వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 75

పాత చర్చ 74 | పాత చర్చ 75 | పాత చర్చ 76

alt text=2020 జూలై 1 - 2020 ఆగస్టు 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 జూలై 1 - 2020 ఆగస్టు 31

నిర్ణయం కోసం చూస్తున్న చర్చలుసవరించు

కింది చర్చల సమయాలు ముగిసిపోయాయి. కొన్ని చర్చల్లో వాడుకరులు చురుగ్గా పాల్గొనలేదు గానీ, సమయం ముగిసిపోయి చాన్నాళ్ళైంది కాబట్టి ఇక వాటికి నిర్ణయం ప్రకటించి మూసెయ్యవచ్చు. వాటిలో జోక్యం చేసుకోని, సంబంధిత విషయ పరిజ్ఞానం ఉన్న నిర్వాహకులు/వాడుకరి ఎవరైనా వాటిని ముగించాలని మనవి.

  1. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?
  2. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం
  3. చర్చ:వాసి (ప్రసిద్ధి)
  4. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాఘవేందర్ అస్కాని

అర్జున గారూ, మీరు ఈ చర్చల్లో పాల్గొనలేదు. కాబట్టి వీటికి నిర్ణయాలు ప్రకటించవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 08:07, 1 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా? కేవలం ఒకరే స్పందించారు. అందువలన ప్రస్తుతానికి మార్గదర్శకంగా పరిగణించడం మంచిది.
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం నేను ప్రతిపాదన దశలోనే వ్యతిరేకించాను కావున నేను నిర్ణయం ప్రకటించలేను.
మిగతా వాటిపై నా అభిప్రాయం లేక నిర్ణయం తెలియ చేశాను. పాలసీలపై చర్చలు వ్యాస పేజీలో కాకుండా చర్చ పేజీలోనే జరపడం మంచిది. కొత్త విధానాలకు వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి పాటించమని కోరుతున్నాను.-- అర్జున (చర్చ) 06:40, 2 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు. "వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?" ను ఒక మార్గదర్శకంగా తీసుకొమ్మన్నారు. కానీ అందులో సి. చంద్ర కాంత రావు గారు తన స్పందనలో కొన్ని సూచనలు చేసారు. వాటిని పరిగణన లోకి తీసుకోవాలో లేదో స్పష్టం కాలేదు, చర్చ అక్కడే అసంపూర్ణంగా ఆగిపోయింది. ప్రతిపాదనను ఉన్నదున్నట్టుగా తీసుకోవాలని మీ ఉద్దేశమా? లేక వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం ఓటింగు ప్రకటించడం మంచిదంటారా? మీ నిర్ణయాన్ని అక్కడే ప్రకటిస్తే బాగుంటుందేమో పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:56, 2 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మార్గదర్శకంగా తీసుకోమని అన్నదాని గురించి స్పష్టత ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తు చేసినందులకు ధన్యవాదాలు. ప్రస్తుతమున్న పద్ధతి ప్రకారం అది నిర్ణయ స్థాయికి చేరలేదు. కావున మంచి సూచనగా తీసుకోవాలన్నదే నా భావం. అలాగే మార్గదర్శకాలకు ఓటు పద్ధతిని మనం ఇంతవరకు ప్రయోగించి చూడలేదు. కావున మార్గదర్శకాలకు క్లిష్టమైన పద్ధతి అవసరంలేదని నా ప్రస్తుత అభిప్రాయం. ఆ మేరకు పద్ధతి కి సవరణ చేయవలసిన అవసరం వుంది. --అర్జున (చర్చ) 05:02, 3 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Annual contest Wikipedia Pages Wanting Photosసవరించు

This is to invite you to join the Wikipedia Pages Wanting Photos (WPWP) campaign to help improve Wikipedia articles with photos and win prizes. The campaign starts today 1st July 2020 and closes 31st August 2020.

The campaign primarily aims at using images from Wikimedia Commons on Wikipedia articles that are lacking images. Participants will choose among Wikipedia pages without photo images, then add a suitable file from among the many thousands of photos in the Wikimedia Commons, especially those uploaded from thematic contests (Wiki Loves Africa, Wiki Loves Earth, Wiki Loves Folklore, etc.) over the years.

Please visit the campaign page to learn more about the WPWP Campaign.

With kind regards,

Thank you,

Deborah Schwartz Jacobs, Communities Liaison, On behalf of the Wikipedia Pages Wanting Photos Organizing Team - 08:24, 1 జూలై 2020 (UTC)

feel free to translate this message to your local language when this helps your community

How does one know what pictures are already available in the Commons? Is there a way to query? Thanks Vemurione (చర్చ) 23:07, 25 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Vemurione గారు, పైన ఇచ్చిన లింకులో మూడవ అంకం నకలు క్రింద ఇచ్చాను చూడండి
  Find an appropriate image on Commons. Click here to search for the image using the correct title or category. There are several ways to do this. See this simple media reuse guide. Here are additional tips.
తెలుగులో వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు చూడండి.--అర్జున (చర్చ) 00:16, 26 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఈ పోటీ ఫలితాలు వెలువడ్డాయా? ఎవరైనా లంకె ఇవ్వగలరు.--స్వరలాసిక (చర్చ) 01:35, 3 అక్టోబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Feedback on movement namesసవరించు

నమస్తే. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language if necessary. కృతజ్ఞతలు!

There are a lot of conversations happening about the future of our movement names. We hope that you are part of these discussions and that your community is represented.

Since 16 June, the Foundation Brand Team has been running a survey in 7 languages about 3 naming options. There are also community members sharing concerns about renaming in a Community Open Letter.

Our goal in this call for feedback is to hear from across the community, so we encourage you to participate in the survey, the open letter, or both. The survey will go through 7 July in all timezones. Input from the survey and discussions will be analyzed and published on Meta-Wiki.

Thanks for thinking about the future of the movement, --The Brand Project team, 19:42, 2 జూలై 2020 (UTC)

Note: The survey is conducted via a third-party service, which may subject it to additional terms. For more information on privacy and data-handling, see the survey privacy statement.

చర్చసవరించు

ఇది రీబ్రాండింగ్ ఎక్సర్ సైజ్. ఇది గనుక విజయవంతం అయితే, వికీమీడియా ఫౌండేషన్ పేరు, వికీమీడియా మూవ్ మెంట్ అన్న పేరు అసలు వికీమీడియా అన్న పేరు సైతం మారిపోతాయి. చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. కాబట్టి, ఈ విషయాన్ని గురించి మనం ఈ విషయాన్ని మనం చర్చించి, మన పక్షాన మనం ఒక నిర్ణయం తీసుకుని, మన స్వరం వినిపించాలని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 02:06, 3 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కాల దోషం పట్టిన మూలపు మూస వాడుకలలో deadurl పరామితి తొలగింపుసవరించు

ప్రధానపేరుబరిలోని వ్యాసాలన్నింటిలో మూలపు మూసలలో వాడబడిన deadurl లేక dead-urlకు కాలదోషం పట్టింది. దీనికి బదులుగా url-status వాడాలి. నా బాట్ ద్వారా ఆ మార్పులు చేశాను. అయితే Internetarchivebot మార్చిన మూలాలకు ఇప్పటికే url-status వుండి వుంటే దానిని గమనించి చేయలేదు కావున కొన్ని సార్లు url-status పరామితి రెండు సార్లు వేర్వేరు విలువలతో కూడా చేరివుండవచ్చు. దీనిని వాడుకరులు ఆ మూలాన్ని వీక్షించి తదనుగుణంగా మానవీయ మార్పులు చేయవలసినదిగా కోరుతున్నాను. దీనివలన మూలాల జాబితా లో ఎర్ర సిరా చాలావరకు తగ్గిపోయింది. ఇంకేమైనా ఎర్రసిరా హెచ్చరికలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:24, 7 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ అలా మార్చవలసిన మాదిరి లింకు ఒకటి ఉన్న వ్యాసం గానీ, అలాంటి లింకులు ఉన్న వర్గం గానీ వివరాలు తెలుపగలరా!నాకు అవగాహన కోసం మాత్రమే.--యర్రా రామారావు (చర్చ) 06:21, 7 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, లింకు చూడండి. ఇక్కడ url-status విలువ ఒకే విధంగా వుంది. కావున ఒకటి తొలగించాను.-- అర్జున (చర్చ) 09:35, 7 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సరేనండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:44, 7 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Internetarchivebot పనిచేస్తున్న లింకుని పనిచేయనిదిగా గుర్తించడంసవరించు

అర్జున గారూ, పనిచేస్తున్న లింకులను కూడా Internetarchivebot పనిచేయని లింకులుగా చూపిస్తూ, [permanent dead link] అని చేరుస్తోంది. ఒకసారి ఈ లింకు పరిశీలించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:19, 8 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari నేను ఆ మార్పు తొలగించి మానవీయంగా బాట్ నడిపి చూశాను. బాట్ మార్పు చేయలేదు. సర్వర్ లో ఏమైనా తాత్కాలిక సమస్య వలన జరిగిందేమో. ఇటువంటివి ఇంకా ఎక్కువగా కనబడితే బాట్ యజమానికి తెలియచేయవచ్చు.--అర్జున (చర్చ) 07:09, 8 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:12, 8 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారు, False positive లను https://iabot.toolforge.org/index.php?page=reportfalsepositive లో నివేదించవచ్చు. నేను నివేదించాను. మరల సమస్య కనబడితే en:User talk:Cyberpower678 లో చర్చించండి.--అర్జున (చర్చ) 06:07, 9 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగేనండి అర్జున గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:11, 9 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ఈ సమస్య పరిష్కారం కాలేదు, పనిచేస్తున్న అనేక లింకులను Internetarchivebot డెడ్ లింక్స్ గా మారుస్తోంది. en:User talk:Cyberpower678లో ఈ చర్చను నివేదించి, తెలుగు వికీపీడియాలో dead link checkingని అచేతనం చేయమంటే మంచిదని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 17:11, 28 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారు, Internetarchivebot పని dead link కనుగొని ఆర్కైవ్.ఆర్గ్ లింకు చేర్చటమే. కావున dead link checking అచేతనం చేయలేము. 2020 లో ఇప్పటిదాక, 36306 మార్పులలో ఏడు మార్పులలోనే సమస్య వచ్చింది. అటువంటి సమస్య False positive నివేదించటం ద్వారా తీరుతుంది. ఆ పేజీలకు నేను నివేదించాను మరల ఇంకొకనెల పరిశీలించి సమస్య తీవ్రత పెరుగుతుంటే బాట్ యజమానిని సంప్రదించటం మంచిది.-- అర్జున (చర్చ) 23:01, 28 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారు, కె. నాగేశ్వర్, కాసర్ల శ్యామ్, తెలుగు భాషా దినోత్సవం పేజీల్లో Internetarchivebot చేసిన మార్పులు చూస్తే, url-status=dead గా మారుస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 05:12, 29 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి గారు,మీరు చూపినవి పరిశీలించాను. వీటిలో కొన్ని ఇప్పటికే False positive గా నివేదించారు. మిగిలినవాటిని నేను నివేదించాను. ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా భద్రపరచాను. ఇంటర్నెట్ పనితీరువలన కొన్ని సార్లు దోషాలుండవచ్చు.కాని ఒకసారి ఒక జాలచిరునామ నివేదిస్తే కొత్త దోషాలలో ఆ జాలస్థలి ఉండదనుకుంటాను. మీరు దోషాలు గమనిస్తే బాట్ మార్పు రద్దు చేసి URL నివేదించండి. కొన్నాళ్ల తరువాత మరల సమీక్షించవచ్చు. ఒకవేళ పనిచేయనిదిగా మార్పు చేసినా, ఆర్కైవ్.ఆర్గ్ లింకు వుంటే చదువరులకు సమాచారం అందుతుంది కాబట్టి పెద్దగా మనం బాధపడాల్సిన పనిలేదు. --అర్జున (చర్చ) 23:54, 29 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సరేనండి అర్జున గారు. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 03:01, 30 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Editing news 2020 #3సవరించు

12:55, 9 జూలై 2020 (UTC)

GENTLE REMINDER: Project Tiger 2.0 - Feedback from writing contest editors and Hardware support recipientsసవరించు

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest feedback.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further. The process of the writing contest will be ended on 20 July 2020.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

The Writing Contest Jury Feedback form is going to close on 10 July 2020.

Thank you. Nitesh Gill (talk) 15:57, 10 June 2020 (UTC)

Announcing a new wiki project! Welcome, Abstract Wikipediaసవరించు

Sent by m:User:Elitre (WMF) 20:10, 9 జూలై 2020 (UTC) - m:Special:MyLanguage/Abstract Wikipedia/July 2020 announcement Reply[ప్రత్యుత్తరం]

ఇండిక్ వికీ ప్రాజెక్టు - online వికీ శిక్షణా తరగతులు ప్రతిపాదనసవరించు

నమస్కారం ,

తెలుగు వికిపీడియాను ఎప్పుడైనా , ఎక్కడైనా ,వెబ్ ఆధారంగా నేర్చుకోవటం కోసం గూగుల్ సాంకేతిక పరిజ్ఞానం ( classroom , codelabs ) ఆధారంగా కొన్ని ఆన్లైన్ పాఠాలువీడియోలు ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించదలచాము. ఇవి కొత్తగా వికీలో రాయబోయే ఔత్సాహికులను దృష్టిలో పెట్టుకొని రాసిన ప్రాధమిక జాబితా వీటిని అందరికీ అందుబాటులో ఉంచటం ద్వారా ఎవరైనా వికీలో వ్యాసం రాయగలరని మా ఆలోచన , వీటి ఆధారంగా వికీడేటా, వికీ సోదర ప్రాజెక్టులు వంటి మరిన్నిపాఠ్యాంశాలు చేర్చగలం. ఇందులో ఈ విభాగాలుచేర్చాలని మా ఆలోచన , ఇలా చేసిన మొదటి రెండు విభాగాలు నమూనా ను https://teluguwiki-aa8c2.web.app/ లో మీరు చూడవచ్చు , ఏమైనా సూచనలు , చేర్చదగిన అంశాలు ఉంటే మాకు తెలియచేయగలరు. ఈ ప్రాజెక్టు వివరాల కొరకు ఇక్కడ చూడగలరు.

వికీపీడియా వర్క్ షాప్ లో ఉపయోగించడానికి అభ్యాస కంటెంట్ సృష్టించడం కొరకు అంశాలు

1) వికీపీడియా ఉపోద్ఘాతం , సంక్షిప్తం గా వికీపీడియా పరిచయం , వికీపీడియా - ఐదు మూలస్థంభాలు, వికీపీడియా ఆవశ్యకతలు

2) Google మూలాంశ ఉపకరణాల పొడిగింపు (డెస్క్ టాప్ )

3)వాయిస్ మరియు కీబోర్డ్ లు ఉపయోగించి మొబైల్ పరికరాల్లో తెలుగును టైప్ చేయడం ఎలా Gboard (మొబైల్ అప్లికేషన్)

4)tewiki.iiit.ac.in పరిచయం, తెవికీ ప్రయోగశాల ( Sandbox) లో నమోదు

5)తెలుగు వికీపీడియాలో లాగిన్ ప్రక్రియ, ఒక వాడుకదారుని పేజీని సృష్టించడం , స్వ పరిచయం జోడించడం

6) వికీపీడియా లో అన్వేషణ , వికీపీడియాలో ఉన్న ప్రాథమిక నావిగేషన్

7) వికీపీడియాను ఒక పరిశోధన సాధనంగా ఉపయోగించడం, వికీ పేజీ నుండి PDF గా ఎగుమతి మొదలైనవి

8)వికీ ప్రామాణిక వ్యాసం పరిచయం

9) వాడుకదారుని శాండ్ బాక్స్ లో ప్రయోగాలు చేయడం ద్వారా ఒక వ్యాసం రాయడం

10) ఎడిటింగ్ ప్రాధమిక అంశాలు

శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, ఇటాలిక్, లింక్ లు, రిఫరెన్సింగ్, చర్చించడం (విజువల్ ఎడిటర్)

టేబుల్స్, జాబితా, ఇండెంట్ లు , వచన దస్త్రాలు , ప్రత్యేక క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(విజువల్ ఎడిటర్)

శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, పట్టికలు, జాబితాలు, సూచికలు, రివర్ట్, Referencing, చర్చించడం (క్లాసిక్ ఎడిటర్)

టేబుల్, లిస్ట్ లు, ఇండెంట్ లు, టెక్ట్స్ ఫైళ్లు, స్పెషల్ క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(క్లాసిక్ ఎడిటర్)

మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (విజువల్ ఎడిటర్) సాంకేతిక పరిమితులు

మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (క్లాసిక్ ఎడిటర్) టెక్నికల్ పరిమితులు

11) వ్యాసం పేరు మార్చడం మరియు తొలగించటానికి నివేదించటం

12) వికీ కామన్స్ మరియు ఇతర సోదర ప్రాజెక్టులు

13) గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను మొబైల్ లో ఇన్ స్టాల్ చేయడం మరియు గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను తెలుగులో వ్యాసములు డ్రాఫ్టింగ్ చేయడం కొరకు ఎలా ఉపయోగించాలి.

14)వ్యాస పరిధి ,నాణ్యత మదింపు సరైన మూలలకోసం శోధన

నాణ్యత పరిశోధన - సంబంధిత డాక్యుమెంట్ లు/ఆర్టికల్/పుస్తకాలను కనుగొనడం

వ్యాసమును సుసంపన్నం చేయటం

వ్యాసమును ప్రయోగశాల ( శాండ్ బాక్స్ )నుండి తెవికీ లో ప్రచురించటం

వికీపీడియాలో వ్యాసాల ను సవరించటం/ నవీకరించడం

నా స్వంత వ్యాసాలను అప్ డేట్ చేయడం

ఇతర వ్యాసాలను సంకలనం చేయడం, వ్యాసం చర్చాపేజీ

15)వికీపీడియా లో మంచి వ్యాసం ఎలా ఉండాలి?

16)ఈ ఆన్లైన్ అభ్యాసము యొక్క ఫలితం అంచనా వేయటం

ఈ పాఠ్యాంశాలు తయారు చేయటంలో ఉదాహరణకు : పరిశీలన , నాణ్యత , భాష మీద ఐఐఐటి ఇండిక్ వికీ బృందానికి సహాయపడటానికి ఎవరికైనా ఆసక్తి ఉన్నా కూడా మాకు తెలియచేయగలరు

ఇట్లు

ఇండిక్ వికీ సభ్యులు tewiki @ iiit . ac .in --2020-07-15T11:34:34‎ User:Newwikiwave

విజువల్ ఎడిటర్ వాడుకతో చేరిన నిరర్ధక <nowiki/> తొలగింపుసవరించు

రెండు సంవత్సరాల క్రింద గుర్తించిన <nowiki/> పరిష్కరించాను. దాదాపు నా బాట్ ఖాతాతో 8000పైబడి పేజీలలో మార్పులు జరిగినందున, ఎక్కడైనా సవరణలలో దోషముంటే తెలపండి. దీని గురించి సాంకేతిక వివరాలుచూడండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఫౌండేషన్ సాఫ్ట్వేర్ జట్టు వారి ప్రాధాన్యతలో లేనందున, అప్పుడప్పుడు ఈ పని మరల చేయవలసివస్తుంది. సాధారణ ఎడిటర్ వాడేవారికి ఇప్పుడు పేజీలు సవరించేటప్పుడు సౌకర్యంగా వుంటుంది. మీ అభిప్రాయాలు తెలపండి. --అర్జున (చర్చ) 06:15, 16 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సమిష్టికృషికి {{సహాయం కావాలి}} వాడుక ఎక్కువకావాలిసవరించు

గత ఏడేళ్లుగా {{సహాయం కావాలి}} సంబంధిత మూసల వాడుక విశ్లేషణ పరిశీలిస్తే తెవికీ సమిష్టి కృషి మంచి స్థాయిలో లేదు. ఒక వేళ ఏదైనా వుంటే అది వ్యక్తిగతంగా సభ్యులు కొంత వ్యాసాలు కేటాయించుకొని పనిచేయడం మాత్రమే. అలా కాకుండా, వ్యాసాలనాణ్యత మెరుగవటానికి సమిష్టి కృషి మెరుగవడానికి చర్చలు జరగాలి, ఆ చర్చలు ప్రధానంగా ఆ వ్యాస చర్చాపేజీలో జరగాలి. నేను ఇటీవల గమనించినంతవరకు ఆ వాడుకరి ఒక్కరికే సంబంధించినది కానప్పటికి సభ్యుల వాడుకరి చర్చాపేజీలలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి.. చర్చలకు చర్చ పేజీలు దానితో పాటు {{సహాయం కావాలి}} విరివిగా వాడితే చర్చలలో సామరస్యపూర్వక ధోరణి ఎక్కువై, ఇతర చర్చలుకూడా ఫలప్రదంగా సాగుతాయని నా అభిప్రాయం. మీ స్పందనలు తెలపండి. --అర్జున (చర్చ) 07:43, 16 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సంప్రదింపుల లింకులో మార్పుసవరించు

వికీపీడియా:సంప్రదింపుల కేంద్రం మరింత మెరుగైన పేరుకి వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం ( Reference desk) మార్చబడినిది. సంప్రదింపు పేజీ వికీపీడియా:సంప్రదింపు గా తరలించబడినది. ఇంతకు ముందు ప్రధానపేరుబరిలో వున్న Contact-url తొలగించాను. ఇది నేనే సృష్టించాను కాని అప్పుడు ఎందుకలా చేశానో గుర్తులేదు. వీటి లింకులు ముఖ్యమైన చోట్ల తాజా పరిచాను(గణాంకాలు లాటి వాటిలో తప్పించి). వికీపీడియా:సహాయ కేంద్రం లో మార్పులేదు. చాలాక్రిందట ఈ విషయం గురించి చర్చించినా పెద్ద స్పందనలు లేవు. మరింత మెరుగైన పేరులు ఏవైనా తెలపమని మనవి.-- అర్జున (చర్చ) 06:17, 19 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యక్తుల జనన మరణాల నమోదు ప్రాజెక్టుసవరించు

వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు అనే ఒక కొత్త ప్రాజెక్టును రూపొందించాను. వ్యక్తుల పేజీల్లో ఉండే జనన అరణ తేదీలను బట్టి చెయ్యాల్సిన వివిధ పనులను ఎయ్యడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కొత్తగా సమాచారాన్ని సేకరించేదేమీ ఉండదు. ఉన్న సమాచారాన్నే వర్గాల రూపంలో పెట్టడం, ఇతర పేజీల్లో ఆ సమాచారాన్ని చేర్చడం ఈ ప్రాజెక్టు పని. పరిశీలించండి. ఈ పనిలో పాలు పంచుకోండి. __చదువరి (చర్చరచనలు) 04:27, 21 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి గారు, నా స్పందన చూడండి.--అర్జున (చర్చ) 06:33, 22 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో తెలుగు వెబ్సైట్ మూలాల విశ్లేషణసవరించు

ఇటీవల వికీపీడియాలో మూలాల విశ్లేషణ పరిశోధన నా గమనింపుకి వచ్చింది (.net/f-model/te/ "Best Sources in Telugu Wikipedia". bestref.net. Retrieved 2020-07-20. {{cite web}}: Check |url= value (help)). దాని ప్రకారం మూలం తరచుదనం ప్రకారం అత్యధిక 25 మూలాలలో తెలుగు సైట్లు క్రింద ఇచ్చాను.

# Website Score in June 2020 1m changes వెబ్సైటు భాష
8 ourtelugunadu.com 1,877 -2 తెలుగు
13 sakshi.com 1,295 +31 తెలుగు
14 andhrajyothy.com 1,281 +50 తెలుగు
15 eenadu.net 991 +6 తెలుగు

http://ourtelugunadu.com మూలాలుసవరించు

తెలుగు వెబ్సైట్ల మూలాలు తక్కువగా వున్నాయనిపించింది. తొలిస్థానంలో వున్న http://ourtelugunadu.com చూస్తే User:యర్రా రామారావు గారి పరిచయపత్రంతో కూడిన వెబ్సైట్ కనిపించింది. ఈ మూలాలు కొన్ని యర్రా రామారావు గారే చేర్చినట్లు వికీపీడియా కూర్పులు వెతికితే తెలిసింది. చాలావరకు ప్రభుత్వ రాజపత్ర ఫైళ్లకు స్థావరంగా వాడినట్లున్నది. వికీపీడియా:బయటి_లింకులు#వ్యాపార_ప్రకటనలు,_దృక్పథాల_ఘర్షణ నియమాన్ని ఉల్లఘించిందేమోనన్న అనుమానం వుంది. దీని గురించి స్పష్టత ఇవ్వవలసినదిగా యర్రా రామారావు గారిని కోరుచున్నాను. మరీ ముఖ్యంగా ఈ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.-- అర్జున (చర్చ) 05:11, 21 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.గౌరవిస్తున్నాను.ఇవాలిటి పరిస్థితులలో నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే ఆ వెబ్ సైట్ నేను వికీపీడియాలో వచ్చిన తరువాతనే ఏర్పాటు చేయబడింది.అయితే తెలంగాణలో గ్రామాల ప్రాజెక్టు చెసేటప్పుడు నాకు ఇంత పరిజ్ఞానం లేనిమాట వాస్తవం. అప్పుడు ఆ ఉత్తర్వులు వెబ్ సైట్లో పెట్టి అన్నిటికి కాదుగానీ, కొన్ని వ్యాసాలుకు ఇవ్వబడినవి.ఆ వెబ్ సైట్ తగిన విధంగా చేయటానికి కూడా వికీపీడియాలో చేరిన తరువాత ఇందులోనే పూర్తి సమయం వెచ్చించి, దానిని అభివృద్ది చేయలేకపోతున్నాను.అయితే మీరు అనుకున్నట్లు వ్యాపార ప్రకటనలు కోసం ఏర్పాటు చేయబడిందికాదు.దానిలో ఒక్క వ్యాపార ప్రకటన కూడా లేదు.కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించబడింది.అసలు నేనే దానిని రద్దు పరచుకుందామా అనే అభిప్రాయంలో ఉన్నాను.ఆ మూలాలన్నటిని తొలగించినా నాకు అభ్యంతరంలేదు.వికీ నియమాలు ముఖ్యం.అయితే గ్రామ వ్యాసాలుకు, మండల వ్యాసాలుకు మూలాలు కూర్పు కూడా అలోచించండి.వాటిని మీరు యంత్రం/బాటు ద్వారా తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:22, 21 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు హుందాగా స్పందించారు కాబట్టి అర్జున గారూ, మీరు నిర్ణయించిన చర్యలు తీసుకోవచ్చను. - రవిచంద్ర (చర్చ) 10:54, 21 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రాజపత్రాల ఫైళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియక రామారావు గారు కేవలం వికీపీడియాలో వాటిని కోట్ చేయడానికే ఆ స్వంత వెబ్‌సైట్‌లో వాణిజ్యపరమైన ఉద్దేశాలు లేకుండా హోస్ట్ చేస్తున్నట్టు వారి వివరణ వల్ల తెలుస్తోంది. 1. ఈ రాజపత్రాలను ఆర్కైవ్ వంటి వెబ్‌సైట్‌లోకి దశలవారీగా ఎక్కించి ఈ లింకులను ఆ లింకులతో మార్చవచ్చు. దీనివల్ల శాశ్వతంగా నిలబడే అవకాశం ఉంటుంది. 2. ఆ ఓపిక మనకు లేకుంటే ఇది వ్యాపార ప్రకటన గానో, స్పామ్‌గానో రాదు కనుక భవిష్యత్తులో ఎవరైనా పై మార్పు చేయడానికి వీలుగా నిర్ణయిస్తూ ప్రస్తుతానికి యధాతథ స్థితి కొనసాగించవచ్చు. మొత్తానికి, స్వంత ఆసక్తి తీసుకుని ఇన్ని పత్రాలను తన లాభాపేక్ష రహిత వెబ్‌సైట్‌లో పెట్టి మరీ వికీపీడియాలో మూలాలను, సమాచారాన్ని అభివృద్ధి చేసినందుకు వాడుకరి:యర్రా రామారావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:27, 21 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, పవన్ సంతోష్ గారు స్పందించినందులకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:06, 22 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు స్పష్టత ఇచ్చినందులకు ధన్యవాదాలు.ఈమూలాలు ఏమి చేయాలన్నది, ప్రాజెక్టు చర్చలో చర్చిద్దాము. అయితే ఇలా జరగటం గురించి, ఇకముందు ఇలా జరగకుండా చేయడం గురించి మనం నేర్చుకోవాల్సినది చర్చించాలి. తెవికీ నిర్వహణ సమర్ధవంతంగా చేయలేకపోయామని నాకు అనిపిస్తుంది.-- అర్జున (చర్చ) 05:39, 22 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు వెబ్సైట్ మూలాల స్థితి గురించి అభిప్రాయాలుసవరించు

పైన తెలిపినట్లు, ఈ మూలాల విశ్లేషణ లో ప్రముఖ దినపత్రికల మూలాలు 1000 కి అటుఇటుగా వుండడం చూడవచ్చు. 70000వ్యాసాలు గల తెవికీకి ఇవి నాకు చాలా తక్కువగా అనిపించింది. మన సభ్యులలో , ప్రస్తుత స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగల వారు చాలా తక్కువ. ఇంతకు ముందు కొంత మంది సభ్యులు వార్తల్లో విషయాల గురించి తెవికీలో వ్యాసాలను పెంచడానికి ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు. మీరు మీ అనుభవంలో తెలిసినదాన్ని బట్టి మీ అభిప్రాయాలు పంచుకోండి. --అర్జున (చర్చ) 05:43, 22 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ప్రాజెక్టు చర్చలో తెలిపితే బాగుంటుందని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:08, 23 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, మీ సలహాకు ధన్యవాదాలు. అది ప్రాజెక్టు కాదు, ఒక వ్యాసం, ఇంతకు ముందు మూలాలు చేర్చటం గురించి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ప్రాజెక్టు చేశాం అక్కడ మెరుగు. కావున చర్చ వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో కొనసాగిద్దాం.-- అర్జున (చర్చ) 06:29, 23 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

The Universal Code of Conduct (UCoC): we want to hear from you.సవరించు

కొత్త వాడుకరుల సొంతపేజీల సృష్టికి సహాయంసవరించు

ప్రతి రోజు కొత్త వాడుకరి ఖాతా దారులుగా చేరుతూ ఉంటారు, కాని వారి సొంత పేజీలు సృష్టించుకోవడం చేయరు ఎందుకు కొత్త వారికి వారి పేజీ ని ఎలా సృష్టించాలి అనే విషయం తెలియదు, కావున అందుకు వారిని ప్రోత్సహించడానికి తెలుగు పేరుతో తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు పేరుతో చేరిన వికీపీడియనులు ఎంతో కొంత పరిజ్ఞానం, భాష మీద ప్రేమ ఉన్నవారు, అలాంటి వారిని భాను రేఖ ఇలా వారి పేజీని మనమే సృష్టించి, కొంత ప్రారంభించి ఇవ్వడం, వికీపీడియా నియమాలకు అనుకూలమా, వ్యతిరేకమా, వివరించగలరు. నియమాలు తెలియక అడుగుచున్నాను. అందులో కొందరు వ్యాసాలు రాయగలిగేంత జ్ఞానం ఉండి , ప్రవేశం తెలవక దూరమవుతున్నారని నా అభిప్రాయం. ప్రభాకర్ గౌడ్ నోముల 12:59, 26 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, సాధారణంగా ఎవరి వాడుకరి పేజిలో వాళ్ళే దిద్దుబాట్లు చేసుకుంటారు. వేరేవాళ్ల వాడుకరిపేజీల్లో కెళ్ళి దిద్దుబాటు చెయ్యడం సంప్రదాయం కాదు, అమర్యాద అని కూడా వికీలో భావిస్తారు. అయితే ఆ వాడుకరి అనుమతితో మరొకరు ఆ పని చెయ్యవచ్చు. పేజీ ఎలా తయారుచెయ్యాలో తెలీనివారికి, అది నేర్పే పనిలో భాగంగా ఆ వాడుకరి అనుమతితో చెయ్యవచ్చని నా అభిప్రాయం. (అయితే, పేజీ సృష్టించే పనిని నేర్పడానికి వాడుకరి పేజీయే సృష్టించనక్కర్లేదు, ప్రయోగశాల పేజీని సృష్టించవచ్చు.) __చదువరి (చర్చరచనలు) 13:15, 26 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, కొందరు కొత్త వాడుకరుల వారి పేజీ తయారు చేసుకుందామనే తెవికీలో చేరతారు. కొంత కృషి చేసినతరువాత వారికి స్వంత పేజీ చేసుకోవడంలో సహాయం అభ్యర్ధిస్తే అప్పుడు సహాయం చేయడం మంచిది.--అర్జున (చర్చ) 05:57, 27 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఎవరి వాడుకరుల పేజీలను వారినే తయారుచేసుకోమనడమే సబబనిపిస్తున్నది. కొన్ని విషయాలలో సీనియర్ల సహాయం కోరితే మనం అందించడం బాగుంటుంది. కాని వాడుకర్ల పేజీలను సృష్టించడానికి లేదా వాటిలో సమాచారం చేర్చడానికి ఇతరులకు అనుమతించడం మంచి సంప్రదాయం కాదేమో అని నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 06:40, 27 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి, అర్జున గురువుగారు, చేరే వారి సంఖ్య లక్షల్లో, ఖాతాదారుల సంఖ్య 1000 లలోనూ, మార్పులు, చేర్పులు చేసే వారి సంఖ్య వందలో, వ్యాసాలు రాసే వారి సంఖ్య రెండు, మూడు పదుల్లో ఉన్నారు. మీరన్నట్లు మొదట వారు ప్రారంభించాక వారి పేజీలు మనం అభివృద్ధి చేయవచ్చు, అయితే చేరిన వారు ఈ మధ్య ఎక్కువగా చరవాణి లతో చేరుతున్నారు. వారు చేసే మార్పు ముందు ఖాతా సృష్టించు అని, లేకపోతే మీ పేరుకు బదులు ఇంటర్నెట్ ip సంఖ్య మాత్రమే నమోదు అవుతుంది, లాగిన్ కాలేదు ఇంటర్నెట్ తీసుకోమని ఖాతా హెచ్చరించడం వల్ల కొంతమంది వినియోగదారులు ఖాతా సృష్టించుకొని వికీపీడియాలోకి వస్తున్నారు అనేది వాస్తవం, వారికి వాడుకరి పేజీ, చర్చాపేజీ, ప్రయోగశాల ఉంటాయని మొబైల్ వాడుకదారులకు తెలిసే అవకాశం చాలా తక్కువ, కంప్యూటర్ వాడకం దారులకు తెలిసే అవకాశం మెండుగా ఉన్నాయి, మొబైల్ ద్వారా చేరితే చురుకైన వాడుకరులు ఉంటే వారు ఎక్కడో ఒకచోట కంప్యూటర్ తో వికీపీడియా లో వాడుకరులు కాగలరు, దీనికి ఉదాహరణ ఏం. మహేష్ రాజు ఇతను మొబైల్ ద్వారా వ్యాసాలు రాస్తున్నారు, ఇలాంటి వారు కొంత మందిని వదిలేసుకుంటున్నాము మొబైల్, కంప్యూటర్ 2 ఉండే వాళ్లు కూడా ఉంటారు కదా వాడుకరులు దీనికి ఏదైనా తప్పకుండా తరుణోపాయం ఆలోచించాలి నే కోరుతున్నా... ప్రభాకర్ గౌడ్ నోముల 06:59, 27 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, మీ ఆలోచన చర్చించదగ్గదే. గత పదేళ్లు పైగా నేరుగా వికీపీడియా శిక్షణ శిబిరాలు నడిపితేనే ఎక్కువ మంది చేరినా కొనసాగని సభ్యుల అనుభవంతో కేవలం పేజీ వీక్షణల అనుభవంతో వాడుకరులను పెంచడం దానికన్నా సులభమని నేను అనుకోను. ప్రవేశించిన సభ్యులకు స్వాగత సందేశం ద్వారా వికీపీడియా గురించి తెలియచేస్తున్నాము. మొబైల్ మెనూలో వికీపీడియా:సముదాయ పందిరి కనబడుతుంది కాబట్టి, దానిలో కూడా స్వాగతం లింకు చేర్చాను. వారి చర్చాపేజీలో స్వాగతం సందేశం చేర్చనంతవరకు, దీని ద్వారా వికీపీడియా గురించి వారి తెలుసుకొనే అవకాశముంది. ప్రవేశించని వారికి స్వాగతం సందేశం మొబైల్ లో చేర్చాను. దీనివలన ప్రవేశించిన వాడుకరులు మొదటిపేజీ చూసినపుడు స్వాగతం, వాడుకరి పేరు, తరువాత వికిపీడియాకు స్వాగతం అని రెండు సార్లు స్వాగతం కనబడుతుంది. ప్రవేశించిన వాడుకరులకు రెండో స్వాగతం వరుస కనబడకుండా చేయటానికి ఇతర సాంకేతిక సభ్యులు ఆలోచించవలసినది. --అర్జున (చర్చ) 04:39, 28 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, వికీపీడియాలో ఖాతా తీసుకున్న ప్రతి వారికి వారి ఖాతాపేజీ తయారు చేయాలి అని అనడం కాదండి, తెలుగు పేరుతో ఖాతా తీసుకున్న వారికి మాత్రమే వారిని ఎలాగైనా చురుకైన వాడుకరి, క్రియాశీలక వాడుకరి గా మార్చాలని నా ప్రధాన ఉద్దేశం, ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారం ముఖ్యంగా ఆంగ్ల వికీపీడియన్లు ఖాతా తీసుకొని వాడుకరి పేజీలో వారు ఏదైనా మార్పులు చేర్పులు చేసినప్పుడు మాత్రమే వారికి స్వాగతం పలుకుతారు. మన వారిలాగా ఇతర దేశాల భాష వారికి కూడా స్వాగతం పలికే ఉద్దేశం, మార్పుల, చేర్పుల సంఖ్య పెంచుకునే ఉద్దేశం అది కాదండీ, తెలుగు పేరుతో వికీపీడియాలో ప్రవేశించే వారి కోసమే నేను మాట్లాడుతున్నాను, మీరు గమనించగలరు వారికి ఏం చేయాలి క్రియాశీలక చేయాలి రోజుకు ఒకరు వారానికి ఐదుగురు కూడా తెలుగు పేరుతో ఖాతా చేరడం లేదు, 100 మంది చేరికలో ఒక వాడుకరి వికీపీడియాకు, మనకు ఉపయోగకారిగా మారిన చాలు కదండి...
అర్జున తొలిగురువు గారు, రానున్నది మొత్తం మొబైల్ వాడకాలు ఏ సాఫ్ట్వేర్ చేసినా అది దృష్టిలో పెట్టుకోవాలి, మరో ముఖ్య విషయం ఏమిటంటే తెలుగు వికీపీడియన్లు కొత్తగా చేరే వారు ఈ తరం వారు మాత్రమే, వచ్చే తరానికి ఇంగ్లీష్ మీడియం ప్రభావం కాబట్టి ఇంగ్లీష్ ప్రాధాన్యత ముందు తెలుగు, ప్రాంతీయ భాషలు నిలబడడం కష్టం, రాసే వ్యాసాలు కూడా మరి కొద్ది రోజుల తరువాత..., చదివేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తెలుగు పేరుతో ఖాతా తీసుకున్న వారికి వారి మొబైల్ కు సూచనలు, హెచ్చరికలు పోయేలాగా పదేపదే, మళ్లీమళ్లీ వెళ్లేలా ఖాతా వచ్చినట్టుగా వారి పేరు మీద వారికి తెలియాలి, సాంకేతిక సభ్యులు ఆలోచించవలసినది. ప్రభాకర్ గౌడ్ నోముల 06:49, 28 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారు, ఖాతా పేరుభాష తప్పించి మీ సూచనలు బాగున్నాయి. ఖాతాపేరు ఆంగ్లంలో వున్నా వాడేటప్పుడు తెలుగులో కనబడే సౌకర్యమున్నప్పుడు,సాధారణంగా వాడని కంప్యూటర్ వ్యవస్థలలో తెలుగులో టైపు చేయటానికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశమున్నందున ఖాతాపేరుగల భాషకి అంత ప్రాముఖ్యమివ్వనవసరంలేదని నా అభిప్రాయం.-- అర్జున (చర్చ) 10:19, 29 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చంద్ర కాంత రావు నిర్వాహక హోదా విరమణసవరించు

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించారు (చూడండి వికీపీడియా:నిర్వాహకుల_జాబితా). 12 ఏళ్లకు పైగా నిర్వాహకహోదాలో తెవికీ కి సేవచేశారు. వారి సేవలకు నా ధన్యవాదాలు. నా వికీ ప్రయాణంలో ఇప్పటివరకు నా పనిపై ప్రముఖంగా ముద్ర వేసిన బహు కొద్ది మందిలో చంద్రకాంత రావు గారు ఒకరు. తెవికీ లో చర్చలలో చురుకుగా పాల్గొని నిర్మొహమాటంగా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. నేను తలపెట్టే పనులకు అవి కొంత అడ్డంకిగా మారి లక్ష్యం చేరటానికి కొంత ఎక్కువకాలంతీసుకున్నా, చేపట్టిన పనులు నాణ్యతగా చేయటానికి అవి సహకరించాయి. వికీ నియమాల గురించి తెలుసుకోవటంలో ఆయన చర్యలు సహాయపడేవి. చాలా కొద్దిమంది చురుకైన వికీపీడియన్లు గల తెవికీలో ఏకరూప సమూహఆలోచన (Groupthink) గా మారకుండా వుండటంలో వారి పాత్ర ప్రముఖమైనది. ఇకముందుకూడా నిర్వాహకహోదానుండి తప్పుకున్నా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 10:12, 29 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించడం నాకు చాలా బాధనిపించింది. అతను తెవికీలో విశేష సేవలందించారు. నేను తెవికీలో చేరినపుడు తెలియని విషయాలలో, విధానాలలో అవగాహన కల్పించారు. ఒక విధంగా వికీ గురువు లాంటి వారు. ఈ రోజు చురుకుగా పనిచేస్తున్నానంటే అతని ప్రేరణ ఎంతో ఉందని చెప్పవచ్చు. మొదటి పేజీలో శీర్షికల నిర్వహణ నుండి, మూలాలు, లింకులు, కాపీహక్కుల వంటి విషయాలలో నాకు చాలా సందర్భాలలో మార్గనిర్దేశం చేసారు. ఏదో ఒక రోజు వికీలో క్రియాశీలక నిర్వాహకులుగా వస్తారని, వికీని సుసంపన్నం చేస్తారని అనుకున్నాను. స్వచ్ఛందంగా విరమించుకోవడం బాధ కలిగించింది. నిర్వాహకహోదానుండి తప్పుకున్నా సభ్యునిగా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. K.Venkataramana(talk) 15:56, 29 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో చంద్రకాంతరావు గారికి ప్రత్యేక శైలి, నాది వెంకటరమణ గారి అభిప్రాయంతో సరిపోతుంది, వికీపీడియాలో నియమాలు అసలుకే తెలియక నిర్వాహకులను చాలా ఇబ్బందులకు గురి చేసే వాడిని అలాంటి సమయంలో నియమాలు ఇలా ఉంటాయని నన్ను ప్రోత్సహించిన పవన సంతోష్, అర్జున, వైజాసత్య,పాలగిరి, చంద్ర కాంత రావు గారు, వెంకటరమణ గార్లు మార్గనిర్దేశం చేశారు, అందులో చంద్ర కాంత రావు గారు నా గాడ్ ఫాదర్ వికీపీడియాలో తప్పు చేయని వాడుకరి ఎవరూ లేరు ప్రారంభంలో అందరూ చేసేదే అని నా చర్చా పేజీలో ప్రోత్సహించి ఒక్క వాడుకరిల చేసింది, ఆ నాలుగు పదాలు నన్ను ముందుకు నడిపించాయి, వారి మంచి మనసు చంద్ర కాంత రావు గారి బ్లాగులో నా గురించి ఒక వ్యాసం కూడా రాశారు, వికీపీడియాలో నిర్వాహకులుగా 100% న్యాయం చేశారు, వాడుకరిగా మీ నుండి ఇంకా... చాలా వ్యాసాలు నేను ఆశిస్తున్నాను... మంచి వ్యాసాలు రాయగలరు, నేను మీ అభిమాని... నమస్తే... ప్రభాకర్ గౌడ్ నోముల 17:12, 29 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
నాపై చూపిన అభిమానానికి అర్జున, వెంకటరమణ, ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు కృతజ్ఞతలు. అలాగే ప్రారంభంలో నా నిర్వాహక హోదాను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకు కూడా వందనాలు. గత ఏడాది చేసిన ఒక పాలసీకి నిరసనగా అప్పుడే నేను నిర్వాహకుల నోటీసు బోర్డులో రాజీనామా సమర్పించాను. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ అధికారం అధికారులకు లేదని మెటాలో అభ్యర్థన చేయమని ఒక సభ్యుడు సెలవియ్యగా, ఎలాగూ ఆ పాలసీకి అనుగుణంగా దిద్దుబాట్లు చేయననీ, తొలగింపు తప్పనిసరి అని వేచిచూశాను. కాని నెలలు గడిచినా, సంవత్సరం పైగా గడిచినా ఆ పాలసీ అటకెక్కింది కాని పట్టించుకొనే వారే లేరు. అమలు చేయనప్పుడు సభ్యుల సమయం వెచ్చించి పాలసీలెందుకు చేస్తున్నారో అర్థం కాదు కాని చివరికి విసిగిపోయి మాట ప్రకారం నేనే మెటాలో అభ్యర్థన చేసి నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నాను. నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నా నేను తెవికీ నుంచి వెళ్ళిపోయే ప్రశక్తి ఏ మాత్రం లేదు కాబట్టి సభ్యులు బాధపడే/సంతోషపడే అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఇదివరకటి కంటే మరింత చురుకుగా తెవికీలో సమీక్ష పనులు నిర్వహించి లోటుపాట్లను, నిర్వాహక తప్పిదాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ప్రస్తుత తెవికీ ఘోరదశలో ఉంది. ఊబిలో దిగజారిన తెవికీని పట్టాలపైకెక్కించడానికి తెవికీ ప్రక్షాళన జరగడం కూడా తప్పనిసరి. తెవికీని చక్కదిద్దడానికి అర్జునరావు మరియు వెంకటరమణ గార్లు ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:25, 29 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారు తెవికీకి చేసిన సేవలు నిస్సందేహంగా ప్రశంసనీయమైనవే. కానీ తెవికీ ఘోరదశలో ఉందనడం నేను అంగీకరించను. ఇది కేవలం ఆయన పేర్కొన్న సభ్యులు తప్ప మిగతా వారిని అవమానించడమే. ఆయనకు ఇది కొత్తకాదు. మొదటి నుంచి సూటిగా మాట్లాడటమనే పేరుతో సభ్యులను నొప్పించడమే అలవాటు. చర్చలు సామరస్య పూర్వక ధోరణిలో జరగడం లేదు. అదీ కాక ఆయన ఎప్పుడూ తప్పులు వేలెత్తి చూపడమే తప్ప జరిగిన మంచిపనులు గురించి ఏదీ ప్రస్తావించింది లేదు. దీని వల్ల తెవికీకి మేలు జరగక పోగా కీడు జరుగుతుంది. - రవిచంద్ర (చర్చ) 05:57, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రవిచంద్రగారూ, నా సేవలు గుర్తించినందుకు మీకూ నా కృతజ్ఞతలు. తెవికీ ఘోరదశలో ఉందని అన్నందుకు మీరు బాధపడే అవసరం లేదు. అది మీకుగాని మరికొందరు నిర్వాహకులకు గాని ఈ ఘోరదశకు సంబంధం లేదు. నాకు సందేశమిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి తప్ప పైన నేనెవరి పేర్లు పేర్కోలేదనే విషయం గ్రహించండి. ఘోరదశ ఎందుకనేది దానికి కారకులెవరన్నదీ నా తదుపరి చర్చలే చెబుతాయి. వ్యక్తులను కాకుండా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని బాగా ఆలోచించి తెవికీ అభివృద్ధి దృష్ట్యా మీ అభిప్రాయాలు ప్రకటించండి. మీకు మంచి తెవికీ భవిష్యత్తు ఉంటుంది. మిమ్ముల్ని ప్రశంసించే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు భాషాశాస్త్రవేత్తల వేదిక వారి అంతర్జాల శిక్షణా శిబిర ప్రతిపాదనసవరించు

నమస్కారం,

తెలుగు భాషాశాస్త్రజ్ఞుల వేదిక వారు కొరోనా లాక్‌డౌన్ సమయంలో అంతర్జాలం-జూమ్ వేదికగా పలు శిక్షణా శిబిరాలు, చర్చా కార్యక్రమాలు చేపట్టారు, అందులో భాగంగా వికీ శిక్షణా శిబిరం నిర్వహించమని నన్ను సంప్రదించారు. నేను వారికి ప్రతిపాదించాలనుకుంటున్న ప్రణాళిక :

  1. మొదటి మూడు రోజులు తెలుగు వికీపీడియా ప్రవేశ స్థాయి శిక్షణ
  2. తరువాతి రెండు రోజులూ వికీసోర్స్ పై అవగాహన
  3. ఆరవ రోజు నకలు హక్కులపై, క్రియేటివ్ కామన్స్, మొదలగు లైసెన్సులపై అవగాహన
  4. ఏడవ రోజు వికీకామన్స్ పై శిక్షణ, ఇప్పటికే చేరిన వివిధ ఫోటోలు, వీడియోల పేర్లు, వివరణలు తెలుగులో చేర్చే విషయమై చర్చ.
  5. ఎనిమిది-తొమ్మిది-పదవ రోజుల్లో వికీడేటా, లెగ్జీంలకు సంబంధించిన అవగాహన, కార్యశాల.

ఇంకా తేదీలు ఖరారు కాలేదు కానీ, ఆగస్టు-సెప్టెంబర్ నెలలలో ఈ శిక్షణ జరగవచ్చు. సభ్యులు సూచనలు అందించి, కుదిరితే శిక్షణా శిబిరంలో శిక్షకులుగా పాల్గొనవలసినదిగా మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:07, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మంచి పని రహ్మానుద్దీన్ గారు. చాలా పెద్ద కార్యక్రమం ఇది. తక్కువ సమయంలో చాలా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:18, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం రహ్మానుద్దీన్ గారు. నేను కూడా సహకారం అందిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 09:37, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్గారు ఈరోజు మంచి శుభవార్త గత ఐదు సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నా ఇలాంటి శిక్షణ శిబిరం కోసం నేను ఒక్కటి కూడా పాల్గొన లేదు, అందుకే నాకు మూలాలు ఇవ్వడం రాదు, అందుకే నా వ్యాసాలు అంతగా బాగుండవు. నాకే అంతగా నచ్చవు అందుకే వ్యాసాలు సరిగా రాయడం, చేయడం లేదు, శిక్షణా శిబిరాలు అనంతరం వ్యాసాలు రాయడం ప్రారంభిస్తా, నాకు అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభాకర్ గౌడ్ నోముల 09:54, 30 జూలై 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్,చదువరి,ప్రణయ్‌రాజ్ వంగరి గారితో మొదటి మూడు రోజులు తెలుగు వికీపీడియా ప్రవేశ స్థాయి శిక్షణ మీద మాట్లాడాను నేను కూడా ఈ శిక్షణా శిబిరంలో శిక్షకునిగా సహకారం అందిస్తాను, తెలుగు భాషాశాస్త్రజ్ఞుల వేదిక వారికి ధన్యవాదములు Kasyap (చర్చ) 10:49, 6 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

లింకులు లభించడం లేదుసవరించు

వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మరో మూడు మిగిలి ఉన్నాయి వాటికి లింకులు లభించడంలేదు, వాటికి లింకులు ఇతర భాషల్లో లభించడంలేదు. కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృతం అన్ని భాషల్లోనూ వెతికిన తెలుగు చాలా నయం అన్ని భాషల్లోనూ, చాలా వ్యాసాలు మొలకలు గానే ఉన్నాయి. ఈ వ్యాసం గురించి కాదు, చాలా వ్యాసాలు వెతికాను తెలుగులో ఉన్నంత సమాచారం, ఇతర భాషల్లో ఉండదు, తెలుగులో చాలా సమాచారం ఉంటుంది. వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మూడు వ్యాసాలు మిగిలి ఉండగా మరెవరైనా వాటిని విస్తరించాలని మనవి. ఇందులో కాలములు వ్యాసమును విస్తరించగా ఋతువులు దారిలో చర్చ:కాలములు వెళ్ళింది... దాన్ని సరి చేయగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 16:13, 4 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ విభాగం వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 చర్చా పేజీలో విభాగంగా చేర్చాను.--యర్రా రామారావు (చర్చ) 17:30, 4 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Technical Wishes: FileExporter and FileImporter become default features on all Wikisసవరించు

Max Klemm (WMDE) 09:14, 6 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Content translation tool వాడటంలో సమస్యసవరించు

తెవికీలో Content translation tool లో యాంత్రిక అనువాదం శాతం 70 శాతం కన్నా తక్కువ వుండాలన్న పరిమితి ( పాత చర్చ)ఈ ఉపకరణాన్ని నిరుపయోగంగా మార్చింది. నేనొక వ్యాసంలో కొన్ని భాగాలు ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు వ్యాసంలో చేర్చాలనుకున్నాను. ఈ పరిమితి లేకపోతే నా అనువాదాన్ని వాడుకరి పేజీలో ముద్రించుకొని అవసరమైన భాగాలను అసలు వ్యాసంలో చేర్చే వీలుండేది. ఇప్పడు మొత్త వ్యాసం అనువాదం చేసి యాంత్రిక అనువాదం 70 కన్నా తగ్గితే కాని వీలవుటలేదు. Translation debugger ఉపకరణం అనువాదం చిత్తుస్థితి వుంటే వికీటెక్స్ట్ రూపం చూపించడంలేదు. కావున సముదాయం ఈ పరిమితి ని సమీక్షించాలి. నా దృష్టిలో వాడుకరి పేరుబరి ముద్రణకు పరిమితి ఎక్కువగా వుండవచ్చు (90%) లేక వాడుకరి హక్కులను బట్టి అనుమతి వుంటే బాగుంటుంది. దీనిగురించి కృషి చేసిన User:Chaduvari గారు, ఇతర సభ్యులు అనుభవాలు, స్పందనలు తెలపండి. --అర్జున (చర్చ) 12:35, 8 ఆగస్టు 2020 (UTC) Reply[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, అనువాద పరికరాన్ని మెరుగుపరచే ఏ చర్యకైనా నేను సై యే. నావి కొన్ని సందేహాలు/ప్రశ్నలు/పరిశీలనలు.. మీరు ఏ పేరుబరిలోకి ప్రచురించదలచుకున్నా అవసరమైన మార్పు చేర్పులు అనువాద పరికరంలోనే చెయ్యాలనేది అభిలషణీయమనే సంగతి ఒక సాఫ్టువేరు నిపుణుడైన మీకు, సాఫ్టువేరు నిరక్షరాస్యుణ్ణైన నేను చెప్పాల్సిన పనిలేదు. అనువాద పరికరం గురించి గతంలో రచ్చబండలో జరిగిన చర్చను చూసే ఉంటారు. ప్రస్తుతమున్న నిబంధనలూ పరిమితులూ ఎందుకు విధించారో మీరు గ్రహించే ఉంటారు. ఇప్పుడు మీరు ఆ నిబంధనలను ఎందుకు సడలించదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. వివరంగా, వీలైతే ఒక్కొక్కటే బులెట్ పాయింట్లతో రాయగలరు. ఒకవేళ సడలిస్తే ఆ నిబంధనలను విధించడానికి దారితీసిన పరిస్థితులు తిరిగి తెలెత్తకుండా ఎలా నివారిస్తారో, తలెత్తితే ఎల ఎదుర్కొంటారో కూడా రాయండి. __చదువరి (చర్చరచనలు) 06:27, 10 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ ఉపకరణం గురించి మరింతగా తెలుసుకొని, గణాంకాలు విశ్లేషించి, ఈ ఉపకరణం వాడిన వారిలో కొంత మంది మాట్లాడి, ప్రస్తుత విధానం సమీక్షకు, కొత్త విధానానికి ప్రతిపాదనలుకు చర్చలు ప్రారంభించాను. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు పేజీకూడా కొంతవరకు తయారు చేశాను. మీరు, ఇతర సహ సభ్యులు ఆ చర్చలో పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. --అర్జున (చర్చ) 14:31, 14 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వేమూరి నిఘంటు పేజీలు తరలించి, తొలగించటం పూర్తిసవరించు

వేమూరి నిఘంటు పేజీలు వికీపీడియాలో వుండదగినవి కావున, చర్చ ప్రకారం వికీబుక్స్ కు తరలించి, వికీపీడియా లో తొలగించాను. ఇప్పటినుండి వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలలో పేజీ ర్యాంకులు (ఉదాహరణకు క్రిందటి రోజు వీక్షణలు) సరిగా కనబడతాయి.. --అర్జున (చర్చ) 09:51, 13 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడిన అనువాదాల కృషికి గుర్తింపుసవరించు

జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 21 వికీపీడియా సభ్యులు Meena gayathri.s, Chaduvari, Pavan santhosh.s, K.Venkataramana, Subramanyam parinam, IM3847, Viggu, Apbook, యర్రా రామారావు, రహ్మానుద్దీన్, Ajaybanbi, దేవుడు, PhaniYesh99, Arjunaraoc, Rajani Gummalla Translation, Ballankipavan, Bhashyam Tharun Kumar, Ch Maheswara Raju, Krupa Vara Prasad, Somepalli Manikumar, Sumanth699 గార్లకు అభివందనాలు. వారి కృషికి వికీ గుర్తింపు పతకం వారి చర్చాపేజీలద్వారా అందచేశాను. --అర్జున (చర్చ) 10:34, 13 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఉపకరణం వాడి అనువాదాల కృషికి గుర్తింపు పతకం పొందిన అందరికీ అభివందనాలు, ఇందులో మరో ముగ్గురికి ఈ నెల చివరన మరో పతకం రానుంది, వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 పతకం. ప్రభాకర్ గౌడ్ నోముల 14:08, 13 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అర్జున గారు చెప్పిన ఐదేళ్ళ కాలంలో పై 80% అనువాదాలు చేసిన వాడుకరుల అనువాద గణాంకాలు కింది పట్టికలో ఉన్నాయి. ఈ ఐదేళ్ళ కాలంలో అనువాద పరికరాన్ని ఎలా వాడామో ఈ గణాంకాలు చూడకపోతే తెలియదు. అయితే ఈ గణాంకాలు పరికరం నుండి నేరుగా "ప్రచురించిన" వాటిని మాత్రమే చూపిస్తాయి. అక్కడ కాపీ చేసి వికీ పేజీలో పేస్టు చేసిన వాటిని చూపించవు (ఈ సరికే వికీలో ఉన్న పేజీలను విస్తరించాలంటే, నేరుగా ప్రచురించ కూడదు.). అందుచేత ఆ సంఖ్యలు కింది పట్టికలో చూపిన సంఖ్యలకు కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందని నా అనుకోలు. __చదువరి (చర్చరచనలు) 16:15, 13 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాడుకరిపేరు వాడుకరి చేసిన

అనువాదాల సంఖ్య

మొత్తం అనువాదాల్లో ఈ

వాడుకరి అనువాదాల శాతం

Meena gayathri.s 273 22.05%
Chaduvari 208 16.80%
Pavan santhosh.s 103 8.32%
K.Venkataramana 71 5.74%
Subramanyam parinam 59 4.77%
IM3847 51 4.12%
Viggu 47 3.80%
Apbook 22 1.78%
యర్రా రామారావు 22 1.78%
రహ్మానుద్దీన్ 17 1.37%
Ajaybanbi 15 1.21%
దేవుడు 15 1.21%
PhaniYesh99 12 0.97%
Arjunaraoc 11 0.89%
Rajani Gummalla Translation 11 0.89%
Ballankipavan 10 0.81%
Bhashyam Tharun Kumar 10 0.81%
Ch Maheswara Raju 8 0.65%
Krupa Vara Prasad 8 0.65%
Somepalli Manikumar 8 0.65%
Sumanth699 8 0.65%
Praveen Illa 7 0.57%
అనువాద పరికరం వాడి వికీ నాణ్యతను పెంచిన సభ్యులందరికీ అభినందనలు. చదువరి గారు చెప్పినట్లు ఇంకా చాలామంది వ్యాసం ప్రచురించకపోయినా ఉపకరణాన్ని వాడి ఉండవచ్చు. ఉదాహరణకు నేనే :-) నేను ఎప్పుడూ తెలుగు వికీలో లేని కొత్త వ్యాసాన్ని పూర్తిగా ఈ ఉపకరణం వాడి అనువాదం చేసి పూర్తి వ్యాసాన్ని ప్రచురించలేదు. ఇది వరకే ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించడానికి ఉపకరణాన్ని వాడి కొన్ని విభాగాలు అనువదించి కాపీ పేస్టు చేశాను. అందుకనే నాకు పతకం రాలేదు. :-) - రవిచంద్ర (చర్చ) 17:09, 13 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
స్పందించిన వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల,చదువరి,రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. మొదటిగా ఒక సవరణ. 80 శాతం అనువాదాలకు కృషి చేసినవారు 23 మంది. వారిలో ఇంతకముందు తెలిపిన వారే కాక, Praveen Illa, Vin09 చేరుతారు. వారికి కూడా అభివందనలు. వారికి కూడా పతకం అందజేయడం జరిగింది. మొదటి జాబితాలో వారి పేర్లు చేర్చనందుకు క్షమాపణలు. మామూలుగా అత్యధిక 20 లేక 100 లాగా గణాంకాలు విశ్లేషించడానికి బదులు ఈసారి పర్సైంటైల్ ఆధారంగా గణాంకాలు విశ్లేషించడం అప్పుడు చివరి వారిలోసాంకేతికంగా ఇద్దరు ఒకే సంఖ్య అనువాద వ్యాసాలు చేయటంతో సందేహం వలన జరిగిన పొరపాటు.
ఇక గణాంకాల గురించి కొంత స్పష్టత. ప్రధాన పేరుబరిలో కొత్తగా సృష్టించి, తొలగింపుకు గురికాని వ్యాసాలు మాత్రమే పరిగణించడం జరిగింది. వాడుకరిపేజీలలో ముద్రితమైనా, వాడుకరిపేజీలకు తరలించిన వ్యాసాలు పరిగణించలేదు. కొద్దిగా కొద్దిగా అనువదించి అనువదించిన ప్రతిసారి ముద్రణ చేసినా కూడా ఒకే వ్యాసంగా పరిగణించడం జరిగింది. నాకు తెలిసిన ప్రకారం వికీటెక్స్ట్ రూపం కావాలంటే ఒకసారైన ముద్రితమవ్వాలి. చిత్తుప్రతిగానే వుంచి అనువాద పాఠాన్ని (మూలాలు రావు) మానవీయంగా చేర్చిన వారిని పరిగణించలేదు. ఇక Special:ContentTranslationStats ప్రకారం 2020 అగష్టు 02 వరకు చిత్తుస్థితిలోనున్న అనువాదాలు 281, తొలగించిన అనువాదాలు 382. ముద్రించిన అనువాదాలు 1570. అంటే తొలగించిన వాటితో కలుపుకొని ముద్రితమైన అనువాదాలు 1952. ఇక API వాడి లెక్కించినా 2020 జులై అంతానికి ముద్రితమైనవి తొలగించినవాటితో కలుపుకొని 1563 గా వున్నాయి. అంటే ఉపకరణం వాడినవి చిత్తు స్థితిలోవున్నవాటిని కలుపుకొని ఇప్పటికి 2203 దాటవు. పై లెక్కలో దోషాలు వుంటే తెలపండి. మరికొంత విశ్లేషణ త్వరలో కొత్త ప్రాజెక్టు చర్చాపేజీలో చేరుస్తాను.--అర్జున (చర్చ) 05:57, 14 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
పై గణాంకాలలో కొత్తగా సృష్టించిన వ్యాసాలను మాత్రమే పరిగణించడం జరిగింది. ఇప్పటికే వున్న వ్యాసంపై తిరగరాస్తే పరిగణించ లేదు. నేను 13 వ్యాసాలు ముద్రించగా, 11 కొత్తవి, రెండు తిరగ రాసినవి. ఆసక్తిగల సభ్యులు వారి గణాంకాలను contenttranslation ట్యాగ్ తో పరిశీలించి (ఉదా:అర్జున అనువాదాలు) ప్రధానపేరుబరిలో ఏడు కంటే వ్యాసాలు 2020 జులై లోపు ప్రచురించి వుంటే తెలియచేయండి. వారికి పతకం అందజేస్తాను. ఇప్పటికే వున్న నా క్వెరీని మార్పులు చేయటానికి కొంత సమయం పట్టవచ్చు.--అర్జున (చర్చ) 10:42, 14 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
తరువాతి రెండు స్థాయిలు 6, 5 కొత్త వ్యాసాలు చేర్చిన వారివి పరిశీలించగా, వారు కొత్తవి కానితోటి కూడా 7 కు చేరలేదు. కావున పతకాలకు అర్హులలో మార్పులు లేవు. --అర్జున (చర్చ) 12:49, 14 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
User:K.Venkataramana గారు చర్చలో తన వ్యక్తిగత అనుభవం తెలిపిన తర్వాత, విజువల్ ఎడిటర్ లో అనువాదం చిత్తు ప్రతిలో నున్నా వికీటెక్స్ట్ రూపం నకలు చేసి అతికించవీలవుతుందని తెలిసింది. అనువాద ఉపకరణం రెండవ విడుదల విజువల్ ఎడిటర్ కు తగినట్లుగా రూపొందించారు కావున అలా జరుగుతున్నట్లున్నది. పై సమాచారం పరిగణించినను, అనువాద వ్యాసాల గణాంకాలలో తేడా వుండదు. --అర్జున (చర్చ) 10:50, 17 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఐఐఐటి, హైదరాబాదు ప్రాజెక్టు సభ్యుల వ్యాసాల నాణ్యతసవరించు

వాడుకరి:Kasyap గారు, ఇటీవల ప్రాజెక్టు సభ్యులు వ్యాసాలు చేర్చటం లేక ఉన్న వ్యాసాలు సవరించటం గమనించాను.(ఉదా:క్వాల్కమ్, వై ఫై వ్యాసంలో సభ్యుని ప్రారంభపు మార్పు) వాటి నాణ్యత గురించి సహ సభ్యులు తగు మూసలు చేర్చటం, చర్చించటం మొదలు పెట్టారు. అనువాదాల నాణ్యత నియంత్రణ గురించి ప్రస్తుతం తెలుగు వికీలో పెద్ద చర్చ జరుగుతున్నది. IITH ప్రాజెక్టు వ్యాసాల నాణ్యతను ఏ విధంగా నియంత్రిస్తున్నారో సముదాయానికి తెలియచేయండి. ఇప్పటికి ఒక్క ప్రతిపాదన పేజీయే వుంది. వేరేగా ప్రాజెక్టు పేజీ సృష్టించి వివరాలు తెలియచేస్తే, సముదాయం మీ ప్రాజెక్టుకు తగిన స్పందనలు, సహకారం ఇవ్వటానికి అవకాశం వుంది.--అర్జున (చర్చ) 00:15, 22 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు సభ్యులను గుర్తించటానికి వర్గం:IIITH Indic Wiki Project సభ్యులు చూడండి.--అర్జున (చర్చ) 06:00, 23 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు వర్గం చేర్చినందులు ధన్యవాదములు అర్జున గారు, అయితే ఇందులో ఐఐఐటీ హైదరాబాదు కు చెందిన అందరూ వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన సభ్యులు కారు. కొంత మంది విద్యార్థులు కొన్ని వారాల పాటు ఈ ప్రాజెక్టులో పనిచేశారు. అలాంటివారిని మీరు తెలిపిన వర్గంలో చేరుస్తాము. ఈ ప్రాజెక్టులో పనిచేసే యంత్ర అనువాదాలు ఎక్కువగా వేరొక సాండ్ బాక్స్ (https://tewiki.iiit.ac.in) లో ప్రస్తుతానికి ప్రముఖ బాట్ లను తెలుగు భాషమీద అభివృద్ధి కోసం తెలుగు వికీపీడియాలో కాకుండా లోకల్ గా టెస్ట్ వికీమీడియా సర్వర్ మీద పరీక్ష చేస్తున్నాము. ఇందువలన తెలుగు వికీపీడియాలో ఎలాంటి కృతమైన వ్యాసాలు, నాణ్యతకు చేటు తెచ్చే వ్యాసాలూ చేరవు. ఈ ఏర్పాటు వలన నాణ్యత కోసం స్వచ్ఛందముగా పాటుపడుతున్న నిర్వాహకుల శ్రమ తగ్గుతుంది, అనేక పద్దతుల ద్వారా (https://tewiki.iiit.ac.in) లో చేర్చిన వ్యాసాలు ఒక సంతృప్త స్థాయికి చేరుకొన్న తరువాత ఆ వ్యాసాలను తెవికీ సముదాయంతో చర్చించి వాటికి తెలుగు వికీపీడియాలో చేర్చే సాద్యాసాధ్యాలు నిర్వాహకుల , వాడుకరులు సూచనలు పరిగణలోకి తీసికొని, వికీపీడియా పాలసీలు అనుగుణంగా తెలుగు వికీపీడియాలో చేర్చాలని మా ఆలోచన. అయితే తెలుగు వికీపీడియా సముదాయం తో కలసి పనిచేసేందుకు ,ఇప్పటికే యంత్రిక అనువాదం అర్ధం చేసుకునేందుకు , యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ మీద ఒక నిర్ణయానికి రావటానికి కొన్ని అనువాదాలు , అల్గారిధం లు పరీక్ష చేస్తున్నాం. అందులో భాగంగా కొంత మంది విద్యార్థులను తెవికీ లో రాయవలసినదిగా సూచించాము. వారిలో కొంతమంది కొత్తగా తెలుగులో రాస్తున్నవారు కాబట్టి నాణ్యంగా రాయలేక పోయారు. అందులో కొన్ని తొలగింపునకు గురయినాయి కూడా. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలా రాసిన వ్యాసాల నాణ్యత, అభివృద్ధి ఈ ప్రాజెక్టు లో భాగంగా ఉన్న నావంటి కొంతమంది 'సభ్యులం' భాద్యత తీసుకొంటున్నాము. అలా చేసున్న వారిని ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తాము.
ఇక యాంత్రికానువాదాల నాణ్యతా విషయానికి వస్తే మన తెలుగులో కూడా 42% వరకు బాట్ ల ద్వారా సృష్టించినవే. గత కొన్ని సంవత్సరాలనుండి ఉపకరణాల ద్వారా అనువాదం మెరుగు పడుతోంది. గత రెండు సంవత్సరాలుగా వికీపీడియాలో బాట్ లు ఎక్కువ సంఖ్యలో పేజీలు, కంటెంటు సృష్టిస్తున్నాయి. అయితే వీటి నాణ్యత , భాష మెరుగు పరచవలసిన అవసరం ఆయా సమూహం మీద కూడా ఉన్నది. అలా చేయటాన్ని ఎక్కువ మంది సహకారం అవసరం! మీకు తెలుసు ప్రపంచంలో రెండవ అతిపెద్ద వికీపీడియా దాదాపు పూర్తిగా ఒక బాట్ ద్వారా వ్రాయబడింది (Cebuano Wikipedia). ఇందులో 5.37 మిలియన్ ల ఆర్టికల్స్ ఉన్నప్పటికీ, కేవలం 6 మంది అడ్మినిస్ట్రేటర్ లు మరియు 14 మంది యాక్టివ్ యూజర్ లు ఉన్నారు. అయితే మేము తెలుగు వికీపీడియా మీద సాధ్యమైనంత వరకు మానవనీయంగా వ్వాసాలు రాయమని ప్రాజెక్టు సభ్యులకు సూచించాము, ఇంకా ఏమైనా వివరాలు ప్రాజెక్టు పేజీలో పంచుకోగలము. -- Kasyap (చర్చ) 13:41, 24 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. తెవికీలో క్రియాశీల సభ్యులు, నిర్వాహకులు తక్కువగా వున్నారు. మీ ప్రాజెక్టు, శిక్షణ కార్యక్రమాలలో కృషి వలన వారిపై మోయలేని నిర్వహణ భారం పడకుండా చూసుకొనే బాధ్యత ప్రాజెక్టు నిర్వాహకులు తీసుకోవాలి. మీ ప్రాజెక్టు సభ్యులకు, శిక్షణ ఇచ్చినవారికి తొలి 500 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలను అభివృద్ధి చేయమని చెప్పటం,ఆ తరువాత సాంకేతిక అంశాలపై కాకుండా ఇతర అంశాలను అనువాదానికి ఎంపిక చేసుకోమని చెప్పటం మంచిది. కొన్ని అనువాదాలు అలా చేసిన తరువాత, సాంకేతికాంశాల అనువాదాలు చేయవచ్చు. ఇటీవల అనువాద వ్యాసాలు చేర్చిన సభ్యుల చర్చాపేజీలలో చేసిన వ్యాఖ్యలకు కూడా స్పందనలు లేవు. చర్చలకు స్పందన ప్రాముఖ్యాన్ని కూడా మీరు వారికి తెలియచేయాలి. లేకపోతే గతంలోని గూగుల్ అనువాదాల ప్రాజెక్టు వలన వచ్చిన సమస్యలే పునరావృతమవుతాయి.
యాంత్రికానువాదాలు, బాట్ల కృషి ఒకటి కాదు. తెవికీలో బాటు వాడి మూసరూపంలో ఒకటి రెండు వాక్యాలతో చేర్చిన గ్రామవ్యాసాలే 42% సంఖ్యకి మూలం. వేరే భాషలో యాంత్రిక అనువాదాలు ఎక్కువ చేర్చివుండవచ్చు. మీ ప్రాజెక్టు లక్ష్యం తెలుగులో వ్యాసాల సంఖ్యని పెంచడం లాగా నేను అర్ధంచేసుకున్నాను. అయితే కనీస నాణ్యత లేని వ్యాసాల సంఖ్య పెరిగితే అది తెలుగు వికీకి మంచిది కాదని నా అభిప్రాయం. దాదాపు 9 నెలల క్రిందట చేర్చిన ప్రతిపాదన తరువాత ఇంతవరకు ప్రాజెక్టు రూపం తెలియచేయకపోవటం, ప్రాజెక్టు నిర్వహణ సామర్ధ్యంపై అనుమానాలకు ఆస్కారం కలిపిస్తున్నది. మీ శాండ్ బాక్స్ పరిశీలించినా దానిలో ఏమంత కృషి జరిగినట్లు కనబడలేదు. కావున త్వరలో వివరమైన ప్రాజెక్టు పేజీ తయారుచేయమని కోరుతున్నాను.
మీ అనుభవాలు, మీ ప్రాజెక్టు సభ్యుల అనుభవాలు, ప్రస్తుత యాంత్రిక అనువాద విధానం సమీక్షకు, కొత్త మెరుగైన విధాన నిర్ణయాలకు ఉపయోగపడతాయి. మీరందరూ ఆ చర్చలో పాల్గొనమని నా విజ్ఞప్తి.--అర్జున (చర్చ) 00:26, 27 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Important: maintenance operation on September 1stసవరించు

Trizek (WMF) (talk) 13:49, 26 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు సారాంశంసవరించు

సెప్టెంబర్ 1 ,2020, మంగళవారం నాడు సాయత్రం (19:30 IST )నుండి గంట వరకు వికీలో ఎడిట్ చేయలేరుసవరించు

ఒక గమనిక : బెనాయిట్ ఎవెల్లిన్ - కమ్యూనిటీ రిలేషన్స్ స్పెషలిస్ట్ వికీమీడియా ఫౌండేషన్ నుండి ఒక మైయిల్ చూశాను దీని ప్రకారం వికీమీడియా ఫౌండేషన్ తన సెకండరీ డేటా సెంటర్ ను పరీక్షిస్తుంది ఇది వికీపీడియా , ఇతర వికీమీడియా వికీలు ఏదైనా విపత్తు తర్వాత కూడా ఆన్‌లైన్‌లోనే ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతిదీ పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి, వికీమీడియా టెక్నాలజీ విభాగం ప్రణాళికాబద్ధమైన పరీక్ష చేయవలసి ఉంది. అయితే మీడియావికీలో కొన్ని పరిమితుల వల్ల, స్విచ్ తయారు చేసేటప్పుడు అన్ని ఎడిటింగ్ లు విధిగా నిలిపివేయాలి అంతేకాక దీర్ఘకాలం గా నడుస్తున్న స్క్రిప్టులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ సమయములో అనగా మంగళవారం, సెప్టెంబర్ 1, 2020 నాడు సెకండరీ డేటా సెంటర్ కు అన్ని ట్రాఫిక్ ని మారుస్తారు 2020 సెప్టెంబర్ 1వ వారం కోడ్ ఫ్రీజ్ లు ఉంటాయి కావున గమనించగలరు.-- 2020-08-26T19:59:01‎ Kasyap

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలుసవరించు

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. వారికి నా ధన్యవాదాలు. చర్చపై ఆసక్తిగలవారు, ఇంతవరకు ఉపకరణం వాడనట్లైతే వాడుటకు ప్రయత్నించి, అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో ఎవరైనా పాల్గొనవచ్చు, కాని కేవలం ఓటు మాత్రమే ఇతర నియమాలకు లోబడి పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:38, 29 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చిత్తు అనువాదాల పెరుగుదలసవరించు

గణాంకాలు పరిశీలిస్తే గత రెండువారాల్లో 356 అనువాద వ్యాసాలు సభ్యులు చిత్తురూపంలో ప్రయత్నించారు. అంతకు ముందు రెండువారాలలో అవి 64 మాత్రమే. అనువాద ఉపకరణం పరీక్షించిన సభ్యులకు ధన్యవాదాలు. గత రెండువారాలలో 29 అనువాద వ్యాసాలు మాత్రమే ప్రచురితమయ్యాయి. అనువాదం ప్రయత్నించిన సభ్యులందరు మీ అభిప్రాయాలు చర్చలో చేర్చి, మెరుగైన విధానం చేయటానికి తోడ్పడవలసింది.-- అర్జున (చర్చ) 00:09, 31 ఆగస్టు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]