వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 81

పాత చర్చ 80 | పాత చర్చ 81 | పాత చర్చ 82

alt text=2021 మే 1 - 2021 జూన్ 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2021 మే 1 - 2021 జూన్ 30

Invitation for Wikipedia Pages Wanting Photos 2021 మార్చు

Hello there,

We are inviting you to participate in Wikipedia Pages Wanting Photos 2021, a global contest scheduled to run from July through August 2021.

Participants will choose among Wikipedia pages without photo images, then add a suitable file from among the many thousands of photos in the Wikimedia Commons, especially those uploaded from thematic contests (Wiki Loves Africa, Wiki Loves Earth, Wiki Loves Folklore, etc.) over the years.

In its first year (2020), 36 Wikimedia communities in 27 countries joined the campaign. Events relating to the campaign included training organized by at least 18 Wikimedia communities in 14 countries.

The campaign resulted in the addition of media files (photos, audios and videos) to more than 90,000 Wikipedia articles in 272 languages.

Wikipedia Pages Wanting Photos (WPWP) offers an ideal task for recruiting and guiding new editors through the steps of adding content to existing pages. Besides individual participation, the WPWP campaign can be used by user groups and chapters to organize editing workshops and edit-a-thons.

The organizing team is looking for a contact person to coordinate WPWP participation at the Wikimedia user group or chapter level (geographically or thematically) or for a language WP. We’d be glad for you to reply to this message, or sign up directly at WPWP Participating Communities.

Please feel free to contact Organizing Team if you have any query.

Kind regards,
Tulsi Bhagat
Communication Manager
Wikipedia Pages Wanting Photos Campaign
Message delivered by MediaWiki message delivery (చర్చ) 03:54, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Call for Election Volunteers: 2021 WMF Board elections మార్చు

Hello all,

Based on an extensive call for feedback earlier this year, the Board of Trustees of the Wikimedia Foundation Board of Trustees announced the plan for the 2021 Board elections. Apart from improving the technicalities of the process, the Board is also keen on improving active participation from communities in the election process. During the last elections, Voter turnout in prior elections was about 10% globally. It was better in communities with volunteer election support. Some of those communities reached over 20% voter turnout. We know we can get more voters to help assess and promote the best candidates, but to do that, we need your help.

We are looking for volunteers to serve as Election Volunteers. Election Volunteers should have a good understanding of their communities. The facilitation team sees Election Volunteers as doing the following:

  • Promote the election and related calls to action in community channels.
  • With the support from facilitators, organize discussions about the election in their communities.
  • Translate “a few” messages for their communities

Check out more details about Election Volunteers and add your name next to the community you will support in this table. We aim to have at least one Election Volunteer, even better if there are two or more sharing the work. If you have any queries, please ping me under this message or email me. Regards, KCVelaga (WMF) 05:21, 12 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కాలదోషం పట్టే వ్యాసాలపై చర్యలు మార్చు

కాలదోషం పట్టిన/పట్టే వ్యాసాలను గుర్తించడం, వాటిపై తగు చర్యలు తీసుకోవడంపై ఒక చిన్నపాటి వికీపీడియా వ్యాసం రాసాను. వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో ("కాలదోషం పట్టే వ్యాసాలను గుర్తించడం ఎలా" విభాగం) దాన్ని చూడవచ్చు. పరిశీలించండి. __‎‎ చదువరి (చర్చరచనలు) 10:23, 15 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:14, 15 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపిడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 మార్చు

జూలై ఆగష్టు నెలలలో జరగబోయే వికీపిడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా కమ్యూనిటీ తరఫున నిర్వహించడానికి ఉత్సాహం చూపుతున్నాను. ఈ విషయంలో గౌరవ వికీపీడియన్‌లు తమ సహకారాన్ని అందించాలని కోరుతున్నాను. స్థానికంగా బహుమతులు, ఇతర ఖర్చుల కోసం రాపిడ్ గ్రాంటు కొరకు ఇక్కడ దరఖాస్తు చేశాను. సభ్యులు దయచేసి తమ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. --స్వరలాసిక (చర్చ) 12:19, 15 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@స్వరలాసిక గారూ, మొదటి లింకులో ఏదో తప్పుంది, చూడండి. __ చదువరి (చర్చరచనలు) 03:22, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక గారూ, మీరు గ్రాంటు ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. Wikipedia Pages Wanting Photos 2021 అనేది - ఈసరికే కామన్సులో ఉన్న ఫొటోలను ఈసరికే ఉనికిలో ఉన్న పేజీల్లో చేర్చే ఉద్యమం. కొత్తగా ఫొటోలను ఎక్కించే పోటీ కాదని నాకు తోస్తోంది. ఒకవేళ అదే అయితే, గ్రాంతు అక్కరలేదు కదా? పరిశీలించండి. లేక నా అవగాహనలో లోపమేదైనా ఉందా?__ చదువరి (చర్చరచనలు) 03:33, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఓహో నాకు అర్థమైంది. ఆ డబ్బులతో ఇక్కడ పోటీ పెట్టి బహుమతులు ఇవ్వాలనేది మీ ఆలోచన కదా? బానే ఉంది సార్.__చదువరి (చర్చరచనలు) 03:37, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సముదాయ సభ్యులందరికీ.. ఈ పోటీకి సంబంధించి స్థానిక వికీల్లో ప్రైజులు ఇచ్చేందుకు అవసరమైతే గ్రాంట్లు కోరమని కూడా మెటావారు చెప్పారు. ఆ వివరం ఇక్కడ చూడవచ్చు.__ చదువరి (చర్చరచనలు) 03:39, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@స్వరలాసిక, నేను మద్దతు రాసాన్సార్ __ చదువరి (చర్చరచనలు) 03:45, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపిడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా కమ్యూనిటీ తరఫున నిర్వహించడానికి ఉత్సాహం చూపుతున్న స్వరలాసిక గార్కి ధన్యవాదాలు.నాకు ఈ దిగువ వివరించినవాటిపై వివరణ కూడా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
1.ఫోటోలు కోరుకునే పేజీలు ఇప్పటికి ఎన్ని ఉన్నాయి.
2.అన్ని పేజీలకు ఎక్కించటానికి అవసరమైన ఫోటోలు ఎన్ని ఉన్నాయి.
3.ఇంకా కొత్తగా ఫొటోలు తీసి ఎక్కించాల్సిన అవసరం ఉంటుందా?
పై వివరాలు అవకాశం ఉంటే తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 06:23, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారూ! పైన యర్రా రామారావు గారు లేవనెత్తిన అంశాల గురించి మీరే సమాధానం చెప్పగలరు సార్. నాకు ఈ గణాంకాలను ఎలా తీయాలో తెలియదు. కానీ వారు లేవనెత్తిన 3వ పాయింటుకు సమాధానం అవసరం ఉండక పోవచ్చు. ఒక వేళ కొత్త ఫోటోలు కామన్స్‌లో ఎక్కిస్తే మంచిదే.--స్వరలాసిక (చర్చ) 07:13, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు దీని మీద పనిచేసేంత సమయం లేదుగానీ, కింది లెక్కలు చూడండి:
1. మొదటి దానికి వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు వర్గంలోని పేజీలను పరిగణించవచ్చు. ఆ వర్గం లోని పేజీల్లో కొన్నిటిలో బొమ్మలను చేర్చి ఉండవచ్చు. చాలా వరకు (సుమారొక 10 వేలు) పేజీల్లో ఉండవు.
2. వికీపీడియా కామన్సులో ఎన్ని ఫొటోలున్నాయో చూస్తే తెలుస్తుంది. వాటికి తోడు మన దగ్గర 12 వేలకు పైగా ఉన్నట్టున్నై. వీటన్నిటి లోంచి వ్యాసానికి పనికొచ్చే దేన్నైనా వాడుకోవచ్చు.
__చదువరి (చర్చరచనలు) 07:21, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ! "వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు" లో 11,752 పేజీలు ఉన్నాయి. అయితే ఇవి సరైన సంఖ్య అని చెప్పలేము.--స్వరలాసిక (చర్చ) 07:17, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఖచ్చితమైన సంఖ్య 11538 (ప్రధానబరిలో బొమ్మలున్నవాటిని, ఇతర పేరుబరుల్లో ఉన్నవాటినీ తీసెయ్యగా) __ చదువరి (చర్చరచనలు) 07:33, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మన లక్ష్యం కనీసం 2000 పేజీలలో బొమ్మలు ఎక్కించడం కనుక సులభంగా సాధించవచ్చు అనుకుంటున్నాను. --స్వరలాసిక (చర్చ) 07:38, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ కార్యక్రమానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:13, 18 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం. దీనికి నా మద్దతు కూడా ప్రకటిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:38, 19 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారు, ఇందులో వాంలంటీర్ గా చేరటానికి ప్రపొజల్ పేజీలో అసక్తి కనపరచాను, నేను ఏమి చేయగలనో చెప్పగలరు -- Kasyap (చర్చ) 10:13, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రాజెక్టుకోసం దరఖాస్తు చేసిన రాపిడ్ గ్రాంట్ ఆమోదించబడినదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ పేజీని ఇక్కడ చూడండి. వికీపీడియాలో చురుకుగా ఉన్న మరియు ఆసక్తి ఉన్న ఇతర వాడుకరులు అందరూ ప్రాజెక్టు పేజీలో సంతకం చేసి, ఈ ప్రాజెక్టులో పాల్గొని దానిని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 09:39, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమా పేజీల ఎర్రలింకులు మార్చు

తెలుగు సినిమాలకు సంబంధించి, 1170 ఎర్రలింకులను వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/అవసరమైన పేజీలు పేజీలో జాబితాగా చేసిపెట్టాను. దాన్ని పరిశీలించి, ఆ ఎర్ర లింకులపై తగు చర్య తీసుకోవాలని ఆసక్తి గల వాడుకరులకు వినతి. __ చదువరి (చర్చరచనలు) 03:21, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సినిమాల ఎర్రలింకు పేజీల జాబితా తయారుచేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు. అయితే, ఆ జాబితాలోని కొన్ని పేజీలకు అక్షర బేధాలతో వ్యాసాలు ఉన్నాయి. కాబట్టి, వ్యాసాన్ని సృష్టించేముందు పలు రకాలుగా వెతికి రాయాల్సివుంటుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:46, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఔను, @Pranayraj1985 గారు. ఆ పేజీ ప్రవేశికలో ఐదవ పాయింటు కింద ఉన్న 4 ఉప పాయింట్లను చూడండి.__ చదువరి (చర్చరచనలు) 06:07, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చూసానండీ. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:14, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, మీరు ఆ పేజీలో లింకులు కలపడం చూసాను. చివరి నిలువు వరుసలో టిక్కు పెట్టి ఉంటే దానర్థం, ఆ ఎర్ర లింకు ఉన్న పేజీలో దానికి సంబంధించిన సవరణ జరిగినట్లే అర్థం. ఇప్పుడు ఇక్కడ లింకులు కలపాలసిన పనిలేదు. గమనించగలరు. __ చదువరి (చర్చరచనలు) 06:15, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:40, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక గమనిక: ఎర్రలింకులను సవరించాల్సినది ఈ ప్రాజెక్టు పేజీలో కాదు, ఆ ఎర్రలింకులున్న జాబితా పేజీలో! అక్కడ లింకులను సవరించాక, ఈ ప్రాజెక్టు పేజీలో లింకును సవరించడం గాని, లేదా చివరి గడిలో టిక్కు పెట్టడం గానీ ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి. లేదా రెండూ చెయ్యవచ్చు. కానీ జాబితా పేజీలో లింకు సరిచెయ్యకపోతే, ఈ ప్రాజెక్టు పేజీలో ఎంత పనిచేసినా వృథాయే! __ చదువరి (చర్చరచనలు) 06:59, 16 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మరణ వివరాలను చేర్చేటపుడు ఏమేం చెయ్యాలి మార్చు

వ్యక్తుల పేజీల్లో మరణ వివరాలను చేర్చేటపుడు ఏయే వివరాలను చేర్చాలో తెలియజెప్పే వివరాలతో ఒక చెక్‌లిస్టును వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "మరణ వివరాలను చేర్చేటపుడు" అనే విభాగంలో చేర్చాను. పరిశీలించి, తగు మార్పుచేర్పులు చెయ్యండి. చదువరి (చర్చరచనలు) 05:23, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 05:42, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఎప్పటి నుంచో రాయాలనుకుంటూ ఉన్నది మీరు రాశారు చదువరి గారూ, ధన్యవాదాలు. రవిచంద్ర (చర్చ) 07:36, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా..? మార్చు

మొదటి పేజీ లోని "మీకు తెలుసా?" శీర్షికలో ఏయే వ్యాసాల్లోని విశేషాలను చేర్చామో ఎలా తెలుస్తుంది? ఏనాడో రాసిన వ్యాసంలో మనం గమనించిన విశేషాన్ని ఇప్పుడు చేర్చాలని ఒకవేళ భావిస్తే, దాన్ని ఈసరికే చేర్చారో లేదో తెలుసుకోవడం ఎలా?

{{మీకు తెలుసా}} అనే మూస ఒకటి మనకుంది. దీన్ని గతంలో వ్యాసాల చర్చ పేజీల్లో చేర్చేవారు. అలా చేరిస్తే ఆ చర్చ పేజీ వర్గం:మీకు తెలుసా వ్యాసాలు అనే వర్గంలో చేరే ఏర్పాటు చేసాను (ఈ ఏర్పాటు ఈరోజే చేసాను). కానీ గతంలో వాడిన ఈ మూసను ప్రస్తుతం వాడడం లేదు. ఎందుకు ఆపేసారో తెలియదు. "మీకు తెలుసా?" శీర్షికను తాజాకరించిన వారు, తాజాకరిస్తున్నవారు చెప్పగలరని భావిస్తున్నాను. వారిచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తాను. __ చదువరి (చర్చరచనలు) 06:08, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలుసా కోసం వాక్యాలు రాస్తున్నాను. దీనికి నేను పెట్టుకున్న నియమం, ప్రతి రోజు కొత్త పేజీలు పరిశీలించడం, అందులో ఆసక్తి కరమైన అంశాలుంటే వాటిని వాక్యాలుగా రాయడం. అయితే ఈ వాక్యాలు మొదటి పేజీలో ప్రముఖంగా చూపిస్తాము కాబట్టి కనీస మూలాలున్న వ్యాసాలనే ఎంచుకుంటున్నాను. అన్నిసార్లు నాకు కొత్త వ్యాసాల్లోనే మంచి వాక్యాలు దొరకడం లేదు. అలాంటప్పుడు ఇటీవలి మార్పులు లోని దిద్దుబాట్లు పరిశీలించి అందులో ఆసక్తికరమైన వాక్యాలు కూడా చేరుస్తున్నాను. ఇటీవలి మార్పులు లోని ఆ వ్యాసం ఇదివరకే మీకు తెలుసా వాక్యాల్లో వాడామా లేదా అనేది నేను ఎడమవైపున పరికరాల పెట్టెలో ఉన్న ఇక్కడికి లింకులున్న పేజీలు చూసి ఇదివరకే ఈ వ్యాసాన్ని వాడలేదు అనే నిర్ధారణకు వస్తాను. ఈ పద్ధతి సరైంది కాదో నాకు తెలియకపోయినా వాక్యాలు కొంచెం ఆసక్తికరంగా ఉంచడం కోసం నాకు తప్పడం లేదు. ఒక్కోసారి ఈ వాక్యాలు ఆసక్తికరంగా ఉంచడం కోసం, వైవిద్యం చూపించడం కోసం నేను మొలకలు ప్రారంభించిన రోజులు కూడా ఉన్నాయి.
ఇక మీకు తెలుసా మూస ఒకటి ఉన్నట్లు, ఒక వ్యాసాన్ని ఆ వాక్యాల్లో వాడితే ఈ మూస ఆ వ్యాసంలో/చర్చా పేజీలో చేర్చాలి అనే సంగతి నిజంగా తెలియదు. ఇక నుంచి చేరుస్తాను.
నేనీ మధ్య అనారోగ్య కారణంగా తెవికీకి దూరంగా ఉన్నప్పుడు ఎడమవైపున ఉన్న కొత్తపేజీలు అనే లింకు తీసేసినట్లు తెలుస్తోంది. దాంతో నా పని కొంచెం కష్టమవుతోంది. వీలైతే ఆ లింకును పునరుద్ధరించాలి. రవిచంద్ర (చర్చ) 07:34, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎప్పట్లాగానే బాగుందని ఆశిస్తాను. ఈ కోవిడ్ రోజుల్లో, అది కాకుండా వేరే ఏ అనారోగ్యమొచ్చినా కూడా ఆసుపత్రికి వెళ్ళాలంటే భయమేస్తోంది -అక్కడ వైరస్ అంటుకుంటుందేమోనని.
ఆ మీకు తెలుసా మూసను పాత పేజీల్లో కూడా పెట్టేసే ఏర్పాటు తేలిగ్గా చెయ్యగలమేమో చూద్దామని నా ఉద్దేశం. ఐతే ఆ పని చేసే ముందు అసలు వాదకపోడానికి కారణమేమైనా ఉందేమో తెలుసుకుందామని అడిగాను, అంతేనండి. పోతే, ఇక్కడికి లింకున్న పేజీలులో వెతకడం మంచి పద్ధతి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 08:17, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, 2013 నుండి నేను ఈ శీర్షికన వివిధ కొత్త వాక్యాలలోని వ్యాసాలను చేర్చుతున్నాను. కొత్త పేజీలలోని వాక్యాలను, మొలకలను అభివృద్ది చేయునపుడు అందులో ఆసక్తి గల అంశములను కూడా చేర్చాను. {{మీకు తెలుసా}} మూస ఉందని కొంత కాలానికి తెలిసింది. దానిని 2015 లో కొన్ని వ్యాసాలలో ఉపయోగించాను. పని ఒత్తిడి వలన తరువాత కాలంలో అనేక వ్యాసాల చర్చాపేజీలో ఆ మూసను చేర్చడం లేదు. తప్పని సరిగా చేరిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా పాత వ్యాసాలలో ఏదైనా విధానంలో ఆ మూసను చేర్చితే బాగుంటుంది.➠ కె.వెంకటరమణచర్చ 08:29, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@K.Venkataramana గారూ ధన్యవాదాలు. ఈ మూసను చేర్చేందుకు సమస్యలేమీ లేవని ప్రస్తుతం అర్థమౌతోంది కాబట్టి, పాత మీకు తెలుసా వ్యాసాల చర్చపేజీల్లో కూడా ఈ మూసను చేర్చే విషయాన్ని పరిశీలిద్దాం. __ చదువరి (చర్చరచనలు) 09:19, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, కొత్త పేజీలు లింకు కనబడ్డం లేదని అడిగారు, నేను దానికి సమాధానమివ్వడం మర్చిపోయాను - దాన్ని నేను తీసెయ్యలేదండి. ఈ చర్చ పేజీలు చూస్తే మీకు వివరం తెలుస్తుంది - మీడియావికీ చర్చ:Sidebar, మీడియావికీ చర్చ:Common.css __   చదువరి (చర్చరచనలు) 10:36, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
డేటాబేసును వెతకడం ముగించాక, కింది విషయాలు నా దృష్టిలోకి వచ్చాయి.
  1. మీకు తెలుసా నుండి మొత్తం 2763 వ్యాసాలకు లింకులున్నై. వీటిలో కొన్ని ఈ వారం బొమ్మ లింకులు, ఇతర లింకులూ కూడా ఉన్నై. కానీ అవి చాలా తక్కువ కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోనక్కర్లేదు.
  2. తెలుగు అనే వ్యాసం 16 సార్లు మీకు తెలుసా లోకి వచ్చింది. ఇవన్నీ తొలి నాలుగు పాత పేజీల్లోనివే. ఈ 16 లో ఒకే అంశాన్ని రాసారో లేదో చూడాల్సి ఉంది.
  3. 3 సార్లు వచ్చినవి 30 పేజీలున్నై
  4. 2 సార్లు వచ్చినవి 144 పేజీలున్నై.
ఇక మిగతా 2585 ఎంట్రీలు ఒక్కసారి వచ్చినవే. పునరుక్తాలు చాలా తక్కువగా ఉన్నై. పై లెక్కలను బట్టి మనకు అర్థమౌతున్నదేంటంటే, పన్నెండేళ్ళకు పైగా నిర్వహిస్తూ కూడా పునరుక్తాలు లేకుండా చూడడంలో ఈ శీర్షికను నిర్వహించినవారు చాలా సమర్థంగా పనిచేసారు అని. వారందరికీ - ఈ చర్చలో తమ పాల్గొని మూసపై తమ అభిప్రాయాలు చెప్పిన @రవిచంద్ర, @K.Venkataramana గార్లు కూడా ఈ శీర్షికను సుదీర్ఘ కాలం పాటు నిర్వహించారు. వారితో సహా మిగతావారందరికీ - ధన్యవాదాలు.
ఇక, ఏయే పేజీల్లో మూసను పెట్టాలో మనకిప్పుడు తెలిసిపోయింది. వీటన్నిట్లోనూ పెట్టాల్సిన మూస ఒకటే గానీ, దానికి ఇవ్వాల్సిన రెండు పరామితులు మాత్రం మారుతూంటాయి. ఈ పరామితులు లేకపోతే, మూసను చేర్చడం AWB తో చేసెయ్యవచ్చు. అది నే చేసెయ్యగలను. కానీ పరామితులు పెట్టాలి కాబట్టి ఆ పరామితులను ఆటోమాటిగ్గా ఎంచుకోవాలంటే బాటు లాంటిది కావాలి. కానీ ఆ విద్య నాకు రాదు. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఈ పని చేపట్టగలరు. ఎవరూ ముందుకు రాకపోతే, అప్పుడు చూద్దాం. __ చదువరి (చర్చరచనలు) 09:42, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
బాటు గురించి ఎవరూ స్పందించనందున AWB తో కింది విధంగా పని చేస్తున్నాను:
  1. మూసలో తేదీని చేర్చకుండా (నెల, తేదీ) సంవత్సరాన్ని మాత్రమే చేరుస్తున్నాను. తద్వారా ఆఅయా పేజీలు సంవత్సరానికి చెందిన వర్గం లోకి చేరుతాయి. అంటే ఈ మూసను చేర్చ పేజీలు వర్గం:మీకు తెలుసా వ్యాసాలు - 2007‎, వర్గం:మీకు తెలుసా వ్యాసాలు అనే రెండు వర్గాల్లోకి చేరుతాయి. వర్గం, ఉపవర్గం రెండింటి లోకీ చేర్చడానికి కారణం - తేలిగ్గా వెతక గలిగే అవకాశం కల్పించడమే.
ఇకపై "మీకు తెలుసా" లో కొత్త విశెషాన్ని చేర్చదలిస్తే పై వర్గాల్లో పరిశీలించవచ్చు. అయితే ఇది మూడో పద్ధతి మాత్రమే. దీనికంటే ఉత్తమ పద్ధతులు మరో రెండున్నై. అవి:
  1. వాడుకరి:రవిచంద్ర గారు పైన సూచించినట్లుగా "ఇక్కడికి లింకున్న పేజీలు" విశేషాన్ని వాడి తెలుసుకోవడం. ఇది అత్యుత్తమం
  2. "వికీపీడియా:మీకు తెలుసా? భండారము" పేజీలకు వెళ్ళి (1,2,3,4,.. వగైరా) అక్కడ మీ పేజీ లింకు ఉందేమో చూడడం. ఇది రెండో ఉత్తమ పద్ధతి
  3. ఇక మూడో పద్ధతి - ఇప్పుడు కొత్తగా చేరుస్తున్న వర్గాల్లో వెదకడం.
వాడుకరులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 07:31, 19 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గీకరణ మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు గాను కింది మార్పులు చేసాను:
  1. మూసలో ప్రచురితమైన సంవత్సరంతో పాటు ప్రచురితమైన వారాన్ని కూడా (గతంలో తేదీ ఉండేది. దాన్ని తీసేసాను) చేరుస్తున్నాను.
  2. సంవత్సరానికి లింకును ఆ సంవత్సరపు భండారానికి ఇస్తున్నాను. అది నొక్కితే ఆ చర్చ పేజీ నుండి నేరుగా భండారంలో సంబంధిత విభాగానికి వెళ్ళవచ్చు. దీని కోసం భండారపు పేరును "వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 12" అనే రూపం నుండి "వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2020" అనే రూపానికి తరలిస్తున్నాను.
ఈ పద్ధతిలో ఈ చర్చ పేజీ / వర్గాల ప్రయోజన స్థాయి మూడవ స్థానం నుండి మొదటి స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం 2020 సంవత్సరపు వర్గం పూర్తైంది. మీకు తెలుసా వ్యాసాలు - 2020 వర్గం లోని ఏదైనా పేజీని పరిశీలించి చూడండి. (భండారం పేజీల్లో 1 నుండి 9 వారాల విభాగాల పేర్లను 01,02,.. వగైరాలను 1,2,.. రూపం లోకి మార్చాల్సి ఉంది.) __ చదువరి (చర్చరచనలు) 16:51, 19 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వారపు బొమ్మ మార్చు

ఈ వారం వ్యాసం ప్రచురించేటప్పుడు మొదట ఈ వారం వ్యాసంగా ప్రచురించవలసిన వ్యాస చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} మూస చేర్చడం, ఈ వారం వ్యాస పరిగణనల వర్గంలోని వ్యాసాలను మొదటి పేజీలో ప్రచురించడం, ప్రచురించిన తరువాత ఆ వ్యాస చర్యా పేజీలో {{ఈ వారం వ్యాసం}} మూసను చేర్చడం ఆనవాయితీగా వస్తుంది. అదే విధానం ఈ వారం బొమ్మ శీర్షిక నిర్వహణలో కూడా ఉంది. కానీ అలా జరగడం లేదు. కొంతకాలం ప్రచురిత బొమ్మ చర్చా పేజీలో మూసలను చేర్చడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమం కూడా జరగడం లేదు. దీనిని కూడా పరిశీలనలోకి తీసుకోవాలని భావిస్తున్నాను.➠ కె.వెంకటరమణచర్చ 08:36, 17 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@K.Venkataramana గారూ, కొన్ని సందేహాలు:
  1. ఈ వారం బొమ్మగా కామన్సు లోని బొమ్మలను కూడా ఎంచుకుంటున్నట్టు గమనించాను. అది మన విధానమేనా?
  2. ఒకవేళ అలా ఎంచుకుంటే, దాని చర్చపేజీలో తెలుగు వికీపీడియాలో ప్రదర్శించినట్టుగా మూస పెట్టవచ్చా?
__ చదువరి (చర్చరచనలు) 09:27, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, ఈ వారం బొమ్మ నిర్థారించే విధానంలో వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు లోని విభాగంలో బొమ్మను ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు అనుసరించవలసిన విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రతిపాదిత బొమ్మ మన తెలుగు వికీపీడియాలో ఏదైనా పేజీలో ఉపయోగించాలనేది. అలా జరుగుతుండో లేదో తెలియదు. సుదీర్ఘ కాలం పాటు ఆదిత్య మాధవ్ గారు ఈ శీర్షికను నిర్వహించారు. అతను ఎలా బొమ్మల నిర్థారణ చేసి ప్రచురించారో తెలియదు. ఈ వారం వ్యాసం లాగానే తెలుగు వికీపీడియాలో ఉపయోగించే బొమ్మ చర్చా పేజీలో {{ఈ వారం బొమ్మ పరిగణన}} చేర్చాలనే నియమం ఉంది. ఆ బొమ్మలన్నీ వర్గం:ఈ వారం బొమ్మ పరిగణనలు లోని వస్తాయి. అందులోని బొమ్మలను వారాల వారీగా ప్రచురించాలి. కానీ చాలా సంవత్సరాలుగా అలా జరగడం లేదు. మనకు కామన్స్ లో కనిపించే ఏ మంచి చిత్రాన్నైనా తీసుకుని దానిని ప్రచురిస్తున్నారు.బొమ్మను చేర్చిన తరువాత ఆ బొమ్మ చర్చా పేజీలో మూసను తొలగించి {{ఈ వారం బొమ్మ|సంవత్సరం=2009|వారం=??}} అనే మూసను ఉంచాలనే నియమం ఉంది. కానీ అది పాటించడం లేదు. కొంత కాలం చర్చా పేజీలో అలా నిర్వహించడం కూడా జరిగింది. ఉదా: దస్త్రంపై చర్చ:Jain temple warangal.jpg చూడండి. చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుట లేదు. దానిని పరిశీలించాలి.
  1. మొదటి పేజీలో ప్రచురించవలసిన చిత్రాలు కామన్స్ లోనివి ఉండాలనే నియమం ఉంది. అందువలన ఈ వారం వ్యాస ప్రచురణలో కొన్ని వ్యాసాలలో ఫెయిర్ యూజ్ చిత్రం ఉన్నా ప్రచురించడం లేదు. నేను ఈ.వా.వ్యా నిర్వహణ ప్రారంభంలో ఫెయిర్ యూజ్ చిత్రం వాడితే అది మన విధానం కాదని నిర్వాహకులు తొలగించే వారు. అందువలన కామన్స్ చిత్రాలను వాడాలనే విధానం మనకు ఉందని అనుకుంటున్నాను.
  2. కామన్స్ ఉన్న చిత్రమైనా తెలుగు వికీపీడియాలో మనం మూస పెట్టవచ్చు. అది కామన్స్ పుట చర్చా పేజీలో కనిపించదు. ఉదా: వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 10వ వారం చూడండి. అందులోని చిత్రానికి సంబంధించి తెలుగు వికీపీడియాలో దస్త్రం:Red pottery, IVC.jpg లా ఓపెన్ అవుతుంది. దాని చర్చా పేజీలో దస్త్రంపై చర్చ:Red pottery, IVC.jpgలో ఈ వారం బొమ్మ పరిగణన మూసను పెట్టారు చూడండి. కానీ కామన్స్ లోని ఆ చిత్రం లింకు ను చూడండి. దాని చర్చాపేజీలో మనం చేర్చిన ఈ వారం బొమ్మ పరిగణన మూస కనిపించడం లేదు. కనుక బొమ్మ చర్చపేజీలో తెలుగు వికీపీడియాలో ప్రదర్శించినట్టుగా మూసను ఉంచవచ్చు.➠ కె.వెంకటరమణచర్చ 10:50, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
    @K.Venkataramana గారూ, మీరు చెప్పినట్టుగానే, 2016 నుండి ఇప్పటి వరకూ ప్రదర్శించిన బొమ్మల చర్చ పేజీల్లో {{ఈ వారం బొమ్మ}} మూసను చేర్చాను. అక్కడి నుండి సంబంధిత బొమ్మల జాబితా పేజీకి లింకు ఇచ్చాను. ఆ చర్చ పేజీని వర్గం:ఈ వారం బొమ్మలు వర్గం లోకి చేర్చాను. అయితే 2016 కు ముందున్న బొమ్మల్లో అన్నిటికీ ఈ మూసను పెట్టినట్టు లేదు. అలాంటి వాటిని ఎవరైనా గమనించి వాటిలో మూసను చేరిస్తే పని సంపూర్ణమౌతుంది. __ చదువరి (చర్చరచనలు) 05:06, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్రలో ఈ రోజు లో అజ్ఞాత వాడుకరుల దోషపు మార్పులు మార్చు

ఈ శీర్షికలో ఎవరో అజ్ఞాత వాడుకరి "ప్రముఖ వ్యక్తి ఓలేటి నాగేంద్ర రెడ్డి పుట్టిన రోజు [1989] ముందు జన్మలో స్వాతంత్ర్య సమర యోధుడు" అని చేర్చాడు. దాన్ని తొలగించాను. మొదటి పేజీ శీర్షికలను కొందరు మాత్రమే మార్పులు చేసేలా చేయలేమా? --స్వరలాసిక (చర్చ) 02:21, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని పేజీలను సంరక్షణ చేసినట్లే ఈ పేజీలకు కూడా అజ్ఞాత వాడుకరులు మార్పులు చేయకుండా ఉండేట్లు చేయగలము. ఈ క్షణంలో అలా చేయడం మంచిదే అని నాకు అనిపిస్తుంది. మిగతా సభ్యుల అభిప్రాయాలు కూడా కనుక్కుని చేద్దాం అని నా అభిప్రాయం. రవిచంద్ర (చర్చ) 05:27, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞాత వాడుకరులు మార్పులు చేయకుండా సంరక్షణలోపెట్టటం అవసరం.ఇలాంటి పేజీలకు తప్పదు. యర్రా రామారావు (చర్చ) 05:55, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో అనేక సార్లు అనామక వాడుకరులు అనవసర విషయాల్ని ఈ శీర్షికలో చేర్చడం గమనించాను. నిర్వాహకులు నిరంతరం పరిశీలించకపోతే అవి అలానే ఉండిపోతాయి. కనుక మొదటి పేజీ శీర్షికలలో అనామక వాడుకరులు మార్పులు చేయకుండా సంరక్షిస్తే మంచిది. ➠ కె.వెంకటరమణచర్చ 06:01, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతికూల స్పందనలేమీ లేనందున చరిత్రలో ఏ రోజు పేజీని అజ్ఞాత వాడుకరులు మార్పులు చేయకుండా సంరక్షణలో ఉంచాను. - రవిచంద్ర (చర్చ) 06:10, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా పాత విశేషాలను ఒక వరుసలో పేర్చినట్టే మార్చు

మొదటిపేజీలో మీకు తెలుసా? శీర్షికలో ప్రదర్శనకు నోచుకున్న విశేషాలకు చెందిన వ్యాసాలను వర్గీకరించడం పూర్తైంది. నేను చేసిన పని ఇది:

  1. ఆయా వ్యాసపు చర్చ పేజీలో, ఏ సంవత్సరం, ఏ వారంలో ఆ వ్యాసపు విశేషాన్ని ప్రచురించామో చూపిస్తుంది. ఆ సంవత్సరాన్ని నొక్కినపుడు పాత విశేషాల పేజీలో సంబంధిత విభాగానికి తిసుకుపోతుంది. వ్యాసం లోని ఏ విశేషాన్ని అక్కడ ప్రదర్శించామో తెలిసిపోతుంది.
  2. ఈ పేజీ మీకు తెలుసా వ్యాసాలు - <<సంవత్సరం>> అనే వర్గం లోకి దాని మాతృ వర్గం లోకీ చేరుతాయి. మాతృవర్గంలో చేర్చడం స్సరైన పద్ధతి కాకున్నప్పటికీ, వెతికేందుకు తేలిగ్గా ఉంటుందని అలా చేసాను. తీసేద్దామంటే తీసెయ్యొచ్చు. చిటికెలో పని.

దీనితో పాత విశేషాలపై మనకు మరింత నియంత్రణ వచ్చినట్టే. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 08:25, 21 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:42, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా పేజీల ఎర్రలింకులు మార్చు

సినిమా పేజీల్లో ఉన్న ఎర్ర లింకుల జాబితను తయారుచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/అవసరమైన పేజీలు పేజీలో పెట్టిన వెంటనే వాడుకరులు దానిపై పనిచేసి వాటిలో సగానికి పైగా లింకులను సరిచేసారు. ఇక మిగిలిపోయిన ఎర్రలింకులను ఏరి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/సృష్టించవలసిన పేజీలు అనే పేజీలో చేర్చాను. ఈ పేజీలోని ఎర్ర లింకులు 90% కి పైగా "నిజమైన ఎర్రవే". కాబట్టి వీటికి పేజీలను సృష్టించవచ్చు. కొత్త పేజీని సృష్టించేటపుడు మామూలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను వీటి విషయంలో కూడా తీసుకోవాలని గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 08:47, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే, ఇదే ప్రాఅజెక్టులో, వివిధ పేజీల నుండి అయోమయ నివృత్తి పేజీలకు ఉన్న లింకులను ఒక జాబితాగా చేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు/అయోమయ నివృత్తి పేజీలకు ఉన్న లింకులు పేజీలో పెట్టాను. పరిశీలించి తగు చర్య తీసుకోవలసినది. __ చదువరి (చర్చరచనలు) 09:01, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ. -- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:27, 22 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికల వాలంటీర్ పరిచయం మార్చు

తెలుగు వికీపీడియా సభ్యులకు నమస్కారం.

నేను, 2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికల వాలంటీర్ గా ఉన్నాను.

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనేది వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. వికీపీడియా సముదాయ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. వికీమీడియా కార్యకలాపాల్లో తెలుగు వికీపీడియా ప్రాతినిధ్యం, వైవిధ్యం, నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక మంచి అవకాశం.

2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికల గురించి పూర్తిగా తెలియజేయడమనేది ఎన్నికల వాలంటీర్ గా నా బాధ్యత.

మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నాకు తెలియజేయండి. - ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:54, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@Pranayraj1985 గారూ రెండు సంగతులు:
  1. ఈ ఎన్నికలకు సంబంధించిన లింకులివ్వండి.
  2. ఎన్నికల పద్ధతి - ఎలా జరుగుతాయి, ఎవరు వోటెయ్యొచ్చు, ఎవరు నిలబడుతున్నారు.. వగైరా - గురించి చెప్పండి.
__ చదువరి (చర్చరచనలు) 14:57, 25 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం చదువరి గారు, ఇందులో 2021 ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఎవరు వోటెయ్యొచ్చు అనే అంశానికి సంబంధించి 2017లో జరిగిన ఎన్నికల్లో ఓటరు సమాచారంలో చూడవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 04:43, 27 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  1. మన సముదాయం నుండి ఎవరైనా పోటీ చేయాలకుంటే వారికి నా బేషరత్తు తెలియచేసుకొంటున్నాను, దయచేసి మనలో ఒకరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో ఉంటే మేలు Kasyap (చర్చ) 11:09, 27 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 14:37, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా నుండి గ్రంథచౌర్యం మార్చు

తెలుగు వికీపీడియా లోని "చరిత్రలో ఈ రోజు" శీర్షిక లోని సమాచారాన్ని ఆదాబ్ హైదరాబాదు పత్రిక తీసుకుని తమ "చరిత్రలో నేడు" శీర్షికన ప్రచురిస్తోందని అర్జున గారు గతంలో సముదాయం దృష్టికి తీసుకువచ్చారు. అలా జరుగుతున్నట్లు ఈ రోజు కూడా నేను గమనించాను. తెరపట్టును కూడా సేకరించాను. ఈ విషయాన్ని గ్రంథచౌర్యం వ్యాసంలో వికీపీడియా నుండి దొంగిలించిన సందర్భాలు అనే విభాగంలో చేర్చాను. ఒకవేళ ఈ అంశాన్ని ఆ పత్రిక దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే, ఆ విషయాన్ని, ఆ పత్రిక వారి స్పందననూ ఇక్కడ తెలియజేయవలసినది. మరొక్క విషయం ఏమిటంటే గ్రంథచౌర్యం వాసాన్ని 32 వ వారంలో ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించాను. ఆ వారంలో ఈ వ్యాసాన్ని మామూలు కంటే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆ పత్రిక వారు వికీపీడియాకు తగు శ్రేయస్సును ఆపాదించినా, లేక చౌర్యాన్ని ఆపేసినా తెవికీ సముదాయానికి తెలియజేస్తే, ఆ విషయాన్ని కూడా గ్రంథచౌర్యం వ్యాసంలో చేరుద్దాం. వాడుకరులు ఈ అంశాన్ని పరిశీలించి తమ అభిప్రాయాలు తెలుపవలసినది. అలాగే ఇలాంటి కాపీ సంఘటనలు మరెక్కడైనా జరిగినట్లు గమనిస్తే తగు ఆధారాలను సేకరించి గ్రంథచౌర్యం పేజీలో చేర్చవలసినది.__చదువరి (చర్చరచనలు) 10:35, 28 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:40, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీల్లో ఎర్ర లింకులు మార్చు

ఒకే పేరుతో లేదా ఒకేలాంటి పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నపుడు వాటి లింకులను ఒక పేజీలో చేరుస్తూ అయోమయ నివృత్తి (అ.ని) పేజీలు తయారు చేస్తాం.

ఒకేలాంటి పేరుతో పేజీలు అసలంటూ ఉంటేనే అయోమయం కలుగుతుంది, అప్పుడే అ.ని. పేజీ తయారుచేయాల్సిన అవసరము లేదా అ.ని. పేజీలో దాని లింకును చేర్చాల్సిన అవసరమూ కలుగుతుంది. అసలు పేజీలే లేకపోతే ఇక అయోమయం కలిగే ప్రసక్తే లేదు, అలాంటపుడు ఆ లేని పేజీల లింకులను అ.ని. పేజీలో చేర్చాల్సిన పన్లేదు.

కానీ.., త్వరలోనే ఖచ్చితంగా పేజీని సృష్టిస్తారు అని భావించిన సందర్భంలో మాత్రమే ఎర్రలింకులు ఇవ్వవచ్చు. తెవీకీలో అలా పేజిని సృష్టించడం అనేది ఎప్పటికో గానీ జరగదు - అసలు జరక్కపోడానికే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అ.ని పేజీల్లో ఎర్రలింకులను చేర్చడం అనవసరం, చేర్చరాదు అని నా అభిప్రాయం. వాడుకరులు తమ అభిప్రాయాలు చెప్పవలసినది.

ఇకపోతే అ.ని. పేజీల్లో ఉన్న ఎర్రలింకుల సంక్షిప్త గణాంకాలు కింది విధంగా ఉన్నై:

  • మొత్తం అయోమయ నివృత్తి పేజీలు: 4375
  • కనీసం 2 ఎర్ర లింకులున్న అ.ని. పేజీలు: 950
  • 3 అంతకంటే ఎక్కువ ఎర్ర లింకులు ఉన్న పేజీలు: 130

కొన్ని పేజీల్లో అసలు ఉన్నవే ఎర్ర లింకులు, నీలపు లింకులు లేనేలేవు. కొన్నిటిలో ఒకటే లింకు ఉంది. ఒక్క లింకుంటే అ.ని. పేజీ అక్కర్లేదని వేరే చెప్పనక్కర్లేదు. రెండు లింకులున్నచోట్ల కూడా చాలా సందర్భాల్లో అ.ని. పేజీ అవసరం ఉండదు. హ్యాట్‌నోట్ ఇస్తే సరిపోతుంది.

అ.ని. పేజీల్లో ఎర్ర లింకులు గమనించినపుడు వాటిని తొలగించవలసినదిగా విజ్ఞప్తి. నేను తీసేస్తున్నాను, కొన్ని తీసేసాను. __ చదువరి (చర్చరచనలు) 14:33, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:41, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అయోమయ నివృత్తి పేజీలో ఎర్రలింకులను తొలగించాలి. అలాంటివి గమనించినపుడు తొలగిస్తాను.➠ కె.వెంకటరమణచర్చ 15:01, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అవసరం లేదు.గమనించినవాటిని తొలగించాలి. అయితే ఇంకొక విషయం కొన్నిటికి పేజీలు ఉన్నా, లింక్ సరిగా కలపనందున ఎర్ర లింక్ చూపటానికి అవకాశం ఉంది. ముందు లింక్ కలపటానికి ప్రయత్నం చేసి, లేదని నిర్ధారించుకున్నాక తొలగించాలి.యర్రా రామారావు (చర్చ) 16:13, 31 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీల గణాంకాలు మార్చు

అయోమయ నివృత్తి ప్రాజెక్టు పేజీకి అనుబంధంగా ఒక ఉపపేజీని సృష్టించి అందులో అయోమయ నివృత్తి పేజీల గణాంకాలను చేర్చాను. సవివరమైన గణాంకాల కోసం చూడాల్సిన లింకులను కూడా ఇచ్చాను. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 08:37, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సమచారపెట్టె లేని గ్రామాల పేజీలు మార్చు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గ్రామాలకు చెందిన పేజీల్లో సమాచారపెట్టె లేని గ్రామాల పేజీల జాబితాలను తయారు చేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉపపేజీల్లో చేర్చాను. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 15:44, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ ధన్యవాదాలు.రెండు రాష్ట్రాల జాబితాలు పరిశీలించాను.ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో 318, తెలంగాణ రాష్ట్రంలో 246 గ్రామాలు ఉన్నవి. నేను గమనించిన పేజీలలో సమాచారపెట్టె, అందుబాటులో ఉన్న సమాచారంతో కూర్పు చేస్తున్నాను.నిల్ చేసే ప్రయత్నం చేద్దాం.యర్రా రామారావు (చర్చ) 16:16, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు గారు. __చదువరి (చర్చరచనలు) 16:20, 1 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రముఖ/ప్రఖ్యాత వడపోత మార్చు

వ్యాసాల్లో ప్రముఖ, ప్రఖ్యాత వంటి విశేషణాలను వాడినపుడు హెచ్చరించేందుకుమనం ఒక వడపోతను పెట్టుకున్నాం. ఈ పదాలను చేర్చి పేజీని భద్రం చేసేటపుడు ఈ వడపోత వాడుకరికి ఒక హెచ్చరిక చేస్తుంది. తద్వారా ఆయా విశేషణాలను సవరించే అవకాశం వాడుకరికి ఉంటుంది. అయితే దీని వలన కొంత నష్టం కలుగుతోంది. విశేషణాలను వాడదగ్గ, వాడాల్సిన సందర్భాల్లో కూడా ఇది హెచ్చరిక చేస్తోంది. ఇది కొంత చికాకును కలిగిస్తోంది. పైగా, గతంలో ఒకటి రెండు సందర్భాల్లో కొన్ని పనులు చేసేందుకు ఇది అడ్డుపడ్డం వలన దీన్ని తాత్కాలికంగా అచేతనం చెయ్యాల్సి వచ్చింది.

అంచేత దీన్ని శాశ్వతంగా అచేతనం చెయ్యాలని భావిస్తున్నాను. దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే రెండు మూడు రోజుల్లో తెలపవలసినది. __ చదువరి (చర్చరచనలు) 03:12, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతిస్తున్నాను. గత చర్చలో నా వ్యాఖ్య చూడండి. --అర్జున (చర్చ) 03:29, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు అభ్యంతరం లేదు చదువరి గారూ, శాశ్వతంగా అచేతనం చేయవచ్చు అనుకుంటున్నాను. - రవిచంద్ర (చర్చ) 03:50, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు కూడా అభ్యంతరం లేదు. శాశ్వతంగా అచేతనం చేయడం మంచిదే. అయితే, అచేతనం చేసిన తరువాత కూడా వీలయినంత వరకు ప్రముఖ, ప్రఖ్యాత వంటి పదాలు ఉపయోగించకుండా వ్యాసాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:08, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికి ఇబ్బందిగా ఉందనిపిస్తే అచేతనం చేయవచ్చు అని, ఎలా అయినా పర్వాలేదని గత చర్చలో నాఅభిప్రాయం తెలిపాను.నాకూ అభ్యంతరంలేదు. యర్రా రామారావు (చర్చ) 05:56, 6 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ వడపోతను అచేతనం చేసాను. __చదువరి (చర్చరచనలు) 06:25, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చరిత్ర పేజీలో ఉపకరణాలు తాజా మార్చు

ఆంగ్లవికీలో లాగా పేజీ చరిత్రపేజీలో ఉపకరణాల వివరాలు తాజా చేశాను ( మీడియావికీ:Histlegend తేడాలు). ఇంతకు ముందు వున్న పేజీ వీక్షకుల సమాచారం, ప్రక్కపట్టీలో పేజీసమాచారం ద్వారా లభిస్తుంది కావున అంగ్లవికీలో దానిని తొలగించారు. తెవికీలో అలా చేశాను. ఏమైనా సందేహాలుంటే తెలియచేయండి. అర్జున (చర్చ) 06:23, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం ఎలా మార్చు

ఈమధ్య వికీపీడియా డేటాబేసు నుండి అవసరమైన డేటాను నేరుగా తెచ్చుకుని దాన్ని బట్టి వికీలో చెయ్యాల్సిన పనులు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు, మనం తెచ్చిన అనేకానేక గణాంకాలు, ఎర్రలింకుల పేజీలు, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులు వగైరాలు. ఈ డేటా ఎక్కడి నుండి వస్తుంది, ఎలా తెచ్చుకోవాలి వంటి వివరాలను తెలియజేసే సమాచారాన్ని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం" అనే విభాగంలో చేర్చాను. పరిశీలించవలసినది. దానిపై సందేహాలేమైనా ఉంటే ఇక్కడైనా రాయవచ్చు, అక్కడైనా రాయవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 09:15, 4 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కులాల పేజీలను అర్ధ సంరక్షణలో పెడదాం మార్చు

కులాల పేజీల్లో తరచూ మూలాల్లేనివో, వివాదాస్పదమైనవో.. సమాచారాన్ని చేరుస్తూ ఉన్నారు. కొత్త చరిత్ర రాసేవీ, ఉన్న చరిత్రను చెరిపేవీ కూడా ఉండడం గమనించాం. ఇప్పటికే కొన్ని పేజీల్లో ఉన్న కొంత సందేహాస్పద సమాచారం ఉండడ్ం చూసాన్నేను. అయితే ఏది సరైనదో ఏది కాదో ఇదమిత్థంగా తెలీదు కాబట్టి, వతిని సవరించలేకపోయాను. మూలాల్లేవు కాబట్టి నిర్ద్వంద్వంగా తిసెయ్యడం మాత్రమే ఈ పరిస్థితిలో మనం తీసుకోగలిగే అత్యుత్తమ చర్య. ఆసక్తి గల వాడుకరులు ఈ పేఝీలను పరిశీలించి తమకు తెలిసిన అంశాలకు మూలాలను జోడించవలసినదిగ కోరుతున్నాను.

ఈ సమస్యను నివారించడానికి ఈ కులాలు వర్గం లోని పేజీలన్నిటినీ అర్ధ సంరక్షణలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే కొన్ని పేజీలను అర్ధ సంరక్షణలో పెట్టే ఉంటాం కూడా. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 06:22, 8 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, నేను కూడా ఇలాంటి మార్పులు గమనించానండీ, కులాలకు సంబంధించిన మార్పులు కొంచెం సెన్సిటివ్ అయినందున మూలాలు లేని సమాచారం చేర్చినప్పుడు దాన్ని తిప్పికొట్టడమే మంచి పద్ధతి. అలాగే నమోదయిన సభ్యులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షణ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా. రవిచంద్ర (చర్చ) 05:32, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటీవలి మార్పులు కొత్తగా మార్చు

నాకు ఇటీవలి మార్పులు పేజీ కొత్తగా కనిపిస్తోంది. అందరికీ అలాగే కనిపిస్తోందా లేదా నాకేనా అనేది అర్థం కావడం లేదు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పు ఏమిటంటే కొన్ని మార్పులకు ఎడమవైపున ఒక బాణం గుర్తులాగా వచ్చి, దాన్ని నొక్కితే అదే వ్యాసంలో జరిగిన మార్పుల చిట్టా ఒకటి కనిపిస్తున్నది. ఇంకా ఎవరైనా ఇది గమనించి ఉంటే తెలియజేయగలరు. - రవిచంద్ర (చర్చ) 05:30, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, నాకు ఏమీ మార్పు కనబడ్దం లేదు. ఎడమవైపున ఒక త్రికోణం కనిపించేది ఇదివరకు, ఇప్పుడూ అదే కనిపిస్తోంది. అది నొక్కితే ఆ పేజీలో, ఆ రోజున జరిగిన మార్పులన్నీ కనిపించేవి, మళ్ళీ నొక్కుతే మూసుకుపోయేవి. ఇప్పుడూ అంతే. బాణం గుర్తేమీ కనబడ్దం లేదు. చూపులకు గాని, పనితీరులో గానీ "ఇటీవలి మార్పులు" పేజీలో నాకు ఏ తేడా కనిపించలేదు.__చదువరి (చర్చరచనలు) 05:40, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తెల్గు వికిపిడియాలో పనికిమాలిన నిర్వాహకులు మార్చు

తెలుగు వికీపీడియాలో చాలా మంది పలికిమాలిన నిర్వాహకులున్నారు. యర్రా అనే ఒక నిర్వాహకుడైతే ఎప్పుడూ ఒక పదం రెండు సార్లు వచిందని తొలగించడం తప్ప అతనికి వేరే పనేమీ ఉండదు. ముందుగా అతన్ని నిర్వాహక పదవి నుంచి తొలగిస్తే తెల్గు వికీపీడియాకు ఎంతో మేలు. చెప్పిన తర్వాత కూడా రూల్స్ తెలుసోకుంటే తెవికీ రూల్స్ ఎవరికోసం. ఎదుటివాడికి చెప్పడానికేనా? ముందు పనికిరాని, రూల్స్ తెలియని అధికారులు, నిర్వాహకులు రాజీనామా చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. / /అజయ్ కుమార్ / / తెలుగు భాషా ప్రేమికుడు

యర్రా పేజీలో రాసిననూ మల్ల మల్ల అవే పనికిమాలిన మార్పులు చేస్తూ ఆఖరికి అతడి పేజీలో రాసిన విషయం కూడా డిలీట్ చెయడం అహంకరపూర్వక మరియు నిర్లక్ష్య చర్యకు ప్రబల నిదర్శనం. దీనిపై ఇతడిపై తెల్గు వికి ఏ చర్య తీసుకుంది అనెది తెలుగు భాషాభిమానులకు కావాలి. ఇతర నిర్వాహకులు ఉన్నారా? ఏం చేస్తున్నారు? అతడి వెబ్‌సైట్ లింకులు వెంటనే తెవికి నుంచి నామరూపాల్లేకుండా డిలీట్ చేయాల. లేకుండా మా అభిమానుల బ్లాగుల, యూట్యూబ్ లింకులు ప్రతి ఎస్సేలో వస్తాయి. అప్పుడెలా తొలగిస్తారో చూస్తాం. / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.
చిన్నచిన్న ఎడిట్లు చేయాలంటే యంత్రం ద్వారా చేయాలని తెవికి బయటి సమూహానికి కూడా తెలుసు. మల్ల ఇక్కడ చాలా రోజుల నుంచి ఇతడు ఇట్ల చేస్తుంటే మిగితా నిర్వాహకులు గప్పుగా ఎందుకున్నరు? అతడు అట్లా చేయడానికి ఏదైనా లాభం ఉండొచ్చు. అదేమిటో అందరికీ చెప్పాలా. తెల్గు వికీ ఏ ఒక్క అబ్బ సొత్తు కాదు, అందరిదీ. ఆ లాభం ఏమిటో మాకూ తెలియాలా? / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

నేను చాలా రోజుల నుంచి తెల్గు వికీని చూస్తున్నాను. నాకు చాలా తెలుసు. ఇంకా రాస్తా. తెలుగు వికీపీడియా విఫలం కావడానికి కారణాలు కూడా తెల్సు. −

ఒకప్పుడు తెల్గు వికీపీడియాలో మహామహా ఉద్ధండులు ఉండేవారు. ఇప్పుడెవరూ లేరు. వ్యాసాలలో అన్నీ తప్పులే. అప్పటి ఉద్ధండులు రాసిన వ్యాసాలలో అప్‌డెడ్ లు ఏమీ లేవు. పాత చింతకాయపచ్చడి. / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

తెలుగు భాషాభిమానుల సమావేశంలో నాకు తెల్సిన విషయం ఏంటంటే చదువురి అనే నిర్వాహకుని వల్లనే తెలుగు వికీపీడియా కుప్పకూలిందని అందరూ చెప్తున్నారు. మంచిగా పనిచేసే చాలా వ్యక్తులను బలవంతంగా బయటకు పంపాడని, పని చేసే వారిని చేయనివ్వడని చదువురిపై పెద్ద అభియోగం ఉంది. మంచిపనులు చెసే సాంకేతిక నిపుణుడిపై పంగనామాలు పెట్టి పని జర్గనివ్వడని చెప్తుంటారు. ఆదివారం నాడు తెలుగు భాషాభిమానుల మరో చిరు సమావేశంలో మరిన్ని విసయాలు తెల్సుకొని రాస్తాను. / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలకు దరఖాస్తుల ఆహ్వానం మార్చు

అందరికీ నమస్కారం, 2021 బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ట్రస్టీలో ఉన్న సీట్లను భర్తీ చేయడానికి వివిధ వికీ సముదాయాల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనేది వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. కమ్యూనిటీ ట్రస్టీలు మరియు నియమించబడిన ట్రస్టీలు బోర్డ్ ఆఫ్ ట్రస్టీని ఏర్పాటుచేస్తారు. ప్రతి ట్రస్టీ మూడేళ్ల కాలపరిమితితో పనిచేస్తారు. వికీమీడియా కమ్యూనిటీకి కమ్యూనిటీ ట్రస్టీలకు ఓటు వేసే అవకాశం ఉంది. వికీమీడియా కంట్రీబ్యూటర్లు బోర్డులో ప్రస్తుతం నాలుగు సీట్లను భర్తీ చేయడానికి ఓటు వేయవలసివుంటుంది. వికీమీడియా కార్యకలాపాల్లో వికీ సముదాయాల ప్రాతినిధ్యం, వైవిధ్యం, నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక మంచి అవకాశం.

  • దరఖాస్తు చివరి తేది: 29 జూన్, 2021. వివరాలకు కింది లింకులు చూడండి.

మీ మద్దతుకు ధన్యవాదాలు,
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నుండి
-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:38, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పాడ్ కాస్ట్ లంకెలను మూలాలుగా చేర్చవచ్చా? మార్చు

అందరికీ నమస్సుమాంజలి!

గత కొద్దిరోజులుగా నేను పాడ్ కాస్ట్ లను వినటం ప్రారంభించాను. కళ పై నాకున్న అభిమానంతో మొదట కళల పై పాడ్ కాస్ట్ ను వెదకగా ArtCurios అనే పాశ్చాత్య పాడ్ కాస్ట్ తారసపడింది. దీని వ్యాఖ్యాత జెన్నిఫర్ డసెల్. చిత్రకళ యొక్క చరిత్ర ప్రధానాంశంగా జెన్నిఫర్ ఈ పాడ్ కాస్ట్ ను రూపొందిస్తుంది. మొదట ఈ పాడ్ కాస్ట్ యాపిల్ ఐ-ట్యూన్స్ లో లభ్యం అయ్యింది. నేను విన్నది అమెజాన్ మ్యూజిక్ పైన. తర్వాత ఈ పాడ్ కాస్ట్ యూట్యూబ్ లో కూడా లభ్యం అని తెలుసుకొన్నాను.

నా ధర్మ సందేహం: పాడ్ కాస్ట్ లంకెలను వ్యాసం యొక్క మూలాలుగా చేర్చవచ్చా? (బ్లాగు చేర్చకూడదని తెలుసు. పాడ్ కాస్ట్ ల గురించి వికీ నియమాలు ఏమిటి?)

ఉదా: యూట్యూబ్ లంకె: జెన్నిఫర్ డసెల్ యొక్క ఆర్ట్ క్యూరియస్ పాడ్ కాస్టు లోని మొదటి ఎపిసోడ్, మోనా లిసా ఈ పాడ్ కాస్టు ను మోనా లిసా వ్యాసం లో మూలంగా వాడవచ్చా?

ధన్యవాదాలు! - శశి (చర్చ) 17:00, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


శశి గారూ, వికీపీడియాలో విశ్వసనీయ మూలాలు వాడాలన్నది ముఖ్యమైన నియమం. ఏది విశ్వసనీయం అన్నదాని విషయంలో బ్లాగులు సెల్ఫ్ పబ్లిషింగ్ కాబట్టి విశ్వసనీయ మూలాలుగా పరిగణించలేదు. నాకు అవగాహన ఉన్నమేరకు పాడ్‌కాస్టులు కూడా సెల్ఫ్ పబ్లిషింగ్ వేదికలే. ఐతే, ఆంగ్లంలో పలు వ్యాసాల్లో పాడ్‌కాస్టులు మూలాలుగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందులోంచి కేవలం గుడ్ ఆర్టికల్స్, ఫీచర్డ్ ఆర్టికల్స్ మాత్రమే పరిగణించి ఉదాహరణలు ఇస్తున్నాను:
  • Batman_(1989_film)#cite_ref-31
    • బ్యాట్‌మ్యాన్ సినిమాలో దర్శకుడు బర్టన్ ఒక పాత్రకు ఫలానా స్టార్‌ని ఎందుకు ఎంపికచేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఆ సినిమాలో వేరే పాత్రలో నటించిన Robert Wuhl ఒక పాడ్‌కాస్టులో చెప్పాడు. దాన్ని సైట్ చేశారు ఇక్కడ. ఇది ప్రైమరీ సోర్సు కింద లెక్కించాలి. అంటే పవన్ సంతోష్‌ గురించి మీరు రాస్తున్నప్పుడు, పవన్ భార్య ఓ పాడ్‌కాస్ట్ చేస్తే దానిలోని వివరాలను సైట్ చేయడం అనుకోండి.
  • Confirmation_bias#cite_ref-129
    • Confirmation bias ఫీచర్డ్ ఆర్టికల్. The constant: A history of getting things wrong అన్న పాడ్ కాస్ట్ సీరీస్ నుంచి Seattle windshield pitting epidemic అనే మాస్ డెల్యూషన్ గురించిన ఎపిసోడ్‌ని సైట్ చేశారు, ఆ డెల్యూషన్ గురించిన విభాగంలో. ఇది కాస్త పాడ్‌కాస్టుని సీరియస్‌గా తీసుకోవడం అవుతోంది. ఆ పాడ్‌కాస్ట్ విలువ కూడా చాలా ఎక్కువ. రిలయబుల్. ఎందుకంటే - దాన్ని గురించి ప్రత్యేకించి బోలెడు రివ్యూలు ఉన్నాయి ఆన్‌లైన్‌లో.
  • Waylon_Smithers#cite_note-Jeff_Martin-2
    • సింప్సన్స్ అన్న అత్యంత ప్రముఖ షో రచయిత Jeff Martin తన రచన గురించి, తాను సింప్సన్స్‌ని ఏయే నిజజీవిత సందర్భాల నుంచి తన పాత్రలను సృష్టించానో చెప్పాడు. ఇదీ ప్రాథమిక మూలమే!
ఇవి శశి గారూ ఉదాహరణలు. బాగా స్థిరపడ్డ వాస్తవాలను, లేదంటే ఆయా వ్యక్తుల విషయంలో ప్రాథమిక మూలాలుగా పనికివచ్చే అంశాలను పాడ్‌కాస్టుల నుంచి మూలాలు ఇవ్వడం ఫర్వాలేదు. అలా కాకుండా కొత్త విశేషాలు, వివాదాస్పదమైన అంశాలు సెల్ఫ్ పబ్లిష్డ్ పాడ్‌కాస్టుల నుంచి కాక నమ్మదగ్గ సంపాదకులు రివ్యూ చేసి బలమైన మూలాల నుంచి ఇవ్వడమే సరైనది. ఇక టెంప్లెట్ కావాలంటే మూస:Cite podcast ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 08:48, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, అదుర్స్ . ఇక చూస్కోండి!! - శశి (చర్చ) 09:26, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Universal Code of Conduct News – Issue 1 మార్చు

Universal Code of Conduct News
Issue 1, June 2021Read the full newsletter


Welcome to the first issue of Universal Code of Conduct News! This newsletter will help Wikimedians stay involved with the development of the new code, and will distribute relevant news, research, and upcoming events related to the UCoC.

Please note, this is the first issue of UCoC Newsletter which is delivered to all subscribers and projects as an announcement of the initiative. If you want the future issues delivered to your talk page, village pumps, or any specific pages you find appropriate, you need to subscribe here.

You can help us by translating the newsletter issues in your languages to spread the news and create awareness of the new conduct to keep our beloved community safe for all of us. Please add your name here if you want to be informed of the draft issue to translate beforehand. Your participation is valued and appreciated.

  • Affiliate consultations – Wikimedia affiliates of all sizes and types were invited to participate in the UCoC affiliate consultation throughout March and April 2021. (continue reading)
  • 2021 key consultations – The Wikimedia Foundation held enforcement key questions consultations in April and May 2021 to request input about UCoC enforcement from the broader Wikimedia community. (continue reading)
  • Roundtable discussions – The UCoC facilitation team hosted two 90-minute-long public roundtable discussions in May 2021 to discuss UCoC key enforcement questions. More conversations are scheduled. (continue reading)
  • Phase 2 drafting committee – The drafting committee for the phase 2 of the UCoC started their work on 12 May 2021. Read more about their work. (continue reading)
  • Diff blogs – The UCoC facilitators wrote several blog posts based on interesting findings and insights from each community during local project consultation that took place in the 1st quarter of 2021. (continue reading)

--MediaWiki message delivery (చర్చ) 23:06, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన మార్చు

తెలుగు వికీపీడియాకు ద్రోహం మరియు నష్టం కలిగిస్తున్న చదువరిపై నిరోధం విధించవల్సిన అవసరం తప్పకుండా ఉంది. సంవత్సరాల తరబడి తెలుగు వికీకి సేవ చేసిన వారి సేవలు ఈ సభ్యుడి వల్ల సర్వనాశనం అవుతున్నాయి. ఇతనికి ఇటీవల అహంకారం చాలా పెరిగిపోయింది. రచ్చబండలో రాసిన సమాచారాన్ని కూడా డిలీట్ చేస్తాడా? ఇలాంటి వ్యక్తి నిర్వాహకుడిగా మరియు అధికారిగా అస్సలు పనికిరాడు. అందరూ కలిసి ఇతడిని తెవికీ పదవుల నుంచి బహిష్కరించండి. నిర్వాకుడైన యర్రా తప్పు చేస్తే నాకు నిరోధం విధిస్తాడా? నిరోధం విధించే ముందు హెచ్చరిక జారీచేయాలనే ఇంగిత జ్ఞానం కూడా తెలియదా? అసలు ఇతనికి ఏమీ రాదు. చేసే వాళ్ళకు చేయనీయడు. అర్జున అనే నిపుణుడిని అడుగడుగున అడ్డు తగులుతాడనీ తెలుగు భాషాభిమానులందరూ చెప్తారు. ఒకప్పుడు వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబు లాంటి మహా ఉద్ధండులైన తెలుగు వికీపీడియన్లు అభివృద్ధి పర్చిన తెవికీని ఈయన పాతాళంలోకి దింపాడు. ఇతన్ని కొనసాగిస్తే తెలుగు వికీపీడీయా నామరూపాల్లేకుండా పోతుంది. వీలయినంత త్వరగా తెవికీ నుంచి బహిష్కరించాలి. పనిచేసే వారికి ఎలా వెళ్ళగొట్టాలి అనేది తప్ప తెలుగు వికీని ఎలా అభివృద్ధి పర్చాలి అనేది ఇతనికి ఏమీ తెలియదు. చదువరికి ఏ మాత్రం తెవికీపై అభిమానం ఉంటే ఈ ప్రతిపాదన చూసిన వెంటనే నిర్వాహక, అధికార పదవులకు రాజీనామా చేసే తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పదవులను పట్టుకొని వేలాడటం వృధాపని. తెవికీ అభివృద్ధి ఇతరులైనా చేస్తారు. / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని / / వారం రోజుల్లోగా సభ్యులు నిరోధం ప్రతిపాదన పూర్తి చేయండి.

అనుకూలం: మార్చు

అజయ్ కుమార్

Vinay Kumar nomula

(పై రెండూ సంతకాలు కాదు, కేవలం పేర్లు. అవి చెల్లవ్. ఇక్కడ చేర్చాల్సింది అర్హులైన వాడుకరుల సంతకాలు, పేర్లు కాదు. సంతకాలకు బదులు పేర్లు రాసి తోటి వాడుకరులను తప్పుదోవ పట్తించే ప్రయత్నం లాగా ఉంది. అందుకే వాటిని కొట్టివేస్తున్నాను. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా ఒక ఎగతాళి లాగా, ఒక జోకు లాగా తయారు చేసారు.__చదువరి (చర్చరచనలు) 19:16, 17 జూన్ 2021 (UTC))[ప్రత్యుత్తరం]

  1. నేను ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:55, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నన్ను చదువరి గారు నిర్వాహక హోదా నుండి కొంతమంది అనుయాయులను తోడుపెట్టుకుని తప్పించారు. ఆ రోజులలో నా ఆత్మక్షోభను పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు. ఉచిత సేవలు చేసేవారిపై దాష్టీకం చేయడం ఎంత వరకు సబబు అని నేను మొదటి నుంచి అడుగుతున్నాను. కొంతమంది ఒక వర్గంగా ఉండి తెవికీని చాలాకాలం నుండినడుపుతున్నారు. ఈ అరాచకాలు నా మనసు తట్టుకోలేక నాకుగా నేను ఇక్కడ పని చేయడం మానుకున్నాను. చదువరి గారు ఇక సాధారణ సభ్యునిగా కొనసాగడం మంచిదని నా అభిప్రాయం. నేను ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాను. JVRKPRASAD (చర్చ) 13:39, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

తిరస్కరణ: మార్చు

  1. అజ్ఞాత ముసుగు వేసుకుని ఏ ఆధారాలు, సవ్యమైన కారణాలు లేకుండా కేవలం ఒక వ్యక్తి పట్ల అక్కసుతో చేసిన అత్యంత అవినీతికరమైన ప్రతిపాదన ఇది. దానికి ఇప్పటివరకూ సమర్థించిన ఇద్దరూ కూడా తాము నిర్వాహకత్వం నుంచి తప్పుకోవలసి వచ్చిందనీ, కాబట్టి చదువరి గారిని కూడా దింపాలనీ అపసవ్యమైన తమ అజెండాను బహిరంగంగానే ఇవే చర్చల్లో చెప్పిన మాజీ నిర్వాహకులు. తెలుగు వికీపీడియాలో పలు మంచి కార్యకలాపాలు చేపట్టి, అనేక విధానాలు ప్రతిపాదించి, నిత్యం చురుకుగా పనిచేస్తున్న చదువరి గారిని ఏ సవ్యమైన కారణమూ లేకుండా, ఇలా ఎవరెవరో అకారణ వ్యక్తిగత కక్షలతో, అమర్యాదకరమైన భాష వాడి నిర్వాహకత్వం నుంచి తొలగించాలని చూడడం తెవికీ విధానాలకు పూర్తి వ్యతిరేకం. కనుక ఈ అపసవ్యమైన, అకారణమైన ప్రతిపాదనను సాంతం తిరస్కరిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తిగత దాడులు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టవలసిందిగా తోటి నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:48, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. కింద పేర్కొన్న అభిప్రాయం ప్రకారం నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 06:54, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ఈ ప్రతిపాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.-- స్వరలాసిక (చర్చ) 07:53, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ఐ.పి.అజ్ఞాత/ప్రస్తుత అభివృద్ధిని చూసి ఓర్వలేని పాత సభ్యుడు చేసిన ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాను...... నేను 2012 నుండి వికీలో నిరంతరం పనిచేస్తున్నాను. వ్యాస నాణ్యతాభివృద్ధి విషయంలో, మొలక వ్యాసాల విస్తరణ, మొలకలుగా అనేక సంవత్సరాలుగా ఉండిపోయిన గ్రామ వ్యాసాల అభివృద్ధి విషయంలో చదువరి విశేష కృషి చేసారు. నిరంతరం తెవికీ అభివృద్ధి కోసం తమ విలువైన సమయాన్నంతా వెచ్చిస్తున్న చదువరి, యర్రా రామారావు గార్ల సేవలు తెవికీ సమాజంలోని ఇతర సభ్యులకు నిరంతరం ప్రేరణ నిస్తాయి. అతనితో కలసి అనేక ప్రాజెక్టులలో , వ్యాసాల శుద్ధి కార్యక్రమాలలో పనిచేయడం నాకెంతో ఆనందకరమైన విషయం. 2012 నుండి నా తెవికీ ప్రస్థానంలో చదువరి చేసిన వ్యాస/వ్యాసేతర రంగాలలో చేసిన సేవలు అద్వితీయమైనవి. ఈ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక, ధైర్యంగా చర్చించలేని పాత వాడుకరి అజ్ఞాతగా అవతారమెత్తి అసూయతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లుంది. అజ్ఞాత చేసిన ప్రతిపాదకు పాత సభ్యులు మద్దతు పలకడం సరైన చర్య కాదు. అజ్ఞాత చేసిన ఆరోపణలలో ఒకటైనా ఆధారాలతో చూపించాడా? //నిర్వాకుడైన యర్రా తప్పు చేస్తే నాకు నిరోధం విధిస్తాడా? // ఈ వాక్యంలో యర్రా రామారావు చేసిన తప్పు ఏమిటి? అనేక గ్రామ వ్యాసాలను శుద్ధి చేయడమే అతని తప్పా? నిరంతరం తెవికీ వ్యాసాల నాణ్యత కోసం పనిచేస్తున్న అతనిపై నిరాధార ఆరోపణ ఇది. రచ్చబండలో అజ్ఞాత/పాత వాడుకరి బూతులు,అమర్యాదకరమైన పదజాలం, ఆధారాలు లేని విషయాలు రాస్తే అతనిపై నిరోధించడంలో తప్పులేదు. ఓ అజ్ఞాతా! నీవు ధైర్యంగా నీ అభిప్రాయాలను చెప్పలేక అనామకంగా అనేక ఆరోపణలు రాస్తే నీతో ఎలా చర్చించమంటావు? నిరోధించే ముందు ఎలా హెచ్చరికలు జారీ చేయమంటావో తెలియజేయగలవు. ఒక అజ్ఞాత చురుకుగా ఉన్న వాడుకరులను ఏ కారణమూ లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ, అమర్యాదకర భాష వాడి నిర్వాహకత్వం నుండి తొలగించే ప్రతిపాదన తేవడం తెవికీ విధానాలకు వ్యతిరేకం. కనుక ఈ ప్రతిపాదనను నేను తిరస్కరిస్తున్నాను. తెవికీ అభివృద్ధిని ఆటంకపరిచే ఇలాంటి అజ్ఞాతలపై భవిషత్తులో గట్టి చర్యలు చేపట్టాలి.➠ కె.వెంకటరమణచర్చ 13:12, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  5. తెవికీకి సంబంధంలేని అజ్ఞాత వాడుకరి చేసిన ఈ ప్రతిపాదనకు అసలు స్పందన అవసరం లేదనిపిస్తోంది. కానీ, దీన్ని ఇలాగే వదిలేస్తే మునుముందు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి, సముదాయ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రతిపాదనను నేను తిరస్కరిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:48, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. ప్రణయ రాజ్ గారు చెప్పినట్లు, తెవికీకి సంబంధంలేని అజ్ఞాత వాడుకరి చేసిన ఈ ప్రతిపాదనకు అసలు స్పందన అవసరం లేదు.కానీ, దీన్ని ఇలాగే వదిలేస్తే మునుముందు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి, సముదాయ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఇకముందు అజ్ఞాత వాడుకరులు ముసుగులో ఇటువంటి ప్రతిపాదనలు ప్రవేశపెట్టుటకు అవకాశం లేకుండా రచ్చబండ పేజీనితగిన విధంగా సంరక్షణలో ఉంచవలసిన అవసరం ఏర్పడిందని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:53, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. అజ్ఞాత వాడుకరి చేసిన ఈ చెత్త మార్పులను ప్రతిపాదనలు ముఖ్యం కాదని అనిపిస్తోంది, నేను ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాను. Nskjnv (చర్చ) 13:22, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  8. ఈ ప్రతిపాదనను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.T.sujatha (చర్చ) 16:25, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర అభిప్రాయం మార్చు

పైన అజ్ఞాత వాడుకరి పేర్కొన్నది కేవలం వ్యక్తిగత దాడి. ఇటీవల కొంతమంది సభ్యుల మద్య చర్చలను గమనిస్తే, ఎందుకు ఇలాంటి విషయాలు లేవనెత్తుతున్నారో నాకు చూచాయగా అర్థం అయింది. వికీ కమ్యూనిటీ నియమాలు అనుసరించకుండా ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. - రవిచంద్ర (చర్చ) 14:14, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు అభిప్రాయం మార్చు

