2021 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2021 సంవత్సరం లోని వాక్యాలు

మార్చు

01 వ వారం

మార్చు
  • ...శివుడు 20 చేతుల నటరాజ విగ్రహం రూపంలో ఉన్న దేవాలయం వడక్కునాథన్ దేవాలయం అనీ!
  • ... సహారన్‌పూర్ లో "శాకంబరీ దేవి" ఆలయం ప్రసిద్ధి చెందిందనీ!
  • ...రాంపూర్ను నవాబుల నగరంగా వ్యవహరిస్తారనీ!
  • ... 48 కోసుల ప్రదక్షిణ అంటే హర్యానా లోని పవిత్ర నగరం కురుక్షేత్ర చుట్టూ వివిధ మహాభారత సంబంద ప్రదేశాలకు, ఇతర వేద యుగపు తీర్థాలకూ చేసే తీర్థయాత్ర అనీ!
  • ... కర్ణాటకలోని కోలారు పట్టణం పాల ఉత్పత్తికీ, బంగారు గనులకీ ప్రసిద్ధి అనీ!

02 వ వారం

మార్చు
  • ... భారత,చైనా వాస్తవాధీన రేఖ రెజాంగ్ లా, రెచిన్ లా కనుమల గుండానే వెళ్తుందనీ!
  • ... పుదుచ్చేరికి చెందిన కరైకల్ పట్టణంలో శనీశ్వరుడికే అంకితమైన ఆలయం ఉందనీ!
  • ... రచయిత లియో టాల్‌స్టాయ్ ఎనిమిది సార్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించబడినప్పటికీ ఒక్కసారి కూడా బహుమతి అందుకోలేదనీ!
  • ... ఒకప్పటి తెలుగు రాష్ట్రం హైదరాబాద్ నుండి గుల్బర్గా జిల్లా విడిపోయిందని!
  • ... ఢిల్లీ సమీపంలోని దర్యాగంజ్ లో ప్రతి ఆదివారం పుస్తకాల వ్యాపారం భారీ ఎత్తున జరుగుతందనీ!

03 వ వారం

మార్చు

04 వ వారం

మార్చు
  • ... మధ్యప్రదేశ్ లోని దతియా అనే పట్టణాన్ని మహాభారతంలో దంతవక్త్రుడు పరిపాలించినట్లుగా ఉందనీ!
  • ... ఎఫ్.సి. కోహ్లీ భారతదేశంలో అతిపెద్ద సాఫ్ట్ వేర్ కన్సల్టెన్సీ సంస్థల్లో ఒకటైన టిసిఎస్ వ్యవస్థాపకుడనీ!
  • ... తమిళనాడులోని తిరుపూరు జిల్లా వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిందనీ!
  • ... 2020 లో యూట్యూబ్ లో అత్యధిక వీక్షణలు జరిగిన వీడియో గెంద ఫూల్ ను దాదాపు 60 కోట్ల మంది వీక్షించారనీ!
  • ... మోజార్ట్ ను పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో అత్యుత్తమ కళాకారుల్లో ఒకడిగా పరిగణిస్తారనీ!

05 వ వారం

మార్చు

06 వ వారం

మార్చు
  • ... పశ్చిమ బెంగాల్ లోని రాయ్‌గంజ్ 200 ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన పట్టణమనీ!
  • ... పి.టి. శ్రీనివాస అయ్యంగార్ దక్షిణ భారతదేశ చరిత్రపై పలు పుస్తకాలు రాశాడనీ!
  • ... మోండా మార్కెటు హైదరాబాదులోని అతిపెద్ద హోల్ సేల్, రీటైల్ కూరగాయల మార్కెట్లలో ఒకటనీ!
  • ... సింహగిరి వచనములు రాసిన కృష్ణమాచార్యులు తొలి తెలుగు వచన కవిగా గుర్తించబడ్డాడనీ!
  • ... కన్నడ సినీ పరిశ్రమలో నాదబ్రహ్మ బిరుదు పొందినది సంగీత దర్శకుడు హంసలేఖ అనీ!

07 వ వారం

మార్చు
  • ... మధ్యప్రదేశ్ లోని విదిశ పట్టణం శాతవాహనులు, గుప్తుల కాలంలో ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేదనీ!
  • ... ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉందనీ!
  • ... మణిపూర్ రాష్ట్రానికి చెందిన వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి రాజీవ్ ఖేల్ రత్న పురస్కార గ్రహీత అనీ!
  • ... కాడ్ మూవీస్ ఆఫ్రికన్ దేశాలలో తెలుగు సినిమాలు విడుదల చేసే నిర్మాణ సంస్థ అనీ!
  • ... క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు మొత్తం మూడు సార్లు ఫైనల్ ఆడగా, రెండు సార్లు విజేతగా నిలిచిందనీ!

08 వ వారం

మార్చు
  • ... ప్రపంచంలో మొట్టమొదటి తెల్లపులిని 1952 లో రీవా ప్రాంతంలో కనుగొన్నారనీ!
  • ... భారతదేశపు టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ డేవిస్ కప్ లో అత్యధిక డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడనీ!
  • ... సైబీరియా ఉత్తర ఆసియా, రష్యాలో విస్తరించి ఉన్న విస్తృత భౌగోళిక ప్రాంతమనీ!
  • ... రెండవ అత్యధిక జనాభా యుటిసి+05:30 టైం జోన్ లో నివసిస్తున్నారనీ!
  • ... కళైమామణి తమిళనాడు ప్రభుత్వం సంగీత, సాహిత్య, నాటక రంగాల్లో కృషిచేసిన వారికి ఇచ్చే పురస్కారమనీ!

09 వ వారం

మార్చు
  • ... రాజస్థాన్ లోని హనుమాన్‌గఢ్ పట్టణంలో 1700 సంవత్సరాల పురాతనమైన ఆంజనేయ కోట ఉందనీ!
  • ... సంపూర్ణ సార్వభౌమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థామస్ హాబ్స్ అనీ!
  • ... హైదరాబాదు నిజాం బొగ్గులకుంట ప్రాంతంలోని కింగ్ కోఠి ప్యాలెస్ లో నివసించేవాడనీ!
  • ... స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం యూరోపియన్ యూనియన్ లో మూడవ అతిపెద్ద నగరమనీ!
  • ... భారత మాజీ క్రికెట్ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ అదే జట్టుకు 2007 నుంచి 2009 దాకా బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడనీ!

10 వ వారం

మార్చు
  • ... బీహార్ లో అత్యధిక జనాభా కలిగిన జిల్లా పాట్నా జిల్లా అనీ!
  • ... మిస్సోరి నది ఉత్తర అమెరికాలోకెల్లా అత్యంత పొడవైన నది అనీ!
  • ... గోండు నృత్యమైన గుస్సాడీ నాట్యంలో కృషి చేసినందుకుగాను గుస్సాడీ కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించిందనీ!
  • ... సికింద్రాబాదులోని ప్యాట్నీ అనే ప్రాంతంలో షికాగో సర్వమత సభలకు వెళ్ళేముందు స్వామీ వివేకానంద పెద్ద సభలో ప్రసంగించాడనీ!
  • ... 18వ శతాబ్దం చివర్లో సంస్కృతానికి, కొన్ని ఐరోపా భాషలకూ మధ్య సారూప్యతను గమనించిన తరువాత ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం క్రమేణా రూపుదిద్దుకుందనీ!

