వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 84
← పాత చర్చ 83 | పాత చర్చ 84 | పాత చర్చ 85 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2021-12-01 : 2022-02-28
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
అనువాదయంత్రంపై ఉన్న మానవీయ అనువాదపరిమితి ఆంక్ష 30% నుండి 25% కి తగ్గించుట
మార్చుఅనువాదయంత్రాన్ని ఎక్కువ మంది తెవికీ వాడుకరులు ఉపయోగించటాన గతంలో నాటికి, ఇప్పటికి దాని నాణ్యత కొంతవరకు పెరిగింది.అనువాదంలో వాక్యనిర్మాణం గాని, ఆంగ్ల పదాలకు సరియైన తెలుగు అర్థాలను సూచించటంలో గాని గణనీయంగా అభివృద్ది చెందింది. సంవత్సరం క్రిందట అనువాదయంత్రం ద్వారా అనువదించటానికి, ఈరోజున అనువదించటానికి చాలా తారతమ్యం ఉంది.ఇప్పటి పరిస్థితులలో గతంలో కష్టపడవలసినంత అవసరం లేదనిపిస్తుంది.అలా అని పూర్తిగా అనువాదయంత్రమే అనువదిస్తుందని కాదు.కొంత మెరుగుపండిందని దాని అర్థం. కావున ఈ పరిస్థితులలో ప్రస్తుతం మానవీయ అనువాద పరిమితిఆంక్ష 30% నుండి 25% కి తగ్గించటానికి ఇక్కడ ప్రతిపాదనలు పేజీనొకదానిని తయారుచేసి చర్చకొరకు సముదాయం దృష్టికి తీసుకురావటమైనది.కావున దీనిమీద గౌరవ వాడుకరులు వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇక్కడ ప్రతిపాదనలు పేజీలో ఒక వారం రోజులలోపు తెలుపవలసిందిగా కోరుచున్నాను. --యర్రా రామారావు (చర్చ) 14:24, 6 డిసెంబరు 2021 (UTC)
Festive Season 2021 edit-a-thon
మార్చుDear Wikimedians,
CIS-A2K started a series of mini edit-a-thons in 2020. This year, we had conducted Mahatma Gandhi 2021 edit-a-thon so far. Now, we are going to be conducting a Festive Season 2021 edit-a-thon which will be its second iteration. During this event, we encourage you to create, develop, update or edit data, upload files on Wikimedia Commons or Wikipedia articles etc. This event will take place on 11 and 12 December 2021. Be ready to participate and develop content on your local Wikimedia projects. Thank you.
on behalf of the organising committee
MediaWiki message delivery (చర్చ) 07:46, 10 డిసెంబరు 2021 (UTC)
హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో వికీపీడియా స్టాల్
మార్చుతెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు నమస్కారం. తెలుగు వికీపీడియా, తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం సంయుక్తాధ్వర్యంలో గత ఏడేళ్ళుగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు నేను సంధానకర్తగా వ్యవహరిస్తున్న విషయం సభ్యులకు తెలిసిందే. ఈ కింది విషయాన్ని తెవికీ సముదాయ సభ్యులకు తెలియజేసేందుకు తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం వారు నన్ను సంప్రదించారు. వారు పంపించిన దానిని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
- స్థానిక భాషల ప్రాధాన్యత పెరగాల్సిన ఆవశ్యకతను రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ప్రాచీన భాష, ప్రజల భాష అయిన తెలుగు భాష గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటిచెప్పేలా తెలంగాణ సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖలోని డిజిటల్ మీడియా విభాగం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇంటర్నెట్ ఆవిర్భావం, సమాచార విప్లవం నేపథ్యంలో, తెలంగాణ భాష, చరిత్ర, సాహిత్య, సాంస్కృతిక తదితర విషయాలపై అంతర్జాలంలో సరైన సమాచారం తెలుగులో ఉండాలి అన్నది తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రధాన లక్ష్యం. ఈ దిశలో, డిజిటల్ మాధ్యమాలపై కృషిచేస్తున్న వ్యక్తులతో లేదా సంస్థలతో కలిసి సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగు వాడుక మరియు అభివృద్ధికై డిజిటల్ మీడియా విభాగం కృషి చేస్తోంది.
- తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం తెలుగు వికీపీడియా ఆవశ్యకతను గుర్తిస్తూ, తెవికీ అభివృద్ధికై అంకిత భావంతో పనిచేస్తున్న తెవికీ సముదాయ సభ్యుల కృషిని అభినందిస్తుంది. అంతర్జాలంలో తెలుగులో సమాచార లభ్యత, పెంపు విషయంలో డిజిటల్ మీడియా విభాగం చేస్తున్న ప్రయత్నాలకు సహాయ, సహకారాలు అందజేయాల్సిందిగా తెవికీ సముదాయ సభ్యులకు వినతి.
- తెలుగు వికీపీడియా, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ, హైదరాబాద్ ఐఐఐటీల భాగస్వామ్యంతో తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో 2019 హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 'ప్రాజెక్టు తెలుగు వికీ' పేరుతో తెలుగు వికీపీడియా కోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వికీపీడియాలో తెలుగులో సమాచారం పెంపొందిపచేయడంలో మరింత ఎక్కువ మందిని భాగస్వాములుగా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమం విజయవంతమైంది.
- అదేవిధంగా, ఈ సంవత్సరం డిసెంబర్ 18 నుండి 27 వరకు జరుగబోతున్న 34వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కూడా తెలుగు వికీపీడియా, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ, హైదరాబాద్ ఐఐఐటీల భాగస్వామ్యంతో 'ప్రాజెక్ట్ తెలుగు వికీ' పేరుతో ఒక స్టాల్ ఏర్పాటుచేసి డిజిటల్ మాధ్యమాలలో తెలుగు సమాచారం అభివృద్ధికి సంబంధించి విస్తృత ప్రచారాన్ని కలిపించాలనుకుంటున్నాం. ఈ బృహత్తర కార్యక్రమంలో తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు పాల్గొనవలసిందిగా తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం తరపున ఆహ్వానిస్తూ, 'ప్రాజెక్ట్ తెలుగు వికీ' స్టాల్ కు సంబంధించి తెవికీ సముదాయ సభ్యుల నుండి సలహాలను, సూచనలను కోరుతున్నాం.
--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:51, 13 డిసెంబరు 2021 (UTC)
- నా అభిప్రాయం:
- ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వానిది కాబట్టి, వారే మనల్ని ఆహ్వానించారు కాబట్టి తెవికీ ఇందులో పాల్గొనవచ్చు, పాల్గొనాలి అని నా అభిప్రాయం. మన ప్రభుత్వం చేస్తున్న పని ఇది, మనకు సంబంధించిన పని ఇది, కాబట్టి మనం పాల్గొనాలి. ఐఐఐటీ వారు ప్రస్తుతం తెవికీ పట్ల అనుసరిస్తున్న ధోరణి నాకు సమ్మతం కాదు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు తెవికీ తరపున మనమూ పాల్గొని తెవికీకి ప్రచారం చెయ్యాలని నేను భావిస్తున్నాను. ఐఐఐటీతో కలిసి కాకుండా మనం విడిగా పాల్గొని మన ప్రచార సామాగ్రితో ప్రచారం చేసుకోవచ్చు. వీలైతే మనకు విడిగా ఒక స్టాలును ఇమ్మని కూడా అడగవచ్చు. ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను సమ్మతిస్తుందని నా భావన. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 03:59, 14 డిసెంబరు 2021 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి ఇది కేవలం స్టాల్ కోసమేనా ?, అయితే తెలుగు వికీపీడియా గానే స్టాల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇస్తారా?. దీనికి ప్రాజెక్టు తెలుగు వికీ అనడం ఏమిటో నాకు తెలియలేదు. కొంచెం వివరించగలరా? B.K.Viswanadh (చర్చ) 05:13, 14 డిసెంబరు 2021 (UTC)
- @Pranayraj1985 గారూ, తెలంగాణ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా విభాగం, వారు తెలుగు వికీపీడియా అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతగానో సహాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ మద్దతును కొనసాగించడం, పైగా ఈ కార్యక్రమానికి వారే ప్రత్యేకించి మనల్ని ఆహ్వానిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం వారితో కలసి ఏ కార్యక్రమంలో పాల్గొనడానికైనా మనకు ఏ అభ్యంతరమూ లేదు. కాకపోతే, ఈ కార్యక్రమంలో ఐఐఐటీ వారు, వారి "ఇండిక్ వికీ ప్రాజెక్టు" కూడా ఇమిడి ఉండడం వల్ల మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇదే రచ్చబండలో ఇంతకుముందు చర్చల్లో 1) తెలుగు వికీపీడియా బదులు తమ url ప్రచారం కావడం గురించి 2) తెలుగు వికీపీడియా సముదాయంతో చర్చించకుండా ఆ పేరిట కార్యక్రమాలు నిర్వహించుకోవడం గురించి 3) ఇంతవరకూ అసలు తెలుగు వికీపీడియాకు తాము చేస్తామని పెద్ద ఎత్తున చెప్పుకుంటున్న కార్యకలాపాల్లో ఏవీ చేయకుండానే ఇలా తప్పుగా చూపించుకోవడం గురించి సమస్యలు లేవనెత్తాము. వారు కనీసం సమస్యలు ఉన్నాయని అంగీకరించడానికి కూడా ఇష్టపడలేదు, సందేహాలని వీటన్నిటినీ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అలానే తెలుగు వికీపీడియా సముదాయంతో కాకుండా విడివిడి వ్యక్తులతోనే తాము వ్యవహరిస్తామని వారి ప్రతినిధి ఇక్కడే రాసేశారు. ఈ ప్రతిష్టంభన అంటూ ఒకటి ఈ రెండు ఎంటిటీల మధ్య ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికే ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని ఇంకొంచెం విస్తరించి, మనకు ఒక ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటుచేస్తే తెలుగు వికీపీడియా ప్రచారాన్ని చక్కగా చేసుకోగలం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం కోరుకుంటున్నది విజువల్ గా తెలుగు వికీపీడియా వేరు, ఈ ఐఐఐటీ హైదరాబాద్ వేరు అన్న స్పష్టత. అలానే, స్టాల్లో మనకు కావాల్సిన రీతిలో బ్యానర్లు పెట్టుకుని పనిచేసుకోగలిగే వీలు ఉంటుందని ఆశిస్తున్నాను. మరొక్కమారు, ఇటువంటి చక్కని అవకాశాన్ని ఎప్పటికప్పుడు కల్పిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం వారి డిజిటల్ మీడియా విభాగానికి ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 13:09, 14 డిసెంబరు 2021 (UTC)
- మరొక్క సంగతి.. మనం ఇందులో పాల్గొంటుంటే మనం కింది అంశాలను గమనంలో పెట్టుకోవాలని నా అభిప్రాయం
- ప్రభుత్వం అనే గొడుగు కింద తెలుగు వికీపీడియా ప్రచారం చేస్తుంది. ఐఐఐటీతో కలిసి కాదు. అయితే మనమేమీ క్రాస్ పర్పస్‌లో పనిచెయ్యం. ఒకే గమ్యం చేరే రెండు వేరువేరు దారులివి అంతే.
- తెలుగు వికీపీడియా ప్రచార సామాగ్రి విడిగా ఉంటుంది.
- కార్యకర్తలు వేరుగా ఉంటారు.
- మన గుర్తింపు వేరుగా ఉంటుంది.
- అలాగే, మనం కింది పనులు చేసుకోవాలి:
- "తెలుగు వికీపీడియా" కార్యక్రమంలో పని చేసేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద కార్యకర్తలను ఎంచుకోవాలి.
- "తెలుగు వికీపీడియా" బ్యానర్లను రూపకల్పన చేసుకుని స్టాలు వద్ద తగిలించుకోవాలి
- "తెలుగు వికీపీడియా" సమాచారంతో కరపత్రాలను ముద్రించాలి.
- "తెలుగు వికీపీడియా" బ్యాడ్జీలను తయారు చేసుకోవాలి.
- పరిశిలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 04:49, 15 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ, చదువరి గారూ... మీరు ఇక్కడ ప్రస్తావించిన అంశాలు డిజిటల్ మీడియా విభాగం వారికి తెలియపరిచాను. వారినుండి స్పందన వచ్చిన తరువాత మనం దాన్నిబట్టి మనం ముందుకెలుదాం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:10, 15 డిసెంబరు 2021 (UTC)
- సహ సభ్యులు (పవన్ సంతోష్, చదువరి గార్లు) ప్రస్తావించిన అంశాలను డిజిటల్ మీడియా విభాగం వారికి తెలియపరుచగా స్టాల్ నిర్వహణ విషయంలో కొన్ని సవరణలకు వారు ముందుకువచ్చారు. `ప్రాజెక్టు తెలుగు వికీ' పేరుతో కాకుండా `తెలుగు వికీపీడియా' పేరుతోనే స్టాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్యానర్లు, కరపత్రాలలో తెలుగు వికీపీడియాకు ప్రాధానత్య ఇస్తామన్నారు. అందుకోసం వికీపీడియా URLను ఇవ్వడంతోపాటు, ఔత్సాహికులు సంప్రదింపులు జరపడానికి వీలుగా తెలుగు వికీపీడియాకు సంబంధించిన మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరును ఇస్తే వాటిని కూడా బ్యానర్లు, కరపత్రాలలో చేరుస్తామన్నారు. అంతేకాకుండా తెవికీ ప్రచారంలో భాగంగా ఎక్కువమందికి చేరడానికి స్టాల్ వేదికగా ఎలాంటి కార్యక్రమాలు, పనులు చేయవచ్చునో సలహాలు ఇవ్వమని కూడా కోరారు.
- పవన్ సంతోష్ గారూ, చదువరి గారూ... మీరు ఇక్కడ ప్రస్తావించిన అంశాలు డిజిటల్ మీడియా విభాగం వారికి తెలియపరిచాను. వారినుండి స్పందన వచ్చిన తరువాత మనం దాన్నిబట్టి మనం ముందుకెలుదాం.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:10, 15 డిసెంబరు 2021 (UTC)
- నా అభిప్రాయం,
- డిజిటల్ మీడియా విభాగం వారు తెలిపిన దాన్నిబట్టి చూస్తే తెలుగు వికీపీడియా తరపున మనమూ పాల్గొని తెవికీకి ప్రచారం చెయ్యాలని నేను భావిస్తున్నాను. ఇకపోతే... తెలుగు వికీపీడియా తరపున ప్రచారానికి ప్రత్యేక స్టాలు కాని, ప్రత్యేక ప్రచార సామాగ్రి తయారుచేసుకోవలసిన పనిలేదు. కాకపోతే తెవికీ తరపున స్టాలులో ప్రతిరోజూ కనీసం ముగ్గురు స్వచ్ఛంద కార్యకర్తలు ఉండేలా చూసుకోవాలి.
- నా అభిప్రాయం,
- సమయం తక్కువగా ఉన్నందున ఈ విషయమై సముదాయ సభ్యులు ఈరోజు సాయంత్రం వరకు తమతమ స్పందనలను తెలియజేయవలసిందిగా కోరుతున్ననాను. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:31, 16 డిసెంబరు 2021 (UTC)
- తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం వారు తెలుగు వికీపీడియా ఆవశ్యకతను గుర్తిస్తూ, తెవికీసముదాయం సమస్యను అర్థం చేసుకుని హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో వికీపీడియా స్టాల్ కొనసాగించుటానికి అవసరమైన మార్పులుతో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చురుకైన కొత్తవాడుకరులుతో మరింతసమర్థంవంతంగా విజయవంతంచేయవలసిన భాధ్యత మనందరిపై ఉంది.హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్న తెవికీ వాడుకరులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించగలరు. యర్రా రామారావు (చర్చ) 06:53, 16 డిసెంబరు 2021 (UTC)
- @Pranayraj1985 గారూ, సమన్వయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. మన అభ్యర్థన విషయంలో తమకు సాధ్యమైనంత వరకు సానుకూలంగా వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు వికీపీడియాకు అంటూ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి వంటివి లేవు కనుక మనం వాటిని విడిచిపెట్టవచ్చు. ఇక ఈ స్టాల్ విషయంలో నా సూచన ఏమిటంటే - అక్కడికి వచ్చే రచయితలు, పత్రికా ప్రముఖులు, పబ్లిషర్లు వంటివారిని ఫోటోలు తీయడానికి అదే స్టాల్లో చిన్న బూత్ వంటిది నిర్వహించడం బావుంటుంది. మంచి ప్రచారమూ జరుగుతుంది, మనకు పనికివచ్చేలా ఫోటోలూ లభిస్తాయి. పవన్ సంతోష్ (చర్చ) 15:43, 16 డిసెంబరు 2021 (UTC)
- సభ్యులకు సమస్కారం, హైదరాబాదు బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహించిన నేపథ్యంలో 422మంది ఔత్సాహికులు తెవికీ శిక్షణకు రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికి ట్రిఫుల్ ఐటి హైదరాబాదు వారి ఆధ్వర్యంలో జనవరి 3 నుండి వారం రోజులపాటు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుండి 8.30 వరకు ఆన్లైన్ వేదికగా తెవికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆసక్తిగల సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఔత్సాహిక రచయితలకు శిక్షణ అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభ్యులు తమ స్పందనలను తెలియజేయగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:45, 3 జనవరి 2022 (UTC)
- సమయం తక్కువగా ఉన్నందున ఈ విషయమై సముదాయ సభ్యులు ఈరోజు సాయంత్రం వరకు తమతమ స్పందనలను తెలియజేయవలసిందిగా కోరుతున్ననాను. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:31, 16 డిసెంబరు 2021 (UTC)
అతర్జాతీయ తెలుగు సంబరాలు, భీమవరం
మార్చు2022 జనవరి 7,8 తేదీల్లో భీమవరం లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసంబరాలలో తెలుగు వికీ తరపున పాల్గొనే అవకాశం ఉందా?, తెలుగు వికీపై కనీసం ఒక ప్రజంటేషన్ అయినా ఇవ్వగలిగితే బావుంటుంది. అలాగే ఎక్కువమంది భీమవరం, పెదఅమిరం మరియు పరిశరప్రాంతాల గురించి వెదుకుతారు కనుక ఆ వ్యాసాలను ఆయా ప్రాంత ప్రముఖ పర్యాటక పేజీలను సృష్టించి మరింత మెరుగుపరచడం, సంబరాలపై వ్యాస పేజీని ప్రారంభించడం ద్వారా ఎక్కువ వ్యూస్ రావచ్చు..B.K.Viswanadh (చర్చ) 05:24, 14 డిసెంబరు 2021 (UTC)
- ప్రజెంటేషను తయారు చెయ్యగలిగినవారు ఎవరైనా ముందుకొస్తే, నా శక్తి మేరకు నేను తోడ్పడగలను. __ చదువరి (చర్చ • రచనలు) 05:06, 15 డిసెంబరు 2021 (UTC)
- గొప్ప ఆలోచన, దీనికి అవసరమైన ప్రెజెంటేషన్ తయారుచేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. Nskjnv ☚╣✉╠☛ 16:18, 15 డిసెంబరు 2021 (UTC)
- మిస్టర్ సాయికిరణ్ ప్రజెంటేషన్ తయారుచేయడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణిలో తెవికీమీద ప్రెజెంటేషన్ ఒకటి రికార్డు చేసి ఉన్న మీరు, దీనిని చాలా సమర్థవంతగా చేయగలరని నమ్ముతున్నా ను. యర్రా రామారావు (చర్చ) 05:48, 16 డిసెంబరు 2021 (UTC)
- గొప్ప ఆలోచన, దీనికి అవసరమైన ప్రెజెంటేషన్ తయారుచేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. Nskjnv ☚╣✉╠☛ 16:18, 15 డిసెంబరు 2021 (UTC)
- @B.K.Viswanadh గారూ, ప్రజెంటేషన్ తయారుచేయడానికి @Nskjnv, సాయం చేయడానికి @Chaduvari గార్లు ఇప్పటికే ముందు వచ్చారు. మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశం ఉందా? ఎందుకంటే ఈరోజు 22 తారీఖు, మహా అయితే ఓ రెండు వారాల సమయం ఉంది. ఇప్పుడు మీరు చెప్తే వాళ్ళు పనిచేసేందుకు టైం ఉంటుంది. పవన్ సంతోష్ (చర్చ) 10:35, 22 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారు నేను జరుగుతున్నాయి కనుక : తెలుగు వికీ తరపున పాల్గొనే అవకాశం ఉందా? : అని అడిగాను. ఉంటే దీనిపై చర్చించవచ్చు, లేదంటే విరమించుకోవచు, దీని గురించి కొందరు వెదుకుతారు కనుక ఆయా ప్రాంతాల వ్యాసాలను రాయవచు అని సూచించాను. ఆశక్తి ఉన్నవాళ్ళు రాస్తారు. ప్రజెంటేషన్ అంటారా? ముందు పాల్గొనె అవకాశం ఉందా లేదా తెలిస్తే అపుడు చూడవచ్చు నాకు ప్రస్తుతం సమయాభావం వలన చేయాలనుకున్నా చేయలేను. కానీ నేనూ చేయగలవారికి తొడ్పడగలను. సహ వికీ మిత్రుల సూచనలనట్టి సమర్ధవంతులైన వారున్నారు, వారెవరైనా ముందుకు వచ్చి చేయవచ్చు. ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 11:23, 22 డిసెంబరు 2021 (UTC)
- @B.K.Viswanadh <<తెలుగు వికీ తరపున పాల్గొనే అవకాశం ఉందా?>> అన్నారు కదా. మీరు పాల్గొనదలిచి ఆ పాల్గొనడమేదో "తెవికీ తరఫున పాల్గొనేందుకు అవకాశం ఉందా?" అని అడుగుతున్నారని అనిపించింది. అందుకే అలా అడిగాను. @Chaduvari గారికి అలా అర్థమైందో లేదో తెలియదండీ. "తెలుగు వికీ తరఫున ఎవరైనా పాల్గొంటారా" అని అడిగితే ఈ అయోమయం ఉండేది కాదు. సరేనండీ విశ్వనాథ్ గారూ. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 11:47, 22 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారు నేను జరుగుతున్నాయి కనుక : తెలుగు వికీ తరపున పాల్గొనే అవకాశం ఉందా? : అని అడిగాను. ఉంటే దీనిపై చర్చించవచ్చు, లేదంటే విరమించుకోవచు, దీని గురించి కొందరు వెదుకుతారు కనుక ఆయా ప్రాంతాల వ్యాసాలను రాయవచు అని సూచించాను. ఆశక్తి ఉన్నవాళ్ళు రాస్తారు. ప్రజెంటేషన్ అంటారా? ముందు పాల్గొనె అవకాశం ఉందా లేదా తెలిస్తే అపుడు చూడవచ్చు నాకు ప్రస్తుతం సమయాభావం వలన చేయాలనుకున్నా చేయలేను. కానీ నేనూ చేయగలవారికి తొడ్పడగలను. సహ వికీ మిత్రుల సూచనలనట్టి సమర్ధవంతులైన వారున్నారు, వారెవరైనా ముందుకు వచ్చి చేయవచ్చు. ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 11:23, 22 డిసెంబరు 2021 (UTC)
- ఇక విశ్వనాథ్ గారు తనవైపు నుంచి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఐతే, దీనిని ఇలా ముగించడం నాకు ఇష్టం లేదు. మనం భీమవరం వెళ్ళి ప్రెజంటేషన్ ఇవ్వగలిగినా లేకున్నా మనవైపు నుంచి ఈ సంబరాల కోసం ఒక పనిచేయవచ్చు. తెలుగు భాష కోసం భాషాభిమానులుగా, సాహిత్యవేత్తలుగా వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి మద్దతుగా, మనవైపు నుంచి వీరికి ఒక బహుమతిగా "తెలుగు భాషా సాహిత్యాలపై ఎడిటథాన్" నిర్వహిద్దాం. మరీ ముఖ్యంగా సమకాలీన తెలుగు భాష, సాహిత్యాలకు సంబంధించిన వ్యక్తులు, పుస్తకాలు, పురస్కారాలు, సంస్థలు వంటివి అంశాలుగా తీసుకుని, వ్యాసాలను సృష్టించడం, విస్తరించడం చేయవచ్చు. ఇందుకు సిద్ధం కావడానికి మనకు చక్కగా వారం రోజుల సమయం ఉంది. జనవరి 1 నుంచి ప్రారంభించి సంక్రాంతి గడిచేదాకా చేసుకుంటే హాయిగా మనవాళ్ళు అందరూ పాల్గొని విజయవంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆ నిర్వాహక సభ్యులకు తెలియపరిచి, వేదిక మీద ఘనంగా ప్రకటింపజేసి, వీలైతే ఈ ప్రయత్నం యొక్క వివరాలు ప్రదర్శింపజేసేందుకు నేను చొరవ తీసుకుంటాను. ఆ నిర్వాహక బృందంలో ఒకరిద్దరు నాకు పరిచితులే. ఒకవేళ అదంతా కుదరకపోతే మనకు వచ్చిన నష్టమేమీ ఉండదు, లాభంగా కొన్ని మంచి మంచి వ్యాసాలు, బాగా కృషిచేశామన్న ఆత్మ సంతృప్తి. దానికి సాటేదీ లేదు కదా!
- ఈ ప్రయత్నం నచ్చితే, తమకు వీలైతే నాయకత్వం వహించాల్సిందిగా ఇటీవలి కాలంలో అత్యంత. ఉత్సాహంగా పనిచేస్తున్న కొత్తవారు @Nskjnv, MYADAM ABHILASH,వంటివారికి సూచిస్తున్నాను. సహ వికీపీడియన్లు ఏమంటారు? సైయా? పవన్ సంతోష్ (చర్చ) 14:55, 23 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ, అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా Nskjnv తో కలిసి "తెలుగు భాషా సాహిత్యాలపై ఎడిటథాన్" ను నిర్వహించడానికి నేను సిద్ధం.--అభిలాష్ మ్యాడం 09:08, 25 డిసెంబరు 2021 (UTC)
- "తెలుగు భాషా సాహిత్యాలపై ఎడిటథాన్" కు నేనూ సిద్ధమే యర్రా రామారావు (చర్చ) 10:33, 25 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ, విశ్వనాధ్ గారు పుల్ స్టాప్ పెట్తేసారు ముగించేసారు అంటే ..దానిలో మీ అర్ధం ఏమిటో వివరించగలరా?. ఈ చర్చ మొదలుపెట్టింది నేను. ఒక ఎడిట్ధాన్ లా కొన్ని వ్యాసాలు రాయాలి అని, లేదా ఉన్న వ్యాసాలు అభివృద్ది చేయాలని రాసాను. పెజెంటేషన్ గురించి పుల్‌స్టాప్ పెట్టారు అని ఉంటే అర్ధవంతంగా ఉండేది. వ్యాసాలను రాయాలి అనేదానికి మన వైపు నుండి తెలుగు బాషా సాహిత్యాలపై ఎడిట్‌ధాన్ చేయాలనుకున్నపుడు నాయకత్వం లేదా అధికారం ఎవరికైనా ఇచ్చుకోండి (ఈ సంస్కృతి ఉంటే) దానిలో ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ.."ఇలా ముగించడం ఇష్టం లేదు అని వ్యాసాలు రాయాలి" అనీ మీరేదో కొత్తగా ప్రతిపాదించినట్టు, నేను తప్పుకున్నట్టు, అన్యాపదేశంగా సూచిస్తూ లౌక్యంగా భలే రాసుకొచ్చారు.....B.K.Viswanadh (చర్చ) 05:39, 29 డిసెంబరు 2021 (UTC)
- @B.K.Viswanadh గారూ, ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నదే లెండి. 2013 డిసెంబరులో నేను తెవికీకి వస్తే 2014 ఫిబ్రవరి నాటికి నన్ను ప్రోత్సహించి సాహిత్యం అన్న పెద్ద ప్రాజెక్టు ప్రారంభించపజేసి, తాను వెనుక వెనుక సభ్యునిగా చేరి, ఎంతగానో ఉత్సాహపరిచిన @Rajasekhar1961 గారి బాటలోనే నేను కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినవారినే నాయకత్వం వహించమని ఆహ్వానించాను. మీరు "దీని గురించి కొందరు వెదుకుతారు కనుక ఆయా ప్రాంతాల వ్యాసాలను రాయవచు అని సూచించాను. ఆశక్తి ఉన్నవాళ్ళు రాస్తారు." అని మీరు ఆనాడే తేల్చేసి ఉండకపోతే నేనూ ఫుల్ స్టాప్ అనేవాడిని కాదు. పైగా, "ఆశక్తి ఉన్నవాళ్ళు రాస్తారు." అని మీరు అన్నాకా కూడా మిమ్మల్నే చేయమనడం మర్యాదా కాదు, స్వచ్ఛంద కార్యక్రమాల పద్ధతీ కాదు.
