వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2016
2016 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు |
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 |
01 వ వారం
మార్చు- ...తెలుగులో "వసంతసేన" పేరుతో నిర్మించిన సినిమా మృచ్ఛకటికమ్ అనే సంస్కృత నాటక ఆధారమనీ!(చిత్రంలో "వసంతసేన")
- ...బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి తెలుగు చిత్రం "పాండవ వనవాసం" నకు డబ్బింగ్ చేసిన వారు పి.సాంబశివరావు అనీ!
- ...నాలుగు దశాబ్దాలపాటు సినిమా పోస్టర్ రూపకల్పనలో అద్భుతాలు సృష్టించిన డిజైనర్ ఈశ్వర్ అనీ!
- ...ప్రతిఫలాన్ని ఆశించకుండా సంగీతాన్ని విద్యార్థులకు చేరవేయుట కొరకు సారణి సంగీతవిద్యాసంస్థ నడుపుతున్న సంగీతకారుడు నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి అనీ!
- ... 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించిన ముంబై క్రికెట్ క్రీడాకారుడు ప్రణవ్ ధనవాడే అనీ!
02 వ వారం
మార్చు- ...శ్రీపాద శ్రీ వల్లభ కురుపురం లో తన జీవితంలో చాలా కాలం బస చెసారనీ!(చిత్రంలో శ్రీపాద వల్లభ)
- ...గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా "అదృష్టదీపుడు" లో కథానాయకుడు రామశర్మ అనీ!
- ...సింహాచల క్షేత్రంలోని ప్రధాన అర్చామూర్తియైన వరాహలక్ష్మీనారసింహస్వామి నిజరూప విగ్రహం త్రిభంగ భంగిమలోనే ఉంటుందనీ!
- ...పోస్టర్ డిసైనింగ్ విజ్ఞాన సర్వస్వం గా పేరుపొందిన ఈశ్వర్ రచించిన పుస్తకం సినిమా పోస్టర్ అనీ!
- ...సూర్యుడు ప్రత్యక్ష దైవమని నమ్మి సూర్యశతకము ను రచించిన ప్రఖ్యాత సంస్కృత వాజ్మయ కవి మయూరుడు అనీ!
03 వ వారం
మార్చు- ...మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ గీతా ప్రెస్ అనీ!
- ...తెలుగులో ఆలిండియా రేడియోలో మొట్టమొదటి వ్యాఖ్యానకర్త రేడియో తాతయ్య అనీ!
- ...సూర్యుని వల్ల వచ్చిన వరం అయిన శమంతకమణి కారణంగానే సత్రాజిత్తు మరణించాడనీ!
- ...కేశనాళిక ఫీడ్ ఫౌంటెన్ పెన్ యొక్క ఆవిష్కర్త లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్ అనీ!
- ... నెహ్రూ "నా మీద కూడా నువ్వు కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా" అని శంకర్ పిళ్ళై ని కోరారనీ!
04 వ వారం
మార్చు- ...మలేసియా లో అతి ఎత్తైన విగ్రహం మురుగన్ విగ్రహం అనీ!
- ...భారతదేశంలోని తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అనీ!
- ...సంగీత రూపకాలు, యక్షగానాలు తో విజయవాడ రేడియో కేంద్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వారు ఓలేటి వెంకటేశ్వర్లు అనీ!
- ...గురజాడ అప్పారావుకు అంకితమిస్తూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు అందించిన పుస్తకం తప్పక చదవాల్సిన వంద కథానికలు అనీ!
- ..."బ్లాక్ టైగర్" గా పిలువబడే భారతదేశ భారతీయ రహస్య ఏజెంటు, దేశభక్తుడు రవీందర్ కౌశిక్ అనీ!
05 వ వారం
మార్చు- ..."ఏ ప్యాషన్ ఫర్ డాన్స్" పేరిట ఆత్మకథను వ్రాసింది ప్రముఖ నాట్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి అనీ!(చిత్రంలో)
- ...ఆలిండియా రేడియోలో ప్రసారం కాబడిన "కార్మికుల కార్యక్రమం" లో "చిన్నక్క" గా సుప్రసిద్ధులు వి.రతన్ ప్రసాద్ అనీ!
- ...రాజకీయాలకూ, సామాజికులకూ చురుక్కుమనిపించే విధంగా గీతోపదేశం చేసిన కార్టూనిస్టు గీతా సుబ్బారావు అనీ!
- ...రాసిన తొలినవల "ఏది పాపం?" నకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత చివుకుల పురుషోత్తం అని!
- ...భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన బీకర పోరులో అమరుడైన సైనికుడు సంతోష్ మహాదిక్ అనీ!
06 వ వారం
మార్చు- ...కోణార్క్ దేవాలయం కంటే ఖచ్చితంగా నూరేళ్ళ ముందే దివిసీమలో రథాకారంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నిర్మించారనీ!
- ...రేడియోలో ఆదివారాల్లో వచ్చే "కార్మికుల కార్యక్రమం" లో "బాలయ్య" గా ప్రసిద్ధి చెందినవారు జీడిగుంట రామచంద్ర మూర్తి అనీ!
- ...రాముడి జన్మస్థలి గురించి ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించిన ముస్లిం రచయిత మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ అనీ!
- ...శివుని రూపం శీర్షాసనం వేసి లింగతలంపై కనిపించే విశిష్టత కలిగిన ఆలయం శక్తీశ్వరస్వామి ఆలయం అనీ!
- ... రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పున:సృజించి చారిత్రిక నవల బోయకొట్టములు పండ్రెండు అనీ!
07 వ వారం
మార్చు- ..."భైరవి సంగీత అకాడమీ" అనే సంస్థను స్థాపించి అనేక మందికి సంగీత జ్ఞానాన్ని అందుస్తున్న ప్రముఖ సంగీతకారుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం అనీ! (చిత్రంలో)
- ...ఇస్రో వారు రూపొందించిన 29వ దృవియ ఉపగ్రహ ప్రయోగనౌక పిఎస్ఎల్వి-సీ27 అనీ!
- ...తన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం 57 సంవత్సరాల పాటు శ్రమించి 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించిన గురువు రాజారాం బాప్కర్ అనీ!
- ...ప్రపంచంలో పూర్తిగా (100%) చందన తైలంతో తయారుచేయడిన ఏకైక సబ్బు మైసూరు సాండల్ సబ్బు అనీ!
- ...హైదరాబాదులోని "లాల్ బహదూర్ స్టేడియం"(ఫతే మైదాన్)ను నిర్మించింది సేఠ్ రామ్‌గోపాల్‌జీ మలానీ అనీ!
08 వ వారం
మార్చు- ...ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థకు సంబంధించి,ఇస్రో ప్రయోగించిన నాల్గవ నావిగేసన్ ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1డి అనీ!
- ... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనీ!
- ...పెయింటింగ్‌లో 50 రకాల శైలులను సృష్టించిన ప్రముఖ చిత్రకారుడు పి.ఆర్.రాజు అనీ!
- ... మదనపల్లె రచయితల సంఘం (మరసం) యేర్పాటుకు కృషిచేసిన రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె అనీ!
- ...2016కు గాను ఆస్ట్రేలియా దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పొందిన తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్ అనీ!
09 వ వారం
మార్చు- ...దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా సోకే నయం చేసే మందులు లేని వైరస్ జికా వైరస్ అనీ!
- ...తన గ్రామస్థుల సౌకర్యార్థం 22 సంవత్సరాలు కష్టపడి కొండను దొలిచిన "మౌంటెన్ మ్యాన్" దశరథ్ మాంఝీ అనీ!
- ... తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై వ్రాసిన వ్యాస సంకలనం సాహిత్యాకాశంలో సగం అనీ!
- ...2009 సాహిత్య అకాడమీ బహుమతి పొందిన అనువాద నవల ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర అనీ!
- ... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మెజీషియన్, రచయిత మరియు బాల సాహితీకారుడు చొక్కాపు వెంకటరమణ అనీ!
10 వ వారం
మార్చు- ...చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తి ఎడ్గర్ మిచెల్ అనీ!
- ...'నో, ప్రైమ్ మినిస్టర్' పేరుతో మన్మోహన్‌సింగ్‌పై వేసిన కార్టూన్లన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించిన ప్రసిద్ధ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ అనీ!
- ...వాల్మీకి మహర్షి చేత రచింపబడిన ఒక గ్రంథము యోగ వాశిష్టం అనీ!
- ...భారత అత్యున్నత పురస్కారం అశోకచక్ర పొందిన తొలి భారతీయ మహిళ నీరజా భానోట్ అనీ!
- ... స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడుతున్న పురస్కారం సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు అనీ!
11 వ వారం
మార్చు- ... స్కూల్ బవాస్ మియాన్ ని చెన్నపట్న బొమ్మల పితామహునిగా భావిస్తారనీ!
- ...13 గంటలపాటు నిర్విరామంగా ప్రసంగించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న రచయిత ననుమాస స్వామి అనీ!
- ...కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి అనీ!
- ...మూడువందల సం.ల క్రితం తాళపత్రాలపై రాసిన రామానుజాచార్యుల జీవిత చరిత్రను పుస్తక రూపంలోనికి తెచ్చిన రచయిత్రి వింజమూరి రాగసుధ అనీ!
- ...మూత్రపిండాలరాళ్ళలో 80% కాల్సియం ఆక్సాలేట్ ఉంటుందనీ!
12 వ వారం
మార్చు- ... మొఘలుల సామ్రాజ్య కాలంలో చందేరి వస్త్రం వ్యాపారము శిఖరాలు అందుకున్నదనీ!
- ...ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరు పొందినది జైపూర్ కాలు అనీ!
- ...భారతదేశంలోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై పి.హె.డి చేసిన మొదటి వ్యక్తి హరిశ్చంద్ర రాయల అనీ!
- ...ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైన ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి అమృతా షేర్-గిల్ అనీ!
- ...పబ్లిక్ ఈతకొలనులను పారిశుధ్యం చేయుటకు ఉపయోగించే రసాయనం కాల్సియం హైపోక్లోరైట్ అనీ!
13 వ వారం
మార్చు- ...ఇత్తడి వస్తువులకు పేరొంది భౌగోళిక గుర్తింపు పొందిన హస్తకళ బుడితి కంచు, ఇత్తడి పని అనీ!
- ... భారతదేశంలో బి.టి. పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇస్మత్ చుగ్తాయ్ అనీ!
- ...మూడు యుగాల నుండి హోమగుండం నిరంతరం వెలుగుతూనే ఉందని భావించే ఆలయం త్రియుగీ నారాయణ్ ఆలయం అనీ!
- ... మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్ అనే ఔషధాన్ని కనుగొన్న నోబెల్ పురస్కార విజేత అయిన మహిళ తు యుయు అనీ!
- ...నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు పొందిన "వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్" గ్రంథ రచయిత్రి స్వెత్లానా అలెక్సీవిచ్ అనీ!
14 వ వారం
మార్చు- ...ఈ మెయిల్ సృష్టికర్త రాయ్ టామ్లిసన్ అనీ!(చిత్రంలో)
- ... చిరంజీవికి మొట్టమొదట పారితోషకాన్ని అందించిన నిర్మాత కాకిత జయకృష్ణ అనీ!
- ...ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఆర్కెస్ర్టా ను ప్రారంభించిన ప్రముఖ సంగీతకారుడు పెద్దిరెడ్డి గంగాధరం అనీ!
- ...పోటోగ్రాఫిక్ ఫిల్ముల తయారిలో ఉపయోగించు రసాయనం కాడ్మియం బ్రోమైడ్ అనీ!
15 వ వారం
మార్చు- ...జాతీయ చలన చిత్ర పురస్కారాల 63 సంవత్సరాల చరిత్రలో జాతీయ ఉత్తమ చలన చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చలన చిత్రం బాహుబలి:ద బిగినింగ్ అనీ!
- ...పండితారాధ్య చరిత్ర కావ్యాన్ని తెలుగు వారి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారనీ!
- ...భారత క్రికెట్ చరిత్రలో ఒకే సమయంలో రెండు రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు అధ్యక్షుడిగా ఉండే గౌరవం పొందిన వ్యక్తి విజ్జీ అనీ!
16 వ వారం
మార్చు- ...మామిడి పండు రసం తయారుచేయబడిన అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర అనీ!
- ...1940ల వరకూ అంతగా తెలియని శివరంజని రాగం సినిమా, లలిత సంగీతాల వల్లనే ప్రాచుర్యం పొందిందనీ!
- ... శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించుటకు "విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం" అనే సంస్థను స్థాపించిన వారు మధుర కృష్ణమూర్తిశాస్త్రి అనీ!
- ... చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను తెలియజేసే నాటకం ముద్రారాక్షసం అనీ!
17 వ వారం
మార్చు- ...ఖవ్వాలీ పాటల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం హార్మోనియం అనీ!
- ...చందనం దొంగ వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరంభించిన ఆపరేషన్ ఆపరేషన్ కుకూన్ అనీ!
- ...కావ్యంలో ధ్వని ప్రాధాన్యతను ప్రతిపాదించే విశేషత కలిగిన అలంకారిత గ్రంథం ధ్వన్యాలోకం అనీ!
- ... మారిషస్ జాతిపిత గా గుర్తింపబడుతున్న మానవతావాది శివసాగర్ రాంగులామ్ అనీ!
- ...పూసపాటి రాజుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు అనీ!
18 వ వారం
మార్చు- ...ప్రపంచంలో మహాత్మాగాంధీకి చెందిన విగ్రహాలలో అత్యంత పొడవైన కాంస్య విగ్రహం పాట్నాలోని మహాత్మా గాంధీ విగ్రహం అనీ!
- ...భారత సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ అనీ!
- రాజీవ్ గాంధీ హత్య కేసు విచారించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటోగ్రాఫులను, 1044 మంది సాక్షులు ఇచ్చిన 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించిందనీ!
- ...బొబన్-మోలీ బొమ్మల పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న కార్టూనిస్టు వి.టి.థామస్ అనీ!
19 వ వారం
మార్చు- ... రసాయనాల రారాజు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనీ!(చిత్రంలో)
- ...స్వంత నావెగెసన్ వ్యవస్థ కోసం భారతదేశం పంపిన ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ అనీ!
- ...అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందనీ!
- ...మహాత్మాగాంధీ అభిమాన పత్రిక "త్రివేణి" కి సుదీర్ఘకాలం సంపాదకత్వం వహించిన విద్యావేత్త ఐ.వి.చలపతిరావు అనీ!
- ... మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయదస్తూరిలో ఆ కథను రాసి శ్రీరమణకు పంపారనీ!
20 వ వారం
మార్చు- ...2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట లో 50 మందిని రక్షించినందుకు సాహసబాలల అవార్డు పొందినవారు "గౌరవ్ సింగ్ సైనీ" అనీ!(ఆలయ చిత్రం)
- ... 500 ఏళ్లుగా చిత్తశుద్ధితో తెలుగు భాష ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెపుతున్న కళ భాగవత మేళా అనీ!
- ... వందల యేళ్ళుగా మద్యం, మాంసం పై నిషేధం ఉన్న గ్రామం అడిగుప్ప అనీ!
- ...పాలరాతి విగ్రహాలలు ఉపరితలంపైపూతగా ఆక్సాలిక్ ఆమ్లాన్ని లేపనం చేస్తారనీ!
- ...వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖ వాగ్గేయకారుడు నామదేవుడు అనీ!
21 వ వారం
మార్చు- ... పొగ మరియు అగ్నిని శోధించే పరికరం స్మోక్ డిటెక్టర్ అనీ! (చిత్రంలో)
- ...ఆ ప్రాంత రైతులు వ్యవసాయం చేయడానికి ఋణాన్ని అందించే గ్రామ దేవత మారెమ్మవ్వ అనీ!
- ... స్మగ్లర్ వీరప్పన్ వద్ద 108 రోజులు బందీగా ఉన్న కన్నడ సినిమా నటుడు రాజ్‌కుమార్ అనీ!
- ...పద్మశాలీ కులానికి చెందిన మూలపురుషుడు భావనాఋషి అనీ!
- ... "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడిపిన నాటక రంగ ప్రముఖులు పెద్ది రామారావు అనీ!
22 వ వారం
మార్చు- ...దళిత, బహుజనుల కోసం ఫోరాటం చేసిన తెలంగాణ కు చెందిన ఉద్యమనాయకుడు మారొజు వీరన్న అనీ!
- ...రజనీకాంత్, చిరంజీవి మొదలగు అనేకమందిని సినిమా రంగ నటులుగా శిక్షణనిచ్చినవారు లక్ష్మీదేవి కనకాల అనీ!
- ...ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి లావు నాగేశ్వరరావు అనీ!
- ...20వ శతాబ్దిలోకెల్లా అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచిన వారు అల్లావుద్దీన్ ఖాన్ అనీ!
23 వ వారం
మార్చు- ...అంతర్యుద్ధంలో ఓటమి పాలైన కాన్ఫిడరేట్ ను పున:స్థాపించే కుట్రలో భాగంగా తాను అభిమానించే నటుని చేతిలోనే అబ్రహాం లింకన్ హత్య జరిగిందనీ!(చిత్రంలో లింకన్)
- ...భారత ప్రభుత్వం అణు పితామహుడిగా పేరుగాంచిన హోమీ భాభా పేరుమీదుగా భాభా అణు పరిశోధనా కేంద్రం స్థాపించిందనీ!
- ...ప్రముఖ నటుడు శివ బాలాజీ ఇరవయ్యేళ్ళకే స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడనీ!
- ...యెమ్మిగనూరు అభివృద్ధికి నాంది వేసిన చేనేత సహాకార పితామహుడు మాచాని సోమప్ప అనీ!
- ...భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన తన జీవితాంతం విశ్లేషించిన పరిశోధకుడు మర్రీ బీ. ఎమెనో అనీ!
24 వ వారం
మార్చు- ...శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి యొక్క ఐక్యతకోసం నిర్మించిన నిర్మాణం ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్అనీ!(చిత్రంలో)
- ...సింధూలోయ నాగరికతకు చెందిన సింధూ లిపిని పురాతత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోయారనీ!
- ... చనిపోయిన కళేబరం లేదా ఎముకను బట్టి జీవి వయస్సును గణించే పద్దతి రేడియోకార్బన్ డేటింగ్ అనీ!
- ... ప్రభుత్వ అసమగ్ర విధానాలకు సామాజిక అంతరాలు తోడు కావడంవల్లే లక్ష్మీపేట ఘటన జరిగినదనీ!
- ... వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజల మనిషి (నవల) తెలంగాణా తొలి నవల అన్న గుర్తింపు పొందిందనీ!
25 వ వారం
మార్చు- ... తొలి నవల "ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్" తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి (చిత్రంలో) ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవడనీ!
- ...అమెరికాలో బానిసత్వాన్ని నిషేధించడం అన్న అంశంపై 1861 నుంచి 1865 దాకా సాగిన పౌర యుద్ధం అమెరికా అంతర్యుద్ధం అనీ!
- ...1914 లో ప్రారంభింపబడిన మొదటి మహిళా పత్రిక అనసూయ (పత్రిక) అనీ!
- ...మద్రాసు సమాజంలో మొదటి తరం గైడులు తయారుచేసిన ప్రతిభాశాలి రెంటాల వెంకట సుబ్బారావు అనీ!
- ...నవల పరిధిని దాటుకుని తెలుగు సాహిత్యంలో నిలిచిన పాత్ర ఇందిర పి.శ్రీదేవి సృష్టించినదనీ!
26 వ వారం
మార్చు- ...కాలిఫోర్నియాలో 134 అడుగులప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్ నెలకొని ఉన్నదనీ!(చిత్రంలో)
- ... 1914లో స్త్రీని మేల్కొలిపిన తెలుగు పత్రిక "అనసూయ" ను నడిపిన వారు వింజమూరి వెంకటరత్నమ్మ అనీ!
- ...ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ పోన్లు, టెలిఫోన్లు, కార్లూ, బైకులు వాడకం ఆమిష్ ప్రజల జీవన విధానంలో నిషిద్ధమనీ!
- ...క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేద్కర్ వాది మద్దెల శాంతయ్య అనీ!
- ... "మీనాక్షిసుందరం-ప్లీజెల్ జీటా సమీకరణము" సృష్టించిన భారతీయ గణిత శాస్త్రవేత్త సుబ్బరామయ్య మీనాక్షిసుందరం అనీ!
27 వ వారం
మార్చు- ...మనుషుల్ని అంటరానివాళ్ళుగా చేసి ఆవుల్ని దేవతలుగా పూజించే హిందూ సంస్కృతిని తాత్త్వికంగా ఎండగట్టిన రచయిత నాగప్పగారి సుందర్రాజు అనీ!
- ...భారతదేశంలో మొదటి ధ్వని ఇంద్రజాలికుడు మిమిక్రీ శ్రీనివాస్ అనీ!
- ... బెంగళూరులో వరుసగా రెండేళ్లు ఒకే థియేటర్లో ప్రదర్శింపబడిన కన్నడ సినిమా బంగారద మనుష్య అనీ!
- ... హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి అయిన పద్మ పురాణంలో 55,000 శ్లోకాలు ఉన్నాయి అనీ!
- ... ప్రపంచంలో అత్యంత ప్రాచీన హోటల్ జపాన్ లోని నిషియమా ఆన్‌సెన్ కియున్‌కన్ అనీ, దీనిని 1311 సంవత్సరాల క్రితం ప్రారంభించారనీ!
28 వ వారం
మార్చు- ...గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉన్న చారిత్రాత్మక కట్టడం జిన్నా టవర్ అనీ!(చిత్రంలో)
- ...రధోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లేది అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయంలో అనీ!
- ...'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు పొందిన వారు బుజ్జాయి అనీ!
- ...దూరదర్శన్ కెరీర్ లో ఆమె వివిధ నాట్యరీతుల అభివృద్ధి మరియు వాటిని భద్రపరచుటపై కృషిచేసిన వారు సీత రత్నాకర్ అనీ!
- ...ఆసియాలో రెండవ అతిపెద్ద అయుధాగారం పల్గాం లోని కేంద్ర ఆయుధాగారం అనీ!
29 వ వారం
మార్చు- ...ప్రపంచంలో ఎత్తయిన బుద్దుని కంచు విగ్రహం "అమితాభ బుద్ధ" అనీ అది చైనాలోగల డాంగ్లిన్ దేవాలయం సమీపంలో ఉంది అనీ!(చిత్రంలో)
- ...1893 ప్రపంచ మత సమ్మేళనంలో హిందూ మతం పరపున స్వామీ వివేకానంద చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుందనీ!
- ...1923లో బందిపోట్లకు సహకరిస్తున్నారన్న తప్పుడు ఆరోపణపై లెవీ(పన్ను) చెల్లించమంటే పటేల్ నాయకత్వంలో తిరస్కరించి బోర్సాడ్ సత్యాగ్రహం చేశారనీ!
- ...అమెరికాలో అంజలి సెంటర్ ఫర్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి అనేకమందికి నాట్యంలో శిక్షణనిచ్చినవారు రత్నపాప అనీ!
30 వ వారం
మార్చు- ... పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్’ స్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది అనీ!
- ...భూకబ్జా చేసిన రాంవృక్ష్‌యాదవ్ అనుచరులకు మరియు పోలీసులకు మధ్య మధురలో ఘర్షణ జరిగినదనీ!
- ...ఆంధ్రజాతి అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్ర అవసరమని పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వింజమూరి భవనాచార్యులు అనీ!
- ...భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పున:సమీక్షించడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పరిచినది రాష్ట్రాల పునర్విభజన కమీషనన్ అనీ!
- ... భారత స్వాతంత్ర్యానంతరము మిస్టర్ యూనివర్స్ లో గెలుపొందిన మొదటి భారతీయుడు మనోహర్ ఐచ్ అనీ!
31 వ వారం
మార్చు- ...నైలు నదిపై కట్టిన మొదటి ఆనకట్ట అస్వాన్ డ్యాం అనీ!
- ...తెల్లవారిపై తొలి తిరుగుబాటు చేసిన యుద్ధం పద్మనాభ యుద్ధం అనీ!
- ...తమిళ సినిమా రంగంలో "వాకింగ్ ఎన్సైక్లోపీడియా" గా సుపరిచితుడు ఫిల్మ్‌న్యూస్ ఆనందన్ అనీ!
- ...తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు గల పుస్తకం చిట్టగాంగ్ విప్లవ వనితలు అనీ!
- ...తన సహచరులకు, అనుచరులకు తారాబాయి షిండే పుస్తకాలు చదవమని జ్యోతిరావ్ పూలే సూచించేవారనీ!
32 వ వారం
మార్చు- ...పంజాబ్ లో పేరెన్నిక కన్న నృత్యం భాంగ్రా అనీ!
- ...ఒళ్ళంతా బుల్లెట్లు ఉన్నా 48 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టి కార్గిల్ విజయాన్నందిన సైనికుడు డిజేంద్ర కుమార్ అనీ!
- ...ముస్లిం జీవనవిధానాలను, పేదరికాన్ని ప్రతిబింబించిన కథలున్న పుస్తకం జుమ్మాఁ అనీ!
- ...దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అనీ!
- ... ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం ఇరాక్ లోని నజాఫ్ నగరంలో గల వాదీ అల్ సలాం అనీ! ఇది దాదాపు 1500 ఎకరాలలో విస్తరించిఉన్నదనీ!
33 వ వారం
మార్చు- ..."శ్రీకాకుళం ఉద్యమం" పై ఛాయరాజ్ రాసిన కథా కావ్యం శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం) అనీ!
- ...చిన్న వయసులోనే అనేక డాక్టరేట్లు పొందిన యువకుడు డా. ఆర్యవర్ధన్ రాజ్ స్థాపించిన సాహితీ సంస్థ రాజ్ పౌండేషన్ అనీ!
- ...భారత దేశం, పాకిస్తాన్, మరియు కొంతమేరకు చైనాల మధ్యనున్న ప్రాదేశిక వివాదం కాశ్మీరు సమస్య అనీ!
- ...భారతదేశం నుంచి డేవిస్ కప్ లో పాల్గొన్న మొట్టమొదటి తెలుగువాడు కోట రామస్వామి నాయుడు అనీ!
- ...వేరే భాషలోకి తర్జుమా చేయబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం కీలుగుర్రం అనీ!
34 వ వారం
మార్చు- ...తెనాలి కవిరాజా పబ్లిషర్స్ కు వెన్నెముకగా ఉండి ఎన్నో గ్రంధాలను ముద్రించడంలో కీలకపాత్ర పోషించిన వారు జాస్తి వెంకట నరసింహారావు అనీ!
- ...ఉపాధ్యాయులుగా పనిచేసిన వెంపటాపు సత్యం మరియు ఆదిభట్ల కైలాసం శ్రీకారం చుట్టిన ఉద్యమం శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం అనీ!
- ...ఒరిస్సాలోని చాందీపూర్ వద్ద ఆటు పోట్ల సమయంలో సముద్రం 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది అని!
- ... 1954 మనీలా ఆసియా క్రీడలలో డిస్కస్ త్రో మరియు షాట్‌పుట్ అంశాలలో బంగారు పతకం సాధించిన ఆసియా లోనే మొట్టమొదటి క్రీడాకారుడు మనదేశానికి చెందిన పర్దుమన్ సింగ్ బ్రార్ అనీ!
- ... రియో ఒలంపిక్స్ లో భారత దేశానికి మొట్ట మొదటి పతకం సాధించి పెట్టింది సాక్షి మాలిక్ అనీ!
35 వ వారం
మార్చు- ...బరోడా విశ్వవిద్యాలయంలో పురాతత్వ విభాగాన్ని నూతనంగా నెలకొల్పిన ఘనుడు బెండపూడి సుబ్బారావు అనీ!
- ...18వ శతాబ్ది తొలి అర్థభాగంలో సిక్ఖులు ఎదుర్కొన్న తీవ్రమైన అణచివేతను నవాబ్ కపూర్ సింగ్ సిక్ఖు నాయకునిగా అద్భుతంగా ఎదుర్కొన్నారనీ!
- ...దక్షిణభారతదేశంలో హోయసల స్వతంత్ర సామ్రాజ్యానికి పునాదులు వేసినవాడు విష్ణువర్ధనుడు అనీ!
- ...భారతదేశంలో ఆధునిక విద్యా విధానాల్ని ప్రవేశ పెట్టిన కళాశాలల్లో దక్కను కళాశాల ఒకటనీ!
- ...అక్బర్ చక్రవర్తి పైనే తిరుగుబాటు చేసిన దుల్లా భట్టి ని పంజాబ్ రాబిన్ హుడ్ అని పిలుస్తారనీ!
36 వ వారం
మార్చు- ...బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించిన చరిత్రకారుడు మల్లాది లీలా కృష్ణమూర్తి అనీ!
- ...ఈస్టిండియా కంపెనీ చివరగా బ్రిటీష్ ఇండియాలో కలుపుకున్న ఆఖరి పెద్ద సామ్రాజ్యం సిక్ఖు సామ్రాజ్యం అనీ!
- ...ఐదు వేర్వేరు విభాగాల్లో నంది అవార్డు పొందిన గాయకుడు రఘు కుంచే అనీ!
- ...ప్రవాసాంధ్రుడు హరి కొండబోలు అమెరికాలో స్టాండప్ కమెడియన్ గా రాణిస్తున్నాడనీ!
- ...జాన్ గ్రీషమ్ అనే అమెరికన్ రచయిత నవలలు 42 ప్రపంచ భాషల్లోకి తర్జుమా అవుతున్నాయనీ!
37 వ వారం
మార్చు- ...క్రీపూ 2500 కు చెందిన మొహంజో-దారో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారనీ!(చిత్రంలో)
- ...ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో రాజ్ ‘బహదుర్షా జాఫర్’ అవార్డు గ్రహీత రాజ్ బహదూర్ గౌర్ అనీ!
- ... ప్రముఖ సంగీత దర్శకులైన మణిశర్మ, ఏ. ఆర్. రెహ్మాన్ కోటి దగ్గర శిష్యరికం చేశారనీ!
- ...శిరోమణి అకాలీ దళ్ పేరుతో పంజాబ్ లో పలు రాజకీయ పార్టీలున్నాయనీ!
- ...డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు పుట్టుకతో అంధుడైనా వెయ్యికి పైగా అవధానాలు చేశాడనీ!
38 వ వారం
మార్చు- ...మహబూబ్‌నగర్ పట్టణంలో రాంమందిర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి నిజాం ప్రభువుకు సవాల్ విసిరిన యోధుడు గంగాపురం బాలకిషన్‌రావు అనీ!
- ...కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందిన వాడు హేమచంద్ర అనే జైన సన్యాసి అనీ!
- ...శ్రీకృష్ణుని తండ్రియైన వసుదేవుడు కశ్యప మహర్షి అంశతో జన్మించాడనీ!
- ... భారతదేశంలో అతి పెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్ సంస్థ స్థాపకుడు టి.వి. సుందరం అయ్యంగార్ అనీ!
- ... ప్లాసీ యుద్ధం ఆంగ్లేయులు భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు దోహదపడ్డదనీ!
39 వ వారం
మార్చు- ...బానిసత్వం రద్దు కారణంగా అమెరికా అంతర్యుద్ధం ఏర్పడిందనీ!
- ... ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన దక్షిణ చైనాలోని బైపన్ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న డ్యూజ్ వంతెన అనీ. !
- ...వేదమాత పత్రికను నడిపిన తెలంగాణ పోరాట యోధుడు సంతపురి రఘువీర రావు అనీ!
- ...భీమ్‌బేట్కా శిలా గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికిని తెలియజేస్తున్నాయనీ!
- ...పొందూరు పట్టణానికి చెందిన 4 ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారనీ!
40 వ వారం
మార్చు- ... బ్రిటిష్ కొలంబియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం వాంకోవర్ అనీ!
- ... భారత దేశపు ఆఖరి ముగ్గురు వైశ్రాయ్ లకు రాజ్యాంగ సలహాదారుగా సేవలంచినవారు వి. పి. మెనన్ అనీ!
- ... మాండొలిన్ శ్రీనివాస్ గా పేరు గాంచిన ఉప్పలపు శ్రీనివాస్ పద్నాలుగేళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మక రాజలక్ష్మీ పురస్కారం అందుకున్నాడనీ!
- ... బైకల్ సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటనీ!
41 వ వారం
మార్చు- ...తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఉద్యమించి రజాకార్ల చేతిలో హతులైన పోరాట యోధుడు చింతలపురి రాంరెడ్డి అనీ!
- ...అబ్దుల్ కలాం పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వ్యక్తి రాఘవ లారెన్స్ అనీ!
- ...న్యూజీలాండ్ కు చెందిన జీన్ బాటన్ ఎక్కువ సార్లు ఒంటరిగా విమానయానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించిందనీ!
- ...సిద్ధాంతవ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్ సంపాదించిన ఏకైక భారతీయ నటి జయమాల అనీ!
- ...తెలుగు వాడైన రేమాల రావు మైక్రోసాఫ్ట్ లో చేరిన మొట్టమొదటి భారతీయ ఉద్యోగి అనీ!
42 వ వారం
మార్చు- ... ప్రతీ సంవత్సరం మార్చి, సెప్టెంబరు నెలలలో మూడుసార్లు మహాలక్ష్మీ ఆలయ విగ్రహంపై సూర్యాస్తమయం వేళ సూర్యకిరణాలుపడతాయనీ!(చిత్రంలో)
- ... రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్న యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి అనీ!
- ... బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో కంగనా రనౌత్ ఒకరనీ!
- ... ఒక్కో మంగోలు సైనికుడు నాలుగేసి గుర్రాలతో యుద్ధాలకు వెళ్ళి ఒకటి అలసిపోతే మరోదానిపై స్వారీ చేసేవారని!
- ... బాపు తొలిచిత్రం "సాక్షి" లో ఎస్.వి.జగ్గారావు ప్రధాన ప్రతినాయునిగా నటించారనీ!
43 వ వారం
మార్చు- ...సతీదేవి దంతాలుపడిన చోట వెలసిన శక్తి పీఠం దంతేశ్వరి దేవాలయం అనీ!(చిత్రంలో)
- ... శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకాకుళేశ్వరస్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించాడనీ!
- ...దర్శకుడు నీలకంఠ షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారం అందుకున్నాడనీ!
- ...మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర ఇస్లామిక్ దేశాలపై మంగోలుల ఆధిపత్యానికి నాంది అనీ!
- ... ఉత్తరాంధ్రలో బియ్యంపిండితో చేసిన మిఠాయిలు పాకుండలు అనీ!
44 వ వారం
మార్చు- ... ఎలుకలు తినే ఆహార పదార్థాలను పవిత్ర ప్రసాదంగా భావించే ఆలయం కర్ణి మాతా దేవాలయం అనీ!(చిత్రంలో)
- ...గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది పురస్కారాలను అందుకున్నదనీ!
- ...ఇస్రో కక్ష్యా వాహనం మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళగల వాహక నౌక అనీ!
- ...బాల సాహిత్య రచనలు చేయడంలో పిల్లలను ప్రోత్సహించే రచయిత నారంశెట్టి ఉమామహేశ్వరరావు అనీ!
- ...నవదుర్గల్లో ఆరో అవతారం కాత్యాయనీ దుర్గా అనీ!
45 వ వారం
మార్చు- ... సతీదేవి నేత్రాలు పడిన చోట వెలసిన పవిత్ర శక్తి పీఠం నైనా దేవి ఆలయం అనీ!(చిత్రంలో)
- ...సుబ్రహ్మణ్య భారతి ని ఆధునిక తమిళ సాహిత్యంలో మార్గదర్శకునిగా భావిస్తారనీ!
- ...త్రైలింగ స్వామి ని రామకృష్ణ పరమహంస కాశీలో నడయాడే శివుడిగా కొనియాడాడనీ!
- ...భూమిపై ఒకే కాండమును కలిగి బ్రతికిఉన్న అతిపెద్ద వృక్షం జనరల్ షేర్మన్ చెట్టు అనీ!
- ... చల్లగా ఉండే వాతావరణంలో మనకు జలుబును కలిగించే రైనోవైరస్ చాలా తొందరగా పెరుగుతుందనీ!
46 వ వారం
మార్చు- ...కిరాయి ఇవ్వకపోయినా పర్వాలేదు రాజమండ్రి దేవీచౌక్ లో చాన్స్ వస్తే చాలు అనుకున్న కళాకారులు ఎందరో ఉన్నారనీ!(చిత్రంలో)
- ...చందమామ కథలు సినిమా 2014 లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
- ...నవదుర్గల్లో రెండో అవతారం బ్రహ్మచారిణీ దుర్గా అనీ!
- ...పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ అనీ!
- ...ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ. వి. ఎస్. రాజు రాసిన సత్యసాయిబాబా జీవిత కథ అతిపెద్ద పుస్తకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిందనీ!
47 వ వారం
మార్చు- ...ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా పేరు గాంచినది సిదు రివర్ బ్రిడ్జ్ అనీ!(చిత్రంలో)
- ...ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు 30 మంది నూతన దర్శకులతో పనిచేశాడనీ!
- ...ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ వరల్డ్ మ్యూజిక్ లో గ్రామీ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి అనీ!
- ...బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఖాలిదా జియా అనీ!
- ...సెర్బియా దేశపు రాజధాని నగరమైన బెల్గ్రేడ్ ను వైట్ సిటీ అని పిలుస్తారనీ!
48 వ వారం
మార్చు- ... ఆస్ట్రేలియాలో అతి పెద్ద నది ముర్రే నది అనీ!
- ...శ్రీలంక దేశానికి రాష్ట్రపతిగా పని చేసిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించినవారు చంద్రికా కుమరతుంగా అనీ!
- ...చాలా ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి గూర్చి అవగాహన కల్పించినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందిన వైద్యులు కూటికుప్పల సూర్యారావు అనీ!
- ...2002లో కామన్వెత్ క్రీడల్లో మూడు పసిడి పతకాలు సాధించిన వెయిట్ లిప్టర్ పూజారి శైలజ అనీ!
- ...రైతాంగ ఉద్యమ పోరాటం ద్వారా కోట్లాది శ్రమ జీవుల బాగుకోసం ఉద్యమించిన కార్యదీక్షాపరుడు మార్పు పద్మనాభం అనీ!
49 వ వారం
మార్చు- ...సింధు లోయ నాగరికతలో కలిబంగాన్ ఒక పెద్ద ప్రాంతానికి రాజధానిగా ఉండేదనీ!
- ...తన సాధారణ తుపాకీతో మూడు ట్యాంకులను పేల్చి ధైర్యసాహసాలను ప్రదర్శించిన కార్గిల్ వీరుడు అబ్దుల్ హమీద్(PVC) అనీ!
- ...భారత రష్యాల సంయుక్త ప్రాజెక్టు అయిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి పిళ్ళైను పితగా భావిస్తారనీ!
- ...అవంతి ప్రాచీన భారతదేశపు మహా జనపదాల్లో ఒకటనీ!
- ...బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రహ్మాన్ ను బంగబంధు అని వ్యవహరిస్తారనీ!
50 వ వారం
మార్చు- ...బెట్ ద్వారకను మహాభారతం, స్కాందపురాణాల్లో చెప్పిన ద్వారకా నగరంలోని భాగంగా భావిస్తారనీ!
- ...ఇస్రో వారి వాహకనౌకల, ఉపగ్రహాల కార్యక్రమాలను విజయవంతం చెయ్యడంలో బ్రహ్మ ప్రకాష్ కీలక పాత్ర పోషించాడనీ!
- ...మెహబూబా ముఫ్తీ జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అనీ!
- ...అశోకుని కుమార్తెయైన సంఘమిత్ర శ్రీలంకలో బౌద్ధ మత ప్రచారం చేసిందనీ!
- ...అప్పడాల తయారీ భారతీయ మహిళల ఉపాధి మార్గాల్లో ఒకటనీ!
51 వ వారం
మార్చు- ...ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్-2 అనీ!
- ...పృథ్వి క్షిపణిని అభివృద్ధి చెయ్యడంలోను, దాన్నిభారత సైన్యంలో మోహరించడం లోను వి.కె. సరస్వత్ కీలకపాత్ర పోషించాడనీ!
- ...మచిలీపట్నంలో అతి ప్రాచీనమైన కళాశాల హిందూ కళాశాల అనీ!
- ...పలక విరూపణ సిద్ధాంతం భూగోళం మీద వివిధ నైసర్గిక స్వరూపాలు, అగ్ని పర్వతాలు, భూకంపాల వంటి అంశాలను వివరిస్తుందనీ!
- ...రంగనాథస్వామి దేవాలయం, శ్రీరంగం 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటనీ!
52 వ వారం
మార్చు- ...నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ పేరుతో "సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం"గా పేరు పెట్టారనీ!
- ...ప్రపంచ వ్యాప్తంగా అహింసాత్మక ప్రతిఘటన కు ప్రాచుర్యం కల్పించిన వాడు మహాత్మా గాంధీ అనీ!
- ...వందేమాతరం రామచంద్రరావు నిజాం సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడనీ!
- ...దింసా నృత్యం అరకు లోయలో ప్రసిద్ధమైన గిరిజన నృత్యం అనీ!
- ...ఆంధ్రప్రదేశ్ కు చెందిన సయ్యద్ ఫరీదుద్దీన్ న్యూక్లియర్ ప్లాంట్లలో ఉపయోగించే భారజల ఉత్పత్తిపై విశేష కృషి చేశాడనీ!