వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 70

పాత చర్చ 69 | పాత చర్చ 70 | పాత చర్చ 71

alt text=2019 నవంబరు 8 - 2020 జనవరి 2 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 నవంబరు 8 - 2020 జనవరి 2

Project Tiger 2.0 - Hardware support recipients list మార్చు

Excuse us for writing in English, kindly translate the message if possible

Hello everyone,

 
tiger face

Thank you all for actively participating and contributing to the writing contest of Project Tiger 2.0. We are very happy to announce the much-awaited results of the hardware support applications. You can see the names of recipients for laptop here and for internet stipend see here.

78 Wikimedians will be provided with internet stipends and 50 Wikimedians will be provided with laptop support. Laptops will be delivered to all selected recipients and we will email you in person to collect details. Thank you once again.

Regards. -- User:Nitesh (CIS-A2K) and User:SuswethaK(CIS-A2K) (on benhalf of Project Tiger team)
using --MediaWiki message delivery (చర్చ) 07:15, 8 నవంబర్ 2019 (UTC)

Hi User:Nitesh (CIS-A2K) and User:SuswethaK(CIS-A2K), can you please let us know when the Internet Stipend was disbursed? I couldn't find it on the referred page. __చదువరి (చర్చరచనలు) 08:10, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: Hi sir, I did not understand your question. Are you asking when the internet stipend distribution is completed? Because we are still doing it. The list of internet stipend recipients is mentioned in the mass message above. SuswethaK(CIS-A2K) (చర్చ) 04:24, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
SuswethaK(CIS-A2K): Thanks for your response. The page that you mentioned, shows that the stipend was granted to users on behalf of Telugu community too. But I do not see any significant contribution from some of them in Tewiki/Tewikisource/Tewiktionary/Wikidata. I thought the stipend was granted, but not not disbursed yet. __చదువరి (చర్చరచనలు) 05:32, 8 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
SuswethaK(CIS-A2K), I am still waiting for your response. My question is: Is the Internet stipend disbursed to the people who requested on behalf of Telugu community? I know the grant is approved from the page you mentioned. But is the amount disbursed to them or not? If so, please give the details. __చదువరి (చర్చరచనలు) 13:03, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: The stipend was given based on overall contributions (to other Wikimedia projects too) and not to Telugu Wikipedia alone. They were selected by jury and not by the A2K team. The stipend is being disbursed. Some are yet to recieve their 6 months stipend. Once everyone recieves, I will update the meta page. I hope I answered your query.SuswethaK(CIS-A2K) (చర్చ) 08:49, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
SuswethaK(CIS-A2K) I am afraid the query is not answered. The query is.. when was the Internet stipend amount disbursed to those users whose "Language community" is "Telugu". If not disbursed, when will it be done. If it is disbursed to "some of them", who received the amount and who did not. Thank you. __చదువరి (చర్చరచనలు) 09:04, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Users PranayRaj1985, Tharun Bhasyam Kumar, Mekala Harika, and Ajaybanbi have recieved the stipend @Chaduvari: SuswethaK(CIS-A2K) (చర్చ) 13:31, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
yes, i received Internet stipend amount for six months from Project Tiger 2.0.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:25, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
SuswethaK(CIS-A2K), I am trying to assess the impact of the grants that WMF is providing to Telugu community. The study that I made so far is not very encouraging. I already noticed issues like waning interest among the candidates. Now I see some new issues too. Anyway,
  1. can you please let us know when the balance disbursements be made?
  2. Can you please update here as soon as it is done?
Thank you __చదువరి (చర్చరచనలు) 16:57, 14 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Sure. SuswethaK(CIS-A2K) (చర్చ) 17:10, 14 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పేర్లతో ఆంధ్రప్రదేశ్ మండలాల సమగ్ర భౌగోళిక గతిశీల పటము విడుదల మార్చు

 
ఆంధ్రప్రదేశ్ మండలాల పటము తెలుగు పేరులతో (గతిశీల చిత్రానికి తెరపట్టు)

ఆంధ్రప్రదేశ్ మండలాలు (సంఖ్య:670) ఓపెన్ స్ట్రీట్ మేప్ లో తెలుగు పేర్లతో చేర్చబడినవని తెలియచేయుటకు సంతసించున్నాను. ప్రస్తుతం మండలాల పేర్లు తెలుగులో కనబడుతాయి. వికీపీడియాలో ఇప్పటికే తెలుగు పేర్లు గల అంశాలతో అవి అందుబాటులో లేనిచోట ఆంగ్ల పేర్లతో కనబడతాయి (చూడండి వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు). ఇటువంటి పటాలు భారత సర్వే సంస్థల ద్వారా కాని, గూగుల్ ద్వారా కాని, రాష్ట్ర స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ద్వారా కాని ఇతర వాణిజ్య సంస్థల ద్వారాకాని ఇంతవరకు సమగ్రంగా తెలుగులో అందుబాటులోలేవు. మండలాల పటములను భారత మేప్స్ ఆధారంగా OSM సంపాదకుడు హేయిన్జ్ OSM లో చేర్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దానిని వికీడేటాతో అనుసంధానం, దానికి అవసరమైన తెలుగు వికీలో మార్పులు (గ్రామాల, మండలాల వ్యాసాలు అవసరమైనచోట సరిచేయడం) ఓవర్పాస్ టర్బో, వికీడేటా క్వెరీలు తయూరు చేయడం నేను చేశాను. ఈ కృషికి ఆధారం తెలుగు వికీలో గత 12 ఏళ్లకు పైగా భౌగోళిక విషయాలపైన కృషి చేసిన సోదర,సోదరీ సభ్యులు, భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జియో పోర్టళ్లు, గూగుల్ మేప్ వంటి సంస్థల సేవలు. వారందరికి నా కృతజ్ఞతలు. పక్కన వున్న చిత్ర తెరపట్టు గతిశీల చిత్రం తెరపట్టు. వికీడేటా క్వెరీ తో ప్రతి మండలానికి తెలుగు వికీ లింకు, OSM link గల పట్టిక లేక/మరియు గతి శీల చిత్రం (ఆంధ్రప్రదేశ్ మొత్తం) మరియు చూసి మీ సొంత మండలం, లేక పరిచయంగల మండలాల వివరాలను పరిశీలించి దోషాలు, మెరుగుపరచడానికి సలహాలు తెలియచేయండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:45, 9 నవంబర్ 2019 (UTC)

Extension of Wikipedia Asian Month contest మార్చు

In consideration of a week-long internet block in Iran, Wikipedia Asian Month 2019 contest has been extended for a week past November. The articles submitted till 7th December 2019, 23:59 UTC will be accepted by the fountain tools of the participating wikis.

Please help us translate and spread this message in your local language.

Wikipedia Asian Month International Team

--MediaWiki message delivery (చర్చ) 14:16, 27 నవంబర్ 2019 (UTC)

రూపాయి గుర్తు ఎడిటర్ ద్వారా చేర్చడం. మార్చు

 
సోర్స్ ఎడిటర్ లో రూపాయి గుర్తు
 
విజువల్ ఎడిటర్ లో రూపాయి గుర్తు

బగ్ పరిష్కరింపబడినది. ఎడిటర్ లలో రూపాయి గుర్తు (₹) చేర్చబడినది. భారత దేశపు ద్రవ్యం(ధనం) సూచించడానికి వాడండి. --అర్జున (చర్చ) 06:05, 3 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా అవగాహన సదస్సు మార్చు

తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును మరియు వికీపీడియాలో వ్యాసాలు రాసే కార్యక్రమానికి అవసరమైన మూలాల గురించి చర్చ నిర్వహిస్తున్నాం.

ఈ సదస్సులో పాల్గొనువారు వికీపీడియాకి తోడ్పడటమెలాగో నేర్చుకుని తద్వారా తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే మహా ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.

తేదీ :డిసెంబర్ 7 2019

స్థలం: ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గచ్చిబౌలీ , హైదరాబాద్ - 500032

సంభాషించుటకు : 9959263974/ 9396533666

మీ రాకను తెలియచేయుటకు ఈమెయిల్ : bhashakadhambari@gmail.com

వాట్సాప్ / ఎస్ యం ఎస్ : 9959263974

Dollyrajupslp 10:47, 3 డిసెంబరు 2019 (UTC)

Dollyrajupslp గారు, వికీపీడియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను సముదాయ సభ్యులతో పంచుకోవలసి వుంటుంది. కార్యక్రమ తేది, స్థలం రాశారు, సమయం రాయలేదు. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో... ఏఏ సమయంలో ఏఏవి జరుగుతాయో కూడా ఉండాలి. తెలుగు వికీపీడియాకు సంబంధించిన ప్రతి సమావేశంకు, ప్రతి కార్యశాలకు ప్రత్యేక పేజీ పెట్టాల్సివుంటుంది. ఉదాహరణకు మినీ మీడియా వికీ ట్రైనర్, ట్రైన్-ద-ట్రైనర్ 2016 చూడండి. ఇటువంటి కార్యక్రమాలకోసం మీ ప్రాజెక్టు పేజీలోనే ఉప పేజీలను పెట్టండి. అందులో వివరాలు, ప్రదేశం, తేదీ, చర్చించాల్సిన అంశాలు, సమావేశం నిర్వాహకులు (నిర్వహణ సహకారం), సమావేశానికి ముందస్తు నమోదు (Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు, బహుశా పాల్గొనేవారు, పాల్గొనటానికి కుదరనివారు, స్పందనలు), నివేదిక (చర్చించిన అంశాలు, పాల్గొన్నవారు, ప్రత్యక్షంగా పాల్గొన్నవారు), చిత్రమాలిక వంటి అంశాలు ఉండేలా చూసుకోగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:48, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడీయా 17 వ పుట్టినరోజు మార్చు

