వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 89

పాత చర్చ 88 | పాత చర్చ 89 | పాత చర్చ 90

alt text=కేలండర్ రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2022-08-01 : 2023-10-05

Announcement of Train the Trainer 2023 and Call for Scholarship మార్చు

Dear all,

We are excited to announce the reactivation of the Train the Trainer (TTT) initiative by CIS-A2K in 2023. TTT aims to empower Indian Wikimedians like you with essential skills to support Wikimedia communities effectively. Through this program, we seek to enhance your capacity, encourage knowledge sharing, identify growth opportunities, and enable a positive impact on the communities you serve. The [https://forms.gle/GynAYyGzoNXh4VM26] scholarship application period is from ‘‘‘1st to 14th August 2023’’’. Unfortunately, we regretfully cannot consider applications from non-Indian Wikimedians due to logistical and compliance-related constraints. The event is scheduled for the end of September or the beginning of October 2023, and final dates and venue details will be announced soon. We encourage your active participation in TTT 2023 and welcome you to apply for scholarships via the provided form.

For inquiries, please contact us at a2K@cis-india.org or nitesh@cis-india.org. We look forward to your enthusiastic involvement in making Train the Trainer 2023 a resounding success!

Regards, Nitesh (CIS-A2K)

నాకు వికీపీడియా పట్ల మరింత అవగాహన ఇతర భాషల వికీపీడియన్ ల గురించి, వారితో పరిచయం, నాయకత్వ నైపుణ్యాల వంటి ఇతర అంశాలు తెలుసుకోవటానికి ఎంతో సహాయం చేసినది CIS A2K వారి ట్రైన్ ది ట్రైనర్ (TTT) వర్క్‌షాప్, ఆసక్తి గల తెలుగు వికీపీడియన్లు దరఖాస్తు చేసుకోగలరు. --Kasyap (చర్చ) 05:21, 2 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, ధన్యవాదాలండీ.
@సముదాయ సభ్యులకు: ట్రైన్ ద ట్రైనర్ 2023 (టిటిటి 2023) కార్యక్రమం ద్వారా సముదాయంలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే శిక్షణ కార్యక్రమం. 2013-20 మధ్యకాలంలో ఏడుసార్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేకమంది భారతీయ భాషల వికీపీడియన్లు పాల్గొన్నారు. వారిలో కొందరు తాము సముదాయానికి మరింత చురుకుగా సేవలందించడానికి, తమలో నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి ఈ కార్యక్రమం ఉపకరించిందని పలుమార్లు చెప్పారు. కాబట్టి, ఇప్పటిదాకా ఎప్పుడూ టిటిటి కార్యక్రమాల్లో పాల్గొనని సముదాయ సభ్యులు ఇందుకు [https://forms.gle/GynAYyGzoNXh4VM26] స్కాలర్షిప్ కోసం నమోదుచేసుకొమ్మని సూచిస్తున్నాను. ఇంతకుముందు పాల్గొన్నవారు కానీ, ఈసారి పాల్గొనే వీలు లేనివారు కానీ అర్హత గల తోటి సభ్యులను ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 12:37, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
సిఐఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ ట్రైన్ ద ట్రైనర్ శిక్షణ కార్యక్రమం అనేది ప్రతిఒక్కరికి ఎంతో ఉపయోగకరమైనది. 2013లో తొలిసారిగా నిర్వహించబడిన ట్రైన్ ద ట్రైనర్ శిక్షణ కార్యక్రమంలో తెవికీ నుండి 6మంది వికీపీడియన్లం పాల్గొన్నాం. ఆ తరువాత సంవత్సరాలలో జరిగిన శిక్షణ కార్యక్రమాలలో కూడా తెవికీ నుండి మరికొంత మంది పాల్గొన్నారు. @Kasyap గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకోవడంతోపాటు ఇతర భాషల వికీపీడియన్లతో పరిచయం ఏర్పడింది. ఈ అవకాశాన్ని సభ్యులందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:42, 5 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు/లేదా మార్చు

"మరియు" అనే పదాన్ని ఉపయోగించకూడదు అని కొందరంటున్నారు. అది తప్పు. "మరియు" వాడిన చోటల్లా కామా (,) వాడితే ఏలా ఉంటుందో మరియు/లేదా వ్యాసాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ వ్యాసంలో వ్యాసకర్త "మరియు" ఉపయోగించిన చోటల్లా ఒక బాటు ద్వారా కామాతో నింపారు. దానితో వ్యాసం యొక్క అసలు రూపం మారిపోయింది. కనుక మరియు/లేదా వ్యాసంలో ఇంకా ఇటువంటి వ్యాసాలలో "మరియు" బదులుగా కామాను ఉంచే బాటును ఉపయోగించవద్దు. "మరియు" పదం ఎక్కడ వాడాలో అక్కడ వాడడం వలన ఒక ప్రత్యేక సౌకర్యం ఉంది, దానిని తెలుసుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 06:42, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు/లేదా వ్యాసంలో నా AWB ఖాతాతో చేసిన దిద్దుబాటు సరైనది కాదు. మరియు/యొక్క ల గురించి వివరించే వ్యాసం అది. అందులో వాటిని తీసెయ్యడం తప్పు. ఆ తప్పును సవరించేందుకు ఇప్పుడు నేను చేసిన దిద్దుబాటును ఇప్పుడు వెనక్కి తిప్పాను.@YVSREDDY గారూ ఈ సంగతిని దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.
(ఇకపోతే, "మరియు" వాడాలా లేదా అనేది భాషకు సంబంధించిన సంగతి. సహజమైన భాషలో "మరియు" వాడరు. ఈ దిద్దుబాటు చేసినంత మాత్రాన దాని విషయంలో నా అభిప్రాయం కించిత్తు కూడా మారలేదు.)
__ చదువరి (చర్చరచనలు) 06:57, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, మరియు/లేదా వ్యాసంలో మరియులను కామాతో AWB ఖాతా వాడి మార్పుచేయడం అన్నదొక పొరబాటు. చదువరి గారు దాన్ని అంగీకరించారు. దిద్దుకుంటారు. అయితే, ఈ కారణంగా "మరియు" వాడకం సహజమైనదనో, దానికి చాలాచోట్ల స్థానం ఉందనో వాదిస్తే సబబు అవ్వదు. (మీరలా వాదించరనే భావిస్తున్నాను) వికీపీడియా వ్యాసాల్లో ఏకవచన ప్రయోగం చేయడం నియమం. కానీ, మనం చర్చించుకునేప్పుడు బహువచన ప్రయోగాలు చేసుకుని గౌరవించుకుంటాం. ఎందుకలాగ? నేపథ్యం (Context) వేరు కనక. ఇది కూడా అంతే.
  1. మరియు/లేదా అన్న వ్యాసంలో అదే సబ్జెక్టు. కాబట్టి దాన్ని అక్కడ "నామవాచకం"గా వాడతాం. అది ఒప్పు, అవసరం.
  2. వికీపీడియాలోనూ, బయట కూడా వేరే వ్యాసాల్లో తెలియక "సముచ్చయం" (conjunction)గా వాడుతున్నారు. ఇది తెలుగు భాషకు అసహజం. పొరబాటు.
మరియు/లేదా వ్యాసాన్ని మీ ప్రశ్నతో మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 13:00, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

meta user page on my user page మార్చు

i have deleted user page, so my meta userpage can be visible. please fix my user page. for example my te wiki userpage should look like my bn userpage thank you రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 12:18, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@రుద్రుడు చెచ్క్వికి గారు, మీరు కన్నడ, బెంగాల్, తెలుగు వికిపీడియాలలో WPCleaner ద్వారా చేసున్న సవరణలకు నెనర్లు. ఇంకా ఈ భాషలలో కూడా మీరు తెలుగు యుజర్ పేరు వాడుతున్నందుకు ప్రత్యేక అభినందనలు, చిన్న విన్నపం మీరు మన తెలుగు వాడుకరులు కూడా WPCleaner సంబందిత సమాచారం, శిక్షణ ఇచ్చే అవకాశం పరిశీలించగలరు. ఇంకో సూచన మీరు ఇలా వికి url పంచుకొనేటప్పుడు https://www.url-encode-decode.com/ Tool ద్వారా Decode చేస్తే క్లిక్ చేయకుండానే విషయం తెలుసుకొనే వీలు అవుతుంది. లేదా మెనూ లోని Special pages లోని URL Shortener ద్వారా కుదించవచ్చు ఇలా alternative URL: https://w.wiki/_vrN9 లేదా https://meta.wikimedia.org/wiki/User:రుద్రుడు_చెచ్క్వికి , ధన్యవాదములు Kasyap (చర్చ) 11:18, 4 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyapగారు, మీకు వ్యాసలని అనువధమ్ చెసె అలవతు ఉంధని భవిత్సునను. దయచేసి సమయము కేటాయించి వికీపీడియా:Manual of Style/Accessibility పేజిని పూర్థిగ అనువంధినచగలరు. ధన్యవాదములు. _ రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 15:10, 4 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కెరీర్ బదులగ జీవన ప్రగతి ఉపయోగపర్చు? మార్చు

అనెక వ్యసలలొ‌‌ కెరీర్ పదమ్ షిర్షికలొ ఉంధి. దాని బలుగ జీవన ప్రగతీ. కెరీర్ అనువదించు పలితలు: వృత్తి మరియు జీవన ప్రగతి. వృత్తి: నటుడు, వైద్యుడు, ... నా ఉద్ధషములొ‌‌ వ్రుత్తుని ఉపయొహగించ్గలెము. అయిథె '''జీవన ప్రగతీ''' ఉపయొగించి అనుక్జ్ంతన్నను. మీ అభిప్రయలు చెప్పగలరు. ధన్యవాదములు_ రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 01:52, 5 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

"జీవన ప్రగతి" కంటే "వృత్తి జీవితం" మరింత దగ్గరగా ఉంది. కానీ అది కూడా కెరీర్‌ను సరిగ్గా వివరించడం లేదు. __ చదువరి (చర్చరచనలు) 13:51, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
జీవన యానం, జీవిత గమనం ఏది వాడినా దానికి సరియైన పదంగా అనిపించుటలేదు.ఒకరకంగా "వృత్తి జీవితం" అనేదే కాస్త దగ్గరిగా ఉందని నేనూ భావిస్తున్నాను.ఆంగ్ల వికీపీడియాలో en:Career అనే వ్యాసం ఉంది.దానిని అనువదించితే దీనిమీద కొంతక్లారిటీ వస్తుందనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 14:17, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ట్విట్టరుకు ప్రత్యామ్నాయం అనుకుంటాను మార్చు

ఇది చూసారా.. ట్విట్టరుకు ప్రత్యామ్నాయంగా ఉన్నట్టు ఉంది. నిర్వాహకులు దీన్ని అధ్యయనం చేసి, మనకు ట్విట్టరు ఎలాగూ పనిచెయ్యడం లేదు కాబట్టి, దీన్ని స్థాపించుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి. __ చదువరి (చర్చరచనలు) 13:49, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

సారీ.. ట్విట్టరు కాదు, ట్వింకిల్! ట్వింకిల్‌కు ప్రత్యామ్నాయం లాగా అనిపిస్తోంది.__ చదువరి (చర్చరచనలు) 04:50, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:29, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చెబుదాం మార్చు

తెలుగు వికీపీడియాలో కొత్తవారు కొనసాగడం పెరగాలన్నా, ఉన్నవారికి ప్రోత్సాహం హెచ్చాలన్నా మంచి మార్గాల్లో ఒకటి వారి కృషిని గుర్తించి ప్రోత్సహించడం. "ధన్యవాదాలు" బొత్తం అందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఒక మంచి వ్యాసం సృష్టించినా, ఒక తప్పు విషయాన్ని సరిజేసినా, ఒక వ్యాసంలో సమస్యను గుర్తించే నిర్వహణ మూస చేర్చినా, చక్కగా రచ్చబండలో ఒక చర్చలో పాల్గొన్నా, మూస సరిజేసినా, ఫోటో చేర్చినా - ఇలా చాలా మంచి పనులకు మనం కృతజ్ఞతలు చెప్పవచ్చు. ఇటీవలి మార్పులు చూసేప్పుడు అక్కడ అవకాశం కనిపిస్తుంది, చరిత్రను చూడండి నొక్కినా అక్కడ ధన్యవాదాలు చెప్పే వీలుంటుంది.

అయితే, ఈ ధన్యవాదాలు చెప్పడం అన్న అవకాశాన్ని గత మూడు నెలల్లో తెలుగు వికీపీడియాలో బాగా ఉపయోగించి చక్కగా పదుగురినీ ప్రోత్సహించిన పదిమంది ఎవరయ్యా అని వెతికితే ఈ జాబితా వచ్చింది:

ర్యాంకు వాడుకరి చెప్పిన ధన్యవాదాలు
1 Pranayraj1985 55
2 డా. గన్నవరపు నరసింహమూర్తి 26
3 K.Venkataramana 16
4 యర్రా రామారావు 16
5 Muralikrishna m 15
6 C1K98V 8
7 Rajasekhar1961 6
8 Chaduvari 6
9 Naidu999 5
10 Pavan santhosh.s 4

దీని క్వైరీ ఇక్కడుంది. జాబితాలో ఆఖరి స్థానం వచ్చిన నాకు తప్ప అందరికీ ధన్యవాదాలు. :-) పవన్ సంతోష్ (చర్చ) 12:51, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు Muralikrishna m (చర్చ) 12:55, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s ధన్యవాదాలండి.__ చదువరి (చర్చరచనలు) 13:59, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 15:57, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ మంచి సమాచారం వెలికితీసినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 16:15, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
బాగుందండి అలాగే చేద్దాం. తెలియజెప్పినందుకు ధన్యవాదాలు బొత్తం నొక్కాను... :) NskJnv 17:03, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s, Gald you ran a quarry. I would like to thank the community for all their efforts and collaboration. C1K98V (💬 ✒️ 📂) 04:31, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:28, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

లింగ్వ లిబ్రే - తెలుగు గళం మార్చు

సముదాయ సభ్యులకు నమస్కారం!

మనమంతా ఈ విశ్వ విజ్ఞాన సంపదకు మన వంతు అందిస్తూ ఉన్నాము. అయితే మన లాగ ఈ విజ్ఞాన సర్వస్వానికి సేవ అందించాలని అనుకునే వాళ్ళు ఇంకా చాలానే ఉండొచ్చు. కానీ వారికి తగు వేదిక దొరక్కపోయి ఉండవచ్చు. నిజానికి వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం ఈ అంతర్వరిని అర్థం చేసుకోవడం సామాన్యులకి కొంచెం కష్టమే అని చెప్పాలి.

అయితే ఇటీవల నేను ఒక ప్రాజెక్టు ద్వారా మన తెలుగు భాషను ఆడియో రూపంలో పొందు పరచటం మొదలు పెట్టాను. ఈ ప్రాజెక్టు పేరు లింగ్వ లిబ్రే అంటే అక్షరాలా స్వేచ్ఛ గళం అని అర్థం. ఇక్కడ మనం చిన్న చిన్న పదాలను రికార్డు చేసి వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించవచ్చు.

ఇక లెక్కల్లోకి వస్తే ఫ్రెంచ్ వికీమీడియా వారు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో అత్యధిక ఆడియోలు ఎక్కించడంలో ఫ్రెంచ్ వారు మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఒడియా(129019 ఆడియోలతో), నాలుగో స్థానంలో బెంగాలీ (67355 ఆడియోలతో), 12 వ స్థానంలో మరాఠీ (15955 ఆడియోలతో), మలయాళం 15 స్థానాల్లో నిలవగా తెలుగు భాష 4500 ఆడియోలతో 27వ స్థానంలో ఉంది. ఈ ప్రాజెక్టులో అర గంటలో దాదాపు 200ల పదాలు ఎక్కించవచ్చు, ఈ లెక్కన చూస్తే ఒక నెల రోజులు పది మంది గట్టిగా కూర్చుంటే మనం టాప్ 15 లోకి అలాగే ఇంకో నెల చేసేస్తే ప్రపంచ టాప్ టెన్ కి చేరుకోవచ్చు.

ఆసక్తి కల వారు పరిశీలించగలరు, రండి తెలుగు గళాన్ని ప్రపంచ వేదికపై అగ్ర స్థానంలో నిలుపుదాం.

NskJnv 17:20, 7 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Nsk గారు చూసాను. బాగానే ఉంది. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. VJS (చర్చ) 05:23, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder for TTT Scholarship and announcement about Event dates మార్చు

Dear all,

We wanted to remind you about the Scholarship form for the Train the Trainer 2023 program and also provide you with the event dates. We encourage you to apply for scholarships to participate in Train the Trainer 2023, as it offers a valuable opportunity for you to actively contribute to your language communities. The scholarship form is accessible [https://forms.gle/GynAYyGzoNXh4VM26] here, and the submission window will remain open until 14th August 2023. If you are genuinely interested in promoting knowledge sharing and community empowerment, we strongly encourage you to fill out the form. (Please note that we won't be able to consider applications from Wikimedians based outside of India for TTT 2023.)

The Train The Trainer program will take place on 29th, 30th September, and 1st October 2023. This program provides you an opportunity to enhance your leadership and community-building skills. Thank you for your attention.

CIS-A2K Newsletter July 2023 మార్చు


Please feel free to translate it into your language.

 

Dear Wikimedians,

Greetings! We are pleased to inform you that CIS-A2K has successfully completed several activities during the month of July. As a result, our monthly newsletter, which covers the highlights of the previous month, is now ready to be shared. We have taken care to mention the conducted events/activities in this newsletter, ensuring that all relevant information is captured.

Conducted events
  • Wikibase session with RIWATCH GLAM
  • Wikibase technical session with ACPR GLAM
  • Wikidata Training Sessions for Santali Community
  • An interactive session with some Wikimedia Foundation staff from India
Announcement
  • Train The Trainer 2023 Program

Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.

Thank you MediaWiki message delivery (చర్చ) 16:23, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

iabot_ మూస పారామీటర్లు ఇంగ్లిష్ లేదా తెలుగులో? మార్చు

తెలుగులో మూస పారామీటర్ లను మార్చడం ఆపమని నేను meta:user:InternetArchiveBotని అభ్యర్థించాను, దయచేసి చర్చ meta:User_talk:InternetArchiveBot#multiple_month_name_issues_on_tewiki చూడండి. అనుభవజ్ఞులైన సభ్యులు [ @యర్రా రామారావు, @రవిచంద్ర, @ప్రణయ్‌రాజ్ వంగరి, @మాకినేని ప్రదీపు, @అర్జున , @meta:User:Harej ] మార్గదర్శకత్వం అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 23:35, 9 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలలో ఉన్న ఆంగ్ల నెలలను తెలుగులోకి మార్చనవసరంలేదు.అవి ఆంగ్లంలోనే ఉండాలి. యర్రా రామారావు (చర్చ) 03:07, 10 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు సమస్య iabot archive url మూలనికి జతపరిచినప్పుదు. మనము మూసలు చలా ఆంగ్లంలోనే ఉన్నవి. ప్రత్యేక:తేడా/3912612 అన్ని తెధిలు ఆంగ్లంలోనే ఉన్నవి, కాని iabot archive-date=22 డిసెంబర్ 2015 జతపరిచింధి. iabot మూసలలొ తెలుగు తెధిలు మార్చదు. కెవలమ్ archive-url జతపరిచినప్పదె. నెను @meta:user:harejఘరికి ఆంగ్లంలో మార్చవధ్ణి తెలియ చెయన? రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 05:48, 10 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే సార్, మీ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:29, 10 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ యువ ---- వికీలో యువతరం మార్చు

వికీ వైబ్రేన్స్ అనేది ఒక అంతర్జాతీయ ఉద్యమం దీని ద్వారా వికీమీడియా ఉద్యమంలో యువత భాగస్వామ్యం పెంచడం, వారి కృషిని గుర్తించడం వగైరాలు చేయడం జరుగుతుంది. ఈరోజు అనగా ఆగస్టు 12 అంతర్జాతీయ యువత దినోత్సవం సందర్బంగా వికీ వైబ్రేన్స్ వారు ఒక ఎడిటతాన్ ని ప్రారంభించడం జరిగింది దీనికి తగినట్లు తెలుగు వికీలో కూడా ఏదైనా కార్యాచరణ చేపడితే బాగుంటుంది, దీనికి తెలుగు వికీలో యువత అంతా చేరి వికీ అభివృద్ధిపై చర్చా గోష్ఠి నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

ఈ అంశాలపై చర్చించడానికి అలాగే తగు కార్యాచరన రచించడానికి అలాగే ఐక్యరాజ్య సమితి వారు ప్రకటించిన అంతర్జాతీయ యువ దినోత్సవంన్ని జరుపుకోవడానికి తెలుగు వికీ యువ కెరటాలని గూగుల్ మీట్ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. ఆసక్తి కల వారు చేరవచ్చు, అలాగే ఈ చర్చకు కూడా స్పందిస్తూ మీ అభిప్రాయాలను పంచుకోవలసిందిగా కోరుతున్నాను.

సమావేశ వివరాలు : తెవికీ యువ

  • Monday, 14 August · 6:00 – 7:00pm
  • Time zone: Asia/Kolkata
  • Google Meet joining info
  • Video call link: [1]

NskJnv 15:49, 12 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సమావేశానికి హాజరవుతాను. Vadanagiri bhaskar (చర్చ) 06:36, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Nskjnv గారు, మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను సమావేశానికి హాజరవుతాను. Divya4232 (చర్చ) 14:54, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీకి యువత ఆవశ్యకత ఎనలేనిది... వికీపీడియాకు యువత ప్రాముఖ్యతను గుర్తుచేసే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను... తద్వారా వికీపీడియా మరింత బలపడాలని కోరుతూ... ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని తెలుపుతూ.. కార్యక్రమం నిర్వహించే సాయికిరణ్ గారికి ధన్యవాదాలు౼౼అభిలాష్ మ్యాడం (చర్చ) 04:44, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను సమావేశానికి హాజరవుతాను. Thirumalgoud (చర్చ) 07:21, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను సమావేశానికి హాజరవుతాను. V Bhavya (చర్చ) 13:50, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను సమావేశానికి హాజరవుతాను. --Tmamatha (చర్చ) 15:13, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో యువత భాగస్వామ్యం ప్రోత్సహించే ఈ కార్యక్రమం విజయవంతమవ్వాలని ఆశిస్తున్నాను. Nskjnv గారికి ధన్యవాదాలు. --Muralikrishna m (చర్చ) 05:57, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
సమావేశానికి హాజరయినందుకు V Bhavya, Tmamatha, Thirumalgoud,Vadanagiri bhaskar, ప్రశాంతి, అభిలాష్ మ్యాడం గార్లకి ధన్యవాదాలు.

సమావేశంలో చర్చింకున్నట్లు వికీ వైబ్రేన్స్ ప్రాజెక్టులో మనం భాగస్వామ్యం నమోదు చేసుకోవడానికి, అలాగే వికీ వైబ్రేన్స్ వారు నిర్వహిస్తున్న ఎడిటతాన్లో పాల్గొనడానికి మనం ఇంకాస్తా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.

అంతర్జాతీయ యువత దినోత్సవం 2023 సందర్బంగా వికీ వైబ్రేన్స్ వారు నిర్వహిస్తున్న ఆయా కార్యక్రమాలలో మనం కూడా భాగస్వామ్యం అవ్వడానికి ఈ శుక్ర,శని (సెప్టెంబర్ 8,9) వారాల్లో ఒక ఎడిటతాన్ నిర్వహించుకొందాం.. మీ మీ అభిప్రాయాలు తెలుపగలరు. NskJnv 04:19, 4 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@NsKJnV గారు, మీ అభిప్రాయంతో నేను సమర్థిస్తున్నాను. నేను కచ్చితంగా ఆన్లైన్ సమావేశానికి హాజరు అవుతాను. Vadanagiri bhaskar (చర్చ) 10:45, 4 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
NsKJnv గారు మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకిభవిస్తున్నాను, సమర్ధిస్తున్నాను నేను ఆన్లైన్ సమావేశానికి హాజరవుతాను.
Thirumalgoud (చర్చ) 14:34, 4 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@NsKJnV గారు, మీ అభిప్రాయంతో నేను ఏకిభవిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కి తోడ్పడతాయని భావిస్తూ నేను ఆన్లైన్ సమావేశానికి హాజరు అవుతాను. V Bhavya (చర్చ) 7:29, 5 సెప్టెంబరు 2023 (UTC)

6,000 అనువాదాలు దాటేసాం మార్చు

అనువాద పరికరం వాడి ప్రచురించిన అనువాదాల సంఖ్య 6,000 దాటింది. 2018 నవంబరులో 1,000 అనువాదాలు, 2020 డిసెంబరులో 2 వేలు (ఈ వెయ్యికి రెండేళ్ళ ఒక నెల పట్టింది) , 2021 జూలైలో 3 వేలు (మూడో వెయ్యికి 7 నెలలు పట్టింది) , 2022 జనవరిలో 4 వేలు (6 నెలలు), 2022 నవంబరులో 5 వేలు (10 నెలలు), 2023 ఆగస్టులో 6,000 (ఆరో వెయ్యికి 10 నెలలు పట్టింది) దాటాం. ఆగస్టు 13 నాటికి ఈ సంఖ్య: 6,101. ఇతర భాషల అనువాద గణాంకాలు ఇలా ఉన్నాయి. బ్రాకెట్లలో 2022 నవంబరు నాటి సంఖ్య - అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన వృద్ధి శాతం:

  • తెలుగు: 6101 (5006 - 22%)
  • తమిళం: 28,509 (24,613 - 16%)
  • కన్నడం: 4,810 (4,203 - 14.5%)
  • మలయాళం: 10,789 (9,213 - 17.1%)
  • హిందీ: 9.018 (6,918 - 30.3%)
  • మరాఠీ: 3,444 (2,288 - 51%)
  • బెంగాలీ: 34,834 (27,886 - 25%)
  • పంజాబీ: 20,376 (12,190 - 67.1%)
  • గుజరాతీ: 2,596 (2,509 - 3%)
  • ఒరియా: 2,919 (2,402 - 21.5%)
  • అస్సామీ: 713 (565 - 26%)

మొత్తం అనువాదాల్లో మనం ఆరో స్థానంలో ఉన్నాం. పెరుగుదలలో పంజాబీ, మరాఠీ వికీలు మంచి దూకుడు మీద ఉన్నాయి.

అనువాద గణాంకాలను ఇక్కడ చూడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 14:07, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు చదువరి గారు, నేను పరిశీలించిన కొన్ని భారతీయ భాషల అనువాదాలు చాలా ప్రాథమికంగా ఉన్నాయి, వీటితో పోలిస్తే తెలుగు అనువాదాల నాణ్యత బాగున్నది,నా అవగాహన ప్రకారం నేరుగా హిందీ, కన్నడ,తమిళ మోదలైన భారతీయ భాషలలో నుండి తెలుగులో అనువాద పరికరం బాగానే పనిచేస్తున్నది, భారతదేశ ప్రాంతీయ చరిత్ర,సంస్కృతి ఇతర సంబంధిత సమాచారం మన భారతీయ భాషలలో దొరికే అవకాశం ఉన్నప్పుడు అనువాదానికి నేరుగా ఇతర భారతీయ భాషల వికిలను పరిశీలించగలరు.భారతీయ భాషల్లో నెలలో అత్యధికంగా చదివే వికీపీడియా కథనాల ప్రకారం గా తెలుగులో వ్యాసాలు అనువదిస్తే ఎక్కువ మందికి లబ్ది చేకూరతుంది అని భావిస్తున్నాను --Kasyap (చర్చ) 07:26, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ, భారతీయ భాషలలో నుండి తెలుగులో అనువాద పరికరం బాగానే పనిచేస్తున్నది అనే మీ సూచనతో నేను ఏకీభవిస్తాను. నేను కూడా గతంలో కొన్ని అనువాదాల్లో గమనించాను - నేరుగా వాటిని ప్రచురించలేదు గానీ కొన్ని భాగాలను వాడుకున్నాను.
దానికి కారణం బహుశా భారతీయ భాషలన్నిటికీ వాక్య నిర్మాణం (ఇంగ్లీషుతో పోలిస్తే) దగ్గరగా ఉండడమే కారణం కావచ్చు. భారతీయ భాషల నుండి అనువదిస్తే బాగానే ఉంటుందనే మీ సూచన బాగుంది.
ఇతర భాషలలో చేస్తున్న అనువాదాల నాణ్యత గురించి.. మీరు గమనించిన వ్యాసాలు ఏవో చెబితే నేనూ చూస్తానండి. __ చదువరి (చర్చరచనలు) 15:13, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చాలానే ఉన్నాయండీ మీరు ఇచ్చిన గణాంకాలలో వివిధ భాషల లింకుల ఎక్కువగా అనువాదం చేసేవారు కాక కొత్త వారు చేసిన అనువాదాలు చూడవచ్చు, నేను చదివిన హిందీ వ్యాసాలు , నాకు ప్రాధమికంగా తెలిసిన తమిళ, కన్నడ భాషల అనువాద వ్యాసాలను వాటి మూల ఇంగ్లీషు వ్యాసాల పోల్చినప్పుడు కలిగిన అభిప్రాయం. Kasyap (చర్చ) 03:20, 17 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఈ అనువాదాలలో గమనించిన విషయము ఏమంటే ఇతర క్రికెట్ వెబ్సైటు లలో లభ్యమయే విషయాలకు ఎన్వికీ లోనుంచి గ్రహించినదానికి కొంత వ్యత్యాసం ఉంటోంది. ఉదా. పుట్టిన తేదీ వగైరా. ఇంకా చాల సమాచారం ఎన్వికీలో ఉండటం లేదు. ఎన్వికీ లో కూడా సమాచారము చేర్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ విషయం మన సభ్యులు గమనించి ఉండవచ్చు అనుకుంటున్నాను. --VJS (చర్చ) 16:24, 21 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

దయచెసి అనుభవముగాల వ్యక్తులు వికీపీడియా:Link rot పేజిని పూరిగా అనువాధము చెయగలరు. ధన్యవాదాలు_ రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 14:24, 14 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ మార్చు

తెలుగు వికీపీడియాతో పాటు తెలుగు వికీ సోర్స్, వికీ బుక్స్, విక్షనరీ లాంటి అన్ని తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ను ప్రారంభిస్తున్నాము. ఈ విషయం ఇంతకు మునుపు చర్చలు చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఇందులో మొదటి కాంటాక్ట్ పర్సన్ గా పవన్ సంతోష్ గారు, రెండో కాంటాక్ట్ పర్సన్ గా నేను ప్రతిపాదన ప్రారంభించాము. వికీమీడియా ఉద్యమంలో విస్తృతంగా వీలైనంత ఎక్కువ మంది పాలుపంచుకునేందుకు, దానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉద్దేశించినదే ఈ వేదిక. అంటే నేరుగా ప్రాజెక్టుల్లో పాలుపంచుకోకుండా, అందులో పాల్గొనడానికి ముందుకు వచ్చేవారికి అవసరమైన సహాయం చేయడం దీని ముఖ్య ప్రయోజనం. ఈ సమూహం కలిసికట్టుగా, ఒకరికొకరు పరస్పరం సహాయం చేసుకుంటూ తెలుగు వికీమీడియా ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్ళాలని మా ఆ కాంక్ష.

ఇందుకోసం వికీమీడియా మెటా సైటులో ఒక ప్రతిపాదన ప్రారంభించాము. లింకు ఇక్కడ. ఇందులో ఆసక్తిగల వారు ముందు ఇచ్చిన లింకులో నమోదు చేసుకోగలరు. - రవిచంద్ర (చర్చ) 17:09, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @రవిచంద్ర గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:29, 15 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, @Pranayraj1985 గారూ, ధన్యవాదాలు. ఆసక్తి ఉన్నవారంతా నమోదుచేసుకుంటారని ఆశిస్తున్నాను. @Chaduvari, @Kasyap గార్లకు కూడా నమోదుచేసుకున్నందుకు అభినందనలు. ఆసక్తికరమైన, ప్రయోజనకరమైన పనులు ఈ యూజర్ గ్రూప్ ద్వారా మనం కలసికట్టుగా చేయగలమని ఆశిస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 08:16, 16 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రూపు ఏర్పాటు, గుర్తింపు కోసం దరఖాస్తు మార్చు

యూజర్ గ్రూప్ ఏర్పాటు, గుర్తింపు కోసం దరఖాస్తు గురించి అప్‌డేట్ ఇక్కడ అందించాను. దయచేసి గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:57, 24 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాద పరికరాన్ని వాడడం మార్చు

కొత్తవారికి అనువాద పరికరం గురించి తెలిపేందుకు, దాన్ని వాడుకోవడంలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసుకునేందుకూ సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సమాచారాన్ని చూపించే వికీపీడియా:విషయ అనువాద ఉపకరణం పేజీ మనకు ఈసరికే ఉంది. ఈ పేజీలో కొంత సమాచారాన్ని చేర్చి, వివిధ సందేహాలకు సమాధానాలు చెబుతూ వికీపీడియా:అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు అనే పేజీని సృష్టించాను. ఆ పేజీలను చూసి అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవలసినదిగా వాడుకరులను కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 13:13, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:55, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో యువ కెరటాలు మార్చు

@Nskjnv గారూ, తెలుగు వికీలో యువకులు ఏం చెయ్యాలి అనే విషయంపై ఈ మధ్య ఒక చర్చా గోష్ఠి పెట్టుకున్నారు గదా. ఆ సమావేశం విశేషాలేంటి, ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏమేం చర్చించారు, ఎవెరెవరొచ్చారు.. ఈ వివరాలు తెవికీలో ఎక్కడైనా రాసరా? రాస్తే ఆ లింకు ఇవ్వవలసినది. __ చదువరి (చర్చరచనలు) 05:08, 20 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు ఇదే పేజీలో 11 వ విషయం తెవికీ యువత చర్చలో మీరు అడిగిన విషయాలు ఉన్నాయి, గమనించగలరు.

వికీపీడియాలో నేరుగా అనువాదాలు విరివిగా చేసేవాళ్ళు అనువాద పరికరాన్ని ఎందుకు వాడరు? మార్చు

వికీపీడియాలో నేరుగా అనువాదాలు చేసేవాళ్ళు -విరివిగా చేసేవాళ్ళు - కొందరున్నారు. వీళ్ళు నేరుగా అనువాదాలు చేస్తారు. కానీ అనువాద పరికరాన్ని వాడరు. ఎందుకని? ఈ ప్రశ్న వేసుకుంటే నాకుతోచిన సమాధానాలు, ఆ సమాధానాలకు నా సమాధానాలూ ఇవి:

  • "అనువాద పరికరమా? అట్టాంటిది ఒకటుందా?": అనువాద పరికరం అంటూ ఒకటి ఉందని తెలియని వాళ్ళు బాగా తక్కువగా ఉంటారనేది నా అనుకోలు. ఏది ఏమైనప్పటికీ దాని లింకు ఇది: https://te.wikipedia.org/wiki/Special:ContentTranslation
  • "అనువాద పరికరంతో పని పెద్ద తల్నెప్పి వ్యవహారం లాగా ఉన్నట్టుంది, మనకెందుకులే.": అనువాద పరికరం తలనెప్పి కాదు సరిగదా, కొన్ని తల్నెప్పుల్ని తీసేస్తుంది. ఆ వివరాలు కావాలంటే తరచూ వచ్చే సందేహాలు చూడండి.
  • "అందులో యంత్రం అనువాదం చేస్తుంది. దాన్ని మనం సరిదిద్దాలి. ఈ తలనెప్పి ఎందుకూ.. మనమే నేరుగా చేసుకుంటే పోలా.": అదుగో అదే మరి అపోహంటే! అనువాద పరికరంలో యంత్రానువాదం చేసి తీరాల్సిందే అనే రూలేమీ లేదు. మొత్తం యత్రాలన్నిటినీ పక్కన పడేసి, మీరే నేరుగా అనువదించుకోవచ్చు.
  • "నేనే స్వయంగా అనువదించుకునే కాడికి ఈ పరికరం ఎందుకంట!?": ఎందుకంటే..
    • ఎందుకంటే.. వికీలింకులను అదే ఇస్తుంది. ఎర్రలింకులను తయారుచెయ్యదు. మీరు నేరుగ ప్రచురిస్తే ఎర్రలింకులు బోలెడుంటాయి. వాటిని మీరు సవరించుకోవాలి.
    • ఎందుకంటే.. భాషాంతర లింకులను అదే ఇచ్చేస్తుంది. అంటే వికీడేటా లింకు కూడా దానంతటదే ఏర్పడిపోతుందన్నమాట!
    • ఎందుకంటే.. మూసలను కూడా అదే తెస్తుంది. మీరు తేనక్కర్లేదు.
    • ఎందుకంటే.. వర్గాలను కూడా అదే చేరుస్తుంది. మీరు తేనక్కర్లేదు.
    • ఎందుకంటే.. వాడిచూడండి. వాడితే మరిని తెలుస్తాయి. ఇంకా బాగా తెలుస్తాయి
  • "నేరుగా చేసుకుంటే కొంచెం కొంచెం తీరుబాటుగా అనువదించుకోవచ్చు, ప్రచురించుకోవచ్చు. పరికరంలో అది కుదర్దు": ఎవరా మాట చెప్పింది? తప్పు, తప్పు, తప్పది. బ్రహ్మాండంగా కుదురుతుంది. పేజీ మొత్తాన్ని ప్రచురిస్తారా.. సరే! ఒక విభాగాన్నే ప్రచురిస్తారా..స్సరే! ఒక పేరాయే ప్రచురిస్తారా.. ఓకే! ఒక వాక్యమే ప్రచురిస్తారా.. వాకే! ఒక్క పదాన్ని మాత్రమే ప్రచురిస్తారా.. తెలీదు. ప్రయత్నించి మీరే చెప్పండి. అంతేకాదు, ప్రచురణలు ఎన్నిసార్లైనా చెయ్యొచ్చు. పది పదిహేనుసార్లు కొంచెం కొంచెం ప్రచురించుకుంటూ పోవచ్చు. ఎలాగైనా చెయ్యొచ్చు.

చెయ్యండి. అనువాదాలు చెయ్యండి. పరికరం వాడండి. అనువదించి ప్రచురించండి. సందేహమొస్తే అడగండి.__చదువరి (చర్చరచనలు) 01:56, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాద పరికరం గతంతో పోలిస్తే నాణ్యత పెరిగింది, మనం సాధ్యమైనంత వరకూ వికి వారి MinT మెషిన్ అనువాదం వాడితే ఇంకా మెరుగు పరచవచ్చు, అలాగే అనువాద శాతపు కనీస పరిమితిని తగ్గించే దిశగా సముదాయం నిర్ణయం తీసుకోవాలని విన్నపము, అందువలన తిప్పిరాయటంలో ఇబ్బందులు ఉన్నప్పుడు అడ్డదారులకు అవసరం వుండదు అనువాదం చేయాలనుకొన్న కొత్త వారకీ సులభంగా వుంటుంది. సబ్యులకు మరో విన్నపం వ్యాసం ప్రచురించిన తరువాత వీలును బట్టీ కొన్ని తెలుగు లింకులు, మనకు ప్రత్యేకమైన సమాచారం కూడా ఇతర తెలుగు సోర్సుల ద్వారా చేర్చడం వలన చదివేవారికి వారికి మరింత సమాచారం తెలుగు అందుబాటులో వుంటుంది. ఇది మొబైల్ లో కూడా సులువుగా వాడటానికి ఒక అనువర్తనం రావాలని కొరుకొంటున్నాను. Kasyap (చర్చ) 06:13, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, మానవిక అనువాద శాతం పరిమితిని తగ్గించాలని యర్రా రామారావు గారు ప్రతిపాదించినపుడు ఎవరూ స్పందించలేదు. __చదువరి (చర్చరచనలు) 13:52, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అవును.కొన్ని అంగ్లపదాలకు తెలుగులో సరియైన అనువాదపదాలు ఉండటం లేదు. గమనించి వాటికి ప్రత్యేక మినహాయింపు అవకాశం ఉండాలి. యర్రా రామారావు (చర్చ) 14:06, 22 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తాజా గణాంకాలు మార్చు

వికీపీడియా తాజా గణాంకాల పని (స్థూల గణాంకాలు, పేజీలకు సంబంధించిన గణాంకాలు, వాడుకరుల గణాంకాలు) దాదాపుగా పుర్తి అయింది, కొన్ని నవంబర్ 2022లో చేసినవాటిని (మూడు నాలుగు రకాలు)తప్పించి. అంటే వార్షిక గణాంకాలు 2022 వరకు, నెలవారీ గణాంకాలు జూన్/జులై వరకు చేశాను. ఈలోగా సమస్యలను గుర్తించి పరిష్కరించుకోగలిగితే, మళ్లీ ఈ పని 2024 జనవరిలో కొనసాగించవచ్చు.ఈ పనిలో మార్గదర్శకం చేసిన చదువరిగారికి ధన్యవాదాలు.
వ్యక్తిగత వాడుకరులు గణాంకాలు మనకు సమగ్రంగా ఎక్స్ టూల్స్, వికీస్కాన్, వికీమీడియా స్టాట్స్ పరికరాలలో లభిస్తున్నాయి. VJS (చర్చ) 04:24, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vjsuseela గారూ, గణాంకాల ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 13:46, 23 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Review the Charter for the Universal Code of Conduct Coordinating Committee మార్చు

Hello all,

I am pleased to share the next step in the Universal Code of Conduct work. The Universal Code of Conduct Coordinating Committee (U4C) draft charter is now ready for your review.

The Enforcement Guidelines require a Building Committee form to draft a charter that outlines procedures and details for a global committee to be called the Universal Code of Conduct Coordinating Committee (U4C). Over the past few months, the U4C Building Committee worked together as a group to discuss and draft the U4C charter. The U4C Building Committee welcomes feedback about the draft charter now through 22 September 2023. After that date, the U4C Building Committee will revise the charter as needed and a community vote will open shortly afterward.

Join the conversation during the conversation hours or on Meta-wiki.

Best,

RamzyM (WMF), on behalf of the U4C Building Committee, 15:35, 28 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మాలపల్లి (నవల) వ్యాసానికి వాడ్రేవు చినవీరభద్రుడి ప్రశంస మార్చు

ఇటీవల ప్రముఖ విమర్శకుడు, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు గారు తన బ్లాగులో "జాతీయోద్యమ స్ఫూర్తిని భద్రపరుచుకోవాలి" అన్న శీర్షికన రెండు భాగాలుగా వ్యాసం రాశారు. రెండవ భాగంలో జాతీయోద్యమ నవలలను తెలుగు సాహిత్యం ఎలా క్రమేపీ విస్మరిస్తూ వచ్చిందో వివరిస్తూ మాలపల్లి నవల ప్రాధాన్యత గురించి చెప్తున్న సందర్భంలో ఇలా రాశారు:

"సాహిత్య చరిత్రలో జాతీయోద్యమ సాహిత్యానికి లభించిన నిరాదరణ కవిత్వానికి మాత్రమే పరిమితం కాదు. మాలపల్లి నవల పట్ల కూడా మనం చూపించవలసినంత గౌరవం చూపించలేదనే అనుకుంటున్నాను. తెలుగు వికీపీడియాలో మాలపల్లి నవల గురించిన వ్యాసం రాసిన రచయిత ఎవరోగాని, ఆయన ఆ నవల ప్రాముఖ్యతను అన్ని పార్శ్వాల్లోనూ అద్భుతంగా పట్టుకున్నాడు. తెలుగులో అభ్యుదయ సాహిత్యం అంటూ మొదలయ్యింది ఆ రచనతోనే అని రాసాడాయన."

దానితో నేను ఆయన ఎఫ్బీ పేజీకి వెళ్ళి ఆ లింకు మీద ఇలా కామెంట్ చేశాను (ఇది ప్రైవేటు కనుక లింకివ్వట్లేదు): "వికీపీడియా వ్యాసం ఒక్కరే రాసేది కాదు కాబట్టి మీరు ప్రస్తావించిన వివరం ఎవరు రాశారో వెతికాలి. ఈ వివరం ఎవరు రాశారో నిర్ధారించుకోవడానికి కాస్త ప్రయత్నం అవసరం అయింది. ఆ రాసిన తెలుగు వికీపీడియా రచయిత పేరు వుక్కుం మహేష్‌ కుమార్ (వాడుకరి:Vmakumar)." దీనికి ఆయన ఇలా ప్రతిస్పందించారు:

"మీరు నేను రాసిన ఒక వాక్యం పట్టుకుని ఆ రచయితను వెతికి పట్టుకోవడమే ఎంతో గొప్ప విషయం. అందుకు మీకు మేమంతా ఋణపడి ఉంటాం. ఆయన కేవలం క్రోడీకరించలేదు. అసలు ఆ వ్యాసం చదివిన తర్వాత మాలపల్లి పట్ల మన దృక్పథం మొత్తం మారిపోతుంది. అటువంటి ఒక వ్యాసం తెలుగు వికీపీడియాలో రాసినందుకు ఆయనకు మొత్తం తెలుగుజాతి ఋణపడి ఉంటుంది."

వాడ్రేవు చినవీరభద్రుడు సమకాలీన తెలుగు సాహిత్య విమర్శలో మంచి కృషిచేస్తున్నవారు. సమ్మోహనకరమైన శైలి కలిగినవారు. గొప్ప పాండిత్యం సముపార్జించినవారు. మీడియా సహితంగా చాలామంది తెలుగు వికీపీడియా వ్యాసాల్లోని సమాచారాన్ని క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా వాడేసుకుంటున్న రోజుల్లో ఒక తెలుగు వికీపీడియా వ్యాసపు ప్రాధాన్యతను, కృషిని గుర్తించి ఇలా ప్రత్యేకించి రాయడం నాకు సంతోషం కలిగించింది. ఇంత చక్కగా ఆ వ్యాసాన్ని తీర్చిదిద్దినందుకు వాడుకరి:Vmakumar గారికి ప్రత్యేకించి అభినందనలు, ధన్యవాదాలు చెప్పబుద్ధయ్యింది. పవన్ సంతోష్ (చర్చ) 06:24, 3 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Vmakumar గారూ, చక్కటి సమాచారం చేర్చి, వాడ్రేవు చినవీరభద్రుడు గారి వంటి ఉద్దండుల నుండి తెవికీకి ప్రశంసలు తెచ్చిపెట్టిన మీకు అభినందనలు, ధన్యవాదాలు. @Pavan santhosh.s గారూ, ఈ సంగతిని ఇక్కడ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 06:42, 3 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తొలి ఆన్లైన్ సమావేశం మార్చు

అందరికీ నమస్కారం,

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పడ్డాకా తొలి ఆన్లైన్ సమావేశాన్ని సెప్టెంబర్ 17 తేదీ (ఆదివారం) ఉదయం 10.30 నుంచి 11.30 వరకూ నిర్వహించనున్నాం. ఈ సమావేశం అజెండా, మిగిలిన వివరాలు ఇక్కడ చూడొచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 11:26, 6 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Pavan santhosh.s గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:36, 6 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు వాడుకరి పేర్లతో ఉన్నాను మార్చు

నేను bethi.ramesh తోను bethi.rameesh తోను కొనసాగుతున్నాను. మొదటి వాడుకరి పేరుకు పాస్ వర్డ్ రాకపోవటం తో మరోకటి సృష్టించుకున్నాను.గమనించగలరు. Bethi.rameesh (చర్చ) 06:23, 7 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Bethi.rameesh గారూ, ఈ విషయాన్ని మీ వాడుకరి పేజీలో (వాడుకరి చర్చ కాదు) రాయండి. అప్పుడు మీ వాడుకరి పేజీకి వచ్చినవారికి ఈ విషయంలో అయోమయం ఉండదు. అలానే, ఇలా స్పష్టంగా తమ వాడుకరి పేజీలో రాయడం రెండు మూడు ఖాతాలు ఉన్నవారికి తప్పనిసరి అన్న నియమం కూడా ఉన్నట్టు నాకు గుర్తు. కాబట్టి, ఆ పద్ధతి పాటించండి. పవన్ సంతోష్ (చర్చ) 15:34, 16 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation to the Indic Community Monthly Engagement Call on September 8, 2023 మార్చు

Dear Wikimedians,

A2K is excited to invite you to the third call of the Indic Community Monthly Engagement Calls initiative scheduled for September 8, 2023, where A2K is hosting “Learning Clinic: Collective learning from grantee reports in South Asia” by Let’s Connect. This event is designed to foster collaboration and knowledge-sharing among community members interested in the region's progress, grantees, potential grantees, and Regional Fund Committee members. The dedicated meta page is here. Here are the details:

  • Date: September 8th
  • Time: 6:00 PM - 7:30 PM IST
  • Language: English
  • Facilitation: Jessica Stephenson (WMF - Let’s Connect), Pavan Santhosh (CIS-A2K), Chinmayee Mishra (Let’s Connect working group)
  • Duration: 1.5 hours
  • Zoom Link: Zoom Link

You can find detailed information on the given meta page. We look forward to meeting you there tomorrow. :) Regards MediaWiki message delivery (చర్చ) 11:01, 7 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, పదాల వాడుక మార్చు

గతంలో వీటిని గురించి అంతగా ఆలోచించవలసిన లేదా పట్టించుకునే అవసరం కలగలేదనుకుంటాను.ఇప్పుడు ప్రస్తుతం వీటి వాడుక విషయంలో ఒక పద్దతి లేదా పాలసీని సముదాయ సభ్యులు చర్చించి లేదా విశ్లేషించి ఒక విధాన నిర్ణయం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వికీపీడియాలో జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ ప్రాజెక్టు పనిలో పనిచేసినప్పుడు, ప్రధాన పేరుబరులలో ఘఢ్ , ఘడ్, గఢ్, గడ్ , గర్, అనే ఈ పదాలు రాష్ట్రాలు, జిల్లాల, వివిధ పట్టణాలు నగరాలు వ్యాసాలు శీర్షికల అంత్యంలో స్పేస్ తోటి, స్పేస్ లేకుండా పై వాటిలో ఏదో ఒకటి రకరకాలుగా వచ్చాయి. అలాగే కొన్ని వ్యాసాలలో ఇలాంటి ప్రధాన పేరుబరి వ్యాసాలు కూడా వచ్చినవి. వీటివలన లింకులు కలిపేటప్పుడు శ్రమతీసుకోవలసివచ్చింది.వికీపీడియా వాడుకలో ఇన్ని రకాలుగా కాకుండా గతంలో ఉన్నవి, ఇక ముందు సృష్టించే శీర్షికలు ఏకసారూప్యతతో ఉండేలాగున పైకి కనపడే ప్రధాన పేరుబరి ఎలా ఉండాలనే దానిపై ఇక్కడ విధాన నిర్ణయం కోసం, చర్చ, అభిప్రాయాల కొరకు పేజీనొకదానిని తయారుచేసాను.కావున ఆ పేజీలో మీ అభిప్రాయాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 05:09, 11 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

#expr లోపం చూపిస్తోంది మార్చు

వికీ సాఫ్టువేరులో అంకగణితపు లెక్కలు చెయ్యాలంటే {{#expr అనే ఎక్స్‌ప్రెషన్ను వాడతాం. ఉదాహరణకు 100+12 అనే లెక్క చెయ్యాలంటే దాన్ని {{#expr:100+12}} అని రాస్తే ఆ లెక్క చేస్తుంది. లేదంటే 100+12 అనే చూపిస్తుంది. దీని లోపల ఇతర ఎక్స్‌ప్రెషన్లు, మ్యాజిక్ పదాలూ వాడొచ్చు.

వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 పేజీలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ను, దాని లోపల మ్యాజిక్ పదాలనూ వాడి, ప్రాజెక్టు పురోగతిని చూపించాం. పొద్దుటి దాకా బానే పని చేసింది. ఒక అరగంట కిందట చూస్తే, అది లోపం చూపిస్తోంది. తెవికీలో దానికి సంబంధించిన మూసలో గానీ, మాడ్యూలులో గానీ మార్పేమీ జరగినట్టు లేదు. (వికీ సాఫ్టువేరులో లోపమేమైనా తలెత్తిందేమో తెలీదు).

విడివిడిగా చూస్తే ఎక్స్ప్రెషనూ బానే పనిచేస్తోంది, మ్యాజిక పదమూ బానే పనిచేస్తోంది. రెండూ కలిస్తేనే లోపం వస్తోంది. దీనికి పరిష్కారం తెలిసినవాళ్ళు దీని సంగతి చూడగలరు. __ చదువరి (చర్చరచనలు) 14:24, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, సరిచేసాను.➤ కె.వెంకటరమణచర్చ 16:25, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు వెంకటరమణ గారూ. అప్పటి దాకా పనిచేసి ఒక్క సారిగా ఎందుకు చెయ్యలేదో ఇంకా అర్థం కాలేదు. నిన్న ఆ వర్గంలోని పేజీలు 1024 దాటాయి. బహుశా ఆ మ్యాజిక్ పదంలో pages అనే పరామితికి 1024 వద్ద పరిమితి ఏదైనా ఉందేమో తెలీదు.__ చదువరి (చర్చరచనలు) 01:21, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక సవరణ.. 1024 కి ఇంకా చేరనేలేదు. చదువరి (చర్చరచనలు) 01:35, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ ఎక్స్‌ప్రెషన్ లో "కామా" లు గుర్తించబడటం లేదు. "pages" పరామితి ఉపయోగించినపుడు "1,024" అని వస్తుంది. ఆ సంఖ్యలో "కామా" ఉండటం వలన దోషం ఏర్పడి పనిచేయడం లేదు. "R" అనే పరామితి ఉపయోగిస్తే కామాలు లేకుండా సంఖ్య "1024" వస్తుంది. కనుక పనిచేస్తుంది.➤ కె.వెంకటరమణచర్చ 02:53, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఓహో.. ఇప్పుడర్థమైంది, నా మట్టిబుర్రకి. ధన్యవాదాలు @K.Venkataramana గారు.__ చదువరి (చర్చరచనలు) 03:01, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కులాల వ్యాసాలలో దిద్దుబాట్లు మార్చు

ఈ మధ్య కాలంలో కులాల వ్యాసాలలో ప్రత్వేకంగా పనిగట్టుకుని కులాల వ్యాసాలలో చేయటం ఎక్కువుగా ఉంది.ఒకరు రాసింది ఒకరు తొలగించటం, మరలా తొలగించినదానినే చేర్చటం అసలు ఆ వ్యాసాలలో పరిశీలించించినవార్కి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదా అర్థం కాకుండా గంధరగోళం గా తయారుచేస్తున్నారు.సరియైన మూలాలు ఉండవు.ప్రతి కులం వ్యాసంలో ఆ కులం మిగతా కులాలకన్నా గొప్పదన్నట్లు వారి ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉన్నారు.ఒక రకంగా చెప్పాలంటే ఎవరి కులంలో వారు మార్పులు చేస్తూ గొప్పగా రాసుకున్నట్లు ఉంటుందని నా అభిప్రాయం.ఉదాహరణకు ఈ దిగువ వ్యాసాలు చరిత్రను పరిశీలించగలరు.

ఈ వ్యాసాలలో ఎక్కువుగా వాడుకరి:Dhrashan yadav , వాడుకరి:Naidu999 , వాడుకరి:Mukesh mudhiraju ఈ వాడుకరులు చేసిన సవరణలు ఉన్నవి.ఇక అజ్ఞాత వాడకరు సవరణల అయితే లెక్కే లేదు.ఎప్పటికప్పుడు అవి చూసి రోల్ బ్యాక్ చేేసిన సందర్బాలు ఉన్నాయి.నేను అనుకోవటం వాడుకరులో మర్చిపోయో, లేకా కావాలనే చేస్తున్నారని నా అభిప్రాయం. గొల్ల: ఈ రోజు జరిగిన ఈ వ్యాసం కూర్పుల మధ్య తేడాలు లో సవరణ సారాంశం ఒకసారి పరిశీలించండి. అది చూసి ఆ వ్యాసం కేవలం నిర్వాహకులు మాత్రమే సవరించేలాగున సంరక్షణలో పెట్టాను. యాదవ" అలాగే ఈ రోజు జరిగిన ఈ వ్యాసం కూర్పుల మధ్య తేడాలు లో సవరణ సారాంశం ఒకసారి పరిశీలించండిఅది చూసి ఆ వ్యాసం కేవలం నిర్వాహకులు మాత్రమే సవరించేలాగున సంరక్షణలో పెట్టాను. కావున ఈ కులాల వ్యాసాలన్నిటిమీద మార్గదర్శకాలు లేదా నియమాలు సముదాయం నిర్ణయించాలిసిన అవసరమున్నందున మీ అభిప్రాయాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 17:58, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వాస్తవానికి నేను సూచనలను కలిగి ఉన్న సమాచారాన్ని జోడించాను, అందుకే నేను చర్చకు రాలేదు....@యర్రా రామారావు...ఈ పేజీలు అసంపూర్ణ పేజీలు అందుకే నేను కొన్ని సవరణలు చేసాను....మీరు నా సూచనలను తనిఖీ చేయాలి...నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు....మీరు అనామక వినియోగదారులను చూడవచ్చు మరియు కొంతమంది అనుభవం లేని ఎడిటర్‌లు మొబైల్‌ల నుండి దీన్ని చేస్తున్నారు...మీరు దీన్ని తనిఖీ చేయాలి Naidu999 (చర్చ) 18:46, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ, ఈ విషయంపై చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు. కొత్తగా నియమాలేమీ పెట్టుకోనక్కర్లేదు. నావి కొన్ని సూచనలు:
  • మూలం లేని వాక్యం చేరిస్తే, ఆ వాక్యాన్ని వెంటనే తీసెయ్యాలి.
  • రెండు మూడు సార్లు అలా చేరిస్తే ఆ వాడుకరికి హెచ్చరిక చెయ్యాలి.
  • ఇంకా అలాగే చేస్తే నిరోధించాలి.
  • పేజీని తగు సంరక్షణలో ఉంచాలి
__ చదువరి (చర్చరచనలు) 01:42, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారు నాయుడు అనే ఒక వ్యక్తి మా యాదవ కులం పై పేరే అన్ని కులాలపై అతను ఆ కులంకున్న చరిత్రను కొట్టేసి తన సొంతంగా ఒక దొంగ చరిత్రను సృష్టించి వికీపీడియాలో రాస్తున్నాడు దయచేసి అలాంటి వాళ్లను నిష్క్రమించండి అంతేకాకుండా ఒక్కసారి మా యాదవ కులం యొక్క చరిత్ర రాసుకోనే దానికి నాకు అవకాశం కల్పించండి నేను పీజీ గ్రాడ్యుయేట్ను హిస్టరీ చేశాను చదివాను Dhrashan yadav (చర్చ) 18:16, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సరైన సమాచారాన్ని జోడించాను, దయచేసి సూచనలను తనిఖీ చేయండి....మీరు ఎటువంటి సూచనలను జోడించలేదు, వికీపీడియాకు సూచనలు కావాలి....@Dhrashan yadav...అతను నన్ను దుర్భాషలాడాడు.....అతనికి జ్ఞానం ఉంటే అతను సూచనలను జోడించేవాడు....నేను తప్పు చరిత్రను ఎలా సృష్టించగలను??? నేను పుస్తకాలలో వ్రాసిన వాటిని జోడించాను.....మీరు సంబంధం లేని సమాచారాన్ని జోడించారు...నేను ఆ సమాచారాన్ని తొలగించాను....నేను చాలా కులాలపై వ్యాసాలు రాశాను.....మీరు వాస్తవాలను తీసుకోలేరు@Dhrashan yadav మీరు నిజంగా ph.d చేసి ఉంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మీ సంఘం యొక్క సూచనలను జోడించి, చర్చాలో చేయండి@యర్రా రామారావు గారు ఆ విషయాలను మారుస్తారు,అది నిజమైతే... @Dhrashan yadav..... చాలా రెఫరెన్స్‌లు కుల వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే అందుకే తొలగించాను Naidu999 (చర్చ) 18:29, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక్కసారి నీ ఫోన్ నెంబర్ పెట్టు Dhrashan yadav (చర్చ) 18:30, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ, ఆయా కుల వ్యాసాలలో విశ్వసనీయ మూలాలు లేని వాక్యాలన్నీ తొలగించి సరైన మూలాలు ఉన్న సమాచారాన్ని చేర్చాలి. అనామకవాడుకరులు, ఇతర వాడుకరులు మూలాలు లేకుండా స్వంతంగా చేర్చిన వాక్యాలన్నీ తొలగించవలసి ఉంటుంది. వ్యాస సమాచారం తక్కువైనా సరే సరైన సమాచారాన్ని సమాజానికి అందించవలసి ఉంటుంది. ఆంగ్ల వ్యాసం ప్రకారం మూలాల సహితంగా విస్తరించాలి.➤ కె.వెంకటరమణచర్చ 01:15, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికీకి సంబంధంలేని వాడుకరి పెట్టెలు మార్చు

వికీపీడియా:వాడుకరి పెట్టెలు పేజీలో కొన్ని వాడుకరిపెట్టెలు వికీకి ఏ మాత్రం ఎట్టి పరిస్తితులలో సంబంధంలేనివి ఉన్నవి.వాటిని వాడుకరి పెట్టెలు చర్చా పేజీలో వివరించి, తొలగించటానికి చర్చను ప్రవేశపెట్టాను.కావున పరిశీలించి ఆ చర్చా పేజీలో మీ స్పందనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:36, 24 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు vs , (కామా) మార్చు

మరియు పదానికి బదులుగా , (కామా) ఉపయోగించడం అన్ని చోట్లా కుదురుతుందా అంటే కుదరదు. వీల్ మరియు యాక్సిల్: వీల్ మరియు యాక్సిల్ ఒకే ఫంక్షనల్ యూనిట్‌గా కలిసి పనిచేసేలా రూపొందించబడిందని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఈ పదం ఉపయోగించబడుతుంది. చక్రం ఇరుసుపై అమర్చబడి రెండు భాగాలు కలిసి తిరిగే యాంత్రిక వ్యవస్థల గురించి చర్చిస్తున్నప్పుడు ఇది అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, కారు సందర్భంలో, సాధారణంగా "చక్రం మరియు ఇరుసు"ని సూచిస్తారు ఎందుకంటే చక్రం నేరుగా ఇరుసుకు అనుసంధానించబడి ఒక యూనిట్‌గా తిరుగుతుంది.

వీల్, యాక్సిల్: కామాను ఉపయోగించడం మరియు "మరియు" విస్మరించడం అనేది వీల్ మరియు యాక్సిల్ ప్రత్యేక అంశాలు లేదా భాగాలు అని సూచిస్తుంది మరియు వాటి మధ్య బలమైన సంబంధాన్ని సూచించకపోవచ్చు. వివిధ భాగాలను జాబితా చేస్తున్నప్పుడు ఈ ఫార్మాట్ సముచితంగా ఉంటుంది మరియు వీల్ మరియు యాక్సిల్ ఆ జాబితాలో ఒక భాగం మాత్రమే. ఇది వాటి క్రియాత్మక సంబంధాన్ని "వీల్ మరియు యాక్సిల్" వలె గట్టిగా నొక్కిచెప్పదు.

మరియు అనే పదం తెలియజేయాలనుకుంటున్న వివరాల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. వాటి క్రియాత్మక సంబంధాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు "వీల్ మరియు యాక్సిల్"ని ఉపయోగిస్తాము మరియు వాటి ప్రత్యక్ష కనెక్షన్‌ను నొక్కి చెప్పకుండా భాగాలను జాబితా చేసేటప్పుడు "వీల్, యాక్సిల్"ని ఉపయోగిస్తాము.

చక్రం మరియు ఇరుసు అని నేను వ్యాసాన్ని ప్రారంభిస్తే మరియు పదం తీసివేసి చక్రం, ఇరుసు అని ఈ వ్యాసానికి పేరు మార్చారు. చక్రం మరియు ఇరుసు అనేదే ఈ వ్యాసానికి సరైన పేరు. మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా మరియు పదాన్ని ఉపయోగించము. కానీ నొక్కి చెప్పగలము. ఆ నొక్కి చెప్పగలిగే , (కామా) నే "మరియు" పదం. YVSREDDY (చర్చ) 11:33, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

టాల్‌స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ (ఇంగ్లీషు పేరు) అనే నవల ఉంది. దాని తెలుగు అనువాదం పేరు "యుద్ధమూ శాంతీ"! "యుద్ధము మరియు శాంతి" అని పెట్టలా.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసుకున్న ఆత్మకథ - "అనుభవాలూ - జ్ఞాపకాలూనూ". దానికి పేరు "అనుభవాలు మరియు జ్ఞాపకాలు" పెట్టలా. (దీన్ని ఇంగ్లీషు లోకి అనువదించేప్పుడు"అండ్" లేకుండా రాస్తే అక్కడ అది పెద్ద తప్పౌతుంది. అలాగని తెలుగులో "మరియు" రాసేయకూడదు.) ఎంత చక్కగా "మరియు" లేకుండా రాసారో!
ది ప్రిన్స్ అండ్ ది పాపర్ - మార్క్ ట్వైన్ రాసిన ప్రసిద్ధ నవల - తెలుగులో సినిమాగా వచ్చింది. దాని పేరు "రాజూ పేద". "రాజు మరియు పేద" కాదు.
"చక్రం, ఇరుసు" అనేది తప్పనుకుంటే, దాన్ని ఎలా రాయాలో మన పెద్దలు చెప్పనే చెప్పారు. వారి అడుగుజాడల్లోనే "చక్రమూ ఇరుసూ" అని రాయాలి. "చక్రం మరియు ఇరుసు" కాదు.
ఇది నేను చెప్పేది కాదు, పెద్దలు చెప్పినది. "యుద్ధమూ శాంతీ" చెప్పినది. "అనుభవాలూ - జ్ఞాపకాలూనూ" చెప్పినది. "రాజూ పేద" చెప్పినది.
"నేను మరియు నువ్వు" కాదు, "నేనూ నువ్వూ". "రాజు మరియు రాణి" కాదు, "రాజూ రాణీ". 1,2,3 మరియు 4 కాదు - 1,2,3,4. __ చదువరి (చర్చరచనలు) 13:17, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మరియు పదమును నేను ఉపయోగించినది ఈవిధంగా 1,2,3,4 మరియు A,B,C,D. YVSREDDY (చర్చ) 05:14, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలను తొలగించకుండా వ్యాస సృష్టికర్త వ్యాసానికి తరలించగలరు మార్చు

వ్యాసాలను తొలగించకుండా ఆ వ్యాస సృష్టికర్త వ్యాసానికి తరలించగలరు. ఉదాహరణకు ఆడియో ఇంజనీర్, సాంకేతిక విజ్ఞానం, రీఛార్జబుల్ బ్యాటరీ, ఇజ్రాయెల్ జెండా, రాజకీయాలు, రాజకీయ పార్టీ ఈ వ్యాసాలలో ఎటువంటి తప్పులు లేకపోయినా తొలగింపు మూసలు పెట్టారు అని నా అభిప్రాయం. ఈ వ్యాసాలను తొలగించే పక్షంలో నేను సృష్టించిన ఈ వ్యాసాలను వ్యాసం యొక్క చరిత్ర చెడిపోకుండా నా వాడుకరి పేజీకి తరలించగలరు. ఆడియో ఇంజనీర్ - వాడుకరి:YVSREDDY/ఆడియో ఇంజనీర్, సాంకేతిక విజ్ఞానం - వాడుకరి:YVSREDDY/సాంకేతిక విజ్ఞానం, రీఛార్జబుల్ బ్యాటరీ - వాడుకరి:YVSREDDY/రీఛార్జబుల్ బ్యాటరీ, ఇజ్రాయెల్ జెండా - వాడుకరి:YVSREDDY/ఇజ్రాయెల్ జెండా, రాజకీయాలు - వాడుకరి:YVSREDDY/రాజకీయాలు, రాజకీయ పార్టీ - వాడుకరి:YVSREDDY/రాజకీయ పార్టీ అలాగే నేను సృష్టించినవి ఇంకా ఏవైనా తొలగించివుంటే వాటిని కూడా పునఃప్రారంభించి వాటిని కూడా నా వాడుకరి పేజీకి చరిత్ర చెడిపోకుండా తరలించగలరు. ఈ విషయాన్ని తెలుగు వికీపీడియాకు చెందిన నిర్వాహకులు అందరు గమనించగలరు. - YVSREDDY (చర్చ) 18:00, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తవారు, తెవికీ పద్ధతులు తెలీని వారూ సృష్టించిన పేజీలను అలా తరలించవచ్చు. అలా తరలించి, "వాటిని అభివృద్ధి చెయ్యండి, మళ్ళీ ప్రధాన బరి లోకి తరలిద్దాం" అని ప్రోత్సహించవచ్చు. ఇతరులు కూడా ఒక చెయ్యి వేసి వాటిని అభివృద్ధి చెయ్యవచ్చు. కానీ..
అనుభవజ్ఞులు, పదేళ్ళకు పైబడి "ఫలానా తప్పు చెయ్యొద్దు సార్" అని చెప్పించుకుంటూనే ఉన్నవారు, తోటి నిర్వాహకులను నిందించేవారు, పదే పదే తప్పులు చేసి నిరోధాలకు గురైనవారు (8 సార్లు), "ఇటువంటి గుడ్డి ఐడియాలు మానుకొని.." అంటూ యథాలాపంగా చులకనగా మాట్లాడుతూ పోయే వారూ, తొలగించిన పేజీని వెనువెంటనే సృష్టించేవారు (తాజా ఉదాహరణ: "నక్షత్రవనం"), అలా చెయ్యకూడదని చెప్పినా చేసేవారూ, తెవికీ విధానాలు మార్గదర్శకాల పట్ల పట్టింపు లేనివారూ.. అయిన వాడుకరి పదేపదే చేసే తప్పులను వాడుకరి పేరుబరి లోకి తరలించి కాపాడాలసిన అవసరం లేదు. వాటిని తొలగించాలని నిర్ణయిస్తే తొలగించాల్సిందే. ఇలా చేస్తే సదుద్దేశంతో చేసేవారినీ, ఇతరులనూ ఒకే గాటన కట్టినట్టు అవుతుంది. __ చదువరి (చర్చరచనలు) 23:48, 29 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారి పై అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:51, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ప్రారంభించిన థియేటర్ వ్యాసం తెలుగు పేరుతోనే ప్రారంభిద్దామని రంగస్థలం పేరు టైపు చేయగా అది తెలుగు నాటకం వ్యాసానికి దారి మార్పుగా ఉన్నది. రంగ స్థలం పేరు టైపు చేయగా అది కూడా తెలుగు నాటకం వ్యాసానికి దారి మార్పుగా ఉన్నది. అందుకని రంగస్థలం వ్యాసాన్ని థియేటర్ పేరుతోనే ప్రారంభించాను. నిర్వాహకులు సరిచేస్తారు అని అనుకున్నాను. రంగస్థలం వ్యాసానికి ఒక సరైన బొమ్మను చేర్చాలని వెతికితే సరైన ఫోటో కనిపించలేదు. ఒక సినిమా థియేటర్ బొమ్మను చేర్చాను, అలా ఎందుకు చేర్చానంటే సినిమా థియేటర్ వేరు అని చెప్పడానికి. అది అవకాశంగా తీసుకొని Theatre, Theater పదాల మధ్య తేడా అంటూ ప్రణయ్‌రాజ్ వంగరి నాటకరంగం అంటూ కొత్త వ్యాసాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని నేను థియేటర్ వ్యాసం యొక్క చర్చా పేజీలో వ్రాస్తే అది మహా తప్పుగా భావించిన ప్రణయ్‌రాజ్ వంగరి వెనువెంటనే ఆ పేజీని తొలగించారు. అదే విషయాన్ని రచ్చబండలో వ్రాసాను. దానికి సమాధానం చెప్పకుండా, చెప్పలేక, చేతకాక తప్పులు సరిచేయండి అని అడిగినన్ను 3 రోజులు నిరోధించారు. తప్పును తప్పు అని చెప్పగల నిర్వాహకులను వెల్లగొట్టారు. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ ఉండేలా మిగతా నిర్వాహకులను భయపెడుతున్నారు. నా వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారో కరపత్రములు పంచి ప్రజల మధ్యనే అడుగుతాను. న్యాయస్థానమునకు ఫిర్యాదు చేస్తాను. YVSREDDY (చర్చ) 03:15, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని బెదిరించడం దుష్ప్రవర్తన. ఇందుకు గాను మీరు క్షమాపణలు చెప్పి ఆ వ్యాఖ్యను వెనక్కి తీసుకోండి. లేకపోతే మీరు చర్యకు గురయ్యే అవకాశం ఉంటుంది. గమనించండి. __ చదువరి (చర్చరచనలు) 14:35, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

26 మార్చి 2020‎న 2,102 బైట్లతో YVSREDDY రాజకీయ పార్టీ వ్యాసంలో వ్రాసిన సమాచారం మార్చు

రాజకీయ పార్టీ అంటే ఒక దేశం యొక్క వ్యవహారాలను నడిపించడానికి ఎన్నికల ద్వారా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తుల లేదా సంస్థల వ్యవస్థీకృత సమూహం. ఇది తరచుగా ప్రభుత్వ కార్యాలయములకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నికలలో పదవికి పోటీ చేస్తారు, ఎన్నికలలో గెలిచిన్న అభ్యర్థులు ప్రజాప్రతినిధులు అవుతారు. మెజారిటీ అభ్యుర్థులను గెలిపించుకున్న పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. మళ్ళీ మళ్ళీ నిర్ణీత కాలాన్ని ఎన్నికలు జరుగుతుంటాయి, మళ్ళీ ఏ పార్టీ అధిక సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికార పార్టీగా అధికారాన్ని చేపట్టి నిర్ణీత గడువు వరకు పరిపాలన కొనసాగిస్తుంది. అధికార పార్టీకి చేరువగా అభ్యర్థులను గెలిపించుకున్న పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది.

తెలుగు వికీపీడియాలో నేను చేరిన సమయంలో ఒక వాక్యం వ్రాస్తే అది గొప్పగా భావించేవారు. నేను వ్రాసిన వ్యాసాలలో కనీసం 6 లైన్లు ఉండాలని నాకు నేనుగా అనుకున్నాను. నేను సృష్టించిన ప్రతి వ్యాసంలో కనీసం 2000 బైట్లు ఉండేలా చేస్తున్నాను. కానీ ఈ వ్యాసం ప్రారంభమే 2000 బైట్లకి మించి ప్రారంభించబడింది. ఈ వ్యాసంలో తక్కువ సమాచరం ఉంది అని ఇప్పుడు తొలగింపు మూస పెట్టారు. ఈ విధానం వలన ఈ వ్యాసం యొక్క చరిత్ర పూర్తిగా చెడిపోతుంది. ఇలాంటి విధానాల వలన ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. నేను సృష్టించిన ప్రతి వ్యాసం ఎవరు తొలగించినా దుర్మార్గమే తప్ప మరొకటి కాదు. నేను నిర్వాహకుడిగా, అధికారిగా అవ్వాలనే లక్ష్యంతో నేను తెలుగు వికీపీడియాలో చేరలేదు. తెలుగు వికీపీడియాలో నేను చేసిన కృషికి అతిసులభంగా నిర్వాహకుడిని అయ్యేవాడిని. నేను అనుకుంటే కేవలం మా ఊరి వారి సహకారంతోనే నేను నిర్వాహకుడిని కాగలను. నా తొలగించిన ప్రతి వ్యాసాన్ని పునఃసృష్టిచేయగలను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాస్తున్నాను, కాబట్టే నేను సృష్టించిన వ్యాసాలను దుర్మార్గంగా తొలగిస్తున్నారు. నేను సృష్టించిన వ్యాసాలను తొలగిస్తే నిర్వాహకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ప్రతి తెలుగు వికీపీడియా నిర్వాహకుడి ఊరిలో కరపత్రములను పంచుతాను. నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాయబట్టే 2016 సంవత్సరంలో రోజుకో విజ్ఞాన వ్యాసం వ్రాసి ప్రపంచ రికార్డు సాధించినా ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పటికైనా తొలగించిన నా వ్యాసాలను పునఃప్రారంభించండి. నేను వ్రాసిన వ్యాసాలను తొలగిస్తే ఆ స్థానంలో ఏలాంటి వ్యాసాలు వచ్చాయో పరిశీలించండి. ఉదాహరణకు చర్చ:నిజాయితీ చూడండి. YVSREDDY (చర్చ) 13:11, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

"ఇలాంటి విధానాల వలన ఇప్పటికే తెలుగు వికీపీడియా సర్వనాశనం అయ్యింది. " - @YVSREDDY గారూ దీనికి ఆధారాలు చూపండి. సర్వనాశనం అయిందని చెప్పడానికి ఆధారాలేంటి?__ చదువరి (చర్చరచనలు) 14:33, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • "తెలుగు వికీపీడియాలో నేను చేరిన సమయంలో ఒక వాక్యం వ్రాస్తే అది గొప్పగా భావించేవారు." - ఎవరు భావించేవారు?
  • "నేను అనుకుంటే కేవలం మా ఊరి వారి సహకారంతోనే నేను నిర్వాహకుడిని కాగలను." - నిజమే.., మన మంచితనాన్ని తెవికీ గుర్తించకపోయినా, మన ఊరి వాళ్ళు గుర్తిస్తారు. దానికి తోడు, నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత కూడా ఉంది.
  • "నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాస్తున్నాను, కాబట్టే నేను సృష్టించిన వ్యాసాలను దుర్మార్గంగా తొలగిస్తున్నారు. " - మీరు అజ్ఞాతగా వ్యాసాలు సృష్టిస్తే, పనిగట్టుకుని వాటిని తొలగించడానికి, అసలు ఆ వ్యాసాలు సృష్టించినది మీరేనని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? విషయమేంటో నాకు అర్థమవడం లేదు.
  • "నేను అజ్ఞాతంగా వ్యాసాలు వ్రాయబట్టే 2016 సంవత్సరంలో రోజుకో విజ్ఞాన వ్యాసం వ్రాసి ప్రపంచ రికార్డు సాధించినా ఎవరికి తెలియకుండా పోయింది" - అజ్ఞాతగా ప్రపంచ రికార్డు సాధించారా? కానీ ఎవరికీ తెలీకుండా పోయిందా? పోన్లెండి, ఏం పర్లేదు. మీర్రాసిన వ్యాసాలు చాలా ప్రసిద్ధి గాంచాయి. అనేకమంది వాటిని చదివి వాటిపై పరిశోధనలు చేసి వాటిని ఉంచాలా తొలగించాలా అనే విషయమ్మీద బోల్డన్ని చర్చలూ గట్రా చేసారు. ఆ గొప్పదనం మరెవరి వ్యాసాలకూ దక్కినట్టు లేదు. ఆ ఘనత వాటికి ఉండిపోతుంది. __
చదువరి (చర్చరచనలు) 15:14, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • 2016 సంవత్సరంలో రోజుకో విజ్ఞాన వ్యాసం వ్రాసినా అప్పుడు నేను అది ప్రపంచ రికార్డ్ గా భావించలేదు. ప్రపంచంలో నాలాంటి వారు అనేక మంది వ్రాసి ఉండవచ్చు అని అనుకున్నాను. నా తరువాత వ్రాసిన వారినే ప్రపంచ రికార్డ్ సృష్టించారని మీరంతా పొగడుతుంటే మీరు పనిచేస్తున్న తెలుగు వికీపీడియాలోనే సంవత్సరం రోజులు క్రమంగా తప్పకుండా వ్రాసిన వ్యక్తినే మీరు గుర్తించలేదు ప్రపంచంలో కోట్ల మంది గురించి మీకేమి తెలుసు అని తెలియజేసేందుకే నేను వ్రాసిన విషయాన్ని బయటపెట్టాను. నేను వ్రాసిన మంచి మంచి వ్యాసాలను ఎలా తొలగించాలా అని కొంతమంది పరిశోధనల మీద పరిశోధనలు చేస్తున్నారు కదా. అలా చేసే కదా అత్యద్భుతమైన, మహాత్తరమైన, పరమ పవిత్రమైన నక్షత్రవనం వ్యాసాన్ని తొలగించారు.
  • నా వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారో కరపత్రములు పంచి ప్రజల మధ్యనే అడుగుతాను. న్యాయస్థానమునకు ఫిర్యాదు చేస్తాను" అని వ్రాసినందుకే నన్ను నిరోధిస్తే అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నేను వ్రాసిన మంచి మంచి వ్యాసాలను తొలగించి, క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాసాలు వ్రాస్తున్న నన్ను ఎటువంటి తప్పు లేకపోయినా పరమ దుర్మార్గంగా నీచాతి నీచంగా దిగజారి నన్ను నిరోధించిన వారిని ఇంకేమి చేయాలి. నేను కావాలనుకుంటే మా ఊరి వారి సహాకారంతో నేను నిర్వాహకుడిని కాగలను. దిగజారి నీచంగా ప్రవర్తిస్తున్న నిర్వాహకులపై చర్యలూ తీసుకోగలను. YVSREDDY (చర్చ) 21:24, 30 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
YVSREDDY గారూ చేసిన పనులు చెరిగిపోయేవి కావు. ఇది వికీపీడియా. 2016 లోనే కాదు, ఎప్పుడైనా సరే.. ఇక్కడ మనం చేసిన ప్రతి పనినీ వెలికితీయవచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ రికార్డును ప్రకటించండి. నేను 2016 లో మీరు చేసిన రచనలు చూసాను. అప్పుడు చాలానే వ్యాసాలు రాసారు. నేను డిసెంబరు నెలలో చూట్టం మొదలుపెట్టాను. డిసెంబరు 29 న వ్యాసం రాయలేదు (ఒక్క రోజు రాయకపోయినా రికార్డు అవదు కాబట్టి నేను ఆ తేదీ దాటి ఇక చూడలేదు). కాబట్టి, "సంవత్సరం రోజులు క్రమంగా తప్పకుండా వ్రాసిన" అని మీరు చెప్పుకున్నట్లుగా అక్కడ లేదు. అంచేత ఆ రికార్డు పరిగణన లోకి రాదు. కానీ మొత్తంమీద మీరు 365+ వ్యాసాలు రాసి ఉండవచ్చు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
నక్షత్ర వనం "అత్యద్భుతమైన, మహాత్తరమైన, పరమ పవిత్రమైన"దా? నేను దాన్ని చూసాను. అసలు ఏ భాష పేజీ ఇది? తెలుగా? ఇంగ్లీషా? మలయాళమా? ప్రవేశిక ఒకటి ఉంది. అది తెలుగులో ఉంది. అందులో ఒక వాక్యం - "ఇటువంటి వనాలలో ఒకటి భారతదేశంలోని కర్ణాటకలోని శృంగేరిలో ఒక పవిత్రమైన తోపు." - లోని వ్యాకరణం ఎలా ఉందో చూడండి. ఒక పట్టిక ఉంది. దాన్నిండా ఇంగ్లీషే, తెలుగనేదే లేదు. దాని కింద నక్షత్రం పేర్లు, వాటి చెట్లతో కూడిన ఒక తెలుగు పేరా. దాని కింద ఒక 27 చెట్ల బొమ్మలున్న మలయాళం కొలువు. మూడు భాషల్లో ఉన్న ఒక పేజీని తీసుకొచ్చి దాని మొహాన "ఇన్ యూజ్" లాంటి ఒక మూసనొకదాన్ని పడేసి, దానికి "అత్యద్భుతమైన, మహాత్తరమైన, పరమ పవిత్రమైన" అని చెప్పుకుంటారా? దాన్ని ఒక మామూలు తెవికీ వ్యాసం స్థాయికి తీసుకురావాలంటే దానిలో ఇంకా బోల్డంత పని చెయ్యాలి. ఇంకొక్క వారం రోజుల్లో ఆ పని జరక్కపోతే దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. కాబట్టి దయచేసి దాన్ని వీలైనంత తొందరగా సరిచేసి ఒక మామూలు వ్యాసం స్థాయికి అభివృద్ధి చెయ్యండి. ఒకటి రెడ్డి గారూ, దోషాలూ లోపాలూ అన్ని వ్యాసాల్లోనూ ఉంటై, అందరి రాతల్లోనూ ఉంటై. కానీ అద్భుతం, అత్యద్భుతం, మహాద్భుతం అంటూ ఆత్మస్తుతి ఎవరూ చేసుకోరు. మీరు చేసుకున్నారు. అంచేతనే నేను దాని నాణ్యతను పరిశీలించాల్సి వచ్చింది.
ఆత్మస్తుతి చేసుకుంటే ఎవరికీ నష్టం లేకపోవచ్చు. కానీ పరనింద ("పరమ దుర్మార్గంగా నీచాతి నీచంగా దిగజారి నన్ను నిరోధించిన వారిని") పెరిగిపోతోంది. ఇలా నిందించినందుకే మిమ్మల్ని నిరోధించారు. ఇప్పుడు మళ్ళీ నిరోధించాల్సిన పరిస్థితి తెచ్చారు.__చదువరి (చర్చరచనలు) 00:50, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

29 డిసెంబరు 2016న నేను వ్రాసిన వ్యాసం మార్చు

  • మిస్సోరి నది
  • ప్రస్తుగత 21:51, 29 డిసెంబరు 2016‎ YVSREDDY చర్చ రచనలు‎ 759 బైట్లు +759‎ ←Created page with 'మిస్సోరి నది (Missouri River - మిస్సౌరీ రివర్) అనేది ఉత్తర అమెర...'
  • చరిత్రను చూడండి. మీకు నచ్చినట్లుగా వ్రాయకండి. నక్షత్రవనం వ్యాసాన్ని మళ్ళీ తొలగిస్తున్నామంటున్నారు. తొలగిస్తామనే మాట తప్పక మీకు విస్తరిస్తామని, సరి చేస్తామని, బాగుచేద్దామని వంటి పలుకులు రావా. 2013లో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు వికీపీడియా విజయ ఉగాది వేడుకలో వికీపీడియాలో నేను వ్యాసాలు వ్రాయడానికి ఒక కారణం చదువరి గారు అని చెప్పాను. ఒక చర్చలో మీ అభిమాని YVSREDDY అని వ్రాసాను. మీకు ఇప్పుడు కొంతమంది తోడుగా ఉన్నట్లు నటిస్తూ మిమ్మల్ని వాడుకుంటున్నారు అర్థం చేసుకోండి. YVSREDDY (చర్చ) 02:47, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    అయ్యా @YVSREDDY గారూ, మీ అభిమానాన్ని, మీ గౌరవాన్నీ పొందేంతటి అర్హత నాకు లేదు. మీరు నిజాయితీగానే చెబుతున్నారేమో గానీ, నాకు మాత్రం ములగచెట్టు ఎక్కిస్తున్నట్టుంది. నన్నిలా ఉణ్ణీండి.
    నాకు తోడుగా ఉన్నట్లు నటిస్తున్నారని మీరు ఎవర్ని ఉద్దేశించి అన్నారో నాకు తెలీదు. కానీ నాకు మనుషుల పట్ల ఒక చక్కటి అంచనా ఉంది. ఎవరిది నటనో ఎవరిది కాదో నాకు తెలుసు. నేను అమాయకుణ్ణని అనుకుంటున్నారేమో.. కాదు!
    నమస్కారం. ఇక ఈ చర్చను పొడిగించకండి. (అన్నట్టు ఆ మిస్సోరీ నది ఈ చర్చలో ఎందుకు ప్రవహిస్తోందో నాకు అస్సలు అర్థం కాలేదు.)__ చదువరి (చర్చరచనలు) 13:17, 1 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదాల్లో ప్రగతి మార్చు

2023 ఆగస్టు సెప్టెంబరుల్లో అనువాదం పరికరం ద్వారా చేస్తున్న అనువాదాలలో వేగం పెరిగింది. ఇతర భాషలతో పోలిస్తే ఈ కాలంలో వృద్ధి శాతం చాలా ఎక్కువగా ఉంది. నెలా 15 రోజుల్లోపే వెయ్యి పైచిలుకు అనువాదాలు చేరాయి. దీనికి ప్రధాన కారణం క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వస్తున్న అనువాదాలు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ ప్రగతి మందగించే అవకాశం లేకపోలేదు.

వికీపీడియా 2023 అక్టోబరు 2

నాడు వ్యాసాల సంఖ్య

2023 ఆగస్టు 13

నాడు వ్యాసాల సంఖ్య

వృద్ధి శాతం
తెలుగు 7,330 6,101 20.14
తమిళం 29,467 28,509 3.36
కన్నడం 4,951 4,810 2.93
మలయాళం 10,983 10,789 1.80
హిందీ 9,448 9.018 4.77
మరాఠీ 3,719 3,444 7.98
బెంగాలీ 35,840 34,834 2.89
పంజాబీ 20,666 20,376 1.42
గుజరాతీ 2,627 2,596 1.19
ఒరియా 3,025 2,919 3.63
అస్సామీ 723 713 1.40

అనువాదాల ప్రగతి గురించి గతంలో రచ్చబండలోనే చేసిన ఒక చర్చ చూడండి. చదువరి (చర్చరచనలు) 13:58, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ప్రాజెక్టులో మంచి ప్రగతి సాధించినందుకు కృషిచేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు.ముఖ్యంగా ఈ ప్రాజెక్టు రూపకర్త చదువరి గార్కి ప్రత్వేక ధన్యవాదాలు.ఈ ప్రాజెక్టువలన ఈ 2 నెలలు 15 రోజులలో వికీపీడీయాలో దాదాపు 3 శాతం వ్యాసల సంఖ్య పెరిగింది.ఈ సంవత్సరం ఆఖరుకు 90,000 వ్యాసాల లక్ష్యానికి చేరుకుంటామని ఆశిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:54, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాదాల్లో తెవికీ ప్రగతి గురించి గణాంకాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు. --ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:05, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ వికీపీడియాల ప్రస్థానం - తెవికీ స్థానం మార్చు

వివిధ భారతీయ భాషల వికీపీడియాలు వ్యాసాల సంఖ్య పరంగా సాధించిన పురోగతిని కింది పట్టికలో చూడవచ్చు. జూలై, ఆగస్టు సెప్టెంబరు - ఈ మూడు నెలల్లో ఈ వికీపీడియాలు సాధించిన స్థూల పురోగతిని కింది సంఖ్యలు చూపిస్తాయి. ఈ కాలంలో అత్యధిక వృద్ధి శాతం - 3.57% - తో తెలుగు అన్నిటి కంటే ముందంజలో ఉంది. జూలై 5 న మలయాళం కంటే వెయ్యి వ్యాసాలు వెనకబడి ఉండగా, అక్టోబరు 2 నాటికి దాన్ని దాటేసి వెయ్యి వ్యాసాలు ముందుకు పోయాం. ఈ కాలంలో వచ్చిన వ్యాసాల సంఖ్యలో కూడా - 2994 తో మనమే ముందంజలో ఉన్నాం. మనకు అత్యంత సమీపంలో తమిళం 2,507 తో, బెంగాలీ 2,500 తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

భాష 2023 జూలై 5 నాటికి

వ్యాసాల సంఖ్య

2023 అక్టో 2 నాటికి

వ్యాసాల సంఖ్య

వృద్ధి శాతం
తెలుగు         83,922           86,916 3.57%
తమిళం      1,57,010       1,59,517 1.60%
మలయాళం         84,940           85,612 0.79%
కన్నడం         30,934           31,280 1.12%
హిందీ      1,61,621       1,62,945 0.82%
బెంగాలీ      1,39,536       1,42,036 1.79%
మరాఠీ         93,692           94,299 0.65%
పంజాబీ         50,620           51,310 1.36%
గుజరాతీ         30,380           30,434 0.18%
ఒరియా         16,949           17,299 2.07%

__ చదువరి (చర్చరచనలు) 14:37, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వివరాలు తెలిపినందుకు చదువరి గార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:56, 2 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
భారతీయ వికీపీడియాల ప్రస్థానం - తెవికీ స్థానం గురించి గణాంకాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:06, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరిగారు మీకు, తెలుగు వికీపీడియన్లందరికి ధన్యవాదాలు..! ఇదే పంథా నిరంతరం కొనసాగించడానికి ప్రయత్నించాలి. Muralikrishna m (చర్చ) 10:21, 4 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో అంబేద్కర్ , అంబేడ్కర్ నామవాచకం వాడుక విషయం మార్చు

గతంలో వీటిని గురించి అంతగా ఆలోచించవలసిన లేదా పట్టించుకునే అవసరం కలగలేదనుకుంటాను.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్య్వస్థీకరణలో కోనసీమ జిల్లాకు ఈ పేరు పెట్టబడింది.దీని ప్రభావం వర్గాలు, మూసలు, జిల్లా పేరుపై ఉంది.అంతే గాదు కొన్ని వ్యాసాలలో ఈ నామవాచకం వాడుక రెండు విధాలుగా వాడబడుతుంది.దీని నిర్ణయ ప్రకారం వర్గాలు, మూసలు, వ్యాసాలలో కొన్ని సవరణలు చేయవలసి ఉంది.అందువలన వీటి వాడుక ప్రభావం విషయంలో ఒక పద్దతి లేదా పాలసీని సముదాయ సభ్యులు చర్చించి లేదా విశ్లేషించి ఒక విధాన నిర్ణయంచేయవలసిన అవసరం ఉందని, ఈ లింకులో విధాన నిర్ణయం కోసం చర్చకు ప్రవేశ పెట్టటమైనది.కావున ఆ పేజీలో మీ అభిప్రాయాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 08:14, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చను తీకుకొచ్చినందుకు ధన్యవాదాలు యర్రా రామారావు గారు. గతంలో వికీలో ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ పేజీని అనుసరించి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డా. బి.ఆర్. అంబేడ్కర్ స్మృతివనం, బి.ఆర్. అంబేడ్కర్ రాజగృహం పేర్లతో వ్యాసాలు రాశానుకానీ, అంబేడ్కర్ అనే పదం కంటే అంబేద్కర్ అనే పదం సరైనదని మనసులో మెదలుతూఉండేది. దానిని నిర్థారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రవేశద్వారాలపై 'డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం' అని పేరును రాసింది. దాంతో అంబేద్కర్ అనే పదమే సరైనదని నిర్ణయించుకొని, ఆ ఒక్కవ్యాసాన్ని సరైన పేరుకు తరలించాను. మిగతా పేజీలను కూడా సరైన పేరుకు తరలించాలని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:07, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
రెండు పదాల వినియోగం గూగుల్ మరియు తెవికీలో ఉంది. హిందీ వికీలో भीमराव आम्बेडकर గానూ, కన్నడ వికీలో ಬಿ. ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ అనే వాడుకలో ఉన్నాయి. అంటే "అంబేడ్కర్" పదాన్నే ఉపయోగించాయి. వివిధ ప్రముఖులు అంబేద్కర్ గురించి రాసిన పుస్తకాలను పరిశీలిస్తే జానమద్ది హనుమచ్ఛాస్త్రి రాసిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు లో "డా. భీమ్‌రావ్ అంబేద్కర్" అని వాడగా, కత్తి పద్మారావు గారు తాను రాసిన అంబేడ్కర్ జీవిత చరిత్ర లో "అంబేడ్కర్" అనే పదాన్ని వాడారు. గూగుల్ లో ప్రముఖులు అంబేద్కర్ గురించి రాసిన పుస్తకాల శీర్షికలను పరిశీలిస్తే రెండు పదాలను ఉపయోగించడం జరుగుతుంది. రెండు పదాలు కూడా సరియైనవే. అయితే ఎస్.సి.ఇ.ఆర్.టి రెండు తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతులకు అందించే సోషల్ స్టడీస్ పుస్తకాలలో "అంబేద్కర్" పదాన్నే ఉపయోగించారు. చాలాకాలంగా మనం చదువుకుంటున్న వివిధ పుస్తకాలలో "అంబేద్కర్" అనే పదం ఉపయోగిస్తున్నాం. దానినే విద్యార్థిలోకం నేర్చుకుంటుంది. కనుక 8 డిసెంబర్ 2012 న ఆ వ్యాస చర్చా పేజీలో "అంబేద్కర్" గా శీర్షికను మార్చమని తెలియజేసాను. కనుక "అంబేద్కర్" సరైన పేరుగా నేను సమర్థిస్తాను. ➤ కె.వెంకటరమణచర్చ 11:58, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు పాఠ్యపుస్తకాల్లో అంబేద్కర్ అనే ఉంది. అలాగే తెలుగులో అంబేద్కర్ అని గూగుల్ లో వెతికితే అంబేడ్కర్ అనే పదం కన్నా ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. (అంబేడ్కర్ - 2,80,000, అంబేద్కర్ - 12,00,000) కాబట్టి అంబేద్కర్ అనే పదాన్ని ప్రధాన పదంగా వాడి అంబేడ్కర్ అనే పదం నుంచి దారి మార్పులు చేయవచ్చని నా అభిప్రాయం. - రవిచంద్ర (చర్చ) 06:43, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Announcing Indic Wikimedia Hackathon 2023 and Invitation to Participate మార్చు

Dear Wikimedians,

The Indic MediaWiki Developers User Group is happy to announce Indic Wikimedia Hackathon 2023 on 16-17 December 2023 in Pondicherry, India.

The event is for everyone who contributes to Wikimedia’s technical spaces code developers, maintainers, translators, designers, technical writers and other related technical aspects. Along with that, contributors who don't necessarily contribute to technical spaces but have good understanding of issues on wikis and can work with developers in addressing them can join too. You can come with a project in mind, join an existing project, or create something new with others. The goal of this event is to bring together technical contributors from India to resolve pending technical issues, bugs, brainstorm on tooling ideas, and foster connections between contributors.

We have scholarships to support participation of contributors residing in India. The scholarship form can be filled at https://docs.google.com/forms/d/e/1FAIpQLSd_Qqctj7I87QfYt5imc6iPcGPWuPfncCOyAd_OMbGiqxzxhQ/viewform?usp=sf_link and will close at 23:59 hrs on 15 October 2023 (Sunday) [IST].

Please reach out to contact indicmediawikidev.org if you have any questions or need support.

Best, Indic MediaWiki Developers UG, 04:40, 4 అక్టోబరు 2023 (UTC)

Image Description Month in India: 1 October to 31st October మార్చు

Apologies for writing in English.

Dear everyone,

We're excited to invite you to the Image Description Month India description-a-thon, set to take place from October 1st to October 31st, 2023. During this event, we'll be focusing on improving image-related content across Wikimedia projects, including Wikipedia, Wikidata, and Wikimedia Commons.

To stay updated and get involved, please visit our dedicated event page event Page.

Your active participation will be instrumental in enhancing Wikimedia content and making it more accessible to users worldwide. Thank you :) MediaWiki message delivery (చర్చ) 14:35, 5 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]