సంఖ్యానుగుణ వ్యాసములు

(త్రివిధ శబ్దశక్తులు నుండి దారిమార్పు చెందింది)

totocto0l

సంఖ్యలు - వాటి ప్రత్యేకతలు
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40
41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60
61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80
81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100
ఇవి కూడా చూడండిఇతర లింకులు
  • ఏకదంతుడు - వినాయకుడు
  • ఏక పత్నీవ్రతుడు - శ్రీ రాముడు
  • ఏకాహము - 24 గంటలు పాటు చేసే భజన కార్యక్రమం
  • ఏకోనారాయణ - నారాయణుడు ఒక్కడే
  • ఏకాశం - జగతికి ఆకాశం ఒక్కటే - తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ
  • ఏకాక్షి - హిందూ పురాణాలలో శుక్రుడు ఏకాక్షి.
  • త్రిషవనం - ప్రాతస్సవనం, మధ్యందివాసవనం, సాయంసవనం
  • త్రి మూర్తులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (హరి, హర, బ్రహ్మ)
  • త్రి గుణములు - సత్వ, రజో, తమో
  • త్రివిధ గుణములు - దేవ, మనుష్య, రాక్షస
  • త్రి భువనాలు - భూలోకము, భువర్లోకము, సువర్లోకము
  • త్రి కరణములు - మనస్సు, వాక్కు, శరీరం (పని)
  • త్రి గంధములు - ఏలకులు, జాపత్రి, దాల్చిన చెక్క
  • త్రికాలములు - వేసవి, వర్ష, శీతల
  • త్రివిధ కాలములు - భూత, భవిష్యత్, వర్తమాన
  • త్రి లోకాలు - ముల్లోకాలు - స్వర్గ (దేవ), మర్త్య (మానవ), పాతాళ
  • త్రి మతములు - ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము
  • త్రివిధ మార్గములు - జ్ఞాన, కర్మ, ఉపాసన
  • త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
  • త్రిఫల - ఉసిరి, కరక్కాయ, తానికాయ (జాజికాయ)
  • త్రిదోషములు - వాత, పిత్త, కఫ
  • త్రి సంధ్యలు -ప్రాతః, మాధ్యాహ్నిక, సాయం సంధ్యలు
  • త్రికరణాలు : మనసు, మాట, చేత ( = చేసే పని). వీటినే మనోవాక్కాయకర్మలు అంటారు. (మనస్సు, వాక్కు, కర్మ). దేన్నయినా త్రికరణశుద్ధిగా పాటించడమంటే దాన్ని మనసా, వాచా, కర్మేణ పాటించడమన్నమాట.
  • త్రివర్ణములు :1.బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3.వైశ్యులు (అగ్రకులాలు)
  • త్రిలింగములు :1.తారకలింగము (ఆకాశమున)2.మహాలింగము (భూలోకమున)3.హటకేశ్వరలింగము (పాతాళలోకమున)
    1.శ్రీశైలము, 2. ద్రాక్షారామము, 3.కాళేశ్వరము
  • త్రిమదములు : 1.విద్యామదము, 2.ధనమదము, 3.కులమదము
  • త్రిపురుషులు : 1.పితృ, 2. పితామహ, 3. ప్రపితామహ
  • త్రిపత్రికములు : 1.తులసి, 2.మారేడు,3.కుందము
  • త్రినేత్రములు : 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3. అగ్ని (ఈశ్వరునివి)
  • త్రినాడులు : 1.ఇడ, 2. పింగళ, 3. సుషుమ్న
  • త్రిజ్యేష్టములు : (వివాహమునకు)1, గ్బొలిచూలి వరుడు. 2. తొలి కన్యక, 3. జ్యేష్ట మాసము.
  • త్రికవులు : 1.నన్నయ, 2. తిక్కన, 3. ఎఱ్ఱాప్రగడ= కవిత్రయము
  • త్రికంటకములు : 1.శొంఠి, 2. తిప్పతీగ, 3.దూలగొండి
  • త్రికంటక ద్రవ్యములు : 1. వాకుడు. 2. దూలగొండి. 3. పల్లేరు.
  • త్రివిధ కాంక్షలు : 1. కాంత, 2 .కనక, 3.కీర్తి
  • త్రికరణములు : 1.మనస్సు, 2.వాక్కు, 3.పని
  • త్రిలోకములు : 1.స్వర్గలోకము, 2.మర్త్యలోకము, 3.నరకలోకము
  • త్రివేణీసంగమ నదులు : యమున, గంగా, సరస్వతి నదులు
  • త్రివిధాగ్నులు :1.కామాగ్న. (కోరిక) 2.క్రోదాగ్ని, (కోపము) 3.క్షుద్రాగ్ని (ఆకలి)
  • త్రివిధాక్షీణులు :1. కంచి కామాక్షి. 2. మధుర మీనాక్షి. 3. కాశీ విశాలాక్షి
  • త్రివిధ సుగంధ ద్రవ్యములు :1.చందనము. 2. కురువేరు. 3.నాగకేసరి.
  • త్రివిధ సుందర పురములు : 1.బ్రహ్మపురము 2.విష్ణుపురము. 3. శివపురము
  • త్రివిధ శాంతములు : (శాంతత్రయము) 1. సత్యము. 2. శాంతము. 3. మౌనము.
  • త్రివిధ శరీరాంగములు : 1.దేహము. 2. ఇంద్రియాలు. 3. ప్రాణము
  • త్రివిధ వేదకాండలు :1.ఉపాసనాకాండ, 2.కర్మకాండ, 3.జ్జానకాండ.
  • త్రివిధ వృద్ధులు : 1.జ్ఞావృద్ధులు. 2. తపోవృద్ధులు. 3. వయోవృద్ధులు.
  • త్రివిధ మార్గములు : మూడు మార్గాలు: 1జ్ఞానమార్గము, 2. కర్మమార్గము, 3. ఉపాసనా మార్గము
  • త్రివిధ మండలంలు : సూర్య మండలం, చంద్రమండలం, అగ్ని మండలం
  • త్రివిధ గుణదేవతలు : 1.సాత్వికము.. వసువు. 2. రాజసము. రుద్రుడు. 3. తామసము. ఆదిత్యుడు.
  • త్రివిధ కళలు : (అభినయ) 1. గానము, 2. వాద్యము 3. నర్తనము
  • త్రివిధ కల్పములు : 1.బ్రహ్మ కల్పము. 2. వరాహ కల్పము. 3. పద్మ కల్పము
  • త్రివిధ శబ్దశక్తులు : 1.అభిధ 2.లక్షణ 3.వ్యంజన
  • త్రివిధ ఋషులు : త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
  • త్రిశక్తి దేవతలు : 1.లక్ష్మీ 2. పార్వతి. 3. సరస్వతి.
  • త్రిపిటకములు : (భౌద్ధ మత సంబంధమైనవి) అవి. 1.సుత్త పిటకము, 2. వినయ పిటకము, 3. అభిధమ్మ పిటకము (బౌద్ధం)
  • త్రిక్షారములు : మూడువిధాలైన క్షారములు 1,సజ్జాక్షారము, 2. యవాక్షారము, 3. వెలిగారము
  • ధనగతి త్రయము : 1.దానము. 2. భోగము. 3.నాశము.
    సంపాదించిన ధనాన్ని ఉపయోగించాలి అనగా అనుబవించాలి.
    లేదా దానం చేయాలి. ఈ రెండు చేయకుంటే అది నాశనమౌతుందని దీని అర్థము.
  • శక్తిత్రయము : 1.ప్రభుశక్తి, 2. ఉత్సాహశక్తి, 3. మంత్రశక్తి
  • తాపత్రయములు : మూడువిధాలైన తాపములు (అవి. ఆధ్యాత్మికము, 2.ఆధిభౌతికము, 3.ఆధిదైవికము)
  • అంబాత్రయము : 1.మూకాంబిక, 2. జ్ఞానాంబ, 3.బ్రమరాంబ.
  • పాకత్రయము : మూడువిధములైన కావ్య శైలి పాకములు. అవి. 1.ద్రాక్షాపాకము. 2. కదలీ పాకము. 3. నారికేళ పాకము
  • కావ్యరీతిత్రయము : 1.వైదర్భి. 2. గౌడి. 3. పాంచాలి.
  • నాయికాత్రయము : 1.స్వీయ, 2.పరకీయ, 3.సామాన్య
  • త్రివిధ నాయికలు : 1.ముగ్ద: ఉదయించుచున్న యౌవనము లజ్జ గల స్త్రీ. 2. మద్య, సగము లజ్జ వీడిన స్త్రీ., 3. ప్రౌడ. సిగ్గు విడిచిన సంపూర్ణస్త్రీ.
  • త్రిమతములు : 1. ద్వైతము, 2. అద్వైతము, 3.విశిష్టాద్వైతము
  • క్రియాత్రయము : 1.మణి, 2.మంత్రము, 3. ఔషదము
  • అవస్థాత్రయము : 1.జాగ్రదవస్థ, 2.స్వప్నావస్థ, 3.సుషుస్త్వవస్థ
  • త్రివిధనాయికలు : ముగ్ధ = యౌవనారంభదసలో ఉన్న పడుచు; సిగ్గు వీడని కన్నె, మధ్య = లజ్జ సగం విడిచిన యువతి, ప్రౌఢ = లజ్జ పూర్తిగా విడిచి గడితేరిన పూర్ణ యౌవనవతి.
  • త్రిదండాలు: త్రిదండాలు అనగా మూడు కర్రలు చేర్చి కట్టి సన్యాసులు ధరించే దండం. అవి మనోదండం, వాగ్దండం, కర్మదండం
  • త్రిమతాచార్యులు : ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు
  • ఈషణత్రయం లేదా ఏషణత్రయం:: విత్తేషణ = ధనం కావాలనే కోరిక, త్రేషణ = పుత్రులు కలగాలనే కోరిక, రేషణ = భార్య దొరకాలనే కోరిక (అంటే పెళ్ళి కావాలనే కోరిక)
 
మహాభారతంలో పాండవులు ద్రౌపతిదేవిని పందెము పెట్టి కౌరవులతో ఆడుతున్న జూదము
 
కర్ణాటకలోని హళిబీడులో ఉన్న చతుర్ముఖుడు (బ్రహ్మ) శిల్పం
  • చతుర్విధ కావ్య నాయకులు: 1.ధీరోదాతతుడు: ధైర్యం వంటి ఉదాత్త గుణములు గల వాడు. 2. ధీరోద్దతుడు. గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు. 3. ధీరశాంతుడు. అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు. 4. ధీరలలితుడు: అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవనాభిలాషి.
  • చతుర్విధపురుషార్థములు: 1.బ్రహ్మచర్యము, 2.గార్హ్యస్థము, 3.వానప్రస్థము, 4.సన్యాసము
  • చాతుర్మాసములు: 1. ఆషాఢము. 2. శ్రావణము. 3. బాధ్రపదము. 4. ఆశ్వయుజము.
  • చతుర్విధ ఆయుదములు: శ్రీమహావిష్ణువి: 1.శంఖము. 2.గద, 3. చక్రము. 4. పద్మము
  • చతుర్విధ సభలు: 1.బ్రహ్మసభ. 2. ఇంద్ర సభ. 3. రుద్ర సభ. 4. విష్ణుసభ.
  • చతుర్విధ ఆలింగనములు : 1. స్పష్టకము, 2. విద్ధకము, 3. ఉద్ఘృష్టకము, 4. పీడితకము. [వాత్స్యాయనకామసూత్రములు2-2-6]
  • మన్మథుని పంచబాణాలు :
    1. అరవిందం = తామర పువ్వు
    2. అశోకం = అశోకవృక్షం పువ్వు
    3. చూతం = మామిడి పువ్వు
    4. నవమల్లిక = అప్పుడే విరిసిన మల్లె పువ్వు
    5. నీలోత్పలం = నల్ల కలువ
  • పంచ-ఉపవిఘ్నములు : (యోగమునకు కలుగు ఉపవిఘ్నములు) 1. దుఃఖము, 2. దౌర్మనస్యము, 3. అంగమేజయత్వము, 4. శ్వాసము, 5. ప్రశ్వాసము. "దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేపసహభువః" [పాతంజలయోగసూత్రములు 1-31]
  • పంచ లోహాలు - వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
  • పంచ జ్ఞానేంద్రియాలు - శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)
  • పంచ కర్మేంద్రియాలు - వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
  • పంచ కర్మలు: తర్కశాస్త్రంలో: ఉక్షేపణం, అవక్షేపణం, అకుంచనం, ప్రసారణం, గమనం ; వైద్యశాస్త్రంలో: వమనం, రేచనం, నస్యం, అనునాసనం, నిరూహం
  • పంచ విషయాలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
  • పంచ ప్రాణాలు - ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము
  • పంచ పాండవులు - ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు
  • పంచ భూతాలు - భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని
  • పంచ లింగాలు - పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం
  • పంచమహాపాతకములు: 1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య
  • పంచమత గ్రంధములు: 1.భగవద్గీత, 2. ధర్మపదము, 3. బైబులు, 4. ఖురానీషరీఫ్, 5. దివ్వగ్రంధము.
  • పంచభక్తులు: 1.పితృభక్తి, 2. రాజభక్తి, 3. గురుభక్తి, 4. దేశభక్తి, 5. దైవభక్తి.
  • పంచ పర్వముల కర్మలు: 1.కృష్ణాష్టమి. స్నానము. 2. కృష్ణ చతుర్ధశి. దానము. 3. అమావాస్య. తర్పణము. 4. పౌర్ణము. దేవతారాధన. 5. సంక్రాంతి. దేవోత్సవములు (పితృ కార్యములు.)
  • పంచ పత్రములు: 1.తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ
  • పంచ పతివ్రతలు: 1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.
  • పంచనియమములు: 1.శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయము, 5. ఈశ్వరప్రణిధానము.
  • పంచధాతువులు:1.బంగారము, 2. వెండి, 3. రాగి, 4. కంచు, 5. ఇనుము
  • పంచ ధర్మములు: 1.జాతి ధర్మము. 2. ఆశ్రమ ధర్మము. 3. మత ధర్మము. 4. దేశ ధర్మము. 5. గుణ ధర్మము.
  • పంచదేవతలు: 1.మహాదేవతలు, 2. కర్మదేవతలు, 3. ఆజానజ దేవతలు, 4. పితృదేవతలు. 5. గందర్వలు.
  • పంచ జయతిధులు: 1.శుద్ధ ఏకాదశి. 2. ద్వాదశి. 3. త్రయోదశి. 4. చతుర్ధశి. 5. పౌర్ణము.
  • పంచగవ్యములు: 1.గోమూత్రము, (ఆవు పంచితము), 2. గోమయము (ఆవు పేడ) 3, గీక్షీరము (ఆవు పాలు) 4. గోదధి (ఆవు పెరుగు) 5. గోఘృతము (ఆవు నెయ్యి)
  • పంచక్షీర వృక్షములు: 1.మఱ్ఱి. 2. రావి. 3. జువ్వి. 4. మేడి. 5. గంగరావి.
  • పంచకావ్యములు: (తెలుగులో) 1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము., 4 వసుచరిత్ర, 5. విజయవిలాసము.
    సంస్కృతంలో: 1. రఘువంశము, 2.కుమార సంభవము, 3. శిశుపాలవధ 4.మేఘసందేశము, 5.కిరాతార్జునీయము
  • పంచ కషాయ వృక్ష ద్రవ్యములు: 1.జువ్వి. 2. రావి. 3. మోడి. 4. దిరిసెన., 5. మర్రి పట్ట.
  • పంచకళ్యాణి: (గుఱ్ఱమునకు వుండవలసినవి) 1. నాలుగు కాళ్ళు. 2. ముఖముపై తెల్లటి చుక్క. 3. తెల్లటి కుచ్చు తోక. 4. తెలుపురంగు వీపు. 5. తెలుపు రంగు మెడజూలు.
  • పంచకల్పములు: 1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.
  • పంచ కర్మ సాక్షులు: 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు
  • పంచకర్తల దేవేరులు: 1. బ్రహ్మపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని... లక్ష్మి, 3. రుద్రపత్ని.... పార్వతి, 4. ఈశ్వరుని పత్ని.... ఉన్మని, 5. సదాశివపత్ని.... మనోన్మని.
  • పంచ ఋషులు: సానగ బ్రహ్మఋషి, సనాతన బ్రహ్మఋషి, అహభువన బ్రహ్మఋషి, ప్రత్నస బ్రహ్మఋషి, సుపర్ణస బ్రహ్మఋషి
  • పంచామృతములు: 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె
  • మాతృపంచకములు:1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.
  • పంచగంగలు: 1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.
  • పంచమహాపాపములు: 1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము
  • పంచాంగములు: జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి.......... 1.తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.
  • పంచసూతకములు: 1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.
  • పంచసూక్తములు: (మతాంతరము) 1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;
  • పంచశుద్ధులు: 1.మనశ్శుద్ధి 2. కర్మశుద్ధి, 3. బాండశుద్ధి, 4. దేహశుద్ధి, 5. వాక్ శుద్ధి
  • పంచవిధ శకములు: 1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.
  • పంచవిధ ధన వారసులు: 1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు
  • పంచవిధ దేవతా పీఠములు : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
  • పంచవాయువులు : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
  • పంచ దోషములు :
    • 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ. పంచహేత్వాభాసములు]
    • 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము.
    • 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
  • పంచయజ్ఞములు: "అహుతం చ హుతం చైవ తథా ప్రహుతమేవ చ, బ్రాహ్మ్యం హుతం ప్రాశితం చ పంచయజ్ఞాన్‌ ప్రచక్షతే" [మనుస్మృతి 3-73]
    • (నిత్య యజ్ఞములు) 1. స్నానము, 2. దానము, 3. తపస్సు, 4. హోమము, 5. పితృయజ్ఞము.
    • 1. జపము, 2. హోమము, 3. బలి, 4. బ్రాహ్మణ శ్రేష్ఠుని పూజించుట, 5. పితృతర్పణము.
    • 1. అగ్నిహోత్రము, 2. దర్శపూర్ణ మానము, 3. చాతుర్మాస్యము, 4. పశుయాగము, 5. సోమయాగము.
  • పంచమకారాలు : మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం
  • పంచాక్షరి : శివ పంచాక్షరీ మంత్రం: ఓం నమశ్శివాయ: విష్ణు పంచాక్షరీ మంత్రం: ఓం నారాయణాయ:
  • పంచాయుధములు : శ్రీ మహావిష్ణువు ఆయుధాలు : శంఖము - పాంచజన్యము, చక్రము - సుదర్శనము, ఖడ్గము - నందకము, గద - కౌమోదకి, ధనుస్సు - శార్ఙము
  • పంచయజ్ఞాలు : వేదపఠనం, వైశ్వదేవం, అతిథిపూజ, పితృతర్పణం, భూతబలి
  • పంచధర్మములు : 1. జాతి ధర్మము: 2. ఆశ్రమ ధర్మము. 3.మత ధర్మము.4.దేశ ధర్మము. 5.గుణ ధర్మము.
  • పంచ-సూత్రములు :
    • (అ.) 1. సంకల్పము, 2. మార్జనము, 3. వరుణ సూక్తము, 4. అఘమర్షణము, 5. స్నానాంగతర్పణము.
    • (ఆ.) 1. ఆపస్తంభీయము, 2. ఆశ్వలాయనీయము, 3. కాత్యాయచనీయము, 4. బోధాయనీయము, 5. వైఖానసీయము.
  • షడ్రుచులు - మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు ( కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు)
  • షట్చక్రవర్తులు - హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I సగర: కార్త వీర్యశ్చ,షడేతే............ చక్రవర్తిన:II హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు
  • షడ్విధ పరమార్థ శత్రువులు: 1.కామము. 2. క్రోదము, 3.లోబము. 4. మోహము. 5. మదము. 6. మాత్సర్యము
  • షడ్విధ నరకములు: 1. తపనము. 2. అవీచి. 3. మహాకావరము. 4. కావరము. 5. సంఘాతము. 6. కాలసూత్రము.
  • షడ్విధ గుణములు: (రాజనీతి యందు) 1. సంధి. 2. విగ్రహము, 3. యానము. 4. సంస్థాపనము. 5. ఆసనము. 6. ద్వైధీభావము
  • షడ్విధ కలియుగ శకములు: 1.యుధిస్టరశకము. 2. విక్రమ శకము. 3. శాలివాహన శకము. 4. విజయనందన శకము. 5. నాగార్జున శకము. 6. కల్కి శకము.
  • షద్రసములు: 1.కషాయము. (వగరు.) 2. మధురము (తీపి) 3. లవణము (ఉప్పు) 4. కటువు (కారము) 5. తిక్తము (చేదు) 6. ఆమ్లము (పులుపు)
  • షదృతువులు: 1.వసంతఋతువు, 2. గీష్మఋతువు. 3. వర్షఋతువు. 4. శరదృతువు. 5. హేమంతఋతువు. 6. శశిఋతువు.
  • షట్చక్రాధి దిశదేవతలు: 1.మూలాధారము. గణపతి. 2. స్వాధిష్టానము. బ్రహ్మ. 3. మణిపూరకము. విష్ణువు. 4. అనాహతము . రుద్రుడు. 5. విశుద్ధము. ఈశ్వరుడు. 6. ఆజ్ఞాచక్రము. సదాశివుడు.
  • షట్ స్త్రీ రక్షకులు: 1.భర్త, .2 తంద్రి. 3. కొడుకు. 4.సోదరుడు. 5. పినతండ్రి. 6. మేనమామ
  • షట్ గుణములు: 1. శక్తి. 2. జ్ఞానము. 3. బలము. 4. ఐశ్వర్యము. 5. తేజము
  • షడ్భావవికారాలు: 1.గర్భంలో ఉండడం 2. జన్మించడం 3. పెరగడం 4. ముదియడం (ముసలివారు కావడం) 5. కృశించడం 6. మరణించడం
  • షడ్శరీరాంగములు: 1. (మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మద్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
  • షట్శివ లింగములు: (రావణ ప్రతిష్ఠితము) 1. వైద్యనాధ లింగము. 2. వక్రేశ్వర నాథ లింగము. 3. సిద్ధి నాథ లింగము. 4. తారకేశ్వర లింగము. 5. ఘటేశ్వర లింగము. 6. కపిలేశ్వర లింగము.
  • షట్కళలు: నివృత్తి,, ప్రతిష్ఠ.. విద్య, శాంతి, శాంత్యాతీతము, నిష్కళము
  • షట్ వాయిద్యములు:డమరుకము,గుమ్మడి, డిండిమము, ఘర్ఘరము, మర్దలము, ప్రణవము
  • షట్ లక్ష్యములు: 1. స్థూలము. 2. సూక్ష్మము. 3. కారణము. 4. మహాకారణము. 5. సమరసము. 6. వ్వక్తము.
  • షట్ బౌద్ధ విశ్వ విద్యాలయాలు: 1. నలంద విశ్వవిద్యాలయము. 2. తక్షశిల విశ్వవిద్యాలయము. 3. ధనకటక విశ్వవిద్యాలయము. 4. విక్రమశైల విశ్వవిద్యాలయము. 5. బలాభి (వలాభి) విశ్వవిద్యాలయము. 6. కాంచీ పుర విశ్వవిద్యాలయము.
  • షడ్గుణైశ్వర్యములు: జ్ఞానము, ధైర్యము, మహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము
  • షడ్గుణములు: 1. శక్తి, 2. జ్ఞానము, 3. బలము, 4. ఐశ్వర్యము. 5. వీర్యము. 6. తేజము
  • షట్చాస్త్రములు: 1.తర్క శాస్త్రము 2. వ్యాకరంఅను. 3. వైద్య శాస్త్రము 4. జ్యోతిషశాస్త్రం 5. ధర్మ శాస్త్రము 6. మిమాంస
  • షడ్విధ గణపతి: 1.మహాగణపతి మతము, 2. హరిద్రాగణపతి మతము . 3. ఉచ్ఛిష్టగణపతి మతము 4. నవనీతగణపతిమతము 5. స్వర్ణగణపతిమతము 6. సంతానగణపతిమతము
  • షడీతి బాధలు: 1.అతివృష్టి. 2. అనావృష్టి. 3. మిడుతలు. 4. పందికొక్కులు. 5. విశుద్ధ. 6. హంక్లములు.
  • షణ్మతములు: శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, కాపాలము
  • అరిషడ్వర్గములు: మానవునికి అంతశత్రువులు ఆరు. అవి, కామ, క్రోద, లోభము, మోహము, మదము, మాత్సర్యములు.
  • షడ్విధ సన్యాసులు: 1.కుటీచక, 2. బహుదక, 3. హంస, 4. పరమహంస. 5. తురీయాతీత. 6. అవధూత
  • షడ్విధ ప్రజాపతులు: (బ్రహ మానస పుత్రులు)1. మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు
  • షడ్భాషలు : 1.అచ్చతెనుగు, 2.దేశీయము, 3.గ్రామ్యము, 4.కన్నడి, 5.హళేకన్నడి, 6.అరవము.
  • షట్కాలాలు : ప్రాత:కాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్ణకాలం, సాయాహ్నకాలం = సాయంకాలం, ప్రదోషకాలం = మునిమాపు వేళ
  • యుద్ధషట్కము : 'భీష్మపర్వం" మొదలుకొని "స్త్రీ పర్వం" వరకు గల ఆరు పర్వాలను "యుద్ధ షట్కము" అని అంటారు. అవి- 1. భీష్మపర్వం, 2. ద్రోణపర్వం, 3. కర్ణపర్వం, 4. శల్యపర్వం, 5. సౌప్తికపర్వం, 6. స్త్రీపర్వం.
  • షణ్మతాలు : పాషండ, చార్వాక, బౌద్ధ, జైన, వామన, గాణపత్యాలు.
  • షణ్మతాలు : "బౌద్ధం వైదిక శైవంచ సౌరం విష్ణుచ శాక్తకం" అని కూడా ఒక శ్లోకం ఉంది. దీని ప్రకారం మతాలు: బౌద్ధమతం, వైదికమతం, శైవమతం, సౌరమతం, వైష్ణవమతం, శాక్తేయం
  • షట్‌-అంగములు
  • సప్తపుణ్యక్షేత్రాలు: అయోధ్య, మథుర, కాశీ, గయ, కంచి, అవంతిక, ద్వారవతి
  • సప్తపిండదానకరులు: 1.పుత్రులు, 2. దౌహిత్రులు, 3. పౌత్రులు, 4. మేనల్లుడు, 5. భార్య, 6. అన్నదమ్ములు, 7. అన్నదమ్ముల కొడుకులు.
  • సప్త బ్రహ్మలు : మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు
  • సప్తమండలంలు: 1.వాయుమండలం, 2. వరుణ మండలం, 3. అగ్ని మండలం, 4. చంద్ర మండలం, 5. సూర్య మండలం, 6. నక్షత్ర మండలం, 7. జ్యోతి మండలం.
  • సప్తమాతలు:1. స్త్రీ, 2. లక్ష్మి, 3. ధృతి, 4. మేధ, 5. శ్రద్ధ, 6. విద్య, 7. సరస్వతి.
  • సప్తమాతలు (మాతృసమానులు) : 1. తల్లి తల్లి, 2. మేనమామ భార్య, 3. తల్లి సోదరి, 4. భార్య తల్లి, 5. తండ్రి తల్లి, 6. అన్నభార్య, 7. గురుపత్ని.
  • సప్త రాజ్యాంగములు: 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
  • సప్తయజ్ఞములు: 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
  • సప్తలోకములు: 1.భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహార్లోకము, 5. జనలోకము, 6. తపోలోకము, 7. సత్య లోకము.
  • సప్తగంగలు: 1. గంగ,2.యమున,3. గోదావరి,4. కృష్ణవేణి,.5.నర్మద,6.సింధు,7.కావేరి
  • సప్తజన్మలు: 1. దేవతలు,2.మనుష్యులు.3.మృగములు,4.పక్షులు,5.పురుగులు.6.జలచరములు,7.తరుపాషాణములు
  • సప్తజలమాతృకలు : మత్స్య, కూర్మి, వరాహి, దర్దురి, మకరి, జాలుక, జంతుక
  • సప్త తత్వములు: 1.సత్యము. 2.బ్రహ్మము.3.విలంబితమానము.4.పక్షులు,5.వస్తువు,6.స్వభావము,7.సత్యాదిగుణము
  • సప్తదేహ పుణ్య కార్యములు: 1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.
  • సప్తసరస్వతులు: 1. సుప్రభ (పుష్కర క్షేత్రము) 2. కాందనాక్షి (నైమిశారణ్యము) 3. విశాల (గయా క్షేత్రము) 4. మనోరమ (ఉత్తర కోసలము) 5. ఓఘవతి (కురుక్షేత్రము) 6. సురేణు (హరిద్వార్) 7. విమనోదక (హిమాలయము
  • పాకయజ్ఞములు: ఏడు. 1. ఔపాసనము 2. వైశ్యదేవము 3. పార్వణము 4. అష్టక 5. మాసశ్రాద్ధము 6. సర్పబలి 7. ఈశానబలి.
  • సప్తదోషాలు : స్త్రీ సంగమ, విషయ, విషయశీత, పీతజిహ్వక, రక్తజిహ్వక, శ్వేతజిహ్వక దోషాలు,
  • సభాసప్తాంగాలు: మంత్రం, ఔషధం, ఇంద్రజాలం, సామం, దానం, భేదం, దండం
  • సప్తాంగాలు: రాజ్యానికి ఉండే ఏడు అంగాలు: స్వామి (రాజు), మంత్రి, సుహృదుడు, కోశం, రాష్ట్రం, దుర్గం (కోట), బలం (సైన్యం)
  • సప్తవర్షాలు: వర్షాలంటే భూమండలంలోని సప్తద్వీపాల్లో అతి పెద్దదైన జంబూద్వీపంలోని భాగాలు: కురు, హిరణ్మయ, రమ్యక, ఇలావృత, హరికేతుమాల, భద్రాశ్వ, కిన్నెర, భరత
  • సప్తకులపర్వతాలు : మహేంద్రపర్వతం (ఉత్తరాన ఉండే పర్వతం) , మలయపర్వతం (దక్షిణాన ఉండే పర్వతం), సహ్యపర్వతం (సహ్యాద్రి/పశ్చిమ కనుమలు), శుక్తిమంత లేదా మాల్యవంత పర్వతం, గంధమాదన లేదా రుక్షపర్వతం, వింధ్య పర్వతం, పారియాత్ర పర్వతం
  • "శాంతి సప్తకం" అంటే, మహాభారతం లోని శాంతి పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు గల ఏడు పర్వాలను "శాంతి సప్తకం" అని అంటారు. అవి: 1. శాంతి పర్వం 2. అనుశాసనిక పర్వం 3. అశ్వమేథ పర్వం 4. ఆశ్రమవాస పర్వం 5 మౌసల పర్వం 6. మహాప్రస్థానిక పర్వం 7. స్వర్గారోహణ పర్వం
 
కుబేరుడు
 
పుష్పం
 
గోల్కొండ దుర్గము
  • అష్టగంధాలు : కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం
  • అష్ట దిక్పాలకులు - ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
  • అష్టలక్ష్ములు - ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ
  • అష్టస్థాన పరీక్ష - నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష
  • అష్టదోషములు: 1.చంద్రునిలో కళంకము, 2.హిమగిరియందు మంచు, 3.సముద్రునియందు ఉప్పు, 4.చందన వృక్షములనీడన త్రాచుపాములు, 5.పద్మములకు ముండ్లు, 6.సుందరీమణులకు వృద్దాప్యము, 7.కుచములకు పతనము, 8.విద్యావంతులకు దారిద్రము.
  • అష్టద్రవ్యములు: యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.
  • అష్టమహా రసాలు: 1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.
  • అష్ట భాగ్యములు: 1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].
  • అష్టభోగాలు : గృహం, వస్త్రం, గంధం, పుష్పం, శయ్య, తాంబూలం, స్త్రీ, గానం
  • అష్టావధానము: 1. చదరంగము, 2. కవిత్వము, 3. లేఖనము, 4. పఠనము, 5. గణితము, 6. సంగీతము, 7. యుక్తి చెప్పుట, 8. వ్యస్తాక్షర. (ఆ.) 1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము [ఈ యెనిమిదింటితో గూడినవి అష్టావధానము].
  • అష్టధాతువులు: బంగారు,వెండి,రాగి,తగరం,తుత్తునాగం,సీసం,పాదరసం,ఇనుము
  • అష్టైశ్వర్యాలు: దాసీజనము,భృత్యులు,పుత్రులు,మిత్రులు,బంధువులు,వాహనములు,ధనము,ధాన్యము
  • అష్టలోహాలు : బంగారు, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము, సత్తు, తగరం, ధీవరం
  • అష్టమంగళాలు : సింహం, వృషభం, నాగం, కలశం, వ్యచనం, వైజయంతి, బేరి, దీపం
  • అష్టజ్వరనాశక ధూపాంగములు : 1. గుగ్గిలము, 2. వేపాకు, 3. వస, 4. చెంగల్వకోష్టు, 5. కరక్కాయ, 6. ఆవాలు, 7. యవలు, 8. నేయి
  • అష్ట్రరాజ్యాంగములు : 1. రాజు, 2. రాష్ట్రము, 3. అమాత్యుడు, 4. దుర్గము, 5. బలము, 6. కోశము, 7. సామంతులు, 8. ప్రజలు
  • అష్టపర్వతములు : హిమచలము, హేమకూటము, నిషదము, నీలము, శ్వేతము, శృంగి, మాల్యవంతము, గంధమాదనము
  • అష్టార్ఘ్యములు : 1.పెరుగు,2. తేనె,3. నెయ్యి,4. అక్షతలు, 5.గఱిక,6. నువ్వులు, 7.దర్భ, 8.పుష్పము.
  • అష్టభాగ్యాలు : రాజ్యం, భండారం (ఖజానా), సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఛత్రం (గొడుగు), చామరం (వింజామర), ఆందోళిక (అందలం/పల్లకి/ఊయల)
  • అష్టార్చనలు : ముగ్గులు, సుగంధము. అక్షతలు, పుష్పములు, దీపము, ఉపహరము, తాంబూలము, దూపము
  • అష్ట అర్ఘ్యాలు : పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు
  • అష్టవిధ ప్రమాణములు : 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. శబ్దము, 5. అర్థాపత్తి, 6. అనుపలబ్ధి, 7. సంభవము, 8. ఐతిహ్యము [ఇవి పౌరాణికుల మతమున].
  • అష్టఅధికారములు : 1. జలాధికారము, 2. స్థలాధికారము, 3. గ్రామాధికారము, 4. బ్రహ్మాసనము, 5. కులలేఖనము, 6. దండ వినియోగము, 7. పౌరోహిత్యము, 8. జ్యోతిషము.
  • అష్ట మదములు : భోజనం, అర్థం, స్త్రీ, విద్య, కులం, రూపం, ఉద్యోగం, యౌవనం
  • అష్టసూర్యులు : 1. ఆరోగుడు, 2. భ్రాజుడు, 3. పటరుడు, 4. పతంగుడు, 5. స్వర్ణనుడు, 6. జ్యోతిష్మంతుడు, 7. విభాసుడు, 8. కాశ్యపుడు
  • అష్టవిధభక్తి : భాగవతవాత్సల్యం, భగవ్త్పూజానుమోదనం, భగవదర్చన, భగవద్విషయంలో అదంభం, భగవద్కథాశ్రవణేచ్ఛ, స్వరనేత్రాంగవికారం, సదాభగవద్స్మరణం, అమాంసభక్షణం
  • అష్టపాశములు : దయ. జుగుప్స. మోహం. భయం, సంశయం, కులం, శీలం, బలం
  • అష్టమాతలు:
    • 1. రౌద్రి, 2. వైష్ణవి, 3. బ్రాహ్మి, 4. కౌమారి, 5. వారాహి, 6. నారసింహి, 7. చాముండ, 8. మాహేంద్రి.
    • 1. వ్యాపిని, 2. తాపిని, 3. పావని, 4. క్లేదని, 5. ధారిణి, 6. మాలిని, 7. హంసిని, 8. శంఖిని.
    • 1. బ్రాహ్మి, 2. మాహేశ్వరి, 3. చండి, 4. వారాహి, 5. వైష్ణవి, 6. కౌమారి, 7. చాముండ, 8. చర్చిక.
    • 1. ఆరోగ్యము, 2. ప్రతిభ, 3. అభ్యాసము, 4. భక్తి, 5. విద్వత్కథ, 6. పాండిత్యము, 7. స్మృతిదార్ఢ్యము, 8. అనిర్వేదము [ఇవి కవిత్వమునకు మాతలు] [కావ్యమీమాంస]
  • అష్ట భావములు
    • 1(అ.) 1. ధర్మము, 2. జ్ఞానము, 3. వైరాగ్యము, 4. ఐశ్వర్యము, 5. అధర్మము, 6. అజ్ఞానము, 7. అవైరాగ్యము, 8. అనైశ్వర్యము.
    • 2(ఆ.) 1. స్తంభము, 2. స్వేదము, 3. రోమాంచము, 4. వైస్వర్యము, 5. కంపము, 6. వైవర్ణ్యము, 7. అశ్రుపాతము, 8. ప్రళయము.
    • 3(ఇ.) 1. కంపము, 2. రోమాంచము, 3. స్ఫురణము, 4. ప్రేమాశ్రువులు, 5. స్వేదము, 6. హాస్యము, 7. లాస్యము, 8. గాయనము.
    • 4(ఈ.) 1. రతి, 2. హాసము, 3. శోకము, 4. క్రోధము, 5. ఉత్సాహము, 6. భయము, 7. జుగుప్స, 8. విస్మయము.
 
