చంద్రమోహన్

సినీ నటుడు
(మల్లంపల్లి చంద్రశేఖరరావు నుండి దారిమార్పు చెందింది)

చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించారు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు.

చంద్రమోహన్
జననం
మల్లంపల్లి చంద్రశేఖర రావు [1]

1942 మే 23
మరణం2023 నవంబరు 11(2023-11-11) (వయసు 81)
హైదరాబాదు
విద్యబి. ఎస్. సి, బాపట్ల వ్యవసాయ కళాశాల
వృత్తినటుడు
జీవిత భాగస్వామిజలంధర
పిల్లలుఇద్దరు కుమార్తెలు,
మధుర మీనాక్షి (సైకాలజిస్టు)
మాధవి (వైద్యురాలు)
తల్లిదండ్రులు
  • మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి (తండ్రి)
  • శాంభవి (తల్లి)
బంధువులుశివలెంక కృష్ణప్రసాద్ (మేనల్లుడు)
పురస్కారాలునంది అవార్డు

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ (సినిమా)లో నటించారు.

జీవిత సంగ్రహం

మార్చు

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు.[3] ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.

ఈయన భార్య జలంధర, రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను వెలువరించింది.

పురస్కారములు

మార్చు

నటించిన సినిమాలు

మార్చు

చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 నవంబరు 11న దీపావళి పండుగకు ఒకరోజు ముందు మరణించారు.[5][6][7][8]

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (23 May 2021). "80 ఏళ్ళ సమ్మోహనుడు". www.andhrajyothy.com. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
  2. "chandramohan: అవన్నీ పుకార్లు.. నమ్మకండి - senior actor chandramohan clarifies on rumours about his health". www.eenadu.net. Archived from the original on 2021-05-25. Retrieved 2021-05-25.
  3. Andhrajyothy (11 November 2023). "చంద్రమోహన్ స్వగ్రామం పమిడిముక్కలలో విషాదఛాయలు". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  4. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  5. "బ్రేకింగ్‌.. సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత | Senior Hero Chandra Mohan Passed Away - Sakshi". web.archive.org. 2023-11-11. Archived from the original on 2023-11-11. Retrieved 2023-11-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Eenadu (12 November 2023). "అస్తమించిన నట చంద్రుడు". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  7. Andhrajyothy (11 November 2023). "సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ ఇకలేరు | Chandra mohan is no more avm". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  8. Eenadu (11 November 2023). "Chandramohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.

బయటి లింకులు

మార్చు