వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 92

పాత చర్చ 91 | పాత చర్చ 92 | పాత చర్చ 93

alt text=కేలండర్ రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2024-05-07 : 2024-07-18

మెటాలో గ్రాంట్ల కోసం అభ్యర్థించినపుడు

మార్చు

మెటాలో వివిధ గ్రాంట్ల కోసం అభ్యర్థించినవారు ఆ సంగతిని ఇక్కడ రచ్చబండలో తెలియపరచండి. ఇక్కడ చెప్పకపోతే ఆ గ్రాంటు కోరిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఎవరికీ తెలియకనే పోయే అవకాశం కూడా ఉంది. మీ అభ్యర్థనను ఎండార్సు చేసే అవకాశం అందరికీ కల్పించవలసినది. __చదువరి (చర్చరచనలు) 12:28, 7 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదే విషయం గురించి మన సభ్యుల అవగాహన కొరకు అంటే వికీమీడియా ఫౌండేషన్ నుంచి గ్రాంటులు పొందడం, ఇంకా ఫౌండేషన్ వారి సహకార కార్యక్రమాలలో (collaboration programs) పాల్గొనడం ఎలా? అనేది అంశం మీద పవన్ సంతోష్ (CIS/A2K) గారు తెవికీ బడి శిక్షణా కార్యక్రమంలో మొదట కొంతసేపు ప్రసంగిస్తారు.
తేదీ: 12.05.2024 ఆదివారం.సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి గూగుల్ మీట్ లో - లింక్
తరువాత శిక్షణాంశం: "వికీపీడియాలో అనువాద పరికరం ఉపయోగించి నాణ్యమైన వ్యాసాలు రాయడం ఎలా?" ప్రణయరాజ్ వంగరి గారితో కొనసాగుతుంది.
సభ్యులు ఈ లింకులో నమోదు చేయవలసినది. ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 12:25, 8 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari, @Vjsuseela గార్లకు ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:04, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు - స్పందన

మార్చు

సభ్యులకు నమస్కారం
తెవికీ సభ్యుల అభీష్టం మేరకు, తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూప్ తరపున తెవికీ బడి శిక్షణా కార్యక్రమాలు 6 వారాలుగా 2024 ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మాధ్యాహ్నం 2.00గం నుండి నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ తెవికీ బడి శిక్షణాంశాలు కూడా వివరంగా ఇవ్వడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమం మెరుగుపరిచే లక్ష్యంతో సభ్యుల నుండి వారి స్పందనను - శిక్షణాంశాలు గురించి, శిక్షణా కార్యక్రమం సమయం, ఏ ఇతర సంబంధిత విషయం గురించి కానీ కోరడమైనది. సభ్యులు తమ స్పందనను వికీపీడియా చర్చ:తెవికీ బడి పేజీలో తెలియచేసి సహకరించవలసినది.
ధన్యవాదాలు - తెవికీ బడి ''వి.జె.సుశీల'' (చర్చ) 17:59, 12 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:05, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాట్లు చేస్తూండగా కరెంటు పోతే చేసిన మార్పుల గతేంటి?

మార్చు

దిద్దుబాట్లు చేస్తూండగా బ్రౌజరు అకస్మాత్తుగా క్రాషయితే, అప్పటి వరకూ చేసిన మార్పుల సంగతేంటి? ఈ సందర్భంలో వాడుకరులకు సాయపడేందుకు వికీసాఫ్టువేరులో ఒక కొత్త అంశాన్ని తెచ్చారు. దిద్దుబాట్లు చేస్తూండగా బ్రౌజరు క్రాష్ అయితే అనే పేజీలో ఈ వివరాలు చూడవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 11:00, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరులకు ఎంతో అవసరమైన అంశాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:15, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు.చాలా ఉపయోగకరమైన అంశం. ధన్యవాదాలు --''వి.జె.సుశీల'' (చర్చ) 12:22, 13 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for April 2024

మార్చు
 

Dear Wikimedians,

We are pleased to present our monthly newsletter for April, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.

  • In the Limelight- Chandan Chiring
Monthly Recap
From the Team- Editorial
Comic

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 16:22, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

WMF’s Annual Plan Draft (2024-2025) and Session during the South Asia Open Community Call (SAOCC)

మార్చు

Hi Everyone,

This message is regarding the Wikimedia Foundation’s Draft Annual Plan for 2024-2025, and in continuation of Maryana’s email; inviting inputs from members of the movement. The entire annual plan is available in multiple languages and a shorter summary is available in close to 30 languages including many from South Asia; and open for your feedback.

We invite you all to a session on the Annual Plan during 19th May's [:m:South Asia Open Community Call|South Asia Open Community Call (SAOCC)]], in line with the collaborative approach adopted by the foundation for finalizing Annual Plans. The discussion will be hosted by members of the senior leadership of the Wikimedia Foundation.

Call Details (Please add the details to your respective calendars)

  • Google Meeting
    • Date/Time: 19th May 2024 @ 1230-1400 UTC or 1800-1930 IST

You can add any questions/comments on Etherpad [1]; pre-submissions welcomed.

Ps: To know more about the purpose of an Annual Plan, please read our listed FAQs. Look forward to seeing you on the call.

Best MediaWiki message delivery (చర్చ) 16:35, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Sign up for the language community meeting on May 31st, 16:00 UTC

మార్చు

Hello all,

The next language community meeting is scheduled in a few weeks - May 31st at 16:00 UTC. If you're interested, you can sign up on this wiki page.

This is a participant-driven meeting, where we share language-specific updates related to various projects, collectively discuss technical issues related to language wikis, and work together to find possible solutions. For example, in the last meeting, the topics included the machine translation service (MinT) and the languages and models it currently supports, localization efforts from the Kiwix team, and technical challenges with numerical sorting in files used on Bengali Wikisource.

Do you have any ideas for topics to share technical updates related to your project? Any problems that you would like to bring for discussion during the meeting? Do you need interpretation support from English to another language? Please reach out to me at ssethi(__AT__)wikimedia.org and add agenda items to the document here.

We look forward to your participation!

MediaWiki message delivery 21:22, 14 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Feedback invited on Procedure for Sibling Project Lifecycle

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
 

Dear community members,

The Community Affairs Committee (CAC) of the Wikimedia Foundation Board of Trustees invites you to give feedback on a draft Procedure for Sibling Project Lifecycle. This draft Procedure outlines proposed steps and requirements for opening and closing Wikimedia Sibling Projects, and aims to ensure any newly approved projects are set up for success. This is separate from the procedures for opening or closing language versions of projects, which is handled by the Language Committee or closing projects policy.

You can find the details on this page, as well as the ways to give your feedback from today until the end of the day on June 23, 2024, anywhere on Earth.

You can also share information about this with the interested project communities you work with or support, and you can also help us translate the procedure into more languages, so people can join the discussions in their own language.

On behalf of the CAC,

RamzyM (WMF) 02:26, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ వ్యాసాలు రాయాలి?

మార్చు

మూడేళ్ళ కిందటి వరకు కూడా తెవికీలో సగటున రోజుకు ఆరేడు కొత్త వ్యాసాలకు మించి వచ్చేవి కావు. ఇప్పుడు రోజుకు 30 కి పైగా వస్తున్నాయి. కొత్త వాడుకరులు ఉత్సాహంగా రాస్తూ ఉండడం, పాతవారు కూడా స్పీడు పెంచడం, వివిధ వికీప్రాజెక్టుల ద్వారా ఏకోన్ముఖమైన కృషి జరగడం వీటికి కారణాలు. లక్ష వ్యాసాల మైలురాయి చేరుకోడానికి 4,500 వ్యాసాల దూరం లోనే ఉన్నాం. ఇంకో నాలుగైదు నెలల్లో ఆ అంకె చూస్తాం కూడా. ఈ క్రమంలో, వ్యాసాల సంఖ్యలో మలయాళాన్ని వెనక్కి నెట్టాం. ఇంకో రెణ్ణెల్లలో మరాఠీని కూడా దాటతాం.

రోజుకో వ్యాసం, రోజుకు రెండు, 5, 10 వ్యాసాలు - రాస్తున్న వాడుకరులున్నారు మనకు. ఇంగ్లీషులో 68 లక్షల పైచిలుకు వ్యాసాలున్నాయి కాబట్టి, ఏ విషయమ్మీద వ్యాసం రాయాలి అనేది పెద్దగా ఆలోచించనక్కరలేదు. ఏదో ఒక ఇంగ్లీషు వ్యాసం తీసుకుని అనువదించవచ్చు. అయితే తెవికీకి దగ్గరగా ఉండేవి, భారతదేశానికి సంబంధించినవి, విషయ పరంగా ప్రాముఖ్యత కలిగినవీ అయిన వివిధ ఆవశ్యక వ్యాసాల జాబితాలు మనకు ఈసరికే ఉన్నాయి. వీటన్నిటినీ ఒకచోట చేర్చిన ఏ వ్యాసాలను సృష్టించాలి అనే ఒక వ్యాసం ఇదివరకే ఉంది. అందులో ఉన్న లింకుల ద్వారా, ఆవశ్యక పేజీల జాబితాలను చూడవచ్చు. పరిశీలించండి. అలాగే వికీపీడియా జాబితాలు అనే వర్గం కూడా చూడవచ్చు.

అలాగే, పై పేజీల్లో ఉన్న సమాచారంతో పాటు ఇప్పుడు మరొక జాబితా కూడా తయారుచేసాను. ఇదొక జాబితాల జాబితా. భారతదేశానికి సంబంధించిన వివిధ విషయాలపై ఎన్వికీలో ఉండి, తెవికీలో లేని వ్యాసాల జాబితాలు ఇవి. మొత్తం వ్యాసాలు 40 - 50 వేలు ఉండొచ్చు బహుశా. కింద చూపిన లింకులకు వెళ్ళి నచ్చిన పేజీని ఎంచుకుని వ్యాసం రాయవచ్చు. ఆ జాబితాల జాబితా ఇది:

  1. వివిధ వృత్తులకు చెందిన భారతీయులు మహిళలు, శాస్త్రవేత్తలు, పురస్కార గ్రహీతలు, మాస్ మీడియా వ్యక్తులు కాకుండా
  2. భారతీయ పురస్కార గ్రహీతలు -ఇందులో మహిళలు, శాస్త్రవేత్తలు, మాస్ మీడియా వ్యక్తులు ఉండరు
  3. భారత మాస్ మీడియా వ్యక్తులు - ఇందులో మహిళలు ఉండరు
  4. భారత మహిళలు
  5. భారతీయ శాస్త్రవేత్తలు ఇందులో మహిళలు ఉండరు
  6. భారత చరిత్ర వ్యాసాలు
  7. భారతదేశంలో విద్య
  8. భారత ఆర్థిక వ్యవస్థ
  9. భారత పర్యావరణం
  10. భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు, వ్యవస్థలు

__ చదువరి (చర్చరచనలు) 10:28, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:23, 24 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదయంత్రం మానవీయ అనువాదపరిమితి తగ్గించుటకు ప్రవేశపెట్టిన చర్చలో మీ స్పందనలు తెలుపగలరు

మార్చు

తెవికీ అనువాదయంత్రాన్ని ఎక్కువ మంది ఉపయోగించటాన దాని నాణ్యత చాలావరకు పెరిగింది. అనువాదంలో వాక్యనిర్మాణం గాని, ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు అర్థాలను సూచించటంలో గాని గణనీయంగా అభివృద్ది చెందింది. గత రెండు సంవత్సరాల క్రిందట అనువాదయంత్రం ద్వారా అనువదించటానికి, ఈరోజున అనువదించటానికి చాలా తారతమ్యం ఉంది. ఇప్పటి పరిస్థితులలో గతంలో కష్టపడవలసినంత అవసరం లేదు. అలా అని పూర్తిగా అనువాదయంత్రమే అనువదిస్తుందని కాదు, చాలా మెరుగుపండిందని దాని అర్థం. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% తగ్గించటానికి ప్రతిపాదనలు ఈ లింకులో ప్రవేశపెట్టబడినవి. . అనువాదయంత్రం ద్వారా వ్యాసాలు సృష్టించే వాడుకరులు ఆ చర్చలో రెండు, మూడు రోజులలోపు పై లింకులోకి వెళ్లి స్పందించగలరు.దానిమీద తరువాత తదుపరి చర్యలు గైకొనవలసిఉంది.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 14:29, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చేశానండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:15, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 21వ వార్షికోత్సవం - తెవికీ పండగ 2025

మార్చు

సభ్యులకు నమస్కారం,

తెవికీ 20వ పుట్టినరోజు నేపథ్యంలో 2024 జనవరిలో విశాఖపట్నంలో 'తెవికీ 20వ వార్షికోత్సవం (తెవికీ పండగ 2024)'ను ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ సందర్భంగా వికీపీడియన్ల కలయికతోపాటు గత ప్రగతిని, భవిష్యత్ వ్యూహాలనూ చర్చిస్తూ, నైపుణ్యాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. వేడుకలతోపాటుగా ప్రాజెక్టు గతం-ప్రస్తుతం-భవిష్యత్తు గురించిన ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుని, వాటిపై భవిష్యత్ వ్యూహాలను రూపొందించుకున్నాం.

వార్షికోత్సవం నిర్వహణ గురించి జరిగిన చర్చలలో, తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ఆధ్వర్యంలో తెవికీ 20వ వార్షికోత్సవం నిర్వహించుకోవాలని ప్రతిపాదనలు వచ్చినా... పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అప్పుడు సముదాయం విజ్ఞప్తి మేరకు సిఐఎస్-ఎ2కె వారు సహ-నిర్వాహకులుగా వ్యవహరించి, వార్షికోత్సవ కార్యక్రమ నిర్వాహణకు సహకరించారు. అయితే, తెవికీ పండగ అనేది ప్రతిఏటా నిర్వహించే కార్యక్రమం కాబట్టి, వచ్చే తెవికీ పండగతోపాటు మరిన్ని కార్యక్రమాలను తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించాలని గతంలోనే చర్చించుకోవడం జరిగింది.

దాంతోపాటు, ప్రతి ఏటా నిర్వహించబడుతోన్న 'హైదరాబాదు బుక్ ఫెయిర్' లో 2014 నుండి క్రమం తప్పకుండా 'తెవికీ స్టాల్'ను ఏర్పాటుచేసి, బుక్ ఫెయిర్ సందర్శకులకు తెవికీ గురించిన అవగాహన కలిగిస్తున్నాం. బుక్ ఫెయిర్ లో స్టాల్ నిర్వహణ కూడా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారానే నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.

అయితే, 'తెవికీ 21వ వార్షికోత్సవం - తెవికీ పండగ 2025', 'తెవికీ స్టాల్' నిర్వహణకు కావలసిన బడ్జెట్ కోసం వికీమీడియా ఫౌండేషన్ వారికి వీలైనంత త్వరగా అభ్యర్థన చేయాల్సివుంటుంది. గ్రాంట్ అభ్యర్థన నుండి తెవికీ పండుగ నిర్వహణ వరకు వివిధ దశలలో మనకు కావలసిన సహకారానికి సిఐఎస్-ఎ2కె వారికి కోరవచ్చు.

  1. 'తెవికీ పండగ 2025' ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేద్దాము?
  2. బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ లో పలు కార్యకలాపాల నిర్వహణ

అనే అంశాలపై తెలుగు వికీపీడియా రచ్చబండలో ఇప్పుడు చర్చకు పెడుతున్నాను. దయచేసి మీ అభిప్రాయాలను పంచుకోగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:35, 26 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు. ఈ రెండు ఘటనలూ తెవికీకి ముఖ్యమైనవి.
పుస్తక ప్రదర్శనలో స్టాలు పెట్టడం అనేక ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాం. అయితే ఏ విధమైన ధన సహాయం లేకుండా, కొద్దిపాటి వస్తు సహాయంతో ఇది చేస్తూ వస్తున్నాం. స్టాలు నిర్వాహకులపై ఎంతో బరువు పడుతూ వస్తోంది. ఇది ఏటా జరిగే కార్యక్రమం కాబట్టి, వ్యవస్థీకృతంగా చేస్తే నిర్వహణ మరింత సులువుగా ఉంటుంది. స్టాలుకు, నిర్వాహకులకూ కనీస మాత్రపు సౌకర్యాలు కల్పించడానికీ డబ్బు అవసరం. అంచేత గ్రాంటు కోసం ప్రయత్నించాలి.
అలాగే, తెవికీ పుట్టిన రోజు పండగ కూడా. గతంలో ప్రతి ఏడూ ఉత్సవాలు జరపక పోయినా, మొన్న జనవరిలో పెద్దయెత్తునే చేసాం. ఏ యేటి పుట్టినరోజు కూడా అలాగే జరుపుకుందాం. దీన్ని ఏటా కొనసాగించాలి కూడా. గత ఉత్సవాలకు సిఐఎస్ వారి ఆర్థిక, నిర్వహణా సహాయం తీసుకున్నాం. ఈసారి ఫౌండేషన్ను ఆర్థిక సాయం అడుగుదాం.
ఈ ఏడు ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. పుట్టినరోజు నాటికి తెవికీ లక్ష వ్యాసాలకు చేరబోతోంది. తెవికీ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయి. పై రెండు ఉత్సవాలకు దీన్ని థీమ్‌గా చేసుకుందాం.
ఈ ఉత్సవాలను యూజర్‌గ్రూపు నిర్వహించడం నాకు సమ్మతమే. __ చదువరి (చర్చరచనలు) 03:02, 27 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ముందుగా ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు. తెవికీ పండగ 2025', బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు కార్యక్రమాలు తెవికీకి ముఖ్యమైన కార్యక్రమాలు.ఈ ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను. అలాగే 'తెవికీ పండగ 2025' ఈ సారి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగుళూరులో నిర్వహించటానికి అలోచించవలసిందిగా సముదాయసభ్యులను కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:22, 27 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయాన్ని చర్చకు తెచ్చినందుకు Pranayraj1985 గారికి ధన్యవాదాలు.తెవికీ పండగ 2025, బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను.KINNERA ARAVIND (చర్చ) 04:31, 28 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఎక్కడ జరపాలనే విషయానికి వస్తే బెంగళూరు కన్నా తెలుగు రాష్ట్రాలలోనే జరుపుకుంటే బాగుంటుంది. కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని కానీ, కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆయా పట్టణాలలో నిర్వహించగలిగితే అక్కడి విద్యార్థులను, అధ్యాపకులను వికీపీడియావైపుకు ఆకర్షించవచ్చు. --స్వరలాసిక (చర్చ) 06:17, 28 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • 'తెవికీ పండగ 2025', బుక్ ఫెయిర్ లో తెవికీ స్టాల్ నిర్వహణ ఈ రెండు కార్యక్రమాలు తెవికీకి ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ ఉత్సవాలను యూజర్ గ్రూపు ద్వారా నిర్వహించటానికి, ఈ రెండు కార్యక్రమాలకు అవసరమయ్యే గ్రాంటును వికీమీడియా ఫౌండేషన్‌ను వారిని కోరుటకు నేను అంగీకరిస్తున్నాను.--Nagarani Bethi (చర్చ) 11:00, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 తెవికీ బడిలో నేను ప్రస్తావించినట్టుగానే ఈ గ్రాంట్లు రెండూ తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ నిర్వహించేట్టుగా ఎవరైనా ప్రతిపాదించాలని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా తెవికీలో గ్రాంట్లు తీసుకోవడం, వాటిని పారదర్శకంగా నిర్వహించడం, పబ్లిక్ గా వివరాలన్నీ ప్రచురించడం వంటి పనులు చేయడం ఎక్కువమందికి రావాలని కూడా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 12:03, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • 'తెవికీ పండగ 2025' బెంగళూరులో నిర్వహించాలి ఎర్ర రామారావు గారి సూచన బాగుంది అనిపిస్తుంది, 2024 జనవరిలో నిర్వహించిన వైజాగ్ నందు సౌకర్యాలు పవన్ సంతోష్ గారు చాలా బాగా డిజైన్ చేసి నిర్వహణ పూర్తిగా సంతోషంగా గడిచింది, వారికి అభినందనలు. ఈసారి యూజర్ గ్రూప్ ద్వారా నిర్వహించాలంటే దానికి కూడా సమ్మతమే, ఈ కార్యక్రమానికి, పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి, విక్కీమీడియా ఫౌండేషన్ ను గ్రాంటును కోరడానికి నేను అంగీకరిస్తున్నాను. ప్రభాకర్ గౌడ్చర్చ 15:51, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రణయ్ రాజ్ గారి పతిపాదనకునకు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రణయ్ రాజ్ గారి ప్రణాళిక బాగుంది. స్వరలాసిక గారి ఆలొచన కూడా బాగుంది. నా అభిప్రాయం ప్రకారం మన తెలుగు రాష్త్రాలలొ ఏదైన యూనివర్సిటీ లొ ఏర్పాటుచేస్తే బాగుంటుంది.
A.Murali (చర్చ) 16:04, 30 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విశ్వవిద్యాలయాలలో నిర్వహించే కార్యక్రమాలు మన వికితో బాగా కలిసిపోయేలా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ కార్యక్రమాలకు వికిపీడియన్లు భాగస్వామ్యులుగా ఉంటేనే అవి సఫలంగా జరుగుతాయి. లేకపోతే, ఈ రెండు రోజుల కార్యక్రమాల నిర్వహణలో అనేక లాజిస్టిక్ వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కావాలంటే అయా యునివర్సిటీలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టవచ్చు, 'తెవికీ పండగ 2025' బెంగళూరులో నో చెన్నై లోనో నిర్వహింస్తే బాగుంటుంది. ఎప్పటిలాగనే తెవికీ స్టాల్ నిర్వహణ కు నా పూర్తి తోర్పాటు ఉంటుంది Kasyap (చర్చ) 13:33, 31 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    @Kasyap గారూ, చాలా మంచి పాయింటు చెప్పారు. విశ్వవిద్యాలయాల్లాంటి పెద్ద సంస్థలతో వ్యవహరించేప్పుడు అవి మనకు సౌకర్యవంతంగా వ్యవహరిస్తాయని ఊహించుకోవడం దెబ్బతినేలా చేస్తుంది. పవన్ సంతోష్ (చర్చ) 11:51, 2 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

...

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెవికీ

మార్చు

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాలు పెట్టేందుకు, అందుకోసం గ్రాంటు పొందేందుకూ పైన వచ్చిన ప్రతిపాదన చూసే ఉంటారు. ఆ ప్రదర్శన రోజుల్లో మనం ఏమేం చెయ్యాలనేది కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుందని భావించి ఇది రాస్తున్నాను. ఈసారి ప్రదర్శనలో కింది పనులు చెయ్యాలని నేను భావిస్తున్నాను

  1. ఈసారి "లక్ష వ్యాసాల తెవికీ"ని ముఖ్యమైన థీముగా పెట్టుకుందాం. బ్యూనర్లు, పోస్టర్లు, కరపత్రాలు వగైరాల్లో దీన్ని హైలైటు చేద్దాం
  2. స్టాలు నిర్వహణ కోసం రోజూ కనీసం ముగ్గురు ఉండేలా చూసుకుందాం. ఈ నిర్వాహకులు రానుపోను, భోజనాలకీ ఏర్పాట్లు చేద్దాం
  3. బ్యానర్లు, పోస్టర్లు, ఫొటోలు, కరపత్రాలు మామూలే
  4. ఎప్పటి లాగానే సందర్శకుల డేటాను తీసుకుందాం. వారికి తెవికీని పరిచయం చేద్దాం
  5. తెవికీ గురించి ఇప్పటికే తెలిసిన సందర్శకుల డేటాను కూడా తీసుకుందాం. వారి చేత ఖాతాను సృష్టింప జేద్దాం
  6. ఖతా సృష్టించుకున్నవారికి గురువుగా ఉంటూ చెయ్యి పట్టి కొన్నాళ్ళ పాటు నడిపించేందుకు ముందుకు వచ్చే కొందరు అనుభవజ్ఞులైన వాడుకరుల జాబితా తయారు చేసుకుందాం
  7. ఈ సారి ప్రదర్శనలో ఒకరోజున తెవికీ లక్ష వ్యాసాల ఉత్సవం చేద్దాం. దానికి ఎవరైనా ప్రముఖ వ్యక్తిని ఆహ్వానిద్దాం.
  8. పైన సూచించిన గ్రాంటు ప్రతిపాదనలో ఈ ఖర్చులన్నిటినీ చేరుద్దాం.

ఈ ప్రతిపాదనలపై మీ అభిప్రాయాలు సూచనలూ చెప్పవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:04, 28 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ, పైన మీరు ప్రస్తావించినవన్నీ బాగున్నాయి. సందర్శకులను వికీ స్టాల్ దగ్గర ఎంగేజ్ చేయడానికి కొన్ని చిన్నిచిన్న ఆక్టీవిటీస్ చేయాలి.
  1. ఖాతాను సృష్టించుకున్నవారికి వికీ పెన్నులు/కీ చైన్లు/బ్యాడ్జీలు/ఇతరాలు ఇవ్వడం
  2. 5 తెలుగు పదాలు రాసిన చిన్నారులకు చిన్నచిన్న బహుమతులు ఇవ్వడం
వంటివి చేయవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:28, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, @Pranayraj1985 గారూ చేసిన ప్రతిపాదనలు లేదా సూచనలు బాగున్నవి.ఇలాంటి కార్యక్రమాలు తెలుగు వికీపీడియాకు మరింతమంది దగ్గరవటానికి ఇదొక మెట్టు. అలాగే అవకాశం ఉన్న వాడుకరులు మరింత మంది స్టాల్ లో సర్వీసు చేస్తే కార్యక్రమం ఇంకా మంచి ఫలితాలు ఇవ్వగలదని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:44, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గత నాలుగేళ్ళలో తెలుగు వికీపీడియా ప్రగతిని రెండు గణాంకాల రూపంలో పరిశీలిస్తే రెండు విషయాలు తెలుస్తున్నై.. కొత్త వ్యాసాల సంఖ్య పెరుగుదలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. అదే సమయంలో కొత్త వాడుకరుల సంఖ్యలో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయింది. కింది పట్టికలో వివరాలు చూడవచ్చు. దీన్నిబట్టి మనం తెవికీ లోకి కొత్త వాడుకరులను తీసుకురవాల్సిన అవసరం ఉంది. అందుకు గాను పుస్తకప్రదర్శన మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను.
అంశం కొత్త వ్యాసాల సంఖ్య

(శాతం)

కొత్త వాడుకరుల సంఖ్య

(శాతం)

2013-2016 కాలంలో 13880 8220
2017-2020 కాలంలో

(గత కాలంతో పోలిస్తే శాతం)

8784 (63%) 10445 (127%)
2021-2024 ఇప్పటివరకు

(గత కాలంతో పోలిస్తే శాతం)

26956 (307%) 5128 (49%)

__చదువరి (చర్చరచనలు) 04:54, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ, గత ఆదివారం జరిగిన తెవికీ బడిలో పుస్తక ప్రదర్శనలో మన స్టాల్ విషయమై గ్రాంటు అడగాలని, ఇంతకుముందు మనం వనరులు లేకపోవడం వల్ల ఈ స్టాల్ ద్వారా చేయలేకపోయిన పనులన్నిటినీ ఇప్పుడు చేయగలగాలని నేను అన్నందున ఈ కారణాల మీదనే ఇప్పుడు ఈ ప్రస్తావనని పూర్తిగా సమర్థిస్తున్నాను.
వీటితో పాటుగా, మనలో ఫోటోగ్రాఫర్లు అయినవారు వంతులువారీగా ఉంటూ స్టాల్ ని సందర్శించినవారి ఫోటోలు తీసేలా ఏర్పాటుచేస్తే బావుంటుందని భావిస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 12:02, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, పైన పలు సూచనలు చెప్పినవి చాలా బాగున్నాయి, తెవికీలో ఈ మధ్య చర్చలు సూచనలు అభిప్రాయాలు చాలా బాగా జరుగుతున్నాయి. పుస్తక ప్రదర్శనలో చాలా సంవత్సరాల నుండి కశ్యప్ గారు, ప్రణయ్ రాజుగారు మాత్రమే స్టాల్ లో ఎక్కువ సమయం ఉంటున్నారు వారికి తోడుగా ఇప్పటి నుండి అయినా అందుబాటులో ఉన్నవారు తప్పకుండా పాల్గొనే విధంగా చేసే విధంగా పై సూచనలు అందరివి బాగున్నాయి. అభినందనలు ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 15:32, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా స్టాలు నిర్వహణలో చేయవలసిన కార్యకలాపాల గురించి Chaduvari గారు చేసిన సూచనలు బాగున్నాయి. అదేవిధంగా వికీలో మహిళా వాడుకరుల సంఖ్యను పెంచేదిశగా, మహిళలను వికీ రచనలో భాగం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకోసం స్టాల్ లో ప్రతిరోజూ ఒక మహిళా వాడుకరి కూడా ఉండేలా చూడాలి.--Nagarani Bethi (చర్చ) 03:29, 30 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
స్టాలు నిర్వహణ గురించి పైన ఇచ్చిన సూచనలు బాగున్నాయి. అలాగే సామజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న వాడుకరులు స్టాలు గురించి, ఏ రోజుకారోజు స్టాల్లో జరగబోయే కార్యక్రమాల గురించి వారి వారి అకౌంట్లలో తెలియజేస్తే దీని గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది.
అలాగే 'ఎందరో వికీమీడియన్లు' పుస్తకం కొత్త వాడుకరులకు వికీపీడియాలో చేయదగ్గ పనులు ఏమిటి అనే అవగాహన కల్పించడంతో పాటు, ఇప్పటి దాకా జరిగిన కృషి గురించి చెప్పి స్ఫూర్తినిస్తుంది. దీన్ని స్టాల్లో అందుబాటులో ఉంచి, ఆన్‌లైన్‌లో ఎక్కడ చదవచ్చో చెప్తే బాగుంటుంది. కిమీర (చర్చ) 09:52, 4 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో చిత్ర ప్రదర్శన, ఫోటోవాక్

మార్చు

అందరికీ నమస్కారం! ఈ నెల 3, 10వ తేదీలలో నేనూ, @పవన్ గారూ 24 Hour Project అనే సంస్థతో మాట్లాడాం. ఈ జులై 6-14 తేదీల మధ్య వారు హైదరాబాదులో ఒక అంతర్జాతీయ చిత్ర ప్రదర్శన పెడుతున్నారు. దీనికి మన నగరంలోని వారే కాకుండా, వివిధ రాష్ట్రాలు, పలు దేశాలు నుంచి వేళాది మంది ఫోటోగ్రాఫర్లు హాజరవుతున్నారు. జులై 7 (ఆదివారం) మనం వారితో కలిసి ఒక ఫోటోవాక్ చేయుంచడమే కాక, ఒకటి-రెండు రోజులు మనం వికీమీడియా కామన్స్ గురించి, ఆసక్తి ఉన్నవారికి వికీపీడియా గురించి కూడా తెలియజేయవచ్చు. భధ్రాచలంలో మనం చేసిన కార్యక్రమంలోని ఒక సభ్యుడే ఈ ప్రదర్శనను హైదరాబాదు అంబాసెడరుగా వ్యవహరిస్తున్నారు. వివిధ కళాశాలలకు చెందిన పిల్లలు కూడా రావడంతో హైదరాబాదులోని యువతకు వికీమీడియా ప్రాజెక్టులను చాలా సులువుగా పరిచయం చేయవచ్చని నేను భావిస్తున్నాను. మనం చేయవలసిన పనులు:

  1. జులై 7 (ఆదివారం) ఫోటోవాక్ కార్యక్రమం
  2. ఒకటి లేదా రెండు రోజులు Wiki-Workshops
  3. వికీ T-Shirts and Stickers
  4. Banners / Posters for Marketing

వారి వెబ్-సైటు లింకులు: 24HourProject , India Exhibition 2024

దీనికీ మీ సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయండి, మన కార్యక్రమ ప్రణాళిక కుడా తయారుచేయాల్సి ఉంది. -- IM3847 (చర్చ) 16:26, 30 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమం @IM3847 గారు, ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. నా నుండి ఎటువంటి సహకారం కావాలన్నా అడగవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Announcing the first Universal Code of Conduct Coordinating Committee

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello,

The scrutineers have finished reviewing the vote results. We are following up with the results of the first Universal Code of Conduct Coordinating Committee (U4C) election.

We are pleased to announce the following individuals as regional members of the U4C, who will fulfill a two-year term:

  • North America (USA and Canada)
  • Northern and Western Europe
  • Latin America and Caribbean
  • Central and East Europe (CEE)
  • Sub-Saharan Africa
  • Middle East and North Africa
  • East, South East Asia and Pacific (ESEAP)
  • South Asia

The following individuals are elected to be community-at-large members of the U4C, fulfilling a one-year term:

Thank you again to everyone who participated in this process and much appreciation to the candidates for your leadership and dedication to the Wikimedia movement and community.

Over the next few weeks, the U4C will begin meeting and planning the 2024-25 year in supporting the implementation and review of the UCoC and Enforcement Guidelines. Follow their work on Meta-wiki.

On behalf of the UCoC project team,

RamzyM (WMF) 08:15, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hello RamzyM (WMF),

Thanks for sharing the result for UCoC Elections. నేతి సాయి కిరణ్ (చర్చ) 13:22, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

2024 లో తెవికీ ప్రగతి - ఒక పరిశీలన

మార్చు

2024 లో తెవికీ ప్రస్థానంపై ఒక స్థూల పరిశీలనను వికీపీడియా:2024 లో తెవికీ ప్రగతి - మధ్యంతర పరిశీలన పేజీలో చూడవచ్చు, దానిపై మీ అభిప్రాయాలు సూచనలూ రాయండి. __ చదువరి (చర్చరచనలు) 10:14, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:52, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా కరదీపిక

మార్చు

తెవికీ గురించి అసలు తెలియని వారికి పరిచయం చేసే ఉద్దేశంతో ఒక పుస్తకం ఉంటే బాగుంటుంది. దాన్ని ఔట్‌రీచ్ కార్యక్రమాల్లో వాడుకోవచ్చు. అలాంటి పుస్తకాన్ని రూపొందించే ఉద్దేశంతో ఒక చర్చను వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక వద్ద మొదలుపెట్టాను. పరిశీలించి సూచనలు చెయ్యవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:09, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:52, 3 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ [[2]] ఒకటి మునుపు చేసాము. వీలైతె వాడుకోవచ్చు.--B.K.Viswanadh (చర్చ) 07:21, 6 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Fair use and living people

మార్చు

Hi! It seems that te.wiki have/upload many photos as fair use of living people. According to wmf:Resolution:Licensing_policy#Resolution #3 "Such EDPs must be minimal. ... An EDP may not allow material where we can reasonably expect someone to upload a freely licensed file for the same purpose, such as is the case for almost all portraits of living notable individuals. ..."

So I think you should check వికీపీడియా:Non-free_content_criteria and perhaps make it more clear. And of course also delete photos that does not meet the requirements. --MGA73 (చర్చ) 19:40, 5 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@MGA73, thank you for the information.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:33, 7 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 2024-25 - గ్రాంట్ దరఖాస్తుకు మద్దతు

మార్చు

సభ్యులకు నమస్కారం

ప్రతి సంవత్సరం మన తెలుగు వికీపీడియా సభ్యులు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు స్వచ్చందంగా నిర్వహిస్తున్న విషయం అందరకు తెలిసినదే. మనలో చాలామంది ఈ స్టాలును సందర్శించుతుంటారు. ఈ విధమైన అవుట్ రీచ్ కార్యక్రమాల వలన తెలుగు వికీపీడియాకు విస్తృత ప్రచారం, అవగాహన, కొత్త సభ్యులు ఏర్పడుతుంటారు. ఇదే లక్ష్యంతో తెలుగు వికీపీడియా స్టాలుకు మరింత హంగులు చేకూర్చడానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున వికీమీడియా ఫౌండేషన్ వారినుంచి గ్రాంట్ కు దరఖాస్తు చేశాను (గ్రూప్ నుంచి చేయడానికి సాంకేతికకారణాల పరిమితి వలన వీలుపడలేదు).

కాబట్టి ఈ గ్రాంట్ దరఖాస్తును పరిశీలించి చర్చాపేజీ (Discussion Page)లో తమ మద్దతును ప్రకటించవలసినదిగా సభ్యులందరినీ కోరుతున్నాము

ఈ ప్రక్రియలో సహకరించిన చదువరిగారికి,పవన్ సంతోష్ గారికి, ప్రణయరాజ్ వంగరి గారికి, CIS A2K సిబ్బందికి ధన్యవాదాలు. ''వి.జె.సుశీల'' (చర్చ) 07:44, 6 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Vjsuseela గారు. గ్రాంట్ దరఖాస్తును చర్చాపేజీలో నా మద్దతును తెలిపాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:32, 7 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారు, నా మద్దతును తెలిపానండి. Nagarani Bethi (చర్చ) 03:12, 8 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Apply for Wikimedia Technology Summit (WTS) 2024 scholarships

మార్చు
Wikimedia Technology Summit (WTS) 2024 is focused on using technology to enhance inclusivity across Wikipedia and its associated projects. We aim to explore strategies for engaging underrepresented communities and languages while also strengthening the technical foundation. By fostering collaboration between developers, users, and researchers, we can unite our efforts to create, innovate, and advance the technology that drives open knowledge.

We invite community members residing in India who are interested in attending WTS 2024 in person to apply for scholarships by July 10, 2024. The summit will be held at IIIT Hyderabad, India, in October 2024. To apply, please fill out the application form by clicking this link].
On behalf of the WTS 2024 Scholarship Committee : Kasyap (చర్చ) 07:33, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

The final text of the Wikimedia Movement Charter is now on Meta

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hi everyone,

The final text of the Wikimedia Movement Charter is now up on Meta in more than 20 languages for your reading.

What is the Wikimedia Movement Charter?

The Wikimedia Movement Charter is a proposed document to define roles and responsibilities for all the members and entities of the Wikimedia movement, including the creation of a new body – the Global Council – for movement governance.

Join the Wikimedia Movement Charter “Launch Party”

Join the “Launch Party” on June 20, 2024 at 14.00-15.00 UTC (your local time). During this call, we will celebrate the release of the final Charter and present the content of the Charter. Join and learn about the Charter before casting your vote.

Movement Charter ratification vote

Voting will commence on SecurePoll on June 25, 2024 at 00:01 UTC and will conclude on July 9, 2024 at 23:59 UTC. You can read more about the voting process, eligibility criteria, and other details on Meta.

If you have any questions, please leave a comment on the Meta talk page or email the MCDC at mcdc@wikimedia.org.

On behalf of the MCDC,

RamzyM (WMF) 08:45, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామ వ్యాసాలలో సమాచారపెట్టెను వికీడేటా ఆధారితంగా మార్చటం

మార్చు
గొత్తివాడ రెవెన్యూ గ్రామ వ్యాస సమాచారపెట్టె ఉదాహరణ
 
ప్రస్తుత పాఠ్య ఆధారిత సమాచారపెట్టె
 
ప్రతిపాదిత వికీడేటా ఆధారిత సమాచారపెట్టె

2019 మే లో, పాత ప్రకాశం జిల్లాలో ప్రయోగాత్మకంగా వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలు ప్రవేశ పెట్టటం జరిగింది. అప్పట్లో వికీడేటాలో చాలా దోషాలు వున్నందున, సహసభ్యుల ఆసక్తి, నైపుణ్యాలు తగిన ప్రమాణంలో లేనందున ఆ ప్రయోగం ఇతర రెవెన్యూ గ్రామాలకు విస్తరింపబడలేదు. ఇటీవలి రెండు, మూడు నెలల కాలంలో వికీడేటాలో అంగ్ల, తెలుగు భాషా వికీపీడియన్లు, వికీడేటా సభ్యులు, ఓపెన్ స్ట్రీట్ మేప్ సభ్యులు విశేష కృషి చేయడం ద్వారా గ్రామానికి సంబంధించిన ప్రధాన దత్తాంశాలను శుద్ధి చేయడం జరిగింది. గ్రామ అక్షాంశరేఖాంశాలు, పరిపాలన వ్యవస్థ, జనాభా గణాంకాలు, విస్తీర్ణం, పిన్ కోడ్ వివరాలు అధికారిక డేటాబేస్ లను తనిఖీ చేసి సరిచేయటం, అవసరమైన చోట్ల అధికారిక డేటాబేస్ లనుండి సంగ్రహించి చేర్చటం, వాటి నాణ్యతను ఇతర డేటాబేస్ల తో తనిఖీ చేసి అవసరమైన సవరణలు చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా పేర్కొనదగినవి: రెవెన్యూ గ్రామ పేరుతోనే ఆవాసాలున్న దాదాపు 10000 గ్రామాలకు వికీడేటా అక్షాంశరేఖాంశాలు, ఓపెన్ స్ట్రీట్ మేప్ లోని గ్రామ స్థానాలతో పోల్చి ఎక్కువ నాణ్యత గల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన సంస్ధ సేకరించిన అక్షాంశ రేఖాంశాలకు 2 కి.మీలకు లోపలగా వుండేలా తనిఖీ, సవరణలు, 6000 పైబడి తాజా లేక సరియైన పిన్ కోడ్లు చేర్చడం, విస్తీర్ణం,జనాభా, ఆవాసాల సంఖ్యలలో దోషాలు పరిష్కరించడం వంటివున్నాయి. అందువలన ప్రస్తుత రెవెన్యూ గ్రామపేజీలలోని సమాచారపెట్టెలను వికీడేటా అధారిత సమాచారపెట్టెకు మార్పు తలపెట్టాను. దీనితో పాటు, వ్యాసాలలో పిన్ కోడ్, తనిఖీ చేయబడని అక్షాంశరేఖాంశాల తొలగింపు కూడా చేయదలచాను. అందువలన ఈ వివరాల గురించి సందిగ్ధతకు అవకాశం వుండదు. ఈ మార్పు ముందు ముందు గ్రామ పేజీల నిర్వహణకు సౌలభ్యంగా వుంటుంది. ఉదాహరణ సమాచారపెట్టె (గతిశీల పటంతో) మార్పు చూడండి. మీకు ఆసక్తి వున్న గ్రామపేజీలో {{Infobox India AP Village}} అనే మూస చేర్చి మునుజూపులో కొత్త సమాచారపెట్టె కనబడుతున్న విధము,అలాగే సంబంధిత వికీడేటాలో ఏమైనా దోషాలుంటే, లేక ఈ ప్రతిపాదిత మార్పుపై సందేహాలు, అభ్యంతరాలు ఒక వారంలోగా (18 జూన్ 2024) లోగా తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 11:02, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Arjunaraoc గారూ ఈ చర్చలో మీరు సూచించిన సమాచారపెట్టెపై అభిప్రాయాలు లేదా స్పందనలు తెలియచేయటానికి ప్రస్తుతం ఎన్నికలు వ్యాసాలు తాజాసవరింపులు, కాలానుగుణంగా సృష్టించవలసిన వ్యాసాలు పనిలో బిజీగా ఉన్నందున నాకు సమయం పట్టింది.నేను మీ దృష్టికి తీసుకురావలసిన స్పందనలు,లేదా అభిప్రాయాలు ఉన్నవి.అందువలన నాకు ఒకవారం రోజులు సమయం పట్టింది గమనించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 11:27, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీకు ఎంత సమయం అవసరమో తెలపండి. అభిప్రాయాలు తెలపడానికి పెద్ద సమయం పట్టదు కావున, అన్నీ ఒకసారి తెలిపేబదులు, ప్రస్తుతం మీరు అడగదలచుకున్న వాటిలో కొన్ని తెలపండి. అర్జున (చర్చ) 03:42, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ అంత పెద్దగా వీక్షణలు ఉండని, నాకిష్టమైన గ్రామ వ్యాసాల పేజీలలో భారీ ఎత్తున మంచి కార్యక్రమం తలపెట్టినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు చెపుతున్నాను.అయితే మీరు ఈ చర్చలో ఉదాహరణగా సూచించిన వికీడేటా ఆధారిత సమాచారపెట్టె పరిశీలించగా దానిపై నాకు కొన్ని సందేహాలు ఉన్నవి.
సందేహాలు
  • అసలు గ్రామ వ్యాసాలలో ఎన్ని మ్యాపులు ఉండవచ్చు. మీరు సూచించే వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలో రెండు పటాలు ఉన్నవి. అంతకు ముందు కొన్ని రెవెన్యూ గ్రామాలలో Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point అనేది ఒకటి చేర్చారు. వికీడేటా ఆధారిత సమాచారపెట్టె పెట్టిన తరువాత పైదానిని తొలగించవచ్చా లేక అది కూడా ఉండాలనా అనేది వివరించగలరు.
  • వికీడేటా ఆధారిత సమాచారపెట్టెలో కాలానుగుణంగా అదనంగా ఏదైనా తాజా సమాచారం చేర్చవలసి వస్తే. ఈ పని అందరూ చేసేదికాదు.ఏదైనా వికీపీడియాలో అందరూ సవరించే అవకాశం ఉండాలిగాని, ఇది అర్జనరావుగారు లేదా మరెవరో మాత్రమే చేయగలుగుతారు అనేది ఉండకూడదు. నా ఉద్దేశ్యం అది సులభతరంగా ఉండాలిగానీ, దానిని బంధించకూడదు అని అర్థం.దీని ఎలా అధిగమిస్తాం.
  • ఏప్పుడైనా మూలంలో లేదా మరొక దానిలో సాంకేతిక సమస్య లేదా ఎర్రర్ వచ్చినప్పుడు, ఎవరిని సంప్రదించాలి. ఇంతకముందు మండల వ్యాసాలలో వచ్చింది చాలాకాలం అలానే ఉంది. తరువాత మీరు మాత్రమే సరిచేసారు. కాబట్టి దీనిని ఎలా అధిగమిస్తాం,
  • వికీడేటా ఆధారిత సమాచారపెట్టె వ్యాసంలో ఎక్కువ వెడల్పుతో స్థలం ఆక్రమించి ఎబ్బెట్టుగా ఉంటే వ్యాస నాణ్యత దెబ్బతింటానికి అవకాశం ఉంది. వికీడేటా అక్షాంశరేఖాంశాలు, ఓపెన్ స్ట్రీట్ మేప్ జూమ్ చేయకపోతే ఆ రెవెన్యూ గ్రామం కనపడకుండా ఉండటానికి అవకాశం ఉందా అనేది నా సందేహం.
ఇక సమాచారపెట్టెలో చేర్చవలసిన ప్రతిపాదనలు
  • ప్రాధమిక సమాచారం
జిల్లా:అనకాపల్లి అని ఉంటే చాలు అనకాపల్లి జిల్లా అని రానక్కరలేదు
మండలం:కోట ఉరుట్ల అని ఉంటే చాలు. మండలం అని రానక్కరలేదు
గ్రామ విస్తీర్ణం: 3.22 చ.కి (1.24 చ.మై) అని ఉంటే బాగుంటుంది.విస్తీర్ణం కింద మరలా మొత్తం అని అవసరంలేదని నా అభిప్రాయం
గ్రామ పంచాయితీ:కోట ఉరుట్ల
సర్పంచ్:
ప్రామాణిక సంవత్సరం: 2011 లేదా 2021
పురుషులు:
స్త్రీలు:
గృహాల సంఖ్య:
లింగనిష్పత్తి:
గ్రామ జనగణన కోడ్ లేదా సెన్సస్ కోడ్: (ఏదో ఒకటి)
ప్రాంతీయ కోడ్:
పిన్‌కోడ్
పై విధంగా సమాచారం ఉంటేనే ఆ సమాచారపెట్టె పరిపూర్ణంగా ఉంటుందని నా అభిప్రాయం.గతంలో మండల సమాచారపెట్టెలలో కూడా పూర్తి సమాచారం రాలేదు. అవసరమయితే ఈ ప్రాజెక్టులో నా పూర్తి సహాయసహకారాలు అందిస్తాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 05:39, 14 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. గతకాలపు దోషాలను సరిదిద్దడానికి, గూగుల్ మేప్స్ లో తెలుగు ఊర్లపేర్లు కొన్ని సార్లు వింతగా కనిపిస్తుండటంతో (చిన కొత్తపల్లి అనేది గూగుల్ మేప్స్ లో చైనా కొత్తపల్లి) కనబడటం, OSM పటాలు సరియైన తెలుగు పేర్లతో కనబడడానికి చేర్చిన కృషిలోభాగంగా, తెవికీలో గ్రామపేజీలలోని సమాచారపెట్టెల మెరుగు మరల చేపట్టాను. మీ సందేహాలకు సమాధానాలు ఉపవిభాగాలుగా చేసి ఇస్తున్నాను. గమనించండి. అర్జున (చర్చ) 01:12, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీడేటా లో ఫొటో ఉన్నట్టు అయితే, సమాచారపెట్టెలో చూపిస్తే బాగుంటుంది. మ్యాపు జూం లెవెల్ ను గ్రామం కనిపించినట్లుగా మార్చవచ్చు. Saiphani02 (చర్చ) 12:15, 11 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వికీడేటా ఫొటో చేర్చటానికి ప్రయత్నిస్తాను. పటం జూమ్ స్థాయి పెంచి గ్రామ పరిసరాలు చూపించవచ్చు కాని, ప్రస్తుత వికీమీడియా పటరూపంలో కేవలం రోడ్లు, నదులు, చెరువులు లాంటి భౌతిక సౌలభ్యాలు మాత్రమే కనబడతాయి. అందువలన గ్రామానికి చుట్టు పక్కల గల పెద్ద గ్రామాలు, పట్టణాలు కనిపించేటట్లు చేయడం ద్వారా గ్రామ స్థానం తెలుసుకోవటానికి ఉపయోగం అని నా అభిప్రాయం. ఇతర సభ్యులు కూడా జూమ్ పెంచడానికి ఆసక్తి కనబరిస్తే మారుస్తాను. ఈ ప్రతిపాదనకు సంబంధించి, ప్రత్యేకంగా ఉత్తర ఆంధ్ర జిల్లాల వ్యాప్తంగా వికీడేటా, OSM లో విస్తారమైన మీ కృషికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 00:42, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, నేను సమాచార పెట్టెల సవరణలు ఎక్కువ చెయ్యలేదు గనుక కొన్ని సందేహాలు ఉన్నాయి. కొత్త సమాచార పెట్టెలో Area, Population, Density, Area code అనేవి తెలుగులోకి మార్చడం కుదురుతుందా? అలా వీలు కాకపోతే ఆ పదాలు కనపడకుండానైనా చెయ్యొచ్చా? ఉదా: Area అసలు కనపడకుండా దాని కింద 'మొత్తం' స్థానంలో 'మొత్తం విస్తీర్ణం' అని వచ్చేలా చెయ్యొచ్చా?
ఈ పనిలో మీకు ఏదైనా సహాయం అవసరమైతే అందించగలను. కిమీర (చర్చ) 12:13, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ప్రతిపాదిత రూపు, ఆంగ్లవికీ మూస {{Infobox settlement}} పై ఆధారపడింది. నిర్వహణ కొరకు వ్యాసాలు, సంబంధిత మూసలు దిగుమతి చేసినప్పుడు, ఆ మూసలో పదాలు మరల ఆంగ్లంలోకి మారుతుంటాయి. మరల అనువాదం చేర్చవలసివస్తుంది. ఇప్పుడు అవసరమైన అనువాదాలు చేర్చాను. మూస_చర్చ:Infobox_India_AP_Village#ఆంధ్రప్రదేశ్_అన్ని_రెవెన్యూ_గ్రామాలకు_వికీడేటా_ఆధారిత_సమాచారపెట్టె_మార్పుకు_ఉదాహరణ లో తాజా అనువాదాలతో పటం చూడండి. అ ఇబ్బంది లేకుండా వుండాలంటే ఆంగ్ల మూసకి తెలుగు నకలు చేసి, ఆ మూస వాడటం. అయితే ఆంగ్లంలో మెరుగుపడినప్పుడు మరల మానవీయంగా ఆ మార్పులు మన నకలు మూసలోకి చేయవలసివస్తుంది. ఈ మూస గ్రామాలకొరకు విస్తారంగా వాడే ప్రతిపాదన చేస్తున్నందున ఆ పని చేయక తప్పదనిపిస్తుంది. చర్చపూర్తయిన తర్వాత చేస్తాను. అర్జున (చర్చ) 01:04, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది చక్కగా ఉందండీ. 'ప్రాంతపు' కోడ్ కంటే 'ప్రాంతం' కోడ్ బాగుంటుందేమో చూడండి. కిమీర (చర్చ) 19:37, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat గారు. మీ సలహాకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 01:42, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాలలో మ్యాపుల సంఖ్య

