వాడుకరి:కాసుబాబు/వికీ డైరీ
26/3/2008 - ఈ పేజీని మొదలు పెట్టడానికి ప్రేరణ - నేను పాల్గొన్న వ్యాసాల జాబితాను చేయమని రంగారావు గారు చేసిన సూచన. అచ్చం అలా కాకున్నా నా వికీ ప్రయాణంలో ముఖ్యమైన మజిలీలు ఇక్కడ వ్రాయాలనుకొంటున్నాను. (వ్యక్తిగతంగా నాకు డైరీ రాసే అలవాటు లేదు.)
నా దిద్దుబాట్ల గణాంకాలు
మార్చు26/3/2008 నాటికి
మార్చుఈ రోజు http://tools.wikimedia.de/~interiot/cgi-bin/count_edits?dbname=tewiki_p&user=కాసుబాబు లింకు ద్వారా నా User edit counter ఇలా చూపించింది.
Username కాసుబాబు -- User groups sysop Total edits 12318 Image uploads 471 (450 cur, 21 old) Distinct pages edited 5937 Edits/page (avg) 2.07 -- Avg edits/day 0.88 -- Deleted edits 124 '''First edit 2006/07/31 13:56:03''' ;Edits by namespace (Main) 8921 -- చర్చ 463 -- సభ్యుడు 157 -- సభ్యులపై చర్చ 814 వికీపీడియా 403 -- వికీపీడియా చర్చ 38 -- బొమ్మ 644 -- బొమ్మపై చర్చ 80 -- మూస 690 -- మూస చర్చ 22 -- వర్గం 81 -- వర్గం చర్చ 5 Delete 438 -- Restore 1 -- Move 260 -- Move_Redirect 1
గమనిక: దిద్దుబాట్ల లెక్కల జాడ్యం ఆరోగ్యానికి మంచిది కాదు.
- Your edit count is not your IQ, value as a human being, or a score in a video game. It does not determine your worth as a Wikimedian. It does not cure cancer or grant you a seat on the secret spaceship that will be traveling to Mars when the Krulls return to destroy the planet in 2012... Don't let it bother you. It's just a number in the database. — Slashdot
29/6/2009 నాటికి
మార్చుTotal edits 24514 Image uploads 847 (821 cur, 26 old) ) Distinct pages edited 10739 - Edits/page (avg) 2.28 Avg edits/day 1.70 - Deleted edits 552 Edits by namespace (Main) 16731 చర్చ 1252 - సభ్యుడు 211 - సభ్యులపై చర్చ 1493 - వికీపీడియా 1697 - వికీపీడియా చర్చ 81 బొమ్మ 1346 - బొమ్మపై చర్చ 269 - మూస 1203 - మూస చర్చ 33 - సహాయము 1 - వర్గం 182 - వర్గం చర్చ 14 Unknown namespace(101) 1 - Delete 1149 - Restore 10 - Move 620 - Move_Redirect 23
9/6/2010 నాటికి
మార్చుTotal edits 27674 Image uploads 1080 (1051 cur, 29 old) Distinct pages edited 12192 Edits/page (avg) 2.27 Deleted edits 615 First edit 2006-07-31 13:56:03 Edits by namespace Articles 18714 - Talk 1440 - User 244 - User talk 1566 - Project 2013 - Project talk 91 - Image 1642 - Image talk 434 - MediaWiki 3 - Template 1278 - Template talk 33 - Help 1 - Category 197 - Category talk 14 - Unknown namespace 100 1 - Unknown namespace 101 3
2006
మార్చుజూలై
మార్చుజూలై 31, 2006న సభ్యునిగా చేరాను. నేను 517వ సభ్యుడిని. ఇంగ్లీషు వికీపీడియా కూడా అంతకు కొద్ది రోజుల ముందే పరిచయం. ఏదో వెతుకులాటలో తెలుగు వికీపీడియా లింకుకు అనుకోకుండా చేరుకొన్నాను. ఇదేదో క్రొత్తగా అనిపించింది. అంతకు ముందు ఒకటి రెండు నెలలుగా కావ్యనందనం వెబ్ సైటునుండి పోతన ఫాంట్ దించుకొని తెలుగులో టైపింగ్ ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రాక్టీసు వికీపీడియాలో కూడా చేయవచ్చుననిపించింది. అప్పటికి తెలుగువికీ ఎడిట్ బాక్స్‌లో నేరుగా తెలుగు టైపు చేసే సదుపాయం లేదు. ఎక్కువ మంది లేఖినిలో తెలుగు టైపు చేసుకొని, దానిని కత్తిరించి తెలుగు వికీలో అతికిస్తున్నారనుకొంటాను. కాని నేను లేఖినిని వాడలేదు. అయితే లేఖిని ఉందని మాత్రం తెలుసు.
- జూలై 2006లో (ఒక్క రోజులో) నేను చేసిన ఘన కార్యాలు
- సభ్యునిగా నమోదు చేసుకొన్నాను. నా సభ్యనామం User:Kajasudhakarababu (తరువాత "కాసుబాబు"గా మార్చుకొన్నాను)
- "వికీపీడియాలో మీ వూరు ఉందా?" అనే లింకు పట్టుకొని వెళ్ళి మా వూరు పెదవేగి గురించి రెండు, మూడు వాక్యాలు వ్రాశాను. పెదవేగి మండలం పేజీలో చూస్తే పెదవేగి లింకు ఎరుపూ కాదు, నీలం కాదు. నల్లగా ఉంది (అదే పేజీ కనుక!). ఏంచెయ్యాలో తెలియక చాలా సతమతమమయ్యాను. "మార్చు" ట్యాబ్ నొక్కాలని చాలా సేపటికి వెలిగింది.
- కారం తినడం కడుపుకి మంచిది కాదా? అన్న 'వ్యాసం'లో ఒక పేరా (ఎప్పుడో టి.వి.లో చూసిన విషయం) వ్రాశాను. అప్పటికి వికీ అంటే ఒక బ్లాగులాంటిదనే అనుకొనేవాడిని. కనుకనే ఇంత గొప్ప వ్యాసం మీద ప్రారంభోత్సవం చేశాను.
అప్పటికి తెలుగు వికీలో సభ్యుల సంఖ్య నాతో కలిపి 517. వ్యాసాల సంఖ్య షుమారు 3300.
ఆగష్టు
మార్చుక్రమంగా వికీ అంటే కొద్ది అవగాహన ఏర్పడసాగింది. అయితే ఒక బలమైన వ్యసనానికి పునాదులు పడుతున్నాయని అనుకోలేదు.
2006 ఆగష్టులో నేను చేసిన ముఖ్యమైన పనులు -
- రామాయణము అనే ముఖ్యమైన వ్యాసం ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఇక విజృంభించుదామని ఒక పేరా వ్రాశాను. అది కూడా "తల్లిదండ్రులకు నమస్కారములు" అని మొదలు పెట్టిన స్వంత పరిచయమే. తరువాత అది "ప్రకటన" గనుక తొలగించాలని చావాకిరణ్ వ్రాశారు. ముఖం మాడ్చుకొని సరే అన్నాను. రామాయణము వ్రాస్తే రామాయణం పేజీ ఖాళీగా ఉన్నది. ఏం చేయాలో తోచక వైజాసత్య చర్చా పేజీలో వ్రాశాను. ఎందుకంటే నన్ను స్వాగతించిన పాపం అతనిదే. అప్పుడు "దారిమార్పు" విధానం గురించి వైజాసత్య వ్రాశాడు. నాకు తెలిసిన విషయం ప్రయోగించుదామని మహాభారతం వ్యాసానికి దారిమార్పు చేశాను.
- శ్రీనాధుడు, విశ్వనాధ సత్యనారాయణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, తిక్కన వంటి పేజీలలో చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాను. మహాత్మా గాంధీ పేజీ ఖాళీగా ఉండడం చూసి చింతించి ఆ వ్యాసం వ్రాయడం క్రమపద్ధతిలో మొదలుపెట్టాను. అలాగే [రామాయణం]] వ్యాసాన్ని కొనసాగించాను. తెలుగు వికీలో నేను ముందుగా వ్రాసిన పెద్ద వ్యాసాలు ఇవి రెండే.
- కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పరవస్తు వెంకట రంగాచార్యులు వ్యాసాలు ఒకమాదిరిగా వ్రాశాను. వారిద్దరిపైనా నాకు ఎంతో అభిమానం.
త్రివిక్రమ్ (అనుకొంటా) మొదలుపెట్టిన సంఖ్యానుగుణ వ్యాసములులో తెలిసినవి జోడించడం మొదలుపెట్టాను.
- ఈ నెలలో నేను కృషి చేసిన మరి కొన్ని - శతక సాహిత్యము, నవదుర్గలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, బాపు, కంచెర్ల గోపన్న
- అప్పటికి వైజాసత్య తెలుగు సినిమాల డేటాబేస్‌ను బాట్ ద్వారా వ్యాసాలుగా సృష్టించాడు. వ్యాసాల పేర్లు తెలుగులో ఉన్నాయి గాని మూసలో సమాచారం ఆంగ్లంలో ఉంది. చదువరి వాటిని తెలుగులోకి అనువదించడం "ఇటీవలి మార్పులు"లో గమనించాను. ఓహో ఇలా చేయాలి కాబోలుననుకొని సినిమాల అనువాదం మొదలుపెట్టాను. ఈ పనికి "వెల సులభము, ఫలమధికము" - దిద్దుబాట్లు సంఖ్య బాగా పెరుగుతుంది. ఒకో పేజీని పూర్తిగా అనువదించడానికి ఒకటి నుండి ఐదు నిముషాల మధ్య పడుతుంది. చాలా పని చేసేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సెప్టెంబరు
మార్చు- సినిమాల అనువాదం కొనసాగించాను. రోజుకు 50 నుండి 150 దాకా పేజీల అనువాదం సాగుతున్నది. ఈ నెలలో చిట్టెళ్ళ కామేశ్వరరావు గారు ఈ పనిలో తోడయ్యారు. ఇద్దరం కలిసి ఎడా పెడా ఈ పని లాగించేశాము. 26వ తారీఖు నాటికి అన్ని పేజీల అనువాదాలూ పూర్తయ్యాయి. చివరిలో రెండు పేజీలను మాత్రం అలా ఉంచేసి కామేశ్వరరావుగారిని ఈ పనికి మంగళం పాడమన్నాను. ఆయన సంతోషించారు. షుమారు రెండు వేల సినిమా పేజీల అనువాదాలు పూర్తి చేసినందుకు మమ్ముల్నిద్దరినీ (చదువరి, వైజాసత్య..) అభినందించారు.
- ఈ నెలలో వ్రాసిన మరికొన్ని ముఖ్యమైన వ్యాసాలు - వినాయకుడు, పెదవేగి (మా వూరు), వినాయక వ్రతకల్ప విధానము (అమరికలు), బాపు, శక్తిపీఠాలు, త్రికోణమితి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, త్రిమతాలు, పరశురాముడు, రామాయణం, మహాత్మా గాంధీ, ముత్యాల ముగ్గు, లవకుశ, రామదాసు, తెలుగు
- ఫైలు:Bapubomma.jpg - ఇది నేను అప్‌లోడ్ చేసిన మొదటి బొమ్మ
- క్రొత్త సభ్యులకు స్వాగతం చెప్పడం మొదలుపెట్టాను.
అక్టోబరు
మార్చు- కొన్ని మండలాల పేజీలలో వూళ్ళ పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని అనువదించడం మొదలుపెట్టాను.
- భారతదేశం రాష్ట్రాలు పేజీలు ఎక్కువగా ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని అనువదించడం మొదలుపెట్టాను. ఉత్సాహంగా మొదలుపెట్టాను కాని ఇది చాలా పెద్దపని అయ్యింది - బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, త్రిపుర, రాజస్థాన్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, పంజాబ్
- ఈ నెలలో వ్రాసిన ముఖ్యమైన కొన్ని వ్యాసాలు - తెలుగు, నిజ ఏసుక్రీస్తు మండలి, అన్నమయ్య, ఒమన్ (నేను ఉంటున్న దేశం), విశ్వనాథ సత్యనారాయణ,
నవంబర్
మార్చు- భారతదేశం రాష్ట్రాలు పేజీలు అనువాదం కొనసాగింపు- బీహార్, ఒరిస్సా, పుదుచ్చేరి, దాద్రా నగరు హవేలి, దమన్ దియు, అసోం, భారతదేశ జిల్లాల జాబితా, మేఘాలయ
- ఈ నెలలో వ్రాసిన ముఖ్యమైన కొన్ని వ్యాసాలు - మస్కట్, నిజ ఏసుక్రీస్తు మండలి, ఒమన్
డిసెంబరు
మార్చుఈ నెలలో వ్రాసిన, అనువదించిన కొన్ని ముఖ్య వ్యాసాలు:
- బీహార్, గోవా, గంగానది, గుజరాత్, భారతదేశ చరిత్ర, జమ్మూ కాష్మీరు, మన్వంతరము, జార్ఖండ్, చతుర్వేదాలు, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర
- ఈ నెలలో వ్యాసాల సంఖ్య 25 వేలకు చేరుకొంది. అయితే దీనికి ప్రధాన కారణం బాట్ల ద్వారా వైజాసత్య గ్రామాలకు ప్రత్యేక పేజీలు చేయడమే. అంతకుముందు "పదివేల పండుగ" అని చదువరి ఒక మైలురాయిని గురించి ప్రస్తావించారు. కాని బాట్ల కారణంగా ఒక్కసారిగా వ్యాసాల సంఖ్య 25 వేలకు దూకింది. ఈ వ్యాసాలను విస్తరించడం మరియు వాటి నాణ్యత పెంచడం అనేది ఇప్పటికీ (2009 జూన్ నాటికి) తెలుగు వికీ శ్రామికులకు ఒక సవాలుగా ఉంది.
- గ్రామాల అనువాదం కొనసాగింది. చాలా గ్రామాలకు అయోమయ నివృత్తి పేజీలు చేశాను.
2007
మార్చుజనవరి
మార్చు- రాష్ట్రాల పేజీలు అనువాదం కొనసాగుతున్నది. దశావతారాలలో కొన్ని వ్యాసాలను విస్తరిస్తున్నాను.
- ఈ నెలలో వ్రాసిన, అనువదించిన ముఖ్యమైన వ్యాసాలు - మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరాఖండ్, నరసింహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, గంగానది, భగవద్గీత
- గ్రామాల అయోమయ నివృత్తి పేజీల పని కొనసాగుతున్నది.
- లింకుల సవరణ ద్వారా అనేక సినిమా పేజీలను అనాధ పేజీలనుండి తొలగించాను.
- సంఖ్యానుగుణ వ్యాసాలు కొన్ని కొద్దికొద్దిగా విస్తరించాను.
ఫిబ్రవరి
మార్చుజాతీయములు, గ్రామాల అయోమయ నివృత్తి, సినిమాల విస్తరణ - కొనసాగినవి
మార్చి
మార్చు- గ్రామాల అయోమయ నివృత్తి, సినిమాల విస్తరణ - కొనసాగినవి
- విష్ణు సహస్రనామ స్తోత్రము, తెలుగు సినిమా చరిత్ర - ఈ నెలలో వ్రాసిన ముఖ్య వ్యాసాలు
ఏప్రిల్
మార్చు- గ్రామాల అయోమయ నివృత్తి, సినిమాల విస్తరణ, వర్గీకరణ - కొనసాగినవి
- తెలుగు సినిమా చరిత్ర, తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా, విష్ణువు వేయి నామములు-1-100, విష్ణువు వేయి నామములు-101-200, తిరుపతి వేంకట కవులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం - ఈ నెలలో వ్రాసిన ముఖ్య వ్యాసాలు
- వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ప్రాజెక్టు మీద మరింత శ్రద్ధ పెట్టాను. ప్రచార నిమిత్తం వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు 1 అనే వ్యాసం వ్రాశాను. కాని ఇది పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఇప్పటికీ గ్రామాల విషయంలో వికీ ప్రగతి చాలా మందంగా ఉన్నదని నా అభిప్రాయం.
- పుస్తకాల ప్రాజెక్టు మీద కొంత కృషి మొదలు పెట్టాను.
మే
మార్చు- ముఖ్య వ్యాసాలు - విష్ణువు వేయి నామములు-201-300
- ఆంగ్ల వికీనుండి దేశాల జాబితాలు తెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టాను. మూస:Country showdata మరియు దానికి సంబంధించిన మూసలపై ప్రయోగాలు చేశాను. తరువాత వందలకొద్దీ మూసలు ఆంగ్లవికీనుండి తెలుగులోకి తీసుకొచ్చాను. దేశాల జాబితా, ప్రపంచ దేశాల జాబితాలు చాలావరకు తయారు చేశాను. ఈ పనిలో భాగంగా దేశాల జాబితా - డేటా ఫైలు కూడా తయారయ్యింది.
- సినిమాల వ్యాసాలు మామూలే. సినిమా వ్యాసాలు వ్రాయడం, దిద్దడంలో నేను గమనించిందేమంటే ఈ పని చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. స్ట్రెస్ ఉండదు.
జూన్
మార్చు- ముఖ్య వ్యాసాలు - ఖోరాన్, గోను తుఫాను, కుంభకర్ణుడు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
జూలై
మార్చు- ముఖ్య వ్యాసాలు - రాజా రవివర్మ, అవధానం (మానసిక ప్రవృత్తి) (ఈ వ్యాసాన్ని ప్రయోగాత్మకంగా "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము"నుండి తిరగ వ్రాశాను)
- జూన్ నుండి "ఈ వారం వ్యాసం" క్రమంగా రావడం మొదలయ్యింది. ఈ శీర్షిక నిర్వహణలో అధికంగా పాల్గొనడం మొదలు పెట్టాను. వైజా సత్య చేసిన పట్టిక నుండి వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 - 2009 పేజీని మరింత విస్తారంగా వివరంగా తయారు చేశాను.
- ప్రపంచ దేశాల జాబితాలు మరియు సంబంధిత పేజీలపై కృషి కొనసాగింది.
ఆగష్టు
మార్చు- వివిధ ప్రపంచ దేశాల జాబితాలు మరియు సంబంధిత పేజీలపై కృషి కొనసాగింది. అనేక వందల Countrydata మూసలను ఆంగ్లంనుండి కాపీ చేశాను.
- ఇతర ముఖ్య వ్యాసాలు - తెలుగు సాహితీకారుల జాబితాలు, సుమతీ శతకము, మేఘ సందేశం (సంస్కృతం), చైనా (అనువాదం)
- తెలుగు సినిమాలు అకారాది అమరిక, వర్గీకరణ, విస్తరణ, సవరణలు
సెప్టెంబరు
మార్చు- వివిధ ప్రపంచ దేశాల జాబితాలు మరియు సంబంధిత పేజీలపై కృషి కొనసాగింది.
- ఇతర ముఖ్య వ్యాసాలు - పశ్చిమ గోదావరి, ఆళ్వారులు , ముదలాళ్వారులు,
- తెలుగు సినిమాలు అకారాది అమరిక, వర్గీకరణ, విస్తరణ, సవరణలు
అక్టోబరు
మార్చు- సెప్టెంబరు నెలలో సెలవుకు వెళ్ళాను. సెలవుల్లో మా వూరు చుట్టుప్రక్కల మండలాల్లో ఆటోమీద వెళుతూ ఒకోవూరు ఫొటోలు తీశాను. ఏలూరు, పెదవేగి, నూజివీడు, ద్వారకాతిరుమల ప్రాంతాలు. అందరూ నాకు పిచ్చిపట్టిందని విసుక్కునేవారు. ఆటో డ్రైవర్లు మాత్రం చాలా సహకరించారు. ఆ ఫొటోలను అప్‌లోడ్ చేశాను. షుమారు 200 ఫొటోలు ఉండవచ్చును. వీటిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఫొటోలు - పెదవేగి, ద్వారకా తిరుమల, రంగాపురం, ఏలూరు, గుంటుపల్లి (కామవరపుకోట), గద్దేవారిగూడెం.
- ఇంకా నేను గుర్తుంచుకొనే కొన్ని బొమ్మలు - దస్త్రం:Banyan Tree Growth.jpg, దస్త్రం:APvillage Gaddevarigudem 1.JPG, దస్త్రం:Guntupalli Buddist site 6.JPG, దస్త్రం:APvillage Sanivarappeta 1.JPG
- ముఖ్య వ్యాసాలు - గుంటుపల్లి (కామవరపుకోట), హిందూమతము (రవిచంద్ర సహకారంతో)
నవంబర్
మార్చు- వివిధ దేశాల జాబితాల పని కొనసాగింది
- ముఖ్య వ్యాసాలు - అబ్ఖజియా, ఆఫ్ఘనిస్తాన్
- నవంబర్లో మళ్ళీ సెలవులకు వెళ్ళాను. ఇప్పుడు ఫొటోల ప్రస్థానం కొనసాగించాను. ముఖ్యంగా హైదరాబాదులోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మ్యూజియంలో అనేక ఫొటోలు తీశాను. మ్యూజియంలో ఉద్యోగులు చాలా సహకరించారు. వూళ్ళల్లో కూడా మరిన్ని ఫొటోలు తీశాను. ఇవన్నీ తరువాత అప్‌లోడ్ చేశాను.
డిసెంబరు
మార్చు- ముఖ్య వ్యాసాలు - జనాభా, ఆఫ్ఘనిస్తాన్, మల్లంపల్లి సోమశేఖరశర్మ, సత్య సాయి బాబా, గుంటుపల్లి (కామవరపుకోట), శ్రీకాకుళం, ఆక్రొతిరి మరియు ఢెకెలియా, గ్రామం, మహాసముద్రం, షిర్డీ సాయిబాబా, మస్కట్, లక్ష్మి
- క్రొత్తలో రామాయణం వ్యాసాన్ని వ్రాశాను. ఇప్పుడు ఒక్కోకాండాన్ని ఒక్కో వ్యాసంగా వ్రాయాలని అనుకొన్నాను. ఈ నెలలో బాలకాండ, అయోధ్యకాండ వ్రాశాను.
2008
మార్చుజనవరి
మార్చుఫిబ్రవరి
మార్చు- ఎక్కువగా గ్రామాల పేజీలమీద పని చేశాను. ఇంతకు ముందు తీసిన అనేక బొమ్మలు అప్‌లోడ్ చేశాను.
- ముఖ్య వ్యాసాలు - ఆర్ధికశాస్త్రము, నరసాపురం, కిష్కింధకాండము
- వికీపీడియా:WikiProject/పుస్తకాలు పుస్తకాల ప్రాజెక్టుపై కొంత కృషి చేశాను. ఈ ప్రాజెక్టులోని పనులను క్రోడీకరించాను. కొన్ని జాబితాఉ తయారు చేశాను.
- ప్రదీప్ నడిపిన బాట్ వల్ల అనేక బొమ్మలు కాపీహక్కులు సరిగా లేనందున తొలగించవలసినవిగా పేరుకు పోయాయి. చాలా బొమ్మలకు సరైన కాపీ హక్కుల ట్యాగ్‌లను తగిలించాను. కొన్నింటిని తొలగించాను.
మార్చి
మార్చు- వికీపీడియా:WikiProject/పుస్తకాలు పై మరింత కృషి చేశాను. మరికొన్ని జాబితాలను, మూసలను సవరించాను.
- ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తయారు చేశాను. ఇందులో పుస్తకాలన్నింటికీ వ్యాసాలుండాలని నా ఆశయం.
- సెలవులలో తీసిన మరికొన్ని ఫొటోలను అప్‌లోడ్ చేశాను.
- తెలుగువారి ఇంటిపేర్లు కలగాపులగంగా ఉన్నాయి. వాటిని అకారాదిక్రమంలో తెలుగునాట ఇంటిపేర్ల జాబితా అనే వ్యాసంగా అమర్చాను. ఈ పేజీకి సందర్శకులు ఎక్కువగా ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
- గ్రామాలు, సినిమాల వ్యాసాలమీద కూడా కొంత పని జరిగింది.
- వికీ డైరీ (ప్రస్తుతం మీరు చదువుతున్నది) మొదలుపెట్టాను. కాని క్రమంగా వ్రాయడం లేదు. అప్పుడప్పుడూ.
- కాపీహక్కుల ట్యాగ్‌ల పరిష్కరణ పని కొనసాగింది.
- వేంగి - ఇది తూర్పు చాళుక్యుల రాజ్యం. మావూరైన పెదవేగికి పూర్వనామం. వేంగి వ్యాసాన్ని దాదాపు పూర్తిగా స్వంతంగా, అనగా వివిధ మూలాలు పరిశోధించి, వ్రాశాను. - నాకు చాలా ఇష్షమైన నా వ్యాసాలలో ఇది ఒకటి.
ఏప్రిల్
మార్చుముఖ్యమైన పనులు
- కుషాణులు - అనువాదం
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర- వ్యాసాల పునర్విభజన, మరియు దానికి సంబంధించిన మూసలు - ఈ పనికి వాడుకరి:Kumarrao గారు స్ఫూర్తి. ఆయనే అధిక భాగం వ్రాశారు.
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ - ఇది కూడా నేను స్వతంత్రంగా వివిధ పుస్తకాలు రిఫర్ చేసి చేసిన రచన
- నెల్సన్ మండేలా అనువాదం - రవిచంద్ర సహకారంతో
- కట్టమంచి రామలింగారెడ్డి
మే
మార్చు- వేయి పడగలు
- {{ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర}}
- అమరావతి స్తూపం - కుమారరావుగారి రచనకు విస్తరణ
- సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, బిక్కవోలు
- నియమాలకు సంబంధించిన కొన్ని వ్యాసాల అనువాదం
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, కాపీహక్కుల ట్యాగ్ సవరణలు
జూన్
మార్చు- గొల్లప్రోలు, గన్నవరం, కోరుట్ల
- ఆనంద్ (సినిమా), హ్యాపీ డేస్
- తరిగొండ వెంకమాంబ, మహాభాగవతం
- బౌద్ధ మతము అనువాదం, ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
జూలై
మార్చు- కాకతీయులు
- జపాన్ అనువాదం
- మహాభాగవతం, బౌద్ధ మతము అనువాదం, ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు, అమరావతి స్తూపం
- సుందరకాండ - నాకు బాగా ఇష్టమైన వ్యాసాలలో ఇది ఒకటి
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కు సంబంధించిన వ్యాసాలు, చేజెర్ల (నకిరికల్లు)
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, పాలిసీ పేజీల అనువాదం
ఆగష్టు
మార్చు- కాశీ అనువాదం
- యుద్ధం, మొసలి, ఒయాసిస్సు అనువాదం
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
- అన్నమయ్య
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
సెప్టెంబరు
మార్చు- బెర్ముడా ట్రయాంగిల్
- అల్లూరి సీతారామరాజు , కందుకూరి వీరేశలింగం పంతులు , సుభాష్ చంద్రబోస్
- కురుక్షేత్ర సంగ్రామం, యుద్ధకాండ, భగవద్గీత
- యమదొంగ
- తెలుగు సాహిత్యం - పునర్విభజన
- తెలుగు సాహిత్యం యుగ విభజన, ఒక్కో యుగానికీ మూసలు
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
అక్టోబరు
మార్చు- చింపాంజీ, బంగాళదుంప, సింధు లోయ నాగరికత
- ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా, గంగదేవిపల్లి , ద్వారకా తిరుమల
- మూస:తిరుమల తిరుపతి మరియు సంబంధిత వ్యాసాలు, అలమేలు మంగ
- యుద్ధకాండ, లక్ష్మి
- తెలుగు సాహితీకారుల జాబితాలు, వేములవాడ భీమకవి
- తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము - ఇది కూడా నాకిష్టమైన వ్యాసాలలో ఒకటి
- తెలుగు సాహిత్యం యుగ విభజన, ఒక్కో యుగానికీ మూసలు
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, చిట్కాలు
నవంబర్
మార్చు- శ్రీకాళహస్తి, చివరకు మిగిలేది, ఏనుగుల వీరాస్వామయ్య, ముళ్ళపూడి వెంకటరమణ, బుడుగు
- ఉప్మాక అగ్రహారం, గంగదేవిపల్లి , ద్వారకా తిరుమల
- వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు మరియు వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు - ఈ రండు వ్యాసాలలోను ప్రధాన కృషి అహమ్మద్ నిస్సార్ గారిది.
- హాస్యము
- రసాయన మూలకాలకు సంబంధించిన కొన్ని వ్యాసాలు
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
డిసెంబరు
మార్చు- స్వారోచిష మను సంభవము, సుగ్రీవుడు, సత్యభామ, సామవేదము, సామెతలు, శ్రీ మదాంధ్ర మహాభారతం, కల్పము, తెలుగు సాహిత్యం - శివకవి యుగము
- సౌందర్య లహరి, కనకధారా స్తోత్రం - నాకు ఇష్టమైన మరి రెండు వ్యాసాలు
- రసాయన మూలకాలకు సంబంధించిన కొన్ని వ్యాసాలు
- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు, మొలకల తగ్గింపు
2009
మార్చుజనవరి
మార్చు- కనకధారా స్తోత్రం, సౌందర్య లహరి
- సాక్షి వ్యాసాలు, కాశీయాత్ర చరిత్ర
- సెలవుల్లో ఒక డి.వి.డి. షాపులో తీసిన అనేక సినిమా బొమ్మల ఎక్కింపు
- సాధారణ నిర్వహణ
ఫిబ్రవరి
మార్చు- షోడశి - రామాయణ రహస్యములు, సుందర కాండ
- రామాయణ కల్పవృక్షం
- తెలుగు సాహిత్యానికి సంబంధించిన కొన్ని వ్యాసాలు
మార్చి
మార్చుఏప్రిల్
మార్చు- భగవద్గీత, నాలాయిర దివ్యప్రబంధము
- సెలవుల్లో తీసిన మరికొన్ని వూళ్ళ, సినిమాల బొమ్మలు ఎక్కింపు
- రూపవాణి ఆర్చివ్స్ నుండి కొన్ని సినిమా బొమ్మలు ఎక్కింపు
- flickr నుండి కొన్ని బొమ్మల ఎక్కింపు
- కొల్లూరి భాస్కరరావు గారి బ్లాగు నుండి ఆయన అనుమతితో పాటపాటలను ఆయా సినిమా పేజీలలోకి కాపీ చేశాను. ఆయన సహకారానికి కృతజ్ఞతలు. ఈ మార్పులు నా పేరు మీద ఉండవచ్చును గాని శ్రమంతా ఆయనదే.
మే
మార్చు- కొల్లూరి భాస్కరరావు గారి బ్లాగు నుండి ఆయన అనుమతితో పాతపాటలను ఆయా సినిమా పేజీలలోకి కాపీ - కొనసాగింపు - ఆయన ఈ పనిలో అనేక మంచి సూచనలు, సవరణలు ఇచ్చారు
- జాతీయములు విభజన. ఈ వ్యాసాలలో కృషి అధికంగా రహమతుల్లా గారిదే.
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
- http://www.telugudukanam.co.in వెబ్ సైటు నుండి అనేక సినిమా ముఖచిత్రాల కాపీ
జూన్
మార్చు- కొల్లూరి భాస్కరరావు గారి బ్లాగు నుండి ఆయన అనుమతితో పాతపాటలను ఆయా సినిమా పేజీలలోకి కాపీ - కొనసాగింపు
- http://www.telugudukanam.co.in వెబ్ సైటు నుండి అనేక సినిమా ముఖచిత్రాల కాపీ
- లలితా సహస్రనామ స్తోత్రం
- భారతదేశం జాబితాలు, భారతదేశం తాలూకాలు
- ఈ వికీ డైరీ మరికొంత
జూలై
మార్చు- మాగంటి బాపినీడు, మాగంటి అన్నపూర్ణాదేవి
- బ్రహ్మ పురాణము
- భారతదేశం తాలూకాలు
- విష్ణువు, గరుత్మంతుడు, రామానుజాచార్యుడు, విశిష్టాద్వైతం
- సెలవులలో పాత పత్రికలలో అనేక సినిమా ప్రకటనలు స్కాన్ చేసి వాటిని ఎక్కించాను.
- సెలవులలో తీసిన మరికొన్ని వూళ్ళ బొమ్మలు ఎక్కించాను.
ఆగష్టు
మార్చు- సెలవులలో తీసిన వూళ్ళ ఫొటోలు ఎక్కింపు
- గ్రామాల అయోమయ నివృత్తి పేజీలు
- కొల్లూరి భాస్కరరావుగారి బ్లాగునుండి పాత పాటల కాపీ కొనసాగింపు
- వినాయకుడు
- సప్త ద్వీపాలు
- బ్రహ్మాండ పురాణము, బ్రహ్మాస్త్రము
సెప్టెంబరు
మార్చుఅక్టోబరు
మార్చు- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
నవంబర్
మార్చు- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
డిసెంబరు
మార్చు- సాధారణ నిర్వహణా కార్యక్రమాలు
2010
మార్చుజనవరి
మార్చు- కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు
ఫిబ్రవరి
మార్చు- కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు
మార్చి
మార్చు- కొద్దిపాటి నిర్వహణా కార్యక్రమాలు
ఏప్రిల్
మార్చు- ఏమీ చేయలేదు
మే
మార్చు- ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం
జూన్
మార్చు- వికీ డైరీ
- కొద్ది నెలలుగా ఇతర వ్యాపకాల కారణంగా వికీలో పని దాదాపు శూన్యంగా ఉంది. మరల పని ఆరంభిస్తున్నాను.
జూలై
మార్చు- ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం
ఆగష్టు
మార్చు- ఈ వారం బొమ్మ, వ్యాసం మాత్రం
సెప్టెంబరు
మార్చుఈ నెలలో మళ్ళీ వికీకి కాస్తంత ఎక్కువ సమయం కేటాయించ గలుగుతున్నాను. చిన్న చిన్న దిద్దుబాట్లు చేస్తున్నాను. అక్టోబరు, నవంబర్ నెలల్లో నేను సెలవు, ప్రయాణాలలో ఉంటాను కనుక ఈ సంవత్సరం చివరి వరకు ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం శీర్షికలను పూర్తి చేశాను.