డిసెంబర్ 10, 2019 తెలుగు వికీపీడియాకు 17 వ పుట్టిన రోజు. గతంలో కొన్ని సార్లు (ఉదా:వికీపీడియా:సమావేశం/వికీ జన్మదినం వేడుక 2012) జరుపుకున్నట్లు, తెలుగు వికీపీడియా జన్మదిన వేడుకలు జరుపుకుంటే బాగుంటుంది. ఆసక్తి గల సభ్యులు స్పందిస్తారని ఆశిస్తాను. ఈ సందర్భంగా తెలుగు వికీ అభివృద్ధికి కృషి చేసిన, చేస్తున్న అందరికి వ్యక్తిగతంగా నా కృతజ్ఞతలు. --అర్జున (చర్చ) 09:20, 4 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన. నేను దీనికి సుముఖంగా ఉన్నాను.__చదువరి (చర్చరచనలు) 10:40, 4 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ సరైన సమయానికి గుర్తు పెట్టుకుని సముదాయం దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ,దీనికి నా సుముఖతను మద్దతును తెలుపుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:25, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
భేష్! ఈ పుట్టిన రోజు సంబరాలకు వేదికగా, గచ్చిబౌలి లోని కోలివ్ - గార్నెట్ లో గల కాన్ఫరెన్స్ హాల్ ను వేదికగా నేను ఏర్పాటు చేయగలను. సమయం తెలిపిన చో ఆ ప్రకారంగా నేను ఏర్పాట్లు చేస్తాను. - శశి (చర్చ) 13:41, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
శశి గారూ, చప్పట్లు!!__చదువరి (చర్చరచనలు) 14:19, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, స్థలాన్ని సూచిస్తూ శశి గారు ముందుకొచ్చారు. ఇక మీరు సంభావ్యమైన తేదీలను సూచిస్తే మిగతా వాడుకరులు కూడా ఈ చర్చలో పాల్గొనేందుకు రావచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:22, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించిన చదువరి, యర్రా రామారావు, శశి గార్లకు ధన్యవాదాలు. వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2019 పేజీ ప్రారంభించాను. ఆసక్తిగల అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. --అర్జున (చర్చ) 04:25, 6 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ లవ్స్ మేడారం జాతర ఫొటోగ్రఫీ పోటీకు ప్రతిపాదన మార్చు

2020 ఫిబ్రవరి నెలలో జరగబోయే సమ్మక్క సారక్క (మేడారం) జాతరకు, వికీ లవ్స్ మాన్యుమెంట్స్ తరహాలో ఒక ఫొటోగ్రఫీ పోటీ పెడితే ఎన్నో సంవత్సరాలుగా మన మధ్య జరుగుతున్న ఈ జాతర గురించి బాహ్య ప్రపంచానికి తెలియజేయడంలో తోడ్పడుతుంది. ఈ ఆలోచన కనుక మీకు నచ్చినట్టు అయితే క్రింద దీనికి మద్దతు తెలుపగలరు. అలానే ఏమైనా సందేహాలు, సూచనలు, ఆలోచనలు ఉంటే క్రింది అడగగలరు.--IM3847(చర్చ) 14:59, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఆలోచన బాగుంది. పోటీ పెట్టండి. __చదువరి (చర్చరచనలు) 17:26, 7 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • B.K.Viswanadh IM3847 గారికి, విషయానికి సంబంధించి ఎక్కువమంది పాల్గొనేలాగా వుంటే బాగుంటుంది. ఇప్పటివరకు ఫోటోగ్రపీ పోటీల విషయాలు పరిశీలించినట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. లేకపోతే కేవలం ఆ జాతర లో పాల్గొన్న కొద్దిమంది మాత్రమే పోటీలోపాల్గొనే అవకాశం ముంది. ఒక నాలుగయిదు ఫొటోలు సరిపోయే దానికి ఎక్కువ సంఖ్యలో ఫొటోలు వచ్చినా ఎక్కువ ఉపయోగం లేదు. సమ్మక్క సారక్క జాతర లో ఇప్పటికే స్వేచ్ఛాహక్కుల ఫొటోలు వున్నాయి. అంతకంటే ఇంక ఎక్కువ నాకయితే అవసరమనిపించటం లేదు. విస్తృతంగా పాల్గొనేటందుకు వేరే విషయం ఆలోచించడం మంచిది. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు లేక మండల స్థాయిలో ఇతర విషయాలు ఏమైనా మెరుగుగా వుంటాయోమో ఆలోచించండి. --అర్జున (చర్చ) 05:07, 8 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • Arjunaraoc గారు, సమ్మక్క సారక్క జాతర వ్యాసంలో ఉన్న చిత్రాలన్నీ 500kb కు దరిదాపుల్లో ఉన్నవి. వికీమీడియా కామన్సులో ముఖ్యమైన, నాణ్యమైన ఫోటోలను Quality images మరియు Featured pictures గా పిలుస్తారు. మన రాష్ట్రాలలో ఇవి కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి ఫొటోగ్రఫీ పోటీలలో సాధారణ వికీపీడియన్లే గాక, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కూడా పాల్గొనే అవకాశము ఉంది. ముఖ్యమైన వ్యాసాలకు నాణ్యమైన ఫోటోలు ఉంటే బాగుంటుందని నా మనవి.--IM3847 (చర్చ) 09:37, 8 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • IM3847 గారికి, మెరుగైన నాణ్యత గల ఫొటోలు వుంటే మంచిదని నేను అంగీకరిస్తాను. అయితే ఎక్కువ పని, ఖర్చుతో కూడిన పనులు చేసేటప్పుడు వాటికి తగినంత ప్రతిఫలం వస్తుందని అంచనా వేస్తేనే ప్రారంభించటం మంచిదని అందరికి తెలిసినదే. కేవలం ఒక్క వ్యాసం మెరుగుచేయటాకి మీరు ప్రతిపాదించిన పోటీ తగినంత ప్రతిఫలం ఇవ్వదని నా సూచన.--అర్జున (చర్చ) 04:19, 9 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • మంచి ప్రయత్నం మహేష్. ఇలాంటి ఫోటో కాంపిటీషన్ పెట్టాలని గత కొన్నేళ్ళుగా అనుకుంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్ళకి ఒక సందర్భం దొరికింది. వెంటనే ప్రారంభిద్దాం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:24, 10 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇది మంచి ప్రయత్నం. దీని వల్ల వచ్చే ఫోటోలతో బాటు (ఆమాటకి వస్తే అంతకన్నా) వచ్చే ఫోటోగ్రాఫర్లు మనకు చాలా విలువైన రీసోర్సు. కార్యక్రమం ప్రణాళికలోనే ఆ వచ్చే ఫోటోగ్రాఫర్లకు వికీ స్ఫూర్తి తెలిసి వారు వికీమీడియన్లు అయ్యేలాంటి ప్రయత్నం ఆలోచించుకుంటే వన్ టైం కార్యక్రమం కాకపోవడం, మన శ్రమకు తగ్గ ప్రతిఫలం రావడం అన్నది ఉంటుందని నా సూచన. ఏదేమైనా ఈ ప్రయత్నాన్ని నావైపు నుంచి పూర్తిగా సమర్థిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:58, 13 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

హైదారాబాదు పుస్తక సంబరాలు (2019)లో తెలుగు వికీపీడియా స్టాల్ మార్చు

అందరికీ నమస్కారం, హైదరాబాదు పుస్తక సంబరాలు 2019, డిసెంబరు 23 నుండి 2020, జనవరి 1 వరకు జరుగనున్నాయి. కొన్ని కారణాల వల్ల గత రెండు (2017, 2018) సంవత్సరాలలో జరిగిన హైదారాబాదు పుస్తక సంబరాల్లో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహించుకోలేకపోయాం. ఈసారి తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహించాలని అనుకున్నాం. గత కొన్నేళ్ళుగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ మరియు తెలంగాణ డిజిటల్ మీడియా వాళ్ళు తెలుగు వికీపీడియా అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ వస్తున్నారు. స్టాల్ విషయమై వారిముందు ప్రస్తావించగా, అందుకు కావలసిన సహకారం అందిస్తామన్నారు. కాబట్టి... తెలుగు వికీపీడియా, హైదరాబాదు ఐఐఐటీ, తెలంగాణ డిజిటల్ మీడియా సంయుక్తంగా హైదారాబాదు పుస్తక సంబరాలు (2019)లో తెలుగు వికీపీడియా స్టాల్ ను నిర్వహించుకోబోతున్నాం. పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి, స్టాలులో ఉండటానికి ఔత్సాహికులు కావాలి. మీకు వీలైనంత సమయమే స్టాలు వద్ద గడపవచ్చు. కార్యక్రమంలో తమ భాగస్వామ్యం గురించి కానీ, సూచనలు కానీ, ఇతరేతరమైన అభిప్రాయాలు కానీ తెలియజేయగలరు. నిర్వహణలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఇతర వికీపీడియన్లు తమ అందుబాటు వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.

మన అవసరాలు

  1. పుస్తక ప్రదర్శనకి వచ్చిన వారి పేరు నమోదు, వచ్చిన వారికి సహాయము చేయుట, కరపత్రముల పంపిణి మెదలగు అవసరములకు సహాయము కావలెను.
  2. తెలుగు సాంకేతికాలు (కంప్యూటర్/మొబైల్ లలో తెలుగు రాయటం, తెలుగు వికీపీడియా) వాటికి సహాయము - మీరు లాపుటాపు తెచ్చుకొనవలసి ఉండును, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే మరీ మంచిది.

ఆసక్తి ఉన్నవాళ్ళు గూగుల్ ఫారంలో నమోదు చేసుకోగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:34, 17 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey మార్చు

This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.

MediaWiki message delivery (చర్చ) 09:05, 18 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Project Tiger updates - quality of articles మార్చు

Excuse us for writing in English, kindly translate the message if possible

Hello everyone,

 
tiger face

It has been around 70 days since Project Tiger 2.0 started and we are amazed by the enthusiasm and active participation being shown by all the communities. As much as we celebrate the numbers and statistics, we would like to reinstate that the quality of articles is what matters the most. Project Tiger does not encourage articles that do not have encyclopedic value. Hence we request participants to take care of the quality of the articles submitted. Because Wikipedia is not about winning, it is about users collectively building a reliable encyclopedia.

Many thanks and we hope to see the energy going! (on behalf of Project Tiger team)
sent using --MediaWiki message delivery (చర్చ) 16:21, 19 డిసెంబరు 2019 (UTC)
[ప్రత్యుత్తరం]

తెవికీ పుట్టినరోజున వాడుకరుల మనోగతాలు మార్చు

తెవికీ 16 వ పుట్టినరోజు సందర్భంగా, 2019 డిసెంబరు 22 న హైదరాబాదు, గచ్చిబౌలిలో తెవికీ వాడుకరుల సమావేశం జరిగింది. తెవికీ ప్రస్తుత పరిస్థితి గురించి, లోటుపాట్ల గురించి, ఎలా మెరుగుపరచుకోవాలి అనే విషయాలపై వాడుకరులు తమ తమ అభిప్రాయలు సూచనలూ చెప్పారు. వాటిని క్రోడీకరించి వికీపీడియా:తెలుగు వికీపీడియా పరిస్థితిపై వాడుకరుల అభిప్రాయాలు పేజీలో పెట్టాం. వాడుకరులంతా వాటిని పరిశీలించడమే కాకుండా, తమ అభిప్రాయాలను కూడా అక్కడి చర్చాపేజీలో జోడించి, ఆ సూచనల జాబితాకు మరింత సమగ్రత ఇవ్వాల్సినదిగా కోరుతున్నాను. ఆ విధంగా వచ్చిన సూచనలన్నిటి ఆధారంగా మనం ఒక కార్యాచరణను రూపొందించుకుందాం. వాడుకరులంతా చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 01:43, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సుమారుగా ఒక వారమైంది తెవికీ లోటుపాట్ల గురించిన ఈ పేజీ పెట్టి. మరొక్క వారం లోపు వాడుకరులు ఈ పేజీని చూసి తమ అభిప్రాయాలు చెబితే, తదనుగుణంగా జనవరి ఐదారు తేదీల్లో కార్యాచరణను రూపొందించుకుందాం. __చదువరి (చర్చరచనలు) 01:47, 30 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం నుండి వికీసోర్సులోని సంబంధిత పేజీకి లింకు చేసేందుకు మార్చు

తెవికీ వ్యాసం నుండి వికీసోర్సు లోని సంబంధిత పేజీకి లింకు చేసేందుకు {{Wikisourcelang}} అనే మూసను వాడాలి. తెవికీ వ్యాసం పేరు, వికీసోర్చు పేజీ పేరు - ఈ రెండూ ఒకటే అయితే {{Wikisourcelang}} అని రాసేస్తే సరిపోతుంది. ఒకవేళ అవి రెండూ వేరువేరు అయితే, {{Wikisourcelang|te|<వికీసోర్సు వ్యాసం పేరు>}} అని రాయాలి. గతంలో {{Wikisource}} అనే మూసను వాడాం. కానీ దీనితో తెలుగు వికీసోర్సుకు లింకు ఇవ్వడం కుదరదు, ఇంగ్లీషు వికీసోర్సుకు మాత్రమే లింకు ఇవ్వగలం. వాడుకరులు గమనించవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 07:26, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తక ప్రదర్శనలో వికీపీడియా మార్చు

హైదరబాదు పుస్తక ప్రదర్శనలో, తెలంగాణ ప్రభుత్వం, ఐఐఐటి వారు కలిసి తెలుగు వికీపీడియా స్టాలును ఏర్పాటు చేసారు. అక్కడ తెవికీ సముదాయం తరపున కూడా కార్యక్రమాలు చేద్దామని నిన్నటి (డిసెంబరు 22 నాటి) 16 వ పుట్టినరోజు సమావేశంలో అలోచన వచ్చింది. పుస్తక ప్రదర్శనలో ఏదో ఒక కార్యక్రమం చేసి వికీపీడియాకు అదనపు ప్రచారం చేకూరేలా చెయ్యాలని సభ్యులు భావించారు. వాటిలో ప్రణయ్ రాజ్ గారు 1200 రోజుల్లో 1200 వ్యాసాలు రాసిన సందర్భంగా ఆయన్ను అభినందించే కార్యక్రమం ఒకటి అనుకున్నాం. అలాగే పవన్ సంతోష్ గారు ఈరోజు ఒక సూచన చేసారు. తెవికీలో తెలంగాణ గ్రామాల వ్యాసాల అభివృద్ధి గురించి ఒక ఈ పుస్తకం తయారుచేసి, దాన్ని పుస్తక ప్రదర్శనలో విడుదల చేస్తే తెవికీ ప్రచారానికి ఉపయోగపడుతుందనేది ఆ సూచన. అది నాకు కూడా నచ్చింది. ప్రణయ్‌రాజ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు బాధ్యత తీసుకున్నారని పవన్ గారు చెప్పారు. వాడుకరులు తమ సూచనలను తెలియజేయాలని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:42, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ రాజ్ గారిని అభినందించే కార్యక్రమానికి ఒకరిద్దరు సినీరంగ/ సాంస్కృతిక రంగ ప్రముఖులను రప్పించగలిగితే జనాన్ని ఆకర్షించగలుగుతాము. వీలవుతుందేమో పరిశీలించండి. --స్వరలాసిక (చర్చ) 13:54, 23 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పుస్తక ప్రదర్శనలోని తెవికీ స్టాల్ లో భాగంగా ఈ కార్యక్రమం చేయడం కంటే, ప్రత్యేకంగా ఒకరోజు మొత్తం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రభుత్వ అధికారులను ఆ కార్యక్రమంకు ఆహ్వానించి వారికి ఈ కృషిని చూపిస్తే బాగుంటుంది. ఆ కార్యక్రమంలో 'సమాచారపరంగా తెలంగాణ గ్రామ వ్యాసాలను తెవికీలో అభివృద్ధి చేశామని, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గ్రామవ్యాసాల్లోకి వచ్చిచేరేలా సహకారం అందించమని' తెలంగాణ ప్రభుత్వాన్ని కోరవచ్చని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:35, 25 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 16 వ పుట్టిన రోజు కార్యక్రమాల నివేదిక మార్చు

2019 డిసెంబరు 22 న, తెవికీ 16 వ పుట్టినరోజు సందర్భంగా, జరిగిన సమావేశపు నివేదికను ప్రచురించాను, చూడండి.-- 2019-12-23T20:41:37 User:Chaduvari

వికీపీడియా యూజర్ గ్రూపు ఏర్పాటు మార్చు

వికీపీడియా యూజర్ గ్రూపు ఏర్పాటు గురించి తెవికీ 16 సమవేశంలో చర్చించాం. ఈ గ్రూపును ఏర్పాటు చెయ్యడానికి సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తూ పవన్ సంతోష్ గారు సవివరమైన ప్రతిపాదన వ్యాసం రాసారు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 00:37, 26 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త కొలువు (ప్రాజెక్టు కన్సల్టెంట్ @ ఐఐఐటి హైదరాబాద్) మార్చు

నేను (కృపాల్ కశ్యప్ ) ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్ లో ప్రాజెక్టు కన్సల్టెంట్ (కాంట్రాక్టు & పార్ట్ టైం) గా డిసెంబర్ 2019 న చేరాను. తెలుగు, వికిపీడియా లో నాకు గల 15 సంవత్సరాల అనుభవం ఈ కొత్త కొలువుకు ఉపయోగపడగలదు, ప్రాజెక్టు కన్సల్టెంట్ గా నా బాధ్యతలు తెలుగు వికీ,ఇండిక్ వికీ సముదాయ అభివృద్ధి, ఇతర కమ్యూనిటీలు లేదా సంస్థలతో సహకారం ,శిక్షణా సమావేశాలు మరియు వర్క్‌షాపులు నిర్వహించడం, IIIT సహకార ప్రాజెక్టులు, యంత్ర అభ్యాసం, AI, డేటా సైన్స్ సాధనాలు , అనువాదం మరియు భాషా సాధనాలు మొదలైన వాటికి కన్సల్టింగ్ మద్దతును అందించడం. వీటికోసం (newwikiwave ) అనే ఐడి లేదా ఐఐఐటీ వారి కామన్ ఐడి ని వాడతాను. ముఖ్యమైన కార్యక్రమాలు , మార్పుల విషయంలో, రాశి లోనూ , వాసిలోనూ తెలుగు వికీపీడియా అభివృద్ధికి, తెలుగు వికీపీడియన్ లు ఇచ్ఛే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకోంటాను. నేను పనిచేసే ఏ విషయం లో కూడా వికీపీడియా ఐదు మూల స్థంభాల ని దాటి వెళ్లకుండా జాగ్రత్త పడతాను, నా నుండి ఏమైనా పొరపాటు జరిగితే మొహమాటంలేకుండా హెచ్చరించగలరు నాకు చేతనైన మేర సరిదిద్దుకొంటాను. ఈ ప్రాజెక్టు కు ఐఐఐటీ వారికి నా పేరు సూచించిన కొంతమంది వికీపీడీయా అధికారులకు ధన్యవాదములు. తెలుగు వికీపీడియా సభ్యుల నుండి సహకారం ఆశిస్తూ . Kasyap (చర్చ) 06:39, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

  • కృపాల్ కశ్యప్ గారూ,మీరు కొత్త కొలువులో చేరినందుకు ముందుగా అభినందనలు.తెలుగు వికీపీడియా ముఖ్యమైన కార్యక్రమాలు , మార్పుల విషయంలో, రాశి లోనూ , వాసి తెలుగు వికీపీడియా అభివృద్ధికి, తెలుగు వికీపీడియన్ లు ఇచ్ఛే విలువైన సలహాలను పరిగణలోనికి తీసుకొంటానని, మీరు పనిచేసే ఏ విషయం కూడా వికీపీడియా ఐదు మూల స్థంభాల ని దాటి వెళ్లకుండా జాగ్రత్త పడతాను అని మీరు వక్కాణించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 07:48, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • @Kasyap: గారూ, మీ కొత్త కొలువు విషయంలో శుభాకాంక్షలు. 2020 వ్యక్తిగతంగా, వృత్తిగతంగా మీకు మరింత సంతోషాన్ని పంచాలని ఆశిస్తున్నాను. ఉద్యోగ బాధ్యతల విషయంలో వేరే ఐడీ వాడే ఆలోచన చేశారు కాబట్టి చిన్న సూచన (బహుశా ఈ విషయం మీకు ముందే తెలిసీ ఉండొచ్చు)- ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా ఫౌండేషన్‌తో సహా చాలా సంస్థల్లో వాడే పద్ధతి ఏమంటే కొత్త వాడుకరి పేరు ఆ వ్యక్తి పేరిట ఏర్పాటుచేసుకుని బ్రాకెట్లో సంస్థ పేరు పెట్టుకుని వాడుకోవడం.(ఈ పోస్టులో మానవ్ ప్రీత్ పద్ధతిలో) ఇలాగే చెయ్యాలనేమీ లేదు. మీరన్నట్టుగా సంస్థ కామన్ ఐడీ కూడా వాడవచ్చు. మీకీ పద్ధతి ఎప్పుడైనా పనికివస్తుందేమోనని చెప్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:21, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • "వికీపీడియా ఐదు మూల స్థంభాల ని దాటి వెళ్లకుండా జాగ్రత్త పడతాను" -భేష్, Kasyap గారు. మీరు ఈ పనికి సమర్ధులని నాకు గట్టి నమ్మకం. మీరు ఐఐఐటీ వాళ్ళకు ఒక మంచి రిసోర్సు అవుతారు. వాళ్ళ ప్రాజెక్టుకు మంచి జరుగుతుందని, వికీపీడియాకు కూడా మంచి జరుగుతుందనీ నా నమ్మకం. కొత్త వాడుకరులు చేసే రచనల్లోని భాష విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలని మిమ్మల్ని కోరుతున్నాను. (ఇక పోతే.. తేడాపాడాలు ఏమైనా జరిగితే, ఎవర్ని అడగాలో మాకు తెలిసిపోయింది. :) ) __చదువరి (చర్చరచనలు) 10:37, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • ధన్యవాదాలు కశ్యప్ గారికి మరియు శుభాకాంక్షలు. మీరు వికీపీడియాకు దొరికిన ఒక ఆణిముత్యం, అందరికంటే ముందు కార్యక్రమాలను నిర్వహించిన ఘనత మీది. మీరు చేసిన వాగ్దానాలను నిలుపుకొనే ప్రయత్నం చేస్తూ, అదే త్రాటిన చురుగ్గా వ్యాసాల అభివృద్ధి సాధించాలని నా అభిలాష.--Rajasekhar1961 (చర్చ) 12:38, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • కొత్త కొలువులో చేరిన Kasyap గారికి శుభాకాంక్షలు.-నాయుడు గారి జయన్న (చర్చ) 17:19, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • Kasyap గారికి అభినందనలు. గతంలో వ్యక్తిగతంగా, సంస్థాగతంగా జరిపిన కృషి లోటుపాట్లు తెలుసుకొని మీరు పనిచేస్తారని, అలా చేసేపని తెవికీ అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాను. --అర్జున (చర్చ) 23:18, 27 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ముంబైలో జరుగుతున్న SWASTHA సమావేశంలో పాల్గొనడం మార్చు

అందరికి నమస్కారం, స్థానిక సముదాయాలలో ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ అనుబంధ సంస్థల సహాయంతో SWASTHA (Special Wikipedia Awareness Scheme for The Healthcare Affiliates) పేరుతో ఒక ప్రాజెక్టు ప్రారంభించబడింది. భారతదేశంలోని 10 భాషలలో 10 అంశాలపై వికీపీడియాలో ఆరోగ్య సమాచారాన్ని పొందుపరచమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశం ముంబైలో జరుగుతుంది. అభిషేక్ సూర్యవంశీ ఆధ్వర్యంలో జరుపబడుతున్న ఈ సమావేశంకు నన్ను ఆహ్వానించారు. ఈ సమావేశంలో SWASTHA ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని, తెలుగు వికీపీడియాలో ఆయా వ్యాసాలపై కృషి చేయడంతోపాటు, సముదాయ సభ్యులకు ఈ ప్రాజెక్టు గురించి వివరించి వారిని కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వాయ్యం చేయాలనుకుంటున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:18, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మంచిది.ఆరోగ్య సంరక్షణకు సంబందించిన మరింత సమాచారం తెలుగు వికీపీడియా అందించగలరని ఆశిస్తూ శుభాకాంక్షలు.--యర్రా రామారావు (చర్చ) 04:25, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ SWASTHA అనేది వికీమీడియా మొదలుపెట్టిందా? దీని గురించిన వివరాలు చెప్పండి. ఒకవేళ గతంలో చర్చకు వచ్చి ఉంటే.. నేను చూళ్ళేదు, సారీ. __చదువరి (చర్చరచనలు) 04:42, 28 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగేతర పేర్లను రాయడం ఎలా? మార్చు

తెలుగేతర పేర్లు సాధారణంగా హలంతాలుగా ఉంటాయి. అలాంటి పేర్లను తెలుగులో రాసేటపుడు అజంతం చెయ్యాలా అనే సందేహం మనకు ఉంది. దీనిపట్ల మనకు మార్గం చూపే మార్గదర్శకం ఏదీ లేదని నాకు అనిపించింది. దీనిపై చర్చించి ఒక మార్గదర్శకం రూపొందించుకుందామనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదనను వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా? వద్ద పెట్టాను. ఆ ప్రతిపాదనలో ఇంకా చేర్చాల్సినవి ఉన్నాయని నాకు తోస్తోంది. దాన్ని పరిశీలించండి, చర్చించండి, సూచనలు సలహాలూ ఇవ్వండి, కొత్త సూత్రాలేమైనా చేర్చాల్సి ఉంటే చేర్చండి. ఆ చర్చానుసారం ఒక మార్గదర్శకాన్ని తయారు చేసుకుందాం. ధన్యవాదాలు.__చదువరి (చర్చరచనలు) 11:50, 29 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాల విభాగంలో మండలం పేరు ఎలా ఉండాలి? మార్చు

మండలాల విభాగంలో మండలాల పేర్లు ఎలా చూపించాలి అనే దానిపై కొంత సందిగ్దంగా ఉంది. ఉదా: అనంతపురం మండలం ఉండాలా లేదా అనంతపురం అని ఉండాలా?దీని మీద ఒక నిర్ణయం లేదా మార్గదర్శకం లేకపోయినందువలన ఆ విభాగాలు తరుచూ మార్పులు గురౌతున్నాయి.అన్ని చోట్ల ఒకే పద్దతి ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో చర్చకు తీసుకురావడమైనది.--యర్రా రామారావు (చర్చ) 05:04, 31 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

  • యర్రా రామారావు గారూ, ఈ సదర్భంలో పైపు లింకు పెట్టకూడదు. [[అనంతపురం మండలం|అనంతపురం]] అని రాయకూడదు, [[అనంతపురం మండలం]] అనే రాయాలి. మరీ ముఖ్యంగా "ఫలానా ఊరు [[అనంతపురం మండలం|అనంతపురం]] మండలం లోని గ్రామం." అనే వాక్యంలో అసలు అవసరం లేదు. నేరుగా "ఫలానా ఊరు [[అనంతపురం మండలం]] లోని గ్రామం." అని రాసెయ్యాలి. మనం లింకు ఇవ్వదలచిన పదమూ, పేజీ పేరూ ఒక్కటే అయితే, పైపులింకుతో పనిలేదు. ఆ రెండూ ఒకటి కాకపోతేనే పైపులింకు వాడాలి. ఉదాహరణకు "అనంతపురం మండలానికి" అనే పదానికి లింకు ఇవ్వాలంటే, [[అనంతపురం మండలం|అనంతపురం మండలానికి]] అని రాయాలి. ఆటోవికీబ్రౌజరు కూడా, అవసరం లేని పైపు లింకులను సవరిస్తుంది. అయితే, ఈ మధ్య గ్రామాల పేజీల్లోని లింకులను సవరించినపుడు ఈ పేజీల్లోని సమాచారపెట్టెల్లో మాత్రం [[అనంతపురం మండలం|అనంతపురం]] అనే పెట్టాను. ఎంచేతంటే, "అనంతపురం మండలం" అనే పేరు సమాచారపెట్టె వెడల్పు తక్కువగా ఉన్నందున రెండవ లైనులోకి దిగి, పెట్టె స్వరూపం మారుతోంది. అంచేత అలా పెట్టాను. __చదువరి (చర్చరచనలు</nowiki>) 06:52, 31 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇలాంటి సందర్భాల్లో సాధారణ నామం వాడాలన్న మన విధానాన్ని అనుసరించి పోవాల్సి ఉంటుంది. అంటే- సామాన్యంగా జనం ఎలా పిలుస్తారు, పత్రికలు ఎలా రాస్తున్నాయి వంటివి పరిశీలించి నిర్ణయించాలి. ఆ ప్రకారం చూస్తే- అనంతపురం పట్టణాన్ని అనంతపురం పట్టణం అని వ్యవహరించరు, అనంతపురం అని వ్యవహరిస్తారు. అలానే అనంతపురం మండలాన్ని అనంతపురం అని వ్యవహరించరు అనంతపురం మండలం అనే అంటారు. అదే మనకు గీటురాయి. --పవన్ సంతోష్ (చర్చ) 12:15, 31 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • సమాచారపెట్టెలో మండలం పేరును కుదించి చూపటానికి ముఖ్య కారణం, సమాచారపెట్టె లో మండలం అనే శీర్షిక ఎదురుగా పేరు వుంటుంది కాబట్టి.--అర్జున (చర్చ) 04:58, 1 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నే చెప్పిందీ అదే. __చదువరి (చర్చరచనలు) 15:53, 1 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైపు లింకులో పెద్ద విశేషమేమీ లేదులెమ్మనుకునేవాణ్ణి. కానీ యర్రా రామారావు గారూ, మీరడిగిన ప్రశ్న కారణంగా దానికి సంబంధించిన ఎన్వికీ పేజీ చదివాను. కొత్త సంగతులు, ముఖ్యంగా, దారిమార్పుల పేజీకి లింకులు ఎందుకివ్వాలో చెప్పే ఒక కారణాన్ని కూడా తెలుసుకున్నాను. ధన్యవాదాలు.__చదువరి (చర్చరచనలు) 15:53, 1 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]