వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-52వ వారం

రంగనాథ్

తిరుమల సుందర శ్రీరంగనాథ్ (T.S.S.Ranganath) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. ఇతడు 1949లో మద్రాసు నగరంలో టి.ఆర్.సుందరరాజన్, జానకీదేవి దంపతులకు జన్మించాడు. ఇతడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేశాడు. రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్‌గా కొంతకాలం పనిచేశాడు. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై సుమారు 300 సినిమాలలో నటించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ.వీ.సీరియళ్లలో కూడా నటించాడు. రంగనాథ్ నటుడే కాదు మంచి కవి, రచయిత కూడా. ఇతడు రచించినకవితా సుదర్శనం, అంతరంగ మథనం, ఈ చీకటి తొలగాలి, పదపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు అచ్చయ్యాయి. ఇతడు డిసెంబరు 19, 2015హైదరాబాదు లోని తన స్వగృహంలో మరణించాడు

సినీరంగ ప్రవేశం

మార్చు

రంగనాథ్ గారి తాతగారు రాజుగారికి వైద్యునిగా ఉన్నప్పుడు. అదే రాజుకు తాపీధర్మారావుగారు ట్యూటర్‌గా ఉండేవారు. వాళ్లు అలా పరిచయం అయ్యారు. కన్నాంబ, పుష్పవల్లిలది రంగనాధ్ గారి అమ్మమ్మ ఊరైన ఏలూరు. అక్కడ వారి అమ్మమ్మకు ఇద్దరు అన్నలు. వాళ్లు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లో విద్వాంసులు. రంగనాధ్ గారి అమ్మ జానకి సింగర్. తబలాప్లేయర్. వారి అమ్మమ్మ వీణలో గోల్డ్‌మెడలిస్టు. రంగనాధ్ గారి తల్లి జానకి గారు గాయని కావాలనుకునేవారట. అదే టైమ్‌లో ఎస్.జానకి కూడా గాయని అయ్యారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ కోరిక నెరవేరకపోవడంతో కొడుకు అయినా ఆర్టిస్టు కావాలనుకుంది. దక్షిణాది సినీ రాజధానిగా ఉన్న చెన్నై నగరంలో 1949లో జన్మించిన రంగనాథ్‌. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించారు. చందన (1974) చిత్రంలో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు.కెరీర్ ప్రారంభంలో కుటుంబ బాధ్య‌తులు మీద పడ‌టంతో సినీ జీవితం న‌మ్మకం కాద‌ని భావించి ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేశారు. బిఎ చ‌దువుతుండ‌గానే ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో టిసిగా ఉద్యోగం వ‌చ్చింది. ఆ వెంటనే వెంట‌నే వివాహం. త‌రువాత పిల్లలు అలా జీవితం సాగిపోతున్నా న‌టుడవ్వాల‌న్న కోరిక మాత్రం చ‌చ్చిపోలేదు. త‌ను నాట‌కాలు వేసే నాట‌క‌రంగం వారి ద్వారా 1969లో చిన్న అవ‌కాశం వ‌చ్చింది. అయితే పాత్ర‌కు గుర్తింపు రాలేదు. అదే స‌మ‌యంలో బాపుగారి అందాల రాముడు సినిమాలో రాముడి వేషం, చంద‌న సినిమాలో హీరో వేషం ఒకేసారి వ‌చ్చాయి. దీంతో బాపుగారి స‌ల‌హాతో చంద‌న సినిమాకే అంగీక‌రించారు. అలా వెండితెర మీద హీరోగా రంగం ప్రవేశం చేశారు రంగ‌నాధ్. పంతుల‌మ్మ సినిమాతో స్టార్ హీరోగా మారారు.

ఎక్కువ‌గా కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌టం ఆయ‌నను మ‌హిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసింది. కానీ సినీ రంగంలో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కెరీర్ స్టార్టింగ్ లోనే ఒడిదుడుకులు వ‌చ్చాయి. దీంతో మ‌రో మార్గం లేక విల‌న్ గా మారారు. 'గువ్వ‌ల జంట' సినిమాతో తొలి సారిగా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అల‌రించారు. ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు. వెండితెర మీదే కాదు.. బుల్లి తెర మీద కూడా తన న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు రంగ‌నాధ్. పౌరాణిక నేప‌థ్యంతో తెర‌కెక్కిన భాగ‌వ‌తం సీరియ‌ల్ తో పాటు, రాఘ‌వేంద్ర‌రావుగారి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ లో తెర‌కెక్కిన శాంతినివాసం సీరియ‌ల్ లోనూ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

నటించిన చిత్రాలు

మార్చు

చిత్ర సౌజన్యం: స్వరలాసిక