ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు | |
---|---|
రకం | జిల్లాలు |
స్థానం | ఆంధ్రప్రదేశ్ |
సంఖ్య | 26 జిల్లాలు |
జనాభా వ్యాప్తి | పార్వతీపురం మన్యం – 9,25,340 (అత్యల్ప); నెల్లూరు – 24,69,712 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | విశాఖపట్నం – 1,048 చ.కి.మీ. (చిన్నది); ప్రకాశం – 14,322 చ.కి.మీ. (అతిపెద్ద) |
ప్రభుత్వం | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
ఉప విభజన | ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు |
విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.
చరిత్ర
మార్చుస్వాతంత్ర్యం వచ్చేనాటికినేటి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగాఉండేది. తెలుగు మాట్లాడే ఆధిపత్య ప్రాంతాలైన కోస్తాాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది.[1]
ఆంధ్రరాష్ట్రంగా ఇది అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి అనే 11 జిల్లాలను కలిగి ఉంది.[2][3]
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునర్వ్యవస్థీకరించబడ్డాయి.1956 నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. దీనిని పునరాలోచనలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా సూచిస్తారు.
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఆంధ్రరాష్ట్రం లోని 11 జిల్లాల కలిపి మొత్తం 21 జిల్లాలతో ఏర్పడింది. 1959 సంవత్సరంలో, గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పు గోదావరి జిల్లా లోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా లోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాను నల్గొండ జిల్లా లోకి చేర్చారు.[4] 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విజయనగరం జిల్లా ఏర్పడడంతో జిల్లాల సంఖ్య 21 నుండి 23కు పెరిగింది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విభజించబడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా పిలవబడే ఆంధ్రప్రాంతం 13 జిల్లాలతో మిగిలిపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి అనేక గిరిజన ప్రాబల్య మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయి. ఈ మండలాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేర్చబడ్డాయి.[5][6][7][8]
2022 జనవరి 26న, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, 1974, సెక్షన్ 3 (5) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఆధారంగా ప్రతిపాదించింది.[9][10] దీనికి మినహాయింపు విశాలంగా వున్న అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చటం. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్సభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు.[11][12] ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ను ప్రచురించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులోని షెడ్యూల్లో పేర్కొన్న విధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2022 ఏప్రిల్ 4 నుండి అమలులోకి వచ్చాయి.[13][14][15] ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి
కాలక్రమ స్థితి పటాలు
మార్చు-
(1953–1956)
-
(1956–2014)
-
(2014–2022)
-
(2022–present)
పునర్య్వస్థీకరణ వివరాలు
మార్చు2022 పునర్య్వస్థీకరణ, తదనంతర సవరణల ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు.[16]
- జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు దిగువ గణాంకాలతో జిల్లాల జాబితా చూడండి.)
- మొత్తం మండలాలు: 679
2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జరిగిన మార్పులు
- గుంటూరు మండలం -> గుంటూరు తూర్పు మండలం, గుంటూరు పశ్చిమ మండలం (2)
- కర్నూలు మండలం -> కర్నూలు పట్టణ, కర్నూలు గ్రామీణ మండలం (2)
- విజయవాడ పట్టణ మండలం -> విజయవాడ మధ్య మండలం, విజయవాడ ఉత్తర మండలం, విజయవాడ తూర్పు మండలం, విజయవాడ పశ్చిమ మండలం (4)
- నెల్లూరు మండలం -> నెల్లూరు పట్టణ మండలం, నెల్లూరు గ్రామీణ మండలం (2)
- విశాఖపట్నం పట్టణ మండలం + విశాఖపట్నం గ్రామీణ మండలం (కొంత భాగం) -> సీతమ్మధార మండలం, గోపాలపట్నం మండలం, ములగాడ మండలం, మహారాణిపేట మండలం (4)
వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాల సంఖ్య 679కి చేరుకుంది.[17]
- రెవెన్యూ డివిజన్లు: 76 (మరిన్ని వివరాలకు ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్ల జాబితా చూడండి)
- రద్దుఅయిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు
- రెవెన్యూ డివిజన్లు - 1 (వర్గం:చారిత్రాత్మక రెవెన్యూ డివిజన్లు)
- మండలాలు - 5 (వర్గం:ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిన మండలాలు)
2023 లో జరిగిన మార్పులు
మార్చుగణపవరం మండలం 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది. [18]
జిల్లాల గణాంకాలు
మార్చువ.సంఖ్య | కోడ్[19] | అధికారిక పేరు | ప్రధాన కార్యాలయం | రెవెన్యూ డివిజన్లు | మండలాలు సంఖ్య | జనాభా | విస్తీర్ణం చ.కి.మీ. | జనసాంద్రత చ.కి.మీ.1కి |
స్థితిని తెలిపే పటం |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | SR | శ్రీకాకుళం జిల్లా | శ్రీకాకుళం | 3 | 30 | 21,91,471 | 4,591 | 477.34 | |
2 | PM | పార్వతీపురం మన్యం జిల్లా | పార్వతీపురం | 2 | 15 | 9,25,340 | 3,659 | 252.89 | |
3 | VZ | విజయనగరం జిల్లా | విజయనగరం | 3 | 27 | 19,30,811 | 4,122 | 468.42 | |
4 | VS | విశాఖపట్నం జిల్లా | విశాఖపట్నం | 2 | 11 | 19,59,544 | 1,048 | 1869.79 | |
5 | AS | అల్లూరి సీతారామరాజు జిల్లా | పాడేరు | 2 | 22 | 9,53,960 | 12,251 | 77.87 | |
6 | AK | అనకాపల్లి జిల్లా | అనకాపల్లి | 2 | 24 | 17,26,998 | 4,292 | 402.38 | |
7 | KK | కాకినాడ జిల్లా | కాకినాడ | 2 | 21 | 20,92,374 | 3,019 | 693.07 | |
8 | EG | తూర్పు గోదావరి జిల్లా | రాజమహేంద్రవరం | 2 | 19 | 18,32,332 | 2,561 | 715.48 | |
9 | KN | డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా | అమలాపురం | 3 | 22 | 17,19,093 | 2,083 | 825.30 | |
10 | EL | ఏలూరు జిల్లా | ఏలూరు | 3 | 27 | 20,06,737 | 6,579 | 305.02 | |
11 | WG | పశ్చిమ గోదావరి జిల్లా | భీమవరం | 2 | 20 | 18,44,898 | 2,278 | 809.88 | |
12 | NT | ఎన్టీఆర్ జిల్లా | విజయవాడ | 3 | 20 | 22,18,591 | 3,316 | 669.06 | |
13 | KR | కృష్ణా జిల్లా | మచిలీపట్నం | 3 | 25 | 17,35,079 | 3,775 | 459.62 | |
14 | PL | పల్నాడు జిల్లా | నరసరావుపేట | 3 | 28 | 20,41,723 | 7,298 | 279.76 | |
15 | GU | గుంటూరు జిల్లా | గుంటూరు | 2 | 18 | 20,91,075 | 2,443 | 855.95 | |
16 | BP | బాపట్ల జిల్లా | బాపట్ల | 2 | 25 | 15,86,918 | 3,829 | 414.45 | |
17 | PR | ప్రకాశం జిల్లా | ఒంగోలు | 3 | 38 | 22,88,026 | 14,322 | 159.76 | |
18 | NE | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | నెల్లూరు | 4 | 38 | 24,69,712 | 10,441 | 236.54 | |
19 | KU | కర్నూలు జిల్లా | కర్నూలు | 3 | 26 | 22,71,686 | 7,980 | 284.67 | |
20 | NN | నంద్యాల జిల్లా | నంద్యాల | 3 | 29 | 17,81,777 | 9,682 | 184.03 | |
21 | AN | అనంతపురం జిల్లా | అనంతపురం | 3 | 31 | 22,41,105 | 10,205 | 219.61 | |
22 | SS | శ్రీసత్యసాయి జిల్లా | పుట్టపర్తి | 4 | 32 | 18,40,043 | 8,925 | 206.17 | |
23 | CU | వైఎస్ఆర్ జిల్లా | కడప | 4 | 36 | 20,60,654 | 11,228 | 183.53 | |
24 | AM | అన్నమయ్య జిల్లా | రాయచోటి | 3 | 30 | 16,97,308 | 7,954 | 213.39 | |
25 | TR | తిరుపతి జిల్లా | తిరుపతి | 4 | 34 | 21,96,984 | 8,231 | 266.92 | |
26 | CH | చిత్తూరు జిల్లా | చిత్తూరు | 4 | 31 | 18,72,951 | 6,855 | 273.22 |
జిల్లాల విశేషాలు
మార్చు- అతి పెద్ద జిల్లా: ప్రకాశం జిల్లా
- అతి చిన్న జిల్లా: విశాఖపట్నం జిల్లా
- అతి తక్కువ మండలాలు గల జిల్లా: విశాఖపట్నం జిల్లా
- అతి ఎక్కువ మండలాలు గల జిల్లాలు: ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల జిల్లా: విశాఖపట్నం జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ జిల్లా: విశాఖపట్నం జిల్లా
- 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి గ్రామీణ జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా
వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు
మార్చురాష్ట్రంలో 2022 పునర్య్వస్థీకరణ తరువాత ఈ దిగివ వివరించిన 7 జిల్లాలు వ్యక్తుల పేరుతో ఉన్నాయి.[20][21]
ఆరు జోన్లు
మార్చు- మల్టీ జోన్ 1 [ఆధారం చూపాలి]
1.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
2.పాడేరు, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ,
3. ఏలూరు, విజయవాడ, బందరు
- మల్టీ జోన్ 2 [ఆధారం చూపాలి]
4.గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు
5.తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప
6.నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కర్నూలు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "History of Andhra Pradesh". The Hans India (in ఇంగ్లీష్). 1 November 2020. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ "AP new districts: First formed under the empire, Andhra Pradesh's map shaped and reshaped over two centuries". The Times of India (in ఇంగ్లీష్). 30 March 2022. Retrieved 3 April 2022.
- ↑ "New districts in AP: Experts want the government to walk the talk". The Hindu (in ఇంగ్లీష్). 2 April 2022. Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ ANI (2013-11-12). "GoM on Andhra bifurcation to elicit views of political parties". Business Standard India. Retrieved 2023-03-14.
- ↑ "Andhra Pradesh takes control of seven mandals in Khammam". Deccan Chronicle (in ఇంగ్లీష్). 3 September 2014. Retrieved 3 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "List of seven mandals to be included in AP". The Hans India (in ఇంగ్లీష్). 11 July 2014. Retrieved 3 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "TS gives up on 7 transferred mandals". The Hindu (in Indian English). 2014-08-19. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
- ↑ "Parliament passes bill on Polavaram project". The Hindu (in Indian English). 2014-07-14. ISSN 0971-751X. Retrieved 2023-03-14.
- ↑ "Doubling the number of districts in Andhra Pradesh: The proposal and the criticism". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-31. Retrieved 2023-03-11.
- ↑ Raghavendra, V. (26 January 2022). "With creation of 13 new districts, AP now has 26 districts". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
- ↑ "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
- ↑ "New districts to come into force on April 4". The Hindu. 30 March 2022. Retrieved 3 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Here's how new ap map looks after districts reorganisation". 2022-04-03. Retrieved 2023-04-17.
- ↑ "Andhra Pradesh to have 13 new districts from April 4". india.com (in ఇంగ్లీష్). 31 March 2022. Retrieved 3 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
- ↑ DOP (2023). Socio economic survey 2022-23 (PDF). Government of AP. p. 431. Archived from the original (PDF) on 2024-03-28. Retrieved 2024-02-25.
- ↑ AP GO Number 158, Part-I, Extraordinary dated 16-Feb-2023 for GO MS No:54, Revenue (Lands IV), dated 16-02-2023
- ↑ "NIC Policy on format of e-mail Address" (PDF). www.mail.nic.in. 2008-09-11. Archived from the original (PDF) on 11 September 2008. Retrieved 2021-02-15.
- ↑ Desk, HT Telugu. "New Districts In AP | ఏపీలో వ్యక్తుల పేర్లతో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఏది?". Hindustantimes Telugu. Retrieved 2023-08-01.
- ↑ "ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు - BBC News తెలుగు". web.archive.org. 2023-08-01. Archived from the original on 2023-08-01. Retrieved 2023-08-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)