వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 33
← పాత చర్చ 32 | పాత చర్చ 33 | పాత చర్చ 34 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 మార్చి 1 - 2014 జూన్ 27
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు
మార్చుఅంతర్జాతీయ మహిళా దినోత్సవం మళ్ళీ వచ్చింది! క్రిందటి సంవత్సరం మనం మహిళలపై కొత్త వ్యాసాలు మరియు ఉన్న వ్యాసాల విస్తరణలో అత్యున్నతంగా కృషి చేసి అన్ని భారతీయ భాషా వికీపీడియాలకంటే తెవికీని ముందంజలో ఉంచాం. గత ఏడాది లాగే ఈసారి కూడా తెవికీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఆసక్తి గలసభ్యులు ఈ క్రింది విధంగా ఈ సంబరాలలో పాల్గొనవచ్చు.
- మహిళలలకు సంబదించిన విషయాలపై తెలుగు వికీపీడియాలో మార్చి నెలంతా జరిగే ఎడిటథాన్ (edit-a-thon)లో పాలుపంచుకోవడం
- మార్చి 8న హైదరాబాదు మరియు బెంగుళూరులలో జరిగే ప్రత్యక్ష సమావేశాలకు హాజరుకావడం
- మీకు తెలిసిన ముగ్గురు మహిళలకు తెవికీని పరిచయం చేయండం మరియు తెవికీలో మార్పులు చేర్పులు ఎలా చేయాలో నేర్పడం
మరిన్ని వివరాలకు మరియు మీరు పాల్గొనటానికి ఈ పేజిని సందర్శించండి--విష్ణు (చర్చ)17:06, 1 మార్చి 2014 (UTC)
- తెవికీ సభ్యులు అందరూ వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం/2014 పేజీని చూచి అందులోని వ్యాసాల్ని అభివృద్ధి చేయాలని; లేని వ్యాసాల్ని మొదలుపెట్టాలని కోరుతున్నాను. క్రిందటి సంవత్సరం మనమంతా కలిసికట్టుగా సుమారు 100 పైగా వ్యాసాల్ని అందించి అన్ని భాషల వికీపీడియాలలో ముందున్నాము. అలాగే ఈసారి కూడా మన సత్తా చూపించాలని; మరొక 150-200 వ్యాసాలు చేర్చే విధంగా సభ్యులు కలిసిపనిచేద్దామని కోరుతున్నాను. అందుకు అవసరమైన లింకుల్ని సమావేశంలో చేర్చాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 19:28, 1 మార్చి 2014 (UTC)
- తెవికీలో పద్మశ్రీ పురస్కార గ్రహీతల జాబితాలో స్త్రీల పేర్లను చూసి తెలిసివున్నంత వరకూ వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. ప్రయత్నించండి.(నేనూ ఆ దిశగా కృషిచేస్తున్నాను.)--పవన్ సంతోష్ (చర్చ) 03:40, 5 మార్చి 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ ధన్యవాదాలు. పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు అనే వర్గం లేకపోతే తయారుచేయండి. శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 10:01, 6 మార్చి 2014 (UTC)
తెలుగులో - Hans
మార్చు- తెలుగులో న అక్షరానికి స కారము ఎలా చేర్చాలో దయచేసి తెలియజేయండి.
- Example: Hans, Kins
- rins : రింస్, Air lines: ఎయిర్ లైంస్ (ఇది తెలుగులో తప్పు కదా !)
JVRKPRASAD (చర్చ) 08:52, 6 మార్చి 2014 (UTC)
- JVRKPRASAD గారు ఇలా ప్రయత్నించండి n&s(న్స్).han&s(హన్స్),kin&s(కిన్స్),lain&s(లైన్స్),rin&s(రిన్స్)...Palagiri (చర్చ) 09:34, 6 మార్చి 2014 (UTC)
- Palagiri గారికి, మీకు ధన్యవాదములు. మీ....JVRKPRASAD (చర్చ) 13:22, 6 మార్చి 2014 (UTC)
- JVRKPRASAD గారు ఇలా ప్రయత్నించండి n&s(న్స్).han&s(హన్స్),kin&s(కిన్స్),lain&s(లైన్స్),rin&s(రిన్స్)...Palagiri (చర్చ) 09:34, 6 మార్చి 2014 (UTC)
2013 లో వాడుకరుల అధికమార్పుల ర్యాంకులు
మార్చువికీపీడియా:2013_లక్ష్యాలు#గణాంకాలు లో వ్యాసపేరుబరి మరియు వ్యాసేతరపేరుబరుల అధికమార్పుల 10ర్యాంకులు వివరాలు చేర్చబడ్డాయి.
- వ్యాసపేరుబరిలో ర్యాంకులు
YVSREDDY,Kvr.lohith,శ్రీరామమూర్తి,Rajasekhar1961,Bhaskaranaidu,T.sujatha,C.Chandra Kanth Rao,సుల్తాన్ ఖాదర్,Palagiri మరియు Veera.sj
- వ్యాసేతర పేరుబరులలో ర్యాంకులు
Arjunaraoc,Kvr.lohith,YVSREDDY,Rajasekhar1961,JVRKPRASAD,వైజాసత్య,T.sujatha,C.Chandra Kanth Rao,Kprsastry మరియుPalagiri వీరందరికి అభివందనాలు. --అర్జున (చర్చ) 06:23, 10 మార్చి 2014 (UTC)
Proposed optional changes to Terms of Use amendment
మార్చుసీఐఎస్-ఏ2కే త్రైమాసిక ఫలితాల వెల్లడి
మార్చుసీఐఎస్-ఏ2కే జూలై-సెప్టెంబర్ 2013 కు గానూ మొదటి రిపోర్ట్, అక్టోబర్-డిసెంబర్ 2014 కు గానూ రెండో రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈ రిపోర్టులలో క్లుప్తంగా ఇప్పటి వరకూ సీఐఎస్-ఏ2కే పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమాలు, వాటి ఫలతాల విశ్లేషణను చూడవచ్చు. ఆయా పేజీల చర్చా పేజీలలో మీ సూచనలను తెలుపగలరు. అలానే ఆసక్తి గలవారు ఈ పేజీలను తెలుగులోకి అనువదించగలరు. మొదటి రిపోర్ట్ ఆలస్యంగా విదుదల చేసినందుకు క్షమాపణలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:11, 14 మార్చి 2014 (UTC)
జన సేన పార్టీ
మార్చుజనసేన పార్టీ పేరుతో మొదట వ్యాసం సృష్టించడం జరిగింది. తర్వాత జన సేన పార్టీ పేరుతో YVSREDDY మరియు జన సేన పేరుతో నరేష్_బళ్ళ మరియు పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారు అదే వ్యాసాన్ని సృష్టించారు. ఈ అన్ని వ్యాసాలను జనసేన పార్టీ లో విలీనం చేస్తే బాగుంటుంది. ఆయా చర్చా పేజీలలో కూడా ఇదే విషయాన్ని రాశాను. సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:14, 15 మార్చి 2014 (UTC)
జన సేన పార్టీ - 10:09, 14 మార్చి 2014 YVSREDDY
- జనసేన పార్టీ - 15:29, 14 మార్చి 2014 సుల్తాన్ ఖాదర్
- జన సేన - 10:07, 15 మార్చి 2014 నరేష్ బళ్ళ
వివిధ సమయాలలో సృష్టించబడిన జనసేనపార్టీ వ్యాసాలు. YVSREDDY (చర్చ) 14:19, 15 మార్చి 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు, నేనుజన సేన పేరుతో వ్యాసం సృష్టించలేదు.అంతకుముందే జన సేన పార్టీవ్యాసమున్నదని,దానిలో విలీనం చెయ్యాలని నోట్ పెట్టను.అంతే.వివరాలు మరొకసారి సరిగ్గా చూడండి.Palagiri (చర్చ) 14:23, 15 మార్చి 2014 (UTC)
- అవునండి పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారు. మీరు విలీన ప్రతిపాదన చేశారు. YVSREDDY గారు మరియు నరేష్ బళ్ళ గారూ, మీరు జన సేన పార్టీ ని విస్తరిస్తున్నారు . ఈ మూడు వ్యాసాలను సరైన వ్యాస శీర్షిక అయిన జనసేన పార్టీ లో విలీనం చేస్తే సమంజసమంగా ఉంటుందని నా అభిప్రాయము.-- 2014-03-15T14:27:37 సుల్తాన్ ఖాదర్
- నేను సరి చేశాను. ఇలాంటి చర్చలు విలీనం మూసం చేర్చి సంబంధిత చర్చాపేజీలలో చేయడం, ఇతరలకు తెలియచెప్పడానికి {{సహాయం కావాలి}}మూసను వాడడం మంచిది. నేను అలా చేశాను. రచ్చబండను వికీపీడియా విభాగాల పరిధికి మించిన విషయాల కు మాత్రమే వాడదాం. --అర్జున (చర్చ) 06:36, 16 మార్చి 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారు, నేనుజన సేన పేరుతో వ్యాసం సృష్టించలేదు.అంతకుముందే జన సేన పార్టీవ్యాసమున్నదని,దానిలో విలీనం చెయ్యాలని నోట్ పెట్టను.అంతే.వివరాలు మరొకసారి సరిగ్గా చూడండి.Palagiri (చర్చ) 14:23, 15 మార్చి 2014 (UTC)
Catalan Culture Challenge
మార్చుI apologize if this message is not in your language. Please help translate it.
The Catalan-speaking world... Want to find out more? From March 16 to April 15 we will organise the Catalan Culture Challenge, a Wikipedia editing contest in which victory will go to those who start and improve the greatest number of articles about 50 key figures of Catalan culture. You can take part by creating or expanding articles on these people in your native language (or any other one you speak). It would be lovely to have you on board. :-)
We look forward to seeing you!
Amical Wikimedia--Kippelboy (చర్చ) 06:08, 16 మార్చి 2014 (UTC)
విక్షనరీ లో ఉండవలసిన వ్యాసాలు
మార్చుతెవికీలో ఈమధ్య కాలంలో ఏక వాక్య వ్యాసాలు, విక్షనరీలో ఉండవలసిన వ్యాసాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. అనుభవమున్న సభ్యులే ఈ విధంగా చేర్చడం జరుగుతున్నట్లున్నది. దయచేసి సదరు వ్యాసాలను మొలకస్థాయి దాటినంతవరకైనా విస్తరించ మనవి. రాశి కంటే వాసి ముఖ్యమని గమనించాలని మనవి. ఇది వరకు ఏక వాక్య వ్యాసాల గూర్చి విస్తృతమైన చర్చ జరిగినప్పటికీ ఈ విధగా గణనీయంగా విస్తరింపవీలు లేని వ్యాసాలు ఒకే వాక్యంతో చేర్చడం వల్ల తెవికీ నాణ్యత పెంచినట్లు భావింపరాదని నా అభిప్రాయం. చిన్న వాక్య వ్యాసాలను విక్షనరీకి తరలిస్తే బాగుంటుంది.-----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 14:51, 16 మార్చి 2014 (UTC)
- విక్షనరీ కి తరలించాలంటే అక్కడ మన ఖాతాకు దిగుమతి చేసుకునే హక్కుండాలి. ఇదివరకు నాకు వికీసోర్సులోనూ, విక్షనరీలోనూ దిగుమతి హక్కుండేది. ఉదాహరణకు వికీసోర్సులో ప్రస్తుతమున్న అన్నమాచార్య కీర్తనలు ఒకప్పుడు వికీపీడియాలోనే ఉండేవి. నేను తిరిగి క్రియాశీలమైన తర్వాత దిగుమతి హక్కు కనిపించలేదు. అందుకే వికీసోర్సుకు, విక్షనరీకి పంపించవలసిన పేజీలు పేరుకు పోయాయి. --వైజాసత్య (చర్చ) 08:44, 18 మార్చి 2014 (UTC)
- దాదాపు ఐదారేళ్లుగా క్రమం తప్పకుండా తిరోగమిస్తున్న మొలకల శాతం, మళ్లీ ఇటీవలి జిల్లాల పేజీలు తదితర చిన్న పేజీల వలన మళ్లీ దాదాపు ఒక శాతం పెరిగింది. ఇది సరైన దిశ కాదు. --వైజాసత్య (చర్చ) 08:32, 18 మార్చి 2014 (UTC)
- భాస్కరనాయుడు గారు, విక్షనరీతోపాటు పురాణాలకు సంబంధించిన వ్యాసాలను ఇక్కడ కూడా చేరుస్తున్నారు. వాటి గురించి తెలియజేసినా కూడా ఇంకా తన మాటమీదనే కొనసాగిస్తున్నారు.Rajasekhar1961 (చర్చ) 09:19, 18 మార్చి 2014 (UTC)
- వైజాసత్య మరియ ఇతర విక్షనరీ లోని నిర్వాహకులకు , మీరు విక్షనరీ సభ్యులతో ఈ విషయమై చర్చించి బగ్జిల్లా లో వికీపీడియా నుండి దిగుమతి అనుమతి కొరకు బగ్ ఫైల్ చేస్తే మరల దిగుమతి సౌకర్యం పొందవచ్చు అనుకుంటాను. --అర్జున (చర్చ) 10:41, 20 మార్చి 2014 (UTC)
నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్/పైలట్ ప్రాజెక్టు విశ్లేషణ కు తోడ్పాటు
మార్చువికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు ముగిసింది.దీనికి తోడ్పడిన ప్రాజెక్టు సభ్యులు మరియు ఇతర సభ్యులందరికి ధన్యవాదాలు. విశేషంగా కృషి చేసిన పవన్ సంతోష్,రాజశేఖర్ ,సుల్తాన్ ఖాదర్ గారిని ప్రత్యేక పతకంతో గుర్తించడమైనది. ఇక ఈ ప్రాజెక్టు సమన్వయానికి తోడ్పడిన శశి కి ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు విశ్లేషణ చూసి మీరు కృషి చేసే ప్రాజెక్టులలో దీని వలన వచ్చిన మంచిపద్ధతులను వాడడానికి వీలుంటే వాడండి. అలాగే విశ్లేషణ లో మీ అభిప్రాయాలు పంచుకొని తదుపరి తెవికీ అభివృద్ధి పనులు రూపుదిద్దడానికి తోడ్పడండి. --అర్జున (చర్చ) 07:20, 17 మార్చి 2014 (UTC)
- ఎందుకు ముగిసింది? మార్గదర్శకములోని లింకు కూడా రెండురోజులుగా పనిచేయట్లేదని గమనించాను --వైజాసత్య (చర్చ) 10:48, 19 మార్చి 2014 (UTC)
- వైజాసత్య గారికి, ప్రామాణికమైన ప్రాజెక్టు నిర్వచనం (ఆంగ్లవికీ) ప్రకారం తాత్కాలికమైనదే ప్రాజెక్టు. నిర్దిష్ట ముగింపులేకపోతే అదినిత్యకృత్యము (Operation) గా పరిగణించాలి. లింకు పనిచేయకపోవటానికి ఈ ప్రాజెక్టు ముగింపుకి సంబంధం లేదు. ఏదో సమస్య వలన లింకు పనిచేయుటలేదు.నేను జోహాన్ (అభివృద్ధికారునికి) తెలిపాను. ప్రస్తుతానికి సైడ్ బార్ నుంచి తొలగిస్తాను.సమస్య పరిష్కారమైన తరువాత మరల చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 04:24, 20 మార్చి 2014 (UTC)
- విశ్లేషణకు సహాయపడిన వారికి ధన్యవాదాలు. సభ్యుల ఆసక్తి ఎక్కువగా లేనందున ఇక ఈ ప్రాజెక్టు సాంప్రదాయిక వికీప్రాజెక్టు అనగా ఆపరేషన్ లాగానే కొనసాగుతుంది. ఆసక్తి గలవారు ప్రాజెక్టు పేజీలో సూచనలను పాటించి తోడ్పడవచ్చు. --అర్జున (చర్చ) 04:36, 24 మార్చి 2014 (UTC)
తెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల మొదటి రోజు ఫోటోలు కామన్స్ లో కావాలి.
మార్చుతెలుగు వికీ దశాబ్ది ఉత్సవాల మొదటి రోజు ఫొటోలు కామన్స్ లో చేర్చమని సమావేశంలో పాల్గొని ఫొటోలు తీసిన సభ్యులకు మనవి. ఇప్పటివరకు పాలగిరి గారు ఎక్కించిన రెండవరోజు ఫొటోలు మాత్రమే వున్నాయి. ప్రత్యేకించి మండలి బుద్ధ ప్రసాద్ గారి వ్యాసానికి మంచి ఫొటో మరియు కొలరావిపు విజేతల ఫొటో ఎక్కించండి. --అర్జున (చర్చ) 16:17, 20 మార్చి 2014 (UTC)
కొత్త నిర్వాహకులు, అధికారులు
మార్చుతెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ అభినందనలు తెలిపాము. అయితే నిర్వాహకులలో విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులగాను, శశి గార్ని నిర్వాహకులుగా చేయడానికి సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:52, 21 మార్చి 2014 (UTC)
- రాజశేఖరుల వారు, మంచి విషయాన్ని సూచించారు. నేను వీరితో ఏకీభవిస్తున్నాను. సభ్యులకు ఈ విషయమై తమ అభిప్రాయాలు తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:01, 21 మార్చి 2014 (UTC)
- విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులగాను, శశి గార్ని నిర్వాహకులుగా చేయడం తెవికీ అభివృధ్ధికి దోహదపడుతుంది. ఈ విషయంలో Rajasekhar గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.---కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 00:41, 22 మార్చి 2014 (UTC)
- విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గార్లను అధికారులను చేయడానికి శశిగారిని నిర్వాహకుని చేయాలనే అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. --t.sujatha (చర్చ) 05:07, 25 మార్చి 2014 (UTC)
- విష్ణువర్ధన్, రహ్మానుద్దీన్ మరియు విశ్వనాథ్ గారు వికీ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయం. కేవలం అది ఒక్కటే నిర్వాహకత్వం లేదా అధికారిని చేయటానికి ప్రాతిపదిక కాకూడదు ఎందుకంటే ఇవి సేవలకు గుర్తింపుగా ఇచ్చే పతకాలు కాదు. నిర్వాహకత్వం ఇవ్వాలంటే ఆయా అభ్యర్ధికి నిర్వహణా కార్యక్రమాలలో ఆసక్తి ఉండాలి, ఆపై నిర్వహణపై సరైన అవగాహన ఉండాలి. అధికారి హోదాకు వీటితో పాటు వివాద పరిస్కారం, ఏకాభిప్రాయ సాధన తదితర అంశాలపై పట్టు ఉండాలి. ఇదివరకటి కంటే అధికారి హోదా యొక్క బాధ్యతలు గణనీయంగా పెరిగాయి. అందుకనే రహ్మానుద్దీన్ గారిని ఆయా విషయాల్లో అనుభవం పొంది తిరిగి ప్రతిపాదించుకోవాలని అర్జునరావు గారు తిరస్కరించి ఉంటారని నా నమ్మకం. అన్యధా భావించవద్దు నాకు వీరందరూ చేస్తున్న కృషిపై చక్కని గౌరవం ఉన్నది కానీ ఆయా హోదాలు గౌరవప్రదానాలు కాదు. ఈ వ్యాఖ్యతో నేను ఎవరిని నిర్వాహకత్వానికి, అధికారి హోదాకు ప్రతిపాదించుకోకుండా ఆపడం లేదు. కాకపోతే ప్రతిపాదనలను గతంలో కంటే కాస్త క్షుణ్ణంగానే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాను. -08:14, 26 మార్చి 2014 (UTC)
CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం జులై 2014-జూన్2015 తెలుగు వికీ ప్రణాళిక - మీ సూచనలకై అభ్యర్థన
మార్చునమస్కారం. గత ఫిబ్రవరి నుండి CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం తెవికీ అభివృధ్ధికై కృషి చేస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. గత సంవత్సరం 5 భారతీయభాషా వికీపీడీయాల అభివృధ్ధికి కృషి చేసిన CIS-A2K ఈ సంవత్సరం 7 భాషలలో కృషి చేయడానికి ప్రణాళిక తయారుచేస్తున్నది. ఈ 7 భాషలలో తెలుగును మళ్ళీ చేర్చడం జరిగిండి. జులై 2014-జూన్2015 వరకు తెలుగు వికీ అభివృధ్ధికి ప్రణాళిక ఇక్కడ చేర్చడం జరిగింది. సమాయాభావం వలన మొత్తం ప్రణాళికను తెలుగులోకి అనువాదం చేయడానికి వీలుపడలేదు. సభ్యులు సద్మనస్సుతో క్షమించగలరు మరియు అనువాదనికి తోడ్పడగలరు. ఈ ప్రణాళిక తెవికీ దశాబ్ది వేడుకలలో మరియు మార్చి 8వ తేది గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన చర్చల అధారంగా, తెవికీ సభ్యుల సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకొని రూపొందించబడింది. ఈ ప్రణాళికను మెరుగు పరచడానికి సూచనలు సలహాలు చర్చా పేజిలో ఇవ్వగలరు.
ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం తెవికీలో మరియు క్రిందటి ఏడాది ప్రణాళికపరంగా జరిగిన ప్రగతి విశ్లేషణ కూడా జరుపబడింది.
CIS-A2K చేపట్టబోయే మిగతా 6 భాషల ప్రణాళికలు, మరియు ఇతర స్వతంత్ర ప్రాజెక్టులు,community strengthening initiatives ఇతరత్రా వివరాలన్ని CIS-A2K Annual Work Plan పేజిలో చూడవచ్చు. ఈ ప్రణాళికలపై కూడా మీ సూచనలు సలహాలు నిర్ధారిత ప్రణాళికా చర్చా పేజిలో ఇవ్వ మనవి. నెనర్లు.--విష్ణు (చర్చ)12:13, 22 మార్చి 2014 (UTC)
- తెవికీ బస్సుకార్యక్రమ ప్రణాళిక ఇక్కడ చేర్చబడింది. మీ సూచనలు సలహాలతో ఈ ప్రణాళికలను ఇంకా బలోపేతం చేయగలరు. --విష్ణు (చర్చ)09:12, 26 మార్చి 2014 (UTC)
- ఈ విషయమై మరింత చర్చించేందుకు వెబ్ ఛాట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు వెబ్ ఛాట్ వద్ద చూసి నమోదు చేసుకోగలరు. తేదీ : 30 మే, 2014. సమయం సా॥8 నుండి 9. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:44, 26 మే 2014 (UTC)
Changes to the default site typography coming soon
మార్చుThis week, the typography on Wikimedia sites will be updated for all readers and editors who use the default "Vector" skin. This change will involve new serif fonts for some headings, small tweaks to body content fonts, text size, text color, and spacing between elements. The schedule is:
- April 1st: non-Wikipedia projects will see this change live
- April 3rd: Wikipedias will see this change live
This change is very similar to the "Typography Update" Beta Feature that has been available on Wikimedia projects since November 2013. After several rounds of testing and with feedback from the community, this Beta Feature will be disabled and successful aspects enabled in the default site appearance. Users who are logged in may still choose to use another skin, or alter their personal CSS, if they prefer a different appearance. Local common CSS styles will also apply as normal, for issues with local styles and scripts that impact all users.
For more information:
- Summary of changes and FAQ
- Discussion page for feedback or questions
- Post on blog.wikimedia.org
-- Steven Walling (Product Manager) on behalf of the Wikimedia Foundation's User Experience Design team
డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి
మార్చుతెలుగు సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడమనే ప్రాజెక్టుకు ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంట్ కోసం ప్రయత్నించడం జరుగుతోంది. సహ వికీపీడియన్లు ప్రాజెక్టు పేజీని సందర్శించమని మనవి.
ఇప్పటికే వేలాది తెలుగు పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఐతే వాటిని వెతకడం, అందుబాటులోకి తెచ్చుకుని చదవడం మాత్రం చాలా కష్టసాధ్యమైన విషయంగా ఉంది. పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఆంగ్లంలో అత్యంత అస్పష్టమైన స్పెల్లింగులతో రాసి ఉండడంతో వీటిని గూగుల్ వంటి ప్రసిద్ధిపొందిన సెర్చ్‌ఇంజిన్లలో వెతకడం సాధ్యపడడం లేదు. ఆ పుస్తకాలకు తెలుగు యూనీకోడ్‌లో పేరు, రచయిత పేరు, పుస్తకంలోని విషయానికి సంక్షిప్త వివరణలతోపాటు డి.ఎల్.ఐ.లో పుస్తకం వద్దకు లింకుతో కూడిన అంతర్జాల గ్రంథసూచి(ఆన్లైన్ కాటలాగ్) తయారు చేయడం ముఖ్యోద్దేశం. వికీపీడియా మరియు సోదర ప్రాజెక్టుల్లోనే కాక సి.ఐ.ఎస్. ఎ 2 కె బ్లాగు, వెబ్సైట్, సోషల్ మీడియా, తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఇతర అంతర్జాల పత్రికల్లోనూ స్వేచ్చా నకలుహక్కులతో ప్రచురించడం ద్వారా వాడుకరులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తాము.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాథమికంగా తెలుగు వికీపీడియా, వికీసోర్స్, వికీకోట్స్‌లు ప్రయోజనం పొందవచ్చు. ఆయా గ్రంథాల్లోని విజ్ఞానసర్వస్వ సమాచారాన్ని సహ వికీమీడియన్లు ఉపయోగించుకోవచ్చు. నకలుహక్కుల పరిధిలో లేని ఎన్నో పుస్తకాలు వికీసోర్సుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వికీమీడియా ప్రాజెక్టులకే కాక తెలుగు అంతర్జాలం అభివృద్ధికి కూడా ఈ గ్రంథసూచి ఉపయోగపడవచ్చు.
ఈ ప్రాజెక్టుకు మద్దతునివ్వాలంటే - ప్రాజెక్టు పేజీలోని ఎండార్స్‌మెంట్స్ అనే విభాగంలో సంతకం చేసి ఎండార్స్ చేయవచ్చు. అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు అక్కడి చర్చపేజీలో వ్యాఖ్యానించవచ్చు. ఆయా అంశాల్లో మీ విలువైన భాగస్వామ్యాన్ని కోరుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 04:39, 5 ఏప్రిల్ 2014 (UTC)
కొంతమంది తెలుగు స్వాతంత్ర్యసమరయోధులు
మార్చుఆసక్తి ఉన్న ఈ సమాచారం ఉపయోగించి ఈ ప్రముఖుల పేజీలు సృష్టించగలరు
- ఏ.కామేశ్వరరావు - http://www.kamat.com/database/biographies/a_kameshwar_rao.htm
- కె. ఎల్. నరసింహారావు (స్వాతంత్ర్య సమరయోధుడు) - http://www.kamat.com/database/biographies/k_l_narsimharao.htm
- జి.వి.సుబ్బారావు - http://www.kamat.com/database/biographies/g_v_subbarao.htm
- అల్లూరి సత్యనారాయణ - http://www.kamat.com/database/biographies/alluri_satyanarayana.htm
- నేను ఈ అనువాదాల్లో కృషి చేసేందుకు ఆసక్తి కలిగివున్నాను. ఐతే ఆంగ్ల పాఠ్యాన్ని పేస్ట్ చేసి వ్యాసానువాదం చేస్తూంటే వీక్షకులు అవి యధాతథంగా ఆంగ్ల సమాచారం చూసేలా ఉంది. ఎడిటర్లకి కనిపించేలా(సవరణల్లో) వీక్షకులకు కనిపించకుండా ఉండేలా వీలుందని గతంలో ఎక్కడో చదివాను. అది ఎలా చేయాలన్నది చెప్పగలరా? అక్కడ అర్జున రావు గారు పెట్టారేమోనని నాకు గుర్తు.--పవన్ సంతోష్ (చర్చ) 06:04, 8 ఏప్రిల్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అనువాదం చేయునపుడు అనువాదం కాని ఆంగ్ల భాగానికి ఇరువైపులా <!-- ఆంగ్ల భాగం --> అనే ట్యాగును ఉంచండి. అపుడు అనువాదం జరిగినపుడు మాత్రమే ఎడిటర్లకు కనిపిస్తాయి. వీక్షకులకు కనిపించవు.---- కె.వెంకటరమణ చర్చ 07:02, 8 ఏప్రిల్ 2014 (UTC)
- వెంకటరమణ గారూ కృతజ్ఞతలు. ఐతే ఎ.కామేశ్వరరావు అనే వ్యాసం సృష్టించడంలో ప్రయత్నం చేశాను. ప్రయోజనం కనిపించలేదు. నేనెక్కడ పొరపాటు చేశానన్నది తెలియలేదు.--పవన్ సంతోష్ (చర్చ) 10:18, 8 ఏప్రిల్ 2014 (UTC)
- పై వ్యాసాలలో అల్లూరి సత్యనారాయణరాజు అనే వ్యాసం తెవికీలో ఉన్నది. ఆయన జీవిత చరిత్ర ఇక్కడ] వివరంగా ఉంది.---- కె.వెంకటరమణ చర్చ 06:06, 8 ఏప్రిల్ 2014 (UTC)
- వెంకటరమణ గారూ కృతజ్ఞతలు. ఐతే ఎ.కామేశ్వరరావు అనే వ్యాసం సృష్టించడంలో ప్రయత్నం చేశాను. ప్రయోజనం కనిపించలేదు. నేనెక్కడ పొరపాటు చేశానన్నది తెలియలేదు.--పవన్ సంతోష్ (చర్చ) 10:18, 8 ఏప్రిల్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అనువాదం చేయునపుడు అనువాదం కాని ఆంగ్ల భాగానికి ఇరువైపులా <!-- ఆంగ్ల భాగం --> అనే ట్యాగును ఉంచండి. అపుడు అనువాదం జరిగినపుడు మాత్రమే ఎడిటర్లకు కనిపిస్తాయి. వీక్షకులకు కనిపించవు.---- కె.వెంకటరమణ చర్చ 07:02, 8 ఏప్రిల్ 2014 (UTC)
- సరిచేశాను. చూడండి.--Rajasekhar1961 (చర్చ) 10:53, 8 ఏప్రిల్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, సరిచేశాను. -- కె.వెంకటరమణ చర్చ
రద్దైన శాసనసభ నియోజకవర్గాల గురించిన పేజీలు
మార్చు2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలు రద్దయ్యాయి. రద్దైన నియోజకవర్గాలు దశాబ్దాల తరబడి కొనసాగాయి. ఎందరో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికై రాష్ట్రస్థాయిలో మంత్రులుగా పనిచేశారు. ఐతే తెవికీలో ఆయా నియోజకవర్గాల గురించి వ్యాసాలు లేనట్టు గమనించాను. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి శాసనసభ నియోజకవర్గం గురించిన పేజీ లేకపోవడం నేను గమనించాను. ఆ నియోజకవర్గంలోని మండలాలు మూడుగా విడిపోయి తణుకు మొదలైన శాసనసభ నియోజకవర్గాల్లో చేరిపోయాయి. వీటి గురించి వ్యాసాలు ప్రారంభించవచ్చా? లేదంటే ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలే ఉండాలా?--పవన్ సంతోష్ (చర్చ) 05:31, 10 ఏప్రిల్ 2014 (UTC)
- మరణించిన ప్రముఖుల వ్యాసాలున్నాయి, కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక ప్రదేశాల వ్యాసాలున్నాయి, ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన రాజ్యాలు- సామ్రాజ్యాలు- సంస్థానాల వ్యాసాలున్నాయి, నేలమట్టమైన కోటలకు సంబంధించిన వ్యాసాలున్నాయి, అంతరించిపోయిన జీవజాతుల వ్యాసాలున్నాయి, ఇదే మాదిరిగా తగినంత సమాచారం ఉంటే రద్దయిన నియోజకవర్గాల వ్యాసాలను కూడా మీరు తప్పకుండా చేర్చవచ్చు. నిబంధనలు పాటిస్తూ తెవికీలో ఏ వ్యాసమైనా సృష్టించవచ్చు. ఆ వ్యాసాలకున్న విలువే ముఖ్యం, కాని అవి ఉన్నవా లేవా అనేది ముఖ్యం కాదు. ఇలాంటి వాటికి వర్గం వేరు చేస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:38, 10 ఏప్రిల్ 2014 (UTC)
- ప్రతిస్పందించినందుకు కృతజ్ఞతలు చంద్రకాంతరావు గారూ! మీ సలహా బావుంది. తప్పకుండా ఆయా నియోజకవర్గాలు చేర్చుతాను.--పవన్ సంతోష్ (చర్చ) 14:08, 11 ఏప్రిల్ 2014 (UTC)
పురస్కారాలు బిరుదులు కాదు
మార్చుభారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు(అవార్డులు) బిరుదులుగా వాడుకోకూడదు. భారతప్రభుత్వం ద్వారా అందే ఈ అత్యున్నత పౌరపురస్కారాలు చూడడానికి, వాడడానికి బిరుదుల్లా ఉండడంతో ఈ సమస్య వస్తోంది. ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారం బిరుదుగా వాడుకున్నారనీ, వెనక్కి తీసుకోవాలనీ ప్రముఖ సినీనటులపై హైకోర్టులో కేసు నడిచిన విషయం విదితమే. హైకోర్టు ఈ బిరుదులు రాష్ట్రపతికి వెనక్కి తిరిగి ఇవ్వాలని ఆదేశించగా సుప్రీంకోర్టులో స్టే విధించారు. ఐతే సుప్రీంకోర్టు కూడా సదరు నటుణ్ణి ఇంటి నేమ్‌ప్లేటుపై కూడా బిరుదులా వాడనని ఓ అఫిడవిట్ దాఖలుచేయమని ఆదేశించింది. ఆంగ్ల వికీలో చాలామంది వ్యక్తిగత పేజీల్లో ఆనరరీ ప్రీఫిక్స్, టైటిల్ అంటూ పద్మవిభూషణ్, పద్మశ్రీలు ఉండడం చూసి అక్కడ చర్చ ప్రారంభించాను. ఇప్పుడు తెలుగు వికీపీడియా మెయిన్ పేజీలో 1858 : ప్రముఖ మహిళోద్ధారకుడు, భారతరత్న ధొండొ కేశవ కర్వే జననం. అని ఉంది. ఐతే నిజానికి భారతరత్న పురస్కార గ్రహీత అని ఉంటే మరింత బావుంటుంది. ఇవేమీ గతంలో అంతగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం హైకోర్టు, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మనం కూడా ఇక ఈ జాగ్రత్త వహిస్తే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 06:53, 18 ఏప్రిల్ 2014 (UTC)
హైదరాబాద్ నెలవారీ సమావేశాలు
మార్చు- హైదరాబాద్ సమావేశాలకు స్పందన తక్కువ కావడం, మరియు పాత వాడూకరులు క్రియాశీలకంగా లేకపోవడం గురించి నాదొక ఆలోచన. హైదరాబాద్‌లో కొద్దిమంది ఆశక్తి కలిగిన వారు ఉన్నా వారు హైదరాబాద్‌లోనే వేరు వేరు ప్రాంతాల నుండి రావాలి కనుక వారికి రవాణా చార్జీలు కల్పించగలిగితే బావుంటుందని.
ఇవి చిన్న మొత్తాలు కనుక ఆచరణీయమే అని నా అభిప్రాయం. రావాలనుకున్న వారికీ చార్జీలు పెట్టుకొని మరీ అబిడ్స్ వరకూ ఎందుకు వెళ్ళడం అని ఉండదు కనుక అలాంటి చిన్న నిధిని ఏర్పాటు చేసుకొని వచ్చిన వారికి చార్జీలు ఇవ్వగలిగితే ఎక్కువమంది వస్తారనుకుంటున్నాను...విశ్వనాధ్ (చర్చ) 13:58, 18 ఏప్రిల్ 2014 (UTC)
- నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం స్వచ్చంద సంస్థలలో వచ్చే సేవకులు, వాడుకదారులు ఎటువంటి లాభా పేక్ష లేకుండా వస్తేనే బాగుంటుంది మనము నగదు ప్రోత్సాహకాలు ఇస్తూ వుంటే ఛార్జీలు ఇస్తారుకదా కానీ వచ్చిన వాళ్ళు ఆ తరువాత కూడా ఉచితంగా తమ సేవలు అందచేయలేకపోవచ్చు.మనము చార్జీలు ఇచ్చి కూడా రమ్మని చెపితే జనాలు ఇదేదో వికీవారు వాణిజ్య ప్రయోజనం ఆశించి మనలకు ఆహ్వానిస్తున్నారు అనుకొనే ప్రమాదం వున్నది నగరంలో జరిగే వివిధ కార్యకమాలకు ప్రజలు స్వచ్చందం గానే వస్తారు, ఈమధ్య కాలంలో ఆమ్వే,హెర్బల్ లైఫ్,యోగా , ట్రైనింగ్ కంపెనీలు , కొన్ని చైన్ మార్కెటింగ్ సంస్థలు ఉచిత సెమినారు,వర్క్ షాపులు అని చెప్పి వచ్చిన జనాల చేత డబ్బులు కట్టించుకొంటున్నారు వీరి వలన ప్రముఖ సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా వేరేవాటికి హాజరు అయ్యే ప్రజల సంఖ్య తగ్గినది . కొత్త మందికి చేరువకావాలి అంటే వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ( స్కూళ్ళు ,లైబ్రరీలు, కమ్యునిటీ హాళ్లలో మనమే వర్క్ షాపు లాంటి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది దీనికి మనకు కావలసినది కొన్ని కరపత్రాలు ,స్టీక్కర్లు ! --కశ్యప్ 06:01, 21 ఏప్రిల్ 2014 (UTC)
- మీరు చెప్పిన లాంటివి తరచుగా జరిగేవి కాదు. మన ప్రోగ్రాం ప్రతి నెలా జరుగుతుంది. అలా ప్రతిసారీ రావాలంటే కొంత ఇబ్బందితో కూడుకొన్నదే. మనం మనవైపుగా చేసేది తెవికీకి అంతర్జాలం ద్వారా చేస్తున్నాం. అది స్వచ్చందానే కదా. పైన చెప్పిన దానిబట్టి , నెలవారీ సమావేశాలకు హైదరాబాదీయులు ఎక్కువగా హాజరవుతారని నా అభిప్రాయం...విశ్వనాధ్ (చర్చ) 08:06, 21 ఏప్రిల్ 2014 (UTC)
వికీపీడియా అన్వేషణ ఫలితాల్లో వికీడేటా ఫలితాలు
మార్చుMediawiki:commons.js వద్ద ఒక మార్పును చేయడం ద్వారా వికీడేటా ఫలితాలు వికీపీడియా ఫలితాలలో సైతం కనిపించే ఏర్పాటు జరిగింది (ఉదాహరణకి "మణిలాల్ గాంధీ" అని వెతికి చూడగలరు). కేవలం వికీడేటా లో, వెతికే అంశం యొక్క లేబుల్ ఇంకా డిస్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది. వికీడేటాలో ఏ విధంగా పని చేసి మన సొంత వికీపీడియాను అభివృద్ధి పరచవచ్చో అన్న విషయమై వెబినార్ చేయదలిచాను. ఇందులో వికీడేటా లో పనిచేసే పనిముట్లలో ఒకటయిన రెజనేటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆసక్తి గలవారు వచ్చే నెల బెంగుళూరు సమావేశంలో పాల్గొనదలిస్తే ప్రత్యక్షంగా, బెంగుళూరు వెలుపల వారికి వెబినార్ ద్వారా రెజొనేటర్ గురించి చిన్న ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:33, 22 ఏప్రిల్ 2014 (UTC)
- ఈ వీషయమై జెరార్డ్ వ్రాసుకున్న బ్లాగు టపా ను ఇక్కడ చదవండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:13, 23 ఏప్రిల్ 2014 (UTC)
- నాకు ఆశక్తి ఉన్నది. వెబినార్ లో ఎలా నమోదు చేసుకోవాలి తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 06:51, 26 ఏప్రిల్ 2014 (UTC)
KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్
మార్చుKLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్ ని పరిశీలించి, మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా మనవి. --రాధాక్రిష్ణ (చర్చ) 18:28, 22 ఏప్రిల్ 2014 (UTC)
KLRWP అవార్డుల విధి విధానాల బ్లాగ్ పోస్ట్ ఇచ్చట publish చేయబడినది. అందరికీ ధన్యవాదములు. రాధాక్రిష్ణ (చర్చ) 05:39, 30 ఏప్రిల్ 2014 (UTC)
జాలపత్రికల్లో తెవికీ ప్రాచుర్యం
మార్చుఅంతర్జాలంలో తెలుగు సాహిత్యం, రాజకీయం, సినిమా వగైరా ఎన్నెన్నో అంశాలతో కూడిన పత్రికలు ఉన్నాయి. ప్రింటుమీడియాతో సంబంధం లేని ఎన్నో జాలపత్రికలు నేడు అంతర్జాలంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ పత్రికల్లో వచ్చే వ్యాసాలలో వివిధ ఆంగ్ల వికీ లింకులు ఇస్తున్నారు. తెలుగు సినిమాలు, సాహిత్యానికి సంబంధించిన వివరాలకు కూడా ఆంగ్ల వికీ లింకులు ఇస్తున్నారు. నేను పుస్తకం.నెట్, కినిగె అనే రెండు సాహిత్య పత్రికలను సంప్రదించి తెలుగు వికీపీడియా లింకులు సరైనవి లేకుంటేనే ఆంగ్ల వికీని సంప్రదించాలని, తద్వారా అంతర్జాలంలో తెలుగు సమాచారాన్ని అభివృద్ధి చేసే ఉద్యమంలో భాగస్వామ్యం వహించాలని ఇ-మెయిల్స్ పెట్టాను. వారు వెంటనే సానుకూలంగా స్పందించి నేను కోరిన విధంగానే తెవికీ వ్యాసాలకు లింకులు ఇస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది కనుక సహసభ్యులు మీకు తెలిసిన జాలపత్రికల కాంటాక్టు మెయిల్స్‌కీ అలా కోరుతూ పంపగలరేమో పరిశీలించండి.
పుస్తకం.నెట్ వారు భగవంతుని మీది పగ, ధూమరేఖ, నాస్తికధూమము, నందోరాజా భవిష్యతి వ్యాసాల్లో చివర వికీపేజీకి లింకు అని ఇచ్చారు. అలానే మధ్యలో ఎక్కడైనా వీలైతే ఇస్తున్నారు. కినిగె పత్రికలో కూడా కర్నాటకలో నా తిరుగాట వ్యాసంలో శివరామ కారంత్ ప్రస్తావన వచ్చినప్పుడు వికీలో ఆయన పేరిట ఉన్న పేజీకి లింకు ఇచ్చారు. ఐతే నిన్నటి వరకూ అది ఆంగ్ల వికీలోని పేజీకి లింకు ఉండేది. ఇకపై ఎప్పుడు వీలున్నా ముందుగా తెవికీనే ప్రయత్నిస్తామన్నారు.
ఈ క్రమంలోనే అంతర్జాలంలోని పెద్ద సంఖ్యలో ఉన్న సినీ, రాజకీయ పత్రికల విషయంలోనూ, బ్లాగర్ల విషయంలోనూ ప్రయత్నించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 04:35, 26 ఏప్రిల్ 2014 (UTC)
మేనెల మొలకల జాబితా
మార్చుఏప్రిల్ నెలలో తయారయిన మొలకల జాబితాను ఇక్కడ చూడవచ్చు. ఎవరు సృష్టించిన మొలకలను వారే కనీసం 2100 బైట్ల స్థాయిని దాటించే విధంగా కృషి చేయాలని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:51, 3 మే 2014 (UTC)
- కృతజ్ఞతలు. నా వ్యాసాలతో పాటు మిగిలినవారివీ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను ఐతే చిన్న సందేహం. కనీసం 2100 బైట్ల స్థాయికి పెంచాలని సూచించారు. ఐతే మీరు ఇచ్చిన జాబితాలోని నా వ్యాసాల్లో ఇప్పటికే శబ్బాష్‌రా శంకరా 4,222 బైట్లు, నల్లంచు తెల్లచీర 3,864 బైట్లతో ఉన్నాయి. --పవన్ సంతోష్ (చర్చ) 10:17, 3 మే 2014 (UTC)
- ఈ విషయాన్ని పైకి తెచ్చినందుకు కృతజ్ఞతలు. మనం వ్యాసంలో మార్కప్ కు వాడే కొన్ని సంకేతాలను కలుపుకొని మీరు చెప్పిన పరిమాణం వస్తుంది. కానీ బయటవారికి చదివేందుకు కనిపించే అక్షరాల సంఖ్యను ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాము. పేజీ పాఠ్యాన్ని కాపీ చేసుకుంటే ఆ నిడివి ఎంతో అది ఆ పేజీ పరిమాణం అవుతుంది. మీరు ఎలాంటి జాబితాలు/పట్టికలు/మూసలు వాడని పక్షంలో రెండంకెలూ ఒకటిగానే కనిపిస్తాయి. ఎక్కువ శాతం మార్కప్ రాస్తే ఇలా కనిపించవచ్చు. http://www.string-functions.com/length.aspx లాంటి ఉపకరణాలు వాడి ఈ విషయం తెలుసుకోవచ్చు. అయితే, అలా బైట్ల లెక్క వేసుకునే బదులు ఇన్ని లైన్లు అనుకుందామా? ----రహ్మానుద్దీన్ (చర్చ) 12:35, 3 మే 2014 (UTC)
- మొలక స్థాయి దాటాలంటే బైట్లే సరైన కొలమానం అని నా అభిప్రాయం. పవన్ గారు తెలియజేసిన వ్యాసాలలో శబ్బాష్‌రా శంకరా (1.9 కె.బి),నల్లంచు తెల్లచీర (1.5 కె.బి) ,ప్రస్తుతం పరిమాణం కలిగి యున్నాయి. వాటిని 2 కె.బి దాటిస్తే మొలక స్థాయి దాటించినట్లే. పవన్ సంతోష్ గారూ పేజీ చరిత్రలో కనిపించే పరిమాణం చూసి మొలకస్థాయి దాటిందని అనుకోకూడదు. మొలక స్థాయి దాటటం అంటే 2 కేబీలు (2048 బైట్లు) సమాచారం ఉండాలి. ఈ పరిమాణం అంచనాలో సమాచారపెట్టెలు, మూసలు వగైరా పరిగణించబడవు. కాబట్టి నల్లంచు తెల్లచీర వ్యాసం పేజీ చరిత్రలో 3,864 బైట్లు దాటినా నిజానికి అందులో 1.5 కేబీల సమాచారం మాత్రమే ఉంది. మీ అభిరుచుల్లోకి వెళ్ళి ఉపకరణాల్లో నావిగేషన్ పాపప్స్ (వికీపీడియా:ముంజేతి కంకణం) సచేతనం చేసుకొని మీకు కావలసిన వ్యాసపు లింకుపై కుడినొక్కు నొక్కితే అప్పుడు దాని పరిమాణం చూపిస్తుంది. ---- కె.వెంకటరమణ చర్చ 13:28, 3 మే 2014 (UTC)
- రహ్మాన్ గారూ! మీరు చెప్పిన విషయం అర్థమైంది. ఐతే ఎలా ఆచరణలోకి పెట్టాలో ముందు అర్థమవలేదు. ఇప్పుడు వెంకటరమణ గారి సలహా బాగా ఫలించింది. థాంక్యూ వెరిమచ్ రమణ గారూ.--పవన్ సంతోష్ (చర్చ) 07:27, 4 మే 2014 (UTC)
- మొలక స్థాయి దాటాలంటే బైట్లే సరైన కొలమానం అని నా అభిప్రాయం. పవన్ గారు తెలియజేసిన వ్యాసాలలో శబ్బాష్‌రా శంకరా (1.9 కె.బి),నల్లంచు తెల్లచీర (1.5 కె.బి) ,ప్రస్తుతం పరిమాణం కలిగి యున్నాయి. వాటిని 2 కె.బి దాటిస్తే మొలక స్థాయి దాటించినట్లే. పవన్ సంతోష్ గారూ పేజీ చరిత్రలో కనిపించే పరిమాణం చూసి మొలకస్థాయి దాటిందని అనుకోకూడదు. మొలక స్థాయి దాటటం అంటే 2 కేబీలు (2048 బైట్లు) సమాచారం ఉండాలి. ఈ పరిమాణం అంచనాలో సమాచారపెట్టెలు, మూసలు వగైరా పరిగణించబడవు. కాబట్టి నల్లంచు తెల్లచీర వ్యాసం పేజీ చరిత్రలో 3,864 బైట్లు దాటినా నిజానికి అందులో 1.5 కేబీల సమాచారం మాత్రమే ఉంది. మీ అభిరుచుల్లోకి వెళ్ళి ఉపకరణాల్లో నావిగేషన్ పాపప్స్ (వికీపీడియా:ముంజేతి కంకణం) సచేతనం చేసుకొని మీకు కావలసిన వ్యాసపు లింకుపై కుడినొక్కు నొక్కితే అప్పుడు దాని పరిమాణం చూపిస్తుంది. ---- కె.వెంకటరమణ చర్చ 13:28, 3 మే 2014 (UTC)
తెలుగు వికీపీడియా ... దారి.... తెన్ను.......,(ప్రయోగము)
మార్చుగణాంకాలు ... తెవికి
మార్చుగత ఆరు మాసాలలో తెవికి తీరు తెన్నులు (క్రింద సమర్పించిన అంకెలు స్వల్ప తేడాతో అన్నీ వాస్తావాల...
- 1.నవంబరు నెలలో (2013) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 150 మంది
- 2.డిశెంబరులో (2013 ) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 186 మంది
- 3.జనవరిలో (2014) ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 170 మంది
- 4.పిబ్రవరి (2014)లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 220 మంది
- 5.మార్చి (2014) లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 144 మంది
- 6.ఏప్రిల్ (2014) లో ఖాతా సృష్టించిన వారు: (ఆటోమేటిక్ గా ఖాతా సృష్టించిన వారు మినహాయించి) 121 మంది
- 7.ఏప్రిల్ 2014 చివరి నాటికి క్రియాశీలంగా వున్న వాడుకరుల సంఖ్య 156 మంది
- ఈ 156 మందిలో గత 30 రోజుల్లో కేవలం 1 మార్పు మాత్రమే చేసిన వారు 25 మంది.
- ...............................గత 30 రోజుల్లో 2 నుండి 4 మార్పులు చేసినవారు. 38 మంది
- .................................గత 30 రోజుల్లో 5 నుండి 10 మార్పులు చేసిన వారు 10 మంది
- .................................గత 30 రోజుల్లో 10 కి పైగా మార్పులు చేసిన వారు 83 మంది (పదికి పైగా మార్పులు చేసిన వారిని మాత్రమే క్రియాశీలంగా వున్నారని భావించినా...... అది ప్రస్తుతమున్న క్రియాశీలక వాడుకదారుల సంఖ్యకు (156) లో సగం మాత్రమే. అనగా 50 శాతం.
- వీరిలో అత్యంత చురుకైన వాడుకరులు సమయాభావం వలన ప్రస్తుతానికి తక్కువ మార్పులు చేసి వుండ వచ్చు..... కాని ఎక్కువ శాతం మంది ఎప్పటినుండో అదే స్థాయిలో వున్నారు.
- వీరిలో వాడుకరి పుట తెరిచిన వారు.... 100 మంది
- వీరిలో వాడుకరి పుట తెరవని వారు.......50 మంది
- మొత్తం నిర్వహకులు: 20 మంది
- మొత్తం అధికారులు: 4 గురు
- గత 30 రోజులలో 10 దిద్దుబాట్లు... ఆపైన చేసినవారు: 50 మంది
- వీరిలో గత ఆరు నెలల నుండి చేరిన క్రొత్త వారు: 5 మంది
- మిగతావారు (100 మంది) పాత సభ్యులే.
- ఇద్దరు సభ్యులు అధిక మొత్తంలో పుటలను వ్రాస్తున్నా.... అజ్ఞాతంగా వ్రాస్తున్నారు. (పేరులేకుండా)
గణాంకాలు. విక్షనరీ
మార్చు- విక్షనరీ లో మొత్తం క్రియాశీలంగా వున్న వారు 22 మంది.
- వీరిలో సగం మంది అనగా 11 మంది పర భాషలకు చెందిన వారు.
- మిగిలిన 11 మందిలో కేవలం ముగ్గురు/నలుగురు మాత్రమే ఎక్కువగా తమ రచనలు చేస్తున్నారు.
విశ్లేషణ
మార్చు- పైన కనబరచిన గణాంకాలను విశ్లేషించగా ....... నాకు అర్థమైన విషయ మేమంటే? .............
ప్రతి నెలా సుమారు 120 మందికి పైగా తమంతట తాము ఉత్సాహంతో వికిపీడియాలో ప్రవేసిస్తున్నారు. అనగా రోజుకు నలుగురు చొప్పున వికిపీడియాలో కొత్తగా చేరు తున్నారు. (ఆటోమేటిక్ గా ఖాతా తెరిచిన వారు కాకుండా) ఇది శుభ పరిణామమే. కాని వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఆగి పోతున్నారు. కనీసం వారి వాడుకరి పుటను కూడ ప్రారంబించడం లేదు. అక్కడక్కడా ఒకరిద్దరు ఏదో కొంత వ్రాసినా అవి ఎక్కువగా వారి స్వంత విషయాలు మాత్రమే. ఇంకొందరు తెలుగు లిపిలో వ్రాయడానికి తెలియక ఇంగ్లీషు లిపిలో వ్రాస్తున్నారు. కనుక ఇటు వంటివి తొలగింపునకు గురౌతున్నాయి. ఇదంతా వారి వికిపీడియా పై వారికున్న అవగాహనా రాహిత్యం వల్లనే జరుగు తున్నదని నా అనుమానం. ఇంచుమించు అందరు కొత్త సభ్యులు కనీసం వారి వాడుకరి పేజీని కూడ ప్రారంబించలేదు. వాడుకరి పేజీని ప్రారంబించాలని, అందులో తమ స్వంత వివరాలు వ్రాయవచ్చునని వారికి తెలియక పోవడమే కారణంగా నాకనిపిస్తున్నది. వారికి స్వంత ఈమైల్, ఫోన్ నెం. మొదలగు వాటితో వాడుకరి పుట లేనందున అధికారులు గాని, నిర్వాహకులు గాని వారితో సంప్రదించి తగువిధంగా తగు సలహాలివ్వడానికి వారిని ప్రోత్సహించడానికి అవకాశము లేదు. ఆ కారణంగా ఉత్సాహంగా వికీపీడియాలో నామోదయి కూడ ఏమీ వ్రాయ లేకున్నారు. ఆవిధంగా కొత్తగా చేరిన సభ్యులకు............ వికీపీడియా కార్య వర్గానికి మధ్యన పెద్ద అఘాదమేర్పడింది. ఒకరికొకరు తెలియని పరిస్థితి. [అంతర్జాలంలోనైనా] వారంతట వారె ఉత్సాహంగా ఖాతా తెరిచిన వారిలో కనీసం 10 శాతం మందినైనా క్రియాశీలకమైన వాడుకరులుగా మార్చ గలిగితే ఎంతో పురోభివృద్ధి సాదించ వచ్చు.
గత పిబ్రవరి నెలలో కొత్తగా చేరిన వారి సంఖ్య 220. ఈ సంఖ్య మిగతా నెలలలో కొత్తగా చేరిన వారిసంఖ్యకన్న చాల ఎక్కువ. వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలు విజయవాడలో జరిగిన సందర్భంగా ... మన నిర్వాహకులు ఆ చుట్టు ప్రక్కల శిక్షణా శిభిరాలను నిర్వహించినందునే ఈ అభివృద్ధి.
సూచనలు
మార్చు- శిక్షణా శిభిరాలలో తమ పేరు నామోదు చేసుకున్న వారితో అక్కడే వారి వాడుకరి పేజీని వారితోనే సృష్టింపజేసి వారి ఈమైల్ ఐ.డి, ఫోన్. నెంబరు, మొదలగు విషయాలను అందులో చేర్పించ గలిగితే ఉత్తరోత్తరా వారితో అనేక విధాలుగా సంప్రదించ డానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా వారిని ప్రోత్సహించి కార్యోన్ముఖులను చేయగలిగిన వారమౌతాము.
- ఇప్పటికే పేరు నామోదు చేసుకున్న వారికి వాడుకరి పుట లేనందున వారిని సంప్రదించడానికి అవకాశము ఉండడము లేదు. వారిని సంప్రదించడానికి వేరు మార్గమేమైనా వున్నదా పరిశీలించాలి. అదే జరిగితే మంచి ఫలితముండ గలదు.
- వికీపీడియాలో రచనలకు మూలాలు చేర్చడము అన్నది కూడ కొత్తవారి బయపెడుతున్నదని నాకనిపిస్తున్నది. దానికి విరుగుడుగా ...... మూలాలు చేర్చడము అన్న సమస్య అంత ఎక్కువగా లేని .... విక్షనరీ . వికీసోర్స్, మొదలగు వాటిలో క్రొత్తవారికి కొంత అవగాహన కల్పించగలిగితే..... అందులో వారు వ్రాస్తవుంటే మొత్తం వికీపీడియా పై వారికి మంచి అవగాహన కలుగుతుంది. కనుక ఆ విభాగలలో వారిని ప్రోత్సహించాలి.
- అదే విధంగా క్రొత్తవారిని వారి వారి గ్రామాల విషయాలను వ్రాయమని ప్రోత్సహిస్తే అది వారికి తెలిసిన విషయం గనుక ఉత్సాహంగా వ్రాస్తారు. ఆ విధంగా వారికి అవగాహన పెరుగు తుంది. (ప్రస్తుతం వున్న చాల గ్రామాల వ్యాసాలను గమనిస్తే........ అందులో స్థానిక వాడుకరులు ఉత్సాహం కొద్దీ..... తమ గ్రామాల విషయాలతో పాటు..... తమ గ్రామంలోని సమస్యలను....... వాటి నివారణోపాయలను కూడ పొందు పరిచారు. ఇది వికీపీడియా పద్దతి కాదేమో????.) కాని అలా వ్రాయడము వల్ల వాడుకరులకు రచనలో మంచి అవగాహన కలుగుతుంది. గ్రామాలకు సంబందించిన వ్యాసాలు లెక్కకు మిక్కిలిగా వుంటాయి. కొత్త వాడుకరులకు సులభ గ్రాహ్యమే కదా...శ్రమ లేకుండా వ్రాయగలిగిన వారికి ఇది మంచి వనరు.
- వికీపీడియా గురించి సమగ్రంగా/సంషిప్తంగా.... అవగాహన కలిగే విధంగా కరపత్రాలు గానీ, చిన్న పుస్తక రూపంలో గాని పంపిణీ చేయ గలిగితే..... దానికి మంచి స్పందన రావచ్చును. వికీపీడియా లో ఇటు వంటి దానికి అవకాశమున్నదా???
- గతంలో జరిపిన వ్యాసరచన పోటీ లాంటిదే..... సాహిత్య సంబంద పదబందం లాంటి (గడులను పూరించడం) క్విజ్ మొదలగు ప్రక్రియల ద్వారా కూడ వాడుకరులను ఉత్సాహ పరుచ వచ్చ,కొత్త వారిని ఆకర్షించ వచ్చు. ఇటువంటి ప్రక్రియలకు అవకాశమున్నదో లేదో తెలియదు.
- తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులైన వికీస్పీసీస్, వికీకోట్ మొదలగు నవి ఇప్పటికీ అనాధలుగానే వున్నాయి. వాటిలో కూడ వ్రాయడానికి ఉత్సాహ పరిచేవిధంగా చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో తెలుగు భాషకన్నా..... చిన్నభాషలైన తమిళం, మళయాళం, ఒడియా భాషలు ఈ విషయంలో ముందున్న సంగతి గమనించే వుంటారు. మనమెందుకు అంత వెనుక బడి వున్నాము.... కారణాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసిన అవసరమున్నది.
- ఈ మద్యన అనగా మార్చి నెల 21 న తెలుగు వికీపీడియా గురించి ఇంటర్వూ చేస్తామని తద్వారా మిగతా ప్రపంచానికి తెలుగు వికీపీడియా గురించి తెలుస్తుందని, దానికి స్పందించమని వాడుకరులకు సందేశం పంపించారు. దానికి స్పందించి పోను ద్వారా సంప్రదించడంకూడ జరిగింది. కాని ఈ విషయంలో తర్వాత జరిగిన పురోగతి తెలియ లేదు... అనగా ఇంటర్వూ చేసి వుంటే దానిని వాడుకరులకు అందుబాటులో వుంచితే ..... వాడుకరులు సంతోషించ గలరు.. తమిళ/మళయాళ భాషలలో ఇలాంటి ఇంటర్వూలు కనిపిస్తున్నాయి. ఆస్థాయి మనతెలుగు భాషకు లేదా???
- అన్నింటికి మూలస్థంబమైన వికీమీడియా నుండి ప్రతి రోజు అనేక సూచనలు, సలహాలు, కార్యక్రమాలు, వార్తలు, క్రొత్త క్రొత్త ప్రాజెక్టులు, అవగాహనా కార్యక్రమాలు (అన్ని భాషలకు సంబందించి) నిత్యము వెలువడుతున్నాయి. వికీ మీడియా ఒక్క భాషకు సంబందించినది కాదుగనుక వారి కార్యక్రమాలు ఇంగ్లీషులోనే వుంటున్నాయి. అవి సామాన్య తెలుగు వాడికి అర్థం కావు. వాటిని తెలుగులో అనువదించి అందుబాటులో వుంచితే మరెంతో ఉపయోగ కరంగా / ప్రోత్సాహ కరంగా వుండగలదు.
- తెలుగు వికీపీడియా గురించి తెలుగు వారిలో అవగాహన చాల తక్కువగా వున్నది. వికీపీడియాలో రచనలు చేయడము తర్వాత విషయం. ముందుగా తెలుగు వారికి తెలుగులో ఎవరైనా.... వ్రాయగలిగే ఒక వేధిక వున్నదన్న విషయం అందరికి తెలియాలి. మనసంస్థకైనా.... అధికారులకైనా... నిర్వాహకులకైనా.... చివరగా సామాన్య వాడుకరులకైనా.... చదువరులకైనా ఇదే ప్రధాన ద్యేయం. ఈ వేధిక గురించి సంపూర్ణ అవగాహన తెలుగు వారి కందరికి కలగాలి. దీనికి సంబందించిన దానికి ఒక చూచన.............. ఏమంటే? వికీపీడియాకు సంబందించి సమగ్ర/సంపూర్ణ సమాచారము ఒక పుస్తక రూపకంలో తీసుకొచ్చి దాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంధాలయాలలోను, కళాశాలల గ్రంధాలయాలలోను,చదువరులకు అందుబాటులో వుంచ గలిగితే దాని ప్రభావము చాల వుండ గలదని నా భావన.
- 11.తెలుగు వికీపీడియాకు మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున నుండి ఏమాత్రము సహకారము లేదు. ఈ విషయంలో ఇతర భాషలకు సంబందిన ప్రభుత్వాలు వారికి తమ వంతు సహకారం అదిస్తున్నాయని ఆయా భాషల వికీపీడియన్లు మన దశాబ్ధి వేడులలో చెప్పి వున్నారు. వికీపీడియా అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటూ వుండవచ్చు. అయినా.... అతి కొద్ది రోజుల్లో మన తెలుగు భాషకు రెండు ప్రత్యేక రాష్ట్రాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని వికీపీడియా అధికారులు చురుకుగా స్పందించి తెలుగు వికీపీడియాకు ప్రభుత్వ తరుపున నుండి తగు ప్రోత్సాహం తీసుకు రాగలిగితే..... చాల బాగుంటుండి. ఈ విషయంలో ఏ ఒక్క రాష్ట్రంలో నైనా మనం పురోగతి సాధించగలిగితే..... రెండో రాష్ట్ర ప్రభుత్వం మొదటిదానితో పోటీపడి .... తెలుగు వికీపీడియాకు మరింత ప్రోత్సాహాలు అందించ గలదని నా భావన. క్రొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదేని ఒక మంత్రిత్వ శాఖలో ...... అనగా...... విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, తెలుగు భాష, మొదలగు మంత్రిత్వ శాఖలలోదేనిలోనైనా ఒక్క దానిలో తెలుగు వికీపీడియా కూడ ఒక అంశంగా వుండేటట్లు చేయ గలిగితే...... మనందరి కలలు పండి నట్లే.... మన ప్రయత్నాలకు ఇదే మంచి తరుణం. తెలుగు భాషకు సంబందించి రెండు వేర్వేరు రాష్ట్రాలు కొత్తగా కొలువు తీరబోతున్న సమయంలో మన ప్రయత్నాలు సత్పలితాలిస్తాయని నా నమ్మకం.
12.చివరిగా ఒక సూచన: పైన కనబరచిన విషయం వికీపీడియా సూత్రాలకు విరుద్ధంగా వున్నా?, అభ్యంతర కరంగా వున్నా? అనవసరమైనా (స్పాం) వెంటనే తొలగించ వచ్చును. Bhaskaranaidu (చర్చ) 10:29, 3 మే 2014 (UTC)
- చివరి సూచన విషయంలో ఒక సమాచారం. తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగు భాష, సంస్కృతిని ప్రపంచానికి, ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారికి అందుబాటులోకి తెస్తామని ఒక పార్టీ ప్రకటించింది. మీరు అభ్యంతరం కాదనుకుంటే రిఫరెన్సుతో ఆ పార్టీ పేరును ఇక్కడ రాస్తాను.--పవన్ సంతోష్ (చర్చ) 12:26, 3 మే 2014 (UTC)
- తప్పకుండా వ్రాయండి: అవసరమైన దిద్దుబాట్లను కూడ చేయండి. ఇంకా ఎవరైనా మంచి సూచనలిస్తే బాగుంటుంది: మీస్పందనలు తెలియ జేయండి Bhaskaranaidu (చర్చ) 13:11, 3 మే 2014 (UTC)
- భాస్కరనాయుడు గారు చాలా పరిశోధన చేసి వారు గత 2 సంవత్సరాలుగా కనుగొన్న విషయాలను ధైర్యం చేసి మనముందుంచారు. వారి సూచనలను ఇప్పటికే కొన్నిటిని కార్యరూపంలో వుంచాము. ఉగాది మహోత్సవాల సమయంలో తెలుగు వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని ఒక చిన్న పుస్తకానికి సరిపోయేటంత సుజాతగారు తయారుచేసి, సుమారు వెయ్యి కాపీలు పంపిణీ చేశాము. ఇంకా ఎవరికైనా దానిని అంతర్జాలం ద్వారా పంపించవచ్చును. అకాడమీల సమయంలో అందరికీ దానిని ముద్రించి అందించవచ్చును. శిక్షణా శిబిరాలలో పాల్గొన్న కొందరిని నేను నేరుగా ఫోను ద్వారా చర్చించి వారు వికీలో రచనలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది చురుకుగా పనిచేస్తున్న అందరం చేస్తుంటే తద్వారా కొంతమంది వారి రచనలు కొనసాగించే అవకాశం వుంటుంది. సభ్యత్వం తీసుకొన్న వారందరికీ మనం ఈ-మైల్ ద్వారా చేరుకొనే అవకాశం ఉన్నది. దానిని వారు ఎంతవరకు స్పందిస్తారో చెప్పలేము. విష్ణుగారు హెచ్.ఎం.టి.వి. కార్యక్రమ సమయంలో కొత్త వాడుకరులకు సహాయంగా ఉండడానికి వీడియో ద్వారా ఒక 10 చిన్న చిన్న కార్యక్రమాలను హిందీలో రూపొందించినట్లు తెలియజేశారు. అవి తెలుగులో కూడా తయారుచేయబోతున్నట్లుగా చెప్పారు. ఆ పని ఎంతవరకు ముందుకు పోయిందో తెలియదు. అవి కొత్తవారికి చాలా ఉపయొగపడతాయి. వికీస్పీషీస్ మీద నాకు చాలా ఆశక్తి ఉన్నది. దానిని ఇంక్యుబేషన్ నుండి బయటికి తెచ్చి కార్యరూపంలో తేవడానికి మనం ఏమిచేయాలో నాకు తెలియదు. తెలిసినవారు దానిని ముందుకు తీసుకొనివెల్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:24, 4 మే 2014 (UTC)
- Bhaskaranaidu గారు చేసిన సూచనలు అమూల్యమైనవి. ఇవి ఆచరణలోకి వస్తాయని ఆశిస్తున్నాను. Bhaskaranaidu గారికి నెనరులు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:14, 15 మే 2014 (UTC)
- భాస్కరనాయుడు గారు చాలా పరిశోధన చేసి వారు గత 2 సంవత్సరాలుగా కనుగొన్న విషయాలను ధైర్యం చేసి మనముందుంచారు. వారి సూచనలను ఇప్పటికే కొన్నిటిని కార్యరూపంలో వుంచాము. ఉగాది మహోత్సవాల సమయంలో తెలుగు వికీపీడియా గురించిన సమగ్ర సమాచారాన్ని ఒక చిన్న పుస్తకానికి సరిపోయేటంత సుజాతగారు తయారుచేసి, సుమారు వెయ్యి కాపీలు పంపిణీ చేశాము. ఇంకా ఎవరికైనా దానిని అంతర్జాలం ద్వారా పంపించవచ్చును. అకాడమీల సమయంలో అందరికీ దానిని ముద్రించి అందించవచ్చును. శిక్షణా శిబిరాలలో పాల్గొన్న కొందరిని నేను నేరుగా ఫోను ద్వారా చర్చించి వారు వికీలో రచనలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది చురుకుగా పనిచేస్తున్న అందరం చేస్తుంటే తద్వారా కొంతమంది వారి రచనలు కొనసాగించే అవకాశం వుంటుంది. సభ్యత్వం తీసుకొన్న వారందరికీ మనం ఈ-మైల్ ద్వారా చేరుకొనే అవకాశం ఉన్నది. దానిని వారు ఎంతవరకు స్పందిస్తారో చెప్పలేము. విష్ణుగారు హెచ్.ఎం.టి.వి. కార్యక్రమ సమయంలో కొత్త వాడుకరులకు సహాయంగా ఉండడానికి వీడియో ద్వారా ఒక 10 చిన్న చిన్న కార్యక్రమాలను హిందీలో రూపొందించినట్లు తెలియజేశారు. అవి తెలుగులో కూడా తయారుచేయబోతున్నట్లుగా చెప్పారు. ఆ పని ఎంతవరకు ముందుకు పోయిందో తెలియదు. అవి కొత్తవారికి చాలా ఉపయొగపడతాయి. వికీస్పీషీస్ మీద నాకు చాలా ఆశక్తి ఉన్నది. దానిని ఇంక్యుబేషన్ నుండి బయటికి తెచ్చి కార్యరూపంలో తేవడానికి మనం ఏమిచేయాలో నాకు తెలియదు. తెలిసినవారు దానిని ముందుకు తీసుకొనివెల్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:24, 4 మే 2014 (UTC)
No one needs free knowledge in Esperanto
మార్చుThere is a current discussion on German Wikipedia on a decision of Asaf Bartov, Head of WMF Grants and Global South Partnerships, Wikimedia Foundation, who rejected a request for funding a proposal from wikipedians from eowiki one year ago with the explanation the existence, cultivation, and growth of the Esperanto Wikipedia does not advance our educational mission. No one needs free knowledge in Esperanto. On meta there has also started a discussion about that decision. --Holder (చర్చ) 10:55, 5 మే 2014 (UTC)
మీడియా వ్యూయర్ తెలుగు వికీపీడియాలో స్థాపన విషయమై
మార్చునమస్కారం మీడియావ్యూయర్ ఉపకరణం ద్వారా ఒక పేజీలో ఉన్న బొమ్మలను మనం పెద్దదిగా చేసి ఒక ఓవర్లే లో చూడవచ్చు. ఈ ఉపకరణం ద్వారా వ్యాసంలోని ఏదయినా బొమ్మ మీద క్లిక్ చేసి దానిని పెద్దగా చూడవచ్చు, ఇంకా ఆ బొమ్మకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా చూడటానికి వీలుంటుంది. ఈ ఉపకరణాన్ని బీటా ద్వారా ఎన్నో రోజులనుండి చూస్తున్నాం. ఇది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నాం. మీ స్పందన తెలపగలరు. అలానే ఈ ఉపకరణానికి సంబంధించిన అనువాదాలను ఇక్కడ సమీక్షించగలరు.
- నాకు సమ్మతమే
- --రహ్మానుద్దీన్ (చర్చ) 06:17, 7 మే 2014 (UTC)
- --Pranayraj1985 (చర్చ) 04:18, 8 మే 2014 (UTC)
- -- --t.sujatha (చర్చ) 05:28, 9 మే 2014 (UTC)
- --- విశ్వనాధ్ (చర్చ) 05:29, 12 మే 2014 (UTC)
- ------- కె.వెంకటరమణ చర్చ 06:35, 12 మే 2014 (UTC)
- --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:11, 12 మే 2014 (UTC)
- ఇది వాడుకరులకు చాలా ఉపయోగం. దీనిని తెలుగు వికీపీడియా స్థాపించడం నాకు సమ్మతమే.Rajasekhar1961 (చర్చ) 11:33, 12 మే 2014 (UTC)
<పైన మీ పేరు చేర్చగలరు>
- నాకభ్యంతరాలున్నాయి
- (మీ అభ్యంతరాలు, సంతకం చేర్చగలరు)
- <పైన మీ పేరు చేర్చగలరు>
- తటస్థం
- <పైన మీ పేరు చేర్చగలరు>
- నిర్ణయం
అందరి సమ్మతంతో మీడియావ్యూయర్ రేపు తెలుగులో రోల్ ఔట్ అవుతుంది. పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు.
హైదరాబాదులోని వివిధ ప్రాంతాల చరిత్ర విషయమై
మార్చుhttps://www.facebook.com/groups/HistoryofHyderabad/ అనే ఫేస్‍బుక్ గ్రూప్ లో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల చరిత్ర ఆ ప్రదేశపు పేరు వ్యుత్పత్తి మొదలగు వాటి మీద చర్చిస్తున్నారు. ఆ విషయాలన్నీ ఒక పుస్తకం గా వేసి ప్రచురిస్తారు. ఆ అంశాలను వికీపీడియాలో వ్యాసాల నాణ్యత పెంచేందుకు వాడుకోవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:35, 7 మే 2014 (UTC)
ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో విడుదల, తెలుగు వికీసోర్సులో చేర్పు
మార్చుతెవికీ మిత్రులకు నమస్కారం.రహ్మతుల్లా గారి అభ్యర్థనమేరకు సిఐఎస్ ఆక్సెస్ టు నాలడ్జ్ ప్రోగ్రాం ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల చేయడానికి వారిని సంప్రదించింది. ఈ విషయమై ఇందూ జ్ఞానవేదిక ప్రతినిధులతో విస్త్రుతంగా చర్చించడం జరిగింది. ఈ చర్చల పర్యవసానంగా వారు క్రింది ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల చేయడానికి ఒప్పుకున్నారు మరియు వీటిని తెలుగు వికీసోర్సులో ఉంచి జనబాహుళ్యానికి ఉచితంగా ఈ జ్ఞానభాండాగారాన్ని అందుబాటులోకి తేవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. రహ్మతుల్లాగారు ఇచ్చినఈ మంచి సూచన మరియు వారి స్పూర్థి గణనీయం. వారికి అనేకానేక ధన్యవాదాలు.
- ఇందూ జ్ఞానవేదిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల చేయడానికి ఇచ్చిన జాబితా
- త్రైత సిద్ధాంతము.
- ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు.
- ధర్మము - అధర్మము.
- ఇందుత్వమును కాపాడుదాం.
- దయ్యాల - భూతాల యదార్థసంఘటనలు.
- సత్యాన్వేషి కథ.
- శ్రీకృష్ణుడు దేవుడా, భగవంతుడా.
- గీతా పరిచయము.
- కలియుగము (ఎప్పటికీ యుగాంతము కాదు).
- జనన మరణ సిద్ధాంతము.
- మరణ రహస్యము.
- పునర్జన్మ రహస్యము.
- త్రైతాకార రహస్యము (త్రైతాకార బెర్ముడా).
- దేవాలయ రహస్యములు.
- ఇందూ సాంప్రదాయములు.
- మన పండుగలు (ఎలా చేయాలో తెలుసా?)
- ధర్మశాస్త్రము ఏది?
- హేతువాదము-ప్రతివాదము.
- ప్రథమ దైవ గ్రంథము భగవద్గీత.
- ద్రావిడ బ్రాహ్మణ
భారతదేశంలో అందులోను భారతీయ భాషలలో ఇంత పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మిక ప్రచురణలు క్రియేటివ్ కామన్స్ (CC-BY-SA 3.0)లైసెన్స్ లో విడుదల కావడం బహుశా ఇదే మొదటి సారి. ఒక హైదరాబాదులో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రచురణలను క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో విడుదల చేయలని ఆలోచన. ఇలా చేయడం ద్వారా క్రియేటివ్ కామన్స్ గురించి తెలుగువారిలో ఇంకా అవగాహన పెంచవచ్చు. ఈ కార్యక్రమం తేది, వేదిక ఇంకా ఖరారు కాలేదు, బహుశా జూన్ నెల హైదరాబాదులో జరిగే తెవికీ నెలసరి సమావేశంలో భాగంగా దీనిని చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని తెవికీ సముదాయం సహకారంతో సి.ఐ.ఎస్ A2K తెలుగు ప్రణాళికలో భాగంగా చేయదలిచాము. మీ సూచనలు సలహాలుస్పందనలు క్రింద తెలియచేయగలరు. --విష్ణు (చర్చ)07:35, 15 మే 2014 (UTC)
స్పందనలు
మార్చుచాలామంచి పని చేపట్టారు. ఈ పుస్తకాలు మనకు ఏ రూపంలో ఇస్తారు? దాన్నిబట్టి మనం వికీలో టైపు చేయాలా లేక కోడ్ కన్వర్టర్లను వాడి ఎక్కించాలా అనేది నిర్ణయించగలం. --రవిచంద్ర (చర్చ) 07:41, 15 మే 2014 (UTC)
- చాలా బృహత్ప్రణాళిక ఇది. ముందుగా వారిని ఒప్పించడానికి మీరు పడిన శ్రమ అభినందనీయం. ఈ పుస్తకాల విడుదల తెవికీ నెలసరి సమావేశాలలో చేస్తే బాగుంటుంది అని విష్ణు గారు చెప్పడం బాగుంది. అర్జునరావు, నేను, రవిచంద్ర, భాస్కరనాయుడు తదితరులు దీనికి అవసరమైన కృషి చేసి వికీసోర్సు ద్వారా వీటికి తెలుగువారికందరికీ అందజేద్దాము.Rajasekhar1961 (చర్చ) 10:07, 15 మే 2014 (UTC)
- రవిచంద్ర గారు రాజశేఖర గారు మీ స్పందనలకు ధన్యవాదాలు. ఈ పుస్తకాలు అన్నీ అనులో టైపు చేయబడి ఉన్నాయి. ఆ దస్త్రాలను మనం తీసుకొని యూనికోడ్‌కి కన్వర్ట్ చేసి వికీసోర్సులో ఉంచవచ్చు. దీనిని మనం పుస్తకాల విడుదల కార్యక్రమం తరువాత చేపడదాం. రాజశేఖరగారు మీరు ఫాంటు కన్వర్టరు వాడుతున్నారా. వాడనట్లయితే ఈ సారి మనం ఇద్దరం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రహ్మానుద్దీన్ నుండి నేర్చుకుందాం. ఏమంటారు? --విష్ణు (చర్చ)17:14, 15 మే 2014 (UTC)
సూచనలు
మార్చుతెవికీకి ప్రభుత్వం తరుపున సహకారము - ఒక చిన్ని విజయం
మార్చుతెవికీ మిత్రులకు నమస్కారం.
తెలుగు వికీపీడియాకు మన రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహకారము తీసుకురావాలని మనం సముదాయంలో చాలా మార్లు చర్చించాం. అయితే గత కొన్ని నెలలుగా సి.ఐ.ఎస్.A2K తరఫున ఈ దిశలో ప్రయత్నం చేస్తున్న సంగతి మీలో కొందరికి తెలిసిందే. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒక ప్రముఖ పార్టీ మానిఫెస్టోలో తెలుగు వికీపీడియా అభివృద్ధిని పరిగణలోకి తీసుకుందని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఈ మానిఫెస్టోలో తెలుగు భాషా - సాంస్కృతిక రంగం అభివృద్ధి సెక్షనులో చూడగలరు. ఈ చిన్ని విజయం స్పూర్తితో తెవికీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారం తీసుకురావడానికి కృషి ఇంకా కొనసాగిస్తామని సభ్యులు గమనించగలరు.
సి.ఐ.ఎస్.A2K కాని మరియు నేను కాని ఈ పార్టీకి సానుకూలము కాదు వ్యతిరేకము కాదు. మరియు ఏ రాజకీయ పార్టీకి ప్రచారం కల్పించడమనే ఉద్దేశంతో ఈ ప్రయత్నము చేయలేదు. అందుకనే మానిఫెస్టోలో వికీపీడియా ఉన్న విషయం మీ దృష్టికి ఎన్నికల ముందు తీసుకురాలేదు. ఇది పూర్తిగా తెవికీ పురోగతిని దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రయత్నమే కాని మరే ఇతర ఉద్దేశముతో కాదని సభ్యులు గమనించగలరని అభిలషిస్తున్నాను.--విష్ణు (చర్చ)15:16, 15 మే 2014 (UTC)
- ఈ హామీ అమలైతే తెవికీకి చాలా మంచిది, హామీ గురించి కృషి చేసిన సభ్యులకు మరియు ఇలాంటి హామీ ఒకటి ఉన్నదని తెలిపిన విష్ణు గారికి ధన్యవాదములు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:11, 15 మే 2014 (UTC)
- తెదేపా ఇచ్చిన ఈ హామీని నేను తెలుగు వెలుగు పత్రికలోని వ్యాసంలో చూశాను. రచ్చబండలోని వేరే థ్రెడ్‌లో అప్పటీకి ఎన్నికలు మిగిలే ఉండడంతో విష్ణు గారి సూచనల మేరకు ఒక పార్టీ అని ప్రస్తావించాను. ఏదేమైనా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోనూ, వెనువెంటనే ఆ స్ఫూర్తితో తెలంగాణాలోనూ తెవికీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. అలాగే ప్రభుత్వం కొలువుదీరాకా ఈ అంశంపై సంబంధిత మంత్రులను కదిలించిచూద్దాము. ఈ అంశాన్ని మేనిఫెస్టోలోకి తీసుకువచ్చేలా వారి దృష్టికి తీసుకుపోయేందుకు కృషిచేసినందుకు విష్ణు గారికి ఆయన మిత్రులకు కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:57, 31 మే 2014 (UTC)
‘‘కవిసంగమం’’ లోని కవుల వ్యాసాలు
మార్చుఅందరికి నమస్కారం... ఫేస్ బుక్ లోని కవి సంగమం లోని కవుల వ్యాసాలు రాయాలని తెలుగు వికీపీడియా సంకల్పించింది. దానికోసం మార్చి నెలలో ఈ గ్రూప్ పేజిలో వికీపీడియా రాయడం జరిగింది. వ్యాసాలు రాయాలంటే ఈ కవిది ఒక పుస్తకం అయిన ప్రచురితమై ఉండాలి అని చెప్పడం జరిగింది. 10 మంది తమతమ వివరాలు పంపించారు. అయితే మంచి కవులకు కొలమానం పుస్తక ప్రచురణా ? అని కవి సంగమంలో రాస్తున్న ఇతర కవులు నన్ను ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ చూడండి. మూలాల కోసం అవసరమని వారికి వివరించాను. కొంతమంది కవుల కవిత్వాలు వార్త పత్రికల్లో, పుస్తకాల్లో, ఇతర వాటిల్లో వచ్చాయని, వాటిని మూలాలుగా ఎందుకు తీసుకోలేరని అడిగారు. కవుల వ్యాసాలు రాయడానికి దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో పెద్దలు తెలుపగలరు. Pranayraj1985 (చర్చ) 09:37, 25 మే 2014 (UTC)
- స్పందించిన పదిమంది కవుల గురించి వ్యాసాలు ప్రారంభించండి. వారి పుస్తకాలు మాత్రమే కాకుండా వార్తాపత్రికలు, పుస్తకాల్లోవచ్చిన కవిత్వాలు కూడా మూలాలుగా పేర్కొనవచ్చును. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:32, 31 మే 2014 (UTC)
- కవిసంగమంలోని కవులను గురించి రాయవచ్చన్నది మంచి ఆలోచన. పుస్తకాలేమీ వారి ప్రతిభకు కొలమానం కాదు. ప్రాచుర్యం అన్నది ప్రమాణంగా ముందుకువస్తే మళ్ళీ నేనేమీ చెప్పలేను. పైగా పుస్తక ప్రచురణే వికీపీడియాకు ప్రామాణిక మూలమని మీరు భావించేట్టైతే నా వద్ద కవిసంగమం కవుల గురించి వారి కవితాపాదాలనే ఉపయోగించి వర్ణిస్తూ మిత్రుడు "యశస్వి" సతీష్‌కుమార్ రాసిన పుస్తకం ఉంది. అందులో ఆయా రచయితల సంక్షిప్త వివరాలు ఉన్నాయి. ఆ పుస్తకం ప్రచురించేముందు అన్వయదోషాలు సరిజేసేందుకు సహకరించాను కనుక సాఫ్ట్‌కాపీ కూడా నా దగ్గర ఉంది. రచయిత ఎవరితోనైనా పంచుకునేందుకు అనుమతించారు. గతంలో ఈ పుస్తకంలోని వివరాల గురించి నేను కొందరు వికీపీడియన్లతో సంప్రదించాను. మీరు కావాలంటే ఆ పుస్తకం పంపుతాను. అవసరమైతే మనం ఒక స్కైప్ ఛాట్ చేసి ప్రణాళిక మెరుగుపరుచుకోవచ్చు. ఇదే కాక కవిసంగమం వారు ఆయా కవుల కవిత్వాలను సంకలనాల్లో ముద్రించారేమోననుకుంటున్నాను. ఈ కృషిలో సహకరించేందుకు నేను సిద్ధమే. --పవన్ సంతోష్ (చర్చ) 07:52, 31 మే 2014 (UTC)
- ధన్యవాదాలు రాజశేఖర్ గారు మరియు పవన్ సంతోష్ గారు... రాజశేఖర్ గారు చెప్పినట్లుగా వార్తాపత్రికలు, పుస్తకాల్లోవచ్చిన కవిత్వాలు కూడా మూలాలుగా తీసుకొని వ్యాసాలను ప్రారంభిస్తాను.. Pranayraj1985 (చర్చ) 06:51, 9 జూన్ 2014 (UTC)
Making telugu content accessible projetకు ఫండింగ్ లభించింది
మార్చుhttps://meta.wikimedia.org/wiki/Grants:IEG/Making_telugu_content_accessible అన్న పేజీలో నేను ప్రతిపాదించిన Making telugu content accessible అన్న ప్రాజెక్ట్‌కు వికీమీడియా ఫౌండేషన్(WMF) నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారు. తెలుగు వికీపీడియన్లు విశ్వనాధ్.బి.కె., వెంకటరమణ,రాజశేఖర్, భాస్కరనాయుడు, రవిచంద్ర, కశ్యప్, పాలగిరిలు ఈ ప్రాజెక్టును పరిశీలించి దాన్ని సమర్థిస్తూ అక్కడ సంతకం చేశారు. Ocaasi, Arjunaraoc, Jayantanth, Jan eissfeldt, Nemo ప్రాజెక్టుపై సూచనలతో చర్చ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ప్రాజెక్టుకు ప్రయత్నం చేయమన్న ఆలోచన కలిగించిన రాజశేఖర్, సలహాలతో సహకరించిన విష్ణు, రహ్మానుద్దీన్లకు, ప్రాజెక్టుకు సానుకూలంగా స్పందించి ఫండింగ్ ఇచ్చిన IEG కమిటీ సభ్యులకు ధన్యవాదాలు.
ఈ ప్రాజెక్టు విషయమై నాకు సహకరించేందుకు ఇప్పటికే రాజశేఖర్ గారు, మీనా గాయత్రి వాలంటీర్లుగా కృషిచేస్తానని ముందుకు వచ్చారు. ఇంకెవరైనా ముందుకు రాదలిస్తే సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కాటలాగును తయారుచేసే క్రమంలో ఆయా పుస్తకాలను మూలాలుగా స్వీకరించి వ్యాసాలు అభివృద్ధి చేసేందుకు ఎడిట్-ఎ-థాన్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంపై కూడా మీ సూచనలకు, నిర్మాణాత్మక భాగస్వామ్యానికి ఆహ్వానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 08:26, 31 మే 2014 (UTC)
- తెలుగు వికీపీడియాలో మొట్టమొదటి వ్యక్తిగత గ్రాంటు పొందిన పవన్ కి శుభాకాంక్షలు. మొదటి నెలలో మీ ప్రణాళిక వివరాలు తెలియజేయండి. జూన్ నెలలో తెవికీ సభ్యుల కోసం ఒక అవగాహనా సదస్సు నిర్వహించి ఈ బృహత్కార్యాన్ని ఎలా నిర్వహించాలో చర్చించండి.Rajasekhar1961 (చర్చ) 09:52, 31 మే 2014 (UTC)
- అభినందనలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:52, 31 మే 2014 (UTC)
- అభినందనలుPalagiri (చర్చ) 13:03, 31 మే 2014 (UTC)
- తెలుగు వికీపీడియాలో మొట్టమొదటి వ్యక్తిగత గ్రాంటు పొందినందులకు అభినందనలు . .--విష్ణు (చర్చ)
- ఆభినంధనలు ..విశ్వనాధ్ (చర్చ) 07:20, 2 జూన్ 2014 (UTC)
- తెలుగు వికీపీడియాలో మొట్టమొదటి వ్యక్తిగత గ్రాంటు పొందినందులకు అభినందనలు . .--విష్ణు (చర్చ)
- అభినందనలుPalagiri (చర్చ) 13:03, 31 మే 2014 (UTC)
- పవన్ సంతోష్ కు అభినందనలు. వెంటనే పని చేపట్టి ఉత్సాహంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నం మరికొంతమందికి ప్రేరణగా నిలవాలని నా ఆకాంక్ష.--రవిచంద్ర (చర్చ) 11:33, 2 జూన్ 2014 (UTC)
- పవన్ సంతోష్ కు అబినందనలు.--శ్రీరామమూర్తి (చర్చ) 16:07, 3 జూన్ 2014 (UTC)
- తెవికీలో వ్యక్తిగత గ్రాంటు పొందిన పవన్ సంతోష్ కు మనఃపూర్వక అభినందనలు. --t.sujatha (చర్చ) 16:14, 3 జూన్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారికి అభినందనలు. మీరు మీ ప్రయత్నంలో సఫలీకృతం కావాలని కోరుతూ శుభాకాంక్షలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:32, 3 జూన్ 2014 (UTC)
- తెలుగు వికీపీడియాలో మొట్టమొదటి వ్యక్తిగత గ్రాంటు పొందినందులకు పవన్ సంతోష్ గారికి అభినందనలు.---- కె.వెంకటరమణ చర్చ 07:22, 4 జూన్ 2014 (UTC)
- అభినందనలు వాడుకరి:Pavan santhosh.s గారు -- Pranayraj1985 (చర్చ) 04:24, 9 జూన్ 2014 (UTC)
- స్పందించిన సహ వికీపీడియన్లందరికీ కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేస్తాను. గ్రాంటుకు సంబంధించిన కొన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకునేందుకు బిజీగా ఉండడం, నా లాప్‌టాప్ అదే సమయంలో పాడుకావడం వంటి కారణాలతో మీ అందరికీ ఆలస్యంగా స్పందించాను. మీ స్నేహపూర్వకమైన ప్రతిస్పందనలకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:26, 9 జూన్ 2014 (UTC)
- అభినందనలు వాడుకరి:Pavan santhosh.s గారు -- Pranayraj1985 (చర్చ) 04:24, 9 జూన్ 2014 (UTC)
వికీపీడియా గ్రాంట్‌కు గూడెం యువకుడు
మార్చుసూరంపూడి పవన్‌సంతోష్ గారిని అభినందిస్తూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త.... --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:32, 20 జూన్ 2014 (UTC)
తాడేపల్లిగూడెం: తెలుగు భాషా సాహిత్యాలను క్రోడీకరించి ప్రపంచానికి అందించే ఉద్దేశంతో వికీపీడియా ఆధ్వర్యంలో ఈ ఏడాది తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘తెలుగు ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంటు గ్రాంట్’ (డబ్ల్యూఎంఎఫ్)కు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సూరంపూడి పవన్‌సంతోష్ ఎంపికయ్యారు. తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌కు మనదేశం నుంచి తాను, కర్ణాటకకు చెందిన మరొకరు ఎంపికైనట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యున్నతమైన చారిత్రక, భౌగోళిక, సాంకేతిక గ్రంథాల మౌలిక వివరాలు అందిస్తూ, వాటిని ఉచితంగా చదివేందుకు వీలైన వెబ్‌సైట్ లింకులు పొందుపరుస్తామని తెలిపారు. తెలుగులో ఉన్న అపురూప గ్రంథాలు వెలికి తీసి వాటిలోని విజ్ఞానాన్ని వికీపీడియా సహకారంతో అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
జూన్ నెల మొలకల జాబితా
మార్చుజూన్ నెల మొలకల జాబితా వద్ద మే నెలలో కొత్తగా చేర్చబడిన మొలకల వ్యాసాలు ఉన్నాయి. వీటిపై కృషి చేయగలరు. ఎవరి మొలకల బాధ్యత వారిదే! అదే సమయంలో మిగితా మొలకలను కూడా సభ్యులు పరిశీలించి విస్తరించగలరు. మే నెల జాబితాలో ఇంకా ఎన్నో మొలకల స్థాయిని దాటని వ్యాసాలున్నాయి. వాటి మీద కూడా పని చేద్దాం! --రహ్మానుద్దీన్ (చర్చ) 12:05, 1 జూన్ 2014 (UTC)
- ఈ విధంగా నెలవారీ మొలకల జాబితా తయారు చేయడం ఎన్ని నెలలుగా జరుగుతోంది. మొలక అని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. పరిమాణాన్ని బట్టా? దీన్ని ఇలాగే కొనసాగించాలని నా కోరిక --రవిచంద్ర (చర్చ) 10:38, 2 జూన్ 2014 (UTC)
- రవిచంద్ర గారూ, వైజాసత్య గారు దాదాపు ఒక సంవత్సరం క్రితం మొదలుపెట్టారు. అయితే ఒక రెండు నెలల తరువాత ఎందుకో మళ్ళీ కనిపించలేదు. నేను పోయిన నెల నుండి మొదలుపెట్టాను. వైజాసత్య గారు అనుసరించిన విధానాన్నే నేనూ అనుసరిస్తున్నాను. వ్యాసం చరిత్రను చూడండి లో చూస్తే మూసలు, వర్గాలు, ఇతర కోడ్ లో ఉన్న చిహ్నాలు కలుపుకొని వ్యాసం పరిమాణం చూపిస్తుంది. కానీ ఆ పరిమాణానికి వ్యాసం బయట చదవడానికి కనిపించే పరిమాణానికి తేడా ఉంటుంది. ఇది వీక్షణకున్న వ్యాసం పరిమాణాన్ని బట్టీ ఉంది. అంటే, మీకు వ్యాసం నిడివి లో కనిపించే దానికన్నా ఇది తక్కువగానే ఉంటుంది. బయటకు కనిపించే పాఠ్యాన్నే నేను పరిగణిస్తున్నాను. నేను మరొకరికి బాటు విధానాలు నేర్పే వరకూ, కనీసం వారికి ఇవి నడిపే బాధ్యత తెలిసే వరకూ కొనసాగిస్తానని చెప్పగలను. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:33, 4 జూన్ 2014 (UTC)
తెలంగాణ ఆవిర్భావం
మార్చుతెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన శుభసమయంలో తెలంగాణ ప్రజలందరికీ తెవికీ తరపున శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన సమయమిది. తెలుగువారికి మరొక రాష్ట్రం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఇప్పుడున్న సమాచారాన్ని రెండుగా వేరుచేయాలి. దానికి ఏదైనా సులభమైన పద్ధతి ఉన్న తెలియజేయగలరు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:42, 2 జూన్ 2014 (UTC)
- నేను కొంత సమాచారాన్ని తాజా పరిచాను.ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసం కొంత శ్రమ తగ్గించడంలో ఉపయోగపడవచ్చు. --విష్ణు (చర్చ)
అచ్చు తప్పులుగా కనిపించడంపై
మార్చు"ఆన్లైన్ బ్యాంకింగ్" అనే పేరుతో పేజీని సృష్టించినప్పుడు ఆ పేజీ శీర్షిక "ఆన్లెన్ బ్యాంకింగ్" లాగా కనిపిస్తుంది. ఇలా తప్పుగా కనిపించకుండా సరిచేయగలరని మనవి. YVSREDDY (చర్చ) 06:36, 4 జూన్ 2014 (UTC)
- YVSREDDY గారూ, వ్యాస శీర్షికను ఆన్‌లైన్ బ్యాంకింగ్ కి తరలించాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:38, 4 జూన్ 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ గారికి ధన్యవాదములు, మీరు ఈ వ్యాస శీర్షికను తరలించిన తదుపరే ఈ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అచ్చు తప్పుగా కనిపించే శీర్షికలు మరికొన్ని ఉండవచ్చు, లేదా కొత్త శీర్షికలకు ఈ సమస్య ఏర్పడవచ్చు, ఇటువంటి సమస్యలు మున్ముందు ఏర్పడకుండా తగు పరిష్కారం కొరకు ఈ చర్చ ప్రారంభించడం జరిగింది. YVSREDDY (చర్చ) 07:20, 4 జూన్ 2014 (UTC)
శివ పురాణం
మార్చుs:శివ పురాణం పూర్తి పాఠ్యాన్ని వికీసోర్సులో చేర్చాను. గౌరవనీయులైన వికీపీడియన్లలో ఆసక్తిగలవారు దానిని భక్తిపూర్వకంగా చదివి తరించమని మనవి.Rajasekhar1961 (చర్చ) 06:04, 5 జూన్ 2014 (UTC)
తెలుగు విక్షనరీ గణాంకాలు
మార్చుతెలుగు విక్షనరీ లో 90,000 పేజీలు దాటాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:42, 11 జూన్ 2014 (UTC)
- చాలా మంచి విషయం. త్వరలోనే 100,000 కావాలని ఆశిస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:46, 12 జూన్ 2014 (UTC)
ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల కార్యక్రమము హైదరాబాదులో జూన్ 22న!
మార్చుసీఐఎస్-ఏ2కే ఆధ్వర్యంలో ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు అనుగుణంగా జరుగనుంది. ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల సభ సమావేశ పేజీ వద్ద ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో వికీసోర్స్ మీద శిక్షణ, లైసెన్స్ ల పై అవగాహన, చర్చా వేదిక ఉంటాయి. ఇది 22 జూన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకూ ఉంటుంది. తదుపరి సాయంత్రం 3 నుండి నెలవారీ సమావేశం ఉంటుంది.--రహ్మానుద్దీన్ (చర్చ) 17:34, 12 జూన్ 2014 (UTC)
వికీడేటా
మార్చువికీడేటా లోనికి తెలుగు భాషకు చెందినవి చేరడం లేదు. సాంకేతికమైన విషయాలేమైనా ఇబ్బంది కలిగిస్తున్నాయి. దయచేసి ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 11:18, 13 జూన్ 2014 (UTC)
విజయవాడ, గుంటూరులలో వికీపీడియా శిక్షణ శిబిరాలు
మార్చువచ్చే వారంలో విజయవాడ, గుంటూరులలో వికీపీడియా శిక్షణా శిబిరాలు జరుగనున్నాయి. పరిసరాలలో ఉండే తెలుగు వికీపీడియనులు తప్పక పాల్గొనగలరు. వివరాలు సంబంధిత శిక్షణ శిబిరం పేజీలో చూడగలరు (వికీపీడియా:శిక్షణ శిబిరం/గుంటూరు/గుంటూరు 4, వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 5,వికీపీడియా:శిక్షణ శిబిరం/విజయవాడ/విజయవాడ 6), వికీపీడియన్లు వారి పేర్లను నిర్వాహకుల విభాగంలో చేర్చగలరని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:39, 19 జూన్ 2014 (UTC)
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
మార్చువికీమీడియా ఫౌండేషన్ వారు ప్రకటించిన ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంటుకు తెలుగు వికీపీడియా నుంచి మనం ప్రతిపాదించిన "తెలుగు సమాచారం అందుబాటులో"(making telugu content accessible) అన్న ప్రాజెక్టు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 21తేదీ నుంచి ప్రాజెక్టుకు కార్యరూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. నేను ప్రారంభించిన ప్రాజెక్టు పేజీని సందర్శించమని సహ వికీపీడియన్లకు మనవి. ఈ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో విజ్ఞానసర్వస్వ కృషికి పనికివచ్చే తెలుగు పుస్తకాలను వెతికేందుకు వీలుగా సెర్చబుల్ కాటలాగ్ తయారుచేయడం. ఆ చేసిన కాటలాగులోని పుస్తకాలు వికీసోర్సులో చేర్చుకుని, వికీపీడియాలో వాటి సాయంతో వ్యాసాలు అభివృద్ధి చేసుకుని మన కృషిని మరింత సుసంపన్నం చేసుకోవడం లక్ష్యం. ఇప్పటికే రాజశేఖర్ గారు ఈ కృషిలో పాలుపంచుకుని ఓ రెండు పుస్తకాల వివరాలు కాటలాగ్ చేశారు. పలువురు ఆంధ్ర వీరుల గురించి వ్రాసిన వ్యాసాల సంపుటియైన ఆంధ్రవీరులు రెండు సంపుటాలనూ అక్కడ చూసి వికీసోర్సులో పెడతామని ఆసక్తితో వున్నారు. భాస్కరనాయుడు గారు ఆ వ్యాసల్లోని వివరాలతో ఆంధ్రవీరుల గురించి ఇప్పటికే ఉన్న వ్యాసాలు అభివృద్ధి చేసి, లేకుంటే కొత్త వ్యాసాలు రాస్తామన్నారు. ఇదంతా ఒకే ఒక్క పుస్తకానికి వచ్చిన స్పందన. మిగిలిన సహవికీపీడియన్లు కూడా కాటలాగ్ నిర్మాణం, వికీసోర్సులో చేర్చడం, వికీపీడియా వ్యాసాలు రచించడం విషయాల్లో సహకరించమని విజ్ఞప్తి. --పవన్ సంతోష్ (చర్చ) 03:59, 23 జూన్ 2014 (UTC)
- కాటలాగ్ నిర్మాణంలో సహకరించదలుచుకున్న వికీపీడియన్లు మాత్రం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇచ్చిన పుస్తకం పేరు, రచయిత పేరు విశ్వసించవద్దని మనవి. ఎందుకంటే అవి చాలా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఉదాహరణకు ramand-a sheshhaadri అని డీఎల్‌ఐ వారు ఇచ్చారు. తీరా పుస్తకంలో పేజీలు తిరగేస్తే అది శేషాద్రి రమణ కవులు అన్న పేరుకు వాళ్ళ స్పెల్లింగ్ అని తేలింది. కనుక పుస్తకం పేజీలు తెరిచి చూసి మరీ రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 23 జూన్ 2014 (UTC)
- తెలుగు వికీపీడియాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు పేజీలు ప్రారంభించాం-డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితా, ప్రాజెక్టు పేజీ. ఇందులో మొదటిది కీలకమైన జాబితా పేజీ కావడంతో కంటెంట్ సెర్చబుల్ అయ్యేందుకు గాను కంటేంట్ పేజీగా చేశాం. రెండోది ప్రాజెక్టు పేజీ-ఇది పూర్తిస్థాయి మార్గదర్శిగా ఉండేందుకు అవసరమైన సమాచారంతో అభివృద్ధి చేసాము. ఈ ప్రాజెక్టులో రాజశేఖర్ గారు విస్తృత సహకారం, సూచనలు, సేవలు అందిస్తున్నారు. తెవికీలో జాబితాలోంచి పలు పుస్తకాలను ఎంపికచేసి వాటిని వెతికి, దిగుమతి చేసి వికీసోర్సులో చేరుస్తున్నారు. ఆపైన పుస్తకాల్లోని వివరాలు చదివి వ్యాసాలను సృష్టించడం అభివృద్ధి చేయడం చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని పుస్తకాలు వికీసోర్సులో చేరాయి. ఇక ఈమధ్య ఫేస్‌బుక్‌లో నేను యాక్టివ్‌గా ఉండే సాహిత్యం అన్న గ్రూపులో ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు తద్వారా తెలుగు సాహిత్య రంగానికి జరిగే మేలు వివరించాను. తద్వారా నా స్నేహితులు, సాహిత్యవేత్త నారాయణస్వామి తమ వాల్‌పై ఆ వివరాలు లింకు పోస్టు చేసుకున్నందుకు ఈ జాబితా గురించి విస్తృతమైన చర్చ జరిగింది. ఫలితంగా కొందరు ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తామని ముందుకు వచ్చారు. ఒకరు లక్ష్మీదేవి గారు-ఆవిడ సాహిత్యంపై చక్కని అవగాహనతో సాహిత్య విశ్లేషణలు చేస్తూంటారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై ఆసక్తితో వికీలో వాడుకరి పేజీ తయారు చేసుకున్నారు. మరొకరు పి.వి.రామారావు గారు ఆయన ఇప్పటికే తెవికీలో కృషిచేసిన వారు. ఈ ప్రాజెక్టు గురించి ఫేస్‌బుక్‌లో తెలుసుకుని దీనిపై కృషిచేస్తానని సంప్రదించి ప్రాజెక్టు సభ్యులుగా చేరారు. వీరందరికీ ధన్యవాదాలు. ఆసక్తి వున్న వికీపీడియన్లు ఈ ప్రాజెక్టు పేజీలో సభ్యులు కావాలని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:50, 27 జూన్ 2014 (UTC)