ఈ ప్రతిపాదనను గురించి గౌరవ వికీపీడియన్ రాజశేఖర్ గారు దిగువ చర్చలలో "మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము" అని చెపుతూ, ఏ విధమైన సమస్యలోనైనా అందరినీ సంతృప్తి పరచడం జరుగదు ఏ వ్యవస్థలోనైనా. అదే మాదిరిగా కొన్ని విషయాలలో కొందరికి అసహనం కలుగుతుంది. వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది.నాయీ అభిప్రాయం తెవికీ అంతిమ నిర్ణయంగా భావించి సభ్యులు తెవికీ అభివృద్ధికి తోడ్పడతారని నా ఆకాంక్ష" అని చెప్పినాక ఇంకా దీనిని పొడిగించటం బాగాలేదు.రాజశేఖర్ గారి అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని గౌరవించి ఇక దీనిమీద నేనేమీ ఏమీ మాట్లాడటంలేదు.--యర్రా రామారావు (చర్చ) 04:33, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి తెవికీలో పున:ప్రవేశం చేసిన తర్వాత తెవికీ ఘోరంగా దెబ్బతినడం ప్రారంభమైంది. తనకు నచ్చని సభ్యులపై వేటువేయడం, తెవికీ అభివృద్ధిని పట్టించుకోకపోవడం, సాంకేతిక నిపుణుడైన అర్జున ఎంత కృషిచేయాలనుకున్ననూ ఆయన్ని అడుగడుగున హేళనతో అడ్డుకోవడం, రచ్చబండ చర్చలలో కూడా తిట్లు, శాపనార్థాల భాష్ ఉపయోగించం (ఇది అధికారిగా ఉంటూ చేయదగని పని) తెవికీ సభ్యులకే కాదు తెలుగు భాషాభిమానులందరికీ విదితమే. తెలుగు భాషాభిమానులు చదువరిపై మండిపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరెందరో తెవికీ యోధుల ద్వారా తయారైన తెవికీని పాతాళంలోకి దిగజార్చిన అపకీర్తిని సొంతం చేసుకోవడం అవమానకరమైన ఘనతను పొందాడు. నాపై కూడా తిట్లు, శాపనార్థాలు వాడిన చర్చ ఇప్పటికీ రచ్చబండలో ఉంది. ఇలా తెవికీలోనీ అత్యంత ఘోరమైన చర్చ చేసిన సభ్యుడిగా "రికార్డు" సృష్టించాడు. అందరూ బాగా ఆలోచించి ప్రతిపాదన నెగ్గిస్తే తెవికీ మళ్ళీ దశాబ్దం క్రిందటిలాగా స్వర్ణదశ చేరడానికి బాట ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:04, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పనికిమాలిన పాలసీలు చేసి సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేసి, ఆ తర్వాత పట్టించుకోకపోవడం లాంటి పనికిమాలిన పనులు చేయడంలో చదువరి సిద్ధహస్తుడు. సభ్యుల విలువైన పని కాలాన్ని హరించడం ఘోరమైన చర్య. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:51, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@సి. చంద్ర కాంత రావు గారూ @Chaduvariచదువరి గారిపై పైన చేసిన, వెలిబుచ్చిన అభిప్రాయాలను నిర్విద్దంగా ఖండిస్తున్నాను.మీరు పైన రాసిన అభిప్రాయాలకు పాయింట్లు వారిగా వివరిస్తున్నాను.
  • చదువరి తెవికీలో పున:ప్రవేశం చేసిన తర్వాత తెవికీ ఘోరంగా దెబ్బతినడం ప్రారంభమైంది.
ఒక పనిచేయండి సి.కె రావు గారూ వాస్తవాలు అందరికి తెలుస్తాయి.మీరు తెవికీలో చేరిన దగ్గర నుండి మీరు తెవికీ అభివృద్ధికి చేసిన కృషి, అలాగే చదువరి గారు చేసిన కృషికి వివరాలు తయారుచేసి వెల్లడించండి.వాస్తవాలు తెలుస్తాయి. మీది నిరాధారమైన ఆరోపణ కాదని అందరికి తెలుస్తుంది. ఇది నాకు ఇది నాకు తోచిన సలహా ఏమనుకోకండి.
  • తనకు నచ్చని సభ్యులపై వేటువేయడం,
ఇది అర్ధం పర్థం లేని ఆరోపణ.ఇలాంటి వాక్యాలు ప్రతి రచ్చబండ చర్చలలో కనపడుతూనే ఉంటాయి. తెవికీలో చురుకుగా పనిచేసేవారికి అభిప్రాయాలలో భేదాలు తేడా ఉండవచ్చు. అది సహజం. వికీ అభివద్ధికి అలాంటి సంప్రదాయం అవసరం కూడా! అదే లేకపోతే వికీలో చురుకుగా పనులుకూడా జరగవు.ఇక వేటు ఎంతమందిమీద వేసారో, ఎందుకు వేసారో తగిన ఆధారాలతో వివరాలు ఇవ్వలేదు సరికదా!ఆరోపణ అయితే బేసుగ్గా ఉంది.
  • తెవికీ అభివృద్ధిని పట్టించుకోకపోవడం,
అసలు ఈ మాట  మీకు ఎలా అనాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు.ఏమైనా చదువరి గార్కి మనం ఇచ్చిన ఉద్యోగమా!అయితే ఒక పని చేయండి సార్!ఎవరెవరు వికీని అభివృద్ధిని ఎలా, ఎంత కాలంలో చేయాలో ఒక ప్రణాళిక తయారుచేసి, తాఖీదులు పెడితే బాగుంటుంది సార్.
  • సాంకేతిక నిపుణుడైన అర్జున ఎంత కృషిచేయాలనుకున్ననూ ఆయన్ని అడుగడుగున హేళనతో అడ్డుకోవడం,
పాపం అర్జునగారిని ఎందుకు ముగ్గులోకి లాగుతారు.నాకు తెలిసినంతవరకు అర్జునగారు ఆ అభిప్రాయం ఏ సందర్బంలో ఉటంకించలేదు.
  • రచ్చబండ చర్చలలో కూడా తిట్లు, శాపనార్థాల భాష్ ఉపయోగించం (ఇది అధికారిగా ఉంటూ చేయదగని పని)
ఈ విషయంలో నేను కూడా అయ్యో పాపం అలా ఎందుకు తిట్లు, శాపనార్థాల ఎందుకు ఉపయోగించాడు అని భాధపడ్డాను. తప్పుకదా! సరేవాస్తవం తెలుసుకుందామని, నా పరిజ్ఞానం మేరకు, రచ్చబండ పేజీలలో చదువరి గారి పేరుతో వెతుకగా (సెర్చ్) నాకైతే ఎక్కడా తిట్లు, శాపనార్థాల ఉపయోగించినట్లు కనపడలేదు.ఒక వేళ నాకళ్లు మోసం చేసాయేమో!
  • తెవికీ సభ్యులకే కాదు తెలుగు భాషాభిమానులందరికీ విదితమే. తెలుగు భాషాభిమానులు చదువరిపై మండిపడుతున్నారు.
తెవికీ సభ్యులేకాదు, తెలుగు భాషాభిమానులు చదువరిపై మండిపడుతున్నారు.అరే భళారే విచిత్రంగా  ఉందే.ఈ విషయంలో నాకు కొన్ని సందేహాలున్నాయి.సి.కె రావు గార్కి ఎవరైనా ఫోన్ చేసి చెప్పరా? లేదా మెయిల్స్ ద్వారా  తెలిపారా? ఏమైనా పేపర్లకు ఇస్తే వార్తలాగా పడిందా?.వారందరు సికెరావు గారికి ఏమైనా వకాల్తా ఇచ్చారా? ఇవి కూడా వివరించితే సపోర్టుగా బాగుండేది.
  • ఎన్నో సంవత్సరాల నుంచి ఎందరెందరో తెవికీ యోధుల ద్వారా తయారైన తెవికీని పాతాళంలోకి దిగజార్చిన అపకీర్తిని సొంతం చేసుకోవడం అవమానకరమైన ఘనతను పొందాడు.
సికె రావు సార్ దీనికి ప్రామాణికం లేదా ఆధారం ఏమిటి.నాకు తోచిన సలహా మీముందు ఉంచుతున్నాను సార్.ఏమి అనుకోవద్దు.ఒక పని చెయ్యండి సార్, మీరు వికీలో చేరినప్పటి నుండి మీరెంతవరకు అభివృద్ధి చేసారో, అలాగే చదువరిగారు ఎంత వరకు అభివృద్ది చేసారో ఏదైనా నివేదికలు లాంటివి తయారు చేసి అందరి ముందు ఉంచండి సార్.ఈ దెబ్బతో చదువరిగారు ఏమీ మాట్లాడటానికి అవకాశం ఉండదు.మంచి సపోర్టుగా ఉంటుంది.చదువరి గారు తయారు చేస్తే మనం నమ్మవద్దు.
  • నాపై కూడా తిట్లు, శాపనార్థాలు వాడిన చర్చ ఇప్పటికీ రచ్చబండలో ఉంది.
ఓహో అందుకా ఇది సార్, అసలు ఇన్ని రోజులు మీరు ఉదాశీనంగా ఎందుకు ఉన్నారు.మరి నాకైతే రచ్చబండలో ఎవరిని ఎక్కడా  కనపడలేదని తిట్లు, శాపనార్థాలు వాడిన చర్చలు అగపడలేదు.మీ ఇద్దరి పేర్లతో ఉదయం నుండి ప్రతి చర్చా పేజీ పరిశీలించాను. మీరు అన్నీ తెలిసినవారు వదిలేయండి సార్.
  • ఇలా తెవికీలోనీ అత్యంత ఘోరమైన చర్చ చేసిన సభ్యుడిగా "రికార్డు" సృష్టించాడు.
పోనీ లేండి ఏదో ఒక రికార్డు సంపాదించాడు.మన కన్నా నయం కదా! అసలు నాకు తెలియక అడుగుతాను.చర్చలు చదువరి గారు ఒక్కడే జరుపుకునేవి కాదు కదా. తలతిక్కలాంటి నాలాంటి ఉన్నప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు.
  • అందరూ బాగా ఆలోచించి ప్రతిపాదన నెగ్గిస్తే తెవికీ మళ్ళీ దశాబ్దం క్రిందటిలాగా స్వర్ణదశ చేరడానికి బాట ఏర్పడుతుంది.అలాంటి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను.
ప్రతిపాదన నెగ్గగానే మనం ఎవరి విధులలోకి వాళ్లం ఎంచక్కా చేరిపోవచ్చు.తెవికీ సంగతి తరువాత.అంతగా అవసరమైతే నేను కొద్ది కాలం శెలవు తీసుకుంటున్నాం అని ఎంచక్కా చెప్పవచ్చు.తెవికీ అభివృద్ధి ఎప్పడూ ముందంజెలో ఉండాలని ఆశిస్తున్నాను.సంస్థలు శాశ్వతం.వ్యక్తులు శాశ్వతం కాదు.ఈ రోజు నేను వికీలో చేసింది రేపు ఉంటుందో లేదో అని నేనూ అలోచించను. అవకాశం ఉన్నంతవరకు చెయ్యటమో మన పని. యర్రా రామారావు (చర్చ) 14:08, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి చేసిన ఒక పనికిమాలిన పాలసీ కారణంగా నేనే మాట ప్రకారం నిర్వాహక పదవికి రాజీనామా కూడా చేసి నా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాను. ఇప్పుడు చదువరి కూడా నిర్వాహక మరియు అధికార పదవులకు రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెవికీలో కొనసాగి చేసేదేమీ లేదు అనవసరంగా రో గొడవలు, తిట్లు, శాపనార్థాలు, అర్జున చేసే కృషిలో అడ్డుపడటం తప్ప చదువరి కృషి గుండుసున్నా. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:07, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సార్ సి.కె.రావుగారూ, " నేను నా నిర్వాహకహోదా నుంచి స్వచ్ఛందంగా వైదొల్గుటకై నిర్ణయించి నిర్వాహకుల నోటీసుబోర్డులో పేర్కొన్నాను. ఇదివరకే నిర్ణయించిన ప్రకారం నేను రాజీనామా సమర్పిస్తున్నాను. రాజీనామాను ఆమోదించిన తర్వాత సభ్యుడిగా ఉంటూ, అవసరమైతే "తెవికీ విమర్శకుడి"గా మారి తెవికీని సంస్కరించడానికి, తెవికీలో లోటుపాట్లను లేవనెత్తి తెవికీ ప్రగతికి తోడ్పడగలను. అలాగే ప్రధాన చర్చలలో సీనియర్ సభ్యుడిగా పాల్గొనగలను. నిర్వాహకహోదాలో ఉంటూ ఒకవైపు నిర్వహణ చేయజాలని స్థితిలో మరోవైపు తెవికీలో జరుగుతున్న (ముఖ్యంగా నిర్వహణ లోపాలను) లేవెనెత్తే స్థితిలో లేని కారణంగా నిర్వాహక హోదా నుంచి బయటపడాలని నిర్ణయించాను." అని చెప్పారు. ఎక్కడా మచ్చుకు కూడా చదువురి గారి వలన అనే మాట కానీ, పనికిమాలిన పాలసీ కారణంగా అని రాలేదు. యర్రా రామారావు (చర్చ) 15:48, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ పనికిమాలిన పాలసీ చర్చలో చూడండి, ఆ పాలసీ అమలులోకి వస్తే రాజీనామా చేస్తాననీ అప్పుడే మాటిచ్చాను కూడా. మాట ప్రకారమే అంటే పనికిమాలిన పాలసీ వల్లనే నిర్వాహకహోదా రాజీనామాకు ఉపక్రమించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:33, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం. తెవికీ తరఫున లాభం పొందింది కొందరె. సమావేశాలంటూ, వర్క్‌షాపులంటూ, రకరకాలుగా కార్యక్రమాలకై గ్రాంట్లు పొంది దాని ఏంచేశారనేది తెవికీ సభ్యులకు చెప్పాలి. తిరుపతి మహాసభల ఖర్చు లెక్కలు ఇప్పటికీ తేల్చలేరు. తెవికీ తరఫున పొందిన లాప్‌టాపులు, డెస్క్‌టాపులు, నెట్ కనెక్షన్ బిల్లులు ఏమయ్యాయి? లాప్‌టాపులు తదితరాలు ఎవరివద్ద ఉన్నాయి. ఇవన్నీ బయటపెట్టాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:13, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మధ్యలో ఇది ఎందుకు సార్, ఇది ఇంకొక విషయం కదా! యర్రా రామారావు (చర్చ) 15:54, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చ మొత్తం తెవికీ ప్రక్షాళణవైపు దారితీస్తోంది. తెవికీ తరఫున లాభం పొంది కూడా తెవికీకి అవసరమైనప్పుడు పట్టించుకోకపోవడం దారణమేమరి. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:37, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పుకార్లు, వ్యక్తిగత దాడుల ధోరణిపై చర్యలు మార్చు

  • "భాషాభిమానులందరూ చెప్తారు", "తెలుగు భాషాభిమానుల సమావేశంలో నాకు తెల్సిన విషయం ఏంటంటే", "పెద్ద అభియోగం ఉంది", "పని జర్గనివ్వడని చెప్తుంటారు" - ఇవన్నీ పుకార్లు. ఎవరో చెప్పారు, నాకు తెలిసిన విషయం, అభియోగం ఉంది - వంటి వాక్యాలు నిరూపించలేని ఆరోపణలు చేయడానికి, వాటిని ఎవరో అజ్ఞాత భాషాభిమానుల మీదకు తోయడానికి ఉపయోగిస్తున్న పదబంధాలు. సామాన్యంగా కొన్ని రకాల పత్రికల్లో, వెబ్‌సైట్లలో "ఆ హీరోయిన్‌ గురించి ఇండస్ట్రీ కోడై కూస్తోంది", "ఫలానా జరిగిందని భోగట్టా", "సినిమా పరిశ్రమ వర్గాల్లో ఫలానా పుకార్లు షికార్లు చేస్తున్నాయి" - ఇలాంటి భాష వాడి సినీ ప్రముఖుల మీద పుకార్లు లేవనెత్తుతారు. అందులో ఏ ఆధారమూ ఉండదు. అలాంటి భాషే ఇక్కడ వాడారు.
  • ఈ గాలి పుకార్లు తప్పించి సరైన ఆధారాలతో కూడిన విమర్శలు లేవు. "పాతాళంలోకి దింపాడు", "ఎలా అభివృద్ధి పర్చాలి అనేది ఇతనికి ఏమీ తెలియదు", "పదవులను పట్టుకొని వేలాడటం", "పంగనామాలు పెట్టి పని జర్గనివ్వడని", "వల్లనే తెలుగు వికీపీడియా కుప్పకూలిందని" - ఇవి తిట్లు, ఆరోపణలు. రాజకీయ నాయకుల మీద సామాన్యంగా చేసే వ్యక్తిగత దాడుల వంటివి ఇవి. మొన్న యర్రా రామారావు గారి మీద, నిన్న చదువరి గారి మీద ఈ భాషే వాడి ఆధారాలు లేని ఆరోపణలు చేసి అవమానపరిచాడు. రేపు ఇతరుల మీద కూడా ఇలానే చేయడన్న ఆధారమేమీ కనిపించట్లేదు. దీనికి తోడు ఇతర సభ్యులను కూడా ఈ అనవసర వివాదంలోకి లాగుతున్నాడు.
  • ఈ తిట్లు, గాసిప్పుల నడుమ అడిగిన ఒకే ఒక్క విషయం - "నిరోధం విధించే ముందు హెచ్చరిక జారీచేయాలనే" సంగతి. నిరోధం విధించే ముందు హెచ్చరిక ఇతనికి ఎక్కడ జారీచేయాలి చదువరి గారు? ఇతను అజ్ఞాతంగా ఈ పని చేస్తున్నాడు. ఐపీ అడ్రస్ తప్ప ఖాతా లేదు. ఐపీ అడ్రస్ చర్చా పేజీల్లో హెచ్చరికలు రాయకూడదు. (కారణం తెలియనివారికి: ఒకే ఐపీ అడ్రస్ పలువురు వాడుతూ ఉంటారు. ఐపీ అడ్రస్ వాడేవారు ఒక సారి ఒకచోట, ఇంకోసారి ఇంకోచోట లాగిన్ అవుతారు.) కాబట్టి, భవిష్యత్తులో ఈ వ్యక్తి ఖాతా సృష్టించుకుని మార్పుచేర్పులు చేస్తేనే చర్చపేజీలో ఏమైనా చెప్పగలం లేకుంటే ఏ నిర్వాహకుడైనా చేసిన దుశ్చర్య ఆధారంగా నేరుగా చర్యలు తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదు. అందుకే ఇప్పుడూ అదే చేశాను.
  • చివరగా, చదువరి గారు పద్ధతి ప్రకారం ఒకరోజు నిరోధం విధించారు. ఇప్పుడు మళ్ళీ పైన పాల్పడిన ఆధారాలు లేని వ్యక్తిగత దాడులు, పుకార్లు, అవమానకరమైన భాష కారణంగా మరోసారి నేను వారం రోజుల ఐపీ నిరోధాన్ని విధించవలసి వచ్చింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేసిన నిర్వహణా చర్యలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:34, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఆధారాలు లేకుండా రచ్చబండలో కొందరు నిర్వాహకులపై దూషణలు, వ్య్హక్తిగత దాడులు, పుకార్లు చేయడం సరైన చర్య కాదు. రెండు రోజుల క్రితం కూడా అజ్ఞాత వాడుకరి ఐ.పి.నెంబరుతో నిర్వాహకులపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేయడం వల్ల అతనిని ఒకరోజు నిరోధించడం సరైన చర్య. ఇప్పుడు కూడా చర్య తీసుకోవడం సరైనది. ఆ వ్యక్తి ఐ.పి.నెంబరుతో కాకుండా తన వాడుకరి పేరుతో లాగిన్ అయి ఆరోపణలు చేస్తే అతనికి నిరోధించేముందు హెచ్చరికలు చేసే అవకాశం ఉంది. ఐ.పి.నెంబరు గల వాడుకరికి చేసే దుశ్చర్యల పై చర్య తీసుకోవచ్చు. అయితే ఒక ఐ.పి.నెంబరుతో అజ్ఞాత పైన రాసిన నిరాధార ఆరోపణలను, పుకార్లను కూడా తొలగించాలని నా అభిప్రాయం. ➠ కె.వెంకటరమణచర్చ 11:38, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞాత వాడుకరి వచ్చి వికీపీడియా నిర్వాహకుల మీద నిరాధార ఆరోపణలను, పుకార్లు చేయడం, అవమానకరమైన భాష వాడడం మంచిపద్దతి కాదు. ఆ అజ్ఞాత వాడుకరిపై తీసుకున్న చర్యలు సరైనవని నేను భావిస్తున్నాను. అలాగే నిరాధార ఆరోపణలను, పుకార్లను కూడా తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 17:16, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దూషణలు, వ్యక్తిగత దాడులు, పుకార్లు అని అనడం కంటే దానికి కారకుడైన వ్యక్తి ఎవరో గ్రహించండి. తప్పంతా నిర్వాహకులదే. బయటి అనామకులకు ఆ అవకాశం ఇచ్చిన అధికారులు, నిర్వాహకులదే తప్పు. ఇతరులను నిందించి తప్పు లేదు. ఇప్పటికీ చిన్న సమస్యను పెద్దగా చేస్తున్నారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:11, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అధికారం ఎవరికీ లేదు. అనవసర్ంగా మాట్లాడకండి. తెవికీని చులకనగా చేయకండి. తెవికీ బయట కూడా తెలుగు భ్షాభిమానులు రచ్చబండ వ్యాఖలను చూస్తారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:09, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, పవన్ లు మాటిమాటికి కొత్తవారికి నిరోధం విధించి తెవికీని పిల్లలాటగా మార్చ్చేస్తున్నారు. ఐ పి అడ్రస్ లపై నిరోధం పనిచేయదన్న ప్రాథమిక సూత్రం, కనీస జ్ఞానం కూడా వీళ్ళద్దరికి లెదా? సి. చంద్ర కాంత రావు- చర్చ 14:13, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారిపైన, పవన్ గారిపైన చేసిన నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలను ఖండిస్తున్నాను. దీనివల్ల తెవికీకి పైసా ప్రయోజనం కూడా లేదు. ఇందులో విధానాల పరమైన చర్చ కనిపించడం లేదు. ఏం జరిగిందో అర్థం చేసుకోకుండా గుడ్డిగా విమర్శించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక్కడ క్రమం తప్పకుండా పనిచేసే వాళ్ళ కృషి మీద కనీస గౌరవం లేకుండా, తెవికీ నాశనమై పోయింది అని గగ్గోలు పెట్టడం ఎంతమాత్రం సబబు కాదు. నా ఉద్దేశ్యంలో అవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని భావిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 14:31, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరి రాసిన చెత్త తొలగింపు మార్చు

పై విభాగంలో అజ్ఞాత వాడుకరి రాసిన చెత్తను తొలగించాలని స్పందించిన ప్రణయ్ రాజ్, వెంకట రమణ గార్లు అభిప్రాయపడ్డారు. నాదీ అదే అభిప్రాయం. ఇప్పుడు కూడా ఆ వాడుకరి అవమానకరమైన భాషతో వ్యక్తిగత దాడులకు పాల్పడుతూ ఉండడంతో ఆ చెత్తను తొలగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:41, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుల సూచన కాదురా pawan. ముందు నియమాలు నేర్చుకో. లేకుంటే నిర్వాహక పదవికి రాజీనామా చేసేయ్. Ajay kumar
ప్రణయ్, రమణలు అలా అభిప్రాయపడటం తప్పు. అభిప్రాయాల ప్రకారం రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు. వారి వ్యక్తిగత సభ్యపేజీలలొ మరియు చర్చా పేజీలలో ఏమైనా చేసుకోవచ్చు కాని రచ్చబండ అనేది అందరికీ, ఏ ఒక్కరిదీ కాదు. రచ్చబండ అనేది భవిష్యత్తులో కొత్తవారికి కూడా ఉపయోగపడవచ్చు. రచ్చబండలో తొలగించిన సమాచారం మళ్ళీ రివర్ట్ చేసే అవకాశం ఎవరికైన ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:20, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు. అనవసరంగా నిందించకండి, అతను తెలుగు భాషాభిమాని. ఎప్పటినుంచో తెవికీని పరిశీలించి తెవికీ పరిస్థితి ఈ దశలోని రావడానికి కారకుడైన సభ్యుడిపై ఒళ్ళుమండి ఇల్ చేశాడనుకుంటాను. అతను రాసినదాంట్టో వాస్తవాలున్నాయి. అవి గాలికబుర్లుకావు. అవి అందరికీ తెలుగు. నిర్వాహకులు పరిస్థితిని అంచనా వేయాలు కాని అంత తేలిగ్గా కొట్టిపారేయడం సమంజసం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:03, 14 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారి నిందల పైన, విమర్శల పైనా చదువరి స్పందన మార్చు

చంద్రకాంతరావు గారూ, మీరు పైన వివిధ విభాగాల్లో నాపై వేసిన నిందలకు, విమర్శలకూ నా స్పందన ఇక్కడ రాస్తున్నాను. "చదువరి కృషి గుండుసున్నా" అని కూడా మీరు అన్నారు. అయితే ఈ ఒక్క సంగతినీ నేను స్పృశించను. నా కృషిని గురించి ఏమీ రాయనిక్కడ. ఎందుకంటే నా కృషిని "గుండు సున్నా" అని చెప్పడం మీకు చాలా అవసరం. అది చెప్పకపోతే మీరిక్కడ రాసిన విమర్శలకు, నిందలకూ అసలు ప్రాతిపదికే లేకుండా పోతుంది. అంచేత దాన్ని నేను వదిలేస్తాను. (నా కృషి గురించి తెలుసుకోదలచిన వారు నా వాడుకరి పేజీ చూడవచ్చు.)

నేను చెప్పినవి నిందలు, విమర్శనలు కావు తెవికీలో జరుగుతున్న వాస్తవాలు మాత్రమే. సి. చంద్ర కాంత రావు- చర్చ 21
20, 18 జూన్ 2021 (UTC)

నా స్పందనను రెండు భాగాలుగా రాస్తాను. ముందుగా విమర్శలపై..

విమర్శలపై నా స్పందన మార్చు

  1. అజ్ఞాతలు చేసిన వ్యక్తిగత దూషణలను సమర్ధిస్తూ "రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అధికారం ఎవరికీ లేదు. అనవసర్ంగా మాట్లాడకండి." అని రాసారు. "ప్రణయ్, రమణలు అలా అభిప్రాయపడటం తప్పు. అభిప్రాయాల ప్రకారం రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు." అని రాసారు. నలుగురు సభ్యులు వెనక్కి తిప్పాలని చెబుతోంటే, లేదు అది తప్పు అని మీరు వారందరినీ తప్పు బట్టారు. నిజానికి మీదే తప్పు. కింది పాయింట్లు చూడండి:
    1. వికీపీడియా వ్యక్తిగత దూషణల పట్ల కఠినంగా ఉంటుంది. దూషణలు చేసినపుడు ఏ పేజీలోనైనా వెనక్కి తిప్పవచ్చు. ఒరేయ్, పందులు వంటి మాటలతో అజ్ఞాత దూషించారు. అందుకు ప్రతిగా తీసుకున్న చర్యలు సబబే.
    2. అంతెందుకు.. నిన్న ఇదే చర్చలో అజ్ఞాత ఇంగ్లీషులో వేస్ట్ వికీపీడియన్స్ అంటూ దూషిస్తే "గ్లోబల్ రోల్‌బ్యాకర్" (అంటే వారి స్పెషాలిటీయే తిరగ్గొట్టడం) అధికారాలున్న వ్యక్తి దాన్ని తిరగ్గొట్టారు. ఆ తిరగ్గొట్టిన లింకు చూడండి. మీరు చెప్పేది తప్పని ఈ చర్చకు ఏ సంబంధమూ లేని వ్యక్తి - ఇక్కడే, నిన్ననే - నిరూపించారు.
    3. ఈ పేజీ చరిత్ర లోకి వెళ్ళి చూడండి. అందులో వెనక్కి తిప్పే లింకులున్నాయి. అధికారం ఎవరికీ లేకపోతే మరి ఆ లింకులు ఎందుకున్నట్టు?
  2. "ఐ పి అడ్రస్ లపై నిరోధం పనిచేయదన్న ప్రాథమిక సూత్రం, కనీస జ్ఞానం కూడా వీళ్ళద్దరికి లెదా?" అని అన్నారు. ఐపి అడ్రసులపై నిరోధాలు విధించవచ్చు, విధిస్తారు. అది చాలా సాధారణంగా జరిగే పని. ఒక్క ఐపీనే కాదు, ఏకంగా ఐపీ రేంజినే నిరోధించే పద్ధతులున్నై. మరొక సంగతి.. ఒక వికీలోనే కాదు, అసలు ఏ భాషకు చెందిన వికీలోనూ పని చెయ్యకుండా నిరోధించే గ్లోబల్ బ్లాకు విధానాలు కూడా ఉన్నై. మీ జ్ఞానపరిధిలో ఈ సంగతులు లేవేమో గానీ, వికీపీడియా పరిధిలో ఉన్నై. వీటి గురించి జ్ఞానం ఉండే మాట్టాడుతున్నారా లేక తెలిసి కూడా కావాలనే అబద్ధాలు చెబుతున్నారా?

__చదువరి (చర్చరచనలు) 04:19, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండలో అజ్ఞాతలు రాసే విషయమై రావు గారు గతంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడే చూసాను. దాన్ని సముదాయం కూడా చూడవలసినది:
2013 జనవరిలో రచ్చబండలో రాసిన అజ్ఞాతకు రావు గారు ఇచ్చిన సమాధానం ఇది "చర్చలలో తమ అభిప్రాయాలు తెలిపే వారు సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. ఐపీ అడ్రస్ తో చర్చాపేజీలలో వ్రాసిననూ ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఆ విషయాలను చర్చా పేజీల నుంచి పూర్తిగా తొలిగించవచ్చు కూడా. " రావు గారి అప్పటి అభిప్రాయానికీ, ఇప్పటి అభిప్రాయానికీ ఇంత స్పర్థ ఎందుకు వచ్చింది!! __చదువరి (చర్చరచనలు) 05:15, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2008 నవంబరు లో ఐపీ అడ్రసుల నిరోధంపై రావు గారి అభిప్రాయం చూడండి: "కాని ఇటీవలి కొన్ని వ్యాసాలు చూస్తే ఈ హద్దుదాటినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. గౌరవప్రదంగా సూచించినా వినడం లేదు. ఇక వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను. " - ఇదిగో.. ఇక్కడ ఆయన ప్రదర్శించిన ఈ "జ్ఞానమే" మాకూ ఉందని విమర్శించారాయన.__చదువరి (చర్చరచనలు) 07:04, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదివరకు చెప్పినది రచ్చబండ వ్యాఖ్యలకు సంబంధించినది కాదు ఇప్పుడు కూడా కెవలం రచ్చబండ వ్యాఖ్యలను మాత్రమే తొలగించరాదని చెప్తున్నాను. రచ్చబండ అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ లాంటిది. భవిష్యత్తులో ఎప్పుడైన ఎవరికైనా ఎలాంటి సమయంలోనైనా అవసరం పడవచ్చు. అయినా తొలగించే అవసరం ఏమిటి? ఎవరో ఎకరిద్దరికీ నచ్చనంతమాత్రానా తిట్లు ఉన్నంత మాత్రానా జడుకుకోవల్సిందేనా? మరి రచ్చబండలోనే నకు చదువరి తిట్టిన టిట్ల సంగతేంటీ? సి. చంద్ర కాంత రావు- చర్చ 13:54, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఐపి అడ్రస్ లపై నిరోధం విషయంలో ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. గతంలో ఎక్కువగా BSNL స్థిర కనెక్షన్‌లు ఉండేవి. వాటిపై నిరోధం పనిచేసేది. కాని ఇప్పుడు ఎక్కువగా అస్థిర ఐపి కల్గిన సెల్ కనెక్షన్‌లు ఉన్నాయి. అస్థిర ఐపి అడ్రస్‌లు చాలా పొడవైనవి. నెట్ కనెక్షన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయగానే ఏ కొద్ది మార్పుతో నిరోధం పనిచేయదు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, నిరోధం విదించిననూ సదసు సభ్యుడు చేసే దిద్దుబాట్లకు ఎలాంటి ఆటంకం కల్గటం లేదు. అందుకే ఇప్పటి అస్థిర ఐపి అడ్ర లపై నిరోధం విధిచడం నేను వద్దంటున్నాను. పాత చర్చలలో నేను చెప్పినది ఈ విధానానికి సంబంధం లేదు. అనసరంగా నిరోధం విధించి తిట్లు తిన్నారు. కనీసం ఇప్పుడైన "జ్ఞానం" పొందితేచాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:10, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రోల్‌బ్యాక్ సదుపాయం ఉన్నంతమాత్రానా అది అవసరమైనప్పుడు మాత్రమే తప్ప తిట్లు ఉన్నాయనే చిన్న కారణంతో చేయడం తగదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:58, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:C.Chandra Kanth Rao గారూ, ఆ అజ్ఞాత వాడుకరి చేసింది తప్పో కాదో మీ అభిప్రాయంగా చెప్పండి. అదేదో సార్వకాలిక సత్యంగా చెప్పొద్దు. మీరు రాసిన ఈ రాతలు అందరూ గమనిస్తున్నారు. ఇక సాంకేతకంగా "అస్థిర ఐపి కల్గిన సెల్ కనెక్షన్‌లు" వాడి నిరోధాన్ని తప్పించుకోవడం గురించి చూస్తే - "శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు" ఉంటాయన్న సామెత మీరు విన్నారో లేదో మరి. ఆ అజ్ఞాత వ్యక్తి దూషణలతో వికీపీడియా రచ్చబండకున్న గౌరవాన్ని చెడగొడుతున్నప్పుడు, అతను సాంకేతికంగా ఒక లూప్‌హోల్ వాడుకుని ఈ పనులు చేస్తున్నట్టైతే - ఈ దాడులను ఎలా తిప్పికొట్టాలన్న సాంకేతిక విషయం తెలుసుకోవడం తెలుగు వికీపీడియా నిర్వాహక బృందానికి పెద్ద విషయం ఏమీ కాదు. లూప్‌హోల్ ఉంది కాబట్టి చర్యలే వద్దన్న మీ లాజిక్‌కి చర్చా గౌరవం లేదు. ఇదేమీ మాకూ ఫుల్ టైం ఉద్యోగం కాదు. కాబట్టి, ఒకటి రెండు రోజులు పడితే పడుతుంది. ఈలోపు మీరు కంగారుపడిపోయి మీ అజ్ఞాత భాషాభిమానిపై నిరోధమే వద్దని వాదించనక్కరలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 18:15, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఐపివి4 / ఐపివి6 లను స్టాటిక్/డైనమిక్ లనూ కలిపేసి నోట్లో నలగ్గొట్టి ఊసేస్తున్నారు. నాదో సలహా.. దీని గురించి ఇక మీరు మాట్టాడకుండా ఉంటే మిగతా అజ్ఞానం కూడా బైట పడకుండా ఉంటుంది.
మీ అజ్ఞానం మాత్రం బయటపడిందిచాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:50, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక రోల్‌బ్యాక్ సదుపాయం గురించి.. "చిన్నకారణంతో చెయ్యతగదు" అనే స్మాల్ ప్రింటు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు.=, నిన్న లేదే? నిన్న రచ్చబండలో అలాంటివి చేసే అర్హత లేదు అని గొంతెత్తినపుడు అది చెప్పలేదే? వ్యక్తులపై ద్వేషం ఉన్నంత మాత్రాన, చర్చల్లో దురుసుగా మాట్టాడితే కొంత కాలం పాటు నడుస్తుందేమో గానీ, వికీ నియమాలకు నిబంధనలకూ మీ ఇష్టం వచ్చినట్టు భాష్యాలు చెప్పేస్తానంటే ఒప్పదు, నప్పదు. __ చదువరి (చర్చరచనలు) 07:12, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నాపై మోపిన నిందలపై నా స్పందన మార్చు

రావు గారూ, నాపై అనేక నిందలు మోపారు మీరు. కానీ, ఒక్కదానిక్కూడా - కనీసం ఒక్కదానిక్కూడా - ఆధారం చూపలేదు. ఇక్కడ దూషణలు రాసిన అజ్ఞాతకు మీకూ పెద్ద తేడా ఏమీ లేదు. వారూ ఆధారాలు ఇవ్వలేదు. మీరూ ఇవ్వలేదు. కాకపోతే వారు పందులు అంటూ తిట్టారు, మీరు అలా తిట్టలేదు, అంతే. కానీ నేను మీలా కాదు.. మీరు చేసిన ప్రతి నిందకూ సమాధానం చెబుతాను- ఆధారాలతో సహా.

స్వర్ణయుగం, అర్జున గారిని అడ్డుకోవడం మార్చు

"చదువరి తెవికీలో పున:ప్రవేశం చేసిన తర్వాత తెవికీ ఘోరంగా దెబ్బతినడం ప్రారంభమైంది. " అని ఇప్పుడు నన్ను విమర్శించారు. దాదాపు పదేళ్ళ తరువాత నేను తిరిగి వచ్చింది 2016 మధ్యలో. అంటే మీ ఉద్దేశం ప్రకారం పతనం అప్పుడే ప్రారంభమైందన్నమాట. అప్పటి వరకు ఉజ్వలంగా ఉన్న తెవికీని చదువరి అనే ఒకే ఒక వ్యక్తి నాశనం చేసి, అధఃపాతాళానికి తీసుకుపోయాడన్నమాట! సరే.. 2016 జూన్ కు ముందు తెవికీ పరిస్థితిపై తమరు వెలిబుచ్చిన అభిప్రాయాలేంటో చూడండి

  1. 2015 ఏప్రిల్ లో "పూర్తిగా ఊబిలోకి కూరుకుపోయిన తెవికీకి సంస్కరించడానికి ఇదో కొత్త ప్రయత్నం. "
  2. 2015 మే లో "నాణ్యత కరువై, నిర్వహణ బరువై, చర్చలు అధికమై, ఫలితం శూనమై, దిక్కుతోచని స్థితిలో ఊబిలో కూరుకున్న తెవికీని .." అంటూ రాసారు
  3. 2014 అక్టోబరు "..ఇటీవలి కాలంలో ఎవరికి వారు చేయబట్టే తెవికీ మొత్తం అస్తవ్యస్తం అయిపోతోంది. "
  4. 2014 జనవరి "చాలాకాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది అస్తవ్యస్తమైపోయింది. "
  5. 2013 సెప్టెంబరు "చాలా కాలం నుంచి తెవికీలో నిర్వహణ అనేది సమస్యగా మారింది."
  6. 2013 నవంబరు "ఎంత పటిష్టంగా, ఆలోచించి చేసిననూ నిర్వాహకులను నిరంకుశులుగా పేర్కొన్న విషయం ఇదివరకు నాకూ అనుభవమైంది. " మీరు చేస్తే నేమో పటిష్ఠంగా చేసినట్టా చదువరి చేస్తేనేమో పనికిమాలిన పనా!? భేష్! భలే లాజిక్కండీ!

నేను తిరిగి రావడానికి మూడేళ్ళ ముందే, నేను ఇక్కడ లేని కాలంలోనే తెవికీ ఊబిలో కూరుకుపోయిందని మీరే స్వయంగా వాక్రుచ్చారు కదా.. మరి, నన్నెందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే.. ఎప్పటికప్పుడు తెవికీ పరిస్థితి ఘోరంగా ఉన్నట్టు చూపిస్తూ ఆ సమయంలో చురుగ్గా పనిచేసేవారిని చిన్నబుచ్చడం, అవమానించడం మీకు అలవాటు. ఉదాహరణ చూడండి.. గతంలో అర్జున గారిని కూడా ఎక్కువగా విమర్శిస్తూ ఉండేవాళ్ళు మీరు. అప్పట్లో ఆయన్ను విమర్శిస్తూ "..చదువరి,.." లాంటి మహామహులు చేసిన పనులను తగ్గించలేం కదా అని మీరు నన్ను కీర్తించారు కూడా. నిజంగానేనండి, కావాలంటే ఇదిగో ఈ లింకు చూడండి. అర్జున గారితో మీ గొడవలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఆయనపై అలిగి 2013 జనవరిలో మీరు తెవికీ నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు, అదే అర్జున గారిని మెచ్చుకుంటూ ఆయన్ను నేను పని చెయ్యనీయకుండా అడ్డు పడుతున్నానని నన్ను విమర్శిస్తున్నారు. ఇప్పుడు మా పాత్రలను మార్చేసారు -ఇప్పుడు ఆయన "మహామహుడు", నేను "దుష్టుణ్ణి"! ఈ ఉదాహరణలు చాలు మీ ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పేందుకు. ఇప్పటివాణ్ణి తిట్టేందుకు అప్పటివాణ్ని పొగడుతారు. మళ్ళీ రేపటివాణ్ణి విమర్శించేందుకు ఇప్పుడు తిట్టినవాణ్ణే రేపు పొగడుతారు. భేష్!

నా చర్చల సారాంశాన్ని అర్థం చేసుకొనే స్థోమత మీకు లేదనీ ఎప్పుడో నిరూపితమైంది. కేవలం సమూహానికి ఏదో చెప్పడానికి వాగుతున్నారంతే!! సి. చంద్ర కాంత రావు- చర్చ 17:41, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారితో మీకు వచ్చినట్లే నాక్కూడా వివాదాలు వచ్చాయి. ఆ సందర్భాల్లో నా వాదన వినిపించానంతే. నేను ఆయన పనికి ఎక్కడా అడ్డుపడలేదు. మీకు తెలుసో లేదో.. అడ్డుపడే సందర్భం వచ్చినపుడు కూడా పక్కకు తప్పుకున్నాను. తగ్గి ఉన్నాను. అంతేగానీ నేను అడ్డుపడలేదు. ఈ ఉదాహరణలు మూస చర్చ:స్వాగతం#పుస్తకం లింకు, మూస చర్చ:క్లుప్తస్వాగతం చూడండి. __చదువరి (చర్చరచనలు) 07:20, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున ప్రతిపాదనలు ఎంత చక్కగా ఉన్నా ఇప్పటికీ నిష్కారణంగా అడ్డుపడుతున్నారనేది జగమెరిగిన సత్యం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:53, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఊబిలో కూరుకుపోవడానికి, పాతాళంలోని తోయడానికి తేడా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:15, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రావు గారూ, వివేచనతో మాట్లాడ్డం లేదు మీరు. నాలుక మెలికెలు తిరిగిపోతోంది. చూసుకోండి. __చదువరి (చర్చరచనలు) 15:01, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారితో ఒక దశలో చాలా చర్చలు వాడివేడిగా జర్గాయన్న సంగతి అందరికీ తెలుసు. కాని అర్జునగారు మీలా కాకుండా నా నుంచి మంచే జరిగిందనీ, చాలా నేర్చుకున్నాననీ నా నిర్వాహక హోదా రాజీనామా సమయంలో తెలిపారు కూడా. అప్పుడు అర్జునను విమర్శించాననీ, ఇప్పుడు చదువరిని విమర్శించానని కాకుండా తెవికీలో జరుగుతున్న పొరపాట్ళనే బయటపెడటం నా పనిగా భావించాల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:20, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఇతరుల పొరపాట్లను ఎంచేముందు, తిఒలగించాలని ముందే అనుకుని అనేక వందల పేజీల్లో చేర్చిన పాఠ్యం సంగతిని గుర్తుకు తెచ్చుకోండి. దానికి క్షమాపణ చెప్పలేదింతవరకు. చివరికి ఆ పేజీల్లో మీరు చేసిన తప్పును రామారావు గారు సరిదిద్దాల్సి వచ్చింది. ఇతరుల పొరపాట్లు ఎంచుతారా మీరు! మీరు తెవికీ పనికొచ్చే పైసా పని చెయ్యరు. ఇప్పుడు ఈ చర్చంతా ఐపోయాక అందరూ మళ్ళీ తెవికీ పనిలో పాల్గొంటారు మీరు తప్ప. మీరు మాత్రం ఇక ఇక్కడ కనబడరు. మళ్ళీ ఎవరినో తిట్టాల్సి వచ్చినపుడు మాత్రమే వచ్చేస్తారు. __చదువరి (చర్చరచనలు) 15:01, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అది తప్పుడు సమాచారం కానేకాదు. తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెకు ప్రతి మండలంలో సముచితస్థానం కల్పించడం చరిత్ర విభాగం పరిపూర్ణం చేయడం అత్యావశక్యం. ప్రతి మండల వ్యాసంలో చరిత్రకు సంబంధించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యం లేకుండా చెప్పలేము. తెలంగాణ ఉద్యమాన్ని సకలజనుల సమె లేకుండా పరిపూర్ణం చేయలేము. సకల జనుల సమ్మె సంఘటనలు జ్ఞప్తికి వస్తేనే ఒళ్ళు పరివశించిపోతోంది. అంతటి ప్రధాన సంఘటనను మండల వ్యాసాలలో చేర్చడం తప్పుపట్టే అవసరం ఎవరికీలేదు. ప్రతి మండలంలో సకలజనుల సమ్మెకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కో మండలంలో ఒక్కోవిధంగా, ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంగా ఆంధ్రోళ్ళకు వ్యతిరేకంగా కొనసాగింది. ఇంకానయం నేను కేవలం కొన్ని వ్ందల మండల వ్యాసాలలో మాత్రమే చేర్చాను. తెలంగాణకు సంబంధించిన అన్ని గ్రామ వ్యాసాలలో అంటె వేలాది వ్యాసాలలో చేర్చినట్లయితే తెలంగాణ వ్యతిరేకుల మతిపోయేదేమో!! సకలజనుల సమ్మె ప్రతిగ్రామంలో ఎలా జరిగిందనే సమాచారం కూడా అప్పట్లో నేను సేకరించానుకూడా. Jai Telangana, Jai Jai Telangana సి. చంద్ర కాంత రావు- చర్చ 17:06, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు తప్పుడు పనిచేస్తున్న చదువరి కూడా రేపు తెవికీ కృషిలో భాగంగా మంచిపనిచేస్తే తప్పకుండా ప్రశంసలు పొందడం ఖాయం అంతేకాని ఇప్పటివాణ్ణి తిట్టేందుకు అప్పటివాణ్ని పొగడుతారు మళ్ళీ రేపటివాణ్ణి విమర్శించేందుకు ఇప్పుడు తిట్టినవాణ్ణే రేపు పొగడుతారు అనే మాటలు అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:27, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేను విమర్శించడానికే ఉన్నాను, నేను ప్రశంసలు ఇచ్చేస్థాయిలో ఉన్నవాణ్ణి అనే మీ ఈ అహంకారమే మిమ్మల్ని పతనానికి తిసుకుపోతోంది.__చదువరి (చర్చరచనలు) 15:01, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేను తెవికీ విమర్శకుడిగా ఉన్నానన్న సంగతి అందరికీ తెలుసు. అందరినీ ఎందుకు విమర్శిస్తాము, తప్పు చేసేవారినే చెప్పడం వల్ల పొరపాట్లను తగ్గించి తెవికీ అభివృద్ధికి దారికల్పించడం విమర్శకుల బాధ్యత. ప్రతీదానికీ తప్పుడు భాష్యం తీసేవారికి ఏమీ చెప్పలేము. విమర్శకుడికి, అహంకారికి కూడా తేడా తెలియకుండా మాట్లాడతం ఏమిటో? ఇదే మీ పతనానికి దారితీస్తోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:48, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పనిమాలిన పాలసీలు, దూషణలూ.. తదితర నిందలు మార్చు

"పనికిమాలిన పాలసీలు చేసి సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేసి, ఆ తర్వాత పట్టించుకోకపోవడం లాంటి పనికిమాలిన పనులు చేయడంలో చదువరి సిద్ధహస్తుడు." ఇదీ రావుగారి మర్యాద. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే.. పాలసీలు చేసింది నేనేనని చెబితే అది సముదాయంలో ఇతర సభ్యులను అవమానించినట్లు అవుతుంది. నేను ఆ మాట అనను. నేను కొన్ని విధానాలను తయారుచేయడం పట్ల చొరవ తీసుకున్నాను, అంతే. నేను చేసిన ప్రతిపాదనల్లో కొన్ని నెగ్గాయి, కొన్ని వీగిపోయాయి, కొన్ని ఎటూ పోకుండా అర్థంతరంగా అగిపోయాయి. ప్రతిపాదించడం వరకే ప్రతిపాదకుడి పని. మిగతాదంతా సముదాయ సభ్యుల పని. ఈమాత్రపు కనీస ఇంగిత జ్ఞానం రావుగారిలో కొరవడిందని నేననను. ఎందుకంటే ఆయనకు ఆ సంగతి తెలిసినా నాపై ఉన్న వ్యక్తిగత ద్వేషం ఆయన చేత ఆ మాటలు చెప్పిస్తోంది. ఆ ద్వేషం ఆయన తలలో నాట్యం చేస్తోంది. అంచేత నేను ప్రతిపాదించినవి పనికిమాలిన విధానాలా కాదా అనేది నేను చర్చించను. ఆయన విజ్ఞతకే వదిలేస్తాను.

ఒకానొక పనికిమాలిన విధానం వలన తాను నిర్వాహకత్వాన్ని వదలుకున్నానని చెప్పారు. నిర్వాహత్వాన్ని వదులుకున్నపుడు, రచ్చబండలో ఆయన చేసిన వాదన చూస్తే విస్తుపోతారు. ఆ విధానం ప్రకారం "నేను" ఆయన్ను నిర్వాహకత్వం నుండి తొలగించలేదంట. దాంతో (నేను ఆయన్ను తొలగించనందున) విసుగెత్తిపోయి, తానే తప్పుకుంటున్నారంట. ఇదీ అప్పుడు ఆయన నాపై వెళ్ళగక్కిన ద్వేషం. విధానాన్ని నేను అమలు చెయ్యడం ఏంటసలు? సూటిగా ఆలోచించేవారు మాట్టాడిల్సిన పద్ధతేనా అది? నిజంగా ఆ పని చెయ్యదలిస్తే విధానం వచ్చినవెంటనే అది తనకు అమలౌతుందని భావిస్తే తానే స్వచ్ఛందంగా తప్పుకుని ఉండాల్సింది. ఆ విధానం చెబుతున్న తొట్టతొలి సూత్రం అదే. అది చెయ్యకుండా, ఆయన్ను తొలగించలేదని నాపై ద్వేషం వెళ్లగక్కారు. నిజానైకి ఆ విధానాన్ని పాటించదలిస్తే ఆయన ఏం చేసి ఉండాల్సిందంటే.., వికీకి వచ్చినపుడు (వికీపీడియా లోకి అసలు రాకనే పోతే ఆ విధానం అసలు వర్తించనే వర్తించదు) కాస్త నిర్వాహక పనులు కూడా చెయ్యడం. అదీ "చిత్తశుద్ధి"ని నిరూపించుకోవడం అంటే! అలా చేసి ఉంటే ఆ విధానానికి సార్థకత ఉండేది. కానీ రావు గారు ఆ ఆప్షను తీసుకోలేదు.

పైగా "ఇప్పుడు చదువరి కూడా నిర్వాహక మరియు అధికార పదవులకు రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి." అని నాకు ఉద్బోధించారు. రావు గారూ మీరు సలహాను పాటించను. ఎందుకంటే నేను మీలాగా తప్పులు చెయ్యలేదు. ఎందుకంటే వికీపట్ల నాకు నిబద్ధత ఉంది. ఇక్కడ పని చెయ్యడమే నాకు తెలుసు గానీ, పని చెడగొట్టడం తెలియదు. అదీ నా "చిత్తశుద్ధి". ఈ సమాధానం వలన మీకు చిరాకు కలగవచ్చు బహుశా. ఎందుకంటే మీలో వివేచన లేదు, నా పట్ల ద్వేషం తప్ప. మీరు "హేతువు"కు తిలోదకాలిచ్చి చాన్నాళ్ళే అయిపోయింది.

రావుగారూ, చిత్తశుద్ధి గురించి మీకు మరొక్క ఉదాహరణ చెబుతాను.. ఈ మధ్య ఒక వాడుకరి కొందరు వికీపీడియన్లకు వికీపేజీలు (ప్రధానబరిలో పేజిల గురించి మాట్టాడుతున్నాను) సృష్టించారు. వాళ్లంతా, తమకు అంతటి "విషయ ప్రాముఖ్యత" లేదని భావించి, తమతమ పేజీలను - తక్షణమే - తొలగించివేసారు. ఆ వాడుకరుల్లో నేనూ ఒకణ్ణి. మేం "చిత్తశుద్ధి నిరూపించుకున్నాం చూసారా" అని వాళ్ళలో ఒక్కరు కూడా పోజు కొట్టలేదు. వికీలో తమ పని తాము చేసుకుపోయారంతే! ఎందుకో తెలుసా..? చిత్తశుద్ధి ఉండడం ముఖ్యం, ఉందని చెప్పుకోవడం కాదు అని వాళ్లకు తెలుసు. మరి మీరు.., మీకు పేజీ సృష్టించినపుడు మీరేం చేసారు? ఏం విషయ ప్రాముఖ్యత ఉందని మీ పేజీని ఉంచుకున్నారు? ఇలాంటివి వెనక పెట్టుకుని, నేను "చిత్తశుద్ధిని నిరూపించుకున్నాను" అని చెప్పుకోవడం ఎప్పటికప్పుడు అవసరం అవుతూ ఉంటుంది. తప్పదు. అలాంటపుడు నా పేజీని ఎందుకు తొలగించలేదు అని మీరు నన్ను అడుగుతారు, నాకు తెలుసు. దానికి నా సమాధానం ఇదే - నాకుగా నేను మిమ్మల్ని ఏమీ అనకుండానే నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు, ఇక ఈ పని చేస్తే ఇంకా ఎంతలా ద్వేషిస్తారో అనే ఆలోచించి వెనక్కి తగ్గాను.

రావుగారికి నాపై ఉన్న అక్కసు ఎంతలా పెరిగి పోయిందంటే... నేను చేసిన పని "గుండు సున్నా" అనేంత. పనికిమాలిన పాలసీలు చేసానని ఒకపక్క తిడుతూనే నే చేసిన పని గుండు సున్నా అని అన్నారు. పనికిమాలినదా కాదా అనేది వ్యక్తి అభిరుచిని బట్టి ఉంటుంది. రావు గారి అభిరుచి ఎలా ఉందన్నది పక్కనబెడితే అసలంటూ పని చేసానని ఆయనే ఒప్పుకున్నారు. తాను చేసిన గుండు సున్నా ఆరోపణను తానే ఖండించుకున్నారు. అది ఆయనకు మామూలే అనేది అనేక సార్లు ఋజువైంది -నిన్నటి మంచి ఇవ్వాళ చెడు అవుతుంది. మళ్ళీ అదే రేపటికి మంచి అవుతుంది.

పోతే నేను ఆయన్ను దూషించానని రాసారు. అది అబద్ధం. ఆయనే నన్ను దూషించారు గానీ, నేను ఆయన్ను దూషించలేదు. అంచేతనే నేమో.. ఆయన ఆ సందర్భానికి లింకు ఇవ్వలేదు. కానీ, నేను ఊరుకోను.., ఆ లింకు నేను ఇస్తాను. రావుగారూ.., ఇదిగోండి ఆ లింకు. అందులో నేను మిమ్మల్ని దూషించినది ఎక్కడో చెప్పండి. కానీ, "కెలకడం" మాటతో నేనే మిమ్మల్ని దూషించానని ఆరోపించారు అందులో. నేను ఆ మాట వాడలేదు, మీరే నాలుగైదు సార్లు వాడారు అని నేను జవాబు చెబితే మీ నోట మళ్ళీ మాట లేదు. అ తరువాత మీరు ఆ చర్చలో కనబడనే లేదు. పైగా ఇక్కడకొచ్చి నేను మిమ్మల్ని దూషించానని అంటున్నారు. అబద్ధాలు చెప్పడం తప్పు రావు గారూ. మీరు ఈ అలవాటు మానుకోవాలి. ఆ చర్చలో మీరు రాసిన అబద్ధాల గురించి కూడా ప్రస్తావించాను, గుర్తుకు తెచ్చుకోండి.

రావు గారూ మీ అసలు రూపం గురించి, మీ మనస్తత్వం గురించీ సోదాహరణంగా మాట్టాడ్డం ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తాను.

తోటి వాడుకరులకు విజ్ఞప్తి - నేనేంటో నా పని చూసి తెలుసుకోవచ్చు - నా వాడుకరి పేజీలో టూకీగా ఉంటుంది. __చదువరి (చర్చరచనలు) 07:07, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంత రావు గారు మర్యాదగా మాట్లాడితే బావుంటుంది! మార్చు

వాడుకరి:C.Chandra Kanth Rao గారూ!

  • //తెవికీ తరఫున లాభదాయక పదవులు పొంది లక్షల్లో జీతం పొందిన పవన్ కూడా నిర్లక్ష్యపూర్వక ధోరణిలో ఉండుట శోచనీయం.// అన్నారు పైన.
  • మీరు ఏది పడితే అది మాట్లాడడం బావోలేదు, మర్యాదగా మాట్లాడండి. ఉదాహరణకు: మీరు ప్రభుత్వోద్యోగి, నేను టాక్స్‌ పేయర్‌ని, అంటే నేను కట్టిన పన్నులోంచి ఎంతో కొంత భాగం మీవంటి ప్రభుత్వోద్యోగుల జీతాలకు, భత్యాలకు వస్తాయి. అంతమాత్రం చేత నేను మిమ్మల్ని చిటికేసి పిలవొచ్చనీ "ప్రభుత్వం నుంచి జీతాలు పొందిన" అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చని, మీ పెర్ఫార్మెన్సు, లోటుపాట్లు నాకు నివేదిక ఇవ్వాలని అనుకుంటే మీకెలా ఉంటుంది? హాస్యాస్పదంగా, అగౌరవంగా ఉండదా? ఇప్పుడు మీరు మాట్లాడిన మాట అంతకన్నా చాలా చాలా ఎక్కువ అమర్యాదగా ఉంటుంది. గాజు గదుల్లో ఉన్నవాళ్ళు బయటివాళ్ళ మీద రాళ్ళు వెయ్యకూడదు. ఏతావతా చెప్పేదేమిటంటే - కాస్త మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ ఈ ధోరణి తగ్గించుకోవడం మంచిది. మీకు నేను మర్యాద ఇవ్వడమూ, మీరు నన్ను అమర్యాదగా మాట్లాడడమూ చెల్లుతుందనుకోకండి.
  • //తిరుపతి మహాసభల ఖర్చు లెక్కలు ఇప్పటికీ తేల్చలేరు.// అన్నారు మళ్ళీ.
  • ఆ మహాసభలో డబ్బు ఎవరు ఖర్చుపెట్టారు? ఎవరు లెక్కతేల్చాలి? ఎవరిని ఎవరు అడగాలి- ఏమైనా తెలుసా మీకు? మీరు మాట్లాడే ధోరణి ఎలా ఉందంటే, రేపు మీరు రిటైరయ్యాకా "చార్లెస్ శోభ్‌రాజ్‌ అన్ని హత్యలు చేస్తుంటే సకాలంలో ఎందుకు పట్టుకోలేదు మీరు?" అని నేను మిమ్మల్ని అడిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. చార్లెస్ శోభ్‌రాజ్‌ను పట్టుకోవాల్సిన పోలీస్, గూఢచర్య సంస్థలూ ప్రభుత్వానికే చెందినవీ, మీరూ ప్రభుత్వోద్యోగిగానే రిటైర్ అయ్యారు కాబట్టి అసందర్భంగా మిమ్మల్ని అడగొచ్చు అనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది కదా. ఇదీ అంతే హాస్యాస్పదమైన సంగతి. మీరు రాస్తున్న ధోరణి చూస్తే మీకు ఉదాహరణ ఇచ్చి చెప్తే తప్ప అర్థం కాదని అనిపించి ఇలా చెప్పాను, మళ్ళీ ఈ ఉదాహరణ పట్టుకుని సాగదీయవద్దు. విషయం ఏమిటంటే - మీరు ఎవరిని పడితే వాళ్ళని ఏదైనా అడిగేయగలను అనుకోకండి. ఎంత నామీద మీరు ఏవో మనసులో పెట్టుకుంటే మాత్రం నాకు సంబంధం లేని సంగతులు నన్ను అడుగుతారా?
  • //అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు. అనవసరంగా నిందించకండి, అతను తెలుగు భాషాభిమాని.// అని ఆ చెత్త రాతలకు ప్రోద్బలం, ప్రోత్సాహం అందిస్తున్నారు.
  • మమ్మల్ని "అరే, తురే" అని సంబోధిస్తున్నాడు అజ్ఞాతంగా, అలాంటివాడిని వెనకేసుకుని వస్తారా? అంటే మీరు రేపట్నించీ మమ్మల్ని "అరే ఒరే" అంటారా? మిమ్మల్ని ఎవరైనా అంటే మీకు ఓకేనా? "పందులు" అని నన్ను, చదువరి గారిని సంబోధించిన ఈ అజ్ఞాత వాడుకరి తెలుగు భాషాభిమానియా? అంత బాగా తెలుసా మీకు? మీకు విడిగా పరిచయం ఉందా అతనితో? అలాంటి దుశ్చర్యలకు మీ ప్రోద్బలం, ప్రోత్సాహం, కితాబులు దేనికి?
  • //ప్రణయ్, రమణలు అలా అభిప్రాయపడటం తప్పు. అభిప్రాయాల ప్రకారం రచ్చబండ వ్యాఖ్యలను తొలగించే అవకాశం లేదు.// అన్నారు మీరిప్పుడు.
  • 14 ఏళ్ళ క్రితం ఒకసారి, ఏడేళ్ళ క్రితం మరొకసారి అదే మీరు (చంద్రకాంతరావు గారు) "చర్చలలో తమ అభిప్రాయాలు తెలిపే వారు సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. ఐపీ అడ్రస్ తో చర్చాపేజీలలో వ్రాసిననూ ప్రాధాన్యత ఉండదు. అంతేకాకుండా ఆ విషయాలను చర్చా పేజీల నుంచి పూర్తిగా తొలిగించవచ్చు కూడా." అనీ, "వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను" అనీ అజ్ఞాతంగా రాసేవారి గురించి మాట్లాడారని చదువరి గారు బట్టబయలు చేశారు. ఐపీ అడ్రస్‌లు బ్లాక్ చేయడం గురించి ఇప్పుడెందుకు ఇంత బాధ కలుగుతోందో మీకు, మమ్మల్ని, మాతోపాటు ఇతర నిర్వాహకులను ఇంకో నాలుగు బూతులు తిట్టి ప్రోత్సహిద్దామనేనా? ఎంతటి అకారణ ద్వేషం మీకు మామీద ఉన్నా, ఇలాంటి సందర్భంలో అజ్ఞాతలతో మమ్మల్ని నానా తిట్లూ తిట్టిస్తూ ప్రోత్సహించడం సరికాదు.

మీరు రాసిన కొన్ని రాతలు దాడులుగా పరిణమిస్తున్నాయి కాబట్టీ, మీ అజ్ఞాతలు దాడులు చేయడానికి ప్రోత్సాహం, ప్రోద్బలం కలిగిస్తున్నాయి కాబట్టి తగదు అని నేను మీకు చెప్తున్న హితవు ఇది. మీరు ఒక ఖాతాతో రాస్తున్నారు కాబట్టి మీకు ఈ హితవు చెప్పగలుగుతున్నాం. ఖాతాతో రాసినవారు వ్యక్తిగత దాడులు చేసినా నిర్వాహకులు ఒకటి రెండుసార్లైనా హితవు చెప్పి చూడగలరు. అజ్ఞాతంగా రాస్తే ఇలా చెప్పలేం. ఆ రాతలను బట్టి చర్యలు తీసుకోవడం తప్ప మార్గం ఉండదు. ఈమాత్రం అవగాహన అయినా ఈసారి నుంచి కలిగివుంటారని ఆశిస్తున్నాను. ఇకపై వికీపీడియాలో ఈ వ్యక్తిగత దాడులు మానుకొమ్మని సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ)

ఐపి అడ్రస్ తో రాసిన చర్చపేజీలను తొలిగించాలని నేను చెప్పినది రచ్చబండ వ్యాఖ్యలకు సంబంధం లేదు. పై విభాగంలో వివరంగా రాశాను చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:35, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞాత వాడుకరిని వేనుకేసుకోవడం కాదు కాని ఆ స్థితి కల్పించుకున్నది మీరిద్దరే. తిట్లు తినడం మీ స్వయంకృతాపరాధం. నిర్వాహకులై ఉండి కూడా చర్చకు చర్చ సమాధానం ఇవ్వకుండా అనసరంగా నిరోధం ఎందుకు విధించినట్లు? చేతిలో అధికారం ఉందని నిరోధం విధించడం మరో తప్పిదం కూడా. నిర్వాహకహోదాను దుర్వినియోగపర్చడమే కాకుండా అనామక సభ్యుల ఎదుట తమ నిర్వాహకహోదా ప్రాతాపాన్ని ప్రదర్శించినట్లుగా పరిగణించవల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:35, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@C.Chandra Kanth Rao: ఈ డొంకతిరుగుడు వదిలిపెట్టి సూటిగా సమాధానం చెప్పగలిగితే చెప్పండి, అజ్ఞాత వాడుకరి ఒకడు నన్నూ, చదువరి గారినీ పందులు అని తిట్టాడు, దీన్ని మీరు సమర్థిస్తున్నారా? సాధ్యమైనంత సూటిగా సమాధానం చెప్పండి. నిషేధం విధిస్తే తిట్టాడనో మరోటనో మాట్లాడవద్దు. "అజ్ఞత వాడుకరి రాసినది చెత్త కానేకాదు" అన్నారు. ఈ పందులు, ఒరే వంటి భాషకు మీ మద్దతు ఉందా లేదా? --పవన్ సంతోష్ (చర్చ) 17:58, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞాతకు నేణు మద్దతు తెల్పడం కాదుకాని చిన్న సమస్యను పరిష్కరించడానికి బదులు నిషేధాలపై నిషేధాలు విధించి సమస్యను పెద్దగా చేసి స్వయంగా కల్పించికున్న స్వయంకృతాభిరామమిది. చిన్న నిర్వహణే పరిష్కరించనప్పుడు, దానికై నిర్వహ హోదా దుర్వినియోగపర్చినప్పుడు చేతిలో పదవులు ఉంచుకోవడం తప్పు. అసలు పదవులు పట్టుకొని వేలాడమేమిటో ? నిర్వాహక హోదాపై అంత ఆసక్తి ఏమిటో? సి. చంద్ర కాంత రావు- చర్చ 21:40, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మూలకారణం మార్చు

ఈ వివాదానికి మూలకారణం యర్రారామారావు దిద్దుబాట్లే. సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం. నిర్వాహకుడై ఉండి కూడా ఇలా చేయడం, చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్ననూ ఇతర నిర్వాహకులు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండుటయే చిలికి చిలికి వివాదం పెద్దదైంది. నా అనుభవంలో ఇదివరకు కూడా ఇలాంటి వివాదాలు చాలాచూశాను. అన్నీ నిర్వాహక తప్పిదాల వల్లనే తలెత్తాయి. సమీప భవిష్యత్తులో మరో వివాదం వచ్చే అవకాశం ఉంది. అదికూడా యర్రాకు చెందిన వెబ్‌సైట్ లింకుల విషయంలోనే. బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా అవన్నీ వెంటనే తొలిగించి ఆంగ్ల వికీలో ఉన్నట్లుగా ప్రభ్య్త్వ ఉత్తర్వు సంఖ్య, తేదీ ఇస్తే సరిపోతుంది. బాటు లేదా AWB సభ్యత్వం ఉన్నవారికి ఈ మార్పులు సునాయాసంగా చేయవచ్చు. అర్జున లాంటి వారికి ఇది చిటికెలో పని. మానవీయంగా చేయడం మళ్ళీ వివాదమే కావచ్చు. ఎలాగైనా సరే త్వరలోనే అర్జునగారు ఈ పని బాటు ద్వారా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:59, 15 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సార్ సికె రావు గారూ వికీలో మీరు చేయరు.చురుకుగా చేసే వాళ్ల మీద ఆధారాలు లేని నిందలు, అపవాదులు, వారి మీదకు ఇతరులను రెచ్చగొట్టే ఫోబియా చర్యలు మాత్రం మీకు కొట్టిన పిండి లాంటివని మీ చర్చలు సరళి ద్వారా అందరూ తెలుసుకోవటానికి మంచి అవకాశం కలిగించుచున్నందుకు ధన్యవాదాలు.ఇక మూలకారణం గురించి మీరు రాసిన చర్చా విభాగంలో పాయింట్లు వారిగా నా అభిప్రాయాలు తెలుపుతున్నాను.
  • ఈ వివాదానికి మూలకారణం యర్రారామారావు దిద్దుబాట్లే. సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగించడమే అసలుకారణం.
సార్ సికె రావు గారూ  ఆలస్యంగానైనా ఈ విభాగం  చర్చకు పెట్టినందుకు ధన్యవాదాలు.మరి నేను కారణం అయితే అజ్ఞాత వాడుకరి, చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన చేసినప్పుడు, ఈ ప్రతిపాదన తగదు, దీనికి అసలు మూల కారణం యర్రా రామారావు అనే వ్యక్తి,ఆయనమీద నిరోధం విధించటానికి ప్రతిపాదన పెట్టాలనికానీ, చదువురి మీద నిరోధం పెట్టటం ఏమిటి అని, మీ సన్నిహిత అజ్ఞాత వాడుకరిని ఖండించకుండా, ఆదరాబాదరా పనిగట్టుకునివచ్చి, మద్దతు ఎందుకు తెలిపారు. మీ సన్నిహిత అజ్ఞాత వాడుకరి అని, ఎందుకు అన్నానంటే, ఇప్పటివరకు దీనిమీద సాగిన చర్చలలో, మీరు అజ్ఞాత వాడుకరి తరుపున పూర్తి వకాల్తా తీసుకుని చెపుతున్నట్లుగా తెలుస్తుంది.అందువలన అనుమానించవలసి వస్తుంది.దీనిని బట్టి చదువరిగారిపై ద్వేషంపెంచుకుని, అజ్ఞాత వాడుకరి ముసుగులో పరోక్షంగా వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నట్లు, ఎలాంటి సందేహం లేకుండా ఎవరికైనా అర్థమవుతుంది.నిర్వాహకులను పందులు అని అనుచిత పదాలతో తిట్టిననూ మాట మాత్రం ఖండించకుండా, పైన ఒక సందర్బంలో తిట్లు చిన్న కారణంఅని ఒక సర్టిఫికెట్ ఇచ్చారంటే, ఇంకా మీ సన్నిహిత అజ్ఞాత వాడుకరి అనే పదానికి ఇంకా బలం చేకూరుతుంది.మీరు వకాల్తా పట్టించుకుని అజ్ఞాత వాడుకరికి పనితగ్గించినట్లుగా తెలుస్తుంది.
  • నిర్వాహకుడై ఉండి కూడా ఇలా చేయడం, చాలా రోజుల నుంచి ఇలా చేస్తున్ననూ ఇతర నిర్వాహకులు కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా ఉండుటయే చిలికి చిలికి వివాదం పెద్దదైంది.
చాలా రోజులనుండి చేస్తున్నప్పుడు, మొన్నమొన్నటిదాక మీరూ నిర్వహకుడుగా ఉన్నారే?మరి నాకు చర్చా పేజీ ద్వారా నేరుగా తెలుపవచ్చు,  ఒక వేళ అది మీకు చిన్న తనంగా భావిస్తే రచ్చబండలో  “యర్రారామారావు సునాయాస లేదా చిన్న దిద్దుబాట్లు చేస్తూ, ఇటీవలి మార్పులు మొత్తం ఇతరులకు చికాకుగా కలిగిస్తున్నాయి" అని చర్చ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు. అసలు వీటివలన మీరనుకున్నట్లు ఏదైనా చికాకు కలిగితే చురుకుగా వికీలో పనిచేసే చదువరి అర్జున, వెంకటరమణ, ప్రణయరాజ్, రవిచంద్ర, గారలకు, ఇంకా తదితరులు ఎవరైనా గౌరవ వాడుకరులకు ఇబ్బంది అనిపించాలి.మీకు అసలు ఇబ్బంది లేదు, ఎందుకంటే మీరు ఇటీవల మార్పులు అంతగా చూసి, సవరణలు చేసిన జాడ నేను ఇంతవరకు చూడలేదు. ఇక అజ్ఞాత వాడుకరికి చిరాకు వచ్చింది,అందుకే ఈ పరిస్థితికి వచ్చిందని మరల అది ఒక వత్తాసు.
  • నా అనుభవంలో ఇదివరకు కూడా ఇలాంటి వివాదాలు చాలాచూశాను. అన్నీ నిర్వాహక తప్పిదాల వల్లనే తలెత్తాయి.
ఈ ఊతపద వాక్యాలు మీరు పాల్గొన్న ప్రతి చర్చలలో ఉంటాయి.వీటివలన వికీకి ఏమీ ఉపయోగంలేదు. పరోక్షంగా మీకు మీరే గొప్పవాడినని చెప్పుకోవటానికి ఉపయోగించుకోవటానికి వాడుచున్నట్లు అర్థమవుతుంది.
  • సమీప భవిష్యత్తులో మరో వివాదం వచ్చే అవకాశం ఉంది. అదికూడా యర్రాకు చెందిన వెబ్‌సైట్ లింకుల విషయంలోనే.
జ్వోతిషం కూడా చెపుతున్నారే.ఒకసారి ఆ వెబ్‌సైట్ లింకుల చర్చ మళ్లీ ఒకసారి చదవండి.లేవనెత్తారు కాబట్టి ఆ చర్చలో నేను వెల్లడించిన అభిప్రాయాలు మరియొకసారి చెపుతున్నాను.తెలుసుకోండి.
సదరు సభ్యుడు రాసిన చర్చను తొలగించి ఇప్పుడు కాకరాకుండా చేసి నన్ను జ్యోతిష్కుడిగా పేర్కొనే అవసరం ఎలా వచ్చింది. తప్పెవరిది. తొలగించిన ఈ లింకు అందరూ [చూడాల్సిందే https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81&curid=133441&diff=3217337&oldid=3217040] సి. చంద్ర కాంత రావు- చర్చ 18:03, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
“ తెలంగాణలో గ్రామాల ప్రాజెక్టు చేసేటప్పుడు నాకు ఇంత పరిజ్ఞానం లేనిమాట వాస్తవం. అప్పుడు ఆ ఉత్తర్వులు వెబ్ సైట్లో పెట్టి అన్నిటికి కాదుగానీ, కొన్ని వ్యాసాలుకు ఇవ్వబడినవి.ఆ వెబ్ సైట్ తగిన విధంగా చేయటానికి కూడా వికీపీడియాలో చేరిన తరువాత ఇందులోనే పూర్తి సమయం వెచ్చించి, దానిని అభివృద్ది చేయలేకపోతున్నాను.అయితే మీరు అనుకున్నట్లు వ్యాపార ప్రకటనలు కోసం ఏర్పాటు చేయబడిందికాదు. దానిలో ఒక్క వ్యాపార ప్రకటన కూడా లేదు.కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించబడింది.అసలు నేనే దానిని రద్దు పరచుకుందామా అనే అభిప్రాయంలో ఉన్నాను.ఆ మూలాలన్నటిని తొలగించినా నాకు అభ్యంతరంలేదు.వికీ నియమాలు ముఖ్యం.అయితే గ్రామ వ్యాసాలుకు, మండల వ్యాసాలుకు మూలాలు కూర్పు కూడా అలోచించండి.వాటిని మీరు యంత్రం/బాటు ద్వారా తొలగించగలరు” అని ఆ చర్చలో అర్జున గారిని ఉద్దేశించి చెప్పాను.  ఆ వెబ్‌సైట్ కూడా రద్దు చేసుకున్నాను.అదే అభిప్రాయాలు నాకన్నాముందుగా చదువరి గారూ, రవిచంద్ర గారూ వివరంగా చెప్పారు.
  • ఇక సికె రావు గారి అసలు స్వరూపం గురించి నా అనుమానాలు
మరిదీని మీద మరో వివాదం వస్తుందని జ్వోతిషం చెపుతున్నారంటే సికె రావు గారితో ఆజ్ఞాత వాడుకరి సంప్రదింపులు జరిపినట్లు బలం చేకూరుతుంది. నేనే కాదు సికె రావు గారి చర్చలు సరళిని బట్టి, చదువరి  గారికి బలమైన అభిప్రాయం కలిగి, కింద చర్చలో వెలుబుచ్చారు.
ఇక్కడ అందరికి తెలియటానికి ఇంకొకటి చెప్పాలి.వికీని అడ్డం పెట్టుకుని ఇందులోని వ్యాసాలు, ఫోటోలు పెట్టి కొంతమందిలాగా నేను మిర్రర్ సైట్ లాగా అభివృద్ధి చేసుకోలేదు.గౌరవ వికీపీడియన్లు ఎవరైనా ఆ చర్చను పరిశీలించానుకుంటే ఈ లింకు ద్వారా వాస్తవాలు గ్రహించవచ్చు.
వెబ్‌సైట్ లింకుల విషయంలో బాటు ద్వారా తొలగించటానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా అర్జునగారిని మరియెకసారి కోరుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:23, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
విషయం ఏమిటంటే - రామారావు గారు బాగా పనిచేస్తున్నారు. తద్వారా ఇటీవలి మార్పులు అంతటా ఆయనే కనిపిస్తున్నారు. ఎలాగైనా ఆయనతో పనిమాన్పించాలి. కాబట్టి, అజ్ఞాతలతో దాడులు, అజ్ఞాతలు చేసిన దాడులకు మాజీ నిర్వాహకుల సమర్థనలు జరుగుతున్నాయి. అంతే కదా? అయినా నిత్యం వికీపీడియాలో పనిచేసే ఇంతమందికి లేని చికాకు అతనెవరో అజ్ఞాతకు, తిట్ల పురాణాలను సమర్థించడానికి తప్ప వికీకి రాని మీకు దేనికి? రామారావు గారిపైన మీరు ఇలాంటి వెయ్యిదాడులు చేయించినా ఆయన తెలుగు వికీపీడియాకు సేవ చెయ్యడం మానరు. ఈ శ్రమ దండుగ పని మానుకొమ్మని మీ భాషాభిమాన అజ్ఞాతకు చెప్పండి. --పవన్ సంతోష్ (చర్చ) 01:38, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ రచ్చ మొదలయ్యాక రావు గారు అజ్ఞాతకు మద్దతుగా వచ్చినపుడు అజ్ఞాత ఎవరో ఈయనకు గానీ తెలుసా అనే సందేహం నాకు వచ్చినప్పటికీ అది కరెక్టనిపించలేదు. దాన్ని మనసులోంచి తీసేసాను. ఆయన అలాంటి పని చెయ్యడని అనిపించించింది. అనేదేమైనా ఉంటే నేరుగా పేరు పెట్టుకునే అంటారని అనుకున్నాను.
అబ్బబ్బో రామారావు బాగా పనిచేస్తున్నాడా? ఇది ప్రపంచపు ఎన్నో వింతనో అది కూడా చెబితే బాగుండేది. అజ్ఞతకు నాకు ముడివేయడమేంటీ! మన నిర్వాకుల కంటే యర్రా చేస్తున్న పొరపాటును ధైర్యంగా బయటపెట్టాడంతే. అదే పని నిర్వాహకులెవరైనే చెప్పియుంటే తప్పకుండా ప్రశంశించేవాడిని. నాకు సన్నిహితుడని చెబుతున్న ఆ అజ్ఞతను నాకు సన్నిహితంగా ఉన్నట్లుగా ఎవరైన కనీసం కలలోనైనా చూశారా. అలా చూసియుంటే కనీసం ఛాయాచిత్రం గీచినైనా అప్లోడ్ చేయండి. ఆ ధైర్యవంతుడి బొమ్మైనా చూద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:59, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కానీ సమయం గడిచే కొద్దీ, ఆయన చేస్తున్న వాదనను చూస్తే నాకు ఆ సందేహం తిరిగి కలుగుతోంది. అజ్ఞాత చేసినది తప్పు కాదని అనడం, అజ్ఞాత తిట్టడానికి కారణం మీరిద్దరే కాబట్టి తప్పు మీదేనని అనడం, ఐపి అడ్రసులను నిరోధించడం తప్పని అంటూ దాన్ని మళ్ళీ మళ్ళీ సమర్ధించుకోవడం, రచ్చబండలో రాసినదాన్ని తొలగించకూడదని అబద్ధాలు చెబుతూ దాన్ని తిరిగి తిరిగి సమర్ధించుకోవడం, అజ్ఞాత తెలుగు అభిమాని అంటూ (వారెవరో తనకు తెలిసినట్లు) మాట్టాడ్డం, ఆయన రాయడం మొదలెట్టాక ఆ అజ్ఞాత ఇక రాయకపోవడం.. ఇలాంటివి చూస్తే కొంత అనుమానం కలుగుతోంది. ఆయన ఒకప్పుడు నిర్వాహకుడుగా పనిచేసిన వ్యక్తి. ఐపీ అడ్రసులను నిరోధించ కూడదు, రచ్చబండలో రివర్టులు చెయ్యరాదు అంటూ మాట్టాడితే అవి - నిర్వాహకుడిగా పనిచేసినా పెద్దగా ఏమీ నేర్చుకున్నట్టు లేరే అని అనుకుంటారు. మహా అయితే అవి ఆయన పరిమిత పరిజ్ఞానాన్ని అమాయకత్వాన్నీ బయటపెడతాయి. కానీ ఇలా అజ్ఞాతలను నిర్హేతుకంగా సమర్ధించుకుంటూ పోతే, అది బయటపెట్టేది ఆయన అమాయకత్వాన్ని కాదని ఆయన గ్రహించాలి. __చదువరి (చర్చరచనలు) 05:03, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@C.Chandra Kanth Rao గారూ, ఆ వెబ్ లింకుల విషయం అర్జున గారు లేవనెత్తినపుడు రామారావు గారు, తనకు తెలియక చేసానని, ఆ తప్పును అంగీకరించారనీ గుర్తు. ఆయనేమీ మొండిగా నాది తప్పేంకాదు అని మాట్టాళ్ళేదు. వందలాది పేజీల్లో తప్పుడు సమాచారం చేర్చి తరువాత అదేంటని అడిగితే కొన్నాళ్ళాగాక తీసేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను. అందుకు విచారిస్తున్నాను. అంటూ మీరు చెప్పినట్టు చెప్పలేదు ఆయన. చివరికి ఆ సమాచారాన్ని రామారావు గారే పూనుకుని మీరు చేర్చిన ఆ చెత్తను తీసెయ్యాల్సి వచ్చింది. అందుకు మీరు ఆయన పట్ల కనీసమాత్రపు కృతజ్ఞత చూపకపోగా ఇదుగో ఇప్పుడిలా ఆయన్ను చిన్నబుచ్చుతున్నారు. పనిచేసేవాళ్ళను విమర్శిస్తూ మాట్టాడుతున్నారు మీరు. పైగా ఆ పని చెయ్యలేదని నిర్వాహకులను విమర్శిస్తున్నారు. మీ అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. మీరెలాగూ పని చెయ్యరు.. పర్లేదు. కానీ పనిచేసేవాళ్లను విమర్శించడం దయచేసి మానండి. __ చదువరి (చర్చరచనలు) 05:14, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సునాయాసమైన చిన్న దిద్దుబాట్లైనా వ్యాసానికి మేలు చేసే దిద్దుబాట్లే కదా చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల మార్పుల్లో ఆయన మార్పులు కనిపించకుండా ఉండాలంటే ఎవరైనా ఒక వడపోత సృష్టించుకోవచ్చు. అది పెద్ద పనే కాదు. ఒకవేళ యాంత్రిక పనులు చేయవలసి వచ్చినా అందుకు సమయం పడుతుంది, పైగా అది చేసే వాళ్ళకు ఆ పనిపైన ఆసక్తి ఉండాలి. అర్జున గారు చేయగలిగినా ఆయనకు ఆసక్తి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు రామారావు గారు మాన్యువల్ గా చేస్తే తప్పేమిటి? ఇందులో నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చంద్రకాంతరావు గారు దయచేసి ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. రవిచంద్ర (చర్చ) 06:50, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
'తాను చెయ్యను, ఇంకొకరిని చెయ్యనియ్యను అన్నట్లుంది' ఆయన పద్ధతి. అయినా యర్రారామారావు చేస్తున్న దిద్దుబాట్ల విషయంలో ప్రతిరోజూ వికీలో రాస్తున్న మాకు ఎలాంటి సమస్య లేనప్పుడు.... ఆర్నెల్లకో ఏడాదికో సెలవులమీద వికీకి వచ్చే చంద్రకాంతరావు గారికి, అసలు తెవికీతో ఎలాంటి సంబంధం లేని సదరు తెలుగు భాషాభిమానికి ఏం సమస్య ఉందో నాకైతే అర్ధంకావట్లేదు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:05, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@ ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది? అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా? అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!! సి. చంద్ర కాంత రావు- చర్చ 21:49, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ రాజ్ గారూ ఇంత మంది సికె రావు గారికి చెంపపెళ్లు లాంటి సమాధానాలు ఇచ్చినా మార్పులేదు.మనం పట్టించుకోవలసిన అవసరంలేదు.మనం ప్రతిస్పందించుట కూడా దండగ మారి పని.వదిలేసేయ్.మనపని మనం చేసుకుపోవటం ఉత్తమం. యర్రా రామారావు (చర్చ) 08:33, 19 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా! ఏమిటీ చెప్పేదీ? తెవికీలో నా చర్చలను అర్థం చేసుకొనే స్థోమతే ఎవరికీ లేనప్పుడు (ఒక్క సభ్యుడు మినహా) నాకు సమాధానం ఇచ్చినదెవరు? ఇష్టమున్నట్లుగా మాట్లాడడం కుదరదు. కొందరు తప్పులపై తప్పులు చేసి నిర్వాహక హోదాలను దుర్వినియోగపర్చి, కొందరు తెవికీని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ నిర్వహణను గాలికి వదిలేసి ఈ సన్నాయి నొక్కులేంటీ? కనీసం నన్ను కాకున్నా తెవికీ పాలసీలను, సంప్రదాయాలను, గత చర్చలను అయినా పట్టించుకున్నా ఇలాంటి వివాదాలకు ఆస్కారమే ఉండదు. లేకుంటే నిర్వాహక హోదాలను త్యజించి వెళ్ళిపోవడం తెవికీకి మంచిది. తెవికీలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక పెద్ద్ద చర్చలు చిన్న లేదా సునాయాస దిద్దుబాట్లకు సంబంధించినవేనని సీనియర్ సభ్యులకు మరియు రచ్చబండను పరిశీలించే సభ్యులకు తెలుసు. ఇంత జర్గినా ఈ వివాదం జరుగుతున్నా మళ్ళీ నిన్నటి నుంచి తెలంగాణ గ్రామ వ్యాసాలలో మూలాలు తీసివేసే మరో బృహత్సమస్యకు పూనుకోవడం ఏమిటో? వివాదాలను సృష్టించడం అంటే అంత ఉత్సాహమా? తెవికీని సాఫీగా నడపడం ఇష్టం లేదా? ఇంతచేసీ మళ్ళీ ఇతరులపై నెట్టడం మాత్రం చేస్తారు. మూలకారకులెవరో స్పష్టంగా తెలుస్తున్ననూ ఇతర నిర్వాహకులు ఏ మయ్యారు? సి. చంద్ర కాంత రావు- చర్చ 00:11, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ చర్చలతో మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము. ముఖ్యంగా చంద్రకాంతరావు గారు. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు. మనం వున్న కరోనా సంక్షోభం సమయంలో కూడా వీరిద్దరు, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గార్లు అవిశ్రాంతంగా తెవికీని ముందుకు తీసుకొని పోవడానికి శ్రమిస్తున్నారు. వీరు చేస్తున్న కృషి మెచ్చుకోదగ్గది. ముఖ్యంగా చదువరి గారి మీద నిషేధం విధించాల్సిన పొరపాటు ఏమీ ఇక్కడ జరగలేదని నా అభిప్రాయం. అర్జునరావుగారికి ఒక విషయంలో (స్వాగతం మూస విషయంలో) జరిగిన చర్చ పరిష్కారం అయినది. ఏ విధమైన సమస్యలోనైనా అందరినీ సంతృప్తి పరచడం జరుగదు ఏ వ్యవస్థలోనైనా. అదే మాదిరిగా కొన్ని విషయాలలో కొందరికి అసహనం కలుగుతుంది. వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది. ఇక చంద్రకాంతక్రావుగారి (నిర్వాహక హోదా నుండి ఆయనే తప్పుకొన్న తర్వాత మరియు ముందు) వలన పెద్దగా తెవికీలో సమాచారం పెద్దగా ఏమీ చేరలేదు. ప్రసాద్ గారి ప్రవర్తన మూలంగా ఆయనను తప్పించడం జరిగింది. నాయీ అభిప్రాయం తెవికీ అంతిమ నిర్ణయంగా భావించి సభ్యులు తెవికీ అభిబృద్ధికి తోడ్పడతారని నా ఆకాంక్ష.--Rajasekhar1961 (చర్చ) 06:47, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, నమస్కారం. మీరు నా ప్రవర్తన మూలంగా పదవి నుండి తప్పించడం జరిగింది అని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ అత్యంత ఆత్మీయినిగా ఉన్న నేను నన్ను తప్పించే సమయంలో నాలో చెడ్డ ప్రవర్తన మీకు గోచరించడం నిజంగా ఆశ్చర్యకరం కదండీ. జీవితంలో యెంతో విలువైన కాలాన్ని వికీకి సేవ చేసినందుకు ఫలితంగా అపనిందలు,అవమానాలు చదువరి గారు తిరిగి చురుకుగా అధికారిగా వచ్చినప్పుడు, ఒక వర్గంగా మానసిక హింసదాడి జరిగడం, అందుకు తగిన విధంగా నేను ప్రతిస్పందించడం జరిగింది. మొత్తానికి యేతావాతా నాది మాత్రంమే తప్పు అన్న విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాని, మన చర్చల చరిత్ర మాత్రం యెక్కడికి పోదు కదండి. ఎవరిది తప్పు అనేది బయటకు ఎవరైనా తీస్తారు. జీవుడు వెళ్ళేపోయే రోజులు వచ్చినా నిజాలు మరుగున పడటం మంచిది కాదని నేను మీకు జవాబు వ్రాస్తున్నాను. ప్రతి మనిషి వారివారి ఉద్దేశ్యంలాలో ఆలోచనలు, భావాలు వేరువేరుగా ఉంటాయి. మీకు నేను ఒక విధంగా ఒక్కోకాలంలో ఒక్కో విధంగా కూడా గోచరించ వచ్చును. దయచేసి నీరు ఇతరుల ద్వారా మూలకారణ నిజానిజాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోరని తలుస్తాను. మీకు నా ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 07:51, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారూ సమయమనం పాటించండి మార్చు

చంద్రకాంత రావు గారూ, పైన రాజశేఖర్ గారు రాసినది చూసాక, ఆయన మాట మీద గౌరవముంచి నేను ఇక ఇక్కడ ఏమీ రాయకూడదని భావించాను. ఆయన మాటను మీరు కూడా గౌరవిస్తారని అనుకున్నాను. కానీ మీరు అలా చెయ్యలేదు. తప్పనిసరై ఇది రాయాల్సి వస్తోంది. "అబ్బబ్బో రామారావు బాగా పనిచేస్తున్నాడా? ఇది ప్రపంచపు ఎన్నో వింతనో అది కూడా చెబితే బాగుండేది." అని రాసారు మీరు. ఇలా ఏకవచనంతో సంబోధించడం మర్యాద కాదు. రామారావు గారి పనిలో దోషముంటే ఆ దోషాలను ఎత్తి చూపవచ్చు, అందులో తప్పులేదు. కానీ ఇలా న్యూనత పరచడం తప్పు. వికీ నియమాల ప్రకారం ఇది ఆయన్ను పీడించడం (హరాస్‌మెంటు) కిందకి వస్తుంది. రావు గారూ, నాపై ఉన్న అక్కసుతో మీరు సంయమనం కోల్పోతున్నారు. వికీనియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఈ చర్చలో నన్ను, ఇతరులనూ దూషించారు. జనరిక్ స్టేట్‌మెంట్లు ఇచ్చేసారు. ఏకవచనంతో సంబోధించారు. ఇంతమంది వాడుకరులు ఈ చర్చలో పాల్గొన్నారు గదా.. మీరు, అజ్ఞాత తప్ప మరెవరైనా ఇలా వ్యక్తిగత నింద చేసారా? ఇలా నిందించడం తప్పని ఇంతమంది చెబుతున్నప్పటికీ మీరు ఆపలేదు. వీటిపై వికీనియమాల ప్రకారం తగు చర్య తీసుకునే అవకాశం ఉంది, గమనించగలరు. దయచేసి ఇకనైనా ఆపండి. __చదువరి (చర్చరచనలు) 19:37, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

@C.Chandra Kanth Rao: గారూ, ఇప్పటికే ఈ చర్చలో పన్నెండుమంది నిర్వాహకుల్లో ఏడుగురు స్పందించారు.
  • వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర గార్లు మీరు చేస్తున్నది వ్యక్తిగత దాడి అనీ, క్రమం తప్పకుండా వికీపీడియాలో పనిచేస్తున్నవారిపై కనీస గౌరవం లేకుండా మాట్లాడడమనీ పలు విధాలుగా ఖండించారు. ఇక వాడుకరి:Rajasekhar1961 గారు "ఇక్కడ చర్చలతో మనలో మనం పరిష్కరించుకోవలసిన విషయాలను వికీపీడియా పతనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నాము. మీరు ఈవిధంగా ప్రతిసారి పురోగతిలో పాల్గొంటున్న వారందరి మీద; ప్రస్తుతం చదువరి మరియు యర్రా రామారావు గారి మీద నిందలు వేస్తున్నారు." అంటూ కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మీకు హితవు చెప్పారు. అదే సందర్భంలో ఆయన ఒక బాధ్యతాయుతమైన నిర్వాహకునిగా ఈ నిందలను ఆపుచేయమంటూ "వికీపీడియా విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పోవడం మంచిది." అని సామరస్యపూర్వకంగా ఒక నిర్ణయం చేశారు.
  • ఇంత చేసినా మీరు ఇప్పటికీ తెలుగు వికీపీడియాలో నిత్యం పనిచేస్తున్న సభ్యులపై ఆధారాలు లేకుండా దాడిచేస్తూ, వారి కృషిని కొట్టిపారేస్తూ, అవమానిస్తూ వ్యక్తిగతదాడులు చేయడం ఏమీ బాగోలేదు. వాడుకరి:Pranayraj1985 గారిని మీరు "ప్రణయ్ రాజ్, ఏమిటీ చెప్పేది? అసలు నిర్వాహకుడిగా మీ తెవికి సేవలేంటీ? అస్తమానం మీ రికార్డులే ధ్యాసే తప్ప నిర్వహణ గురించి ఏమైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా?" అంటూ దాడిచేస్తున్నారు. ప్రణయ్‌రాజ్ గారు ఎంతో చిత్తశుద్ధితో చాలామంది చేయని విధంగా (ఆ చాలామందిలో దురదృష్టవశాత్తూ నేనూ ఉన్నాను) తన నిర్వాహకత్వ సమీక్షను క్రమం తప్పకుండా చేస్తున్నారు. "నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి." - అని ఆ పేజీలో రాసుకున్నారు కూడాను. ఈ సమీక్ష లింకు ప్రణయ్ రాజ్ గారు రచ్చబండలో ఇచ్చిన రోజే మీరూ రచ్చబండలో ఏవో చర్చలు చేశారు. మరి ఆ పేజీ చూసి, మీకేమైనా విమర్శలు ఉంటే ఆయన చర్చా పేజీలో రాసివుండొచ్చు కదా. అదేమీ చేయకుండా ఆయనను కించపరుస్తూ, న్యూనపరుస్తూ మాట్లాడడాన్ని వేధింపు అంటారు. మీరు ఇలాంటి వేధింపులు ఇంతకుముందు చేసివున్నారు. ఇంక మానెయ్యండి. ఇంతమంది చెప్తున్నారు మీకు. ఇది గౌరవంగా లేదు.
  • "అలాంటప్పుడు తెవికీని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఎందుకు పరిగణించరాదు!" అన్నారు. ఆయనవి స్వార్థ ప్రయోజనాలని దూషించడానికి మీరు చెప్పిన (అవాస్తవమైన) కారణం ఏమిటంటే ప్రణయ్ రాజ్ గారికి నిర్వహణపై ధ్యాస లేదన్నారు. ఆయనే నిర్వహణ స్వీయ సమీక్ష చేసుకున్నారని లింకు ఇచ్చాను. ఇప్పుడు మీరు రాసిన ఈ వాక్యాన్ని ఎలా పరిగణించాలి? మీకు వ్యక్తిగతంగా ప్రణయ్ రాజ్ గారికి వస్తున్న మంచిపేరుతో ఏదో సమస్య అయినా ఉందనుకోవాలి లేదంటే ఆయనను వేధించి బెదిరించి చర్చల్లో మాట్లాడనీయకుండా చేయాలనుకుంటున్నారని అయినా తీసుకోవాలి. ప్రణయ్ గారు నిర్వహణపై ఎంతో కృషిచేస్తున్నప్పుడు, మీరు పచ్చి అసత్యాన్ని ప్రచారం చేస్తుంటే - ఎంత సదుద్దేశం ఆపాదించి చూసుకున్నా మీరు చేస్తున్న పనిని ఇంతకన్నా వేరుగా విశ్లేషించలేము.
మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నిరాధారమైన నిందలు, వ్యక్తిగత దాడులు మానుకోండి. వేధింపు ధోరణి వదులుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటికే రాజశేఖర్‌ గారు వెలువరించిన నిర్ణయాన్ని కనీసం గౌరవించండి. మీరు ఆ నిర్ణయాన్ని గౌరవించినంత మాత్రాన మీకున్న విలువ తగ్గిపోదు, నిజం చెప్పాలంటే కాస్తో కూస్తో పెరుగుతుంది. దయచేసి గమనించండి. మీకు మీ ధోరణిలోని పొరబాటు ఏమిటో చాలా ఓపికగా, నా సమయాన్ని వెచ్చించి రాస్తున్నాను. ఇంతకన్నా మృదువుగా, గౌరవంగా ఈ విషయం మీకెవ్వరూ ఎత్తిచూపలేరు. రచ్చబండ గౌరవాన్ని ఇంతకన్నా పతనం చేసేలా రాతలు రాయవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 19 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వహణ అంటే కేవలం స్వీయసమీక్ష చేసుకోవడం కానేకాదు. 10-15 సం.ల క్రితం నిర్వహణ ఎలా ఉండేదో, నిర్వాహకుల కృషి ఎలా ఉండేదో, అప్పుడు తెవికీని పాఠకులు బ్రహ్మరథం ఎందుకు పట్టారో, అప్పటి వ్యాస నాణ్యత, సభ్యుల కృషి, నిర్వాహక పనులు గురించి తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు తెవికీ చచ్చిపోయింది. కొన ఊపిరితో ఉన్న తెవికీని హతమార్చిన ఇద్దరెవరో అందరికీ తెలుసు. ఇన్నేళ్ళ తెవికీ సభ్యుల కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు పనిచేస్తున్న వారి కృషి ఎలాగూ పనికిరాదు. దీనికి ఒకటే పరిష్కారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతే అర్జున, వెంకటరమణ లాంటి వారితో కొద్దికొద్దిగా తెవికీని పుంజుకొనే అవకాశం అంది. అందుకు నాలాంటివారి సహకారం ఉంటుంది. కాని తెవికీ అభివృద్ధి దృష్ట్యా ఆలోచిస్తేనే ఈ పని అవుతుంది. పదవులపై ధ్యాస ఉంటే మాత్రం తెవికీ సమాధికే అంటే చరిత్రకే పరిమితం. సి. చంద్ర కాంత రావు- చర్చ 00:24, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
గత కొన్ని రోజులుగా నా తెవికీ సభ్యపేజీపై మరియు మెయిల్ అడ్రస్ పై దాడులు జరుగుతున్నట్లుగా అలెర్టులు వస్తున్నాయి. నా సభ్యపేజీ లాగిన్ అవడానికి ఎక్కడెక్కడినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏదో కుట్ర జరుగుతోంది. నిరోధిత ఐపి అడ్రస్ నుంచి కూడా లాగిన్ ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. మెయిల్కు తాత్కాలిక పాస్‌వర్డ్‌లు పలుసార్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో? సి. చంద్ర కాంత రావు- చర్చ 01:13, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimania 2021: Individual Program Submissions మార్చు

 

Dear all,

Wikimania 2021 will be hosted virtually for the first time in the event's 15-year history. Since there is no in-person host, the event is being organized by a diverse group of Wikimedia volunteers that form the Core Organizing Team (COT) for Wikimania 2021.

Event Program - Individuals or a group of individuals can submit their session proposals to be a part of the program. There will be translation support for sessions provided in a number of languages. See more information here.

Below are some links to guide you through;

Please note that the deadline for submission is 18th June 2021.

Announcements- To keep up to date with the developments around Wikimania, the COT sends out weekly updates. You can view them in the Announcement section here.

Office Hour - If you are left with questions, the COT will be hosting some office hours (in multiple languages), in multiple time-zones, to answer any programming questions that you might have. Details can be found here.

Best regards,

MediaWiki message delivery (చర్చ) 04:18, 16 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

On behalf of Wikimania 2021 Core Organizing Team

Candidates from South Asia for 2021 Wikimedia Foundation Board Elections మార్చు

Dear Wikimedians,

As you may be aware, the Wikimedia Foundation has started elections for community seats on the Board of Trustees. While previously there were three community seats on the Board, with the expansion of the Board to sixteen seats last year, community seats have been increased to eight, four of which are up for election this year.

In the last fifteen years of the Board's history, there were only a few candidates from the South Asian region who participated in the elections, and hardly anyone from the community had a chance to serve on the Board. While there are several reasons for this, this time, the Board and WMF are very keen on encouraging and providing support to potential candidates from historically underrepresented regions. This is a good chance to change the historical problem of representation from the South Asian region in high-level governance structures.

Ten days after the call for candidates began, there aren't any candidates from South Asia yet, there are still 10 days left! I would like to ask community members to encourage other community members, whom you think would be potential candidates for the Board. While the final decision is completely up to the person, it can be helpful to make sure that they are aware of the election and the call for candidates.

Let me know if you need any information or support.

Thank you, KCVelaga (WMF) 10:03, 19 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాలు, గ్రామాలు పేజీలలో చేయవలసిన నిర్మాణాత్మకమైన సవరణలు ఆవశ్యకత మార్చు

అందరికీ నమస్కారం.తెవికీలో అన్ని గ్రామాలను బాటు ద్వారా తెవికీ ప్రారంభంలో (2005) సృష్టించబడినవి.2017 లో భారత జనగణన డేటా నుండి, సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించేంత వరకు అన్ని మొలకలు గానే ఉన్నాయి.డేటా ఎక్కించి మొలకలు సమస్యను అధిగమించినప్పటికీ, వాటిలో చేయాల్సిన అవసరమైన నిర్మాణాత్మకమైన సవరణలు అలానే ఉన్నాయి.ఆ ఉద్ధేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రతి మండలం, ఆ మండలంలోని ప్రతి గ్రామం పరిశీలించి, కనీసం చేయవలసిన సవరణలు గుర్తించి, అది ఇది అని కాకుండా సవరణలు చేస్తున్నాను.కేవలం ఆ సవరణలు నేను ఏదో గణాంకాలు పెంపొందించుకోవటానికి చేస్తున్నట్లు ఇటీవల కొంత మందికి అపోహలు కలిగినవి.ఎవరు చేసినా ఆ సవరణలు తప్పని సరిగా చేయవలసిన అవసరం మాత్రం ఉంది.ఆ పని ఆపేదేమీ కాదు. నేనే చేస్తే, నా అంచనా ప్రకారం సుమారు ఇంకా ఒక సంవత్సర కాలం పట్టవచ్చు. అందుకు గాను ఈ దిగువ అభిప్రాయాలు సముదాయం ముందు పెడుతున్నాను.

  1. కేవలం నేనే చేయాలనే అభిప్రాయం నాకు ఎ మాత్రం లేదు.గ్రామ వ్యవస్థమీద నాకున్న అభిమానంతో ఆలోపాలు నేను గుర్తించాను, కాబట్టి పూర్తిచేయలనే సంకల్పంతో నేను సవరించుట జరుగుతుంది.
  2. ఆ సవరణలు ఏదైనా "ఆటో బాటు" లేదా "సెమీ బాటు" ద్వారా చేయటానికి ఎవరైనా ముందుకువస్తే, వారితో నేను పూర్తిగా సహకరిస్తాను.పై రెండిటితో ఈ సవరణలు చేసేంత పరిజ్ఞానం నాకు లేదు.నాకు చేత కాదు
  3. లేదూ, ఆ పనికి ఎవరూ ముందుకురాని పక్షంలో, మానవవీయంగా చేయటానికి గౌరవ వికీపీడియన్లు ఎవరైనా ముందుకువస్తే, వారితో కలసి పనిచేస్తాను.నాకు తెలిసినంతవరకు నా సహకారం పూర్తిగా అందిస్తాను.

మానవీయంగా చేయాలిసివస్తే ముఖ్యంగా ఈ విషయంలో చంద్రకాంతారావు గారు ఈ పనులలో పాలుపంచుకుంటే, నేను ఆయనతో కలసిపని చేస్తాను.ఎవరికి కుదిరినా, కుదరక పోయినా ఆపని ఆగటానికి వీలులేదు.నా శక్తిమేరకు సవరణలు చేస్తూనే ఉంటాను.నా ఆలోచనలకు తగ్గట్టుగా ఆ సవరణలు పూర్తిచేయటం నాధ్యేయం. ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 16:06, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా గారూ! ఈ విషయంలో కలిసి పని చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఒకప్పుడు అందరూ కలిసి తెవికీని అభివృద్ధిపర్చినట్లుగా మళ్ళీ పూర్వవైభవం తీసుకువద్దాం, తెవికీని తెలుగు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళదాం. అయితే ముందుగా తెవికీ ప్రక్షాళన జరగాలి. గత కొన్ని సంవత్సరాలుగా తెవికీని దారుణంగా దెబ్బతీసిన ఇద్దరు సభ్యుల నిర్వాహక/అధికార హోదాలు రద్దుచేయాలి. గత కొన్ని సంవత్సరాలలో ఇద్దరు సభ్యుల చర్చను పరిశీలిస్తే వారు తెవికీ నిరోధకులుగా ఉన్నట్లుగా ప్రస్పుటంగా కనిపిస్తోంది. అడుగడుగునా మంచిపనిచేసేవారిని అడ్డుకునేవారు తెవికీకి అవసరమేంటీ? కేవలం పదవులపై మాత్రమే ధ్యాస ఉంచుకొని, సభ్యులపై నిష్కారణంగా నిరోధాలు విధిస్తూ, నిర్వాహకహోదాను దువినియోగపర్చే వారు తెవికీకి చెడ్డ పెరు తెచ్చేవారు నిర్వాహకులుగా ఉండతగరు. తెలుగు భాషాభిమానులు ఇద్దరిపై మండిపడుతున్నారు. సంవత్సరాలనుంచి అభివృద్ధి చెందిన ఒక రూపుకు వచ్చిన తెవికీ ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమైంది. దానికి కారకులెవరో బాగా పరిశీలించేవారికి తెలుసు. భాషాభిమానులు తెవికీ చచ్చిపోయిందనీ తీర్మానించారు కూడా. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ తెవికీని పట్టాలపై ఎక్కించి పూర్వవైభవం తీసుకురావడం కొంత కష్టమైన పనైననూ అసాధ్యం మాత్రం కాదు. దీనికి నా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. అర్జున, వెంకటరమణ, రవిచంద్ర, స్వరలాసిక తదితరుల సేవలను కూడా పొందుదాం. కాని చదువరి, పవన్ లను మరియు వారికి గుడ్డిగా మద్దతిచ్చే సభ్య్లను మాత్రం వదిలివేయాల్సిందే, వారి నిర్వాహక, అధికార హోదాలు త్యజించవల్సిందిగా చెప్పాల్సిందే, సీనియర్ సభ్యులు, నిర్వాహకులు కనీసం ఓటింగులో కూడా పాల్గొనడం లెదు. వారు "సరైన" విధంగా స్పందిస్తే బాగుండేది. సి. చంద్ర కాంత రావు- చర్చ 01:02, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ మీరు "కలిసి పని చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు." అంతవరకు ఓ.కె .దానికి ధన్యవాదాలు.ఇక మిగతా విషయాలు అప్రస్తుతం.వాటిని నేను ఖండిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:47, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
మండల వ్యాసాలు ఎలా ఉండాలో [అనుచితమైన బయటి లింకును తీసేసాను __చదువరి (చర్చరచనలు) 02:28, 14 జూలై 2021 (UTC)] తెలంగాణకు సంబంధించిన దాదాపు అన్ని జిల్లాల మండలాల వ్యాసాలను స్వయంగా రూపొందించిన పటాలు, సమాచారంతో సహా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాను. ఎప్పటికప్పుడు తాజాకరణ చేస్తున్నాను. భాషాభిమానులు కూడా తెవికీ కంటే నాణ్యమైన సమాచారం ఉన్నట్లుగా, మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు. కేవలం ఒక్కరు నిర్వహించే బ్లాగుకన్నా వందలాది మందితో తయారైన తెవికీకి ఈ దుర్గతి పట్టడానికి కారణం బాగా పరిశీలించేవారికే తెలుసు. అందుకే ప్రక్షాళన అత్యావశక్యం. సి. చంద్ర కాంత రావు- చర్చ 01:21, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది కేవలం మీ బ్లాగు గురించి నాకు తెలుసో లేదోనని తెలియజేయటానికి చెప్పినట్లుగా ఉంది.మీ భ్లాగు చూసి, తెవికీలో ఆ విధంగా సవరణలు చేయాల్సినంత దౌర్బాగ్యస్థితికి నేను దిగజారలేదు.గమనించండి. యర్రా రామారావు (చర్చ) 14:56, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రకాంతరావు గారి వేధింపులు మార్చు

నిర్వాహకులందరికీ విజ్ఞప్తి

చంద్రకాంత రావు గారు పైన నాపై ఎన్నెన్ని నిందలు మోపారో చూసారు. ఒక్కదానిక్కూడా ఆధారాలు చూపించలేదు. అయినా నేను ఓపిగ్గా ఆయనకు సమాధానాలు చెప్పాను -ఆధారాలతో సహా. కానీ అయన నాపై నిందలు మోపుతూనే పోయారు. చివరికి తెవికీ చచ్చిపోయిందని అన్నారు. ఇది యావత్తు సముదాయంపై చేసిన నింద. అందుకు కార్నం నేనేనని అన్నారు.

ఇప్పుడు, యర్రా రామారావు గారు కలిసి పనిచేద్దాం రమ్మని చంద్రకాంత గారిని పిలిచారు. దానిపై ఏం నిర్ణయించుకుంటారనేది ఆయనిష్టం. కానీ కారణం మరొకరిపై వెయ్యడం ఏంటి? అకారణంగా ఏమిటీ నిందలు? ఏమిటీ వేధింపులు? ఇప్పటికైనా నిర్వాహకులు రావుగారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. విసుగొచ్చేస్తోంది సార్. అందరికీ నమస్కారాలతో.__చదువరి (చర్చరచనలు) 02:53, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ సి. కె. రావు వికీని అడ్డం పెట్టుకొని నిర్వాహకులుపై వ్యక్తిదాడుల ఆగడాలు పని కట్టుకుని పదే పదే ఎక్కువ అవుతున్నాయి.దీనిని నేను ఖండిస్తున్నాను. నిర్వాహకులు నోటీసు బోర్డులో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది కేవలం పవన్ గారి మీద. మీ మీద నూటికి నూరుశాతం వ్యక్తిగత దాడి అని అందరికీ తెలుసు. మీ వెనుకనే మేము. యర్రా రామారావు (చర్చ) 03:43, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చూస్తున్న కొద్దీ చంద్రకాంతరావు గారి వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయి. దీనిని ఇక ఉపేక్షించకూడదు. ఆయన వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడి కారణంగా గత కొన్నిరోజులుగా తెవికీలో అభివృద్ధి కుంటుపడిపోతోంది. అంతేకాకుండా తన బ్లాగు గురించి మాట్లాడుతూ,'భాషాభిమానులు కూడా తెవికీ కంటే నాణ్యమైన సమాచారం ఉన్నట్లుగా, మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు' అని అన్నారు, 'తెవికీ చచ్చిపోయిందని' అంటున్నారు. దీనినిబట్టి చూస్తే, తన బ్లాగు బాగుందని ప్రకటించుకోవడంకోసం తెవికీ మీద ఇంతటి ఘోరమైన ఆరోపణలు, వినకూడని మాటలు అంటున్నారని తోస్తోంది. కాబట్టి, రామారావు గారు చెప్పినట్టుగా నిర్వాహకులు నోటీసు బోర్డులో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని చదువరి గారిని కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 04:20, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన మార్చు

చంద్రకాంత రావుగారు చేసిన వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలు, ఇతరత్రా ఉల్లంఘనలూ జాబితా వేసి, ఆధారాలను చేర్చి ఆయనపై చర్య కోసం నిర్వాహకుల నోటీసుబోర్డులో ప్రతిపాదన ప్రారంభించాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 19:42, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సమాచారపెట్టె లేని పేజీలు మార్చు

వ్యాసం పేజీలో ఉన్న కీలకమైన సమాచారాన్ని సమాచారపెట్టె టూకీగా చూపుతుంది. అయితే స్తుతం వికీలో ఉన్న పేజీల్లో కొన్నిటిలో సమాచారపెట్టె లేదు. అలాంటి పేజీలను గుర్తించి ఒక వర్గంలో చేర్చేందుకు {{Infobox requested}} అనే మూసను దిగుమతి చేసాను. సమాచారపెట్టె లేని పేజీల చర్చ పేజీల్లో ఈ మూసను చేర్చాలి. వ్యక్తుల పేజీ అయితే మూసతో పాటు "వ్యాసం రకం=వ్యక్తి" అనే పరామితిని చేర్చాలి. ఇతర పేజీలకైతే అ పరామితిని ఖాళీగా వదిలెయ్యవచ్చు. అప్పుడు ఆ పేజీలు, వ్యక్తి పేజీ అయితే వర్గం:సమాచారపెట్టె లేని వ్యక్తుల పేజీలు అనే వర్గం లోకి, ఇతర పేజీలైతే వర్గం:సమాచారపెట్టె లేని పేజీలు అనే వర్గం లోకీ చేరుతాయి.

సమాచారపెట్టె లేని వ్యక్తుల పేజీల సంఖ్య - వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు లో 1,158, వర్గం:తెలంగాణ వ్యక్తులు లో 264 గాఅ ఉంది. ప్రస్తుతం ఈ పేజీల చర్చ పేజీల్లో ఈ మూసను చేర్చే పని (AWB ద్వారా) జరుగుతోంది. అదయ్యాక ఇతర పేజీల్లో కూడా ఈ ముసను చేరుస్తాను.

పై వర్గాల్లో ఉన్న వ్యాసాల్లో సమాచారపెట్టెను చేర్చినపుడు, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{Infobox requested}} మూసను తీసెయ్యవలసినది. వాడుకరుల పరిశీలన కోసం __ చదువరి (చర్చరచనలు) 06:59, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 07:31, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పై మూసలో "వ్యాసం రకం" అనే పరామితికి విలువగా "వ్యక్తి" అని ఇచ్చినట్లు గానే సినిమా, గ్రామాల పేజీలకు "సినిమా", "గ్రామం" అని ఇవ్వవచ్చు. తద్వారా అవి సంబంధిత వర్గం లోకి చేరుతాయి. పైన సమాచారపెట్టె లేని గ్రామాలు విభాగంలో సూచించిన పేజీల్లో కూడా మూసను చేర్చడం పూర్తైంది. ఈ విధంగా {{Infobox requested}} మూసను చేర్చిన పేజీలు దానిలో ఉన్న "వ్యాసం రకం" పరామితికి ఇచ్చిన విలువను బట్టి వర్గం:సమాచారపెట్టె లేని పేజీలు వర్గంలో గానీ దాని ఉపవర్గాల్లోకి గానీ చేరుతాయి. __చదువరి (చర్చరచనలు) 09:31, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కన్నడంలో యాంత్రికానువాద సమస్య మార్చు

కన్నడ వికీలో కూడా మనకున్నట్టే యాంత్రికానువాద సమస్య ఉన్నట్టుగా ఉంది (ఆశ్చర్యమేమి లేదు). వాళ్ళు కింద చూపిన సందేశాన్ని ప్రతి పేజీలో చూపిస్తున్నారు:

ಯಂತ್ರಾನುವಾದದ ಮೂಲಕ ಲೇಖನ ಸೇರಿಸುವವರು ಲೇಖನವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಓದಿ ವಾಕ್ಯಗಳನ್ನು ಸರಿಪಡಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ.
ಯಂತ್ರಾನುವಾದದ ಮೂಲಕ ದೊರೆತ ಲೇಖನವನ್ನು ಪರಿಷ್ಕರಿಸದೆ ಹಾಗೆಯೇ ಸೇರಿಸಬೇಡಿ.
ಲೇಖನದ ಶೀರ್ಷಿಕೆ ಕನ್ನಡದಲ್ಲೇ ಇರತಕ್ಕದ್ದು.

వాడుకరి:స్వరలాసిక గారూ కింది అనువాదంలో తప్పులుంటే సరిచెయ్యవలసినది:

యాంత్రికానువాదం ద్వారా వ్యాసాలను చేర్చేవారు వ్యాసాన్ని బాగా చదివి వాక్యాలను భాషనూ సరిదిద్దండి.
సవరించని పాఠ్యాన్ని చేర్చవద్దు.
వ్యాస శీర్షిక కన్నడం లోనే ఉండాలి.

__ చదువరి (చర్చరచనలు) 08:42, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మీ అనువాదం సరిగ్గానే ఉందండీ.--స్వరలాసిక (చర్చ) 09:32, 22 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Internet Support for Wikimedians in India 2021 మార్చు

 

Dear Wikimedians,

A2K has started an internet support program for the Wikimedians in India from 1 June 2021. This will continue till 31 August 2021. It is a part of Project Tiger, this time we started with the internet support, writing contest and other things that will follow afterwards. Currently, in this first phase applications for the Internet are being accepted.

For applying for the support, please visit the link.

After the committee's response, support will be provided. For more information please visit the event page (linked above). Before applying please read the criteria and the application procedure carefully.

Stay safe, stay connected. Nitesh (CIS-A2K) (talk) 14:09, 22 June 2021 (UTC)

"వికీపీడియా చచ్చిపోయింద"ని అజ్ఞాత మొదటిపేజీ లోని చరిత్రలో ఈ రోజు శీర్షికలో రాసాడు మార్చు

మొదటి పేజీ లోని చరిత్రలో ఈ రోజు శీర్షికలో ఒక అజ్ఞాత దుశ్చర్య చేసాడు. ఈ దిద్దుబాటులో వికీపీడియా చచ్చిపోయిందని రాసాడు. దాన్ని వెనక్కి తిరగ్గొట్టి ఆ అజ్ఞాతను నిరోధించాను. సముదాయం దృష్టికి తెస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 07:38, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Tewiki chacchi povitaku karakudu nuvve mahanubhavuda. Malla emi cheptav. Tewiki I Sarva nashanam cheshav. Neelu nishedham okkate telsu. Ajay kumar

ఇదే అజ్ఞాత వాడుకరి నిరోధించేలోపు తెలుగు వికీపీడియా చచ్చిపోయింది. మీరు రచనలు చేసి సమయం వృధా చేసుకోకంండి. వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 25వ వారం, వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 25వ వారం రెండు చోట్ల రాసాడు.--యర్రా రామారావు (చర్చ) 08:29, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ అజ్ఞాత ఆగడాలు మితిమీరిపోయాయి. వికీపీడియా మొదటి పేజీనే చెడగొట్టాడు. ఇక ఇతడి ఐపీ అడ్రసులపై మూకుమ్మడిగా నిరోధం విధించాల్సిన సమయం వచ్చేసింది.__చదువరి (చర్చరచనలు) 09:04, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:09, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Nirvahakula aagadalu mitimeeripoyayiraa.

Tappantha nirvahakulafe raa.

Nirvahakula nishedham tappa emi raadu.

Tewiki ni champivesharu.

Padavulu pattukoni dance chestunnaatu.

Ajay kumar nomula

రెండు ఐపీ శ్రేణులపై నిరోధం విధించాను. అయితే లాగినై ఉన్న వాడుకరులను ఈ నిరోధం అడ్డుకోదు. అజ్ఞత ఇంకా రాస్తూంటే ఈ శ్రేణులను విస్తరించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:57, 23 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చచ్చిపోయిన "తెలుగు వికీపీడియా"ను ఏం చేద్దాం? మార్చు

చదువరి మరియు పవన్ సంతోష్ దుశ్చర్యల మూలంగా అర్థాంతరంగా చచ్చిపోయిన తెలుగు వికీపీడియాను ఏ చేద్దాం అనేది నిర్ణయించుకోవాలి. అర్జున, వెంకటరమణ లాంటి వారితో కలిసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చే స్థోమత నాకుంది. కాని చదువరి, పవన్ లు తమ నిర్వాహక, అధికార హోదాలు పూర్తిగా త్యజించి, తెవికీలో అనవసరంగా అడ్డుపడే అవకాశం కల్పించనప్పుడు మాత్రమే నా ప్రతిపాదన సఫలమౌతుంది. విజ్ఞాన సర్వస్వాన్ని ఎలా నిర్వహించాలో, తెలుగు వారికి దాన్ని ఎలా ప్రయోజనకరంగా మరల్చాలో నాకు తెలుసు. తెలుగు భాషాభిమానుల దృష్టిలో నేనే ఒక విజ్ఞాన సర్వస్వాన్ని. దాదాపు 30 సం.ల అనుభవం విజ్ఞాన సర్వస్వం రూపకల్పనపై ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 01:08, 24 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]


Great sir. You are not just a Wikipedian. You are Wikipedia. Ajay Kumar Nomula.

అయ్యా,చదువరి మరియు పవన్ సంతోష్ వీరిద్దరూ కొంతకాలము అన్ని పనులు,పదవులు దీర్ఘకాలం మానుకుంటే తెవికీ ఒక మంచిబాటలోకి వచ్చేందుకు అవకాశం ఉండవచ్చును. వీరు దూరంగా కొత్తగా వచ్చే నష్టాలు అంటూ యేమీ ఉండవేమో ? దయచేసి వీరు ఇద్దరూ తెవికీకి దూరంగా ఉంటే అందరికీ మంచిది. నేను కూడా తెవికీకి అనేక విధాలుగా యెన్నో సంవత్స్రాలుగా సహాయ సహకారాలు అందించిన వాడిని, అనుభవముతో చెబుతున్నాను. నేను దూరముగా ఈ కారణం వలననే ఉన్నాను. నేను ఏమీ నష్టపోలేదు, నేను ప్రశాంతముగా ఉండి, ఎస్ మ్యూల్ నందు పాటలు పాడుకుంటున్నాను.నాకు మంచి కాలక్షేపం, ఓజులు హాయిగా ఉన్నాయి. అలాగే ఒకరికి మనం ఇబ్బంది కాకూడదు అని నా ఉద్దేశ్యం, అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 07:18, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సైడ్‌బారులో సంప్రదింపు పేజీ లింకు లక్ష్యం గురించి మార్చు

సైడ్‌బారులో ఉన్న "సంప్రదింపు పేజీ" లింకుకు లక్ష్యంగా ఉన్న పేజీని మార్చి కొత్త పేజీని పెట్టాలనే ప్రతిపాదనను దాని చర్చ పేజీలో పెట్టాను. దాన్ని పరిశీలించి అక్కడే స్పందించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 05:20, 24 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2021 #2 మార్చు

14:14, 24 జూన్ 2021 (UTC)

చదువరీ, నీకు ఎన్ని సార్లు చెప్పిననూ నీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు మార్చు

చదువరీ, నీకు ఎన్ని సార్లు చెప్పిననూ నీ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేసుకుంటున్నావు. తప్పంతా నీ లోనె ఉంది. తెవికీ చచ్చిపోయిందనీ తెలుగు భాషాభిమానులే నీ పై చిందులు తొక్కుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి వైజాసత్య, కాసుబాబు, చంద్రకాంతరావు, దేవా, అర్జున, పాలగిరి, వెంకటరమణ లాంటి వారి వల్ల అభివృద్ధి చెందిన తెవికీని సర్వనాశనానికి కారకుడివి నువ్వేనని ఏకముక్తంగా తెలుగు భాషాభిమానులు మొన్న ఆదివారం సమావేశంలో తీర్మానించారు. నేను ప్రణయ్ ను ఏమీ దుర్భాషలాడలేను. అతను నిర్వాహకుడై ఉండి కూడా విచక్షణతో బాగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయంతో నిర్వాహక పని చేయక ఎవరొ ఒక తింగరి చెప్పిన పని చెయడమేంటీ? ఆ తింగరి పైనే నిషేధం విధిస్తే సమస్త తెలుగు భాషాభిమానులందరూ హర్షాతిరేకాలు వ్యక్త్యం చేసేవారు. ఆకాశం నుంచి జయజయ ధ్వనులు వినిపించేవి. పువ్వుల వర్షం కురిసేది. తెవికీకి ఉజ్వల భవిష్యత్తు కనిపించేది. చదువరీ, తక్షణమె నిర్వాహక, అధికార హోదాలు వదిలిపెట్టి సెలవులోకి వెళ్ళిపో. తెవికీపై మమకారం ఉంటే కనుక వెంటనే ఈ పని చేసేయ్. ఎందుకంటే నివ్వు తెవికీలో ఉండి కూడా తెవికీనిక ఉద్ధరించేదీ ఏమీలేదు, నీ వల్ల కాదు కూడా. చచ్చిపోయిన తెవికిని ఇంకా కుళ్ళిపోయోలా చేస్తావేమోకానీ, పునర్వైభవానికి కృషి చేస్తావన్న నమ్మకం ఎవరికీ లేదు. చివరగా నేను చెప్పేదేమంటే నాపై మళ్ళీ నిషేధం గనుక విధిస్తే మళ్ళీ నీపై తప్పకుండా వాస్తవాలు రాయాల్సి ఉంటుంది. నిషేధం విధించకుండా వదిలేసి చూడు, నేనూ రాయడం వదిలేస్తా. ఆ మేరకు తెవికీ అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇతర సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది. నిరోధం విధించిననూ ఐపి అడ్రస్ తోనైనా లేదా కొద్ద్ది మార్పుతో మరో సభ్యనామం సృష్టించుకొని రాయడానికి ఇబ్బంది ఏమీ ఉందదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 03:13, 25 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@C.Chandra Kanth Rao గారూ, ఇదే పాఠ్యాన్ని మీరు నిర్వాహకుల నోటీసుబోర్డులో కూడా రాసారు. అక్కడ నేను సమాధానం ఇచ్చాను, చూడండి.__ చదువరి (చర్చరచనలు) 04:45, 25 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

SGrabarczuk (WMF) 01:19, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలు మార్చు

అందరికీ నమస్కారం, 2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికల కోసం తెలుగు వికీపీడియాలో ఒక పేజీ సృష్టించబడింది. ఎన్నికల తాజా సమాచారం కోసం ఆ పేజీని చూడగలరు, మీకు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు.

  ఓటరు అర్హత ప్రమాణాలు ఇప్పుడు చేర్చబడ్డాయి. దయచేసి క్రింది లింక్‌ను పరిశీలించండి.

లింక్: 2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలు

ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:07, 27 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]