భారతీయ డబ్బింగ్ కళాకారుల జాబితా
ఇది వికీపీడియా వ్యాసాలను కలిగి ఉన్న భారతీయ డబ్బింగ్ కళాకారుల జాబితా. దీనిలో విదేశీ మీడియాలో పాత్రలకు వాయిస్ ఓవర్లను అందించిన వారు, భారతీయ మీడియాలో పనిచేసిన వారు, వివిధ భాషలలో డబ్బింగ్ చేసిన వారు, అసలు భాషలో నటించలేని నటులకు గాత్రాలు అందించిన వారు కూడా ఉన్నారు. భారతీయ డబ్బింగ్ కళాకారులు యానిమేషన్, లైవ్-యాక్షన్ సినిమాలు, టెలివిజన్ ధారావాహికలు, వెబ్ కంటెంట్ సహా విస్తృతశ్రేణి కళాప్రక్రియలకు దోహదం చేస్తారు. తరచుగా వివిధ ప్రాంతాల సాంస్కృతిక భాషా సూక్ష్మ నైపుణ్యాలకు అనుగుణంగా తమ ప్రతిభను చాటుకుంటారు. విభిన్న ప్రేక్షకులకు అంతర్జాతీయ విషయాలను అందుబాటులోకి తీసుకురావడంలో, అలాగే దేశంలోని భాషా అడ్డంకులను దాటి భారతీయ నిర్మాణాల పరిధిని విస్తరించడంలో డబ్బింగ్ కళాకారుల పాత్ర చాలా ఉంది.
పేరు | మాట్లాడే భాష(లు) | తెలిసిన పాత్రలు | వివరాలు |
---|---|---|---|
అనురాధ శ్రీరామ్ | తమిళం | ||
అభినవ్ శుక్లా | హిందీ | సరిలేరు నీకెవ్వరు హిందీ డబ్బింగ్ చిత్రంలో మహేష్ బాబు పాత్ర | |
అమీ త్రివేది | హిందీ | హ్యారీ పాటర్ మొదటి చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్లో డేనియల్ రాడ్క్లిఫ్ పోషించిన "హ్యారీ పాటర్" పాత్ర | |
గుజరాతీ | |||
అశ్విన్ ముశ్రన్ | హిందీ | సైఫ్ అలీ ఖాన్‌కు ఇంగ్లీషులో డబ్బింగ్ చెప్పాడు. | |
ఉపద్రష్ట సునీత | తెలుగు | శ్రీరామరాజ్యం సినిమాలో సీత (నయనతార) పాత్రకు ప్రసిద్ధి. | 800కి పైగా చిత్రాలలో 110 కి పైగా నటీమణులకు తన గాత్రాన్ని అందించింది. ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా ఐదు నంది పురస్కారాలు గెలుచుకుంది. |
ఎం.ఎం.మానసి | తమిళం | తమన్నాకు పలు చిత్రాలలో డబ్బింగ్ చెప్పింది. | ఈమె నేపథ్య గాయని కూడా |
తెలుగు | |||
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం | తెలుగు | కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలుభాషల్లో గాత్రదానం చేశాడు. | నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా రెండు సార్లు పురస్కారాలు అందుకున్నాడు. |
ఎస్.పి.శైలజ | తెలుగు | శ్రీదేవి, రవీనా టాండన్, సోనాలి బెంద్రే, ఇషా కొప్పికర్ తదితరులకు గాత్రదానం చేసింది. | |
ఏంజెల్ షిజాయ్ | మలయాళం | ఇలియానా, నిత్య మేనన్, కమలిని ముఖర్జీ, ఛార్మీ కౌర్ మొదలైనవారికి గాత్రాన్ని అందించింది. | 2015లో ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. |
కనికా | తమిళం | అన్నియన్‌లో సదా, శివాజీలో శ్రియా శరణ్, సచిన్‌లో జెనీలియా, వారియర్‌లో కృతి శెట్టికి డబ్బింగ్ చెప్పెంది. | |
కరిష్మా రాంధవా | హిందీ | ||
కవిత కృష్ణమూర్తి | హిందీ | ||
కవితా కౌశిక్ | హిందీ | ||
కృష్ణ అభిషేక్ | హిందీ | F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌లో వరుణ్ తేజ్, చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్, లియోలో విజయ్ మొదలైనవారికి డబ్బింగ్ చెప్పాడు. | |