11 వ వారం

మార్చు
  • ... ఇందిరా ప్రొడక్షన్స్ సినీ నటుడు కృష్ణ కుమార్తె మంజుల స్థాపించిన నిర్మాణ సంస్థ అనీ!
  • ... ఆది శంకరాచార్యులతో వాదనలో ఓడిపోయిన మండనమిశ్రుడు సహర్సా ప్రాంతానికి చెందినవాడనీ!
  • ... సినీ నటి గ్రేసీ సింగ్ భరతనాట్యం, ఒడిస్సీ నృత్య కళాకారిణి కూడాననీ!
  • ... హిందుస్తాన్ ఫోటో ఫిలింస్ 1960వ దశకంలో ఊటీలో ఫోటో ఫిల్ముల ఉత్పత్తి కోసం ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ అనీ!
  • ... భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ది డూన్ స్కూల్ లో చదువుకున్నాడనీ!

12 వ వారం

మార్చు
  • ... శ్రీ గంగానగర్ ను రాజస్థాన్ ఆహారబుట్ట (ఫుడ్ బాస్కెట్ ఆఫ్ రాజస్థాన్) అని పిలుస్తారనీ!
  • ... తమిళనాడుకు చెందిన సాలమన్ పాపయ్య సామాజిక అంశాలపై పన్నెండువేలకుపైగా చర్చలు నిర్వహించాడనీ!
  • ... ఎన్.ఎస్.రాజారామ్ స్వదేశీ ఆర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రకారుడు అనీ!
  • ... తాడిపత్రిలో ఉన్న చింతలరాయస్వామి దేవాలయం భారత పురాతత్వ సంస్థ జాతీయ స్మారక చిహ్నాల్లో ఒకటిగా చేర్చబడిందనీ!
  • ... చిరంజీవి నటించిన కొదమ సింహం ఆంగ్లంలోకి అనువదించబడిన మొదటి దక్షిణ భారతీయ చలనచిత్రమనీ!

13 వ వారం

మార్చు

14 వ వారం

మార్చు
  • ... బుర్జ్ ఖలీఫాకు అబుదాబి పరిపాలకుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవార్థం పేరు పెట్టారనీ!
  • ... ఐక్యరాజ్యసమితి ఆరు అధికారిక భాషల్లో రష్యన్ భాష ఒకటనీ!
  • ... దక్షిణ భారతదేశపు నైటింగేల్ గా పేరుగాంచిన గాయని కె. ఎస్. చిత్ర అనీ!
  • ... డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక గ్రామానికి సమీపంలో ఉన్న ఎబోలా నది నుండి ఎబోలా వైరస్ కు ఆ పేరు వచ్చిందనీ!
  • ... భారత కేంద్రపాలిత ప్రాంతాల్లో భాగమైన నికోబార్ దీవుల్లో వేల సంవత్సరాల నుంచి మానవులు నివాసం ఉంటున్నారనీ!

15 వ వారం

మార్చు
  • ... ప్లాటినం భూమి పొరల్లో లభించే అత్యంత అరుదైన మూలకాల్లో ఒకటనీ!
  • ... కాడు మల్లేశ్వర దేవాలయం పేరు మీదుగా బెంగళూరులోని ప్రాంతానికి మల్లేశ్వరం అనే పేరు వచ్చిందనీ!
  • ... అమెరికాలోని శాన్ డియాగో విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో ఫుల్ బ్రైట్ స్కాలర్ షిప్ అందుకున్న మొట్టమొదటి భారతీయుడు కె.వి.నారాయణస్వామి అనీ!
  • ... చలనచిత్ర విభాగంలో పురస్కారాలు అందించే సైమా అవార్డులు ఇందూరి విష్ణువర్ధన్ 2012 లో ప్రారంభించాడనీ!
  • ... పద్యప్రభంజనం దేశభక్తి అంశంపై వెలువడిన పద్య బృహత్సంకలనం అనీ!

16 వ వారం

మార్చు

17 వ వారం

మార్చు
  • ... గాయని టి.ముక్త ఆమె సోదరి కలిసి చేసిన కచేరీ కర్ణాటక సంగీత చరిత్రలో మహిళా ద్వయం చేసిన ప్రథమ కచేరీలు అనీ!
  • ... పోర్చుగీసు భాష ప్రపంచంలో అత్యధిక ప్రభావవంతమైన పది భాషల్లో ఒకటనీ!
  • ... హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్ లోగల సాయిబాబా దేవాలయం భక్తుల సౌకర్యాల కల్పనలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ సాధించిందనీ!
  • ... ఋషులు ధ్యానం చేసే ప్రదేశంగా భావించే కొండలోయలో స్థాపించడం వల్ల రిషి వ్యాలీ పాఠశాలకు ఆ పేరు వచ్చిందనీ!
  • ... రాజస్థాన్ లోని ఆరావళీ పర్వతశ్రేణుల్లో నిర్మించబడిన కుంబల్‌ఘర్ కోట చైనా మహాకుడ్యాన్ని తలపిస్తుందనీ!

18 వ వారం

మార్చు
  • ... అవధాని రేవూరి అనంత పద్మనాభరావు కుటుంబ సభ్యులంతా రచయితలేననీ!
  • ... హంగేరీ దేశ జనాభా మొత్తంలో 33 శాతం ఆదేశపు రాజధాని అయిన బుడాపెస్ట్ నగర ప్రాంతంలోనే నివసిస్తున్నారనీ!
  • ... సైన్సు, తత్వ శాస్త్రానికి సంబంధించిన అనేక ప్రాథమిక రచనలు గ్రీకు భాష లో రాయబడి ఉన్నాయనీ!
  • ... ఆదిలాబాద్ కి చెందిన నిర్మల్ బొమ్మలు పరిశ్రమకు 400 సంవత్సరాల చరిత్ర ఉందనీ!
  • ... విటమిన్ బీ12 తీవ్రలోపం రక్తహీనతకు దారితీయవచ్చనీ!

19 వ వారం

మార్చు

20 వ వారం

మార్చు
  • ... పాపనాశం శివన్ ను తమిళ త్యాగరాజుగా భావిస్తారనీ!
  • ... రాజస్థాన్ లోని జైసల్మేర్ ని గోల్డెన్ సిటీగా వ్యవహరిస్తారనీ!
  • ... చెక్ రిపబ్లిక్ దేశపు రాజధాని అయిన ప్రాగ్ నగరం ప్రాచీన రోమన్ చక్రవర్తుల నివాసంగా ఉండేదనీ!
  • ... భారత పార్లమెంటులో ఫిరోజ్ గాంధీ బీమా సంస్థల మోసాల అంశాలను లేవనెత్తిన తర్వాత భారత జీవిత బీమా సంస్థ ప్రారంభమైందనీ!
  • ... మోసగాళ్ళు సినిమా నిజజీవితంలో జరిగిన సాంకేతిక మోసాల ఆధారంగా రూపొందింది అనీ!

21 వ వారం

మార్చు

22 వ వారం

మార్చు

23 వ వారం

మార్చు

24 వ వారం

మార్చు

25 వ వారం

మార్చు
  • ... సుకన్య రామగోపాల్ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మొట్టమొదటి ఘటవాద్య కళాకారిణి అనీ!
  • ... తెలంగాణాకు చెందిన నవీన్ మేడారం పలు హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ కళాకారుడిగా పనిచేశాడనీ!
  • ... గ్లోబల్ వార్మింగ్ వల్ల భూవాతావరణం వేడెక్కడమే కాకుండా, వర్షాలు, మంచు ఎక్కువగా కురవడం వంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయనీ!
  • ... హోమీ జహంగీర్ భాభా ను భారత అణుకార్యక్రమ పితామహుడిగా భావిస్తారనీ!
  • ... కవికర్ణరసాయనము అనే ప్రౌఢ ప్రబంధ కావ్య రచయిత సంకుసాల నృసింహకవి అనీ!

26 వ వారం

మార్చు

27 వ వారం

మార్చు

28 వ వారం

మార్చు
  • ... సంగీత విద్వాంసుడు ఎల్.సుబ్రహ్మణ్యం ఆరేళ్ల వయసులోనే తొలి కచేరీ చేశాడనీ!
  • ... ఓ బేబీ సినిమా 2014 లో వచ్చిన కొరియన్ చిత్రం మిస్ గ్రానీ కి పునర్నిర్మాణమనీ!
  • ... పి.ఆర్. పిషరోటి ని భారతదేశపు రిమోట్ సెన్సింగ్ పితామహుడిగా భావిస్తారనీ!
  • ... అవధాన కళను సమాజంలో అందరికీ చేరువచేసేందుకు మాడుగుల నాగఫణిశర్మ స్థాపించిన సంస్థ అవధాన సరస్వతీ పీఠం అనీ!
  • ... బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో విపరీతమైన మానసిక అసమతౌల్యతలు ఉంటాయనీ!

29 వ వారం

మార్చు
  • ... శాలిహోత్రుడు భారతీయ పశువైద్య శాస్త్ర పితామహుడిగా పరిగణించబడతాడనీ!
  • ... విజయవాడలోని రామమోహన గ్రంథాలయం శతాబ్దంకిపైగా చరిత్ర గలిగిన ప్రాచీన గ్రంథాలయమనీ!
  • ... శ్రీ వ్యాసాశ్రమం చిత్తూరు జిల్లా, ఏర్పేడు సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రమనీ!
  • ... కొల్లేరు సరస్సుకు సుదూర ప్రాంతమైన సైబీరియా నుంచి కూడా పక్షులు వలస వస్తాయనీ!
  • ... ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం కర్ణాటక రాష్ట్రంలోని పావగడ లో ఉందనీ!

30 వ వారం

మార్చు
  • ... 1990 దశకంలో భారతదేశంలో పాప్ గాయకుడిగా పేరొందిన లక్కీ అలీ అసలు పేరు మఖ్సూద్ మహమూద్ అలీ అనీ!
  • ... విజయవాడలోని కృష్ణా నదిపై నిర్మించిన కనకదుర్గ వారధి భారతదేశంలో 27వ అతి పెద్ద వంతెన అనీ!
  • ... ఆలయ నృత్య సాంప్రదాయంలో ప్రేంఖిణి నృత్య సాంప్రదాయాన్ని రూపొందించింది సి.రామాచార్యులు అనీ!
  • ... చెన్నైలోని మోఫ్యూసిల్ బస్ టర్మినస్ (CMBT) ఆసియాలోనే అతిపెద్ద బస్సు స్టేషన్ అనీ!
  • ... కర్నూలు లోని ఉస్మానియా కళాశాల ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీనమైన కళాశాలల్లో ఒకటనీ!

31 వ వారం

మార్చు
  • ... వేంపల్లె షరీఫ్ రాసిన జుమ్మా అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం లభించిందనీ!
  • ... ఉత్తర ప్రదేశ్ లోని నైమిశారణ్యంలో వ్యాస మహర్షి మహాభారత రచన చేసినట్లుగా భావిస్తారనీ!
  • ... సుబోధ్ కుమార్ జైస్వాల్ కొత్తగా నియమితుడైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్ అనీ!
  • ... పోతన రాసిన వీరభద్ర విజయం అనే కావ్యంలో దక్షుడు రెండు సార్లు యజ్ఞం చేసినట్లుగా కల్పించాడనీ!
  • ... న్యాయశాస్త్రం అభ్యసించే వారు తొలిపాఠ్యపుస్తకంగా భావించే తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని రచించింది అన్నంభొట్టు అనీ!

32 వ వారం

మార్చు
  • ... ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది అనీ!
  • ... అరేబియన్ నైట్స్ గా ప్రసిద్ధి గాంచిన అలీఫ్ లైలా వెయ్యిన్నొక్క కథల సమాహారమనీ!
  • ... వైష్ణవభక్తులైన ఆళ్వారులు రచించిన ఆధ్యాత్మిక రచనలను దివ్య ప్రబంధాలు అంటారనీ!
  • ... పాశ్చాత్య ప్రబంధ కవిత్వంగా భావించే ఇలియడ్, ఒడిస్సీ రచనల సృష్టికర్త హోమర్ అనీ!
  • ... ఉన్నవ లక్ష్మీనారాయణ శారదా నికేతన్ పేరుతో బాలికల పాఠశాల స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించాడనీ!

33 వ వారం

మార్చు
  • ... హంగేరి దేశంలో ప్రపంచంలోని అతి పెద్ద ఉష్ణ నీటి గుహ వ్యవస్థ ఉందనీ!
  • ... ఎస్కిమోలు వేలాది సంవత్సరాలుగా ఇతరులతో సంబంధం లేకుండా జీవనం చేస్తున్నారనీ!
  • ... రెండవ ప్రపంచ యుద్ధానంతరం తమ తమ కూటముల్లో చేరాలన్న అగ్రరాజ్యాల ఒత్తిడినుంచి బయట పడటానికి అలీనోద్యమం రూపుదిద్దుకుందనీ!
  • ... భారతదేశంలో మొదటి సారిగా దూరవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము అనీ!
  • ... బత్తిన సోదరులు పంచే చేప ప్రసాదం లో కొర్రమీను చేప పిల్లలను ఉపయోగిస్తారనీ!

34 వ వారం

మార్చు
  • ... దాదాభాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంటు సభ్యత్వం (1892-1895) పొందిన తొలి ఆసియా వ్యక్తి అనీ!
  • ... హిందూ మున్నాని తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ అనుబంధ సంస్థ అనీ!
  • ... సచిన్ బన్సల్ ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరనీ!
  • ... 1990 దశకం చివర్లో ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత ధారావాహిక ఎనిమిది నంది పురస్కారాలు అందుకుంది అనీ!
  • ... శ్రీగంధం మొక్క భూమి నుండి నేరుగా నీటినీ, పోషకాలనూ గ్రహించలేదనీ, అందుకోసం పక్కనే ఉన్న మొక్కలను వాడుకుంటుందనీ!

35 వ వారం

మార్చు

36 వ వారం

మార్చు
  • ... గత 30 వేల సంవత్సరాలుగా మానవుడు పలు రకాలుగా డూడుల్ వేస్తూ ఉన్నారనీ!
  • ... తెలుగు భాషాభిమాని ఎం.ఎ.సుభాన్‌ ఏర్పాటు చేసిన కళాసాగర్ అవార్డులు కళలరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే వారనీ!
  • ... కరాచీ బేకరి 1947 లో భారత్, పాకిస్థాన్ విభజన జరిగినప్పుడు హైదరాబాదుకు వలస వచ్చిన సింధీ వలసదారుడు ఖాన్ చంద్ రామ్నానీ స్థాపించిన సంస్థ అనీ!
  • ... తెలుగులో వచ్చిన మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతి అనీ!
  • ... విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ ని జెవెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తారనీ!

37 వ వారం

మార్చు
  • ... మలయాళ సినిమా రంగంలో పేరు గాంచిన శివన్ మూడు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నాడనీ!
  • ... తెన్నేటి పార్క్ విశాఖపట్నంలో తొలి పిల్లల పార్కుగా పేరు గాంచిందనీ!
  • ... మేఘాలయ రాష్ట్రానికి చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ గుర్తింపు సాధించిన పార్టీల్లో మొదటిది అనీ!
  • ... భారత ప్రభుత్వ రంగ సంస్థయైన HAL, ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల రాఫెల్ ఒప్పందం వివాదం ఏర్పడిందనీ!
  • ... హైదరాబాద్ మారథాన్ భారతదేశంలో రెండవ అతిపెద్ద మారథాన్ గా పేరుపొందింది అనీ!

38 వ వారం

మార్చు
  • ... ఒరిస్సాల్లో బిజూ జనతా దళ్ పార్టీని ప్రారంభించిన నవీన్ పట్నాయక్ ఆ పార్టీ తరఫున వరుసగా ఐదు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడనీ!
  • ... భారతదేశపు మొట్టమొదటి ఔషధ సంస్థ బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ సంస్థను స్థాపించింది ప్రఫుల్ల చంద్ర రాయ్ అనీ!
  • ... కర్ణాటక, శివమొగ్గ జిల్లాలోని కుందాద్రి కొండల్లో పురాతన జైనదేవాలయం ఉందనీ!
  • ... కాశ్మీరులోని గడ్సర్ సరస్సు ని పువ్వుల లోయ అని వ్యవహరిస్తారనీ!
  • ... ఈథర్నెట్ అనేది లోకల్ ఏరియా నెట్‌వర్క్ లో భాగంగా కంప్యూటర్లను వైర్లతో అనుసంధానించే ప్రమాణ పద్ధతి అనీ!

39 వ వారం

మార్చు
  • ... గాయని కె. ఎస్. చిత్ర తమిళ సినీపరిశ్రమలో ప్రవేశించిన మొట్టమొదటి చిత్రం సింధు భైరవి లో పాటకు జాతీయ పురస్కారం అందుకుందనీ!
  • ... వరంగల్‌ సెంట్రల్‌ జైలు నిజాం పరిపాలనా కాలంలో నిర్మించబడినదనీ!
  • ... భారతదేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహం తెలంగాణాలోని ఆవంచ గ్రామంలో ఉన్నదనీ!
  • ... కడుపులో నులిపురుగులు ప్రధానంగా అపరిశుభ్రతవల్ల ఏర్పడతాయి అనీ!
  • ... సెట్విన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ఏర్పడ్డ ప్రభుత్వ సంస్థ అనీ!

40 వ వారం

మార్చు
  • ... హైదరాబాదులోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పౌరసేవల అభివృద్ధి రంగంలో శిక్షణ ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అనీ!
  • ... నల్గొండ జిల్లా, పిల్లలమర్రిలోని నామేశ్వర దేవాలయం కాకతీయుల సామంతులైన రేచర్ల నామిరెడ్డి కట్టించిన దేవాలయమనీ!
  • ... పాకిస్తాన్ లోని కరాచీ నగరం ప్రపంచంలో 12వ అతిపెద్ద దేశమనీ!
  • ... కాశ్మీర్ లోని శేషనాగ్ సరస్సుకు హిందూ పురాణాల్లోని శేషనాగు ఆధారంగా పేరుపెట్టారనీ!
  • ... బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వెంట్ అయిన విలియం ఫ్రేజర్ మొఘలుల కాలం నాటి దృశ్యాలను చిత్రాల ద్వారా రికార్డు చేయించాడనీ!

41 వ వారం

మార్చు

42 వ వారం

మార్చు

43 వ వారం

మార్చు

44 వ వారం

మార్చు

45 వ వారం

మార్చు
  • ... జేన్ ఆడమ్స్ నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి పొందిన తొలి అమెరికన్ మహిళ అనీ!
  • ... 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడిపందేలు జరిగేవనీ!
  • ... భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జరిగిన నిరపాయకరమైన చపాతీ ఉద్యమం ఆంగ్లేయులను కలవరపెట్టిందనీ!
  • ... రాజరత్న అనేది బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత సంస్థానాదీశులు ప్రజలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమనీ!
  • ... టైమ్ అమెరికా వార్తా ప్రచురణలో మొట్టమొదటి వార పత్రిక అనీ!

46 వ వారం

మార్చు
  • ... చత్తీస్‌ఘడ్ లోని రాయగఢ్ బొగ్గు నిల్వలకూ, విద్యుత్ ఉత్పత్తికి పేరు గాంచిందనీ!
  • ... రాజా భగవన్‌దాస్‌ బాగ్‌ ప్యాలెస్‌ కేవలం చెక్కతో కట్టిన వందల ఏళ్లనాటి అరుదైన భవనాల్లో ఒకటనీ!
  • ... తెలంగాణాకు చెందిన సేంద్రీయ రసాయన శాస్త్రవేత్త రమాకాంత్ సరబు మధుమేహంపై ప్రపంచస్థాయి పరిశోధనలు చేశాడనీ!
  • ... స్వపరిపాలన కోసం ప్రారంభమైన భారత హోంరూల్ ఉద్యమం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టమనీ!
  • ....విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సమాఖ్యకు ప్రెసిడెంటుగా ఎన్నికైన మొదటి మహిళా, ఏకైక భారతీయురాలు అని!

47 వ వారం

మార్చు
  • ... ఎవర్‌గ్రాండే గ్రూప్ చైనాలో రెండవ అతిపెద్ద స్థిరాస్తి అభివృద్ధి సంస్థ అనీ!
  • ... డి.కె.బరువా అస్సాం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి అనీ!
  • ... బొకారో స్టీల్ సిటీ భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటనీ!
  • ... స్వాతంత్ర్య సమర యోధుడు బసావన్ సింగ్ మొత్తం పద్దెనిమిదన్నరేళ్ళు జైల్లో ఉన్నాడనీ!
  • ... తెలంగాణా రాష్ట్రంలో పురావస్తుశాఖ వివిధ ప్రాంతాల తవ్వకాల్లో లభించిన శిల్పాలను పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారనీ!

48 వ వారం

మార్చు

49 వ వారం

మార్చు

50 వ వారం

మార్చు
  • ... అరవింద్ అడిగ రాసిన మొట్టమొదటి నవల ది వైట్ టైగర్ కు 2008 లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్నాడనీ!
  • ... తమిళ స్వాతంత్ర్యోద్యమ కారుడు కోవై సుబ్రి మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు పొందాడనీ!
  • ... భారతదేశంలో ఒక హైకోర్టుకు హాజరైన మొదటి మహిళా న్యాయవాది వైలెట్ ఆల్వా అనీ!
  • ... భారత స్వాతంత్ర్య సముపార్జనలో నేతాజీపై హత్యా ప్రయత్నం చేసిన తన భర్తను చంపిన సైనికురాలు నీరా ఆర్య అనీ!
  • ... క్విట్ ఇండియా ఉద్యమంలో ధైర్యంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు 17 ఏండ్ల కనకలతా బారువా ను బ్రిటిష్ వారు కాల్చి చంపారనీ!

51 వ వారం

మార్చు
  • ... గడ్డం సమ్మయ్య అరుదైన చిందు యక్షగాన కళ కొనసాగిస్తూ అనేక పురస్కారాలు అందుకున్నాడనీ!
  • ... రాస్‌ బిహారి బోస్‌ భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత ధైర్యసాహసాలు చూపిన దేశభక్తుల్లో ఒకడనీ!
  • ... శంఖపుష్పం కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వివిధ రకాల జబ్బులను నయం చేయడానికి వాడుతున్నారనీ!
  • ... మహాలయ పౌర్ణమి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమైన పండుగ అనీ!
  • ... అబ్దుల్ కలాం స్మారకార్థం తమిళనాడు ప్రభుత్వం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అందజేస్తున్నారనీ!

52 వ వారం

మార్చు
  • ... అంగోత్‌ తుకారాం ఎవరెస్టు శిఖరంతో బాటు ఐదు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలు అధిరోహించిన అంతర్జాతీయ పర్వతారోహకుడనీ!
  • ... ప్రపంచంలో అన్నింటికన్నా ఎత్తైన ఏంజెల్ జలపాతము వెనెజులా దేశంలో ఉన్నదనీ!
  • ... భారతదేశంలో శక్తివంతమైన రాజకీయ నాయకులు ఢిల్లీ లోని అక్బర్ రోడ్ లో నివాసం ఉంటారనీ!
  • ... స్వాతంత్ర్య భారతదేశపు 1వ లోక్‌సభ లో 489 మంది సభ్యులు ఉండేవారనీ!
  • ... మావోయిస్టు నేత అక్కిరాజు హరగోపాల్‌ నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంలో ప్రధాన నిందితుడనీ!