వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 2

పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3

alt text=2007 ఆగస్టు 11 - 2007 సెప్టెంబరు 26 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2007 ఆగస్టు 11 - 2007 సెప్టెంబరు 26

పంచారామాలు మార్చు

పుణ్యక్షేత్రాలలోని పంచారామాల వివరాలు సరిచూడగలరు.సరిగా లేనట్టుంది.కోటిపల్లి పంచారామం కాదుకధ.భీమవరం ఒకటి లేదు.కృతజ్ఞతలు.vissu 13:27, 11 ఆగష్టు 2007 (UTC)

సరైన వివరాలతో మీరు మార్పులు చేయండి. మూలాలు చూపండి.కోటిపల్లి పంఛారామం కాదు, భీమవరం పంచరామం అని అనుకొంటున్నాను.--మాటలబాబు 14:01, 11 ఆగష్టు 2007 (UTC)

శ్రీశైలం మార్చు

శ్రీశైలం మండలం పేజీలో శ్రీశైలలింగం.శ్రీశైలం అని ఉంది దాన్ని క్లిక్చేస్తే శ్రీశైలక్షేత్రం గురించిన సమాచారం వస్తున్నది.దాన్ని శ్రీశైల లింగం అనికాక శ్రీశైలదేవస్తానం మరియు పరిశర ప్రాంతాలు అని మార్ఛబడిన బాగుంటుందని నా ఉద్దేశ్యం.
తరువాత శ్రెశైలక్షేత్రం పేజీ బాగా పెద్దగా ఉంది.దాన్ని మార్చి మల్లిఖార్జున దేవాలయ ప్రాంతం, శ్రీశైలం ప్రాజెక్ట్, హటకేస్వరం, శిఖరేస్వరం, పాతాళగంగ, ఇలా దేనికి దానికే ఒక్కొక్క పేజీలుగా విడగొట్టి దాంట్లోనే దాని సమాచారం పొటోలు చేరిస్తే బావుంటుందనుకొనుచున్నాను.పరిశీలించగలరు.vissu 08:08, 11 ఆగష్టు 2007 (UTC)
శ్రీశైలక్షేత్రం అని ఉన్నదాన్ని ఇప్పడు శ్రీశైలం వ్యాసానికి మార్చాను..మండల సమాచారాన్ని శ్రీశైలం మండలముకి తరలించాను. పేజీలకు వీలైనంత వరకు సంక్షిప్త నామాలే ఇవ్వాలి శ్రీశైలదేవస్తానం మరియు పరిశర ప్రాంతాలు ను శోధించడం కంటే శ్రీశైలం అని శోధించటం సులభం కదా అందుకని.
క్షేత్రం పేజీ అంత పెద్దగా ఏమీలేదు..కాస్త సరిగ్గా అమరిస్తే బాగానే ఉంటుంది. హటకేశ్వరం, శిఖరం మరియు శ్రీశైలం ప్రాజెక్టు వ్యాసాలు ఈ పాటికే ఉన్నాయి. వాటికి సమాచారం చేర్చవచ్చు. ఇప్పుడే ఇంతకంటే వేర్వేరు వ్యాసాలు చెయ్యాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం --వైజాసత్య 08:33, 11 ఆగష్టు 2007 (UTC)

పులికాట్ సరస్సు మార్చు

మీరు ఆంధ్ర జ్యోతి పాత ఆదివారం సంచికలు (ఈ మీన్ అరౌండ్ 2004) సంవత్సరము లో మీకు కొంత సమాచారం దొరుకు తుంది ఆ సంచిక లలో మీకు ప్రళయ కావేరీ కథలు( రచయిత) సం. వె. రమేశ్. దొరుకుతుంది. ఆ కధల ద్వారా మీకు కొంత ముఖ్య సమాచారం పులికాట్ సార్షసు గురించి దొరక వచ్చును పులికాట్ సరస్సుపై ఏదైనా వ్యాసమున్నదా సెర్చ్ లో రావడంలేదు.చిత్తూరులో కనిపించలేదు.vissu 11:36, 6 ఆగష్టు 2007 (UTC)

తిరుమలలోని బేడీ ఆంజనేయస్వామివారి చిత్రం కొద్దిగా మార్పుచేసాను దానిని మళ్ళీ అప్ లోడ్ చేయవచ్చా?.అది శ్రీ చామర్తి శాస్త్రి గారి చిత్రం.vissu 08:47, 8 ఆగష్టు 2007 (UTC)
ఆ బొమ్మ పేజీలోనే కొత్త కూర్పును అప్లోడ్ చెయ్యండి అని ఉంటుంది చూడండి దాంట్లో బేషుగ్గా మళ్ళీ అప్లోడ్ చెయ్యొచ్చు. పాత కూర్పుకూడా పదిలంగానే ఉంటుంది --వైజాసత్య 08:50, 8 ఆగష్టు 2007 (UTC)
అప్ లోడ్ చేసాగాని దానిని వ్యాసంలో పెట్టడం నావలన కాలేదు.మీరు చేర్చగలిగితే చూసి నేర్చుకుంటాను.కృతజ్ఞతలు.vissu 09:23, 8 ఆగష్టు 2007 (UTC)
ఆ బొమ్మ ఈపాటికే వ్యాసంలో ఉంది కాబట్టి కొత్తకూర్పు అప్లోడ్ చేసిన తర్వాత చెయ్యాల్సిందేమీ లేదు. వ్యాసం కొత్త కూర్పునే ఆటోమేటిగ్గా తీసుకుంటుంది. కాస్త కాషేను రిఫ్రెష్ చేసి చూసుకోండి (Ctrl+F5 in IE) --వైజాసత్య 09:28, 8 ఆగష్టు 2007 (UTC)
మీరు మెరుగు పరచి అప్లోడ్ చేసిన బొమ్మ తానంట‍ అదే ఆవ్యాసం పేజిలోకి వెళ్ళి పోతుంది, ఎందువలన అంటె బొమ్మ పేరు మార్చలేదు కదా అందువలన, వ్యాసాన్ని గమనించండి, మీరు అప్లోడ్ చేసిన బొమ్మ అక్కడ ఉన్నది. వ్యాసానికి లింకు బేడి ఆంజనేయస్వామి దేవాలయము--మాటలబాబు 09:32, 8 ఆగష్టు 2007 (UTC)

భండారము +భాండారము మార్చు

మొదటి పేజీలో 'మీకుతెలుసా' శీర్షికలో భండారము నుండి. ఉంది భండారము అంటే రహస్యము అని కధ అర్దము.'భాం'డారము అనాలేమో.భాండారము అంటే నిలువచేయబడినది అనికద.

[1] భండారము/బండారము అంటే ట్రెజరీ అని ఈలింకులో ఉంది, భాండారము అనే పదము ఉందోలేదో తెలియదు (భాండాగారము అనే పదానికి కూడా ఇదే అర్ధం) --వైజాసత్య 06:37, 13 ఆగష్టు 2007 (UTC)

వీరతాడు మార్చు

వేరే ఏదైనా చెప్పండి. వీరతాడు బొమ్మ బాగుంది. కాని మరీ రింగుమాదిరికాక వడితిప్పిన తాడుమాదిరి అంటే పగ్గం లా మార్పులు సేయగలిగితే బహుబాగుగా యుండునని అస్మదీయులకు మనవి.vissu 04:12, 16 ఆగష్టు 2007 (UTC)

అవును దానికి తాడు టెక్స్చర్ ఉంటే చాలా బాగుంటుంది. ప్రయత్నిస్తా!! (ఎవరైనా గ్రాఫిక్స్ తెలిసినవాళ్ళు బాగాచేస్తారేమో) --వైజాసత్య 04:43, 16 ఆగష్టు 2007 (UTC)

నన్ను ప్రయత్నించమంటారా? ప్రయత్న పలితం {టెస్టింగ్} కోసం ఎక్కడకు{ఎవరికి} పంపను.vissu 04:53, 16 ఆగష్టు 2007 (UTC)

ఓ.. తప్పకుండా ప్రయత్నించండి. తెవికీ గూగుల్ గుంపుకు పంపండి. అక్కడైతే చాలామంది చూసే అవకాశముంది --వైజాసత్య 04:59, 16 ఆగష్టు 2007 (UTC)
తెవికి గూగుల్ గుంపుకి పంపమంటె తెలుగు బ్లాగు గూగుల్ గుంపుకి పంపుతున్నారే???మాటలబాబు 22:09, 16 ఆగష్టు 2007 (UTC)

ఈ వారం వ్యాసాల పంపిణీ మార్చు

పని వత్తిడి కారణంగా ఈ వారంతో కలుపుకుని ఇంకో మూడు వారాల పాటు నేను వికీపీడియా వైపు రాలేను, అందుకని నా బదులుగా ఇంకెవరయినా ఈ వారం వ్యాసాలను ఈ-మెయిలు ద్వారా పంపగలరు. ఈ-మెయిలును telugublog, teluguwiki, tewiki-maiku అనే మూడు గూగుల్ గుంపులకు పంపించాలి. వ్యాసాన్ని PDFగా ప్రచురించటానికి నేను primopdf అనే సాఫ్టువేరును వాడాను. అలాగే ప్రచురించేటప్పుడు "పరికరాల పెట్టె"లో ఉన్న "ముద్రణా వెర్షన్‌" అనే లింకును నొక్కండి. అలాగే వ్యాసాన్ని యధాతదంగా పంపించటానికి Thunderbird అనే ఈ-మెయిలు క్లైంటును వాడాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:40, 17 ఆగష్టు 2007 (UTC)

నేను పంపిస్తా. ముందుగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 10:47, 17 ఆగష్టు 2007 (UTC)
ఈ వారం వ్యాసం మీరు పంపుతున్నారు కదా ...--మాటలబాబు 21:15, 19 ఆగష్టు 2007 (UTC)
అవును --వైజాసత్య 21:16, 19 ఆగష్టు 2007 (UTC)
నాకు ఎలా పంపాలొ నేర్పించండి. పి.డి.ఎప్. గా ఎలా మార్చాలి?? చెప్పండి, భవిష్యత్తులొ అవసరమైతే పంపుతాను, నాకింకా వ్యాసం అందలేదు.--మాటలబాబు 23:34, 19 ఆగష్టు 2007 (UTC)
నేను దీన్నీ ఎలా చేయాలో చూసి తప్పకుండా నేర్పుతాను. నేనింకా పంపలేదు. ఒక గంటలో పంపిస్తాను --వైజాసత్య 23:43, 19 ఆగష్టు 2007 (UTC)
గంట దాటి పోయింది.నాకింకా వ్యాసం రాలేదు.--మాటలబాబు 02:51, 20 ఆగష్టు 2007 (UTC)
నేనిప్పటివరకూ ఎప్పుడూ ఈ-మెయిల్లో వెబ్ పేజీ పంపియుండలేదు. అందుకే కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు పంపాను చూడండి --వైజాసత్య 03:41, 20 ఆగష్టు 2007 (UTC)
చతుర్వేదాలు వ్యాసం లో కుడి వైపున శృతులు బదులు శ్రుతులు అనీ, తైత్తరీయ బదులు తైత్తిరీయ అనీ, సంహితము బదులు సంహిత అనీ, కధ బదులు కఠ అనీ, అరణ్యకము బదులు ఆరణ్యకము అనీ, గ్రంధాలు బదులు గ్రంథాలు అనీ ఉండాలి. సరి చెయ్యడం ఎలా? ----కంపశాస్త్రి 02:40, 21 ఆగష్టు 2007 (UTC)
ఆ ప్రక్కన ఉన్న విషయాలు హిందుధర్మశాస్త్రాలు అనే మూస లొ ఉన్నాయి. మూస లొపలికి వెళ్ళి అది సరిచేయాలి. వెతుకు పెట్టె లొ మూస:హిందుధర్మశాస్త్రాలు అని టైపు చేయాలి. అప్పుడు ఈ లింకు వస్తుంది. మూస:హిందూధర్మశాస్త్రాలు అక్కడ పట్టిక ఉంటుంది , దానిని సరి చేయాలి. చొరవ తీసుకొని సరిచేయండి, సహాయం కావలంటే అడగండి.--మాటలబాబు 02:46, 21 ఆగష్టు 2007 (UTC)
అక్కడ సరిచేయండి కాని శృతులు అనే పదానికి చాలా లింకులు ఉన్నట్లున్నాయి. కనుక ఆ పట్టిక సరిచేసిన తరువాత ఎర్రలింకులు వస్తాయి , దానికి మనం తర్లింపు ఏర్పాట్లు చేయాలి. మీరు ఆ పట్టిక సరిచేయండి తరువాత తరలింపులు చేద్దాం--మాటలబాబు 02:50, 21 ఆగష్టు 2007 (UTC)
శ్రుతులు అంటే వేదాలు, శృతులు అంటే సంగీతసంబంధమైనవి.----కంపశాస్త్రి 04:33, 21 ఆగష్టు 2007 (UTC)
ఇక్కడి చర్చ ని హిందు ధర్మ శాస్త్రాలు మూస కి మరియు ఆ పేజి చర్చా కి కూడా అంటిస్తున్నాను --మాటలబాబు 17:18, 21 ఆగష్టు 2007 (UTC)

పదాలు, ప్రత్యయాలు మార్చు

శాస్త్రిగారు, రాష్ట్రంలో లాంటి పదాలను రాష్ట్రం లో లాగా విడిగా రాయటం చూశాను? కలిపి రాయాలా, విడివిడిగా రాయాలా? ఏది సరైనది --వైజాసత్య 19:43, 21 ఆగష్టు 2007 (UTC)

రాష్ట్రములో అని వ్రాయాలి. కాదంటే ఎవరి యిష్టం వారిది. --కంపశాస్త్రి 05:00, 22 ఆగష్టు 2007 (UTC)
నేనూ అలానే అనుకున్నాను. కొన్ని సార్లు మీరు విడిగా రాయటం చూసి అనుమానం కలిగింది. సందేహ నివృత్తి చేసినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 06:12, 22 ఆగష్టు 2007 (UTC)

పెద్దలకు, నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా 'క్రుషి' అనే పదాన్ని సరిగ్గా వ్రాయలేకపోతున్నాను. దయ చేసి తెలుపగలరు...హైదరాబాద్.

kRshi అని టైపు చేస్తే కృషి వస్తుంది. మరింత టైపింగు సహాయానికి WP:TH చూడండి --వైజాసత్య 15:54, 20 సెప్టెంబర్ 2007 (UTC)

సోదర ప్రాజెక్టులు మార్చు

వ్యాసం కు సంబంధించిన విషయాలు సోదర ప్రాజెక్టుల లో ఉంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మూసలు ని అడ్డదారి లో పెట్టరా. వెతుకుకొనడం కష్టంగా ఉన్నది. అదేకాక ఆ మూసలకు నామకరణం కుడా ప్రామాణీకరణం చేయాలి ---మాటలబాబు 12:29, 22 ఆగష్టు 2007 (UTC)

ఇప్పటిదాకా అవి ప్రామాణికం చేయలేదు. తలా ఒక మూస ఇష్టమెచ్చినట్టు తెచ్చేశాం. అన్ని ఒక దగ్గర క్రోడీకరించి ఒక పేజీలో పెట్టే ప్రయత్నం చేస్తాను --వైజాసత్య 13:19, 22 ఆగష్టు 2007 (UTC)

కాళిదాసు - మేఘసందేశం మార్చు

కాళిదాసు రచన-మేఘసందేశం కావ్యాన్ని తెలుగు లిపి లోకి మార్చి తెవికి లోకి చేర్చాలని ఉంది. ఇది దేవనాగరి లిపి లో వికిసోర్సు లో ఉంది.లిపి మార్పుకు అనుమతి తీసుకొనాలా?----కంపశాస్త్రి 13:12, 22 ఆగష్టు 2007 (UTC)

అది వికీసోర్సులోనే ఉంది కాబట్టి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు --వైజాసత్య 13:17, 22 ఆగష్టు 2007 (UTC)
మేఘసందేశం ఈమాట లో ఉంది.యదేఛ్ఛగా వాడుకోవచ్చు. -- మేఘమాల 15:43, 22 ఆగష్టు 2007 (UTC)

ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు అనే పేజిలొ స్థలాలు పేర్లు చేరుస్తున్నప్పుడు ఒక శైలి పాటిమ్చితే బాగుంటుందని నా అభిప్రాయము. ఇక్కడ నేను వ్రాస్తున్న అభిప్రాయము ఎవరిని ఉద్దేశించి కాదు. నేను చేసిన మార్పులు గమనించండి. ఉదాహరణ కు పౌలతీశ్వరాలయం, పొలస, జగిత్యాల సమీపంలొ అని చేర్చారు అది సరిగా లేదని అభిప్రాయము. మరలా ఏదైనా ఒక చిన్న ఊరు ఉన్నదనుకోండి ఆ ఊరులొ ఒక మాదిరి ప్రసిద్ధ దేవాలయం ఉన్నదనుకోండి ప్రత్యేకంగా ఆ దేవాలయం కు ఒక పేజి తయారు చేయాల అని ప్రశ్న. దీనికి ఉదాహరణ ర్యాలి ఉన్నది ఆగ్రామము లొ జగన్మోహిని కేశవ స్వామి ఉన్నారు. జగన్మోహిని కేశవ స్వామి దేవాలయమ్ అనే లింకు తయారు చేయడం ఇప్పటికి సముచితం కాదు అని అభిప్రాయము. ర్యాలి గ్రామము పేజి లొ సమాచరాము చాల ఎక్కువై నప్పుడు ఆ పేజి నుంది వేరే పేజి ఏర్పాటు కి బావుంటుంది. ఆంజనేయ స్వామి గుడి,సింగరకొండ,ప్రకాశం జిల్లా తిరపతమ్మ తల్లి,పెనుగంచిప్రోలు,కృష్ణా జిల్లా పాండురంగ స్వామి గుడి(పెన్నా నది ఒడ్డున),నెల్లూరు చెన్నకేశవ స్వామి గుడి,మార్కాపురం,ప్రకాశం జిల్లా శైలి కి అనుగుణంగా లేవు.

నా ప్రతిపాదన ఏమిటంటే పేజి పై భాగ్మ్లొ ఒక హెచ్చరిక పెట్టి చర్చా పేజిలొ లింకు ఇచ్చే వ్యాసం పేరు ఏవిధంగా ఉండాలే శైలి నిర్ణయం జరగాలి

సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలుపగలరని ఆశిస్తున్నాను--మాటలబాబు 05:47, 29 ఆగష్టు 2007 (UTC)

నాకూ అదే సందేహం కలిగింది.ర్యాలీ అనే దానిని క్లిక్ చేస్తే పొటోలతో ఉన్న ర్యాలి రావాలి. కాని ఇక్కడ వేరే వ్యాసపు పేజీ ఉన్నది.ర్యాలీ అనే దానిని నేను ర్యాలి గా మార్చాను.విశ్వనాధ్. 05:59, 29 ఆగష్టు 2007 (UTC)

దీని గురించి చర్చా అవరమోలేదో నాకు తెలియదు కానీ ఒక స్థూల మార్గదర్శకమేమిటంటే నామకరణం చేసేటప్పుడు చదివేవారు ఎలా శోధిస్తారనేది దృష్టిలో పెట్టుకోవాలి. (ఉదా: పొలాసలోని పౌలతీశ్వరాలయం కోసం వెతుకుతున్న వ్యక్తి "పౌలతీశ్వరాలయం, పొలస, జగిత్యాల సమీపంలొ" అని వెతకాలని కలలో కూడా ఊహించడు..అందుకే ఈ వ్యాసానికి పౌలతీశ్వరాలయం లేదా పౌలతీశ్వరాలయం (పొలస) అని ఉంటే సరిపోతుంది. రెండవ పేరులో పదాల మధ్య ఖాళీ ఎందుకు ముఖ్యమంటే పొలస అని వెతికినా ఉట్టి పౌలతీశ్వరాలయం అని వెతికినా ఆ పేజీకి చేరే అవకాశముంటుంది. (ఇది క్లుప్తంగా నామకరణ తర్కం) --వైజాసత్య 06:03, 29 ఆగష్టు 2007 (UTC)

ఆంధ్రా పిండి వంటలు మార్చు

ఆంధ్రా పిండి వంటలు పేరుతో ఒక పేజీ మొదలు పెట్టాలనుకొన్నాను.అయితే హెడ్డింగ్ వేరే అయిపోయింది.పేజీ హెడ్డింగ్ మార్చడం ఎలా? పిండివంటల గురించి ఇప్పటికే వ్యాసాలున్నా అవి ఒక క్రమంగాలేవు వాటిని వర్గాలు, ఉపవర్గాలు వేరు చేసి పెట్టాలి పరిశీలించి చేయగలరు. విశ్వనాధ్. 10:15, 1 సెప్టెంబర్ 2007 (UTC)


వ్యాసం పైన ఉన్న "తరలించు" టాబ్ తీసుకొని క్రొత్త వ్యాసం పేరు ఆంధ్ర పిండి వంటలు అని వ్రాయండి. తరువాత పాత వ్యాసం (Gare)లో {{తొలగించు|(కారణం)}} అన్న మూసను ఉంచండి. నిర్వాహకులెవరైనా దాన్ని తొలగిస్తారు. ప్రస్తుతానికి నేను ఆ పని చేశాను. వర్గీకరణ తప్పకుండా అవసరం. పరిశీలించండి. తరువాత చర్చిద్దాము. --కాసుబాబు 11:35, 1 సెప్టెంబర్ 2007 (UTC)

రాయకల్లు,కరీంనగర్ మండలాలు మార్చు

కరీంనగర్ మండలాలలో రైకల్ అని వ్రాయబడి ఉన్నది. రైకల్ నుండి ఇది రాయికల్లు, లేదా రాయికల్ గా మార్చవలసిఉన్నది పరిశీలించగలరు.

ధనుష్కోడి మార్చు

ధనుష్కోడి-ధనుష్కోటి ఈ రెండిటిలో ఏది కరెక్ట్. ఇంతకు మునుపు ఈనాడులో దీనిపై ఒక వ్యాసం వచ్చింది దానిలో ధనుష్కోటి అని వాడారు. పరిశీలించగలరు.విశ్వనాధ్. 03:55, 5 సెప్టెంబర్ 2007 (UTC)

తమిళ వాళ్ళ వాడూకలొ ధనుష్కోడి అని ఉన్నట్లు ఉన్నది. తెలుగు లొ పలికేటప్పుడు ధనుష్కోటి అని నేను చిన్నప్పుడూ విన్నట్లు గుర్తు. తరిలింపు ఏర్పాటు చేయవచ్చు. శాస్త్రి గారు మరియు ఇతర సభ్యులు ఏమంటారో చూడాలి --మాటలబాబు 04:00, 5 సెప్టెంబర్ 2007 (UTC)
తెలుగువాళ్ళు ధనుష్కోటి అనడం నిజమే..తమిళులు ధనుష్కోడి అంటారు..నేను కోటినే తమిళంలో కోడి అంటున్నారేమో అని అనుకున్నాను. కానీ కోడి అంటే బాణపు అంచు అట కాబట్టి తెలుగువాళ్ళు దాన్ని సంస్కృతీకరించారేమో అని అనిపించింది. --వైజాసత్య 12:10, 5 సెప్టెంబర్ 2007 (UTC)
ధనుష్కోటి అంటే ధనుస్సు యొక్క కోటి (అగ్రభాగం లేదా చివరిభాగం). బాణపుఅంచు అని అర్థం లేదు. కోడి అనేది కోటి కి తమిళీకరణం (తమిళంలో ట ను డ గా పలుకుతారనుకుంటాను). కనుక ధనుష్కోడి అన్నా ధనుష్కోటి అన్నా ఒకటే. కాని, గ్రామం దక్షిణ దేశం లో ఉంది కనుక దాక్షిణాత్యుల పలుకుబడిని అనుసరించడం భావ్యమేమో.----కంపశాస్త్రి 13:16, 7 సెప్టెంబర్ 2007 (UTC)

సామెతలు మార్చు

అన్నిదానాలలోకి నిదానమే గొప్పదన్నాట్ట!!

ఈ పై సామెతను ఎప్పుడు విన్నట్లుగా లేదు. పైగా, అందులో ఒక నీతి కన్నా పొడుపు కథల తాలూకు హాస్యం కనిపిస్తోంది. నా ఆలోచన సరియేనా? తెలుపగలరు. Sreenyvas 13:38, 7 సెప్టెంబర్ 2007 (UTC)

మరొక మనవి. సామెతలు నాకు తెలిసినంతవరకు పూర్తి చేద్దామని తలపెట్టి కొన్ని పూర్తి చేశాను. ఏవైనా దిద్దుబాట్లు లాంటివి ఒకటో రెండో చూసి తెలిపితే, చేయబోయే వాటిలో జాగ్రత్త పడతాను. Sreenyvas 18:36, 7 సెప్టెంబర్ 2007 (UTC)

దానం కాని దానం నిదానం అని పొడుపు కథ-సమాధానం.----కంపశాస్త్రి 22:57, 7 సెప్టెంబర్ 2007 (UTC)
మీరు సామెతలకు తెలిసినవరకు రాద్దామన్న ప్రయత్నం అభినందనీయం. ఎలాగూ రాస్తున్నారు కాబట్టి ఆ రాసిన పేజీలో చివరన [[వర్గం:సామెతలు]] అని రాసి వర్గీకరించండి. --వైజాసత్య 23:28, 7 సెప్టెంబర్ 2007 (UTC)

క్షమించండి, నేను (Sreenyvas) నా క్రొత్త లాగిన్ "వికటకవి" గా మార్చుకున్నాను. ఇక పై ఇదే లాగిన్ తో కొనసాగుతాను. వికటకవి 22:36, 8 సెప్టెంబర్ 2007 (UTC)

