వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 59

పాత చర్చ 58 | పాత చర్చ 59 | పాత చర్చ 60

alt text=2018 మే 19 - 2018 మే 30 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 మే 19 - 2018 మే 30

తెలుగును వ్రాసే విధానం మార్చు

ఇప్పుడు తెలుగు రాసే విధానంలో ఎన్నో మార్పులు వచ్చినా మనం ఇంకా RTS పద్ధతిలోనే వికీలో రాసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం.ఇది గూగూల్ వాయిస్ సహాయంతో మాటను అక్షరాలుగా మార్చి రాసినది అలాగే Google Telugu Input tool నాణ్యత కూడా పెరిగింది,కాబట్టి కోత్త వాడుకదారులకు మిగిలిన వాటితో పాటు ఈ గుగూల్ టూల్స్ మీద,మోబైల్ ద్వారా ఎడిటింగ్ మీద శిక్షణ ఇవ్వాలి అని నా అభ్యర్థన . కశ్యప్

అవును కశ్యప్ గారు. ఇప్పటివరకు మనం కంప్యూటర్ లో వికీ రాయడం గురించే శిక్షణ ఇస్తున్నాం. ఇక మోబైల్ ద్వారా ఎడిటింగ్ మీద శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:39, 19 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ పోటీ కోసం స్థానిక అంశాలు మార్చు

ప్రాజెక్టు టైగర్ పోటీ కోసం స్థానిక ప్రాధాన్యత గల అంశాల జాబితా తయారైంది. ఇందులో 494 పేజీలున్నాయి - కొన్ని కొత్తగా తయారు చెయ్యాల్సినవి (ఇంగ్లీషు వికీ లింకులు), కొన్ని విస్తరించాల్సినవీ (తెలుగు లింకులు). వాడుకరులు ఈ జాబితాలోని వ్యాసాలలోనూ కృషి చెయ్యవచ్చు. నియమాలు మామూలే. __చదువరి (చర్చరచనలు) 16:24, 2 మే 2018 (UTC) ఒక గమనిక: ఇంగ్లీషు లింకులు ఉన్నవాటికి తెలుగు వ్యాసాలు ఉండే అవకాశం ఉంది. వాడుకరులు ఒకసారి చూసుకోవాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 16:27, 2 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్.ఆర్గ్ లో DLI పుస్తకాలు వివరాలు తెలుగులో తాజా మార్చు

 
ఆర్కీవ్.ఆర్గ్ లో DLI తెలుగు పుస్తకం "తెలుగు భాషా చరిత్ర"

"తెలుగు సమాచారం అందుబాటులోకి" ప్రాజెక్టు ఫలితాలు ఆర్కీవ్.ఆర్గ్ లో DLI తెలుగు పుస్తకాల తాజా ప్రారంభమైంది. దీనివలన తెలుగు వాడుకరులు శోధన యంత్రాల ద్వారా 5884 తెలుగు పుస్తకాలకు చేరుకుంటారు. మరిన్ని సంబంధిత తెలుగు పుస్తకాలను చూడగలుగుతారు. వికీమీడియా ఫౌండేషన్ వారి సహాయంతో తెలుగు కేటాలాగ్ ప్రాజెక్టు చేసిన వాడుకరి:Pavan santhosh.s మరియు జట్టుకు, డిఎల్ఐ పుస్తకాలను ఆర్కీవ్.ఆర్గ్ లో భద్రపరచటానకి కృషిచేసిన పబ్లిక్ రిసోర్స్ సంస్థ అధిపతి కార్ల్ మలమూద్ కు ధన్యవాదాలు. మరిన్ని వివరాలు.వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI final catalogue, ఉదాహరణ పుస్తకం చూడండి. సహ వికీపీడియన్లు ఆసక్తి గనబరిచితే మిగతా 75% శాతం పుస్తకాల వివరాలు తెలుగులోకి మార్చే కృషి చేపట్టవచ్చు. --అర్జున (చర్చ) 23:45, 2 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మూసలకు దగ్గరి దారి బొత్తాంలు వికీ ఎడిటర్ లో char-insert gadget తో చేతనం మార్చు

 
తెవికీ మూసల బొత్తాంలు char-insert gadget తో పనిచేయటం

మనం ఇంతకు ముందు వాడే {{సహాయం కావాలి}} లాంటి మూసల బొత్తాంలు కొత్త వికీ ఎడిటర్ తో చేతనం చేశాను.ఇవి సవరణ పెట్టె పాఠ్య భాగానికి, మరియు మార్పులను ప్రచురించు విభాగానికి మధ్య Wiki markup అనే ఎంపిక జారుడుమెనూలో కనబడతాయి. ఇప్పడు తెలుగు వికీ సవరణ సౌకర్యాలు ఆంగ్ల వికీ లాగా వుంటాయి. మరిన్ని వివరాలకు https://phabricator.wikimedia.org/T192246 చూడండి. --అర్జున (చర్చ) 07:19, 3 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

AdvancedSearch మార్చు

Birgit Müller (WMDE) 14:53, 7 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2018 మే నెలలో చేపడుతున్న కార్యకలాపాల జాబితా మార్చు

అందరికీ నమస్కారం,
మే నెలలో సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళిక అమలు విషయమై చేపడుతున్న కార్యకలాపాల జాబితా సముదాయ సభ్యులు ఇక్కడ చూడవచ్చు, గత నెలలో ప్రతిపాదించిన పనులు వాటి పురోగతి ఇక్కడ చూడవచ్చు. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:28, 10 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కీవ్ డాట్ ఆర్గ్ లోని తెలుగు పుస్తకాల వివరాలు ఆంగ్లలిపినుండి తెలుగులోకి మార్చుటకు సహాయం. మార్చు

user:Pavan santhosh.s నాయకత్వం వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు ఫలితాలనుండి తెలుగు 5844 పుస్తకాల వివరాలను ఆర్కీవ్.అర్గ్ లో చేర్చాను.(మార్చిన తరువాత కనబడే పుస్తకం ఉదాహరణ). ఇంకా 17062 పుస్తకాల వివరాలను తెలుగులోకి మార్చితే విలువైన తెలుగు పుస్తకాలు తెలుగు వారికి అందుబాటులోకి వస్తాయి. దానికొరకు ప్రయోగాత్మకంగా తెలుగులోకే మార్చే సాఫ్ట్వేర్ తో యాంత్రిక లిప్యంతరీకరణ సలహాలను చేర్చిన గూగుల్ షీట్ మీతో పంచుకుంటున్నాను. ఆంగ్లఅక్షరాలతో రాసిన మూలంలో కోడ్ సరిగా వాడకపోవడంతో యాంత్రిక లిప్యంతరీకరణ నేరుగా వాడలేకపోతున్నాము. దానిలో ఆకుపచ్చ రంగులో వున్న ntitle, nauthor అనే నిలువ వరుసలో ptitle, pauthor లో ప్రశ్నార్ధకంతో మొదలయ్యే వరుసలోని ఆర్కీవ్.ఆర్గ్ లింకు నొక్కి పుస్తకం తొలి పేజీలు చూసి, పుస్తకం శీర్షిక,రచయిత,ఆనువాదం, సంపాదకుల వివరాలు చేర్చాలి. ఇంకా పుస్తక ప్రచురణ సంవత్సరం సరిగా లేకపోతే pdateలో , అది తెలుగు భాషకు కాని పుస్తకం అయితే ఆ భాష కోడ్(tam tel లేక Unknown) అనేది nslang వరుసలో చేర్చాలి. ఒక అంశం దిద్దినపుడు ptitle, pauthor వరుసలో ఆ అంశం తాలూకు మొదటి అక్షరం ప్రశ్నార్ధక చిహ్నాన్ని తొలగించండి. దానితో ఇంకా చేయవలసిన అంశాల సంఖ్యలు మొదటి వరుసలోవి తాజా అవుతాయి. మీకేదైనా సందేహాలుంటే తెలపండి. తెలుగులో మంచి విలువైన పుస్తకాల వివరాలు తెలుసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం. వికీసోర్స్ లో పని చేసిన రోజున 15 నిముషాలు కేటాయించగలిగితే 10 పుస్తకాల వరకు వివరాలు చేర్చగలుగుతారు. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమం పూర్తిచేయటానికి సహకరించవలసింది. వికీసోర్స్ లో కాకుండా గూగుల్ షేర్ లో ఈ పని చేయడానికి మెరుగైన సౌలభ్యం కాబట్టి అలా చేయడమైనది. మీకు గూగుల్ లో తెలుగు టైపు చేయడానికి సమస్య ఏమైనా వుంటే సంప్రదించండి. మీ ఆసక్తి మరియు స్పందనలు తెలియచేయవలసినది.--అర్జున (చర్చ) 07:17, 12 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. గూగుల్‌లో తెలుగు పుస్తకాల పేర్లతో వెతికేవారికి ఆర్కైవ్‌లో నేరుగా లంకె దొరికేస్తుందిక! ఆరువేల పుస్తకాల వివరాలకు మరింత సార్థకత చేకూర్చినందుకు మీకు తెలుగు సమాచరం అందుబాటులోకి ప్రాజెక్టు బృందం తరఫున ధన్యవాదాలు. ఇక మిగతా 17వేల పైచిలుకు పుస్తకాల సంగతికి వస్తే, నేను, చదువరి గారూ గ్రామాల వ్యాసాల పేర్లను గ్రామ వ్యాసాల్లో సమాచారం చేర్చేందుకు ఆంగ్లంలోంచి లిప్యంతరీకరించిన పద్ధతి కొంతమేరకు ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఈ పద్ధతి ప్రకారం ముందు సాధారణంగా మరిమరి వచ్చే కొన్ని పదాలను Replace చేస్తూ పోవాలి. గ్రామాల విషయమై ఉదాహరణ కావాలంటే pur > పూర్, bad > బాద్ ఇలాగన్నమాట. అలా తరచు వచ్చే స్ట్రింగ్స్ గమనించి చేస్తే సగం పనివరకూ పూర్తవుతుంది. తర్వాత మిగిలిన పని విషయమై ఒక్కోదాని మీదా ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. ఈ సూచనలపై మీ ఉద్దేశం ఏమిటో చెప్పగలరు. అసలు పుస్తకాల విషయంలో ఈ పద్ధతే పనికిరాదనుకుంటే మీరన్నట్టే మానవీయంగా చేసుకుందాం. ఒక్కో పేజీ తప్ప తెరుచుకోని డీఎల్ఐలోనే సమర్థవంతంగా పనిచేసినవాళ్ళం కాబట్టి నేరుగా అన్ని వివరాలు తెరిచి చూడగల ఆర్కైవులో పని మరింత సులభం కాగలదనే భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:09, 12 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారి స్పందనకు ధన్యవాదాలు. ఇప్పటికే లిప్యంతరీకరణ సాఫ్ట్వేర్ డిఎల్ఐ కోడ్ IT3 ప్రకారం తయారు చేశాను. కాని మూలంలో ఆ కోడ్ వాడుక సరిగాలేకపోవటంతో ఉపయోగం లేకుండా పోయింది.కాకపోతే గూగుల్ షీట్ లోని సౌలభ్యాలతో మరియు ఆర్కీవ్ వెెబ్సైట్ వాడకరులకు అనువుగావుండండంతో ఈ పనికి పెద్ద సమస్యలు లేవు. కేవలం. ఆసక్తిగల వారు ఎక్కువగా పాల్గొనడమే కావలసినది.--అర్జున (చర్చ) 10:31, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
గూగుల్ తెలుగు ద్వారా తెలుగు లొ వివరాలు బాగానే మారుతున్నయ్, ప్రయత్నిస్తాను , ఇది ఛ్హుడండి Kasyap (చర్చ) 17:59, 1 జూలై 2018 (UTC) https://translate.google.com/#auto/te/Sri%20Madhguru%20Bhabavatham%20Ekadhasha%20Dhwadhasha%20Skandhamulu%0ASri%20Madramayana%20Anthergatha%20Ayodhya%20Kandam%20Andhra%20Tathparya%20Saiththam[ప్రత్యుత్తరం]
Kasyap గారికి, మీరు పై వ్యాఖ్యని హాస్యంగా జోడించారని అనుకుంటాను.--అర్జున (చర్చ) 05:34, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

క్షమించాలి,పైన వ్రాసిన వ్యాఖ్య google to speech to text ద్వారా నేను ఈ మద్య ఎక్కుగా speech to text సాధనాలు వాడుతున్నాను Kasyap (చర్చ)

అర్జున రావు గారూ, క్షమించాలి, మీరు మే లో పంపించిన సందేశం ఇప్పుడే కనబడింది. నేను ఈ ప్రాజెక్టులో సహాయ పడదామనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు అనుకుంటున్నాను. రోజుకు కొంత సమయం కేటాయించి గూగుల్ షీట్ లో ntitle, nauthor నిలువ వరుసలో సమాచారం నింపగలను. ఈ గూగుల్ షీటు పూర్తిగా నిండిన తర్వాత ఈ సమాచారం ఎక్కిడికి వెళుతుంది? పూర్తిగా నిండిన తర్వాతే వెళుతుందా లేదా మనం సమాచారం చేర్చినది చేర్చినట్టు అంతర్జాలం లోకి వెళ్ళే సౌలభ్యం ఉందా? రవిచంద్ర (చర్చ) 11:47, 2 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. నెలకొకసారి పూర్తయిన పనిని ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చడానికి, ఈ పుస్తకాల నిల్వదారు ఒప్పుకున్నారు. మానవీయంగా చేయటానికి చాలా సమయం కావాలి కాబట్టి, వాడుకరి:Chaduvari కొంతమేరకు కంప్యూటర్ సహకారంతో త్వరలో చేద్దామనుకుంటున్నాను. ఆ తరువాత వీటిని పుస్తకపు లింకు తెరిచి తనిఖీ చేయాలి. దీనికి సహాయం చేస్తున్నావారందరితో తాజా విషయాలు ఈ మెయిల్ ద్వారా పంచుకుంటాను.అర్జున (చర్చ) 05:33, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు అర్థం కాలేదు మార్చు

వాడుకరులకు నమస్కారము. ఈ పనిలో ఒక వాడుకరిగా ఏమి చేయాలో నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకు తర్జుమాలు పనులు నిజానికి బాగా ఇష్టం ఉన్నా, అవి అన్నీ ఏమి చేయాలో తెలియక నేను పాల్గొనడము లేదు. దయచేసి అసలు ఉన్న పని ఏమిటి, దానిని తెలుగులోకి ఏమి మార్చాలో ఒక ఉదాహరణగా వివరంగా చూపించి వ్రాయండి. JVRKPRASAD (చర్చ) 01:47, 2 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారికి, ఆంగ్ల లిపిలో వున్న పుస్తకపు పేరు, రచయిత పేరు, తెలుగు లిపిలో చేర్చాలి. గూగుల్ షీట్ లో ఆంగ్ల లిపి లో పుస్తకపు వివరాలు, పుస్తకానికి లింకు, కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా లేక ఇప్పటికే DLI ప్రాజెక్టు ద్వారా తెలుగు లిపిలో పుస్తకపు వివరాలు, వాటిని సరిచేసి రాయటానికి వేరే నిలువ వరుసలు వున్నాయి. ఒకటి రెండు వరుసలు చదివితో సులభంగా అర్ధంచేసుకోవచ్చు. అర్జున (చర్చ) 05:40, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:38, 5 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండియా ఐఆర్సీలో చేరగలరు మార్చు

ఈరోజు (అంటే 2018 మే 12న) రాత్రి 8 గంటలకు భారతదేశ వ్యాప్తంగా వికీమీడియా అంశాలను చర్చించేందుకు భారత ఐఆర్సీ జరగనుంది. http://webchat.freenode.net/?nick వెబ్ వెర్షన్‌కు చేరుకుని మీ పేరు లేక మీ నిక్‌నేమ్ Nickname వద్ద రాసి, ఛానెల్ అన్నదగ్గర #cis-a2k అన్న చానెల్ పేరు చేర్చి ఈ ఐఆర్సీలో చేరవచ్చు. తెలుగు వికీమీడియన్లు దయచేసి చేరతారని ఆశిస్తూన్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:46, 12 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండ - పాలసీలు వద్ద శైలీపరమైన చర్చ మార్చు

రచ్చబండ పాలసీలు వద్ద అతడు-అతను అన్న విభాగంతో "అతడు" అన్న ప్రయోగం చేయాలా, "అతను" అన్న ప్రయోగాన్ని స్వీకరించాలా అన్న అంశంపై శైలీపరమైన చర్చ ప్రారంభించాను. దయచేసి సభ్యులు చర్చించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:51, 13 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

" ఆయన " అన్న ప్రయోగం చేస్తే బాగుంటుందేమో ! T.sujatha (చర్చ) 12:14, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సుజాత గారూ! మీ అభిప్రాయాన్ని రచ్చబండ పాలసీలులో అతడు-అతను అన్న విభాగంతో చేరుస్తున్నాను. ఇక ఈ చర్చను ఎవరైనా ఇక్కడే చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:47, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా దశ-దిశ కాన్ఫరెన్సు ప్రతిపాదన మార్చు

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా దశ తెలుసుకునేలా, తద్వారా తెవికీ నాణ్యత తెలిసేలా "తెలుగు వికీపీడియా దశ-దిశ" పేరిట కార్యక్రమాన్ని రూపొందించేందుకు ప్రతిపాదిస్తున్నాం. తెలుగు వికీపీడియన్లు, బయటి రంగాల నిపుణులు(రచయితలు, సంపాదకులు, జర్నలిస్టులు, చరిత్రకారులు, విజ్ఞానశాస్త్ర రచయిలు, సాంకేతిక రంగ రచయితలు, కాలమిస్టులు, వగైరా) పాల్గొంటారని ప్రతిపాదన. దీని వల్ల మూడు ప్రయోజనాలను లేక లక్ష్యాలను ఉద్దేశిస్తూ ప్రతిపాదిస్తున్నాం.

  1. మదింపు: తెలుగు వికీపీడియా ప్రస్తుత స్థితి ఏమిటన్నది బయటి నిపుణులకు కొన్ని నమూనా వ్యాసాలు (రీడింగ్ లిస్టు), తెలుగు వికీపీడియా చరిత్ర-తెలుగు వికీపీడియన్లు చేసిన ప్రయత్నాలు వంటివాటి ఆధారంగా నాణ్యత, వైవిధ్యం, అవసరమైన సమాచారం, విస్తృతి వంటివి పరామితులుగా పెట్టుకుని మదింపు వేసి, మన, వారి మదింపు ఆధారంగా చర్చలు, ప్రెజంటేషన్లు, ప్రసంగాల వంటివి జరుగుతాయి. గతంలో మనం చేసిన ప్రాజెక్టులు, ప్రయత్నాలను కూడా మనం నిష్పాక్షికంగా అంచనా వేసుకుని వికీపీడియన్లలో కొందరు వాటి ఫలితాలు, వాటి నుంచి నేర్చుకున్నవి వంటివి మదింపు వేసేలా ప్రెజంట్ చేయడమూ జరుగుతుంది.
  2. ప్రదర్శన: ఒక సమిష్టి కృషిగా, తెలుగు భాషకు, తెలుగునాట విజ్ఞానవ్యాప్తికి తెలుగు వికీపీడియన్లు చేసిన ప్రయత్నాలు, దాని ఫలితాలు విస్తృతమైన తెలుగు రంగానికి చూపించేందుకు ఇదొక వేదికగా ఉపయోగించవచ్చని రెండో ప్రతిపాదన. ఇదే వేదికగా తెలుగు భాషకు తెలుగు వికీమీడియా ప్రాజెక్టులు చేసిన కృషి, భవిష్యత్తులో చేయదలుచుకున్న ప్రయత్నాలపై ఒక చక్కని పుస్తకాన్ని రూపొందించి విడుదల చేయడం మన ప్రయత్నాలకు వన్నెతెస్తుందని ఆశిస్తున్నాం.
  3. నేర్చుకోవడం-పంచుకోవడం: పలు రంగాల్లో ఇప్పటికే కృషిచేస్తున్నవారిని పిలిచి మన సమస్యలు, మనం సాధించిన విజయాలు చర్చిస్తూండగా వారి నుంచి మంచి పద్ధతులు మనం నేర్చుకోవడం, మన నుంచి మంచి విధానాలు వారు స్వీకరించడం, మొత్తానికి ఒక భాగస్వామ్య ప్రయత్నాలకు వీలు కలగడం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ విధంగా నేర్చుకోవడం, పంచుకోవడం దీనికి మూడో, మౌలిక లక్ష్యంగా ప్రతిపాదిస్తున్నాం.

ఇది తెలుగు వికీపీడియన్లు పెద్ద ఎత్తున హాజరైన గత వార్షికోత్సవాల స్థాయిలో చేస్తూనే, ఇతర రంగాల ప్రముఖులను, నిపుణులను ఆహ్వానించి విశిష్టమైన ప్రయత్నంగా చేయాలని ఆలోచన. తెలుగు వికీపీడియన్ల ముందు ఈ ప్రతిపాదనను ఉంచేప్పుడు ప్రతిపాదనగానే ఉంచుతున్నామని, దానిని వికీపీడియన్లు చర్చించి, మెరుగుపరిచి మరే రూపొన్నైనా సంతరించేలా చేయడానికి వీలుందని తెలియజేస్తున్నాం. ఈ ప్రతిపాదనపై చర్చించడమే కాక నిర్వహణా సాధ్యమైన ప్రతిపాదన అనీ, నిర్వహించడం తెవికీకి అంతిమంగా మేలుచేస్తుందనీ భావించినట్టైతే నిర్వహణలోనూ ముందుండి నడిపించమని మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:44, 14 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారు "తెలుగు వికీపీడియా దశ-దిశ" పేరిట మంచి కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. కార్యక్రమ లక్ష్యాలు కూడా బాగున్నాయి. గత మూడు సంవత్సరాలుగా మనం అందరం కలిసే పెద్ద కార్యక్రమేది జరగలేదు. గతంలో కంటే ప్రస్తుతం వికీపీడియా గురించి చాలామందికి తెలిసింది, ఇటువంటి సమయంలో మనం ఇంకా జనం దృష్టిని ఆకర్షించడం కూడా చాలా ముఖ్యమని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:28, 18 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)) గారూ! మీ ప్రతిపాదన బాగుంది. నేను 25-05-2018 నుండి ఇండియాలో ఉండను కనుక సమావేశంలో పాల్గొనలేను. 15-10-2018 పైన అయితే పాల్గొనగలను. అయినప్పటికీ కార్యవర్గ సభ్యత్వం ద్వారా గతంలో చేసినట్లు అవసరమైన సహాయం అందించగలను.T.sujatha (చర్చ) 16:04, 24 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)) గారికి. గత కొన్ని నెలలుగా వీకీప్రాజెక్టుల పురోగతి గమనిస్తున్నప్పుడు నాకు అనిపించేదేమంటే,చదువరులు పెరుగుతున్నా క్రియాశీలక సంపాదకులు పెరగడంలేదు. ఒక్క వికీ గ్రామాల ప్రాజెక్టు తప్పిస్తే సమిష్టి కృషికి తార్కాణాలులేవు.ఇటీవలి ప్రాజెక్టు టైగర్ కూడా వ్యక్తిగత కృషిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా రూపొందినదే. రాష్ట్ర స్థాయి వ్యాసాలలో మార్పులకు కూడా సహకారం కనబడుటలేదు. తెలంగాణా వ్యాసాన్ని అభివృద్ధి చేయ‍డానికి సహాయం కోరినా స్పందనలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిట్ట, పూవు మార్పులు జరిగినా రెండ‍ువారాలు పైగా ఎవరూ మార్పులు చేయలేదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యాలు వికీకి అంత ఉపయోగపడలేదు. ఈ సందర్భంలో పెద్ద ఆశయాలతో కార్యక్రమాలు చేపట్టటంకంటే క్రియాశీలంగా వున్న సభ్యుల ఆసక్తులని పరిగణించి వీలైనంతవరకు సమిష్టి ప్రాజెక్టులలో కృషి పెరిగేలాగా చిన్న కార్యక్రమాలు,సమావేశాలు చేపట్టటం మంచిది.--అర్జున (చర్చ) 09:02, 12 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నమస్తే. ప్రాజెక్టు టైగర్ మీరన్నట్టు సమిష్టి కృషికి నేరుగా సాయం చేసేది కాదు, కానీ విమర్శలను స్వీకరించడానికి, తమ శైలిని వికీపీడియా శైలికి తగ్గట్టు దిద్దుకోవడం వంటి సమిష్టి కృషికి మౌలికమైన అంశాలు పెంపొందించేలా సాగిందనే భావిస్తున్నాను. ఎన్ని మార్పులు చేశారన్న ప్రశ్న నుంచి ఎన్ని వ్యాసాలు సృష్టించారన్న ప్రశ్నకు సాగిన సామూహిక ప్రోత్సాహక దృష్టిని, ఇది ఎన్ని వ్యాసాలను అభివృద్ధి చేశారన్న వైపుకు తీసుకుపోతోందనే భావిస్తున్నాను. పోటీలో కొత్త వ్యాసాలు రాసినవారే కాక ఇప్పటికే ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేసినవారూ పరిగణించదగ్గ మంది ఉండడం కూడా ప్రోత్సాహకరమే. అయితే అన్ని ప్రాజెక్టులూ నేరుగా అన్ని ఆశయాలనూ లక్ష్యం చేసుకోలేవు కనుక ఇప్పటికే మన మొదటి పేజీలో ప్రదర్శించిన వ్యాసాలలో ఉన్న సమస్యలను గుర్తింపజేసి (వారు సృష్టించినవి కావు కాబట్టి వ్యక్తిగత కృషి నుంచి సమిష్టి వైపుకు ఒక అడుగు అవుతుందని భావిస్తున్నాను) వాటిని మెరుగుపరిచేలా ఓ ఎడిటథాన్ రూపొందిస్తున్నాం. తద్వారా ఎవరు సృష్టించిన వ్యాసాలు వారే అభివృద్ధి చేసుకునే ధోరణి ఎక్కడైనా ఉన్నా దానిని ఈ ప్రయత్నం తగ్గిస్తుందని ఆశిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 09:25, 23 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

స్వేచ్ఛ, గచ్చిబౌలి కార్యాలయంలో కలవవచ్చు మార్చు

అందరికీ నమస్కారం,
నేను ఆఫీసువేళల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సర్కిల్ వద్ద స్వేచ్ఛ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నాను. బయటి అపాయింట్‌మెంట్లు, మీటింగులు, కార్యశాలలు వంటివి లేని సమయాల్లో స్వేచ్ఛ ఆఫీసులో అందుబాటులో ఉండగలను, కాబట్టి ముందుగా సంప్రదించి వికీపీడియన్లు అక్కడ కలవవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:37, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదులో గతనెలలో నేను ఉండగా ఎవరినీ కలవలేకపోయాను. మా సొంత ఇల్లు గచ్చిబౌలిలోని మాగ్నం ఓపన్ నందు వచ్చినప్పుడు ఉంటాను. మా చెల్లలు సొంత ఇల్లు కూడా అక్కడే ఎదురు బజారులో ఉంది. ఈ సారి మాత్రం తప్పకుండా కలుస్తాను.JVRKPRASAD (చర్చ) 05:43, 15 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"ప్రాజెక్టు టైగర్ - ఎడిట్ ఎ థాన్" సమావేశం మార్చు

అందరికి నమస్కారం. భారతీయ భాషలలో వ్యాసాల అభివృద్ధికి వికీపీడియా "ప్రాజెక్టు టైగర్" పేరుతో గత మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఎడిట్ ఎ థాన్ నిర్వహిస్తే బావుంటుందనే నా ఆలోచనకు పవన్ సంతోష్‌ గారూ తోడ్పాటును ఇస్తూ, వేదికగా తన నివాసాన్ని ఉపయోగించుకోవచ్చని తన సమ్మతిని తెలిపారు. అదేకాక, తన నివాసనమునందు స్వంతంగా ఏర్పాటుచేసుకున్న చిన్న గ్రంథాలయాన్ని ఆరోజు వ్యాసాల అభివృద్ధికి వాడుకోవచ్చని తెలిపారు. కావున సభ్యులు తేదీః 20 మే, 2018 ఆదివారం రోజున, సమయం మధ్యాహ్నం 3 గం. నుండి 6 గం. వరకూ కూకట్‌పల్లి భాగ్యనగర్ ఫేజ్.3లోని హైటెన్షన్ రోడ్డు సమీపంలో పవన్ సంతోష్ గారి నివాసంలో జరిగే ఈ కార్యశాలకూ హాజరుకాగలరని మనవి. పాల్గొనదలిచినవారు ముందుగా 9705658896కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. --Ajaybanbi (చర్చ) 13:02, 18 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Ajaybanbi... ఎడిట్ ఎ థాన్ నిర్వాహణ మంచి ఆలోచన. ఎడిట్ ఎ థాన్ ద్వారా ఎక్కువ మొత్తంలో వ్యాసాలను అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది. తప్పకుండా వస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:36, 19 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అజయ్ గారూ మీ ఉత్సాహానికి చాలా సంతోషం. కార్యక్రమానికి, భవిష్యత్తులో తెవికీపీడియా అభివృద్ధికి మీరు తలపెట్టే కార్యక్రమాలకు నా వంతు సహాయం ఎప్పుడూ లభిస్తుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:19, 19 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

"ప్రాజెక్టు టైగర్" పోటీ చివరి ఎడిటథాన్ సమావేశం మార్చు

అందరికి నమస్కారం. భారతీయ భాషలలో వ్యాసాల అభివృద్ధికి వికీపీడియా "ప్రాజెక్టు టైగర్" పేరుతో నెలసరి పోటీలు గత మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయము విధితమే. ఇందులో భాగంగా పవన్ సంతోష్ గారి సహాయంతో ఎడిట్ ఎ థాన్ నిర్వహిణకు సన్నాహాలు చేసాము. తెలుగు వికీపీడియా సహా పలు భారతీయ భాషల వికీపీడియాలో జరుగుతున్న ఈ పోటీ ఈ శనివారం (మే 26) సాయంత్రం 5-7 గంటల్లో బంజార హిల్స్‌లో ఉన్న లమాకాన్‌లో జరుగుతుంది. ప్రాజెక్టు టైగర్ పోటీలో ఆఖరి నెల, చివరి వారం కనుక అందరూ వచ్చి, వ్యాసాలు రాయాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమం మీటప్‌.కాం అనే చోట ప్రచురణ చేసాము. అందులో ఉన్న తోటి వికిపీడియన్లకు (తెలుగు వారికి మరియు తెలుగు కాని వారికి కూడా) ఈ క్రింది లంకెను పంపండి,

http://meetu.ps/e/FkxkX/yTfmH/d

చిరునామా: Lamakaan Off Road No. 1, Banjara Hills, Opposite GVK One, Green Valley, Banjara Hills, Hyderabad, Telangana 500034 https://goo.gl/maps/fqVCEBzJ21U2

--Bhavabhuthi (చర్చ) 11:43, 24 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను లమకాన్ లో ఉన్నాను , ఇక్కడ ఏ వికీపీడియన్ లేరు 😞 . కశ్యప్

కొన్ని వ్యాసాలు, విషయ ప్రాముఖ్యత మార్చు

ఈ మధ్య నేను తెలుగు వికీకి విషయ ప్రాముఖ్యత లేని కొన్ని వ్యాసాలను చూపించి తొలగింపు ప్రతిపాదన చేశాను. ఉదాహరణకు టిమోన్ మరియు పుంబా, డ్రాగన్ బాల్ జి. ఈ వ్యాసాలు ప్రారంభించిన సభ్యులు వాడుకరి:IM3847 ఇవి తప్పనిసరిగా ఉండాల్సిన వ్యాసాల జాబితాలో ఉన్నాయంటున్నారు. నాకైతే ఈ వ్యాసాలు అంతగా ప్రాముఖ్యత లేదని అనిపిస్తున్నది. మిగతా సభ్యులు తమ స్పందన తెలియజేయగలరు. పవన్ రవిచంద్ర (చర్చ) 06:20, 28 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ! ఇవి గత పదేళ్ళ నుంచి తెలుగు పిల్లలకు బాగానే పరిచయం ఉన్న కార్యక్రమాలండీ. కాకుంటే మన తెలుగువారి మీద ప్రభావం చూపుతున్న కార్యక్రమాలకు కూడా తెలుగులో ఏ పత్రికలోనూ ప్రస్తావన ఉండకపోవచ్చు. కానీ వీటికి తెలుగునాట మంచి ప్రజాదరణే ఉంది. కాబట్టి ఇవి విషయ ప్రాముఖ్యత ఉన్నవనే నా అంచనా. --పవన్ సంతోష్ (చర్చ) 10:26, 28 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
తొలగింపు మూస తీసివేశాను. రవిచంద్ర (చర్చ) 11:42, 28 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సమూహంలో ఉత్సాహ లోపం మార్చు

గత కొంత కాలంగా వికీ సమూహంలో కలయికలు లేదా సమావేశాలు వంటివి లేవు. మంత్లీ మీట్స్‌లో కూడా కొంత స్దబ్దత ఉన్నది. దాదాపు సంవత్సర కాలంగా వికీమిత్రుల సరియైన కలయిక జరగలేదు. మునుపు జరిగినట్టుగా ఉత్సవం వంటి ఒక సమావేశం నిర్వహిస్తే బావుంటుంది. దీనిని ఫక్తు ట్రైనింగ్, ఎడిటధాన్ లేదా క్లాసు లానో కాక కొంత భిన్నంగా నిర్వహిస్తే మరో సారి వికీమిత్రులకు కొంత ఆట విడుపుగా ఉంటుంది. తద్వారా మరికొంత ఉత్సాహంగా వికీ రచనలో పాల్గొనే అవకాశం ఉండవచ్చు అని నా అభిప్రాయం..B.K.Viswanadh (చర్చ)

పైన తెలుగు_వికీపీడియా_దశ-దిశ_కాన్ఫరెన్సు_ప్రతిపాదనలో ట్రైనింగ్, ఎడిటథాన్ కాక తెవికీలో జరిగిన కృషిని తెవికీపీడియన్లు స్వయంగా వివరించడం, తెలుగు సాహిత్యపరులు, శాస్త్ర నిపుణులు, సంపాదకులు వగైరా వచ్చి మనతో చర్చలు జరపడం వంటివి దీనిలో భాగం. కేవలం ఇలా మదింపుకే ఒక పూర్తి కాన్ఫరెన్సు జరపడం వినూత్నమే కాక మనం చేసిన పనిని ప్రపంచం ఎలా చూస్తోందన్న విషయం ఆసక్తిదాయకంగా కూడా ఉండగలదు. తెవికీపీడియన్లను ఒకచోట పోగుచేసి, బయటివారిని, వారిలో వారిని కలిపి, జరిగిన పనిని ఇష్టంగా, సంతోషకరంగా చెప్పుకుని, భవిష్యత్తులో ఏమేం చేయవచ్చో ఆలోచించుకునే ఈ ప్రయత్నం ఉత్సాహపూరితంగా ఉంటుందని భావిస్తూ మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:41, 29 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ప్రయత్నం ముందుకు సాగండి.B.K.Viswanadh (చర్చ)

New Wikipedia Library Accounts Available Now (May 2018) మార్చు


Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to research and tools as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials on the Library Card platform:

  • Rock's Backpages – Music articles and interviews from the 1950s onwards - 50 accounts
  • Invaluable – Database of more than 50 million auctions and over 500,000 artists - 15 accounts
  • Termsoup – Translation tool

Expansions

Many other partnerships with accounts available are listed on our partners page, including Baylor University Press, Loeb Classical Library, Cairn, Gale and Bloomsbury.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 18:03, 30 మే 2018 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.