వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 82

పాత చర్చ 81 | పాత చర్చ 82 | పాత చర్చ 83

alt text=2021 జులై 1 - 2021 సెప్టెంబరు 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2021 జులై 1 - 2021 సెప్టెంబరు 30

Wiki Loves Women South Asia 2021 మార్చు

 

Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We warmly invite you to help organize or participate in the competition in your community. You can learn more about the scope and the prizes at the project page.

Best wishes,
Wiki Loves Women Team
17:46, 11 జూలై 2021 (UTC)

సైట్ నోటీసు గురించిన సమచారం మార్చు

ప్రతీ పేజీ లోనూ పైన పేజీల్లో ఫొటోలను చేర్చే పోటీ గురించి ప్రకటనను చూస్తున్నాం. ఈ ప్రకటనలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా మార్చాలి, వీటిని కనబడకుండా చేసుకోవడం ఎలా, తిరిగి కనబడేలా చేసుకోవడం ఎలా అనే విషయాల గురించి వాడుకరులకు సూచనలు పేజీలో చేర్చాను. పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 04:04, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:37, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities మార్చు

Dear Wikimedians,

As you may already know, the 2021 Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term.

After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election. This event is for community members of South Asian and ESEAP communities to know the candidates and interact with them.

  • The event will be on 31 July 2021 (Saturday), and the timings are:
  • India & Sri Lanka: 6:00 pm to 8:30 pm
  • Bangladesh: 6:30 pm to 9:00 pm
  • Nepal: 6:15 pm to 8:45 pm
  • Afghanistan: 5:00 pm to 7:30 pm
  • Pakistan & Maldives: 5:30 pm to 8:00 pm

KCVelaga (WMF), 10:00, 19 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దిద్దుబాటు సారాంశం పెట్టెలో ఒక సమస్య మార్చు

గతంలో దిద్దుబాటు సారాంశం పెట్టెలో సారాంశం టైపు చెయ్యడం మొదలు పెట్టగానే టైపించిన అక్షరాన్ని బట్టి ఈ మధ్య మనం రాసిన సారాంశాలను చూపించేది. వాటిలో మనకు అవసరమైన దాన్ని ఎంచుకునే వీలుండేది. వరసగా అనేక పేజీల్లో ఒకే రకమైన దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ సౌకర్యం ఎంతో వీలుగా ఉండేది. గత రెండు మూడు రోజులుగా ఈ సౌకర్యం పనిచెయ్యడం లేదు. ఇది నాకేనా.., అందరికీ ఉందా? ఒకసారి పరిశీలించగలరు. __ చదువరి (చర్చరచనలు) 07:34, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ అటువంటి సమస్య నాకేమీ కనిపించడంలేదు. దిద్దుబాటు సారాంశం పెట్టెలో ఇంతకుముందు చేసిన సవరణలను చూపిస్తుంది. అందులోంచి ఇంతకుముందు రాసిన సవరణ సారాంశాన్ని ఎంచుకుంటున్నాను. Abhi (చర్చ) 07:45, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
హ్మ్.. నాకే ఎందుకిలా జరుగుతోంది... హే శ్రీరామచంద్రా..!
ఒక్కసారి అభిరుచుల్లో ఏమైనా తేడా జరిగిందేమో ఛూడమంటావా.. అలాగే ప్రభూ!__ చదువరి (చర్చరచనలు) 07:58, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, నాక్కూడా సమస్యేమి లేదండి. ఇంతకుముందు రాసిన సవరణ సారాంశాలు కనిపిస్తున్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:59, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Pranayraj1985 గారు. సమస్య ఎక్కడుందో తెలవదం లేదు. బ్రౌజరులో ఏమైనా ఉందేమో చూడాలి. (అన్నట్టు మీరు నా మనోవేదనను పెంచేసారు.) __ చదువరి (చర్చరచనలు) 09:07, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, 😞-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:21, 25 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిన్నటి నుండీ పని చేస్తోంది. ఎందుకో తెలీదు. మొన్న కంప్యూటరును షట్ డౌను చేసాను. బహుశా అది పనిచేసిందేమో తెలవదు.__ చదువరి (చర్చరచనలు) 02:14, 28 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాల్లో ఫొటోలు చేర్చే పోటీ మార్చు

వ్యాసాల్లో ఫొటోలు చేర్చే పోటీలో భాగంగా గ్రామాల పేజీల్లో మ్యాపులను చేర్చే పని జరుగుతోంది. గ్రామాల వ్యాసాలకు ఎంతో విలువను చేకూర్చే పని ఇది. తక్కువలో తక్కువగా ఒక పాతిక ముప్పైవేల పేజీల్లో చెయ్యాల్సిన పని. ప్రస్తుతానికి ఒక మూడువేల పేజీల్లో జరిగింది. బోల్డంత పని మిగిలే ఉంది. ఈ పోటీలో ఇంకా నెలకు పైగా సమయం మిగిలి ఉంది. అందరూ ఇందులో పాలుపంచుకుంటే ఈ పనిని పోటీ ముగిసే లోగా విజయవంతంగా పూర్తి చెయ్యవచ్చు.

దీనివలన ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఈ పోటీలో తెలుగు వికీపీడియా భారతీయ భాషా ప్రాజెక్టుల్లో మొదటి స్థానం లోను, ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానం లోనూ ఉంది. మూడవ స్థానం కనుచూపు మేరలో కనిపిస్తోంది. మనందరం కృషి చేస్తే మూడవ స్థానం సాధించడం కష్టమేమీ కాదు. అందరూ ఈ పోటీలో పాల్గొని, తెవికీని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు తోడ్పడండి.__ చదువరి (చర్చరచనలు) 02:27, 28 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు రాష్ట్రాలలో గల మొత్తం 16069 పిన్ నెంబర్ లను గూగుల్ జియో లొకేషన్ API సహాయంతో రేఖాంశం మరియు అక్షాంశం వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచాను , ఇది గూగుల్ మ్యాప్స్ కు వెళ్లి రేఖాంశం మరియు అక్షాంశం కాపీ చేసే శ్రమను తగిస్తుంది,ప్రాజెక్టు సభ్యులకు ఉపయోగ పడవచ్చు. Kasyap (చర్చ) 09:45, 29 జూలై 2021 (UTC) నెనర్లు @Kasyap గారు. Nskjnv (చర్చ) 09:48, 29 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా 2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికల్లో తెలుగు తేజానికి మన మద్దతు మార్చు

వికీమీడియా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు ఆగస్టు 4 నుండి జరగనున్నాయి, ఇందులో మన తెలుగు కమ్మూనిటీ నుండి @పవన్ సంతోష్ గారు పోటీ చేయడం మనందరికీ గర్వ కారణం. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఈరోజు(2021 జులై 31) సాయంత్రం 4 గంటలకి జరిగిన సమావేశంలో తమ గురించి వికీమీడియా ఉద్యమంలో వారు చేస్తున్న కృషి గురించి వివరించారు. ఈ పోటీలో పాల్గొనే అభ్యర్థుల గురించి ఇక్కడ చూడచ్చు. ఈ పోటీలో ఉన్న 20 మంది అభ్యర్థులు వివిధ విభాగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు. ఒక ప్రొఫెసర్, మాలిక్యూలర్ బయాలజిస్ట్, క్రిమినాలజిస్ట్, ఆర్మీ ఆఫీసర్ ఇలా విభిన్న అనుభావాలు గల వ్యక్తులు పోటీ చేయడం వికీపీడియా విశిష్టతను కూడా మరింత పెంచిందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు జరిగిన సమావేశంలో అభ్యర్ధులని కొన్ని ప్రశ్నలు అడగగా, వారు ఎన్నికల్లో గెలిస్తే ఎటువంటి కార్యాచరణ చేపడతారో వివరించారు. వాటిలో కొంతమంది సమాధానాలు ఇక్కడ చూడండి. మన తెలుగు కమ్యూనిటీ నుండి పోటీ చేస్తున్న పవన్ సంతోష్ సూరంపూడి గారు తనదైన శైలిలో పరిచయం ఇవ్వడం ఆ తరువాత అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పడం గమనార్హం. ఓటు హక్కు ఉన్న వారందరు వారి అమూల్యమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే వ్యక్తిగత భావనలు, అభిప్రాయాలు పక్కన పెడుతూ మన తెలుగు కీర్తి చాటేలా తెలుగు వారంతా ఒక్కటే అని ప్రపంచానికి వినిపించేలా పవన్ సంతోష్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. Nskjnv (చర్చ) 15:04, 31 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv: గారూ, మీ మద్దతుకు అనేక ధన్యవాదాలు. దక్షిణాసియా, తూర్పు-ఆగ్నేయాసియా పసిఫిక్ ప్రాంతాల వికీపీడియన్లతో బోర్డు ఎన్నికల అభ్యర్థులకు జరిగిన ఈ సమావేశంలో మీరు పాల్గొనడం, అందరూ మాట్లాడిన విషయాలను కూలంకషంగా విని అవగాహన చేసుకోవడం, విశేషాలను ఇక్కడ పంచుకోవడం, కార్యక్రమంలో అభ్యర్థుల స్టేట్‌మెంట్లు, సమాధానాలు విని ఒక అభిప్రాయం ఏర్పరుచుకుని నాకు మద్దతునివ్వడం చాలా ఆనందం కలిగించింది. భవిష్యత్తులో వికీమీడియా సముదాయాల అభివృద్ధి కోసం మనం మళ్ళీ మళ్ళీ పనిచేస్తామని నా విశ్వాసం. మీ అందరి మద్దతుతో వికీమీడియా ఫౌండేషన్ బోర్డుకు ఎన్నికై వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి నా వంతు కృషిచేయాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:26, 1 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv గారూ, సమావేశానికి సంబంధించిన వివరాలను టూకీగా చెప్పినందుకు ధన్యవాదాలు. @Pavan santhosh.s గారిని ఈ పదవికి ఎన్నుకుంటే వికీమీడీయా వారి ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే -
  1. ఆ పదవికి అవసరమైన అర్హతలు, అనుభవం, కుశలత ఆయనకు ఉన్నాయి.
  2. వికీపీడియా విధానాలు మార్గదర్శకాలపై చక్కటి అవగాహన ఉంది. వాటిపైన గానీ, కాపీహక్కుల గురించి గానీ ఆయనంత సాధికారికంగా మాట్లాడగలిగిన వ్యక్తి తెవికీలో మరొకరు లేరు.
  3. ఆ పదవిలో ఏం పని చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే విషయంపై ఆయనకు స్పష్టత ఉంది.
  4. తాననుకున్నది అవతలి వారికి స్పష్టంగా చెప్పగల వాక్శక్తి అయనకు ఉంది. ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.
  5. వికీమీడియా ఫౌండేషనుకు సంబంధించిన వివిధ సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది.
  6. ఫౌండేషను పార్ట్‌నరు (సిఐఎస్) సంస్థల్లో పనిచేసి క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొత్తు.
అంచేతనే నా వోటు కూడా ఆయనకే. __ చదువరి (చర్చరచనలు) 04:11, 3 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సమావేశానికి నేను హాజరుకాలేకపోయాను.సమావేశ వివరాలు తెలిపినందుకు @Nskjnv గార్కి ధన్యవాదాలు.@Pavan santhosh.s గార్కి నా మద్దతును తెలుపుతూ, నాకు తెలిసిన వారిని కూడా ప్రోత్సహిస్తాను. యర్రా రామారావు (చర్చ) 05:03, 4 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీమీడియా బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే కాబట్టి మనం మన తెలుగు తేజం పవన్ సంతోష్ గారిని ఎన్నికల్లో గెలిపించుటకు, మనకు తెలిసిన వారిని ప్రోత్సహించుటకు సమయం దొరికిందని నా అభిప్రాయం. కాబట్టి పవన్ సంతోష్ గారికి మద్దతు తెలుపుతూ మనకు తెలిసిన వారిని ఎన్నికల్లో పాలుపంచుకొమ్మని ప్రోత్సహిద్దాం.--Abhilash (చర్చ) 13:00, 10 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 మార్చు

 

ప్రియమైన ఇండిక్ వికీసోర్స్ సభ్యులారా,

ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడింగ్ పోటీ -ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 గత సంవత్సరం పోటీలో పాల్గొని జయప్రదం చేసిన మీ అందరికీ అభినందనలు , అభివాదములు. ఆదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్ ఇండిక్ వికీసోర్స్ ప్రూఫ్ రీడథాన్ - ఆగస్ట్ 2021 ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని డిజిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా సంపన్నం చేసేందుకు సీ ఐ ఎస్ - ఏ2 కె సిద్ధమైంది

పాల్గొనేందుకు మీరేంచేయాలి

పుస్తకాల జాబితా : ప్రూఫ్ రీడింగ్ చేసేందుకు పుస్తకాల ఎంపిక చెయ్యాలి. తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసి సహకరించ వలసినదిగా కోరుతున్నాము. మీరు ఎంపిక చేసిన పుస్తకాలు వేరే అంతర్జాల సైట్లలో యూనికోడ్ లో ప్రచురించబడి ఉండరాదు. అలాంటి పుస్తకాలను సేకరించి పోటీకి సంబందించిన పుస్తకాల జాబితాలో చేర్చండి. ఇక్కడ ఇవ్వబడిన కాపీ హక్కుల నియమాలను పాటించాలి. సేకరించిన పుస్తకాల పుటలను పరిశీలించి పేజిలిస్ట్ <pagelist/>.ను తయారు చేయాలి

పాల్గొన దలచినవారు : పాల్గొనేవారు ఈ విభాగంలో తమ సంతకాన్ని నమోదు చేసుకోవాలి

సమీక్షకులు : ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కూడా సమీక్షకులుగా లేదా నిర్వాహకులు గా కూడా వ్యవహరించవచ్చు. అలాంటివారు ఇక్కడ నమోదు చేసుకోండి.

మన వికిసోర్స్ సమూహ సభ్యులందరూ తమకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రూఫ్ రీడథాన్ కు తగినంత ప్రచారము కలిగించ వలసినదిగా కోరుతున్నాను.

బహుమతులు : సీ ఐ ఎస్ - ఏ2 కె కొన్ని బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేసింది.అచ్చుదిద్దబడిన , ఆమోదింప బడిన పుటల వివరాలను ఇక్కడ చూడవచ్చు.

సమయము : ప్రూఫ్ రీడథాన్ భారతీయ కాలమానం ప్రకారం ఆగస్ట్ 15 , 2021 , 00.01 గంటల నుండి ఆగస్ట్ 31 , 2021, 23.59 గంటల వరకు నిర్వహించ బడుతుంది.

నియమాలు, మార్గదర్శక సూత్రాలు : సాధారణ నియమాలు , మార్గదర్శక సూత్రాలను ఇక్కడ చూడండి.

గణనము : పాయింట్ల గణనకు సంబందించిన వివరాలు ఇక్కడ చూడండి లాక్ డౌన్ పరిస్థితులలో ఇంటివద్దనే ఉంటున్న వికిసోర్స్ సంపాదకులు విరివిగా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను.

అభినందనలతో
Jayanta (CIS-A2K)
వికిసోర్స్ కార్యక్రమ అధికారి , సీ ఐ ఎస్ - ఏ2 కె -- 2021-08-01T17:05:33‎ Jayanta (CIS-A2K)

2021 WMF Board election postponed until August 18th మార్చు

Hello all,

We are reaching out to you today regarding the 2021 Wikimedia Foundation Board of Trustees election. This election was due to open on August 4th. Due to some technical issues with SecurePoll, the election must be delayed by two weeks. This means we plan to launch the election on August 18th, which is the day after Wikimania concludes. For information on the technical issues, you can see the Phabricator ticket.

We are truly sorry for this delay and hope that we will get back on schedule on August 18th. We are in touch with the Elections Committee and the candidates to coordinate the next steps. We will update the Board election Talk page and Telegram channel as we know more.

Thanks for your patience, KCVelaga (WMF), 03:49, 3 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Grants Strategy Relaunch 2020–2021 India call మార్చు

Namaskara,

A Grants Strategy Relaunch 2020–2021 India call will take place on Sunday, 8 August 2021 at 7 pm IST with an objective to narrate and discuss the changes in the Wikimedia Grants relaunch strategy process.

Tanveer Hasan will be the primary speaker in the call discussing the grants strategy and answering questions related to that. You are invited to attend the call.

Why you may consider joining

Let's start with answering "why"? You may find this call helpful and may consider joining if—

  • You are a Wikimedia grant recipient (rapid grant, project grant, conference grant etc.)
  • You are thinking of applying for any of the mentioned grants.
  • You are a community/affiliate leader/contact person, and your community needs information about the proposed grants programs.
  • You are interested to know about the program for any other reason or you have questions.

In brief,

As grants are very important part of our program and activities, as an individual or a community/user group member/leader you may consider joining to know more—

  • about the proposed programs,
  • the changes and how are they going to affect individuals/communities
  • or to ask your questions.

Event page:Grants Strategy Relaunch 2020–2021 India call

We request you to add your name in the participants list here.

If you find this interesting, please inform your community/user group so that interested Wikimedians can join the call.

Thank you,

Tito Dutta

Access to Knowledge,CIS-A2K

2021-08-03T21:01:41‎ MediaWiki message delivery

New Wikipedia Library collections and design update (August 2021) మార్చు

Hello Wikimedians!

 
The TWL OWL says log in today!

The Wikipedia Library is pleased to announce the addition of new collections, alongside a new interface design. New collections include:

Additionally, De Gruyter and Nomos have been centralised from their previous on-wiki signup location on the German Wikipedia. Many other collections are freely available by simply logging in to The Wikipedia Library with your Wikimedia login!

We are also excited to announce that the first version of a new design for My Library was deployed this week. We will be iterating on this design with more features over the coming weeks. Read more on the project page on Meta.

Lastly, an Echo notification will begin rolling out soon to notify eligible editors about the library (T132084). If you can translate the notification please do so at TranslateWiki!

--The Wikipedia Library Team 13:23, 11 ఆగస్టు 2021 (UTC)

This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

వ్యాసం తొలగింపుకు ప్రతిపాదనలో లోపాలు మార్చు

సభ్యులకు అందరకూ నమస్కారం. కొంతకాలంగా వికీలో కొత్త సభ్యుల రచనలు గమనిస్తూ వచ్చిన నాకు ఒక విషయంలో అసంతృప్తి ఉంది. కొత్త వాడుకరులకు ప్రోత్సాహం ఇవ్వడం వికీలో మొదటి ప్రాధాన్యతా అంశం గా అనుకొనే స్థాయి నుండి నేడు అది కొరవడి ఆరోపణ, అనుభవాధికారం పెరుగుతున్నదిగా అనుకుంటున్నాను. వాటిలో రచన మొదలైన వెంటనే కొందరు సభ్యులు ఆ వ్యాసంలో మార్పులు చేయడం అనేది. సరాసరి వ్యాసంలో మార్పులు చేయకుండా వ్యాసం రాస్తున్న వాడుకరినిదానిపై వివరణ కోరి, లేదా సలహా అడిగి ఆపై వాడుకరి రాసిన దానినిబట్టి నిర్ణయం తీసుకోవాలి. కాని ఇక్కడ వాటికి వ్యతిరేకంగా వాడుకరి వ్యాసం రాస్తూ ఉన్నపుడు అత్యుత్సాహంతో అందులో మార్పులు చేయడం తగని పనిగా అనుకుంటాను. ఒకవేళ వ్యాసంలో పైన వ్యాసం పూర్తి కాలేదని కాని, సమయం కావాలి అని గాని ఇస్తే కూడా దానిపై మార్పులు చేయడం అంతే ఒక రకమైన అధికార భావం, లేదా అహంకార భావం ప్రదర్శించడంగా అనుకోవచ్చు. అందుకే ఇలాంటి కొన్ని విషయాలపై కొంతకాలంగా వికీకి సేవలు అందిచిన అనుభవంతో, అంతకు మించిన బాధ్యతతో పాలసీలో కొన్ని మార్పులు కావాలని కోరుతున్నాను. అనగా

  • కొత్త వాడుకరి లేదా అనుభవం ఉన్న వాడుకరి అయినా రాస్తున్నపుడు మద్యలో అ వ్యాస భాగాలను తొలగించరాదు
  • కొంత సమయం అడిగినా లేదా వ్యాసంలో మార్పులు పూర్తి కాలేదని గాని ఉదహరింపు ఇచ్చిన తరువాత వ్యాసంలో బలవంతపు మార్పులు చేయరాదు.
  • వ్యాసం రాస్తున్నపుడు మధ్యలో రాతలు తొలగించడం, తొలగించిన దాన్ని వ్యాసకర్త మళ్ళీ రాస్తే దానిపై మళ్లీ తొలగింపు లేదా మరే చర్యలైనా అవి కక్ష సాధింపు లేదా అహంకారపూరితమైన భావాలుగానే పరిగణించవల్సిఉంటుంది.
  • ఇలా పదే పదే వ్యాసకర్తకు సమయం ఇవ్వకుండా ప్రతి చర్య ద్వారా వ్యాసభాగాల్ను తొలగించే వాడుకరిపై హెచ్చరిక, తదుపరి నిషేదం విధించడం అవసరం అనుకుంటాను.

ఇలాంటి కొన్ని సవరణలను తొలగింపు పాలసీల్లో చేర్చాలని అనుకుంతున్నాను. మీకేవైనా తొస్తే, దీనిపై సహ సభ్యూల అమూల్య అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతున్నాను...B.K.Viswanadh (చర్చ) 15:12, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ దిగువ వ్యాసానికి సంభందించిన చర్చ కనుక వాడుకరి పేజీ నుండి ఇక్కడ చేర్చుతున్నాను..

సాయి కిరణ్ గారికి,

కళా సాగర్ గారు ఇటీవలె జరిగిన ఒక వికీ సమావేశంలో శిరీష్ గారిని కలిసి, తన వద్ద స్థానిక కళాకారుల గురించి అపారమైన సమాచారం, ఫోటోలు ఉన్నవి అని, తన వద్ద ఉన్న సమాచారం తో వికీకి తోడ్పడాలని ఉందని, దీనిని నిశానిర్దేశం చేయవలసిందని కోరారు. అంతకు మునుపు కొన్ని ఏళ్ళ క్రితం, రాజశేఖర్ గారి ప్రాజెక్టు కళాసమాహారం లో భాగంగా ప్రాజెక్టు:చిత్రలేఖనం మొదలు పెట్టిన నాకు, కళాసాగర్ గారిని శిరీష్ గారు పరిచయం కుదిర్చారు. దీనిపై శిరీష్, రాజశేఖర్, పవన్ వంటి వారితో ఈ ప్రాజెక్టును, కళాసాగర్ గారి వద్ద ఉన్న సమాచారంతో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో కూలంకుషంగా చర్చించాను. సహ వికీపీడియను, కళాకారుడు అయిన విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో వ్యాసరచన మొదలు పెట్టమని సలహా ఇచ్చాను.