సామెతలు ఒకటి పూర్తి చేసిన తరువాత, మళ్ళీ మరొకటి చెయ్యటానికి వెనక్కు వెళ్ళేందుకు రెండేసి క్లిక్కులు అవసరమవుతున్నాయి. తాత్కాలికంగానయినా, ఒక్క క్లిక్కుతో మళ్ళీ సామెతల లోకి వెళ్ళగలిగేలా ఓ లంకె ఎక్కడైనా పెట్టుకొనే మార్గముందా?వికటకవి 23:43, 20 సెప్టెంబర్ 2007 (UTC)
ప్రతీ సామెత పేజీలో {{తెలుగుభాషాసింగారం}} అని తగిలించండి. అది పేజీలో కుడివైపున లింకులు చేరుస్తుంది. అక్కడనుండి ఒక్క క్లిక్కుతో సామెతల పేజీకి వెళ్ళవచ్చు. (ఉదాహరణకి ఈ పేజీ చూడండి.) —వీవెన్ 08:23, 21 సెప్టెంబర్ 2007 (UTC)
బాగుందండీ. కృత్జ్ఞతలు వీవెన్. వికటకవి 11:36, 21 సెప్టెంబర్ 2007 (UTC)

చందమామ మార్చు

మనము అందరము చిన్నప్పుడు చందమామ అంటే ఎంతో ఇష్టపడే వారము. చందమామ అంటే పిల్లల పత్రికే ఎందుకయింది ? చంద్రుడి ని కూడా చందమామ అనే అంటాము కదా. ambiguation కాదా ఇక్కడ ? ప్రవీణ్ 18:15, 9 సెప్టెంబర్ 2007 (UTC)

బొమ్మ సరిగా అప్ లోడ్ కాలేదు మార్చు

నేను తయారుచేసిన " బొమ్మ:sankhyalu_1.svg " సరిగా అప్ లోడ్ కాలేదు. ఎందుచేత?----కంపశాస్త్రి 03:28, 14 సెప్టెంబర్ 2007 (UTC)

ఎస్వీజీ ఫైళ్ళలో తెలుగు చేర్చిఉంటే అవి సరిగా చూపించడం లేదు. ఈ లోపాన్ని సరిదిద్దమని అభ్యర్ధన చేశాము. అది సరిచేస్తే కానీ ఈ బొమ్మలలోని తెలుగు కనిపించదు --వైజాసత్య 03:31, 14 సెప్టెంబర్ 2007 (UTC)

నిర్ధారణ-ముక్తేశ్వరంగ్రామం. మార్చు

నాకొక చిన్న నిర్ధారణ కావాలి. ముక్తేశ్వరంగ్రామం గురించి తూగో జిల్లా గ్రామాల్లో వెధికితే దొరకలేదు.అది కోటిపల్లికి సమానంగా గోదారికి ఇవతలివైపుగా ఉంటుంది.అసలది ఏమండలంలోది. ఆమండలంలో ఉందా?లేదా?.....దయచేసి పరిశీలించగలరు.కృతజ్ఞతలు. విశ్వనాధ్. 07:06, 15 సెప్టెంబర్ 2007 (UTC)

Can anyone help me in transfering the International Classification of Disease from Engilsh to Telugu Wikipedia. This includes the diseases, symptoms and organ systems. It is very essential to begin the work on different diseases in Telugu. I will translate the words into Telugu languageRajasekhar1961 06:55, 16 సెప్టెంబర్ 2007 (UTC)

  • I.C.D. Codes లోని మొత్తం విభాగాలు అన్ని లింకులతో సహా తెవికీలోకి తీసుకొని రావాలి. అసలు కోడ్ నంబర్లు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నది మొదటిపేజీ మాత్రమె.Rajasekhar1961 11:43, 3 అక్టోబర్ 2007 (UTC)

వైకుంటపురం మార్చు

వైకుంటపురం అనే ఊరు గుంటూరు జిల్లాలో అమరావతిలో ఉన్నదా లేక తెనాలి మండలములో ఉన్నదా. చిన్న డిస్కషన్ వచ్చింది. అమరావతిలోని వైకుంట పురములొ వెంకటేశ్వరస్వామి దేవస్థానము లేదని మా స్నేహితుడు చెప్పాడు.దయచేసి పరిశీలించగలరు.విశ్వనాధ్. 15:19, 26 సెప్టెంబర్ 2007 (UTC) హరినారాయన రాజు