గిరీష్ సహదేవ్ | హిందీ | ||
గౌరవ్ చోప్రా | హిందీ | ||
చిన్మయి | తెలుగు | సమంతకు డబ్ చెప్పడం ద్వారా ప్రసిద్ధి చెందింది. | 2010 నంది ఉత్తమ డబ్బింగు కళాకారిణి పురస్కారం పొందింది. |
హిందీ | |||
తమిళం | |||
కన్నడ | |||
జావేద్ జాఫ్రీ | హిందీ | ది జంగిల్ బుక్-2 లో షేర్‌ఖాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు | |
దీపా వెంకట్ | తెలుగు | సిమ్రాన్, స్నేహ, జ్యోతిక, నయనతార, అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాయ్ మొదలైనవారికి వివిధ సినిమాలలో డబ్బింగ్ చెప్పింది. | కళైమామణి పురస్కార గ్రహీత |
హిందీ | |||
తమిళం | |||
నాజర్ | ఇంగ్లీష్ | బెన్ కింగ్స్‌లే, అట్లూరి పుండరీకాక్షయ్య, మిథున్ చక్రవర్తి, నెడుముడి వేణు, రామిరెడ్డి తదితరులకు డబ్బింగ్ చెప్పాడు. | |
తెలుగు | |||
హిందీ | |||
మలయాళం | |||
కన్నడ | |||
నిళల్‌గళ్ రవి | తమిళం | జాకీ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్ లకు తమిళంలో డబ్బింగ్ చెప్పాడు. | |
పి. రవిశంకర్ | తమిళం | సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, రవి కిషన్, ముఖేష్ రిషి, సత్యరాజ్, అభిమన్యు సింగ్ వంటి అనేక నటులకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో దక్షిణ భారత చిత్రాలలో డబ్బింగ్ చెప్పాడు. | కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా ప్రతికూల పాత్రలను ధరించేందుకు ఇతడు ప్రసిద్ధుడు. తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. |
తెలుగు | |||
కన్నడ | |||
భాగ్యలక్ష్మి | మలయాళం | కొలిళక్కం చిత్రానికి సుమలతకు డబ్బింగ్ ఇచ్చింది. | ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా మూడుసార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకుంది. |
భానుప్రియ | తమిళం | 'ఇండియన్"లో ఊర్మిళ మతోండ్కర్,' సూర్యవంశం"లో ప్రియా రామన్ | |
మీనా | తమిళం | పొక్కిశం సినిమాలో పద్మప్రియ జానకిరామన్‌కు డబ్బింగ్ చెప్పింది. | |
రవీనా రవి | తమిళం | మహిమా నంబియార్, రమ్య సుబ్రమణియన్, మడోన్నా సెబాస్టియన్, ఎమీ జాక్సన్, ఐశ్వర్య రాజేశ్ తదితరులకు గాత్రదానం చేసింది. | |
హిందీ | |||
తెలుగు | |||
మలయాళం | |||
రాధిక | తమిళం | ముదల్ మరియాదై చిత్రానికి రాధకు డబ్బింగ్ చెప్పింది. | |
రేవతి | తమిళం | శ్రీదేవి, శరణ్య, సువలక్ష్మి, కాజోల్, పూజా బాత్రా, టబు తదితరులకు డబ్బింగ్ చెప్పింది. | కళైమామణి పురస్కార గ్రహీత. |
రోజారమణి | తెలుగు | 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పా శెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రం అందించింది. | డబ్బింగ్ కళాకారిణిగా సుమారు 50 పురస్కారాలు పొందింది. |
తమిళం | |||
రోహిణి | తెలుగు | గీతాంజలి చిత్రంలో గిరిజా షెత్తర్, శివ చిత్రంలో అమల, ఇండియన్, మాపిళ్ళై చిత్రాలలో మనీషా కోయిరాలా, రావణ చిత్రంలో ఐశ్వర్య రాయ్ మొదలైన నటులకు డబ్బింగ్ చెప్పింది. | |
తమిళం |