మార్చు

గ్రామ వ్యాసాలలో మ్యాపుల సంఖ్యపై పరిమితి వుండనవసరం లేదు. విషయ అవగాహనకు తగినన్ని వుండవచ్చు. గతంలో గ్రామ వ్యాసాలలో సమాచారపెట్టెలో కనబడ్డ పటాలు కాకుండా, గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల పటం పెద్ద విస్తీర్ణంలో కనబడేటట్లు {{|Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}} అనే మూస కోడ్ చేర్చాను. (ఇంకొల్లు ఉదాహరణ (శాశ్వత లింకు)) అయితే అటువంటి రూపు సమాచారపెట్టె లో గల గతిశీల పటాన్ని పూర్తి విండోలో చూసి జూమ్ మార్చి చేరుకునే అవకాశం వున్నందున అటువంటి మేప్ అవసరంలేదని నా ప్రస్తుత అభిప్రాయం. దీనిపై స్పందనల ప్రకారం తగిన మార్పులు చేస్తాను.--అర్జున (చర్చ) 01:26, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్యను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:42, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యేక వికీడేటా ఆధారిత మూస వాడడం వలన నిర్వహణ ఇబ్బందులు

మార్చు

పదులవేలసంఖ్యలో గల గ్రామాల వ్యాసాల వివరాలను భవిష్యత్తులో సులభంగా నిర్వహించాలంటే, ఈ అంశాలపై క్రియాశీలవికీపీడియన్లు అతి తక్కువగా వుండడం, ముందు అది మెరుగుపడే అవకాశాలు నా దృష్టిలో అంతగా లేనప్పుడు ఆధునిక సాంకేతికాల వాడకం తప్పనిసరి. తెవికీ సభ్యులలో చాలమందికి తెలిసిన మూస సాంకేతికాలనే వికీడేటా తో వాడాను. వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_91#ఆంధ్రప్రదేశ్ మండల పేజీలలో మూలాల లోపాలు సవరణ గత చర్చలో తెలిపినట్లు, నిర్వహణ సమస్యలకు తెవికీ సభ్యుల నైపుణ్యాలు సరిపోనప్పుడు m:Indic-TechCom లేక ఆంగ్లవికీలో మూసల నిర్వాహకుల సహాయం పొందాలి.--అర్జున (చర్చ) 01:47, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందనకు ధన్యవాదాలు.చివరగా అన్ని సవరణలతో మాదిరి సమాచారపెట్టె తయారైన తరువాత ఒకసారి పరిశీలనకు పెట్టగలరు. యర్రా రామారావు (చర్చ) 12:43, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారపెట్టె విస్తీర్ణం ఎక్కువ, జూమ్ చేయకుండా రెవెన్యూ గ్రామం

మార్చు

ప్రతిపాదిత నమూనాతో ఇంకో పటం చేరినందున సమాచారపెట్టె విస్తీర్ణం ఎక్కువవుతుంది. దీనివలన వ్యాసం ఎబ్బెట్టుగా వుంటుందని నాకనిపించుటలేదు. ప్రతిపాదన నమూనాలో జూమ్ స్థాయి, పరిసర పట్టణాలను చూపించేదిగా వాడాము. జూమ్ స్థాయి పెంచి రెవిన్యూ గ్రామ పరిసరాలు మాత్రమే కనబడేటట్లు చేయవచ్చు. OSM లో ప్రస్తుతం చాలావరకు గ్రామానికి చేరుకునే ప్రధాన రహదారి, అడవులు, చెరువులు వంటి భౌతిక సౌలభ్యాలు మాత్రమే కనబడతాయి కావున, వికీమీడియా మేపు రూపుదిద్దిన పద్ధతిలో OSM లో గ్రామ దేవాలయాలు, పాఠశాల లాంటి సౌలభ్యాలున్నా కనబడవు కావున అంత ఉపయోగంగా వుండకపోవచ్చు. ఎక్కువ జూమ్ స్థాయికి గొత్తివాడ వికీడేటా అంశంలో Coordinate location అంశం ఎదురుగా కనబడే OSM పటం చూడండి. User:యర్రా రామారావు, User:Saiphani02 గార్లు, సహసభ్యులు ఆ విధమైన జూమ్ స్థాయి ఇప్టపడితే తెలపండి.--అర్జున (చర్చ) 02:02, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారపెట్టె ఎక్కువ వెడల్పుతో వ్యాసం ఎబ్బెట్టుగా కనపడకుండా అవకాశం ఉన్నంతవరకు మ్యాప్ జూమ్ స్థాయి ఉండేటట్లు చూడగలరు. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:51, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, సమాచారపెట్టెలో జూమ్ స్థాయి మార్చిన, వెడల్పు ప్రత్యేక పరామితిలో మార్చితే తప్ప మారదు. గ్రామాన్ని చాలా దగ్గరగా అంటే OSM లో దాని పేరు కనిపించేటట్లు చూపించాలా, లేక గ్రామ స్థానాన్ని మార్కర్ తో, చుట్టుపక్కల పట్టణాలు లేక మండల కేంద్రాలు చూపించితే మంచిదా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని తెలపండి. అర్జున (చర్చ) 01:47, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాధమిక సమాచారం - గ్రామ నిర్వహణ వ్యవస్థ అంశాలు

మార్చు

జిల్లా, మండలం ప్రత్యయాలను తొలగించడానికి ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 02:08, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సమస్య అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 12:53, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, ప్రస్తుత కోడ్ తో ఇది చేయలేకపోయాను. అర్జున (చర్చ) 09:30, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, ఆంగ్లవికీ సభ్యుని సహాయంతో సమస్య పరిష్కరించాను. నిన్నటిసందేశంపై ఇంకా సభ్యుల స్పందనలు రానందున,పరీశీలనకు పెట్టిన మూసలోనే తగిన మార్పులు చేశాను. అర్జున (చర్చ) 00:47, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ విస్తీర్ణం

మార్చు

ప్రతిపాదన ఆంగ్ల మూస పై ఆధారపడింది. ఆంగ్ల మూసలో మొత్త విస్తీర్ణం, భూ విస్తీర్ణం, జల విస్తీర్ణం లాంటి వివరాలు చేర్చే వీలుంది, కావున మనకు ప్రస్తుతం మొత్తం విస్తీర్ణం మాత్రమే లభ్యమవుతున్నందున మొత్తం విస్తీర్ణం మాత్రమే కనబడుతున్నది. మొత్తం పదం తీసివేస్తే, విస్తీర్ణం ఒక వరుసలో, సంఖ్య రెండో వరుసలో వస్తుంది. Area కనబడకుండా, మొత్తం బదులు మొత్తం విస్తీర్ణం కనబడేటట్లు చేయవచ్చు. కాని సమాచారపెట్టెలో శీర్షికల క్రమం దెబ్బతింటుంది కావున రూపం కూడా కాస్త ఎబ్బెట్టుగా వుంటుంది. కావున ప్రస్తుత కూర్పుని కొనసాగించడమే మంచిదని నా అభిప్రాయం. పై వివరాలు పరిశీలించి, user:యర్రా రామారావు, user:Kimeerat గార్లు, సహ సభ్యులు స్పందించండి.--అర్జున (చర్చ) 02:32, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవకాశం ఉన్నంతవరకు వీలునుబట్టి కూర్పు ఉండేటట్లు చూడగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:56, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat, @యర్రా రామారావు గార్లకు, మొత్తం పదం వాడకుండా విస్తీర్ణం వచ్చేలా చేశాను. అర్జున (చర్చ) 09:37, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ ధన్యవాదాలు.అన్నీ అయినాక ఒకసారి సమాచారపెట్టె రూపు చూపగలరు. యర్రా రామారావు (చర్చ) 09:53, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, #ప్రతిపాదిత_మూస_చిత్తుప్రతి_తయారు చూడండి. అర్జున (చర్చ) 10:36, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తీర్ణం కొలమానం తెలుగులో

మార్చు

విస్తీర్ణం కొలమానం( km2 బదులుగా చ.కి.మీ లాంటివి) కూడా ఆంగ్ల వికీ నుండి అదేపేరుతో దిగుమతి చేసుకున్న మూసపై ఆధారపడింది. తాత్కాలిక అనువాదాలు, మరల ఆంగ్ల వికీనుండి దిగుమతి చేసినప్పుడు రద్దవుతాయి. కావున సంబంధిత మూసను తెలుగులో వాడుకకు నకలు చేయాలి. ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 04:17, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ డేటాలో square kilometer పేజీలో చ.కి.మీ. ని చేర్చాను. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కిమీర (చర్చ) 19:34, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగులో వస్తే బాగుంటుంది.ప్రయత్నించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 12:58, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat, కొలమానానికి సంబంధించి ప్రత్యేక మూస వాడడం వలన వికీడేటాలో మార్చటం వలన ఉపయోగం లేదు. అర్జున (చర్చ) 01:50, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat, @యర్రా రామారావు గార్లకు, మూసలో ప్రధాన ఆంగ్లపదాల కొత్త రూపం దిగుమతైనప్పుడు మారకుండా, స్థానికంగా {{infobox settlement te}} అనే మూస వాడాను. కొత్త రూపు దిగుమతైనప్పుడు, కొలమానాలు ఆంగ్లానికి మారితే, పాత అనువాద రూపులో మానవీయంగా చేర్చాలి. విస్తీర్ణం కొరకు,
{{Infobox settlement/areadisp}} (ఉదాహరణ కూర్పు , జనసాంద్రత కొరకు {{Infobox settlement/densdisp}} ([ https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%82%E0%B0%B8:Infobox_settlement/densdisp&diff=prev&oldid=4239423 ఉదాహరణ మార్పు]), ఇతర సాధారణ కొలమానాలకు Module:Convert/data (ఉదాహరణ మార్పు) చూడండి. మూసలు తెలిసిన నిర్వాహకులు, కొత్తరూపు, పాతరూపుకి తేడా చూస్తూ ఈ పని సులభంగా చేయవచ్చని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 09:48, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పరిపాలన అంశాలు

మార్చు

నా ఇటీవల కృషిలో తెలిసినదేమంటే, ఒక రెవెన్యూ గ్రామానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుండవచ్చు, అలాగే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం లాంటి ఆదివాసి ప్రాంత జిల్లాలలో ఒకటి కంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలకు ఒక గ్రామ పంచాయతీ వుంటుంది. అలాగే 25% రెవెన్యూ గ్రామాలకు అదే పేరుతో ఆవాసాలు గల గ్రామం,పంచాయతీ వుండదు. కావున పంచాయతీ వివరాలను, వికీడేటాలో చేర్చి, రెవెన్యూ గ్రామాలతో అనుసంధానంచేసేవరకు, పంచాయతీ, సర్పంచి లాంటి వివరాలను చేర్చటం వీలుకాదు. అప్పుడు కూడా గ్రామపంచాయతీ ప్రత్యేక విషయంగా గల వ్యాసాలలో ఆయా వివరాలను చేర్చడం ఉపయోగం అని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 02:17, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అది లేకపోతే అజ్ఞాత వాడుకరులు ఎవరోకరు వ్యాసపేజీలను డిస్టర్బ్ చేస్తుంటారు.గ్రామానికి ఇది ముఖ్యమైన కాలమ్. పాత సమాచారపెట్టెలో ఈ వివరాలు ఉన్నవి. అవకాశం ఉన్నంతవరకు చేయగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:02, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీరు సమస్యని అర్ధం చేసుకున్నట్లు లేదు. ఈ వివరాలు సమాచారపెట్టెలో వుండి, వ్యాసంలో లేకపోతే, ప్రస్తుతానికి వ్యాసంలో చేర్చి సహకరించండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 02:26, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, సర్పంచి వివరాలు ప్రతిపాదిత మూస ద్వారా చేర్చటానికి సరైన సమాచారం వికీడేటాలో లేదు. అవసరమనుకుంటే మూస వాడుక infobox settlement సంబంధిత పరామితిలు వాడి చేర్చటానికి వీలు చేశాను. అర్జున (చర్చ) 10:18, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారికి, సర్పంచి వివరాలు ప్రతిపాదిత మూస ద్వారా చేర్చటానికి సరైన సమాచారం వికీడేటాలో లేదు. అవసరమనుకుంటే మూస వాడుక infobox settlement సంబంధిత పరామితిలు వాడి చేర్చటానికి వీలు చేశాను. మూస:Wikidata example లో లింకులు వాడవచ్చు, లేక మీకు ఆసక్తి గల రెవెన్యూ గ్రామ వ్యాసంలో పరీక్షించవచ్చు. మూస వాడినప్పుడు ఏమైనా దోషాలుంటే తెలపండి. అర్జున (చర్చ) 10:26, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ పరిశీలించి,అవసరమయితే మీతో సంప్రదిస్తాను యర్రా రామారావు (చర్చ) 10:37, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

జనగణాంకాలు

మార్చు

ప్రస్తుతానికి 2011 అధికారిక జనగణన వివరాలుమాత్రమే వున్నందున ప్రామాణిక సంవత్సరం 2011 మాత్రమే. 2021 జనగణన జరగలేదు. భవిష్యత్తులో కొత్త జనగణన అంశాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వికీడేటాలో ప్రవేశపెట్టి, అపుడు ఆ జనగణన సంవత్సరానికి తగినట్లుగా మూసలో స్వల్పమార్పులు చేయాలి.

జనగణాంకాలలో గృహాల సంఖ్య చేర్చటానికి నాకు సమ్మతమే. ప్రత్యేకంగా పురుషులు, స్త్రీల సంఖ్యలు, లింగ నిష్పత్తి చేర్చటం వలన గ్రామస్థాయిలో పెద్దగా ఉపయోగం లేదని నా అభిప్రాయం. వీటివలన సమాచారపెట్టె నిడివి కూడా పెరుగుతుంది. ఇతర సభ్యులు కూడా తమ అభిప్రాయాలు తెలిపితే మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేస్తాను. --అర్జున (చర్చ) 02:22, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ వీలుబట్టి అవకాశం ఉన్నంతవరకు ఎక్కువ సమాచారం వచ్చేటట్లు చూడగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:04, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, Chaduvari గారు కూడా ఈ విషయం తమ స్పందనలో ప్రస్తావించారు. పురుషులు, స్త్రీల జనసంఖ్యలు చూపించడం సమస్య కాదు, కాని అలా చూపించడం వలన సమాచారపెట్టె విలువ,ఉపయోగం ఎంతవరకు మెరుగవుతుంది అనేది సమస్య. ఆంగ్లవికీ వ్యాప్తంగా వాడే infobox settlement ప్రధాన మూసలో పురుషులు, స్త్రీల జన సంఖ్యలకు పరామితి లేదని గమనించారనుకుంటాను. ఆంగ్ల వికీపీడియా వ్యాసాలలో సమాచారపెట్టెలో బొమ్మ చూపించవచ్చనే సౌకర్యం వుంది కాబట్టి ఐదారు బొమ్మలు చూపిస్తున్నారు. అలా చేయడంవలన సమాచారపెట్టెలో ఇతర ముఖ్యమైన సమాచారంపై ఫోకస్ తగ్గుతుంది అని నా అభిప్రాయం. ఆంగ్లవికీలో ఆంధ్రప్రదేశ్ వ్యాసంలో చర్చ తరువాత మూడు ఫొటోలకు కుదించాను. ఈ విషయంపై గతంలో కూడా చర్చించాము. అందువలన ఈ చర్చని పొడిగించదలచుకోలేదు. సమాచారపెట్టె కూర్పులో ఇవి కూడా చూపించటానికి ప్రయత్నిస్తాను. అర్జున (చర్చ) 02:18, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ మీ సానుకూల ప్రయత్నానికి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:55, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావుగారు, అదనపు జనగణాంకాలు విభాగంలో చేర్చాను. అర్జున (చర్చ) 10:18, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ కోడ్లు

మార్చు

గ్రామ జనగణన కోడ్ చేర్చడానికి అభ్యంతరమేమిలేదు. ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 02:34, 15 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 13:04, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, అదనపు జనగణాంకాలు విభాగంలో చేర్చాను. అర్జున (చర్చ) 10:19, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:38, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

{{Infobox India AP Village}} లో బొమ్మ కూడా ఉండాలి

మార్చు

ముందుగా, {{Infobox India AP Village}} మూసపై తిరిగి పనిచేస్తున్నందుకు అర్జున గారికి ధన్యవాదాలు. ఇందులో ప్రస్తుతం చూపిస్తున్న అంశాలతో పాటు పురుషుల స్త్రీల జనసంఖ్యలను కూడా చూపిస్తామని ఆయన చెప్పారు, బాగుంది. అయితే, బొమ్మ కూడా ఆ సమాచారపెట్టెలో ఉండాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆ మూస మరింత సమగ్రంగా ఉంటుంది. ప్రస్తుతం అది రావడం లేదు. నేను కావూరు (చెరుకుపల్లి మండలం) పేజీలో దీన్ని పరిశీలించాను. సంబంధిత వికీడేటా పేజీలో బొమ్మ ఉంది. ఇది ఎలా చెయ్యాలనేది అర్జున గారికి ఎరుకే కాబట్టి దాని గురించి ఇక చర్చించాల్సిన పనిలేదు. అయితే, ఆపని చేసాక కూడా కింది సందర్భాలలో కొత్త మూస, బొమ్మను చూపించదు:

  • వికీడేటాలో బొమ్మ లేదు, కానీ కామన్సులో ఉంది. తెవికీలో ఇప్పటి సమాచారపెట్టెలో కూడా ఆ బొమ్మే ఉంది. ఈ సందర్భంలో కొత్త మూస బొమ్మను చూపించదు.
  • వికీడేటాలో బొమ్మ లేదు, కామన్సులో కూడా లేదు. కానీ తెవికీలో ఇప్పటి సమాచారపెట్టెలో స్థానికంగా ఎక్కించిన సముచిత వినియోగపు బొమ్మ ఉంది. అపుడు కూడా కొత్త మూస బొమ్మను చూపించదు.

