వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 55

పాత చర్చ 54 | పాత చర్చ 55 | పాత చర్చ 56

alt text=2017 మే 17 - 2017 అక్టోబరు 25 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2017 మే 17 - 2017 అక్టోబరు 25

బస్ స్టేషన్లు

మార్చు

తెలుగు వికీపీడియాలో "బస్" మరియు "బస్సు" అనే రెండు పదాలు కూడా వాడుకలో ఉన్నాయి. కానీ ఆంగ్ల ఉచ్ఛారణ ప్రకారం చూస్తే

"బస్" అని స్పష్టంగా ఉన్నది కనుక వ్యాసాలలో "బస్సు" బదులుగా "బస్" వాడితే బాగుండునని నా అభిప్రాయం. అన్ని వ్యాసాలు, వర్గాలలో కూడా ఒకే విధమైన పదం వాడాలని నా భావన. ----కె.వెంకటరమణచర్చ 02:40, 17 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మాత్రం తెవికీ పెద్దల తుది నిర్ణయము ప్రకారం ఇక ముందు అనుసరిస్తాను. JVRKPRASAD (చర్చ) 03:45, 17 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ బస్సు అన్న తెలుగు వాడుక విస్తారంగా ప్రచారంలో ఉంది. బస్ అన్న పదం గూగుల్లో వెతికితే వచ్చే ఫలితాల సంఖ్య (5 లక్షలకు పైగా)కు బస్సు అన్న పదాన్ని వెతికితే మూడు రెట్లకు చేరువలో (14 లక్షలు) ఫలితాలు వస్తున్నాయి. బస్సు అన్నది బస్ అన్న ఆంగ్ల పదానికి తెలుగు రూపంగా భావించే దాన్నే ఉపయోగిస్తూ బస్ అన్నదాన్ని కేవలం రీడైరెక్టుల్లో ఇస్తే సరిపోతుందని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:45, 17 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ, వ్యాసాలను రీడైరక్టు చేయవచ్చు. వర్గాలలో రెండు రకాలైనవి ఉన్నాయి. కొన్ని వర్గం:గుంటూరు జిల్లా బస్సు స్టేషన్లు అనీ మరికొన్ని వర్గం:ఆంధ్ర ప్రదేశ్ బస్ స్టేషన్లు అనీ ‎ఉన్నాయి. వాటిని దారిమార్పులు లేకుండా ఏకాభిప్రాయంతో ఏదో విధమైన ఒక పదంతో (బస్ గానీ లేదా బస్సు గానీ) అన్నింటినీ మార్చితే బాగుంటుంది.----కె.వెంకటరమణచర్చ 08:04, 17 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ "నకారపొల్లు సమస్య" చాలా చోట్ల వస్తోంది. ఉదహరణకి - in the bus అని చెప్పదలుచుకున్నప్పుడు "బస్ లో" అని ఖాళీ వదలి రాయవలసి వస్తోంది. ఖాళీ వదలకపోతే "బస్లో" అని వస్తుంది. బస్ ని అజంతంగా మార్చి బస్సు అని రాసినప్పుడు బస్సులో అని ఇబ్బంది లేకుండా రాయవచ్చు. ఈ సమస్యకి మంచి సాంకేతిక పరిష్కారం కావాలి. నమస్కారం. Vemurione (చర్చ) 14:59, 21 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారూ, in the bus అని చెప్పదలచుకున్నప్పుడు "బస్‌లో" (bas^lO) అని ఖాళీ వదలకుండా వ్రాయవచ్చు. తెలుగు వ్యాసాలలో ఆంగ్ల ఉచ్ఛారణ ప్రకారం "బస్" అని మార్చవచ్చా? సరైన సుచనను తెలియజేయగలరు.----కె.వెంకటరమణచర్చ 16:35, 21 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, ఈ సమస్యని సాధారణీకరించి అన్ని సందర్భాలలోను అనువర్తించేలా చెప్పలేను కాని, బస్సు, కారు వంటి మాటలు తెలుగులో కలిసిపోయి చాల కాలం అయింది. కనుక వాటిని తెలుగు మాటలుగా అంగీకరించి ఉకారాంతపు తెలుగు మాటలుగా వాడెస్తే నష్టం లేదనే అనుకుంటున్నాను. Vemurione (చర్చ) 01:21, 22 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione మీరన్నట్లు బస్సు, కారు వంటి పదాలను ఉకారాంత పదాలుగా ఉంచుదాం. కానీ కొన్ని వ్యాసాల విషయానికి వస్తే "వండిట్ నెహ్రూ బస్ స్టేషన్" లేదా "పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్" వంటి వాటిలో దేనికి ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది? అలాగే వర్గాల విషయానికి వస్తే "వర్గం:ఆంధ్రప్రదేశ్ బస్ స్టేషన్లు" లేదా "వర్గం:ఆంధ్రప్రదేశ్ బస్సు స్టేషన్లు" అనే వాటిలో దేనికి ప్రాధాన్యతనిస్తే బాగుంటుందో తెలియజేయగలరు. విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద "పండిట్ నెహ్రూ బస్ స్టేషన్" అనే బోర్డు ఈ లింకు లోనూ, "చీపురుపల్లి బస్ స్టేషన్ కాంపెక్స్" అని ఈలింకు లోనూ ఉన్నది పరిశీలించండి. తెవికీలో వివిధ వర్గాలలో కొన్నింటిలో "బస్ స్టేషన్లు" అనీ, మరికొన్నింటిలో "బస్సు స్టేషన్లు" అనీ ఉన్నది. కనుక అన్నింటినీ ఏదైనా ఒకే విధంగా మార్చాలని భావిస్తున్నాను.----కె.వెంకటరమణచర్చ 04:47, 22 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ:

ఈ సమస్యని అనేక కోణాల గుండా పరిశీలించి ప్రతీ ఒక్క కోణాన్నీ సమర్ధిస్తూ వ్యాఖ్యానం చెప్పవచ్చు. అదంతా పెద్ద గ్రంథం అవుతుంది కనుక, టూకీగా తేల్చుతాను. (1) పండిత నెహ్రూ బస్సు స్టేండు అని రాసెస్తే సరిపోతుంది.

పండిట్ అన్న ఇంగ్లీషు మాటకి "పండిత" మూలం కదా. స్టేండ్ కి సరి అయిన తెలుగు మాట - అందరూ ఒప్పుకునే మాట - నాకు తట్టడం లేదు.

మరి వాళ్లు "పండిట్ నెహ్రూ బస్ స్టేండ్ అని వారి ప్రకటన బల్ల మీద రాసేరు కదా. దానిని మనం గౌరవించవద్దా? అని మీరు అడగొచ్చు. మన తెలుగు నాట వ్యాపార ప్రకటన బల్లలపై వర్ణక్రమ దోషాలు ఎన్ని లేవు? వారంతా వచ్చీ రాని తెలుగులో రాస్తున్నారు.

మరి proper nouns ని మనం వర్ణక్రమం మార్చి రాయవచ్చా? అని మీరు అడగొచ్చు. ఉదాహరణకి "వెంకటేష్" అనే పేరును తీసుకుందాం. ఆ పేరుని వాళ్ల నాన్న బారసాల నాడు బియ్యంలో రాసేడు. ఇప్పుడు మనం వచ్చి "నాయనా అది వెంకటేశ్" అని రాయాలి అని "నమో వేంకటేశా" అన్న ప్రయోగం ఎత్తి చూపేమనుకోండి. మనకి వ్యాకరణం వచ్చేమో కాని అతని పేరు వర్ణక్రమం మార్చే అధికారం మనకి లేదు.

ఇప్పుడు మరొక వ్యక్తి "ఆంధ్రప్రదేష్" అని రాసేడనుకుందాం. అప్పుడు, "నాయనా దానిని ఆంధ్రప్రదేశ్" అని శకారంతో రాయాలి అంటూ "ప్రదేశం" అన్న ప్రయోగం చూపించవచ్చు. ఇక్కడ మనకి అలా మార్చే హక్కు ఉంది.

మరి వాళ్లు బల్ల మీద రాసేసేరే? రాసేసినవన్నీ మనం చెరిపి మళ్లా రాయలేము. కాని వెబ్ పేజీలలో ఉన్న సమాచారాన్ని సరి చెయ్యడం అంత్ఖ ర్చుతో కూడిన పని కాదు.

ఆలోచిస్తూన్న కొద్దీ అనేక రకాల ఉదాహరణలు స్పురిస్తున్నాయి. స్థాయీకరణ లేని భాషతో కుస్తీ పడుతున్నాం. వికీపీడియాలోనైనా స్థాయీకరణ కోసం మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న మీ అందరి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నమస్కారం. Vemurione (చర్చ) 17:23, 22 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బస్‌స్టాండ్, బస్‌స్టేషన్‌లుగా మార్పు చేయవచ్చు..అన్నీ ఒకే తీరున ఉండటం వలన తికమక ఉండదు.. బస్సు స్టాండు లేదా బస్సు స్టేషను ఆంగ్ల పదాలు కాబట్టి తెలుగులో కూడా పొల్లు అదే విధంగా వాడుకలో ఉండటం ఉత్తమం. గూగుల్ బస్ అని ఉన్నా, బస్సు అని ఉన్నా వెతికి ఇస్తుంది.. ఏకాభిప్రాయం కోసం ఓటింగ్ పెట్టడం ద్వార ఒకటి నిర్ణయించుకోవచ్చు..--Viswanadh (చర్చ) 01:33, 23 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రెండు పదాలు వాడుకలో ఉన్నవే అని తెలుస్తుంది. గూగుల్ సెర్చ్ లో "బస్ స్టేషన్" అనే పదానికి 1,77,000 ఫలితాలు వస్తే, "బస్సు స్టేషన్" అనే పదానికి 1,40,000 ఫలితాలు వచ్చాయి. నా ఉద్దేశ్యం ప్రకారం ఈ బస్ స్టేషన్లకు సంబంధించి వికీపీడియాలో వాడే పదాలన్ని ఒకే విధమైనవి (ఏదైనా సరే) ఉండాలని. ప్రస్తుతానికి ఎలా ఉన్న శీర్షికలను అలాగే ఉంచేద్దామని అనుకుంటున్నాను. చర్చలో పాల్గొన్న సభ్యులకు ధన్యవాదములు. ----కె.వెంకటరమణచర్చ 06:36, 23 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు భాషాపరంగా బస్సు సరైన ప్రయోగము. కానీ బస్ ఉపయోగం బహుళంగా కనిపించడం వలన రెండింటినీ వాడవచ్చును. చర్చకి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:23, 25 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

21:05, 23 మే 2017 (UTC)

తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలకు క్యూఆర్ కోడింగ్ ప్రాజెక్టు

మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తెలంగాణ తేజోమూర్తులు పేరిట తెలంగాణకు చెందిన పలు రంగాల ప్రముఖుల చిత్రపటాలు చిత్రీకరించి వాటిని హైదరాబాద్ సాంస్కృతిక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన రవీంద్ర భారతిలో నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి తెలుగు వికీపీడియా వ్యాసాల క్యూఆర్ కోడ్ లు ముద్రించి ఫోటోల కింద వివరాలతో పాటు ముద్రించాలన్న ఆలోచన చేస్తున్నాం. తద్వారా సందర్శకులు ఆయా పెయింటింగ్ లు చూసి, వారి గురించి తెలుసుకునేప్పుడు ఫోనులో క్యూఆర్ కోడ్ ద్వారా వ్యాసానికి వెళ్ళి వివరాలు చదువుకునే వీలుంటుంది, మరింతమంది చదువరులకు తెవికీ చేరినట్టు అవుతుంది. అలానే వారికి ఇప్పటిదాకా వ్యాసం లేకపోయి ఉంటే మూలాలు ఉపయోగించి సృష్టించేందుకు కూడా వీలవుతుంది. నేను, ప్రణయ్ చేసిన విజ్ఞప్తికి తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ గారు సానుకూలంగా స్పందించారు. వారి పేర్లను ఇక్కడ జాబితా చేస్తున్నాం. ఈ పెయింటింగ్ లను స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేయించేందుకు కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ సూచనలు, సలహాలు, ఒకవేళ వ్యాససృష్టిలోనో, విస్తరణలోనో, మరేదైనా దశలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నా తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:34, 24 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ గారితో గత మూడు సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. నేను కలిసిన ప్రతిసారీ తెలుగు వికీపీడియా గురించి, తెలుగు వికీపీడియన్లు చేస్తున్న కృషి గురించి నాతో చర్చించడమేకాకుండా, ఇతరులకు కూడా తెవికీ గురించి వివరిస్తుంటారు. సాంస్కృతిక శాఖ తరపున తెవికీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, తన నుండి ఎలాంటి సహకారంకావాలో చెప్పమని గత మూడు సంవత్సరాలుగా ఆయన నన్ను అడగుతున్నారు. అందులోభాగంగా గత డిసెంబర్ లో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె), తన్వీర్ హాసన్ (సీఐఎస్-ఎ2కె)లతో మామిడి హరికృష్ణ గారిని కలవడం జరిగింది. ఆ సమావేశంలో జరిగిన చర్చల ఫలితంగా 1. తెవికీ కార్యక్రమాలకు రవీంద్ర భారతి లోని సమావేశ మందిర వేదిక ఇవ్వడం, 2. వికీ గ్రంథాలయ ఏర్పాటుతో పాటు ఇరత సహకారం అందిస్తానని మాటిచ్చారు. గతనెల మాయాబజార్ కు ప్రేమతో తెవికీ లో భాగంగా పవన్ తో కలిసి రవీంద్ర భారతికి వెళ్లినప్పుడు తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను చూడడం జరిగింది. వాటిని చూసిన పవన్ క్యూఆర్ కోడ్ ముద్రణ విషయమై మామిడి హరికృష్ణతో మాట్లాడగా, ఆయన సరేనన్నారు. తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలకు క్యూఆర్ కోడ్ తయారుచేసి ఇవ్వడంద్వారా కొందరు ప్రముఖుల వ్యాసాలు తెవికీలో రావడంతోపాటు అక్కడికి వచ్చిన సందర్శకులు కూడా తెవికీ చూసేందుకు వీలుంటుంది. దీనివల్ల తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలుగు వికీపీడియాల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం ఏర్పడుతుందని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:49, 25 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభుత్వం దగ్గరున్న అపార అధికారిక సమాచారం వికీపీడియా ద్వారా అంతర్జాలంలో అందుబాటులోకి వచ్చేందుకు తొలి అడుగు పడటం చాలా సంతోషం. కట్టా శ్రీనివాస్ (చర్చ) 06:07, 27 మే 2017 (UTC)][ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమం. దీని ద్వారా తెలంగాణ సాంస్కృతిక శాఖ, తెలుగు వికీపీడియాల మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం ఏర్పడి తెవికీ అభివృద్ధికి దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.--కశ్యప్ (చర్చ) 16:13, 8 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ ప్రభుత్వ ఫోటోలు రిలైసెన్స్ లో విడుదల

మార్చు

అందరికి నమస్కారం.
తెలుగు వికీపీడియా సముదాయం, సీఐఎస్-ఎ2కె లు గతంలో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ని కలిసి ప్రభుత్వ ఫోటోలను స్వేచ్ఛా లైసెన్సుల్లో వికీ కామన్స్ లో విడుదలచేయమని కోరడం జరిగింది. ఈ కోరికను మన్నించి విజ్ఞాన సర్వస్వంకి ఉపయోగపడే ప్రభుత్వ ఫోటోలను స్వేచ్ఛా లైసెన్సుల్లో వికీ కామన్స్ లో విడుదలచేసేందుకు తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియా వారు సంసిద్ధత వ్యక్తంచేశారు. ఇందుకు అనుగుణంగా ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి సహకరించేందకు ముందుకువచ్చారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా శాఖ సంస్థాగతంగా ఎం.ఓ.యు. చేసుకొని కృషిచేయాలని ఆశిస్తుంది. ఇప్పటివరకు చర్చల్లో పాల్గొని పురోగతికి సహకరించిన సీఐఎస్-ఎ2కె వారు ఈ సంస్థాగతమైన కృషికోసం ఈ ప్రాజెక్టును చేపట్టి నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించవలసిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:21, 8 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలు అభివృద్ధి చెందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. తెలుగు వికీపీడియా అభివృద్ధికి తెలంగాణ డిజిటల్ మీడియా వారు ముందుకురావడమనేది హర్షించదగ్గ విషయం. ఈ భాగస్వామ్య ఏర్పాటులో కృషిచేసిన కొణతం దిలీప్, ప్రణయ్, పవన్ సంతోష్ మరియు సీఐఎస్-ఎ2కె కి అభినందనలు. ఈ భాగస్వామ్యంలో మునుముందు మరిన్ని ప్రాజెక్టులు రావాలని నా కోరిక.--కశ్యప్ (చర్చ) 16:00, 8 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వికీ పిడియా లో చేరేందుకు అవకాశం లభించటం సంతోషించదగిన పరిణామం. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మిగిలిన రాష్ట్రాలలో మరో అడుగు పడేందుకు దారి ఏర్పడుతుంది. ఈ పరిణామాలను స్వాగతిస్తూ నా మద్దతు తెలియజేస్తున్నాను. కట్టా శ్రీనివాస్ (చర్చ) 04:49, 9 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదన పంపి పనిచేస్తూంది. ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వ శాఖలతో భవిష్యత్తులో మరింత విస్తృతమైన, బృహత్ ప్రయోజనకారి అయిన కార్యకలాపాలకు ఇది నాంది కాగలదని భావిస్తున్నాము. --పవన్ సంతోష్ (చర్చ) 11:51, 9 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పాలసీ చర్చల పట్టిక

మార్చు

తెలుగు వికీపీడియాలో ఇప్పటివరకూ అనేక పాలసీలపై చర్చలు జరిగాయి. అవి ఆన్-వికీ పాలసీ రచ్చబండ పేజీలోనూ, రచ్చబండ పేజీలోనూ ఉన్నాయి. ఐతే వాటి ఫలితాలు అనుసరించి పాలసీ పేజీలు రూపొందించడం కొంత తక్కువగా జరుగుతోంది. తద్వారా ప్రధానమైన పాలసీలను కోట్ చేయడానికి నిర్వాహకులకు కూడా ఇబ్బందిగా ఉండడం పలుమార్లు గమనించాను. పాలసీ పేజీలు రూపొందించడం అత్యుత్తమమైన విధానం, కానీ అది వెనుకబట్టుతున్నందున కనీసం ముందస్తుగా పాలసీ చర్చల పట్టిక ఏర్పాటుచేసుకుంటే బావుంటుందని భావిస్తున్నాను. ప్రస్తుతం జరిగిన చర్చలలో పాలసీ చర్చలను పరిశీలించి రాయవచ్చు. దయచేసి సభ్యులు ఈ ప్రతిపాదనపై తమ అభిప్రాయం తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:33, 11 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సంతోషము మరియు మంచిది.JVRKPRASAD (చర్చ) 07:26, 11 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి అలోచన పవన్ సంతోష్ గారు. దీనివల్ల తెవికీ సభ్యులు, కొత్త వాడుకరులు పాలసీలను సులభంగా తెలుసుకొనుటకు వీలుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:28, 11 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీసోర్సు వర్క్ షాప్

మార్చు

అందరికీ నమస్కారం,
తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో స్వేచ్ఛా గ్రంథాలయం అయిన తెలుగు వికీసోర్సు కూడా ఒకటి. దీనిపై ఇప్పటికే వికీమీడియన్లు పనిచేస్తూన్నారు. వందలాది పుస్తకాలు, వేలాది పుటలతో దేశంలో ప్రముఖ వికీసోర్సుల్లో ఒకటిగా నిలుస్తోంది. తరచుగా నా కలం నా గళం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటి పుస్తకాల్లోని అంశాలు తెలుగు నెటిజన్లు ప్రస్తావించడాన్ని బట్టి దీనికి విస్తృతమైన ప్రజల ఆసక్తి తెలుస్తూంది.
మరోవైపు తెలుగు వికీపీడియన్లలో పలువురు తమకు వికీసోర్సులో పుస్తకం ఎలా ఎక్కించి, ఎలా పనిచేసి, ఎలా పూర్తిచేయాలో నేర్పించమని కోరారు. వికీసోర్సులో పనిచేస్తున్నవారిలోనూ ప్రస్తుతం వికీసోర్సుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఓసీఆర్ వంటి ఉపకరణాల వినియోగం, వాటి వల్ల ప్రయోజనం, ఎలా వాడితే సమస్యలు తలెత్తుతాయి, ఎలా పరిష్కరించవచ్చు వంటి అంశాలూ నేర్చుకోవాలని ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియన్లకు హైదరాబాదులో 2017 జూలై 22, 23 (24, 25) తేదీల్లో (శని, ఆదివారాలు) రెండురోజుల పాటు తెలుగు వికీసోర్సు కార్యశాల నిర్వహించదలిచాం. స్పందన తెలియజేయవలసిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:16, 12 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

  • ఓసీఆర్ వంటి ఉపకరణాల వినియోగం, వాటి వల్ల ప్రయోజనం తెలుసు కోవటం మంచిది , ఈ మద్య వీటి నైపుణ్యం కూడా పెరిగినది , తెలుగు వికీసోర్సు కు ఎక్కువ మంది తెలుగు వికీపీడియన్ లు వస్తే విజయ వంతం అవుతుంది . నెనర్లు కశ్యప్ (చర్చ) 10:11, 12 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఓసిఆర్ ఉపకరణం వినియోగం గురించి తెలుసుకోవడం ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటికే వికీసౌర్సులో పనిచేస్తున్న వారికి అదనపు శిక్షణ లభించడం మరింత ఉపయోగంగా ఉంటుంది. t.sujatha (చర్చ) 17:49, 15 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తేదీలు సరిగా చూచి సవరించండి. శని ఆది వారాలు 22, 23 తేదీల్లో వస్తాయి. దూరంనుంచి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా, ప్రయాణ రిజర్వేషన్ కు వీలుగా వుంటుంది.--Nrgullapalli (చర్చ) 02:16, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గుళ్ళపల్లి గారూ నమస్తే, సవరించివున్నానండీ. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:31, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తేదీ, స్థలం వివరాలు

మార్చు

తెలుగు వికీసోర్సు కార్యశాల జూలై 22, 23 (శనివారం, ఆదివారం) తేదీల్లో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టులో నిర్వహించనున్నాం. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:47, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పాల్గొనే సభ్యులు దయచేసి ఇక్కడ సంతకం చేయగలరు, సూచనలు తెలియజేయదలిచినవారు చర్చ పేజీలో కానీ, సభ్యుల అభిప్రాయాల్లో కానీ తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:18, 17 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

IMPORTANT: Admin activity review

మార్చు

Hello. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was adopted by global community consensus in 2013. According to this policy, the stewards are reviewing administrators' activity on smaller wikis. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the admin activity review.

We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):

  1. Ahmed Nisar (administrator)
  2. Chavakiran (administrator)

These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards.

However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Rschen7754 02:31, 13 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిరవధిక కాలం సంరక్షిత పేజీలుగా ఉండిపోయిన పేజీలు

మార్చు

తెలుగు వికీపీడియాలో ముఖపేజీ కాకుండా నిరవధిక కాలం పాటు సంరక్షిత పేజీలుగా ఈ కింది పేజీలు చలామణిలో ఉన్నాయి.

పురాణములు, మహాత్మా_గాంధీ, హిందూధర్మశాస్త్రాలు, నాయీ_బ్రాహ్మణులు, హిందూ_సంస్కారములు, పరువు_హత్యలు, వికీపీడియా:సంప్రదింపు, సర్పంచి, శిక్ష_(వేదాంగం), అరణ్యకాలు, WP:STATS, అనుక్రమణి, మండలము_1_(ఋగ్వేదం), గోపథ_బ్రాహ్మణం, పంచవింశ_బ్రాహ్మణం, 2014_భారత_దేశము.

వీటిని సంరక్షించటంపై ఆయా పేజీల చర్చా పేజీల్లో చర్చ జరగాలి. అలా చాలా పేజీల్లో జరగలేదు. అటువంటి పేజీల చర్చా పుటల్లో చర్చించి సంరక్షణను కొనసాగించాలా వద్దా, అన్న విషయమై చర్చ జరగాల్సి ఉంది. గమనించగలరు. --

నాకు నిర్వాహకత్వం బాధ్యత ఉన్న రోజుల్లో, పైన సూచించిన వాటిలో కొన్నింటిని నిర్వాహకులు మార్పులు చేసే విధంగా సంరక్షిత పేజీలుగా సంరక్షించడము జరిగింది. ఇప్పుడు నాకు ఆ అధికారం లేదు, ఆ పేజీలలో నేను ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేని అశక్తుడను. కనుక, దయచేసి వాటికి అధికార పెద్దలు విముక్తి కలిగించిన యెడల ఆయా పేజీలలో సమాచారము చేర వేసేందుకు ప్రయత్నించ గలను. JVRKPRASAD (చర్చ) 14:45, 17 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సూచన చేసి దాదాపు పది రోజులు పైన దాటింది. JVRKPRASAD గారు తప్ప ఇతరులు స్పందించలేదు గనుక ఆయా పేజీలపై ఉన్న రక్షణను తీసివేస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 10:48, 27 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:17, 27 జూన్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ , JVRKPRASAD గారూ, నాయీ బ్రాహ్మణులు వ్యాసమునకు రక్షణ లేనప్పటికీ, దానిని ఎడిట్ చేయుటకు ఆప్షన్ చూపించడం లేదు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:14, 16 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నిజమేనండి. దీనిని వెంకట రమణ గారు రక్షణ చేసినట్లుగా ఉంది. [1] JVRKPRASAD (చర్చ) 12:04, 16 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, నాయీ బ్రాహ్మణులు వ్యాసమును శుద్ది చేయవలసిన అవసరం ఉన్నది. దీనికి రక్షణ తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:49, 31 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారూ. నాయీ బ్రాహ్మణులు వ్యాసంలో కొందరు వాడుకరులు మూలాలు లేని సమాచారం చేర్చడం, వ్యక్తిగత అభిప్రాయాలను చొప్పించడం మరియు ఉన్న సమాచారాన్ని తొలగించడం వంటి చర్యల మూలంగా గతంలో ఆ వ్యాసాన్ని సంరక్షించవలసి వచ్చింది. పై చర్చ మేరకు ఆగస్టు 16 2017 న సంరక్షణ తొలగించాను. ఇపుడు దానిలో మార్పులు జరుగుతున్నవి. ఎవరైనా శుద్ధిచేయవచ్చును. ధన్యవాదాలు.----కె.వెంకటరమణచర్చ 00:53, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:39, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Technical Wishes 2017 Announcement

మార్చు
Sorry for posting this message in English, please feel free to translate the message
 

Greetings from CIS-A2K!

CIS-A2K is happy to announce the Technical Wishes Project beginning July 2017. We now welcome requests from Indic language communities on our Technical Request page. This project, inspired by WMDE, is an effort to document and hopefully resolve the technical issues that have long plagued Indian Wikimedians. For more details, please check our Technical Requests page. Please feel free to ask questions or contact us at tito@cis-india.org and manasa@cis-india.org. Regards. --MediaWiki message delivery (చర్చ) 18:05, 1 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెగిపోయిన దారిమార్పులు

మార్చు

తెవికీలో 550 పైచిలుకు తెగిపోయిన దారిమార్పు పేజీలున్నాయి. ఈ పేజీలను తయారుచేసిన తరువాత, వాటివాటి గమ్యస్థానం పేజీలను తొలగించారన్నమాట. తెగిపోయిన దారిమార్పులు ప్రత్యేక పేజీలో ఈ జాబితాను చూడొచ్చు. ఇక వీటితో పనిలేదు, తొలగించవచ్చు. బాటేదైనా ఉంటే శ్రమలేకుండా ఒక్కదెబ్బతో తొలగించవచ్చు. బాటు వాడుకరులు దృష్టి పెట్టగలరు.__చదువరి (చర్చరచనలు) 06:22, 2 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Accessible editing buttons

మార్చు

Whatamidoing (WMF) (talk) 22:23, 10 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు స్థానికీకరణ సమావేశం

మార్చు

కార్యక్రమం పేరు: తెలుగు స్థానికీకరణ సమావేశం
నిర్వాహకులు: మొజిల్లా, స్వేచ్ఛ
తేదీలు: 29 & 30 జులై, 2017
వేదిక: స్వేచ్ఛ, గచ్చిబౌలి, హైదరాబాదు

స్వేచ్ఛా సాఫ్టువేరు సమాచారం వికీలో అభివృద్ధికి కార్యశాలకు ఆహ్వానం
మొజిల్లా ఫౌండేషన్, స్వేచ్ఛ సంస్థలు హైదరాబాద్‌లో 29 మరియు 30 జూలై 2017 తేదీల్లో స్వేచ్ఛ, గచ్చిబౌలి, హైదరాబాదు వేదికగా నిర్వహిస్తున్న తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు అభివృద్ధి, స్థానికీకరణ, సమాచార విస్తరణ కార్యక్రమంలో, నిర్వహణలో పాల్గొనేందుకు వికీమీడియన్లను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియాలో సాంకేతిక సంబంధమైన అంశాలు అభివృద్ధి చేసేందుకు ఒక ఎడిటథాన్ నిర్వహించాలని, దానికి ఇక్కడ ముందస్తుగా స్వేచ్ఛా సాఫ్టువేర్లపై ఆసక్తి ఉన్నవారితో పాటు అందరికీ తెలుగు వికీపీడియాపై శిక్షణను ఇవ్వాలని ఆశిస్తున్నాం. తద్వారా తెలుగు వికీపీడియా మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో సాంకేతిక అంశాలపై వ్యాసాలు, బుక్‌లెట్లు తయారుకావాలని లక్ష్యం. తెలుగు వికీపీడియన్లు ఇప్పటికే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వాన్ని అభివృద్ధి చేస్తూండగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, ఉబుంటు మొదలుకొని సాఫ్టువేరు పరంగా తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేరు రంగంపై జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. తెలుగు వారై సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి తెవికీతోనూ, తెవికీకి అవసరమయ్యే సాంకేతికాంశాలపైనా అవగాహన ఏర్పడే వీలుంది.

మా కోరిక మేరకు పవన్ సంతోష్‌ నిర్వహణ కమిటీలో చేరి కొన్ని సూచనలు, సహకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులో పాలుపంచుకుంటారని, కార్యక్రమానికి విచ్చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను.

సంక్షిప్తంగా ఈ కార్యక్రమం లక్ష్యాలు:

  • స్థానికీకరణ, సాంకేతిక రంగంలో తెలుగు వ్యాప్తి చేయడం ఎలా?
  • తెలుగు వారికి టెక్నాలజీని అందుబాటులోకి తేవడం ఎలాగ?
  • తెలుగు సాఫ్టువేరు(స్వేచ్ఛా లైసెన్సు కలిగిన సాఫ్టువేర్లు) వాడకం మీద వర్కుషాపు
  • తెలుగు వికీ స్ప్రింటు: వికీప్రాజెక్టు:స్వేచ్ఛా సాఫ్టువేరు ని అభివృద్ది చేయడం


తెలుగు వికీ సముదాయాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవమని కొరుకుంటున్నాము, ఈ కార్యక్రమం వల్ల మన ఉపయోగాలు:

  • తెలుగు వికీపీడియన్లకు తెలుగు స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకంపై శిక్షణ
  • స్థానిక సాంకేతిక సముదాయాలతో మంచి అనుబందం
  • IT Employees, Engineering students & Techie లను వికీపీడియన్లను ఆహ్వానించడం

గమనిక: సమావేశానికి సంభందించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి వికీపీడియా:సమావేశం/తెలుగు_స్థానికీకరణ_సమావేశం (నమోదు చిట్టా కూడా ఇందులో ఉంది).


సమావేశానికి నమోదు

మార్చు
  1. Ranjithraj (చర్చ) 05:44, 19 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:46, 19 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:08, 20 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  4. -- కశ్యప్ (చర్చ) 03:05, 23 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Rajasekhar1961 (చర్చ) 06:49, 28 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --Nrgullapalli (చర్చ) 06:57, 28 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Page Previews (Hovercards) update

మార్చు

CKoerner (WMF) (talk) 22:32, 20 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మూస అర్థం తెలియదు

మార్చు

నేను వ్రాస్తున్న వ్యాసం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985 నందు "Orphan|date=జూలై 2017" అనే మూస ఉన్నది. దీని అర్థం తెలిసినవారు దయచేసి నేనేమి చేయాలో తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 12:46, 25 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలోని వ్యాసానికి సంబంధిత వ్యాసాల నుండి లింకులు ఉండాలి. అలా ఒక్ఖలింకూ లేకపోతే ఆ వ్యాసాన్ని అనాథ వ్యాసం అంటారు. ఈ వ్యాసానికి ఏ ఇతర వ్యాసం నుండీ లింకు లేకపోవడాన AWB ఆ మూసను చేర్చింది. ఇప్పుడు నేను మాదక ద్రవ్యాలు వ్యాసం నుండి ఈ వ్యాసానికి లింకును చేర్చాను. ఇప్పుడది అనాథ కాదు. __చదువరి (చర్చరచనలు) 14:37, 25 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 04:19, 5 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter June 2017

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the months of June 2017. The edition includes details about these topics:

  • Wikidata Workshop: South India
  • Tallapaka Pada Sahityam is now on Wikisource
  • Thematic Edit-a-thon at Yashawantrao Chavan Institute of Science, Satara
  • Asian Athletics Championships 2017 Edit-a-thon
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. --MediaWiki message delivery (చర్చ) 04:01, 5 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
"Tallapaka Pada Sahityam is now on Wikisource" ఈ విషయమై @Pavan santhosh.s: ఇక్కడ వివరించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 02:44, 17 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ సరిదిద్దానండీ. అలానే మెటాలో పేజీని యూజర్‌ సబ్‌పేజీకి పంపించాను. పూర్తిస్థాయిలో సరైన సమాచారంతో విస్తరించాకే దాన్ని లైవ్ చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 03:35, 17 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter July 2017

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the months of July 2017. The edition includes details about these topics:

  • Telugu Wikisource Workshop
  • Marathi Wikipedia Workshop in Sangli, Maharashtra
  • Tallapaka Pada Sahityam is now on Wikisource
  • Wikipedia Workshop on Template Creation and Modification Conducted in Bengaluru

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. --MediaWiki message delivery (చర్చ) 03:58, 17 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రేపే వికీమీడీయా డైవర్సిటీ కాన్ఫరెన్స్ స్కాలర్షిప్ కి ఆఖరు తేదీ

మార్చు

ఈ లంకెలో వివరాలు చూడండి. భాషా, భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యతలను చర్చించి, వికీపీడియా, వికీమీడియా సోదర ప్రాజెక్టులలో వైవిధ్య సమాచారాన్ని చేర్చటం పై చర్చలు, సదస్సులు ఉంటాయి. పాల్గొని తెవికీ అభివృద్ధికి దోహదపడండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:17, 19 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో సెప్టెంబరు 6, 7 తేదీల్లో వికీడేటా కార్యశాల

మార్చు

అందరికీ నమస్కారం,
వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్, వికీమీడియన్ అసఫ్ బార్టోవ్ భారతదేశంలో పలుచోట్ల వికీడేటా కార్యశాలలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్టు వేదికగా అసఫ్ బార్టోవ్ రీసోర్సు పర్సన్ గా వికీమీడియన్లకు సెప్టెంబరు 6, 7 తేదీల్లో వికీడేటా కార్యశాల జరుగనుంది. కార్యక్రమంలో వికీడేటా గురించి అవగాహన, దానిపై ప్రాథమిక శిక్షణ, హ్యాండ్స్-ఆన్-సెషన్ వంటివి భాగంగా ఉంటాయి. వికీడేటా మనుష్యులు కానీ, మెషీన్లు కానీ దిద్దగల, చదవగల స్వేచ్ఛా విజ్ఞాన భాండాగారం. ఈ కార్యక్రమం గురించి మీ సూచనలు, కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు ఆసక్తి వంటివి తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:18, 24 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గత కొన్ని సంవత్సరాలుగా వికీపీడియాలో కృషిచేస్తున్నా వికీడేటా గురించిన సరైన అవగాహన లేదు. ఈ వికీడేటా కార్యశాల అందుకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:42, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • స్పందించిన ప్రణయ్ గారికి ధన్యవాదాలు, ఈ కార్యశాల మీకు వికీడేటాపై మరింత అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నాను. ఆసక్తి కలిగిన సభ్యులు దయచేసి ఇక్కడ సంతకం చేయడం కానీ, దాని చర్చ పేజీలో సూచనలు తెలియజేయడం కానీ చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 09:57, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Wiki Loves Monuments 2017 in India

మార్చు

Greetings from Wikimedia India! Wiki Loves Monuments in India is an upcoming photo competition, part of the bigger Wiki Loves Monuments 2017. We welcome you all to be part of it, as participants and as volunteers. The aim of the contest is to ask the general public—readers and users of Wikipedia, photographers, hobbyists, etc.—to take pictures of cultural heritage monuments and upload them to Wikimedia Commons for use on Wikipedia and its sister projects. This in turn would lead to creation of new articles along with development of new articles in Indian languages.

We seek your support to make this event a grand success ! Please sign up here -- Suyash Dwivedi, sent using MediaWiki message delivery (చర్చ) 11:50, 25 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Wikidata Workshops in India in September 2017

మార్చు
Apologies for writing the message in English. Please feel free to translate the message to your language.
 

Hello,
We are glad to inform you that Asaf Bartov will visit India in the month of September, and will be conducting local workshops on Wikidata and other recent technologies and tools. You might be aware that Asaf is a promoter and trainer of Wikidata, and before and during this year's Wikimania, Indic Wikimedians from two communities requested Asaf to visit India to conduct more Wikidata workshops.
The workshop would include extensive Wikidata training, from absolute beginner level through querying and embedding Wikidata in Wikipedia (incl. infoboxes), as well as a general tools demonstration, including Quarry. Additionally, time would be made for general Q&A ("ask me anything") to let people use the opportunity to directly ask a WMF representative anything that they have on their mind.
Asaf would come to India on 29 August. Please see the detailed plan here. Please contact here or write to Asaf if you have any question. Regards. -- Titodutta, sent using MediaWiki message delivery (చర్చ) 13:37, 25 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తులు

మార్చు

ఇద్దరు సభ్యులు - స్వరలాసిక, JVRKPRASAD గారలు- వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలో మార్పులు చేసారు. స్వీయ నిర్వాహకత్వం కోసం విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించారని నాకు అనిపించింది. ఒకవేళ అదే అయితే, వారి ప్రయత్నం సఫలం కాలేదు. ఒక లోపం దొర్లడం వలన, ఆ విజ్ఞప్తి పేజీలు ఇంకా తయారు కాలేదు, గమనించగలరు. ఆ లోపాన్ని సవరించి, వీరిద్దరూ తిరిగి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. __చదువరి (చర్చరచనలు) 03:16, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆ లోపమేదో సెలవిస్తే సవరించుకుంటాను.--స్వరలాసిక (చర్చ) 03:20, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సార్, ప్రస్తుతానికి ఇంకా మీరు మీ స్వీయ అభ్యర్ధిత్వం పేజీ తయారు చెయ్యలేదు. <nowiki>, </nowiki> లను తొలగించాలి. అప్పుడు కనబడే ఎర్ర లింకుకు సంబంధించిన పేజీని తయారు చెయ్యాలి. అదే మీ అభ్యర్ధిత్వం పేజీ. వివరాలన్నీ వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలోనే ఉంటాయి, చూడగలరు. __చదువరి (చర్చరచనలు) 04:07, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్వాహకత్వ పేజీలో మద్దతు, వ్యతిరేకత, తటస్థం, ఫలితం విభాగాలను సృష్టించాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 10:05, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారి ప్రతిపాదనలో రెండు సమస్యలు తలెత్తాయి.
  1. తన ప్రతిపాదనను వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం పేజీలో పెట్టారు. అది కేవలం నమూనా కోసం చూపించిన పేజీయేగానీ, అదే లింకును వాడి ప్రతిపాదన చెయ్యకూడదు. "సభ్యనామం" అన్నచోట వాడుకరి పేరు రాసి సంబంధిత పేజీని తయారుచెయ్యాలి. (ఈ పేజీని నేను తొలగిస్తాను, అవసరం లేదు కాబట్టి.)
  2. ఆయన అసలైన పేజీని కూడా తయారు చేసారు - వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD అంటూ. కానీ ఇక్కడో లోపం జరిగింది. ఆ పేజీలో ఆయన ఇదివరకే ఒకసారి నిర్వాహకత్వాన్ని ప్రతిపాదించుకున్నారు, తదనంతరం జరిగిన వోటింగు ద్వారా నిర్వాహకుడయ్యారు. రెండో ప్రతిపాదనను ఇదే పేజీలో చెయ్యకూడదు, తికమక తలెత్తుతుంది కాబట్టి. రెండోసారి ప్రతిపాదించేటపుడు తన ప్రతిపాదన పేజీ శీర్షికలో ఉండే వాడుకరిపేరు తరువాత 2 ను చేరిస్తే ఆ పేజీ కొత్తగా తయారవుతుంది. ఈ ప్రతిపాదన రెండోసారి చేస్తున్నారని కూడా వాడుకరులకు తెలుస్తుంది. ఈ విధంగా కొత్తపేజీని తయారుచేసి, అక్కడ తన స్వీయ ప్రతిపాదన చెయ్యమని ఆయనకు సూచిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 16:12, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మరొక సూచన.. వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/సభ్యనామం పేజీని చెయ్యాల్సిన కొత్త పేజీకి తరలించండి, సరిపోతుంది (నేను దాన్ని తొలగించను). పాతపేజీని దారిమార్పుగా ఉంచవద్దు. __చదువరి (చర్చరచనలు) 16:36, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారి ప్రతిపాదనలోని మార్పు

మార్చు

JVRKPRASAD గారూ, మీ ప్రతిపాదన పేజీని మళ్ళీ మార్చారు -ఎందుకో తెలియదు. మీరు చెయ్యాల్సినది ఇది:

  1. వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 పేరుతో ఒక ప్రతిపాదన పేజీని తయారు చెయ్యాలి: అది మీరు చేసారు. అక్కడే వోటింగు జరుగుతుంది. అది మొదలైంది కూడా.
  2. పై పేజీని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి: అది చెయ్యకుండా ప్రతిపాదన లోని పాఠ్యం మొత్తాన్నీ కాపీ చేసి "వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి" పేజీలో పెట్టి, ప్రతిపాదన పేజీలో "తొలగింపు" మూస పెట్టారు. అలా చెయ్యకూడదు. ప్రతిపాదన పేజీని రివర్టు చెయ్యాలి. దాన్ని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి లోకి ట్రాన్స్‌క్లూడు చెయ్యండి. ప్రతిపాదన పేజీలో జరిగే చర్చలన్నీ ఆటోమాటిగ్గా ఈ పేజీలో కనబడతాయి. (స్వరలాసిక గారు చేసారు, చూడండి) __చదువరి (చర్చరచనలు) 06:09, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీరు చెబుతున్న విషయములు నాకు అర్థం కావడం లేదు. నేనేమి చేయాలో మీరు అడిగేది నాకు తెలియడం లేదు.మీరన్నా మీరు పద్ధతిగా పెట్టండి. నాకైనా కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి. మీరే సరి చెయ్యడం ఉత్తమం. JVRKPRASAD (చర్చ) 06:20, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నా మీద సరయిన సదభిప్రాయం ఎంతమందికి ఉందో కూడా తెలియదు. ఇప్పుడు నేను నిర్వాహక పదవి కోసం అడగడటం అంత మంచి పద్ధతి కాదేమోనని అనిపిస్తోంది. అధికారులకు ఎలాగూ నిర్వాహకుని నియమించే అధికారం ఉన్నది. కొంతమందికి అయినా నా మీద అభిమానం ఉంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వారికి వారే నన్ను ప్రతిపాదించ వచ్చును. ఇంతకాలం అయినా స్పందనలు కూడా అనుకూలంగా లేవు. అన్ని నిజాలు నిదానంగా తెలుస్తాయి. నాకుగా విరమించుకుంటే మంచిదేమోనని అనిపిస్తున్నది. నా ప్రతిపాదన తొలగించినా సంతోషమే. అందరికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 06:53, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారి నిర్వాహకహోదా ప్రతిపాదనలు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 మరియు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD-2 అనే పేర్లతో రెండు పేజీలున్నాయి. ఏది సరియైన ప్రతిపాదన? ఒకటి ఉంచి రెండవది తొలగించగలరు.----కె.వెంకటరమణచర్చ 13:19, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 అనేది సరి అయినది. రెండవ దాంట్లో చర్చలు ఏమీ లేవండి మరియు దయచేసి తొలగించండి. JVRKPRASAD (చర్చ) 13:25, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారి ప్రతిపాదన రెండు వేరువేరు పేజీల్లో ఏకకాలంలో సాగుతోంది.. కొందరు ఒకపేజీలో మరికొందరు రెండో పేజీలో రాస్తున్నారు. దాన్ని నివారించడానికి వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలోని ప్రతిపాదన పాఠ్యాన్ని తీసివేసి, ఆ పాఠ్యాన్ని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 పేజీలోని పాఠ్యంతో విలీనం చేసాను. ఆ తరువాత ఈ పేజీని వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసాను. ప్రతిపాదన చెయ్యాల్సిన పద్ధతి ఇది. ప్రసాద్ గారు ఈ పద్ధతి అర్థం కాలేదని చెబుతూ, నన్నే చెయ్యమన్నారు కాబట్టి ఇలా చేసాను. ఇకపై వ్యాఖ్యలు, వోటింగు వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD 2 పేజీలో మాత్రమే చెయ్యగలరు.__చదువరి (చర్చరచనలు) 10:49, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా-యోగ్యత లేని పేజీలు

మార్చు

ఈమధ్య వికీపీడియా-యోగ్యత లేని పేజీలు చాలానే తయారవుతున్నాయి. ఏకవాక్య పేజీలు, ఇంగ్లీషులో మాత్రమే పాఠ్యం ఉన్న పేజీలు, ఇంగ్లీషు శీర్షికతో ఉన్న పేజీలు, వ్యక్తిగత సమాచారం ఉన్న పేజీలు.. మొదలైనవి చాలానే తయారవుతున్నాయి. ఇవన్నీ దాదాపుగా అన్నీ కూడా ఐపీఅడ్రసుల నుండే తయారవుతున్నాయి. నిర్వాహకులు వీటిని వెనువెంటనే తొలగించెయ్యడం మంచిది. ఇతర సభ్యులు తొలగింపు మూసను పెట్టవచ్చు; నిర్వాహకులు సదరు పేజీలను చర్చ లేకుండానే తొలగించవచ్చు. ట్వింకిల్ లోని సీఎస్‌డీ ని వాడడం లాంటిదన్నమాట! ఇది నా అభిప్రాయం. ఆయా పేజీల విషయమై చర్చించాల్సినంత విశేషమేమీ లేకపోవడం, చర్చ పేజీలో రాసేంత ఉత్సాహం, తీరిక, అంతమంది సభ్యులూ మనకు లేకపోవడం వీటికి కారణం. మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. __చదువరి (చర్చరచనలు) 04:20, 28 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవాక్య పేజీలు, ఇంగ్లీషులో మాత్రమే పాఠ్యం ఉన్న పేజీల విషయంలో ఆయా పేజీలు తయారైన తరువాత కొంత సమయం (ఒక వారం అనుకుందాం) వేచి ఉండడం భావ్యమేమో అని నాకు అనిపిస్తుంది. వాటికి తొలగింపు మూసలు పెట్టవచ్చు. ఇక ఇంగ్లీషు శీర్షికతో ఉన్న పేజీలు, వ్యక్తిగత సమాచారం ఉన్న పేజీలు వెనువెంటనే తీసివేయాలి.--స్వరలాసిక (చర్చ) 00:22, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ మధ్య ఏక వాక్య పేజీలు, అనువాదం జరగని ఆంగ్ల వ్యాసాలు, ఆంగ్ల శీర్షికలు గల ఖాళీ పుటలు, మూలాలు లేని వ్యాసాలు మొదలైనవి తయారవుతున్నాయి. ఇటువంటి వెనువెంటనే చర్చలేకుండా తొలగించడం మంచిది. వికీపీడియాలో ఉండదగిన వ్యాసం అయితే సంబంధిత మూలాల, విస్తరణ,మొలక మూసలను చేర్చవచ్చు.----కె.వెంకటరమణచర్చ 13:24, 29 ఆగస్టు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అటువంటివి సృష్టించి వారం గడిచి మద్యలో ఏ మార్పులూ చేయకపోతే మూస కూదా అవసరం లేదు అనుభవం కలిగిన వాడుకరులు వెంటనే తొలగించవచ్చు...--Viswanadh (చర్చ) 04:04, 2 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా సామాజిక మాధ్యమాల నిర్వహణపై పాలసీ చర్చ

మార్చు

ఫేస్ బుక్, ట్విట్టర్ మాధ్యమాల్లో తెలుగు వికీపీడియాకు ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలను ఆసక్తి కలిగిన వికీపీడియన్లు సృష్టించి, వికీపీడియాను విస్తృత ప్రచారానికి తెచ్చేందుకు వీలు అవుతుందని భావించిన విధంగా నడిపారు. ముఖ్యంగా మన ఫేస్ బుక్ పేజీకి ఇప్పుడు (2017 సెప్టెంబరు 1 నాటికి) 6936 మంది అనుసరిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ ఖాతాల నిర్వహణలో క్రమాన్ని తెలుగు వికీపీడియా సముదాయం తీసుకువస్తే బావుంటుందని భావిస్తున్నాను. దీనికి కొన్ని ఆలోచనలు, ఈ కింది ఆలోచనలు నా తొలి ప్రతిపాదనలుగా భావించండి, దీనిపై సముదాయ సభ్యులు ఎలాంటి సవరణలు అయినా సూచించవచ్చును, చర్చించి నిర్ణయించుకుందాం:

  1. సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఓ ప్రత్యేకమైన పేజీ రూపొందించుకోవాలి.
  2. ఈ కృషికి ఏయే ఫలితాలను ఆశిస్తున్నామో మనం నిర్ణయించుకోవాలి: నా వరకూ నేను తెలుగు వికీపీడియాలోని సమాచారం, దాని నాణ్యత, వైవిధ్యం, సముదాయం వంటివాటిని ప్రాచుర్యంలో పెట్టేందుకు (రీచ్) ప్రాథమిక లక్ష్యంగా, సామాజిక మాధ్యమాల్లో అనుసరించేవారు తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల వరకూ వచ్చి రాయడం అన్నది ద్వితీయ లక్ష్యంగా భావిస్తున్నాను.
  3. ఇక్కడ సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి పోస్టులు పెట్టవచ్చో సూత్రప్రాయంగా చర్చించి నిర్ణయించుకుంటే అది ఆ పేజీలో ప్రముఖంగా కనిపించాలి. పాలసీలో సామాజిక మాధ్యమాల పేజీల్లో, హ్యాండిళ్ళలో ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవచ్చు, ఎలాంటి సమాచారాన్ని ప్రచురించరాదు, ఎవరైనా వికీపీడియా ఫేస్ బుక్ పేజీలోనో, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానో ఓ సమాచారాన్ని పంపదలుచుకుంటే ఎక్కడ కోరాలి, మనం ప్రచురించిన సమాచారంపై వచ్చే అనుబంధ ప్రశ్నల కామెంట్లకు సమాధానం ఇవ్వొచ్చా మొదలు ముఖ్యమైన సామాజిక మాధ్యమ నిర్వహణ పాలసీలు ఉండాలి. వేరే పేజీల నుంచి సమాచారాన్ని పున:ప్రచురించదలిస్తే ముఖ్యమైన నిబంధన ఏమిటి వంటి విషయాలను కూడా నిర్ధారించాలి.
  4. తెలుగు వికీపీడియా సామాజిక ఖాతాలను నిర్వహించే ఆసక్తి ఉన్నవారు ఇక్కడే తమ పేర్లతో సైన్-అప్ అవుతారు, ఇక్కడ సైనప్ అయినవారికే సామాజిక మాధ్యమాల్లో నిర్వహణ అప్పగిస్తాం.
  5. నిర్వహణా బాధ్యతలు చేసేవారు దుర్వినియోగపరిస్తే ఆ విషయాన్ని తెలుగు వికీపీడియాలోని సామాజిక మాధ్యమాల పేజీలో నమోదు చేసి, వారిని హెచ్చరించి, హెచ్చరిక ఫలించకుంటే తొలగించాలి.

మూడవ పాయింట్లో చెప్పిన మార్గదర్శకాల విషయమై ఇదిగో ఇలా ప్రతిపాదిస్తున్నాను:

  • ప్రస్తుతం చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటివాటిని ప్రణయ్ చాలా చక్కగా క్రమం తప్పకుండా వికీపీడియా యాప్లో వచ్చే "షేర్-ఎ-ఫ్యాక్ట్" టూల్ ఉపయోగించి పోస్ట్ చేస్తున్నారు. ఇది కొనసాగించాలి.
  • నెలకు ఒక వికీపీడియన్ చేసిన కృషిని గుర్తించి వారి గురించి కథనం, ఏవీ లాంటివి ఉపయోగించి ప్రాచుర్యం కల్పించాలి. ఈ కృషిలో ప్రధానంగా వారిని గౌరవించుకోవడం అన్న లక్ష్యం కన్నా, వారిలాంటి వృత్తిలో, వయసులో, సామర్థ్యంతో ఉన్నవారికి అరె మనమూ చేయొచ్చు కదా అన్న భావన కల్పించడం ముఖ్యం. కాబట్టి ప్రధానంగా ఒక టీచర్ ఏ సమయాన్ని ఉపయోగించుకుని వికీపీడియా ద్వారా ఏయే లక్ష్యాలను సాధిస్తున్నారు, కుటుంబ బాధ్యతలు పూర్తిచేసుకున్న ఒక జంట తమ సమయాన్ని దీనికి వెచ్చించి ఎంతటి కృషిచేస్తున్నారు, ఎలా భావితరాలకు ఆదర్శప్రాయులయ్యారు, ఒక ఉద్యోగి తనకు ఆసక్తి అయిన సినిమా రంగం గురించి సరదాగా రాయడం ద్వారానే ఎలా వికీపీడియాలో గొప్ప కృషిచేసినవారయ్యారు అన్న కోణంలో ఉండాలి. అసాధ్యమైన పనిలా మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ అనిపించేలా రాయరాదు.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో జరుగుతున్న కృషిని - ఉదాహరణకు తెలంగాణ తేజోమూర్తులు ప్రాజెక్టు, వికీసోర్సులో ఆసక్తికరమైన చిన్ననాటి ముచ్చట్లు దిద్దుబాట్లు, అక్షరదోషాల సవరణ ఇలాంటి విషయాలపై ఫోకస్ చేసి ప్రతీ శుక్రవారం ఒక్కో కథనం అందించవచ్చు. తద్వారా జరుగతున్నదేంటో - జరగాల్సింది ఏంటో, దానిలో వారెలా పాలుపంచుకోవచ్చో తెలియజేయవచ్చు.
  • తెలుగు వికీపీడియా మొదటి పేజీ శీర్షికలను వీలువెంబడి పోస్టులుగా ప్రచురిస్తూండవచ్చు.
  • తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి అవుట్-రీచ్ కార్యక్రమాలు జరిగినా, వికీపీడియన్ల గురించి ఏదైనా పత్రికలో కవరేజి వచ్చినా, ఏ విధంగానైనా వికీపీడియాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం పంచుకున్నా దాన్ని పంచుకోవడాన్ని అనుమతించవచ్చు

చేయకూడనివి:

  • సంబంధం లేని, కేవల ప్రచారపరమైన పోస్టులను ప్రచురించకూడదు.
  • తటస్థ వైఖరిని తప్పకూడదు.
  • వివాదాస్పదమైన ఏ పోస్టునూ చేయకూడదు.
  • వికీపీడియాకు సంబంధం లేని వ్యక్తిగతమైన పోస్టులు వేయకూడదు.

దయచేసి పై ప్రతిపాదనలకు, మీ ఆలోచనలు జోడించి చర్చించవలసిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:46, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని మంచి ఆలోచనలు పవన్. మనం ఎంత సమాచారం పోగుచేస్తున్నామో దాన్ని నలుగురికీ చేరేలా చేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. కాకపోతే పైన చెప్పినట్లుగా వికీ నియమాలు అన్నీ అనుసరించిన వ్యాసాలు (అంటే స్వంత రచనలు, సరైన మూలాలు, తటస్థ దృక్కోణం మొదలైనవి) మాత్రమే బయటకు వెళితే మనం చేస్తున్న పని నాణ్యమైనదని తెలిసే వీలుంది. ఇప్పటికే తెవికీ అంటే కాపీ పేస్టులనే అభిప్రాయంతో ఉన్నారు కొంతమంది.--రవిచంద్ర (చర్చ) 12:46, 1 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఫేస్‌బుక్ పేజీలో కేవలం వ్యాసాలు మాత్రమే కాక అప్పుడపుడూ కొన్ని సాంకేతిక విషయాలు రాసి వాటిపై కొన్ని చర్చలు జరగాలి. ఇలాంటివి ఫాలోవర్స్ ను ఆకర్షిస్తాయి. వ్యాస విషయాలు కాక కొన్ని మంచి అత్యుత్తమమైన వికీ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. తరచుగా అవగాహనా పరమైన కొన్ని టపాలుండాలి..అలా జనంలో వికీలో రాసేదానికి ఆశక్తి కలగొచ్చు..--Viswanadh (చర్చ) 04:12, 2 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం పవన్ సంతోష్ గారు. ముఖపుస్తకంలో తెలుగు వికీపీడియా సముదాయానికి సంబంధించి ఒక సమూహం, ఒక పుట ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీటినే తెవికీ సముదాయ ప్రధాన సామాజిక మాధ్యమ ప్రచార సాధనాలుగా ఉపయోగిస్తున్నాము. వాటిలో నేను తెలుగు వికీపీడియాకు సంబంధించినవి టపా చేస్తూ వస్తున్నాను. నాతోపాటు మరికొందమంది తెవికీ సభ్యులు వాటికి నిర్వాహకులుగా ఉన్నారు.అయుతే, ఒకటిరెండుసార్లు ముఖపుస్తక వికీపీడియా పుట, సమూహాల్లో తెవికీకి సంబంధంలేని టపాలు చేయబడ్డాయి. ఆ విషయం ఇతర సభ్యులకు తెలియజేసి, వెంటనే ఆ టపాలను తొలగించాను. అలాంటివి మళ్లీ జరగకూడదని, తెలుగు వికీపీడియా సామాజిక మాధ్యమాల నిర్వహణపై ఒక పాలసీ చర్చ జరగాలని భావించాను. ఆ చర్చను మీరు మొదలుపెట్టినందుకు మీకు ధన్యవాదాలు. మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటికి తోడుగా నేను కొన్ని సూచనలు చేస్తున్నాను.

  1. తెలుగు వికీపీడియా ముఖపుస్తక సమూహా, పుటల్లో తెవికీకి సంబంధించినవే టపాచేయాలి.
  2. తెవికీ సభ్యులు అంగీకరించిన, తెవికీ అభివృద్ధికి ఉపయోగపడే మరియు తెవికీ సోదర ప్రాజెక్టులకు సంబంధించిన ముఖపుస్తక సమూహా, పుటలతోనే తెవికీ తెలుగు వికీపీడియా ముఖపుస్తక సమూహా, పుటలను లింక్ చేయాలి.
  3. మీరు పైన చెప్పినట్టుగా ప్రస్తుతం చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా వంటివాటిని టపా చేయడాన్ని కొనసాగిస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:40, 2 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]


పవన్లేవదీసిన చర్చ చాలా బాగున్నది, రవిచంద్ర, విశ్వనాధ్, ప్రణయ్ ల ఆలోచనలు బాగున్నాయి. ప్రణయ్ ముఖపుస్తకంలో చేస్తున్న విధంగా నిబద్ధతతో ఈ వికీ పాలసీలకు అనుగుణంగా నిర్వహించేవారు మనకు అవసరం. నా ఆలోచనలను క్రింది తెలియజేస్తున్నాను>

  1. తెలుగు వికీపీడియాను నిర్వహిస్తున్న విధంగానే తెలుగు వికీసోర్స్ మరియు తెలుగు విక్షనరీ లను గురించి కూడా ప్రతి రోజూ ముఖపుస్తకంలో ఒక పోస్ట్ చేయాలి.
  2. తెలుగు విక్షనరీకి అక్కడ పేజీ లేకపోతే సృష్టించాలి. రోజూ ఒకపదం ప్రస్తుతం మొదటి పేజీలో నిర్వహించడం లేదు. అది తిరిగి ప్రారంభించి; అందులోని పదాన్ని ముఖపుస్తకంలో తెలియజేయవచ్చును. బొమ్మలున్న పదాలను చూపిస్తే పిల్లలకు, విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతుంది.
  3. తెలుగు వికీసోర్స్ గురించి కూడా ముఖపుస్తకంలో లేదు. అది ప్రారంభించి, నెలకొక పుస్తకాన్ని అందులోని వివిధ అంశాలను పేజీలవారీగా లేదా ప్రకరణాల వారీగా తెలియజేయవచ్చును. కొందరు రచయితల జీవితచరిత్రలను అందించవచ్చును.
  4. విక్షనరీ, వికీసోర్స్ లను వారానికి ఒకసారి కాకుండా రోజువారీగానే నిర్వహిస్తే బాగుంటుంది. వీనిలో ఆసక్తి ఉన్నవారికి అవకాశం ఇద్దాము.
  5. వివిధ విభాగాలలో మంచి కృషిచేస్తున్న వికీపీడియన్లను గురించి కూడా ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయవచ్చును. వారిగురించి తెలియజేయడం వలన మరికొంతమంది తెలుగు వికీ విభాగాల్లో పనిచేయడానికి ముందుకు వస్తారని నా భావన.Rajasekhar1961 (చర్చ) 05:56, 12 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]


-->ముగింపుకు ముందు నేనో మాట చెప్పాలి. ఆలస్యంగా చెబుతున్నందుకు మన్నించాలని కోరుతున్నాను.. ఇక్కడ వెలిబుచ్చిన ఆలోచనలన్నీ బాగున్నాయి. కానీ, ఫేస్‌బుక్‌లోగానీ, ఇతర సామాజిక మాధ్యమాల్లో గానీ వికీపీడియా కోసం చేపట్టే కార్యక్రమాలు అధికారికంగా వికీపీడియాకు సంబంధం లేనివని నా ఉద్దేశం. దాన్ని మనం స్పష్టంగా ఆయా సైట్లలో స్పష్టంగా, స్ఫుటంగా కనబడేలా ప్రకటించాలి. ఒకవేళ అవి అధికారిక పేజీలే అయితే, ఆ విషయాన్ని ముందుగా ఇక్కడ ప్రకటించగలరు.__చదువరి (చర్చరచనలు) 17:05, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పాలసీలను అనుసరించి, ఇక్కడ నమోదు చేసుకున్న వాడుకరులు మాత్రమే నిర్వహించినప్పుడు అధికారికంగా నిర్వహించడంలో పొరబాటు ఉందంటారా? ఈ ఆలోచన ఓ సమస్య నేపథ్యంలో వచ్చింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఇలా అనధికారికంగా నిర్వహించే అవకాశం (ఇక్కడ ఏ పాలసీ లేకపోవడంతో) ఉండడంతో తోచిన విధంగా ఆయా పేజీల నుంచి వ్యక్తిగతమైన విషయాలు పంచుకుంటూ ఉన్న సందర్భాలు ఎదురైనాయి. అలాంటి సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలన్నది ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో సచేతనంగా ఉన్న సముదాయ సభ్యుల్లో ఆలోచన రాగా, పాలసీ ఉన్నప్పుడే నియంత్రణ, ఫలప్రదమైన కృషి సాధ్యమని భావించి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ దీన్ని అనధికారికం చేస్తే, ఎవరి ఉత్సాహాన్ని బట్టి వారు, ఎవరి ఉద్దేశాలను బట్టి వారు చెదురుమదురుగా పేజీలు రూపొందించుకుని, ఉన్న పేజీలోనూ కూడా రాసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇది అధికారికమనీ, దీనిని తెలుగు వికీపీడియాలో సదరు ప్రాజెక్టు పేజీలో సంతకం చేసి, అక్కడ పాలసీలకు వ్యతిరేకంగా నిర్వహించమని పేర్కొన్నవారికే అడ్మిన్, ఎడిటర్ హక్కులు ఇస్తామని పేర్కొంటే వారిని నియంత్రించడం సాధ్యపడుతుంది అని నా వ్యక్తిగత భావన. --పవన్ సంతోష్ (చర్చ) 17:28, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ అనధికారికంగా ఉంటే, అక్కడ ఏం జరిగినా వికీ నేరుగా ప్రభావితం కాదు. అదే అధికారికమైతే, అక్కడ ఆ పేజీలో జరిగేదాని ప్రభావం ఇక్కడ ఉంటుందని నా ఉద్దేశం. ఉదాహరణకు, దాని గురించి రచ్చబండలో చర్చలూ జరగవచ్చు.__చదువరి (చర్చరచనలు) 18:04, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ ముగింపు కోరుతూ

మార్చు

చర్చ ప్రారంభించి రెండు వారాలు కావస్తున్నది. సముదాయ సభ్యులు తగినంతగా స్పందించారు. మొత్తం నాలుగు స్పందనలు, వాటిలో ఒకరు సమర్థించారు, మిగతా వారు సమర్థిస్తూనే మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. దీనిపై ముందుకు వెళ్ళేందుకు గాను చర్చ ప్రారంభించిన, పాల్గొన్న సభ్యులను మినహాయించి వేరెవరైనా నిర్వాహకులు క్రోడీకరిస్తూ ముగింపు పలకగరని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:24, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ముగింపు

మార్చు

సామాజిక మాధ్యమాలలో తెలుగు వికీపీడియా ప్రచారానికై ఖాతాల నిర్వహణకై పవన్ సంతోష్ 5 పాయింట్లతో ఒక పాలసీ చర్చ లేవదీసారు. రవిచంద్ర పై ప్రతిపాదనలను సమర్థిస్తూనే వికీ నియమాలకు అనుగుణంగా వున్న వ్యాసాలకు మాత్రమే ఈ మాధ్యమాలలో ప్రచారం కల్పించాలని సూచించారు. Viswanadh వ్యాసాలతో పాటు సాంకేతిక అంశాలు, అవగాహన కల్పించే విషయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. Pranayraj Vangari కూడా ఈ ప్రతిపాదనలను సమర్థిస్తూ ఇతర వికీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కాకుండా తెలుగు వికీపీడియాకు సంబంధించిన టపాలు మాత్రమే వుండాలని ఆశిస్తున్నారు. Rajasekhar1961 తెలుగు వికీసోర్సు, తెలుగు విక్షనరీలకు విడివిడిగా ఖాతాలను తెరచి వాటిని నిర్వహించాలని కోరారు. చదువరి ఈ ఖాతాల నిర్వహణ అధికారికంగానా, అనధికారికంగానా స్పష్టం చేయాలని ఒక వేళ అధికారికమైతే దాని ప్రభావం వికీపీడియాపై ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చర్చలో పాల్గొన్న సభ్యులందరూ పవన్ సంతోష్ ప్రతిపాదనలను మౌలికంగా అంగీకరిస్తున్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో వికీపీడియా నిర్వహణకు తెలుగు వికీపీడియాలో ఓ ప్రత్యేకమైన పేజీ ఏర్పాటుపై పాలసీ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాను.--స్వరలాసిక (చర్చ) 03:19, 16 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించండి

మార్చు

వికీపీడియాలో ఇంతకాలం పనిచేస్తూ, నాకుగా నేను ఇతరులతో ఎలా మాట్లాడి ప్రవర్తించాలో అర్థంకాక, తెలుసుకోలేక తెలిసోతెలియకో నేను వికీ గురించి తెలియక మరియు మీతో నా ప్రవర్తనలో తప్పులు జరిగి ఉండవచ్చునన్న ఉద్దేశ్యంతో బాధ్యత తీసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యం అయినందున, తోటి వికీపీడియన్లు పేరుపేరున ప్రతిఒక్కరూ మీరు నన్ను మన్నించండి . వ్యక్తిగత విద్వేషాలు, ద్వేషాలు ఎక్కువకాలం ఏ విషయములోనూ ఏ ఒక వ్యక్తికి మంచిది కాదని నా అభిప్రాయం. ప్రస్థుత స్థితి, పరిస్థితులలో నుండి మంచి మార్పు కొరకు నేను చేయగల మార్గమేమిటో తెలియజేయండి. భవిష్యత్తులో ఎటువంటి సమస్య జరగకుండా నావంతు జాగ్రత్తలు నేను తీసుకుంటాను. నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పటం, తద్వారా సంబంధం పునర్నిర్మించటానికి దోహద పడుతుందని ఆశిస్తున్నాను. నీతి నిజాయితీగా వ్రాసిన ఈ లేఖ నా చేతివ్రాత ప్రతి గానే దయచేసి అందరూ భావించ గలరు. దయచేసి మన్నించండి. శలవు. JVRKPRASAD (చర్చ) 01:20, 3 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆసఫ్ బార్టోవ్ పత్రికా సమావేశంలో తెలుగు వికీపీడియా గురించి

మార్చు

అందరికీ నమస్కారం,
వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆసఫ్ బార్టోవ్ వికీడేటా కార్యశాల కోసం రేపు హైదరాబాద్ వచ్చి, సమావేశాల్లోనూ, పత్రికా సమావేశంలోనూ పాల్గోనున్నారు. ఆయన పత్రికా సమావేశం ప్రధాన మీడియాల్లో ప్రముఖంగా కవర్ అయ్యే అవకాశం ఉన్నందున తెలుగు వికీపీడియన్ల ప్రాజెక్టులు, ఈవెంట్లు వంటివాటి గురించి దేని గురించైనా ప్రస్తావిస్తే ప్రాచుర్యం లభించగలదు. ఈమేరకు సముదాయం ప్రాజెక్టులు, ఈవెంట్ల గురించి వెల్లడించడానికి ఆసఫ్ ముందుకువస్తున్నారు. తెలుగు వికీపీడియాలో తెలుగు గ్రామాల వ్యాసాలు ఉన్న విషయం, వాటిని విస్తరించే క్రమంలో ఎవరైనా గ్రామంలో ప్రభుత్వ బడి, కొలను, ప్రముఖమైన పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనాలయాలు వంటివాటి ఫోటోలు తీసి వికీమీడియా కామన్సులోనూ, తద్వారా తెలుగు వికీపీడియాలోనూ చేర్చవచ్చని, అలా చేర్చడం వల్ల తమ గ్రామ వ్యాసాన్ని వృద్ధి చేసినట్టు అవుతుందన్న అంశం ప్రస్తావిస్తే మేలని భావిస్తున్నాను. ఎందుకంటే - గ్రామ గ్రామాల సమాచారాన్ని తీసుకురాగలుగడం కొంతమేరకు సాధ్యం కావచ్చు కానీ, గ్రామం ఫోటోలు తీసుకురావడానికి మాత్రం స్థానికులకే మరింత తేలిక కనుక ఈ అంశం ప్రాచుర్యం చెందితే మనకు ఉపకరిస్తుందనుకుంటున్నాను. సముదాయ సభ్యులు మెరుగైన సూచనలు సలహాలు, ఈ విషయంపై చర్చ వీలైనంత త్వరగా చేయగలరు. పత్రికా సమావేశం 6 తేదీ సాయంత్రం జరిగే అవకాశం ఉంది కాబట్టి మన చర్చను ఈలోగా చేయడం ఉపకరిస్తుంది. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:03, 3 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తీసిన ఫోటోలు నాకు అందుబాటులో ఉన్న వాటిని ఆయా గ్రామపుటలలో వెంటనే కాకపోయినా చేర్చగలను.JVRKPRASAD (చర్చ) 15:08, 3 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు జేవీఆర్కే ప్రసాద్ గారూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:45, 4 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ ప్రతిపాదన మేరకు 2017 సెప్టెంబరు 7 నాటి పత్రికా సమావేశంలో అసఫ్ బార్టోవ్ గ్రామ వ్యాసాల్లో సమాచారంపై తెలుగు వికీపీడియన్లు పనిచేస్తున్న సంగతీ, ఆయా వ్యాసాల్లో ఫోటోలు అవసరమన్న విషయం, వాటిని గ్రామ గ్రామంలోని వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్ తో సైతం ఫోటోలు తీసి సైతం పెట్టవచ్చన్న విషయాన్ని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరినీ తమ తమ ఊళ్ళలో ఆలయాలు కానీ, బళ్ళు కానీ, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు వగైరాలు ఫోటోలు తీసి చేర్చమంటూ ఆయన పిలుపునిచ్చారు. పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఈ విషయం కవర్ అయింది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:41, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తవారిని చేర్చేందుకు ఒక మార్గం

మార్చు

తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లోకి కొత్తగా వచ్చి, నిలబడగలిగే వికీపీడియన్లను చేర్చేందుకు పలు మార్గాలు అన్వేషిస్తూండాలి. ఎందుకు రావట్లేదు, వచ్చినవారు ఎందుకు నిలవట్లేదన్న విషయంపై ఆలోచించి ఒక మార్గం పట్టుకోవాలని మొన్నామధ్య చదువరి గారితో చేసిన ఒక చర్చలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఐతే ఇటీవల ఇద్దరు కొత్త సభ్యులను తెలుగు వికీసోర్సుకు పరిచయం చేశాము. వారిద్దరూ ఆసక్తిగా పనిచేస్తున్నారు, కొత్త అంశాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు, వికీమీడియన్లకు ఉండే ఉత్సాహం, స్వచ్ఛంద దృష్టి ఉన్నది. వారు తెవికీసోర్సులో చేరి దాదాపు 50 రోజులు కావస్తున్నది, వికీమీడియన్లుగా వారి వీలువెంబడి కృషిచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి తెవికీమీడియా ప్రాజెక్టుల్లో ప్రవేశం తెలియజేస్తే ఇతర సముదాయ సభ్యులు తమ పరిధిలో అటువంటివారిని గుర్తించేందుకు, వికీమీడియా సముదాయాన్ని విస్తరించేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నాను:

  • జరిగినది- పద్యసౌందర్యం అని ఒక వాట్సాప్ సముదాయం ఉన్నదనీ, సామాన్యమైన వాట్సాప్ గ్రూపుల్లా కాక లక్ష్యశుద్ధితో చాలా సీరియస్ గా పనిచేస్తున్నారని తెలిసింది. వారంలో ఒక్కోరోజు ఒక్కో కావ్యం గురించి ఎంచుకుని (ఆంధ్ర మహాభారతం, శివభారతం వగైరాలు), ఆ కావ్యంలో ఈ పద్యం నుంచి ఈ పద్యం వరకూ ఈ వారం అని నిర్ణయించుకుని దాన్ని గురించి చర్చిస్తూ, వ్యాఖ్యానించుకుంటూ సాగుతూంటారు. ఎక్కడా సూత్రం చెడదు, సంబంధం లేని వ్యాఖ్యలు చేసినా, ఫార్వార్డ్ మెసేజీలు పంపినా తొలగిస్తారు. ఇలా 3 ఏళ్ళ నుంచి నడుపుతున్నారు. ఈ గ్రూపులో నేను చేరాకా కొద్దిరోజుల్లోనే వీరు మంచి వికీపీడియన్లు కాగలరని అర్థం చేసుకున్నాను. కొందరు ఆ గ్రూపులో వ్యాఖ్యాన రచనలు చేయడంలోనే తమ సమయాన్ని వెచ్చిస్తూన్నా, మిగిలిన ఆస్వాదిస్తున్నవారూ చక్కని సాహిత్యాసక్తి, భాష మీద పట్టు, తెలుగు టైప్ చేయగలిగి, సమయం నిర్వహించుకోవడం తెలిసి, తమవంతుగా భాషకి చేయగలిగినవారూ. సామాన్యంగా నాకున్న ఆసక్తిని అనుసరించి గ్రూపులో అప్పుడప్పుడు రాసేవాణ్ణి. ఈ క్రమంలో గత జూలైలో సారస్వత జ్యోత్స్న పేరిట పద్య సౌందర్యం గ్రూపు సభ్యులం ఓ కార్యక్రమం నిర్వహించుకుంటే కార్యక్రమంలో హాజరైనాను. మిగిలిన సభ్యుల్లాగే నచ్చిన పద్యాలు రెండు వినిపించాను, కార్యక్రమాన్ని ఆస్వాదించాను. ఐతే నిర్వాహకుల అనుమతి స్వీకరించి తెలుగు వికీపీడియా, వికీసోర్సు మొదలైన ప్రాజెక్టుల గురించి, వాటికి వీరు కృషిచేయవచ్చన్న విషయాన్ని కేవలం 5 నిమిషాల స్వల్ప వ్యవధిలో చెప్పి ఆసక్తి ఉన్నవారిని కాంటాక్ట్ చేయమన్నాను. జి.ఎస్.వి.ఎస్.మూర్తి గారు, రామేశం గారూ ముందుకువచ్చారు. హైదరాబాదులో తెలుగు వికీసోర్సు కార్యశాల నిర్వహించి పూర్తి వికీసోర్సు ప్రాసెస్ అంతా ప్రస్తుత సభ్యులకు వివరించే క్రమంలో వీరిని ఆహ్వానించాను. వారిద్దరూ కార్యక్రమానికి వచ్చి నేర్చుకున్నారు. ఆపైన మూర్తి గారి కోరిక మేరకు వారింట్లో వ్యక్తిగతంగా చిన్న శిక్షణ చేశాను. ఓ వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తూ దానిలో సభ్యులు వికీసోర్సు, వికీపీడియాల గురించే మాట్లాడుకునేలా నిర్వహిస్తున్నాం.
  • దీన్ని నమూనాగా- సాధారణ కార్యశాలల్లో పదుల సంఖ్యలో పాల్గొన్నవారికి వికీపీడియా గురించి నేర్పించినా వారిలో ఒకరిద్దరు మిగలడం అయినా కొద్ది కష్టమేనన్నది వాస్తవం. ఇది నేను వ్యక్తిగతంగానూ చూశాను. కానీ ఈ ఉదాహరణలో ఇద్దరినే ఆహ్వానిస్తే, ఇద్దరూ వచ్చి, ఇద్దరూ నేర్చుకుని, వికీమీడియన్లుగా మారడం ఎందుకు సాధ్యమైందన్న అంశాన్ని కొంత ఆలోచిస్తే - ప్రత్యేక ఆసక్తులు కలిగిన వ్యక్తులనే మనం దృష్టిపెట్టాలన్న విషయాన్ని గ్రహించాను. ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల్లో నిజంగా ఏదైనా ప్రొడక్టివ్ గా పనిచేస్తున్న గుంపులు కొన్ని ఉన్నాయి. ఈ గుంపులు కేవలం ఫార్వార్డ్ మెసేజిలతో పొద్దుపుచ్చవు. వీరికి ప్రత్యేకమైన లక్ష్యం ఉంటుంది, అలానే దాన్ని చేరుకునే క్రమంలో మనలానే స్వచ్ఛంద కృషి చేస్తూంటారు. కాబట్టి వారికి తమ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసు, అలానే స్వచ్ఛందంగా ఎందుకు రాయాలన్న ప్రశ్నే తలెత్తదు, కొంతవరకూ వేర్వేరు ప్రాజెక్టుల్లో రాయాల్సిన తీరు వేర్వేరుగా ఉంటుందనీ తెలుసు. కాబట్టి వీరు వికీపీడియన్లు అయ్యేందుకు మరింత అవకాశం ఉంటుంది. గతంలో నేను వాడుకరి:Katta Srinivasa Rao గారిని వికీపీడియాలో రాయమని ఆహ్వానించినప్పుడు కూడా నేనిదే గమనించాను. లక్ష్యశుద్ధితో హైదరాబాద్ చరిత్ర ఫేస్ బుక్ గ్రూపును నిర్వహిస్తున్న వ్యక్తి, అంతేకాక తను నమ్మిన అంశాలపై ఫేస్ బుక్ వేదికగా రాస్తున్నవారు. మరింత విభిన్నమైన, శాశ్వతమైన వేదికగా వికీపీడియాను చూపినప్పుడు, అలానే వికీపీడియన్ల ఉత్సాహం చూసినప్పుడు ఆయన క్రమంగా వికీపీడియన్ అయ్యారు. నేను దీన్ని కేవలం సోషల్ మీడియా పరిధి వరకే చెప్పట్లేదు, ప్రత్యేక ఆసక్తులు - ఫోటోగ్రఫీ ఇష్టమైన వాళ్ళు కావచ్చు, ప్రత్యేకించి ఒక నటుడి గురించి పాత ఫోటోలు, సినిమాల వివరాలు సేకరించి ఎక్కడో ఒకచోట పంచుకుంటున్నవారు కావచ్చు, లేదా సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్న గుంపులు కావచ్చు. లక్ష్యంతో పనిచేస్తూ, ఒక ఆసక్తిని పర్ష్యూ చేస్తున్నవారు ఉంటే వారిలో సమయం, ఆసక్తి ఉన్నవారిపై దృష్టిపెడితే మరింతమంది వికీపీడియన్లను చేర్చేందుకు అవకాశం ఉంటుందని నా నమ్మిక.

ఈ అంశంపై ఆసక్తి ఉన్న సహ సభ్యుల స్పందనను కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:33, 5 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అసఫ్ వికీటూల్స్ కార్యశాల ప్రశ్నావళి

మార్చు

అందరికీ నమస్కారం,
6, 7 తేదీల్లో నిర్వహించనున్న వికీడేటా సాంకేతిక కార్యశాలలో రెండవరోజైన 7వ తేదీన అసఫ్ వికీటూల్స్ కార్యశాల నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్యశాలకు సముదాయం అవసరాలు తెలుసుకునేందుకు గాను తను రూపొందించిన ఈ ప్రశ్నావళిని వికీమీడియన్లు నింపేందుకు వీలుగా రచ్చబండలో ప్రచురించమని అడిగారు. దయచేసి ప్రశ్నావళిని పూర్తిచేయమని ఆసక్తికలిగిన సభ్యులను కోరుతున్నారు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:23, 5 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మూసలు

మార్చు

తెవికీలో ఏ మూసలకు కూడా "మూత" (క్లోజ్) పడటం లేదు. ఈ విషయాన్ని వికీపీడియా:సహాయ కేంద్రం లో మే 28 2017ప్రసాద్ గారు సహాయం కోరి ఉన్నారు. ఇంతవరకు అది సరికాలేదు. దీనిని సరిచేసే మార్గాలను సభ్యులు పరిశీలించగలరు.----కె.వెంకటరమణచర్చ 14:12, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సమస్య సంబంధిత లూవా స్ర్కిప్టులను తాజాకరించడం ద్వారా పరిష్కారమైంది. --అర్జున (చర్చ) 06:56, 9 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అనేక రోజులుగా వికీలో కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కారం చేసినందులకు ధన్యవాదాలు.----కె.వెంకటరమణచర్చ 07:02, 9 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సెప్టెంబరు నెలలో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితా

మార్చు

సెప్టెంబరు 2017లో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 19:21, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు లింకు లేదండి.

మార్చు

మన తెలుగులో ఈ లింకు [2] పనిచేయడము లేదండి.JVRKPRASAD (చర్చ) 07:35, 10 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారూ, ఈ లింకును పరిశీలించండి.----కె.వెంకటరమణచర్చ 07:40, 10 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 08:05, 10 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రికార్డులు

మార్చు

ఒకరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు రికార్డులు అనేక రకాలుగా సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వికీ పెద్దలు కొన్ని ప్రతిపాదనలు చేసి, పాల్గొనే వారికి అభినందనలతో ప్రోత్సహించ వచ్చును. వికీకి కూడా మంచి పేరు వస్తుంది. JVRKPRASAD (చర్చ) 06:22, 12 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీలో ప్రపంచ రికార్డులు సాధించాలంటే వికీ పెద్దలు నియమ నిబంధనలు తెలియజేయండి:
  1. ఒకే నెలలో ఎన్ని అత్యధిక వ్యాసాలు వ్రాయాలి ?
  2. ఒక సంవత్సరంలో ఎన్ని అత్యధిక వ్యాసాలు వ్రాయాలి ?
  3. ఒక పీరియడ్ కాలంలో ఎన్ని అత్యధిక వ్యాసాలు వ్రాయాలి ?
  4. ఎవరైనా ఇలాంటివి ప్రతిపాదించండి, నేను రాబోయే కాలంలో అందరితో పాటుగా నావంతు ప్రయత్నము కూడా చేస్తాను.

