జూలై 5
తేదీ
(5 జూలై నుండి దారిమార్పు చెందింది)
జూలై 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 186వ రోజు (లీపు సంవత్సరములో 187వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 179 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1687: సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫి నేచురాలిస్ ప్రిన్సిపియా మేథ్ మెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు.
- 1811: వెనెజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకొంది.
- 1946: బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
- 1954: గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
- 1954: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.
- 1962: అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది (ఫ్రాన్స్ నుంచి).
- 1975: కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి).
- 1977: పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ర చేసి, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జుల్ఫికర్ ఆలి భుట్టో ను, ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు.
- 1995: సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
- 1996: మొట్టమొదటిసారి, క్లోనింగ్ ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారా డాలీ అనే పేరు గల గొఱ్ఱె ను శాస్త్రవేత్తలు పుట్టించారు.
- 2004:లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు.
జననాలు
మార్చు- 1853: రొడీషియా (నేటి జింబాబ్వే) దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్
- 1906: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (మ.1953)
- 1927: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
- 1943: అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.
- 1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.
- 1979: నవీన షేక్, రంగస్థల, సినీ, టివీ నటి.
- 1980: కళ్యాణ్ రామ్, తెలుగు సినిమా నటుడు, నందమూరి తారక రామారావు మనవడు.
- 1995: పి.వి. సింధు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేసింది.
- 1997: కార్తీక్ రత్నం , నాటక రంగ , సినిమా నటుడు .
మరణాలు
మార్చు- 2017: కంచర్ల సుగుణమణి, సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనుయాయి (జ.1919)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం.
- మెకానికల్ పెన్సిల్ డే .
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 5
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 4 - జూలై 6 - జూన్ 5 - ఆగష్టు 5 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |