వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 24

పాత చర్చ 23 | పాత చర్చ 24 | పాత చర్చ 25

alt text=2013 సెప్టెంబరు 7 - 2013 అక్టోబరు 2 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 సెప్టెంబరు 7 - 2013 అక్టోబరు 2

బ్లాగులింకుల మయం

మార్చు

గత వారంరోజులుగా తెవికీ వ్యాసాలలో బ్లాగులింకులివ్వడం అతి అయిపోయింది. (నేను మాత్రం రెండు రోజుల క్రితమే చూశాను) కాపీ చేసిన వ్యాసాలు చేర్చడమే తప్పయితే, పైగా వాటికి బ్లాగులింకులివ్వడం మరోపొరపాటు. ఒకవేళ నిజంగా బ్లాగునిర్వాహకులే రచించిన వ్యాసాలు అనుమతిలో తెవికీలో చేర్చాలన్ననూ ముఖ్యమైన వాక్యాల చివరన మాత్రమే రెఫరెన్స్ పెట్టాలి కాని, మూలం అనే విభాగంలో కాదు. అలా ఇస్తే భవిష్యత్తులో ఇతరవనరుల నుంచి తీసుకున్న సమాచారానికి కూడా ఇదే లింకు ఆధారమని పొరపడే అవకాశముంది. ఇచ్చిన బ్లాగులింకులు కూడా వ్యాసాలలో ఎక్కడెక్కడో ఇష్టమున్నట్లుగా చేర్చారు. కొన్ని వ్యాసాలలో ప్రారంభంలో, (చూడండి:ఓలర్) కొన్నింటిలో మధ్యలో చేర్చడమే కాకుండా చాలా వ్యాసాలలో visit my Website Dr Seshagirirao, MBBS అని చేర్చడం దేనికి? (చూడండి: కాకర, తమలపాకు, బ్లూబెర్రీ, చిట్కాలు, చిక్కుడు, సమతౌల్యపౌష్టికాహారం) మరికొన్ని వ్యాసాలలో వ్యాసంలో మధ్యలోనే Collected /dr.seshagirirao-MBBS (Srikakulam) చేర్చే అవసరం ఏమిటి? (చూడండి: ఆలివ్ నూనె), మరికొన్ని వ్యాసాలలో "వివిధ వార్తా పత్రికల నుండి విషయ సేకరణ్ . (డా. వందన శేషగిరిరావు ...శ్రీకాకుళం)" అని చేర్చారు.(చూడండి: తేనె) అంటే పత్రికలలో వచ్చినదిగా చెబుతూనే పేరు వ్రాయడమెందుకు? మక్కికిమక్కి తీసుకోవడానికి సేకరణ అనరు, కాపీ అంటారు. తెవికీ అనేది బ్లాగులను ప్రచారం చేసే వేదిక కాదుకదా! కొన్ని వ్యాసాలలో ఒక్క వాక్యం కూడా లేదు, అలాంటి వ్యాసాలలో కూడా బ్లాగులింకులివ్వడం దేనికి? (చూడండి: హింషెన్‌వుడ్, వాల్టర్, హీమర్, బాయిల్) మరికొన్ని వ్యాసాలలో ఇదివరకే సమాచారం ఉన్ననూ కేవలం బ్లాగులింకు ఇవ్వడం కొరకే దిద్దుబాట్లు చేసినట్లు తెలిసింది. (చూడండి:వాల్తెర్‌బోథె, స్టీఫెన్‌హాకింగ్, రవీంద్రనాథ్‌ఠాగూర్,) కొన్ని వ్యాసాలలో బ్లాగరు పేరు చేర్చారు (చూడండి: జీడిపప్పు, బీటుదుంప) ఈ అనవసర లింకులన్నీ తొలిగించబడ్డాయి. ఇకముందైనా ఇలాంటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:19, 7 సెప్టెంబర్ 2013 (UTC)

ఆవును.ఈ విషయంలో సభ్యులు,నిర్వాహకులు తగిన విధంగా స్పందించి,అభిప్రాయాలు వెల్లడించిన, తదనుగుణంగా రచనలు చెయ్యటానికి వీలుంటుంది.మనకు రాశికన్న వాసి ముఖ్యం.అవసరమైతే కొన్ని మార్గదర్శకసూత్రాలను రచయితలకు అందుబాటుగా వుంటేటట్లు సభ్యుల చర్చాపేజిలో ఉంచిన మంచిదేమో?పాలగిరి (చర్చ) 01:05, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • పైన తెలిపిన వాటితో నేను ఏకీభవిస్తాను.--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే పుస్తకంలోఅందుబాటులో వున్నవాటిని యథాతథంగా చేర్చటానికి వికీసోర్స్ ఉత్తమం. గమనించండి--అర్జున (చర్చ) 13:53, 8 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీకి ఆమోదయోగ్యంకాని వ్యాసం పేర్లు

మార్చు

ఇటీవల తెవికీలో వచ్చిన వ్యాసాలను గమనిస్తే వ్యాసం పేర్లు వికీపీడియాలో పెట్టడానికి ఆమోదయోగ్యంగా లేనట్లుగా కనిపిస్తోంది.
1) వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది? అనే పేరుతో వ్యాసం సృష్టించడానికి బదులు అందులో అవసరమైన సమాచారం ఉంటే వంటనూనెలు వ్యాసంలో చేర్చితే సరిపోయేది. ఏ విషయంలోనైనా ఏది మంచిది? అనే విషయాన్ని తెవికీ ఎప్పుడూ చెప్పదు. అన్ని అభిప్రాయాలతో కూడిన సమాచారం, దానికి తగిన మూలాలతో కూడిన వ్యాసం మాత్రమే ఇక్కడ ఉండాలి.
2)ఆరోగ్యానికి టమేటా లాంటి శీర్షికలు పత్రికలు, మేగజైన్ల వారు సృష్టిస్తారు కాని మనకు మాత్రం అలాంటి సమాచారం అందుబాటులో ఉన్నా టమేటా వ్యాసంలో చేరిస్తే సరిపోతుంది. ‎ఆరోగ్యానికి పానీయాలు వ్యాసాలపేర్లు కూడా ఇంతే. గోజి...సూపర్‌ఫ్రూట్‌ వ్యాసం పేరే కాకుండా సమాచారం కూడా తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. "కాబట్టి 'గో గోజి...' అన్న స్లోగన్‌ మెల్లగా మనకీ విస్తరించినా ఆశ్చర్యం లేదు" అని మనం చెప్పడానికి వీలుండదు.
3)ఫాస్ట్ ఫుడ్-మన ఆరోగ్యము అవగాహన పేరుతో పాటు వ్యాస ప్రారంభమూ ప్రమాణంగా లేదు. "మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే..." తో ప్రారంభమైన వ్యాసంలో "అనుకుంటాం", "అనుకోవచ్చు" లాంటి పదాలు వాడినారు (ఉంచారు). వ్యాసంలో మన స్వంత అభిప్రాయాలు ఉండరాదు కదా! ఆ విషయం ఎవరైనా చెబియుంటే ఫలానా వారు ఇలా చెప్పారు అని వ్రాసి రెఫరెన్స్ ఉంచాలి.
4)పైడి జైరాజ్ -హిందీ చిత్ర సీమలో తొలి తెలుగు హీరో పేరు గురించి ఇదివరకే చెప్పాను. పొట్టలో క్రొవ్వు పెరుగుదల, పిల్లలలో చురుకుదనం తగ్గుదల, ఉద్యోగినుల పోషకాహారం, ఆహారము తో పెయిన్ కిల్లర్లు లాంటి వ్యాసాలలో పేరుతో సహా సమాచారం కూడా పత్రికల శైలిలోనే ఉంది.
5) శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌ పేరుతో సహా సమాచారం చూస్తే "శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే..." వాక్యంతో ప్రారంభమౌతుంది. అలా అని మనం ఎలా చెప్పగలం. తెవికీ వ్యాసం అనేది బాడీలోషన్ కంపెనీకి చెందిన ప్రకటన కాదుకదా!
పత్రికలలో వచ్చిన సమాచారం కాపి చేయడం (వయా బ్లాగు) వల్ల ఈ సమస్యలు వచ్చినట్లుగా భావిస్తున్నాను. ఇలాంటి వ్యాసాలలో అవసరమైన కొద్ది సమాచారం మాత్రమే ఉంచి (లేదా సంబంధిత వ్యాసాలకు తరలించి) పూర్తిగా వికీకరణ చేయాల్సి ఉంటుంది. ఇకముందైనా సభ్యులు కాపీ వ్యాసాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:30, 9 సెప్టెంబర్ 2013 (UTC)

వ్యాసాల శీర్షికలు చాలా పెద్దవిగా ఉండటం వాస్తవం. ఆ వ్యాసాలను యింతకు ముందు తెవికీ లో ఉన్న తగిన వ్యాసంలో విలీనం మూస ఉంచినట్లయితే వాటిపై చర్చించి తగు విధంగా విలీనం చేయవచ్చు. కొన్ని వ్యాసాలు యిది వరకు లేనివైతే వాటి పేర్లను తగువిధంగా సంగ్రహంగా అర్థం అయ్యేటట్లు వికీ నియమావళికి అనుగుణంగా తరలించవచ్చు. పైన చేర్చిన వ్యాసాలను తగు విధంగా వికీ నియమాల ప్రకారం వికీకరణను చేపట్టవలసి యున్నది. ఈ వికీకరణ లో నేను తగు విధంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.-- -- కె.వెంకటరమణ చర్చ 13:10, 10 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. ఆయా వ్యాసాములలోని సమాచారమును అనుబంధ వ్యాసాలలో చేరిస్తే సమంజసంగా ఉంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:00, 10 సెప్టెంబర్ 2013 (UTC)
ఇవన్నీ మేగజిన్ సరుకు. వీటిని శుద్ధి చేయాలంటే చాలా ఓపిక, శ్రమ కావాలి దానికి బదులు నాణ్యమైన సమాచారాన్ని ఆంగ్ల వ్యాసాలనుండి అనువదించవచ్చు --వైజాసత్య (చర్చ) 02:04, 11 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావు గారు చెప్పింది అక్షరాలా నిజం. వారి అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. ఈ మధ్యన నమోదైన సభ్యులు ఉత్సాహంతో వ్రాస్తూ పోతున్నారు. బహుశా వారికి వికీ తత్వం తెలియదు కాబోలు. వారికి సరైన మార్గదర్శం చేయకపోతే ఈ 'వారపత్రికల ' శైలితో తెవికీకి నష్టమే మరి. కొత్త సభ్యులకు నిరుత్సాహపరచకుండా వారికి సరైన మార్గదర్శకం చేయడమే ఉత్తమం. విజ్నానసర్వస్వానికి పత్రికా రచనల శైలికీ గల తేడాలను స్పష్టంగా తెలియజేసి వారికి తోడ్పాటు చేయాలి. తెవికీ శైలిలో లేని వ్యాసాలను తొలగించడమే సరైన నివారణోపాయం. వైజాసత్య గారు చెప్పినట్టు శుద్ధి చేయాలంటే శ్రమ కావాలి. ఆ శ్రమ బదులు తెవికీ సిద్ధాంతాలనుగుణంగా కొత్త వ్యాసాల కొరకు పడే శ్రమే ఉత్తమం. అహ్మద్ నిసార్ (చర్చ) 20:08, 24 సెప్టెంబర్ 2013 (UTC)

ఏమిటీ లింకులు

మార్చు

ఇటీవల జరిగిన వ్యాసపు దిద్దుబాట్లలో కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే చాలా వ్యాసాపు మూలాలలో ఒక లింకు ఉన్నట్లుగా, దాన్ని నొక్కితే మళ్ళీ అదే వ్యాసపు ఎడిట్ పేజీ తెరుచుకుంటున్నట్లుగా గుర్తించాను. వందలాది వ్యాసాలలో ఇలాంటి లింకులున్నట్లు నా దృష్టికి వచ్చింది. అలాంటి లింకులవల్ల ఉపయోగమేమీ లేదు, వ్యాసాన్ని ఎడిట్ చేయాలంటే పైన ట్యాబ్ ఎలాగూ ఉంటుంది, మరి దీని ఉపయోగమేమిటో ఎందుకు చేర్చారో తెలియదు. కొన్ని వ్యాసాలలో ఇలాంటి లింకులు రెండేసి చొప్పున ఉన్నాయి. (చూడండి: అనాస, గ్రీన్‌టీ) కొన్నింటిలో నేను తొలిగించాను. ఇంకనూ తొలిగించాల్సినవి చాలా ఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:17, 10 సెప్టెంబర్ 2013 (UTC)

ఏక వాక్య వ్యాసాలు

మార్చు

ఈ మధ్య ఏక వ్యాసాలు అధికంగా చేరుతున్నాయి. ఏక వాక్యాలపై యిదివరలో చర్చ జరిగింది. 2 కె.బి పరిమాణం దాటితే మొలక స్థాయి దాటునట్లు నిర్ణయించారు. కానీ ఒక వాక్యాన్ని కూడా వ్యాసంగా చేర్చుతున్నారు. యిలాంటివి విక్షనరీలో చేర్చవచ్చు. కానీ వికీపీడియాలో విపరీతంగా చేరుతున్నాయి. శాస్త్రవేత్తల వ్యాసాలలో విషయమేమీ లేకుండా సమాచార పెట్టె తో అదీ ఆ సమాచార పెట్టె కూడా అనువాదం కాకుండా గల వాటితో మొలక వ్యాసాలు చేరుతున్నాయి. యిటువంటి వ్యాసాలను చేర్చరాదని మనవి. తెవికీలో రాశి కన్నా వాసి ముఖ్యం అని గమనించాలి. మనం తలచుకుంటే అనేక వాసిగల వ్యాసాలను తయారుచేయగలం. మరి ఎందుకు యిలాంటి లఘువ్యాసాలు? యివి ఎవరికి ఉపయోగపడతాయో వ్యాసకర్తలు ఆలోచించవలసియున్నది.-- -- కె.వెంకటరమణ చర్చ 04:45, 11 సెప్టెంబర్ 2013 (UTC)

వికీ బడి

మార్చు
మీ చర్చలను చర్చ:వికీ బడి పేజీలో రాయగలరు

నేను వికీ బడి అనే శీర్షికన క్రియాశీలక సభ్యులకు వికీపాఠాలు నిర్వాహించదలచుకున్నాను. ఇవి కొత్తసభ్యులను ఉద్దేశించినవి కావు. ఆసక్తి ఉన్నవారు ఈ దిగువన పేరు జతచేయండి. అందరికీ తగిన సమయం చూసి అంతర్జాల తరగతులను నిర్వహించగలను --వైజాసత్య (చర్చ) 05:00, 12 సెప్టెంబర్ 2013 (UTC)

  • మంచి ఆలోచన. ఉదాహరణగా మొదటి కార్యక్రమానికి పాఠాల శీర్షికలు తెలిపితే ఆసక్తిగలవారు పేరు చేర్చటానికి సులభమవుతుంది.--అర్జున (చర్చ) 05:33, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీలో నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. నన్ను మీ బడిలో విద్యార్థిగా నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 05:38, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నేను కూడా,ఇలాంటివి నాకు తెలియవు.పాలగిరి (చర్చ) 07:18, 12 సెప్టెంబర్ 2013 (UTC)
తొలి పాఠం - మూలాలు, ఉదహరింపులు, మూలలను చేర్చే విధానం, వికీలో మూలాలను ఉదహరించడంపై ఉన్న నియమనిబంధనలు, మార్గదర్శకాలు, మూలాల నాణ్యతను బేరీజు వెయ్యటం, బ్లాగులను ఉదహరించడం, సమాచారపు తనిఖీ మొదలుగు అంశాలని అనుకుంటున్నాను. నేను ఈ పాఠానికి కావలసినవి సమకూర్చుకోవటానికి ఒక రెండు వారాలు పడుతుంది.
రెండవ పాఠం - విజ్ఞానసర్వస్వపు రచనాశైలి - వివిధ రచనాశైలులలో ఉన్న వ్యత్యాసాలు (వార్తలు, మేగజిన్లు, పరిశోధనా వ్యాసాలు, సాధారణ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ట్రావెల్‌గైడ్స్, స్వీయ చరిత్రలు) డూస్ అండ్ డోంట్స్ (చేయకూడనివి, చేయవలసినవి)
మూడవ పాఠం - వికీపీడియాలోని వివిధ తత్త్వాలు, అభిమతాలు - వాటి పరిశీలన. దైనందిన దిద్దుబాటు క్రమంలో వీటి influence (అన్వయం?)
నాలుగవ పాఠం - వికీపీడియా ఏమిటి, ఏది కాదు, వికీపీడియా యొక్క పరిధి, ఇతర సోదర వికీమీడియా ప్రాజెక్టులతో గల సంబంధం.
ఐదవ పాఠం - వికీ సభ్యుల ప్త్రవర్తనా నియమావళి, ఎలా నడచుకోవాలి, ఎందుకలా నడచుకోవాలి, సభ్యుల మధ్య సంబంధాలు.
ఆరవ పాఠం - బొమ్మలు చేర్చటం, సేకరించడం, కాపీహక్కులు, సముచిత వినియోగం, క్లుప్తంగా సంబంధింత కాపీహక్కుల లైసెన్సులపై చర్చ, కొన్ని కాపీహక్కుల చట్టాలపై చర్చ.
ఏడవ పాఠం - నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు
ఇవి నాకు ప్రస్తుతానికి తోచిన కొన్ని అంశాలు. ఇంకా ఏవైనా మీకు తోచితే జోడించగలరు. --వైజాసత్య (చర్చ) 06:44, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నాకూ మీ బడిలో పాథాలు నేర్చుకోవాలనుంది. నన్నూ చేర్చుకోగలరు. దీనికి ఒక పేజీ తయారు చేసి అందులో రాస్తే బావుంటుందిగా. చర్చా పేజీలో వీటికి సంభందించిన చర్చలు రాయొచ్చు..విశ్వనాధ్ (చర్చ) 06:59, 12 సెప్టెంబర్ 2013 (UTC)
"వికీ బడి" అనేది మంచి ఆలోచన. వికీలో రచనలు చేసే విధానం చాలా మందికి తెలియవలసిన అవసరం ఉంది. మూలాలు, లింకులు చేర్చడం, దస్త్రాలను దిగుమతిచేయడం , కాపీహక్కులు , తెవికీ మార్గదర్శకాల గూర్చి తెలుసుకోవలసిన అవసరం నాకున్నది. నేను తెవికీ లో అనేక రంగాలలో రచనలు చేయగలను. కానీ విధివిధానాలు స్పష్టంగా తెలుసుకోవాలని ఉంది.అందువలన తెవికీ బడిలో నన్ను చేర్చుకోండి.-- -- కె.వెంకటరమణ చర్చ 10:13, 12 సెప్టెంబర్ 2013 (UTC)
విధివిధాన పరిజ్ఞానము కొరకు నేను కూడ "వికీ బడి" లో చేరాలని వుంది. Bhaskaranaidu (చర్చ) 11:24, 12 సెప్టెంబర్ 2013 (UTC)
వికీబడి శిక్షణ అనేది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా భావిస్తున్నాను. చాలా కాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది సమస్యగా మారింది. "కాసే చెట్లకే దెబ్బలు అన్నట్లు" నిర్వహణ చేసే వారికే చివాట్లు రివార్డులుగా లభిస్తున్నాయి. దాంతో నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు! సభ్యులందరికీ నిబంధనలపై అవగాహన ఉంటే నిర్వహణ చేయాల్సిన అవసరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వికీశిక్షణ అనేది అందరూ ఆనందంగా స్వాగతించాల్సిన ఒక శిక్షణా కార్యక్రమం. అయితే ఈ అంతర్జాల తరగతులు ఎక్కడ నిర్వహిస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనేది తెలిస్తే పూర్తిగా విశ్లేషించడానికి వీలవుతుంది. నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే దీన్ని తెవికీలోనే నిర్వహించాలి. ఛాట్ రూపంలో అయితే ఆ సమయంలో మనకు వేరే వ్యాపకాలుండవచ్చు. తెవికీ పేజీలోనే అక్షరరూపంలోనే వారానికి ఒక పాఠం చొప్పున రోజూ వివరించాలి. సభ్యుల అభిప్రాయాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో చేరే సభ్యులకే కాకుండా ఇప్పటి సభ్యులకు ఏమైనా అనుమానాలువచ్చినప్పుడు మరోసారి ఆ పేజీని దర్శించడానికి వీలవుతుంది. దీనికి అదనంగా వీడియో ఉన్నా మంచిదే. కొన్ని సందర్భాలలో యానిమేషన్ చిత్రాలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడతాయి. అలాగే "నిర్వాహక హోదా, అధికారి హోదాల సమీక్ష, పరిమితులు, పద్ధతులు. నిర్వాహకత్వ బాధ్యతలు" అనే విషయాన్ని చివరి పాఠంగా పెట్టారు, అసలు దాన్నే మొదటిపాఠంగా పెడితే బాగుంటుంది. క్రియాశీలకంగా ఉండే సభ్యులు చాలా వరకు నిర్వాహకులై ఉంటారు. కాబట్టి వారి ప్రధాన బాధ్యత అయిన నిర్వహణ ఎలా చేయాలి? నియమాలు ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతమున్న నియమాలు ఏమిటి? ఒక నియమానికి మరో నియమానికి ఘర్షణ వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చూపించాలి? ప్రస్తుతం నిర్వహణ ఎలా ఉంది? దీనిలో లోటుపాట్లేమి? దీన్ని సరిదిద్ది భవిష్యత్తులో నిర్వహణ ఎలా మెరుగుపర్చాలి? నియమాలు స్పష్టంగా లేనప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలి? తదితర విషయాలు ప్రారంభంలోనే తెలియపర్చి ఆ తర్వాత మీరు పాఠాలు ప్రారంభిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మొదటి పాఠానికి ఎలాగూ రెండు వారాల సమయం అవసరమంటున్నారు కాబట్టి అంతకు ముందే నిర్వాహకత్వ బాధ్యతలు పాఠం ప్రారంభిస్తే సరిపోతుంది. ఒక పాఠానికి సంబంధించి వివరించేటప్పుడు ప్రస్తుత నిబంధనలు, ఆ విషయంపై ఇప్పటివరకు జరిగిన చర్చలు (ఎక్కడెక్కడో ఉన్నాయి, అవన్నీ వెదకాల్సిఉంటుంది), చర్చలపై తీసుకున్న నిర్ణయాలు, మారిన పరిస్థితులకనుగుణంగా మళ్ళీ చేయాల్సిన మార్పులు-చేర్పులు, సోదర వికీలలో ఇవే అంశానికి సంబంధించి నియమాలు ఎలా ఉన్నాయి (పరిశీలనకు మాత్రమే), వికీ పురోవృద్ధితో పాటు మారాల్సిన నిబంధలు ఏమిటి? నియమాలు ఏ సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలా అనేక అంశాలు పాఠ్యాంశంలోకి తీసుకోవాలి. అన్నింటికంటే ముందుగా (నిర్వాహక బాధ్యతల తర్వాత) వికీ మూల నియమాలు ఏమిటి? వాటిని ఎలా వర్తింపజేయాలి? వాటికి భిన్నంగా ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటివి కూడా తొలిదశలోనే శిక్షణ ఇస్తే బాగుంటుంది. పూర్తి కార్యక్రమ వివరాలు వెల్లడిస్తే సమీక్షించడానికి వీలవుతుంది. ఆ పిదప శిక్షణా కార్యక్రమ ఎజెండాను ఖరారుచేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:21, 12 సెప్టెంబర్ 2013 (UTC)
నిర్వహణ పాఠం నుండి మొదలుపెట్టడానికి అభ్యంతరమేమీ లేదు. నేనింకా ఈ పాఠాలకు పూర్తిగా ప్రణాళిక వేసుకోలేదు. కాకపోతే వీటిలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలన్న విషయంపై స్థూలంగా కొన్ని ఆలోచనలున్నాయి. వీటిని పాఠ్యప్రణాళిక తయారుచేసుకొనే క్రమంలో మరింత పరిపుష్ఠం చేస్తాను. సూత్రప్రాయంగా వికీ గురించిన చర్చలు, సమావేశాలు వీలైనంతగా వికీలోనే జరగాలి, కానీ ఈ పాఠాలు కేవలం పాఠాలు మాత్రమే, వికీ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు కాబట్టి ఇది బయట జరిగినా పెద్ద ఇబ్బంది లేదు. అదీగాక వికీలో పొందుపరచి వ్రాయాలంటే ఎంతో కొంత ప్రామాణికత ఉండాలి. నియమనిబంధనలు మొదలైన విషయాలు ఇప్పటికే వికీలో ఏదో ఒక చోట ఉన్నవి (తెలుగులో కాకపోయినా) వీటికి నేను కొత్తగా జోడించే విషయాలేవీ లేవు. కాకపోతే నాకున్న అనుభవాలతో వీటిని సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. విష్ణు గారు వీటి ఆధారంగా కొన్ని చిన్న చిన్న వీడియోలు, బోధక వనరులు ప్రొఫెషనల్స్‌తో తయారు చేయించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇవి వికీపీడియన్లకు బోధకాలుగా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. యూట్యూబు యుగంలో నిబంధనలు వ్రాతలో తెలుసుకొనే అలవాటు కొరవడినట్టుంది. నా ఆలోచన ప్రకారం ఈ పాఠాలు ప్రధానంగా పవర్‌పాయింట్ స్లైడ్లు, నా వ్యాఖ్యానంతో ఒక అంతర్జాలపు పాఠంగా కొనసాగుతాయి. ఈ క్రమంలో తయారైన విషయాన్నంతా (పాఠ్యం, స్లైడ్ల ఫీడిఎఫ్ ఫైలు, వీలైతే వీడియో కూడా) వికీపీడియాలో ఎక్కించగలను. వీటి ఆధారంగా కొన్ని బైట్ సైజ్ బోధనా వీడియోలు తరువాత తయారుచేయిస్తారు. నేను పాఠ్యపు ప్రణాళిక, సంబంధిత సమాచారం ముందస్తుగానే వికీలో పెట్టగలను కానీ, పైన చెప్పినట్టుగా నియమాల విషయంలో నేను వికీకి కొత్తగా అందించగలిగేది ఏమీ లేదు. ఏదైనా విషయం వివరించేటప్పుడు ఇప్పటిదాకా జరిగిన చర్చలు మొదలైనవి తప్పకుండా ప్రస్తావిస్తాను కానీ నిర్ణయాలు తీసుకోవటం వంటివి ఈ బడి పరిధిలోకి రావు. చర్చలు, పాఠాలు సంబంధించిన విషయాలే కానీ వీలైనంతగా వాటిని వేరుగా ఉంచితేనే మంచింది. వికీ పద్ధతులపై చర్చలు సాధారణ పద్ధతిలో రచ్చబండపై జరిగితేనే మంచిది. --వైజాసత్య (చర్చ) 04:52, 13 సెప్టెంబర్ 2013 (UTC)
మీ ఆలోచన ప్రకారము చేయండి. ఎలా చేసిననూ ఫలితం మాత్రం ప్రస్తుతం ఉన్న దాని కంటె మెరుగుపరితే చాలు. మీ వ్యాఖ్యప్రకారం చూస్తే తెవికీనే కాకుండా ఇతర వికీ నిబంధనలు కూడా తెలియజేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ముందుగానే ఇతర వికీల నియమాలు కేవలం పరిశీలనకే అని చెబితే బాగుంటుంది, లేనిచో రేపు ఏదైనా చర్చలో మీ పాఠాన్ని ఉదహరించే అవకాశమూ ఉంటుంది. ఆ నిబంధన తెవికీ నియమానికి విరుద్ధంగానూ ఉండవచ్చు. ఇదివరకు నేను చేసిన చర్చలలో ఆంగ్లవికీ నియమాలు కూడా తెలియజేశారు. తెవికీకి విరుద్ధంగా ఉన్న ఇతర వికీ నియమాలతో భవిషత్తులో ఇబ్బందులు రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 13 సెప్టెంబర్ 2013 (UTC)
ఇకపై ఈ విషయం గురించిన చర్చ ఇక్కడ కొనసాగించగలరు --వైజాసత్య (చర్చ) 06:00, 14 సెప్టెంబర్ 2013 (UTC)
వికీ బడి ప్రతిపాదన వైజాసత్య గారు చేసారు, చంద్రకాంతరావు గారు ముఖ్య సూచనలిచ్చారు. చాలా బావుంది. సభ్యులు నేర్చుకోవాలనే ఉత్సాహంతో చేరారు, చాలా చాలా బావుంది. శుభం. అలాగే వ్యాసాలు వ్రాసే సభ్యులు, నిర్వాహకులూ వికీ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే నియమం కూడా పెట్టి, ప్రతి సభ్యుని పేజీలోనూ సూచించండి. వికీ బడిలో నేనూ చేరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:19, 24 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీలో Echo (Notifications) వ్యవస్థ అందుబాటు - మీ సహకారం

మార్చు

తెవికీలో Echo (Notifications) ఒక కొత్త ప్రకటనల వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త వ్యవస్థ సముదాయ సభ్యుల మధ్య పరస్పర సందేశాలను మరింత ఉన్నతంగా బట్వాడా చేయడానికి సహకరిస్తుంది. ఇది ఇప్పటికే ఆంగ్ల, మీడియా వికీ మరియు ఇతర పాశ్చాత్య వికీపీడియాలలో సమర్ధవంతంగా అమలు చేయబడింది. దీనిని భారతీయ భాషా వికీలలో (బహుశా ఆసియా అంతటిలోనూ అనుకుంటా) మొదటి సారి మన తెవికీ సముదాయానికి అందుబాటు చేయడానికి ఈ ప్రయత్నం. ఈ అధునాతన వ్యవస్థను తెవికీలోకి సెప్టెంబరు చివరన అమలు పరచడానికి దీనికి సంబందిత వికీమీడియా ఇంజనీరింగ్ జట్టు చాలా ఉత్సాహం చూపిస్తుంది. దీనికి మనందరి సహకారం అవసరం.

మనం అందించవలసిన సహాయం
  • ఈ క్రింది లంకెలలో ఇచ్చిన సిస్టం మెసేజులను అనువదించడం. అంతే.
  1. Echo ఎకో [1]
  2. Thanks ధన్యవాదాలు [2]
  3. Notifications సహాయ సూచిక [3]

మీరందరు మన తెవికీ అభివృధ్ధికై చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తూ --విష్ణు (చర్చ)08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)

మంచి ప్రయత్నం. --అర్జున (చర్చ) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)
అనువాదం ప్రారంభించాను. కానీ ఇంతకు ముందు ప్రోగ్రాం లోని వికీపీడియా కు చెందిన తెలుగు భాషను అనువదించిన వైజాసత్య, అర్జునరావు లాంటి వారు ఈ ప్రధాన మూసల అనువాదం చేస్తే యూనిఫార్మిటీ ఉంటుందనుకుంతున్నాను.Rajasekhar1961 (చర్చ) 03:19, 20 సెప్టెంబర్ 2013 (UTC)
  • ఇప్పటికే వున్న అనువాదాల సముదాయంలో సరిపోయిన అనువాదం వుంటే సాఫ్ట్వేర్ సూచిస్తుంది కావున ఎవరైనా సరే అనువాదంలో పాల్గొనవచ్చు. Translatewiki.net లో ఖాతా ద్వారా ప్రవేశించి అనువాదాలు చేస్తే సరి. --అర్జున (చర్చ) 05:12, 20 సెప్టెంబర్ 2013 (UTC)
మన తెవికీలో నిన్నే ఎకో (Echo) సమర్థవంతంగా అమలు చేయబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇంకా కొన్ని సిస్టమ్ మెసేజులను అనువదించవలసి ఉంది. మిత్రులు చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను. --విష్ణు (చర్చ)04
18, 25 సెప్టెంబర్ 2013 (UTC)
  • మంచిది. మిగిలిన అనువాదాలు మరియు ఇతరులు చేసిన అనువాదాల సమీక్ష అవసరమైతే మార్పులు పూర్తిచేశాను. నేను చేసిన అనువాదాలు మరియు మార్పులు ఇంకొకరు సమీక్షించితే పని పూర్తయినట్లే--అర్జున (చర్చ) 11:25, 25 సెప్టెంబర్ 2013 (UTC)
నేను అనువదించడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. మీరు అనుభవమున్న అధికారులుగా అనువాదం పూర్తిచేసి మంచిగా తెలుగు వికీపీడియా పరువు కాపాడారు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:46, 25 సెప్టెంబర్ 2013 (UTC)
  • అక్టోబరు 22న అన్ని వికీలలో ఇది అమలులోకి వస్తుంది కాబట్టి, చర్చలలో పాల్గొనేవారు తప్పనిసరిగా వాడుకరి పేరు వాడండి. వీలైనంతవరకు చర్చలను వ్యక్తిగత చర్చాపేజీలలో కాక, సంబంధిత చర్చా పేజీలలో రాయండి. సందేశాల అనువాదాలలో ఇంకా కొన్ని దోషాలున్నాయి. (ఉదా: సందేశాలలో మూస:స్త్రీ/పురుషుడు అని కనబడుతున్నది) నేను సవరించాను. ఒకటి రెండురోజులలో ఇది తొలగిపోవొచ్చు. --అర్జున (చర్చ) 07:25, 14 అక్టోబర్ 2013 (UTC)
  •  
    సూచనల వ్యవస్థ అభిరుచులు
    పక్కబొమ్మలో తెలిపినట్లు, సూచనల బొమ్మను మీ పేజీ మొదటి వరుసలో కనబడేటట్లు ఎంపిక చేసుకోండి. --అర్జున (చర్చ) 07:51, 14 అక్టోబర్ 2013 (UTC)
  • ఎకో వ్యవస్థ నిన్న అన్నీ తెలుగు వికీప్రాజెక్టులలో అమర్చబడింది. ఇది చర్చలను సరియైన చర్చాపేజీలలో చేస్తూ సంబంధించిన వారి పేరు పేర్కొనడంద్వారా వారికి తెలియ చేయడానికి, ఇంకా సభ్యుల మార్పులకు కృతజ్ఞతలు తెలపడం లాంటి చర్యలతోపాటు, మీరు ప్రారంభించిన వ్యాసాలకు వేరేవారు లింకులిచ్చినపుడు సందేశాలు, మీచర్యలు రద్దుపరచబడినపుడు సందేశాలు ఇవ్వడంతో వీక్షణజాబితా కు అనుబంధంగా చాలా ఉపయోగపడుతుంది. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 04:53, 23 అక్టోబర్ 2013 (UTC)

Tamil Wikipedia turns 10. We need your wishes

మార్చు

Andharukku Namaskaram :) This is Ravi from Tamil Wikipedia. We are celebrating our 10 years with an event in Chennai on 29th September. I invite you all to join us as it would be great to share our experiences and learn from each other. If you cannot make it to the event, please leave your best wishes for us here. --Ravidreams (చర్చ) 22:51, 19 సెప్టెంబర్ 2013 (UTC)

  • Ravidreams గారి ద్వారా తమిళ సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. పై లంకెలో రాద్దామంటే తమిళం కనిపిస్తోంది. అది నాకు రానందున విచారిస్తూ ఇక్కడే తెలుపుతున్నా శుభాకాంక్షలు. Through Ravidreams i express my best wishes to our Tamil friends. To write on page @ link above, it is in Tamil. I regret not able to follow it. so, i just expressing here my best wishes. Telugubhagavatam (చర్చ) 16:31, 21 సెప్టెంబర్ 2013 (UTC)

సైటునోటీసుల విషయమై

మార్చు

వికీపీడియాలో సైటు నోటీసులు ఎప్పతికప్పుడు తాజాకరిస్తున్నాను. అలానే మీడియావికీ:Anonnotice ను పునఃప్రారంభించాను. ఇక్కడ ఉండే సైటు నోటీసు ఖాతా తెరువని/లాగిన్ అవ్వని సందర్శకులకు కనిపిస్తుంది. అలానే సైటు నోటీసులో పాఠ్యం ఉంచడానికే ప్రయత్నించగలరు, బొమ్మలు పెట్టడం వల్ల అందంగా కనిపించినా కొన్ని దుష్ప్రభావాలున్నాయి. అలాగే పాఠ్యాన్ని మరింత అందంగా చూపించడం కోసం కొత్త సాంకేతికాలు తెలుసుకోవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:18, 21 సెప్టెంబర్ 2013 (UTC)

సైటు నోటీసులపై చర్చ తీసిన రహ్మానుద్దీన్ గారికి కృతజ్ఞతలు. ఇదివరకు ప్రత్యేకంగా సైటునోటీసుపై చర్చ జరుగలేదని అనుకుంటున్నాను. (నా ప్రస్తుత చర్చ మాత్రం పై వాటికి కొద్దిగా భిన్నం). కొన్ని రోజుల క్రితం చూస్తే ఒకేసారి 3 సైటునోటీసులు కనిపించాయి. చిన్న స్క్రీన్ కంప్యూటర్లలో డెస్క్‌టాప్ మొత్తం సైటునోటీసుల ఆక్రమణకే సరిపోతుంది. కాబట్టి ఒకే సమయంలో ఒకటి కంటె అధికంగా సైటునోటీసులు ఉండనట్లు చూసుకోవాలి. వికీమీడియా వారి ఒకటి, మన రెండు సైటునోటీసులు ఒకేసారి కనిపిస్తే కొత్తవారికి ప్రతీ సారి ప్రతీపేజి ప్రారంభించగానే వీటివల్ల ఇబ్బందిగా ఏర్పడుతుంది. అలాగే సైటునోటీసులనేవి తాత్కాలిక కాలానికే పరిమితమై ఉండాలి. ఇప్పుడు ఉన్నట్లుగా గ్రామ వ్యాసాల ప్రచారానికి తొలిపేజే సరియైనది. ఇదివరకు గ్రామావ్యాసాల ప్రచారానికై తొలిపేజీలోనే లింకు ఉండేది. శాశ్వత ప్రాదిపదికన ఉండే గ్రామవ్యాసాల ప్రచారానికి అది సరిపోతుంది. కొత్త సభ్యులు సాధారణంగా మొదటిపేజీ నుంచి వస్తారు కాబట్టి అది వారి దృష్టికి వస్తుంది, ప్రతీపేజీ తెరిచినప్పుడు కనిపించే అవసరం లేదనుకుంటాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:12, 24 సెప్టెంబర్ 2013 (UTC)
నేని పైన తెలిపిన విధంగాలాగిన్ అయ్యి ఉన్నవారికి ఒకరకంగా లాగిన్ అవ్వని వారికి ఒకరకంగా సైట్ నోటీస్ వచ్చేలా చేసాను. ఒకటి కన్నా ఎక్కువ సైటు నోటీసులు ఉండరాదు మరియు వారానికో మారు సైటు నోటీసు మార్చాలి. అనవసరంగా సైటు నోటీస్ ఉంచరాదు అన్నవి నేను పాటిస్తున్న నియమాలు. వికీమీడియా నుండి వచ్చ్ నోటీసులు లేదా మనం ఏర్పరిచే నోటీసులు ఐచ్ఛికాలే - ఈ నోటీసు తొలగించు అని లింకు లాగిన్ అయ్యి ఉన్న ప్రతి వాడుకరికీ వెళుతుంది. గ్రామవ్యాసాల మీద విశేష కృషి జరగాలి. అనుకున్నంత స్థాయికి చేరనంత వరకూ అనామకులకు(లాగిన్ అవ్వని వారికి) ఆ సైటు నోటీస్ ఉంచాలని సంకల్పించాను. ఆ సైటు నోటీసు చర్చా పేజీలో అభ్యంతరాలు తెలపవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 18:18, 24 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీ ఉగాది మహోత్సవం అనంతర అభివృద్ధి

మార్చు

మనం అందరం ఈ సంవత్సరం తెలుగు ఉగాది మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము. అందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఆ తర్వాత (మే నుండి ఆగష్టు వరకు గడిచిన నాలుగు నెలలు) మన తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధిని సమీక్షించాల్సిన సమయం వచ్చింది. దాని కోసం మనమందరం కలిసి వికీపీడియా:ఉగాది మహోత్సవం-2013 తర్వాత తెవికీ ప్రగతి అనే వ్యాసం మొదలు పెడుతున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాల్ని చేర్చుతున్నాను. అలాగే మీరందరూ మీకు తెలిసిన విషయాల్ని ఇక్కడ చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:51, 24 సెప్టెంబర్ 2013 (UTC)

అలాగే వికీపీడియా_చర్చ:సమావేశం/తెలుగు_వికీపీడియా_మహోత్సవం_2013#సమావేశం నిర్వహణనుండి నేర్చుకోగల అంశాలు లో మీ స్పందనలు రాయండి. ముందు జరగబోయే కార్యక్రమాలకు ఇవి చాలా ఉపయోగంగా వుంటాయి. --అర్జున (చర్చ) 07:02, 18 అక్టోబర్ 2013 (UTC)

నిర్వహణకు సహకారం ఇదీ

మార్చు

గత కొద్ది రోజుల నుంచి తెవికీ దిద్దుబాట్లను గమనిస్తే నిర్వహణకు సభ్యుల సహకారం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే ఒక సభ్యుడు పదేపదే సృష్టిస్తున్న చిన్న వ్యాసాలను రమణగారు దారిమార్పులు చేశారు. ఎన్నిసార్లు దారిమార్పులు చేసిననూ ఆ సంఖ్యానుగుణ వ్యాసాలను సృష్టించడం మాత్రం ఆ సభ్యుడు మానలేడు. మనం చేర్చిన సమాచారంలో ఒక్క దిద్దుబాటు అయినా ఎవరైనా మార్పు చేశారంటే అలా ఎందుకు చేశారో తెలుసుకొని మరో సారి అలాంటి తప్పిదం రాకుండా జాగ్రత్తపడాలి. కాని అనుభవమున్న సభ్యులు కూడా అవన్నీ మనకెందుకు, నాకు నచ్చినట్లు నేను చేస్తాను అన్నట్లుగా దిద్దుబాట్లు చేస్తున్నారు. తెవికీ నిర్వహణకు సభ్యులు ఇచ్చే సహకారం ఇదీ!! నేను కూడా కొన్ని రోజులక్రితమే ఒక అనుభవమున్న సభ్యుడు గ్రామాల పేర్లు కల మూసలలో బాటుద్వారా చేసే మార్పులను చేసే అవసరం లేదని చెప్పాను, అది వదిలేసిననూ మరో రకంగా సునాయాసపు దిద్దుబాట్లు తీసుకొని మార్పులు చేస్తుంటే ఇప్పుడే మళ్ళీ తెలియజేశాను. ఇది చూడడానికి చిన్న సమస్యే కావచ్చు కాని అందరూ అలా చేస్తుంటే గమ్యం ఎటువైపు వెళ్తుంది. శ్రమకోర్చి పెద్ద దిద్దుబాట్లు చేసే సభ్యులకు రావల్సిన పేరు మరొకరికి వెళుతుంది. ఇక్కడ జరిగే మరో పొరపాటు ఏమంటే కొన్ని సంవత్సరాలుగా సభ్యులు దిద్దుబాట్లను మాత్రమే చూసి పతకాలు అందిస్తున్నారు. ఇలా చేయడం కంటె నాణ్యమైన వ్యాసాలను అందించే వారికి తగు గుర్తింపు ఇస్తే తెవికీ నాణ్యత పెరుగుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:58, 27 సెప్టెంబర్ 2013 (UTC)

అవును,నిజమే.గతకొద్దికాలంగా కొన్ని అనవసరమైన మార్పులను అధికంగా చేస్తున్నారు.దాని వలనతెవికీ పెద్ద ప్రయోజనంలేదు, సభ్యుడికి కూడా వృదాకాలాయాపన.అందరి లక్ష్యం నాణ్యమైన మంచి వ్యాసాలను ముందు తరాలకు అందించటమన్నది,మనందరిలక్ష్యం కావున,అటువైపుగా దృష్టిసారించడం మంచింది.చంద్రాకాంతారావుగారన్నట్లు మంచి వ్యాసాలను వ్రాసేవారికి గుర్తింపు ఇవ్వడం వలన ప్రయోజనముండవచ్చును.అందరం కలసి అలోచించవలసిన విషయమిది.అలాగే అనవరపు బొమ్మలను కూడా అధికంగా అప్లోడ్ కొందరు చేస్తున్నారు.వ్యాసాలకు సంబంధంలేని బొమ్మలను కామన్సులో చేర్చమని పలుసందర్భాలలో చెప్పినను,అనవరపు బొమ్మలను అప్ లోడ్ చెయ్యడం మానలేదు. సినియరు సభ్యులు,నిర్వాహకులు,అధికారులు ఇచ్చే సలహాలు,తెవికీ అభివృద్ద్ధిని దృష్టిలో పెట్టుకొనే ఇస్తున్నారని,రచనలు చేసే సభ్యులు సహృదయంతో అర్థం చేసుకోవాలి.పాలగిరి (చర్చ) 19:58, 28 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారు లేవనెత్తిన సందేహంలో సత్యముందనడంలో సందేహం లేదు. నాణ్యతకు ప్రథమ స్థానం ఇవ్వాలి. దిద్దుబాట్ల సంఖ్యను పొందే తపనలో నాణ్యతకు తిలోదకాలివ్వడం ఏమాత్రము సమంజసం కాదు. నాణ్యతతో కూడిన వ్యాసాలు, అవి సంఖ్యలో తక్కువైననూ, దిద్దుబాట్ల సంఖ్యలోనూ తక్కువైననూ సోదరి సుజాతగారిని ఆదర్శంగా తీసుకోవడం ఉత్తమం. కాపీ పేస్టుల వ్యవహార శైలి, తెవికీ నాణ్యత పెంచదు. వికీలో తెవికీ స్థానం రూపొందాలంటే నాణ్యత అవసరం గానీ సంఖ్యగాదు. "గంగి గోవు పాలు గరిటెడైన చాలు". తెవికీ గాడి తప్పుతున్నదేమో ఒక సారి అవలోకనం చేసుకోవాలి. దిద్దుబాట్ల సంఖ్యల ఆధారంగా గండపెండేరాలు ఇవ్వడం బదులు, ఏ సభ్యుడు ఎన్ని కిలోబైట్ల నాణ్యమైన సమాచారాన్ని కాంట్రిబ్యూట్ చేశాడో లెక్కలోకి తీసుకుని పతకాలందిస్తే బావుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:08, 28 సెప్టెంబర్ 2013 (UTC)
సభ్యుల సూచన సరైనదే. దీనిపై అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎన్నిక నిర్వహించి సరైన విధి విధానాలను రూపొందిస్తే బాగుంటుంది.--పోటుగాడు (చర్చ) 03:19, 29 సెప్టెంబర్ 2013 (UTC)
పాలగిరి గారు చెప్పినట్లు ఇది వృధాకాలయాపన, అది నిజమే, కాని అది అంతవరకే, ఆ సభ్యుల వరకే అయితే ఫర్వలేదు కాని, ఆ ప్రభావం మిగితావారిపైనా పడుతోంది, దీనితోనే ప్రమాదం ముంచుకొస్తోంది. నిసార్ గారు చెప్పినట్లు నాణ్యతకు ప్రథమస్థానం తప్పకుండా ఇవ్వాలి, అయితే పెద్దపెద్ద వ్యాసాలూ తయారుచేయాలని ఏమీ లేదు, అసలు పెద్ద వ్యాసాలలో కూడా చాలా వరకు అనవసరపు సమాచారం ఉంది. అంతేకాకుండా వ్యాసాలు ఒకసారి వ్రాసి వదిలేస్తున్నాం, ఎలాంటి తాజాకరణ చేయనందుకు పాఠకులకు వ్యాసాలపై నమ్మకం పోతుంది. పోటుగాడు గారు చెప్పినట్లు ఎన్నిక నిర్వహించిననూ ఈ అభిప్రాయం తప్పకుండా చిత్తుగా ఓడిపోతుంది. ఇదివరకు జరిగిన కొన్ని ఓటింగు ఫలితాలు చూస్తే ఎందుకో అని అర్థం చేసుకోగలం. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:32, 29 సెప్టెంబర్ 2013 (UTC)
పలుమార్లు చెప్పిననూ సభ్యుడు:YVS REDDY నిర్వహణలో భాగంగా తెలియజేసిన సూచనలకు విరుద్ధంగానే ప్రవర్తించడం మూలానా, భవిష్యత్తు తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ఈ సభ్యుడిపై ప్రజాస్వామ్య పద్దతులతోనే తగిన చర్య తీసుకోవలసి ఉంటుందని తెలియజేస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:31, 29 సెప్టెంబర్ 2013 (UTC)
సభ్యుల సహకారం లేనందున ప్రజాస్వామ్య పద్దతిలో నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికరమే. నిర్దిష్టమైన నియమాలూ లేవు కనుక ఏకపక్ష నిర్ణయాలకూ అవకాశంలేదు. అయిననూ ఒక్క ఉదాహరణ చెబుతాను: గ్రామవ్యాసాలలో మూసపెట్టేవరకు అన్ని గ్రామాల లింకులు సరిగ్గానే ఉన్నాయి. ఈ విషయం వైజాసత్య, కాసుబాబు గార్లకు బాగా తెలుసు. ఈనాడు ఆదివారంలో తెవికీ ప్రత్యేక కథనంతో సభ్యులు ఉప్పెనలా చేరి ఇక్కడి పద్దతులు తెలియక వారి గ్రామాల సమాచారం చేర్చాలనే ఉత్సాహంతో చాలా లింకులను మార్చారు, పేర్లలో ఉన్న చిన్నచిన్న తేడాలను సరిదిద్దారు. వీటివల్ల నీలం లింకులు కాస్త ఎర్రలింకులయ్యాయి. వాటిని మళ్ళీ సరిదిద్దడానికి కొంతశ్రమ అవసరం. సభ్యులు ఇలాంటి శ్రమ తీసుకొనక సునాయాసపు దిద్దుబాట్లపైనే దృష్టిపెడుతున్నారు. ఆదిలాబాదు జిల్లా సోనల గ్రామం పేరును సొనాలగా మార్చారు. అది ఎర్రలింకుగాఉందని, దానిపై వ్యాసం లేదని భావించి (!)ఇటీవలె సభ్యుడు సొనాల వ్యాసం సృష్టించాడు. చూడండి. అయితే ఇదివరకునేను చేర్చిన కొంతసమాచారం ఉన్న సోనల పేరుతో ఉన్న వ్యాసం వృధాగా మిగిలిపోయింది. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. మూసలలో మార్పులు చేసే సభ్యుడు అవే పేర్లుగల మండల వ్యాసంలో మార్పులకు దూరంగా ఉండడానికి కారణం సభ్యులు గ్రహిస్తారని అనుకుంటున్నాను. చెబితే బాగుండదేమో కాని గణాంకాలనేవి ... బిస్కెట్ల లాంటివి. ఇలాంటివాటికై సభ్యులు ఎందుకు ఆశపడుతున్నారనేది అంతుచిక్కని సమాధానమే. ఇలాంటివి నేను గమనించడం చాలా సార్లు జరిగింది. తెవికీ కృషిలో భాగంగా వచ్చే గణాంకాలకు, గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చేసే దిద్దుబాట్లకు చాలా తేడా ఉంటుంది. దాన్ని ఎవరైనా ఇట్టే పసిగట్టవచ్చు. అలాంటి వారికి, అలాంటి గణాంకాలకు కూడా గుర్తింపు ఇవ్వడం మరీ శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 30 సెప్టెంబర్ 2013 (UTC)
ఇది చాలా సీరియస్ విషయం.అయినను ఈ విషయంలో సభ్యులు,నిర్వహాకులు,అధికారులు తగువిధంగా స్పందించకపోవటం నిజంగా విచారకరం.ఎవ్వరి గోల వారిదే ... పాలగిరి (చర్చ) 03:45, 1 అక్టోబర్ 2013 (UTC)
పాలగిరి గారూ, ఎందుకు స్పందించడం లేదండి, చేతనంగా వున్న నిర్వాహకులు ఇద్దరు ముగ్గురు స్పంచించినా చాలు. ఈ విషయం, మీరు చెప్పినట్టు సీరియసే. వికీ నియమాలకు, మరియు ప్రజాస్వామ్య పద్దతికి ఎవరూ అతీతులు కారు. చంద్రకాంతరావు గారూ, మీరు తెవికీ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని, తగు కార్యాన్ని ప్రవేశ పెట్టండి, సభ్యులు తప్పక ప్రతిస్పందిస్తారు. అహ్మద్ నిసార్ (చర్చ) 05:38, 1 అక్టోబర్ 2013 (UTC)
సభ్యులందరికీ సంయమనం పాటించాలని విన్నపం. చంద్రకాంతరావు గారు రెడ్డి గారికి అక్షరక్రమంలో పెట్టేపని బాటు ద్వారా చేయవచ్చని చెప్పారు. ఆయన సరేనని ఆ పని మానేశారు. అనుభవమున్న సభ్యుడిగా చక్కని సలహా ఇచ్చారు. రెడ్డిగారు స్వీకరించారు. ఇద్దరూ ఇక్కడ చక్కగా వ్యవహరించారు. మరోచోట గ్రామలకు లింకుల విషయంలో పొరపాటు వచ్చింది అది ఎత్తిచూపారు. ఇది కూడా సరైనదే. రెడ్డి గారు దీన్ని సద్భావంతో స్వీకరించాలి. అక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఈ చిన్న మార్పుల విషయంలో జరుగుతున్న చర్చ సరైన దిశలో సాగటం లేదని నాకనిపించింది. ఎందుకంటే కేవలం పెద్దమార్పులనే స్వాగతించాలని వికీలో ఎక్కడా లేదు. కేవలం దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే చేస్తున్నారని ఆరోపించడం ఎదుటివారు సదుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అనుకోకపోవటం వల్లే వచ్చింది. ఒకవేళ దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే చేసినా దాని వళ్ళ వికీకి వచ్చిన నష్టమేమీలేదు. దిద్దుబాట్ల సంఖ్య ఆధారంగా వికీలో వచ్చే హోదాలేమీ లేవు. 10,000 దిద్దుబాట్లు దాటిన వాళ్లకి నిర్వాహకహోదా ఇవ్వాలని నియమం లేదు. దిద్దుబాట్ల సంఖ్య కాకపోయినా, వ్యాసాల సంఖ్య అమాంతంగా పెంచాలని నేను తాపాత్రాయపడిన రోజులు నాకు బాగా గుర్తు. కావలంటే వాటి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. మచ్చుకు ఇవి చూడండి. వికీలో ఎవరి అభిరుచి వారిది. చంద్రకాంతరావు గారికి, పాలగిరి గారికి, నిసార్ గారికి, నాకూ పెద్ద వ్యాసాలు వ్రాయటం ఇష్టం. శాస్త్రి గారికి అచ్చుతప్పులు దిద్దటం ఇష్టం, శ్రీరామమూర్తి గారికి గ్రామాల వ్యాసాల్లో గణాంకాలు చేర్చటం, పీపకాయల రాజు గారికి సొంత పేజీని దిద్దుకోవటం ఇష్టం. వికీ నాణ్యత దెబ్బతిననంతవరకూ ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు దిద్దుబాట్లు చేసుకోవచ్చు (నియమాలు పాటించాలనుకోండి). ఇది మొలకలలాగా నాణ్యతను దెబ్బతీసే విషయం కూడా కాదు కాబట్టి పట్టువిడుపుగా వదిలెయ్యండి. ఎక్కడైనా లింకులు వగైరా గట్లా తెగిపోయినప్పుడు తప్పకుండా తెలియజేయాలి. ఆ గ్రామాల వ్యాసాల్లో ఇప్పటికీ చాలా అచ్చుతప్పులున్నాయి. వాటిని సరిదిద్దే క్రమంలో నేను ఎన్నివేల చిన్న దిద్దుబాట్లు చేశానో నాకే తెలియదు. కేవలం సంఖ్య పెంచుకోవటానికే దిద్దుబాట్లు చేసేవాళ్ళు ఉండరని నేనట్లేదు. వాళ్ళు నాణ్యతకు భంగం కలిగించనంతవరకు పెద్ద నష్టమేమీ లేదు --వైజాసత్య (చర్చ) 10:17, 1 అక్టోబర్ 2013 (UTC)
ఈ చర్చలో నేను గమనించిన మంచి విషయం గురించి వ్రాయటమే మరచిపోయాను. చిన్న దిద్దుబాట్లను ఆపలేము, కానీ పెద్ద వ్యాసాలను, చక్కగా వ్రాసిన వ్యాసాలను, వాటిని పొందుపరచిన సభ్యులను తప్పకుండా గుర్తించి, అభినందించాలి. నిసార్ గారూ, మీరు ఇదివరకు చాలామంది సభ్యులను పతకాలిచ్చి గుర్తించినట్టు గమనించాను. ఉత్తమ వ్యాసాలకు పతకాలు తయారుచేసి, మంచి వ్యాసాలను వ్రాసేవారిని ప్రోత్సహిద్దాం --వైజాసత్య (చర్చ) 10:31, 1 అక్టోబర్ 2013 (UTC)
తెవికీ అభివృద్ధికి మంచి వ్యాసాలు వ్రాసేవారు ఎంత అవసరమో అదే విధంగా శుద్ధి,వికీకరణ, అనువాదం, చేసే సభ్యులు,సరైన వర్గీకరణలు, మూసలు చేర్చేవారూ అవసరమే. అనేక వ్యాసాలకు శాస్త్రిగారు శుద్ధి చేసి మహోన్నత కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆయన చేసిన మార్పులు చిన్నవైనా అవి తెవికీ కి అత్యంత అవసరం.అటువంటి వారి కృషిని కూడా గుర్తించాలి. నిరంతరం గ్రామ వ్యాసాలలో గణాంకాలను చేర్చి కృషి చెసిన శ్రీరామమూర్తిగాలి లాంటి కృషినీ గుర్తించాలి. వ్యాసాలలోనేకాకక వ్యాసేతర కార్యక్రమాలను నిర్వహించేవారి కృషినీ గుర్తించాలి. అన్ని వర్గాల వారూ అవసరమే. అందరూ పెద్ద వ్యాసాలు వ్రాయాలంటే వ్రాయలేరు కానీ తెవికీ అభివృద్ధికి అనేక రకాలుగా తమ సహాయ సహకారాల్ని అందిస్తారు. ఇక్కడ ఎవరూ వ్యక్తిగత ప్రయోజనాలకు వ్యాసాలను వ్రాయడంలేదు. రెడ్డిగారు నిర్వాహకులకు సహకరిస్తే బాగుంటుంది. యిదివరకు చిన్న వ్యాసాలపై ఆయన వల్లనే అధిక చర్చ జరిగింది. ఆమొలకలను అలానే ఉంచి ప్రస్తుతం మరికొన్ని లఘు వ్యాసాలను సృష్టిస్తున్నారు. వారి వ్యాసాల విస్తరనకు సమయం కేటాయిస్తే బాగుంటుంది. రోజుకు అనేక గంటలు తెవికీలో ఉంటూ నాణ్యమైన వ్యాసాలను అందిస్తే అందరికీ ఉపయోగపడతాయి. వాటిని వదలి చంద్రకాంతరావు గారు ఎన్ని సార్లు సూచనలు అందించినా అదే పనిగా సదరు గ్రామ వ్యాసాల లో సూక్ష్మ మార్పులు చేస్తున్నారు. నిర్వాహకుల సలహాలని పెద్ద మనసుతో స్వీకరించాలని రెడ్డిగారికి మనవి.-- -- కె.వెంకటరమణ చర్చ 10:54, 1 అక్టోబర్ 2013 (UTC)

నేను చేస్తున్న మార్పులు చిన్నమార్పులు కాని ఆ చిన్న మార్పు ఎంత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు నేను ఈ రోజు మూస:వృక్ష శాస్త్రము లో en: అనే రెండు అక్షరాలు తొలగించి ఒక చిన్నమార్పు చేసాను, ఈ చిన్న మార్పు కారణంగా కలిగిన ప్రయోజనం ఏమిటంటే వృక్షశాస్త్రము మూస సృష్టించబడిన 11:53, 29 మార్చి 2008‎ తేది నుండి నేటి వరకు ఈ మూస ఉంచబడిన వ్యాసాలలో ఆంగ్లవ్యాసం కోసం English నొక్కినప్పుడు ఆ లింకు ఒక వృక్షం యొక్క చిత్రానికి దారితీస్తుంది, కాని నేను ఇప్పుడు చిన్నమార్పు చేసిన తరువాత English నొక్కినప్పుడు ఆంగ్ల వ్యాసానికి దారితీస్తుంది, మరియు ఈ మూసలో ఇంతకు ముందు చూపు నొక్కినప్పుడు కనిపించని చిత్రమూ కనిపిస్తుంది. మీ YVSREDDY (చర్చ) 11:49, 1 అక్టోబర్ 2013 (UTC)

నేను ఈ చర్చ తీయడానికి కారణం వేరు, ప్రస్తుతం చర్చ జరుగుతున్నది వేరు (నిర్వహణలో సభ్యుల సహకారంపై చర్చ తీస్తే చివరకు చిన్న/సునాయాస దిద్దుబాట్లపై చర్చ జరుగుతోంది). చర్చ జరుగుతున్న సమయంలోనే ఒక సభ్యుడు దారి మళ్ళడంతో చర్చ కూడా దారి మళ్ళిందని భావిస్తున్నాను. అయిననూ ఇక్కడ చర్చలో పాల్గొన్న సభ్యులందరూ సంయమనంతోనే ఉన్నారు. ఇక్కడ కేవలం చర్చమాత్రమే జరుగుతోంది, అంతేకాని దీనికి కారకులైన సభ్యులపై (ఇదివరకు ఒకసారి ఇదే సభ్యుడిపై పలువురు సభ్యులు వ్రాతపూర్వకంగానూ నిర్వహణపరంగానూ దాడిచేసినట్లు కాకుండా) ఈ చర్చలో పాల్గొన్నవారు అదుపుతప్పి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సభ్యుని దిద్దుబాట్లపై కాని సభ్యునిపై కాని నిర్వహణ పరంగా ఎలాంటి ప్రతిచర్య జరుగులేదు. ఇక అసలు విషయానికి వస్తే చిన్న దిద్దుబాట్లకు, సునాయాస దిద్దుబాట్లకు తేడాను ఎవరూ గుర్తించడం లేదు. నా ఉద్దేశ్యం సునాయాస దిద్దుబాట్లే కాని చిన్న దిద్దుబాట్లు కాదు. ఎంతో శ్రమకోర్చి ఒక వ్యాసంలో వికీకరణ, శుద్ధిలాంటివి చేయడం భౌతికంగా చిన్న మార్పుకిందకే వస్తుంది, కాని ఇది చాలా ప్రధానమైన మార్పు. ఇలాంటి మార్పులకు ఎవరైనా తప్పకుండా మెచ్చుకుంటారు. ఇలాంటి మార్పులకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.(కాపీపేస్టుల రూపంలో పెద్ద దిద్దుబాట్లు చేసిననూ అది అభ్యంతరకరమే కదా!). వైజాసత్య గారు చెప్పినట్లు అందరూ పెద్ద మార్పులే చేయాలని ఏమీ లేదు. అయితే ఇక్కడ సమస్య చిన్న-పెద్ద మార్పులది కాదు, సునాయాస మార్పులది. చర్యలు తీసుకోవడానికి దీనిపై ఎలాంటి నియమాలు లేవు, లేవు కాబట్టే సభ్యుల ప్రతిస్పందలకై చూశాను, అయినా ఇద్దరు మినహా ఎవరి నుంచీ సరైన ప్రతిస్పందన లేదు. వైజాసత్యగారు ఇలాంటి మార్పులు చేసేవారి వల్ల తెవికీకి ఎలాంటి నష్టం లేదంటున్నారు కాని, ఈ ప్రభావం మిగితా సభ్యులపైనా తప్పకుండా పడుతుంది. నాలుగైదేళ్ళ క్రిందట నేను చురుకుగా ఉన్నప్పుడు ఒక సీనియర్ సభ్యుడు కూడా ఇలాగే ప్రవర్తించడం మూలానా, నేను రెండు-మూడు దిద్దుబాట్లతో రచించిన ఒక పెద్ద వ్యాసాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 20 మార్పులు చేయడంతో (అసలు ఒకేఒక్క మార్పుతో జరుగవలసిన ఆ దిద్దుబాటుకై ఆ సభ్యుడు ప్రతీ విభాగం తెరిచి భద్రపర్చడం వల్ల) తెవికీలోనాకు మొదటిసారిగా "దిద్దుబాట్ల" సమస్య తెలియవచ్చింది. అలాంటి మార్పులు చూసిన పిదప భవిష్యత్తులోనూ ఇంతకు మించిన "ఘనులు" వస్తారనీ అప్పుడే ఊహించాను. నేను ఊహించినట్లే ఇలాంటి చాలా సభ్యులు తెవికీలో తారసపడ్డారు. తెవికీలో నా చురుకుదనం తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణము. ఆ తర్వాత దిద్దుబాట్లు తగ్గించి నిర్వహణ పనులే ఎక్కువగా చేస్తున్నాను. ఇలా నా లాంటి వారు ఎందరున్నారో తెలియదు కాని ఇలాంటి సమస్య వల్ల తెవికీకి నష్టం ఏమీ లేదని ఎలా చెప్పగలం? అలాగే ఎదుటివారు ఏదిచేసిననూ సదుద్దేశంతోనే చేస్తున్నారని భావించుకుంటే ఇక్కడ నిర్వహణ చేసే అవసరం ఎవరికీ ఉండదు. స్వేచ్ఛా విజ్ఞానసర్వస్వం కాబట్టి అందరికీ తమ ఇష్టమున్నట్లు దిద్దుబాట్లు చేయడానికి స్వేచ్ఛనిస్తూ, వారు చేసేదంతా సదభిప్రాయంతోనే చేస్తున్నారని వదిలిపెడితే (అలాంటి నిర్వాహకులూ ఉన్నారనుకోండి, అది వేరే విషయం) అప్పడిది చెత్త విజ్ఞానసర్వస్వంగా మారడం ఖాయం. సమాజంలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటే- వారూ సదుద్దేశంతోనే చేస్తున్నారని నేరవిభాగం వారు తలిచి ఎలాంటి చర్యలు తీసుకోకుంటే, అప్పుడు అరాచకమే రాజ్యమేలుతుంది అని వేరే చెప్పాలా? ఒక సుందరమైన ఉద్యానవనంలో మొక్కలకైనా అవి స్వేచ్ఛగా పెరిగే అవకాశం ఇవ్వరు. ఉద్యానవన నిర్వాహకులు వాటిని స్వేచ్ఛగా పెరగడాన్ని వదిలితే అది వనంగా మారుతుంది కాని ఉద్యానవనం అని అనిపించుకోదు. అలాంటప్పుడు దాని ఉపయోగమేమి? ఒకసాలెపురుగు సదుద్దేశంతో గూడు కట్టుకున్నా సరే, వాటివల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేకున్నా సరే, మన ఇంట్లో మాత్రం ఉంచుతామా? ఇంటి నియమం (శుభ్రత)కు అది అవరోధం అని తొలిగించకుండా ఉంటామా? -- సి. చంద్ర కాంత రావు- చర్చ 12:08, 1 అక్టోబర్ 2013 (UTC)
లెస్స పలికారు చంద్రకాంతరావు గారు. కృషిచేస్తున్న సభ్యులను అభినందించాల్సిందే, కానీ వారు చేస్తున్న కృషి తెవికీకి ఎంత తోడ్పాటు అందిస్తున్నది కూడా అంతే ముఖ్యం. మన సమాజంలో విజ్నానం కంటే వినోదానికి ప్రాధాన్యం ఇస్తున్నారనటానికి ఒక ఉదాహరణ, ఈ మధ్య మన తెవికీలో పాటల పల్లకి జోరందుకుంది. మంచిదే, సభ్యులను అభినందించాల్సిందే, కాని తెవికీ పాటల పుస్తకంలా తయారయ్యే ప్రమాదముంది (బహుశా ప్రమాదం లేకనూ పోవచ్చు), దీనికంటూ వేరే వేదిక (వికీ సోర్సు లాంటిది) ఉన్నప్పుడు, ఈ మెటీరియల్ నీ సరైన "షెల్ఫ్" లో వుంచవచ్చు. వికీలో వుండవలసిన వ్యాసాల జాబితా, తెవికీలో కనీసం ఉండవలసిన వ్యాసాల జాబితాని దృష్టిలో వుంచుకుని వాటిని సరైన రీతిలో సరిదిద్దిన తరువాత, అలాంటిదే ఓ ముఖ్యమైన జాబితాను తయారు చేసి వాటిపై ప్రాజెక్టులా కృషి సాగిస్తే (లీలావతి-కూతుళ్ళలా) సమగ్రత సాధించవచ్చునేమో కొంచెం ఆలోచించండి. మీరన్నట్టు, ఉద్యానవనం ఉద్యానవనమే, వనం వనమే. ఉద్యానవనం కొరకు కృషియే భేషైనది. వైజాసత్యగారన్నట్టు మంచి వ్యాసాలు ఉత్తమ వ్యాసాలు తయారుచేసిన వారికి ప్రోత్సాహకాలు పతకాలు ఇవ్వడం మరీ ఉత్తమం. అహ్మద్ నిసార్ (చర్చ) 18:29, 2 అక్టోబర్ 2013 (UTC)
వికీపీడియనులుగా మనలో (ముఖ్యంగా పాత సభ్యులు) ఎవరైనా సరే కేవలం దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే తాపత్రయపడేవారు వేమన చెప్పిన గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు మననం చేసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఈ పద్దతి సముచితం కాదని సభ్యులకు తెలియజేయటానికి తెవికీ సమాజపరంగా మనందరిపైనా కూడా కొంత బాద్యత ఉంది. బహుశా reactive measures కంటే proactive measures తీసుకోవడం శ్రేయస్కరం అని నా అభిమతం. వైజాసత్య గారు ఒక మంచి సూచననిచ్చారు. వారన్నట్టు "చిన్న దిద్దుబాట్లను ఆపలేము, కానీ పెద్ద వ్యాసాలను, చక్కగా వ్రాసిన వ్యాసాలను, వాటిని పొందుపరచిన సభ్యులను తప్పకుండా గుర్తించి, అభినందించాలి". ఇంకా ఇలాంటి సూచనలేమైనా ఉంటే వాటిపై శ్రద్ధ పెట్టటం ఉపయుక్తం. బహుశా దీని వలన దిద్దుబాట్ల సంఖ్య పెంపు వాడుకరులను ఆపలేకపోయినా సి. చంద్ర కాంత రావు గారి లాంటి వారు తెవికీ నుండి విశ్రాంతి తీసుకోకుండా చూసుకోగలుగుతాం. --విష్ణు (చర్చ)
చిన్న దిద్దుబాట్లు చేయరాదని తెవికీలో నిబంధన ఏమీ లేదు. అందరూ పెద్ద వ్యాసాలే రాయలేరు. ఈ చర్చ అంతా అనవసరమైన వృధాగా అనిపిస్తుంది. కొత్తగా పెద్ద వ్యాసాలు రాయగలిగే వారినే సభ్యులుగా చేర్చుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఇక విషయాల గురించి: వికీ ఒక స్వతంత్ర వేదిన. మీకెవరికీ నచ్చని విషయాల గురించి వ్యాసాలు రాసే స్వతంత్రం నాకుంది. మీకు నచ్చకపోతే వాటి జోలికి పోవద్దు. అనవసరంగా వారిని చులకనగా మాట్లాడడం బాగులేదు. రెడ్డి గార్ని మార్పులు చేయవద్దని చెప్పడానికి మీకెవరికీ అధికారం లేదు. గాడిదపాలు కూడా గాడిద పిల్లకు తల్లిపాలుగా మంచి ఆరోగ్యాన్నిస్తాయి. దయచేసి ఇక్కడితో ఈ చర్చ ఆపండి.Rajasekhar1961 (చర్చ) 09:10, 5 అక్టోబర్ 2013 (UTC)
రాజశెఖర్ గారు బహుశా నా అభిప్రాయాన్ని misinterpret చేసారనిపిస్తుంది. అందుకే ఈ చిన్ని వివరణ. నేను ఏ సభ్యుడిని (ముఖ్యంగా రెడ్డి గారిని) ఉద్దేశించి వ్రాయలేదు మరియు చులకనగా చూడలేదు. అలాగే నేను చిన్న దిద్దుబాట్లకు వ్యతిరేకం కాదు, ఎందుకంటే వాటికీ కూరలో ఉప్పులాగా వ్యాసాల నాణ్యత అభివృధ్ధిలో విలువ ఉంటుంది. కాకపోతే కేవలం దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికే అన్నట్టుగా, (మనందరదైన) తెవికీ నాణ్యతను పక్కనపెట్టి, ఎవరైనా పనిచెస్తే అది నేను అభినందించలేను. వేమన గారన్నట్టు గాడిదపాలు కేవలం గాడిద పిల్లకు మాత్రమే ఉపయోగపడతాయి కాని ఇతరులకు కాదు కదా? మనందరం కూడా విజ్ఞానాన్ని పదిమందికి స్వేచ్ఛగా ఇవ్వలనుకుంటున్నాము దానికై కృషి చేస్తున్నాము కాని మన దిద్దుబాట్ల కోసం కాదు కదా? ఇది అందరూ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా మరియు ముఖ్యంగా నేను చెప్పదలచినది ఏమిటంటే నేను చేసింది ఒక జనరిక్ (Generic) సూచన మాత్రమే. నేను వ్రాసిన దాని వలన ఏ సభ్యుడికైనా మనస్తాపం కలిగితే సద్మనస్సుతో క్షమించ నివేదన. మీ... --విష్ణు (చర్చ)07:00, 8 అక్టోబర్ 2013 (UTC)
సభ్యులందరూ నన్ను క్షమించాలి. అనుకోకుండా కొన్నాళ్ళు పనిమీద వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని చర్చను కొనసాగించలేకపోయాను. చంద్రకాంతరావు గారూ, చిన్న దిద్దుబాట్లకు, సునాయాస దిద్దుబాట్లకు మధ్యన తేడా కొంత అర్థం అయ్యింది. అన్ని చర్యలను నేను భరించాలని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. కానీ మీరు {"నేను రెండు-మూడు దిద్దుబాట్లతో రచించిన ఒక పెద్ద వ్యాసాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలోనే దాదాపు 20 మార్పులు చేయడంతో (అసలు ఒకేఒక్క మార్పుతో జరుగవలసిన ఆ దిద్దుబాటుకై ఆ సభ్యుడు ప్రతీ విభాగం తెరిచి భద్రపర్చడం వల్ల)"} అని చెప్పిన ఉదాహరణలో నాకు సాంకేతికంగా తప్పేమీ కనిపించలేదు. దీని వళ్ళ ఆ వ్యాసపు నాణ్యతకు వచ్చిన ఇబ్బందేమిటి? ఆ ఇరవై చిన్న మార్పులు దుశ్చర్యలైతే అది వేరే విషయం. ఈ ఫలానా సభ్యుడు/సభ్యురాలు కేవలం దిద్దుబాట్లు పెంచుకోవటానికే అలా చేశారని మీ ఉద్దేశిస్తున్నారు. అవును కేవలం దిద్దుబాట్లు పెంచుకోవటానికే అలా చేసి ఉండే అవకాశం ఉన్నది. కానీ మీరు అవతలి పార్శ్వాన్ని విస్మరిస్తున్నారు. కొన్ని సార్లు దిద్దుబాటు ఘర్షణ ఏర్పడుతుందేమోనన్న భయంతో లేదా ఇతర పనులు చేస్తూ దిద్దుబాట్లు చేస్తున్నప్పుడు నేనూ ఇలా విభాగపు దిద్దుబాట్లు చేశాను. అలా ఆ సదరు సభ్యుడు/సభ్యురాలు కూడా సదుద్దేశంతో చేశారేమో? మీరు ఒక్కసారి కాదు చాలా సార్లు గమనించానని అంటారు. కానీ సదుద్దేశంతో చేశారనే అనుకోలు అన్ని వేళలా వర్తిస్తుంది. మనం ఉద్దేశాలను నిరూపించడం కష్టం. అయితే ఆంగ్ల వికీలో లాంటి వికీల్లో ఒక దిద్దుబాటుతో చేసేపనికి, పది చిన్న దిద్దుబాట్లు చేసే వాడుకర్లను పరిణితి చెందిన వాడుకరులుగా పరిగణించరు. నాణ్యత దెబ్బతిననంతవరకూ, దుశ్చర్య కానంతవరకు ఏం చెయ్యలేం. That is the nature of the beast. (ఇదియే వికీపీడియా సంపాదకత్వం అనే మృగం యొక్క ప్రవృత్తి..కామేడీ కోసమే తర్జుమా చేశాను) చర్చను సామరస్యంగా కొనసాగించినందుకు ధన్యవాదాలు.
రాజశేఖర్ గారూ, వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇలాంటి ఆరోపణలు చాలామటుకు నాకూ వర్తిస్తాయి. నేనూ చాలా సార్లు చిన్న దిద్దుబాట్లు చేసాను. వికీపీడియనుగా పరిణితి చెందుతూ వివిధ స్థాయిల్లో ఇలాంటివి "తప్పిదాలు" చాలానే చేశాను. మనం తప్పులు చేస్తూ, నేర్చుకుంటూ ఎదిగినట్టే ఇతర ఎదిగే వికీపీడియన్లకు కూడా అలా పరిణితి చెందే అవకాశం ఇవ్వాలి.
పాటలు వగైరా తెవికీలో ఉంటటానికి వీలులేదు. సదరు సభ్యులకు వివరించి, వాటిని తొలగించాలి
చివరగా చంద్రకాంతుల వారికి (కేవలం సోదరభావంతోనే అలా సంబోధించాను, ఇంకే ఉద్దేశం లేదు ;-)..బాబోయ్ మీతో చర్చ అంటే ఉద్దేశాలను చాలా జాగ్రత్తగా విశదపరచాలండీ ;-)) మనం ఇలాంటి ఎన్ని "ఉపద్రవాలు", "అల్లకల్లోలాలు" వచ్చిపోవటం చూడలేదు. we will survive one more day, one more year and one more decade and make it better every day. తిరిగి వికీలో క్రియాశీలకంగా వ్రాస్తారని ఆశిస్తున్నాను --వైజాసత్య (చర్చ) 08:08, 19 అక్టోబర్ 2013 (UTC)
ఈ చర్చ ప్రారంభించడానికి ఇద్దరు సభ్యుల దిద్దుబాట్లు కారణం. చర్చ ప్రారంభించి 3 వారాలు గడిచిననూ, చర్చ పరిమాణం పెరిగిననూ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. అనవసరంగా మనం మనం కొట్టుకొని ఛస్తున్నాం! (సందర్భానుసారంగా అర్థం చేసుకోండి) కాని ఆ సభ్యుల ధోరణి మాత్రం ఏమీ మారలేదు. ఒక సభ్యుడు ఒక సునాయాస దిద్దుబాటు నుంచి మరో సునాయాస దిద్దుబాటుకు మారుతుంటే (వెనక్కి వెళ్ళి బాగా గమనించండి), మరో సభ్యుడు కాపీ వ్యాసాలను, పెద్ద టైటిళ్ళను చేర్చడం, సూచనలు ఉల్లంఘించడంతో (ఇదీ గమనించండి) రచ్చబండ చర్చలకు విలువ లేనట్లుగా (సభ్యులు ఇవ్వనట్లుగా!) పరిగణించాల్సి ఉంటుంది. చర్చయే దారిమారింది కాని సభ్యులు మాత్రం అసలుదారికి రాకపోవడం విచారించదగ్గ విషయం. ఐదారేళ్ళ క్రితం తెవికీలో వైజాసత్య గారు చెప్పినట్లు ఉపద్రవాలు, అల్లకల్లోలాలు వచ్చాయి. అలా వచ్చిననూ మనం తట్టుకొని నిలబడ్డాం, మరి ఇప్పుడు వానచినుకులకే తట్టుకోలేకపోతున్నాం (అవునా!). సి. చంద్ర కాంత రావు- చర్చ 16:43, 19 అక్టోబర్ 2013 (UTC)
మరింత విశదంగా చెప్పాలంటే సునాయాస దిద్దుబాట్లంటే బాటుద్వారా చేసే దిద్దుబాట్లే. అవి ఒకటో రెండో అయితే ఫర్వాలేదు కాని వందల్లో చేయాల్సివస్తే మాత్రం తప్పనిసరిగా బాటు సభ్యత్వం ఉన్నవారికి నివేదిస్తే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పిననూ సభ్యులలో మార్పు రావడం లేదంటే ఖచ్చితంగా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నారని స్పష్టమౌతోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:29, 20 అక్టోబర్ 2013 (UTC)
వారి కది ఆసక్తి కాబట్టి చేస్తుండవచ్చు. బాట్లు వాడేవారు కూడా పెద్దగాలేరు. వారు ఎంతత్వరగా బాటు నడపగలుగుతారో తెలియదు. కాబట్టి సభ్యులు బాట్ నేర్చుకోవడమే మంచిది. నేను ఆ విషయమై వాడుకరి:YVSREDDY గారికి ప్రతిపాదించాను. పెద్దమార్పులు చేయబోయేముందు తగువిధంగా ప్రకటించి చేస్తే వాళ్లు హాట్ కేట్ వాడినా ఫరవాలేదు. మీకింకా ఇబ్బంది ఏమైనా వుంటే దాన్ని స్పష్టంచేయండి. పరిష్కారాలు చర్చలద్వారా కనుక్కోవచ్చు,--అర్జున (చర్చ) 13:51, 21 అక్టోబర్ 2013 (UTC)
ఎవరికీ ఇబ్బందిగా లేనప్పుడు నాకూ లేనట్లుగానే భావిస్తాను. చర్చలోపాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:33, 21 అక్టోబర్ 2013 (UTC)

కొత్త విక్షనరీ నిర్వాహకులు జాబితా

మార్చు

ఈ క్రింద పొందుపరచిన కొత్త విక్షనరీ నిర్వాహకులు జాబితాను పాతవారు (సభ్యులు) ఒకసారి పరిశీలించండి . నిర్వాహకుల జాబితాలోని తేదీలను సరి చేయండి.

  • Bhaskaranaidu (చర్చ | రచనలు)‏‎ (నిర్వాహకుడు) (సెప్టెంబరు 30, 2011 న 22:36కి చేరారు)
  • Rajasekhar1961 (చర్చ | రచనలు)‏‎ (నిర్వాహకుడు) (జూన్ 30, 2007 న 11:19కి చేరారు)
  • T.sujatha (చర్చ | రచనలు)‏‎ (నిర్వాహకురాలు) (సెప్టెంబరు 20, 2006 న 16:34కి చేరారు)
  • వైజాసత్య గారిది అసలు లేదు. నా పేరు అసలు లేనే లేదు. గమనించండి.
  • ఎవరెవరు నిర్వాహకత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో తెలియ జేయండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 10:21, 29 సెప్టెంబర్ 2013 (UTC)

  • మీరు తెలిపినది ఈ లింకు ద్వారా వచ్చిన వివరణ గురించి అయితే, ఇది ప్రస్తుతము హక్కులు గలవారి వివరాలు మాత్రమే తెలుపుతుంది. కాలానుగుణంగా వివరాలు కావాలంటే మానవీయంగా పేజీ చేర్చి మార్పులు చేరుస్తూవుండాలి. విక్షనరీలో అటువంటిది ప్రారంభించి ఇక్కడ రచ్చబండలో వ్యాఖ్యతో లింకు చేర్చితే ఈ మధ్య విక్షనరీలో పనిచేయనివారు సహాయపడడానికి వీలవుతుంది. --అర్జున (చర్చ) 03:41, 2 అక్టోబర్ 2013 (UTC)