దయచేసి తెలియజేయండి.JVRKPRASAD (చర్చ) 03:45, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రసాద్ గారూ నమస్తే. ఏ రికార్డు అయినా, అవార్డు అయినా సాధారణంగా దానికదే విలువ కలిగినది అవదు. దాని వెనుక కొంత తాత్త్వికత, అవసరం ఉంటాయి. ఆ అవసరాన్ని అనుసరించి రికార్డుకు విలువ ఏర్పడుతుంది. ఉదాహరణకు 100 వికీడేస్ అన్న ప్రయత్నాన్ని బల్గేరియన్ వికీపీడియన్ వాసియా అనే ఆవిడ ప్రారంభించారు. రోజుకొక వ్యాసం చొప్పున వంద రోజులు వంద వ్యాసాలు రాయడం, ఎక్కడైనా తప్పితే వైకుంఠపాళిలో పాము నోట పడినట్టు 1వ రోజుకు వచ్చేసినట్టే అన్నది ఈ ప్రయత్నం. దీనికి మరో పార్శ్వం ఉంది - ఆ విషయాన్ని ఫేస్ బుక్ కానీ మరేదైనా వికీయేతర సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పరిశీలిద్దాం. మొదట 100 రోజుల పాటు వంద వ్యాసాలు రాయడం అంటే ఒక వికీపీడియన్ కి ఛాలెంజింగ్ టాస్క్. రోజూ తను వికీపీడియాకి సమయం కేటాయించుకోగలరా అన్నది పరిశీలించుకోగలుగుతారు. సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం అన్నది పోటీతత్వాన్ని పెంచి ఇతరులను ఆహ్వానిస్తుంది. ఇదంతా దేనికి - వికీపీడియలో కొత్త వ్యాసాలు రావడానికి. ఇప్పటికే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడం ఈ ఛాలెంజిలో భాగం కాదు. మన వికీమీడియా ప్రపంచంలో వెయ్యి నుంచి పదివేల వ్యాసాలు ఉన్న వికీపీడియాలు ఎన్నో ఉన్నాయి. ఈ వికీపీడియాలకు ఓ వందరోజుల్లో వంద వ్యాసాలు చేరితే ఎంత మార్పో ఊహించండి. అలానే ఈ ఛాలెంజి ఊరుకోదు, వేరేవారిని లాగుతుంది. ఇంతేనా అంటే - ఆపైన ఆ వంద వ్యాసాలు ఎక్కువ కవర్ కాని లింగ, వర్గ, ప్రాంతాల మీద రాసే భేదాలతో విస్తరించేసింది. ఇలాంటి ఛాలెంజిని రూపకల్పన చేయడం, విస్తరించడం చాలా గొప్ప ఆలోచన. ఐతే అత్యధిక వ్యాసాలు రాయడం మాత్రమే రికార్డు కాదు, కాబట్టి ఏదైనా వినూత్నమైన ఆలోచన మాకు వస్తే తప్పకుండా పంచుకుంటాం. మీరు కూడా అటువంటి వినూత్నమైన, లోతైన ఛాలెంజ్, కృషి వంటివి ప్రతిపాదించండి. ఉదాహరణకు ఈ రెండు నియమాలను సాధించేదిగా ప్రయత్నించి చూద్దాం - ప్రస్తుతం తెలుగు వికీపీడియా ఎదుర్కొంటున్న నాణ్యత అన్న సమస్యను తొలగించేదిగా ఉండాలి, అలానే కొత్తవారు తెవికీలో రాయడానికి ప్రోత్సాహకరంగా ఉండాలి. అటువంటి ఛాలెంజ్ ఏదేని మనం ప్రారంభించి, ప్రపంచానికి బల్గేరియన్ వికీపీడియన్లలాగానే అందిస్తే మన సముదాయానికీ మంచి పేరు, మంచి ఫలితం. --పవన్ సంతోష్ (చర్చ) 16:17, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అవార్డులు

మార్చు

వాడుకరులకు ప్రోత్సాహం కొరకు వికీ పెద్దలు ప్రతి సంవత్సరము వివిధ అవార్డులు బార్న్ స్టార్స్ రూపంలో అయినా ఇవ్వవచ్చును. JVRKPRASAD (చర్చ) 11:52, 12 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కొలరావిపును పునరుద్ధరించి ఈ సారి ప్రణయ్‌రాజ్‌కు ప్రకటించాలి.--స్వరలాసిక (చర్చ) 01:48, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారు ఇక్కడ ప్రస్తావించిన రెండు విభాగాలనూ -రికార్డులు, అవార్డులు- కలిపి ఒకే దానిని చెయ్యవచ్చనుకుంటాను. ముందుగా దీన్ని ప్రస్తావించినందుకు ఆయనకు ధన్యవాదాలు. పెద్దలు ఏం చెబుతారో పక్కనబెట్టి, ఏయే రికార్డులను పరిశీలించవచ్చో చూద్దాం అని నేను ఆలోచిస్తే నాకు తట్టినవివి: తెలుగు వికీపీడియాకు ఇవ్వాళ కావలసినది నాణ్యత. అందుకనుణంగా మన రికార్డులు, వాటికి అవార్డులూ ఉండాలని నా అభిప్రాయం. నెలనెలా ఈ అవార్డులు ఇవ్వవచ్చు. అంశాలవారీగా నాణ్యతను పెంచవచ్చు. ప్రతీ అంశానికీ కొన్ని పాయింట్లు ఇస్తాం. వచ్చిన పాయింట్లకు అనుగుణంగా పతకాలో, స్టార్లో మరోటో ఇవ్వవచ్చు. __చదువరి (చర్చరచనలు) 07:48, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంపై నా ఆలోచనలు వికీపీడియా:నాణ్యతా మూల్యాంకనం పేజీలో చూడండి. అక్కడే మీ అభిప్రాయాలూ చెప్పండి. __చదువరి (చర్చరచనలు) 14:24, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రపంచ తెలుగు మహాసభల లో తెవికి

మార్చు

(రాజధాని హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు.) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించ నున్నది. ఈ సందర్బంగా మన తెవికి ప్రస్తావన ఆ వేదిక పైకి తీసుక రావడానికి ప్రయత్నము చేయగలందులకు తెవికి అధి కారులకు విన్నపము. అదే విదంగా తెవికిలో విశేష కృషి చేసిన ఇద్దరి ముగ్గరికి, ఆ వేధికపై సన్మానము గాని, ప్రశంసాపత్రము గాని అందజేయడానికి కృషి చేయాలి. దీనికి ధనము అవసరమయ్యే పక్షములో వికిమీడియా వారికి వ్రాసి తెప్పించు కోవచ్చు. దీనివల్ల తెలుగు వికీపీడియా గురించి అనేక మంది తెలుగు వారికి అవగాహన కలుగుతుందని నా నమ్మకం. ఈ విషయమై తెవికి పెద్దలు ఆలోచించి ఇంకేమైనా ఈ సందర్బంగా చేపట్ట దగిన కార్య క్రమాలు వుంటే వాటికి రూపకల్పన చేయవచ్చు. ఎలాగైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెవికి అభి వృద్ధికి కృషి చేయగలరని విన్నపము. Bhaskaranaidu (చర్చ) 05:25, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భాస్కరనాయుడు గారూ, తెలంగాణ ప్రభుత్వం తలపెట్టే ప్రపంచ తెలుగు మహాసభల గురించి మీరు ప్రస్తావిస్తున్నారని భావిస్తున్నాను. అలా అయితే శీర్షిక పేరు మార్చగలరు. ఈ అంశాన్ని తెలుగు వికీపీడియా వైపు నుంచి, సముదాయంలో ప్రతిపాదించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ విషయంపై ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగంతో, భాషా సాంస్కృతిక విభాగంతో చర్చిద్దాం. తెలుగు వికీపీడియా సముదాయంతో చర్చల అనంతరం బయటకి వచ్చే కొన్ని అంశాల ప్రతిపాదనను వీలైనంతమంది వికీపీడియన్లు ప్రభుత్వంలో సంబంధిత అధికారుల ద్వారా కలిసి సమర్పిద్దాం. ప్రస్తుతం వారు కూడా మనముందు ఉంచుతున్న ప్రతిపాదనల్లో డిజిటల్ తెలుగుకు ఇచ్చే స్లాట్ లో తెలుగులో జరుగుతున్న డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా తెలుగు వికీపీడియాను గురించి వివరించడం, ఈ మహాసభల్లో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహించడం ఒకటి. అలానే మీరన్న ప్రతిపాదనలకు తెలుగు వికీపీడియా సముదాయానికి అంగీకారమైతే ప్రభుత్వం సుముఖంగా ఉంటుందనే భావిస్తున్నాను. వీటికి తోడు వ్యక్తిగతంగా నా ప్రతిపాదనలు ఇవి:
  • సాధారణంగా ఇప్పటివరకూ జరిగిన అన్ని ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ తెలుగు భాషా, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాల ప్రచురణ జరిగింది. ఈసారి తెలుగు వికీపీడియా ఆరంభ-వికాసాలు, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులు-భాషా సేవకు ఆధునిక మార్గం అన్న రెండు అంశాలపై పుస్తకాలను రాసేట్టు, వారు ప్రచురించి స్వేచ్ఛా నకలు హక్కుల్లో ప్రచురించేట్టు కోరుదాం.
  • ఈ సందర్భంగా ప్రచురించే పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో ప్రచురించమని, అలానే యూనీకోడ్ వెర్షన్ విడుదల చేయమని - ఈ విధంగా విడుదల చేస్తే తెలుగు ఆధునిక భాషగా అభివృద్ధి చేయడంలో కీలకమైన మలుపును ప్రభుత్వం సమర్థించినట్టు అవుతుందని, ఇది దేశంలోని ఇతర భాషా సముదాయాలకు నేరుగా మార్గదర్శకమవుతుందని ప్రతిపాదిద్దాం.
  • డిజిటల్ గా తెలుగు భాష అభివృద్ధి అవడానికి తమిళ వర్చ్యువల్ అకాడమీలాగా తెలుగు వర్చ్యువల్ అకాడమీ, కానీ తెలంగాణ వర్చ్యువల్ అకాడమీ కానీ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించమని, ఈ అంశంపై ప్రభుత్వానికి ఆసక్తి ఉండి చేసేట్టయితే వేదికపై ప్రకటించమని కోరుదాం.
  • తెలుగు భాషలో మనకు మంచి మూలాలు, ఆకరాలు దొరకాలంటే కేవలం స్కానింగ్ చేస్తే సరిపోదు, స్కాన్ అయిన పత్రికలను యూనీకోడ్ లో ఏ పేజీలో ఏముందో తెలిపేలా ఇండెక్స్ చేయడం తర్వాతి ముందడుగు, పుస్తకాన్ని పుస్తకంగా పూర్తి యూనీకోడీకరించడం చివరి దశ. ప్రభుత్వాలు, అకాడమీలు భారీస్థాయిలో స్కానింగ్ పై దృష్టిపెట్టాయి, మిగతా రెండు దశలకు కూడా ప్రత్యేకించి ప్రాజెక్టులు అనౌన్స్ చేయమని, నిధులు అందించడమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తుచేయవచ్చు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో కనీసం మండలానికి ఒకటి డిజిటల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేసేందుకు కమిటీ వేయమని, అక్కడ ఇ-పుస్తకాలు, ఇ-పత్రికలు భాండాగారంగా ఉంచడం, డిజిటైజేషన్, ప్రజలకు అంతర్జాలంలో తెలుగుపై అవగాహన, వంటి అనేక కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా ఉపకరిస్తుంది. ఈ మలుపు మొత్తం తెలంగాణలో తెలుగు భాష, అంతర్జాల వ్యాప్తిని మలుపుతిప్పే అడుగు అవుతందని నా నమ్మిక. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ కమిటీ వేయమని కోరవచ్చు.

దయచేసి ఇతర సభ్యులు తెలుగులో స్వేచ్ఛా విజ్ఞానం అభివృద్ధి చేయడంలోనూ, తెలుగును ఆధునిక భాషగా అభివృద్ధి చేయడంలోనూ వికీపీడియన్లుగా మనం కోరదగ్గ అంశాలను వాటి ప్రాధాన్యతను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఈ ప్రతిపాదన 10 కీలకమైన అంశాలకు పరిమితం అయితే మెరుగని నా అభిప్రాయం. అందులో 5 నేరుగా తెలుగు వికీపీడియాకు సంబంధించినవి, మిగతా అయిదు డిజిటల్ తెలుగును వృద్ధి చేసి దీర్ఘకాలికంగా వికీపీడియాను వ్యూహాత్మకంగా మలుపుతిప్పేవి అయితే బావుంటుంది. ఈ ప్రతిపాదనల ప్రాధాన్యతపై కూడా మనం చర్చించి పదింటిని ఎంపిక చేసి, వారివద్దకు వెళ్దాం. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

- మంచి ఆలోచన ...... అలాగే కానీయండి. Bhaskaranaidu (చర్చ) 08:51, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Bhaskaranaidu గారూ, ఈ ప్రస్తావన తెచ్చినండుకు ధన్యవాదాలు. వికీపీడియా అభివృద్ధి కోసం మనకు వచ్చిన ఒక చక్కటి అవకాశం. నా ఆలోచనలు కొన్ని ఇక్కడ:
తెలుగు అభివృద్ధి కోసం: ఇవ్వాళ ప్రకటించిన "ఇంటరు దాకా తెలుగు బోధన" ఒక ముందడుగు. మరి కొన్ని:
  1. "తెలుగులోనే పరిపాలన"ను నిరంకుశంగా అమలు చెయ్యాలి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలన్నీ తెలుగులోనే ఉండాలి.
  2. ఆధునిక నిఘంటువును, పదకోశాన్నీ నిర్మించాలి. ఎప్పటికప్పుడు దీన్ని విస్తారిస్తూ/సవరిస్తూండాలి. వీటిని బడుల్లోను, ప్రభుత్వ కార్యకాలాపాల్లోనూ వాడాలి. జాలంలో వీటిని ఉచితంగా అందుబాటులో ఉంచాలి.
  3. అంతర్జాలంలోను, సాంప్రదాయికంగానూ తెలుగులో ప్రచురితమైన ఉత్తమ కంటెంటుకు వార్షిక పురస్కారాలు ఇవ్వాలి.
  4. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ వెబ్‌సైటు కూడా తెలుగులో ఉండడమే కాకుండా, వాటిలో తెలుగులో రాసేందుకు వికీపీడియా వంటి ఇంటరుఫేసు ఉండాలి. వీటిలో నిఘంటువును ఇముడ్చాలి
  5. సెర్చి ఇంజన్లు, సామాజిక వెబ్‌సైట్లు, వగైరాలు కూడా తెలుగులో ఉండేందుకు, వీటిలో నిఘంటువును ఇమిడ్చేందుకూ అవసరమైన సాంకేతిక సహాయం, వత్తిడీ ప్రభుత్వం తరపున చెయ్యాలి.
  6. మొబైళ్ళలో తెలుగు రాసేందుకు అనుకూలమైన ఇంటరుఫేసు ఉండాలి. అలాంటి మొబైళ్ళకు ప్రోత్సాహకాలుండాలి.
వీటిని సానుకూలం చేసేందుకు ప్రభుత్వం ఒక సంస్థనో మరోటో ఏర్పాటు చెయ్యాలి. __చదువరి (చర్చరచనలు) 08:54, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ విషయమై నేడు తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ను కలిసినప్పుడు ప్రస్తావించాను. వచ్చేవారం రౌండ్ టేబుల్ సమావేశం వంటిది డిజిటల్ తెలుగు వైపు నుంచి పలు సంస్థలు, ఉద్యమాలు, ప్రాజెక్టుల ప్రతినిధులూ, తెలుగు మహాసభల నిర్వాహకులతో ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మన నుంచి ప్రతిపాదనలు మౌలికంగా తెలియజేసే అవకాశం ఉంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:49, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా వ్యాప్తి కోసం

మార్చు

వికీపీడియా వ్యాప్తి కోసం ప్రభుత్వం నేరుగా చేసేదాని కంటే, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులూ చేసేది ఎక్కువగా ఉంటుందని నా భావన. ప్రభుత్వం చేసే పనులు మౌలిక స్థాయిలో ఉండి, వికీపీడియా అభివృద్ధికి పరోక్షంగా దోహదపడతాయి. ప్రభుత్వేతర సంస్థలు నేరుగా చెయ్యగల పనులు, ఇప్పటికిప్పుడు నాకు తోచినవి ఇక్కడ రాస్తున్నాను. వీటిని సాధించేందుకు మనం కృషి చెయ్యాల్సి ఉంటుంది.

  1. వార్తాపత్రికల్లో గ్రంథ సమీక్ష లాగా ఆదివారం నాడు ఒక చిన్న (10 సిసి) వార్త, "ఈ వారం వికీ వ్యాసం" అని వేస్తారు. మనం కొన్ని వ్యాసాల జాబితాను వాళ్ళకిస్తాం. వాటిలో తమకు నచ్చిన దాన్ని వేస్తారు. టీవీల్లో కూడా వెయ్యొచ్చేమో పరిశీలించవచ్చు.
  2. తెవికీ పుట్టుక, ఎదుగుదల, ప్రస్తుత స్థాయి, భవిష్యత్తు అంచనాలు మొదలైన వాటి మీద ఎవరైనా పరిశోధన చేస్తారేమో చూడాలి. తగు సమాచారమిచ్చి మనం అందుకు సహకరిస్తాం. ఇది నేరుగా ఉపకరించదుగానీ, మనకు పనికొస్తుంది.
  3. ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల పత్రికలుంటాయి -ఉపాధ్యాయులకు, విద్యుదుద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకూ.. ఇలాగ. ఈ పత్రికల్లో వికీపీడియా గురించి ఓ కాలమ్‌ రాయమనవచ్చు.
  4. సంస్థలు తమ అడ్రసు చెప్పుకుంటూంటారు కదా.. తమ ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలు ఫలానా అని. అలాగే మా వికీ పేజీ ఇది అని రాసుకోవచ్చు.

__చదువరి (చర్చరచనలు) 09:03, 13 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ మీ ఆలోచనల్లో మొదట మొదటి అంశం గురించి నా వంతు:
  1. మీ మొదటి సూచన విషయమై తెలుగు వెలుగు పత్రికవారు సహకరించేందుకు అవకాశం ఉంది. కాకపోతే వికీపీడియా వ్యాసం గురించి కాదు ఉద్యమం గురించి చేయడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. వారితో ఉన్న సమస్య ఏమిటంటే - ప్రతీ నెల వికీపీడియాలో జరుగుతున్నవాటి గురించి, జరగాల్సినవాటి గురించి వ్రాయడానికి సిద్ధమే, కాకుంటే శీర్షిక పెట్టరు, ఒకరే రచయిత ఉండడానికి వీలుకాదు. రాయడానికి ఆసక్తి, శక్తి ఉన్నవారు మనలో కొందరు జరుగుతున్న ప్రాజెక్టులు, జరిగిన కృషి, విశిష్టమైన కృషిచేసిన తెవికీపీడియన్లు, ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియన్ల కృషి వంటి వివిధమైన అంశాలను వేర్వేరు వ్యాసాలుగా రాస్తే వీలువెంబడి వేసుకుంటారు. వీరికి 50 వేలకు పైగా సర్క్యులేషన్ ఉంది - షెల్ఫ్ లైఫ్ లెక్కేసుకుంటే 3 లక్షల మందికి చేరడం ఆశ్చర్యకరం కాదు.
  2. ఇక మీరు చెప్పిన ఆలోచనను అలాగే తీసుకుని వేయగలిగినవారు - అమ్మనుడి పత్రికవారు. వీరు కూడా తత్త్వత: తెలుగు భాషోద్యమ పత్రిక వారు కాబట్టి మనల్ని నేరుగా సమర్థిస్తున్నారు.
  3. ఇటీవల మన మూర్తి గారు తెవికీసోర్సులో చిన్ననాటి ముచ్చట్లు పుస్తకాన్ని పూర్తిచేస్తూ పుస్తకంలోని విశేషాలు ఫేస్ బుక్లో రాస్తూ ఊరిస్తున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని నేను వారిని పుస్తకంలోని విశేషాలను, పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకున్నారన్న వివరాలను, ఎప్పుడు ప్రారంభించి, ఎలా ఆస్వాదించి ఎలా పూర్తిచేశారన్న అంశాలను కూడా కలిపి రాస్తే పుస్తకం.నెట్ వంటి ఆన్లైన్ పత్రికకు పంపవచ్చని సూచించాను. ఆయన రాస్తున్నారు. ఇవే కాదు మనం ఏవైనా ప్రాజెక్టులు, ఎడిటథాన్లకు సహకరించమని కోరుతూ రాసినా వారు ప్రచురించేందుకు సిద్ధమే. (గతంలో నేను రాసినవి పబ్లిష్ అయినాయి, అదృష్టవశాత్తూ నిడదవోలు మాలతిగారు అలాంటి ఓ ప్రకటనకు స్పందనగా కొన్నాళ్ళు తెవికీలో సచేతనమై రాశారు. అలాగే నేను చేసిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు రిపోర్టు పబ్లిష్ చేశాను.)
  4. మిగిలిన పత్రికల విషయమై నేను ప్రయత్నించి చెప్తాను.
ఏతావతా నేను చెప్పేదేమంటే వాళ్ళు చేయడానికి సిద్ధమే. మనవాళ్ళు తలో చేయి వెయ్యగలిగితే బావుంటుంది, కనీసం ముగ్గురు నలుగురు అప్పుడప్పుడూ రాస్తూవుంటే బావుంటుంది. నేను సమన్వయ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:29, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  1. పత్రికలకు వికీ గురించి వ్రాయడానికి అవసరమైన నావంతు కృషి చేస్తాను.T.sujatha (చర్చ) 16:44, 14 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
  2. పత్రికలకు వికీ గురించి వ్రాయడానికి అవసరమైన నావంతు కూడా తప్పకుండా కృషి చేస్తాను. JVRKPRASAD (చర్చ) 03:22, 16 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మార్చు
 

Greeting, on behalf of Wikimedia India, I, Krishna Chaitanya Velaga from the Executive Committee, introduce you to the Featured Wikimedian of the Month for September 2017, Swapnil Karambelkar.

Swapnil Karambelkar is one of the most active Wikimedians from the Hindi community. Swapnil hails from Bhopal, Madhya Pradesh, and by profession a Mechanical Engineering, who runs his own firm based on factory automation and education. Swapnil joined Wikipedia in August 2016, through "Wiki Loves Monuments". He initially started off with uploading images to Commons and then moved onto Hindi Wikipedia, contributing to culture and military topics. He also contributes to Hindi Wikibooks and Wikiversity. Soon after, he got extensively involved in various outreach activities. He co-organized "Hindi Wiki Conference" in January 2017, at Bhopal. He delivered various lectures on Wikimedia movement in various institutions like Atal Bihari Hindi University, Sanskrit Sansthanam and NIT Bhopal. Along with Suyash Dwivedi, Swapnil co-organized the first ever regular GLAM project in India at National Museum of Natural Heritage, Bhopal. Swapnil is an account creator on Hindi Wikipedia and is an admin on the beta version on Wikiversity. Swapnil has been instrumental in establishing the first Indic language version of Wikiversity, the Hindi Wikiversity. As asked regarding his motivation to contribute to the Wikimedia movement, Swapnil says, "It is the realization that though there is abundance of knowledge around us, but it is yet untapped and not documented".

గుంటూరులో నవ్యాంధ్ర పుస్తక సంబరాలు - తెలుగు వికీపీడియా స్టాల్ ప్రతిపాదన

మార్చు

అందరికీ నమస్కారం,
ఎన్టీఆర్ ట్రస్టు-విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్తంగా గుంటూరులో 2017 సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 తేదీ వరకూ పుస్తక సంబరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు స్టాల్స్ లో ఒకదానిలో వికీపీడియా స్టాల్ నిర్వహించేందుకు అవకాశం ఉంది. కనుక వికీపీడియా వాలంటీర్లు పుస్తక సంబరాలు సాగే రోజుల్లో కొద్ది రోజులు నిర్వహించేందుకు ఆసక్తి ఉంటే తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:31, 17 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామ వ్యాసాల్లో ఫోటోల కోసం ఫోటో కాంపిటీషన్ ప్రతిపాదన

మార్చు

అందరికీ నమస్కారం,
గత కొన్నేళ్ళుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల వ్యాసాల్లో ఫోటోల కోసం సముదాయం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం వాడుకరి:Bhaskaranaidu, వాడుకరి:Nrgullapalli స్వంత ఖర్చులపై కొన్ని గ్రామాలు పర్యటించి ఫోటోలు తీయడం కూడా జరిగింది. గతంలో పోటీలకు, ఇతర ప్రోగ్రామేటిక్ కార్యలాపాలకు కూడా ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో దీని కోసం ఒక ఫోటో కాంపిటేషన్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలించాల్సిందిగా సముదాయాన్ని కోరుతున్నాను:

  1. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు చేసే ఫోటో కాంపిటీషన్ ఒకే సమయంలో ప్రారంభించి, ఒకే సమయంలో పూర్తిచేస్తాం. అయితే పోటీలు వేర్వేరుగా నిర్వహించి, తెలంగాణ గ్రామాల్లో చేర్చే ఫోటోలకు, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో చేర్చే ఫోటోలకు విడివిడిగా బహుమతులు ప్రకటిస్తాం. ఈ ప్రయత్నం దేనికంటే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల్లో సంబంధిత శాఖలను మనం చేరుకుని కార్యక్రమాలకు వారి భాగస్వామ్యాన్ని స్వీకరించడానికి ప్రధానంగా ఇది ఉపకరిస్తుంది.
  2. ప్రథమ బహుమతులు రెండు విధాలుగా ఉంటాయి - ఒకటి నాణ్యమైన, అందమైన ఉత్తమ చిత్రానికి, రెండు అనేక గ్రామాల వ్యాసాల్లో ఫోటోలు తీసి, చేర్చినందుకు ఉత్తమ కృషికి. ఒక బహుమతి నైపుణ్యానికి అవుతుంది, రెండోది ఎన్ని గ్రామాల వ్యాసాలకు, ఎన్ని ఫోటోలు లేని వ్యాసాలకు, ఎంత విస్తారంగా కృషిచేశారన్న అంశంపై క్వాంటిటేటివ్ గా ఉంటుంది.
  3. ఉత్తమ కృషి చేసినవారికి వచ్చే సంవత్సరం నిర్వహించే వికీ కాన్ఫరెన్స్ ఇండియా 2018 లేదా అటువంటి ప్రతిష్టాత్మకమైన వికీమీడియా కాన్ఫరెన్సుకు స్పాన్సర్షిప్ బహుమతిగా ప్రకటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. (వికీ లవ్స్ మాన్యుమెంట్స్ లో మొదటి బహుమతి వికీమానియా స్కాలర్ షిప్ ఇస్తారు, ఇది మంచి పద్ధతి. తద్వారా ఉత్తమ కృషి చేసినవారు వాలంటీర్లుగా కొనసాగేందుకు ఉపకరిస్తుందని) ఇతర బహుమతుల్లో కూడా క్యాష్ ప్రైజులు లేకుండా వీలైతే లెన్సులు కానీ, వికీపీడియా బ్యాగులు, టీషర్టులు వంటివి ఉండేలా ప్రయత్నించడం బావుంటుందనుకుంటున్నాను.
  4. ఈ ప్రయత్నం ప్రజల్లోకి వెళ్ళేందుకు సంప్రదాయికంగా పత్రికలు, మీడియా, సోషల్ మీడియా వంటివి ఉపయోగించుకుంటూనే వస్తున్న పుస్తక సంబరాల్లో స్టాల్స్ వంటివాటి ద్వారానూ, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు నిర్వహిస్తున్న కార్యశాలల్లో వీటి గురించి తెలియజేయడం, వంటివాటితో పాటుగా రెవెన్యూ అధికారుల రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, స్కూలు టీచర్ల శిక్షణా తరగతులు వంటివాటి ద్వారా ప్రత్యేకించి గ్రామ స్థాయిలో పనిచేసే రూట్స్ కలిగిన ఉద్యోగులకు పోటీపై అవగాహన కల్పించడం చేయొచ్చు.
  5. పోటీ డిసెంబరు నెలవ్యాప్తంగా, జనవరి మధ్య వరకూ చేస్తే బావుంటుందని భావిస్తున్నాను.

గత దశాబ్దిగా అభివృద్ధి చేస్తున్న గ్రామ వ్యాసాల్లోకి సమాచారం చేర్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నందున వ్యాసం నాణ్యత, లోతు పెంచేందుకు ఫోటోలు చేర్చే కార్యక్రమం చేపడితే బావుంటుందని భావిస్తున్నాను. సముదాయ సభ్యులు తమ తమ సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:52, 17 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]


మంచి ఆలోచన. ఫోటోల చేర్పుతో గ్రామ వ్యాసాలకు ఒక నిండుతనం, పరిపూర్ణత రాగలదు. అదేవిధంగా ఫోటోలు ఏ గడువు లోపల తీసినవై వుండాలనే విషయాన్ని చేర్చండి. అలాగే ఎటువంటి ఫోటోలు తీయాలి అనే విషయాన్ని కూడ నిర్దారించండి. ఉదా: ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆలయాలు, ప్రముఖ చారిత్రిక ప్రదేశాలు, మొదలగు నవి Bhaskaranaidu (చర్చ) 12:21, 17 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా సంతోషం.JVRKPRASAD (చర్చ) 12:45, 17 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
జేవీఆర్కే ప్రసాద్ గారూ ప్రస్తుతం చర్చ ప్రారంభమైంది. సముదాయ సభ్యులు చర్చలో పాల్గొనడం ప్రారంభమైంది. కాబట్టి మిగిలిన వివరాలు చర్చలో భాగంగా ఏర్పడుతూ ఉంటాయి. దయచేసి గమనించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:02, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 06:18, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

RfC regarding "Interlinking of accounts involved with paid editing to decrease impersonation"

మార్చు

There is currently a RfC open on Meta regarding "requiring those involved with paid editing on Wikipedia to link on their user page to all other active accounts through which they advertise paid Wikipedia editing business."

Note this is to apply to Wikipedia and not necessarily other sister projects, this is only to apply to websites where people are specifically advertising that they will edit Wikipedia for pay and not any other personal, professional, or social media accounts a person may have.

Please comment on meta. Thanks. Send on behalf of User:Doc James.

MediaWiki message delivery (చర్చ) 2:06, 17 సెప్టెంబరు 2017 (UTC)

దయచేసి తెలుగులో అనువదించి తెలియజేయగలరు.JVRKPRASAD (చర్చ) 11:34, 18 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగులో రాయడంలో ఇబ్బంది

మార్చు

పేజీ ఎడిట్ పెట్టెలో (విజువల్ ఎడిటరులో కూడా) తెలుగులో రాయడానికి సమస్య ఎదురైంది. కీని నొక్కగానే తెలుగు అక్షరంతో పాటు ఇంగ్లీషు అక్షరం కూడా పడుతోంది. "తెలుగు" అని రాయబోతే త్tఎeల్lఉuగ్gఉu అని రాస్తోంది. లిప్యంతరీకరణ, ఇన్‌స్క్రిప్ట్ రెండింటిలోనూ ఈ సమస్య ఉంది. వెతుకు పెట్టెలో ఆ సమస్య లేదు. వికీడేటా, వికీసోర్సులలోనూ ఈ సమస్య లేదు. అందరికీ ఇలాగే ఉందా?__చదువరి (చర్చరచనలు) 00:20, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కూడా ఇదే సమస్య ఎదురౌతోంది ఒక వారం రోజులనుండి ఏమిచేయాలోతెలియక పొరపాట్లు దిద్దుట ఆపవలసివచ్చింది --Nrgullapalli (చర్చ) 01:13, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అవును నాకూ విజువల్ ఎడిటర్ తో ఈ సమస్య వస్తోంది. నా బ్రౌజర్లో ఏదో సమస్య అనుకుని ప్రస్తుతానికి సోర్సు ఎడిటర్ నే వాడుతున్నాను. చూడబోతే విజువల్ ఎడిటర్ లో కొత్తగా చేసే మార్పుల్లో భాగంగా ఈ సమస్యను సృష్టించినట్లనిపిస్తుంది. --రవిచంద్ర (చర్చ) 01:52, 19 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నేను దీన్ని విజువల్ ఎడిటరు ఫీడ్‌బ్యాక్‌లో రిపోర్టు చేసాను. మిగతా భాషల్లో కూడా ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. కన్నడిగులు మొన్ననే ఫాబ్రికేటరులో రిపోర్టు చేసారు. పరిష్కారం కోసం ఎదురుచూద్దాం. __చదువరి (చర్చరచనలు) 16:12, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలండీ. ఎక్కడ నివేదించాలో తెలీక నేను ఊరకనే ఉన్నాను. --రవిచంద్ర (చర్చ) 16:17, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
సమస్యను పరిష్కరించారు. కానీ దీన్ని లైవుసైటులో అమలు చేసేందుకు మరో రెండ్రోజులు సమయం పడుతుందట.__చదువరి (చర్చరచనలు) 14:54, 12 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పరిష్కారాన్ని అమలు చేసినట్లున్నారు. ఎడిటరు ఇపుడు బాగానే పనిచేస్తోంది.__చదువరి (చర్చరచనలు) 02:10, 13 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Discussion on synced reading lists

మార్చు

CKoerner (WMF) (talk) 20:35, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు

మార్చు

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో రెండు తొలగింపు చర్చలు వారానికి పైబడి ఉన్నాయి. చర్చలో పాల్గొనని నిర్వాహకులెవరైనా నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని ముగించాల్సిందిగా మనవి. __చదువరి (చర్చరచనలు) 10:48, 23 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి తొలగింపు వికీనిర్వాహకులే చేయగలరు కాబట్టి వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో తెలియ చేయటం మంచిది. అలాగే ఇటువంటి వ్యాసాలకు తగిన లింకులు చర్చలలో ఇవ్వడం ద్వారా త్వరితంగా స్పందన పొందకలుగుతారు. --అర్జున (చర్చ) 11:48, 24 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ,
  1. నేను లింకు ఇచ్చాను. తొలగించాల్సిన వ్యాసాలు ఆ పేజీలోనే ఉన్నాయి. మీరసలు ఆ పేజీ చూసినట్టులేదు.
  2. రచ్చబండను చూసినట్టు ఇతర పేజీలను చూడడం లేదు. దీనికున్న ప్రాముఖ్యత వాటికి ఇవ్వడం లేదు మనం. మీరిక్కడ సమాధానం రాయడం ఒక ఉదాహరణ. ఆ రాసిన సమాధానం కూడా అందుకు ఉదాహరణే!__చదువరి (చర్చరచనలు) 17:20, 24 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి నా వ్యాఖ్య పూర్తి వివరాన్ని ఇవ్వనట్లుంది. నేనంటున్నది లింకు గురించి. ఇక నిర్వాహకులనుండి స్పందనలేకపోతే వారి వాడుకరి పేరులను ఉటంకించి సందేశం ఇవ్వవచ్చు. నా సమాధానం ఇక్కడ రాయటం మీ వ్యాఖ్య ఇక్కడ వున్నందున అని గమనించండి.--అర్జున (చర్చ) 06:07, 29 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బీజపూర్

మార్చు

"బీజపూర్" అనే పదానికి సరి అయిన పేరు సూచింఛగలరు. ప్రస్తుతం " బిజాపూర్ ", " బీజపూరు ", " బీజాపూర్ ", " బిజాపూరు " మరియు " బీజాపూరు " ఇలా అనేక రకముల పేర్లు వాడుతున్నారు. దయచేసి ఒక పేరు స్థిరపరచగలరు.JVRKPRASAD (చర్చ) 03:29, 28 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

బిజాపూర్ సరైన పదం. విజాపురకు అది రూపాంతరం.--స్వరలాసిక (చర్చ) 10:44, 28 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గాలు, వర్గీకరణలు

మార్చు

తెవికీలో ఉన్న ప్రతి వ్యాసానికీ కొన్ని వర్గాలు చేరుస్తున్నాము. ఇంగ్లీషు వికీపీడియాతో పోలిస్తే ఒక్కో వ్యాసానికి ఉన్న వర్గాలు చాలా తక్కువ. 5 అంతకన్న తక్కువ వర్గాలున్న వ్యాసాలను, అసలు ఏ వర్గాలు చేర్చని వ్యాసాలను గుర్తించి వాటికి సరైన వర్గాలను కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ చేర్చవలసి వుంటుంది.

ఇకపోతే ప్రస్తుతం తెవికీలో 26000 పై చిలుకు వర్గాలు ఉన్నాయి. వీటిలో 60 శాతం అసలు వర్గాల పేజీ సృష్టించబడలేదు. (ఎర్రలింకులు కనిపిస్తున్నాయి) చాలా వర్గాలలో 1 అంశం, 0 అంశాలు ఉన్నాయి. కనీసం 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాలు లేని వర్గాలు అర్థరహితం. కాబట్టి ఉత్సాహం కల సభ్యులు ఈ వర్గాలపై దృష్టి పెట్టి ఏకరూప్యత కలిగిన వర్గాలను మిళితం చేయడంగానీ, అవసరం లేదు అనిపించిన వర్గాలను తొలగించడం కానీ చేసి ప్రతి వ్యాసానికి సంబంధించిన వర్గాలను చేర్చడం తద్వారా వ్యాసాల నాణ్యత పెంచడానికి కృషి చేయగలరు. ఈ విషయంపై సభ్యుల అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు. --స్వరలాసిక (చర్చ) 15:19, 28 సెప్టెంబరు 2017 (U

గ్రామాల వ్యాసాల పేర్లు సవరణ గురించి.

మార్చు

అందరికి నమస్కారం. నిర్వాహకులకు ఒక మనవి. ఈ గ్రామాలు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందినవి.

  1. అయ్యన్నపాలెం (బోళ్లపల్లి మండలం)
  2. గరికపాడు (బోళ్లపల్లి మండలం)
  3. వెల్లటూరు(బోళ్లపల్లి మండలం)

గ్రామాల పేర్లు సరిగానే ఉన్నవి.కానీ మండలం పేరు బొల్లాపల్లి.(Bollapalli). మండలం పేరు సవరించవలసి ఉంది.

  1. అలాగే బొల్లాపల్లి (గుంటూరు జిల్లా) వ్యాసంలో గుంటూరు జిల్లా మూసలో,మరియు మండలాల మూసలో బొల్లాపల్లి పై క్లిక్ చేయగా ప్రకాశం జిల్లా లో బొల్లాపల్లి అనే మరొక పేరుతో ఉన్న గ్రామానికి లంకె కలుపబడింది.
ఈ లంకెను సవరించవలసి ఉంది.తగిన చర్యలు నిర్వాహకులు తీసుకొనగలరు.

--యర్రా (చర్చ) 11:15, 2 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారూ, నమస్తే. మీరు అడిగిన సహకారాన్ని ఇలా రెండుగా విభజిస్తున్నాను. ఐతే ఒక పేజీకి మార్పు చేశాను, మిగతావి ఎలా చేయాలో మీకిప్పుడు వివరిస్తాను.

  1. అయ్యన్నపాలెం, గరికపాడు, వెల్లటూరు గుంటూరుజిల్లాలోని బొల్లాపల్లి (గుంటూరు జిల్లా) అన్న మండలానికి చెందినవి. గ్రామ వ్యాసంలోని వివరాలు కూడా దీనిని గుంటూరు జిల్లా బొల్లేపల్లి మండలంలోని గ్రామాలగానే గుర్తిస్తున్నాయి. కానీ వ్యాసం పేరులో బ్రాకెట్లో బొల్లాపల్లి బదులు బోళ్ళపల్లి అని అక్షరదోషం ఉండడం వల్ల ఇదొక అయోమయానికి కారణమవుతోంది అని మీరు గుర్తించారు. ఈ నేపథ్యంలో నేను చేసిన ఈ మార్పు గమనించండి. వ్యాసం పేరును సరైన పేరుకు ఎవరైనా మార్పు చేయవచ్చు, దానికి నిర్వాహకులే అయివుండనక్కరలేదు. (ఒకవేళ ఇప్పటికే మీరు ఎంచుకున్న పేరుతో వ్యాసం ఉంటే తప్ప, ఇక్కడ మనకు ఆ సమస్య లేదు) కాబట్టి వ్యాసంలో చరిత్రను చూడండి, నక్షత్రం గుర్తు పక్కన "మరిన్ని" అని ఉంటుంది, దానిపై నొక్కండి. ఆపైన అక్కడ తరలింపు అన్న బటన్ నొక్కాల్సివుంటుంది. ఆ తరలింపు బటన్ వల్ల వచ్చే ఫాం నింపేప్పుడు, మీరు సరైన పేరును కొత్తపేరు అన్నదగ్గర నింపి, కారణంలో కారణం తెలిపి తరలించవచ్చు. నేను ఇప్పటికే గరికపాడు తరలించాను. మిగిలినవి మీరు ప్రయత్నించి చూడండి. ఇప్పటికే ఎన్నో పేజీల్లో ఈ పేరుతో లింకులు ఉన్నందున (తప్పుడు పేరైనా, ఆ పేజీల్లో దిద్దుకునేంతవరకూ) దారిమార్పు ఉంచమన్న ఆప్షన్ టిక్ కొట్టండి. ఇక్కడ ఏ చర్చ జరిగిందో తెలిసేందుకు చర్చ పేజీని తరలించే ఆప్షన్ కూడా టిక్ కొట్టడం విధాయకం.
  2. లంకెలు కూడా మనం పాఠ్యాన్ని మార్చుకుని దిద్దవచ్చు.

ఇది కాక విడిగా మీకు తెలియపరచవలసినది ఏమంటే తెలుగు వికీపీడియా అన్నదాన్ని వాడుకరులే (మీరు, నేనూ, మనం) నిర్వహిస్తారు. వాడుకరులకు లేని వీలు నిర్వాహకులకు చాలా తక్కువ విషయాల్లోనే ఉంటుంది. ఇక నిర్ణయాధికారం (నాకు అర్థమైనంతవరకూ) సముదాయంలో చర్చదే. కాబట్టి మీరు చెప్పిన మార్పులన్నీ అవసరమైనవే, తెవికీ నిర్వహణలో భాగంగా మీరు కూడా వీటిని చేపట్టవచ్చు. మీరు ఇటువంటి కార్యకలాపాల్లో భాగం అయినందుకు అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:50, 3 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీల ప్రాజెక్టు

మార్చు

భారత జనగణన వారి ఫైళ్ళనుండి డేటాను సేకరించి గ్రామాల పేజీల్లో చేర్చే పనిని కొంత ఆటోమేట్ చేసే ప్రయత్నం జరిగింది. దీని వివరాలను ఈ ప్రాజెక్టు పేజీలో చూడండి. ఈ పని విజయవంతంగా పూర్తి కావాలంటే వాడుకరులందరి భాగస్వామ్యం కావాలి. పై పేజీని చూసి, ఈ ప్రాజెక్టులో అందరూ పాలుపంచుకోవాలని విజ్ఞప్తి.__చదువరి (చర్చరచనలు) 17:00, 3 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

  1. JVRKPRASAD (చర్చ) 01:26, 4 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

భాగస్వామ్యానికి ఆహ్వానం

మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గ్రామాల వ్యాసాలు తెలుగు వికీపీడియాలోని వ్యాసాల్లో సింహభాగం ఏర్పడుతున్నాయి. వేలాదిగా ఉన్న ఈ వ్యాసాల్లో చాలా భాగం కొద్ది సమాచారమే ఉంది, కొన్నిటిలో శీర్షికలే తప్ప సమాచారం లేని స్థితి కూడా నెలకొంది. ఈ దిశగా జనగణన 2011 సమాచారాన్ని ఉపయోగించి వ్యాసాన్ని విస్తరించేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు చదువరి గారి కృషి వల్ల మరింత తేలికయ్యాయి. ప్రస్తుతం ఆయన అభివృద్ధి చేసిన విధానంలో తెలుగు వికీపీడియాలో తత్సంబంధిత వ్యాసాల్లో నేరుగా ప్రచురించి, కొద్ది మార్పులు చేస్తే సరిపోయేలా సమాచారం యాంత్రికంగా తయారవుతుంది.
దాదాపు పది సంవత్సరాల నుంచి క్రమక్రమంగా జరుగుతున్న ఈ కృషిలో ఒక పెద్ద అంగ వేసి, తగినంత సమాచారాన్ని ఆయా వ్యాసాల్లో చేరుద్దామన్న ప్రయత్నంతో గత సంవత్సరం నుంచీ 2011 జనగణనలోని విస్తారమైన సమాచారాన్ని ఉపయోగించి వ్యాసాలు విస్తరించే ప్రయత్నం ప్రారంభించడం తెలిసిందే. ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ బృందంతో కలిసి పనిచేసి 2011 జనగణన సమాచారాన్ని ఉపయోగించి యాంత్రికంగా వ్యాసాలు సృష్టించాం. ఐతే ఈ సమాచారం నేరుగా ప్రచురించదగ్గది కాదు, ఇందులో వాక్యనిర్మాణం కృత్రిమంగా ఉండడమే దీనికి కారణం. ఈ వ్యాసాలను సరైన శైలిలోకి మార్చడం గురించీ, వ్యాసాల్లోని సమాచారం గురించీ గత ఏడాది ద్వితీయార్థంలో విపులమైన చర్చలు, చర్చావేదికలు నిర్వహించుకుని, శైలి ఏర్పరుచుకుని, కొన్ని నమూనా వ్యాసాలు తయారుచేసుకోవడం జరిగింది.
తర్వాతి దశలో సంవత్సరాలుగా గ్రామాల వ్యాసాల విస్తరణలో పనిచేస్తున్న భాస్కరనాయుడు గారు ప్రధానంగా మొలక స్థాయిలోనో, మరీ తక్కువ సమాచారంతోనో ఉన్న గ్రామ వ్యాసాలను ఈ ప్రాజెక్టుతో ఒక దశకు తీసుకురావచ్చన్న ఆశాభావంతో కృషిచేయడం ప్రారంభించారు. ఆయన చిత్తూరు జిల్లా గ్రామ వ్యాసాలను తీసుకుని పనిచేయడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి నుంచి నేటిదాకా ఆయన ఈ నమూనా వ్యాసాన్ని ఉపయోగించి, నమూనాని అభివృద్ధి చేస్తూ గ్రామ వ్యాసాల్లో సమాచారాన్ని వృద్ధి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత నెలలో చదువరి గారితో చేసిన చర్చల ఫలితంగా ఈ ప్రాజెక్టు మీద కృషిచేయడం ప్రారంభించారు. ఆయన మరొక నమూనా వ్యాసాన్ని తయారుచేసుకుని, దాదాపు నేరుగా ప్రచురించగల సమాచారాన్ని 2011 జనగణన వివరాలతోనే తయారుచేసేలా ఆయన ఒక లాజిక్ రాశారు. దీనివల్ల కోడ్ రాసిపెట్టేందుకు ఆయన మిత్రుడికి చాలా తేలిక అయింది. తద్వారా ప్రస్తుతం నేరుగా పైన ఉదహరించిన చదువరి గారి నమూనా వ్యాసాన్నే యాంత్రికంగా తయారుచేసేయ గలుగుతున్నారు.
పైన చదువరి గారు ప్రస్తావించిన ప్రాజెక్టు పేజీకి వెళ్ళి ఆసక్తి కలిగిన జిల్లాల వ్యాసాలను స్వీకరిస్తే అతికొద్ది కాలంలోనే మనం గ్రామాల వ్యాసాల్లో ఈసమాచారన్ని ప్రచురించుకోగలం. కాబట్టి దయచేసి ఆసక్తి కల సభ్యులందరూ ముందుకురావాల్సిందిగా మనవి.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:50, 14 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Bhubaneswar Heritage Edit-a-thon 2017

మార్చు

Hello,
The Odia Wikimedia Community and CIS-A2K are happy to announce the "Bhubaneswar Heritage Edit-a-thon" between 12 October and 10 November 2017

This Bhubaneswar Heritage Edit-a-thon aims to create, expand, and improve articles related to monuments in the Indian city of Bhubaneswar.

Please see the event page here.

We invite you to participate in this edit-a-thon, please add your name to this list here.

You can find more details about the edit-a-thon and the list of articles to be improved here: here.

Please feel free to ask questions. -- User:Titodutta (sent using MediaWiki message delivery (చర్చ) 09:20, 4 అక్టోబరు 2017 (UTC))[ప్రత్యుత్తరం]

ఆంగ్ల పదాలకు దారిమార్పులు

మార్చు

‎Vmakumar గారు, అవసరం లేని ఆంగ్ల పదాలకు దారిమార్పులు తిరిగి చేస్తున్నారు. దయచేసి కారణం వివరంగా చెప్పగలరా ? తొలగింపు ప్రతిపాదించినవి, తిరిగి మూస తీసి యథాతథ స్థితిలో ఉంచుతున్నారు. ఎందుకో నాకు తెలియడము లేదండి ? JVRKPRASAD (చర్చ) 00:22, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, తప్పనిసరిగా మీకు వివరించగలను. ప్రస్తుతం శెలవు రోజైనప్పటికీ ఉద్యోగరీత్యా అత్యవసరంగా క్యాంపుకు బయలుదేరవలసి వుంది. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 7,8 గంటలు కావచ్చు. తిరిగివచ్చిన వెంటనే మీకు వివరంగా చెప్పగలను.

నిజానికి మీరు పెట్టిన ఆ మూసను చూసిణ తరువాత , గతంలో ఆ ఆంగ్లపదాలను 'దారిమార్పు చేయడానికి బదులు' content లేని కొత్త వ్యాసంగా ఒక 'కొత్త పేజీ'ని పొరపాటుగా సృష్టించానేమో అని భావించాను. ఇదివరకే ఒక తెలుగుపదం పేరుతొ వున్న వ్యాసానికి "ఆంగ్లపదం పేరుతొ మళ్ళీ కొత్త పేజీ" నా చేత అనవసరంగా సృష్టించబడినదనే అభిప్రాయంతో వున్న నేను, వెంటనే చిన్న మార్పే కదా అని చర్చా పేజీలో వివరణ ఇవ్వకుండానే సవరించుకొందామని దారిమార్పు వెంటనే చేసాను.

ఇప్పుడు మీ వ్యాఖ్యను చూసిన తరువాత అర్ధమయ్యింది. మీరు తొలగింపు ప్రతిపాదన చేసినది దారిమార్పు పేజీకి అని. నేను త్వరపడి చేయడం వల్ల ఆ చర్చా పేజీ క్లోజ్ అయినట్లుంది. నిజానికి మీరు లేవనెత్తిన objection, "దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు వుండటం సమంజసమా! కాదా!" అనే కోణంలో ఆలోచించాల్సిన అంశం అవుతుంది. ఇది మంచి చర్చనీయంశం. తిరిగివచ్చిన వెంటనే చర్చించగలను. --Vmakumar (చర్చ) 03:16, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారు, మీ నుండి సరి అయిన జవాబు లభించక, తిరిగి చర్చ అన్నారు. కొన్ని శాస్త్రరంగాలలోని వాటికి దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు తప్పకుండా ఉండాలి. అవి ఎలాగూ ఉంచాను, కొన్ని చేర్చుదాము. అవసరము లేనివి తొలగించుటలో సందేహము అలాగే ఉంచేసారు. పెద్దల జవాబులు వచ్చే వరకు ప్రస్తుతము నేను చేస్తున్న పనికి విశ్రాంతి కలిగింది. నిర్ణయము త్వరగా చెస్తే బావుంటుంది. JVRKPRASAD (చర్చ) 06:14, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకులకు, ముఖ్యంగా JVRKPRASAD గారికీ, జరిగిన విషయం పై మీకు సమాధానం ఇస్తున్నాను. ప్రసాద్ గారు, మీరు back arc basin, ashvaghosa, barabar caves, buddhapalita పేజీలకు అతికించిన తొలగింపు నోటీసు చూసిన పిదప నాకు కొద్దిగా సేపు అర్ధం కాలేదు. నేను గతంలో ఆ ఆంగ్ల పదాలను సరిగానే దారిలింకులు ఆయా తెలుగు వ్యాసాలకు (వరుసగా బ్యాక్ ఆర్క్ బేసిన్, అశ్వఘోషుడు, బరాబర్ గుహలు, బుద్ధపాలితుడు వ్యాసాలకు) కలిపినట్లు గుర్తు. మళ్ళీ అవి ఎలా seperate page గా తయారయ్యాయి అన్న విషయం చూసిన మొదట్లోనాకు నిజంగానే అర్ధం కాలేదు. ఒకవేళ అప్పట్లో దారిమార్పు సరిగ్గా చేయలేకపోవడం వల్ల, అవి మళ్ళీ seperate pages గా మారిపోయి వుంటాయి అని భావించాను. అలా దారిమార్పు కోసమే అయినప్పటికీ, నా వలన పొరపాటుగా ఆంగ్ల పదంతో పేజీ ఏర్పడటంవల్ల JVR ప్రసాద్ గారు గమనించి ఆ seperate పేజీలను తొలగించడానికి ఆ నోటీస్ అతికించారనుకొన్నాను. తొలగింపు అయితే నిర్వాహకులు చేయాలి. పేజీని దారిమార్పు మనం చేయవచ్చు కదా అని భావించాను. నా వల్ల జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని ఈ సారి మరింత జాగ్రత్తగా దారిమార్పు చేసాను. పిదప ఇంక మీ నోటీస్ అవసరం ఉండదనిపించి నేనే దానిని తొలగించాను. ఇదీ వాస్తవంగా జరిగింది. ఐతే ఆ తరువాత కొద్దిసేపటికి గాని నాకు తెలియలేదు. అసలు ఆంగ్ల పదంతో దారిమార్పు చేయడం సరికాదని మీరు భావించే ఆ నోటీస్ ఉంచారని. ఆ తరువాత మీరు పంపిన మెసేజ్ చూసాను. నా తొందరపాటు వల్ల చర్చా పేజీ క్లోజ్ అయిపోవడం వలన ఇక చర్చించే అవకాశం కూడా పోయింది. (నోటీస్ నేనే తొలగించడంతో దానికి సంబందించిన చర్చాపేజీ కూడా ఇక వుండదు అనుకొంటున్నాను) అందుకే తదుపరి ప్రసాద్ గారు లేవనెత్తిన వేదిక మీదే సమాధానం ఇవ్వడం సమంజసం అని భావించాను. అదే సమయంలో నా అత్యవసర పరిస్థితిని (camp పని) కూడా తెలియచేసి కాస్త సమయం పడుతుందని సూచించి మరీ శెలవు తీసుకొనడం జరిగింది. --Vmakumar (చర్చ) 06:12, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారు అతికించిన నోటీసును నేను వేరే అర్ధంలో ఊహించుకోవడం. దానిని సరి చేస్తున్నాననే భ్రమలో పడటం వల్ల నా వలన చర్చా పేజీ కూడా క్లోజ్ అయిపొయింది. ఇది నేను కావాలనే మీ నోటీస్ పట్ల నిర్లక్ష్యంతో వున్నట్లు దయచేసి భావించవద్దు. ఏది ఏమైనప్పటికీ మీరు ఉంచిన నోటీస్ కు సంబంధించి చర్చా పేజీ నా తొందరపాటు వలన మూసుకుపోవడం, వికీ నియమాలకు ఉల్లంగించినట్లే అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదని, నా తొందరపాటు మరియు అవగాహన లేమి వలనే జరిగింది. దీనివలన మీకు కలిగిన ఇబ్బందికి మరియు వికీ నియమాలకు విరుద్ధంగా జరిగిన దానికి నిర్వాహకులకు కూడా క్షమాపణ చెపుతున్నాను. ఇకమీదట ఇటువంటి నోటీసులకు ముందుగా చర్చించిన మీదటే తదుపరి ప్రయత్నం చేస్తాను. --Vmakumar (చర్చ) 06:16, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అయితే నా జవాబు వచ్చేవరకూ JVRKPRASAD గారికి విశ్రాంతి కలగడం ఒకింత ఆశ్చర్యంగా వుంది. నా నిర్ణయం త్వరగా చెప్తే బాగుంటుంది అన్నారు. మీకు ఉదయం నా పరిస్థితి పైనే పేర్కొన్నాను కదండీ. మనం ఎవరికైనా ఒక నోటీస్ ఇచ్చినపుడు resonable opportunity క్రింద జవాబు ఇవ్వడానికి సాధారణంగా కొంత వ్యవధి ఇవ్వబడుతుంది. ఆ వ్యవధి వరకూ ఆగడం సహజ ధర్మం. అయితే పొరపాటు (మీరు ఉంచిన నోటీస్ నేను చర్చించకుండానే తొలగించడం అనేది) నా వైపు నుండి జరగడం వల్ల నేను కూడా గిల్టీగానే వున్నాను. అందువల్లే పనిత్వరలో పడి జవాబివ్వడం ఒకింత లేటవ్వవచ్చు అని కూడా ముందే సూచించాను. నా జవాబు కోసం వెయిట్ చేస్తూ మీరు రెస్ట్ తీసుకోవడం........వికీలో అవిశ్రాంతంగా పనిచేసే మీ వంటి వారు, నా జవాబు కోసం పనులను ఆపుకొని రెస్ట్ తీసుకోవడం ..... నాకూ ఏదో గిల్టీగా అనిపించింది. ఏమైనప్పటికీ JVRKPRASAD గారు, నా జవాబు గురించి సహనంతో ఇప్పటివరకు ఓపిక పట్టినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మనందరం వికిలో సామూహిక కృషి చేయవలసిన వాళ్ళమే. ఒకవేళ individual గా ఏదైనా పొరపాట్లు జరిగితే జవాబివ్వడం, చర్చించడం సాధారణంగా జరిగేవే. దాని వలన సీనియర్స్ నుంచి మంచి feedback జరిగి, పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం. మరింత rectify అవుతాం. --Vmakumar (చర్చ) 06:24, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, ఇందులో గాభరా పడాల్సిన అవసరమేమీ లేదు. మీరే నిబంధనలు ఉల్లంఘించలేదు. తెలుగు వికీలో నేనైతే ఇప్పటి దాకా ఆంగ్ల పదానికి దారి మార్పు ఇవ్వలేదు. మొదట్నుంచీ తెలుగు వికీలో తెలుగు పేర్లతోనే వ్యాసాలుండాలనేది మేము చాలా మంది అనుసరిస్తున్న సాంప్రదాయం. అలాగని అదేమీ పెద్ద నియమం కాదు. మీరు ప్రస్తుతానికి తెలుగు పేర్లతోనే వ్యాసాలు రాయండి. ఆంగ్ల పదానికి దారి మార్పులు ఇవ్వాలా వద్దా అనేది తర్వాత ఆలోచిద్దాం. నా అభిప్రాయం ప్రకారం ఆంగ్ల పదానికి దారి మార్పులు అవసరం లేదు. ఎందుకంటే అంతర్వికీ లింకుల ద్వారా ఆంగ్ల వికీ నుంచి కూడా తెలుగు వికీకి రావచ్చు. ఈ మధ్యనే గూగుల్ శోధనలో గమనించిన విషయం ఏమిటంటే తెలుగు పదం ఆంగ్లంలో టైపు చేసిన తెలుగు పదానికి సరిపడా ఫలితాలు కూడా చూపిస్తోంది. --రవిచంద్ర (చర్చ) 07:22, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumar గారు, నమస్కారము. నేను విశ్రాంతి అన్నది "ఆ" ఆంగ్ల పదాల విషయములోనండి. అంటే మరో విభాగపు పని చేస్తాను అని ఇతరులకు తెలియ చేసాను. నాకు మరియు కుడి ఛేతికి పూర్తి బెడ్ రెస్ట్ ప్రస్తుతము. చిన్న పనులు ఎడమ చేతితో గత నెలన్నర రోజులుగా చేస్తున్నాను. మీ నిర్ణయం కాదండి. పెద్దలు గురించి మాత్రమే. మనము ఒక సందేహము పెట్టాము కదా. ఇంక మిగతా వాక్యములు మీవి ఒక విషయమునకు మాత్రమే చెందినవి. ఎక్కడైనా నా పదాలు మీమనసు బాధ పడే విధంగా ఉంటే మన్నించండి. JVRKPRASAD (చర్చ) 07:29, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అభిప్రాయాలు చెప్పి నిర్ణయం చేయమని పెద్దలను అడిగానండి, కానీ మిమ్మల్ని కాదు. సమస్య మనము లేవనెత్తినది కదా ! JVRKPRASAD (చర్చ) 07:37, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, నేను తప్పుగాను, బాధపడే విధంగానూ, దురుసుగా వ్రాయలేదండి. అర్థము చేసుకోగలరు. మీ స్పందనకు మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 07:42, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Vmakumar గారు, ఇక్కడ నా జాతకరోజుల ప్రస్తుత స్థితి, పరిస్థితి "రామ" అంటే "బూతు"లా ఎదుటి వారికి అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నాకు సంబంధించి వీలైనంత వరకు ఏమీ తెరవకుండా అందరి దగ్గర జాగ్రత్తగా ఉంటున్నాను. మీరు అర్థం చేసుకోగలరు.JVRKPRASAD (చర్చ) 08:02, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక ప్రసాద్ గారికి, మీ ప్రస్తుత స్థితి అర్థం చేసుకోగలను. మీపట్ల నాకు మంచి అభిప్రాయమే కాదు గౌరవ అభిప్రాయమే వుంది. కాని ఒక పాలసీ కి సంబందించిన అంశం కావడం వలన జవాబు తో పాటు చర్చించడం మనందరకూ ఎంతో మంచిది. అందుకే నా తరుపున జవాబు చెపుతున్నాను. నేను చెప్పే విషయాలు మీ వంటివారికి తెలియనివని కాదు. అయినా “జవాబివ్వమంటే క్షమాపణ అడిగి జవాబు గురించి మర్చిపోయాడు” అనిపించుకోవడం కన్నా నా తరుపున ఒక వివరణ అయినా జవాబు రూపంలో ఉంచడమే భావ్యం అనిపించి రాస్తున్నాను. అన్యదా భావించవద్దు.

ప్రసాద్ గారు, ఇక దారిమార్పుల పాయింట్ కు వద్దాము. దారిమార్పులకు ఆంగ్ల పదాలు వాడటంపై గురించి మీరు నిన్న “కొన్ని శాస్త్రరంగాలలోని వాటికి దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు తప్పకుండా ఉండాలి. అవి ఎలాగూ ఉంచాను, కొన్ని చేర్చుదాము. అవసరము లేనివి తొలగించుటలో సందేహము అలాగే ఉంచేసారు.” అని తెలియ చేసారు. అంటే తెలుగువికీ లో దారిమార్పులు ఆంగ్లంలో కూడా వుండటానికి ప్రాధమికంగా మీకు అభ్యంతరం లేదని తెలుస్తుంది. ఇది ఆచరణాత్మకంగా వుంది. అయితే కొన్ని శాస్త్రరంగాలలోని వాటికి మాత్రమే దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు తప్పకుండా ఉండాలి అన్న అభిప్రాయమూ వుంది. ఇకపోతే మీరన్న మాట దగ్గరకే వద్దాం. “కొన్ని శాస్త్రరంగాలలోని వాటికి” మాత్రమే అన్నారు. సర్ ఏది శాస్త్రరంగం? ఏది శాస్త్రరంగం కానిది? కాస్త విడదీసి మనం ఎవరైనా నిర్దుష్టంగా చెప్పగలమా! మనకూ తోచినది శాస్త్ర రంగం అయితే అందరికీ అది శాస్త్ర రంగం కావచ్చు. కాకపోవచ్చు. History ని శాస్త్రం అనాలా లేదా అనేదానిపై ఎంతో చర్చ జరిగింది. అలాగే జ్యోతీష్యం యొక్క శాస్త్ర్రేయతపై ఎంతో వివాదం వుంది. ఇలాంటప్పుడు ఒక పదం శాస్త్ర రంగానికి చెందని, మరొక పదం కాదనీ ఎవరికీ వారు ఏకపక్షంగా నిర్ణయించడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఇంకొక చిన్న విషయం. శాస్త్రరంగంలోని పదాలను కూడా మీరని, నేనని కాదు సాధారణంగా ఎవరికి వారు వారికి తోచినట్లు భాష్యం చెప్పుకొంటారు. శాస్త్రరంగం లోని పదాలలో మనకు కాస్త పరిచయ పదంగా కనిపిస్తే చాలు దానిని “శాస్త్ర రంగం కాని పదం” గా భావిస్తాం. అదే మనకు కొరుకుడు పడని పదమైతే చాలు, అది శాస్త్ర రంగానికి చెందని పదమైనా దానిని శాస్త్రరంగానికి చెందిన పదంగా ఆపాదిస్తాం. ఈ విషయంలో మీరు “శాస్త్రరంగంలోని పదాలు” అంటున్నది “ శాస్త్ర పారిభాషిక పదాలు” గురించే అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి విషయాలలో మన వికీలో Vemurione వంటి వాడుకరులు భాషాపదాల వాడకంపై మంచి సాధికారత వున్న వ్యక్తులున్నారు.

ఇకపొతే తొలగింపు నోటీసు పెట్టిన ఈ ‘back arc basin’ దారిమార్పుపేజీ గురించి వివరణ. తరువాతి రిఫరెన్స్ కోసమైనా నా అభిప్రాయం చెప్పాలి కదా. మీరు ముందుగానే “ కొన్ని” శాస్త్రరంగాలలోని వాటికి మాత్రమే దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు తప్పకుండా ఉండాలి అన్న అభిప్రాయమూ వెలిబుచ్చారు.

  • కొన్ని శాస్త్ర రంగాలు అనే పదం పట్ల నాకు మొదటి అభ్యంతరకరం వుంది. కొన్ని అంటే ఏవి. ఏవి కాదు అనే ప్రశ్న వస్తుంది. అలా మీరు పేర్కొనబోయే ఆ కొన్ని శాస్త్రరంగాల selection అనేది మన దృష్టిలోనివా! లేదా వేరే ఎవరి దృష్టిలోనివా! లేదా ఇంతకు ముందు ఈ విషయంలో ఏమైనా వికీ ప్రమాణాలు ఫలానా ఇవి శాస్త్ర రంగాలు అవుతాయి అని నిర్ణయించినదా! చెప్పగలరని ఆశిస్తున్నాను.
  • సర్, ప్రతీ దానికి కొన్ని పరామితులుంటాయి. ఏఏ parameters లను బట్టి దారిమార్పుల కోసం మీరు ఒక పదం శాస్త్ర రంగం కానిది అని భావిస్తున్నారో తెలీయడం లేదు. ఉదాహరణకు బ్యాక్ ఆర్క్ బేసిన్ పేరుతొ వున్న తెలుగు వ్యాసానికి ‘back arc basin’ అన్నఆంగ్ల పదం దారిమార్పుగా చేసాను. అయితే దారిమార్పులో వున్న ఆ ఆంగ్ల పదం back arc basin సింపుల్ గా వుండడంతో అది శాస్త్రరంగానికి చెందని పదంగా అనిపించడం కావచ్చు, ఏమైనా కావచ్చు తొలగింపు నోటీస్ తగిలించబడింది. నిజానికి back arc basin అనేది భూగోళ శాస్త్రానికి (జాగ్రఫీ ) సంబందించిన క్లిష్టమైన పారిభాషిక పదమే.

ప్రసాద్ గారు, మీరు బ్యాక్ ఆర్క్ బేసిన్ వ్యాసంలో మచ్చుకు ఒకటి రెండు పేరాలు చదివినా భూగోళ శాస్త్ర కంపు (రాయల వారి కాలంలో కంపు అంటే సువాసన అనే అర్ధం వుంది. నేడు మాత్రం ఎందుకనో పూర్తి వ్యతిరేకార్ధంలో ఉపయోగిస్తున్నాం) గుప్పు గుప్పున తగులుతుందండి! మరి మీరు భావించిన ప్రమాణం ప్రకారం చూసినా, ఆ శాస్త్ర పారిభాషిక పదానికి ఆంగ్ల పదం back arc basin ను దారిమార్పుగా చేయడం సమంజసమే కదా. అంటే దీనినిబట్టి తెలిసినదేమిటంటే శాస్త పారిభాషిక పదాలకు దారిమార్పుగా ఆంగ్ల పదాలు సమంజసమే అని తెలిసిన మీ వంటి వారు కూడా, ఆ వ్యాసాన్ని కనీసం పరమార్శించకుండానే, అది శాస్త్ర పారిభాషిక పదమా కాదా అని కనీస నిర్దారణ చేసుకోకుండానే మెకానికల్ పద్దతి లో వలె వ్యాసానికి నోటీసులు పేస్టు చేసుకోనిపోతున్నారని అర్ధమవుతుంది. ఇటువంటివి ఒక సాధారణ వికి సభ్యుడు, ఇంకా అనుభవం లేని వాడుకరులు నోటీసులను కాపీ పేస్టూ చేసారంటే ఏదో తెలియక చేసారనుకోవచ్చండి. మీలాంటి సీనియర్ మోస్ట్ వికీపీడియన్, శాస్త్ర పారిభాషిక పదాల దారిమార్పులకు ఆంగ్ల పద వాడుక ఒప్పే అని తెలిసినవారు కూడా కనీస పూర్వాపరాలు చూడకుండా Q పద్దతిన ఫాలో కావడం ఇబ్బంది అనిపించింది. అంతే తప్ప మిమ్మలను నొప్పించడం నా అభిమతం ఏమాత్రం కాదు.

ఒకవేళ వికి నిర్వాహకులు, అధికార్లు అలా చేసినప్పటికీ వారి వత్తిడిలు వారికి ఉండవచ్చు. అయినా వారికి సమంజసమనిపిస్తే తిరిగి rectify చేయదగినవారు కాబట్టి వారు అటువంటి నోటీసులు తగిలించినా అర్ధముంది. వికీలో మార్పులు చేయడానికి నోటీసులు తగించడానికి అందరికీ హక్కు వుంటుంది. కాదనలేము కూడాను. కాని అదే సమయంలో ఒక చదువరి వేరొక చదువరి ఆర్టికల్ ను విమర్శించాలన్నా లేదా నోటీసు ద్వారా సంజాయిషీ కోరాలన్నా కనీసం ఒకసారి ఆ ఆర్టికల్ ను కొద్దిమేరకు అయినా చదివే ప్రయత్నం చేసినా బాగుండేదనే నా అభిప్రాయ సారాంశం. (అధికార్లు, నిర్వాహకులకు ఇది వర్తించకపోవచ్చు. నోటీసులు తగిలించడం కోసం ప్రతీ ఒక్కరి వ్యాసాలు చదివే తీరుబడి, బిజీగా వుండే వారి భాద్యతల రీత్యా కుదరకపోవచ్చు. ఇది ఇతర సభ్యులకు వర్తించదనుకొంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.) నిర్వాహకులు రవిచంద్రగారు తెలియచేసిన దాని ప్రకారం అది సంప్రదాయమే కాని ఒక పాలసీ లేదా నియమాలలో భాగంగా లేదనే విషయం తెలుస్తుంది. సంప్రదాయమన్నప్పుడు బలవంతం వుండకూడదు. కాని పాత వ్యాసాలకు దారిమార్పులుగా వున్న ఆంగ్ల పదాలను తొలగించడమే ఒక కార్యక్రమంగా సాగే ప్రమాదం వుంది.

  • ఇంకొక చిన్న మనవి JVRKPRASAD గారు, చిన్నప్పుటినుంచి మనకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం అని ఇలా ఓ నాలుగైదు శాస్త్రాలతోనే పరిచయం కలుగుతుంది. కాని హయ్యర్ స్టడీస్ కి వెళ్ళేకొద్దీ శాస్త్రం అంటే ఇవే కాదు మనకి పరిచయం కానివి వందలలో వున్నాయని, శాస్త్రాలలోను అనేక ఉపవిభాగశాస్త్రాలు కోకొల్లలుగా వున్నాయని వివరంగా భోదపడుతుంది. ఉదాహరణకు క్లచ్ (clutch) అనే సామాన్యంగా వాడే పదం అనుకుంటాం. కాని అది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ శాస్త్రంలో పారిభాషిక పదమే కదా. అలాగే మైదానం (plain), శిల (rock), జనసాంద్రత (population density), రబీ (rabi), భూకంపం, అగ్నిపర్వతం, ఎడారి, ఐస్, బొగ్గు, తోకచుక్క, .... లాంటి అత్యంత సింపుల్ పదాలెన్నో భూగోళ శాస్త్రానికి సంబందించిన పారిభాషికకపదాలే. బాగా పరిచితమైన ఇటువంటి పదాలను సాధారణంగా మనం “శాస్త్ర రంగం కాని పదాలు” గా తీర్మానించేస్తూ ఉంటాము. అయితే back arc basin లాంటి క్లిష్టమైన పారిభాషిక పదాలను సైతం ఈ కోవలోనికే చేర్చేయడం బాగుండదనేదే నా అభిప్రాయం.

కాబట్టి జాగ్రఫీ పారిభాషిక పదకారణంగా back arc basin అనే ఆంగ్ల పదం తెలుగు వ్యాసానికి దారిమార్పుగా వుండతగినదే నా అభిప్రాయం. --Vmakumar (చర్చ) 11:18, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాద్ గారు, ఇంకొక అంశం నన్ను వివరించనీయండి. మీరన్నట్లుగా శాస్త్రరంగాలలోని వాటికి దారిమార్పులుగా ఇంగ్లీష్ పదాలు మనదరికీ ఓకే అయితే - ఆ సంప్రదాయం అనేది సార్వత్రికంగా వుండాలి. అలాకాక పరిచయమైన, పరిచయం కాని పదాలు అని తిరిగి వాటిని విభజించడం, పరిచితమైన శాస్త్ర పారిభాషిక పదాలకు దారిమార్పులుగా ఆంగ్ల పదాలుండకూడదనడం. అంతగా పరిచయం లేని శాస్త్ర పారిభాషిక పదాలకు మాత్రమే దారిమార్పులుగా ఆంగ్ల పదాలు నప్పుతాయి అనడం వలన మళ్ళీ మొదటి కొస్తుంది. ఎందుకంటే మీకు పరిచయమైన పారిభాషిక పదం అందరికీ పరిచయం కాకపోవచ్చు. అలాగే మీకు పరిచయం కాని పారిభాషిక పదం అందరికీ పరిచయమై ఉండవచ్చు కదా! మనకు నచ్చినది అందరికీ నచ్చాలని లేదు కదండీ. అందుకే నిర్వాహకుల వంటివారు ఇటువంటివాటిపై చర్చను పెట్టి ఒక general conclusion కు వస్తేనే ఇకపై వివాదాలనేవి రాకుండా వుంటుంది. అయితే దీనిలో ఒక అతి కూడా జరగవచ్చు. అంతు చూసికాని వదలని extreemist batch వాళ్ళు ఎప్పుడూ ప్రతీ చోటా సిద్ధంగానే వుంటారు. అలాంటి విక్రమార్కుల వాళ్ళు కొంతమంది పూనుకొని, వేలాదిగా పాత వ్యాసాలకు పనిగట్టుకొని మరీ దారిమార్పులుగా వున్న english పద పేజీలను తొలగించడమే పనిగా చేస్తూ వుంటే మాత్రం మొత్తం వ్యవహారం చికాకుగా కూడా వుండవచ్చు. దీనికి పరిష్కారం కూడా మధ్యేమార్గంలో ఆలోచిస్తే దొరకవచ్చు కూడా.

ఇకపోతే ప్రసాద్ గారు, మిగిలిన పదాల (ashvaghosa, barabar caves, buddhapalita) గురించి ఇదే విధంగానే వివరిద్దామనుకున్నాను. కాని Cadmium nitrate‎, Cadmium‎, Carbon, Berkelium లాంటి పారిభాషిక పదాలు Brazil‎, Calcutta లాంటి ప్రాంతాల పేర్లుకు దారిమార్పు పదాలు (?) కూడా తొలగింపు నోటీసులు తగిలించబడటం చూస్తే ..... ఇక మాట్లాడలేకపోతున్నాము.

ఒక వైపు నిర్వాహకులు, పెద్దలు నుంచి ఇటువంటి “ఆంగ్ల పదానికి దారి మార్పులు అవసరం లేదు” అనే అభిప్రాయం స్వంతదే అయినప్పటికీ వ్యక్తం అవుతన్న తరువాత, మరోవేపు ఇటువంటి అభిప్రాయాలతోనే సాధారణ చదువరులు నోటీసులు తగిలించడానికి ఇంకా ఉత్సుకత చూపడం మొదలు పెడతారు. ఈ విషయంపై నా అభిప్రాయాలను చర్చా రూపంలో నిర్వాహకులకు కూడా తెలియచేయడానికి అవకాశం అడుగుతున్నాను.

మిగిలిన సభ్యులందరి అభిప్రాయాలు వెల్లడి అయిన తరువాత, చర్చ పూర్తయి ఏదైనా సానుకూల నిర్ణయం వెలువడిన తరువాతనే తొలగింపు నోటీసులను తగిలించే ప్రయత్నం ప్రారంభించవచ్చు.
లేదా ఒక సీరియల్ గా రాబోయే ఇటువంటి నోటీసులు గందరగోళ పరుస్తాయి. వికీ liberal views యొక్క విశ్వససనీయతను దెబ్బతీస్తాయి.
చర్చానుసారం తీసుకొనే నిర్ణయమే ఇటువంటివాటికి సరైనది.
అప్పటి వరకూ నోటీసులు తగిలించడం మీద, తగిలించిన నోటీసులపై నిర్ణయం తీసుకోవడం కొద్దిగా ఓపికపట్టమనేదే నావంటి వారి కోరిక.
--Vmakumar (చర్చ) 11:31, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారు, మీరు వ్రాసిన ప్రతి పదానికి అడగ గలను, జవాబు చెప్పగలను. ఈలోపున ఇతరుల నుండి జవాబులు కోసము ఎదురు చూద్దాము. ఇంకా చాలా కాలము వరకు నా చేయి పనిచేయదు, నేను వ్రాయలేను కాబట్టి, నా అభిప్రాయము మీకు వెంటనే తెలుసుకోవాలని ఉంటే నా నంబరు 9246196226కు ఫోన్ చేయవచ్చును. నా మాటలు తప్పకుండా రికార్డు చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడే చేయండి.JVRKPRASAD (చర్చ) 11:44, 9 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది వరకు కొన్ని ముఖ్యమైన నగరాలు, ముఖ్యమైన మూలకాలకు ఆంగ్ల పదాలు వ్రాసి తెలుగు పదాలకు దారిమార్పులు చేయడం జరిగినది. కానీ ఈ విధానం అవసరం లేదని నా అభిప్రాయం. ఆంగ్లవికీలో వ్యాసం చూసినపుదు అంతర్వికీ లింకుల ద్వారా తెలుగు వ్యాసాన్ని చేరుకోవచ్చు. రవిచంద్ర గారు చెప్పినట్లు గూగుల్ సెర్చ్ తెలుగు పదం ఆంగ్లంలో టైపు చేసిన తెలుగు పదానికి సరిపడా ఫలితాలు కూడా చూపిస్తోంది. కనుక ఆంగ్ల పదాల శీర్షికలు తెలుగు వికీలో అవసరం లేదని నా అభిప్రాయం. ఇక తొలగింపు మూసలు చేర్చేటప్పుడు తొలగింపు మూసలో తొలగింపుకు తగిన కారణాలను తెలియజేయాలి. ఉదాహరణకు carbon వ్యాసంలో తొలగింపుకు తగిన కారణం తెలియజేయలేదు. దానికి చర్చాపేజీలో కూడా తగిన కారణం లేదు. ఆంగ్ల శీర్షిక అయినందున తొలగించాలని భావిస్తే ఆ పేజీలో {{తొలగించు|ఆంగ్ల శీర్షిక అయినందున}} అని వాడుకరులు చేర్చాలి. దానికి యితర సభ్యులు చర్చాపేజీలో తొలగించాలో, లేదో తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. తరువాత నిర్వాహకులు నిర్ణయం తీసుకుంటారు. ----కె.వెంకటరమణచర్చ 13:38, 10 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీషు పేర్లతో దారిమార్పు పేజీలు ఉండాలా అక్కర్లేదా అనే విషయంపై వికీపీడియా:ఇంగ్లీషు పేర్లతో దారిమార్పు పేజీల ఆవశ్యకత పేజీలో వాడుకరులందరూ అభిప్రాయాలు రాసి ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించగలరు.__చదువరి (చర్చరచనలు) 17:36, 10 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చలో పాల్గొనని నిర్వాహకులు పై చర్చాపేజీకి వెళ్ళి అక్కడ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. __చదువరి (చర్చరచనలు) 04:42, 27 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నిర్ణయం ప్రకటించబడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:38, 29 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మా ప్రాజెక్ట్ గ్రాంటీ అప్లికేషన్

మార్చు

నమస్కారం,

User: Rohini మరి నా ప్రాజెక్ట్ గ్రాంటీ అప్లికేషన్ “Community toolkit for greater diversity” మీతో పంచుకోవడానికి సంతోషంగా ఉంది. ఇది అక్టోబర్ 17, 2017 వరకు కమ్యూనిటీ సమీక్ష కోసం ఇప్పుడు తెరవబడింది. <https://meta.wikimedia.org/wiki/Grants:Project/Chinmayisk/Community_toolkit_for_Greater_Diversity>

ఈ అప్లికేషన్ చర్చా పేజీ లో మీ అభిప్రాయములు మరియు సలహా (https://meta.wikimedia.org/wiki/Grants_talk:Project/Chinmayisk/Community_toolkit_for_Greater_Diversity), మరి మీ మద్దతును, అంగీకారం విభాగం లో మేము అభినందిస్తాము (https://meta.wikimedia.org/wiki/Grants:Project/Chinmayisk/Community_toolkit_for_Greater_Diversity#Endorsements).


మీరు వాలంటీర్ చేయూళ అనుకుంటే, దయచేసి నన్ను సంప్రదించండి, నా ధన్యవాదాలు - Chinmayisk (చర్చ) 08:31, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

can work as valnteer Nrgullapalli (చర్చ) 08:55, 8 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

presenting the project Wikipedia Cultural Diversity Observatory and asking for a vounteer in Telugu Wikipedia

మార్చు

Hello everyone,

My name is Marc Miquel and I am a researcher from Barcelona (Universitat Pompeu Fabra). While I was doing my PhD I studied whether an identity-based motivation could be important for editor participation and I analyzed content representing the editors' cultural context in 40 Wikipedia language editions. Few months later, I propose creating the Wikipedia Cultural Diversity Observatory in order to raise awareness on Wikipedia’s current state of cultural diversity, providing datasets, visualizations and statistics, and pointing out solutions to improve intercultural coverage.

I am presenting this project to a grant and I expect that the site becomes a useful tool to help communities create more multicultural encyclopaedias and bridge the content culture gap that exists across language editions (one particular type of systemic bias). For instance, this would help spreading cultural content local to Telugu Wikipedia into the rest of Wikipedia language editions, and viceversa, make Telugu Wikipedia much more multicultural. Here is the link of the project proposal: https://meta.wikimedia.org/wiki/Grants:Project/Wikipedia_Cultural_Diversity_Observatory_(WCDO)

I am searching for a volunteer in each language community: I still need one for the Telugu Wikipedia. If you feel like it, you can contact me at: marcmiquel *at* gmail.com I need a contact in your every community who can (1) check the quality of the cultural context article list I generate to be imported-exported to other language editions, (2) test the interface/data visualizations in their language, and (3) communicate the existance of the tool/site when ready to the language community and especially to those editors involved in projects which could use it or be aligned with it. Communicating it might not be a lot of work, but it will surely have a greater impact if done in native language! :). If you like the project, I'd ask you to endorse it in the page I provided. In any case, I will appreciate any feedback, comments,... Thanks in advance for your time! Best regards, --Marcmiquel (చర్చ) 22:20, 9 అక్టోబరు 2017 (UTC) Universitat Pompeu Fabra, Barcelona[ప్రత్యుత్తరం]

ఎన్టీఆర్ ట్రస్టు-సీఐఎస్ ఎ2కె అవగాహన పత్రం (MoU) సంతకం

మార్చు

అందరికీ నమస్కారం, వికీమీడియా ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేసేందుకు సీఐఎస్-ఎ2కె మరియు ఎన్టీఆర్ ట్రస్టు అవగాహన పత్రం (మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్)పై సంతకం చేసినట్టు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఎన్టీఆర్‌ ట్రస్టుకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అపారమైన విస్తృతి, సీఐఎస్-ఎ2కె భారతీయ భాషల్లో స్వేచ్ఛా విజ్ఞానాభివృద్ధిలో ప్రోదిపరుచుకున్న అనుభవం కలిసి సహకరించుకుంటూ వికీమీడియా ఉద్యమానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. సముదాయ సభ్యులను ఈ అంశంపై సూచనలు, వ్యాఖ్యలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:42, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేజీలు - ఏయే వర్గాల్లో చేర్చాలి?

మార్చు

గ్రమాల పేజీలు సంబంధిత మండలంలోని గ్రామాలు వర్గంలోకి చేరుస్తాము (ఉదా: వర్గం:తుళ్ళూరు మండలంలోని గ్రామాలు). వాటిని సంబంధిత జిల్లాలోని గ్రామాలు వర్గంలోకి (వర్గం:గుంటూరు జిల్లాలోని గ్రామాలు) చేర్చాలసిన అవసరం లేదు. తుళ్ళూరు మండలంలోని గ్రామాలు వర్గాన్ని గుంటూరు జిల్లాలోని గ్రామాలు వర్గంలో చేరిస్తే సరిపోతుంది.__చదువరి (చర్చరచనలు) 08:58, 17 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

వర్గీకరణ ప్రాథమికాంశ మొకటి

మార్చు

ఒక వర్గంలోకి చేర్చిన వికీపీడియా పేజీని, ఆ వర్గపు మాతృవర్గాల్లో కూడా చేర్చరాదు. ఉదాహరణకు:

అంజనేయపురం అనే గ్రామం తిరువూరు మండలంలోని గ్రామాలు అనే వర్గంలో ఉందనుకుందాం.

తిరువూరు మండలంలోని గ్రామాలు అనే వర్గం కృష్ణా జిల్లా గ్రామాలు అనే వర్గం యొక్క ఉపవర్గం కాబట్టి, ఆంజనేయపురం పేజీని కృష్ణా జిల్లా గ్రామాలు వర్గంలో చేర్చరాదు.
కృష్ణా జిల్లా గ్రామాలు అనే వర్గం ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే వర్గానికి ఉపవర్గం కాబట్టి, ఆంజనేయపురం పేజీని ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు వర్గంలోనూ చేర్చరాదు.

అంచేత గ్రామాల పేజీలను సంబంధిత మండలంలోని గ్రామాలు వర్గంలో చేర్చాలి. జిల్లాలోని గ్రామాలు, రాష్ట్రంలోని గ్రామాలు వర్గాల్లోకి చేర్చరాదు. __చదువరి (చర్చరచనలు) 02:56, 20 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అక్టోబరు నెలలో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితా

మార్చు

అక్టోబరు 2017లో నేను చేపడుతున్న కార్యకలాపాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:39, 20 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాల సృష్టి

మార్చు

గ్రామ వ్యాసాల అభివృద్ధిలో భాగంగా సమాచారం సంబంధిత గ్రామాల వ్యాసాలలో చేరుస్తున్న వాడుకర్లకు మనవి. యిదివరకు ఆ వ్యాసం అక్షర భేదాలతో ఉన్నదో లేదో పరిశీలించి కొత్త వ్యాసాలు వ్రాయగలరు. కొత్త వ్యాసాలను పరిశీలిస్తే యిదివరకు అక్షర భేదాలతో ఉన్న వ్యాసాలే ఉన్నాయి. వాటికి విలీన మూసలను చేర్చాను. దయచేసి కొత్త వ్యాసాలను సృష్టి చేసే ముందు పరిశీలించగలరు.--కె.వెంకటరమణచర్చ 17:12, 23 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు, సెన్సస్ నందు వెంకటనరసింహాపురం నకు రెండింటి వివరాలు ఉన్నాయండి. దయచేసి విలీనము ఏవిధంగా చేయాలో వివరించగలరు లేదా లింకు ఇస్తే అందరికీ అర్థం అవుతుంది.JVRKPRASAD (చర్చ) 01:36, 24 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ రెండింటిలోనూ 2011 జనాభా ఒకే విధంగా ఉన్నది. కనుక ఒకే వ్యాసం అయి ఉండవచ్చు. పరిశీలించగలరు.--కె.వెంకటరమణచర్చ 05:14, 24 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారు, 2011 సెన్సస్ నందు వివరములు ఈ క్రింద విధముగా ఉన్నవి. దయచేసి పెద్దలు వీటి గురించి నిర్ణయము తీసుకుని సరిచేయగలరని మనవి చేసుకుంటున్నాను.
క్రమ సంఖ్య
422 : వెంకటనరసిమ్హాపురం కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589244<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.
క్రమ సంఖ్య
421 : వెంకటనరసిమ్హాపురం కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 382 ఇళ్లతో, 1404 జనాభాతో 251 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 684, ఆడవారి సంఖ్య 720. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 229 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 31. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589243<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 521102.
దయచేసి పెద్దలు వీటి గురించి సరి అయిన నిర్ణయము తీసుకుని సరిచేయగలరని మనవి చేసుకుంటున్నాను.JVRKPRASAD (చర్చ) 06
24, 24 అక్టోబరు 2017 (UTC)

JVRKPRASAD గారు సూచించిన రెండు పేజీలను జనగణన వారి ఎక్సెల్ ఫైల్లో చూసాను. ఆ ఫైల్లో నరసిమ్హాపురం ఫేరుతో రెండు వరుసలు ఉన్నాయి. రెండవ వరుసలో చాలావరకూ డేటా లేదు. మొదటిదానిలో పూర్తి డేటా ఉంది. అందుకే మన రెండో ఎక్సెల్ ఫైలు కూడా (422) ఖాళీగానే ఉంది. అలా రెండు వరుసలు ఎందుకున్నాయో నేను చెప్పలేను. తార్కికంగా చూస్తే రెండో ఫైలు అనవసరమని అనిపిస్తోంది. అంచేత రెండో ఫైలును పక్కన పెట్టేయండి. __చదువరి (చర్చరచనలు) 04:19, 25 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, ఈ విధముగా జనాభా గణన వారు చేర్చారంటే, గ్రామములోని కొంత భాగము గ్రామపరిదిలోను, మరికొంత అర్బన్ పరిధిలో ఏమైనా ఉందా అని నా సందేహం, దయచేసి తీర్చగలరు.JVRKPRASAD (చర్చ) 04:39, 25 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు తెలియదండి.__చదువరి (చర్చరచనలు) 05:16, 25 అక్టోబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]