  • కళాసాగర్ గారు వ్రాసిన వ్యాసం ఇంకా పూర్తి కానే లేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ వ్యాసం మొదట్లోనే ఆయన ట్యాగు కూడా ఉంచారు.
  • వ్యాసం పూర్తి అయ్యి, తగు మూలాలు లేవని అనిపిస్తే, వ్యాసం చర్చా పేజీ లో దానిని సవాలు చేయటం సమంజసం అనుకొంటున్నాను. నిర్ధారిత సమయం లో మూలాలు చూపించలేకపోయిన చో, వ్యాసం తొలగించినా తప్పు లేదు.
  • తమ వద్ద ఉన్న సమాచారం, ఫోటో ల పై నకలు హక్కులను ఉపసంహరించుకొని, వికీ కి సేవలను అందించాలని ఉన్నత భావాలతో పని చేసే వారిని నిరుత్సాహ పరచటం, వికీ నియమాలను విరుద్ధం కావచ్చు.

పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాస/వాడుకరుల తొలగింపు విషయం లో వేచి చూచే ధోరణి మంచిదని నా అభిప్రాయం!

అర్జునరావు గారిని కూడా స్పందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను! - శశి (చర్చ) 16:21, 12 ఆగస్టు 2021 (UTC)

నమస్కారం శశి గారు, అయితే కళా సాగర్ గారు తమ కృషిని నకలు హక్కులు ఉపసంహరించుకొని వికీలో చేర్చాలనుకున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు. అయితే నిర్వాహక స్థాయిలో ఉన్న విశ్వనాథ్ గారు లేదంటే రాజశేఖర్ గారు ఈ వ్యాసాలను వికీలో చేర్చేటప్పుడు ఎలా చేర్చాలో , మూలలను చేర్చడం , విశ్వసనీయత గురించి తప్పక సూచించి ఉంటారని నమ్ముతున్నాను. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిర్మిస్తున్న వ్యాసాలలో విశ్వసనీయత లేదు వీటికి సంబందించిన మూలాలు నేనే స్వయంగా చేరుద్దమని ప్రయత్నించగా ఈ వ్యాస అంశాలు గాని వ్యక్తుల గురించి గాని అంతర్జాలం లో ఎక్కడ దొరకలేదు. అలాగే ఈ వ్యాసాలలో వికీ శైలికి పూర్తి విరుద్దంగా గౌరవ , ప్రముఖ వంటి పదాలు ఉపయోగిస్తున్నారు. ఈ అంశాలనన్నిటిని దృష్టిలో ఉంచుకొని కనీస ప్రమాణాలతో వ్యాసాలు నిర్మించాలి. ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో కళా సాగర్ ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది.కాలవిరాగ్య (చర్చ) 16:38, 12 ఆగస్టు 2021 (UTC)

కాలవిరాగ్య నిర్వాహకస్థాయి వాడుకరి వ్యాసాలు ఎలా చేర్చాలో అని అడిగారు. అంటే వ్యాసం రాస్తున్న 30 నిముషాల్లో మీరు స్పందించారు. అనగా మీకు అరగంటలో వ్యాసం పూర్తిగా అయిపోయి ఉండాలి. మూలాలు, విశ్వసనీయత, వికీశైలికి అనుగుణంగా మారిపోయి ఉండాలి. బహుశా వికీ రూల్స్ నాకు తెలియకుండా మార్పు చేసి ఉన్నారేమో అనుకుంటున్నాను. అలా . చేస్తే మాత్రం అరగంట లోపు పూర్తి వ్యాసం రాయలేకపోవడం నాతప్పే, రాస్తున్న వ్యాసంలో మీరు వచ్చి మీకు నచ్చిన విధంగా దిద్దుబాట్లు మొదలుపెట్టవచ్చు, తొలగింపులు చేయవచ్చు.. రాస్తున్న వ్యాసంలో ఏవైనా సందేహాలు సలహాలు ఉంటే ఆ యొక్క చర్చాపేజీలో రాయనక్కరలేదు. రాస్తున్న వ్యాసంలోనే మార్పులు చేయవచ్చు. సేవ్ చేసేటపుడు ఇద్దరం చేస్తున్నాం కనుక మీకు అవకాశం ఇచ్చి నేను ఉపసంహరించుకోవల్సిందే. వ్యాసంలోనే రాస్తున్న భాగాన్ని కాని భాగాలను కాని మీ ఇష్తప్రకారం తొలగించవచ్చు. పేజీని దారిమార్పులు లేదా వాడుకరి చర్చాపేజీగా మార్చేయవచ్చు. వ్యాసంపై సమయం కావాలని అడిగినా, లేదా వ్యాసభాగం పూర్తి కాలేదని రాసినా పట్టించుకోనక్కరలేదు. పైన ఉదహరింపును లెక్కచేయక మీ దిద్దుబాట్లను అధికారపూర్వకంగా కొనసాగించడం చేయవచ్చు. పూర్తి కాలేదని పెట్టిన నోట్ తొలగించి వ్యాసాన్ని తొలగింపుకు ప్రతిపాదించవచ్చు. తదుపరి వ్యాసకర్త చర్యలను తోసిపుచ్చవచ్చు. 1, - మునుపు జరిగిన ఒక సంగతి నాకు తెలియదు. అది వ్యాసం రాస్తున్న పత్రిక యొక్క సంపాదకుని వాడుకరి:Kalasagary పేజీలోనూ "ఈ user page వికీపీడియా సత్వర తొలగింపు ప్రమాణాలకు సరిపోతూ ఉండి ఉండవచ్చు" అని మూస తగిలించారు. అంటే మీకు ముందుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి.అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమే కాని దానికి ముందు ఇది ఒక వెబ్ పత్రికగా దీనికి పేజీ ఉండటానికి ఎందుకు తగినది కాదు. కూడలి (వెబ్ సైట్), టెక్ సేతు, ఈమాట, తెలుగు బాట, పొద్దు, ప్రాణహిత (జాల పత్రిక), వాకిలి, చిమట మ్యూజిక్ ఇలాంటి వాటిని పరిశీలించలేదా?, వాటికి వ్యాసాలు ఉన్నపుడు అలాంటి మాస, వార పత్రిక అయిన దీకి ఎందుకు స్థానం లేదు అనిపించింది" అని అనుకున్న అతరువాత కలిగింది..2,- "ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో కళా సాగర్ ఉదారభావం ఏమాత్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది." అని రాసారు. అంటే ఆయన నేర్చుకోనక్కరలేదు. ముందు తెలిపినట్టు వికీలో అడుగుపెట్టాలంటే వికీ నియమాలు, శైలి, అన్నీ నేర్చుకొని రావాలి. లేదా వికీలో వ్యాసాలు రాయకూడదు. ఇక్కడ రాస్తూ నేర్చుకోకూడదు. కొత్త వాళ్లకు చెప్పకూడదు, వాళ్ళు రాసాక వ్యాసాన్ని తొలగించాలి కాని ఇంకెవరూ ఆ వ్యాసంలో వికీ శైలిలో మార్పులు చేయకూడదు. వికీలో సమిష్టి కృషి అనేది రూల్స్ కు విరుద్దం అని తెలీదు. ఇలాంటి రూల్స్ అన్నీ నాకు కొత్తే. ఏదైనా గాని నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే ఇటీవల అంతగా చురుగ్గా లేని నాకు ఎవరైనా కొంచెం ఓపిక, సహనం ఉన్న రాజశేఖర్,అర్జునరావు, వాడుకరి వంటి వాడుకరులు తెలియచేయప్రార్ధన..(క్షమించాలి, నాకీబోర్డ్ బాలేదు కొన్ని అక్షరాలు సరిగా రావడం లేదు) ధన్యవాదాలుB.K.Viswanadh (చర్చ) 17:29, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Nskjnv: తెవికీ ప్రణాలిక ప్రకారం అభివృద్దిలో వున్న వ్యాసాలకు ముఖ్యంగా కొత్తవారు మొదటగా వ్రాస్తున్న వారికి కనీసం వారం పదిరోజుల సమయం ఇవ్వాలని అనుకున్నాము. మీరు అత్యుత్సాహంగా తొలగింపు ప్రతిపాదన ఎందుకు చేర్చినట్లు. ఇక పత్రిక వ్యాసాలకు చాలావాటికి వారి వెబ్ సైటు తెలియజేసిన సమాచారం సరిపోతుంది. తెవికీలోని ఇతర పత్రికకు సంబంధించిన వ్యాసాలు చూడండి. మనం ప్రారంభించిన కొత్తవాడుకరులకు శిక్షణ కార్యక్రమానికి ఇది చాలా పెద్ద దెబ్బ. దయచేసి వారికి సహాయం చేయండి. వీలుంటే వ్యాసంలోని లోపాలను ఎత్తి చూపడం కాకుండా వాటిని అభివృద్ధి చేయడానికి దారిచూపండి. ఆంగ్లవికీమాదిరిగా నిరంకుశంగా ప్రవర్తించవద్దు. నేను వ్యాసాన్ని తిరిగి స్థాపిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 06:31, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం @Rajasekhar1961 గారు, ఇక్కడ మీరు ఏ వ్యాసం గురించి చర్చిస్తున్నారో తెలుసుకోవచ్చా?కాలవిరాగ్య (చర్చ) 06:58, 14 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv గారు, వాడుకరిపేజీకి ఉపపేజీలలో రూపొందుతున్న పేజీలకు హెచ్చరికలు సాధారణంగా చేర్చము. అలాగే వాడుకరిపేజీకి కూడా. వాటిని మెరుగు చేయడానికి సూచనలు వాటి చర్చాపేజీల ద్వారా తెలపడం మెరుగైన పద్దతి. Kalasagary గారి చర్చాపేజీలో మీ స్పందనమేరకు ఈ సమస్య పరిష్కారమైందని భావిస్తున్నాను. @B.K.Viswanadh గారు వారి వాడుకరి పేరుబరిలో వృద్ధి చేస్తున్న వ్యాసాన్ని వృద్ధి చేయనివ్వండి. అందుకని ప్రధానపేరుబరినుండి వున్న దారిమార్పుల పేజీలు తొలగించాను. వ్యాసం పూర్తిఅయినతరువాత ప్రధానపేరుబరికి దారిమార్పు లేకుండా తరలించినతరువాత, మీకు అభ్యంతరాలుంటే చర్చించవచ్చు, తగిన హెచ్చరికలు చేర్చవచ్చు. అర్జున (చర్చ) 05:04, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మొత్తం వ్యవహారం గమనించాక ఒక రెండు విషయాలు చెప్పాలని నాకు తోచింది:
@Nskjnv: గారూ, మీరు నిర్వహణ పట్ల ఆసక్తి కనబరచడం మంచి విషయం. వ్యాసాల్లో విశ్వసనీయ మూలాలు ఉన్నాయా లేదా? వికీపీడియా శైలిలో ఉందా లేదా? అని పరిశీలించడం బాగానే ఉంది. ఐతే, చర్చలు చేసేప్పుడు ఉండాల్సిన ఒక ముఖ్యమైన దినుసు లోపించిందని నాకు అనిపించింది. ఎదుటివారి మార్పులన్నీ సదుద్దేశంతో చేసినవేనని భావించి, మీరు అలా భావిస్తున్నారన్నది అవతలివారికి అర్థమయ్యేలా వ్యవహరించడం. మీకు వికీపీడియా చర్చలు, నిర్వహణ కొత్త కాబట్టి అదేమీ పెద్ద తప్పు అని చెప్పట్లేదు. కానీ, చెప్తే తర్వాతి పట్టు నుంచి మీరు సరిద్దుకోగలరని నాకు గట్టి విశ్వాసం.
  • ఇందుకు ఒకటి ఉదాహరణ చూడండి: కళాసాగర్ గారి గురించి మీరు "ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో కళాసాగర్ ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది." అని రాశారు. పై నియమం ప్రకారం అవతలివారు చేసిన పొరబాట్లు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేసినవని (ఈ సందర్భంలో ఉదారభావంతో కాక ప్రచార దృక్పథంతో చేశారని) మీ వద్ద తిరుగులేని రుజువులు, సాక్ష్యాధారాలు ఉంటే తప్ప "మంచి ఉద్దేశంతో చేసిన పొరబాట్లేనని" భావించాలి. మరీ ముఖ్యంగా, కొత్తవారి పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఈ నియమమే చెప్తోంది. అంతమాత్రం చేత కొత్తవారు చేసిన ఏ పొరబాటైనా ఒప్పు అయిపోతుందని కాదు. ఈ సదుద్దేశమేనని భావించాల్సింది "ఉద్దేశాల పట్ల" తప్పించి "చేతల పట్ల" కాదు. మంచి ఉద్దేశంతో కూడా మనుషులు పొరబాట్లు చేయవచ్చు కదా అలాగన్నమాట.
ఇకపై ఎవరి పట్లనైనా వ్యవహరించేప్పుడు నిర్వహణ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ప్రకారమే కానియ్యండి, కాకపోతే "సదుద్దేశమేనని భావించడం" మాత్రం మరచిపోకండి. మరోమాటు చెప్తున్నాను - మీరు నిర్వహణ విషయంలో పాలుపంచుకోవడం తెలుగు వికీపీడియాకు నిస్సందేహంగా శుభసూచకం.
@B.K.Viswanadh: గారూ, కొత్తవారిని ప్రోత్సహించాలన్నది చాలా సరైన ఆలోచన. కాకపోతే, కళాసాగర్ గారు వికీపీడియా రచనకు ఎలాగైతే కొత్తవారో, ఈ Nskjnv గారు వికీపీడియా నిర్వహణకు అలానే కొత్తవారు. పోనీ వికీపీడియా రచన వరకే చూసినా కూడా నాకు తెలిసినంతవరకూ గత డిసెంబరులోనే రాయడం మొదలుపెట్టారు. ఆయన చేసిన పొరబాటల్లా పైన వివరించినట్టు సదుద్దేశాన్ని ఆపాదించుకోకుండా కళాసాగర్ గారి విషయంలో వ్యవహరించడం. అది కూడా బహుశా ఆయనకు ఇంతకుముందు ఈ సదుద్దేశం ఆపాదించుకోవడం అన్న నియమం తెలిసివుండకపోవడం కారణం అనుకుంటున్నాను. ఎంతైనా కొత్త వ్యక్తి కాబట్టి.
  • ఐతే, దురదృష్టవశాత్తూ ఇంతటి నిర్వహణ అనుభవం ఉన్న మీరు కూడా Nskjnv విషయంలో సదుద్దేశమేనని భావించండి అన్న నియమాన్ని పాటించలేదు. ఒకవేళ పాటించి ఉంటే - మొదట Nskjnv చర్చా పేజీలోకి వెళ్ళి కళాసాగర్ గారి ఉద్దేశాల విషయంలో Nskjnv రాసింది ఫలానా నియమం ప్రకారం సరికాదని చెప్పివుండేవారు. అలానే, మీరు రాసిన వ్యాసంపై ఆయన తీసుకున్న చర్యల విషయంలో వికీపీడియా నియమాలను ప్రస్తావిస్తూ మీ అభ్యంతరం ఏమిటో తెలియపరిచేవారు.
  • అందుకు భిన్నంగా రచ్చబండలో నేరుగా చర్చకు పెట్టడం ఒక ఎత్తు అయితే "మీకు ముందుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి." అంటూ ఆయనకు దురుద్దేశాన్ని ఆపాదించారు. ఆఫ్‌కోర్స్ అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమేనని కూడా రాశారు. అసలు, అవతలి వ్యక్తి చర్యలు, వ్యాఖ్యలు సక్రమం కాకున్నా వికీ నియమం ప్రకారం మొట్టమొదట సదుద్దేశాన్ని ఆపాదించుకోవాలి కదా అది చేయలేదు.
ఇకపైన అయినా మీరు Nskjnv గారు, అలాంటి భవిష్యత్ వాడుకరుల విషయంలో "సదుద్దేశమేనని భావించడం" అన్నది పాటిస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:38, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు. ఎవరైనా అనుభవం తో కాదు. ఎదుటి వాళ్ళు ఎందుకు చేశారు అనేదానిపై ఆధారపడి చర్చలు చేస్తారు. వ్యాస ప్రారంభంలో మూలాలతో మొదలు పెట్టరు కదా. కనీసం నాలుగు పేరాలు రాయకుండా మూలాల ఎలా చేరుస్తారు. మరి రెండు పేరాలు రాసిన వ్యాసంలో రాస్తూ ఉన్నపుడు ఎలా ఆధారాల కోసం అడుగుతారు. సరే రాసే వ్యక్తి మధ్యలో రాయడం కుదరక పైన ఈ వ్యాసం పూర్తి కాలేదు అని కొందరు వాడుకరుల గురించి తెలిసినవాడై వ్యాసం పూర్తి కాలేదు, ఆత్రం అస్సలు ప్రోత్సహించదగిన గుణం కాదు అని పెట్టాడు అంటే..దానికి తగిన కారణం ఉంటుంది. ఆ పెట్టిన టాగ్ కూడా తొలగించి మార్పులు చేశారు అంటే దాన్ని దుడుకుచర్యగానో లేదా ఒక సమూహ ప్రోత్సాహం వలనో తప్ప మామూలుగా జరిగినది గా నేను భావించడం లేదు. దీనిపై ఆధారాలతో చర్చి చేయండిఅంటే వీటికి తగిన ఆధారాలు నేను ప్రస్తుతం ఇవ్వలేను. అయితే ఇలాంటి చర్యలు భవిష్యత్ తెవికీకి చాలా చేదు చేస్తాయని చెప్పగలను. మీరు అడగాలనుకుంటే.
  1. ఒకరు రాస్తున్న వ్యాసం మొదలు అయిన కొద్ది సమయంలో ఆ వాడుకరి ఎందుకు కొంత సమాచారం తొలగించవలసి వచ్చింది ?
  2. ఆ కొద్దీ సమయంలో ఆ వాడుకరిని పూర్తి చేయనివ్వమని తరువాత మీ ఇష్టప్రకారం మార్పులు చేసుకో మని తెలియచేసినా ఎందుకు ఆగలేదు.?
  3. వ్యాసం పూర్తి కాలేదు అనే టాగ్ ఎందుకు తొలగించారు.?
  4. తొలగింపు మూస ఎందుకు చేర్చారు..?
  5. వ్యాస విస్తరణకు కొరకు వచ్చిన నాకు ఇది దుందుడుకు చర్యగా అనిపించి దాన్ని తొలగించి వ్యాస విస్తరణకు పూనుకొన్న సమయంలోనే ప్రతి చర్యగా వ్యాసం వాడుకరి పెరుబరికి ఎందుకు తరలించారు.?
  6. ఆపై వ్యాస చర్చల్లో రాజశేఖర్ గారిని ఎందుకు ఉదహరింపవాల్సివచ్చింది..?

ఇలాంటి పలు చర్యలు వలన ఇది ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను. లేదా అవి మీరన్న సదుద్దేశంతో మాత్రం కాదని అనుకుంటాను.ఇవి అనుమానాలుగా కొట్టిపడేసే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే వికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్న ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను..ఇకపై చర్చలు మనిద్దరి మద్యే మిగలకుండా అందరూ పాల్గొని కోన్ని పాలసీ మార్పు సాధిస్తే నాకు సంతోషం...ధన్యవాదాలు.. B.K.Viswanadh (చర్చ) 13:06, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@B.K.Viswanadh: గారూ, "ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను." అని మళ్ళీ అంటున్నారు. మీ వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేకుండా ఇలా భావించడం, రాయడం వికీ పద్ధతి కాదు. నేను ఇంతకుముందే చెప్పాను సదుద్దేశం ఆపాదించుకునే చూడాలి. ఇది ఖచ్చితమైన వికీ నియమం. ఈ నియమం ఏమీ పాటిస్తే పాటించవచ్చు అన్నలాంటిది కాదు తప్పనిసరిగా పాటించాల్సినది. దయచేసి దీన్ని ఉల్లంఘిస్తూ ఇకపైన ఏమీ రాయవద్దు. విధానాన్ని ప్రతిపాదించాలంటే వ్యక్తులపై ఇలాంటి ఆధారరహితమైన ఆరోపణలు లేకుండా కింద వేరే విభాగం ఏర్పాటుచేసి ప్రతిపాదించండి. --పవన్ సంతోష్ (చర్చ) 13:58, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
--పవన్ సంతోష్ గారు. అవునా..మరి పైన పేర్కొన్న ఆరు ఉదహరింపులు వికీ విధానాలా?. వీలైతే వాటిపై చర్చించండి. లేదూ ఇలాగే సమర్ధనా చర్చలు చేయడం వలన వికీ భవిష్యత్ కు ఏమంత మంచి జరుగుతుందని అనుకోను..B.K.Viswanadh (చర్చ) 14:46, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అనుభవమైన వాడుకరులు వ్యాసం రాసే ముందు దానికి సరిపోయే మూలాలున్నాయో లేదో ముందుగా నిర్థారించుకోవాలి. మూలాలు లేనప్పుడు వ్యాసాన్ని ప్రారంభించడం సరైన పని కాదు. అలా రాసిన వ్యాసాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు ఆ వ్యాసంలలో {{మూలాలు లేవు}}, {{మూలాలు సమీక్షించండి}} అనే మూసలు ఉంచాలి. వ్యాసం వికీ విధానాలకు అనుగుణంగా లేనప్పుడు వ్యాసంలో తొలగింపు మూసను చేర్చి చర్చ జరగాలి. కానీ కొద్ది సమయంలో సమాచారాన్ని తొలగించడం సరైన విధానం కాదు. అనుభవమున్న వాడుకరి తాను రాసిన వ్యాసంలో అది పూర్తయ్యే వరకు ఎవరూ మార్పులు జరగకూడదనుకుంటే {{in use}} మూసను చేర్చాలి. అది పూర్తి చేసిన తరువాత {{నిర్మాణంలో ఉంది}} మూసను చేర్చాలి. అలా చేయకుండా కొన్ని గంటలు వ్యాసంలో ఎవరూ మార్పులు చెయ్యనపుడు అందులో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉంది. అలా మార్పులు చేయడం తప్పుకాదు. వ్యాసం పూర్తి కాలేదని వ్యాసం పై భాగంలో వాడుకరి రాసినపుడు అందులో తొలగింపు మూసను చేర్చరాదు. అది పూర్తయిన వరకు వేచి చూడాలి. ఎక్కువ సమయమైతే వాడుకరి చర్చా పేజీలో తెలియజేయాలి. వ్యాసం నిర్మాణంలో ఉండగా వాడుకరి పేరుబరికి తొలగించడం సరైన విధానం కాదు. వాడుకరి పేరుబరిలో వ్యాసం రాస్తున్నపుడు దానిపై చర్చ అనవసరం. అది వాడుకరి పేరు బరి నుంది వ్యాసంగా రూపుదిద్దుకున్నప్పుడు అందులో అభ్యంతరాలేమైనా ఉంటె చర్చా పేజీలో తెలియజేయాలి. ఈ సమస్యను రచ్చబండలోకి తేవలసిన పని లేదు. @Nskjnv: వాడుకరి కొత్త కాబట్టి అతని చర్చాపేజీలో అర్థమయ్యే రీతిలో వివరిస్తే సరిపోతుంది. కొత్త వాడుకరి నిర్వహణ ఆసక్తితో చేసిన చర్యలే కానీ B.K.Viswanadh తెలియజేసినట్లు సమూహం ప్రోత్సహించడం వలన జరిగిన చర్యగా భావించను. కళాసాగర్ రాసిన రచనలను ప్రోత్సహిద్దాం. వారు మూలాలు, లింకులు చేర్చలేని పక్షంలో వారికి తగిన సూచనలు, సలహాలు ఇద్దాం. ➠ కె.వెంకటరమణచర్చ 15:26, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: గారూ, @K.Venkataramana: గారు చాలా చక్కగా సమీక్షించారు. మీరడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు క్లుప్తంగా, ప్రయోజనకరంగా ఇవ్వడమే కాక మొత్తం పరిస్థితిని సవ్యంగా వ్యాఖ్యానించారు. ఆపైన నేను ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు. నమస్తే. --పవన్ సంతోష్ (చర్చ) 17:25, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా, కొత్తైనప్పటికీ, చురుగ్గా దిద్దుబాట్లు చేస్తున్న కళాసాగర్ గారికీ, కొత్తవారైనా చాలా చురుగ్గా వికీలో పాల్గొంటూ, వికీ నిర్వహణ పట్ల కూడా ఆసక్తి చూపుతున్న కాలవిరాగ్య గారికీ ధన్యవాదాలు.
వివిధ పేజీల చరిత్రలను చూసి, సమస్య మూలాల్లోకి వెళ్తే తప్ప ఏమేం జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఈ సమస్యలో నేను గమనించినవి, వాటిపై నా అభిప్రాయాలూ ఇవి:
  • అవతలి వారు సదుద్దేశంతోనే రాస్తున్నారని భావించడం కొరవడింది.
  • కొత్తవారితో సామరస్యంగా ఉంటూ, వారికి నేర్పే ధోరణితో వ్యవహరించలేదు.
  • ఒక వాడుకరి చేసిన పని సరిగా లేదని భావించినపుడు దానిపై ఆ వాడుకరితో చర్చించి, విషయాన్ని బోధపరచి ఆ తర్వాత ఆ చర్యను రద్దు చెయ్యడమనేది సరైన చర్య. ఈ సమస్యలో మొదటినుండీ అలా జరగలేదు. దిద్దుబాట్లు, పై దిద్దుబాట్లు జరిగిపోయాయి. ముందే చర్చించి, ఒక నిర్ణయం తీసుకుని ఆపై చేస్తే బాగుండేది.
  • వ్యాసం చురుగ్గా నిర్మాణంలో ఉంది, ఇప్పుడు మార్పుచేర్పులు చెయ్యకండి అని చెప్పేందుకు "వ్యాసం పూర్తి కాలేదు.. ఆత్రం అస్సలు ప్రోత్సహిన్చదగిన గుణం కాదు." అని ఒక నోటీసును పేజీలో పైన చేర్చారు. ఇది, వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యదలచిన ఇతర వ్యక్తులను కించపరచేలా ఉందని, వారి పట్ల న్యూనతా భావాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉందనీ నాకు తోచింది. అటువంటి భావనలకు ఆస్కారం లేకుండా మరింత మర్యాదగా చెబితే నష్టమేమీ ఉండేది కాదు.
  • పై నోటీసు ఎలా ఉన్నప్పటికీ, నోటీసంటూ ఉంది కాబట్టి, వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదన పెట్టి ఉండకూడదు. అలా పెట్టడం సమంజసంగా లేదు.
  • "సమూహ ప్రోత్సాహం" అనేది నిరాధారమైన ఆరోపణ అని నాకు అనిపించింది. అలాగే వ్యక్తిగత స్పర్థలేవో ఉన్నాయని కూడా నాకు అనిపించలేదు. అలాంటి ఆరోపణలు చేసినపుడు ఆధారాలు చూపించాలి. లేనట్లైతే ఆరోపణను వెనక్కి తీసుకోవాలి. అది హుందాతనం. "ఈ వ్యాసాలు నిర్మించడంలో కళాసాగర్ ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది" అనేది ఓ కొత్త వాడుకరి పట్ల జనరలైజ్ చేసిన రాసిన వ్యాఖ్య. దానికి ఆధారాలు చూపించలేని పక్షంలో వెనక్కి తీసుకోవాలి (కాలవిరాగ్య గారు ఈ దిద్దుబాటులో తనకూ కళాసాగర్ గారికీ వ్యక్తిగత వైరమేమీ లేదని స్పష్టపరుస్తూ ఒకడుగు ముందుకేసారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను).
వీటిని ఎవరికి వారు గ్రహించుకుని సరిచేసుకుంటే బాగుండేది. ఇకముందు అలా జరక్కుండా సరిచూసుకోవాలని విజ్ఞప్తి. పోతే..
  1. ప్రస్తుతం వ్యాసం వాడుకరి పేరుబరిలో ఉంది. ఇంత చర్చ జరిగింది కాబట్టి, దాన్ని వెంటనే మళ్ళీ ప్రధానబరిలోకి తరలించకుండా తగు మూలాలను చేర్చాక ప్రధానబరిలో ప్రచురించాలి. ఏ వ్యాసమైనా మొదలుపెట్టే ముందే ఆ వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఉందా అనేది సదరు వాడుకరి నిర్ధారించుకోవాలి. విశ్వనాధ్ గారు అనుభవజ్ఞులు కాబట్టి "64 కళలు (అంతర్జాల పత్రిక)" పేజీని మొదలుపెట్టేముందు దాని ప్రాముఖ్యతను నిర్థారించుకునే ఉంటారు. లేదంటే, ఇపుడు నిర్థారించుకుంటే మంచిది. ఎందుకంటే, వ్యాసం పేజీని తిరిగి సృష్టిస్తే అప్పుడది ఎలాగూ చర్చకు వస్తుంది.
  2. పత్రికల విషయ ప్రాముఖ్యత గురించి రాజశేఖర్ గారు ఒక సూచనగా తన అభిప్రాయం చెప్పారు. విషయ ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైన సంగతి కాబట్టి ఆ సూచనపై ప్రత్యేకంగా చర్చ జరిపి విధానాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దానికి ఆయనే పూనుకోవాలని అభ్యర్థిస్తున్నాను.
  3. అలాగే కొత్తవారి రచనల విషయంలో మనం ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుంది. దానిపై నాకు కొన్ని ఆలోచనలున్నై. త్వరలో నేను దానిపై ఒక చర్చను మొదలుపెడతాను. లేదా, మరెవరైనా మొదలుపెడితే నేను అందులో నా ఆలోచనలు వెల్లడిస్తాను.
__చదువరి (చర్చరచనలు) 05:19, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్తవారికి కొన్ని మార్గదర్శకాలు,పట్టు విడుపుల మీద ఒక విధానం రావాలి లేకుంటే నిరుత్సాహ పడతారు, అసలే వికీలో స్వచ్చంధంగా పనిచేయాలనే అభిలాష ఉన్న వారు దొరకడం లేదు, గ్రోత్ ప్రాజెక్టు మీద కూడా సమీక్ష జరగాలి ,ఈ విషయం మీద చర్చ తో పాటు శిక్షణా కార్యక్రమం జరగాలి : Kasyap (చర్చ) 09:56, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చమొదలైంది ఒక కొత్త సభ్యుడి రచనలపై. అయితే మునుపు చెప్పిందే మరో సారి చెప్పవలసివస్తున్నది. చర్చ వెనుక ఉద్దెశ్యం నేను ఎప్పుడూ ఉదహరించేదే. కొత్త వాడుకరులపై కొందరి అత్యుత్సాహ ఆత్ర వైఖరి చర్యలు. అందుకే చర్చను రచ్చబండకు మరలించడం జరిగింది. ఇక్కడ రెండు రకాల వాదనలు గమనించవచ్చు. 1. సమస్య మూలాలపై చర్యలు లేకపోగా వాటిని నిర్యహణా చర్యలుగా అభిప్రాయపడటం. 2. అలాంటి చర్యలపై చర్చించేవారివే దుశ్చర్యలుగా అభిప్రాయపడటం. దీనికి కారణం పైన చర్చల్లో వాడుకరి:Nskjnv పై పవన్ సంతోష్ ఈ వాడుకరి నిర్వహణకు కొత్త అనగా '➠ కె.వెంకటరమణ గారు "నిర్వహణా శక్తి" అని అభివర్ణించారు. కొత్తకు, నిర్వహణ శక్తికి మద్య జవాబుదారీ, భాద్యతలు, సహనం కూడా ముఖ్యపాత్రగా మారుతాయని మరచిపోకూడదు. ఇంత చర్చా నడిచినా అలాంటి జవాబుదారీతం, భాద్యత, సహనం వంటిని నాకు కనిపించలేదు. అదే వసరలో "కొన్ని గంటలు వ్యాసంలో ఎవరూ మార్పులు చెయ్యనపుడు అందులో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉంది. అలా మార్పులు చేయడం తప్పుకాదు" అని రాసారు. కానీ కొన్ని నిముషాల వ్యవధిలో ఎందుకు వ్యాసానికి అడ్డం పడవలసివచ్చిందొ రాయలేదు. కొత్త వాడుకరులో పేజీల్లో తొలగింపు మూసలు ఎందుకు పెట్టారో, చర్చ లో ఉదహరించగానే మళ్ళీ ఎందుకు తొలగించారో, దానికీ జవాబులేదు. అయితే వేరే వాడుకరుల ద్వారా అన్ని ప్రశ్నలకూ వివరణలు లభిస్తున్నాయి కాని, వాడుకరి:Nskjnv నుండీ జవాబులేదు. "సమస్యలో మొదటినుండీ అలా జరగలేదు. దిద్దుబాట్లు, పై దిద్దుబాట్లు జరిగిపోయాయి. ముందే చర్చించి, ఒక నిర్ణయం తీసుకుని ఆపై చేస్తే బాగుండేది" అని రాసారు తప్ప సమస్య ఎవరి వలన ఎందుకు మొదలైదో, ఎవరు అసహనంతో ఉన్నారో వారికి తెలియచేయడం చర్చల్లో కొరవడిన ప్రధాన అంశం. కనుక ఈ విషయంలో సమూహ ప్రోత్సాహం అని రాసాను. దీనికీ సదరు వాడుకరి నుండి కాక మిగిలిన సభ్యుల నుండి ఆధారాలు కావాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఆధారాలు లేని కారణంగా నేను ఈ వాఖ్యలను విరమించుకుంటున్నాను. @చదువరి గారు " కొత్త వాడుకరి పట్ల జనరలైజ్ చేసిన రాసిన వ్యాఖ్య. దానికి ఆధారాలు చూపించలేని పక్షంలో వెనక్కి తీసుకోవాలి (కాలవిరాగ్య గారు ఈ దిద్దుబాటులో తనకూ కళాసాగర్ గారికీ వ్యక్తిగత వైరమేమీ లేదని స్పష్టపరుస్తూ ఒకడుగు ముందుకేసారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను)." అని రాసారు.వాడుకరి_చర్చ:Kalasagary గారి పేజీలో వాడుకరిపేజీ తొలగింపుపై కొత్త వాడుకరికి సవాలు చేస్తూ నోటీసు పెట్టినదానికి అభినందనా?, అదే వాడుకరి "ఇదే ఆంగ్ల వికీలో అయితే ఇప్పటికి మీరు ఈ విదంగా రాసిన వ్యాసాలూ అన్ని తొలగింపుకు గురయ్యేవి" అని వాడుకరి పేజీలో రాసిన దానికి ఎవరు సమాదానం చెప్పలేదు. ఇది జనరలైజ్ చేసిన అభిప్రాయంగా తోసిపుచ్చవచ్చు. కానీ కొత్త వాడుకరి పేజీలో ఇలా రాయడం దురుద్దేశం గానే నేను అభిప్రాయపడతాను..(అసలు ఆంగ్ల వికీ ఎందుకు ప్రామాణికం. ఆంగ్ల వికీలో చేస్తే ఇక్కడా అవే రూల్స్ ఫాలో కావాలా, అన్ని విషయల్లో ఆ వాడుకరి ఆంగ్ల వికీనే ఫాలో అయితే 20, 30, కేబీల వ్యాసాలను ఒకటి రెండు మూలాలతో ఎందుకు తామర తుంపరగా సృష్టిస్తున్నట్టు, అవి అవసరమైన వ్యాసాలు అని సమర్ధించుకోవచ్చు, కానీ వికీలో అన్నీ అవసరమైన వ్యాసాలే. అనవసరమైన వ్యాసాలు అంటూ ఉండవు) ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నా వాటికి కూడా సదరు వాడుకరి నుండి కాక మిగతా సభ్యుల నుండే జవాబులు వచ్చే అవకాశాం ఉందని భావిస్తూ.. వికీలో జరిగే పరిణామాలు మనకు పాతవైన కారణంగా తేలిగ్గా తీసుకుంటున్నాం అనుకుంటున్నాను. కానీ ఇటీవల సామాజిక వేదికలలో అనేక విషయాలు వికీ నేపద్యంగా విస్తృతంగా చర్చించబడుతున్నాయి. ఇక్కడ ఆధారాలు కావాలి గాని అక్కడ అక్కరలేదు కదా.. ఎవరు ఎలాగైనా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించవచ్చు. వికీపై వికీలో కాకుండా బయటా అవగాహనా పెరుగుతున్నది. అయితే అది సంతొషించే విషయంగా కాదని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని అస్పష్ట విషయాల్లో ఆందోళనే మునుపు కొందరు వాడుకరులు తెరపైకి తెచ్చినా వారి ఆవేశం అదుపుతప్పి వాడుకరులపైకి మళ్లడంతో చర్చలు అర్ధవంతంగా ముగియలేదు. [దాడులు] చర్చల వద్ద చివర్లో "టాపిక్ డైవర్ట్ చేయడం నా ఉద్దెశ్యం కాదు కాని మూలం ఏమిటో తెలుసుకుంటే చద్రకాంతరావుగారో, మరొకరో, ఇలా ఎందుకు అంటున్నారు అనేదానిపై స్పష్టత వస్తుందని అనుకుంటాను" అని రాసాను. ఇప్పటికీ అదే అభిప్రాయానికి కట్టూబడి ఉన్నాను. ఇది ఒక వాడుకరి, లేదా ఒక వ్యాసం పైనో కాదు. మిగతా వికీల గురించి కాకున్నా తెవికీ వరకూ కొన్ని వేలమంది ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వారి సమయాన్ని అక్షరాలుగా మార్చి సృష్టించారు. అలాంటి మహా సర్వస్వాన్ని లక్షల మంది హేళన, విమర్శ చేసే కాలం రాకూడదని బలంగా కోరుకొనే వాడిగా.. నిజాయితీగా శ్రమిచే వాడుకరులంతా కొన్ని కొత్త మార్పులు చేయాలని ఆశిస్తాను..ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 07:19, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం B.K.Viswanadh గారు, ముందుగా ఒక విషయం స్పష్టంగా చెపుతున్నాను మీతో కూడా నాకు ఎటువంటి వైరము లేదు కేవలం వికీ పరమైన పరిచయం తప్ప.
ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు
  1. చర్చ మొదలైంది 64 కళలు(అంతర్జాల పత్రిక) వ్యాసం గురించి. ఈ వ్యాసం రాసింది మీరు, పైన శశి గారు చేర్చిన చర్చ కూడా ఈ పేజీకి సంబంధిచినదే గమనించగలరు.
  2. నేను 64 కళలు(అంతర్జాల పత్రిక) గురించి దాని చర్చా పేజీలో సమాధానం ఇచ్చాను. తొలగింపుకు ప్రతిపాదించిన ప్రచార ధోరణి కారణాన్ని కూడా రాసాను. ఒక వ్యాసం తొలగింపుకు ప్రతిపాదిస్తే దాని చర్చ రచ్చబండలో చేయనక్కర్లేదని నా అభిప్రాయం.
  3. నేను ముందు మీరు వ్యాసం నిర్మిస్తున్నప్పుడు గమనించిన రెండు విషయాలు 1)ఆ వ్యాసానికి సంబందించిన అంశం కళాసాగర్ గారు తన వాడుకరి పేజీలో ఉంచడం 2)ఆ వ్యాసాన్ని ఏ మూలాలు లేకుండా(నేను చేరుద్దామన్న దొరకలేదు) మీరు నిర్మించడం. ఆంగ్ల, హిందీ మరి చాలా ఇతర వికీ నియమాల ప్రకారం ఇది పూర్తి ప్రచార ధోరణి, మన తేలుగులో కనీస నియమాలు కూడా పాటించకుండా చాలా వ్యాసాలూ నిర్మిచినట్లుంది, తెవికీ అభివృద్ధికి నిరంకుశ ధోరణికి దూరంగా ఉండటం అవసరమని కూడా గమనించాను.
  4. ఇక నేను నిర్మించే వ్యాసాలపై మీ విమర్శ సరియైనది అని అనిపిస్తే సదరు వ్యాసాల్లో తగు మూసలు చేర్చండి, హెచ్చరికలు చేయండి నేను స్పందిస్తాను, వాటిని మెరుగుపరుద్దాం లేని పక్షంలో తొలగింపుకు ప్రతిపాదించండి. తెలుగు వికీ నిర్మాణానికి చేసే ఏ పని అయినా నేను నిర్మొహమాటంగా సమర్ధించడానికి సిద్ధంగా ఉన్నాను.
  5. కళాసాగర్ గారి లాంటి అనుభవజ్ఞులు విజ్ఞాన వంతులని వికీలో వారి అమూల్యమైన వ్యాసాలను చేర్చడానికి తగు మార్గదర్శకాలు రూపొందించుకుందాం. వారికి కావలసిన సహాయం అందిస్తూ మీ అనుభవం నుండి కూడా నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. Nskjnv (చర్చ) 09:04, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh గారూ, ఆధారాలు లేకుండా చేసిన వాఖ్యలను విరమించుకోవడమనేది చక్కటి, సుహృద్భావ పూరిత చర్య. మీ అనుభవానికి తగ్గ పరిణతి చూపించారు. మీకు అభినందనలు, ధన్యవాదాలు.
@Nskjnv గారూ, మీ వ్యాఖ్యలో మీరు కూడా చక్కటి టెంపరమెంటు చూపించారు, ధన్యవాదాలు. విశ్వనాధ్ గారు గత నాలుగైదేళ్ళుగా అంతగా చురుగ్గా లేనప్పటికీ, అంతకు ముందు చాలా చురుకైన వాడుకరి, నిర్వాహకుడు. వికీకి చక్కటి పునాదిని ఏర్పరచిన వైజాసత్య, కాసుబాబు, రాజశేఖర్, అర్జున గార్లతోనూ ఇంకా ఎంతోమందితోనూ కలిసి పనిచేసారు. వికీలో 14 ఏళ్ళ పైచిలుకు ఉన్న అనుభవం ఆయనది. పోతే..,
గత ఐదారు రోజులుగా ఫొటోల పోటీ వెనకబడిపోయింది, చూసారా. మనం మళ్ళీ గేరు మార్చాలి. మళ్ళీ తదేక దీక్షతో దూసుకుపోవాలి. రండి.
అన్నట్టు విశ్వనాధ్ గారూ, మీరు మళ్ళీ చురుగ్గా వికీ లోకి వచ్చారు కాబట్టి, రండి మనం భుజం భుజం కలిపి పనిచేద్దాం. ఫొటోల పోటీ జరుగుతోంది కదా.., అందులో పాల్గొని మీకు నచ్చిన పేజీల్లో ఫొటోలను చేర్చి ఈ పోటీని దిగ్విజయం చెయ్యడంలో పాలుపంచుకోండి. ఈ నెలాఖరు నాటికి ముప్పైవేల పేజీల లక్ష్యాన్ని చేరుకునేలా ఆ పోటీకి తోడ్పడండి. అలాగే, కొత్తవారి పట్ల మనం అనుసరించాల్సిన పంథా ఎలా ఉండాలో మీరు గతంలో వ్యాఖ్యానించారు - వారిని రాయనివ్వాలి, విధానాలతో హడలగొట్టకూడదు అని మీరు రాసినట్టు గుర్తు. ఇప్పుడు ఎలాగూ సందర్భం వచ్చింది. ఈ విషయంలో మీరిప్పుడు ఒక గట్టి స్టాండు తీసుకున్నారు కూడాను. కాబట్టి, ఇప్పుడు ఆ విషయంలో మీరే ఒక మార్గదర్శకాన్ని ప్రతిపాదించి చర్చకు పెడితే బాగుంటుంది. మీకు అందుకు తగ్గ సమర్థత ఉందని నా నమ్మకం. ఈ విషయంలో చొరవ తీసుకుని సముదాయాన్ని ముందుకు నడిపించవలసినదిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.
__ చదువరి (చర్చరచనలు) 04:37, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation for Wiki Loves Women South Asia 2021 మార్చు

Wiki Loves Women South Asia 2021
September 1 - September 30, 2021view details!


 
Wiki Loves Women South Asia is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, Wiki Loves Women South Asia welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the project page.
Best wishes,

Wiki Loves Women Team

18:39, 13 ఆగస్టు 2021 (UTC)

ఈ నాటి చిట్కాలో లోపం మార్చు

గత కొన్ని రోజులుగా ఈ నాటి చిట్కా మూస పనిచేయడం లేదు. వికీపీడియా చిట్కాలు లోకి వెళ్ళి చూసినపుడు కావాల్సిన తేదిన ఆ తేదీకి సంబంధించిన చిట్కా ఉంది కానీ అది ప్రతిరోజూ తాజా కావడంలేదు. ఈ లోపం నాకు మాత్రమే కనిపిస్తుందా? లేదా అందరికీ ఇలాగే ఉందా? లేదా మూసలో ఏమైనా దిద్దుబాటు చేయాల్సి ఉందో దయచేసి పరిశీలించగలరు.--Abhilash (చర్చ) 09:29, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH గారూ, అగస్టు నుండి డిసెంబరు వరకూ ఉన్న నెలల పేర్లలో తప్పులుంటే వాటిని గతంలో సవరించాం. సవరించి కూడా చాన్నాళ్ళైంది. ప్రస్తుతం ఈ చిట్కా పేజీలన్నీ తేదీల పేరుతో ఉంటై. ఈ పేజీల్లోని నెలల పేర్లు పాత, తప్పు పేర్లతోనే ఉండడం వలన సాఫ్టువేరుకు ఆ పేరేంటో అర్థం కాలేదు. ఉదాహరణకు, ఈ నెల పేరును వికీలో గతంలో "ఆగష్టు" అని రాసేవాళ్లం. సవరించాక దాని పేరు "ఆగస్టు" అయింది. ఐతే, ఈ చిట్కాల పేజీల్లో ఈ నెల లోని పేజీల పేర్లు ఆగష్టు 1, ఆగష్టు 2,.. ఇలా ఉండడంతో ఆగస్టు 1 వ తేదీన చూపించాల్సిన చిట్కా పేజీ దానికి కనబడలేదు (మరి, ఆ పేజీ వేరే పేరుతో ఉంది కదా.., అంచేత). ఇప్పుడు నేను ఆగస్టు 16 నుండి 31 వరకూ ఉన్న పేజీలను సరైన పేరుకు తరలించాను. ఇక ఆ సమస్య ఉండదు. ఇంకా ఈ నెలలో 15 వ తేదీ వరకు ఉన్న పేజీలను, సెప్టెంబరు నుండి డిసెంబరు వరకూ ఉన్న పేజీలను (అవసరమైతే) కూడా తరలించాలి. అవి కూడా చేస్తాను.
చాలా ముఖ్యమైన సమస్య ఇది. దీన్ని బట్టి ఇంకా ఏయే చోట్ల ఇలాంటి సమాస్యలొస్తాయో చూడాల్సి ఉంది. దీన్ని గమనించి ఊరుకోకుండా సముదాయం దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇలాంటివి ఇకముందు కూడా చూస్తూ ఉండవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 01:13, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ చిట్కా విషయంలో తలెత్తిన సమస్యను అందరికీ అర్థమయ్యే విధంగా క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి సమస్యలు ఎక్కడైనా ఉంటే తప్పక అందరం సరిచేస్తాం--Abhilash (చర్చ) 05:43, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మండల, గ్రామ వ్యాసాల సవరణలుపై అపోహలు మార్చు

మండల, గ్రామ వ్యాసాలలో నేను చేసే సవరణలుపై ఈ మధ్యకాలంలో అపోహలు ఏర్పడ్డవి.అవి కేవలం దిద్దుబాట్లు పెంచుకోవటానికి, ప్రతి గ్రామ పేజీలో నాపేరు చూసి చిన్న పిల్లాడిలా మురిసిపోవటానికి చేస్తున్నట్లు భావిస్తున్నారు.నేను చేసే మార్పులు బాటు ద్వారా చేయవచ్చుఅనే అభిప్రాయం వెళ్లబుచ్చారు.ఈ విషయం గురించి ఎవరైనా ముందుకు వచ్చి చేస్తే నాకేమీ అభ్యంతరం లేదని రచ్చబండలో పెట్టిన చర్చకు ఎవరూ స్పందించలేదు. ఒక్కో వ్యాసానికి ఒక్కో రకంగా ఉహించని సవరణలు చేయవలసిఉంటుంది.ఆ అపోహలు తొలగిపోవటానికి నా ప్రయత్నంగా జరుగుతున్న సవరణలు రచ్చబండ దృష్టికి తీసుకు వస్తున్నాను.మండల, గ్రామ వ్యాసాలలో ఏదో కనపడిన దోషం సవరించేదికాదు.ఇది ప్రతి మండల, గ్రామ వ్యాసం పేజీలు పరిశీలనా దృక్ఫధంలో చేయాలి.అలా చేస్తేనే ఆ సవరణలకు అర్ధం ఉంటుంది.తెలంగాణ రాష్ట్రంలో భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కిస్తూ, అదే సమయంలో జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం దాదాపుగా రాష్ట్రంలోని 589 మండలాలలో నేనే చేసిినందున, అక్కడ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో చేయటానికి పూనుకున్నాను.

ఆ సవరణలు ఎలా ఉంటాయా నేను ఎందుకు చేయవలసి వస్తుందో అందరికి తెలియాలనే ఉధ్దేశ్యంతో దిగువ వివరిస్తున్నాను. నేను వివరించినవి ఒక్కోటి ఒక్కో రకమైన సవరణలు. దీనికి ఎవ్వరూ స్పందించకపోయినా పర్వాలేదు.ఒకసారి పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే చాలు.

  • ఇది కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం.వాస్తవంగా ఈ లింకు ప్రకారం ఈ మండలంలో జనాభా ఉన్న రెవెన్యూ గ్రామాలు 20 ఉండాలి.కానీ మండలంలోని గ్రామాలు విభాగంలో 26 గ్రామాలు ఉన్నట్లు చూపుతుంది.అంటే అందులో మిగులుగా ఉన్న ఆరు గ్రామాలలో అన్నీ నిర్జన గ్రామాలు లేదా అన్నీ రెవెన్యూయేతర గ్రామాలు లేదా రెండు కూడా కలిసి ఉండవచ్చు. రెండూ కలసి ఉంటే అందులో నిర్జన గ్రామాలను గుర్తించి సముదాయం నిర్ణయం మేరకు తొలగించాలి.అలాగే ఆ గ్రామాలు పేర్లు మండలంలోని గ్రామాలు విభాగం నుండి, మూస నుండి తొలగించాలి. రెవెన్యూయేతర గ్రామాలను గుర్తించి, వాటిని రెవెన్యూయేతర గ్రామాలు అనే కొత్త విభాగంలో కూర్పుచేయాలి.ఈ గ్రామాలకు తగిలించిన మండలంలోని గ్రామాలు మూసను తీసేయాలి.లేకపోతే వర్గంలో సంఖ్యాపరంగా తేడా ఉంటుంది.అలాగే ఆ గ్రామాలు మూస నుండి తొలగించి, వాటిని పలానా మండలంలోని రెవెన్యూయేతర గ్రామాలు అనే వర్గంలోకి చేర్చాలి.ఇది ఎలా తెలుస్తుంది అనే సందేహం రావచ్చు.అది ఈ లింకు ప్రకారం పరిశీలించాలి.ఇందులో ఆ మండలంలోని గ్రామాలు 23 ఉన్నట్లుగా చూపుతుంది.ఇందులో 20 గ్రామాలలో జనాభా వివరాలు చూపుతూ, మూడు గ్రామాలలో జనాభా లేనట్లు చూపుతుంది.అంటే దానర్థం జనాభా వివరాలు ఖాళీగా చూపిన గ్రామాలు నిర్జన గ్రామాలుగా పరిగణించాలి.పైన ముందు ఈ మండలంలో 26 గ్రామాలు ఉన్నట్లు గుర్తించాం.20 జనాభా ఉన్న గ్రామాలు +3 నిర్డన గ్రామాలు కలిపి 23 గ్రామాలు పోను ఇంకా మూడు గ్రామాలు ఎక్కువ కనపడుతున్నవి.వీటిని రెవెన్యూయేతరగ్రామాలుగా పరిగణించాలి.ఈ ఆధారాలకు తోడు నాదగ్గర ఉన్న ఆధారాలతో సరిపోల్చుకుంటాను.ఆ ఆధారం ఏమిటో చివరలో వివరిస్తాను. కాగా పోగా చివరికి మండలంలోని గ్రామాలు విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో, మండలంలోని గ్రామాల వర్గంలో ఒకే సంఖ్యతో రెవెన్యూ గ్రామాలు ఉండాలనే ధృక్పదంతో పరిశీలించటం జరుగుతుంది.
  • ఇది కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలం. వాస్తవంగా ఈ మండలంలో ఉన్న గ్రామాలు ఈ మండలానికి చెందినవికావు. ఇదే జిల్లాలోని పైన ఉదహరించిన చందర్లపాడు మండలానికి చెందినవి.ఈ పొరపాటును నేను తప్పుబట్టటలేదు.ఇలాంటి పొరపాటు నేనైనా చేయవచ్చు.ఇది పరిశీలనా దృక్పధంతో గమనించకపోతే ఆతప్పు ఎంతకాలం గడిచినా అలానే ఉంటుంది.
  • కొన్ని గ్రామాలు అయోమయనివృత్తి పేజీలకు లింకు చూపుతుంది.వాటిని సవరించాలి
  • కొన్ని గ్రామాలు తెవికీలో వ్యాసం ఉండి, గ్రామాల విభాగంలో, మూసలో ఎర్రలింకులు ఉంటాయి. వాటిని సవరించాలి.
  • కొన్ని గ్రామాలకు మండల వ్యాసం లింకుకాకుండా, మండల ప్రధాన కేంద్రం (గ్రామ వ్యాసం) లింకు కలిపి ఉంటుంది.వాటిని సవరించాలి.
  • కొన్ని మండల కేంద్రాలాలో (గ్రామ వ్యాసంలో) మండల సమాచారం, మండలంలోని గ్రామాలు విభాగంలో గ్రామాలు జాబితా ఉంది.వాటిని సవరించాలి.
  • మండల వ్యాసాలకు కొన్నిటికి మండలంలోని గ్రామాలు మూస ఉంటుంది.మండల వ్యాసానికి ఇది అవసరంలేదు.ఇది ఉన్నందున మండలంలోని గ్రామాలు వర్గంలో సంఖ్యాపరంగా తేడా చూపుతుంది.దీనిని తొలగించాలి.
  • మండలంలో రెవెన్యూ గ్రామాలు కాని జనగణన పట్టణాలు ఉంటాయి.వీటిని మండలంలోని గ్రామాలు విభాగం నుండి విడగాట్టి, మండలంలోని పట్టణాలు విభాగంలో చూపించాలి.వాటికి ఉన్న మండలంలోని గ్రామాలు మూస తొలగించి, మూస నుండి ఆ పట్టణాల పేర్లు తొలగించి ఆ వ్యాసం జనగణన పట్టణాల వర్గంలో చేర్చాలి.
  • కొన్ని గ్రామాలకు అక్షరబేదాలుతో రెండు పేజీలు ఉంటాయి.వాటిలో సరియైన పేజీకి, అవసరమైతే దారిమార్పు ఇవ్వటం లేదా తొలగించి, ఆ తేడాలను మూసలో సవరించాలి.
  • రెవెన్యూయేతరగ్రామాలుకు ఎటువంటి డేటా ఉండదు.మూలాలు కూడా అన్నిటికీ ఉండవు.ఇంకా చెప్పాలంటే వాటికి గూగుల్ మ్యాపు లింకులోకూడా ఆ గ్రామాలు పేర్లు చూపించదు. భారత జనాభా లెక్కలు ప్రకారం ఆ గ్రామాల డేటా సంబందిత రెవెన్యూ గ్రామాలలోనే మిళితమై ఉంటుంది.ఆ డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని రెండు రాష్ట్రాలలోని గ్రామాలలో గౌరవ వికీపీడియన్లు సహకారంతో ఎక్కించటం జరిగింది. అయితే ఏ పారపాటువల్లనో కొన్ని గ్రామ వ్యాసాలలో డేటా ఎక్కించలేదు.అటువంటి వాటిని గుర్తించి ఆ డేటాను ఇప్పుడు ఎక్కించటం జరుగుతుంది.
  • కొన్ని మండలాలలో ఉండవలసిన రెవెన్యూ గ్రామాలు కన్నా తక్కువు గ్రామాలకు పేజీలు సృష్టించి ఉంటావి. అంటే కొన్ని గ్రామ వ్యాసాలకు పేజీలు సృష్టించలేదు.వాటిని గుర్తించి మండలంలోని గ్రామాలు విభాగంలో, మూసలో కూర్పు చేయటం జరుగుతుంది.వాటి అన్నింటికి ఒక ప్రాజెక్టు పేజీ తయారుచేసి, పేజీలు సృష్టించి డేటా ఎక్కించాలి.
  • ఇంకొక ప్రధాన సవరణ.గ్రామ వ్యాసాలలో కొన్నిటిలో 2001 జనాభా వివరాలు,కొన్నిటిలో 2001, 2011 జనాభా వివరాలు ఉన్నవి. భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించినప్పుడు ఆ వివరాలు చివరలోకి చేరినవి.ఈ డేటాలో 2011 జనాభా వివరాలు మొదటి పేరాలో మరలా వచ్చినవి.అదే జనాభా వివరాలు సమాచారపెట్టెలో ఉన్నవి.అంటే 2011 జనాభా వివరాలు మూడు చోట్ల ఉన్నవి. సమాచారపెట్టెలో ఉండాలి.కాని వ్యాసం చివరలో ఉన్న 2011 జనాభా వివరాలు అవసరంలేదని భావించి తొలగించి ఒకవేళ ఆ వ్యాసంలో 2001 జనాభా వివరాలు ఉంటే వాటిని పైన ఉన్న 2011 జనాభా దగ్గరచేర్చి గణాంకాలు అనే విభాగంలో చేర్చుట జరుగుతుంది.
  • తెలంగాణాలో సరియైన అంకెలు ప్రకారం రెవెన్యూ గ్రామాలు ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలానే పరిశీలించి చేయాలనే దృక్పదంతో నేను చదువరిగారి నుండి 13 జిల్లాలకు భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన టెక్ట్ ఫైల్స్ తెప్పించుకుని, అన్ని జిల్లాలలోని 670 మండలాలకు ఫోల్డర్లు క్రియేట్ చేసి, 13 జిల్లాలలోని గ్రామాలు ఆ మండలంలోని పోల్డర్లలో కూర్పు చేసి, ఈ సవరణలను మరలా వాటితో సరిపోల్చుకుంటూ సవరణలు చేస్తూ ఉన్నాను. వాటిని సంవత్సరాల తరబడి అలానే ఉంచటం భావ్యమా?. ఆలోచించండి.
  • కాగాపోగా ప్రధాన దృక్పదం మూలాలు ప్రకారం మండలంలోని గ్రామాల విభాగంలో, మండలంలోని గ్రామాలు మూసలో, అలాగే మండలంలోని గ్రామాలు వర్గంలో మూడింటిలో ఒకే సంఖ్య ప్రకారం రెవెన్యూ గ్రామాలు ఉండటం ప్రధాన ఉద్దేశ్యం.

చివరగా నామాట.ఎవరో ఏదో అనుకున్నారని ఈ సవరణలు నేను ఆపే ఉద్దేశ్యం లేదు.నాకు అవకాశం ఉన్నంతవరకు మండల, గ్రామ వ్యాసాలు తీర్చి దిద్దుతాను.--యర్రా రామారావు (చర్చ) 07:12, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ, "ఎవరో ఏదో అనుకున్నారని ఈ సవరణలు నేను ఆపే ఉద్దేశ్యం లేదు" - భేష్! నిష్కామ కర్మ లాగా పని చేసుకుపోతున్నారు మీరు. అలాగే చేసుకుపొండి. మీపై చేసిన ఆ ఆరోపణలు నాకు గుర్తున్నై. అప్పుడు మీరు, నాకు క్రెడిటు అక్కర్లేదు, మీరే చెయ్యండి అని అన్నారు. రండి కలిసి ఈ పని చేద్దాం అని రాసారు. ఆటోమాటిగ్గానో, సెమీ ఆటోమాటిగ్గానో చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే కలిసి పని చేస్తానన్నారు. కానీ ఎవరైనా ముందుకొచ్చారా?
ఇకపోతే, మీరు చెబుతున్న లోపాలను ఒక క్రమపద్ధతిలో చెక్‌లిస్టులుగా రాసి ప్రాజెక్టు పేజీలో పెడితే ఇతరులకు సవరణలు చెయ్యడానికి వీలుగా ఉంటుంది. అంటే, గ్రామం పేజీలో చెయ్యవలసిన మార్పుచేర్పులు అని ఒక చెక్‌లిస్టు, మండల పేజీలో చెయ్యవలసిన మార్పుచేర్పులు, పట్టణం పేజీలో చెయ్యవలసిన మార్పుచేర్పులు - ఇలా విడివిడిగా చెక్‌లిస్టులుగా పెడితే ఆయా పేజీల్లో ఏయే పనులు చెయ్యాలో ఇతర వాడుకరులకు తెలుస్తుంది. ఆ ప్రకారం మార్పుచేర్పులు చేస్తారు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 10:26, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ, మీరు చేసే పనిని పూర్తి స్థాయిలో పరిశీలించలేకపోయినా మీరు చేస్తున్న పని పూర్తిగా యాంత్రికంగా చేయడం లేదని మాత్రం అర్థం అయింది. ఇలాంటి మార్పులు చేయడం కొంతమందికి విసుగు కూడాను. కానీ మీరు ఓపిగ్గా చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. చిన్నపాటి సమాచారమైనా సరే, తప్పులు సరిదిద్దుతున్నారు, నాణ్యతను పెంచుతున్నారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 09:16, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మండలాల్లో గ్రామాల విభజన, నిర్ణజ, రెవెన్యూ గ్రామాలను గుర్తించి విడగొట్టడం వంటి కృషి అద్భుతమైనవి. ఒక విషయంపై గతంలో మీతో చర్చించాను. అది మూసధోరణిలో ( భారత జనగణన డేటా నుండి తీసుకున్న సమాచారం) ఉన్న సమాచారాన్ని వెనక్కి పెట్టి, సహజంగా రాయబడిన సమాచారన్ని ముందు ఉంచమని. కానీ మీరు ఆసలహా తీసుకోలేదు. మీరు సహజంగా ఉన్న సమాచారాన్ని కిందికి పెట్టడం వలన ఎవరు ఏ పేజీ తెరచి చూసినా ఒకే మూస సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు అంతర్వేది లాంటి ప్రముఖ పుణ్యక్షేత్ర వ్యాసంలో అసలు ఉండవలసిన, అవసరమైన సమాచారాన్ని కిందికి నెట్టి, సమీప జూనియర్ కళాశాలలు, సమీప వైద్య కళాశాలలు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాలలు, సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఇవన్నీ పైన మొదట్లో చేర్చారు. తరువాత నేను మార్పులు చేసాను. ఇలా సమాచారాన్ని, కొన్ని మూసలను, కొన్ని పెట్టెలనూ చేర్చి సృజనాత్మక వ్యాసాల అందాన్ని తొలగిస్తున్నమేమో.. మిగతా కృషి ఒకేత్తైతే ఇది ఒకేత్తు. ఎన్ని చేసినా అసలు వ్యాసంలో ఉండావల్సిన సమాచారలోపం వలన వ్యాసం అందం పోయి వికీలో వ్యాసాలు ఇలా ఇటుకల్లా ఒకే మూసలో ఉంటాయి అనే భావన కలుగిస్తున్నామని అనుకుంటాను.. మీ మార్పుల్లో భాగంగా తెరచిన ప్రతి గ్రామ వ్యాస సమాచారంలోనూ మీకు మీరుగా సృజనాత్మక ధోరణిలో సమాచారాన్ని చేర్చేలా జాగ్రత్తలు తీసుకోగలిగితే బావుంటుంది. అది వదిలెస్తే మిగతా మీ కృషికి నా అభినందనలు,ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 08:11, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆటోమాటిగ్గా సమాచారాన్ని చేర్చకపోతే గ్రామాల పేజీలు ఈ స్థాయికి చేరి ఉండేవే కాదు. ఇదే పనిని మానవికంగా చేసి ఉంటే ఇప్పటికి ఐన పనిలో వందో వంతు కూడా అయి ఉండేది కాదు. అంతేకాదు, ఈ పని చెయ్యక ముందు, 90% పేజీల్లో ఉన్నది ఒకటే వాక్యం. అది కూడా యాంత్రికంగా చేర్చినదే. ప్రతీ పేజీలోనూ ఒకే రకమైన వాక్యం ఉండేది. ఆ స్థాయి నుండి 11 కెబి ల స్థాయికి చేరాయి.
గ్రామాలన్నిటికీ ఒకే సమాచారం ఉంటుంది, డేటా మారుతుందంతే! కాబట్టి అన్ని పేజీలు ఒకే రకంగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. సినిమాల పేజీలు కూడా అలాంటివే. ఆ పేజీలన్నీ ఒకే రకంగా ఉంటై, డేటా మారుతుందంతే! చాలా సినిమాల పేజీల్లో వాక్యాలు గ్రామాల పేజీల్లో లాగానే ఒకేలా ఉంటై. గ్రామాల పేజీల్లో వాక్యాలను రెండు మూడు రకాలుగా మార్చాం వివిధ పేజీలను పరిశీలించి చూస్తే తేడాలను గమనించవచ్చు.
మరొక సంగతి.. వరసగా అనేక గ్రామాల పేజీలు చూసుకుంటూ పోతే అన్నీ ఒకేలా ఉన్నాయే అనిపించడం సహజం - వాక్యాలు చాలావరకు ఒకేలా ఉంటై కాబట్టి. కానీ మనకున్న పరిమితిలో అలా చెయ్యక తప్పదు. పైన చెప్పినట్టు మానవికంగా చేస్తే మనం ఇప్పటికీ ఇంకా 2017 లోనే ఉండేవాళ్ళం.
ఇకపోతే తెరిచిన ప్రతి గ్రామ వ్యాసం లోనూ మానవికంగా సమాచారాన్ని చేర్చే ఆలొచన బాగానే ఉంది. ఆ పని మిగతావారు చెయ్యాలి గానీ, @యర్రా రామారావు చెయ్యకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ గ్రామాల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళే బృహత్తరమైన బాధ్యత ఒకటి ఆయనకుంది. ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు కాబట్టి, మరికొందరు ఆయనతో కలిసి పనిచేసారు కాబట్టి పాతిక వేల పైచిలుకు పేజీలు, సంబంధిత మూసలు, వర్గాలు వగైరాలు రూపుదిద్దుకున్నాయి, ఈ స్థాయికి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో ఇంకా బోలెడు పని మిగిలే ఉంది. ప్రతి పేజీ లోనూ ఉన్న సమాచారంలో చెయ్యాల్సిన మార్పుచేర్పులు అనేకం ఉన్నాయి. వాటిని క్రోడీకరించడం, ఆ పనులను చెయ్యడమే పెద్ద పని. ఆ పని మరొకరు చెయ్యగలిగేది కాదు. చేసేవాళ్ళూ లేరు. ఇప్పుడు ఆయన సృజనాత్మక ధోరణిలో సమాచారాన్ని మార్చడం చేర్చడం లాంటి పనులు తీసుకుంటే, ప్రాజెక్టు పని కుంటుపడుతుంది. అంచేత ఆ పనులు ఇతరులు చేస్తే మంచిది. __   చదువరి (చర్చరచనలు) 01:34, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాథ్ గారూ " మండలాల్లో గ్రామాల విభజన, నిర్జన, రెవెన్యూ గ్రామాలను గుర్తించి విడగొట్టడం వంటి కృషి అద్భుతమైనవి". అని గుర్తించినందుకు ధన్యవాదాలు.మిగిలిన విషయాలు మీద చదువరి గారు స్పందించిన తరువాత నేను పెద్దగా స్పందించాల్సిన అవసరం కనపడుటలేదు.కాకపోతే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా వయస్సు 70 సంవత్సరాలు.నాది ఇప్పుడు బోనస్ లైఫ్. ఇది వ్యక్తిగత విషయం కావచ్చు.దీనికి సంబంధం ఉన్న విషయంగా భావించి ప్రస్తావిస్తున్నాను. నేను ఈ గ్రామాలు ప్రాజెక్టులో పూర్తిగా దిగాను కాబట్టి దానిమీదనే నాదృష్టిపెట్టి, నాకు చేతనైంతవరకు, అవకాశం ఉన్నంతవరకు పూర్తిచేద్దామనే అలోచనతప్ప వేరే ఉద్దేశ్యంమేమీలేదు.సదుద్దేశ్యంతో అర్థంచేసుకుంటే అంతేచాలు. యర్రా రామారావు (చర్చ) 04:33, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: సృజనాత్మక సమాచారం అన్న పదాన్ని మీరు బహుశా సంస్కృతి, దేవాలయాలు, చరిత్ర వంటి వాటిని ప్రస్తావిస్తూ వాడారని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం అదే అయితే చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలాసార్లు గ్రామాల వ్యాసాల్లో మూలాల ఆధారంగా ఈ తరహా సమాచారాన్ని చేర్చాలని చాలా ప్రయత్నాలే చేశాను. అయితే, తెలిసిన ఊరి గురించి తెలిసినట్టుగా మూలాల ఊసు లేకుండా రాయడం తేలిక. (తేలిక అంటే మన గుప్పెడు మందికి తెలిసిన ఓ ఇరవై ముప్పై ఊళ్ళ గురంచి రాయగలం. మనకు తెలియని వేలాది ఊళ్ళు అలానే పడుంటాయి.) మూలాల ఆధారంగా రాయడం కొంచెం సవాలుతో కూడిన పని. కానీ, వేలాది సంఖ్యలో ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయాలంటే మూలాల ఆధారంగా చేయడమే స్కేలబుల్ పద్ధతి, సరైన పద్ధతి. సరైన ప్రణాళికతో వెళ్తే చేయవచ్చు. నగరాలు, పట్టణాలు, గ్రామాల వ్యాసాలకు బెంచ్ మార్క్ వ్యాసాలు రూపొందించుకుందాం! అని ఇంతకుముందు రచ్చబండలోనే ఆహ్వానించాను. చదువరి గారు ప్రోత్సహించారు. ఇతరులెవరూ పట్టించుకున్నట్టు లేదు. అయితే నేను నిరుత్సాహపడకుండా విజయవాడ నగరం వ్యాసాన్ని చాలావరకూ అభివృద్ధి చేశాను. తోడు లేకపోవడంతో పూర్తిచేయలేకపోయాను. ఈసారి కొంచెం చిన్న టార్గెట్ పెట్టుకుని అత్తిలి గ్రామ వ్యాసాన్ని చాలా సంతృప్తికరంగా అభివృద్ధి చేశాను.
మీలాంటివాళ్ళు కలిసి వస్తాను అనాలే కానీ మనకు సముద్రం అంతటి సమాచారం అందుబాటులో ఉంది. ఉదాహరణకు:
  • ఈనాడు ఆదివారం పత్రికలో ప్రతీవారం ఒక పుణ్యక్షేత్రం గురించి వ్యాసం పడుతుంది అది మనకు మూలమే. కావాలంటే, పాత ఈనాడు ఆదివారాల స్కాన్లు మనం తెప్పించుకోవచ్చు.
  • తెలంగాణ ప్రభుత్వ సమాచార శాఖ తెచ్చే "తెలంగాణ" పత్రిక ఆన్‌లైన్‌లో ఉంది. పర్యాటకం, చరిత్ర వంటి విభాగాలకు వెళ్తే బోలెడు వ్యాసాలు ఉన్నాయి. ఒక్కోదానిలోనూ ఆయా గ్రామాలకు సంబంధించి ఉన్న చారిత్రక విశేషాలూ, పర్యాటక వివరాలు పట్టుకెళ్ళి గ్రామాల్లో చేర్చవచ్చు. (ఆంధ్రప్రదేశ్‌ పత్రిక కూడా ఆన్‌లైన్‌లో ఉంది కానీ అంత సౌకర్యంగా లేదు చదవడానికి. ప్రయత్నించడంలో తప్పులేదు.)
  • ఇంకా జిల్లాల వారీగా అనేక అంశాల మీద పుస్తకాలు ఉన్నాయి. మీకు ఎలాంటివి అందించాలన్నా సిద్ధమే.
ముందుకు వస్తానంటే అత్తిలి వ్యాసం ఎంత అందంగా తయారైందో అలానే మిగిలిన వ్యాసాలు తయారుచేసుకోవచ్చు. యర్రా రామారావు గారు ప్రస్తుతం చేస్తున్న పని చాలా అవసరమైనది కాబట్టి ఆయన దారిన ఆయనను చేసుకోనిస్తూ, ఈ పని కావాలంటే మనం చేపట్టవచ్చు. పలుమార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి, ఒక్కణ్ణే కావడంతో విసుగెత్తి మానేసి ఉన్నాను. ఆ ఒక్క అత్తిలి వ్యాసం మాత్రం విశేషంగా తయారుచేయగలిగాను. (ఆఫ్‌కోర్స్ యర్రా రామారావు గారిలా ఒక్కరే ముందుకు సాగేందుకు కావాల్సిన పట్టుదల నాకు లేవని అనవచ్చు, తప్పులేదు) --పవన్ సంతోష్ (చర్చ) 11:58, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: గారూ దీనిపై మీకు ఆసక్తి ఉందో లేదో తెలియజేయగలరు --పవన్ సంతోష్ (చర్చ) 09:04, 9 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

The Wikimedia Foundation Board of Trustees Election is open: 18 - 31 August 2021 మార్చు

Voting for the 2021 Board of Trustees election is now open. Candidates from the community were asked to submit their candidacy. After a three-week-long Call for Candidates, there are 19 candidates for the 2021 election.

The Wikimedia movement has the opportunity to vote for the selection of community and affiliate trustees. By voting, you will help to identify those people who have the qualities to best serve the needs of the movement for the next several years. The Board is expected to select the four most voted candidates to serve as trustees. Voting closes 31 August 2021.

Read the full announcement and see translations on Meta-Wiki.

Please let me know if you have any questions regarding voting. KCVelaga (WMF), 06:11, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Universal Code of Conduct - Enforcement draft guidelines review మార్చు

The Universal Code of Conduct Phase 2 drafting committee would like comments about the enforcement draft guidelines for the Universal Code of Conduct (UCoC). This review period is planned for 17 August 2021 through 17 October 2021.

These guidelines are not final but you can help move the progress forward. The committee will revise the guidelines based upon community input.

Comments can be shared in any language on the draft review talk page and multiple other venues. Community members are encouraged to organize conversations in their communities.

There are planned live discussions about the UCoC enforcement draft guidelines:

Summaries of discussions will be posted every two weeks here.

Please let me know if you have any questions. KCVelaga (WMF), 06:24, 18 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అమలు ప్రతిపాదన మార్చు

క్యశ్యప్ గారూ, 75 వసంతాల భారత స్వాత్యంత్ర వేడుకలు సందర్బంగా వికీపీడియాలో ఈ 75 సంవత్సరాలలో సాధించిన విజయాలు , స్వాతంత్ర్య పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర్య సమరయోధులు, 75 ఏళ్ల లో ఆలోచన విధానాలు 75 ఏళ్ల లో విజయాలు , 75 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, భారతీయ ప్రముఖ కంపెనీలు, అంతర్జాతీయ వ్యక్తులు లాంటి విషయాలు అనుగుణంగా 75 రోజులు లేదా వీలును బట్టి 75 వారాలు ! ఒక నిర్వహించుకుంటే ఎలా ఉంటుందనే వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 80#ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – ప్రతిపాదన విభాగంలో ఒక చక్కటి ప్రతిపాదన లేవనెత్తారు.కాలం మన కోసం ఆగదు.దీనిమీద సముదాయం సభ్యులు అందరూ సానుకూలంగా స్పందించారు.ఇలాంటి కార్యక్రమాలుకు చాలా ప్రాముఖ్యత ఉంది.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహంచిన మీకు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించే సమర్థత కొకొల్లుగా ఉందని నేను భావిస్తున్నాను. దీనికి సముదాయ సభ్యులందరి సహకారం తప్పనిసరిగా ఉంటుంది.కావున దీనిమీద ఒక ప్రాజెక్టు పేజీ నిర్మించి, విధి విధానాలు రూపొందించి ఆచరణకుతెరమీదికి తీసుకురావల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. మనం అనుకుని దీనిని ఆచరణలో పెట్టలేకపోయమంటే ఒకరకంగా మనల్ని మనం అవమానించుకున్నట్లే అని అభిప్రాయం. దీనిమీద సముదాయ సభ్యులు ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:30, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

  • క్యశ్యప్ గారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిపాదన చాలా బాగుంది. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే పాలుపంచుకోడానికి నేను సిద్ధం. యర్రా రామారావు గారు చెప్పినట్టు సముదాయ సభ్యులందరి సహకారం కూడా ఉంటుందని భావిస్తున్నాను.--Abhilash (చర్చ) 14:28, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • క్యశ్యప్ గారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిపాదన చాలా బాగుంది. ప్రాజెక్టు ప్రతిపాదన 2021 మార్చి 12న చేసారు. అందుకు రచ్చబండలో సభ్యులు ఆమోదం తెలిపారు. వెంటనే ప్రాజెక్టు ప్రారంభించి ఉంటే 2021 ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి చాలా వ్యాసాలు తయారయి ఉండేవి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించలేదో తెలియలేదు. ఇప్పటికైనా ప్రారంభిస్తే మంచిదే. దీనిని సముదాయ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చినందుకు యర్రా రామారావు గారికి ధన్యవాదాలు.➠ కె.వెంకటరమణచర్చ 17:19, 19 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • కశ్యప్ గారు తన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తే నేనూ ఆ ప్రాజెక్టులో పాల్గొంటాను. పోతే, ఈ ఏడాదంతా కనబడేలా భారత త్రివర్ణాలను సైటులో ఎక్కడైనా ప్రదర్శిద్దామా? __చదువరి (చర్చరచనలు) 01:46, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ ప్రతిపాదన ప్రకారం ప్రాజెక్టును ప్రారంభిస్తే 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతాయి కనుక అప్పటి వరకు సైట్ లో త్రివర్ణ పతాక చిత్రాన్ని ప్రదర్శిస్తే మంచిదే. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే నేను రచనలు చేయడానికి సిద్ధం.➠ కె.వెంకటరమణచర్చ 03:30, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    చదువరి గారు ఈ ఏడాదంతా కనబడేలా భారత త్రివర్ణాలను సైటులో ఎక్కడైనా ప్రదర్శిద్దామా అనే ప్రతిపాదన చాలా సముచితంగా ఉంది.ఇది ఎడమ వైపు లోగో స్వేచ్చా విజ్ఞాన సర్వస్వము దగ్గర ఉంటే బాగుంటుంది. అలాగే 75 సంవత్సరాల సందర్బంగా 75 రోజులు ప్రాజెక్టును ప్రారంభిస్తే నేను రచనలు చేయడానికి సిద్ధం. యర్రా రామారావు (చర్చ) 03:55, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 రోజుల పాజెక్టు ప్రతిపాదన బాగున్నది , #WPWP స్ఫూర్తి తో మరింత విజయవంతం చేయవచ్చు వ్యవధి చిన్నదిగా అందరూ పాల్గొనే విధంగా ఒక కార్యక్రమం తయారుచేయాలి, సముదాయేతర వ్యక్తులు , పాఠశాలలు , ఇతర విద్యాసంస్థలను కూడా భాగస్వామ్యులను చేయవచ్చు , వారితో వర్క్ షాపులు , ప్రాజెక్టులు చేయవచ్చు , తెలుగు వికిపీడియాకు మరింత ప్రచారం కూడా వస్తుంది. ఏమి చేద్దాం ఎలా చేద్దాం ,ఎప్పుడు చేద్దాం ? --Kasyap (చర్చ) 05:33, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నేనుకూడా సిద్ధం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:37, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కశ్యప్ గారూ ఈ ప్రతిపాదించిన మీరు మీ ఆలోచన ప్రకారం ఏమి చేద్దాం, ఎలా చేద్దాం ,ఎప్పుడు చేద్దాం, అనే దానిమీద మీరు ప్రాజెక్టు పేజీ ఒకటి తయారుచేసి రచ్చబండలో ప్రవేశపెట్టిండి. ఒక పని అయిపోద్ది. యర్రా రామారావు (చర్చ) 07:17, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]


గతంలో ఈ ప్రాజెక్టు శీర్షిక పై కూడా చర్చ జరిగింది. దాని నిర్ణయం ప్రకారం ప్రాజెక్టును ప్రారంభించండి.-- కె.వెంకటరమణ 09:15, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ శీర్షికలో చర్చ జరిగినది , కానీ పేరుమీద నిర్ణయం జరగలేదు కాబట్టి ఇది సంస్కృత భూయిష్టమైన పేరైనా విషయ ప్రాధాన్యత కోసం నేను చొరవ తీసుకొని వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆజాది_కా_అమృత్_మహోత్సవం అని ప్రతిపాదిస్తున్నాను , ఇందులో తగు సూచనలు చేయగలరు : Kasyap (చర్చ) 09:35, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంతకుముందు దీనిమీద రచ్చబండలో చర్చలు జరిగినవి. ఇంకొకటి ఇదే విషయసంగ్రహం మీద స్వతంత్ర భారత అమృతోత్సవాలు అనే పేరుతో వినయ్ కుమార్ గౌడ్ గారిచే మరియొక పేజీ సృష్టించబడింది.దీని మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేజీలో చర్చ జరిగింది.దానిలో కశ్యప్ గారు స్వతంత్ర భారత అమృతోత్సవాలు పేరు బాగుందని అంగీకారం తెలిపారు. దానిలో జరిగిన చర్చను కూడా పరిగణనలోకి తీసుకుని, ముందుగా సముచితమైన పేరును నిర్ణయంచి, ఈ రెండు వ్యాసాలను విలీనం చేసి, ప్రాజెక్టు పేజీని మార్పుచేసి, ఏమి చేద్దాం, ఎలా చేద్దాం , ఎప్పుడు చేద్దాం, అనే దానిమీద ముందుకు పోతే బాగుంటుందని నా అభిప్రాయం యర్రా రామారావు (చర్చ) 12:05, 20 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు వేరు , ప్రాజెక్టు పేరు వేరు నేను గమనించిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా , తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా వరకు ఆజాదీ కా అమృత్ అనే పేరుతోనే జరుగుతున్నాయి కావున ఈ పేరునే ఖరారు చేయమని కోరుతున్నాను : కశ్యప్ 04:56, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 72,297 వ్యాసాలు ఉన్నాయి. 75వ భారత స్వాత్యంత్ర వేడుకలు సందర్భంగా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదిలోపు మనందరం కలిసి తెవికీ వ్యాసాల సంఖ్యను 75వేలు దాటించేలా కృషి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ప్రణయ్‌రాజ్ వంగరి 07:07, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఏడాదంతా కనబడేలా మార్చు

ఈ ఉత్సవం సందర్భంగా, మూడు రంగులు ఈ ఏడాదంతా కనబడేలా ఎక్కడైనా పెడితే బాగుంటుంది. లోగోను పూర్తిగా మార్చకుండా పేరు కింద గాని, నేపథ్యంలో గానీ మూడు రంగులను చేరిస్తే ఎలా ఉంటుంది. అదైతే సైటులో ఏ పేజీలోనైనా కనబడుతుంది. వీవెన్ గారూ మీరు గతంలో లోగోలపై పనిచేసినట్టు గుర్తు.. మీ అభిప్రాయం చెప్పగలరు.__చదువరి (చర్చరచనలు) 04:49, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పెట్టాలనే నా అభిప్రాయం కూడా. ఇతర పద్ధతులు కూడా చూడవచ్చు. — వీవెన్ (చర్చ) 06:01, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తేలిగ్గా చిహ్నం వెనకాల జాతీయ పతాకం కనబడేలా చేసాను. దీన్ని ఎవరికివారు ప్రయత్నించి చూడడానికి తమతమ వ్యక్తిగత CSS నియమాలను చేర్చుకోవచ్చు. ఉదాహరణ కోడు కొరకు నా వ్యక్తిగత CSS పేజీ చూడండి. @చదువరి గారూ ఈ పద్ధతిలో (మీడియావికీ:Common.css పేజీలో మార్పు చేసి) మనమే దీన్ని సాధించుకోవచ్చు. లేకపోతే సైటు చిహ్నం మార్చడానికి, ఫాబ్రికేటరులో నివేదించాలి. — వీవెన్ (చర్చ) 07:11, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Veeven గారూ, నేను కూడా నా CSS పేజీలో పెట్టుకుని చూసాను. బాగుంది. background-position:-14px 36px; ను మార్చి -4px 6px; అని పెట్టాను. నాకు మరింతగా నచ్చింది. ట్రాన్స్పరెన్సీ/ఒపేక్ ప్రాపర్టీని మార్చే వీలుంటే మరింతగా బాగుంటుందనుకుంటాను. మిగతా వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం. __ చదువరి (చర్చరచనలు) 10:35, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
 
ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రతిపాదిత లొగొ

ఆజాదీ కా అమృత్ లోగో [1] స్ఫూర్తి తో ఇది తయారు చేసాను , దయచేసి మీ అభిప్రాయం తెలుపగలరు : Kasyap (చర్చ) 06:09, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

లోగో బాగుంది Kasyap గారు, ఇంకొంచెం మార్చొచ్చేమో పరిశీలించండి. NSKjnv ☚╣✉╠☛ 06:30, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Kasyap గారూ, లోగో బాగుంది. అయితే, వికీలోగో జాతీయ పతాకం మధ్యలో వచ్చి, దానికింద తెలుగు వికీపీడియా అని ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే తెలుగు వి అక్షరం కనపడేలా ఉన్న లోగో ఉంటే చూడండి.--ప్రణయ్‌రాజ్ వంగరి 07:00, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
బాగుంది! ఎడమవైపు పైన చిన్నం స్థానంలో పెట్టడానికి వీలుగా నిలువుగా ఉంటే మేలు. — వీవెన్ (చర్చ) 07:03, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మరికొన్ని లోగోలు ప్రాజెక్టు చర్చా పేజీ లో చేర్చాను , దయచేసి అక్కడ సూచనలు చేయగలరు ,మీరు డిజైన్ చేసిన లోగోలు కూడా చేర్చగలరు  : Kasyap (చర్చ) 07:05, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నోట్స్ మార్చు

  1. https://amritmahotsav.nic.in/logo.htm

లోగోలో వీవెన్ గారు చేసిన మార్పులతో తెరపట్టు మార్చు

లోగో నేపథ్యానికి వీవెన గారు చేసిన మార్పులను నా CSS ఫైలులో కూడా చేసుకున్నాను. అప్పుడు నాకు లోగో ఇలా, కిందనున్న బొమ్మలోలా కనిపించింది. అందరూ పరిశీలించి సరేనంటే, అవద్సరమైనా మార్పులు చేసి దీన్ని అందరికీ కనబడేలా పెట్టవచ్చు. __చదువరి (చర్చరచనలు) 10:51, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

బాగుంది.పనిలో పనిగా విజ్ఞాన సర్వస్వములో ము బదులు సున్న చేర్చండి.గతంలో అందరం అనుకున్నాం. యర్రా రామారావు (చర్చ) 11:12, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పతాకం కొద్దిగా పైకి వెళ్లి, చిన్నగా ఉంటె బావుంటుంది..B.K.Viswanadh (చర్చ) 11:49, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది కూడా బాగుంది చదువరి గారు. జాతీయ పతాకం రెపరెపలాడుతున్నట్లుగా ఉంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:56, 21 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
 
వీవెన్ గారూ, దీని గురించి ఇంకా ఏమైనా సూచనలు, అభిప్రాయాలు వస్తాయేమో మరొక్క రోజు చూద్దాం. రేపు, ఇక్కడ వచ్చిన సూచనలను పరిగణించి, సముచితమని మీరు భావించిన మార్పులను చేసి, ఆ లోగో నేపథ్యం అందరికీ కనిపించేలా చెయ్యవలసినదిగా కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 03:55, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంకేమీ సూచనలు, అభ్యంతరాలు రాలేదు కాబట్టి దీన్ని పెట్టేయవచ్చు. మీడియావికీ:Common.css పేజీని నేను మార్చలేకున్నాను. ఆ పేజీని మార్పగలిగే అనుమతి ఉన్నవారు వాడుకరి:Veeven/common.css పేజీ లోని కోడును ఆ పేజీలో అడుగున అతికించగలరు. — వీవెన్ (చర్చ) 12:27, 25 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ కొత్త లోగో వెనుక ఝెండా తో బాగున్నది, పనిలో పని గా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వములో లో విజ్ఞానం బదులుగా స్వేచ్ఛా సర్వస్వం అన్న పేరును కూడా పరిగణించగలరు, ఎందుకంటే చాలా భాషల వికీ లోగో లలో The Free Encyclopedia అనే ఉన్నది గానీ The Free Knowledge Encyclopedia అని లేదు : Kasyap (చర్చ) 08:45, 23 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్‌సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం అని కదా! — వీవెన్ (చర్చ) 11:11, 24 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వీవెన్ గారు నేను చూసిన చాలా ఉదాహరణ లలో encyclopedia means a large collection of information అని మాత్రమే ఉన్నది ,అయితే కొన్ని చోట్ల many branches of knowledgeమాట అని కూడా ఉన్నది , ఈ సమాచారం అంతా జ్ఞానం కాక పోవచ్చు అయితే ఇదొక సూచన మాత్రమే, ఇదివరలో కూడా ఇక్కడ ఈ చర్చ చేశాను , నా వాదన నెగ్గలేదు :) : Kasyap (చర్చ) 04:33, 25 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

“సమాచార సర్వస్వం” అందామా అయితే! 😉 — వీవెన్ (చర్చ) 12:16, 25 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
"విజ్ఞాన సర్వస్వం" అనేది తెలుగులో సరైన పదం. (మిగతా భాషలలోవలె true translation చేయవద్దు) దయచేసి దానిని మార్చవద్దు.--Rajasekhar1961 (చర్చ) 14:28, 27 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]


ధన్యవాదములు Rajasekhar1961, గారు తెలుగు ప్రత్యేకంగా ఉండటమే అభీష్టం అయితే నేనూ గౌరవిస్తాను : Kasyap (చర్చ) 04:40, 30 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు నమస్కారం.
 

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మీరు ప్రతిపాదించిన మాదిరిగా వికీపీడియా లోగో వెనకాల భారత త్రివర్ణ పతాకం వచ్చేట్టు మారుద్దాం అనుకున్నాం కదా! అది ఇంకా అమలు కాలేదు?-అభిలాష్ మ్యాడం 16:22, 16 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@MYADAM ABHILASH గారూ, ఇక్కడ దాని గురించి మాట్టాడిందే నలుగురు. మిగతావాళ్ళు అసలే మాట్టాడలేదు. పాల్గొన్న నలుగురూ నాలుగు సూచనలిచ్చారు. ఏం చెయ్యాలో సందిగ్ధత ఏర్పడింది నాకు. ఎవరైనా ఏమైనా మాట్టాడతారేమోనని కొన్నాళ్ళు చూసాను. ఆ తరువాత దాని సంగతి మర్చిపోయాను.
చర్చలో పాల్గొని అభిప్రాయాలు చెబుతూ ఉంటే నిర్ణయాలొస్తూంటై. మీరు అభిప్రాయం చెప్పారో లేదో నాకు తెలీదు - కనీసం ఆ ప్రతిపాదన సంగతి ఏమైంది అన్న ఉత్సుకతైనా చూపారు, సంతోషం. __ చదువరి (చర్చరచనలు) 10:01, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పెట్టేసాను. __చదువరి (చర్చరచనలు) 10:25, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ఇంకేమీ సూచనలు, అభ్యంతరాలు రాలేదు కాబట్టి దీన్ని పెట్టేయవచ్చు అన్న వీనెన్ గారి మాట చూసి మిగతా వారు ఎవరూ స్పందించలేదు అనుకుంటా.. నేను కూడా ఆ రోజునుండి ఈ రోజు వరకూ ఎప్పుడు మారుతుందా అని ఎదురుచూస్తూ ఉన్న😊 ఏదేమైనా ఇపుడు చేర్చారు కదా సర్! ధన్యవాదాలు చాలాబాగుంది. వికీలో అమృత మహోత్సవ ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.--అభిలాష్ మ్యాడం 10:53, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చూడ చక్కగా ఉంది. చాలా బాగుంది. ఈ రకంగా మన దేశాన్ని, జాతీయపతాకాన్ని వికీపీడియా తరుపున గౌరవించాం.@ అభిలాష్ గారు గుర్తు చేసినందుకు, చదువరి గారు వెంటనే అమలులోకి తీసుకొచ్చినందుకు ఇద్దరకూ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 11:45, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చూడ చక్కగా ఉంది. మీ చురుకుతనానికి అభినందనలు అభిలాష్ గారూ, ధన్యవాదాలు చదువరి గారూ. Nskjnv ☚╣✉╠☛ 13:18, 17 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ, మండల వ్యాసాల నిర్వహణ, సవరణల చెక్ లిస్ట్ పరిశీలన మార్చు

గ్రామ, మండల వ్యాసాల నిర్వహణ, సవరణలకు చెక్ లిస్ట్ నొకదానిని తయారుచేసి చర్చకు ప్రవేశపెట్టటమైంది.దానిని పరిశీలించి సూచనలు , సందేహాలు ఏమైనా ఉంటే చర్చా పేజీలో ఒక వారం రోజులలోపు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:45, 27 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఒలింపిక్ క్రీడలు పేర్లు నమూనా మార్చు

ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన పేర్లు ఈ క్రింది నమూనా ప్రకారం ఉంటే బాగుంటుంది.

ప్రధాన వ్యాసాలు:

ఉపతరగతులు:

వర్గాలు:

వర్గం:భారతీయ ఒలింపిక్ క్రీడాకారులు; వర్గం:భారతీయ ఒలింపిక్ పతక విజేతలు;

Rajasekhar1961 (చర్చ) 06:47, 28 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం Rajasekhar1961 గారు, నేను కూడా 2020 టోక్యో ఒలింపిక్స్ పేజీ నిర్మించేటప్పుడు ఈ విషయం అనుకున్నాను. కానీ అంతకు ముందు ఉన్న పేజీలు కూడా ఒక పద్దతిలో లేకపోవటం వల్ల అలా సృష్టించవలసి వచ్చింది. ఆ పేజీని మీరే సరైన పేరుకు తరలించవల్సిందిగా అభ్యర్తిస్తున్నాను. ఒలింపిక్ క్రీడల పేర్ల నమూనాలో ఈ స్పష్టత ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.NSKjnv ☚╣✉╠☛ 07:22, 28 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పనిమొదలుపెట్టాను. ఇప్పటికే తయారైన వ్యాసాలను ఈ పైవిధంగా మార్చాను. ఇందుకు ప్రారంభ వ్యాసాల కోసం: ఒక పట్టిక, సమాచారపెట్టెలు అవసరం. పట్టికలో క్రీడాకారుని పేరు, పాల్గొన్న క్రీడ, పతకం వివరాలు మొదలైన వివరాలు కలిగివుండాలి. సమాచారపెట్టె:country at games ఆంగ్లం నుండి దిగుమతి చేసుకొంటే సరిపోతుంది. 1900 నుండి 2020 వేసవి ఒలింపిక్ క్రీడలలో భారతదేశం వీటిని ప్రతి వ్యాసంలోను వాడితే బాగుంటుందని నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 18:22, 31 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

[Reminder] Wikimedia Foundation elections 2021: 3 days left to vote మార్చు

Dear Wikimedians,

As you may already know, Wikimedia Foundation elections started on 18 August and will continue until 31 August, 23:59 UTC i.e. ~ 3 days left.

Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term.

Here are the links that might be useful for voting.

We have also published stats regarding voter turnout so far, you can check how many eligible voters from your wiki has voted on this page.

Please let me know if you have any questions. KCVelaga (WMF), 05:40, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు ) మార్చు

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 07:33, 31 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టుని చేపడుతున్నందుకు, తెవికీలో నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నందుకు Kasyap గారికి ధన్యవాదాలు.NSKjnv ☚╣✉╠☛ 07:13, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టుని చేపడుతున్నందుకు, తెవికీలో నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నందుకు Kasyap గారికి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు వ్యాసముల అభివృద్ధి కి అందరు చేయూత ఇచ్చి విజయవంతము చేయాలని, కావాలని ఆకాంక్షిస్తూPrasharma681 (చర్చ) 12:30, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు మార్చు

పోటాపోటీగా గ్రామాల వ్యాసాలలో పటాలను గత రెండు నెలల నుంచి విరామము లేని సమయాన్ని కేటాయించి శ్రమ ఫలితాన్ని అందుకున్న మొదటి మూడు స్థానాల్లో నిలిచిన Nskjnv , చదువరి, వెంకటరమణ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు, విజేతలకు... అభినందనలు. మొదటి పది స్థానాల్లో నిలిచిన వారికి శుభాభినందనలు. ఎంతో కొంత సమయం వెచ్చించి తర్వాత స్థానాల్లో నిలిచిన వారికి అభినందనలు ధన్యవాదాలు... ఇంత మంచి ప్రాజెక్టును నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు... గత ప్రాజెక్టుల కంటే పోటీతత్వం చాలా పెరిగింది... దానికి సాక్ష్యం 3000 ల టార్గెట్ పెట్టుకుంటే 30,000 టార్గెట్ కు చేరువలో చేరడం తెలుగు వికీపీడియా చరిత్రలో ఇదే మొదటిసారి ఈ పోటీ తత్వం అన్ని ప్రాజెక్టులు కొనసాగించాలని నా మనవి. ఇందులో పాల్గొన్న ప్రతివారికి పేరుపేరునా ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్చర్చ 06:39, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గుర్తించాలని మార్చు

అభినందనలు తెలియచేస్తూ మీ శ్రమను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. కానీ, బొమ్మలు చేర్చాలి అని పోటీ పెట్టి, పటాలను చేర్చి గ్రామ వ్యాసాలలో ఫోటోలను ఎప్పుడు చేరుస్తారు. ఎక్కడ ఉన్న పని ఇక్కడే ఉన్నది మరి. ఇతర భాషల వాళ్ళు ఎవరో సర్టిఫికెట్ ఇచ్చారని ఫోటోల బదులు పటాలను పెట్టేశారు. మరి ఇంకా అసలైన పని ఫోటోలు పెట్టడం ఎప్పుడు చేస్తారు. నిజమైన ఫోటోలు చేర్చిన వాడుకరులను ఎప్పుడు గుర్తిస్తారు. ఇది విమర్శ కాదు, ఆత్మ విమర్శ. ఫోటోలు పెట్టినవారిని గుర్తించాలని అభ్యర్థన మాత్రమే. నాకు అనిపించిన మరొక విషయం ఫోటోలు ఎక్కించడానికి ఇలా నెలల వ్యవధి కాకుండా ఒక సంవత్సరం సమయం ఇస్తే ఈ ప్రాజెక్టు లక్ష్యం అన్ని వ్యాసాలలో ఫోటోలు చేర్చాలి, అనే లక్ష్యం చాలావరకు నెరవేరు తుందని నా ఆశ... ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్చర్చ 06:39, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

"ఎప్పుడు చేరుస్తారు", "ఎప్పుడు చేస్తారు".. ఏంటీ ప్రశ్నలు? ఎక్కడున్న పని అక్కడే ఉందని మీకు అనిపిస్తే ఆ పని చెయ్యడం మొదలెట్టండి, చేస్తూండండి, ఇతరులకు స్ఫూర్తి నివ్వండి. పని చేసేందుకు చొరవగా ముందుండి నడవండి. __ చదువరి (చర్చరచనలు) 07:43, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమేనండి, ఇతరులకు చెప్పేముందు ఆ పని నేను ప్రారంభించిన తర్వాతే చెప్పడానికి అర్హత ఉంటుంది. అందుకే చెప్పాను. కచ్చితంగా ఇతర గ్రామాల ఫోటోలు డజనుకు పైగా ఈ పోటీ లోనే నేను పెట్టాను, మీరు కావాలంటే పరీక్షించుకోండి.  ప్రభాకర్ గౌడ్చర్చ 12:43, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు పెట్టారు సార్, అందులో మరో మాటకు ఆస్కారమే లేదు. మీ కృషిని నేను తక్కువగా అంచనా వెయ్యడమే లేదు.
కానీ మీరు ఎవరినైతే ఈ ప్రశ్నలు ఉద్దేశించారో, వాళ్ళు - గ్రామాల పేజీల్లో మ్యాపులు చేర్చిన ఆ వాడుకరులు - మీరు చేసిన ఆ డజను పేజీల కృషికి కంటే కొన్ని డజన్ల రెట్లు ఎక్కువ పేజీల్లో ఫొటోలు చేర్చారు, మీకు తెలుసా ఆ సంగతి? ఆలాంటి వాళ్లను పట్టుకుని మీరు "ఎప్పుడు చేరుస్తారు", "ఎప్పుడు చేస్తారు" లాంటి ప్రశ్నలు అడగవచ్చా? అసలు ఆ ప్రశ్నలు వికీలో ఏ వాడుకరియైనా, మరే వాడుకరినైనా అడగొచ్చా? వికీలో ఫలానా వాళ్ళు ఫలానా పని చేసి తీరాలనే బాధ్యత (నిర్వాహకత్వం లాంటివి కాదు, ఇక్కడ మీరు ప్రస్తావించిన పనుల్లాంటివి) ఏమైనా అప్పగించారా ఎవరైనా? కొందరు ప్రశ్నలు అడిగే బాధ్యత తీసుకోవడం, మరి కొందరికి ఆ ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిన బాధ్యత ఉండడం లాంటి ఏర్పాటేమైనా వికీలో ఉందా?
మరొక్క సంగతి చూసారా.. వేలాది పేజీల్లో బొమ్మలు చేర్చిన వాళ్ళెవరూ - ఒక్కరు కూడా - తాము ఇంత పని చేసాం, అంత పని చేసాం అని చెప్పుకోలేదు. అలా చెప్పుకునేందుకు వాళ్ళందరికీ - మీతో సహా - అర్హత ఉంది కూడా. కానీ అలా చెప్పుకోలేదు. అన్నీ ఉన్న విస్తరి లాగానే ఉన్నారు. కానీ, మీరు మాత్రం, "ఎవరో సర్టిఫికెట్ ఇచ్చారని ఫోటోల బదులు పటాలను పెట్టేశారు." అంటూ ఎత్తిపొడిచారు. సబబైన వ్యాఖ్యేనా అది? ఎవరు సర్టిఫికెట్లిచ్చారు? ఎవరు వాటి కోసం ఆశపడ్డారు? మీరు చేసిన ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో వెనక్కు తిరిగి చూసుకోండి. __ చదువరి (చర్చరచనలు) 14:39, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయం మీద నేను అడిగిన ప్రశ్నకు గారు స్వరలాసిక గారు వివరమైన సమాధానం ఇచ్చారు తరువాత అందరం , ప్రాజెక్టు నిర్వాహకులు అంగీకరించారు ప్రభాకర్ గౌడ్ నోముల గారూ ప్రాజెక్టు ఆయుపోయిన తరువాత ఇక్కడ ఆత్మ విమర్శ పేరుతో చర్చించటం సరికాదు సర్ ,ఇక్కడ అందరూ చేసే ప్రతి ఎడిట్ కూడా విలువ అయినదే ఇక పోతే మీరు అడిగినట్లు ఫోటోలు ఎక్కించడానికి కావాల్సిన సమయం విషయానికి వస్తే మనకు 17 సంవత్సరాలు, 8 నెలలు, 23 రోజులు కూడా సరిపోదు అనుకొంటా : Kasyap (చర్చ) 15:44, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో రాసిన విధానంలో తప్పు ఉండొచ్చేమో నాకైతే అలా అనిపించ లేదు, అలా అనిపిస్తే సారీ, నిజమైన ఫోటోలు చేర్చడానికి కొత్త ప్రాజెక్టు రూపకల్పన చేయాలి అనేది. నేను రాసిన వాక్యాల ఉద్దేశం.  ప్రభాకర్ గౌడ్చర్చ 17:49, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గారూ, ఫోటోలకు బదులు పటాలను పెట్టడం నాకూ వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ అవి నిబంధనలకు లోబడి ఉన్నాయని స్వరలాసిక గారు నిర్ధారించిన తర్వాత ఆ విషయంపై మాట్లాడి, ఉరకలేస్తున్న ప్రాజెక్టు సభ్యులను నిరుత్సాహపరచడం ఇష్టం లేక దాని గురించి నేనేమీ వ్యాఖ్యానించలేదు. ఒకవేళ వ్యాఖ్యానించినా, పటాలు కాకుండా కేవలం ఫోటోలే వేగంగా చేర్చే మెరుగైన ఉపాయం నా దగ్గర లేదు. ఉంటే ధైర్యంగా చెప్పేవాణ్ణి.
పటాలను చేర్చడం వల్ల నిజమైన ఫోటోలు చేర్చడమంత విలువైన పని కాకపోయినా ఖచ్చితంగా నాణ్యతను ఒక చిన్న మెట్టు ఎక్కించే పనే. శిఖరం (అంటే వ్యాసం అత్యున్నత నాణ్యత) చేరుకోవాలంటే చిన్న చిన్న మెట్లు ఎక్కాల్సిందేనని నా ఉద్దేశ్యం. ఇకపోతే పోటీలు వాలంటీర్లలో ఉత్సాహాన్ని నింపి చురుగ్గా పనిచేయిస్తాయి. అందులో నిబంధనలు అనుసరించి మనం గెలవడానికి ఆడాము. ఇప్పటి దాకా వికీలో పెద్ద ఎత్తున జరిగిన పోటీలన్నింటిలో వివిధ భాషల వికీ వాళ్ళు నిబంధనలకు లోబడే ఇలాంటి వ్యూహాలు చాలా పన్నారు. అవి నేను కొన్ని జాగ్రత్తగా గమనించాను కూడా. అన్నీ అసలైన ఫోటోలు ఎక్కించలేకపోయామే అని మనం నీరుగారిపోనవసరం లేదు. మీరన్నట్లు అలాంటి పని చేయాలంటే మరింత దీర్ఘకాలం కావాలి. పైన మీరు వ్యాఖ్యానించిన ఉద్దేశ్యం మంచిదే అయ్యుండచ్చు. అది రాతలోకి వచ్చేసరికి ప్రాజెక్టులో సభ్యులకు నిరుత్సాహకరంగా అనిపించి ఉండవచ్చు. కాబట్టి మనం సున్నితమైన విషయాలు రాసేటపుడు వికీ వ్యాసంలో ఎలాంటి తటస్థత, నిష్పాక్షికత పాటిస్తామో, సంభాషణల్లో కూడా పాటిస్తే మనలో మనకు అభిప్రాయ బేధాలకు తావు లేకుండా ఉంటుంది. మీరు నా మాటలని సదుద్దేశంతో స్వీకరిస్తారని ఆశిస్తూ - రవిచంద్ర (చర్చ) 18:08, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, మీరు చెప్పిన ప్రతి అక్షరం నా మనోభావాలు చాలా దగ్గరగా ఒకే విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు సభ్యులను నిరుత్సాహపరచడం ఉద్దేశం నాకు లేదండి. తెవికీలో అన్ని వేల దిద్దుబాటు జరుగుతూ ముస్తాబు అవుతుంటే సంతోషమే కదా అండి. ప్రాజెక్టు సమయం పూర్తయిన తర్వాత ఈ విషయం ప్రస్తావించాను. మరోసారి దయచేసి, స్వరలాసిక గారు, కశ్యప్ సార్ గారు, వీలు చూసుకుని, మీరు, కొత్త ప్రాజెక్టు రూపకల్పన ఆలోచించగలరు. ప్రభాకర్ గౌడ్చర్చ 08:31, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల్లో మ్యాపు చేర్చడం ద్వారా జరిగిన మేలు గురించి మార్చు

ఫొటోల పోటీ సందర్భంగా గ్రామాల పేజీల్లో మ్యాపు చేర్చడం కచ్చితంగా ఆ పోటీ నియమాల ప్రకారమే జరిగింది. ఆ పోటీని రూపకల్పన చేసింది, నిర్వహించింది అంతా కూడా ఒక కేంద్రీయ బృందం. అన్ని భాషల వికీ ప్రాజెక్టులనూ కలిపి ఈ ప్రాజెక్టును నిర్వహించారు. తెవికీలో ఈ పోటీని నిర్వహించిన స్వరలాసిక గారు ఆ కేంద్రీయ నిర్వాహకులతో మాట్లాడి ఈమెయిలు రూపంలో తెప్పించిన స్పష్టత ఏంటంటే - మ్యాపు చేర్చడం పోటీ నిబంధనల కనుగుణమైనదే అని. అందుచేతనే మ్యాపులను చేర్చడం జరిగింది. ఈ సంగతి తెలీని వాళ్ల కోసమే ఈ స్పష్టత ఇస్తున్నాను.

ఆ పోటీలో పాల్గొన్నవాళ్ళు కూడబలుక్కుని ఆ కేంద్ర కమిటీ వాళ్ళిచ్చే ప్రైజులు కొట్టేద్దామన్న కుట్రలేమీ జరగలేదక్కడ.

ఒక ముఖ్యమైన సంగతి.. ఏదైనా ఒక స్థలం గురించి రాసే ఏ పేజీలో నైనా మొట్టమొదటగా చెప్పేది "ఆ స్థలం ఎక్కడ ఉంది" అనేది. గ్రామాల పేజీలన్నీ "ఫలానా గ్రామం ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ మండలంలో ఉంది" అనే. ఆ భౌగోళిక స్థానాన్ని చూపించే బొమ్మే మ్యాపు! ఈ పోటీ ద్వారా 20 వేల పైచిలుకు గ్రామాల పేజీల్లో మ్యాపులు చేరాయి. ఆ పేజీలకు జరిగిన గొప్ప విలువ చేర్పు అది. బహుశా దాని విలువేంటో తెలీని వాళ్ళకు దాని పట్ల చులకన భావం ఉండవచ్చు.

మరో సంగతి - మ్యాపులో ఉన్నది బొమ్మే! అది .svg లాంటి ఎక్స్టెన్షనుండే దస్త్రమే. ఆ బొమ్మను ఒక మూస/మాడ్యూలు లోపల కూర్చారు. మనం ఆ మాడ్యూలును వాడుకుంటాం. ఆ మాడ్యూలును వాడుతున్నామంటే ఆ బొమ్మను చేరుస్తున్నట్టే. "మరి, ఒకే బొమ్మను అన్ని వేల పేజీల్లో చేరిస్తే తేడా ఏముంటుంది" అని అనుమానం రావచ్చు - అందుకోసమే నిర్దేశాంకాలను ఇస్తున్నాం. ఇచ్చిన నిర్దేశాంకాలను బట్టి ఆ బొమ్మలో ఉండే బిందువు మారుతూంటుంది. నిర్దేశాంకాలను ఇవ్వకపోతే బిందువూ కనబడదు, అసలు ఆ బొమ్మే కనబడదు.

ఇది చాలా మందికి తెలిసిన కనీస మాత్రపు జ్ఞానమే. అది లేక, లేనిపోని అర్థాలు తీసి, అపార్థాలు చేసేసుకునే వాళ్ల కోసమే ఈ చివరి పేరా. __ చదువరి (చర్చరచనలు) 08:10, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చెప్పిన విషయాలకు చాలా జ్ఞానం వచ్చింది, ధన్యవాదాలు. అయితే జరిగిన పనిని ఎక్కడ తక్కువ అంచనా చేయలేదు, చాలా గొప్ప పని, ముందే చెప్పాను, ప్రైజ్ మనీ లక్షల్లో లో ఏమి లేదు... లేదు నేను చెప్పిందల్లా అన్ని గ్రామాల్లో ఫోటోలు పెట్టడానికి ఇలాంటి ప్రాజెక్టు రూపకల్పన చేయమని మాత్రమే. దానికి ఆంజనేయుని పైకి రామ బాణముతో అయోధ్య రాముని వలె యుద్ధం చేస్తానంటున్నరూ ఎందుకో మరి  ప్రభాకర్ గౌడ్చర్చ 13:28, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, పోలికలొద్దు సార్... పైగా దేవుళ్ళతో. ఇక్కడ వాడుకరులంతా సమానులే. ఒకరెక్కువా ఒకరు తక్కువా అంటూ లేదు.
"అన్ని గ్రామాల్లో ఫోటోలు పెట్టడానికి ఇలాంటి ప్రాజెక్టు రూపకల్పన చేయమని మాత్రమే" చెప్పానని మీరు అంటున్నారు. చాలా సంతోషం, చక్కటి మాట. అయితే ఇక్కడ మీరు చెప్పినది పైన మీరు చెప్పినదీ ఒకటి కాదు., మరొక్కసారి పైకెళ్ళి చదవండి. ఇక్కడ రాసినట్టే పైన కూడా రాసి ఉంటే, నేనసలు కలగజేసుకునేవాణ్ణే కాదు, అంత అవసరమూ లేదు.
పోతే.., ప్రాజెక్టు రూపకల్పన చెయ్యమని చెబుతున్నారు.. ఎవరికో చెప్పడం ఎందుకు, మీరే చెయ్యండి. మీరే ముందుండి నాయకత్వం వహించండి. నేను మీ వెనకే నడుస్తా. మిగతావాళ్ళూ నడుస్తారనే భావిస్తున్నాను. నేను మిగతా ప్రాజేక్టుల్లో పనిచేసినట్టుగానే మీ ప్రాజెక్టులో కూడా మీతో కలిసి పనిచేస్తా. (మనకు ప్రాజెక్టులు ముఖ్యంగానీ, అవి చేసే మనుషులు కాదు. చిన్నపిల్లలమా మనం?) నేనేదో మాటకు మాట చెప్పే ధోరణిలో ఈ మాటలు చెప్పడం లేదండి.. త్రికరణశుద్ధిగా చెబుతున్నాను. మరొకటి కూడా.. మీరు మీ ప్రాజెక్టులో బహుమతులు పెట్టదలిస్తే, ఆ బహుమతులకు కొంత ఆర్థిక తోడ్పాటు నేనివ్వగలను. కనీసం వెయ్యి ఫొటోలను చేర్చిన వాళ్ళలో మొదటి ముగ్గురికి బహుమతులు స్వయంగా నా డబ్బుతో నేను ఇస్తాను. రండి, మీరు ప్రాజెక్టును రూపకల్పన చేసి మొదలుపెట్టి నడిపించండి.
తెవికీని మెరుగు పరచే పనిలో ముందుండి నడిపించండి. ఉత్త కబుర్లు చెప్పేవాళ్ళనూ, మీరు ఆ పని చెయ్యండి, మీరు ఈ పని చెయ్యండి అని చెప్పేవాళ్ళనూ చూస్తూనే ఉన్నాం ప్రభాకర్ గారు. మీరు ఆ కోవకు చెందిన వాళ్లు కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, గత ప్రాజెక్టుల్లో గానీ, నిన్న ముగిసిన ప్రాజెక్టులో గానీ మీరు ఉత్సాహంగా పాల్గొన్నారు, కృషి చేసారు. మీకు తగిన అనుభవం కూడా ఉంది. కానివ్వండి.__ చదువరి (చర్చరచనలు) 14:24, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమైన ఫోటోలు చేర్చిన వాడుకరులను ఎప్పుడు గుర్తిస్తారు. అలా ఒక కొత్త ప్రాజెక్టు తయారు ఆలోచించండి అని మాత్రమే, నాకు ఉన్న ఆలోచన తప్ప మరేమీ కాదు. అలాంటి అభిరుచి ఉన్న వారి కోసం మరో ప్రాజెక్ట్ తప్పకుండా చేద్దాం. ఉడతా భక్తిగా 100 ఫోటోలు చేర్చిన ప్రతివారికి కొంత నేను డబ్బులు ఇస్తాను. స్వరలాసిక గారు, Kasyap గారు ఈ ప్రాజెక్టును ఒక రూపానికి రూపకల్పనకు తీసుకువచ్చి కొనసాగించాలని నా మనవి.  ప్రభాకర్ గౌడ్చర్చ 17:36, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, తప్పకుండా గ్రామ వ్యాసాలలో మ్యాపులు కాకుండా ఫోటోలు చేర్చే విషయంలో అందరం కృషి చేద్దాం. అయితే వికీపీడియాలో ప్రస్తుతం నవంబర్ 14 వరకూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు నడుస్తున్నది కదా. ఆ ప్రాజెక్టు ముగిసిన తర్వాత అంటే డిసెంబర్ నెలలో గ్రామ వ్యాసాలలో ఫోటోలు చేర్చే ప్రాజెక్టును చేపడదాం. ఏమంటారు? --స్వరలాసిక (చర్చ) 16:48, 2 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల వెలికితీసే సూపర్ ప్రాజెక్ట్ కశ్యప్ గారు మనవాళ్లు ప్రారంభించిన మంచి ప్రాజెక్టులలో ఇది ఒకటి, ఈ ప్రాజెక్టు ముగిసిన తర్వాతే ఫోటోలది చేపట్టాలి, మనకు కూడా కూసింత సమయం ఉంది. మీరు చేయడానికి సమయం ఉన్నట్లు ఉంటుంది, రూపకల్పన ప్రారంభించండి. అడగగానే ఒప్పుకున్నందుకు మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు, అన్నట్లు పటాలు పెట్టిన ప్రాజెక్టు సూపర్ సక్సెస్ ఆ క్రెడిట్ అంతా మీదే... మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు.  ప్రభాకర్ గౌడ్చర్చ 04:21, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల్లో మెరుగుదల గురించి పత్రికల్లో మార్చు

ఇటీవల ముగిసిన పోటీ ద్వారా దాదాపు 23 వేల గ్రామాల పేజీల్లో మనం మ్యాపులు చేర్చాం. దాంతో ఆ పేజీలకు అత్యంత ఆవశ్యకమైన హంగుల్లో ఒకటి చేకూరిందిప్పుడు. ఆ పేజీల అభివృద్ధిలో ఇదొక మైలురాయి లాంటి ఘటన. తమ గ్రామం పేజీలోనూ మ్యాపు చేరిందా అనే కుతూహలం పాఠకులకు కలగడం సహజం. దాంతో ఆ పేజీలకు, తద్వారా వికీపీడియాకూ ఆవశ్యకమైన ప్రచారం లభించే అవకాశం ఉంది. ఆసక్తి గల కొత్త వాడుకరులకు వికీని పరిచయం చేసి వారు చురుగ్గా పాల్గొనేలా చేసేందుకు కూడా ఇదొక అవకాశం. అది జరగాలంటే గ్రామాల పేజీల మెరుగుదల అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందుకోసం కింది చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం:

  1. పత్రికల్లో ఈ వార్తను ప్రచురించడం
  2. ఆసక్తి ఉన్న వాడుకరులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించడం
  3. ఆసక్తి ఉన్న వాడుకరులు యూట్యూబు వీడియోలను ప్రచురించడం

పాత్రికేయులతో పరిచయాలున్నవారు పత్రికల్లో వార్త ప్రచురించే విషయమై చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 02:43, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన చదువరి గారు, దీనివల్ల తెవికీలో మనం చేసిన కృషి గురించి ఇతరులకు తెలుస్తుంది, అదే సమయంలో ఆసక్తి ఉన్నవారు తెవికీ రచనకు వచ్చే అవకాశం ఉంటుంది. పాత్రికేయులతో నాకున్న పరిచయాలతో పత్రికల్లో వార్త ప్రచురణకు ప్రయత్నం చేస్తాను, సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తాను. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా కాకుండా అందరూ ఒకటేవిధంగా రాసేలా ఒక ఫార్మాట్ లో కంటెంట్ తయారుచేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 02:58, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, అవునండి. మీరు చెప్పినట్టే చేద్దాం. ప్రెస్ నోట్‌కు సంబంధించి నా అభిప్రాయం ఇలా ఉంది -
  1. వ్యక్తుల పేర్లేమీ రాయం. వికీపీడియా ఈ పని చేసింది అని రాస్తాం.
  2. ప్రాజెక్టు గురించి మరీ వివరంగా మాట్టాడకుండా, రెండు నెలల పాటు చేసిన ఒక ప్రత్యేక కృషి ద్వారా వికీపీడియా ఈ పని సాధించింది అని రాద్దాం.
  3. గ్రామాల పేజీలో ఉన్న సమాచారాన్ని విస్తరించేందుకు ఎవరైనా కృషి చెయ్యవచ్చు, మీరూ రాయండి అని కూడా రాస్తాం.
  4. వికీపీడియా లింకుతో పాటు రెండు రాష్ట్రాల గ్రామాల వర్గాల పేజీలకు లింకులు ఇస్తాం.
సామాజిక మాధ్యమాల్లో రాసేందుక్కూడా ఒక కామన్ ఫార్మాటును తయారుచేద్దాం. వాటిలో అనుభవమున్న వారెవరైనా పూనుకుంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 04:47, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు చెప్పింది బాగుంది చదువరి గారు. వీలైనంత తొందరగా (రేపు ఉదయం వరకు) ప్రెస్ నోట్‌ తయారుచేస్తే, రేపు మధ్యాహ్నం ప్రెస్ కి ఇవ్వొచ్చు, ప్రెస్ నోట్ రాయడానికి వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు) విభాగాన్ని ఉపయోగించుకుందాం. --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:01, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, ప్రెస్ నోట్ మీరే తయారుచెయ్యండి. చదువరి (చర్చరచనలు) 05:10, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, గ్రామాల పేజీల్లో కొత్త సభ్యులను సమాచారం చేర్చమంటే మూలాలు లేని, ప్రాముఖ్యత లేని సమాచారం చేర్చే ప్రమాదం ఉందండీ. ఇంతకు మునుపు ఒకసారి వార్తాపత్రికల్లో జిల్లా స్పెషల్ పేజీల్లో వార్తలను కుప్పలు తెప్పలుగా తెచ్చిపోశారు. ఉదాహరణకు గ్రామంలో గుడిలో ఫలానా రోజున దసరా సంబరాలు జరిగాయి అనో, లేక గ్రామ పాఠశాల విద్యార్థి జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనింది అనో రాశారు. ఇంకా గ్రామం చెరువులో పూడిక తీసి ట్రాక్టర్లతో తరలించుకుని వెళ్లారు అని వందల గ్రామాల వ్యాసాల్లో రాశారు. అవి శుభ్రం చేయడానికి చాలా కాలం పట్టింది. కాబట్టి కొంచెం అయినా అవగాహన కల్పించి రాయమంటే బాగుంటుందేమో నని నా ఆలోచన. - రవిచంద్ర (చర్చ) 13:50, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సందట్లో సడేమియా లా అనుకోకపొతే ఆ ప్రకటనలో మన ఆజాదీ కా అమృత్ మహోత్సవం గురించి కూడా చేర్చ విన్నపం : Kasyap (చర్చ) 07:11, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, ఫోటో కాంటెస్ట్ ప్రాజెక్టు మీద అవగాహన, అందులో భాగంగా గ్రామ వ్యాసాల్లో చేసిన కృషి గురించి అవగాహన ఉన్నవాళ్ళు ప్రెస్ నోట్ రాస్తే బాగుంటుంది. ఆ తరువాత ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే నేను సహకరిస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:30, 3 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ మండల వ్యాసాల చెక్‌లిస్టులు మార్చు

యర్రా రామారావు గారూ, మీరు తయారు చేసిన చెక్‌లిస్టులు చూసాను. కొన్ని మార్పులు చేసాను. పరిశీలించండి. ఇంకా మార్పుచేర్పులేమైనా అవసరమైతే చేసి వాటికి తుదిరూపునివ్వండి. ఆ తరువాత వాటిలో AWB తో చేసెయ్యగలవాటిని గుర్తించి పక్కన పెడదాం (కొన్ని అలాంటివి ఉన్నట్టు గమనించాను). మిగతావాటిని మొదలెడదాం.

అయితే ఇది చాలా పెద్దపని. ఒకరో ఇద్దరో చేస్తూ ఉంటే చాలా సమయం పడుతుంది. వీటిమీద ఎక్కువ మంది పనిచేస్తే త్వరగా చెయ్యవచ్చు. విశ్వనాధ్ గారూ, మీరు గ్రామాల పేజీలపై గతంలో కొంత కృషి చేసారు. ఈమధ్య కూడా కొన్ని సూచనలు చేసారు. కాబట్టి మీరూ ఈ పనిలో పాలుపంచుకుంటే బాగుంటుంది. మొన్నటి దాకా గ్రామాల పేజీల్లో బొమ్మలు చేర్చినవారు కూడా ఈ పనిలో పాల్గొనేందుకు ఆలోచించవలసినది. అలాగే ఈ పనిపై ఆసక్తి ఉన్న ఇతర వాడుకరులు కూడా పాల్గొనవలసినది. __ చదువరి (చర్చరచనలు) 04:50, 5 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాఠ్య ప్రణాళిక-పాఠ్యాంశాల జాబితా మార్చు

సముదాయ సభ్యులకు నమస్కారం.
తెలుగు వికీపీడియా పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా వికీపీడియా శిక్షణకు సంబంధించి పాఠ్యాంశాల జాబితా, వాటికి తగిన ప్రశ్నావళిని రూపొందించాము. ప్రస్తుతం ఈ జాబితాలో 1. వికీపీడియా పరిచయం – ఖాతా తెరవడం, 2. వికీపీడియాలో వ్యాసరచన, 3. వికీ నియమాలు అనే మూడు అంశాలను పరిగణలోకి తీసుకున్నాము. సముదాయ సభ్యులు ఈ జాబితాను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు, ఏవైనా మార్పులు చేర్పులు చేసిన తరువాత వాడుకరుల స్థాయిని (ప్రాథమిక, మాధ్యమిక, నిర్వాహణ, నిపుణత స్థాయిలు) బట్టి ఈ జాబితాను విభజించడం జరుగుతుంది. ఆ తరువాత ఒక్కొక్క పాఠ్యాంశానికి తగిన పాఠ్యాన్ని రాసుకొని సముదాయ సభ్యుల సలహాలు, సూచనలతో బోధనా ఉపకరణాలు తయారుచేయడం జరుగుతుంది. కావున సముదాయ సభ్యులు స్పందించి సెప్టెంబరు 25లోపు తమ సలహాలు, సూచనలు, మార్పులు తెలియజేయగలరని కోరుతున్నాను. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:31, 5 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

The 2022 Community Wishlist Survey will happen in January మార్చు

SGrabarczuk (WMF) (talk) 00:23, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వార్తల్లో వికీ గ్రామాలు మార్చు

వికీపీడియాలో మనం చేసిన గ్రామాల మెరుగుదల గురించి, 75 ఏళ్ళ ఎడిటథాన్ గురించీ రెండు పత్రికల్లో వార్త వచ్చింది ఈ రోజున. అనుకున్నదే తడవు.., ఈనాడు, వార్త పత్రికలకు వార్తను అందించిన ప్రణయ్ రాజ్ గారికి ధన్యవాదాలు, అభినందనలు. __ చదువరి (చర్చరచనలు) 05:30, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా ఈ కృషి చేసిన సభ్యులందరికీ, చొరవ తీసుకుని పత్రికలకు సమాచారం అందించిన ప్రణయ్ కూ అభినందనలు. మనం చేసే మంచి పని ఎంత చిన్నదైనా సరే దాని గురించి చర్చించుకోవడం, అభినందించుకోవడం, ఇతరులతో పంచుకోవడం చేస్తూ ఉండాలి. అప్పుడే స్వచ్ఛందంగా పని చేసే మనలాంటి సభ్యులకు ప్రోత్సాహంగా ఉంటుంది. - రవిచంద్ర (చర్చ) 05:48, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టు మూల కర్త స్వరలాసిక గార్కి, ఈ ప్రాజెక్టులో కృషిచేసిన వికీపీడియన్లుకు ప్రత్వేకంగా కాత్త వికీపీడియన్లుకు, దినపత్రికలలో వార్త రావటానికి మూల కారకుడైన ప్రణయ్ రాజ్ కు, ప్రాజెక్టు సాఫీగా జరగటానికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు, ఉత్సాహం తగ్గకుండా ప్రోత్సహించిన చదువరి గార్కి ధన్యవాదాలు.అభినందనలు యర్రా రామారావు (చర్చ) 06:46, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, రవిచంద్ర, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. ఇలానే స్నేహపూర్వక పోటీలతో వికీని అభివృద్ధి పరుస్తూ, అదే సమయంలో వికీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుదాం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:30, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు క్యాపిటల్ వాయిస్ అనే దిన పత్రికకు నిన్న ఇస్తే ఈ రోజు వేసారు.ఇది ఎనిమిది జిల్లాలనందు సర్కులేషన్ లో ఉంది. యర్రా రామారావు (చర్చ) 04:21, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు రామారావు గారు. అలాగే అనంతపురం నుండి వచ్చే భూమిపుత్ర లోను, విశాఖ నుండి వెలువడే గ్రేటర్ న్యూస్ పత్రికలో కూడా ఈ వార్త వచ్చిందని స్వరలాసిక గారు తెలియజేసారు. __ చదువరి (చర్చరచనలు) 04:41, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:రోజుకో వ్యాసం మార్చు

రోజుకో వ్యాసం చొప్పున 100 రోజుల పాటు రాసే పోటీ ఒకటి మనకుంది. దానిలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారు ఉన్నారు. దానితో పాటు కొన్ని స్వల్ప వ్యవధి పోటీలు, కొన్ని దీర్ఘకాలిక పోటీలను కూడా చేరిస్తే మరింత మంది వాడుకరులు వీటిలో పాల్గొనేందుకు వీలుగా ఉంటుంది. ఆయా పోటీలను విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళ జాబితా ఒక పేజీలో ఉంటే అది అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని భావించి వికీపీడియా:రోజుకో వ్యాసం పేరుతో ఒక వికీపీడియా పేజీని సృష్టించాను. వాడుకరులు దాన్ని పరిశీలించి తగు మార్పు చేర్పులు, సూచనలు చెయ్యవలసినదిగా వినతి. __ చదువరి (చర్చరచనలు) 08:47, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలా జాబితా చేయటం చాలా బాగున్నది , వీలయితే వికీ శత ఔత్సాహికులు ఆజాదీకా అమృతంలో భాగంగా సంబంధిత వ్యాసాలు రాయవిన్నపం తెలుగు వికీ జన్మదినం కు మూడు నెలల మూడు రోజుల సమయం ఉన్నది, మంచి వేడుక చేసుకొందాం!, ఉభయ కుశలోపరి: Kasyap (చర్చ) 09:10, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, వీలైతే కాదు, వీలు చేసుకునైనా అందులోని వ్యాసాలే రాయాలి :-). ఎందుకంటే అందువలన రెండు విధాలా ప్రయోజనం కదా, వికీకి. మీ జన్మదినం ఆలోచన కూడా బాగుంది. ఈ విషయాలను ప్రాజెక్టు పేజీలో కూడా ప్రకటించండి. __ చదువరి (చర్చరచనలు) 09:29, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:రోజుకో వ్యాసం పోటీకి సంబంధించి జాబితా ఒక పేజీలో ఉంటే అది అందరికీ మార్గదర్శకంగా ఉంటుందన్న ఆలోచన చేసి, పేజీని సృష్టించిన చదువరి గారికి ధన్యవాదాలు. అలాగే Kasyap గారి సూచన బాగుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:35, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం @చదువరి గారూ, తెలుగు వికీలో వ్యాస నిర్మాణానికి, నవీకరణకు మీరు తీసుకుంటున్న చొరవలు ఇలాంటి ముందడుగులు చాలా అవసరం. వ్యాస నిర్మాణంలో User:Pranayraj1985 అన్నగారి లాంటి వారు చేస్తున్న కృషి మనందరికీ ఉదాహరణగా నిలుస్తున్నది. వికీపీడియా:రోజుకో వ్యాసం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. Kasyap గారు సూచించినట్టు కొత్త వాడుకరులు 7 రోజుల లేక 30 రోజుల పోటీ తీసుకొని ఆజాదీకా అమృతం చిందించవచ్చు. Nskjnv ☚╣✉╠☛ 15:14, 7 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారూ మీరు మొదలెట్టిన వికీపీడియా:రోజుకో వ్యాసం పేజీ చాలా బాగుంది. దీని ద్వారా ప్రణయ్ రాజ్ అన్న గారి స్ఫూర్తి తో మిగతావాళ్ళం అందరం రోజుకో వ్యాసం రాయడంలో కొంత ప్రోత్సాహకాన్ని పొందినట్టైంది. కొత్త వాడుకరులు కూడా మొదలెట్టడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. కశ్యప్ గారు చెప్పినట్టు ఆజాదీకా అమృత్ మహోత్సవంలో కూడా రోజుకో వ్యాసం రాయటం మంచి ఆలోచన తప్పకుండా ప్రయత్నం చేస్తాం.--అభిలాష్ మ్యాడం 16:29, 9 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Results of 2021 Wikimedia Foundation elections మార్చు

Thank you to everyone who participated in the 2021 Board election. The Elections Committee has reviewed the votes of the 2021 Wikimedia Foundation Board of Trustees election, organized to select four new trustees. A record 6,873 people from across 214 projects cast their valid votes. The following four candidates received the most support:

  • Rosie Stephenson-Goodknight
  • Victoria Doronina
  • Dariusz Jemielniak
  • Lorenzo Losa

While these candidates have been ranked through the community vote, they are not yet appointed to the Board of Trustees. They still need to pass a successful background check and meet the qualifications outlined in the Bylaws. The Board has set a tentative date to appoint new trustees at the end of this month.