- ఇప్పుడు విషయం ఏమిటంటే - నేను పైన సూచించిన విధంగానే కార్యక్రమ నిర్వాహకులను సంప్రదించాను. కలిసి మాట్లాడాను. వాళ్ళతో మాట్లాడి ఈ కార్యక్రమానికి తీయబోయే ఫోటోలను సీసీ-బై-ఎస్.ఎ. కింద విడుదల చేసేలా అంగీకరింపజేశాను. మనం ఒక స్టాల్ నిర్వహించుకోవడానికి, 8వ తేదీన వేదిక మీద 15 నిమిషాల పాటు వికీపీడియా, ఇతర అంతర్జాల ప్లాట్ ఫారంల గురించి రచయితలకు వివరించడానికి సుముఖంగా ఉన్నారు. మీరు గనుక కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంతో ఉంటే స్టాల్ విషయంలోనూ, ప్రసంగం విషయంలోనూ, పాంప్లెట్ల విషయంలోనూ మీరే నేతృత్వం వహించవచ్చు. మీరే చేయవచ్చు. ప్రయాణ ఖర్చుల విషయమై సీఐఎస్-ఎ2కె వారిని అడుగుదాం, ఇతర వికీపీడియన్లతో సంప్రదించి మీరే ముందుకు తీసుకువెళ్ళితే నాకూ సంతోషమే. మీ అభిప్రాయం చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 08:33, 31 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ, విశ్వనాధ్ గారు పుల్ స్టాప్ పెట్తేసారు ముగించేసారు అంటే ..దానిలో మీ అర్ధం ఏమిటో వివరించగలరా?. ఈ చర్చ మొదలుపెట్టింది నేను. ఒక ఎడిట్ధాన్ లా కొన్ని వ్యాసాలు రాయాలి అని, లేదా ఉన్న వ్యాసాలు అభివృద్ది చేయాలని రాసాను. పెజెంటేషన్ గురించి పుల్‌స్టాప్ పెట్టారు అని ఉంటే అర్ధవంతంగా ఉండేది. వ్యాసాలను రాయాలి అనేదానికి మన వైపు నుండి తెలుగు బాషా సాహిత్యాలపై ఎడిట్‌ధాన్ చేయాలనుకున్నపుడు నాయకత్వం లేదా అధికారం ఎవరికైనా ఇచ్చుకోండి (ఈ సంస్కృతి ఉంటే) దానిలో ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ.."ఇలా ముగించడం ఇష్టం లేదు అని వ్యాసాలు రాయాలి" అనీ మీరేదో కొత్తగా ప్రతిపాదించినట్టు, నేను తప్పుకున్నట్టు, అన్యాపదేశంగా సూచిస్తూ లౌక్యంగా భలే రాసుకొచ్చారు.....B.K.Viswanadh (చర్చ) 05:39, 29 డిసెంబరు 2021 (UTC)
- "తెలుగు భాషా సాహిత్యాలపై ఎడిటథాన్" కు నేనూ సిద్ధమే యర్రా రామారావు (చర్చ) 10:33, 25 డిసెంబరు 2021 (UTC)
అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వాహకులతో నా చర్చ - పురోగతి
మార్చు@B.K.Viswanadh:, @యర్రా రామారావు:, @MYADAM ABHILASH:, @Chaduvari:, @Nskjnv: గార్లకు నమస్కారం. పై చర్చలో నేను సూచించిన విధంగా అంతర్జాతీయ తెలుగు సంబరాలు - 2022 కమిటీకి నేతృత్వం వహించిన గజల్ శ్రీనివాస్ గారితో మాట్లాడాను. మన ప్రయత్నం తెలుసుకుని ఆయన చాలా ఆనందించారు. సంబరాల్లో భాగంగా పలువురు ప్రాచీన తెలుగు కవుల వారసులు, రాజ్యాల వారసులు హాజరవుతున్నారనీ, సినీ ప్రముఖులైన సాయి కుమార్ గారి 50వ నట సంవత్సరం సందర్భంగా పురస్కారం ప్రదానం చేస్తున్నామనీ, తెలుగు శోభా యాత్ర నిర్వహిస్తున్నామనీ తెలియజేశారు. ఈ సందర్భంగా తీసే ఫోటోల్లో ఎందరో తెలుగు సాహిత్య, సినీ, రాజకీయ ప్రముఖులు ఉంటారు కనుక వీటిని సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సుల్లో విడుదల చేస్తే, తెలుగు వికీపీడియాకే కాకుండా తెలుగు వారందరికీ ఉపయోగపడతాయని నేను సూచించగా తప్పకుండా అలా చేద్దామని ఆయన అన్నారు. తెలుగు వికీపీడియాతో ఈ పరంగా కలిసి పనిచేయడం తమ సంస్థకు కూడా సంతోషకరమని ఆయన తెలియజేశారు. ఈరోజు ఆయన రాజకీయ ముఖ్యులను కలిసేందుకు విజయవాడ ప్రాంతానికి వచ్చారు. కనుక, నేను ఆయన కలిసి ఈ విషయాలపై మరింత వివరంగా మాట్లాడుకోవచ్చునని భావించాము. ఈ విషయంలో చర్చించిన మీరూ, మీతో పాటుగా వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:K.Venkataramana, వాడుకరి:రవిచంద్ర, తదితర చురుకైన సభ్యులు ఈ విషయమై మీ సూచనలు అందించగలరని ఆశిస్తున్నాను. వారితో కలిసి మనం చేయగల పనుల గురించి, మీకేమైనా సూచనలు ఉంటే తెలియజేయగలరు. (ఈరోజు చర్చ లోపు అనే కాదు, రానున్న కొద్ది రోజుల్లో అయినా మనం వారితో ప్రస్తావించేందుకు వీలుంటుంది.) ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 08:11, 30 డిసెంబరు 2021 (UTC)
- @Pavan santhosh.s గారూ, భేషైన పని చేసారు. అభినందనలు.
- కొన్ని సూచనలు:
- ఆయన్ని కలిసినపుడు ఈ ఉత్సవాల గురించి ఆయన నుండి సమాచారం (సభల ధ్యేయం, కార్యక్రమ వివరం, లోగో, దాని వెబ్‌సైటు, ఆహ్వాన పత్రిక వంటివి) సేకరించండి. దాన్ని వికీ పేజీలో చేర్చవచ్చు
- సమావేశాల గురించి అక్కడ మనం ఒక పోస్టరో మరొకటో పెట్టుకోవచ్చేమో అడుగుదాం. ఈ విధంగా తెవికీకి ప్రచారం కలుగుతుంది.
- మన ప్రాజెక్టు గురించి వివరించండి. దాని పట్ల వాళ్ళ సలహాలేమైనా ఉంటే తీసుకోండి. ఆయా పేజీలకు పనికొచ్చే సమాచారం వాళ్ళ వద్ద ఉంటే తీసుకోండి.
- @MYADAM ABHILASH గారూ, ఈ ప్రాజెక్టుకిది శుభసూచకం. ఈ సభల గురించి ప్రస్తుతానికి తెలిసిన సమాచారంతో ఒక పేజీని సృష్టించండి. దానిలో మనం సమాచారం చేర్చుకుంటూ పోవచ్చు.
- ఈ సమావేశాలకు, వీలున్నవారెవరైనా వెళ్తే బాగుంటుంది. __ చదువరి (చర్చ • రచనలు) 08:31, 30 డిసెంబరు 2021 (UTC)
- పవన్ సంతోష్ గారూ, చదువరి గారు అన్నట్టు మీరు గజల్ శ్రీనివాస్ గారితో దీని గురించి మాట్లాడటం ఈ ప్రాజెక్టుకు శుభసూచకం. ఈ సభల గురించి భీమవరం అంతర్జాతీయ తెలుగు సంబరాలు పేజీ సృష్టించాను. తగిన సమాచారాన్ని చేర్చుతూ వెళ్దాం--అభిలాష్ మ్యాడం 11:47, 30 డిసెంబరు 2021 (UTC)
- @Chaduvari గారూ, @MYADAM ABHILASH గారూ, మీ సూచనలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఆయనతో చర్చించాకా ఈ కింది అంశాల ప్రతిపాదన జరిగింది.
- కార్యక్రమానికి హాజరు కమ్మని ఆసక్తిగల తెలుగు వికీపీడియన్లకు ఆయన ఆహ్వానాన్ని అందించారు.
- 8వ తేదీన వేదికపై మాట్లాడమని ఆహ్వానించారు. హాజరయ్యేవారిలో ఎక్కువగా కవులు, రచయితలు ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలుగు వికీపీడియాతో పాటుగా గూగుల్, ఫేస్ బుక్, కోరా, యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్ ఫాంలను కవులు ఎలా వినియోగించుకోవచ్చు అన్నదానిపై మాట్లాడమని నన్ను కోరారు. అయితే, వేదిక మీద చాలా ప్రముఖమైన సమయంలో ఈ అవకాశం ఇవ్వనున్నట్టు అందుకోసం 15 నిమిషాలకే ఈ ప్రసంగం/ప్రెజంటేషన్ పరిమితమైతే బావుటుందనీ చెప్పారు.
- ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కింద వేలాదిమంది ప్రేక్షకులకు పంచేలాగా పాంప్లెట్లు తయారుచేయిస్తామనీ, అందులో స్పష్టంగా తెలుగు వికీపీడియా గురించి, దానిలో వారు రాయవచ్చన్నదాని గురించి, యూఆర్ ఎల్ వంటి వివరాలు పొందుపరచవచ్చు అన్నారు. అందులోనూ కవులకు ఉపయోపగడే ఇతర ప్లాట్ ఫాంలు ఉండేలా చూడాలని కోరారు. ఈ పాంప్లెట్ల ప్రింటింగ్ మొత్తానికి వారే ఖర్చుచేస్తామని చెప్పారు.
- వేదిక వద్ద ఒక తెలుగు వికీపీడియా స్టాల్ కూడా ఏర్పాటుచేస్తామని తెలియజేశారు. అక్కడ తెవికీ గురించి ప్రచారం చేయడానికి వీలుగా ఏర్పాట్లు, బ్యానర్లు వంటివన్నీ ఏర్పాటుచేయించగలమని తెలియపరిచారు.
- ఇది ఇలా ఉండగా ఇంతకుముందు చర్చించినట్టుగా కార్యక్రమం ఫోటోలన్నీ సీసీ-బై-ఎస్.ఎ. కింద విడుదల చేయడం ఎలాగూ ఉన్నది. మొదటి రెండు రోజులూ హాజరు కాలేకపోయినా 8వ తేదీ హాజరుకావాలని నేను ప్రణాళిక వేసుకుంటున్నాను. ఈ విషయమై ఇంకెవరైనా వచ్చేట్టు అయితే ప్రయాణ ఖర్చుల కోసం మనం సీఐఎస్-ఎ2కె వారిని అడిగి ఏర్పాట్లు చేసుకోవచ్చు. బస కార్యక్రమ నిర్వాహకులను అడగవచ్చు. అయితే, ఆసక్తి ఉంటే త్వరగా తెలియజేయండి. పెద్ద వ్యవధి లేదు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:24, 31 డిసెంబరు 2021 (UTC)
- @Pavan santhosh.s గారూ, మంచి పురోగతి సాధించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మనం కరపత్రాల్లో చేర్చేందుకు తగిన సమాచారాన్ని తయారు చేసుకోవాలైతే.__ చదువరి (చర్చ • రచనలు) 08:55, 31 డిసెంబరు 2021 (UTC)
- @Pavan santhosh.s గారూ మీ కృషికి ధన్యవాదాలు.ప్రస్తుతం వ్యాసాలు రాసేదానికన్నా ఉన్న వ్యాసాలకు తెలుగు సంబరాలలో వికీపీడియాకు అవకాశం ఉన్నంతవరకు ప్రచారం కల్పించటం ముఖ్యం. దానిలో భాగంగా నాదొక చిన్న సలహా.తెలుగు వికీపీడియాలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు వర్గంలో 48 మంది తెలుగు రచయితల, రచయిత్రుల వ్యాసాలు ఉన్నవి. ఆ 48 వ్యాసాల జాబితాను QR Codeతో ఒక పోష్టరుగా తయారుచేసి ఈ సందర్బంగా ప్రచురిస్తే సముచితంగా భాగుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుతం ప్రతివారి దగ్గర ఆండ్రాయిడ్ ఫోనులు ఉన్నవి.QR Code Scaner ద్వారా స్కాన్ చేసి ఆలింకు ద్వారా తెలుగు వికీపీడియాలోని వ్యాసాలను చదువచ్చు అని ఆ పోష్టరులో వారికి తెలుపవచ్చు.ఇంకా అవకాశం ఉంటే భీమవరం సమీపంలోని ముఖ్య ప్రాంతాల వ్యాసాలు, తెలుగు సంబరాల నిర్వాహకుల వ్యాసాలు వికీలో ఉన్నవాటిని ఇదే పద్ధతిలో ప్రచురించవచ్చు.నేను ఉదాహరణకు విశ్వనాధ సత్యనారాయణ వ్యాసానికి QR Code జనరేట్ చేసాను.ఒకసారి పరిశీలించండి. ప్రచురించటానికి అవకాశం ఉంటే,సముదాయ సభ్యుల స్పందనలబట్టి చిత్తు పోష్టరు QR Code లతో నేను తయారు చేస్తాను.చదువరి గారూ, అభిలాష గారూ ఇంకా తదితర సభ్యులు దీనిమీద స్పందించగలరు. సమయం దగ్గరలో ఉంది. యర్రా రామారావు (చర్చ) 10:20, 31 డిసెంబరు 2021 (UTC)
- Pavan santhosh.s గారూ నేను 6 వతేదీ భీమవరంలో ఉంటాను. నావైపు చేయగల సహాయం ఉంటే తెలియచేయండి. ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 01:44, 2 జనవరి 2022 (UTC)
- ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు @B.K.Viswanadh గారూ!
- ఇతర సభ్యలకు వివరణ: నేను విశ్వనాథ్ గారినీ, నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ గారిని కనెక్ట్ చేశాను. శ్రీనివాస్ గారు ఇంతకుముందు సూచించినదాని ప్రకారం ఇ-తెలుగు గురించిన ఒక పాంప్లెట్ కంటెంట్ విషయంలో విశ్వనాథ్ గారూ, నేనూ ఇద్దరం పనిచేశాం. ప్రస్తుతానికి ఆయన డిజైన్ పనిచేస్తున్నారు. విశ్వనాథ్ గారు కార్యక్రమాలకు ప్రత్యక్షంగా హాజరవుతున్నారు. 8వ తేదీన ప్రసంగం కూడా వీలును బట్టి ఆయన చేస్తారు. నేను కొద్దిపాటి అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రయాణించలేకపోవచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 02:36, 6 జనవరి 2022 (UTC)
- Pavan santhosh.s గారూ నేను 6 వతేదీ భీమవరంలో ఉంటాను. నావైపు చేయగల సహాయం ఉంటే తెలియచేయండి. ధన్యవాదాలు.B.K.Viswanadh (చర్చ) 01:44, 2 జనవరి 2022 (UTC)
- @Pavan santhosh.s గారూ, మంచి పురోగతి సాధించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మనం కరపత్రాల్లో చేర్చేందుకు తగిన సమాచారాన్ని తయారు చేసుకోవాలైతే.__ చదువరి (చర్చ • రచనలు) 08:55, 31 డిసెంబరు 2021 (UTC)
- @Chaduvari గారూ, @MYADAM ABHILASH గారూ, మీ సూచనలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఆయనతో చర్చించాకా ఈ కింది అంశాల ప్రతిపాదన జరిగింది.
లైసెన్స్ లేని చిత్రాల లింకులు తొలగింపులు బాట్ గా గుర్తించడంలో సమస్య
మార్చుచిత్రాల సమీక్షలో భాగంగా లైసెన్స్ లేని చిత్రాలకు లైసెన్స్ లు చేర్చమని విజ్ఞప్తి చేసినను లైసెన్స్ లు చేర్చబడని చిత్రాలను, అలాగే కామన్స్ లో నకలులున్న చిత్రాలను తొలగించడం, ప్రధానపేరుబరి, వికీపీడియా పేరుబరి వ్యాసాలలో ఆ చిత్రాల లింకులును నా బాట్ ఖాతాతో (Arjunaraocbot) తొలగించడం ప్రారంభించాను. ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్య కారణంగా నా బాట్ ఖాతా మార్పులు బాట్ మార్పులుగా గుర్తించబడవు. ఇటీవలి మార్పులు గమనించేవారికి కొంత అసౌకర్యం కలిగించక తప్పనందుకు క్షమించాలి. అర్జున (చర్చ) 06:51, 20 డిసెంబరు 2021 (UTC)
- బాట్ సవరణ సారాంశంలో దోషం సరిదిద్దబడింది.--అర్జున (చర్చ) 07:16, 20 డిసెంబరు 2021 (UTC)
వికీపీడియా ఏషియన్ నెల/2021 ప్రాజెక్టు గణాంకాలు
మార్చువికీపీడియా:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021 ప్రాజెక్టు నవంబరు 15 న మొదలుకొని డిసెంబర్ 15 వరకు 30 రోజులపాటు సాగింది. దీనిలో భాగంగా ఆసియా దేశాలకు సంబంధించి వివిధ విషయాలపై తెలుగు వికీపీడియాలో 192 వ్యాసాలు అభివృద్ధి చేయడం జరిగింది.
ప్రాపంచిక విషయాలపై తెలుగు భాషలో విజ్ఞానం అందించడానికి తెలుగు వికీపీడియాని మరింత బలమైన వేదికగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి పరిచిందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వవ్యాప్త విషయాల గురించి తెలుగు ప్రజలకు విజ్ఞానం అందించడంలో ఇది మరో ముందడుగుగా నిలిచిందని భావిస్తున్నాను.
వాడుకరి | సృష్టించిన వ్యాసాలూ | Points | |
MYADAM ABHILASH | 100 | 100 | |
KUMMARI NARESH | 31 | 31 | |
Chaduvari | 19 | 19 | |
Ch Maheswara Raju | 11 | 11 | |
యర్రా రామారావు | 10 | 10 | |
Ramesh bethi | 5 | 5 | |
Tmamatha | 5 | 5 | |
PARALA NAGARAJU | 4 | 4 | |
ప్రభాకర్ గౌడ్ నోముల | 4 | 4 | |
Nskjnv | 2 | 2 | |
Divya4232 |
తెలుగు వికీపీడియన్లు మ్యాడం అభిలాష్ గారు, , కుమ్మరి నరేష్ గారు, తుమ్మల శిరీష్ కుమార్ గారు, మహేశ్వర్ రాజు గారు, యర్రా రామారావు గారు, రమేష్ బేతి గారు, మమతా గారు, పరాల నాగరాజు గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు, దివ్య గారు ఈ ప్రాజెక్టులో పాల్గొని 192 అమూల్యమైన వ్యాసాలను సృష్టించారు.
ఈ ప్రాజెక్టులో మ్యాడం అభిలాష్ గారు 30 రోజులలో రమారమి 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. అభినందనలు వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గారు. మీరందించిన ఈ కృషికి తెలుగు వికీ గర్విస్తుంది, తెలుగు వికీలో 30 రోజుల్లో ఒక ప్రాజెక్టు కోసం 100 వ్యాసాలూ రాసిన వ్యక్తిగా రానున్న ప్రాజెక్టులలో వికీపీడియన్లకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నా.
కొత్త వాడుకరి అయినా కుమ్మరి నరేష్, వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో 31 వ్యాసాలూ రాసి తెలుగు వికీ అభివృద్ధిలో పాల్గొన్నాడు. కొత్త వాడుకరిగా ఉన్న 30 రోజులలో 31 వ్యాసాలూ అంటే సుమారు రోజుకో వ్యాసం చొప్పున రాసి వికీలో దిద్దుబాట్లు ప్రారంభించిన తోలి రోజుల్లోనే అద్భుతం చేశారు. మీ కృషి అమోఘం, ధన్యవాదాలు.
ఇక ఈ ప్రాజెక్టు నిర్వాహణలో సహాయం అందించిన చదువరి గారి గురించి, నేను వికీలో ఏ పని తలపెట్టిన నాకు ఏ సందేహం వచ్చిన వెన్నంటే ఉంటూ నా ప్రతి ప్రశ్నకు ఓపికతో బదులిస్తూ తమ అమూల్యమైన సమయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. మీ సహకారం ఈ ప్రాజెక్టు నడపడంలో కీలక పాత్ర పోషించిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, అలాగే ప్రాజెక్టులో భాగంగా 19 విలువైన వ్యాసాలు అందించి మీదైనా శైలిలో ఈ ప్రాజెక్టుకు తోడ్పడ్డారు.
వికీ వీరులు రామారావు గారు, మహేశ్వర్ రాజు గారు తలా 10, 11 వ్యాసాలూ రాసి తమదైన పాత్ర పోషించారు.
ఈ ప్రాజెక్టులో మీ అందరి కృషికి ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 12:45, 20 డిసెంబరు 2021 (UTC)
- ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన సభ్యులందరికీ నా మనఃపూర్వక అభినందనలు. పాల్గొన్న వారందరూ మంచి హుషారుగా పని చేశారు. మరో ప్రాజెక్టు ప్రారంభించే ముందు మనం సృష్టించిన వ్యాసాలను మరోసారి పరికించి వాటి నాణ్యత మీద దృష్టి పెడితే మనకు రాశితో పాటు వాసి కూడా సిద్ధిస్తుందని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 05:40, 21 డిసెంబరు 2021 (UTC)
- రవిచంద్ర గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.రాశితో పాటు వాసి కూడా చాలా ముఖ్యం.మనం రాసిన వ్యాసాలు మరొకసారి చదివి సవరించాల్సినచోట సవరించాల్సిన అవసరం ఉంటుంది.రాయటం ఒక ఎత్తైతే పరిశీలించి నాణ్యత పెంచటం ఒక ఎత్తు.ఇవి వ్యాసానికి రెండు కళ్లు లాంటివి. యర్రా రామారావు (చర్చ) 06:00, 21 డిసెంబరు 2021 (UTC)
- రవిచంద్ర, యర్రా రామారావు గార్ల అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను, వ్యాసాలను రివ్యూ చేయడం చాలా అవసరం. ఆంగ్ల వికీలో లాగ వ్యాసానికి రివ్యూ ఉంటె బాగుంటుంది, ఇది వరకు ఒకసారి రామారావు గారితో ఈ విషయం చర్చించడం జరిగింది. ఈ ప్రాజెక్టులోని వ్యాసాలే కాకుండా తెలుగు వికీలో ఉన్న అన్ని వ్యాసాలను కూడా రివ్యూ చేసే దిశలో మనం ఒక ప్రాజెక్టు నిర్వహిచుకోవచ్చు. Nskjnv ☚╣✉╠☛ 02:41, 22 డిసెంబరు 2021 (UTC)
- ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సాయికిరణ్ గారికి, 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మ్యాడం అభిలాష్ గారికి, ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రతిఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:10, 21 డిసెంబరు 2021 (UTC)
- @Nskjnv వంటి కొత్తవారు ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా ఉండడం, @MYADAM ABHILASH, KUMMARI NARESH వంటి మరొక ఇద్దరు కొత్త వికీపీడియన్లు ఇందులో తొలి రెండు స్థానాల్లో రావడం శుభసూచకం. తెలుగు వికీపీడియాను తీర్చిదిద్దే ఉత్సాహమున్న కొత్తవారు వస్తున్నారనీ, సముదాయం అలాంటి కొత్తవారిని ప్రోత్సహిస్తోందనీ తెలిపే నిదర్శనం ఇది. అందరికీ అభినందనలు. పవన్ సంతోష్ (చర్చ) 02:24, 22 డిసెంబరు 2021 (UTC)
- ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరించిన సాయికిరణ్ గారికి, 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన మ్యాడం అభిలాష్ గారికి, ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రతిఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:10, 21 డిసెంబరు 2021 (UTC)
ప్రాజెక్టు సమన్వయ కర్త సాయి కిరణ్ గారికి, రవిచంద్ర గారికి, యర్రా రామారావు గారికి, పవన్ సంతోష్ గారికి,ప్రణయ్ రాజ్ గారికి, ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇతర సముదాయ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం తో వికీ అభివృద్ధికై రెట్టింపు ఉత్సాహంతో పాటుపడతాం--అభిలాష్ మ్యాడం 18:02, 22 డిసెంబరు 2021 (UTC)
బొమ్మల నిర్వహణకు సహకారం
మార్చుతెలుగు వికీపీడియాలో స్థానికంగా ఎక్కించిన బొమ్మలు 15000పైగా వున్నాయి. నకలుహక్కులు, సముచిత వినియోగంపై అవగాహన లేమివలన, ఈ బొమ్మల వాడుకలో సమస్యలున్నాయి. చురుకుగావుండే వికీపీడియన్లు, నిర్వాహకులు కూడా చాలావరకు బొమ్మలపై ధ్యాసపెట్టనందున, లైసెన్స్ లేని బొమ్మలు, సరియైన లెసెన్స్ లేని బొమ్మలు, సముచిత వినియోగంలో లోపాలున్న బొమ్మలు తొలగించబడకుండా అలానే వుండిపోయాయి. కొత్తవాడుకరులు కూడా వీటిని చూసి, అటువంటి దోషాలతో బొమ్మలు ఎక్కించి వాడుతున్నారు. ఇవి వికీపీడియా నాణ్యతను దెబ్బతీస్తాయి. బొమ్మల వాడుక నాణ్యతను సరిగా నియంత్రించలేకపోతే, స్థానిక వికీపీడియాలో బొమ్మలు ఎక్కించే సాలభ్యాన్ని నిరోధించే పరిస్థితి రావచ్చు.
ఇటీవల లైసెన్స్ లేని బొమ్మలను తొలగించడం ప్రారంభించాము. అది వచ్చేవారంతో పూర్తవుతుంది. దాదాపు 3600 సముచిత వినియోగ బొమ్మలను తనిఖీ చేయటంలో బొమ్మలు ఎక్కించిన వారు, ఆసక్తి వున్నవారందరూ పాల్గొనమని వినతి. మరింత సమాచారానికి వికీపీడియా:బొమ్మల నిర్వహణ వ్యాసం ప్రారంభించాను. దానిని విస్తరించడానికి, మెరుగుపరచడానికి తోడ్పడమని విజ్ఞప్తి. అర్జున (చర్చ) 06:40, 23 డిసెంబరు 2021 (UTC)
- ఒక సాధారణ ప్రశ్న. నేను ఇన్నేళ్ళుగా వికీలో ఉన్నా అర్థం కాని విషయం ఇది. బొమ్మలు ఎక్కించడానికి వికీ కామన్స్ ఉన్నప్పుడు స్థానిక వికీలో బొమ్మలు ఎలాంటి సందర్భంలో ఎక్కించాలి? దీని గురించి వాడుకరుల కోసం ఒక సహాయం పేజీ తయారు చేస్తే బాగుంటుందేమో. దానిని బట్టి బొమ్మలు ఎక్కించేవాళ్ళు స్థానిక వికీలో ఎలాంటి బొమ్మలు ఎక్కించాలి, ఏ లైసెన్సు వివరాలు జతచేయాలి అనేది సూటిగా తెలుసుకునేలా ఉంటే ఇకనైనా సమస్యాత్మక ఫోటోలు ఎక్కించకుండా ఉంటారు. - రవిచంద్ర (చర్చ) 09:11, 23 డిసెంబరు 2021 (UTC)
- @రవిచంద్ర గారు, చాలా అనుభవమున్నా, ఏమాత్రం బిడియం లేకుండా మీరు ప్రశ్న అడగటం, సూచన చేయడం నచ్చింది. వికీపీడియా:బొమ్మలు_అప్_లోడు_చెయ్యడం#ఓ_కొత్త_బొమ్మను_అప్‌లోడు_చెయ్యడం లో క్లుప్తంగా వివరణ వుంది. దానికి అనుబంధ ఆంగ్లవికీలో మరింత వివరమైన వివరణ, కామన్స్ లో ఎక్కింపుకు సంబంధించి వికీమీడియా పుస్తకం లింకు వున్నాయి. ఈ రోజు ఆ పేజీలో పుస్తకం లింకు నేను చేర్చాను. సాధారణ భాషలో చెప్పాలంటే వాణిజ్యపరమైన వాడుక నిరోధించే షరతులు గల బొమ్మలను కామన్స్ అనుమతించదు. అటువంటి వాటిని విద్యాపరమైన వాడుకకు స్థానిక వికీపీడియాలో అనుమతిస్తారు. అలాగే ఏ వికీపీడియా ప్రాజెక్టులోనైనా వాడుకోవాలంటే బొమ్మలను కామన్స్ లో చేర్చాలి.
- సహాయ సమాచారం మెరుగుపరచడంతో పాటు నిర్వహణతోనే విధానాల అమలు సాధ్యమౌతుంది, నాణ్యత పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది. అర్జున (చర్చ) 01:09, 24 డిసెంబరు 2021 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారూ, నేనూ ఆ పేజీ, పుస్తకం చదివి ఇక్కడ కూడా ఉపయుక్తమైన సమాచారాన్ని చేర్చడానికి ప్రయత్నిస్తాను.- రవిచంద్ర (చర్చ) 05:51, 24 డిసెంబరు 2021 (UTC)
First Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుDear Wikimedians,
We are glad to inform you that the second iteration of Wikimedia Wikimeet India is going to be organised in February. This is an upcoming online wiki event that is to be conducted from 18 to 20 February 2022 to celebrate International Mother Language Day. The planning of the event has already started and there are many opportunities for Wikimedians to volunteer in order to help make it a successful event. The major announcement is that submissions for sessions has opened from today until a month (until 23 January 2022). You can propose your session here. For more updates and how you can get involved in the same, please read the first newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 14:58, 23 డిసెంబరు 2021 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
Upcoming Call for Feedback about the Board of Trustees elections
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki.
The Board of Trustees is preparing a call for feedback about the upcoming Board Elections, from January 7 - February 10, 2022.
While details will be finalized the week before the call, we have confirmed at least two questions that will be asked during this call for feedback:
- What is the best way to ensure fair representation of emerging communities among the Board?
- What involvement should candidates have during the election?
While additional questions may be added, the Movement Strategy and Governance team wants to provide time for community members and affiliates to consider and prepare ideas on the confirmed questions before the call opens. We apologize for not having a complete list of questions at this time. The list of questions should only grow by one or two questions. The intention is to not overwhelm the community with requests, but provide notice and welcome feedback on these important questions.
Do you want to help organize local conversation during this Call?
Contact the Movement Strategy and Governance team on Meta, on Telegram, or via email at msg wikimedia.org.
Reach out if you have any questions or concerns. The Movement Strategy and Governance team will be minimally staffed until January 3. Please excuse any delayed response during this time. We also recognize some community members and affiliates are offline during the December holidays. We apologize if our message has reached you while you are on holiday.
Best,
Movement Strategy and Governance
Thank you. Xeno (WMF) 17:56, 27 డిసెంబరు 2021 (UTC)
తెలుగు సాహిత్య అంశాలపై ప్రాజెక్టు
మార్చుభీమవరంలో జరిగే అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా తెలుగు సాహిత్య వ్యాసాలను అభివృద్ధి పర్చడానికి ప్రాజెక్టు పేజీ ను రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్వహణ, కాలం, వనరులు, సృష్టించాల్సిన వ్యాసాలు వంటి మొదలైన అంశాల గురించి Nskjnv గారు, Chaduvari గారు,కశ్యప్ గారు,పవన్ సంతోష్ గారు, ప్రణయ్ గారు, యర్రా రామారావు గారు, ప్రభాకర్ గౌడ్ నోముల గారు మొదలైన సముదాయ సభ్యులు ప్రాజెక్రు చర్చ పేజీలో సూచనలు, సలహాలు ఇవ్వగలరు.౼అభిలాష్ మ్యాడం 17:07, 27 డిసెంబరు 2021 (UTC)
ప్రాజెక్టు ప్రారంభం
మార్చుతెలుగు సాహిత్య అంశాల ప్రాజెక్టు ప్రారంభం అయింది. ప్రాజెక్టు పేజీ లో వికీపీడియాలో లేని కొంత మంది కవులు, రచయితల జాబితాను తయారు చేశాను. ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు గమనించి వ్యాసాలు సృష్టించవలసిందిగా మనవి. అలాగే మీకు తెలిసిన, వికీపీడియాలో లేని సాహిత్య అంశాలు ఏమైనా ఉంటే ప్రాజెక్టు పేజీలో చేర్చవలసిందిగా మనవి.౼అభిలాష్ మ్యాడం 07:00, 1 జనవరి 2022 (UTC)
వికీపీడియా 2021 సమీక్ష, 2022 ప్రాధాన్యతలు
మార్చు2007 లో వికీపీడియా కృషిని సంవత్సరాంతంలో సమీక్షించే పని మొదలైంది. కొన్ని సంవత్సరాలు లక్ష్యాలు కాలప్రణాళికతో నిర్ణయించి, వాటిని సమీక్షించగా, చాలా సంవత్సరాలకు సమీక్షవ్యాసాలు తయారవలేదు. 2019 కొరకు సమీక్ష జరిగింది, లక్ష్యాలకు కాలప్రణాళిక లేదు కాని పురోగతి చేర్చారు. బహుమతులు, రికార్డులు నెలకొల్పడం లాంటి ప్రతిఫలాపేక్షలేకుండా ఔత్సాహికులు చేసే కృషికి కాలప్రణాళిక చేసినా, దాని ప్రకారం ఎక్కువమంది కృషి చేయటం కష్టమని నా అనుభవం. 2014 లో సభ్యులు తమతమ వ్యక్తిగత కృషి సమీక్ష చేశారు. అదే దిశగా 2021 లో ప్రాజెక్టు నిర్వాహకులు, సభ్యులు తమ కృషిని సమీక్షించటం, లేక ఇతర చోట్ల గల సమీక్షలకు లింకులివ్వడం చేస్తే, వికీపీడియా పురోగతికి దోహదమవుతుంది. ఈ దిశగా వికీపీడియా:2021 సమీక్ష ప్రారంభించాను. ఆసక్తిగల సహసభ్యులు ఆ వ్యాసాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడమని మనవి. అర్జున (చర్చ) 03:15, 29 డిసెంబరు 2021 (UTC)
- స్పందించిన రవిచంద్ర,స్వరలాసిక గార్లకు ధన్యవాదాలు. 2022 లో సహకారం కోసం, వికీపీడియా:2022 ప్రాధాన్యతలు అనే పేజీ ప్రారంభించాను. అక్కడ కూడా ప్రాజెక్టు నిర్వాహకులు, సభ్యులు వివరాలు చేర్చమని మనవి. అర్జున (చర్చ) 04:06, 4 జనవరి 2022 (UTC)
- తొలిసారిగా ఆటోమేటిగ్గా ఖాతా నమోదైన వాడుకరుల గణాంకాల విశ్లేషణ చేశాను. గత సంవత్సరంలో ఖాతా తెరిచిన వారిలో 80 శాతం మంది ఆటోమేటిగ్గా ఖాతా తెరిచారు. కనీసం 5 మార్పులు చేసిన కొత్త ఖాతాదారులను పరిశీలిస్తే, వారి సంఖ్య 55.8%గా, వారి మార్పులు 30.8% శాతంగా వుంది. మరిన్ని వివరాలు వికీపీడియా:2021 సమీక్ష లో చూడండి. గతంలో ఆటోమేటిక్ గా నమోదైన ఖాతాలకు స్వాగతం చెప్పాలా వద్దా అనేదాని గురించి చర్చలు జరిగాయి. ఈ విశ్లేషణ స్వాగతం చెప్పటం ఉపయోగమని నిరూపిస్తున్నది. స్వాగతం చెప్పటంలో ఎక్కువ బాధ్యత తీసుకుంటున్న గుళ్లపల్లి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.--అర్జున (చర్చ) 01:03, 9 జనవరి 2022 (UTC)
- 2021లో నమోదైనవారు వాడుతున్న ఉపకరణాల విశ్లేషణ చేర్చాను. అర్జున (చర్చ) 06:54, 28 జనవరి 2022 (UTC)
- మరికొన్ని విశ్లేషణలు సంబంధిత వ్యాసాలలో చేర్చాను. వికీ అభివృద్ధి తీరుతెన్నులు, ప్రభావితంచేసే అంశాలు, 2022 ప్రాధాన్యతల గురించి నా అభిప్రాయాలు చూడండి. మీ అభిప్రాయాలు మీ వాడుకరికి ఉపపేజీగా చేర్చి పంచుకోండి, వికీపీడియా చర్చ:2022 ప్రాధాన్యతలు లో చర్చించండి. అర్జున (చర్చ) 09:20, 10 మార్చి 2022 (UTC)
- వీక్షణల ప్రధాన వర్గ బొమ్మ చేర్చాను. --అర్జున (చర్చ) 13:52, 10 మార్చి 2022 (UTC)
- 2021లో నమోదైనవారు వాడుతున్న ఉపకరణాల విశ్లేషణ చేర్చాను. అర్జున (చర్చ) 06:54, 28 జనవరి 2022 (UTC)
లైసెన్స్ లేని బొమ్మల శుద్ధి పని సమీక్ష
మార్చునేటితో లెసెన్స్ లేని బొమ్మల శుద్ధి పని ముగిసింది. దాదాపు 1000 ఫైళ్లలో షుమారు 500 తొలగింపుకి గురికాగా, మిగతా 500 లకు లైసెన్స్ వివరాలు చేర్చడం జరిగింది. ఈ పని నిర్వహణలో సహకరించిన @Chaduvari గారికి, సలహాలిచ్చిన @MGA73 గారికి, హెచ్చరికకు స్పందించి లైసెన్స్ లు చేర్చిన @స్వరలాసిక, @T.sujatha, హెచ్చరికలకు స్పందించిన @JVRKPRASAD, @YVSREDDY @User:Veera.sj @User:Pranayraj1985 గార్లకు, ఇతరవిధాలుగా సహకరించిన సహసభ్యులకు ధన్యవాదాలు. ఈ పని సమీక్షలో మీ అభిప్రాయాలు చేర్చండి లేక చర్చించండి. అర్జున (చర్చ) 04:59, 29 డిసెంబరు 2021 (UTC)
- @Arjunaraoc గారూ, ఈ పనిని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, లైసెన్సులు చేర్చి 500 ఫైళ్ళను కాపాడినందుకూ ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 07:39, 29 డిసెంబరు 2021 (UTC)
- @Arjunaraoc Good work! --MGA73 (చర్చ) 08:04, 29 డిసెంబరు 2021 (UTC)
స్వేచ్ఛానకలుహక్కులు లేని అనాధ ఫైళ్ల సంబంధించి ప్రకటన
మార్చు66 మంది సభ్యులు, 355 స్వేచ్ఛానకలుహక్కులు లేని బొమ్మలు, సముచిత వినియోగం క్రింద తెవికీలో ఎక్కించారు. వాటి జాబితా పేజీ చూడండి. అయితే అవి వ్యాసపేరుబరిలో వాడనందున అనాధలైనవి. చాలావాటికి సముచిత వినియోగ వివరణ లేకపోవటం, లేక వున్నవాటిలో దోషాలుండవచ్చు. కావున సంబంధిత సభ్యులకు సరిచేయమని హెచ్చరిక సందేశాలు పంపాను. ఎవరికైనా సందేహాలుంటే తెలియచేయండి. వారంలోగా వారినుండి స్పందనలు లేకపోతే బొమ్మలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 11:45, 2 జనవరి 2022 (UTC)
- కొన్ని బొమ్మలు నేను పరిశీలించి లోగోలవంటివి వాడుటకు, వాటి సముచిత వినియోగ, లైసెన్స్ వివరాలు చేర్చటానికి ప్రయత్నించాను. ఈ కార్యక్రమంలో కాస్త అనుభవమున్న సభ్యులు, ముఖ్యంగా నిర్వాహకులు పాల్గొని, సహసభ్యుల కృషిని కాపాడటానికి తోడ్పడవలసినది. అర్జున (చర్చ) 07:10, 5 జనవరి 2022 (UTC)
- తనిఖీలు, సవరణలు, మానవీయ తొలగింపులు పూర్తయిన మీదట, 312 బొమ్మలు మూకుమ్మడి తొలగింపు చేశాను. --అర్జున (చర్చ) 06:34, 10 జనవరి 2022 (UTC)
Second Newsletter: Wikimedia Wikimeet India 2022
మార్చుGood morning Wikimedians,
Happy New Year! Hope you are doing well and safe. It's time to update you regarding Wikimedia Wikimeet India 2022, the second iteration of Wikimedia Wikimeet India which is going to be conducted in February. Please note the dates of the event, 18 to 20 February 2022. The submissions has opened from 23 December until 23 January 2022. You can propose your session here. We want a few proposals from Indian communities or Wikimedians. For more updates and how you can get involved in the same, please read the second newsletter
If you want regular updates regarding the event on your talk page, please add your username here. You will get the next newsletter after 15 days. Please get involved in the event discussions, open tasks and so on.
MediaWiki message delivery (చర్చ) 05:39, 8 జనవరి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
Wiki Loves Folklore is back!
మార్చుPlease help translate to your language
You are humbly invited to participate in the Wiki Loves Folklore 2022 an international photography contest organized on Wikimedia Commons to document folklore and intangible cultural heritage from different regions, including, folk creative activities and many more. It is held every year from the 1st till the 28th of February.
You can help in enriching the folklore documentation on Commons from your region by taking photos, audios, videos, and submitting them in this commons contest.
You can also organize a local contest in your country and support us in translating the project pages to help us spread the word in your native language.
Feel free to contact us on our project Talk page if you need any assistance.
Kind regards,
Wiki loves Folklore International Team
--MediaWiki message delivery (చర్చ) 13:15, 9 జనవరి 2022 (UTC)
సముచిత వినియోగ వివరణ లేని ఫైళ్లు సరిచేయటం
మార్చుబొమ్మల నిర్వహణలో నాల్గవ విడతగా (ప్రస్తుతానికి చివరిది) 30 మంది సభ్యులు 18 నవంబరు 2013 తరువాత అనగా WP:FUW చేతనమైన తరువాత తెవికీలో ఎక్కించిన 1851 ఫైళ్లకు సముచిత వినియోగ వివరణ లేదు. వాటి జాబితా పేజీ చూడండి. అయితే అవి వ్యాసపేరుబరిలో వాడినందున సంబంధిత సభ్యులకు సరిచేయమని హెచ్చరిక సందేశాలు పంపాను. ఆసక్తిగల ఎవరైనా వాటిని సవరించటానికి ప్రయత్నించవచ్చు. ఎవరికైనా సందేహాలుంటే తెలియచేయండి. వారంలోగా స్పందనలు లేకపోతే, సవరించని బొమ్మలు తొలగించుతాను. మీ సహకారానికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 01:49, 11 జనవరి 2022 (UTC)
- 1851 బొమ్మలను తొలగించే ముందు..
- బొమ్మలు సముచిత వినియోగానికి అనుకూలమైనవి కాకపోతేనో, అసలు ఎక్కడా వాడని బొమ్మలైతేనో, బొమ్మ విజ్ఞాన సర్వస్వ యోగ్యం కాకపోతేనో తొలగించడం వేరు. కేవలం లైసెన్సింగు సమాచారం సరిగా లేదన్న కారణం చేత మాత్రమే తొలగించే బొమ్మల విషయంలో వాటిని సరిచేసేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తే మంచిది. ఉదాహరణకు..
- వసరమైన సమాచారాన్ని చేర్చేందుకు మరింత సమయం ఇవ్వడం
- ఈ పని కోసం ఎడిటథాన్లు పెట్టడం.
- ఈ పని తేలిగ్గా చేసేందుకు ఎవరైనా బాటేదైనా రాయగలరేమో చూడడం.
- లైసెన్సింగు కోసం చేర్చాల్సిన సమాచారంలో కామనుగా ఉండే సమాచారంతో సంబంధిత మూసలను సృష్టిస్తే మానవికంగా చేర్చాల్సిన సమాచారాన్ని కనిష్ఠ స్థాయి తీసుకురావచ్చు. తద్వారా మనం చెయ్యాల్సిన పని తగ్గుతుంది. బాటుతో తేలిగ్గా చేసే అవకాశం మెరుగుపడుతుంది. (బొమ్మను ఏ పేజీలో వాడారు అనేదాన్ని బాటు తెచ్చుకుంటే చాలు, పనైపోయినట్టే)
- తొందరపడి తొలగింపు దిశగా వెళ్ళొద్దని వినతి. __ చదువరి (చర్చ • రచనలు) 07:56, 11 జనవరి 2022 (UTC)
- @Chaduvariగారు, సముచిత వినియోగ వివరాలలో మూలం వివరాలు ఎక్కించిన వారికే తెలిసే అవకాశముంటుంది. అటువంటి వివరాలు తెలపలేకపోయినా ఫైళ్లు తొలగించవలసివస్తుంది. కావున సంబంధిత సభ్యులు సవరణలపై దృష్టి పెడితే నేను కొంత తోడ్పడగలను. అదనపు సమయం ఇవ్వడం సభ్యుల అభ్యర్ధన మేరకు పరిశీలించవచ్చు. అర్జున (చర్చ) 10:18, 13 జనవరి 2022 (UTC)
- ఆంగ్ల వికీపీడియాలో ఉన్న సినిమా పోస్టర్ల బొమ్మలను దిగుమతి చేసి తెవికీలో ఎక్కించి ఆంగ్ల వికీలో ఉన్న సముచిత వినియోగ వివరణనే తెవికీలో చేర్చాను, అయినా కాని సముచిత వినియోగ వివరణ సరిగా లేదని తొలగింపు మూసను పెట్టారు. అదికాకా, ఆంగ్ల వికీలో కొన్ని బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చకపోయినా వాటిమీద చర్య తీసుకోలేదు. ఆంగ్ల వికీలో లేని తొలగింపు ఇక్కడ ఎందుకో నాకు అర్థంకావడంలేదు. ఎక్కించిన బొమ్మలు నెట్ లో వెతికితే దొరికే అవకాశం ఉంది. తొలగించడమేముంది ఎవ్వరైనా తొలగిస్తారు, కానీ వాటిని సరిచేయడమే వికీ లక్షణం. ఆ స్ఫూర్తితో అందరి కృషితో వేల మొలక వ్యాసాలను చాలా వరకు తగ్గించాం. కాబట్టి, చదువరి గారు చెప్పినట్టు సముచిత వినియోగ వివరణ తేలిగ్గా చేసేలా ఒక బాటు తయారుచేయడం లేదా సముచిత వినియోగ వివరణ చేర్చడంకోసం ఎడిటథాన్లు పెడితే బాగుంటుంది. ఈ బాధ్యతలు స్వీకరించవలసిందిగా అర్జున గారిని కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:55, 13 జనవరి 2022 (UTC)
- @Pranayraj1985 గారు, మీరు తెలిపిన వాటికి లింకులు తెలిపితే, నేను పొరపాటుగా ఏదైనా చేసివుంటే పరిశీలించి సరిచేస్తాను. బొమ్మలపై చర్యలు జరుగుతానే వుంటాయి. వాటిపై శ్రద్ధపెట్టేవారి అందుబాటుని బట్టి కొన్నిటిపై ఆలస్యంగా జరగవచ్చు, ఇంకా ఏదైనా సందేహాలుంటే,వికీవ్యాప్తంగా అనుభవం వుండి తెవికీలో ప్రస్తుత కార్యక్రమానికి సహకరిస్తున్న వాడుకరి:MGA73 గారి సలహా తీసుకోవచ్చు. నాకు బాటు చేసేటంత అనుభవం లేదు, పెద్దసంఖ్యలో నాణ్యతపై దృష్టిలేకుండా చేర్చే సముచితవినియోగాల బొమ్మలను సవరించేటంత ఆసక్తి లేదు. కావున మీ అభ్యర్ధనను అంగీకరించలేకపోతున్నందులకు క్షమించండి. అర్జున (చర్చ) 04:53, 15 జనవరి 2022 (UTC)
- అర్జున గారూ, ఏదో అప్పుడపుడు వచ్చి హడావుడిగా ఒకట్రెండు పనులు చేసి సూపర్ వైజర్ లా అందరికి పనులు చేయమని చెప్పడమే తప్ప సమిష్టి కృషికి మీరు ముందుకు రారన్న విషయం నాకు ముందే తెలుసు. కానీ, మరోసారి మీ అభిప్రాయం తెలుసుకుందామని అడిగానంతే. ఇక, బొమ్మల లింకులు తెలుపమని చెప్పారు. వేయిపైన ఉన్న బొమ్మల లింకులు ఇవ్వడం కుదరని పని. సినిమా పోస్టర్ల బొమ్మలలో దాదాపు 95శాతం బొమ్మలు ఆంగ్ల వికీలో నుండి తీసుకొని, అక్కడున్న వినియోగ వివరణనే ఇచ్చాను. కాబట్టి, వాటిని పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:54, 19 జనవరి 2022 (UTC)
- @Pranayraj1985 గారు, మీరు తెలిపిన వాటికి లింకులు తెలిపితే, నేను పొరపాటుగా ఏదైనా చేసివుంటే పరిశీలించి సరిచేస్తాను. బొమ్మలపై చర్యలు జరుగుతానే వుంటాయి. వాటిపై శ్రద్ధపెట్టేవారి అందుబాటుని బట్టి కొన్నిటిపై ఆలస్యంగా జరగవచ్చు, ఇంకా ఏదైనా సందేహాలుంటే,వికీవ్యాప్తంగా అనుభవం వుండి తెవికీలో ప్రస్తుత కార్యక్రమానికి సహకరిస్తున్న వాడుకరి:MGA73 గారి సలహా తీసుకోవచ్చు. నాకు బాటు చేసేటంత అనుభవం లేదు, పెద్దసంఖ్యలో నాణ్యతపై దృష్టిలేకుండా చేర్చే సముచితవినియోగాల బొమ్మలను సవరించేటంత ఆసక్తి లేదు. కావున మీ అభ్యర్ధనను అంగీకరించలేకపోతున్నందులకు క్షమించండి. అర్జున (చర్చ) 04:53, 15 జనవరి 2022 (UTC)
- ఆంగ్ల వికీపీడియాలో ఉన్న సినిమా పోస్టర్ల బొమ్మలను దిగుమతి చేసి తెవికీలో ఎక్కించి ఆంగ్ల వికీలో ఉన్న సముచిత వినియోగ వివరణనే తెవికీలో చేర్చాను, అయినా కాని సముచిత వినియోగ వివరణ సరిగా లేదని తొలగింపు మూసను పెట్టారు. అదికాకా, ఆంగ్ల వికీలో కొన్ని బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చకపోయినా వాటిమీద చర్య తీసుకోలేదు. ఆంగ్ల వికీలో లేని తొలగింపు ఇక్కడ ఎందుకో నాకు అర్థంకావడంలేదు. ఎక్కించిన బొమ్మలు నెట్ లో వెతికితే దొరికే అవకాశం ఉంది. తొలగించడమేముంది ఎవ్వరైనా తొలగిస్తారు, కానీ వాటిని సరిచేయడమే వికీ లక్షణం. ఆ స్ఫూర్తితో అందరి కృషితో వేల మొలక వ్యాసాలను చాలా వరకు తగ్గించాం. కాబట్టి, చదువరి గారు చెప్పినట్టు సముచిత వినియోగ వివరణ తేలిగ్గా చేసేలా ఒక బాటు తయారుచేయడం లేదా సముచిత వినియోగ వివరణ చేర్చడంకోసం ఎడిటథాన్లు పెడితే బాగుంటుంది. ఈ బాధ్యతలు స్వీకరించవలసిందిగా అర్జున గారిని కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:55, 13 జనవరి 2022 (UTC)
- @Chaduvariగారు, సముచిత వినియోగ వివరాలలో మూలం వివరాలు ఎక్కించిన వారికే తెలిసే అవకాశముంటుంది. అటువంటి వివరాలు తెలపలేకపోయినా ఫైళ్లు తొలగించవలసివస్తుంది. కావున సంబంధిత సభ్యులు సవరణలపై దృష్టి పెడితే నేను కొంత తోడ్పడగలను. అదనపు సమయం ఇవ్వడం సభ్యుల అభ్యర్ధన మేరకు పరిశీలించవచ్చు. అర్జున (చర్చ) 10:18, 13 జనవరి 2022 (UTC)
గడువు పొడిగింపు
మార్చుఈ రోజు పరిశీలించితే ఇంకా పనిజరగవలసిన ఫైళ్ల సంఖ్య 1728. అంటే తొలి గడువు(వారం రోజులు) ముగిసే సరికి 123 ఫైళ్లను సవరించటమో లేక తొలగించటమో జరిగింది. నేను గమనించినంతలో చదువరి ,Pranayraj1985,K.Venkataramana గార్లు కృషి చేశారు. ఏ ఒక్కరు, తమ ఫైళ్లపై కృషికి గడువు పెంచమని కోరలేదు. అయినా ఫైళ్ల సంఖ్య ఎక్కువగా వున్నందున ఇంకొక వారం గడువు పొడిగించుతున్నాను. 2021 జనవరి 26 లోపల ఫైళ్లను సవరించమని, ఇంకా గడువు పొడిగింపు అవసరమైతే తెలపమని సంబంధిత సభ్యులను మరొక్కమారు కోరుతున్నాను.--అర్జున (చర్చ) 04:01, 19 జనవరి 2022 (UTC)
- అర్జున గారు నా పైళ్లలో చాలా వరకూ ఆయా వ్యాసాలకు లింక్ చేయబడిన్నాయి. ఎక్కువగా పుస్తక ముఖ చిత్రాలు ఉన్నాయి. లేదా సినిమా సన్నివెశ తెరపట్టులు ఉన్నాయి.అవి హక్కుల బట్టే ఉన్నాయి. వాటిని ఎందుకు తొలగించాలో నాకు అర్ధం కాలేదు. పుస్తక వ్యాసం లో పుస్తక ముఖచిత్రం కాక మరేమిపెట్టగలం. మరొకసారి సరి చూసుకొని అయా బొమ్మలపై తొలగింపు మూసను తొలగించగలరు. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 11:48, 21 జనవరి 2022 (UTC)
- @B.K.Viswanadh గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. తెవికీలో స్వంతకృతులైతే, 2013 నవంబరు 19 (WP:FUW చేతనమైన రోజు) కు ముందు సంబంధిత స్వేచ్ఛా లైసెన్స్ మూస చేర్చేవారు. ఇతరాలకు కూడా ఇతర లైసెన్స్ మూస వాడేవారు. పుస్తకముఖచిత్రాలు,సినిమా పోస్టర్లు లాంటివి స్వంత చిత్రాలు కాదు కావున, వాటిని సముచిత వినియోగంగా మాత్రమే వికీపీడియాలో వాడాలి. సముచిత వినియోగమంటే, వ్యాసంలో విద్యావిషయక చర్చలకు, మూలం వివరాలు తెలుపుతూ తక్కువ పరిమాణంలో,అవసరమైన మేరకు మాత్రమే, బొమ్మ వాడే వ్యాసం పేరు లాంటి వివరాలు తెలపాలి. దీనిని పాటించాలంటే, లైసెన్స్ వివరాల మూసతో పాటు సముచిత వినియోగ మూస తగిన వివరాలతో చేర్చాలి. మీరు ఎక్కించిన చిత్రానికి ఉదాహరణ సవరణ చూడండి. బొమ్మ పరిమాణం 500*500 స్థాయికి తగ్గించిన కూర్పుకూడా ఎక్కించాను. ఇక సినిమా సన్నివేశ తెరపట్టులకు ఉదాహరణ(ఆంగ్లవికీలో) చూడండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:బొమ్మల నిర్వహణ చూడండి. దాని ప్రకారం, మీరు ఎక్కించిన బొమ్మలను సరిచేయండి. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 00:08, 22 జనవరి 2022 (UTC)
- అర్జున గారు నా పైళ్లలో చాలా వరకూ ఆయా వ్యాసాలకు లింక్ చేయబడిన్నాయి. ఎక్కువగా పుస్తక ముఖ చిత్రాలు ఉన్నాయి. లేదా సినిమా సన్నివెశ తెరపట్టులు ఉన్నాయి.అవి హక్కుల బట్టే ఉన్నాయి. వాటిని ఎందుకు తొలగించాలో నాకు అర్ధం కాలేదు. పుస్తక వ్యాసం లో పుస్తక ముఖచిత్రం కాక మరేమిపెట్టగలం. మరొకసారి సరి చూసుకొని అయా బొమ్మలపై తొలగింపు మూసను తొలగించగలరు. ధన్యవాదాలు..B.K.Viswanadh (చర్చ) 11:48, 21 జనవరి 2022 (UTC)
2022-01-27 నాటి స్థితి
మార్చుఈ రోజు పరిశీలించితే ఇంకా పని జరగవలసిన ఫైళ్ల సంఖ్య 1717. గత వారంరోజులలో అదనంగా 11 ఫైళ్ల పై మాత్రమే కృషి జరిగింది. ఇప్పటివరకు కృషి చేసిన వారిలో ఇంతకు ముందు తెలిపినవారితో బాటు బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు వుండడం గమనించాను. ఏ ఒక్కరు ఫైళ్లపై కృషికి గడువు పెంచమని కోరలేదు కనుక, పనిజరగని ఫైళ్ల తొలగింపుకు అభ్యంతరాలు లేవని భావిస్తున్నాను. --అర్జున (చర్చ) 06:07, 27 జనవరి 2022 (UTC)
- నాకు అభ్యంతరం ఉంది. ఆ సంగతి పైన రాసాను.
- ఇంగ్లీషు వికీపీడియాలోని ఫైళ్ళనే కాపీ చేసాను, అక్కడ వాటిని తొలగించలేదు గదా అని పైన ప్రణయ్ రాజ్ గారు రాసారు.
- తొలగింపును నివారించేందుకు కృషి ఏమీ చెయ్యలేదు. కనీసం, ప్రణయ్ రాజ్ గారు లేవనెత్తిన వాటిలో కొన్ని ఫైళ్ళనైనా పరిశీలిద్దామని అనుకోలేదు. ఇదిగో ఫలానా పదో ఇరవయ్యో ఫైళ్ళను చూసాను, నేను గమనించినది ఇది అని కూడా చెప్పలేదు. తొలగింపును నివారించే ప్రయత్నాలు అన్నీ చేసాక, తొలగింపు ఇంకా అవసరమైతేనే చెయ్యాలి. __ చదువరి (చర్చ • రచనలు) 06:51, 27 జనవరి 2022 (UTC)
- @Chaduvari గారు, తాము చేసినపనిలో దోషాలను సవరించటానికి ఎక్కించినవారు చురుకుగా పనిచేయటానికి చొరవ తీసుకోనపుడు, కనీస స్పష్టమైన లింకులను కూడా ఇవ్వనపుడు, పనిచేయటానికి నాకు ఆసక్తి లేదు. ప్రణయ్ రాజ్ గారి తొలి వ్యాఖ్యకి స్పందన ఇవ్వడంజరిగినది. ఆంగ్లవికీలో తొలగింపులు అక్కడ పని చురుకుదనం బట్టి జరుగుతాయి. అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు. నేను పరిశీలించిన బొమ్మలలో కనీసం ఆంగ్ల వికీనుండి తీసుకొన్నానన్న వ్యాఖ్య కూడా చాలావరకు లేదు. మీరు ఈ బొమ్మల సముచిత వినియోగ వివరణలోని దోషాలను సరిదిద్దటానికి చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 10:55, 28 జనవరి 2022 (UTC)
- @Arjunaraoc గారూ,
- "అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు." అని రాసారు మీరు. సరే! అలాక్కానీండి.
- "మీరు చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి." అని కూడా రాసారు. మీరు చేస్తారా అని అడగడం వరకూ సరియే. కానీ, చెయ్యడానికి ఎంత సమయం కావాలో చెప్పమని ముందే అడగి షరతు విధించడం సబబు కాదు. ఎదటివాళ్ళను కించపరచేలా, చిన్నబుచ్చేలా, సూపర్వైజర్లాగా మాట్లాడ్డం ఎందుకు? మామూలుగా ఉండొచ్చుగా! బాటు రాయమంటే రాయలేనన్నారు. మరి, బాటు కోసం అభ్యర్థనైనా చెయ్యవచ్చుగా? మానవికంగా చేసే ఆసక్తి లేదు, బాటు కావాలని అడగరు, ఒక ఎడిటథాన్ లాంటి దాన్ని చేపట్టరు. తొలగింపు మాత్రమే చేస్తారు! తోటివారితో కలిసి పనిచేసే పద్ధతేనా ఇది, ఆలోచించండి.
- వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నిర్వహణ సూత్రాలు పేజీలోని చర్చనే తీసుకోండి. అక్కడ మీరు రాసినది అనుచితంగా ఉందని ఇతరులు చెప్పాక కూడా దాన్ని సవరించలేదు. కనీసం మీ రాతలకు అభ్యంతరాలు వచ్చినపుడైనా మారాల్సింది. మారకపోగా అదే ధోరణిని కొనసాగించారు. చివరికి అక్కడి చర్చలో పాల్గొనని వారిని "..చాలామందికి కొత్త వ్యాసం సృష్టించడంపై ఎక్కువ ఆసక్తి వుండటం వలనో.. " అంటూ నర్మగర్భంగా మాట్టాడారు. ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. ఇతరులు చెప్పినా కూడా మీరు మారడం లేదు. సముదాయంలో ఒకరుగా పనిచేస్తూ తోటి వాళ్ళను కించపరచడం, వాళ్ళ కృషిని కించపరచడం తగునా, ఆలోచించండి.
- అర్జున గారూ, దయచేసి మీ ప్రవర్తనను పరిశీలించుకోండి.
- ఇకపోతే, నేను ఈ పని చేసే సంగతి.. ముందు మీ గడువులూ, షరతులూ, సూపర్విజనూ పక్కన పెట్టండి. ఆసక్తి ఉన్నవారెవరో ఒకరు చెయ్యకపోరు. __ చదువరి (చర్చ • రచనలు) 12:59, 28 జనవరి 2022 (UTC)
- @Chaduvari గారు, ప్రస్తుత బొమ్మల నిర్వహణ కృషికి తొలిగా తోడ్పడిన మీరు పై విధంగా వ్యాఖ్య చేయటం బాధాకరం. నా వ్యాఖ్యలు, మీకు కాని ఇతర సభ్యులకాని అపార్ధాన్ని కలిగించివుంటే క్షమించండి. కొంత వివరణకోసం ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.
- దాదాపు మూడు నెలలుపైగా బొమ్మల నిర్వహణ గురించి పనిచేస్తున్నాను. ప్రారంభించిన పనికి సరియైన ముగింపు (అనగా బొమ్మలు సరిచేయడం, లేక తొలగించడం) కొరకు, ఎంత సమయం కావాలని అడగటం జరిగింది.
- నకలుహక్కుల ఉల్లంఘించిన పాఠ్యం దృష్టికిరాగానే వెనువెంటనే ఆ పాఠాన్ని నిర్వాహకులు తొలగించడం అమలుపరచబడుతున్నది. నకలహక్కుల ఉల్లంఘన గల బొమ్మలను, హెచ్చరించిన తరువాత సరిచేయపడకపోతే తొలగించడం జరుగుచున్నది.
- వికీపీడియాలో ప్రతి ఒక్కరు ఇతరుల పనిని పర్యవేక్షణ (సూపర్విజన్) చేసి అవసరమైతే సరిచేయటం లేక తొలగించడం లేక తొలగింపుదిశగా చర్యలు చేపట్టటం చేస్తారు. కావున నా చర్యలు వికీపీడియా విధానాల ప్రకారమే జరుగుతున్నవని గమనించి సహకరించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:29, 2 ఫిబ్రవరి 2022 (UTC)
- @Chaduvari గారు, తాము చేసినపనిలో దోషాలను సవరించటానికి ఎక్కించినవారు చురుకుగా పనిచేయటానికి చొరవ తీసుకోనపుడు, కనీస స్పష్టమైన లింకులను కూడా ఇవ్వనపుడు, పనిచేయటానికి నాకు ఆసక్తి లేదు. ప్రణయ్ రాజ్ గారి తొలి వ్యాఖ్యకి స్పందన ఇవ్వడంజరిగినది. ఆంగ్లవికీలో తొలగింపులు అక్కడ పని చురుకుదనం బట్టి జరుగుతాయి. అక్కడ తొలగించకపోవటానికి, ఇక్కడ తొలగించే చర్యకు సంబంధం లేదు. నేను పరిశీలించిన బొమ్మలలో కనీసం ఆంగ్ల వికీనుండి తీసుకొన్నానన్న వ్యాఖ్య కూడా చాలావరకు లేదు. మీరు ఈ బొమ్మల సముచిత వినియోగ వివరణలోని దోషాలను సరిదిద్దటానికి చొరవ తీసుకొనేటట్లయితే, ఎంత సమయం కావాలో తెలపండి. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 10:55, 28 జనవరి 2022 (UTC)
2022-02-20 నాటి స్థితి
మార్చుసభ్యుల ఎక్కింపులు పరిమితంగా వున్నవి పరిశీలించి కొంతవరకు సవరించడం, సూచనలు చేయడం చేశాను, వివరాలు జాబితా పేజీ లో చేర్చాను. కొద్ది సంఖ్యలో సముచిత వినియోగ మూసలు వాడకుండా పాఠ్య రూపంలో సముచితవినియోగ వివరం చేర్చిన ఫైళ్లు, లేక {{Navbox}} తో విస్తరించిన సముచిత వినియోగం గల ఫైళ్లు (ఆంగ్లవికీలో గల NFUR మూస వాడని సముచిత వినియోగం చేర్చినవి) వుండడం గమనించాను. అలాంటి వాటిని తొలగించకుండా వుండటానికి వాటి సముచిత వినియోగ వివరణను . లైసెన్స్ మూసలో image has rationale=yes అనే పరామితి చేర్చటం ద్వారా ధృవీకరించాను. ఇటువంటి ఫైళ్లు ఇంకా వున్నట్లైతే, ఒక వారంరోజులలో జాబితాలో ఆ ఫైలు వరుస ఎదురుగా ",NFUR మూస వాడని enwiki సముచిత వినియోగం" అనే వ్యాఖ్య చేర్చండి. అలాగే ఇంకా సముచిత వినియోగం సరిచేయవలసిన ఫైళ్లని సరిచేయండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:19, 20 ఫిబ్రవరి 2022 (UTC)
ముగింపు సమీక్ష
మార్చువికీపీడియా:బొమ్మల నిర్వహణ/సముచిత వినియోగం లేని ఫైళ్ల శుద్ధి - 1 చూసి, మీ స్పందనలు ఆ పేజీలో సవరణల ద్వారా కాని లేక చర్చాపేజీలో కాని చేర్చండి. ధన్యవాదాలు --అర్జున (చర్చ) 10:20, 28 ఫిబ్రవరి 2022 (UTC)
Feminism and Folklore 2022
మార్చుPlease help translate to your language
Greetings! You are invited to participate in Feminism and Folklore 2022 writing competion. This year Feminism and Folklore will focus on feminism, women biographies and gender-focused topics for the project in league with Wiki Loves Folklore gender gap focus with folk culture theme on Wikipedia.
You can help us in enriching the folklore documentation on Wikipedia from your region by creating or improving articles focused on folklore around the world, including, but not limited to folk festivals, folk dances, folk music, women and queer personalities in folklore, folk culture (folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales and more. You can contribute to new articles or translate from the list of suggested articles here.
You can also support us in organizing the contest on your local Wikipedia by signing up your community to participate in this project and also translating the project page and help us spread the word in your native language.
Learn more about the contest and prizes from our project page. Feel free to contact us on our talk page or via Email if you need any assistance...
Thank you.
Feminism and Folklore Team,
బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించిన ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపు ఇప్పుడు బహిరంగం
మార్చుఫీడ్బ్యాక్ కోసం పిలుపు: బోర్డు ట్రస్టీల ఎన్నికలు ఇప్పుడు బహిరంగం మరియు 7 ఫిబ్రవరి 2022న సమాప్తి అవుతాయి.
ఈ ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపుతో, మూవ్‌మెంట్ వ్యూహం మరియు పాలనా బృందం భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంటున్నాయి. 2021 నుంచి వచ్చిన కమ్యూనిటీ ఫీడ్‌బ్యాక్‌ను ఈ దృక్పథం తనలో అంతర్భాగం చేసుకుంటుంది. ప్రతిపాదనలతో ముందుకు సాగడానికి బదులు, బోర్డు ట్రస్టీల నుంచి కీలక ప్రశ్నల చుట్టు పిలుపు రూపొందించబడింది.2021 బోర్డు ట్రస్టీల ఎన్నికల గురించి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి కీలక ప్రశ్నలు వచ్చాయి. ఈ కీలక ప్రశ్నల గురించి సమష్టి సంభాషణ మరియు సహకార ప్రతిపాదన అభివృద్ధిని ప్రేరేపించడమే దీని ఉద్దేశ్యం.
ఉత్తమ,
మూవ్‌మెంట్ వ్యూహం మరియు పాలన
Subscribe to the This Month in Education newsletter - learn from others and share your stories
మార్చుDear community members,
Greetings from the EWOC Newsletter team and the education team at Wikimedia Foundation. We are very excited to share that we on tenth years of Education Newsletter (This Month in Education) invite you to join us by subscribing to the newsletter on your talk page or by sharing your activities in the upcoming newsletters. The Wikimedia Education newsletter is a monthly newsletter that collects articles written by community members using Wikimedia projects in education around the world, and it is published by the EWOC Newsletter team in collaboration with the Education team. These stories can bring you new ideas to try, valuable insights about the success and challenges of our community members in running education programs in their context.
If your affiliate/language project is developing its own education initiatives, please remember to take advantage of this newsletter to publish your stories with the wider movement that shares your passion for education. You can submit newsletter articles in your own language or submit bilingual articles for the education newsletter. For the month of January the deadline to submit articles is on the 20th January. We look forward to reading your stories.
Older versions of this newsletter can be found in the complete archive.
More information about the newsletter can be found at Education/Newsletter/About.
For more information, please contact spatnaik wikimedia.org.
తెలుగు మహాసభల ఫొటోలు
మార్చువికీ మిత్రులకు నమస్కారం. భీమవరంలో జనవరి 7,8 తేదీల్లొ జరిగిన తెలుగు మహాసభలకు వెళ్ళాను. గజల్ శ్రీనివాస్ గారిని తెలుగు మహాసభల కార్యవర్గ ముఖ్యులను కలవడం జరిగింది. ఈ సభలలో సమయాభావం వలన ముందుగా స్పందించలేకపోవడం వలన వికీ తరపున ప్రసంగం కోసం అవకాశం లేకపోయింది. దీనిపై గజల్ శ్రీనివాస్ గారు చాలా విచారించారు. తదుపరి విశాఖపట్నంలో జరగబోవు తెలుగు మహాసభలలలో ముందుగా అవకాశం కల్పించడంతోపాటు ఒక స్టాల్ నిర్వహణకు కూడా సహకరిస్తామని మాట ఇచ్చారు. సభల అనంతరం కర్ణాటక, ఒరిసా, తమిళనాడు వంటి అంతరాష్ట్ర తెలుగు సంఘాల ప్రతినిధులతో సమావేశం అవ్వడంజరిగింది. వారికి వికీపై కొంత అవగాహన కల్పించాను. వారు ఆశక్తి కనబరచారు.వారు జూం ద్వారా మరింత సమాచారం పొందకోరారు. వారికి వికీ గురించి అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వవల్సిఉంది. మహాసభల నిర్వహకుల ద్వారా మూడు రోజుల కార్యక్రమాల ఫొటోలు అందుకున్నాను. అవి సుమారు 40 జిబి వరకూ ఉన్నాయి. వాటిలో వడపోత అనంతరం 5 నుండి 10 జిబి వరకూ అనగా సుమారు వేయి ఫొటొల వరకూ ఉపయోగపడవచ్చు అనుకుంటాను..B.K.Viswanadh (చర్చ) 07:03, 22 జనవరి 2022 (UTC)
- @B.K.Viswanadh గారూ, ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 07:15, 22 జనవరి 2022 (UTC)
- విశ్వనాథ్ గారూ మీ కృషికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 10:03, 22 జనవరి 2022 (UTC)
మరికొన్ని కార్యక్రమాలు
మార్చుభీమవరంలో తెలుగు మహాసభల అనంతరం భీమవరం కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సాంస్కృతిక సంఘాలు, తెలుగు సమాజాలను కలవడం జరిగింది. వీరి ద్వారా గత పది పదిహేను సంవత్సరాలుగా హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమలు జరిగాయి, జరుగుతున్నాయి. వాటి ద్వారా అనేక మంది ప్రముఖ కళాకారుల నుండి సమీప కళాకారుల వరకూ తమ ప్రదర్శనలు అందించారు. సన్మానాలు పొందారు. వాటి పేపర్ కటింగ్స్, ఫొటోలు అన్నీ ఆల్భం రూపంలో వారు భద్రపరచారు. వాటిని మనకు ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు. అయితే వారికి ఇంటర్నెట్ గురించి అవగాహన తక్కువ కనుక మనమే వాటిపై పనిచేయాలి. పేపర్ కటింగ్స్, ఫొటోలు స్కాన్ చేయడం చేయాలి. OTRS ద్వారా వారిని వికీకి పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇది జరిగితే మనకు విలువైన సంపద అందుబాటులో ఉంటుంది.దీనిపై మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.B.K.Viswanadh (చర్చ) 07:19, 22 జనవరి 2022 (UTC)
- B.K.Viswanadh గారూ, మహాసభలలో పాల్గొని తెలుగు వికీపీడియాకు చాలా ఉపయోగమైన పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకృషి అభినందనీయము; ఆయా బొమ్మలను కామన్స్ లోనికి అప్లోడ్ చేయమని ప్రార్థన. నేనేమైనా సహాయం చేయగలిగితే అదృష్టవంతున్ని.--Rajasekhar1961 (చర్చ) 11:43, 28 జనవరి 2022 (UTC)
Wikimedia Wikimeet India 2022 Postponed
మార్చుDear Wikimedians,
We want to give you an update related to Wikimedia Wikimeet India 2022. Wikimedia Wikimeet India 2022 (or WMWM2022) was to be conducted from 18 to 20 February 2022 and is postponed now.
Currently, we are seeing a new wave of the pandemic that is affecting many people around. Although WMWM is an online event, it has multiple preparation components such as submission, registration, RFC etc which require community involvement.
We feel this may not be the best time for extensive community engagement. We have also received similar requests from Wikimedians around us. Following this observation, please note that we are postponing the event, and the new dates will be informed on the mailing list and on the event page. Although the main WMWM is postponed, we may conduct a couple of brief calls/meets (similar to the Stay safe, stay connected call) on the mentioned date, if things go well.
We'll also get back to you about updates related to WMWM once the situation is better. Thank you MediaWiki message delivery (చర్చ) 07:27, 27 జనవరి 2022 (UTC)
Nitesh Gill
on behalf of WMWM
Centre for Internet and Society
విలీనం చేయవలసిన వ్యాసాలు
మార్చువిలీనం చేయాల్సిన వ్యాసాల వర్గంలో 170 పేజీలు ఉన్నాయి. నిర్వాహకులు ఎవరైనా వీటిపై తమ దృష్టిని సారించగలరు.--స్వరలాసిక (చర్చ) 02:16, 29 జనవరి 2022 (UTC)
- ధన్యవాదాలు @స్వరలాసిక గారు. ఒక వ్యాసం లోని సమాచారాన్ని రెండో వ్యాసంలో కలిపేసి మొదటి దాన్ని రెండవ దానికి దారిమార్పుగా చెయ్యడమే విలీనం. దీనికి ప్రత్యేక అనుమతులేమీ అవసరం లేదు కాబట్టి, ఈ పని ఎవరైనా చెయ్యవచ్చు - నిర్వాహకులే కానవసరం లేదు. ఎక్కడో అరుదుగా పేజీని తొలగించాల్సిన సందర్భమేదైనా ఉంటే అప్పుడు తొలగింపు మూస పెట్టేస్తే సరిపోతుంది. __ చదువరి (చర్చ • రచనలు) 13:52, 30 జనవరి 2022 (UTC)
ఇంటర్‌ఫేసు అనువాదాలు (స్థానికీకరణ)
మార్చువికీపీడియా సైటు స్థానికీకరణ గురించి, ఇక్కడ ఇంకా చెయ్యాల్సిన అనువాదాలు, సవరించాల్సిన అనువాదాలు, తాజాకరించాల్సిన అనువాదాలు మొదలైన వాటిని గమనించినపుడూ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయమై ఒక పేజీని తెరిచాను. వాడుకరులు ఆ పేజీని పరిశీలించవల్సినదిగా, ఆ పేజీకి సంబంధించిన సూచనలేమైనా ఉంటే ఇవ్వాలనీ కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 07:06, 1 ఫిబ్రవరి 2022 (UTC)
CIS - A2K Newsletter January 2022
మార్చుDear Wikimedians,
Hope you are doing well. As a continuation of the CIS-A2K Newsletter, here is the newsletter for the month of January 2022.
This is the first edition of 2022 year. In this edition, you can read about:
- Launching of WikiProject Rivers with Tarun Bharat Sangh
- Launching of WikiProject Sangli Biodiversity with Birdsong
- Progress report
Please find the newsletter here. Thank you MediaWiki message delivery (చర్చ) 08:17, 4 ఫిబ్రవరి 2022 (UTC)
Nitesh Gill (CIS-A2K)
Enabling Section Translation: a new mobile translation experience
మార్చునమస్తే Telugu Wikipedians!
Apologies as this message is not in Telugu language, Please help translate to your language.
The WMF Language team is pleased to let you know that we will like to enable the Section translation tool in Telugu Wikipedia. For this, our team will love you to read about the tool and test it so you can:
- Give us your feedback
- Ask us questions
- Tell us how to improve it.
Below is background information about Section translation, why we have chosen your community, and how to test it.
Background information
Content Translation has been a successful tool for editors to create content in their language. More than one million articles have been created across all languages since the tool was released in 2015. The Wikimedia Foundation Language team has improved the translation experience further with the Section Translation. The WMF Language team enabled the early version of the tool in February in Bengali Wikipedia. Through their feedback, the tool was improved and ready for your community to test and help us with feedback to make it better.
Section Translation extends the capabilities of Content Translation to support mobile devices. On mobile, the tool will:
- Guide you to translate one section at a time in order to expand existing articles or create new ones.
- Make it easy to transfer knowledge across languages anytime from your mobile device.
Telugu Wikipedia seems an ideal candidate to enjoy this new tool since data shows significant mobile editing activity.
We plan to enable the tool on Telugu Wikipedia in the coming weeks if there are no objections from your community. After it is enabled, we’ll monitor the content created with the tool and process all the feedback. In any case, feel free to raise any concerns or questions you may already have in any of the following formats:
- As a reply to this message
- On the project talk page.
- Through this feedback form
Try the tool
Before the enablement, you can try the current implementation of the tool in our testing instance. Once it is enabled on Telugu Wikipedia, you’ll have access to https://te.wikipedia.org/wiki/Special:ContentTranslation with your mobile device. You can select an article to translate, and machine translation will be provided as a starting point for editors to improve.
Provide feedback
Please provide feedback about Section translation in any of the formats you are most comfortable with. We want to hear about your impressions on:
- The tool
- What you think about our plans to enable it
- Your ideas for improving the tool.
Thanks, and we look forward to your feedback and questions.
UOzurumba (WMF) (చర్చ) 11:06, 15 ఫిబ్రవరి 2022 (UTC) On behalf of the WMF Language team
PS: Sending your feedback or questions in English is particularly appreciated. But, you can still send them in the language of your choice.
International Mother Language Day 2022 edit-a-thon
మార్చుDear Wikimedians,
CIS-A2K announced International Mother Language Day mini edit-a-thon which is going to take place on 19 & 20 February 2022. The motive of conducting this edit-a-thon is to celebrate International Mother Language Day.
This time we will celebrate the day by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some language-related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about languages or related to languages. Anyone can participate in this event and users can add their names to the given link. Thank you MediaWiki message delivery (చర్చ) 13:08, 15 ఫిబ్రవరి 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు ప్రాజెక్టులు
మార్చురెవెన్యూ వ్యవస్థలో పరిపాలనాపరంగా జిల్లాల తరువాత రెవెన్యూ డివిజన్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.రెవెన్యూ డివిజన్లు పరిధిలో ఉప-విభాగాలుగా మండలాలు ఉన్నాయి. తెలంగాణలో 2021 జనవరి నాటికి 73 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లో 2021 జనవరి నాటికి 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు (ఆర్.డి.ఒ) అధిపతిగా ఉంటాడు. వీరిని సబ్ కలెక్టర్ అని కూడా అంటారు. మండలాల్లలోని తహసీల్దారులు (పూర్వం ఎం.ఆర్.ఓ) పరిపాలనాపరంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు నియంత్రణలో ఉంటారు. భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, భూసేకరణ, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామాలు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు కలెక్టర్ తరుపున విధులు నిర్వహిస్తారు . ఏ శాఖా ప్రాతినిధ్యం వహించని పనులును (ఆర్.డి.ఒ) సాధారణ పరిపాలకునిగా చేపడుతుంటారు.ఇవి మండలాలు, జిల్లాల మధ్య పరిపాలనా సమన్యయం కలిగి ఉంటాయి.వీటికి పేజీలు లేనందున జిల్లాలోని మండలాలు ఏ రెవెన్యూ డివిజనుకు చెందినవో అర్థంకాని పరిస్థితి ఉంది.పై కారణాలు దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలలో రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు చాలా అవసరమని భావించి రెండు రాష్టాలకు విడివిడిగా ప్రాజెక్టు పేజీలు రూపొందించటమైనది.
ప్రాజెక్టు పేజీలు
మార్చు- వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు
ఆసక్తి ఉన్న వాడుకరులు ప్రాజెక్టుపేజీలు సందర్శించి, అందులోని సూచనలుప్రకారం పేజీలు సృష్టింపు చేయటానికి ఈ విభాగం ప్రవేశపెట్టటమైనది.ఈ ప్రాజెక్టులపై ఏమైనా సూచనలు, సలహాలు ఆ ప్రాజెక్టు చర్చాపేజీలల చేయగలరు--యర్రా రామారావు (చర్చ) 05:54, 17 ఫిబ్రవరి 2022 (UTC)
- ధన్యవాదాలు యర్రా రామారావు గారు, మంచి ప్రాజెక్టు, ఇందులో నేను కూడా పాల్గొంటాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 06:20, 17 ఫిబ్రవరి 2022 (UTC)
- యర్రా రామారావు గారు ఈ ప్రాజెక్టులో,నేను కూడా పాల్గొంటానుCh Maheswara Raju☻ (చర్చ) 03:25, 19 ఫిబ్రవరి 2022 (UTC)
Ukraine's Cultural Diplomacy Month: We are back in 2022!
మార్చుPlease help translate to your language
Hello, dear Wikipedians!
Wikimedia Ukraine, in cooperation with the Ministry of Foreign Affairs of Ukraine and Ukrainian Institute, has launched the second edition of writing challenge "Ukraine's Cultural Diplomacy Month", which lasts from 17 February to 17 March 2022. The campaign is dedicated to famous Ukrainian artists of cinema, music, literature, architecture, design and cultural phenomena of Ukraine that made a contribution to world culture. The most active contesters will receive prizes.
We invite you to take part and help us improve the coverage of Ukrainian culture on Wikipedia! Also, we plan to set up a banner to notify users of the possibility to participate in such a challenge!--ValentynNefedov (WMUA) (చర్చ) 11:12, 18 ఫిబ్రవరి 2022 (UTC)
Wiki Loves Folklore is extended till 15th March
మార్చుGreetings from Wiki Loves Folklore International Team,
We are pleased to inform you that Wiki Loves Folklore an international photographic contest on Wikimedia Commons has been extended till the 15th of March 2022. The scope of the contest is focused on folk culture of different regions on categories, such as, but not limited to, folk festivals, folk dances, folk music, folk activities, etc.
We would like to have your immense participation in the photographic contest to document your local Folk culture on Wikipedia. You can also help with the translation of project pages and share a word in your local language.
Best wishes,
International Team
Wiki Loves Folklore
MediaWiki message delivery (చర్చ) 04:50, 22 ఫిబ్రవరి 2022 (UTC)
వికీలో ఎవరైనా రాయవచ్చని పాఠకులకు తెలుసా..!?
మార్చువికీలో ఎవరైనా రాయవచ్చని, తమ లాంటి వాళ్ళే వికీలో రాస్తున్నారనీ, తాము కూడా రాయవచ్చనీ వికీ పాఠకుల్లో కొందరికి (బహుశా చాలామందికి) తెలియదని నా ఉద్దేశం. అలాంటి లోపం నిజంగా ఉంటే.., దాన్ని సవరించేందుకు, అజ్ఞాతలకు మాత్రమే కనిపించేలా ఒక ప్రకటనను చేర్చాను. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 06:39, 27 ఫిబ్రవరి 2022 (UTC)
- బాగుంది సార్, పాఠకుడు తెరిచిన ప్రతి వికీ పేజీలో ఈ ప్రకటన కనిపించేలా చేయాలి. అలాగే... పాఠకుడి దృష్టి పడేలా వికీ పేజీలో ఉన్న పాఠ్యానికి, ప్రకటనలో ఉన్న పాఠ్యానికి తేడా (ఆకర్షనీయంగా ప్రకటన నోటీస్) ఉండేలా చూసుకోవాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 08:12, 27 ఫిబ్రవరి 2022 (UTC)
- మంచి ఆలోచన, మంచి ప్రయత్నం.ఇది నిరంతరం ఉంచినా పర్వాలేదు.ప్రకటన నోటీసు చూపురులకు ఆకర్షణగా కూడా ఉంది. యర్రా రామారావు (చర్చ) 08:17, 27 ఫిబ్రవరి 2022 (UTC)
- బాగుంది సర్.. చాలా మంచి ఆలోచన. పాఠకులు వికీలో రాయడానికి, దిద్దుబాట్లు చేయడానికి ఇదొక మంచి పునాదిగా ఉపయోగపడుతుంది.--అభిలాష్ మ్యాడం (చర్చ) 09:08, 27 ఫిబ్రవరి 2022 (UTC)
మూసల దారిమళ్లింపులు
మార్చుమూస పేజీలలో సమస్య (చూడండి) పరిష్కారానికి, మూసలకు అంతర్వికీ లింకులు చేర్చేపని ప్రారంభించాను. ఆంగ్లవికీలో మూసలలో మార్పులను సాధ్యమైనంతవరకు తెవికీలో ప్రతిబింబిస్తే నిర్వహణ సమస్యలు ఎక్కువకాకుండా, ఆంగ్లవికీలో నాణ్యత పెంపొందించే దిశగా మార్పులు జరిగినపుడు, అవి తెవికీలో సునాయాసంగా పొందటం వీలవుతుంది. దీనిలో భాగంగా పాతబడిన మూసలకు దారి మార్పులు, అలాగే కొన్ని తెలుగు పేరుతో వున్న మూసలకు ఆంగ్ల పేరు దారి మళ్లింపులు, కొత్త మూసలు దిగుమతులు చేస్తున్నాను. పర్యవసానంగా, ఇప్పటికే వాడుతున్న తెలుగు స్థానికీకరణ జరిగిన మూసలలోని అనువాదాలను వాటి దారిమార్పు మూసలలో మానవీయంగా చేయాలి. సభ్యులు, నిర్వాహకులు గమనించి ఈ కృషిలో పాలుపంచుకోమని మనవి. మీరు వ్యాసాలు చూస్తున్నప్పుడు సమాచారపెట్టెలు లాంటి చోట్ల ఇంతకు ముందు తెలుగు పదజాలం వుండేచోట ఆంగ్ల పదజాలం కనబడితే ఆ మూసకు అనువాదం మరల చేయాలి అని గమనించండి. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 11:31, 27 ఫిబ్రవరి 2022 (UTC)
Coming soon
మార్చుSeveral improvements around templates
మార్చుHello, from March 9, several improvements around templates will become available on your wiki:
- Fundamental improvements of the VisualEditor template dialog (1, 2),
- Improvements to make it easier to put a template on a page (3) (for the template dialogs in VisualEditor, 2010 Wikitext and New Wikitext Mode),
- and improvements in the syntax highlighting extension CodeMirror (4, 5) (which is available on wikis with writing direction left-to-right).