వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 30

పాత చర్చ 29 | పాత చర్చ 30 | పాత చర్చ 31

alt text=2013 డిసెంబరు 17 - 2013 డిసెంబరు 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 డిసెంబరు 17 - 2013 డిసెంబరు 31

తెవికీ నాణ్యత

మార్చు

నేను కొన్నేళ్లుగా జాగ్రత్తగా పరిశీలిస్తున్న సంఖ్య మొలకల శాతం. నేను దీన్ని గమనించడం ప్రారంభించినప్పుడు తెవికీలో మొలకలు 62 శాతం ఉన్నవి. (ఇక్కడ మొలకలంటే 200 అక్షరాల పైగాలోపు ఉన్నవి) అప్పుడు బాగా కృషి చేసి నలభై శాతం దిగువకు తేవాలని అనుకొన్నాం. ఇన్నేళ్ళకు ఆ సంఖ్య 39.26% కి చేరింది. అంటే మన వికీ నాణ్యత గణనీయంగా పెరిగిందనమాట. ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను అవగతం చేసుకోవాలంటే ఇతర భాషలతో పోల్చి చూడాలి. ఒకప్పుడు మనం నాణ్యతా పరంగా ఆదర్శంగా తీసుకొన్న తమిళ వికీ 33.69%, హిందీ వికీ 25%, ప్రస్తుతం భారతీయ భాషలన్నింటిలోనూ ఆదర్శప్రాయమైన మళయాళ వికీ 14.77% దగ్గర, ఆంగ్లవికీ 13.86% వద్ద ఉన్నాయి. నాకు ఈమధ్య ఏం జరుగుతుందో పెద్దగా అవగాహన లేని బెంగాళీ వికీ 8.85% శాతం వద్ద ఉన్నది.

ఇంకా అప్పుడు వ్యాసాల లోతు 1 ఉన్నది. ఇప్పుడు 20 అయ్యింది. :-) --వైజాసత్య (చర్చ) 03:29, 17 డిసెంబర్ 2013 (UTC)

  • మొలకల పర్యవేక్షణ కు మీరు రూపొందించి ఇచ్చిన బాట్ చాలా సహాయకారిగా ఉంది. అవగాహన వలన సభ్యులు మరింతగా ఈ దిశగా అడుగులు వేయడంలో మీ సహాయం చాలా పనికి వచ్చింది. అయితే లోతు పెంచడం కోసం ఆంగ్ల పేర్లతో రీడైరెక్షన్ గురించి ఆలోచించగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 04:08, 17 డిసెంబర్ 2013 (UTC)
  • వైజాసత్య గారు ఆనందించదగిన విషయాన్ని తెలిపారు. రహ్మానుద్దీన్ అన్నట్లుగా నెలవారీ మొలకల పర్యవేక్షణ చేయటం ఇందుకు కొంతలోకొంత దోహదపడిందనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇలాగే మన తెవికీని వాసి పరంగా రాసి పరంగా అభివృద్ధి బాటాలో సమిష్టిగా ముందుకు తీసుకుపోగలమని ఆశిస్తూ --విష్ణు (చర్చ)04:24, 17 డిసెంబర్ 2013 (UTC)
  • 200 అక్షరాల లోపు వున్నవని రాయాలని పొరబాటుగా పైగా అని రాశారా? ఏమైనా మొలకలశాతం తగ్గడం మంచి సూచన. నేను వికీలో రచనలు చేయడం పుస్తకానికై పరిశోధన చేసినపుడు తెవికీలో మొదట (అనువాదం కాని) వ్యాసం అని పేరున్న ఊరగాయ కనీసం వికీకరణకు కూడా నోచుకోకుండా వుండడం గమనించి నేను కొంత సరిచేశాను. కొత్త వ్యాసాల కన్నా, వున్న వ్యాసాల నాణ్యతను అభివృద్ది చేయటకు వికీప్రాజెక్టుల ద్వారా కృషి చేయడం మంచిది. ఇటీవల నేను చేసిన విశ్లేషణలో భాష మరియు సంస్కృతి పరంగా వీక్షణలు ఎక్కువగా వున్నాయి కాబట్టి వాటి వైపు మరియు సామాజిక ఉపయోగం ఎక్కువగా వుండే విద్య, ఉపాధి, ఆరోగ్యం లాంటి అంశాలపై వికీ ప్రాజెక్టులు చేపట్టటం మంచిదని నా ఆలోచన.--అర్జున (చర్చ) 04:45, 17 డిసెంబర్ 2013 (UTC)
ప్రతి నెల వైజాసత్య గారు మొలకల జాబితాను తయారుచేసి ఎవరికి వారుగాని, ఇతరులు గాని వాటిని వారం రోజులలో విస్తరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ అభివృద్ధి దాని ప్రభావమే. ఈ మధ్య దానిని నిలిపివేశారు. ఎందుకో తెలియదు. ప్రతినెల దానిని నిర్వహిస్తే తప్పకుండా తెవికీ ఇంకా అభివృద్ధి చెందుతుంది.Rajasekhar1961 (చర్చ) 05:45, 17 డిసెంబర్ 2013 (UTC)
  • విష్ణు గారు, నేను మొలకల శాతాన్ని ఎప్పటినుండి గమనిస్తున్నారని అడిగారు. 2007 అక్టోబర్ చివర్లో మన మొలకల శాతం 61.57% అని నా వాడుకరి పేజీలో నమోదు చేసుకున్నాను. 200 అక్షరాలు దాదాపు 800-1000 బైట్లు ఉంటాయి. --వైజాసత్య (చర్చ) 07:31, 17 డిసెంబర్ 2013 (UTC)
  • వ్యాసాల సంఖ్యే కాదు, వ్యాసాల పరిమాణం కూడా గణనీయంగా పెరిగింది. ఈ వికీపీడియా:1000 విశేష వ్యాసాల ప్రగతి పేజీ చూడండి. వెయ్యి విశేష వ్యాసాలు రూపొందాలంటే ముందు కనీసం వెయ్యి పది కేబీ పైబడిన వ్యాసాలు ఉండాలని ఈ గణాంకాలు సేకరిస్తూ వచ్చాను. 2012లో చివరిసారిగా ఈ గణంకాలు సేకరించినప్పుడు పది కేబీలు పైబడిన వ్యాసాలు 2682 ఉన్నాయి. కాబట్టి తెవికీ అభివృద్ధి చెందుతూనే ఉంది. కాకపోతే ఈ అభివృద్ధి వేగవంతం చెయ్యాలి అంతే. తెలుగు వికీపీడియాలో ముందుగా మరే వికీలో ఉండలేని, ఉండని వ్యాసాలుండాలి. తెలుగు భాషా, సాహిత్యం, సంస్కృతి ఇలాంటివన్నమాట. ఉదాహరణకి ఉత్పలమాలపై ఏ భాషలో వ్యాసమున్నా తెలుగు భాషలో చేయగలిగినంత న్యాయంచెయ్యలేరు. అలాంటివన్నమాట. విద్య, ఉపాధి మొదలైన వాటిపై కూడా వ్యాసాలు వ్రాయాలి కానీ కెరియర్ గైడెంస్ వ్యాసాలు కాకుండా జాగ్రత్తపడాలి. ప్రదేశాలపై వ్యాసాలుండవచ్చు కానీ ట్రావెల్ అడ్వైజరీలు, ట్రావెలాగులు తయారుచెయ్యకూడదు. అలాగే ఇదీనూ. --వైజాసత్య (చర్చ) 07:53, 17 డిసెంబర్ 2013 (UTC)
  • వైజాసత్య గారికి, విశ్లేషణ తాజా పరిచినందుకు ధన్యవాదాలు. 10 కెబీ పైన చేరిన వ్యాసాలలో సింహభాగం గూగుల్ అనువాద వ్యాసాలు(దాదాపు 1000) వుంటాయని నా అనుమానం. ఈ ప్రక్రియ తెలుగుకి దోహదపడిందా అవరోధమైందా అనే దానిపై విశ్లేషించవలసిన అవసరంకూడా వున్నది. అలాగే మీరు నాణ్యత పెంచడానికి చేసిన సూచనలు బాగున్నాయి.--అర్జున (చర్చ) 09:32, 17 డిసెంబర్ 2013 (UTC)
మొలకలు తగ్గటం మంచి పరిణామం. ఆనందింపదగ్గ విషయం. చిన్న వ్యాసాల విషయంలో "తెలుగు సినిమాలు" మరియు "గ్రామాల వ్యాసాలు" తొంభై శాతం (దాదాపు) వున్నాయి. వీటిలో సమాచారం ఎక్కిస్తే మొలకలను దాదాపు తగ్గించవచ్చని అనుకుంటున్నాను. మోడల్ గ్రామంలో గల ఫార్మాట్ ను తయారు చేసి అన్ని గ్రామాల వ్యాసాలలో బాట్ ద్వారా ఎక్కించే విధమేమైనా వున్నదా? అలా చేస్తే వాడుకరులు, సభ్యులు, ఆయా వ్యాసాలలో విషయాలను పొందుపరచడానికి అవకాశం ఉంటుందేమో కొంచం సూచించండి. అహ్మద్ నిసార్ (చర్చ) 15:54, 17 డిసెంబర్ 2013 (UTC)

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు

మార్చు

https://docs.google.com/file/d/0BxbmFOiPGyZ1UVQwd1RaVTl5RWM/edit వద్ద ఉన్న బిల్లును తెలుగులో అనువదించి ఉంచితే బావుంటుంది. ఇది వికీసోర్స్ లో ఉంచి ఇక్కడ అనువాదం ఊంచుదామా, లేక వికీపీడియాలో వ్యాఖ్యలు, దృక్కోణాలతో కూడుకున్న వ్యాసం సృష్టించినపుడు, మూలపాఠ్యంలో కొంత భాగం అక్కడ చేర్చుదామా? రహ్మానుద్దీన్ (చర్చ) 04:05, 17 డిసెంబర్ 2013 (UTC)

  • అనువాదమైన ప్రతులు టీవిలో కనబడుతున్నాయి కదా అవి యూనికోడ్ లో సంపాదించే ప్రయత్నం చేయడం మంచిది.--అర్జున (చర్చ) 04:40, 17 డిసెంబర్ 2013 (UTC)
  • టీవీలో కనిపించేది ప్రతి ఒక్కటీ యూనికోడ్ అని మీరనుకుంటున్నారా? రహ్మానుద్దీన్ (చర్చ) 14:37, 17 డిసెంబర్ 2013 (UTC)
  • బిల్లును సంగ్రహంగా 57 పేజీలలో అనువాదం చేసిన తెలుగు ప్రతి నమస్తే తెలంగాణ దినపత్రిక వెబ్‌సైట్లో ఉంది. అది పీడీఎఫ్ ఫార్మట్‌లో (యూనికోడ్‌లో) ఉన్ననూ యూనికోడ్ అక్షరాలు మాత్రం కాపీ కావడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:35, 17 డిసెంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారికి, లేదండి. కాని ఇటీవలి కాలంలో పత్రికా మరియు టీవి మాధ్యమాలతో మీకు ఇతరులకు సంబంధాలున్నాయి కాబట్టి మూలప్రతి నుండి యూనికోడ్ పాఠ్యం తెచ్చుకోవటం లేక మీరు పిడిఎఫ్ నుండి యూనికోడ్ పాఠ్యం చేసిన అనుభవం వుంది కాబట్టి అలాగైనా మీరు ప్రయత్నించుతారనుకుంటున్నాను. ఇప్పటికే డిజిటల్ (బొమ్మ కాని) రూపంలో వున్న విషయాలకు వికీసభ్యుల సమయం వినియోగించడం అంత సదుపయోగం కాదనుకుంటాను. --అర్జున (చర్చ) 05:26, 18 డిసెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే అది యూనికోడ్ లేదా బొమ్మ కాని పీడీఎఫ్ లో ఉందని మీరు గ్రహిస్తే ఆ ప్రతిని మీరు పంచుకోగలరు, లేదా మీరే అందివ్వగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 07:23, 26 డిసెంబర్ 2013 (UTC)

విషయచేర్పులో ఆటంకాలు

మార్చు

వ్యాసాలు రాసే సందర్భాల్లో చాలా సార్లు, కొత్తగా వ్యాసం సృష్టించాక, విషయాన్ని ఆ వ్యాసంలో జోడిస్తున్నపుడు కొందరు సభ్యులు Hotcat ద్వారా వర్గాలను చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేసే సందర్భాల్లో అసలు విషయం రాసే సభ్యుల వ్యాస విషయం దిద్దుబాటు ఘర్షణ వలన పోతోంది, అప్పటి వరకు చేసిన శ్రమ అంతా వృథా అవుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తోటి సభ్యులు సహకరించమని మనవి. రహ్మానుద్దీన్ (చర్చ) 18:20, 17 డిసెంబర్ 2013 (UTC)

ఇది కేవలం హాట్‌కాట్ తో ఏర్పడే సమస్య కాదు. ఎవరైనా ఏదైనా వ్రాసున్నా దిద్దుబాటు ఘర్షణ ఏర్పడుతుంది. అంతమాత్రాన మీరు వ్రాసినది ఎక్కడికీ పోదు. శ్రమవృధా కాకుండా దిద్దుబాటు ఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా పరిష్కరించాలో సహాయం:దిద్దుబాటు ఘర్షణ లో ఉన్నది చూడండి. --వైజాసత్య (చర్చ) 11:45, 18 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారానికి ప్రతిపాదిత సభ్యులకు అభ్యర్ధన

మార్చు

వికీపీడియా:దశాబ్ది_ఉత్సవాల_వికీ_పురస్కార_ఎంపిక/ఆరవ_స్కైప్_సమావేశం_నివేదిక లోనివేదించిన ప్రకారం, పురస్కారానికి ప్రతిపాదిత సభ్యులందరూ తమ ఛాయాచిత్రాలను వికీలో ఎక్కించి వాడుకరి పేజీలో పెట్ట వలసిందిగా కోరడమైనది. ఎంపిక మండలి తరపున, ఎంపిక మండలి కార్యదర్శి, --అర్జున (చర్చ) 05:50, 18 డిసెంబర్ 2013 (UTC)

వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక) ముద్రణకు వికీతీరులో ప్రతి సిద్ధం

మార్చు

వికీపీడియాలో రచనలు చేయుట (2013 సంచిక) వికీతీరు ప్రతి సిద్ధమైనదని తెలుపుటకు సంతసించుచున్నాను. దీనికి వికీమీడియా ఫౌండేషన్ నుండి సహాయం అందించిన User:Sage Ross (WMF) మరియు User:Ldavis_(WMF) కు మొదటిగా అభినందనలు. దీనికి రకరకాలుగా సహకరించిన సహసభ్యులకు ధన్యవాదాలు. ప్రధానంగా అనువాదంలో సహకరించిన వాడుకరి:T.sujatha, వాడుకరి:Bhaskaranaidu, వాడుకరి:రహ్మానుద్దీన్ , వాడుకరి:అహ్మద్ నిసార్, వాడుకరి:విశ్వనాధ్.బి.కె. లకు ధన్యవాదాలు. ఫోటోలు వాడుటకు అనుమతి నిచ్చిన సభ్యులు వాడుకరి:Bhaskaranaidu ,వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:విశ్వనాధ్.బి.కె. , వాడుకరి:అహ్మద్ నిసార్ మరియు తెలుగు వికీ అభివృద్ధికి కృషి చేసి క్రియాశీలంగా వున్న మరికొందరి సభ్యులువాడుకరి: Rajasekhar1961, వాడుకరి:వైజాసత్య, వాడుకరి:C.Chandra Kanth Rao, వాడుకరి:రహ్మానుద్దీన్ మరియువాడుకరి:Visdaviva ఫోటోలను తెవికీ ప్రతినిధులుగా స్వతంత్రించి (కొన్ని సార్లు స్థానిక బొమ్మలను కామన్స్ లోకి తరలించి స్థానిక కాపీని తొలగించి వాడడం జరిగింది.) ఏమైనా అభ్యంతరాలుంటే ఆయా పేజీలలో తెలపండి. కొత్త ప్రతి తెలుగు అనుసరణ పాఠ్యం, బొమ్మలు, కూర్పుపై వికీ సహ సభ్యుల స్పందనలు మరియి ఇప్పటికే కృషి చేస్తున్నా ఇది చదవటం ద్వారా తెలిసిన విషయాలేవైనా ఆయా చర్చాపేజీలలో (మొత్తం ప్రతి పై క్రితం ఇచ్చిన వ్యాసంలింకు చర్చాపేజీలో, ఒక్కొక్క పేజీకి సంబంధించిన స్పందనలు ఆయా పుట చర్చాపేజీలలో 22 డిసెంబర్ లోగా చేర్చమని మనవి. ఈ కృషి వికీతీరులో మరియు ముద్రణా ప్రతి (తయారైనప్పడు) తెవికీని కొత్త వారికి పరిచయంచేయటం ఇంకొంత సులభమై తెవికీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 08:03, 19 డిసెంబర్ 2013 (UTC)

ఈ ప్రక్రియ ద్వారా తెవికీ అభివృద్ధికి నాకు తెలిసినది:ఆంగ్లంలో లాగా తెలుగులో కూడా ప్రదర్శిత వ్యాసాలకు పక్కపట్టీనుండి లింకు కల్పించి నిర్వహించితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:54, 22 డిసెంబర్ 2013 (UTC)
అర్జున గారు మీ కృషి అభినందనీయం. కాకపోతే ఇందులో మీదస్త్రం లేకపోవడం బాగోలేదు. ఒక లిమిట్లో దస్త్రాలు ఉండాలనే నియమం ఉంటే నా దస్త్రాన్ని తీసివేసి మీ దస్త్రం జత చేయమని మనఃపూర్వక నివేదన. --విష్ణు (చర్చ)10:55, 22 డిసెంబర్ 2013 (UTC)
  • విష్ణు గారి స్పందనకు ధన్యవాదాలు. వికీ తీరుకి పరిమితులు లేవు. ఇంకెవరిదైనా ఛాయాచిత్రాలను చేర్చదలుచుకుంటే చేర్చవచ్చు. నా పేరు చివరిపేజీలో గుర్తింపులు విభాగంలో వున్నది కాబట్టి వికీపీడియన్ల పేజీలో అవసరం లేదు. వికీ అభివృద్ధికి క్రియాశీలంగా వున్న మీ పేరు వుండడమే మంచిది. --అర్జున (చర్చ) 06:47, 23 డిసెంబర్ 2013 (UTC)

ఇంటర్నెట్ ఆర్కీవ్ కు విరాళమివ్వండి

మార్చు

మన తెలుగు వికీ ప్రాజెక్టులకు చాలా ఉపయోగపడుతున్న ఇంటర్నెట్ అర్కీవ్ విరాళాలను ఆహ్వానిస్తున్నది. మీరు చేసే విరాళమునకు మూడు రెట్లు ఇతరులు ఇస్తారు. కావున వీలున్నవారు (క్రెడిట్ కార్డు లేక డెబిట్ కార్డు) గల వారు మీ ఇష్టమైనంత విరాళ మివ్వమని కోరడమైనది. --అర్జున (చర్చ) 05:13, 22 డిసెంబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాల సంబందిత ఖర్చులకోసం - బ్యాంకు అకౌంట్ వివరాలు

మార్చు

దశాబ్ధి ఉత్సవాల సంబందిత ఖర్చులకోసం - బ్యాంకు అకౌంట్ వివరాలు . కార్యవర్గం సూచనను అనుసరించి ఇది కేవలం ఇది కేవలం సీఐఎస్ మరియు వికీమీడియా కోసం పేర్కొన బడినది , ఇది పబ్లిక్ కా ఇచ్చాను కాబట్టి నన్ను సంప్రదించ వలసిన వివరాలు పేర్కొన్నాను . ఇక విరాళాల విషయం పై దశాబ్ధి ఉత్సవాల కార్యవర్గం ను అనుసరించి నిర్ణయం తెలియపరుస్తాను  :*వాడుకరి:Kasyap, --కశ్యప్ 12:44, 25 డిసెంబర్ 2013 (UTC)

SB Account Name : KRUPAL PALIVELA

SB Account Number : 00000020185193783

IFS Code SBIN0015780

STATE BANK OF INDIA

LANCO HILLS BRANCH

PLOT NO 40 & 41,

LANCO HILLS ROAD,

MANIKONDA, RAJENDERNAGAR MANDAL,

HYDERABAD-500089

ప్రస్తుతం దీనిని దశాబ్ధి ఉత్సవాల సంబందిత ఖర్చులకోసం మాత్రమే వాడగలను, దీని బాలెన్సు, ఇంటర్నెట్ బ్యాంకింగు వివరాలు దశాబ్ధి ఉత్సవాల కార్యవర్గం మరియు ఇతర వికీ సబ్యులకు అబ్యర్దన పై అందుబాటులో ఉంచుతాను .

దీని మీద మీ సలహాలు సూచనలు కోరుతున్నాను. --కశ్యప్ 08:00, 24 డిసెంబర్ 2013 (UTC)

మీ ఖాతా వివరలను అందించినందుకు కృతజ్నతలు....విశ్వనాధ్ (చర్చ) 09:07, 24 డిసెంబర్ 2013 (UTC)
  • వాడుకరి:Kasyap, విశ్వనాధ్ గార్ల తాజాసందేశాలకు ధన్యవాదాలు. అయితే ఈ విధానం సరియైనది కాదని నా అభిప్రాయం. వికీకి సంస్థలరూపం లేనప్పడు ఇలా చేయడానికి ఏమైనా సహేతుకమైన కారణం వుందేమో కాని, వికీమీడియా భారతదేశం మరియు సిఎస్ఐ-ఎ2కె వికీ కార్యక్రమాలలో బాధ్యత తీసుకుంటున్నప్పుడు, విరాళాలను ఆయా లాభనిరపేక్ష సంస్థల ద్వారా తీసుకోవటం అన్ని విధాల మంచిది. ఎంత మొత్తమైనా, ఏ సంస్థనుండైనా తెచ్చుకొనటానికి. అలాగే ఆయా సంస్థలు స్థానికంగా విరాళాలు సేకరించే శక్తి పెంచుకోవడానికి, అలా తెచ్చుకొన్న విరాళాలన్నీ సద్వినియోగపరచబడ్డాయనడానికి సంస్థల విధానాల ప్రకారం జరిగే ఆడిట్, వికీ కార్యకలాపాలు సంస్థాపరంగా జరగటానికి బలాన్నిస్తాయి. పై ప్రతిపాదనను దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక వర్గం మరల ఆలోచించవలసిందిగా కోరుతున్నాను.--అర్జున (చర్చ) 10:20, 24 డిసెంబర్ 2013 (UTC)
  • కార్యవర్గం తరఫున సీఐఎస్ మరియు వికీమీడియా భారతదేశం అధికారులను సంప్రదించినపుడు బడ్జెట్ విషయమై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సీఐఎస్ వారు గరిష్టంగా 1.5 లక్షలు మరియు టీ-షర్టులకు అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపారు. వికీమీడియా భారతదేశం నుండి చాలా తక్కువ మొత్తం ఇవ్వగలమన్న సందేశం వచ్చింది. ఇంకా కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీమీడియన్ పురస్కారాన్ని భరించేందుకు ఇరు సంస్థలూ విముఖత చూపించాయి. అందువలన ఈ విషయమై విరాళాలు సేకరించాలని కార్యవర్గం నిర్ణయం జరిగింది. రహ్మానుద్దీన్ (చర్చ) 12:03, 25 డిసెంబర్ 2013 (UTC)
  • దీని విషయమై మరింత స్పష్టంగా చర్చించాల్సిఉన్నది. విరాళాలపరంగా ఇప్పటికీ కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కమిటీ నడుస్తున్నది. కనుక పైన తెలిపిన విషయాలపై ఉత్సవ కమిటీ మీటింగ్ తదుపరి వివరణ ఇవ్వగలం....విశ్వనాధ్ (చర్చ) 14:07, 25 డిసెంబర్ 2013 (UTC)
  • రహ్మానుద్దీన్ గారికి, నేను విరాళాలు ఏ విధంగా తీసుకుంటే మంచిది అన్నది మాత్రమే తెలిపాను. విరాళాలు ఎందుకు అడుగుతున్నారు అని వివరణ కోరలేదు. ఇక ఇంకొక విషయం, ఉత్సవాలకు అనుదానం చేసే వికీ సంబంధిత సంస్థలు, వికీమీడియన్ పురస్కారానికి అనుదానాన్ని ఎందుకు వినియోగించకూడదు అని షరతులు ఎందుకు పెడుతున్నాయో స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఇది ఏమైనా ప్రోత్సాహకాల గురించిన వికీ మూలసూత్రాలకు ఏమైనా భిన్నంగా వున్నదా? ఇది పూర్తిగా కార్యనిర్వాహక వర్గానికి దానికి తోడ్పడుతున్న సముదాయానికి సంబంధించిన విషయం. ఈ విషయాన్ని ఫోన్ సమావేశాలు, మరియు మెయిలింగు లిస్టులలో చర్చించినపుడు అటువంటి స్పందనలేమి సిఐఎస్ నుండి లేక వికీమీడియా భారతదేశం నాకు తెలిసినంత వరకు వ్యక్తంకాలేదు. --అర్జున (చర్చ) 03:42, 26 డిసెంబర్ 2013 (UTC)

పంచాంగంలో.. నవనాయకులు

మార్చు
ఆర్యా.....

పంచాంగంలో నవ నాయకులు నిర్ణయించే పద్దతి ఒకటున్నది. నవ నాయకులంటే (పంచాంగం ప్రకారం) 1.రాజు, 2.మంత్రి, 3.సేనాధిపతి, 4. సస్యాధిపతి, 5. ధాన్యాధిపతి, 6. అర్థాధిపతి, 7. మేఘాధిపతి, 8.రసాధిపతి, 9. నీరసాధిపతి అను తొమ్మిది మంది నాయకులుంటారు. ప్రతి సంవత్సరము పంచాంగంలో , సూర్యుడు, చంద్రుడు,బుదుడు, కుజుడు, శుక్రుడు .... .... .... .... మొదలైన వారు ఆయా వర్గాలకు నాయకులుగా వుంటారు ( అ సంవత్సరానికి) ఆ నాయకులను బట్టి ఆయా విషయాలపై వారి ప్రభావముతో ఫలితాలు ఏ విధంగా వుంటాయని పంచాంగంలో వ్రాస్తుంటారు గమనించే వుంటారు. . ఉదాహరణకు: కుజుడు ఒక సంవత్సరానికి రాజైతే.... దేశ వ్యాప్తంగా అగ్ని భయం ఎక్కువగా వుంటుంది, వర్షాలు తక్కువ, ఆహార పధార్తాల ధరలధికమౌతాయి, రాజకీయ నాయకులలో ఐక్యత వుండదు రోగ భయం .... ఇలా వ్రాస్తుంటారు. (అనగా.. కుజుని ప్రభావము దేశం మీద వుంటుండని అర్థము. ఇది దేశానికి సంబందించినది, వ్యక్తులకు కాదు.) ... .... .... ఇలా ఫలితాలను వ్రాస్తుంటారు. ఏ పంచాంగంలోనైనా నవ నాయకుల నిర్ణయించే పద్దతి ఒక్కటే. కాని ఆయా నాయకుల ప్రవర్థన, వారిని ఆర్థం చేసుకొని విశ్లేషించే విధానంలో పంచాంగ కర్థల ప్రజ్ఞ కనబరుస్తారు). ఈ విధంగా ప్రతి పంచాంగంలో ఆయా సంవత్సరాలకు పంచాంగం వ్రాస్తారు. ఈ విషయాన్ని వ్యాసాలుగా వ్రాయ వచ్చునా? తెలుప గలరు. కేవలం నవ నాయకుల నిర్ణయించే పద్దతి మాత్రమే... ఆయా ఫలితాలు క్లుప్తంగా.... అలా వ్రాయాగా పెద్ద వ్యాసాలు 9 కాగలవు. అలాకాకుండా ఆ తొమ్మిదిమంది నాయకులుగా మారుతుంటారు కనుకు 81 చిన్న వ్యాసాలు కాగలవు. వీటిని వ్యాసాలుగా వ్రాయ వచ్చునా తెలుప గలరు. ....... ముందుగా ఒకవ్యాసం వ్రాస్తాను. ఉదాహరణగా.... దాన్ని గమనించి బాగుందనుకుంటే.... వ్రాస్తాను. లేదనుకుంటే.... దానిని తొలిగించండి. Bhaskaranaidu (చర్చ) 14:45, 25 డిసెంబర్ 2013 (UTC)

Bhaskaranaidu గారికి, వికీ ఏదీ రాయొచ్చు ఏదీ రాయకూడదని తేల్చటానికి చాలా కొద్ది విధానాలు మాత్రమే వున్నాయి. వికీలో మీరు చేసిన రచనలు గమనించి నేనొక సలహా ఇవ్వదలుచుకున్నాను. వికీలో మౌలిక పరిశోధనలు నిషిద్ధం. కనుక మీరు తెలుగు విశ్వవిద్యాలయం నడుపుతున్న జ్యోతిషశాస్త్ర కోర్సు పుస్తకాలు లేక అధ్యయన సామాగ్రినో లేక ఇతరత్రా తెలుగు లేక ఆంగ్లంలోగల సంబంధిత పుస్తకాలను ఆధారంగా చేసుకొని మరియు వాటిని పేర్కొంటూ వ్యాసాలు చేయటం మంచిది. అయితే వ్యాస పరిమాణంపరిమితులను దృష్టిలో వుంచుకొని చిన్న వ్యాసాలు రాయటమే మంచిది. ఇక మీరు దీనిని ఇతరులకు అధ్యయన వనరుగా చేయాలనుకుంటే వికీబుక్స్ లో రాయటం మెరుగు. మీరు ఎలా రాసినా తదుపరి ఈ వ్యాసాలతో ఒక ఎలెక్ట్రానిక్ బుక్ తయారు చేయాలంటే వికీలోని కలెక్షన్ ఎక్స్టెన్షన్ చాలా ఉపయోగపడుతుంది --అర్జున (చర్చ) 03:54, 26 డిసెంబర్ 2013 (UTC)

సమూహం పేరున సమూహ ప్రమేయం లేకుండా వేరే చోట్ల మాట్లాడటం

మార్చు

ఈ మధ్య ఒక సభ్యుడు సమూహ ప్రమేయం లేకుండా సమూహాన్ని ప్రాతినిధ్యం చేస్తూ కొన్ని సందర్భాలలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా సమూహంలో చర్చించకుండా సొంత అభిప్రాయ సేకరణ కోసం సమూహ ప్రతినిధిత్వం తీసుకోవటం ఎంత వరకు సబబు, ఇతర సభ్యులు మాత్రమే స్పందించగలరు. -రహ్మానుద్దీన్ (చర్చ) 08:02, 26 డిసెంబర్ 2013 (UTC)

రహ్మానుద్దీన్ గారికి, ఈ రోజు మనం ముఖాముఖీ చర్చించినట్లు, రచ్చబండలో చర్చలు అందరికీ ఉపయోగం మరియు ఫలవంతమయ్యేదిశగా జరగాలంటే వ్యాఖ్యలలో సాధ్యమైనంత స్పష్టత వుండాలి. లేక పోతే మీ మనస్సులో వున్నది ఇతరులకు తెలియదు. అందువలన స్పష్టమైన దృష్టాంతాలతో రాయమని మనవి. ఇంతకు ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఇతరులు కూడా అప్పుడప్పుడు రాసేవారు. అప్పుడే ఇలా స్పందిద్దామని అనుకున్నాను. మనం ముఖాముఖి మాట్లాడుకోవడంతో ఈ వ్యాఖ్య రాయడం , అలాగే మీరు అర్థం చేసుకోవడం సులభమవుతున్నందున ఇప్పుడు రాస్తున్నాను. --అర్జున (చర్చ) 16:46, 26 డిసెంబర్ 2013 (UTC)
  • ఇక్కడ ఆ వ్యక్తి పేరు చేర్చటం అనవసరం. ఇలాంటి నిబంధన ఒకటి ఉంది, తోటి సభ్యులతో చర్చించాక లేదా సమూహానికి తెలిపాక మాత్రమే సమూహం పేరు వాడాలి లేదా ప్రతినిధిగా వ్యవహరించాలి అన్న విషయం ఇదివరకే తెలియక పోతే, ఇక మీదట తెలుసుకొని మసలగలరని ఆశిస్తున్నాను. ఇలా వ్యవహరించడానికి ఒక ఉదాహరణ మనం మాట్లాడుకున్నట్టు మీరు భారతదేశ వికీమీడియా మెయిలింగ్ లిస్ట్ లో సమూహంతో సంప్రదించకుండా సమూహానికి ప్రతినిధిగా సమూహం యొక్క ఆలోచనలన్నట్టుగా మీ ఆలోచనలుంచటం మరియు సమూహం పక్షాన సమూహేతరులను సలహా కోరడం. - -రహ్మానుద్దీన్ (చర్చ) 19:20, 26 డిసెంబర్ 2013 (UTC)
  • చర్చకు మరింత స్పష్టత కొరకు నేను వికీమీడియా భారతదేశ మెయిలింగు జాబితా కు పంపిన సందేశంసరణి చూడవచ్చు. ఈ సందేశాన్ని వికీమీడియా భారతదేశ సభ్యుల జట్టుకు మరి కొన్ని వికీ మెయిలింగు జాబితాలకు పంపినట్లు గమనించగలరు. దీనిపై రహ్మానుద్దీన్ గారు చెప్పినట్లు సహసభ్యులు స్పందించమని మనవి. స్పందనల తదుపరి నా వివరణకు రహ్మానుద్దీన్ అవకాశమిస్తే లేక సభ్యులు కోరితే నేను స్పందించగలను.--అర్జున (చర్చ) 03:45, 27 డిసెంబర్ 2013 (UTC)

వ్యాసాల తీసివేత, మరియు విలీనం విషయమై సమయఅవధి నిర్ణయం

మార్చు

వ్యాసాలు తొలగించేందుకు మరియు ఒకే విషయమై ఉన్న రెండు వ్యాసాలను విలీనం చేసేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి పాలసీ మనం పాటించడం లేదని నా అవగాహనకు వచ్చింది. అందువలన ఈ విషయమై సభ్యులు చర్చించి, అప్రమేయంగా ఇప్పుడు ఆయా సందర్భాల్లో పాటిస్తున్న ఏడు రోజులు, నెల రోజుల గడువులను పాటించగలమేమో నిర్ణయించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 21:52, 26 డిసెంబర్ 2013 (UTC)

చెత్తరాతలతో సృష్టించిన వ్యాసాలను తొలగించడానికి సమయ వ్యవధి అవసరం లేదు, వెంటనే తొలగించవచ్చు, సమాచారం ఉన్న వ్యాసాలను తొలగించనవసరం లేదు. విలీనం మూసలు ఉంచినంత వేగంగా, విలీనం చేయనవసరం లేదని తెలిసినను ఆ మూసలు తీసివేయరు, కావున విలీనం మూసలు తీసివేయడానికి సమయఅవధి నిర్ణయమవసరం. YVSREDDY (చర్చ) 07:01, 27 డిసెంబర్ 2013 (UTC)

మండలమునకు మరియు మండల కేంద్రమునకు వేరువేరు వ్యాసాలపై

మార్చు

శ్రీ అవధూత కాశి నాయన మండలంనకు మండల కేంద్రం నరసాపురం, ఇక్కడ మండలం పేరు, మండలం కేంద్రం పేర్లు వేరువేరుగా ఉన్నాయి. భూత్‌పూర్‌ మండలంనకు మండల కేంద్రం అదే పేరుతో ఉన్న భూత్పూరు, కాని దాదాపు మిగతా అన్నిచోట్ల మండలం మరియు మండల కేంద్రం ఒకేపేరుతో ఉన్నట్లయితే మండల వ్యాసంలోనే మండల కేంద్ర వ్యాసాన్ని వ్రాస్తున్నారు, కావున భూత్పూరు మండల కేంద్ర వ్యాసం ఆదర్శంగా మండల కేంద్రాలకు ప్రత్యేక వ్యాసాలు అవసరమేమో చర్చించగలరు. YVSREDDY (చర్చ) 07:31, 27 డిసెంబర్ 2013 (UTC)

నిజమే, మండలాల వ్యాసాలకు, మండల కేంద్రాలకు చెందిన గ్రామ వ్యాసాలకు వేరువేరు వ్యాసాలు అవసరమే. కాని ఇది మానవీయంగా కాకుండా బాటుద్వారా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మండల కేంద్రం వ్యాసాల పేర్లకు చివరన గ్రామం అని కాకుండా ఇప్పుడున్న పేర్లే మండల కేంద్రాలకు వర్తించాలి. మండలాల వ్యాసాలకు చివరన మండలము అని పేరు తగిలించాలి. (ఉదా:కు నాబ్లాగులో ఉన్నట్లుగా ధన్వాడ మండలము, ధన్వాడ) ఇలా చేయాలంటే తరలింపుల ద్వారా చేయవచ్చు కాని గ్రామ వ్యాసాలలో లింకులన్నీ మార్చాల్సి ఉంటుంది కాబట్టి దీనికి బాటే శరణ్యం. అలాగే అన్ని మండలాల కేంద్రాలకు అదే పేరు వర్తించకపోవచ్చు. ఉదా:కు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక మండలము పేరు ఫరూఖ్ నగర్ కాని మండల కేంద్రం మాత్రం షాద్‌నగర్. అలాగే నవాబ్ పేట పేరుతో మండలం ఉంది కాని ఆ పేరుతో రెవెన్యూ గ్రామం మాత్రం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:32, 27 డిసెంబర్ 2013 (UTC)

అనేక దిద్దుబాట్లు ఉన్న వ్యాసంలో ఏ సమాచారం ఎవరు వ్రాసారో తొందరగా గుర్తించే వీలుందా

మార్చు
  • ఒక వ్యాసంలో అనేక దిద్దుబాట్లు ఉన్నప్పుడు కొంత సమాచారం తీసుకొని ఈ సమాచారాన్ని ఎవరు వ్రాసారో తొందరగా తెలుసుకునేందుకు వీలుందా, ఉదాహరణకు వికీపీడియా:శైలిలోని ఈ క్రింది సమాచారాన్ని ఎవరు వ్రాసారు అని తెలుసుకోవడం ఎలా, అది తొందరగా.
  • పొడి అక్షరాలు రాసేటపుడు ఇలా రాయాలి:
ఎన్.టి.రామారావు, కె.బి.ఆర్.పార్కు. (అక్షరాలకు చుక్కకు మధ్య ఖాళీ లేకపోవడాన్ని గమనించండి.)
YVSREDDY (చర్చ) 12:53, 27 డిసెంబర్ 2013 (UTC)
  • పై వాక్యాన్ని చదువరి గారు ఈ దిద్దుబాటు ద్వారా చేర్చారు. దీనిని తెలుసుకోవడానికి పేజీ చరిత్రలో కొద్దికొద్దిగా పరిశీలిస్తూ పోతే తెలుస్తుంది. దీనికై తేలికైన మార్గం లేదు కాని దిద్దుబాటు చేసేటప్పుడు సారాంశంలో ఏమి మార్పులు చేశారో సంక్షిప్తంగా తెలిపితే తెలుసుకోవడం కొంతవరకు తేలికవుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:27, 27 డిసెంబర్ 2013 (UTC)
  • నేను కూడా కొంత కాలం క్రిందట ఇదే సమస్య గురించి పరిశోధించితే వికీబ్లేమ్ (వికీబ్లేమ్ ఉదాహరణ ) అనే ఉపకరణం ఉపయోగపడింది.మీరూ ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 03:42, 28 డిసెంబర్ 2013 (UTC)
  • చంద్రకాంతరావు గారికి, మరియు అర్జున గారికి ధన్యవాదములు, అర్జున గారు పరిశోధించి వెలికి తీసిన ఈ వికీబ్లేమ్ చాలా అద్భుతంగా ఉంది. YVSREDDY (చర్చ) 06:35, 28 డిసెంబర్ 2013 (UTC)

విషయం లేని వ్యాసాలు - లీలావతి కూతుళ్ళు

మార్చు

"లీలావతికూతుళ్ళు" ప్రాజెక్టులో వివిధ వ్యాసాలను సభ్యులు తయారు చేయడం జరిగినది. దానికి {{మూస:లీలావతి కూతుళ్ళు}} మూసను కూడా సృష్టించడం జరిగినది. అందులో కొన్ని వ్యాసాలు మూసతో మాత్రమే ఉన్నవి. ఎటువంటి విషయం కూడా లేదు. వాటిని తొలగిస్తే బాగుంటుందేమో చర్చించండి. ఎర్రలింకులు గల వ్యాసాలను ఎవరైనా విస్తరించే వీలుంది. ఎర్రలింకు లేనపుడు అవి విస్తరిత వ్యాసాలు అనుకొనే వీలుంది. ఒక వ్యాసం విస్తరించాలనుకొనే సభ్యుడు తాను వ్యాస ప్రారంభకుడుగా ఉండాలని భావిస్తాడు. ఎటువంటి సమాచారం లేని ఈ వ్యాసాలను విస్తరించే అవకాశం తక్కువ అని నా భావన.----కె.వెంకటరమణ (చర్చ) 17:16, 27 డిసెంబర్ 2013 (UTC)

తొలగించవచ్చు! -రహ్మానుద్దీన్ (చర్చ) 18:34, 27 డిసెంబర్ 2013 (UTC)
ఓ నెల రోజులు వేచి చూడండి, ఆతరువాత తొలగించడం గురించి ఆలోచిద్దాం. ఈ లోపల ఎవరైనా ఆ వ్యాసాలలో పాఠ్యం జోడించే అవకాశం ఉందేమో. అహ్మద్ నిసార్ (చర్చ) 20:59, 28 డిసెంబర్ 2013 (UTC)
  • అహ్మద్ నిసార్ గారూ సందర్భం ఏమిటంటే, లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు కింద సభ్యులు మహిళా శాస్త్రవేత్తలపై వ్యాసాలు సృష్టిస్తున్నారు. ఇందుకు వనరులు ఆంగ్లంలో లభ్యం, తర్జుమా చేసి రాయాలి. అయితే సుజాత గారు ఖాళీ పేజీలను సృష్టించి వదిలివేసారు. ఆమె ఆశయం సరియయినదే అయినా, ఆయా వ్యాసాలు సృష్టించిన వారికి కాకుండా ఈమెకు ఆ పేరెన్నిక పోతుంది. ఆ వ్యాసాలను కష్టపడి సృష్టించే వారికి అందుకు తగిన పేరు రాదు. సృష్టీంచింది ఎవరూ అని చూస్తే సుజాత గారి పేరు ఉంటుంది. సుజాత గారికి మూల్యాంకనం విషయమై అలా సృష్టించాల్సి వచ్చింది, అయితే నేను ఆవిడకు సరియయిన పద్ధతి చెప్పే లోపే ఆవిడ వ్యాసాలు సృష్టించేసారు. అవి ఆవిడ తొలగిస్తారేమో చూద్దాం, లేదా తొలగించి కొత్తగా పేజీలు రాసేవారికోసం చూద్దాం! --రహ్మానుద్దీన్ (చర్చ) 17:12, 29 డిసెంబర్ 2013 (UTC)
* సుజాత గారు వాటిని తప్పక అభివృద్ధి చేస్తారు. కొంచెం ఓపిక పట్టండి. సుజాతగారు పెద్ద వ్యాసాలూ వ్రాయడంలో దిట్ట. సమయం చూసి, వాటిని అభివృద్ధి పరుస్తారు. వ్యాసాలకిచ్చిన మూలాల్లో పి.డి.ఎఫ్. ఫార్మాట్ లో ఆయా శాస్త్రవేత్తల గూర్చి వున్నట్టు చూసాను. అందులో వారి ఫోటోలూ వున్నాయి. వాటిని వికీలో ఎక్కించవచ్చా? ఎలా ఎక్కించాలో కొంచెం తెలుపండి. అందరం తలా ఓ చేయి వేసి ఆ ప్రాజెక్టును సంపూర్ణం చేద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 18:18, 29 డిసెంబర్ 2013 (UTC)
    • సుజాత గారు ఇతర ప్రాజెక్టులో వ్యస్తంగా ఉన్నారు. పైగా అన్ని పేజీలూ ఆవిడ రూపొందించలేరు. అందుకని ఖాళీ పేజీలను తీసివేసి, కొత్తగా పూర్తి స్థాయి వ్యాసం రాసేవారు సృష్టిస్తే బావుంటుంది. అది మరలా సుజాత గారయినా సరే! ఇక బొమ్మల విషయానికొస్తే, ఫెయిర్ యూజ్ కింద అవి వికీపీడియా వరకూ (కామన్స్ కాకుండా) ఎక్కించవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:22, 29 డిసెంబర్ 2013 (UTC)
  • ఇదొక ప్రాజెక్ట్, ఇందులో పాల్గొనేందుకు నమోదైన సభ్యులూ వున్నారు. పాల్గొనేవారు 1.Rajasekhar1961 2. కె.వెంకటరమణ 3.విష్ణు 4.Pranayraj1985 5.విశ్వనాధ్ 6.t.sujatha 7.శ్రీధర్ బాబు 8.కిరణ్మయీ 9.రహ్మానుద్దీన్ . ఇందులో మీరూ వున్నారు. దీన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించాలి గాని, వ్యాసాలను (సమాచారం లేకున్ననూ) తొలగించడం బాగుంటుందా? ప్రారంభించిన వాళ్ళే పూర్తి చేయాలనీ లేదుగదా. కొన్నాళ్ళు ఓపిక పట్టండి, సుజాత గారు పూర్తి చేస్తారేమో. మనం ఈ చర్చా పేజీలో ఖర్చు పెట్టిన సమయం లో ఓ రెండు వ్యాసాలూ తయారయ్యేవి :-) అహ్మద్ నిసార్ (చర్చ) 19:03, 29 డిసెంబర్ 2013 (UTC)
    • కావచ్చు. కానీ ఒక విషయం - కొందరు సభ్యులకు-నాతో సహా, ఒక వ్యాసాన్ని మొదలుపెట్టేప్పుడు అది నేను సృష్టించినదయితే మరింత స్ఫూర్తితో రాస్తాను. సుజాత గారు మొదలుపెట్టిన అన్ని వ్యాసాలు ఆవిడ మూల్యాంకనం చేసుకునేందుకు పొరపాటున సృష్టీంచారే కానీ, అవి అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో కాదు. వాటిలో కొన్ని ఆవిడ అభివృద్ధి చేయవచ్చు. నాకు నేను, నేనుగా సృష్టించిన వ్యాసాలను అభివృద్ధి చేయటానికి ఇష్టపడతాను తప్ప ఇతరులవి కాదు. ఆయా పేజీలు సృష్టించి ఖాళీగా ఉంచి దాదాపు రెండు వారాలవుతుంది. ఈ ప్రాజెక్టు విషయమై ఈ నిర్ణయం, ఇది అన్నిటికీ వర్తించదు. ప్రాజెక్టుని త్వరిత గతిన పూర్తి చేస్తూ ఇతరులను చేయటానికి ఆహ్వానించాలంటే వాటిని ఎర్ర లంకెలుగా వదిలివేయాల్సింది. కానీ అలా కాలేదు కాబట్టీ, వాటిని తిరిగి ఎరుపు రంగుకి మార్చాలి (తొలగించాలి), మార్చాక ఎరుపు రంగు వ్యాసాలని అభివృద్ధి చేసేవారు ఎక్కువ మంది వస్తారు - అది నేరుగా మీరే గ్రహించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 19:43, 29 డిసెంబర్ 2013 (UTC)
గ్రహించాను, మీరు వ్రాయదలచే వ్యాసాలకు మొదట ఎర్రలింకులుగా మార్చి వాటిని తిరిగి ప్రారంభించి వ్రాయండి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:15, 29 డిసెంబర్ 2013 (UTC)
నేను మూల్యాంకనం కొరకు కానీ దిద్దుబాట్లు పెంచుకోవడానికి గానీ ఈ పని చేయలేదు. వ్యాసాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన లింకును సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇది చేసాను.
  • ఇంతవరకు నేను వ్రాసిన వ్యాసాలలో 90% నేను ప్రారంభించినవి కాదు. ముందుగా ఆరంభించిన వ్యాసాలను అభివృద్ధి చేసాను. అది వికీపీడియాలో కృషిలో భాగమనుకుని చేసాను.
  • ముందుగా వ్యాసాలను అభువృద్ధి చేస్తున్న తరుణంలో ఇతర సభ్యులు అభ్యర్ధన మీద లింకులు ఆయాపేజీలలో పెట్టాను. ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని అది చేసాను. ఖళీగా ఉన్న వ్యాసాలేవీ నావి కాఫు.
  • నిజానికి వికీపీడియాలో వ్రాసినవేవైనా బధ్రపరచిన వెంటనే వీకీపీడియాకు చెందుతాయి. ఎవీ సభ్యులపేరుతో నమోదు కావు. నేను చేసిన మార్పులు కూడా ఆయావ్యాసాలలో ఎక్కడో అడుగున ఉండిపోతాయి తప్ప వ్యాసం పూర్తి అయిన తరువాత నా పేరుకూడా ముందుగా కనిపించదు.
  • ఇక మీదట కూడా నేను వ్యాసాలను ఇలానే వ్రాస్తాను. నాకు ఎర్రలింకులతో పని లేదు. ఎవరు వ్రాస్తున్న వ్యాసాలలోనైనా వారికి అభ్యనతరం లేని ఎడల దుద్దిబాట్లు చేస్తాను. వికీపనితీరు అదే అని నాభావన..
  • శుద్ధి చేయడం, అక్షరదోషాలు సరిచేయడం వంటి అనేక పనులు ముందుగా వ్రాసిన వ్యాసాలలోనే చేయాలి.
  • జిల్లాల ప్రాజెక్టులో పనిచేసినప్పుడు అన్ని ముందుగా సేష్టించిన వ్యాసాలే విస్తరణ చేయబడ్డాయి. దేశాలకు, ప్రముఖ నగరాలకు వ్యాసాలు ప్రారంభం చేసి వదిలి వేసి ఉంటాయి. అవి చూసిన

సభ్యులు వాటిని విస్తరిస్తారు.

  • నా వ్యాసాలలో ఇతరులు దిద్దుబాట్లు చేసారంటే నేను ఆనందిస్తాను. ఎందుకంటే వ్యాసానికి ఆయా సభ్యులు గుర్తింపు లభించిందని భావిస్తాను.
  • నేను పనిచేసిన వ్యాసాలలో ఇతర సభ్యులు చేసిన అనేక దిద్దుబాట్లు ఉంటాయి. గమనించండి. ఈ పద్ధతిని నేను స్వాగతిస్తాను. వికీపీడియా అంటే సమిష్ఠికృషి అందరూ కలిసి అందరి కొరకు

పనిచేయడమే వికీపీడియా లక్ష్యం. ఇప్పుడు కూడా ఈ చర్చ వలన ఇబ్బంది పడి ఇది వ్రాయలేదు. వికీపీడియా గురించి అవగాహన కొరకు మాత్రమే వివరణ ఇస్తున్నాను.

  • అయినప్పటికీ ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తాను.--t.sujatha (చర్చ) 04:53, 31 డిసెంబర్ 2013 (UTC)
సుజాత గారు ప్రారంభించినవి విస్తరించకుండా వదిలేయటం ఎప్పుడూ నేను చూడలేదు. నియమాలలో పట్టు విడుపూ ఉండాలి. అందరూ కలిసి ఈ వ్యాసాలను విస్తరిద్దాం రండి. --వైజాసత్య (చర్చ) 14:06, 11 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను చేసుకున్న అధికారహోదా విజ్ఞప్తి వద్ద సభ్యులు స్పందించగలరు. - రహ్మానుద్దీన్ (చర్చ) 04:40, 28 డిసెంబర్ 2013 (UTC)

పురస్కారాల హడావిడిలో వీరి ప్రతిపాదనను ఎవరూ చూసినట్టు లేదు. స్వీయ ప్రతిపాదనతో రహ్మానుద్దీన్ గారు చక్కని సాంప్రదాయాన్ని ప్రారంభించారు. దయచేసి అందరూ తమ వ్యాఖ్యలను, సమ్మతిని లేదా అసమ్మతిని తప్పకుండా తెలియజేయండి. --వైజాసత్య (చర్చ) 03:37, 29 డిసెంబర్ 2013 (UTC)
రహమానుద్దీన్ గారి అధికార ప్రతిపాదనకు మనఃపూర్వక మద్దతు తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 06:21, 30 డిసెంబర్ 2013 (UTC)
రహమానుద్దీన్ గారి అదికార ప్రతిపాదనకు మద్దతు తెలియజేస్తున్నాను.--శ్రీరామమూర్తి (చర్చ) 17:27, 30 డిసెంబర్ 2013 (UTC)
రచ్చబండలో కాకుండా ఇక్కడ మీ అభిప్రాయం తెలపండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:51, 30 డిసెంబర్ 2013 (UTC)

కార్యక్రమ వివరాలు వద్ద కొన్ని విషయాల గూర్చి సభ్యులు బాధ్యత తీసుకుంటారని వేచి చూడటం జరిగింది. కాలావధి పూర్తయిన కారణంగా ఆఫ్లైను సీడీ మరియు వికీసాహిత్య పుస్తకాలకు సంబంధించిన బాధ్యతను నేను స్వీకరిస్తున్నానని తెలియచేస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:52, 28 డిసెంబర్ 2013 (UTC)

2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారాలు

మార్చు

తెలుగు వికీమీడియా ప్రాజెక్టు సభ్యులందరికీ నమస్కారం.

తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారానికి వచ్చిన ప్రతిపాదనలను ఎంపిక మండలి పరిశీలించడం పూర్తి అయ్యింది. ముందుగా ప్రతిపాదిత సభ్యులకు, ఆయా ప్రతిపాదనలను ప్రారంభించి, మద్దతు ఇచ్చి, విస్తరించి ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన తెలుగు వికీ సభ్యులందరికీ ధన్యవాదాలు.

ఈ పురస్కారానికి 28 ప్రతిపాదనలు రాగా వాటిలో 18కి ప్రతిపాదిత సభ్యులు అంగీకారం తెలిపారు. వీరి కృషి గణాంకాలు మరియు వికీ అభివృద్ధికి దోహదపడిన గుణాత్మక అంశాల విశ్లేషణ ఎంపిక మండలి చేసింది. ఈ పురస్కారపు తొలివిడతగా ఈ సంవత్సరం, గత దశాబ్ది కాలంలో చేసిన కృషిని గుర్తిస్తూ పది పురస్కారాలు ఇవ్వాలని ఎంపిక మండలి నిర్ణయించింది. దీనికి ఎంపికైన అభ్యర్ధులు క్రింద (మూల్యాంకన వరుసక్రమంలో) ఇవ్వబడ్డారు. వీరికి దశాబ్ది ఉత్సవాలలో నగదు బహుమతి మరియు పురస్కారము ఇవ్వబడుతుంది. వీరి చిత్రాలు, పురస్కార ప్రధానాంశాలు తెలుగు మరియు ఆంగ్లములో చూడవచ్చు.

  1. చదువరి (తుమ్మల శిరీష్ కుమార్)
  2. ఎం.ప్రదీప్
  3. చావా కిరణ్
  4. వీవెన్
  5. పాలగిరి
  6. రవిచంద్ర
  7. అహ్మద్ నిసార్
  8. వీరా ఎస్.జె
  9. జె.వి.ఆర్.కె.ప్రసాద్
  10. భాస్కర నాయుడు

వీరందరు తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు చేసిన కృషికి ‘’’కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారం ఎంపిక మండలి’’’ తరఫున కృతజ్ఞతాంజలులు.

అంగీకారం తెలపని ప్రతిపాదిత సభ్యులు మరియు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన ఇతర సభ్యుల కృషిని గుర్తిస్తూ ఎంపిక మండలి ప్రశంసాపత్రమివ్వాలని నిర్ణయించింది. వీరి వివరాలు చూడవచ్చు. వీరందరి కృషికి ధన్యవాదాలు. వీరికి ప్రశంసా పతకం (ఎలెక్ట్రానిక్) త్వరలో వాడుకరి చర్చాపేజీలో ఇవ్వబడుతుంది.

ఈ ప్రక్రియ వలన వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన అంశాలు అవగతమయ్యాయి. వాటిని ప్రతిపాదన అంగీకరించిన సభ్యుల కృషి గణాంకాలు మరియు దోహదపడిన ముఖ్యాంశాల దస్త్రంలో మరియు మూల్యాంకనంవివరాలను చూడవచ్చు. అలాగే అభివృద్ధికి తోడ్పడని అంశాలు కూడా చూడవచ్చు. సహసభ్యులు వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకొని మరింత అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఈ స్ఫూర్తితో తెలుగు వికీమీడియా సభ్యులు ఇతర జాతీయ, అంతర్జాతీయ వికీ ప్రోత్సాహక పురస్కారాలలో క్రియాశీలంగా పాల్గొంటారని ఆశిస్తున్నాము.

ఈ ప్రక్రియపై మీ అభిప్రాయాలు, స్పందనలు పేజీలో తెలిపితే మున్ముందు మరింత మెరుగుగా నిర్వహించటానికి వీలవుతుంది. ఈ పురస్కారాలను రూపకల్పన దిశ నుండి దాదాపు వేయి గంటల సమయాన్ని వెచ్చించిన ఎంపిక సంఘం సభ్యులు, అర్జునరావు, రాజశేఖర్, రాధాకృష్ణ మరియు సుజాత గార్లకు నా కృతజ్ఞతలు. ఈ పురస్కారాలను రూపకల్పన చేసి, ఎంపిక సంఘం కార్యదర్శిగా కార్యభారాన్నంతా చాలా మటుకు మోసిన అర్జునరావు గారికి ప్రత్యేక వందనాలు. పురస్కారాలకై కావలసిన నిధులు సమకూర్చడానికి అంగీకరించిన తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గానికి ధన్యవాదాలు.

వైజాసత్య

కొలరావిపు ఎంపిక మండలి అధ్యక్షుడు

కృతజ్ఞతలు, అభినందనలు

మార్చు
  • తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయపథం వైపుకు నడిపిస్తున్న నిర్వాహక మండలి, సహాయక మండలి, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపిక మండలి లకు హృదయపూర్వక అభినందనలు. పురస్కార విజేతలను, ప్రశంసాపత్రాల విజేతలను ఎంపిక చేయడంలో ప్రదర్శించిన పారదర్శకత, వికీ విధానాల మరియు ఎంపిక విధానాల చక్కటి అవలంబన, తీసుకున్న జాగ్రత్తలు ఆహ్వానింపదగ్గవి. మరీ ముఖ్యంగా మూల్యాంకనా విధానం మరియు దాని ఆధారంగా విజేతలను ఎంపిక చేసే పద్దతి అందరినీ ఆకట్టుకున్నది. ఈ విధానం మిగతా సభ్యులకు ప్రోత్సాహాన్ని మరియు స్పూర్తినిస్తుందని, తెవికీలో రచనా వేగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను. మరొక సారి ఎంపిక మండలిని అభినందిస్తున్నాను. పేరు పేరునా అందరికీ అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:17, 28 డిసెంబర్ 2013 (UTC)
  • పురస్కార విజేతలకు అభినందనలు. చాలా ఓపికతో, సంయమనంతో వ్యవహరించిన ఎంపిక మండలి సభ్యులందరికీ, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు. --రవిచంద్ర (చర్చ) 06:25, 29 డిసెంబర్ 2013 (UTC)

చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఉచితం కాని బొమ్మలు చూపవచ్చునా

మార్చు

తెవికీ మొదటిపేజీలో కనిపించే చరిత్రలో ఈ రోజు విభాగంలో వాడే బొమ్మలు పూర్తి ఉచితంగానే ఉండవలెనా? లేక ఆయా వ్యాసాలలో వాడబడిన ఉచితం కాని బొమ్మలను కూడా ఈ విభాగంలో చేర్చవచ్చునా? సభ్యులు తెలుపగలరు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:56, 31 డిసెంబర్ 2013 (UTC)

మొదటి పేజీలో ప్రదర్శించే ఏ శీర్షికలోనైనా ఉంచే బొమ్మలు ఉచిత/సార్వజనీనమైన బొమ్మలే ఉండాల్సి ఉంటుంది. అది ఈ వారం బొమ్మలో కావచ్చు, ఈ వారం వ్యాసంలో కావచ్చు లేదా చరిత్రలో ఈరోజు శీర్షిక కావచ్చు. ఈ వారం బొమ్మ శీర్షికకై ఈ విషయం ఇక్కడ చూడవచ్చు. ఈ వారం వ్యాసంలో ఉపయోగించే బొమ్మ విషయంలో కూడా దాదాపు ఐదేళ్ళ క్రితం ఈ విషయమై చర్చ జరిగినట్టు గుర్తు. చరిత్రలో ఈ రోజు శీర్షిక మొదట్లో అచేతనంగా ఉండుటచే ఈ శీర్షికలో ఉపయోగించే బొమ్మకు సంబంధించి నియమం కాని చర్చ కాని లేదు. మొత్తంపై మొదటి పేజీలో ప్రదర్శించే ఎలాంటి బొమ్మ అయిననూ ఉచితం కాని బొమ్మలు చూపరాదనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:15, 31 డిసెంబర్ 2013 (UTC)