నవధాన్యాలు
  • నవఆత్మలు:జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్దాత్మ, మహదాత్మ, భూతాత్మ, సకలాత్మ
  • నవఖండాలు : భరత ఖండం, ఇంద్ర ఖండం, పురు ఖండం, గభస్తి ఖండం, నాగ ఖండం, తామ్ర ఖండం, వారుణ ఖండం, సౌమ్య ఖండం, గంధర్వ ఖండం
  • నవ చక్రములు: 1. మూలాధారము,2.స్వాధీష్ఠానము, 3.నాభి చక్రము, 4. హృదయ చక్రము, 5.కంఠచక్రము, 6.ఘంటిక,7.భ్రూవు, 8.బ్రహ్మరంద్రము, 9.గగనము
  • నవరంధ్రాలు - కళ్ళు (2), ముక్కు (2), చెవులు (2), నోరు, మల ద్వారం, మూత్ర ద్వారం
  • నవగ్రహాలు - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు
  • నవద్రవ్యాలు - పృథివి, తేజం, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు, అప్ (= నీరు)
  • నవధూపాంగములు : వట్టివేళ్ళు, మంచి గంధము, గుగ్గిలము, మహిసాక్షి, కర్పూరము, అగరు, కచ్చూరము, తుంగ ముస్తెలు, సాంబ్రాణి, ఆవు నెయ్యి
  • నవనాడులు - ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ
  • నవవిధ దుఃఖములు:1.పీడ, 2. బాధ, 3. వ్వధ, 4. దుఃఖము, 5. అమనస్యము. 6.ప్రసూతిజము, 7. కష్టము, 8. కృచ్ఛము, 9. అభలము.
  • నవవిధ ధర్మములు: 1.పుణ్యము. 2. న్యాయము, 3.సామ్యము. 4. స్వభావము, 5.ఆచారము, 6. అహింస, 7. వేదోక్తవిధి, 8.ఉపనిషత్తు, 9.యజ్ఞము
  • నవవిష స్థానములు: 1. చోరులకు చేతులందు, 2. స్త్రీలకు స్థనములందు, 3. కొండెగానికి నాలుక యందు, 4. కాముకునకు కన్నుల యందు, 5. పాముకు కోరలయందు, 6.తేలుకు కొండె యందును, 7. ఈగకు తలయందును, 8. నరునకు శరీరమంతా, 9.వేశ్యకు మనస్సాంతా విషము
  • నవసంచార నిషిద్ధ స్థలములు: 1.చింపిపీలికలు. 2. ఎముకలు. 3. ముండ్లు, 4. మలమూత్రములు. 5. వెండ్రుకలు. 6.వరిపొట్టు, 7. బూడిద, 8. కుండ పెంకులు. 9. స్నానము చేసిన నీరు పారు స్థలము.
  • నవతారా శుభాశుభ ఫలితములు:1. జన్మతార, దేహనాశనము. 2, సంపత్తార. సంపద., 3. విపత్తార. దరిద్రము., 4. క్షేమతార., క్షేమము. 5. ప్రత్యక్తార.. కార్య నాశనము.6. సాధనతార., కార్యసాధనము, 7. సైధన తార ./ మరణము. 8. మిత్రతార. మైత్రి., 9. పరమమైత్రి తార. పరమ మైత్రి.
  • నవగ్రహదేశములు: 1.సూర్యుడు. కళింగ దేశము. 2. చంద్రుడు. యవన దేశము. 3. అంగారకుడు. అవంతి దేశము. 4. బుదుడు. మగధదేశము. 5. బృహస్పతి. సింధుదేశము. 6. శుక్రుడు. కాంబోజ దేశము. 7. శని. సింధు దేశము. * 8. రాహువు. బర్బర దేశము. 9. కేతువు. అంతర్వేధి దేశము.
  • నవగ్రహా హోమ సమిధలు: 1. రావి 2. అత్తి. 3. జిల్లేడు, 4. జమ్మి. 5. గరిక, 6. దర్భ 7. ఉత్తరేణి 8. మోదుగ 9. చండ్ర
  • నవ శక్తులు: (అ.) 1. దీప్త, 2. సూక్ష్మ, 3. జయ, 4. భద్ర, 5. విభూతి, 6. విమల, 7. అమోఘ, 8. వైద్యుత, 9. సర్వతోముఖ్య.
    (ఆ.) 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద. [ఆప్టే.]
    (ఇ.) 1. విభూతి, 2. ఉన్నతి, 3. కాంతి, 4. కీర్తి, 5. సన్నతి, 6. సృష్టి, 7. పుష్టి, 8. సత్పుష్టి, 9. బుద్ధి.
  • నవవర్షాలు: 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత
  • నవనిధులు : పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం
  • నవారణ్యాలు : సైంధవ,దండక,నైమిశ,కురు,జాంగాల,ఉత్పలావృత,జంబూమార్గ,పుష్కర,హిమాలయ పర్వతారణ్యాలు
  • నవధర్మములు : పుణ్యము, న్యాయము, సామ్యము, స్వభావము, ఆచారము, అహింస, వేదోక్తవిధి, ఉపనిషత్తు, యజ్ఞము
  • నవవ్యాకరణాలు : పాణినీయం, కలాపం, సుపద్మం, సారస్వతం, ప్రాతిశాఖ్యం, కుమారవ్యాకరణం, ఐంద్రం, వ్యాఘ్రభౌతికం, శాకటాయనం/శాకల్యం
  • నవలక్షణాలు : శుచి, వాచస్వి, వర్చస్వి, ధృతం, స్మృతిమాన్, కృతి, నమ్రత, ఉత్సాహి, జిజ్ఞాసి
  • నవభక్తులు : 1. పరీక్షితుడు, 2. నారదుడు, 3. ప్రహ్లదుడు., 4.భార్గవి. 5. పృధుడు, 6. గరుత్మంతుడు. 7. ధనుంజయుడు. 8. బలిచక్రవర్తి.
  • నవధాన్యాలు : గోధుమలు, యవలు, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు
  • నవ సంచార నిషిద్ధ స్థలములు : చింపి పీలికలు, ఎముకలు, ముండ్లు, మలమూత్రములు, వెండ్రుకలు, వరిపొట్టు, బూడిద, కుండ పెంకులు, స్నానము చేసిన నీరు పారు స్థలము
  • నవధాతువులు : బంగారం, వెండి. ఇత్తడి, సీసం, రాగి, తగరం, ఇనుము, కంచు, కాంతలోహం
  • నవ అవస్థలు : నిషేకము, గర్భము, జన్మము, బాల్యము, కౌమారము, తారుణ్యము, ప్రౌడత్వము, వృద్యత్వము, మరణము.
  • నవబ్రహ్మలు : మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు
  • నవవిధభక్తి : అర్చనము, ఆత్మనివేధనము,కీర్తనము, ధాస్యమ్, పాధసెవానము, వంధనమ్, స్రవనమ్, సక్యము, స్మరనము
  • నవద్వీపములు : ఇంధ్రద్వీపము, శ్వేతద్వీపము, తామ్రవర్రిద్వీపము, గభస్తీద్వీపము, నాగర ద్వీపము, సౌమ్యద్వీపము, గాంధర్వద్వీపము, వారుణద్వీపము, జంబుద్వీపము
  • దశ గురువిద్యలు : లిపి, వ్యాకరణము, కావ్యము, రాజనీతి, దండ నీతి, అర్థ శాస్త్రము, గణితము, ఆయుర్వేధము, శిల్ప శాస్త్రము, గాంధర్యము
  • దశ వాయువులు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన; నాగ, కూర్మ, కృకల, ధనుంజయ, దేవదత్తం (పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశ వాయువులందురు)
  • దశ నాడులు - నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ), శంఖిని
  • దశ విధ పరీక్ష - దూశ్యం, దేశం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయసు, సత్వం, సత్మయం, ఆహారం
  • దశావతారములు - మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి
  • దశ విధ వివాహ పొంతనలు - రజ్జు (పాద, ఊరు, ఉదర, కంఠ, శిరో), నాడి (ఆది, మధ్య, అంత్య), ?, ?, ?, ?, ?, ?, ?, ?
  • దశవిధ జయంతులు: 1.మత్స్యజయంతి. చైత్ర బహుళ పంచమి. 2.కూర్మ జయంతి. జ్యేష్ట బహుళ ద్వాదసి. 3.వరాహ జయంతి. చైత్ర బహుళ త్రయోదశి. 4.నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ చతుర్థశి. 5. వామన జయంతి. బాధ్ర పద శుద్ధ ద్వాదశి. 6. పరశురామ జయంతి. మార్గశిర బహుళ ద్వితీయ. 7. శ్రీరామ జయంతి. చైత్ర శుద్ధ నవమి. 8.బలరామ జయంతి. వైశాఖ శుద్ధ తృతీయ. 9.బౌద్ధ జయంతి. బాధ్ర పద శుద్ధ షష్టి. 10..కల్కీజయంతి. బాధ్ర పద శుద్ధ ద్వితీయ
  • మన్మథదశవిధావస్థలు: 1. కనులతో చూచుట. 2.మనసు పడుట. 3. సంకల్పించుట. 4. నిద్ర పట్ట కుండుట. 5. చిక్కిపోవుట. 6. అన్నిట విసుగు పుట్టుట. 7. సిగ్గువిడుచుట. 8. చిత్తభ్రమ. 9. మూర్చనొందుట.
  • దశక్షీరములు: 1. చనుబాలు, 2. ఆవుపాలు, 3.బఱ్ఱెపాలు. 4. మేకపాలు. 5. లేడి పాలు, 6. గుఱ్ఱము పాలు. 7. గాడిదపాలు. 8. ఒంటెపాలు. 9. గొఱ్ఱెపాలు. 10. ఏనుగు పాలు.
  • దశ-తాళప్రాణములు : 1. కాలము, 2. మార్గము, 3. క్రియ, 4. అంగము, 5. గ్రహము, 6. జాతి, 7. కళ, 8. లయ, 9. యతి, 10. ప్రస్తారము.
  • దశదానములు: 1. గోదానము, 2.భూదానము, 3. తిలదానము., 4. సువర్ణదానము. 5.వస్త్రదానము. 6.ధాన్యదానము. 7. నేతిదానము. 8. బెల్లందానము. 9. వెండి దానము. 10. ఉప్పుదానము.
  • దశదూపాంగములు: 1. వట్టివేళ్ళు, 2.మంచిగంధము. 3. గుగ్గిలము. 4. మహిసాక్షి. 5. కర్పూరము. 6. అగరు, 7. కచ్చూరము. 8. తుంగముస్తెలు. 9. సాబ్రాణి. 10. ఆవునెయ్యి.
  • దశనాదములు: 1. చిణి. 2. చిణిచిణీ, 3. శంఖము. 4. వేణు, 5.వీణ. 6. తాళము. 7.ఘంట. 8. భేరి. 9. మృదంగము. 10. మేఘనాదము.
  • దశనామములు: 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్థుడు. 4. కిరీటి. 5. శ్వేతవాహనుడు. 6. బీభత్సుడు. 7. విజయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి. 10. ధనుంజయుడు.
  • దశనియమములు: 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.
  • దశప్రజాపతులు: 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.
  • దశ ప్రాణములు: 1. కాలము, 2. మార్గము, 3. క్రియ, 4. అంగము, 5. గ్రహము, 6. జాతి, 7. కళ, 8. లయ, 9. యతి, 10. ప్రస్తారము [ఇవి తాళప్రాణములు].
  • దశరూపకములు: 1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంశము, 10. ఈహమృగము.
  • దశలింగములు:1.వాల్మీకిలింగము. 2. జ్యోతిర్లింగము. 3. పృధ్వీలింగము. 4. అబ్లింగము. 5. తేజోలింగము. 6. వాయులింగము. 7. ఆకాశలింగము. 8.దేవలింగము. 9. బ్రహ్మలింగము. 10. మహర్షిలింగము.
  • దశవాయువులు: 1.ప్రాణము. 2. అపానము,. 3.వ్యానము. 4. ఉదానము, 5. సమానము, 6. నాగము. 7. క్రుకరము. 8. కూర్మము, 9. దేవదత్తము. 10.ధనంజయము.
  • దశవిధగుణములు: 1.కామము. 2. క్రోధము. 3. లోభము, 4. మోహము. 5. మదము, 6. మాత్చ్యర్యము 7. ధంభము, 8.దర్పము, 9. ఈర్ష్యా. 10. అసూయ
  • దశవిధ గురుకుల కళలు: 1.వాచకము. 2.లేఖనము. 3. స్వర్ణకార క్రియ. 4. సంఖ్యామానము. 5. జ్యోతిషము. 6. జాతకము. 7. అగద మంత్రము. 8. సర్వద్య. 9. శిష్టామృతీకరణము. 10. గానము.
  • దశవిధ చక్షుర్వింద్రియ రూపకములు: 1.పొడుగు. 2. పొట్టి. 3. లావు. 4. సన్నము. 5. తెలుపు. 6. ఎఱుపు, 7.నలుపు. 8. ఆకుపచ్చ. 9. పసుపు. 10. మిశ్రమము
  • దశవిధ పాపములు: 1.పరుష మాటలు. 2. అసత్యపు మాటలు. 3. పరులను వంచింపు మాటలు. 4. అసందర్భపు మాటలు. 5. పరుల ధనమును గోరుట. 6. ఇతరులకు అనిష్టము తలపుట. 7.వృధా ప్రయానము. 8. పరులకు హాని చేయుట. 9. స్త్రీలను చెరుచుట. 10. హత్యాచారము చేయుట.
  • దశవిధ వైష్ణవులు: 1.శ్రీవైష్ణవులు. 2. కులశేఖరులు. 3. త్రైవర్ణికులు. 4. చాత్తానులు. 5.నంబిళ్ళులు. 6. నీజయ్యారులు. 7. తళములు, 8. గౌణులు. 9. కైవర్తులు. 10. నాచ్చాంబిళ్ళులు.
  • దశవిధ బలములు : విద్యాబలము, కులోన బలము, స్నేహబలము, బుద్ధి బలము, ధన బలము, పరిపాలన బలము, సత్య బలము, సామర్థ్య బలము, జ్ఞానబలము, దైవ బలము
  • తాళదశ ప్రాణములు : 1. కాలము 2. మార్గము 3. క్రియ 4. అంగము 5. గ్రహము 6. జాతి 7. కళ 8. లయ 9. గతి 10. ప్రస్తారము
  • దశ దానములు : గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, ఆజ్యదానము, వస్త్రదానము, ధాన్యదానము, రజతదానము, లవణదానము, అన్నదానము
  • దశవిధనాదములు : జలనాదం, భేరీనాదం, చిణినాదం, మృదంగనాదం, ఘంటానాదం, కాహిళినాదం, కింకిణీనాదం, వేణునాదం, భ్రమరనాదం,ప్రణవనాదం
  • దశబలములు : విద్యాబలము, కులీనతాబలము, స్నేహబలము, బుద్దిబలము, ధనబలము, పరివారబలము, సత్యబలము, సామర్ధ్యబలము, జ్ఞానబలము, దైవబలము
  • దశవాహనములు: దేవును సేవలలో ఉపయోగించు దశ వాహనములు.: హంస, గరుత్మంతుడు, సింహము, శేషుడు, ఆంజనేయుడు, సూర్యప్రభ, చంద్రప్రభ, రధము, అశ్వము, గజము, పుష్పకము
  • దశజ్వరావస్థలు : 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. చిత్తభ్రమ, 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].
  • దశవిధబ్రాహ్మణులు : దశవిధ బ్రాహ్మణ్యంలో వర్గాలు: ఆంధ్రులు, ద్రావిడులు, మహరాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులు, సారస్వతులు, కన్యాకుబ్జులు, గౌడులు, ఉత్కళులు, మైదిలిలు
  • దశవిధవైష్ణవులు : శ్రీ వైష్ణవులు, కులశేఖరులు, త్రైవర్ణికులు, చాత్తాదులు, నంబిళులు, నీంజియ్యరులు, తళములు, గౌణులు, కైవర్తులు, నాచ్చాంభిళ్ళులు
  • దశరుద్ర కళలు : తీక్ష, రౌద్ర, భయ, నిద్ర, తంద్ర, క్షుత్క్రోచ్ర, క్రియ, ఉద్గారి, పయ, మృత్యువు
  • దశవిధ పుణ్యకర్మలు : పరోపకారము, గురుజన సేవనము, ధానము, ఆతిద్యము, పావిత్ర్యము, మహోత్సవము, వ్రతము, పశుపాలనము, జగద్స్విద్ధి, న్యాయాచరణము
  • దశవహ్నులు :
  1. 1.కల్మాషము, 2. కుసుమము, 3. దహనము, 4. శోషణము, 5. తపనము, 6. మహాబలము, 7. పీఠరము, 8. పతగము, 9. స్వర్ణము, 10. భ్రాజకము.
  2. 1. జంభకము, 2. దీపకము, 3. విభ్రమము, 4. భ్రమము, 5. శోభనము, 6. ఆవసథ్యము, 7. ఆహవనీయము, 8. దక్షిణము, 9. అన్వాహార్యము, 10. గార్హపత్యము.
  3. 1.భ్రాజకము, 2. రంజకము, 3. క్లేదకము, 4. స్నేహకము, 5. ధారకము, 6. రంధకము, 7. ద్రావకము, 8. వ్యాపకము, 9. పావకము, 10. శ్లేష్మకము.
  • దశరుద్రకళలు : తీక్షణ, రౌద్రి, భయ, నిద్ర, తంద్ర, క్షుత్క్రోద్ర, క్రియ, ఉద్గారి, పయ, మృత్యువు
  • ‎ఏకాదశ వైరాగ్యములు
  • ఏకాదశ పితరులు: (పిత్రుసమానులు) 1. ఉపాధ్యాయుడు. 2. తండ్రి. 3. అన్న, 4. ప్రభువు.. రాజు. 5. మేనమామ. 6. మామగారు. 7. అభయ ప్రదాత. 8. మాతామహుడు. 9. పితామహుడు. 10. బంధువు 11. తండ్రి సోదరుడు.
  • ఏకాదశకీర్తి శేషులు: 1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్న వాడు.
 
గురుశిష్యులు
  • ద్వాదశ జ్యోతిర్లింగాలు - రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (బీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయిని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)
  • ద్వాదశదానములు: 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/
  • ద్వాదశదేవతారూపులు: (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.
  • ద్వాదశ పుష్కర తీర్థములు: 1.గంగా నదీ పుష్కరము. 2. నర్మదా నదీ పుష్కరము 3. సరస్వతి నదీ పుష్కరము. 4.యమున నదీ పుష్కరము 5. గౌతమీ నదీ పుష్కరము. 6. కృష్ణా నదీ పుష్కరము. 7. కావేరీ నదీ పుష్కరము. 8. తామరపర్ణీ నదీ పుష్కరము. 9. సింధూ నదీ పుష్కరము. 10. తుంగభద్ర నదీ పుష్కరము. 11. తపతీ నదీ పుష్కరము 12. సరయూ నదీ పుష్కరము.
  • ద్వాదశావస్థలు : 1. శయనము, 2. ఉపవేశనము, 3. నేత్రపాణి, 4. ప్రకాశము, 5. గమనము, 6. ఆగమనము, 7. ఆస్థాని, 8. ఆగమము, 9. భోజనము, 10. నృత్యలిప్స, 11. కౌతుకము, 12. నిద్ర [ఇవి గ్రహముల యవస్థలు].
  • ద్వాదశావస్థలు : 1.దర్శనము, 2.మనస్సంగము,3. సంకల్పము,4. జాగరము,5. కార్శ్యము,6. అరతి,7. అలజ్జ, 8.ఉన్మాదము, 9.మూర్ఛ,10. మరణోద్యమము 11. జ్వారము 12. సంతాపము.
  • ద్వాదశ-తపస్సులు : 1. ఉపవాసము, 2. అరకడుపుగ భుజించుట, 3. వృత్తి పరిసంఖ్యానము (భిక్షకై గృహముల నేర్పఱచుకొనుట), 4. రస పరిత్యాగము (షడ్రసములను లేక 1,2 రసములను వదలుట), 5. వివిక్త శయ్యాసనము (ఏకాంత స్థానమున పడుకొనుట, ఉండుట), 6. కాయక్లేశము, 7. ప్రాయశ్చిత్తము, 8. వినయము (రత్నత్రయము, దానిని ధరించువారిపై వినయమును చూపుట), 9. వైయావృత్తము (గురుముని పాదసేవ), 10. స్వాధ్యాయము, 11. వ్యుత్యర్గము (శరీరముపై కల మమతను తక్కువ చేసికొనుట), 12. ధ్యానము చేయుట [ఇవి జైనాచార్యుల తపస్సులు]. [జైనధర్మపరిభాష]
  • ద్వాదశ-వ్యాకరణాంగములు:1. సమానము, 2. వచనము, 3. లింగము, 4. విభక్తి, 5. ప్రత్యయము, 6. అవ్యయము, 7. కాలము, 8. నామము, 9. ఉపసర్గము, 10. ప్రయోగము, 11. ధాతువు, 12. సంహిత
  • ద్వాదశదానములు : ఔషదదానము, విద్యాదానము, అన్నదానము. ఫందాదానము, ఘట్టదానము, గృహదానము, ద్రవ్యదానము, కన్యాదానము, జలదానము, చాయదానము, దీపదానము, వస్త్రదానము
  • త్రయోదశ రాజదోషములు: 1.నాస్తిక్యము. 2. అసత్యము. 3. పొరబాటు. 4. బుద్ధిమాంద్యము. 5. మూడులతో సమాలోచన. 6. క్రోధము. 7. విచారణ యందు ఆలస్యము. 8. పెద్దలయందు నిర్లక్ష్యము. 9. ప్రయోజన కార్య విసర్జితము. 10. సమాలోచన వెల్లడి. 11. అనిశ్చిత కార్యాచరణ. 12. శుభకార్యములందు అశ్రద్ధ. 13. విషయ సుఖాక్ష. ఇవన్నీ రాజులకుండ వలసిన లక్షణములు కావు.
  • త్రయోదశ మనో దోషములు: 1, కామము. 2. క్రోదము. 3. లోభము. 4. మోహము. 5. మధము. 6. మాత్సర్యము. 7. రోగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య. 10 అసూయ. 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము
  • త్రయోదశ-తత్త్వములు : 1. వాక్కు, 2. మనస్సు, 3. సంకల్పము, 4. చిత్తము, 5. ధ్యానము, 6. విజ్ఞానము, 7. అన్నము, 8. జలము, 9. తేజస్సు, 10. ఆకాశము, 11. స్మరుడు, 12. ఆశ, 13. ప్రాణము.
  • చతుర్దశ భువనాలు: భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం (ఊర్ధ్వలోకాలు), అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ (అధోలోకాలు)
  • చతుర్దశ అరణ్యములు: 1.నైమిశా రణ్యము. 2. బదరిక ఆరణ్యము. 3. దండక ఆరణ్యము. 4. చంపక ఆరణ్యము. 5. కామికఆరణ్యము. 6. బృంద ఆరణ్యము. 7. కదళిక ఆరణ్యము. 8. గృవ ఆరణ్యము. 9. దేవత ఆరణ్యము. 10. కేదార ఆరణ్యము. 11. ఆనంద ఆరణ్యము. 12. వృక్ష ఆరణ్యము. 13. మహా ఆరణ్యము
  • చతుర్దశవిద్యలు: 1.ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అదర్వణస్ వేదము. 5. శిక్షా, 6. వ్యాకరణము. 7. చందస్సు. 8. నిరుక్తము. 9. జ్యోతిషము. 10. కల్పము. 11. పురాణములు. 12. శాస్త్రములు. 13. న్యాయశాస్త్రములు. 14. మిమాంస.
  1. కాలి బొటన వ్రేలు.
  2. పాదము.
  3. మడిమ.
  4. పిక్క.
  5. పొత్తి కడుపు.
  6. బొడ్డు.
  7. గుండే.
  8. స్థనములు.
  9. చంకలు.
  10. పెదవులు.
  11. చెక్కిళ్ళు.
  12. కన్నులు.
  13. నుదురు.
  14. మెడ.
  15. నడినెత్తి.
d
  1. తత్వవివేక
  2. మాహభూత
  3. పంచ కోశ
  4. ద్వైత
  5. మహా వాక్యములు
  6. చిత్ర దీప
  7. తృప్తిదీప
  8. కూటస్థ దీప
  9. ధ్యానదీప
  10. నాటకదీప
  11. యోగానంద
  12. ఆత్మానంద
  13. అద్వైతానంద
  14. విద్యానంద
  15. విషయానంద
  • పంచదశ గ్రంధాధ్యాయములు
  1. తత్వవివేక
  2. మాహాభూత
  3. పంచకోశ
  4. ద్వైత
  5. మాహావాక్య
  6. చిత్రదీప
  7. తృప్తిదీప
  8. కూటస్థదీప
  9. దన్యదీప
  10. నాటకదీప
  11. యోగానంద
  12. ఆత్మానంద
  13. అద్వైతానంద
  14. విధ్యానంద
  15. విషయానంద
  • షోడశ లక్ష్మీ నివాస స్థానములు:1. సత్యవంతుల యందు. 2. భగవద్భకులయందు. 3. శోభగలిగిన గృహముల యందు. 4. వీరుల యందు. 5. జయద్వజముల యందు. 6. ఏనుగుల నందు. 7. గోవుల యందు. 8.చత్ర దామరములనందు. 9. తామర పువ్వుల యందు. 10 పంట భూములందు. 11. పూదోటలనందు. 12. స్వయం వరములనందు. 13. రత్నములందును, 14. దీపముల నందు. 15. అద్దముల నందు. 16. మంగళ వస్తువులనందు లక్ష్మీ దేవి నివసించును.
  • షోడశ మహా దానములు: 1. గోదానము. 2. భూదానము. 3. తిలదానము.4. హిరణ్యదానము. 5. రత్న దానము. 6.విద్యా దానము. 7.శయ్యాదానము.8. గృహదానము. 9. కన్యాదానము. 10. దాసి దానము. 11. అగ్రహార దానము. 12. రథదానము. 13. గజదానము. 14. అశ్వదానము. 15. భాగదానము. 16. మహిషీ దానము.
  • షోడశ కర్మలు: 1. గర్బాధానము. 2. పుంసవనము. 3. సీమంతము. 4. జాతకర్మము. 5. నామకరణము. 6. అన్నదానము. 7. చౌలము. 8. ఉపనయము. 9. ప్రజావత్యము. 10. సౌమ్యము. 11. అగ్నేయము. 12. వైశ్వదేవము. 13. గోదానము. 14. సమావర్తనము. 15. వివాహము. 16. ఆత్మకర్మ.
  • షోడశ కళా స్థానములు: 1. తల. 2. ఎదురొమ్ము. 3. చేతులు. 4. కుచములు. 5. తొడలు. 6. నాభి. 7. నుదురు. 8. కడుపు. 9. పిరుదులు. 10. వీపు. 11. చంకలు. 12. మర్మ స్థానము. 13. మోకాళ్ళు. 14. పిక్కలు. 15. పాదములు. 16. బొటన వ్రేళ్ళు.
  • షోడశ-పదార్థములు: 1. ప్రమాణము (ప్రత్యక్షాదికము), 2. ప్రమేయము, 3. ఫలము, 4. దుఃఖము, 5. అపవర్గము, 6. సంశయము, 7. ప్రయోజనము, 8. దృష్టాంతము, 9. సిద్ధాంతము, 10. అవయవములు, 11. తర్కము, 12. నిర్ణయము, 13. వాదము, 14. ఛలము, 15. జాతి, 16. నిగ్రహస్థానము [ఈ పదార్థములు సాహాయ్యమున వాదిప్రతివాదుల మధ్య సిద్ధాంతనిర్ణయము జరుగును] [గౌతమన్యాయసూత్రములు]
  • షోడశ-అంతఃకరణ వృత్తులు : 1. సంజ్ఞానము, 2. ఆజ్ఞానము, 3. విజ్ఞానము, 4. ప్రజ్ఞానము, 5. మేధ, 6. దృష్టి, 7. ధృతి, 8. మతి, 9. మనీష, 10. జ్యోతి, 11. స్మృతి, 12. సంకల్పము, 13. క్రతువు, 14. అసువు, 15. కామము, 16. వశము.
  • షోడశ మహారాజులు : గయుడు, అంబరీషుడు, శశిబిందుడు, అంగుడు, పృథుడు, మరుత్తు, సుహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, భరతుడు, దిలీపుడు, శిబి, రంతిదేవుడు, యయాతి, మాంధాత, భగీరధుడు
  • షోడశ సంపదలు : 1. కీర్తి 2. విద్య 3. బలము 4. జయము 5. పుత్రులు 6. స్వర్ణము 7. ధాన్యము 8. సత్కాలక్షేపము 9. సద్భోజనము 10. జ్ఞానము 11. సౌందర్యము 12. క్షమ 13. బాల్యము 14. ధైర్యము 15. అరోగత 16. చిరాయువు
  • సప్తదశ-నాయక గుణములు: 1. వినయము, 2. మాధుర్యము, 3. త్యాగము, 4. దక్షత, 5. ప్రియంవదత్వము, 6. జనుల యనురాగమునకు పాత్రుడగుట, 7. శుచిత, 8. వాగ్మిత, 9. రూఢవంశము, 10. స్థైర్యము, 11. యౌవనము, 12. జ్ఞానము, ఉత్సాహము, స్మృతి, ప్రజ్ఞ, కళ, మానము (వీనిని కలిగియుండుట), 13. శౌర్యము, 14. దార్ఢ్యము, 15. తేజస్విత, 16. శాస్త్రచక్షుస్త్వము, 17. ధార్మికత్వము. [ద.రూ. 2-1-2] (మూలం:సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి))
 
సూర్యోదయం
  • అష్టాదశ పురాణాలు - మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)
  • అష్టాదశ శక్తిపీఠాలు - భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)
  • అష్టాదశ స్మృతులు - మనుస్మృతి, వశిష్ట స్మృతి, పరాశర స్మృతి, విష్ణు స్మృతి, అత్రిస్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, దక్ష స్మృతి, శంఖ స్మృతి, సంవర్తన స్మృతి, లిఖిత స్మృతి, ఉశన స్మృతి, హరీత స్మృతి, యమ స్మృతి, అంగీరస స్మృతి, వ్యాస స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శాతాత స్మృతి
  • అష్టాదశ ఉపపురాణాలు : సనత్కుమారం, నారసింహం, స్కాందం, శివధర్మం, దౌర్వాసం, నారదీయం, కాపిలం, మానవం, ఔశనం, బ్రహ్మాండం, వారుణం, కౌశికం, లైంగం, సాంబం, సౌరం, పారాశరం, మారీచం, భార్గవం
  • అష్టాదశవర్ణనలు : నగరం, అర్ణవం, శైలం, ఋతువు, చంద్రోదయం, సూర్యోదయం, ఉద్యానం, జలక్రీడ, మధుపానం, ఉత్సవం, విప్రలంభం, వివాహం, పుత్రోదయం, మంత్రం, ద్యూతం, ప్రయాణం, యుద్ధం, నాయకాభ్యుదయం
  1. అమరులు
  2. సిద్ధులు
  3. సాధ్యులు
  4. గరుడులు
  5. కిన్నరులు
  6. కింపురుషులు
  7. గంధర్యులు
  8. యక్షులు
  9. విద్యాధరులు
  10. భూతములు
  11. పిశాచములు
  12. రుద్రులు
  13. మునిగణములు
  14. ఉరుగులు
  15. తుషితులు
  16. దైత్యులు
  17. భాస్వరులు
  18. గుహ్యకులు
  19. నరులు
  1. దిలీపుడు
  2. దశరథుడు
  3. శ్రీరాముడు
  4. భరతుడు (దుష్యంతుని పుత్రుడు)
  5. ధర్మరాజు
  6. జనమేయ జయుడు
  7. శర్వాతుడు
  8. అంబష్టుడు
  9. శతానీతుడు
  10. యుధాంశ్రేష్టి
  11. విశ్వకర్మ
  12. సుధాంసుడు
  13. మరత్తుడు
  14. అంగుడు
  15. దుర్ముఖుడు
  16. అరాతి
  17. పుష్య మిత్రుడు
  18. వాతాపి (ఛాలుక్య వంశీయుడు)
  19. ఏలకేసి (రెండవ)
  • వింశతి కణాది గణములు : పిప్పళ్ళు, పిప్పలి మోడి, చవ్యం, చిత్రమూలం, శొంటి, మిరియాలు, ఏలకులు, అజామోదం, కొడిశపాల, పార విత్తులు, రేణుకలు, జీలకర్ర, గంటు భారంగి, పెనువేప, ఇంగువ, గజ పిప్పళ్ళు, ఆవాలు, వాయువిడంగాలు, అతివస, చాగ
  1. కిరీటము
  2. చత్రము
  3. చామరము
  4. ఢంక
  5. కొమ్ము
  6. చక్రము
  7. గజము
  8. ధ్వజము
  9. మకర తోరణము
  10. పూర్ణ కుంభము
  11. వుష్ఠాహారము
  12. శంఖము
  13. అలవట్టము
  14. దివిటీ
  15. వృషభము
  16. సింహాసనము
  17. హెచ్చరిక
  18. అశ్వము
  19. వారస్త్రీ
  20. నగారా
  21. నౌబత్కాన
  • ద్వావింశతి విష్ణు కళలు
  1. వైష్ణవీ కళ
  2. జారు కళ
  3. పాలినీ కళ
  4. శాంతి కళ
  5. ఈశ్వరి కళ
  6. రతీ కళ
  7. కామినీ కళ
  8. వరదా కళ
  9. హాదినీ కళ
  10. ప్రీతి కళ
  11. ధీఘాన కళ
  12. రుద్ర కళ
  13. తీక్షా కళ
  14. భయా కళ
  15. రౌధ్రా కళ
  16. నిద్రా కళ
  17. తంత్రీ కళ
  18. క్లుత్త్ప కళ
  19. క్రీధినీ కళ
  20. క్రియా కళ
  21. ఉద్గారీ కళ
  22. మృత్యు కళ
  1. ప్రీతి కలా
  2. శ్వేత కలా
  3. అరుణా కలా
  4. అసితా కలా
  5. సదాశివ కలా
  6. నివృతి కలా
  7. ప్రతిష్ఠ కలా
  8. విద్యా కలా
  9. శాంతి కలా
  10. రాధికా కలా
  11. దీపికా కలా
  12. రేచికా కల
  13. మూచికా కలా
  14. పరా కలా
  15. సూక్ష్మ కలా
  16. సూక్ష్మామృతాకలా
  17. జ్ఞాన కలా
  18. జ్ఞానామృత కలా
  19. ఆప్యాయనీ కలా
  20. వ్యాపినీ కలా
  21. వ్యామరూప కలా
  22. జీవకలా
  • చతుర్వింశతి స్త్రీ రాగములు :
  1. దేవ క్రియ
  2. మేఘరంజి
  3. కురంజి
  4. బిలహరి
  5. మనళిహరి
  6. భాండి
  7. హితదో
  8. భాలాతి
  9. నాహుళి
  10. దేశి
  11. ముఖారి
  12. లలిత
  13. రామక్రియ
  14. వరాళి
  15. గౌళ
  16. గండ క్రియ
  17. ఘూర్జరి
  18. బౌళి
  19. కళ్యాణి
  20. ఆహిరి
  21. సావేరి
  22. ఘంటారవము
  23. కాంభోజి
  24. శంఖరాభరణము
  •  
    సహస్ర దీపాలంకరణ మండపం, తిరుమల
    చతుర్వింశతి ఆలయ మండపములు
  1. అభిషేక మండలం
  2. అలంకార మండలం
  3. యాగ మండలం
  4. వివాహ మండలం
  5. ఆస్థాన మండలం
  6. వసంత మండలం
  7. గీష్మ మండలం
  8. వార్షిక మండలం
  9. కార్తీక మండలం
  10. విహారమండలం
  11. జప మండలం
  12. అధ్యయన మండలం
  13. వాహన మండలం
  14. ప్రణయ కలహ మండలం
  15. ప్లవోత్సవ మండలం
  16. దమనకోత్సవ మండలం
  17. డోలా మండలం
  18. శయన మండలం
  19. మాసోత్సవ మండలం
  20. పాలకోత్సవ మండలం
  21. సంవత్సరోత్సవ మండలం
  22. నిత్యోత్సవ మండలం
  23. నైమితెతికోత్సవ మండలం
  24. అభేట మండలం
  • షడ్వింశతి దానములు
  1. గోదానము (ఆవులు)
  2. భూదానము (భూమి)
  3. తిలదానము (నువ్వులు)
  4. హిరణ్య దానము (బంగారము)
  5. అజ్య (నెయ్యి) దానము
  6. వస్త్రదానము (బట్టలు)
  7. ధాన్య దానము (ధాన్యము)
  8. గుడు (బెల్లము) దానము
  9. రౌష్య (ధన) దానము
  10. లవణ (ఉప్పు) దానము
  11. రత్న దానము
  12. విద్యా దానము
  13. కన్యాదానము
  14. దాసీదానము
  15. శయ్యా దానము
  16. గృహ (ఇల్లు) దానము
  17. ఆగ్రహార దానము
  18. రధ (బండి) దానము
  19. గజ (ఏనుగు) దానము
  20. అశ్వ (గుర్రము) దానము
  21. చాక (మేక) దానము
  22. మహిష (గేదె) దానము
  23. అస్త్ర దానము
  24. ఆయుధ దానము
  25. సామ్రాజ్య దానము
  26. పుత్ర దానము

నక్షత్రాలు - నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/

  • పంచత్రింశతి ఇంద్ర నామములు
  1. ఇంద్రుడు
  2. మరుత్యానుడు
  3. మఘవానుడు
  4. భిక్షాజుడు
  5. పాకశాసనుడు
  6. వృద్దశత్రువు
  7. శునాసీరుడు
  8. పురుహోతుడు
  9. పౌరంసరుడు
  10. జీష్టువు
  11. రేఖర్షభుడు
  12. శుక్రుడు
  13. శతమన్యువు
  14. వనస్పతి
  15. సుత్రాముడు
  16. గోత్రభిత్తు
  17. వజ్ర
  18. వానవుడు
  19. వృతహుడు
  20. వృషుడు
  21. వాస్తోష్పతి
  22. సురపతి
  23. బూరాచి
  24. శచీపతి
  25. జమృభేది
  26. హరిహయుడు
  27. స్వరాట్టు
  28. సముచిసూదనుడు
  29. సంక్రదనుడు
  30. దుశ్చవనుడు
  31. తురాషాట్టు
  32. మేఘవాహనుడు
  33. అఖండుడు
  34. సహస్రాక్షుడు
  35. ఋక్షువు

షట్త్రింశత్‌ కావ్యలక్షణములు:

1. భూషణము, 2. అక్షరసంహతి, 3. శోభ, 4. ఉదాహరణము, 5. హేతువు, 6. సంశయము, 7. దృష్టాంతము, 8. ప్రాప్తి, 9. అభిప్రాయము, 10. నిదర్శనము, 11. నిరుక్తము, 12. సిద్ధి, 13. విశేషణము, 14. గుణాతిపాతము, 15. అతిశయము, 16. తుల్యతర్కము, 17. పదోచ్చయము, 18. ది(దృ)ష్టము, 19. ఉపదిష్టము, 20. విచారము, 21. విపర్యయము, 22. భ్రంశము, 23. అనునయము, 24. మాల, 25. దాక్షిణ్యము, 26. గర్హణము, 27. అర్థాపత్తి, 28. ప్రసిద్ధి, 29. పృచ్ఛ, 30. సారూప్యము, 31. మనోరథము, 32. లేశము, 33. సంక్షోభము, 34. గుణకీర్తనము, 35. అనుక్తసిద్ధి, 36. ప్రియవచనము. [భరతనాట్యశాస్త్రము 17 అ.]

ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. (మొత్తం అరవై)

భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)

  • త్రిషష్టి-శలాకాపురుషులు:
    • చతుర్వింశతి తీర్థంకరులు (24)
      ద్వాదశ చక్రవర్తులు (12),
      నవ నారాయణులు (9) (1. త్రిపుష్టుడు, 2. ద్విపుష్టుడు, 3. స్వయంభువు, 4. పురుషోత్తముడు, 5. నరసింహుడు, 6. పుండరీకుడు, 7. దత్తదేవుడు, 8. లక్ష్మణుడు, 9. కృష్ణుడు),
      నవ ప్రతినారాయణులు (9) (1. అశ్వగ్రీవుడు, 2. తారకుడు, 3. మేరకుడు, 4. నిశుంభుడు, 5. మధుకైటభులు, 6. ప్రహ్లాదుడు, 7. బలిసేనుడు, 8. రావణుడు, 9. జరాసంధుడు),
      నవ బలభద్రు (దేవు)లు (9) (1. విజయుడు, 2. అచలుడు, 3. సుధర్ముడు, 4. సుప్రభుడు, 5. సుదర్శనుడు, 6. నంది, 7. నందిమిత్రుడు, 8. రాముడు, 9. పద్ముడు)

created by Nagaraju తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ

ఇతర లింకులు

మార్చు
108 ఉపనిషత్తులు

1, ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) 2. కేనోపనిషత్తు 3. కఠోపనిషత్తు 4. ప్రశ్నోపనిషత్తు 5. ముండకోపనిషత్తు 6. మాండూక్యోపనిషత్తు 7, తైత్తిరీయోపనిషత్తు 8. ఐతరేయోపనిషత్తు 9. ఛాందోగ్యోపనిషత్తు 10. బృహదారణ్యకోపనిషత్తు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు