వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 46

పాత చర్చ 45 | పాత చర్చ 46 | పాత చర్చ 47

alt text=2016 జనవరి 2 - 2016 ఫిబ్రవరి 26 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 జనవరి 2 - 2016 ఫిబ్రవరి 26

గూగుల్ అనువాద వ్యాసాలు శుద్ధికి ప్రతిపాదన మార్చు

వికీపీడియాలో మరింత కన్సట్రక్టివ్ గా పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తెలుగు వికీ గురించీ, దాని ముందు ఉన్న సమస్యల గురించీ ఈ మధ్య నేను పవన్ సంతోష్తో చర్చించినపుడు గ్రామవ్యాసాలు, సినిమావ్యాసాలు, గూగుల్ అనువాద వ్యాసాల గురించి నాకు చెప్పారు. ఇంతకుముందే నేను కొన్ని వ్యాసాలు అనువాదం చేయడంతో గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి ప్రాజెక్టు నేను ప్రయత్నించడం కరెక్టేమో అనిపించింది. కానీ అవి చాలా పెద్దగా ఉండటంతో అనువాదం చేయడం ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను. దీనికి ఒక టూల్ ఉందనీ దానితో వర్క్ చేయడం సౌకర్యంగా ఉండచ్చని, వికీపీడియా అనువాద టూల్ పవన్ చూపించారు. ఆ టూల్ తో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించడం ప్రారంభించి కొంతవరకూ అనువాదం చేసి అనువాదాన్ని ప్రచురించు అని నొక్కగానే ఉన్న పెద్ద వ్యాసం లోని లోపాలతో ఉన్న అనువాద సమాచారం పోయి మనం అనువాదం చేసిన సమాచారం పోస్ట్ అవుతోంది. ఐతే ఇదేమీ గూగుల్ అనువాదంలా ఆటోమేటిక్ కాదు మనం అనువదించేదే, ఐతే కొంచెం వీలు ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్ వల్ల పెద్ద వ్యాసాలు(లోపాలతో ఉన్నవి) చిన్నవిగా(మంచి వ్యాసాలుగా) అవుతాయని అతను హెచ్చరించారు. ఐతే మనం తెలుగు వికీపీడియాకు అవసరమైన వ్యాసమనీ అనుకుంటే కొన్నిటిని పూర్తిగా మంచి అనువాదం చేయొచ్చు కూడా. అయినా చూడగానే వికీ గురించి చెడ్డ అబిప్రాయం తీసుకొచ్చే పెద్ద వ్యాసం కన్నా 500-1000 పదాలతో ఉండే మంచి వ్యాసమే మంచిదనిపిస్తోంది.

అందుకే ఈ టూల్ ని ఉపయోగించి గూగుల్ అనువాద వ్యాసాల శుద్ధి చేయాలనుకుంటున్నాను. సుజాత గారికి అనువాదాలపై ఇంట్రెస్ట్ ఉందని పవన్ ద్వారానే తెలిసి ఆవిడని సంప్రదించగా నేను లీడ్ తీసుకుంటే ఆమె ప్రాజెక్టులో సహకరిస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై పని చేసేవారికి వికీ అనువాద టూల్ పై పవన్ శిక్షణ ఇస్తామన్నారు. ప్రాజెక్టు విషయంలో మరిన్ని అంశాలపై కావాల్సి వస్తే సహకరిస్తామన్నారు కూడా.. కాబట్టి దీనిపై సూచనలు, సహకారం చేయాలని కోరుతున్నాను.--Meena gayathri.s (చర్చ) 07:09, 2 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీనాగాయత్రి గారు మంచి ప్రతిపాదన చేసారు. ఇది తెవికీ ప్రక్షాళనకు సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టులో నేను కూడా నాకు వీలైన సహకారం అందిస్తాను. --t.sujatha (చర్చ) 07:29, 2 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు దీనిమీద ఆసక్తి ఉన్నది. కానీ మొత్తంగా బాధ్యత మీనాగాయత్రి గారు తీసుకొని ముందుకు వెళదాం అనుకుంటే నేను సహాయం చేస్తాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 03:36, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా అండీ వాడుకరి:Rajasekhar1961గారూ.. ప్రాజెక్టు పేజీ కూడా మొదలపెట్టాను. --Meena gayathri.s (చర్చ) 13:23, 19 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అందుబాటులో ఆఫ్ లైన్ తెలుగు వికీపీడియా మార్చు

సీఐఎస్-ఎ2కె వారు తెలుగు భాషకు ఆఫ్లైన్ వికీపీడియా తయారుచేశారు. దీన్ని సీడీలు లేదా డీవీడీల్లో రాసి(బర్న్ చేసి) మంచి అంతర్జాల సదుపాయం లేని కళాశాలలు లేదా పాఠశాలలకు, వ్యక్తులకు ఔట్రీచ్ కార్యక్రమాల సమయంలో పంచిపెట్టవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:42, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ సమావేశంలో కొందరికి దీనిని పంచారు. దీనిలోని బగ్స్ ను తొలగించి; మరింత మంది విద్యార్ధులకు, విద్యాసంస్థల ద్వారా అందేటట్లు చేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 03:34, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ప్రయత్నం --Pranayraj1985 (చర్చ) 07:32, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ప్రయత్నం, కాకపోతే సి.ఐ.ఎస్ వాళ్ళు ఎక్కువ సీడీలు గోల్డెన్ ట్రెషోల్డ్, మరికొందరి ఔత్సాహిక సభ్యుల వద్ద ఉంచిగలిగితే వారు అవసరాలకు ఇవ్వగలుగుతారు...--Viswanadh (చర్చ) 13:43, 4 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సీడీలు గోల్డెన్ ట్రెషోల్డ్ లోవుంచితేనే అందరికీ వుపయోగించుకునే అవకాశం వుంటుంది --Nrgullapalli (చర్చ) 03
26, 8 ఫిబ్రవరి 2016 (UTC)

Wikimania 2016 Scholarships - Deadline soon! మార్చు

Please help translate to your language

A reminder - applications for scholarships for Wikimania 2016 in Esino Lario, Italy, are closing soon! Please get your applications in by January 9th. To apply, visit the page below:

Patrick Earley (WMF) via MediaWiki message delivery (చర్చ) 01:49, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రా లయోలా కళాశాలలో డిజిటల్ సెంటర్ (వికీ ల్యాబ్) స్థాపన మార్చు

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఏ౨కే ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్తంగా పరస్పర భాగస్వామ్యంతో వికీల్యాబ్/డిజిటల్ సెంటర్ స్థాపించే ప్రతిపాదన తెలిసిందే. ఈ అంశాన్ని గతంలోనూ అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని రచ్చబండలో సంప్రదించాము. సీఐఎస్-ఏ౨కే ఆంధ్ర లొయోలా కళాశాల సంయుక్తంగా పరస్పర భాగస్వామ్యంతో స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ తో కూడుకున్న వికీల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నాము.ఒక పది కంప్యూటర్లు, ఇంటర్నెట్ తో ఇవి అక్కడి విద్యార్థులకు వికీకి తోడ్పాటు చేయటంలో మరింత సహాయకమవుతాయి.ఇందుకు కావాల్సిన ఖర్చును సరిసమంగా కళాశాల సీఐఎస్-ఏ౨కే సమకూర్చనున్నాము అనీ, అభ్యంతరం ఉన్న సభ్యులు తెలుపవలసిందనీ వ్రాశాము. ఆ సమయంలో భాస్కరనాయుడు గారు సమర్థిస్తూ వ్రాశారు. కొన్నాళ్ళ అనంతరం అక్కడ స్పందన తెలియజేయని మరికొంతమంది సభ్యులను వ్యక్తిగతంగానూ, కార్యక్రమాల్లో భాగంగానూ సంప్రదించాం. రాజశేఖర్ గారు ఆంధ్ర లయోలా కళాశాలతో భాగస్వామ్యం చాలా విలువైనదని, అంతమంది విద్యార్థులు రాసేలా చేయగలిగే కార్యక్రమమమని పేర్కొన్నారు. ఆ భాగస్వామ్యాన్ని శాశ్వతీకరించేలా ఇది చేపట్టడం మంచిదేన్నారు. నెలవారీ సమావేశంలో ప్రస్తావన తీసుకురాగా కశ్యప్ గారు స్పందిస్తూ, "ఇప్పటికే ఈ అంశాన్ని సంస్థాగతంగా ముందుకుతీసుకువెళ్ళిన కారణాన దీన్ని నిలుపుదల చేయడం సరికాదని, ఈ డిజిటల్ రీసోర్సు సెంటర్ విషయంలో ఒప్పుకున్నవి పూర్తిచేయాలని" పేర్కొంటూనే "భవిష్యత్తులో ఇప్పటికే ఇలాంటి సౌకర్యాలు ఉన్న సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకుని ఆ వనరులు వినియోగించుకునేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రస్తుతం గోల్డెన్ థ్రెషోల్డ్ వనరులను వినియోగించుకుని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని ఇలాంటి సంస్థాగత భాగస్వామ్యాలు ఆదర్శంగా తీసుకోవాలని" సూచించారు. జెవిఆర్కే ప్రసాద్ గారు తమతో చేసిన సంప్రదింపులో భాగంగా ఈ అంశాన్ని వివరించగా, ఇలాంటి ప్రయత్నం చాలా మంచిదని పేర్కొన్నారు. అలానే సీఐఎస్-ఎ2కె ఈ సెంటర్ స్థాపన విషయంలో సరిసమాన ఆర్థిక భాగస్వామ్యాన్ని స్వీకరించడం సరైన విధానమని తద్వారా వికీపీడియన్లకు ఆ డిజిటల్ రీసోర్స్ సెంటర్ విషయంలో సమాన భాగస్వామ్యం ఏర్పడుతుందని భావించారు. భవిష్యత్తులో వికీపీడియన్లు అక్కడ కార్యక్రమాలను నిర్వహించుకునేలా ఉండాలని ఆశించారు. విశ్వనాధ్. గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఒప్పుకున్నాకా బహుకాలం పక్కనపెట్టడం వల్ల సంస్థల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలానే ఇంతవరకూ జరిగిన ఆలస్యం వల్ల భాగస్వామ్య సంస్థ (లయొలా కళాశాల) ఈ రీసోర్సు సెంటర్ ఏర్పాటు అనంతరం వికీపీడియా కార్యక్రమాలు కళాశాలలో జరగకపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ రీసోర్సు సెంటర్ ను సీఐఎస్-ఎ2కె ఏర్పాటుచేస్తూ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనుంది. కార్యక్రమంలో వికీపీడియన్లు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. గమనిక-ప్రస్తుతం లయొలా కళాశాలలో డిజిటల్ రిసోర్సు సెంటర్ ఏర్పాటుచేసే అంశంపై చర్చ ముగిసింది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:13, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాకు కావాల్సిన వనరుల గురించి మార్చు

నమస్తే,
నమస్తే గతంలో తెవికీపీడియన్లు పవనజతో సమావేశమైనప్పుడు ఈ కింది వనరులు కోరడం జరిగింది. వాటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు భావిస్తున్నారు. మరికొన్ని చేయాల్సివుందని అనుకుంటున్నాము. కింది లిస్టులో కోరిన వనరుకు పక్కన వాటి స్థితి రాశాము. పరిశీలించి తెవికీపీడియాకు ఏవి అవసరం అన్న విషయాన్ని గురించి అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:36, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

డాక్యుమెంట్లు
  1. వికీపీడియా బ్రౌచర్ - 4 & 16 పేజీలవి -అందుబాటులో ఉన్నాయి
  2. వికీపీడియా ట్యుటోరియల్ -అవసరం
  3. వికీ మార్కప్ చీట్ షీట్ -వికీపీడియా ఎడిటింగ్ మాన్యువల్ లో భాగంగా అందుబాటులో ఉంది
  4. కీబోర్డ్ లేఅవుట్ - యాపిల్ మరియు మాడ్యులర్ కీబోర్డులను ప్రస్తుతం ఉన్న డాక్యుమెంట్ కు చేర్చాలి
  5. కాపీరైట్ మాన్యువల్
  6. సీసీ చేపుస్తకం
  7. వికీసోర్స్ ట్యుటోరియల్ -అవసరం
  8. విక్ష్నరీ ట్యుటోరియల్ -తర్వాతికాలంలో చేయవచ్చు
వీడియాలు

వీడియో ట్యుటోరియల్స్ - స్క్రిప్టులు అనువాదమయ్యాయి. సంస్థాగత భాగస్వామ్యాల్లోని అవకాశాలను వినియోగించుకుని తయారుచేయవచ్చు.

తెలుగు వికీపీడియా నుంచి రిక్వెస్ట్

డి.ఎల్.ఐ. పుస్తకాల్లోవి ఏవి కాపీహక్కుల పరిధిలో లేవో తెలియజేస్తే వికీసోర్సులోకి ఆయా పుస్తకాలు చేర్చుకునేందుకు వీలవుతుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:36, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో సంస్థాగత భాగస్వామ్య ప్రతిపాదనలు మార్చు

నమస్తే,
తెలుగు భాష, సంస్కృతి విషయంలో పలు రకాల అధ్యాపక, ప్రచురణాది కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గురించి తెలిసిందే. విశ్వవిద్యాలయం ఏర్పాటు సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని లలిత కళల అకాడమీలను విలీనం చేశారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయానికి రకరకాల కళలకు సంబంధించి అధ్యయనం, అధ్యాపనం వంటి కార్యప్రణాళికలు ఉన్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి లభించినవీ, ఆపైన విశ్వవిద్యాలయం ప్రచురణల ద్వారా లభించినవీ పలు విలువైన పుస్తకాలకు సంబంధించిన కాపీహక్కులూ ఉన్నాయి. తెలుగు, ఇతర లలితకళలకు సంబంధించిన కోర్సులు నిర్వహిస్తూన్నారు. ఈ నేపథ్యంలో సీఐఎస్-ఎ2కె వారు విశ్వవిద్యాలయంతో సంస్థాగత భాగస్వామ్యానికి చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యానికి చర్చలు డిపార్ట్మెంట్ అధిపతి, రిజిస్ట్రార్లతో జరుపుతున్న నేపథ్యంలో ప్రతిపాదనల వివరాలను సముదాయం పరిశీలనకు అందజేస్తున్నాము. వీటి విషయంలో చర్చించాలని సముదాయాన్ని కోరుతున్నాము. ఈ అంశాల్లో చర్చించి ప్రతిపాదనలు తయారుచేసి పంపితే ఆపైన విశ్వవిద్యాలయం వారు అంతర్గతంగా పరిశీలిస్తారు.

ప్రతిపాదనలు
  • విశ్వవిద్యాలయానికి కాపీహక్కులు ఉన్న పుస్తకాలు వికీసోర్సులో చేర్చేందుకు తగ్గ లైసెన్సులో పునర్విడుదల చేయడం. విశ్వవిద్యాలయం వద్ద ఎన్నో విలువైన గ్రంథాల కాపీహక్కులు ఉన్నాయి. వీటిలో సముదాయ సభ్యులు ప్రాధాన్యత కల పుస్తకాలుగా పేర్కొన్న "సూర్యరాయాంధ్ర నిఘంటువు", "వ్యాససూచి" వంటివి ఉన్నాయి. ఐతే విశ్వవిద్యాలయం ప్రచురణలు, అమ్మకాల విభాగాలు కూడా నిర్వహిస్తూండడంతో అనేకమార్లు పునర్ముద్రణలు పొందుతూ బాగా అమ్ముడుపోతున్న పుస్తకాలను ఇవ్వడం ఇబ్బందికరమేనని వర్శిటీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పైన పేర్కొన్న సూర్యరాయాంధ్ర నిఘంటువు, వ్యాససూచి వంటివి ఆ క్రమంలోకి రావు.
  • విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు వికీ అకాడమీలు, వర్క్ షాపులు వంటివి నిర్వహించి, వారిని తెలుగు వికీపీడియన్లుగా మలచడం. విశ్వవిద్యాలయ క్యాంపస్ లు రాజమండ్రి, కూచిపూడి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.
  • విలువైన, అరుదైన గ్రంథాలతో కూడివున్న విశ్వవిద్యాలయ గ్రంథాలయ గ్రంథసూచీ (కేటలాగ్)ను తెలుగు వికీపీడియా/వికీసోర్సులో చేర్చేలా స్వేచ్ఛా నకలు హక్కుల్లోకి విడుదల చేయడం. ఇప్పటికే గ్రంథసూచీ డిజిటల్ గా ఉందని తెలియవస్తోంది.

--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:13, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పై ప్రతిపాదనలు చిత్తుప్రతి మాత్రమే వాటిని మెరుగుపరిచేందుకు సముదాయం చర్చించవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:20, 5 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం మార్చు

  1. వికీపీడియాకు వీరితో సంబంధాలు చాలా ప్రయోజనకరం. శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు ముఖ్యంగా తెలుగు విక్షనరీ కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాససూచి వారు ప్రచురిస్తున్న పుస్తకాల జాబితాను అందరికీ వికీ ద్వారా తెలియజేసినట్లుగా భావిస్తే; భవిష్యత్తులో వీటిలో కొన్నింటిని వికీసోర్స్ ద్వారా మరింతమందికి అందుబాటులోకి తేవచ్చును. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:07, 8 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకం మార్చు

సూచనలు మార్చు

తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు మార్చు

అందరికి నమస్కారం.... తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ గారు తెలుగు వికీపీడియాలో తెలంగాణ విషయాలు అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయమై ఆయన నన్ను ఆహ్వానించడంతో 2015, ఆగష్టు 6వ తేదీన సెక్రటేరియట్లో కలిశాను. ఆ చర్చలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల గురించిన వ్యాసాలు, సమాచారం వికీపీడియాలో కొంత తక్కువే ఉందని... కొత్తవి ఎలా తయారుచేయాలి? ఉన్నవి ఎలా అభివృద్ధి చేయాలి? అన్న అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ అంశంలో సముదాయానికి తామెలా సహకారం అందించగలమని ప్రశ్నించారు. ఆ విషయాన్ని సముదాయంలో చర్చించి ఏ ప్రణాళికతో ముందుకుపోవచ్చన్న అంశాన్ని తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను.

ఆపైన కొన్ని సమావేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ ఈ అంశాన్ని కొంత మాట్లాడినా పెద్ద ప్రగతి జరగలేదు. మళ్ళీ దిలీప్ గారు కొన్నాళ్ళ తర్వాత ఢిల్లీలో ఒక కాన్ఫిరెన్సుకు వెళ్ళినప్పుడు అక్కడ కలిసిన సీఐఎస్ సంస్థ డైరెక్టర్ తో ఇదే అంశంపై చర్చించారు. ఆ నేపథ్యంలో నవంబరు నెలాఖరులో జరిగిన ఐఆర్సీలో రహ్మానుద్దీన్, పవన్ సంతోష్ లు తెవికీ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకరిద్దామని దిలీప్ కొణతం చేస్తున్న ప్రతిపాదన ముందుంచితే, ఆ చర్చలోనే నేను గతంలో నాతో ఆయన మాట్లాడిన విషయాన్ని మళ్ళీ తెలిపాను.

ఆ తరువాత దిలీప్ కొణతం గారిని సంప్రదించి మరోమారు చర్చించేందుకు అపాయింట్ మెంట్ తీసుకుని, నాతోపాటు రావాల్సిందిగా పవన్ సంతోష్ ను కోరాను. సరిగా అపాయింట్మెంట్ రోజునే నాకు అతిముఖ్యమైన పని రావడంతో హాజరుకాలేక పవన్ సంతోష్ నే వెళ్ళమంటే, రాజశేఖర్ గారిని సముదాయ సభ్యునిగా తీసుకువెళ్ళవచ్చా అని అడిగి ఆయనను తీసుకువెళ్ళారు. వారిద్దరితో దిలీప్ గారికి జరిగిన సమావేశంలో తెలుగు వికీపీడియా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు, వాటిలో ప్రభుత్వ సహకారం చేయగల వీలు గురించి చర్చలు జరిగాయి. తదుపరి ప్రతిపాదనలు పంపితే ముందుకు వెళ్దామని దిలీప్ గారన్నారు. జరిగిన చర్చలన్నీ సవివరంగా పవన్ నాతో చెప్పారు. ఆపైన డిసెంబర్ నెలవారీ సమావేశంలో అందుబాటులో ఉన్న సముదాయ సభ్యులతో కూడా చర్చించాము. ఈ అంశంలో సముదాయానికి సహకారంగా సంస్థాగతంగా పనిచేసేందుకు సీఐఎస్-ఎ2కె ముందుకువచ్చి ప్రతిపాదనలు మెరుగుపరిచేందుకు, కార్యరూపం దాల్చేందుకు తమకు సాధ్యమైనంత సహకారం అందించాలని కోరుతున్నాను. Pranayraj1985 (చర్చ) 12:35, 6 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ప్రగతి సాధిస్తున్నారు. అయితే పవన్ సంతోష్, రాజశేఖర్ గార్లు చర్చించిన విషయాలు ఏమటో అందరికీ తెలియవు కనుక వాటిని నెలవారీ సమావేశపు పేజీలో పొందుపరచండి. నా చిన్ని సలహాలు - దిలీప్ గారు ప్రభుత్వ పరంగా సహకారం అందిచ్చేట్టయితే, తెలంగాణా యూనివర్శిటీలలో కార్యశాలలు జరిపేలా కృషి చేయగలిగితే బావుంటుంది. ప్రభుత్వ పరంగా కనుక కార్యశాలలకు అన్ని ఏర్పాట్లు (ఆర్ధికంగా,సాంకేతికంగా, అనుమతులపరంగా)వారే చేసుకొనేలా ఒప్పించగలగాలి. అలా అయితే సి.ఐ.ఎస్. నుండే కాక సముదాయంనుండి కూడా అందరం పాల్గొనగలగవచ్చు. సెంట్రల్ లైబ్రరీ, యూనివర్సిటీల లైబ్రరీలను ఉపయోగించుకోవడానికి అనుమతులు తీసుకోవడం ద్వార కొన్ని మూలాలు సేకరించవచ్చు.--Viswanadh (చర్చ) 05:14, 7 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్.బి.కె. గారు నమస్కారం. తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా సహకారం విషయంలో మీరు చేసిన సూచనలు బాగున్నాయి. పవన్ సంతోష్, రాజశేఖర్ గార్లు చర్చించిన విషయాల గురించి త్వరలోనే వికీలో పొందుపరుస్తాము. ఆ తరువాత తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలపై వికీ సభ్యులమంతా చర్చించి, ఒక మంచి ప్రణాళికను ప్రభుత్వం ముందుకు తీసుకువెలుదాము.--Pranayraj1985 (చర్చ) 06:56, 7 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

13 తేదీన ఆంధ్రా లయోలా కళాశాలలో డిజిటల్ రీసోర్సు సెంటర్ ప్రారంభం మార్చు

ఆంధ్రా లయోలా కళాశాలలో జనవరి 13, 2016న డిజిటల్ రీసోర్సు సెంటర్ ప్రారంభం కానుంది. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ యాక్సెస్ టు నాలెడ్జ్ (సీఐఎస్-ఎ2కె) మరియు ఆంధ్రా లయోలా కళాశాల (ఏఎల్సీ) సంయుక్తంగా 10 కంప్యూటర్లతో డిజిటల్ రీసోర్సు సెంటర్ ను ఏర్పాటుచేశాయి. డిజిటల్ రీసోర్సు సెంటర్ ఏర్పాటు వికీపీడియన్లు మరియు ఆంధ్రా లయోలా కళాశాలలోని విద్యార్థి వికీపీడియన్లకు ఉపకరించేందుకు చేస్తున్నారు. ఈ కేంద్రాన్ని స్థానిక వికీపీడియన్లు శిక్షణ సమావేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. ప్రారంభ కార్యక్రమంలో వికీపీడియన్లను పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:49, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ అంశంపై సంప్రదింపులు, నిర్ణయాలు, ప్రకటన వంటివి వికీపీడియా రచ్చబండలో చూసేందుకు లంకెలు ఇవి: సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థన, సంప్రదింపులు సారాంశంగా రాసి ఫలితాన్ని వెలువరించిన ప్రకటన --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:55, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రా లయోలా కళాశాలలో వికీపీడియా విద్యా కార్యక్రమం - కార్యశాల మార్చు

జనవరి 11, 12, 13 తేదీల్లో విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో వికీపీడియా విద్యా కార్యక్రమంలో భాగంగా విద్యార్థి వికీపీడియన్లకు కార్యశాల జరుగుతోంది. కార్యక్రమంలో తెలుగు, భౌతిక శాస్త్రం, సాంఖ్యక శాస్త్రం, వృక్ష శాస్త్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కో విభాగానికి పది మంది చొప్పున ఎంపిక చేసిన 40 మంది విద్యార్థులను వారితో వికీపీడియాలో ఖాతాలు తయారుచేసుకుని, తమ తమ సబ్జెక్టులకు సంబంధించిన వ్యాసాలు సృష్టిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు సీఐఎస్-ఎ2కె, ఆంధ్రా లయోలా కళాశాల సంయుక్తంగా పనిచేస్తున్నాయి. కార్యక్రమంలో పాల్గొనడం కానీ, సూచనలు అందించడం కానీ చేసేందుకు తెలుగు వికీపీడియన్లను ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:19, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రా లయోలా కళాశాలలో వికీపీడియా విద్యా కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు వివిధ శాస్త్రాలలో రచనలు చేయడం మంచి కార్యక్రమం. విద్యార్థులు స్వంతంగా అనువాదాలు చేయాలని మనవి. యాంత్రిక అనువాదాలు యదాతథంగా చేర్చరాదని, వాటిని తగురీతిలో శుద్ధి జరగాలని నా విన్నపం. వృక్ష శాస్త్రంలొ యిదివరకే సాధారణ నామాలతో వ్యాసాలున్నాయి. వాటిని విస్తరించే ప్రయత్నం సంబంధిత వికీపీడియనులు చేయాలి. కానీ ఉన్న వ్యాసాలను వాటి శాస్త్రీయ నామాలలో మరల సృష్టించరాదని విన్నపం. తెవికీలో లేని వ్యాసాలను సృష్టించి విస్తరించండి. సంబంధిత వికీపీడియనులు తెలుగు భాషలో శీర్షికలను ప్రారంభించాలని కోరుకుంటున్నాను. మూలాలను చేర్చడంలో వారికి తగు సూచనలు సంబంధిత శిక్షకులు యివ్వాలని కోరుకుంటున్నాను. వ్యాసవిస్తరణలో ఏ సహాయానికైనా వికీపీడియనులు సంప్రదిస్తే తగు సహాయం అందించగలను. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 08:35, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కొత్త వ్యాసం సృష్టించే ముందుగా సంబంధిత పేరుతో గానీ, ఆ పేరుకు దగ్గరగా కానీ వ్యాసము ఉన్నదీ లేనిదీ పరిశీలించి, లేని ఎడల మాత్రమే సృష్టించగలరు. వ్యాసము ఉన్నచో, దానిని విస్తరించగలరు. కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న సీనియర్ వికీపీడియనులు ఈ విషయంపై విద్యార్థులకు దిశా నిర్దేశం చేయగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:16, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్ధులను సీనియర్ సభ్యులతో చర్చించి ఆయా వ్యాసాలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఆంగ్ల పేర్లతో వ్యాసాలను తెవికీలో ఉండరాదని నియమాన్ని తెలియజేయండి. ఇక వికీస్టైల్ గురించిన ప్రాధమిక అవగాహన కలిగించాలి. గూగుల్ యాంత్రిక అనువాదాన్ని ఎట్టిపరిస్థితులలోను చేయకూడదని నియమం విధించండి. సాంఖ్యకశాస్త్రం వ్యాసాల పేర్లుకు సరైన ఆంగ్ల నామాన్ని మొదట పేరాలో చేర్చిన చాలా ఉపయోగకరంగా వ్యాస విస్తరణకు తోడ్పడుతుంది.--Rajasekhar1961 (చర్చ) 13:14, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • సూచనలు చేరుస్తున్న వికీపీడియన్లకు అభినందనలు, కృతజ్ఞతలు. ఈ సూచనల నుంచి ప్రస్తుతానికి (జనవరి 14 నాటికి) నేను అర్థం చేసుకున్నదేంటంటే- గూగుల్ యాంత్రికానువాదాలు జరుగుతున్నాయని దీన్ని చేయకూడదన్న విషయాన్ని వారికి తెలియపరిచి ఆపుచేసే దిశగా కృషిచేయాలని, వృక్షశాస్త్రంలో ఇప్పటికే ఉన్న వృక్షాల వ్యాసాలను వాటి శాస్త్రీయ నామాలతో మరలా సృష్టించడం కాక కొత్తవి తయారుచేసేలా శ్రద్ధ వహించాలని, ఆంగ్లపేర్లతో వ్యాసాలు ఉండరాదని తెలియజెప్పాలని, సాంఖ్యకశాస్త్ర వ్యాసాల్లో సంబంధిత అంశానికి సంబంధించిన ఆంగ్ల నామాన్ని మొదటిపేరాలో రాయమని సూచించాలని నాకు తెలిసింది. ఈ అంశాలపై జాగ్రత్తవహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాను. దాని విషయంలో వికీపీడియన్లు సహకరిస్తారని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:21, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
* కె.వెంకటరమణ గారూ, సుల్తాన్ ఖాదర్ గారూ, రాజశేఖర్ గారూ మరో చిన్న విషయం. విద్యార్థులను తాము తయారుచేసే మొదటి కొన్ని వ్యాసాలను వారి ప్రయోగశాలలో రాయమని సూచించాను. వారికీ ఆ ఆలోచన నచ్చింది. ఐతే విద్యార్థులు రాసినవాటిలో ప్రస్తుతానికి నాణ్యతపరంగా అభివృద్ధి కావాల్సిన వ్యాసాలను వారి ప్రయోగశాలకు ఉపపేజీలకు తరలించాల్సివుంది. ఈ విషయంలో ప్రస్తుతానికి ఏం చేయవచ్చంటారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:55, 15 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ స్వాగ్స్ కొరకు సి.ఐ.ఎస్. వారికి అభ్యర్థన మార్చు

అందరికి నమస్కారం. మనం తెలుగు వికీపీడియా తరపున కొన్నికొన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఆయా కార్యక్రమాలలో తెవికీ సభ్యులు, నూతన వాడుకరులు హాజరవుతున్నారు. అలా వచ్చినవారికి తెవికీ జ్ఞాపికగా టిషర్టు (500 ఎడిట్స్ చేసినవారికి మాత్రమే), బ్యాడ్జ్, స్టికర్, పెన్నులను (హాజరైన వారికి) ఇస్తే బాగుంటుదని అభిప్రాయపడుతున్నాను. అందుకుగానూ 30 టిషర్ట్స్, 100 బ్యాడ్జ్, 100 స్టికర్, 50 పెన్నుల కొరకు సి.ఐ.ఎస్. వారికి అభ్యర్థన ఇవ్వదలచాను. సహసభ్యులు స్పందిచగలరు. --Pranayraj1985 (చర్చ) 09:12, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దీనివల్ల అభ్యర్ధులకు ప్రోత్సాహకరంగా వుంటుంది. వెంటనే సి.ఐ.ఎస్. వారికి అభ్యర్థన పంపండి:--Nrgullapalli (చర్చ) 11:11, 17 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అదే కదా కావాలి. చిన్ని లంచం ఇస్తే ఎన్ని మంచాలైనా నెసేస్తారు ఆనందంగా  :) ..--Viswanadh (చర్చ) 04:48, 18 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ పేజీలలో రంగుల అక్షరాలను ఉపయోగించుట మార్చు

వర్ణాంధత్వం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని రంగులను తక్కువగా వాడండి. వాడక తప్పని పరిస్థితులలో, వారికి కూడా కనపడే విధమైన జాగ్రత్తలు తీసుకోండి. రంగుల అక్షరాలను ఉపయోగించునపుటు తగు జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పేజీలలో పింక్ రంగులు,ఎరుపు రంగులు వాడటం వల్ల అవి ఎర్ర లింకులుగా కనబడుతున్నాయి. కొన్ని పేజీలలో కాంతి విహీనంగా ఉన్న రంగులను వాడటం వలన వర్ణాంథత ఉన్నవారికి చదవడానికి యిబ్బందిగా ఉండవచ్చు. రంగులను మూసలలోనూ, పట్టికలలోనూ వాడటం పరిపాటి. పాఠ్యాంశం వాస్తవమైనదిగా ఉంచమని వాడుకరులకు సూచన. ఆంగ్ల వికీపీడియాలోని Manual_of_Style లింకులో ఈ క్రింది విధంగా సూచించబడినది. దయచేసి గమనించగలరు.-- కె.వెంకటరమణచర్చ 09:10, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Ensure that color is not the only method used to convey important information. Especially, do not use colored text or background unless its status is also indicated using another method such as an accessible symbol matched to a legend, or footnote labels. Otherwise, blind users or readers accessing Wikipedia through a printout or device without a color screen will not receive that information.
కె.వెంకటరమణ గారు, వికీ పేజీలలో ఏఏ రంగుల అక్షరాలను ఏవిధముగా ఉపయోగించ వచ్చునో నాకు అంతగా అవగాహన లేదు. మీరు పొందుపరచిన సమాచారము ప్రకారము నేను భారతీయ రైల్వేలు వ్యాసములందు ఈ క్రింద సూచించిన విధముగా రంగులను ఉపయోగించుట జరిగినది. వాటిలోని కొన్ని రంగులు పనికి రాకపోవచ్చును. అందువలన ఈ విషయములో మీరు లేదా మరెవరైననూ తగు సలహా, సూచనలు పొందుపరచినట్లయిన వెంటనే అందుకు అనుగుణముగా మార్పులు చేయగలను.
  1. రాజధాని ఎక్స్‌ప్రెస్
  2. శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  3. సువిధ ఎక్స్‌ప్రెస్
  4. దురంతో ఎక్స్‌ప్రెస్
  5. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  6. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  7. జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  8. ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  9. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  10. ఎక్స్‌ప్రెస్
  11. ప్యాసింజర్
  12. మెమో
  13. డెమో
  14. ఈఎంయు
  15. డిఎంయు
  16. రైలు బస్సు
  17. రైలు కారు

రైల్వే అంతర్జాల సమాచారము అందించే వారు కొన్ని రంగులు వాడుతూ ఉన్నారు. వికీ నియమములు అందుకు విరుద్దముగా ఉండవచ్చును. అందువలన తగు విధముగా నాకు తెలియజేయగలరు. వ్యాసములు అన్నీ మరొకసారి వికీకి అనుగుణంగా మార్పులు చేయగలను. ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 12:11, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారికి, ఒక వ్యాసం ప్రారంభించినపుడు ఆ వ్యాస శీర్షికతో ప్రారంభిస్తే ఆ వ్యాస శీర్షిక పదాన్ని బోల్డు అక్షరాలతో ప్రారంభించడం ఆనవాయితీగా ఉన్నది. కనుక వ్యాస శీర్షిక గల పదానికి రంగులు వాడరాదని నా అభిప్రాయం. వ్యాసంలో మొదటి పదం పెద్ద అక్షరాలను కూడా ఉపయోగించరాదని నా భావన. శీర్షికలకు వివిధ పరిమాణాలలో అక్షరాలు యాంత్రికంగా వస్తాయి. కానీ పాఠ్యాంశంలో ఒక వాక్యంలో పెద్ద అక్షరాలను వాడితే ఈ వరుసకు, తరువాతి వరుసకు మధ్య లైన్ స్పేస్ పెరిగిపోతుంది. పైన సూచించిన రంగుల పదాలలో కొన్ని కాంతి తీవ్రత తక్కువగా ఉన్న పదాల వల్ల మనకే చదవాడానికి యిబ్బందిగా ఉన్నది. గమనించగలరు. కనుక వీలైతే రంగులను తొలగించగలరు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 16:04, 13 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రైల్వే అన్ని వ్యాసములలో రంగులను అన్నీ దశలవారీగా తొలగిస్తాను. JVRKPRASAD (చర్చ) 11:45, 15 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • కె.వెంకటరమణ గారు, JVRKPRASAD గారు నీలిరంగు ఇప్పటికే వెబ్ లింకుల కొరకు వాడుతున్నాము కనుక అది అనవసరం. లేని పేజీలకు ఎరుపు వస్తుంది కాబట్టి అదీ అవసరం లేదు. ఇక మిగిలిన రంగులు అన్నీ పేడెడ్ షేడ్స్ కాబట్టి అత్యవసరమైనచో "డార్క్ గ్రీన్" లేదా "డార్క్ పింక్" వంటివి మాత్రం వాడుకోవడం ఉత్తమం...--Viswanadh (చర్చ) 04:52, 18 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Geographical Indications in India Edit-a-thon మార్చు

​Hello,

 

CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical_Indications_in_India_Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (చర్చ) 17:34, 18 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

2016 WMF Strategy consultation మార్చు

Please help translate to your language

Hello, all.

The Wikimedia Foundation (WMF) has launched a consultation to help create and prioritize WMF strategy beginning July 2016 and for the 12 to 24 months thereafter. This consultation will be open, on Meta, from 18 January to 26 February, after which the Foundation will also use these ideas to help inform its Annual Plan. (More on our timeline can be found on that Meta page.)

Your input is welcome (and greatly desired) at the Meta discussion, 2016 Strategy/Community consultation.

Apologies for English, where this is posted on a non-English project. We thought it was more important to get the consultation translated as much as possible, and good headway has been made there in some languages. There is still much to do, however! We created m:2016 Strategy/Translations to try to help coordinate what needs translation and what progress is being made. :)

If you have questions, please reach out to me on my talk page or on the strategy consultation's talk page or by email to mdennis@wikimedia.org.

I hope you'll join us! Maggie Dennis via MediaWiki message delivery (చర్చ) 19:06, 18 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కుల గురించి చేపుస్తకం, వర్క్ షాప్ మార్చు

వికీపీడియా కొరకు కాపీహక్కుల చేపొత్తం (కాపీరైట్ హ్యాండ్ బుక్)పై సీఐఎస్-ఎ2కె సంస్థ నుంచి ప్రతినిధులు సముదాయ సభ్యులను వారికి ఉన్న ప్రశ్నలు ఏమిటన్న అంశంపై సంప్రదించిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుపై కృషిచేసి కాపీహక్కుల చేపొత్తం చిత్తుప్రతి తయారుచేశారు. ఆ ప్రతిలో వికీపీడియన్ల ప్రశ్నల్లో చాలావాటికి సమాధానాలు కూడా పొందుపరిచారు. ఈ చిత్తుప్రతిని ప్రస్తుతం తెలుగులోకి అనువదించాలి, అందుకు ఆసక్తిగల తెలుగు వికీపీడియన్లు కింద ఆ విషయాన్ని తెలపాల్సిందిగా మనవి.
అలాగే గతంలో రాజశేఖర్ గారు తదితర సముదాయ సభ్యులు తెలుగు వికీపీడియన్లకు కాపీహక్కుల గురించి శిక్షణా కార్యక్రమం కావాలని, అది కూడా ప్రత్యేకించి నిపుణుల చేసేలా ఉండాలని కోరారు. కాపీహక్కుల అంశంపై నిపుణులతో శిక్షణ కార్యక్రమం చేయడానికి స్కైప్, గూగుల్ హ్యాంగవుట్ వంటి వాటిలో కానీ నేరుగా కానీ చేసే వీలుంటుంది. ప్రత్యక్షంగా వారు విచ్చేసి చేయాలని భావిస్తే కనుక బెంగళూరు లేదా న్యూఢిల్లీ నుంచి విమానంలో రావాల్సివుంటుంది. ఈ విమాన టిక్కెట్టు ఏర్పాటుచేయడం ఉపయుక్తమేనని భావిస్తే ఆ విషయాన్ని ఇక్కడ చర్చించి ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 20:44, 19 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సమస్య చిరకాలంగా తెవికీ సభ్యుల్ని వేదిస్తున్నది. ఉగాది పురస్కారాల సమయంలో అర్జునరావు గారు DLI నుండి ఒక ప్రముఖమైన వ్యక్తితో లైవ్ చాటింగ్ ఏర్పాటుచేశారు. తరువాత కాలంలో పవన్ సంతోష్ IEG గ్రాంటు క్రింద 6,000 పైగా పుస్తకాల వివరాలను వికీపీడియా జాబితా రూపంలో చేర్చారు. అర్జునరావు గారు తరువాత నేను వికీసోర్స్ (ప్రస్తుతం 200 పుస్తకాలున్న) లో పనిచేస్తున్నప్పుడు నాకు ఎదురైన సమస్య కాపీహక్కులకు సంబంధించినది. దీని మీద పూర్తి అవగాహన కల్పించడానికి ఒక మీటప్ ఏర్పాటు చేస్తామని విష్ణువర్ధన్ గారు తరచుగా చెపుతుండేవారు. కానీ అది జరుగలేదు. వికీ కామన్స్ నుండి సుమారు 15 తెలుగు పుస్తకాలను కాపీహక్కుల సమస్య మూలంగా తొలగించబడ్డాయి. ఇది చాలా బాధ కలిగించింది. సభ్యులు ఎంత వ్యతిరేకించినా 3-4 పుస్తకాలను తప్ప మిగిలిన వాటిని రక్షించలేకపోయాము. దీనికి ముఖ్యమైన కారణం DLI లోని పుస్తకాల గురించిన కాపీహక్కుల వివరాలు స్పష్టంగా లేకపోవడం. ఈ పైకారణాలవలన ఈ కాపీహక్కుల అంశంపై నిపుణులచేత (నిజంగా నిపుణులచేత) శిక్షణ ఏర్పాటుచేయడం చాలా అవసరం. దీనికి విమానం టిక్కట్లు ఇవ్వవలసి వచ్చినా అది ఉపయోగమే. ఈ కార్యక్రమాన్ని అతిత్వరగా నిర్వహించమని CIS వారికి తెవికీ తరపున మా అందరి మనవి.--Rajasekhar1961 (చర్చ) 16:28, 31 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 24, 2016 సమావేశం మార్చు

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 24, 2016 సమావేశం… జనవరి 24, 2016 (నాల్గవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/జనవరి 24, 2016 సమావేశం లో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 10:17, 20 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Watchlist notice for Geographical Indication edit-a-thon మార్చు

We have already informed you about the upcoming Geographical Indications in India edit-a-thon. I am requesting admins of this Wikipedia to put a watchlist notice/banner for the event

Locations required:

  • India/Global

Possible messages:

(Translation credit: Rahmanuddin Shaik)

Date range required:

  • Until 2016-01-28

Thank you. --Titodutta (చర్చ) 09:02, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల జాబితా ప్రచురణ పద్ధతి మార్చు

అందరికీ నమస్కారం,
ఇన్నాళ్ళూ మొలకల జాబితాను సృష్టించిన వారి పేరుతో పాటుగా ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పద్ధతి ఆమోదయోగ్యమేనా అన్న ప్రశ్నతో పాటు మరిన్ని అంశాలను గురించి ఇక్కడ రాశాను. దానికి జేవీఆర్కే గారు తప్ప ఇతరులు ఎవరూ స్పందించలేదు. ఆయన మొలకల జాబితా మాత్రమే కాక ఆ జాబితాలోని మొలకల్లో ఎన్ని తర్వాతి నెలలో అభివృద్ధి అయ్యాయి అన్న విషయంపై కూడా ఓ జాబితా ప్రచురిస్తూండమన్నారు. అది అటుంచితే మొలకలు సృష్టించినవారి పేరును వారి మొలకల ఎదురుగా ప్రచురించే పద్ధతి ఆమోదయోగ్యమేనా అన్నదానికి ఏదోక సమాధానం ఇవ్వగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:56, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక స్థాయి దాటించాలంటే 20 కె.బి కనీస వ్యాస పరిమాణం ఉండాలనే పాలసీ తెలుగు వికీపీడియాలో చేసుకున్న సంగతి అందరికీ విదితమే. సాధారణ సభ్యులు చేసిన ఏక వాక్య వ్యాసాలను, ఒక మూసతో తయారుచేసే వ్యాసాలను అవి విస్తరింపబడనందువలన తొలగించడం జరిగుతుంది. క్రియాశీలక సభ్యులు మొలకలను సృష్టించడం సరియైన పద్ధతి కాదు. ఒక వేళ మొలకలను సృష్టిస్తే దాని విస్తరణకు కృషిచేయాలని మనవి. వికీలో రాశి కంటే వాసి పెంచితే వికీ నాణ్యత పెరుగుతుంది. కానీ రాశి పెంచే కృషి జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని రోజులుగా అనేకమైన మొలక వ్యాసాలు వికీలో చేరిపోతున్నాయి. ఫలానా సమయానికి ఇన్ని వ్యాసాలు చేర్చాలనే నియమమేదైనా ఉన్నట్లు! ఒక వ్యాసం ప్రారంభిస్తే దానిని మొలక స్థాయి దాటినంతవరకైనా విస్తరించి వేరొక వ్యాసం ప్రారంభించవచ్చు కదా! ఒకేసారి వేల సంఖ్యలో మొలకలు చేర్చితే తెవికీ నాణ్యత పెంచినట్లు కాదని నా భావన. మొదటి పేజీలో ప్రచురించడానికి విశేష వ్యాసాలు కరువైన పరిస్థితి యేర్పడింది. ఈ వారం వ్యాస పరిగణనల వర్గంలో గూగుల్ అనువాదం కాని వ్యాసాలు అధికంగానూ, మూలాలు లేని వ్యాసలు కూడా ఉన్నాయి. గతంలో మంచి విస్తరిత వ్యాసాలు తయారయ్యాయి. ఒక వ్యాసం పూర్తి స్థాయిలో విస్తరించాకే సభ్యులు వేరొక వ్యాసం పై దృష్టి పెట్టే వారు. ఆ వ్యాసాలు మొదటి పేజీలొ ప్రచురణకు, చదివేవారికి ఎంతో ఉపయోగపడేవి. కాని ప్రస్తుతం ఏ వ్యాసాన్ని మొదటి పేజీలో ఉంచడానికి అనుకూలమైన వ్యాసం లేదు. విశేష వ్యాసాలపై సభ్యులు దృష్టి పెట్టాలని మనవి.

ప్రతీనెలా మొలకల జాబితా యిదివరకు తయారుచేసేవారు. మొలకలు సృష్టించినవారి పేరును వారి మొలకల ఎదురుగా ప్రచురించే పద్ధతి సరియైనది. కానీ ఆయా సభ్యులు వారి మొలక వ్యాసాలు విస్తరించడానికి కృషి చేయాలి.-- కె.వెంకటరమణచర్చ 17:27, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలు వ్రాసే పనిచేసే వాళ్ళు వ్రాయండి. వ్రాసేవాళ్ళని మీకు తోచినట్లు చేతికి పని చెప్పకండి. అసలు మీ బాధ, సమస్య ఏమిటో సూటిగా వ్రాయండి. ఇలా మీరు కెలుకుతూ ఉంటే ఆ వ్రాసే వేళ్ళ మీద లెక్కపెట్టే వాళ్ళు కూడా వ్రాయడము మానుకుంటారు. ఇది కొంత మంది జాగీరు లాగా ఉంది వారి ఆలోచనల వ్రాతలు. పిచ్చ రాతలు రాయడము మానుకుంటే మంచిది మర్యాద కూడానూ. ఎవడో కెలుకుతాడు అందరి బుర్రలకు చెత్త పని పెడతాడు. అసలు వాడు బయటకు రాడు. నేను వ్రాశినది పైన ఇద్దరు (పవన్ మరియు వెంకటరమణ గారు) వాడుకరులను ఉద్దేశించి వ్రాశినది కాదని గ్రహించగలరు. JVRKPRASAD (చర్చ) 18:09, 22 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలా మొలకలు పుట్టగొడుహగుల్లా పుట్టడానికి కారణం ఒకటై ఉండొచ్చు. ఇది కేవలం నా సిద్ధాంతం మాత్రమే. నేనొక వ్యాసం రాస్తున్నాననుకుందాం. అందులో రామన్ అనే పేరు వచ్చిందనుకుందాం. ఈ రామన్ కి ఒక లంకె ఉంటే బాగుంటుందనిపించి ఆ మాటకి ఇటూ, అటూ ఒక జత చొప్పున చదరపు కుండలీకరణాలు పెడతాను. కాని ఆ పని చెయ్యడం వల్ల ఒక మొలక పుట్టే అవకాశం ఉందనిన్నీ, ఆ మొలకని కూడా పెంచవలసిన బాధ్యత కూడా నాదే అనిన్నీ నాకు అవగాహన లేనప్పుడు అది ఒక "దిక్కులేని మొలక" లా తయారవుతుంది. ఇలాంటి మొలకలని నేను ఎన్నింటినో పొడిగించేను. కాని ఆ మొలక సృష్టించిన వారి పేరు ఆ వ్యాసంతో నిలుస్తుంది కాని తరువాత దానిని పొడిగించి, మరమ్మత్తు చేసిన వారికి ఆ "రికగ్నిషన్‌" రాదు. అవిరామంగా మొలకలని సృష్టించేవారు ఇటువంటి "రికగ్నిషన్‌" కోసం సృష్టిస్తున్నారనుకుందామంటే నమ్మబుద్ధి కావడం లేదు. కాని ఒకటి మాత్రం నిజం. మరీ ఎక్కువ మొలకలు ఉంటే బాగుండదు అనే ప్రతిపాదనలో పస ఉండే ఉంటుందని అనిపిస్తోంది. Vemurione (చర్చ) 03:40, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మొలకల జాబితా నెలావారీగా తయారుచేస్తున్నాము. అందులో కాలానుగుణంగా కొన్ని అభివృద్ధిచేయబడి మొలకస్థాయిని దాటి వ్యాసంగా మారుతుంది. ఆయా జాబితాలో మొలకలను సృష్టించిన వాడుకరి పేరును చేర్చడం ఉపయోగం అనే నా అభిప్రాయం. ఈ పద్ధతి వేరెవరైనా వారు ప్రారంభించినవి కాని మొలకలను వృద్ధిచేయాలనుకున్నా అడ్డంకి కాదు.--Rajasekhar1961 (చర్చ) 04:38, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

24న విజయవాడలో వికీమీటప్ మార్చు

విజయవాడ నగరంలో జరుగుతున్న కార్యకలాపాల గురించి వికీపీడియన్లకు తెలిసిందే. వాటికి తోడుగా విజయవాడలో ఈ ఆదివారం వికీమీటప్ నిర్వహించాలని, దాన్ని హైదరాబాద్ లో జరుగుతున్న నెలవారీ సమావేశంతో వర్చువల్ గా కలిపాలన్నది ఆలోచన. ఈ ఆలోచనను కార్యరూపం దాల్చేలా ప్రారంభస్థాయిలో విజయవాడ ఆంధ్రా లొయొలా కళాశాలలో జనవరి 24, 2016 ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించి ఓ వికీమీటప్ నిర్వహించనున్నాము. కార్యక్రమంలో పాల్గొనేందుకు జేవీఆర్కే ప్రసాద్ గారు, తదితరులు కొందరు ఆసక్తి కనబరచగా, నిర్వహించేందుకు విశ్వనాథ్ ముందుకువచ్చారు. ఐతే ఆయనకు ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, సమావేశానికి తేదీ దగ్గరపడుతూండడం వంటి కారణాలతో సమావేశ నిర్వహణ సహకార బాధ్యతలు చేపట్టదలచిన పవన్ సంతోష్ ఈ విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. కార్యక్రమానికి సూచనలు, అభినందనలు వంటివి తెలియజేయాల్సిందిగా సముదాయ సభ్యులను ఆహ్వానిస్తున్నాం. వీలైనవారంతా హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాం.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:10, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సూచనలు మార్చు

విజయవాడలో నెలవారీ సమావేశాలకు వేదిక లభించడం మంచి పరిణామం. అయితే విజయవాడ మరియు హైదరాబాదు సమావేశాలలో పాల్గొన్న సభ్యులను ఒక 15-20 నిమిషాల నెట్ మీటింగ్ జరిపితే బాగుంటుంది. దీనిలో ఒక దగ్గర జరిగిన కార్యక్రమ వివరాలను మరొక దగ్గర పాల్గొన్న సభ్యులకు తెలియజేసిన ఇంకా బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 10:34, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రాజశేఖర్ గారు, ఈసారి మీటింగ్ ను హైదరాబాద్ మీటింగ్ తో ఇలా ఒక 15 నిమిషాల పాటు అనుసంధానించాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:05, 25 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు మార్చు

అభినందనలు.--శ్రీరామమూర్తి (చర్చ) 08:21, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ లో జరుగతున్న తెవికీ నెలవారి సమావేశాల మాదిరిగానే ఇతర ప్రాంతాలలో కూడా నెలవారి సమావేశాలు నిర్వహించాలనే సూచనలు, ప్రతిపాదనలు గతంలో వచ్చాయి. ఇప్పడు వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. విజయవాడలో తెవికీ నెలవారి సమావేశాలు నిర్వహించేందుకు ముందుకువచ్చిన విశ్వనాథ్.బి.కె. అన్నయ్యకు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరచిన జేవీఆర్కే ప్రసాద్ గురువు గారికి మరియు సమావేశ నిర్వహణ సహకార బాధ్యతలు అందజేస్తున్న పవన్ సంతోష్ కు అభినందనలు. ప్రతి నెల నెలవారి సమావేశాలు జరపుకోవాలని.. విజయవాడతోపాటు మరికొన్ని ప్రాంతాలలో నెలవారి సమావేశాల జరిగేలా తెవికీ సభ్యులు చొరవ చూపాలని కోరుకుంటున్నాను. --Pranayraj1985 (చర్చ) 08:45, 23 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Geographic indication మార్చు

 Y సహాయం అందించబడింది

వికీలో ఎడిటథాన్ జరుగుతున్న నేపధ్యంలో Geographic indication పదానికి సరైన తెలుగుపదాన్ని గుర్తిస్తే బాగుంటుంది. భౌగోళిక సూచన, భౌగోళిక చిహ్నం/గుర్తు/ఆనవాలు, భౌగోళిక లక్షణం మొదలైనవి ఆంధ్రభారతి నిఘంటువును చూసి ప్రతిపాదిస్తున్నాను. సభ్యులు వారివారి విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:35, 25 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారు, పదము Geographical Indication=భౌగోళిక గుర్తింపు సంకేతం అని నేను వాడుతున్నాను. JVRKPRASAD (చర్చ) 06:01, 25 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
భౌగోళిక గుర్తింపు అనే పదం సరియైనది.-- కె.వెంకటరమణచర్చ 16:13, 25 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ దిగువ ఇచ్చిన అర్థాలు కూడ పరిశీలించమని మనవి. Indication అన్న మాటకి recognition అన్న మాటకి మధ్య అర్థంలో తేడా ఉండడం ఉంది. కాని వాడుకలో స్థిరపడ్డ అర్థాన్ని తోసి రాజనడం కష్టం.

indicate, v. t. సూచించు; indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం; indicator of depth, ph. దఘ్నార్థకం; లోతుసూచిక; indicator of direction, ph. దిక్సూచి; indicator of meaning, ph. భావార్థకం; భావసూచిక; indicator of plural, ph. బహువచన స్పోరకం; indicator of size, ph. పరిమాణార్థకం; Vemurione (చర్చ) 02:32, 26 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ నియమాల ప్రకారం వాడుకలోనున్న పదానికే ప్రాధాన్యత ఇవ్వాలి కావున భౌగోళిక గుర్తింపు అనే పదాన్ని Geographic indication కు అతి దగ్గర తెలుగు పదంగా నిర్ణయించాము. మీ స్పందనలకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:12, 26 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, Geographical Indication=భౌగోళిక గుర్తింపు సంకేతం అని, అలాగే, Geographic recognition = భౌగోళిక గుర్తింపు అని వాడుకోవాలని దయచేసి గమనించగలరు. JVRKPRASAD (చర్చ) 08:31, 26 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

GI edit-a-thon 2016 updates మార్చు

Geographical Indications in India Edit-a-thon 2016 has started, if you have not signed up still, please consider joining now.

 
Updates

Here are a few updates:

  1. More than 80 Wikipedians have joined this edit-a-thon
  2. More than 20 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
  3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your Wikipedia too.

Ideas
  1. Please report the articles you are creating or expanding here. It'll be difficult for us to count or review articles unless you report it.
  2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Further updates

Please keep checking the Meta-Wiki event page for the latest updates. --MediaWiki message delivery (చర్చ) 08:33, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హెచ్‌ఎం టివి - వికీపీడియా మార్చు

ఈ రోజు సాయంత్రం 6.30 - 7.00 గం.ల మధ్యన హెచ్‌ఎం టివి నందు నల్లమోతు శ్రీధర్ వారితో ముఖాముఖీ చర్చలో కార్యక్రమము చివరన యాంకర్ అడిగిన ప్రశ్నకు ఐదు లేదా ఆరు విధములయిన సమాచారం లభించే చోట్లలో గూగుల్ తరువాత వికీపీడియా లోనే అధిక సమాచారం లభిస్తుందని, ఎప్పటికప్పుడు సమాచారము అప్‌డేట్ అవుతూ ఉంటుందని, అన్నిరకములయిన చిన్న నుండి పెద్ద సమాచారం లభిస్తుందని తెలియజేశారు.JVRKPRASAD (చర్చ) 13:36, 27 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

The visual editor is coming to this wiki మార్చు

 

Hello. Please excuse the English. Please help translate to your language. కృతజ్ఞతలు!

Hi everybody,

My name is Erica, and I am a Community Liaison at the Wikimedia Foundation. I'm here to let you know that the visual editor is coming to editors at this Wikipedia soon. It allows people to edit Wikipedia articles as if they were using word processing software.

You don't have to wait until the deployment to test it; you can test the visual editor right now. To turn it on, select "బీటా" in your preferences. Choose "విజువల్ ఎడిటరు" and click save. When it is enabled, you will press the "మార్చు" button to edit an article in the new software. To use the wikitext editor, you can press "మూలపాఠ్యాన్ని సవరించు".

After the deployment, everyone will automatically have the option to use either the visual editor or the current wikitext editor. For more information about how to use the visual editor, see mw:Help:VisualEditor/User guide.

More information about preparing for the visual editor is posted here.

Thank you, and happy editing! --Elitre (WMF) (talk) 18:29, 5 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇఫ్లూలో సీఐఎస్-ఎ2కె కార్యశాల మార్చు

గమనిక: సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ తన్వీర్ హాసన్ తెలుగులో రాయలేని కారణంగా ఆయన తరఫున దీన్ని ప్రచురిస్తున్నాను

"భారతీయ భాషల్లో డిజిటల్ రీసోర్సులు సృష్టించడం" అన్న రెండు రోజుల కార్యశాలను సీఐఎస్-ఎ2కె EFLU, హైదరాబాద్ మరియు CILHE, TISS ముంబై వారి సహకారంతో హైదరాబాద్ ఇఫ్లూలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో నిర్వహిస్తోంది. సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ తన్వీర్ హాసన్ ఈ కార్యక్రమం కోసం 18 తేదీ నుంచి 21 వరకూ హైదరాబాద్ లో వుంటున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తెలుగు వికీపీడియన్లను కలసి రానున్న ట్రైన్ ద ట్రైనర్ కార్యక్రమం గురించి చర్చించాలని తన్వీర్ హాసన్ భావిస్తున్నారు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:22, 8 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ అనే వివరాలు తెలుపగలరు..--Viswanadh (చర్చ) 11:22, 8 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారూ థాంక్యూ. ఆ వివరాలు ఇప్పుడు చేర్చాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:51, 9 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం... ఈ కార్యక్రమం కోసం వస్తున్న సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ తన్వీర్ హాసన్ 21వ తేదీ వరకూ హైదరాబాద్ లో వుంటున్నారు కాబట్టి, తనని తెవికీ నెలవారి సమావేశానికి ఆహ్వానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--Pranayraj1985 (చర్చ) 08:47, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా యూజర్ ఇంటర్ఫేస్ మార్పు మార్చు

గత కొద్దికాలంగా తెలుగు వికీపీడియా యూజర్ ఇంటర్ఫేస్ ఒకే మూసలో ఉన్నది. దీనిని మార్చలేమా? బూట్‌స్ట్రాప్ లాంటి ఓపెన్ సోర్సు ఫ్రేమ్‌వర్క్ లను ఉపయోగించి దీనిని మరింత ఆకర్షణీయంగా చేయలేమా?--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 07:00, 10 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ ఆంధ్ర లయొలా కళాశాలలో డిజిటైజేషన్ స్ప్రింట్ మార్చు

విజయవాడలో ఆంధ్ర లయొలా కళాశాలలో డిజిటైజేషన్ స్ప్రింట్ ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించాలని కళాశాల నుంచి వచ్చిన అభ్యర్థన ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాము. ఆంధ్ర లయొలా కళాశాల కంప్యూటర్ లాబ్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండు రోజుల పాటు ఓసీఆర్, వికీసోర్సు వంటివాటిపై విద్యార్థులు కృషిచేస్తారు. విద్యార్థి వికీపీడియన్లకు కంప్యూటర్ లాబ్, వికీలో అనుభవం కలిగిన పూర్వ విద్యార్థులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా ఏయే ఇతర కార్యకలాపాలను నిర్వహించవచ్చన్న అంశంపై వికీపీడియన్లు సూచనలు చేయవచ్చు, కార్యక్రమానికి హాజరుకాదలుచుకుంటే కూడా తెలియపరచగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:22, 10 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడే నిర్వహించడం మంచిది. కొద్దిరోజుల తరువత విద్యార్ధులు పరీక్షల హాడావిడిలోఅందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి వికీ సోర్సును విద్యార్ధులకు పరిచయం చేయడం ద్వారా దానిని మరింత బలోపేతం చేయవచ్చు. ఈ కార్యక్రమానికి నేను హాజరయ్యే ప్రయత్నం చేస్తాను...--Viswanadh (చర్చ) 06:33, 11 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్.బి.కె. గారూ కార్యక్రమాన్ని రూపొందించడంలో విద్యార్థులకు రానున్న పరీక్షల హడావుడినే దృష్టిలో ఉంచుకున్నాం. మీరు సరిగా అంచనా వేశారు :) ఈ కార్యక్రమానికి మీరు రీసోర్సు పర్సనుగా రావడం, విద్యార్థులకు పలు అంశాలు తెలియజేయడానికి ముందుకురావడం హర్షణీయం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:58, 11 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఫిబ్రవరి 21, 2016 సమావేశం మార్చు

అందరికి నమస్కారం... వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఫిబ్రవరి 21, 2016 సమావేశం… ఫిబ్రవరి 21, 2016 (మూడవ ఆదివారం) నాడు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఫిబ్రవరి 21, 2016 సమావేశం లో చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 09:53, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాలు మార్చు

ప్రస్తుతం వికీలో మొలకలు, మూలాలు లేని వ్యాసాలు, బ్లాగుల నుండి కాపీ పేస్టులు, గూగుల్ లో యాంత్రిక అనువాదాలు, ఏక వాక్యాలు, మూస మాత్రమే ఉన్న వ్యాసాలు అధికంగా వచ్చుచున్నవి. వ్యాసం వ్రాయునపుడు దయచేసి వికీనియమాలకు అనుగుణంగా వ్రాయాలని మనవి. మనం వ్రాసే వికీపీడియా వ్యాసాలకు మూలాలు అత్యావశ్యకమని సభ్యులు గమనించాలి. వాసిగల వ్యాసాల కంటే రాశిని పెంచి తెవికీని లక్ష వ్యాసాల కోవలోనికి తీసుకు పోయె ప్రయత్నం జరుగుతున్నట్లుంది. మన స్వంత బ్లాగులలో ఏవిధంగానైనా వ్రాసుకొనవచ్చును. కానీ వికీలో నియమాలను పాటించాలని మనవి. వ్యాసకర్తలు మూలాలకు ప్రాధాన్యతనివ్వాలని మనవి. ఈ వాక్యాలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. ప్రతి ఒక్క వికీపీడియను తెలుసుకోవాల్సిన విషయమని గమనించాలి. -- కె.వెంకటరమణచర్చ 14:01, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వనరుల పరిశీలన కొరకు మార్చు

నమస్తే,
ప్రోగ్రాం అసోసియేట్ ఉద్యోగార్థులు ఉద్యోగ ప్రక్రియలో భాగంగా అనువదించి, అనుసృజించి తయారుచేసిన డాక్యుమెంట్లను వికీపీడియా కామన్స్ లోనూ, వికీసోర్సులోనూ చేర్చారు. ప్రధానంగా వికీపీడియాను మూల్యాంకనం చేయడం ఎలా అనే చేపొత్తం, వికీపీడియాతో విజయవంతంగా పనిచేయడం ఎలా అనే చేపొత్తం సోర్సులో చూడవచ్చు. వీటిని పరిశీలించి వీటిపై అభిప్రాయం తెలియజేయాల్సిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:59, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలను ఎందుకు తెలుపాలి? మార్చు

  • చదివేవారు ఇక్కడ ఉన్న సమాచారము సరయినదా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకోవటానికి.
  • వికీపీడియా యొక్క నాణ్యతా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు.
  • అక్కడ ఉన్న సమాచారం మీ సొంత అభిప్రాయం కాదు అని తెలుపటానికి. వికీపీడియా మీ వ్యాసాలలో మీ సొంత అభిప్రాయాలకు తావులేదు. అలాంటివి ఏమయినా ఉంటే గనక వాటిని చర్చా పేజీలలో ఉంచండి.
  • ఇతర సభ్యులు మీరు రాసిన దానిని వ్యతిరేకించకుండా ఉండేందుకు కూడా మూలాలు అవసరం.
  • మూలాలను తెలుపటం వలన అసలు సమాచారం అందించిన వారికి తగిన గుర్తింపు/గౌరవం ఇచ్చినట్లుంటుంది.

మూలాల ఆవశ్యకతను తెలుసుకోవడానికి, మరింత సమాచారం కోసం Wikipedia:Citing sources చూడండి.-- కె.వెంకటరమణచర్చ 03:28, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు లేని వ్యాసాలు వ్రాయకుండా ఉంటే మంచిది. ఎవరూ సొంత వ్యాసాలు మూలాలు లేకుండా వ్రాయకండి. మూలాలు లేని వ్యాసాలు వికీపీడియాలో తొలగించేందుకు అవకాశము ఉంటుంది. మూలాలు పేర్కొని సమాచారం కూడా సరి అయినది అయి ఉండాలి. JVRKPRASAD (చర్చ) 18:13, 17 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

tewiki anagha train articles? మార్చు

pls chk recent edits, all articles are trains

i am not editor on wiki

but observer

this is not good

it is like tewiki means trains

జనవరి నెల మొలకల మొలకల జాబితా మార్చు

జనవరి 2016 నెల మొలకల జాబితా ప్రచురిస్తున్నాను. సభ్యులు గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:33, 20 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం ఒక వ్యాసమునకు కనీస బైట్లు ఎన్ని ఉండాలని నిర్ణయించినారు ? ప్రస్తుతం ఒక వ్యాసమునకు బైట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడము ఎలా ? ఈ మొలకలను విస్తరించిన పిదప ఎప్పటికి ఈ జాబితా నుండి వైదొలగుతాయి ? నా మొలకలను ఇతరుల ప్రమేయము లేకుండానే ఎన్ని ఉన్నా నాకుగా నేను విస్తరించగలను అని వాడుకరులందరికీ ఈ సందర్భముగా విన్నవించి తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 22:44, 20 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ .. ఈ జాబితాలో అయోమయ పేజీలు కూడా చోటుచేసుకున్నాయి. దయచేసి వాటిని మినహాయించగలరు. ఉదాహరణ: సాగర్ అనునది అయోమయ నివృత్తి పేజీ. దీనిని వ్యాసంగా పరిగణించవలదు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:23, 22 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సరిజేస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:51, 23 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మొలకలు అనేవి మాకుగా మేము తెలుసుకే విధానం ఉన్నదా ? మొలకలు మొలకెత్తి మొక్కలు అయినట్లుగా తెలుసుకోవడము ఎలాగా ? అసలు వ్యాసము మొలక స్థితిలో ఉన్నదని ఎలా తెలుసుకోవాలి ? ఒక వ్యాసము మొలక అని దాని ప్రమాణము ఎన్ని బైట్లుగా ప్రస్తుతము తీసుకుంటున్నారు ? దయచేసి తెలిసినవారు అన్ని వివరములు తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 07:50, 23 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ మొలకలు అభివృద్ధి చెందితే దాన్ని వచ్చే నెల తెలుసుకుని రాయడం కూడా కుదురుతుంది. ఈ అంశంపై మీరు ఇప్పటికే ఓ పట్టిక తయారుచేసి చూపిస్తానని నా చర్చపేజీలో రాసివున్నారు. మీకు వీలుచిక్కినప్పుడు చేస్తే, సముదాయంతో చర్చిస్తే చేయవచ్చు. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:07, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె తెలుగు కార్య ప్రణాళిక (2015-16) చిత్తు ప్రతి మార్చు

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె తెలుగు కార్యప్రణాళికను సముదాయం అవసరాలకు అనుగుణంగా రీ-అలైన్ చేసే క్రమంలో కార్యప్రణాళికకు చిత్తు ప్రతిని రూపొందించాను. దాన్ని సముదాయ సభ్యులందరూ ఇక్కడ చూడవచ్చు. సభ్యులు ప్రణాళికను చూసి దానిపై తమ విలువైన సూచనలు, వ్యాఖ్యలు చేయాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:30, 23 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి కార్యప్రణాళికను పరిశీలించి ఓ వారంరోజుల్లో తమ విలువైన వ్యాఖ్యను, సూచనలను అందజేయాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:08, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మాతృభాషా దినోత్సవం మార్చు

భాషాభిమానులందరికీ వందనములు. మనందరం మనకు వీలైనంతగా తెవికీలో రచనలు చేస్తూ మాతృభాషకు సేవ చేసుకొనటం, సంతోషదాయకమే. అయితే ఇతరత్రా మాతృభాషకు సేవలు చేసేవారు, ఒకవైపు ఆ సేవలను అందిస్తూనే ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకొన్నారు. ఈ వీడియో చూడగలరు:

ప్రతి నెలా చక్కగా తెవికీ నెలవారీ సమావేశాలు నిర్వహించుకొనే మనం, ఈ దినోత్సవం నాడు ప్రత్యేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోవటం, ఒకింత విషాదకరం. తెవికీలో పత్రికా సంపాదకులకేం కొదవ లేదు. ఎక్కడో ఒకక్కడ "మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెవికీ!" అనే శీర్షిక క్రింద ఒక చిన్న వార్త వచ్చి ఉంటే ఎంత చక్కగా ఉండేది? తెవికీ యొక్క Brand Awareness పెరగటంతోబాటు, తోటి భాషాభిమానులు ఆకర్షితులు అయ్యేవారు. "తెవికీ మంచి పనే చేస్తోంది" అనుకొనేవారు.

సరే, పొరబాటు జరిగిపోయినది. కానీ, ఇటువంటివి మరల పునరావృత్తం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని నా మనవి. కేవలం మాతృభాష దినోత్సవమే కాకుండా, ఇటువంటి దినోత్సవాలేవున్ననూ, కాస్త ముందుగా ప్రణాళికలను ఏర్పరచుకొని, ఏవైనా కార్యక్రమాలు చేస్తే, తెవికీ పాఠకులతోబాటు, తెవికీకి వారి సేవలందించాలనుకొనేవారి సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇటువంటి దినోత్సవాలకు ఒక క్యాలెండరు ఏర్పాటు చేసుకోవటం మంచిది. దాని వలన ఏయే దినోత్సవాలు ఎప్పుడున్నాయో ఎవరో ఒకరు చూచి కేక వేయవచ్చు.

ఈ పోస్టు ఎవరినీ విమర్శించుటకు కాదు. సదుద్దేశ్యంతో, మనకున్న వనరులలోనే, మన చేతనైనంతగా మనం కూడా ఇటువంటి దినోత్సవాలు జరుపవలెనని నా చిన్న ఆశ. దయచేసి అపార్థం చేసుకోకండి.

ఈ విషయమై చర్చించుటకు వికీపీడియా:తెవికీ గమనించగల దినోత్సవాలు సృష్టించాను. మీ మీ సలహాలు, సూచనలు తెలియజేయగలరు.- శశి (చర్చ) 14:18, 23 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మరో పేరు అయితే బావుండేదేమో - పరిశీలించగలరు..--Viswanadh (చర్చ) 05:33, 24 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు Viswanadh గారు! "Days TeWiki may Observe" ని ట్రూ ట్రాన్స్లేట్ చేశాను. "తెవికీ జరుపవలసిన ఉత్సవములు" అంటే అదేదో ఆజ్ఞాపించినట్లు ఉంటుందని అనిపించినది. తగు పేరు సూచించగలరు. - శశి (చర్చ) 11:39, 24 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
"తెవికీ ఉత్సవాలు" అని వదిలేస్తేనే బాగుంటుంది. వీటిని కొంతమంది జరుపుకోవచ్చు; కొంతమంది మానుకోనూవచ్చును. మరికొన్ని ఉత్సవాలను కూడా ఇందులో చేర్చవచ్చును. ఉదా: బాలల దినోత్సవం; వయోవృద్ధుల దినం లాంటివి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనం జరుపుకోలేకపోయాం కనుక; దానికి బదులుగా ఈ మార్చినెలంతా లేదా ఒక వారం రోజులు మాతృభాష ఉత్సవాలు జరుపుకుందాం. అందరం వీలున్నన్ని తెలుగు భాష, వ్యాకరణం, పద్యం లాంటి గురించిన వ్యాసాలను ప్రారంభించి, అభివృద్ధి చేద్దాము. ఏమంటారు. Rajasekhar1961 (చర్చ) 07:50, 25 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:తెవికీ గమనించగల దినోత్సవాలు బదులుగా "తెవికీ తెలుగు ఉత్సవాలు", "తెవికీ నిర్వహించు ఉత్సవాలు" లేదా "తెవికీ నిర్వహించుకునే ఉత్సవాలు" "తెవికీ నిర్వహించ దగిన ఉత్సవాలు" అనే వ్యాసము వ్రాయవచ్చును అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 15:00, 25 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారి, JVRKPRASAD గారి మరియు సోదరుడు పవన్ సంతోష్ ల సలహాలు/సూచనలకు ధన్యవాదాలు. (పేరు గురించి) "ఇదే ఉండాలి" అని నేను కోరుకోను. మెజారిటీ సభ్యులు ఏది బావుంది అంటే అదే పేరు పెడదాం. పోతే మాతృభాష దినోత్సవం ఇప్పుడు గతం. గతం గత:. తెలుగు భాష గురించి ఎడిటాథాన్ లు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు. కానీ దాని గురించిన వార్త ఇప్పుడు వెలువడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ క్రింది విధంగా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించగలరు
* మార్చి 21 (సోమవారం) న ఎలాగూ కవుల దినోత్సవం ఉన్నది. మార్చి 19 (శనివారం) గానీ, లేదా మార్చి 20 (ఆదివారం) గానీ, అందరూ పాల్గొనే వీలు ఏ రోజు ఉంటుందో ఆ రోజు, ఔత్సాహికులైన కవులను వికీ కార్యాలయానికి (హైదరాబాదు అయితే గోల్డెన్ త్రెషోల్డ్) ఆహ్వానిద్దాం.
* వారి కవితా సేవలను ముందుగానే సేకరించి, వారి ప్రత్యేకతలను గుర్తించి, వారిలో ముగ్గురిని సన్మానిద్దాం. చప్పట్లు కొడదాం. తెవికీలో వారి కవితా సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయి? కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా, తెవికీ ద్వారా వారి కవితా సేవలను ఖండాంతరాలకు క్షణంలో ఎలా వ్యాపింపజేయచ్చో (ఇంకా ఇటువంటి అంశాలని) వారికి వివరిద్దాం.
* విలేకరి మిత్రులు దీని గురించి విచ్చలవిడిగా రాసేసుకుంటారు. సెల్ఫీలు దిగుదాం. ఫోటోగ్రఫర్ లకు వారి టాలెంటు చూపించుకొనే అవకాశాలు కల్పిద్దాం.
* ప్రపంచ కవుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్న తెవికీ (ఆహా! శీర్షిక వ్రాస్తూ ఉంటేనే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయి. రక్తం ఉరకలేస్తోన్నది. గుండె ఝల్లుమంటోన్నది. ఒళ్ళంతా పులకరించిపోతోన్నది. తన్మయత్వం ఆవహిస్తోన్నది.) అనే శీర్షిక ప్రముఖ దినపత్రికలలో అచ్చు అవుతుంది.
* ఇహ జూస్కొండి నా సామిరంగా.
* ఇదే కాన్సెప్టును మార్చి 3 న జరిగే రచయితల దినోత్సవానికి ఊహించుకొండి. కానీ దీనికి సమయం తక్కువ ఉన్నది. అందుకే కవుల దినోత్సవాన్ని ఉదహరించాను. కవుల దినోత్సవానికి అయితే కావలసినంత సమయం ఉన్నది. నిధులు సమకూర్చుకొనుటకు, కవులతో సంప్రదింపులకు, పకడ్బందీగా ఉత్సవ నిర్వహణను ప్రణాళికీకరించేందుకు మన వద్ద కావలసినంత సమయం ఉన్నది.
* కథనం లో తెవికీ ప్రతి యేడు ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇది వరకు మహిళా దినోత్సవం సందర్భంగా సరిక్రొత్త మహిళా వికీపీడియనులను ప్రపంచానికి పరిచయం చేస్తే, ఈ మారు కవుల దినోత్సవం నిర్వహించి తమ క్రొత్తదనాన్ని చాటుకొంది. వంటి వాక్యాలు వేయిద్దాం. (ఎప్పుడు ఏ దినోత్సవం నిర్వహిస్తుందో, ఈ తెవికీ అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంటుంది. ఈ రోజు ఏదో దినోత్సవం ట, తెవికీ నిర్వహించే ఉంటుంది. వార్తాపత్రిక చూస్తే తెలుస్తుంది. అన్న ఆలోచన కలుగుతుంది. వీలైతే ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా వార్త ప్రసారమయ్యేలా చూద్దం. పైగా మనం ఒక్కో నెల, మనకు అనుకూలంగా ఉండే ఒక్కొక్క ఉత్సవాన్ని మాత్రమే చేయటం వలన మనకు ఖర్చులూ కలిసొస్తాయి.)
* మే 17న ప్రపంచ సమాచార సంఘ దినోత్సవం, వెంఠనే మే 18న కొమర్రాజు లక్ష్మణరావు జన్మదినోత్సవం ఉన్నాయి. ఇటువంటివి కలిపి ఒకే ఉత్సవం చేసెయ్యటమే.
* ప్రస్తుతానికి ఇవి నా మదిలో మెదిలే ఆలోచనలు. ఇంకనూ ఏవైనా తడితే వాటిని కూడా చేరుస్తాను. అభిప్రాయాలను తెలుపగలరు.

- శశి (చర్చ) 17:14, 25 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

  1.   ': శశి కు నా మద్దతు ఫూర్తిగా ఇస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 23:27, 25 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఫేస్ బుక్ గ్రూప్ గా ప్రారంభమై నెలవారీ సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు, పుస్తక ప్రచురణలు వంటి బహుముఖ కార్యకలాపాలతో కవిత్వాన్ని, కవులని ప్రోత్సహిస్తున్న కవిసంగమం సంస్థ వారితో మాట్లాడి 20 మార్చి 2016న హైదరాబాద్ లో కవిసంగమం కవులకు ప్రత్యేకమైన కార్యశాల నిర్వహించనున్నాం. కార్యశాలలో కవుల గురించి, ప్రత్యేకించి భారతీయ కవయిత్రలున్న అంశాన్ని ఆధారం చేసుకుని థీమ్ తో తెవికీలో వ్యాసాల సృష్టి చేయాలని, ఇప్పటికే ఉన్న వ్యాసాలను మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఈ సందర్భంగా కవిసంగమానికి చెందిన కవయిత్రి రచించిన ఓ విజ్ఞానాత్మక గ్రంథాన్ని కూడా వికీసోర్సులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఈ థీమ్ ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు తెవికీపీడియన్లతో వారంరోజుల ముందు నుంచీ గోల్కొండ కవులపై ఎడిటథాన్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. అందులో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి రచించిన గోల్కొండ కవుల సంచిక పుస్తకాన్ని వికీసోర్సులో చేర్చి (కాపీహక్కుల పరిధి ఆవల ఉంది), దాన్ని మూలంగా స్వీకరించి తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేయడం, కొత్తవి సృష్టించడం చేసి కవుల దినోత్సవం నాటికి తెవికీలో ఆ థీమ్ పై చేసిన కృషిని పత్రికాముఖంగా ప్రకటించి ప్రాచుర్యం తీసుకువస్తే ఉభయతారకంగా ఉంటుందని మనవి. ఎడిటథాన్ ఆలోచనపై స్పందనలు ఆహ్వానిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:25, 29 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  1.   ': దీనికి నాపూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. ప్రపంచ కవుల దినోత్సవం తేదీ పక్కాగా నిర్ధారించండి. గోలకొండ కవుల చరిత్ర పుస్తకాన్ని నేను వికీసోర్సులో నేను చేర్చగలను. టైపింగ్ ముందుగానే చేద్దామా. అలా కాకపోతే వికీపీడియాలో వ్యాసాలు రచించడానికి టైపింగు చేసుకోవాలసి వస్తుంది. వివిధ రకాలైన కవితా విధానాల గురించిన వ్యాసాలు కూడా తయారుచేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 07:08, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మద్దతు తెలిపిన పితృసమానులు JVRKPRASAD మరియు గురుతుల్యులు Rajasekhar1961 గార్లకు ధన్యవాదాలు. ఆలోచనను ఆచరణలోకి తెచ్చేందుకు ప్రణాళికను ఏర్పరచిన సోదరసమానుడు పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) కు ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇహ మ్యాటర్ కు వద్దాం:
* ఒక అవిడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! అన్నారు ప్రకటనా మునీశ్వరులు. ఈ అవిడియాతో కనీసం వికీనైనా మార్చగలమో, క్రొత్త క్రియాశీలక వికీపీడియనులు చేర్చగలమో లేదో వెయిటింగు చేసి చూద్దాం.
* వీలైతే ప్రేమిద్దాం డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు! అన్నాడు, మిర్చి లాంటి (మన లాంటి) ఒక రచయితాశిరోమణి గారు. వీలైతే ప్రయత్నిద్దాం డూడ్, మహా అయితే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే పాస్ ఎలా అవ్వాలో తెలుస్తుంది.
* ప్రస్తుతం నేను వ్యక్తిగత కార్యకలాపాలలో తీరిక లేకున్నాను. కావున దగ్గరలో ఉన్న సమావేశాలకు హాజరు కాలేను. కానీ కవుల దినోత్సవం నాటికి కొంత వెసులుబాటు దొరికే అవకాశం ఉన్నది. వీలైతే తప్పక వస్తాను. ఈ లోపు ఈ దినోత్సవాల నిర్వహణకు, సంబంధిత కార్యకలాపాలకు నన్ను/నా అవిడియాలను/నా ల్యాప్ టాప్ ను వాడుకొండి సార్! అసలు వాడకమంటే ఏంటో చూపించండి...

- శశి (చర్చ) 09:10, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder: the visual editor is coming to this wiki soon మార్చు

 

Hello again. Please excuse the English. Please help translate to your language. కృతజ్ఞతలు!

This is a reminder that the visual editor is coming to all editors at this Wikipedia soon. As of this writing, the team is not aware of any issues specific to this language that should prevent the new software to be deployed here; therefore, please do let us know if you find any problems instead. You can report issues in Phabricator, the new bug tracking system or on the central feedback page on MediaWiki.org. There is a short guide at mediawiki.org that you can follow (as if it was a "checklist") to learn about the community work necessary to adapt the visual editor, and its referencing system in particular, to your community's needs.

If you can translate from English into this wiki's language, or know anyone who can, please follow the links below; just a little effort is required to make this language progress toward translations' completion! You'll help your community get the best possible experience when it comes to interface messages and documentation related to the visual editor. After you click on any links, your language should be available from the drop-down menu on the right. Once you've selected it, you'll see the document in English side by side with any translation work already done in your language. You can add new translations or modify existing ones. The interface is hosted at https://translatewiki.net; you'll need an account if you never translated there before. The other pages are at Mediawiki.org, for which you can use your regular Wikipedia account. You're welcome to contact me personally whenever you need help.

Thank you for your cooperation, and happy editing! --Elitre (WMF) (talk) 16:35, 26 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]