Read the full announcement here. MediaWiki message delivery (చర్చ) 02:56, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఫొటోలు చేర్చే పోటీ అధికారిక ఫలితాలు వెలువడ్డై మార్చు

పేజీల్లో ఫొటోలు చేర్చే పోటీ ఫలితాలను స్వరలాసిక గారు అధికారికంగా ప్రకటించారు.

  1. 293 వికీలు పోటీలో పాల్గొనగా తెలుగు వికీపీడియా మూడవ స్థానంలో నిలిచింది.
  2. భారత్‌లో మనది మొదటి స్థానం
  3. మనం 3 వేల దిద్దుబాట్ల లక్ష్యం పెట్టుకోగా చివరికి 28 వేల పేజీలను దాటేసాం
  4. ఈ పోటీలో కొత్తవారు చాలా ఎక్కువగా పాల్గిని ఉత్సాహంగా కృషి చేసారు. కొత్తవారే మొదటి స్థానంలో నిలిచారు.

పోటీని దిగ్విజయం చేసినందుకూ, తెలుగు వికీపీడియాను ప్రపంచస్థాయిలో నిలబెట్టినందుకూ పోటీనిర్వాహకులైన స్వరలాసిక గారిని, పోటీలో పాల్గొన్నవారినీ మనసారా అభినందిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 04:47, 8 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Universal Code of Conduct EDGR conversation hour for South Asia మార్చు

Dear Wikimedians,

As you may already know, the Universal Code of Conduct (UCoC) provides a baseline of behaviour for collaboration on Wikimedia projects worldwide. Communities may add to this to develop policies that take account of local and cultural context while maintaining the criteria listed here as a minimum standard. The Wikimedia Foundation Board has ratified the policy in December 2020.

The current round of conversations is around how the Universal Code of Conduct should be enforced across different Wikimedia platforms and spaces. This will include training of community members to address harassment, development of technical tools to report harassment, and different levels of handling UCoC violations, among other key areas.

The conversation hour is an opportunity for community members from South Asia to discuss and provide their feedback, which will be passed on to the drafting committee. The details of the conversation hour are as follows:

You can also attend the global round table sessions hosted on 18 September - more details can be found on this page. MediaWiki message delivery (చర్చ) 10:47, 10 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Call for Candidates for the Movement Charter Drafting Committee ending 14 September 2021 మార్చు

Movement Strategy announces the Call for Candidates for the Movement Charter Drafting Committee. The Call opens August 2, 2021 and closes September 14, 2021.

The Committee is expected to represent diversity in the Movement. Diversity includes gender, language, geography, and experience. This comprises participation in projects, affiliates, and the Wikimedia Foundation.

English fluency is not required to become a member. If needed, translation and interpretation support is provided. Members will receive an allowance to offset participation costs. It is US$100 every two months.

We are looking for people who have some of the following skills:

  • Know how to write collaboratively. (demonstrated experience is a plus)
  • Are ready to find compromises.
  • Focus on inclusion and diversity.
  • Have knowledge of community consultations.
  • Have intercultural communication experience.
  • Have governance or organization experience in non-profits or communities.
  • Have experience negotiating with different parties.

The Committee is expected to start with 15 people. If there are 20 or more candidates, a mixed election and selection process will happen. If there are 19 or fewer candidates, then the process of selection without election takes place.

Will you help move Wikimedia forward in this important role? Submit your candidacy here. Please contact strategy2030 wikimedia.org with questions.

Xeno (WMF) 17:02, 10 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

SGrabarczuk (WMF) (చర్చ) 00:45, 11 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Talk to the Community Tech మార్చు

 

Read this message in another languagePlease help translate to your language

Hello!

As we have recently announced, we, the team working on the Community Wishlist Survey, would like to invite you to an online meeting with us. It will take place on September 15th, 23:00 UTC on Zoom, and will last an hour. Click here to join.

Agenda

Format

The meeting will not be recorded or streamed. Notes without attribution will be taken and published on Meta-Wiki. The presentation (first three points in the agenda) will be given in English.

We can answer questions asked in English, French, Polish, and Spanish. If you would like to ask questions in advance, add them on the Community Wishlist Survey talk page or send to sgrabarczuk@wikimedia.org.

Natalia Rodriguez (the Community Tech manager) will be hosting this meeting.

Invitation link

See you! SGrabarczuk (WMF) (చర్చ) 03:04, 11 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా వ్యాసం పేజీ అభివృద్ధి మీద సముదాయం ఆసక్తి ఉండాలి మార్చు

తెలుగు వికీపీడియా వ్యాసం పేజీ ఒకటుందని మనందరికి తెలుసు. దాని సవరణల చరిత్రను పరిశీలిస్తే 2008 ఫిబ్రవరి 4న సుజాత గారు సృష్టించారు.2009 అక్టోబరు వరకు అభివృద్ధిలో సముదాయసభ్యుల భాగస్వామం ఉంది.2010 జనవరి నుండి అర్జున గారు మొత్తం మీద అజ్ఞాత వాడుకరుల సవరణలపై పరిశీలన, చిన్న చిన్న సవరణలను ఇప్పటివరకు చేస్తూనే ఉన్నారు. మిగిలిన చురుకైన వాడుకరుల సవరణలు లేవనికాదు.నామమాత్రంగా ఉన్నాయి.రెండు మూడుసార్లు అజ్ఞాత వాడుకరులు పేజీని పూర్తిగా తుడిపేసిన సంగతులు ఉన్నవి. విశ్వనాథ్ గారూ, పాలగిరి గారు గమనించి వెనుకకు తిప్పిన సందర్బాలు ఉన్నవి.ఇది దాని సవరణల చరిత్ర.

ఇక దానిలోని విషయ సంగ్రాహానికి వస్తే వికీపీడియాలో నిర్వహించేకొన్ని ప్రాజెక్టులలో ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాం.కానీ వాటిని గతంలో నమోదు చేసినట్లుగా, ప్రస్తుత సముదాయ సభ్యులైన మనందరం దానిమీద అంతశ్రద్ధ చూపటంలేదని చెప్పకనే తెలుస్తుంది.దీనిని మనందరం ఒప్పకోక తప్పదు. నేను ఇది రాయటానికి కారణం ఈ మద్య కాలంలో విజయాలు అనే విభాగం పెట్టి ప్రణయ్ రాజ్ గారు "వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌" కార్యక్రమం విజవంతమైన వివరం, అలాగే వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఎన్నికలకు తెలుగు వికీపీడియా, వికీసోర్స్, వీక్షనరీలకు చెందిన సముదాయ సభ్యులలో ఓటింగు సరళిపై వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ సభ్యులు వ్యాఖ్యానించిన ప్రశంసలపై గురించిన వివరాలు నమోదు చేసాడు. దానితో నాకు ఈ ఆలోచనస్పరించి ఈ దిగువ సూచనలు సముదాయం దృష్టికి తీసుకువస్తున్నాను.

ప్రతిపాదిత సూచనలు

  1. సంవత్సర వారీ విజయాలు లేదా అభివృద్ధి అనే విభాగాలు పెట్టాలి.
  2. 2020 నుండి చాలా మొలక వ్యాసలు అందరి భాగస్వామ్యంతో అభివృద్ది చేసాం.వాటి మీద ఇప్పటి వరకు మూడు ప్రాజెక్టులు నిర్వహించాం.వాటి ప్రగతి గురించి రికార్డు చేయాలి.
  3. తెలుగు వికీపీడియా అభివృద్దికి గ్రోత్ ప్రాజెక్టును ఏర్పరచుకున్నాం.దాని పూర్వాపరాలు రాయాలి సంక్షిప్తంగా వివరించి ఆ పేజీ లింకులు ఇవ్వాలి.
  4. గణాంకాలు ఎన్నో చదువరి గారి కృషితో బయటికి తీసారు.వాటిని అవసరమైన మేరకు సంక్షిప్తంగా వివరించిఆ పేజీ లింకులు ఇవ్వాలి.
  5. "వికీపీడియా పేజెస్‌ వాంటింగ్‌ ఫొటోస్‌" కార్యక్రమంలో విజేతలుగా పరిగణించినవారి వివరాలు పొందుపర్చాలి.
  6. రోజుకో వ్యాసం దీక్షలో నిరంతరదీక్ష సాగించే వారి వివరాలు సంక్షిప్తంగా ప్రత్యేకంగా ఒక విభాగంలో వివరించి ఆ పేజీ లింకు ఇవ్వాలి.దీక్షను ముగించిన తరువాత ముగించిన సంవత్సరంలో ఆ వివరాలు పొందుపర్చాలి.
  7. వికీపీడియాపై నోటబులిటీ ఉన్న ప్రముఖ వ్యక్తులు వెళ్లబుచ్చిన వ్యాఖ్యలు వివరాలు నిరంతరం పొందుపర్చాలి.
  8. తెలుగు వికీపీడియాపై పత్రికా రంగంలో వస్తున్న వార్తలను ప్రత్వేకంగా మొదటిపేరుబరిలో ఒక పేజీని సృష్టించి, అందుబాటులో ఉన్నవరకు ఆ వార్తలను వివరిస్తూ వికీ కామన్స్ లోకి ఎక్కించిన మీడియా ఫైల్స్ ఈ పేజీలో నిరంతరం పొందుపరుస్తూ ఆ పేజీ లింకులు తెలుగు వికీపీడియా పేజీకి లింకు ఇవ్యాలి.
  9. ప్రాజెక్టులపై వివరాలు సంబందిత ప్రాజెక్టు రూపకర్తలు వివరాలు నమోదు చేసే బాధ్యత తీసుకోవాలి.

పైవాటిమీద సముదాయ సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు, తగుసూచనలు, సలహాలు వెల్లడించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 14:07, 13 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా పేజీని తాజాకరించాలని @యర్రా రామారావు గారు చేసిన సూచనతో స్థూలంగా నేను ఏకీభవిస్తాను. అయితే మరీ సూక్ష్మమైన వివరాల జోలికి పోకుండా, వికీపీడియా దశను దిశనూ సూచించే స్థూలమైన విశేస్జాలను మాత్రం ఆ పేజీలో రాయాలని నేను భావిస్తాను. పైన రామారావు గారు చూపిన పాయింట్లలో -
1 - వికీపీడియా పురోగతిని క్లుప్తంగా చూపే గణాంకాలను రాస్తే చాలు. మైలురాళ్ళను ఎంచుకుని రాస్తే మంచిది. ఉదాహరణకు: ప్రతి ఐదేళ్ళకు/స్మార్టుఫోన్లు రాకముందు, వచ్చాక/జియో రాకముందు,వచ్చాక వగైరాలు
3,4 - అక్కర్లేదు
6 - పాక్షికంగా చేర్చాలి. అందరి పేర్లు రాయనక్కర్లేదు.
7,8 - చేర్చవచ్చు
9 - పాక్షికంగా రాయాలి ఇందులోనే 2,5 లను కలపవచ్చు
అయితే వికీపీడియా పురోభివృద్ధిని వివరంగా - గణాత్మకం గాను, గుణాత్మకం గానూ (టాంజిబుల్, ఇంటాంజిబుల్)- చూపే పేజీ ఒకటి వికీపీడియా పేరుబరిలో ఉండాలి. నేను ఆ పేజీని త్వరలోనే సృష్టిస్తాను.
__ చదువరి (చర్చరచనలు) 05:09, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండీ రామారావు గారు చెప్పిన అన్ని విషయాలూ తెలుగు వికీపీడియా వ్యాసంలో కాకపోయినా మరో ప్రత్యేక పేజీలో పొందుపరిస్తే బాగుంటుంది.- రవిచంద్ర (చర్చ) 05:30, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా వ్యాసంలో తెవికీ సాధించిన ప్రగతి గురించి వివరాలు ఎప్పటికప్పుడు తాజాకరించాలన్న సూచన చేసిన యర్రా రామారావు గారికి, పలు అంశాలపై సూచనలు అందించిన చదువరి గారికి ధన్యవాదాలు. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. వికీ గురించి ప్రతికలు, మీడియా కవరేజ్ కు సంబంధించిన పేపర్ కటింగ్స్, వీడియో లింకులను చేర్చడంలో నేను సహాయపడగలను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:59, 14 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి సంవత్సరం ఈ వ్యాసాన్ని/వ్యాసాలను తాజా చెయ్యాల్సి వున్నది. పైన ప్రతిపాదించినవి అందరూ కలసి చెరొక చెయ్యి వేస్తే సులభంగా జరుగుతుంది. బొమ్మలు చేర్చడం ప్రాజెక్టు వివరాలు, గణాంకాలు చేర్చాలి. కానీ సమాచారం 3-4 వ్యాసాలుగా వున్నది. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 02:58, 15 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నా అభిప్రాయం ఏమిటంటే, ఇది వికీపీడియా గురించిన వ్యాసం అన్న ఆలోచన పక్కన పెట్టి ఒక మామూలు వెబ్‌సైట్‌ వ్యాసాన్ని ఎలా రాస్తామో అలానే రాయాలి. అంటే నిష్పాక్షికమై వికీపీడియాకు సంబంధం లేని మూడవ స్థాయి మూలాలు లేని సమాచారం మనకు ఎంత తెలిసినదైనా చేర్చకూడదు. (ప్రాథమిక పరిశోధన వద్దు అన్న నిబంధన ప్రకారం) అలానే ఒక ఈమాట, బీబీసీ తెలుగు వంటి ఇతర వెబ్‌సైట్ల గురించి రాసినప్పుడు ఏయే విషయాలు రాస్తామో ఇక్కడా ఆయా విషయాలే రాయాలి. నిష్పాక్షికమైన, మూడవ స్థాయి మూలాల్లో ఎక్కడైనా విమర్శలు ఉంటే వాటిని కూడా చేర్చాలి. (ఇప్పటిదాకా అలాంటివి లేవని నా అవగాహన.) --పవన్ సంతోష్ (చర్చ) 13:32, 15 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన, ఇంకో విన్నపం చాలా మంది గూగుల్ లో Telugu Wikipedia అని టైపు చేస్తుంటారు అప్పుడు ఒక్కోసారి ఆంగ్ల వికీలోని Telugu_Wikipedia కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా నవీకరించాలి , ఇప్పటికే 35 భాషలో మన వ్యాసం ఉన్నది అయితే ఎక్కడ కూడా సమగ్ర సమాచారం లేదు ,మన దగ్గర ఉన్న కన్నడ , హిందీ , తమిళ వంటి ఇతర భాషలు తెలిసినవారు వారి వారి వికీలలో తెలుగు వికీపీడియా గురించి రాయాలి, మిగిలిన భాషలో ఆ సముదాయంలో తెలిసిన వారిని ఎవరినైనా అభ్యర్ధించాలి , ఒక సూచన మిగిలినEncyclopedias_by_continent వికీ ల వ్యాసాలు చదివితే ఎక్కువగా అభివృధి తప్ప అందుకోసం పాటుపడిన వ్యక్తుల పేర్లు ఎక్కువగా లేవు, వీలయితే మనము కూడా వ్యక్తుల పేర్లకు అతీతంగా సమష్టిగా మన అభివృద్ధి పంచుకొందాం , అది వికీ వంటి స్వచ్ఛంద సంస్థలలో ఇది మంచి సాంప్రదాయం కూడా !  : Kasyap (చర్చ) 09:18, 20 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 విజేతలు మార్చు

ప్రాజెక్టు పేజీలో విజేతల పేర్లు ప్రకటించబడ్డాయి.--స్వరలాసిక (చర్చ) 12:33, 19 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Movement Charter Drafting Committee - Community Elections to take place October 11 - 24 మార్చు

This is a short message with an update from the Movement Charter process. The call for candidates for the Drafting Committee closed September 14, and we got a diverse range of candidates. The committee will consist of 15 members, and those will be (s)elected via three different ways.

The 15 member committee will be selected with a 3-step process:

  • Election process for project communities to elect 7 members of the committee.
  • Selection process for affiliates to select 6 members of the committee.
  • Wikimedia Foundation process to appoint 2 members of the committee.

The community elections will take place between October 11 and October 24. The other process will take place in parallel, so that all processes will be concluded by November 1.

For the full context of the Movement Charter, its role, as well the process for its creation, please have a look at Meta. You can also contact us at any time on Telegram or via email (wikimedia2030@wikimedia.org).

Best, RamzyM (WMF) 02:46, 22 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వీయ ప్రతిపాదనలు మార్చు

నిర్వాహకత్వానికి గాని, అధికారికి గానీ ప్రతిపాదనలు స్వయంగా అభ్యర్థులే చేసుకోవడం సత్సంప్రదాయమని నా అభిప్రాయం. గతంలో ఈ హోదాలన్నీ మరెవరో ప్రతిపాదించినవే తప్ప, స్వీయ ప్రతిపాదనలు పెద్దగా లేవు. ఇకపై స్వీయ ప్రతిపాదన చేసుకోవడాన్ని ఒక నియమంగా పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుందని నా అభిప్రాయం. వాడుకరులు స్పందించవలసినది.

స్వీయ ప్రతిపాదన చేసుకునే ముందు నేను ఇలా భావిస్తున్నాను, మీరేమంటారు అని @Nskjnv గారు కొందరు వాడుకరులను అడిగారు. అది నాకు నచ్చింది. అది మంచి సంప్రదాయమని కూడా నేను భావిస్తున్నాను. ఆయన్ను అభినందిస్తున్నాను. అలా చెయ్యడం వలన -

  1. ఇతర వాడుకరులకు మొహమాటం లేకుండా అభిప్రాయం చెప్పే అవకాశం కలుగుతుంది.
  2. అభ్యర్థులకు కూడా స్వీయ ప్రతిపాదనపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  3. అభ్యర్థులు చేసుకునే ప్రతిపాదనలు విఫలమయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయి, ప్రతికూలమైన భావాలు ఏర్పడకుండా ఉంటుంది. (అలాంటి చేదు సందర్భాలు గతంలో నేను మూణ్ణాలుగు చూసాను.)

ఈ సందర్భంగా, నిర్వాహక అభ్యర్థులకు సహాయంగా ఉండేందుకు ఒక పేజీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నాను. అందులో -

  1. అభ్యర్థి తెలుసుకోవలసిన విషయాలు - ఒక చెక్‌లిస్టు లాగా - ఉంటుంది
  2. అభ్యర్థులకు ప్రశ్నలు-సమాధానాలు
  3. వివాదాలు, వాటిపై జరిగిన చర్చలు వగైరాల జాబితా - వాటిని చదివి కొన్ని విశేషాలను వారు తెలుసుకోవచ్చు

ఇలాంటి విశేషాలతో ఒక సహాయక పేజీ ఉంటే అభ్యర్థులకు వీలుగా ఉంటుంది. ఈసరికే ఇలాంటివి కొన్ని పేజీలున్నాయి. వాటిని క్రోడీకరించి, మరింత సమగ్రంగా చేస్తే బాగుంటుంది. నిర్వాహకులవ్వదలచిన వారికి "ఎంట్రీ బారియర్" అనేది ఏదైనా ఉంటే ఈ పేజీ దాన్ని అధిగమించేందుకు పనికి రావాలని నా ఉద్దేశం. పరిశీలించండి. ఈ పేజీలో ఇంకా ఏమేమి ఉండాలో సూచించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 05:08, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక అభ్యర్థులకు సహాయంగా ఉండేందుకు ఒక పేజీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదనను తెచ్చినందుకు ధన్యవాదాలు చదువరి గారు. నిర్వాహక అభ్యర్థి ముందుగా చురుకైన వాడుకరి అయుండాలని నా అభిప్రాయం. ముందుగా మనం చురుకైన వాడుకరికి ప్రమాణాలు నిర్ణయించుకోవాలి. ఎవరు చురుకైన వాడుకరి అనేదానిపై నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి: వ్యాసాల్లో నిర్వహణ మూసలు పెట్టడం, తొలగింపు ప్రతిపాదనలు చేయడం, నిరంతరం ఇటీవలి మార్పులను పరిశీలిస్తూ ఇతరులు రాసిన వ్యాసాలలో ఉపయుక్తమైన మార్పులు చేస్తూ వ్యాస నాణ్యతకు తోడ్పడడం, దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొనడం, కొత్తసభ్యులను ఆహ్వానించడం, సహాయం కావలసిన సభ్యులకు సత్వర సహాయాన్నందించడం, కొత్తవాడుకరులకు దిశానిర్దేశం చేయడం, కొత్త వ్యాసాలను నిరంతరం పరిశీలిస్తూ అనామక వాడుకరులు సృష్టించిన చెత్తరాతల వ్యాసాలను గుర్తించడం, అనామక వాడుకరులు చేసిన దుశ్చర్యలను గమనించి వారు చేసిన మార్పులను తిప్పికొట్టడం, అన్నింటికంటే ముఖ్యం తెవికీలో ఇదివరకే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడం వంటివి. వీటిని చురుకైన వాడుకరికి అర్హతులుగా అనుకుంటున్నాను. వీటిని కూడా ఆ పేజీలో చేర్చాలని కోరుతున్నాను. అలాగే నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి అభ్యర్ధిత్వ ప్రమాణాలలో కనీసం మూడు నెలల అనుభవం, 1000 దిద్దుబాట్లూ ఉండాలి అని ఉంది. ఈ విషయంపై సముదాయంలో చర్చ జరిపి వాటిని కనీసం ఒక సంవత్సరంకుపైగా అనుభవం, 5000లు పైగా దిద్దుబాట్లుగా మార్చుకుంటే మంచిదని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 07:21, 25 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Mahatma Gandhi 2021 edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary మార్చు

 
Mahatma Gandhi 2021 edit-a-thon

Dear Wikimedians,

Hope you are doing well. Glad to inform you that A2K is going to conduct a mini edit-a-thon to celebrate Mahatma Gandhi's birth anniversary. It is the second iteration of Mahatma Gandhi mini edit-a-thon. The edit-a-thon will be on the same dates 2nd and 3rd October (Weekend). During the last iteration, we had created or developed or uploaded content related to Mahatma Gandhi. This time, we will create or develop content about Mahatma Gandhi and any article directly related to the Indian Independence movement. The list of articles is given on the event page. Feel free to add more relevant articles to the list. The event is not restricted to any single Wikimedia project. For more information, you can visit the event page and if you have any questions or doubts email me at nitesh@cis-india · org. Thank you MediaWiki message delivery (చర్చ) 10:19, 24 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]