బొమ్మ ఉన్న సమాచారపెట్టెను తీసేసి బొమ్మ లేని పెట్టెను పెట్టడం సరైన పని కాదు గాబట్టి, నాకు కింది పరిష్కారాలు తోచాయి

  • సంబంధిత వికీడేటా పేజీలో బొమ్మ ఉన్న తెవికీ పేజీల్లోనే కొత్త సమాచారపెట్టెను చేర్చాలి. లేదా
  • కొత్త సమాచార పెట్టెను చేర్చాక, పేజీలో వేరే చోట బొమ్మను చేర్చాలి. లేదా
  • కొత్త మూసలో బొమ్మను ఇచ్చే పరామితిని పెట్టాలి. వికీడేటాలో బొమ్మ ఉంటే తెస్తుంది. లేనట్లైతే ఈ పరామితిలో ఇచ్చిన బొమ్మను చూపిస్తుంది. రెండూ లేకపోతే ఏమీ చూపించదు.

ఈ మూడోది నాకు మెరుగ్గా అనిపించింది. పరిశీలించవలసినది. పోతే - రేపు WPWP పోటీయో, కొత్తగా గ్రామాల ఫొటోలను ఎక్కించే పోటీయో జరిగినపుడు వచ్చే ఫొటోలను కామన్సు లోకి ఎక్కించడమే కాకుండా, వికీడేటా పేజీల్లోకి ఎక్కించాలి అనే అంశం చేర్చాలి అని ప్రకటించాలి. గతంలో కామన్సు లోకి ఫొటో ఎక్కించాక తెవికీలో సంబంధిత పేజీలో చేర్చాలి అని ఉండేది. __చదువరి (చర్చరచనలు) 14:39, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పాత సమాచారపెట్టెలో ఆ వ్యాసానికి చెందిన బొమ్మ చేర్చటానికి అవకాశం ఉంది. ఆ సదుపాయం ఎలాగూ ఉంటుందనుకున్నాను.అందువలన బొమ్మను గురించి నేను అంతలోతుగా ఆలోచించలేదు. ముందు ముందు ప్రతి గ్రామం తాలూకూ ఏదో ఒక బొమ్మ అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంది. ఈ విషయపై @Chaduvari గారు పరిశీలించి @అర్జున గారి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:11, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారు ఇంతకు ముందు స్పందనలో ఇదే విషయంకోరారు., Chaduvari, యర్రా రామారావు గారలు కూడా కోరుతున్నందులకు ధన్యవాదాలు. ప్రస్తుతమున్న బొమ్మలు ఏవైనా వికీడేటాలో ఇంకాచేర్చకపోతే చేర్చి సహకరించండి. అర్జున (చర్చ) 02:17, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ అలాగే సహకరిస్తాను.తప్పనిసరిగా గ్రామానికి చెందిన ఒక బోమ్మ సమాచారపెట్టెలో ఉండాలని నా అభిప్రాయం యర్రా రామారావు (చర్చ) 04:32, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మ వికీడేటాలో వుంటే వచ్చేలాగా, లేక అవసరమనుకుంటే infobox settlement మూస వాడుకలో లాగా అదనపు పరామితులు వాడి చేర్చేలా చేశాను. అర్జున (చర్చ) 10:20, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ మీ శ్రమకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:40, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదిత మూస చిత్తుప్రతి తయారు

మార్చు

@Saiphani02, @Kimeerat, @యర్రా రామారావు,@Chaduvari గార్లకు, ప్రతిపాదిత చిత్తుమూస {{infobox India AP Village/sandbox}} తయారైంది. ప్రస్తుత మూసలో qid ఇచ్చే సౌకర్యం మూస క్లిష్టతను తగ్గించడానికి తొలగించాను. దీని రూపం చూడటానికి ఉదాహరణలు Template:Wikidata example (permanent link) లో చూడవచ్చు. ఆ పేజీలో లింకులు నొక్కినప్పుడు తొలిసారి ఏదైనా దోషం కనబడితే మరల రూపుదిద్దటానికి సరే అనే బటన్ నొక్కండి. ఆసక్తి గల గ్రామాలలో మూసను వాడికూడా చూడవచ్చు. పరిశీలించి సమస్యలు రెండు మూడు రోజులలో తెలియచేయండి. అర్జున (చర్చ) 10:26, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మండల జిల్లా లింకులలో ప్రత్యయాల తొలగింపు, Government కు సంబంధించి వివరాలు లేకున్నా అ పదము కనబడుతున్న బగ్ కూడా పరిష్కరించాను. నిన్నటి సందేశానికి ఇంకా స్పందనలు రానందున, అదే మూసలో మార్పులు చేశాను. అర్జున (చర్చ) 00:50, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Arjunaraoc గారూ, Template:Wikidata example (permanent link) లోని లింకుల్లో బొమ్మ పనిచెయ్యలేదు. కానీ, నేరుగా ఆ మూసను కావూరు (చెరుకుపల్లి మండలం) పేజీలో పెట్టాను, పనిచేసింది. బాగుంది. __ చదువరి (చర్చరచనలు) 03:08, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ కావూరు, బీమవరం, అన్నపర్రు, దేవరపల్లి ఈ గ్రామాలలో పెట్టిన మాదిరి తాజా సమాచారపెట్టె నేను అనుకున్న విధంగా బాగా చక్కగా ఉంది.చాలా శ్రమ పడ్డారు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:42, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
భీమవరం (మారేడుమిల్లి) లో వాడాను. బాగుంది. మ్యాపు జూమ్ చేస్తే ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి! ఇలానే ఉంచుదాం. Saiphani02 (చర్చ) 03:09, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారు, ధన్యవాదాలు. రెవెన్యూ గ్రామ విస్తీర్ణానికి తగ్గట్టుగా జూమ్ స్థాయి ఎంపిక మూసలో వున్నందున, కొండప్రాంత జిల్లాలలో అధిక జూమ్ లో కనబడుతుంది. అన్నట్లు, భీమవరం (మారేడుమిల్లి) లోని బొమ్మకు వికీడేటా లో qualifier గా "media legend" లక్షణానికి బొమ్మ వ్యాఖ్య చేర్చాను. ఆ విషయం సమాచారపెట్టెలో కనబడేటట్లు {{infobox India AP Village/sandbox2}} లో మార్చాను. స్పందనలన్నీ పరిశీలించినతరువాత తుది కూర్పులో ఈ మార్పులు చేరుస్తాను. అర్జున (చర్చ) 04:36, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Arjunaraoc గారూ సమాచారపెట్టె వెడల్పు కొద్దిగా తగ్గిస్తే (సుమారు 25px) బాగుంటుందనిపిస్తోంది. __ చదువరి (చర్చరచనలు) 03:26, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే రెండు మ్యాపులూ ఏకకాలంలో కనబడకుండా, దేన్ని ఎంచుకుంటే (రేదియో బటన్ ద్వారా) అదే కనబడేలా ఉంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 03:41, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc ఇంకొక విషయం ఎడమ వైపు లేబుల్స్ జన సాంద్రత, సర్పంచి, పురుషులు, స్త్రీలు, ప్రభుత్వం, విస్తీర్ణం, అవాసాలు వీటికి వికీపీడియాలో వ్యాసాలు ఉన్నవి.అవకాశం ఉంటే ఆ లింకులు కలిపితే బాగుంటుందికదా అని నా అభిప్రాయం.దాదాపుగా అన్నీచేసారు. ఆలోచించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:55, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. {{Infobox India AP Village/sandbox2}}లో అమలుపరచాను. పరిశీలించండి. అర్జున (చర్చ) 05:24, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, నేను మరచాను. సాధారణ పదాలకు లింకులివ్వకూడదనే నియమం వుంది కావున లింకులు మీరు చెప్పినవాటిలో జనసాంద్రతకు మాత్రమే లింకు వచ్చేటట్లుగా మార్పులు చేశాను. సర్పంచి కి లింకు మూసని వాడేవారు లింకుతో చేర్చవచ్చు. అర్జున (చర్చ) 01:05, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగా! ఏవి సాధారణపదాలో, లింకులు ఎందుకు ఇవ్వకూడదని ఎక్కడ ఉందో తెవికీ లింక్ ఇవ్వగలరు. యర్రా రామారావు (చర్చ) 02:48, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, లింకులు ఎప్పుడు ఇవ్వాలి అనే విషయం గురించి తెలుగు వికీపీడియా లో క్లుప్తంగా వున్న పేజీ, ఆంగ్లవికీ శైలి లో విస్తారమైన వివరం చూడండి. మనకు తెలుగు వికీలో విస్తారమైన సమాచారం లేకపోతే, ఆంగ్లవికీనుండి దిగుమతి చేసుకున్న మూసకు ఏ విధంగా లింకులిచ్చారని అవగాహన చేసుకొని అదేవిధంగా తెలుగులో కొనసాగటం సాంప్రదాయమే కదా. అర్జున (చర్చ) 06:38, 24 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ మంచి విషయం చేప్పారు.ఇలాంటివి మీరు మాలాంటి తెలియనివార్కి శిక్షణా తరగతులు ఇస్తే బాగుంటుదని నా అభిప్రాయం.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:51, 24 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, ఎక్కువ పటాలు చూపటానికి రేడియో బటన్ వాడి సమాచారపెట్టె పరిమాణం కుదించటానికి వీలవుతుంది. ఇక్కడ రెండు పటాలు మాత్రమే వాడుతున్నందున అది అవసరంలేదు. ఇంకొక విషయం, ఆంధ్రప్రదేశ్ లో స్థానం పటం చూపటానికి వాడుతున్న సాంకేతికత, వికీమీడియా మేప్ చూపటానికి వాడుతున్న సాంకేతికత భిన్నమైనవి కావున, వాటి రెంటిని రేడియో బటన్ తో ఒకే పటంగా చూపటం వీలుపడదు. అర్జున (చర్చ) 01:10, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇప్పుడు infobox settlement లో గల అప్రమేయ వెడల్పు 250px వాడుతున్నాము. ఈ మూస పై ఆధారపడిన పేజీల ఏకరీతి కూర్పుకు అలానే వుంచటమే మేలనిపిస్తుంది. ఇతరులు కూడా స్పందిస్తే పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 04:39, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుత సమాచారపెట్టె కంటే దీని వెడల్పు ఎక్కువగా ఉన్నట్టుంది సార్ - దాదాపు 325 వరకు ఉంది. 23em ఉన్నట్టు స్టైల్ షీటులో చూసాను. అంటే అక్కడి ఫాంటు సైజును బట్టి అది 322px ఉన్నట్టు. 250px ఉండాలంటే 18em వరకు సరిపోతుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 04:52, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ సమాచారపెట్టె వ్యాసంలో సాధ్యమైనంత తక్కువ పరిమాణంలో ఉంటేనే బాగుంటుంది.దానికి తార్కాణం సమాచారపెట్టె ఎక్కువ వెడల్పు పరిమాణం ఉంటే కొన్ని వ్యాసాలలో పట్టికలు ఉంటవి, ఆ వ్యాసాలలో సమాచారపెట్టె పొడవుకు తగిన విషయసంగ్రహం ఉండదు.ఆ వ్యాసాలలో ఒక్కోసారి ఖాళీ స్పేస్ ఉంటుంది.అలా ఎన్నికల ప్రాజెక్టులో చాలా వ్యాస పేజీలు ఎబ్బెట్టుగా ఉన్నవి.దీనికి మరో ప్రత్యామ్నాయం ఉందేమో నాకు తెలియదు. యర్రా రామారావు (చర్చ) 04:56, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
 
Infobox settlement మూస,దాని ఆధారిత మూసలు వాడే వ్యాసాలలో సమాచారపెట్టె పరిమాణం పోలిక
@Chaduvari, @యర్రా రామారావు గార్లకు , బొమ్మ 250px వుంటే రెండు వైపుల మార్జినుతో కాస్త ఎక్కువగా వుంటుంది. మూల మూస, దాని ఆధారిత గ్రామాలలో వాడే మూస వ్యాసాలను పోల్చిన ఫొటో చూడండి. నేను వాడిన జూమ్ లో బొమ్మ వెడల్పు 378px, సమాచారపెట్టె వెడల్పు 422px వుంది. బ్రౌజర్ లో జూమ్ స్థాయి మార్చుకునే (CTRL తో + లేక -) సౌలభ్యంతో పాఠకులకు సమాచారపెట్టె కనబడే పరిమాణం మారుతుంది కూడా. వ్యాసంలో పట్టికలున్నప్పుడు వాటి వాడుక ఎబ్బెట్టుగా లేకుండా సరిదిద్దటానికి వ్యాసాన్ని సరిచేయటం, లేక ఇతర మూసలు వాడటం చేయవచ్చు. మీరు సమస్యగలవ్యాసం లింకు తెలిపితే పరిశీలిస్తాను. అర్జున (చర్చ) 05:51, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
 
మూలమూస లోనే సమాచారపెట్టె వెడల్పు ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. ఉదాహరణకు ఈ పక్క బొమ్మలో విజయవాడ - ఎన్వికీ, తెవికీ పేజీల పోలిక చూడండి.__ చదువరి (చర్చరచనలు) 06:05, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, విజయవాడ ఆంగ్లవికీ వ్యాసంలో(permanent link) అప్రమేయ వెడల్పు వాడకుండా మార్పులు చేశారు. అందువలన మీకు తేడాగా కనబడుతున్నది. 90% పైగా వీక్షణలకు (మొబైల్) వెడల్పులో మార్పులవలన ఏమీ ప్రభావముండదు కావున ఈ విషయమై మార్పులు అనవసరమని నా అభిప్రాయం. అర్జున (చర్చ) 06:32, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Arjunaraoc గారూ,
  1. సమాచారపెట్టె వెడల్పు ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గిస్తే బాగిఉంటుంది అనేది నేను చెప్పినది. అందుకే నేను పోలిక చూపించాను. మీరు ఎన్వికీలో అలా ఎందుకుందో చెప్పారు. అలా ఎందుకుంది అనేది కాదు మన చర్చ, వెడల్పు తక్కువగా ఉంటే బాగుంటుందని నేను అన్నాను. ఎక్కువగా ఉంటేనే మీకు బాగుంటే, సరే అలాగే కానివ్వండి.
  2. పెట్టె వెడల్పుగా ఉందని భావించినవాళ్ళు బ్రౌజరులో జూమౌట్ చేసుకుని చూడండి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అప్పుడు ఫాంట్లు చిన్నవైపోయి కనబడవు గదా!
ఏమైనప్పటికీ, ఈ విషయమై ఇక నా చర్చ ఇక్కడితో సమాప్తం. మీరు మీ పని కానివ్వండి. మీరు మీ పని కానిచ్చాక, ఏమైనా మార్పుచేర్పులు అవసరమైతే నేనే చేస్తాను. __ చదువరి (చర్చరచనలు) 00:07, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, నేను సమాచారపెట్టె ఏకరూపత గురించి, సమాచారపెట్టె వెడల్పు బ్రౌజర్ జూమ్ ప్రకారం మారేవిధం, వెడల్పు మార్పుల ప్రభావం గురించి మాట్లాడాను. మీరు నా వ్యక్తిగత ఇష్టాలుగా అపార్ధం చేసుకుంటున్నారు. వికీపీడియాలో మార్పులు ఎవరైనా చేయవచ్చు. ఆ మార్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాక. తర్కబద్దంగా, ఎక్కువమంది సభ్యుల అభీష్టంమేరకు చేయటం మంచిది. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 01:34, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో చేసే మార్పులు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాక. తర్కబద్దంగా, ఎక్కువమంది సభ్యుల అభీష్టంమేరకు చేయటం మంచిదనే విషయంలో మరొక అభిప్రాయానికి తావే లేదు. కాకపోతే ఒక విషయంపై చర్చించేటపుడు చర్చను పక్కదారి పట్టించకుండా, అంశంపైననే మాట్లాడాలి. అపుడే మనం ఒక నిర్ణయానికి రాగలం సార్. లేకపోతే ఇదిగో ఈ చర్చలాగే అవుతుంది. సరే, మీరు చెయ్యదలచినది చేసెయ్యండి. __ చదువరి (చర్చరచనలు) 01:42, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ చర్చలో నా వాదనలు అంశంపైనే మాట్లాడానే, మీకు పక్కదారి పట్టించినట్లుగా ఎలా అనిపించిందో నాకైతే అర్ధంకాలేదు. బహుశా ఇది చదివే ఇతర సభ్యులు ఎవరైనా శ్రమదీసుకొని విశదీకరించితే నాకు ఉపయోగంగా వుంటుంది. అర్జున (చర్చ) 02:25, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో బొమ్మ అప్రేయ పరిమాణం 220px అనుకుంటాను.దానికి కుదించటానికి అవకాశం ఉంటే చేయగలరు.ఇప్పుడు మీరు ప్రక్కన చూపిన పటంలో అయితే కాస్త ఎబ్బెట్టుగానే ఉంది.ఒకవేళ చిన్న పరిమాణంలో చూడటాన అలా ఉందేమో నాకు అర్థమగుటలేదు.దీనిమీద చదువరి గారూ స్పందిస్తే బాగుంటుంది. యర్రా రామారావు (చర్చ) 06:10, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చదవరి గారి స్పందన చూసాను యర్రా రామారావు (చర్చ) 06:12, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సూరేపల్లి (ముసునూరు) పేజీలో పెట్టి చూసాను. అంతా బాగుంది. ధన్యవాదాలు. కిమీర (చర్చ) 07:52, 24 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదిత మూస అమలుకు సన్నాహాలు

మార్చు

ప్రతిపాదిత మూస చర్చలో స్పందించిన అందరికి ధన్యవాదాలు. ప్రతిపాదిత మూస రూపం దాదాపుగా ఖరారైనందున, ఇక దీని అమలుకు సన్నాహాలు ప్రారంభించాను. వికీడేటాలో బొమ్మ, STD code తప్పించి ఇతర వివరాలు ఇప్పటికే వున్నాయి. పెట్ స్కాన్ క్వెరీ ప్రకారం 404397 (2024-06-24 నాడు) గ్రామ వ్యాసాలలో సమాచారపెట్టెలో కాని ఇతర వ్యాసవిభాగాలలో కాని బొమ్మలు వున్నాయి. సమాచారపెట్టెలో గల బొమ్మలను, వాటి వ్యాఖ్యను ఇప్పటికే వికీడేటాలో లేకపోతే నేను చేరుస్తాను. ఎస్ టి డి కోడ్లు చాలావరకు నగరాలు, పట్టణాలకు మాత్రమే నెట్లో అందుబాటులో వున్నాయి. ప్రస్తుత సమాచారపెట్టెలో గలవి మూలాలు లేకుండా చేర్చినవి, వాటిని చేర్చటానికి నేను గమనించిన చోట్ల area code పరామితి కాక ఇతరాలు(ఉదా: blank_info) వాడారు. అలాగే సర్పంచి వివరం వికీడేటాలో ప్రస్తుతం చేర్చలేము, గ్రామ సమాచారపెట్టెలో కూడా పేరు తప్ప మూలాలతో చేర్చినవి చాలా అరుదు. కొత్త సమాచారపెట్టె ప్రవేశపెట్టినపుడు ఇవి తొలగించబడతాయి. ఈ విషయమై ఏమైనా సందేహాలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 01:27, 23 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

241 గ్రామాలకు సమాచారపెట్టెలో గల బొమ్మలు వికీడేటాలో వ్యాఖ్యలతో పాటు చేర్చడం, అవసరమైన సవరణలు చేయటం పూర్తయింది. ఇంకా 121 గ్రామాలలో చాలావరకు సమాచారపెట్టెలో కాక ఇతరభాగాలలో వాడిన బొమ్మలను, వికీడేటా లో, వ్యాఖ్యతో ప్రవేశపెట్టాలి. ఈ విషయమై సహకరించవలసిందిగా సహసభ్యులను కోరుతున్నాను.
ఇకపోతే ప్రతిపాదించిన మూసను చేతనం చేశాను. గతంలో ఉమ్మడి ప్రకాశంలో 200 రెవెన్యూగ్రామాలు కాని వాటిలో వాడినందున, వాటికి వికీడేటాలో అక్షాంశరేఖాంశాలు లేనందున, సమాచారపెట్టె దోషాలతో కనబడుతున్నది. వాటిని పరిష్కరించిన పిదప, రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రెవెన్యూ గ్రామాలకు అమలు చేస్తాను. అర్జున (చర్చ) 09:13, 24 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kimeerat గారు, బొమ్మలు వికీడేటాలోచేర్చటానికి ప్రయత్నించి ఒక బొమ్మ విజయవంతంగా చేర్చినందులకు ధన్యవాదాలు. ఈ విషయం గురించి కొన్ని సూచనలు, సమాచారపెట్టెలో ఉండదగిన నాణ్యత గల బొమ్మ ఒకటి చేర్చితే చాలు. ఆ బొమ్మ స్వేచ్ఛా నకలుహక్కులతో ఇప్పటికే కామన్స్ లో వున్నట్లైతే,తెవికీలో బొమ్మ పై నొక్కినపుడు (వికీమీడియా కామన్స్ లో చూడు అని కనబడితే) నేరుగా దాని పేరు, వ్యాఖ్య చేర్చవచ్చు. అలా లేకపోతే తెవికీలో బొమ్మ పేజీలో Export to Wikimedia Commons అనే పదం తొలి ఆదేశవరుసలో కనబడుతుంది, అది నొక్కి, కామన్స్ లో వచ్చే Cleanup source wiki విభాగంలో Delete file on source wiki in my name అనే పదం ముందు పెట్టెలో టిక్ పెట్టి Import అనే బటన్ పై నొక్కండి. అప్పుడు ఆ బొమ్మ వికీమీడియా కామన్స్ లో చేరుతుంది. ఇక వికీడేటాలో చేర్చవచ్చు. ఒకవేళ సమాచారపెట్టెలో గల బొమ్మ స్వేచ్ఛానకలుహక్కులు కలిగినది అనగా CC-BY-SA, CC-0, Public Domain లాంటి లైసెన్సుతో విడుదల కాకపోతే ఆ బొమ్మను సమాచారపెట్టె నుండి తొలగించి వ్యాస విభాగంలో చేర్చండి. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి లేక క్లిష్టమనిపించినవాటిన వదిలి ఇప్పటికే కామన్స్ లో గల బొమ్మల వివరాలు వికీడేటాలో చేర్చండి. అర్జున (చర్చ) 04:37, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, అవునండీ కొన్ని గ్రామాల పేజీలు చూసాను. వాటిలో ఎక్కువ శాతం బొమ్మలు కామన్స్‌లో ఉన్నా, కొన్ని లేవు. మీరు చెప్పినట్టు కామన్స్‌లోకి చేర్చి చూస్తాను. అజ్జరం పేజీలో ఉన్న బొమ్మకి మాత్రం older version of license అని చూపించింది. అది మీరు తీసేసినట్టున్నారు, ఇప్పుడు ఆ పేజీలో ఆ బొమ్మ లేదు. కిమీర (చర్చ) 10:33, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాడిన పేజీలలో రెవెన్యూయేతర గ్రామాలలో అక్షాంశ రేఖాంశాల లేమిని సరిచేయటం జరిగింది. అర్జున (చర్చ) 00:41, 26 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సమాచారపెట్టెలో లేకుండా వ్యాసంలో గల బొమ్మలలో ఒకటిని వికీడేటాలో చేర్చటం పూర్తయింది. @Chaduvari, @Kimeerat గార్ల తోడ్పాటుకి ధన్యవాదాలు. వికీడేటాలో తెలుగు వ్యాఖ్య(media legend) లేని అంశాలలో ( 231, 185, 158 84 అంశాలు) వ్యాఖ్య చేర్చటానికి తోడ్పడండి. అర్జున (చర్చ) 03:58, 26 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదిత మూస సంబంధిత మార్పుల అమలు

మార్చు
తెలుగు వికీపీడియా గ్రామ వ్యాసం నుండి ఓపెన్ స్ట్రీట్ మేప్ పై గ్రామ స్థానానికి చేరటం వీడియా (1ని. 12 సె.)

ప్రతిపాదిత మూస సంబంధిత మార్పుల అమలు ప్రారంభించాను. దాదాపు 15000 పేజీలలో మార్పులు అవసరం. ఇవి పూర్తవడానికి రెండు మూడు రోజులు పట్టవచ్చు. ఈ మార్పులు నా ఖాతాతోనే, ప్రత్యేక తాత్కాలిక బాట్ వాడుకరిపేరు ద్వారా చేస్తున్నాను. అయితే ప్రోగ్రామ్ ద్వారా వేగంగా (ప్రస్తుతం 10 సెకండ్లకు ఒక వ్యాసం చొప్పున) చేస్తున్నందున, ఇటీవలి మార్పుల జాబితా ఈ మార్పులతో నిండిపోవచ్చు. ఈ మార్పుల కొరకు #2024-aprvupdate1 అనే టేగ్ వాడుతున్నాను. #2024-aprvupdate1 వున్న ఇటీవల సవరణల వడపోత చూసి, నా ప్రోగ్రామ్ ద్వారా ఏమైనా దోషాలు ఏర్పడుతుంటే నా దృష్టికి తీసుకురండి. ఈ పని పూర్తయ్యేదాక, #2024-aprvupdate1 లేని ఇటీవలి సవరణల వడపోతను బుక్ మార్క్ చేసుకొని చూడటానికి వాడండి. మీ సహకారానికి ముందస్తు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 08:50, 28 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మూస చేర్చటం పూర్తయింది. క్వెరీ ప్రకారం 16150 రెవెన్యూ గ్రామాల పేజీలో మూస వున్నది. ఒక 6 గ్రామాలు నగర పంచాయతీ గా వికీడేటాలో మారినట్లు గుర్తించినందున, వాటికి {{Infobox India AP Town}} చేర్చాను. ఈ మార్పుల వలన డేటాబేస్ పరిమాణం 30 మిలియన్ బైట్లు తగ్గింది. షుమారు 500 పేజీలలో సమాచారపెట్టెలో బొమ్మ ప్రదర్శితమవుతున్నది. వికీడేటాలో కొన్ని చోట్ల తెలంగాణ గ్రామాలకు లింకులుగా వున్నవి తొలగిపోయినవి. 13000 పైగా జనావాసాలుగా వున్న రెవెన్యూ గ్రామాల అక్షాంశరేఖాంశాలు సరిపోల్చబడినవి. ప్రస్తుత పరిస్థితి వికీడేటాని వాడుకుని ముందు ముందు సమాచారపెట్టెని తాజాచేయటం సులభతరమవుతుంది. ఈ కృషివలన ఏమైనా పొరబాట్లు జరిగివున్నట్లైతే మీరు గమనించినపుడు సరిచేయండి.
నాలుగు నెలలకు పైగా జరిగిన ఈ పనిలో నాకు ప్రధానంగా సహకరించిన తెలుగు వికీపీడియా సభ్యులు Saiphani02,Chaduvari,యర్రా రామారావు, Kimeerat గారలకు, ఇతర సహ సభ్యులందరికి ధన్యవాదాలు. వికీడేటా/కామన్స్/ఓపెన్ స్ట్రీట్ మేప్ లో ప్రధానంగా పనిచేసే, భారత సభ్యులు, advik2000,DaxServer,శ్రీరామ్, గురుదత్త గారలకు నా ధన్యవాదాలు. మన భాష, ప్రాంతం కాకపోయినా, ఈ కృషికి తోడ్పడిన, స్ఫూర్తినిచ్చిన విదేశీయులు MGA73, Heinz_V గారలకు ప్రత్యేక ధన్యవాదాలు.-- అర్జున (చర్చ) 05:33, 1 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Awesome! It is a big job but when it is done it is a big improvement and it will not only benefit Telugu Wikipedia but all other versions of Wikipedia too because it is easy to implement information from Wikidata to other wikis!
(Google Translate): అద్భుతం! ఇది చాలా పెద్ద పని కానీ అది పూర్తి అయినప్పుడు ఇది పెద్ద మెరుగుదల మరియు ఇది తెలుగు వికీపీడియాకు మాత్రమే కాకుండా వికీపీడియా యొక్క అన్ని ఇతర సంస్కరణలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది ఎందుకంటే వికీడేటా నుండి ఇతర వికీలకు సమాచారాన్ని అమలు చేయడం సులభం! --MGA73 (చర్చ) 10:16, 1 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@MGA73, Thanks for your appreciation. Yes. It is true. Through this exercise, we are able to harmonise information from English wikipedia, by merging some times separate wikidata links for villages. We are able to display images uploaded from English Wikipedia to Commons, as those are already linked on Wikidata. అర్జున (చర్చ) 23:28, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ పై చర్చలో 'ఒక 6 గ్రామాలు నగర పంచాయతీ గా వికీడేటాలో మారినట్లు గుర్తించినందున, వాటికి {{Infobox India AP Town}} చేర్చాను." అని తెలిపారు. ఆ ఆరు గ్రామాలు లేదా పట్టణాలు వివరాలు తెలుపగలరు. మీ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రెవెన్యూ గ్రామాలు ఉన్నాయనే వివరం చెప్పగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 10:36, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారు, గ్రామాలు నగర పంచాయతీ గా మారిన వాటికి పెట్ స్కాన్ లింకు చూడండి. నేను ఇంతకు ముందు ఇచ్చిన వ్యాఖ్యలో గ్రామాల క్వెరీ లింకు, ఇప్పుడు ఇచ్చిన నగర పంచాయతీ గా మారిన గ్రామాల క్వెరీలింకు నేడు నడిపితే, తెవికీలో వ్యాసాలు గల రెవెన్యూ గ్రామాలు, నగర పంచాయతీగా మారిన గ్రామాల మొత్తం 16157. పెనుగొండ (ప.గో) వికీడేటాలో పట్టణం గా పేర్కొన్న దోషాన్ని కొద్ది క్షణాల క్రితం సవరించాను. ఈ సమాచారానికి మూల ఆధారం, LGDirectory నుండి పొందిన రాష్ట్ర గ్రామాల రిపోర్టు. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 23:24, 2 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదు పుస్తక ప్రదర్శన గ్రాంటు దరఖాస్తుకు మద్దతు

మార్చు

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో స్టాలును నిర్వహించేందుకు గాను, గ్రాంటు కోసం దరఖాస్తుకు చేసిన సంగతి రచ్చబండ లోనే పైన రాసారు. మెటాలో ఈ దరఖాస్తును పరిశీలించి అక్కడే దాని చర్చ పేజీలో మద్దతును ప్రకటించవలసినది. ఈసరికే కొందరు మద్దతు ప్రకటించారు. ఇంకా దాన్ని చూడని వాళ్ళ కోసం ఈ పిలుపు. __ చదువరి (చర్చరచనలు) 13:43, 16 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:59, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాద పరికరంలో మానవీయ అనువాదపరిమితి తగ్గింపు - పురోగతి

మార్చు

అనువాద పరికరంలో మానవీయ అనువాదపరిమితి తగ్గింపు గురించి మనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వెంటనే, ఈ విషయమై డెవలపర్లను అడిగాను. ఆ లింకు ఇక్కడ ఉంది.ఇప్పటికి రెండు సార్లు వాళ్ళకు గుర్తు చేసాను. రెండు రోజుల్లో దీనిపై పురోగతి లేని పక్షంలో మీరు కూడా అక్కడ రాయవలసినది. __ చదువరి (చర్చరచనలు) 00:28, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 17 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ closed this task as Resolved అని ఉండండి. ఒకసారి పరిశీలించండి. V.J.Suseela (చర్చ) 09:30, 22 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక విశేషం

మార్చు

తెలుగు వికీపీడియాలో ఇప్పటి వరకు వెయ్యికంటే ఎక్కువ వ్యాసాలు రాసిన వారి జాబితా ఇది. ఈరోజు ఇదయం 7 గంటలకు తీసిన జాబితా. ఒక విశేషం ఏమిటంటే, అన్నిటికంటే పైనున్న వినయ్ కుమార్ గౌడ్ గారు 10,000 వ్యాసాల సంఖ్యను చేరుకున్నారు.

రోజుకో వ్యాసం చొప్పున 100 రోజులు రాయడం సాధ్యమేనా అని అనుకునేవాణ్ణి నేను. రోజుకు ఒకటి కాదు, పది వ్యాసాలు రాయొచ్చని, 100 రోజులు కాదు, విడవకుండా వరసబెట్టి ఏళ్ళ తరబడి రాయొచ్చనీ నిరూపించారు వినయ్ గారు. అలాగని నాణ్యత విషయంలో అయన రాజీ పడలేదు. ఆయనకు అభినందనలు.

Batthini Vinay Kumar Goud 10000
Pranayraj1985 7029
Rajasekhar1961 5170
Chaduvari 3582
YVSREDDY 2358
K.Venkataramana 2070
స్వరలాసిక 2039
వైజాసత్య 1821
Bhaskaranaidu 1516
యర్రా రామారావు 1461
Muralikrishna m 1428
Divya4232 1288
T.sujatha 1248
JVRKPRASAD 1210
రవిచంద్ర 1202

చదువరి (చర్చరచనలు) 03:46, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో 10,000 వ్యాసాల సంఖ్యను చేరుకున్న @బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:03, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@10K బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు..!! Muralikrishna m (చర్చ) 07:56, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@వినయ్ కుమార్ గౌడ్ గార్కి అభినందనలు యర్రా రామారావు (చర్చ) 09:43, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@వినయ్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు V.J.Suseela (చర్చ) 12:42, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలో 10,000 వ్యాసాల సంఖ్యను చేరుకున్న బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారికి అభినందనలు.➤ కె.వెంకటరమణచర్చ 16:02, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు గౌడ్ గారు... ప్రభాకర్ గౌడ్చర్చ 15:33, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/చర్చావేదిక, వికీసోర్స్ కు గ్రంథాలయ సర్వస్వం

మార్చు

సభ్యులకు నమస్కారం
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరపున కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. అవి తెవికీ బడి, ప్రాజెక్ట్ సురవరం ఇతర శిక్షణా కార్యక్రమాలు ఇంకా ...
అయితే యూజర్ గ్రూప్ కార్యాచరణకు వీలుగా అనుసరించవలసిన ప్రక్రియలు గురించి చర్చించేందుకు వీలుగా పవన్ గారి సలహా మీద యూజర్ గ్రూప్ పేజీ కి అనుబంధంగా ఒక చర్చావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు పరిశీలించవలసినదిగా కోరుతున్నాను.
ఇంకొక విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం(APLA) ప్రచురించే గ్రంథాలయ సర్వస్వం పత్రిక డిజిటల్ ప్రతులను వికీసోర్స్ కు ఇచ్చే ప్రక్రియ గురించి చర్చావేదికలో ప్రతిపాదన పెట్టడం జరిగింది. సభ్యులు పరిశీలించి తమ అభిప్రాయాలు తెలుపవలసినది.
ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 13:12, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:53, 18 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నా చిన్నపుడు ఈ పత్రికను లోకల్ లైబ్రరీ అథారిటీ వారి గ్రంథాలయాల్లో చూసేవాడిని. అప్పుడు పాతూరి నాగభూషణం గారు సంపాదకులుగా ఉండేవారు. మంచి విలువైన వ్యాసాలతో నిండి ఉండే ఈ పత్రిక నిరాటంకంగా నడుస్తూవుండటం ముదావహం. మంచి ప్రక్రియ. నేను మద్దతు ప్రకటిస్తున్నాను. --Ramesam54 (చర్చ) 06:38, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. ఇప్పటికీ ఆ పత్రిక పౌర గ్రంథాలయాలకు పంపిణీ జరుగుతుంది.డా.శారద గారు వారి అమ్మాయి. V.J.Suseela (చర్చ) 08:45, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • సభ్యులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం(APLA) ప్రచురించే గ్రంథాలయ సర్వస్వం పత్రిక డిజిటల్ ప్రతులను వికీసోర్స్ కు ఇచ్చే ప్రక్రియ గురించి చర్చావేదికలో ప్రతిపాదన పెట్టడం, అనుకూల స్పందన రావడంతో సంఘంనుంచి 11 సంపుటాలు (71 PDF ప్రతులు) అందుకోవడం జరిగింది. సహకరించిన సభ్యులందరికి ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 12:07, 20 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వి ఎన్ ఆర్ కళాశాల లో వికీపీడియా కార్యశాల

మార్చు

సముదాయ సభ్యులకి నమస్కారం,

ఇటీవల వికీలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి తెవికీ యువ సహాయంతో ఒక కార్యక్రమానికి వికీమీడియా వారి నుండి గ్రంటూ తీసుకున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ గ్రాంటూ లో చెప్పిన విధంగా రెండు రోజుల పాటు వి యన్ ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలలో మహిళల, అన్య లింగాల భాగస్వామ్యం పెంచే విధంగా  జూన్ 20,21 తారిఖుల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాను.

ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న తెవికీ యువ సభ్యులకు, సహాయ సహకారాలు అందిస్తున్న సముదాయ సభ్యులకు నా ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 04:58, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@V Bhavya గారూ, అభినందనలు. ఏ విధంగా సాయపడవచ్చో చెప్తే ఇతర సముదాయ సభ్యులు కూడా చేతనైనంత సాయం చేయగలరు. పవన్ సంతోష్ (చర్చ) 06:23, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు భవ్య గారు. మీ కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను. V.J.Suseela (చర్చ) 14:36, 20 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం, అభినందనలు V Bhavya గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:00, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మీ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను, భవ్య గారూ. __ చదువరి (చర్చరచనలు) 06:34, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష వ్యాసాల శిఖరారోహణ

మార్చు

తెవికీలో ఇప్పటికి 96,319 వ్యాసాలున్నాయి. త్వరలోనే లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకోబోతున్నాం. బహుశా మరో మూడు నెలల్లో దీన్ని అందుకుంటాం. మిగిలిన 3700 వ్యాసాలను రాయడంలో మనమందరం ఒక చెయ్యి వేద్దాం. ప్రస్తుతం అత్యధిక వ్యాసాలు రాస్తున్న మొదటి ముగ్గురూ (వినయ్ కుమార్ గౌడ్, ప్రణయ్ రాజ్, మురళీకృష్ణ గార్లు) కలిసి రోజుకు 20 వ్యాసాలు రాస్తున్నారు. మిగతా అందరం కలిసి ఒక ఏడెనిమిది రాస్తున్నాం. లక్షకు చేరుకునే క్రమంలో అందరం కలసికట్టుగా, సాముదాయికంగా కృషి చేసేందుకు లక్ష వ్యాసాల దిశగా ప్రగతి అనే ప్రాజెక్టు మొదలుపెట్టాను. అందరం చేయీ చేయీ కలిపి, ఆడుతూ పాడుతూ లక్షవ మెట్టు ఎక్కేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:22, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:59, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా చేద్దాము. పాలగిరి గారి సహాయంతో వృక్షశాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు వ్రాద్దామని నా ఆలోచన.--Rajasekhar1961 (చర్చ) 06:10, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారూ, తెలుగులో లేని కొన్ని వృక్షశాస్త్ర వ్యాసాల జాబితాలను పెట్టాను, చూడండి. ఇంకా ఏమైనా పెట్టాలంటే చెప్పండి, పెడదాం.__ చదువరి (చర్చరచనలు) 09:13, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి.నాకు వీలయినంత రాస్తాను. మెడ్ వికీ ప్రాజెక్ట్ లో తెలుగులో రాస్తున్నాను. ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 06:29, 21 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Voting to ratify the Wikimedia Movement Charter is now open – cast your vote

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello everyone,

The voting to ratify the Wikimedia Movement Charter is now open. The Wikimedia Movement Charter is a document to define roles and responsibilities for all the members and entities of the Wikimedia movement, including the creation of a new body – the Global Council – for movement governance.

The final version of the Wikimedia Movement Charter is available on Meta in different languages and attached here in PDF format for your reading.

Voting commenced on SecurePoll on June 25, 2024 at 00:01 UTC and will conclude on July 9, 2024 at 23:59 UTC. Please read more on the voter information and eligibility details.

After reading the Charter, please vote here and share this note further.

If you have any questions about the ratification vote, please contact the Charter Electoral Commission at cec@wikimedia.org.

On behalf of the CEC,

RamzyM (WMF) 10:52, 25 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వం పొందటానికి మార్గదర్శకాలు విధాన నిర్ణయ పేజీ

మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు పేజీలో విస్తృత చర్చ జరిగిన తరువాత వచ్చిన నిర్ణయంతో నిర్వాహకత్వం పొందటానికి మార్గదర్శకాలు విధాన నిర్ణయ పేజీ తయారుచేయబడింది.ఆ విధాన నిర్ణయపేజీలోని మార్గదర్శకాలకు లోబడి, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించటానికి ఆసక్తి ఉన్న వాడుకరులు స్వీయ ప్రతిపాదన చేసుకోగలరు. యర్రా రామారావు (చర్చ) 04:12, 26 జూన్ 2024 (UTC

ధన్యవాదాలు యర్రా రామారావు గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:35, 27 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ బడిలో OSM , మ్యాపుల పరిచయం, అభ్యాసం

మార్చు

సభ్యులకు నమస్కారం.

వచ్చే రెండు ఆదివారాలు అంటే జూన్ 30వ  తేదీన, జూలై 7వ తేదీన OSM (ఓపెన్ స్ట్రీట్స్ మాప్స్'), మ్యాపులు, గురించి పరిచయం, అభ్యాసం ఉంటాయి.

  • ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఉంటుంది. కాబట్టి సభ్యులు మధ్యాహ్నం 2గంకు గూగుల్ మీట్వేదికలో సమావేశము కావలసినది
  • శిక్షకులు అర్జున రావు గారు, సాయి ఫణి గారు మాపులు, OSM గురించి ఇవ్వబోయే శిక్షణ ముందు సభ్యులకు ఉండవలసిన సాంకేతిక అవగాహన కొరకు తెవికీ బడి పేజీలలో కొన్ని లింకులు ఇచ్చి సూచనలు చేశారు. వాటి వివరాల కొరకు తెవికీబడి/శిక్షణా కార్యక్రమాలు/13 ఇంకా 14 చూడగలరు.

ధన్యవాదాలు. తెవికీ బడి (తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్) V.J.Suseela (చర్చ) 07:38, 26 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:35, 27 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for May 2024

మార్చు
 

Dear Wikimedians,

We are pleased to present our May newsletter, showcasing the impactful initiatives undertaken by CIS-A2K throughout the month. This edition offers a comprehensive overview of our events and activities, providing insights into our collaborative efforts and community engagements.

In the Limelight
Openness for Cultural Heritage
Monthly Recap
Dispatches from A2K
Coming Soon
  • Future of Commons Convening

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 12:36, 27 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అగాధ పేజీలు - కొత్త పేజీలు

మార్చు

తెవికీలో అగాధ పేజీలు 126 ఉన్నాయి. అగాధ పేజీలంటే అస్సలు ఒక్క వికీలింకు కూడా లేని పేజీలు. తెవికీ వీటిని వ్యాసాలుగా పరిగణించదు. తెవికీ గణాంకాలు పేజీలో చూపించే వ్యాసాల సంఖ్యలో ("విషయపు పేజీలు") వీటిని లెక్కలోకి తీసుకోదు. అంటే వాస్తవంగా ఉన్న వ్యాసాల సంఖ్య కంటే, మనకు కనబడేవాటి సంఖ్య 126 తక్కువ. (విద్యుత్తు సరఫరాలో జరిగే ట్రాన్స్మిషన్ లాస్ వంటిదన్నమాట! ఎనర్జీ సేవ్‌డ్ ఈజ్స్ ఎనర్జీ జనరేటెడ్ లాంటి సూక్తి ఒకటుంది వాళ్లకి. అలాగే..) ఈ 126 వ్యాసాల్లో కనీసం ఒక వికీలింకైనా చేరిస్తే మన వ్యాసాల సంఖ్య 126 పెరుగుతుంది..ఈ తేడా గురించి మరింత ఇక్కడ చూడొచ్చు.__ చదువరి (చర్చరచనలు) 01:27, 29 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:31, 30 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీయులకు ఉత్తరం

మార్చు

లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకోబోయే సందర్భంలో పాత తెవికీయులందరినీ పిలిచి, ఈ ఉత్సవంలో భాగం పంచుకొమ్మని ఆహ్వానిద్దాం. ఈ ఆహ్వానాలను వారివారి ఈమెయిళ్ళకు పంపిద్దాం. వారి వాడుకరి చర్చ పేజీల్లో రాద్దాం. మెయిల్లో పాఠ్యం ఇలా ఉండొచ్చని నా ఊహగా రాసాను, చూడండి:


తెవికీకి ఘనంగా లక్షార్చన జరిపిద్దాం రండి!

_____గారూ,

చిట్టి పొట్టి మొలకగా మొదలైన తెవికీ, క్రమేణా బలమైన సమాచారంతో వేళ్ళూనుకుని, వ్యాసోపవ్యాసాలుగా ఎదిగి అనేక హంగులను సమకూర్చుకుంటూ, పుష్ఠిగా, ఒక దృఢమైన వృక్షంగా ఎదుగుతున్నదంటే.. మీవంటి తెవికీయుల కృషి దానికి కారణం. తెవికీ పల్లకీని మోసిన బోయీలు మీరు. తెవికీకి ఒక దశలో దిశా నిర్దేశం చేసి నడిపించిన నాయకులు మీరు. ఇక్కడ మీ కృషి అవసరం అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది.

మీవంటి ఎందరో వికీమీడియన్ల కృషితో తెవికీ, వందలూ వేల వ్యాసాల స్థాయిని దాటి, ఈ సంవత్సరం లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకోబోతోంది. ఆ సంతోష సమయంలో తెవికీలో విశేషమైన కృషి చేసిన వాడుకరులందరూ తెవికీలో చురుగ్గా ఉంటే ఆ సందర్భానికి మరింత విలువ చేకూరుతుంది అని మేం భావిస్తున్నాం. అంచేత మీకు పునస్వాగతం చెబుతూ ఈ ఉత్తరం రాస్తున్నాం.

త్వరగా రండి సార్.. లక్షకు చేరడానికి ఇంకో మూడు వేల వ్యాసాలను అధిరోహిస్తే చాలు. ఇంకెంత.. ఇంకో మూడు నెలల్లో ఈ కాస్తా ఎక్కేస్తాం. మీరు కూడా వస్తే ఇంకాస్త ముందే చేరుకోవచ్చు.

రండి, అందరం కలిసి తెవికీని అక్షరలక్షలతో అభిషేకిద్దాం. ఇట్లు తెవికీయులు


దీనిపై మీమీ అభిప్రాయాలు చెప్పండి. మార్పుచేర్పులు చెయ్యండి. __ చదువరి (చర్చరచనలు) 03:41, 29 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీకి ఘనంగా లక్షార్చన జరిపిద్దాం..! కదిలి రండి..!! మీ ఆహ్వానం బాగుంది. అందరూ చేరితే చివరి బంతికి సిక్సర్ కొట్టిన అద్భుతమైన అనుభూతి ఉంటుంది. Muralikrishna m (చర్చ) 04:57, 29 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పాత తెవికీయులందరినీ పిలిచి, ఈ ఉత్సవంలో భాగం పంచుకోవడానికి ఆహ్వానం అందించాలన్న మీ ఆలోచన బాగుంది @Chaduvari గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:33, 30 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఏ క్షణాన్నైనా

మార్చు

ఈ 2024 జూన్ 4 వ తేదీ ఉదయం 6:52 సమయాన, తెలుగు వికీపీడియా 97,028 వ్యాసాలతో, మరాఠీ వికీపీడియా 97,029 వ్యాసాలతో ఉన్నాయి. మనం మరాఠీని బహుశా ఇంకొద్ది సేపట్లో దాటేస్తాం. మరొక్క వ్యాసం రాస్తే సమానం, రెండోది రాస్తే ముందంజ. ఇండిక్ వికీల్లో 5 వ స్థానానికి వెళ్తాం. __ చదువరి (చర్చరచనలు) 01:25, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దాటేశాం @Chaduvari గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:02, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  చదువరి (చర్చరచనలు) 06:10, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
👍 యర్రా రామారావు (చర్చ) 06:35, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, గణాంకాలు పేజీలో ఇంకా మనల్ని మరాఠీ వెనుకనే చూపిస్తోంది. ఆ గణాంకాలను ఇంకా తాజాకరించలేదు. ఇది ఆటోమాటిగ్గా జరిగే పని. గరిష్ఠంగా 4 గంటలు పడుతుందంట. __ చదువరి (చర్చరచనలు) 06:27, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2024 ప్రచార ఆలోచన

మార్చు

వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫోటోస్ (#WPWP) కోసం 5వ వార్షిక ప్రచారం సందర్భంగా, తెలుగు రాష్ట్రాలలోని వివిధ గ్రామాల ఫోటోలను , ఇతర తెలుగు సంప్రదాయం, సంస్కృతికి సంబంధించిన వారి మొబైల్ (Exif data with GPS) తో తీసిన ముఖ్యమైన ఫోటోలను వాటి వివరాలతో, వారినుండి CC0 అనుమతి ద్వారా సేకరించడానికి ఒక గూగుల్ ఫారంను రూపొందించాలని, అలా నమోదు చేసుకొన్న వారికి ఆయా ఫోటోలను వికీమీడియా కామన్స్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా, వికీపీడియా వ్యాసాలకు సంబంధించిన చిత్రాలను అందించడానికి, ఇందుకు కావలసిన అవసరం అయిన ప్రచారం, సాంకేతిక వనరులకు నేను బాధ్యత తీసుకోగలను, దీనికి వికీమీడియా ఫౌండేషన్ ద్వారా లేదా ఏవిధం అయిన స్పాన్సర్ అవసరం లేకుండా మన సభ్యుల సహకారంతో పూర్తి చేయగలము అని తలుస్తున్నాను, ఈ విషయం మీద ఏవైనా ఆలోచనలు లేదా సూచనలు ఉంటే,దయచేసి వాటిని వచ్చే ఆదివారం నాటికి తెలియజేయగలరు. Kasyap (చర్చ) 05:36, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, బాగుంది ఆలోచన, కానివ్వండి. __ చదువరి (చర్చరచనలు) 06:33, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ మంచిది. కానివ్వండి. బాగుంది. యర్రా రామారావు (చర్చ) 12:01, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyapగారూ, నిజానికి చాలామంది వారివారి మొబైల్స్ లో విలువైన, అవసరమైన ఫోటోలు తీస్తుంటారు. అలాంటి వాటిని చూసినపుడు కామన్స్ లోకి ఎక్కించండి అని వారికి చెప్తుంటాం. కానీ వారు కామన్స్ లో చేర్చలేకపోతుండడం వల్ల ఆ విలువైన ఫోటోలు ఎవరికీ ఉపయోగపడడటం లేదు. అటువంటి ఫోటోలను CC0 అనుమతి ద్వారా సేకరించి, కామన్స్‌లో అప్‌లోడ్ చేయడమనేది మంచి ఆలోచన. అందుకు కావలసిన అవసరం అయిన ప్రచారం, సాంకేతిక వనరులకు బాధ్యతను తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇందులో నేను కూడా పాలుపంచుకుంటాను.
అలాగే, నాకు తెలిసిన చాలామంది నాటక, సినిమా, కళా రంగాలకు చెందిన ప్రముఖుల దగ్గర పాత ఫోటో కాపీలు ఉన్నాయి. వాటిని కూడా స్కాన్ చేసి కామన్స్‌లో అప్‌లోడ్ చేయాలన్నది నా అలోచన.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:23, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Kasyap గారు చక్కటి ఆలోచన,

వికీపీడియా పేజెస్ వాంటింగ్ ఫోటోస్ 2024 ప్రాజెక్టు ప్రస్తావన తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టుకి తెలుగు వికీలో ప్రత్యేక స్థానం కలదు, 2021 తెవికీని ప్రపంచపటంలో నిలబెట్టి ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తుంది, ఈ సంవత్సరం ఈ ప్రాజెక్టుకి బలం చేకూర్చేలా మీ కార్యాచరణ ఆలోచన బాగుంది, ఫోటోలు సేకరించడంలో మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము.

ఇక WPWP 2024 అంతర్జాతీయంగా జులై 1న మొదలైంది, ఇక మీ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చడానికి పగ్గాలు చేపడదాం.మేము ఏ విధంగా సహాయపడగలమో చెప్పండి. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:38, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సూచనలకు ధన్యవాదాలు.

Coordinate Me 2024 ఫలితాలు

మార్చు

మే నెలలో జరిగిన Coordinate Me 2024 పోటీ (పాత చర్చ) ఫలితాలు విడుదలయ్యాయి. బహుమతులు ప్రకటించిన 30 మందిలో 9 మంది భారతదేశ అంశాలపై కృషి చేశారు. వారిలో 5 గురు కేవలం భారతదేశ అంశాలపై మాత్రమే పనిచేశారు. నాకు తెలిసి, ఆంధ్రప్రదేశ్ అంశాలపై పనిచేసిన ఇద్దరికి అనగా నాకు, @Saiphani02 గారికి ఈ జాబితాలో చోటు దొరకడం విశేషం. తెలుగు వికీపీడియాలో కృషి చేసే @Kimeerat, @IM3847,@KINNERA ARAVIND,@యర్రా రామారావు,@Kasyap గారలు ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. విజేతలందరికీ అభివందనాలు. కార్యక్రమం నిర్వహించిన @Manfred Werner (WMAT) గారికి, ఆష్ట్రియా దేశ వికీమీడియా సంస్థకి కృతజ్ఞతలు. అర్జున (చర్చ) 09:43, 5 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పోటీలో విజేతలైన అర్జున గారికి, సాయిఫణి గారికీ, పాల్గొన్న ఇతరులకూ అభినందనలు.__ చదువరి (చర్చరచనలు) 08:54, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పోటీలో గెలుపొందిన అర్జునరావుగారికి, సాయిఫణి గారికి ఇతర సభ్యులకు అభినందనలు V.J.Suseela (చర్చ) 09:21, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పోటీలో విజేతలుగా నిలిచిన అర్జున గారికీ, సాయి ఫణి గారికీ అభినందనలు! -కిమీర (చర్చ) 10:30, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పోటీలో పాల్గొన్నవారికీ, విజేతలుగా నిలిచిన @Arjunaraoc, @Saiphani02 గార్లకు శుభాకాంక్షలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:33, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పోటీలో పాల్గొన్నవారికీ, విజేతలుగా నిలిచిన @Arjunaraoc, @Saiphani02 గార్లకు అభినందనలు. యర్రా రామారావు (చర్చ) 13:41, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన అర్జున, సాయిఫణి గార్లకి శుభాకాంక్షలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 15:42, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ లోకి PD-India లైసెన్సు గల దస్త్రాల ఎక్కింపు

మార్చు

తెవికీ లో ఉన్న దస్త్రాలలో PD-India లైసెన్సు (మూస:PD-India) గల దస్త్రాలను కామన్స్ లోకి ప్రస్తుతం ఎక్కించటం కుదరటంలేదు. ఉదా: దస్త్రం:Anandavani.jpg ను "Export to Wikimedia Commons" నొక్కి ప్రయత్నించండి. దీనికి కారణం, https://www.mediawiki.org/wiki/Extension:FileImporter/Data/te.wikipedia లో జాబితాలో ఈ లైసెన్సు లేకపోవడం. దీనికి ఎమైనా కారణాలు ఉన్నాయా? లేకా చేర్చవచ్చా? Saiphani02 (చర్చ) 19:25, 6 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Voting to ratify the Wikimedia Movement Charter is ending soon

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello everyone,

This is a kind reminder that the voting period to ratify the Wikimedia Movement Charter will be closed on July 9, 2024, at 23:59 UTC.

If you have not voted yet, please vote on SecurePoll.

On behalf of the Charter Electoral Commission,

RamzyM (WMF) 03:46, 8 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటుకు విజ్ఞప్తి

మార్చు

మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటుకు సంబంధించి రెండు అంశాలు (సముదాయ ఓటులో అభిప్రాయాలు, వీడియోకాల్ చర్చ అభిప్రాయం) ఇక్కడ చర్చా వేదికలో పవన్ సంతోష్ గారు ప్రవేశ పెట్టారు. సమయాభావం వలన రచ్చబండలో అందరికి తెలియచేయడమైనది.

  1. మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటు - అభిప్రాయాలు
  2. చర్చ కోసం వీడియో కాల్
  • సభ్యులు పై లింకులతో పేర్కొన్న మూవ్‌మెంట్ చార్టర్ డ్రాఫ్ట్ పరిశీలించి తమ అభిప్రాయాన్ని పైన రాయమని విజ్ఞప్తి చేస్తున్నాము.
  • సందేహాలుంటే పైన పేర్కొన్న వీడియో కాల్ లో పాల్గొని చర్చించి కూడా తమ అభిప్రాయాన్ని తెలుపవచ్చు.

సముదాయ ఓటు వేయడానికి 9 జులై 2024 రాత్రివరకు మాత్రమే సమయం ఉండడము వలన ఈ అంశాన్ని త్వరగా పరిగణనలోకి తీసుకొమ్మని కోరుతున్నాము. ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 13:55, 8 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఓటు నమోదు

మార్చు

మూవ్‌మెంట్ చార్టర్ అనుమోద (రాటిఫికేషన్) ప్రక్రియలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఓటు పైన వీడియో కాల్ చర్చలో పాల్గొని, పైన తమ అభిప్రాయలు తెలియచేసిన సభ్యులకు ధన్యవాదాలు. అభిప్రాయాలు పూర్తిగా అనుకూలము గానే వచ్చినందున ఆవిధముగానే ఓటు నమోదు నిన్న రాత్రి సుమారు 11.30 కి సముదాయ (Affiliate) ఓటు నమోదు అయినది. దాని స్క్రీన్ షాట్ ఇక్కడ పరిశీలించవచ్చు.

U4C Special Election - Call for Candidates

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello all,

A special election has been called to fill additional vacancies on the U4C. The call for candidates phase is open from now through July 19, 2024.

The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members are invited to submit their applications in the special election for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.

In this special election, according to chapter 2 of the U4C charter, there are 9 seats available on the U4C: four community-at-large seats and five regional seats to ensure the U4C represents the diversity of the movement. No more than two members of the U4C can be elected from the same home wiki. Therefore, candidates must not have English Wikipedia, German Wikipedia, or Italian Wikipedia as their home wiki.

Read more and submit your application on Meta-wiki.

In cooperation with the U4C,

-- Keegan (WMF) (talk) 00:03, 10 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మొన్న మరాఠీ, రేపు మలగేసి

మార్చు

తెవికీ ఈ మధ్య మరాఠీని దాటి 74 వ స్థానానికి చేరింది. ఇప్పుడు 73 వ స్థానంలో ఉన్న మలగేసి వికీపీడియాకు సుమారు రెండు రోజుల దూరంలో ఉన్నాం. కింది పట్టికలో ఈ క్షణాన 60 నుండి 75 వరకు స్థానాల్లో ఉన్న వికీపీడియాలను చూడవచ్చు. ఈ పట్టికలోని డేటా ఎప్పటికప్పుడు మారిపోతూ లైవు గణాంకాలను చూపిస్తూంటుంది. __

60 - 75 స్థానాల్లో ఉన్న వికీపీడియాలు
స్థానం వికీపీడియా వ్యాసాల సంఖ్య
60 తమిళము 1,68,997
61 థాయ్ 1,67,964
62 హిందీ 1,63,496
63 బంగ్లా 1,59,497
64 మాసిడోనియన్ 1,47,292
65 కాంటనీస్ 1,42,104
66 లాటిన్ 1,39,573
67 ఆస్టూరియన్ 1,36,769
68 లాట్వియన్ 1,30,664
69 ఆఫ్రికాన్స్ 1,19,463
70 తజిక్ 1,14,011
71 బర్మీస్ 1,08,477
72 తెలుగు 1,01,036
73 అల్బేనియన్ 1,00,434
74 మరాఠీ 98,337
75 మలగాసి 98,272

చదువరి (చర్చరచనలు) 03:54, 14 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మలగేసిని దాటేసాం.__ చదువరి (చర్చరచనలు) 09:38, 15 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Chaduvari గారు, ఈ నెలలోనే అల్బేనియన్ ని కూడా దాటేసి, 72వస్థానంలో నిలుస్తామనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:24, 15 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
దాటకపోయినా, బాగా దగ్గరగా నైతే వెళ్తాం.__ చదువరి (చర్చరచనలు) 01:37, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా కామన్స్ లో తెలుగు ఫోటోగ్రాఫర్ల పతిభ

మార్చు

సభ్యులకు నమస్కారం, ఈ రోజు వెలువడిన వికీ కామన్స్ పోటీ ఫలితాల గురించి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/చర్చావేదికలో ఒక సంద్శాన్ని చేర్చాను. అక్కడ చర్చను కొనసాగిద్దాం. IM3847 (చర్చ) 14:19, 15 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @IM3847 గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:29, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్వికీలో తెలుగువారి పేజీలు

మార్చు

ఆంధ్ర తెలంగాణ వ్యక్తులకు సంబంధించి తెవికీలో ఉన్న పేజీలు, వాటికి ఎన్వికీలో ఉన్న పేజీల సంఖ్య, అసలు వికీడేటాలో అంశమే లేని పేజీల గణాంకాలు కింది విధంగా ఉన్నాయి. అలాగే తమిళవికీలో తమిళనాడు వ్యక్తులు, మలయాళవికీలో కేరళ వ్యక్తులు, బెంగాలీవికీలో పశ్చిమ బెంగాల్ వ్యక్తుల పేజీల వివరాలు కూడా ఉన్నాయి. దీన్నిబట్టి కింది విషయాలు గ్రహించవచ్చు:

  • తెలుగువారి పేజీలు ఎన్వికీలో సాపేక్షికంగా తక్కువగా ఉన్నాయి. ఎన్వికీలో ఉన్న తెలుగువ్యక్తుల పేజీలు సగమే ఉండగా, మిగతా మూడు వికీల్లో ఇది 66 నుండి 80 శాతం దాకా ఉంది. ఎన్వికీలో పనిచేయడంపై ఆసక్తి ఉన్నవారు ఆయా పేజీలను సృష్టించడంపై దృష్టి పెట్టవచ్చు.
  • తెవికీ లోని తెలుగువ్యక్తుల పేజీల్లో వికీడేటాలో అంశం లేని పేజీలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వికీడేటాలో వీటికి పేజీలు సృష్టించవచ్చు. పెట్ స్కాన్ ద్వారానే, క్విక్ స్టేట్‌మెంట్స్ ను వాడి వీటికి ఆటోమాటిగ్గా పేజీలు సృష్టించవచ్చు. అయితే, ఊరికినే పేరు సైట్‌లొఇంకు ఇచ్చి ఊరుకోకుండా, వీలైనన్ని ఎక్కువ లక్షణాలు ఇస్తే బాగుంటుంది. ఆసక్తి ఉన్నవారు వీటిపై పనిచెయ్యవచ్చు.

గమనిక: పై రెండు పనులు చేసే ముందు, ఎన్వికీలో ఈసరికే పేజీ ఉందేమో చూసుకోవడం ముఖ్యం. ఉంటే, లింకు కలిపేస్తే సరిపోతుంది.

ఈ వర్గాల్లోని పేజీలు ఎన్వికీలో పేజీలు

ఉన్నవి

ఎన్వికీలో పేజీలు

లేనివి

వికీడేటాలో అసలు

అంశమే లేనివి

మొత్తం పేజీల

సంఖ్య

వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు +

వర్గం:తెలంగాణ వ్యక్తులు

2410 (48.38%) (లింకు) 2571 (51.62%) (లింకు) 683 (లింకు) 5663 (లింకు)
వర్గం:தமிழ்நாட்டினர்

తమిళవికీలో తమిళ వ్యక్తులు

3200 (70.27%) 1354 (29.73%) 230 4784
കേരളീയർ

మలయాళవికీలో కేరళ వ్యక్తులు

2577 (66.23%) 1314 (33.77%) 77 3968
পশ্চিমবঙ্গের ব্যক্তি

బెంగాలీ వికీలో పశ్చిమ బెంగాల్ వ్యక్తులు

3761 (82.71%) 786 (17.29%) 66 4613

పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 06:03, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:29, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండి. నేను కూడా చేస్తాను V.J.Suseela (చర్చ) 13:36, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీడేటా అంశం లేని 666 పైచిలుకు పేజీలకు, క్విక్‌స్టేట్‌మెంట్స్ వాడి అంశాన్ని సృష్టించాను. పర్యవసానంగా, "వికీడేటాలో అసలు అంశమే లేనివి" సున్నా అయిపోగా, "ఎన్వికీలో పేజీలు లేనివి" ఆ మేరకు పెరుగుతాయి. __ చదువరి (చర్చరచనలు) 01:55, 24 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు వికీడేటా అంశం లేని 666 పైచిలుకు పేజీలకు, క్విక్‌స్టేట్‌మెంట్స్ వాడి అంశాలు సృష్టించినందుకు ధన్యవాదాలు.ఇదే పద్దతి ఇతర వ్యాసాలకు కూడా చేయవలసిన అవసరం ఉంది. యర్రా రామారావు (చర్చ) 02:38, 24 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ లో ఎక్కించిన ఫోటోలను తెవికీ పేజీల్లోకి చేర్చడం

మార్చు

సభ్యులకు నమస్కారం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకి, రవీంద్రభారతికి చెందిన ఫోటోలు కామన్స్‌లోకి విడుదల చేయడంకోసం నిర్వహించబడుతున్న ప్రాజెక్టు గురించి సముదాయ సభ్యులకు తెలిసిందే. ఆ ప్రాజెక్టులో భాగంగా నేటికి 2,700లకు పైగా (సంస్కృతి, వ్యక్తులు, కార్యక్రమాలు, ఇతరాలు) ఫోటోలు కామన్స్ లో చేర్చాను. వాటిని సంబంధిత వికీ పేజీల్లో చేర్చడంలో తెవికీ సభ్యుల నుండి సహకారం అవసరం. సభ్యులు ఆయా ఫోటోలను పరిశీలించి వికీ పేజీల్లో చేర్చవలసిందిగా కోరుతున్నాను.

కామన్స్ లో ఫోటోల కేటగిరీలు:

ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:26, 17 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimedia Movement Charter ratification voting results

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello everyone,

After carefully tallying both individual and affiliate votes, the Charter Electoral Commission is pleased to announce the final results of the Wikimedia Movement Charter voting.  

As communicated by the Charter Electoral Commission, we reached the quorum for both Affiliate and individual votes by the time the vote closed on July 9, 23:59 UTC. We thank all 2,451 individuals and 129 Affiliate representatives who voted in the ratification process. Your votes and comments are invaluable for the future steps in Movement Strategy.

The final results of the Wikimedia Movement Charter ratification voting held between 25 June and 9 July 2024 are as follows:

Individual vote:

Out of 2,451 individuals who voted as of July 9 23:59 (UTC), 2,446 have been accepted as valid votes. Among these, 1,710 voted “yes”; 623 voted “no”; and 113 selected “–” (neutral). Because the neutral votes don’t count towards the total number of votes cast, 73.30% voted to approve the Charter (1710/2333), while 26.70% voted to reject the Charter (623/2333).

Affiliates vote:

Out of 129 Affiliates designated voters who voted as of July 9 23:59 (UTC), 129 votes are confirmed as valid votes. Among these, 93 voted “yes”; 18 voted “no”; and 18 selected “–” (neutral). Because the neutral votes don’t count towards the total number of votes cast, 83.78% voted to approve the Charter (93/111), while 16.22% voted to reject the Charter (18/111).

Board of Trustees of the Wikimedia Foundation:

The Wikimedia Foundation Board of Trustees voted not to ratify the proposed Charter during their special Board meeting on July 8, 2024. The Chair of the Wikimedia Foundation Board of Trustees, Nataliia Tymkiv, shared the result of the vote, the resolution, meeting minutes and proposed next steps.  

With this, the Wikimedia Movement Charter in its current revision is not ratified.

We thank you for your participation in this important moment in our movement’s governance.

The Charter Electoral Commission,

Abhinav619, Borschts, Iwuala Lucy, Tochiprecious, Der-Wir-Ing

MediaWiki message delivery (చర్చ) 17:52, 18 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]