వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2023
|
01 వ వారం
- ... ఎం. పతంజలి శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధాన న్యాయమూర్తి అనీ!
- ... హేలోజెన్ లను క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారనీ!
- ... గృహస్థాశ్రమం పై హిందూ ఆశ్రమ వ్యవస్థలో విస్తృతమైన చర్చ ఉందనీ!
- ... స్వీడన్ లోని యిటర్బీ అనే గ్రామం పేరు మీద నాలుగు రసాయనిక మూలకాలకు పేర్లు పెట్టారనీ!
- ... హిందూస్తాన్ టైమ్స్ పత్రిక భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జాతీయవాద దినపత్రికగా ప్రముఖ భూమిక పోషించిందనీ!
02 వ వారం
- ... భారతీయ నటుడు కబీర్ బేడీ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించాడనీ!
- ... మోలిబ్డినం మూలకాన్ని ఎక్కువగా ఉక్కు మిశ్రమాల్లో ఉపయోగిస్తారనీ!
- ... కీళ్ళకు సంబంధించిన గౌటు వ్యాధి సాధారణంగా కాలి బొటనవేలు వాపుతో ప్రారంభం అవుతుందనీ!
- ... విద్యుత్ చేపలు సుమారు 650 వోల్టుల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయగలవనీ!
- ... మహారాష్ట్రలో రైస్ మిల్లులు పుష్కలంగా ఉన్న గోందియా పట్టణాన్ని రైస్ సిటీ అని పిలుస్తారనీ!
03 వ వారం
- ... భారతదేశపు చరిత్రలో అత్యధిక కాలం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వై.వి. చంద్రచూడ్ అనీ!
- ... వీడియోటేపు లో సమాచారాన్ని లీనియర్ పద్ధతిలో భద్రపరచడం వలన, డేటాను చదవడం ఆలస్యం అవుతుందనీ!
- ... శ్రీకృష్ణుడు తన చివరి ప్రస్థానంలో ఉద్ధవుడికి ఉపదేశించిన బోధ ఉద్ధవ గీతగా పేరు గాంచిందనీ!
- ... ఇండోనేషియా లోని జావా దీవి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దీవి అనీ!
- ... భారత ప్రభుత్వ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత సంస్థల్లో ఒకటి అనీ!
04 వ వారం
- ... ఆవర్తన పట్టికలోని మూలకాల్లో రీనియం చిట్టచివరి స్థిరమైన మూలకం అనీ!
- ... భారత జాతీయ బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కత లో ఉందనీ!
- ... భారత రైల్వే ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదనీ!
- ... హిమాలయ పర్వత సానువుల్లో పర్వతారోహణకు జోషిమఠ్ను ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారనీ!
- ... శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడికి సంహరించిన తర్వాత అతని తండ్రి ఉగ్రసేనుడు మళ్ళీ రాజ్యపరిపాలన చేశాడనీ!
05 వ వారం
- ... భారతదేశంలో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రబ్బర్ బోర్డ్ ప్రధాన కార్యాలయం కేరళ లోని కొట్టాయంలో ఉందనీ!
- ... సర్ క్రీక్ భారతదేశం పాకిస్థాన్ ల మధ్యన ఒక వివాదాస్పద సరిహద్దు అనీ!
- ... స్టోన్‌హెంజ్ను యునైటెడ్ కింగ్‌డం లో అత్యంత ప్రసిద్ధమైన మైలురాళ్ళలో ఒకటిగా పరిగణిస్తారనీ!
- ... ఉత్తర లండన్ లో ఏర్పాటు చేయబడిన ఇండియా హౌస్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందనీ!
- ... గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అంతర్జాతీయంగా సినిమాలు, టెలివిజన్ రంగంలో ఇచ్చే పురస్కారాలనీ!
06 వ వారం
- ... తమిళనాడులోని ధర్మపురి భారతదేశంలో మామిడి ఉత్పత్తికి పేరు గాంచిన ప్రాంతం అనీ!
- ... మమ్మటుడు ప్రాచీన భారతదేశపు ప్రముఖ వ్యాకరణవేత్త అనీ!
- ... వ్యవసాయ రంగానికి మద్ధతుగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అనీ!
- ... నాయకురాలు నాగమ్మ పలనాటి సీమలో తొలి మహిళా మంత్రిగా పనిచేసిన శక్తివంతమైన నాయకురాలనీ!
- ... MTR గా పేరు గాంచిన మావల్లి టిఫిన్ రూమ్ బెంగుళూరులో ప్రారంభమైన సంస్థ అనీ!
07 వ వారం
- ... చెన్నైకి సమీపంలో ఉన్న కడలూర్ బ్రిటిష్ పాలనలో ముఖ్యమైన ఓడరేవుగా ఉండేదనీ!
- ... ది గెజిట్ ఆఫ్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వం అధికారిక పత్రాలు ప్రచురిస్తుందనీ!
- ... అమెరికాకు చెందిన డేనియల్ కిష్ అంధుల శక్తిసామర్థ్యాలను గుర్తించేందుకు, మెరుగుపరిచేందుకు స్వచ్ఛంద సంస్థను స్థాపించిన వ్యక్తి అనీ!
- ... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగర్తలా పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో భాగంగా ప్రారంభించిన 20 కొత్త ఐఐటీల్లో ఒకటనీ!
- ... విశిష్ట సాహిత్యంగా పరిగణించబడే కథాసరిత్సాగరము గ్రంథకర్త సోమదేవుడు అనీ!
08 వ వారం
- ... లారస్ ల్యాబ్స్ హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ మందుల సరఫరా సంస్థ అనీ!
- ... మొట్టమొదటగా మల్టి టచ్ సౌకర్యంతో వచ్చిన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ అనీ!
- ... మైల్స్వామి అన్నాదురై ని మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారనీ!
09 వ వారం
- ... భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా 100 టెస్టులాడిన 13 వ భారతీయ క్రికెటర్ అనీ!
- ... శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్న ద్వారకా తిరుమల ను చిన్న తిరుపతి అని వ్యవహరిస్తారనీ!
- ... కాసాబ్లాంకా మూడు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు అందుకున్న చిత్రం అనీ!
- ... తమిళనాడులోని శివగంగ పట్టణంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన శివగంగై కోట ఉందనీ!
- ... యవుజ్ సుల్తాన్ సెలిం బ్రిడ్జి ఐరోపా, ఆసియాలను కలుపుతుందనీ!
10 వ వారం
- ... షాన్ గా పేరుపొందిన భారతీయ గాయకుడి అసలు పేరు శంతను ముఖర్జీ అనీ!
- ... కొల్లూరు మూకాంబిక దేవాలయం లో మహా లక్ష్మి, మహా సరస్వతి, మహా కాళి కలిసి ఉన్న రూపం ఉంటుందనీ!
- ... బెల్‌గ్రేడ్ ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి మానవావాసంగా ఉన్న నగరాల్లో ఒకటనీ!
- ... భారతదేశంలో మొట్టమొదటి యాంటీ బయోటిక్ తయారీ సంస్థ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అనీ!
- ... బైబిల్ కథానాయకుడు డేవిడ్ విగ్రహాన్ని మైఖేలాంజిలో 1500 వ దశకంలో సృష్టించాడనీ!
11 వ వారం
- ... శాస్ర్తవేత్త క్లాడ్ షానన్ ను సమాచార సిద్ధాంత పితామహుడిగా భావిస్తారనీ!
- ... సంస్కృత కవి కాళిదాసు పేరు మీదుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ పురస్కారం అందజేస్తుందనీ!
- ... కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ప్రధానంగా మాట్లాడే కొడవ భాష అంతరించిపోతున్న ద్రవిడభాష అనీ!
- ... తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి దేవాలయం వైష్ణవులు కీర్తించే 108 దివ్యదేశాల్లో ఒకటనీ!
- ... ప్రపంచంలో అందరికీ విద్యకు సంబంధించిన వనరులు రూపొందించడం కోసం ఉచిత విద్యా వనరులు ఉన్నాయనీ!
12 వ వారం
- ... జుబేదా మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం ఆలం ఆరా చిత్రంలో నటించిన నటీమణి అనీ!
- ... కాకతీయుల కాలం నాటి ఆది మహావిష్ణువు ఆలయం తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో 2015లో బయట పడిందనీ!
- ... ఆధునిక గ్రీకు వర్ణమాల లో 24 అక్షరాలు ఉంటాయనీ!
- ... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన మేఘా-ట్రోపిక్స్ జల చక్రాన్ని అధ్యయనం చేస్తుందనీ!
- ... పంట వలయాలు పంట చేలల్లో కొంత భాగాన్ని చదును చేసి ఏర్పాటు చేసే రకరకాల ఆకృతులనీ!
13 వ వారం
- ... రాణి కమలాపతి 18 వ శతాబ్దానికి చెందిన గోండు జాతి రాణి అనీ!
- ... పశ్చిమ క్షాత్రపులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పలు బౌద్ధ గుహలను నిర్మించారనీ!
- ... 1959 లో విడుదలైన ఆంగ్ల చిత్రం బెన్ హర్ మొత్తం 11 విభాగాల్లో ఆస్కార్ పురస్కారం సాధించిందనీ!
- ... డిమార్ట్ ను వాల్‌మార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!
- ... ప్రపంచమంతటా మంచి ప్రజాదరణ పొందిన రూబిక్స్ క్యూబ్ పజిల్ సృష్టికర్త ఎర్నో రూబిక్ అనీ!
14 వ వారం
- ... శాస్త్రీయ సంగీత విద్వాంసుడు డి వి మోహన కృష్ణ నాటక రంగ ప్రముఖుడు డి. వి. సుబ్బారావు మనవడనీ!
- ... జోర్డాన్ లోని పెట్రా చారిత్రక కట్టడాలకు పేరు గాంచిందనీ!
- ... కర్ణాటకలో పుట్టిన భద్ర నది, తుంగ నదితో కలిసి తుంగభద్ర నదిగా మారి, ఆంద్రప్రదేశ్ లో కృష్ణానదిలో కలుస్తుందనీ!
- ... నృత్య, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన 40 ఏళ్ళ లోపు అత్యుత్తమ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందజేస్తారనీ!
- ... తమిళనాడులోని వెల్లూరు తోలు ఉత్పత్తుల ఎగుమతిలో ప్రసిద్ధి పొందిందనీ!
15 వ వారం
- ... జయంత భట్టుడు న్యాయదర్శనంపై గ్రంథాలు రాసిన సంస్కృత పండితుడు అనీ!
- ... రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు సమైక్యం అయ్యేందుకు ఏర్పడ్డ సంస్థ ఐరోపా సమాఖ్య అనీ!
- ... నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్, ఆమె భర్త కలిసి కళల్లో సాంప్రదాయ విలువల పరిరక్షణ కోసం కళాక్షేత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేశారనీ!
- ... భూమిపై అన్నింటికన్నా పైన ఉండే పొర భూపటలం మొత్తం భూమి పరిమాణంలో ఒక్క శాతమే ఉంటుందనీ!
- ... రాణి తేనెటీగ రోజుకు 2000 దాకా గుడ్లు పెట్టగలదనీ!
16 వ వారం
- ... అమెరికాలో జన్మించిన గన్నవరం లలిత్ ఆదిత్య చిన్న వయసు నుంచే అవధానాలు చేస్తున్నాడనీ!
- ... బేరి పండ్లలో 83 శాతం నీరు ఉంటుందనీ!
- ... తమిళనాడులోని థేని పట్టణంలో దక్షిణ భారతదేశంలో నాలుగవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉందనీ!
- ... ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రపంచంలో అత్యంత అధికారిక మరియు విస్తృతంగా ఉపయోగించే నిఘంటువులలో ఒకటనీ!
- ... భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు రాజస్థాన్ లోని సంభార్ ఉప్పు సరస్సు అనీ!
17 వ వారం
- ... ఇస్రో లో ఇంటర్ ప్లానెటరీ మిషన్ కు నాయకత్వం వహించిన మొదటి మహిళ ముత్తయ్య వనిత అనీ!
- ...మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దక్షిణ భారతదేశంలో ఏర్పాటయిన మొట్టమొదటి సంగీత పీఠాల్లో ఒకటనీ!
- ... సంతోషిమాత ను ఆరాధించే భక్తులు పులుపు తినరాదనే నియమం ఉందనీ!
- ... సుడోకు క్యూబ్ అనేది సుడోకు, రూబిక్స్ క్యూబ్ కలగలిసిన ప్రహేళిక అనీ!
- ... 2018లో అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభించారనీ!
18 వ వారం
- ... రాజేష్ టచ్‌రివర్ సామాజిక సమస్యలపై తీసే చిత్రాలతో గుర్తింపు పొందాడనీ!
- ... అమెరికాలోని షికాగో లో ప్రత్యేకించి మహిళలు, పిల్లల కోసం ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ అనే దుకాణం ఉందనీ!
- ... కాంచీపురంలోని ఉలగలంద పెరుమాళ్ ఆలయం వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్యదేశాల్లో ఒకటనీ!
- ... మానవ దృష్టికి ప్రధామైన దృష్టి నాడి మెదడుకు దృశ్యాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుందనీ!
- ... గణిత శాస్త్రంలో ముఖ్యమైన విభాగమైన బీజ గణితం లో పురాతన భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేశారనీ!
19 వ వారం
- ... రాణి శంకరమ్మ ఆంథోల్ సంస్థానాన్ని పాలించిన మహారాణి అనీ!
- ... తమిళనాడు శ్రీరంగం ఆలయంలో శ్రీరంగనాథుని సతి రంగనాయకి అమ్మవారు అనీ!
- ... ఆంగ్ల చిత్రాలలో ప్రముఖ స్థానం సాధించిన లారెన్స్ ఆఫ్ అరేబియా థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ అనే బ్రిటీషు సైనికుడి జీవితం ఆధారంగా రూపొందినదనీ!
- ... సంగీత పరికరంగా ఉపయోగిస్తున్న ట్రంపెట్ ఒకప్పుడు యుద్ధాలలో, వేటలో సిగ్నల్స్ కోసం వాడేవారనీ!
- ... సంపీడన వాయువు ను పరిశ్రమల్లో వివిధ అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారనీ!
20 వ వారం
- ... రోబోటిక్స్ అనే పద సృష్టికర్త వైజ్ఞానిక కల్పనా రచయిత ఐజాక్ అసిమోవ్ అనీ!
- ... హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ నిజాం రాజు 1846 లో నిర్మించాడనీ!
- ... వంపులు తిరిగిన రోడ్లపైన వాహనాలు జారిపోకుండా అభికేంద్ర బలం పని చేస్తుందనీ!
- ... హిమాలయాల్లోని గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడిన అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఆలయమనీ!
- ... కర్ణాటక సంగీతంలో హేమవతి రాగం నాదస్వర విద్వాంసులకు ప్రీతికరమైనదనీ!
21 వ వారం
- ... ప్రముఖ నర్తకి చంద్రలేఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ మేనకోడలు అనీ!
- ... హార్మోన్ అనే రసాయనాలు శరీరంలో చాలా రకాలైన జీవక్రియలను నియంత్రిస్తాయనీ!
- ... కేరళ లోని తిరువనంతపురం లో సా.శ.పూ 1000 నుంచి దేశ విదేశాలతో వర్తకం జరుగుతున్నదనీ!
- ... సిరిసిల్ల వ్యవసాయ కళాశాల తెలంగాణా రాష్ట్రంలో రెండవ వ్యవసాయ కళాశాల అనీ!
- ... పిల్లల కోసం బొమ్మ ఇటుకలు తయారు చేసే లెగో గ్రూప్ ప్రధాన కార్యాలయం డెన్మార్క్ లో ఉందనీ!
22 వ వారం
- ... డినా బొలౌర్టే పెరూ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలనీ!
- ... నాడీకణం శరీరంలో వివిధ క్రియలను నియంత్రించే నాడీ వ్యవస్థలో ప్రధాన భాగమనీ!
- ... శ్రీవైష్ణవుల ఆలోచనా సరళిని అనుసరించి రాయబడిన మొట్టమొదటి గద్యం శ్రీరంగ గద్యం అనీ!
- ... గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం భారత కేంద్రప్రభుత్వం గురుకుల విద్యావిధానంలో నిర్వహిస్తున్న పాఠశాల వ్యవస్థ జవహర్ నవోదయ విద్యాలయం అనీ!
- ... కాటన్ జిన్ యంత్రం పత్తిని వాటి విత్తనాలను వేరు చేసి మానవ శ్రమ తగ్గిస్తుందనీ!
23 వ వారం
- ... అనురూప రాయ్ ఇప్పటికీ తోలు బొమ్మలాట కళను కొనసాగిస్తున్నదనీ!
- ... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పునర్వినియోగ ప్రయోగ వాహలను పరీక్షించడానికి హైపర్సోనిక్ ఫ్లైట్ ప్రయోగం చేసిందనీ!
- ... బెంగాల్ ప్రాంతానికి చెందిన కూచ్ బెహార్ రాచరిక వారసత్వఅవశేషాలతో కూడిన ఏకైక ప్రణాళిక బద్ధమైన నగరమనీ!
- ... యునైటెడ్ కింగ్‌డం లో సెవెర్న్ నది చారిత్రకంగా ఒక ముఖ్యమైన రవాణా మార్గంగా ఉందనీ!
- ... లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే క్యాథోడ్ రే ట్యూబుల కన్నా తక్కువ శక్తిని వినియాగిస్తాయి అనీ!
24 వ వారం
- ... బోని గాబ్రియేల్ 2022 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్నదనీ!
- ... అవగాడ్రో స్థిరాంకం అణువులనూ, పరమాణువులను లెక్కించడానికి వాడే ప్రాథమిక భౌతిక స్థిరాంకం అనీ!
- ... పూర్తి స్థాయి ఫోరెన్సిక్ సైన్సుకు అంకితమైన జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం గుజరాత్ లో ఉందనీ!
- ... పొన్నియిన్ సెల్వన్ తమిళ సాహిత్య చరిత్రలో గొప్ప నవలలో ఒకటిగా పరిగణించబడుతుందనీ!
- ... గ్రామ్‌ఫోన్ లో పాటలు మళ్ళీ మళ్ళీ వినడానికి ఫోనోగ్రాఫ్ రికార్డ్ వాడతారనీ!
25 వ వారం
- ... బాలీవుడ్ నటి నూతన్ తన సహజ సిద్ధమైన నటనకు పేరు గాంచిందనీ!
- ... పాలపిట్ట సైక్లింగ్ పార్కు భారతదేశంలో మొట్టమొదటి సైక్లింగ్ పార్కు అనీ!
- ... పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ చారిత్రక ప్రసిద్ధి చెందిన నగరమనీ!
- ... గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్ అమెరికాలో సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశమనీ!
- ... జీరో షాడో డే రోజున కొన్ని నిమిషాల పాటు వస్తువుల నీడ కనిపించదనీ!
26 వ వారం
- ... రామానుజాచార్యుడు తన శిష్యుడైన పరాశర భట్టర్ ను తన తదనంతరం శ్రీవైష్ణవానికి ఉత్తరాధికారిగా నియమించాడనీ!
- ... బ్రెజిల్ లో జరిగే రియో కార్నివాల్ ప్రపంచంలో అతి పెద్ద ఉత్సవంగా పరిగణించబడుతుందనీ!
- ... గ్రావిటీ డ్యామ్ నీటిని నిలుపుకోవడానికి గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడుతుందనీ!
- ... హంపిలోని లోటస్ మహల్ విజయనగర సామ్రాజ్య కాలంలో అంతఃపుర స్త్రీల వినోదం కోసం నిర్మించబడినదనీ!
- ... 2023 సుడాన్ అల్లర్ల నుంచి భారతీయులను తరలించడానికి ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిందనీ!
27 వ వారం
- ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికల్లో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు అనీ!
- ... కర్ణాటకలోని మంగుళూరులో ఉన్న పనంబూరు బీచ్ అత్యంత సురక్షితమైన సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటనీ!
- ... ఎల్లప్పుడూ పారే నీటి మధ్యలో వంతెనను నిర్మించడానికి కాఫర్‌డ్యామ్ వాడతారనీ!
- ... నేపాల్, టిబెట్ లో లభించే చుర్పి అనే జున్నును మజ్జిగ నుంచి తయారు చేస్తారనీ!
- ... భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పారిశ్రామిక వస్తువులకు బిఐఎస్ ప్రామాణిక గుర్తింపు ఇస్తుందనీ!
28 వ వారం
- ... 2021 లో సామాజిక శాస్త్రాలలో కృషికి గాను ప్రతీక్ష బక్షి ఇన్ఫోసిస్ ప్రైజు గెలుచుకుందనీ!
- ... కర్ణాటక లోని కోటిలింగేశ్వర దేవాలయం లోని శివలింగం ప్రపంచంలోని అతి పెద్ద శివలింగాల్లో ఒకటనీ!
- ... కాంప్‌బెల్ బే జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ప్రసిద్ధ వన్యప్రాణి అభయారణ్యం అనీ!
- ... పీతల్లో అతిపెద్దది, తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే కొబ్బరి పీత జాతికి చెందినదనీ!
- ... ఎవరెస్టు పర్వతం తర్వాత రెండవ అత్యంత ఎత్తయిన పర్వతం కే2 అనీ!
29 వ వారం
- ... బీహార్ కు చెందిన సుభద్రా దేవి మధుబని చిత్రకళలో పేరు గాంచిందనీ!
- ... కేరళను పాలించిన ట్రావెన్ కూర్ రాజులు 1859 వరకు రొమ్ము పన్ను విధించే వారనీ!
- ... మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో భాగమైన కైలాస దేవాలయం ఒకేరాతితో చెక్కబడిన అతిపెద్ద దేవాలయాల్లో ఒకటనీ!
- ... తెలుగు క్లాసిక్ గోరింటాకు (1979) చిత్రంలోని కథానాయకి వక్కలంక పద్మ ఇప్పుడొక అంతర్జాతీయ జర్నలిస్ట్ అనీ!
- ... నేపాల్ కు చెందిన షెర్పా ప్రజలు పర్వతారోహణకు ప్రసిద్ధి చెందిన వారనీ!
30 వ వారం
- ... క్రికెట్ క్రీడాకారిణి శుభాంగి కులకర్ణి 1985లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకుందనీ!
- ... జమ్ము కాశ్మీర్ లోని గుల్మార్గ్ అందమైన పూలతోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!
- ... మరాఠ్వాడా నిజాం పాలనలో మరాఠీ మాట్లాడే వారితో ఏర్పడ్డ ప్రాంతమనీ!
- ... చెన్నైలోని అడయార్ ప్రాంతంలో 450 సంవత్సరాల వయసు కలిగిన పురాతన అడయార్ మర్రి చెట్టు ఉందనీ!
- ... జపాన్ లో ఉన్న ఎషిమా ఒహాషి వంతెన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వంతెన అనీ! (చిత్రంలో)
31 వ వారం
- ... చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ సాధించిన మహిళా గ్రాండ్ మాస్టర్ సుబ్బరామన్ విజయలక్ష్మి అనీ!
- ... భారతదేశంలో పండించే స్ట్రాబెర్రీలలో 85 శాతం మహాబలేశ్వర్ ప్రాంతంలో పండుతాయనీ!
- ... మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ నిర్మాణానికి అయిన ఖర్చుకు 400 రెట్లు వసూళ్ళు సాధించిందనీ!
- ... ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందనీ!
- ... కేరళలోని కిలిమనూరు ప్యాలెస్ ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ పూర్వీకుల జన్మస్థలం అనీ!
32 వ వారం
- ... యునైటెడ్ కింగ్‌డం కి మొదటి మహిళా ప్రధాన మంత్రిగానే కాక ఆ పదవిలో దీర్ఘకాలం ఉన్నది మార్గరెట్ థాచర్ అనీ!
- ... మహారాష్ట్రకు చెందిన విదర్భ ప్రాంతం ఒకప్పుడు శాతవాహనుల పరిపాలనలో ఉండేదనీ!
- ... విశాఖ వ్యాలీ స్కూల్ విశాఖపట్నంలోని పురాతన పాఠశాలల్లో ఒకటనీ!
- ... కన్యాకుమారిలో ఉన్న ప్రాచీన తమిళ కవి తిరువళ్ళువర్ విగ్రహం ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమనీ!
- ... సాహస క్రీడ బంగీ జంపింగ్ న్యూజీలాండ్ కి చెందిన ఎ. జె. హ్యాకెట్ ప్రయత్నాల వల్ల ప్రాచుర్యంలోకి వచ్చిందనీ!
33 వ వారం
- ... వరంగల్లుకు చెందిన మనోహర్ చిలువేరు చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి పొందినవాడనీ!
- ... ముదుమలై నేషనల్ పార్క్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణుల అభయారణ్యమనీ!
- ... యుకె లో ప్రజా రవాణా కోసం డబుల్ డెక్కర్ బస్సులను బాగా వాడతారనీ!
- ... ఉత్తరాఖండ్ లోని ధారీ దేవి ఆలయం రోజులో మూడు పూటల మూడు రూపాలలో పూజలు అందుకుంటుందనీ!
- ... న్యూఢిల్లీలో పార్లమెంటు ఉన్న వీధికి సంసద్ మార్గ్ అంటారనీ!
34 వ వారం
- ... భట్టోజి ధీక్షితులు సంస్కృత వ్యాకరణ గ్రంథమైన సిద్ధాంత కౌముది రచయిత అనీ!
- ... ఇజ్రాయెల్ జాతీయ పతాకంలోని నక్షత్రం జుడాయిజంతో అనుబంధం కలిగిఉన్నదనీ!
- ... కేరళలోని కొట్టాయం ను ద సిటీ ఆఫ్ లెటర్స్ అని పిలుస్తారనీ!
- ... ఒక నిర్దిష్టమైన సంఘటనలు, ముఖ్యమైన వ్యక్తులు లేదా సంఘటనలు గౌరవించుకోవడానికి స్మారక నాణెం విడుదల చేస్తారనీ!
- ... భారతదేశానికి రిజర్వు బ్యాంకు లాగే అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ పనిచేస్తుందనీ!
35 వ వారం
- ... రాజా పృథు 13వ శతాబ్దానికి చెందిన ఈశాన్య భారతదేశపు పరిపాలకుడనీ!
- ... భారత్, సోవియట్ యూనియన్ మైత్రికి చిహ్నంగా మైత్రి బాగ్ స్థాపించబడిందనీ!
- ... అన్నామలై యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో దూరవిద్యను అందించే మొట్టమొదటి భారతీయ విశ్వవిద్యాలయం అనీ!
- ... మామూలు కోళ్ళతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి లో 25 శాతం ఎక్కువ పోషకాలు ఉంటాయనీ!
- ... సుదూర ప్రాంతాలకు ధ్వని, ఇంకా ఇతర మాధ్యమాలను ప్రసారం చేసే సాంకేతికతను టెలిఫోనీ అంటారనీ!
36 వ వారం
- ... మరాఠీ గాయకురాలు అంజలి మరాఠీ 16 సంవత్సరాల వయసులోనే జాతీయ పురస్కారం అందుకుందనీ!
- ... చక్కట్ల దండ కవి దాసు శ్రీరాములు రాసిన అచ్చ తెలుగు శతకం అనీ!
- ... పండగలు, ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు స్మరించుకోవడానికి గూగుల్ మొదటి పేజీలో గూగుల్ డూడుల్ ప్రదర్శిస్తారనీ!
- ... ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న యోగా సాంప్రదాయానికి పతంజలి యోగసూత్రాలు మూల గ్రంథమనీ!
- ... ఉడుములు ప్రపంచంలో అతిపెద్దదైన బల్లి జాతి అనీ!
37 వ వారం
- ... పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి పదవికి ఎన్నికైన అమెరికా ఖండం నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి అనీ!
- ... ఎలక్ట్రికల్ ఉపకరణాలు తయారు చేసే హావెల్స్ సంస్థ 50 కి పైగా దేశాలలో కార్యాలయాలు కలిగిఉందనీ!
- ... కావడి ఆట్టం తమిళనాడులో సుబ్రహ్మణ్యారాధనలో భాగంగా చేసే జానపద నృత్యం అనీ!
- ... చెక్ రిపబ్లిక్ రాజధానియైన ప్రేగ్ లో 1410 లో స్థాపించిన ఖగోళ గడియారం ఇప్పటికి కూడా పనిచేస్తున్నదనీ!
- ... సోనామార్గ్ జమ్మూ కాశ్మీర్ లో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం అనీ!
38 వ వారం
- ... పందిరి గురువు పల్నాడుకు చెందిన సంఘ సంస్కర్త, హేతువాది, స్వాతంత్ర్య సమరయోధుడనీ!
- ... కర్ణాటకలోకి కొడగు ప్రాంతానికి చెందిన నాగరహోళె జాతీయ ఉద్యానవనం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ లో భాగమనీ!
- ... తమిళనాడులోని కుంబకోణంలో పన్నెండేళ్లకొకసారి జరిగే మహామహం పండగ లక్షలాది భక్తులను ఆకర్షిస్తుందనీ!
- ... నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు ని ద ఫ్లయింగ్ డచ్ మెన్ అని పిలుస్తారనీ!
- ... విజయవాడలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల రెండో వారంలో గుణదల మేరీమాత ఉత్సవం జరుగుతుందనీ!
39 వ వారం
- ... పురాతమైన సంతాలీ భాష కోసం ప్రత్యేకమైన లిపిని సృష్టించింది రఘునాథ్ ముర్ము అనీ!
- ... కేరళలోని జటాయువు నేచర్ పార్క్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పిన మొదటి ప్రాజెక్టు అనీ!
- ... హృదయ కండరానికి పునరుద్ధరించడం కోసం హృద్ధమని వ్యాకోచ చికిత్స చేస్తారనీ!
- ... జాతీయ సివిల్ సర్వీసుల సిబ్బందికి శిక్షణ, సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ కర్మయోగి పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసిందనీ!
- ... గుంటూరుకు చెందిన ముస్లిం భక్తుడు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన సేవ ప్రారంభమైందనీ!
40 వ వారం
- ... విష్ణుభక్తులలో ఒకడైన నమ్మాళ్వార్ మహావిష్ణువు సైన్యానికి ప్రధాన సేనాధిపతి అయిన విష్వక్సేనుడి అవతారంగా భావిస్తారనీ!
- ... తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగ భాగం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచే జరుగుతోందనీ!
- ... ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో భాగమైన బరోడా రాష్ట్రం మరాఠా గైక్వాడ్ వంశస్థుల పాలించిన రాజ్యం అనీ!
- ... 1857 లో భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే భారత సిపాయిలు ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా వెల్లూరు తిరుగుబాటు చేశారనీ!
- ... కావ్యప్రకాశము అనే గ్రంథాన్నిమొదటిసారిగా పరిచయం చేసింది మమటాచార్య అనే పండితుడనీ!
41 వ వారం
- ... ఐఎఎస్ అధికారి పాపారావు బియ్యాల మాదకద్రవ్య రహిత క్రీడల కోసం కృషి చేశాడనీ!
- ... గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ప్రణాళికాబద్ధమైన నగరమనీ!
- ... చెక్కభజనలు తెలుగు వారి సాంప్రదాయాల్లో ఒక భాగమనీ!
- ... స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకమైంది, భారతదేశంలో స్వపరిపాలనే ధ్యేయంగా ప్రారంభమైన ఉద్యమం స్వదేశీ ఉద్యమం అనీ!
- ... అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అక్కినేని కుటుంబ సభ్యులు సినిమారంగం కోసం స్థాపించిన సంస్థ అనీ!
- ... చిక్కబల్లాపూర్ శాసన సభ్యుడు ప్రదీప్ ఈశ్వర్ 10వ బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడనీ!
42 వ వారం
- ... కర్ణాటకకు చెందిన ఆర్.గణేష్ ఎనిమిది భాషలలో శతావధానం చేసిన అవధాని అనీ!
- ... దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం పేరు మీదుగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ను ప్రోటీస్ అని పిలుస్తారనీ!
- ... లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ రాష్ట్రంలో 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయమనీ!
- ... ఉడిపి అనంతేశ్వర దేవాలయం లో పరశురాముడు లింగరూపంలో కొలువై ఉంటాడనీ!
- ... సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వంలో అవినీతి సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటైన సంస్థ అనీ!
43 వ వారం
- ... మైత్రేయి ప్రాచీన భారతదేశంలో వేద కాలానికి చెందిన మహిళా తత్వవేత్త అనీ!
- ... ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ద్వారా బ్రిటిష్ ఇండియా పాలనలో భారతీయుల ప్రమేయాన్ని పెంపొందించిందనీ!
- ... ఢిల్లీలోని ప్రముఖులు నివసించే రేస్ కోర్సు రోడ్డును ఇటీవల లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చారనీ!
- ... 2019 లో ఫ్రీఫైర్ వీడియోగేమ్ ను అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్నారనీ!
- ... చంద్రా లోకం అనేది జయదేవుడు రాసిన అలంకార గ్రంథం అనీ!
44 వ వారం
- ... చంద్రగోమిన్ నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఒక పురాతన కవి అనీ!
- ... పిల్లల టీవీ ధారావాహిక ఛోటా భీమ్ హైదరాబాదు కేంద్రంగా ఉన్న గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ రూపొందిస్తుందనీ!
- ... లేజర్ నెట్ శక్తివంతమైన కాంతికిరణాల ద్వారా ఇంటర్నెట్ ను అందించే సాంకేతికత అనీ!
- ... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) భారతదేశంలో అన్ని ప్రభుత్వాలను ఆడిట్ చేసే సంస్థ అనీ!
- ... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లోయ విశాలమైన ఆపిల్ తోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!
45 వ వారం
- ... 27 సార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన ఘనత సాధించిన పర్వతారోహకుడు కమీ రీటా అనీ!
- ... ఉడిపి శ్రీ కృష్ణ మఠం 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు స్థాపించిన మఠం అనీ!
- ... శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఉన్న బహుళ ప్రయోజక క్రీడా మైదానం అనీ!
- ... సులభ్ ఇంటర్నేషనల్ భారతదేశంలో అతిపెద్ద లాభాపేక్ష రహిత సంస్థగా పేరు గాంచిందనీ!
- ... క్రికెట్ ఆటను ఒలింపిక్ క్రీడల్లో ఒకే ఒక్కసారి 1900 లో ఆడారనీ, అప్పుడు ఫ్రాన్స్ రెండవ స్థానంలో నిలిచిందనీ!
46 వ వారం
- ... రైల్వే రక్షక దళానికి చెందిన రేఖా మిశ్రా వందలాది మంది తప్పిపోయిన పిల్లలను కనుగొన్నందుకు గాను నారీశక్తి పురస్కారం అందుకున్నదనీ!
- ... భారతదేశంలో అత్యంత పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి అలోపిబాగ్ లో ఉందనీ!
- ... భారతదేశపు తొట్టతొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు అనీ, ఆమె సి.కె.నాయుడు కుమార్తె అనీ!
- ... బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అతి పెద్ద పరిపాలనా విభాగమనీ!
- ... కామన్‌వెల్త్ క్రీడలను అన్నింటికన్నా ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఆస్ట్రేలియా అనీ!
47 వ వారం
- ... రీటా ఫారియా అందాల పోటీలో గెలిచిన మొట్టమొదటి ఆసియా మహిళ అనీ!
- ... 1975 క్రికెట్ ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్‌తో ఆడుతూ సునీల్ గవాస్కర్, మొత్తం 60 ఓవర్లూ బ్యాటింగు చేసి, 174 బంతులు ఆడి, 36 పరుగులే చేసాడనీ!
- ... 2018 లో భారత సుప్రీం కోర్టు కఠినమైన షరతులతో కూడిన చనిపోయే హక్కు కల్పించిందనీ!
- ... తెలుగు సాహిత్యాన్ని డిజిటైజేషన్ చేసే మనసు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మన్నం వెంకటరాయుడు అనీ!
- ... మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రసిద్ధి చెందినదనీ!
48 వ వారం
- ... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలితరం నటీమణుల్లో ఆస్టా నీల్సన్ ఒకరనీ!
- ... ఒకప్పుడు క్రికెట్లో అండర్‌ఆర్మ్ బౌలింగే సరైనదనీ, ప్రస్తుత బౌలింగు యాక్షను అప్పటి క్రికెట్ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమనీ!
- ... భారతీయ సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం సింగపూరు దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనీ!
- ... మామూలు బియ్యానికి మరిన్ని పోషకాలు జోడించి బలవర్ధక బియ్యం తయారు చేస్తారనీ!
- ... వసుచరిత్రము కవిత్రయ భారతంలోని కథను విస్తరిస్తూ రామరాజ భూషణుడు రాసిన కావ్యమనీ!
49 వ వారం
- ... ఒడిషాకు చెందిన సబర్మతీ టికి సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించే స్వచ్ఛంద సేవకురాలనీ!
- ... టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు తరఫున మొట్టమొదటి శతకం సాధించిన ఆటగాడు లాలా అమర్నాథ్ అనీ!
- ... నిజాం వ్యాయామ కళాశాల 1911 లో నిజాం రాజు ఏర్పాటు చేసిన వ్యాయామ కళాశాల అనీ!
- ... గేట్ టవర్ మధ్యయుగానికి చెందిన కోట ప్రవేశ ద్వార నిర్మాణ శైలి అనీ!
- ... ఎర్నెస్ట్ హెమింగ్వే 1954 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న రచయిత అనీ!
50 వ వారం
- ... చానమాంబ తొలితరం ఆంధ్ర కవయిత్రులలో ఒకటనీ!
- ...ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్, భారత్ రెండు దేశాలకూ క్రికెట్ టెస్టులు ఆడాడనీ!
- ... తెలుగు చారిత్రాత్మక నవల బంకోలా బ్రిటిష్ కాలం నాటి సామాజిక పరిస్థితులను ఆధారం చేసుకుని రాసిన రచన అనీ!
- ... ఐక్యరాజ్యసమితి 2023 ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందనీ!
- ... దక్కన్ జింఖానా గ్రౌండ్ మహారాష్ట్ర లోని పూణే లో 1906 లో స్థాపించిన క్రీడా మైదానం అనీ!
51 వ వారం
- ... బాబ్ బీమన్ 1968 లో లాంగ్ జంప్ లో నెలకొల్పిన ప్రపంచ రికార్డు 23 ఏళ్ళ పాటు అలాగే ఉందనీ!
- ... క్రికెట్‌లో ఒక రకమైన రనౌట్‌ను అనధికారికంగా మన్కడింగ్ అంటారనీ, అది ప్రఖ్యాత భారత క్రికెటరు వినూ మన్కడ్ నుండి వచ్చిందనీ!
- ... నాగేంద్ర ప్రసాద్ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ మూడవ కుమారుడు అనీ!
- ... ప్రాచీన సంస్కృత గద్యమైన వాసవదత్త గ్రంథ రచయిత సుబంధుడు అనీ!
- ... భారతదేశపు పట్టణాలు, నగరాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభించారనీ!
52 వ వారం
- ... అమెరికాకు చెందిన కార్ల్ లూయిస్ అత్యధిక ఒలంపిక్ పతకాలు గెలుచుకున్న వారిలో ఒకడనీ!
- ... ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 1882లో క్రికెట్ సిరీస్‌ను ఓడిపోయినపుడు ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక, ఇంగ్లీష్ క్రికెట్ మరణించిందనీ, శవాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్తారనీ రాసినపుడు, యాషెస్ సీరీస్ పుట్టిందనీ!
- ... గ్రాంట్ ఫ్లవర్ జింబాబ్వే దేశపు అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకడనీ!
- ... సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రజాప్రయోజనాల కోసం ఆహార పరిశోధన లాంటి కార్యక్రమాలు చేపడుతుందనీ!
- ... కార్ల్ జంగ్ మానసిక విశ్లేషణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాడనీ!