మార్చి 24
తేదీ
(24 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 83వ రోజు (లీపు సంవత్సరములో 84వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 282 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- 1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
- 1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.
- 1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
- 1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.
- 1998: భారత లోక్సభ స్పీకర్గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
- 1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.
- 2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.
జననాలు
మార్చు- 1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)
- 1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.
- 1923: టీ.ఎం.సౌందర రాజన్ , గాయకుడు, సంగీత దర్శకుడు ,(మ.2013)్
- 1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.
మరణాలు
మార్చు- 1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)
- 1904: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (జ.1832)
- 1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
- 1971: ఎర్రమల కొండప్ప, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1867)
- 1991: చెరువు ఆంజనేయ శాస్త్రి , తెలుగు సినిమా సహాయ దర్శకుడు, గేయ రచయిత(జ.1926).
- 2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
- 2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి సంస్థ వ్యవస్థాపకుడు.
- 2022: అభిషేక్ ఛటర్జీ, బెంగాలీ సినిమా నటుడు. (జ.1964)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
- సెంట్రల్ ఎక్సైజ్ దినం
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-03-03 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-12-07 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 24
మార్చి 23 - మార్చి 25 - ఫిబ్రవరి 24 - ఏప్రిల్ 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |