వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 1

పాత చర్చ 1 | పాత చర్చ 2

alt text=2007 మే 3 - 2012 మార్చి 7 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2007 మే 3 - 2007 ఆగస్టు 2

ఎన్వికీ బొమ్మను ఎంబెడ్ చెయ్యడము

మార్చు

ఎన్వికీ నేమ్‌స్పేస్ లో ఉన్న బొమ్మను తెవికీ లో ఎంబెడ్ చెయ్యవచ్చా?? en:Image:Bmk.JPG (క్లిక్ చెయ్యండి) తో లింకు చెయ్యవచ్చు .. దీని వలన బొమ్మలను రీలోడ్ చెయ్యవలసిన అవసరము తగ్గుతుంది.. --పిఢరా 06:34, 3 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పదివేల పండుగ

మార్చు

పదివేల పండుగ - తెలుగు వికీపీడియా పదివేలవ వ్యాసాన్ని చేరుకునే రోజు. చినుకు చినుకు గా మొదలై జడివాన అయినట్లు, మొలక మొలక గా మొదలై వెయ్యి దాటి రెండు వేలకు దగారౌతున్నది. త్వరలోనే రెండు, మూడు...దాటి పదివేలకు చేరాలని ఆశిస్తూ..

దీనికో మార్గసూచిక (రోడ్‌మాప్‌) తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది? ప్రస్తుతం (07:42, 5 అక్టోబర్ 2005 (UTC)) 150 మంది సభ్యులు.. ఒక్కొక్కరు వారానికి ఒక కొత్త వ్యాసం.., మరో నాలుగు దిద్దుబాట్లు.. సంవత్సరంలో పదివేల వ్యాసాలు గొప్ప విషయమేమీ కాదనుకుంటాను.__చదువరి 07:42, 5 అక్టోబర్ 2005 (UTC)

  • మన రాష్ట్రములో దాదాపు 1200 మండలములు ఉన్నవి. నా వంతుగా ప్రతి మండలము గురించి కనీసము 2-3 వాక్యములు రాయగలనని నా నమ్మకము. ఇప్పటికి మనము జిల్లా స్థాయిలో బాగానే రాశాము. ప్రతి గ్రామానికి ఒక పేజి ఉండే రోజు త్వరలోనే వస్తుంది.
  • తెలుగు సినిమాలు 5000 దాకా ఉంటాయి. మనము వీటి డేటాబేసు ఎక్కడనుంచైన సంపాదించగలిగితే బాట్‌ ఉపయోగించి వాటన్నిటికి పేజీలు రాయొచ్చు.
  • బాట్లు ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. పోలిష్‌ వికిపీడియా ఒక్క రోజులో 90,000 నుండి 1,00,000 కు గెంతింది. ఖచ్చితంగ బాట్ల పనే అయ్యుండొచ్చు. (ఇతర వికిపీడియాలు ఎమి చేస్తున్నయో అప్పుడప్పుడు గమనించండి).
  • అన్నింటికంటే ముఖ్య మైనది. సభ్యుల సంఖ్య పెంచడము. చాలా మంది సభ్యులను ఆకర్షించడానికి ప్రతి పేజీపేరు (అన్ని పేజీలకు వర్తించదనుకో) మొదటి వాక్యములో ఆంగ్లములో రాయవచ్చని ఒక సూచన విన్నా వేరే వికిపీడియాలో. (ఉదాహరణకి కర్నూలు(Kurnool) ) will increase the chances of people getting to that article. జనాలు గుగూల్‌లో తెలుగు పదాలతో అన్వేశించడానికి ఇంకా అలవాటు పడలేదు.
--వైఙాసత్య 08:37, 5 అక్టోబర్ 2005 (UTC)

ఇంగ్లీషులో పేజీపేరు

మార్చు

పేజీపేరు ఇంగ్లీషులో రాసే విషయమై హిందీ వికీపీడియాలోని ఈ లింకు చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 18:16, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


తెలుగులో ఏముంది?

మార్చు

అదే నాకు ఆశ్చర్యంగానూ, గర్వంగానూ ఉంది. నేను కేవలం 45 రోజుల క్రితం యాదృచ్చికంగా తెలుగు వికిపిడియా చూసి, సభ్యునిగా చేరాను. తరువాత ఇది ఒక వ్యసనమై పోయింది. అయితే నేను ఒంటరిని కాను. దాదాపు అందరు సభ్యులు తమ తమ వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే రేయింబవళ్ళూ 'తెవికీ' కోసం శ్రమ పడుతున్నారని గమనించవచ్చు. ఒక్కొక్కరి పనిగంటలు చూస్తే ఇది అర్ధమై పోతుంది. వారికందరికీ నా ధన్యవాదాలు.


ఇంతకూ చెప్పదలచుకున్నదేమంటే ఇలాంటివారు చాలామంది ఉన్నారు కాని వారికి 'తెవికీ' గురించి తెలియదనుకొంటాను (రెండు నెలల క్రితం నాకస్సలు తెలియదు). అటువంటి వారికి గాలం వేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా యువతరాన్నీ, ఉపాధ్యాయ వర్గాన్నీ, గృహిణులనూ, పత్రికా ప్రపంచంలో ఉన్నవారినీ ఆహ్వానించడం అవసరం. పది మంది వల్ల అయ్యే పని ఒక్కరికి సాధ్యం కాదు.


సభ్యులందరికీ విజ్ఙప్తి. సందు దొరికినప్పుడల్లా 'తెవికీ' గురించి పది మందికీ తెలియ జెప్పండి. ఇన్షూరెన్సు ఏజంట్లలా వెంట బడండి. పదివేల పండుగ దగ్గరలోనే వుంది. అయితే రాసితోబాటు వాసికూడా మనం నిలబెడదాము.


కాసుబాబు 21:33, 12 సెప్టెంబర్ 2006 (UTC)

పదివేల పండుగ, తదుపరి లక్ష్యాలు

మార్చు

గత సంవత్సరం అక్టోబరు 5 న "పదివేల పండుగ" ఇదే పేజీలో చర్చకు వచ్చింది. సంవత్సరంలోగా చెయ్యగలమేమో అని అనుకున్నాం. సంవత్సరానికి ఇంకా 20 రోజులు ఉండగానే చేరుకున్నాం! ఈ శుభవేళ సభ్యులందరికీ అభినందనలు. ఈ సందర్భంగా మన ప్రాధమ్యాలను నిర్దేశించుకుందాం.. కింది జాబితాకు మరిన్నిటిని చేర్చండి. __చదువరి (చర్చ, రచనలు) 06:50, 22 సెప్టెంబర్ 2006 (UTC)

  1. అనువాదాలు: అనువదించవలసిన వ్యాసాలు చాలానే ఉన్నాయి. వీటి పని పట్టాలి.
  2. భాషా దోషాల సవరణ: వికిపీడియా శైశవ స్థితిని దాటిన వేళ ఇక మనం నాణ్యతపై మరింత జాగ్రత్త వహించాలి. ప్రస్తుత వ్యాసాల్లో భాషా దోషాలు లెక్కకు మిక్కిలిగా ఉంటూ పంటి కింద రాళ్ళలా తగులుతూ ఉంటున్నాయి. ఈ విషయమై మనం ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చెయ్యాలి. ఈ బృంద సభ్యులు వ్యాసాల్లోని భాషను సంస్కరిస్తూ ఉంటారు. దీని వలన నాణ్యత పెరుగుతుంది. దీనిపై సభ్యులు తమ అభిప్రాయాలు రాయగలరు.----
  3. ప్రాజెక్టులు మొదలుపెట్టి, వాటికి ప్రధాన పేజీ నుండి ఓ లింకు ఇవ్వాలి ,తద్వారా ఓ ప్రాజెక్టుపై మక్కు ఉన్న వారిని ఆకర్షించ వచ్చు. ఉదాహరణకు చరిత్ర, భారత దేశ చరిత్ర, ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర, కంప్యూటర్లు, కంప్యూటరు కంపెనీలు, సాఫ్ట్‌వేరు, హార్డ్‌వేరు, తెలుగు ప్రముఖులు, భారత దేశ ప్రముఖులు, మహా భారత వ్యక్తులు, రామాయణ వ్యక్తులు, వేదాలు, మొదలగున్నవి; ఒక్కొక్క ప్రముఖునికి ఓ తలపండినవాడిని అధిపతి చేస్తే బాగుంటుంది.
  4. మనము మన ప్రధాన పేజీని ఓ చూపు చూడాలి. చక్కగా దీనిని డిజైనును చేయాలి. అంటే ఇప్పుడు ఉన్నది బాగోలేదని కాదు, కానీ మరింత అధ్భుతంగా చేయాలి, దీనిని సాంకేతిక దృష్టితో కాకుండా ముందు ఎలా ఉంటే బాగుంటుందని స్కెచ్ వేసుకొని ఆ తరువాత అలా ఎలా వ్రాయాలో చూడాలి
  5. తెలుగువికీ, తెలుగు బ్లాగు (?) సమావేశాలు పెద్ద యెత్తున నిర్వహించాలి. ప్రతి జిల్లా కేంద్రములోనూ, ప్రతి విశ్వవిద్యాలయపు వాకిలిలోనూ, ప్రతి కాలేజీ, స్కూలు లోనూ వీటి గురించి కనీసం ఒకరైనా ఒకసారి అయినా ప్రచారం నిర్వహించాలి. దీని కోసం మనము సభ్యులను చక్కగా పథక రచన చేయమని అడగాలి

Chavakiran 08:24, 22 సెప్టెంబర్ 2006 (UTC)

ప్రతిపాదన-1

మార్చు

పదివేల పండుగ సందర్భముగా అందరికీ శుభాభినందనలు. చావారవికిరణ్ చెప్పిన విషయాలు అన్నీ ముఖ్యమైనవే. వాటిలో రెండు విషయాలగురించి నేను ప్రస్తావిస్తున్నాను

  • వ్యాసాల నాణ్యత పెంచడం. ఇందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు.
    • అనువాద కార్యక్రమాలు పూర్తి చేయడం
    • ఇప్పుడున్న వ్యాసాల శైలినీ, అనుసందాలనూ అవుసరమైనచోట సవరించడం
    • పకడ్బందిగా వర్గీకరణ డిజైన్ చేయడం.
    • అభిమాన సంఘాలను సినిమా వ్యాసాలలో పాలు పంచుకోమని ప్రోత్సహించడం.
    • గ్రామాలగురించి వ్యాసాలు వ్రాయమని మండలం ఆఫీసులకు ఉత్తరాలు వ్రాయడం.
  • క్రొత్త సభ్యులను చేర్చడం. ఇందుకు మార్గాలు చాలా మంది సభ్యులకు తెలుసు గాని వారు ఇన్షూరెన్సు ఏజంట్లలాగా ప్రచారాన్ని నిర్వహించడానికి మొగమాట పడుతున్నట్లున్నారు.
    • నేనీ మధ్య "చదువరి-ఇసుకపెట్టె 12" లోని "ఇంటర్నెట్లో తెలుగు వ్యాప్తి" అనే వ్యాసాన్ని నకలు మస్కాట్ లో తెలుగువారికి పంపిణి చేశాను. - కానీ స్పందన ఇంతవరకూ తెలియదు.
    • మూడు వర్గాలపై మనం ప్రధానంగా దృష్టి సారించడం మంచిది. వీరంతా సభ్యులసంఖ్య పెంచడంలో ముందు ముందు ప్రధాన పాత్ర పోషించే అవకాశమున్నది.
        • గృహిణులు
        • విలేకరులు
        • అధ్యాపకులు

సభ్యుల అభిప్రాయాలనూ, సహకారాన్నీ కోరుతున్నాను. మరి ముఖ్యమైన విషయం తెలుగులో మనం వీలైనంత త్వరగా ఎక్కువ జ్ఞానసృష్ట్టి చేయ్యలి, అలా అయితెనే మనం మన బాషాను ముందు తరాలకు సగర్వంగా అంది ఇవ్వగలం. కాసుబాబు 09:05, 22 సెప్టెంబర్ 2006 (UTC)


మీ అందరి ప్రతిపాదనలూ చాలా బాగున్నాయి. ఈ చర్చ ఇంకో వారము పాటు ఉంచి. ఆ తరువాత అన్ని సూచనలు క్రోడికరించి ఒక జాబితా తయారు చేద్దాము.
నావి కొన్ని ఆలోచనలు.
  • ఇక పరుగు పందేలు మానేద్దాము. అయినా సినిమాలు, గ్రామాల పేజీలు కేవలము సంఖ్య పెంచడానికి రాసినవి కాదు. సంఖ్య పెంచాలంటే ఎప్పుడో క్రీ.పూ 5000 నుండి 5000 క్రీ.శ వరకు సంవత్సరాలకు బాటుతో పేజీలు తయారుచేసేవాళ్లము కదా. బెంగాళీ వికిలో ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతి ప్రాంతానికి మొలకలు తయారుచేస్తున్నారు. వాళ్ల ఆతృము చూస్తే నవ్వొచ్చింది.
  • సినిమా వ్యాసాలు, గ్రామాల వ్యాసాలతో కొంత సమతుల్యము తప్పిందని నేనంగీకరిస్తాను. అందుకు మనము ఒక తెలుగు విజ్ఞాన సర్వస్వములో తప్పుకుండా ఉండాల్సిన ఒక వెయ్యి వ్యాసాల జాబితా తయారు చేసుకొందాము. ఆ వెయ్యి వ్యాసాలు వీలైనంత సమగ్రముగా విశేష వ్యాసాల స్థాయిలో రాద్దాము. అప్పుడు మన వికి వాసిలో ఆంగ్ల వికిని మించిపోతుంది (13 లక్షల వ్యాసాలున్నా ఆంగ్ల వికిలో విశేష వ్యాసాల సంఖ్య ఈ మధ్యే వెయ్యిని దాటింది). అప్పుడు తెలుగు వికి రాశిలోనే కాదు వాసిలో కూడా మిన్నే అని నిరూపించుకుంటాము. --వైఙాసత్య 15:32, 22 సెప్టెంబర్ 2006 (UTC)

నేను మరల మరల నొక్కి చెబుతున్నాను. మన గ్రామాలు, మన సినిమాలు - ఇవి తెలుగు వికీ లో ఉండేవి, మిగిలిన వికీ లలో ఉండనవి. - అంటే మన వికీ ఆంగ్ల వికీకు అనువాదంగా మాత్రమే పరిమితం కాదని చెప్పేవి. కొద్దికాలంలో ఇవి ఉపయోగకరమైన వనరులుగా తీరుదిద్దుకుంటాయి. కనుక సభ్యులు వీటి విషయంపై "అపాలజెటిక్" గా ఫీల్ కానవసరం లేదు. మన అవసరాలను మనం రూపొందించుకుంటాం. కాసుబాబు 18:32, 22 సెప్టెంబర్ 2006 (UTC)

Translation requests

మార్చు

Is there a place for requesting translations or is this fine. Can some translate the below please,

Thanks, Ganeshk 22:56, 10 అక్టోబర్ 2006 (UTC)

మీ అనువాద విజ్ఞప్తులు ఇక్కడ చేయ్యండి. వికీపీడియా:వ్యాస అనువాద విజ్ఞప్తులు --వైఙాసత్య 04:05, 11 అక్టోబర్ 2006 (UTC)
Translation done. మూస:భారత స్థల సమాచారపెట్టె --వైఙాసత్య 05:17, 11 అక్టోబర్ 2006 (UTC)
Could you please translate the labels that are displayed (Area, Altitude etc)? Thanks, Ganeshk 05:27, 11 అక్టోబర్ 2006 (UTC)
You are too fast!! :) Thanks, Ganeshk 05:35, 11 అక్టోబర్ 2006 (UTC)
Thanks :-) --వైఙాసత్య 05:47, 11 అక్టోబర్ 2006 (UTC)

భారతీయ పరిధి సమాచార పట్టిక Anjali 11:52, 23 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రతిపాదన విశేష వ్యాసం

మార్చు

అరటి ని ఈ వారం విశేష వ్యాసంగా పెట్టాలని నా ప్రతిపాదన Chavakiran 08:01, 7 నవంబర్ 2006 (UTC)


అధికారిక మెయిలింగు లిస్టు

మార్చు

తెవికీ కొరకు అధికారిక మెయిలింగు లిస్టు సృష్టించాం. wikite-l@wikipedia.org (WikiTe-L) సందేహ నివృత్తి మరియు సహాయం కొరకు సభ్యులు దీన్ని కూడా వాడచచ్చు. ఈ మెయిలింగు లిస్టులో చేరడానికి ఈ పేజీ లోని ఫారం వాడండి.--వీవెన్ 06:46, 22 నవంబర్ 2006 (UTC)

ఆహ్వానాలు

మార్చు

మనం 'తెలికీ' వాడుకను మరియు 'తెలికీ' గురించి అవగాహనని పెంచటానికి ఆర్కుట్(Orkut) లో మనకు తెలిసినివారికి ఆహ్వానాలు పంపినట్టు తెలికీలో కూడా అవకాశం ఉంటె బావుంటుందని నా ఉద్దేశం.నిర్వాహుకులారా మీ అభిప్రాయం ఏమిటి?---పాపిశెట్టి 14:56, 8 డిసెంబర్ 2006 (UTC)


25వేలు! వందనాలు - అభినందనలు - త్వరలోనే లక్షాధికారులు!

మార్చు

తెవికీ 25వేల వ్యాసాలకు చేరుకున్న శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. అక్షరం అక్షరం కూర్చి ఈ మహాయజ్ఙంలో పాల్గొంటున్న ఎందరో దీక్షాపరులకు వందనాలు. ఒకప్పుడు పదివేల పండుగకు ఎదురుచూశాం. ఈనాడు 25వేలకు దూకాం. ఇక మన తరువాత ప్రస్థానం లక్ష వ్యాసాలు! అందుకు మార్గదర్శకాలను త్వరలో చర్చించుకొందాం.

పైరగాలి వోలె పరువం పరుగులు పెడుతున్నది
కోడె త్రాచువోలె వయసు కుబుసం విడుతున్నది
నా పరువం సెలయేరుల నడకలవలె ఉన్నది
నా రూపం విరజాజుల నవ్వులవలె ఉన్నది ------- మంగమ్మ శపధం నుండి

నిత్యయౌవనంతో తెలుగుభాష, తెలుగువికీ, తెలుగువారి విజ్ఙానము వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ


కాసుబాబు 08:13, 16 డిసెంబర్ 2006 (UTC)


2007 శుభాకాంక్షలు - గమనికలు

మార్చు

తెలుగువారికి 2007 క్రొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఆయురారోగ్యైశ్వర్యమస్తు. తెవికీ కేవలం సభ్యులకు, వికీకర్తలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగువారికందరికీ ఉపయోగకరమైన విజ్ఞానవేదికగా రూపుదిద్దుకోవాలని మనందరి ఆకాంక్ష. ఈ సందర్భంలో (ఇది రచ్చబండ గనుక) కాస్త అదీ, కాస్త ఇదీ ---

  • ఈ మధ్య కొద్దిరోజులుగా నేను తెవికీలోని వ్యాసాలను, ఇతర భారతీయ భాషా వ్యాసాలతో పోల్చి చూస్తున్నాను. అన్నిభాషలలోనూ ఉండే వ్యాసాలు అంచనాకు ఎంచుకొని, ముఖ్యంగా తమిళం, కన్నడ, బెంగాలీ భాషల వికీలను పరిశీలించాను. వ్యాసాల నాణ్యతలో తెవికీ వేటికీ తీసిపోదు. ఇక వ్యాసాల సంఖ్యలో మనవాళ్ళు పరుగో పరుగు. అయితె అన్ని భారతీయభాషల వికీలు భాల్యదశలోనే ఉన్నాయి గనుక ఈ పోలికలకు అంత ప్రాముఖ్యం ఇవ్వనవుసరం లేదు.
  • ఇక సినిమాలు, గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఉండవేటిమరి! ఏవూరి కధ ఆవూరిది. అంతా కలిపి మనవారి కధ. ఈ అవిడియా తెచ్చినవారికి, కూర్చినవారికి (చదువరి, వైజాసత్య, వీవెన్ అనుకుంటాను) మరోసారి "ఇది చాలా హాట్ గురూ". అసలీ గ్రామాలగురించి వ్రాయాలనుకునే వారికి ఇదివరకు వేదికే లేదు. ఇప్పుడు సీను రెడీ. లైట్స్.కెమెరా.యాక్షన్.
  • మాకినేని ప్రదీపు భారతదేశం ప్రాజెక్టుపై బాగా పని సాగిస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవుసరం ఉంది.
  • అంతే కాదు. ఇందరే కాదు. ఇంకా సానామంది పని సేత్తన్నారు. అందరికీ దండాలు. పనిసేసే వారికి సాయంసేసే వారికి (కుటుంబ సభ్యులు, మిత్రులూ) దండాలు.

చేసింది బాగుండాది. చేయాల్సింది శాన ఉండాది. మళ్ళీ దండాలు

కాసుబాబు 20:12, 2 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


తెలుగు వికీ గురించి ఆంగ్ల వికీలో

మార్చు

నా చర్చా పేజీలో ఒక పోలిష్ సభ్యుడు కొంత సమాచారం అడిగారు. తెలుగు వికీ గురించి వ్యాసం కావాలని. ఆయన సందేశాన్ని క్రింద వ్రాస్తున్నాను.


Could you write some stub about Telegu Wikipedia in English Wikipedia? Now there is only redirect. I would like to write about it in Polish Wikipedia. Write when your wiki was founded, when it passed some milestone (f.e. 10 000 and 20 000), put logo. Thanks, Greg.
I wrote pl:Wikipedia w języku telugu, and be:Тэлугская Вікіпэдыя, but there are incompleted. Milestones and logo are needed. Can you write it in English in article: en:Telugu Wikipedia? Greg.

ఇందుకు సమాధానంగా నేను మొదలుపెట్టిన వ్యాసం en:Telugu Wikipedia చూడండి. అవుసరాన్ని బట్టి ఈ వ్యాసాన్ని సరిదిద్దమని కోరుతున్నాను.

--కాసుబాబు 09:22, 9 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా సమీక్షలు ఎలా వ్రాయాలి?

మార్చు

ఈ చర్చను ఇక్కడికి మార్చాను. --కాసుబాబు 12:34, 31 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల సమాచారం ప్రాజెక్టు

మార్చు

తెలుగు వికీలో అత్యధిక పేజీలు గ్రామాలకు కేటాయించబడ్డాయి. వీటిలో ఎక్కువ పేజీలు ఒకటి రెండు వాక్యాలు మాత్రమే కలిగి ఉన్నాయి. తెలుగు వికీ రాసిలోనూ, వాసిలోనూ పెరగడానికి ఈ పేజీలను విస్తరించాల్సిన అవుసరం చాలా ఉంది. ఇందుకోసం గ్రామాల సమాచార సేకరణ ఒక ప్రాజెక్టుగా నిర్వహించాలి. సమాచారం పంపమని ప్రచారం నిర్వహించాలి.

  • ప్రాజెక్టు ప్రణాళికను ఈ పేజీలో వ్రాసాను. పరిశీలించండి. మీ సూచనలను ఇవ్వండి.
  • ప్రచారం కోసం ఒక వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఈ వ్యాసాన్ని మరింతగా మెరుగుపరచండి. లేదా మీరు మీ అభిరుచికి అనుగుణంగా మరొక వ్యాసం వ్రాయండి.
  • ఈ వ్యాసాన్ని నేరుగా గాని, లేదా మీకు నచ్చినమరొక విధంగా వ్రాసి గాని, మీకు అందుబాటులో ఉన్న తెలుగు వారికి అందజేయండి. "మీ వూరి గురించి మీరే వ్రాయండి" అన్న నినాదంతో ఈ ప్రచారాన్ని సాగిద్దాము.
  • మీ సూచనలు వ్రాయండి. చర్చించండి.

--కాసుబాబు 12:45, 31 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు 3 సందేహాలు ఉన్నాయి.

మార్చు
  1. వికీపీడీయా తెలుగు ఫోరం ఉందా ఉంటే నాకు అడ్రస్ ఇవ్వరా ప్లీజ్ -- దీనికి సమాధానం దొరికేసింది.
  2. మీరు సందేహాలనివృత్తి మీద పని చేస్తున్నారా
  3. నేను చదువరి గారికి ఇచ్చిన మాట ప్రకారం [[1]] శ్రమ కోర్చి ఒక శ్రవణ (ఆడియౌ) ఫైలు తయారు చేశాను, అది ఎలా పెట్టాలో తెలియక కష్టపడుతున్నాను.పైలు లోడింగ్ అయితె అయ్యింది దాన్ని ఎలా ఉపయౌగించాలో తెలియడం లేదు.--మాటలబాబు 16:34, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు చేర్చిన పైలులో మాటలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి. నా అనుమానం ప్రకారం మీరు దానిని ఆంగ్ల వికీపీడియా నుండి సేకరించి తెలుగు వికీలో చేర్చినట్లున్నారు. ఆడియో పైళ్ళను కూడా బొమ్మలను చేర్చినట్లే వ్యాసాలలో చేర్చవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:52, 3 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
భలే, చెప్పిన ప్రకారం చేసి చూపించారు. చిన్న చితకా పొరపాట్లు మినహాయిస్తే, ఆడియో చక్కగా వచ్చింది. దీని విషయమై మనం మరింత ప్రణాళికాబద్ధంగా చేస్తే ఇంకా ఉపయోగకరంగా చెయ్యొచ్చనుకుంటా. వికీపీడియా చర్చ:5 నిమిషాల్లో వికీ పేజీలో చర్చిద్దాం. __చదువరి (చర్చరచనలు) 04:41, 4 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

స్పాము లింకులను కనుక్కోవడం ఎలా

మార్చు

వికీపీడియా వ్యాసాల నుండి బయటి లింకుల రూపంలో స్పాము లింకులివ్వడం ఓ రకం దుశ్చర్య. దీన్ని నివారించడం కోసం, బయటి లింకుల కోసం వెతికే పరికరం ఒకటుంది - ప్రత్యేక:Linksearch. వాడి చూడండి. __చదువరి (చర్చరచనలు) 09:08, 5 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

30 వేల వ్యాసాలు

మార్చు

గ్రామాల పేజీలను అయోమయ నివృత్తి పరచటానికి నడుపుతున్న బాటు వలన ఇవాలే మనం 30000 వ్యాసాల మైలురాయిని దాటబోతున్నాము. 30వేలవ వ్యాసాన్ని బాటు బదులు మనుషులే సృష్టిస్తే బాగుంటుంది. అందుకని 29980-29990న్ వ్యాసాలకు చేరుకున్నాక బాటును కొంచెం సేపు విరామం ప్రకటిస్తాను. అక్కడికి చేరుకోవడానికి సుమారు ఇంకో 2 గంటలు పట్టవచ్చు. ఆ సమయంలో సభ్యులు సద్వినియోగ పరచుకోగలరు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 02:38, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బాటుకు విరామం మొదలయింది. తెవికీలో ఎన్ని వ్యాసాలున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇక్కడ "good" అనే పారామీటరును చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:05, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
cache సమస్యల వలన బాటును ఆపటం కొంచెం ఆలస్యం అయ్యింది. కానీ 30000వ వ్యాసానికి వచ్చిన సమస్య ఏమీలేదు. వ్యవసాయం 30000వ వ్యాసంగా వచ్చింది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:58, 26 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మెదటి పేజి

మార్చు

మెదటి పేజిలు మార్పులు లకు సూచన్: మీకు తెలుసా అనే శీర్షిక మీద ఎదైన అంశాన్ని పెట్టడానికి కల కట్టుబాట్లు చెప్పగలరు. అక్కడ కూడా మార్పులు మిక్కిలి ఎక్కువగా జరగాలని కోరుకొంటూన్నాను.అప్పుడెప్పుడో ప్రదీప్ గారు కళ్ళు సినిమా వ్యాసం గురించి వ్రాస్తు అక్కడ ఒక అంశాన్ని చేర్చారు, ఆతరువాతా చాలా వ్యాసాల్లొ చాలా విశెష విషయాల గురించి వ్రాయడం జరిగింది. కాబట్టి పెద్దలు ఆ అంశం మీద కన్ను వేసి ఉంచమని ప్రార్థన. ఇప్పటికి నా కొ ఆలూచన్ ఉన్నది, నేను అసంపూర్తిగా వదిలి ఆగుంబె వ్యాసం లొ కొన్ని విశేషాలు ఉన్నాయి. భారత దేశంలొ అత్యధిక వర్షపాతం నమౌదు చేసుకొంటున్న ప్రాంతాలలొ రెండొ ప్రాంతం- దక్షిణ చిరపుంజి అనే విషయాన్ని మీకు తెలుసా శీర్షిక క్రింద పెడితే బాగుంటుంది అని నాఆలోచన--మాటలబాబు 07:15, 7 జూలై 2007 (UTC).[ప్రత్యుత్తరం]

ఈ శీర్షికను మీరే నిర్వహిస్తే బాగుంటుంది కదా. మీకు ఆహా అనిపించే విషయాలు మొదట ఈ వికీపీడియా:మీకు తెలుసా? భండారము లో చేర్చండి ఆ తరువాత వారానికి ఒక నాలుగైదు చొప్పున పాతవి తీసేసి కొత్త విషయాలు మూస:మీకు తెలుసా?1 లో చేరుస్తుండాలి. --వైజాసత్య 07:22, 7 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

మార్చు

తెవికీలొ మంచి మంచి బొమ్మలు సభ్యులు అప్లోడ్ చేస్తున్నారు చాలా బాగుంది , నాకు ఒక సందేహం, ఇప్పుడూ సభ్యులు అప్లోడ్ చేసే బొమ్మలలొ వాటర్ మార్కులు విడిచి పెట్టుతున్నారు, నావిన్నపం ఏమిటంటే వాటర్‌మార్కు లేకుండా ఉండాలలొ ఆలోచించండి, --మాటలబాబు 05:41, 31 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

cc-by-sa అంటేనే అది. ఒక కృతిని తయారుచేసిన/సృష్టించిన వ్యక్తికి తగిన గుర్తింపు ఇస్తున్నంత వరకూ మనం ఆ కృతిని ఏ విధంగానయినా ఉపయోగించుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆ లైసెన్సు ప్రకారం కృతిని తయారు చేసిన వ్యక్తి ఏ విధంగా అయితే గుర్తింపు పొందాలని అనుకున్నాడో అదేవిధంగా మనం గుర్తింపు ఇవ్వాలి. అలాంటి వాటిలో వాటరుమార్కింగు ఒకటి. కాబట్టి అటువంటి బొమ్మలలో వాటరు మార్కింగు ఉంటే ఆ బొమ్మ/కృతి యొక్క భవిష్యత్తు వెర్షనులలో కూడా దానిని తొలగించ కూడదనుకుంటా. కానీ, ఆ వాటరుమార్కు ఏదో ప్రకటణలాగా ఉంటేనో లేదా బొమ్మ/కృతి యొక్క అర్ధాన్ని మార్చివేస్తునట్లుగా ఉన్నా మట్టుకు ఆ బొమ్మను వెంటనే తొలగించాలి. వికీపీడియా ప్రకటణలకు వేదిక కాదుగదా. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:53, 31 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యఘ్రముగా

మార్చు

తెవికీ లొ సభ్యులు అందరు వ్యఘ్రముగా గా మారిపోతున్నారు, తెవికీ ని ఏలా నడీపిస్తారు? ఎవరు నడీపిస్తారు. చెప్పండీ???????????--మాటలబాబు 19:53, 1 ఆగష్టు 2007 (UTC)

"వ్యగ్రముగా" అనాలనుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 00:01, 2 ఆగష్టు 2007 (UTC)
 వ్యఘ్రముగా  అనగ ఏమి 123.176.46.27 06:23, 7 మార్చి 2012 (UTC)?[ప్రత్యుత్తరం]
          …srk