నవంబర్ 15
తేదీ
(15 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబరు 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరములో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2025 |
సంఘటనలు
మార్చు- 1937: కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
- 1954: టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు)
- 1954: ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
- 1993: ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు
- 2000: 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు.
- 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
జననాలు
మార్చు- 1738: విలియం హెర్షెల్, వరుణ (యురేనస్) గ్రహాన్ని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త. (మ.1822)
- 1883: ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (మ.1939)
- 1898: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992)
- 1902: గోరా, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (మ.1975)
- 1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు సాహితీవేత్త.
- 1935: తెన్నేటి హేమలత, నవలా రచయిత్రి.
- 1949: మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
- 1958: దార్ల రామచంద్రం, కథా రచయత (మ. 2024)
- 1986: సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
మరణాలు
మార్చు- 1630: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (జ.1571)
- 1949: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910)
- 1949: నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు.
- 1982: వినోబా భావే, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)
- 2012: వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
- 2022: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, మాజీ లోక్‌సభ సభ్యుడు. (జ.1943)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- 2000: ఝార్ఖండ్ ఫౌండేషన్ డే -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 14 - నవంబరు 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |