వికీపీడియా:రచ్చబండ

(వికీపీడియా:Village pump నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 1000 రోజులు - 1000 వ్యాసాలు టాపిక్‌లో 10 గంటల క్రితం. రాసినది: Tmamatha
అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..


హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (2024-25), తెవికీ ప్రచారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరగనుంది. ప్రతిసంవత్సరం చేసినట్లుగానే తెలుగు వికీపీడియా సభ్యులు బుక్ ఫెయిర్ లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఈ ప్రచారం కొంత విస్తృతంగా నిర్వహించాలని, ఇంకా తెవికీ లక్ష వ్యాసాలు, వికీసోర్స్ 20000 వ్యాసాల మైలురాళ్లను దాటిన సందర్భంలో అభినందన కార్యక్రమం బుక్ ఫెయిర్ కేంద్ర వేదిక మీద నిర్వహించాలని ఉద్దేశ్యంతో సముదాయం నిర్ణయించినట్లుగా ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహకారం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. ఈ ప్రాజెక్ట్ పేజి పరిశీలించి అక్కడ మీ సహకారాన్ని నమోదు చేయవలసినదిగా విన్నపం. (మెటాపేజీ)ఇక్కడ చూడవచ్చు. ధన్యవాదాలు.

V.J.Suseela (చర్చ) 07:24, 2 డిసెంబరు 2024 (UTC) (తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్)Reply

ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించే కార్యక్రమం గురించి ఇంతకుముందే (2 డిసెంబరు 2024న) సముదాయానికి తెలియచేయడం జరిగింది. దీంట్లో భాగంగా తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాలు మైలు రాయి అధిగమించడం ఇంకా ఇతర ప్రాజెక్టుల ప్రచారం గురించి ఒక 45 నిముషాల పాటు (మనకు అంతే అవకాశం ఉంటుంది) సభను 26.12.2024 తేదీన సాయంత్రం 5.00 నుండి 5.45 వరకు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము.
పాల్గొనదలచిన వారు 15.12.2024 తేదీ లోపల ఇక్కడ సంతకం చేసి పాల్గొనగల రోజులు పేర్కొనవలసినది.
ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 09:44, 11 డిసెంబరు 2024 (UTC)Reply

ధన్యవాదాలు మేడం

చాలా మంచి ఆలోచన RATHOD SRAVAN (చర్చ) 07:45, 2 డిసెంబరు 2024 (UTC)Reply

తెవికీ 21వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్-ఎ2కె ల సహకారంతో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో తిరుపతి లో తెవికీ పండగ-2025 (తెలుగు వికీపీడియా 21వ వార్షికోత్సవం) జరగబోతుంది. తెవికీ 21వ వార్షికోత్సవానికి హాజరయ్యే వారికి స్కాలర్‌షిప్ పొందే మంచి అవకాశం. ఈ పేజీ లో దరఖాస్తు ఫారానికి లింకు ఇవ్వబడింది. ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 13, 2024 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి ఉన్న సభ్యులందరూ (కమిటీ మెంబర్స్ తో సహా) అప్లై చేసుకోగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:35, 3 డిసెంబరు 2024 (UTC) (తెవికీ పండగ-2025-కమ్యూనికేషన్ & స్కాలర్ షిప్ కమిటీ నుండి)Reply

Expressions of Interest to host Wikimania 2027 in India: Initial conversation

Please help translate to your language

Dear Wikimedians,

We are excited to Initiate the discussions about India’s potential bid to host Wikimania 2027, the annual international conference of the Wikimedia movement. This is a call to the community to express interest and share ideas for organizing this flagship event in India.

Having a consortium of a good number of country groups, recognised affiliates, thematic groups or regional leaders primarily from Asia for this purpose will ultimately strengthen our proposal from the region. This is the first step in a collaborative journey. We invite all interested community members to contribute to the discussion, share your thoughts, and help shape the vision for hosting Wikimania 2027 in India.

Your participation will ensure this effort reflects the strength and diversity of the Indian Wikimedia community. Please join the conversation on Meta page and help make this vision a reality!

Regards,
Wikimedians of Kerala User Group and Odia Wikimedians User Group
This message was sent with MediaWiki message delivery (చర్చ) by Gnoeee (talk) 15:14, 4 డిసెంబరు 2024 (UTC)Reply

A2K Monthly Report – November 2024

 

Dear Wikimedians,

We’re excited to bring you the November edition of the CIS-A2K newsletter, highlighting our impactful initiatives and accomplishments over the past month. This issue offers a comprehensive recap of our events, collaborative projects, and community engagement efforts. It also provides a glimpse into the exciting plans we have lined up for the coming month. Stay connected with our vibrant community as we celebrate the progress we’ve made together!

In the Limelight
Tulu Wikisource
Dispatches from A2K
Monthly Recap
  • Learning hours Call
  • Dandari-Gussadi Festival Documentation, Commons Education Project: Adilabad
  • Executive Directors meeting at Oslo
Coming Soon - Upcoming Activities
  • Indic Wikimedia Hackathon 2024
  • Learning Hours

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 16:46, 10 డిసెంబరు 2024 (UTC)Reply

వ్యాసాలలో అసందర్భ తికమక పదాలు

కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది. మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దినపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.

నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్భ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించాను. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రా పదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్భంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు, కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్య సందర్భానికి తగిన సరియైన పదం ఉండాలి.

ఆంగ్లపదం అనువాద పదం ఉండాలిసిన పదం వివరం
Adoor తలుపు ఆదూర్ కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం
Praful Patel డస్ట్ పటేల్ ప్రఫుల్ పటేల్ రాజకీయ నాయకుడు
Showaless K Shilla ప్రదర్శన లేని కె షిల్లా షోవేలెస్ కె షిల్లా ఒక రాజ్యసభ సభ్యుడు
Jagadambi Mandal జగదాంబి మండలం జగదాంబి మండల్ ఒక రాజ్యసభ సభ్యుడు (పేరు సందర్భంలో మండల్ అని ఉండాలి)
votes swing ఓట్లు ఊపుతాయి ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ ఇలాంటి సందర్భంలో అలా రాస్తేనే బాగుంటుంది
Disqua (Disqualified) డిస్క్వల్ అనర్హత లేదా అనర్హుడు
Dissolved కరిగిపోయింది రద్దుఅయింది లేదా రద్దైంది
Incumbent నిటారుగా పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం
Acting నటన తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్భాన్ని బట్టి రాయాలి
14th ,15th 14వ, 15వ 14వ తేదీ, 15వ తేదీ
Akola చేసాడు అకోలా ఇది ఒక జిల్లా
Raigad కిరణాలు రాయిగఢ్ ఇది ఒక జిల్లా
Beed మంచం బీడ్ ఇది ఒక జిల్లా
Latur సోమరితనం లాతూర్ ఇది ఒక జిల్లా
రోమన్ అంకెలు వరస సంఖ్యలుగా ఉన్నచోట I ,  నేను గాను V ,  వి గానూ అనువదిస్తుంది.
res (సింపుల్ గా రాసారు) రెస్ రాజీనామా అని ఉండాలి resignation సందర్బంలో అలా రాసారు
bye (సింపుల్ గా రాసారు) బై ఉప ఎన్నిక అని ఉండాలి bye election సందర్భంలో అలా రాసారు

నాకు తెలిసినంతవరకు దీనికి ప్రధాన కారణం వ్యాసం సృష్ట్టించిన తరువాత ఒకసారి పరిశీలనాదృష్టితో చదివి సవరించకపోవటం అని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:29, 14 డిసెంబరు 2024 (UTC)Reply

ఇలాంటివి చాల గమనించాను, రాసి పెట్టుకోలేక పోయాను. కనీసం నావ్యాసాలు పరీక్షించుదామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంతకూ ముందే వాటిని సరిదిద్దుతే వారికీ ధన్యవాదాలు . V.J.Suseela (చర్చ) 08:35, 15 డిసెంబరు 2024 (UTC)Reply
@Vjsuseela గారూ కనీసం ఎవరు సృష్టించిన వ్యాసాలు వారు ఒకసారి పరిశీలానాదృష్టితో చూసి సవరిస్తే ఇలాంటి పదాలు చూద్దామన్నా కనపడవు. యర్రా రామారావు (చర్చ) 08:41, 15 డిసెంబరు 2024 (UTC)Reply

37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సభ్యులందరికి నమస్కారం. ఈనెల (డిసెంబర్ 2024) 19వతేదీ సాయంత్రం 4 గంటలకు 37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. (పుస్తకప్రదర్శన స్థలం - కాళోజీ కళాక్షేత్రం, NTR స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, హైదారాబాద్). అందరూ పాల్గొనాల్సిందిగా  ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.
తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్-- V.J.Suseela (చర్చ) 07:46, 18 డిసెంబరు 2024 (UTC)Reply

తెలుగు సాహితి లిస్టు ఎక్కడైనా దొరుకుతుందా నేను జాతీయ దినోత్సవం

Gangaasoonu (చర్చ) 08:26, 22 డిసెంబరు 2024 (UTC)Reply

తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానం - చిరుపుస్తకం ఆవిష్కరణ సభ

సభ్యులందరికి నమస్కారం.
ఈనెల (డిసెంబర్ 2024) 37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో 26వతేదీ సాయంత్రం 5 గం నుంచి 5.45 వరకు తెవికీ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది.

  • తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాల ప్రస్థానం - "వికీపీడియా గురించి మీకు తెలుసా?" అను చిరుపుస్తకం ఆవిష్కరణ సభ
  • డా.మామిడి హరికృష్ణ గారు (సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ) గౌరవ అతిథిగా విచ్చేస్తున్నారు.
  • వేదిక: “తోపుడుబండి సాదిక్” వేదిక, కాళోజీ కళాక్షేత్రం, NTR స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, హైదారాబాద్
  • సమయం: తేదీ 26.12.2024, సాయంత్రం: 5 నుంచి 5.45 వరకు.

తెలుగు వికీమీడియన్లు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.
తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్----V.J.Suseela (చర్చ) 07:18, 24 డిసెంబరు 2024 (UTC) V.J.Suseela (చర్చ) 07:23, 24 డిసెంబరు 2024 (UTC)Reply

ఈ వారపు బొమ్మ - ఫోటో సౌజన్యం ఎవరు?

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2024 01వ వారం - తెలంగాణ_కొత్త_సచివాలయం.jpg (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం) ఫోటో సౌజన్యం పేర్లు దస్త్రం, మొదటిపేజీలలో భిన్నంగా ఉన్నాయి. గమనించగలరు. - Muralikrishna m (చర్చ) 03:29, 30 డిసెంబరు 2024 (UTC)Reply

37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాల్ కార్యక్రమాలు ముగిసాయి

సభ్యులందరికి నమస్కారం. 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 19న ప్రారంభమయి 29వ తేదీన వరకు ముగిసింది. తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహణకు సంబంధించి ఔత్సాహికులైన స్వచ్ఛంద తెలుగు వికీమీడియన్ లు తమ బాధ్యతలను నిర్వర్తించారు. కొంతమంది తెలుగు వికీమీడియన్లు ప్రోత్సాహపూర్వకముగా స్టాల్ ను సందర్శించారు. కొంతమంది ఫోన్లు/వాట్స్ అప్ ద్వారా విషయాలు తెలుసుకుని ఎప్పడికప్పుడు సందేశాలు అందిస్తున్నారు. ఈ నిర్వహణలో సహాయ సహకారాలందించిన వికీమీడియా ఫౌండేషన్ వారికీ, CIS A2K వారికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న తెలుగు వికీమీడియన్లు అందరికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము.
-- తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ V.J.Suseela (చర్చ) 07:23, 30 డిసెంబరు 2024 (UTC)Reply

అందరికీ ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:23, 30 డిసెంబరు 2024 (UTC)Reply

Sitenotice లో ప్రకటన

వికీపీడియా పాఠకులకు వికీపీడియా గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకునేందుకు, మీడియావికీ:Sitenotice లో ప్రస్తుతం ఉన్న ప్రకటన లోని పాఠ్యాన్ని తగు విధంగా మార్చి అందులో ఈ లింకును చేర్చవచ్చు - File:Wikipedia_Gurinchi_Meeku_Telusa?.pdf లేదా తెవికీ లోనే ఓ పేఝీ పెట్టి అక్కడ ఆ పుస్తకం లింకు ఇవ్వవచ్చు.

నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 10:10, 30 డిసెంబరు 2024 (UTC)Reply

@Chaduvari గారు మంచి అలోచన ఇచ్చారు. బాగుంది. పుస్తకం పలానా లింకులో ఉంది చదువుకోండి అని చెప్పవచ్చు. ఈ విషయంలో వాడుకరి: ప్రణయ్ రాజ్ గారు తగిన చర్యలు చేపట్టవలసినదిగా కోరటమైనది యర్రా రామారావు (చర్చ) 11:04, 30 డిసెంబరు 2024 (UTC)Reply
చదువరి, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. Sitenoticeలో మార్పులు చేశానండీ.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:14, 31 డిసెంబరు 2024 (UTC)Reply
సత్వర చర్యలు చేపట్టినందుకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:16, 31 డిసెంబరు 2024 (UTC)Reply
@Pranayraj1985 గారూ ధన్యవాదాలు. లింకు కామన్సుకు వెళ్తున్నందున ఇంటర్‌ఫేసు ఇంగ్లీషులో ఉండి వేరే సైటుకు వెళ్ళినట్టు పాఠకులకు తెలుస్తుంది. అలాకాకుండా తెవికీ లింకునే ఇస్తే ఆ పుస్తకం తెవికీలోనే ఉన్నట్టు భావిస్తారు. అంటే -
తెలుగు వికీపీడియా గురించి మరింత అవగాహన కొరకు వికీపీడియా గురించి మీకు తెలుసా? పుస్తకం చూడండి.
- ఇలా ఇస్తే బాగుంటుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 09:30, 31 డిసెంబరు 2024 (UTC)Reply
మార్చానండీ చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:37, 31 డిసెంబరు 2024 (UTC)Reply
 
__ చదువరి (చర్చరచనలు) 09:41, 31 డిసెంబరు 2024 (UTC)Reply
ఎందరో మహానుభావులు అందరికీ ధన్యవాదాలు...! వికీపీడియా గురించి మీకు తెలుసా? పుస్తక రూపకర్తలందరికీ కృతజ్ఞతలు ..!!! Muralikrishna m (చర్చ) 17:33, 31 డిసెంబరు 2024 (UTC)Reply

విక్షనరీలో తప్పు ఫైళ్ళను మంచి ఫైళ్ళతో మార్చడంలో సహాయం చేయండి

హాయ్! 350 కంటే ఎక్కువ ఫైళ్ళకు లైసెన్స్ లేదు కాబట్టి అవి తొలగించబడతాయి. కానీ ఎవరో సహాయం చేసి తప్పు ఫైళ్ళను మంచి ఫైళ్ళతో మార్చితే పేజీలకు ఫోటోలు మిస్సవకుండా ఉంటాయి. మీరు wikt:వర్గం:Files with no license కు వెళ్లి కొన్ని ఫోటోలను తనిఖీ చేసి, మీరు తీసిన ఫోటోలు లేదా కామన్స్ నుండి ఎవరో తీసిన ఫోటోలతో మార్చవచ్చు. ధన్యవాదాలు! --MGA73 (చర్చ) 10:46, 1 జనవరి 2025 (UTC)Reply

వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం ఆర్ధిక నివేదిక

అందరికి నమస్కారం,

తెలుగు వికీపీడియా 2025 లో 21 వ వార్షికోత్సవం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. అదే విధంగా ఈ కార్యక్రమానికి గాను యర్రా రామారావు గారు అక్షారాల ~28 లక్షల ఆర్థిక సహాయాన్ని తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరఫున పొందిన విషయం అందరికి తెలిసిందే.

అయితే 2024 లో జరిగిన తెలుగు వికీపీడియా వార్షికోత్సవ బడ్జెట్ నివేదిక వెతికాను , నాకు ఎక్కడ దొరకలేదు, ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఆ నివేదిక అందించడం ద్వారా తెలుగు వికీమీడియా వెచ్చించిన గ్రాంటు ఖర్చుల అంశాలపై సముదాయానికి లెక్కలతో సహా తెలపగలరు, తద్వారా తెలుగు వికీ నిర్వహించే కార్యక్రమాలకి మరింత బలం చేకూర్చే దిశగా ప్రత్నిద్దాము. నేతి సాయి కిరణ్ (చర్చ) 16:26, 2 జనవరి 2025 (UTC)Reply

అవును నేను కూడా వెతికాను దొరకలేదు. ప్రస్తుతం ఏర్పాట్లు జరుపుకుంటున్న పండుగ మాదిరి ఆర్థిక నివేదిక కనబడలేదు. కానీ కార్యక్రమ నివేదిక మాత్రం ఉంది. ఆర్థిక నివేదికను ప్రచురించడం ద్వారా మనం జరుపుకుంటున్న ప్రతి కార్యక్రమానికి ఎంతో బలం చేకూరుతుంది.-అభిలాష్ మ్యాడం (చర్చ) 17:28, 2 జనవరి 2025 (UTC)Reply
2024 జనవరిలో విశాఖపట్నంలో జరిగిన తెవికీ పండగకి మనం గ్రాంటు రాయలేదు, డబ్బులు తీసుకోలేదు. దానికైన ఖర్చంతా సీఐయెస్సే పెట్టుకుంది. ఏమేం కార్యక్రమాలు చేస్తారో చెప్పండి డబ్బులు మేం పెడతాం అని వాళ్ళు చెప్పారు. మాకు ఇంత కావాలి అని మనం అడగలేదు. ఏయే పనులు చెయ్యాలో మనం నిర్ణయించుకున్నాం, వాళ్ళు ఖర్చు పెట్టారు. అన్ని ఖర్చులకూ డబ్బులు వాళ్ళే నేరుగా పెట్టారు. ఉదాహరణకు, స్కాలర్ షిప్పులు ఎవరెవరికి ఇవ్వాలో మనం నిర్ణయించాం, రైలు టిక్కెట్లు వాళ్ళు కొన్నారు. హోటల్లో గదులు మాట్లాడి వాళ్ళే బుక్ చేసారు, తిండికి వాళ్ళే ఖర్చుపెట్టారు, విశాఖలో తిరగడానికి పెట్టిన బస్సులు, పుస్తకం, జ్ఞాపికలూ.. అన్నిటికీ వాళ్ళే ఖర్చు పెట్టారు. నాకు గుర్తున్నంతలో మనం ఖర్చుపెట్టింది ఒక్క పైసా కూడా లేదు. యావత్తు కార్యక్రమ ఏర్పాట్లలో సీఐఎస్ నుండి ముగ్గురు నలుగురు చాలా చురుగ్గా పాలుపంచుకున్నారు.
@Nskjnv గారూ, ఆ పండగ కోసం మనం ఏర్పాటు చేసిన కమిటీల్లో మీరూ సభ్యులే. కమిటీల చర్చల్లో ఈ సంగతి మాట్లాడుకున్నాం. ఈ సంగతి మీకు తెలిసే ఉండాలి. తెలియకపోతే, అప్పుడే తెలుసుకుని ఉండాల్సింది. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు. ఈ సంగతిని సముదాయానికి తెలియజెప్పాల్సిన బాధ్యత తీసుకున్నారు మీరు. పైగా మీరు ఆ కమిటీకి నాయకుడు. అలాంటి మీరే ఇన్నాళ్ళ తరవాత ఈ సంగతి అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. కమిటీలో మీరు తీసుకున్న బాధ్యతను ఎంతవరకూ సక్రమంగా నిర్వర్తించారో ఆలోచించండి. __ చదువరి (చర్చరచనలు) 02:11, 3 జనవరి 2025 (UTC)Reply

చదువరి గారికి నమస్కారం,

అయ్యా 2024 లో తెవికీ వార్షికోత్సవం విజయవంతంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే, కార్యక్రమ నిర్వహణలో నేను చాలా చురుగ్గా పాలు పంచుకున్నాను, అది మీక్కూడా తెలిసిన విషయమే.

ఇన్నాళ్ల తర్వాత ఈ విషయం ఎందుకు అడగవలసి వస్తుంది అంటే , సిఐఎస్ వారు తెలుగు వికీకి 20 వ వార్షికోత్సవం జరపడానికి అయిన ఖర్చు మీరు చెప్పినట్టుగానే పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ , మన సమావేశానికి సిఐఎస్ వారు కేటాయించిన బడ్జెట్ మనకి విరాళంగా/దానంగా ఖర్చు పెట్టి ఉండొచ్చు , లేదంటే మన సముదాయం పేరు చెప్పి వికీమీడియా వారికి లెక్కలు చూపించి డబ్బు తెచ్చి ఉంటారు , ఒకవేళ వికీమీడియా వారి నుండి డబ్బు గనక తెచ్చినట్టయితే , యెంత మంజూరైంది, దానిలో యెంత ఖర్చయింది , ఈ విషయాలేవీ సముదాయానికి చెప్పకపోవటం గురించే నా ప్రశ్న, ఇక్కడ కార్యక్రమ ఆర్ధిక పనులు చేపట్టిన వారి నిబద్ధతను ఒక సముదాయ సభ్యుడిగా మీరు ప్రశ్నిచడం సబబు , అని గుర్తించగలరు . ధన్యవాదాలు . నేతి సాయి కిరణ్ (చర్చ) 04:12, 3 జనవరి 2025 (UTC)Reply

చదువరి గారు. ఎవరికైనా దేనిమీదైనా సందేహం వస్తే అడగడానికి వికీలో సమయ పరిమితి ఉందా?, ఆ పరిమితి దాటాక ఆడగకూడదా ?, అంటే "అప్పుడే తెలుసుకుని ఉండాల్సింది, ఇన్నేళ్ళ తర్వాత అడుగుతున్నారు ఆశ్చ్యర్యంగా ఉంది" అని అన్నారుగా. అప్పుడు తెలుసుకోలేకపొతే ఇప్పుడూ తెలుసుకోకూడదా ?, అనుమాన నివృత్తి జరగడం మంచిదే కదండీ...--B.K.Viswanadh (చర్చ) 05:10, 3 జనవరి 2025 (UTC)Reply
చదువరి గారూ మన కార్యక్రమాలకు సిఐఎస్ వాళ్ళు పూర్తి సమయాన్ని వెచ్చించి అన్ని ఖర్చులూ పెట్టి ముందుకు నడిపించడం చాల సంతోషకరమైన విషయమే. కానీ వాళ్ళు వెచ్చించింది మన తెవికీ పండగ సమావేశానికి కాబట్టి దేనిదేనికి ఎంతెంత వారు ఖర్చుపెట్టారో మనందరికీ తెలిసేట్టు ఒక నివేదిక ఉంటే తదుపరి కార్యక్రమాలకు కూడా అది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. - అభిలాష్ మ్యాడం (చర్చ) 07:06, 3 జనవరి 2025 (UTC)Reply
అభిలాష్ మ్యాడం గారూ, మీరు చెప్పినది బానే ఉంది. కానీ, అందుకోసం అడగాల్సింది సీఐఎస్ వారిని. కానీ Nskjnv గారు అలా చెయ్యలేదు.
  • "ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఆ నివేదిక అందించడం ద్వారా తెలుగు వికీమీడియా వెచ్చించిన గ్రాంటు అంశాలపై సముదాయానికి లెక్కలతో సహా తెలపగలరు," అని ఆయన రాసారు. అసలు గ్రాంటే రాయనపుడు గ్రాంటు అంశాల గురించి సముదాయానికి చెప్పాలని అడగడం ఏమిటి? గ్రాంటు రాయలేదని బహుశా మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. "సిఐఎస్ వారు తెలుగు వికీకి 20 వ వార్షికోత్సవం జరపడానికి అయిన ఖర్చు మీరు చెప్పినట్టుగానే పెట్టుకున్న విషయం తెలిసిందే" అని తరువాత రాసారు చూసారు గదా! ఖర్చులు పెట్టుకున్నది సీఐఎస్ అని తెలిసినపుడు, వాళ్ళను ట్యాగ్ చేసి అడగాలి కదా, లెక్కలు చెప్పండి అని? వాళ్ళను అడగకుండా, "కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించిన వారిని" అడగడంలో ఉద్దేశమేమిటి? పైగా, సాయికిరణ్ గారు కార్యక్రమ కమిటీల్లో భాగం. ప్రాతినిధ్యం వహించిన వారిలో ఆయనా ఒకరు. అయినప్పటికీ, దానితో తనకేమీ సంబంధం లేనట్లుగా వేరెవరిదో బాధ్యత అన్నట్టుగా మాట్టాడుతున్నారు.
  • "ఇక్కడ కార్యక్రమ ఆర్ధిక పనులు చేపట్టిన వారి నిబద్ధతను ఒక సముదాయ సభ్యుడిగా మీరు ప్రశ్నిచడం సబబు , అని గుర్తించగలరు ." అని రాసారు. సీఐఎస్ నిబద్ధతను నేను ప్రశ్నించాలంట! ఆయనా సముదాయ సభ్యుడే గదా, ఆయనెందుకు ప్రశ్నించడంలేదు? ఆయనే సీఐఎస్‌ను ట్యాగ్ చేసి అడగాల్సింది గదా? ఆ బాధ్యతను నామీద తోసేసి నువ్వు సీఐఎస్‌ను అడుగు అని నాకు చెబుతున్నారు. అది సబబేనా? పైగా - ఇలా నేను రచ్చబండలో ప్రశ్నించాను, మీరొచ్చి నాకు సమాధానం చెప్పండంటూ ఒక వాట్సాప్ గ్రూపులో నా పేరుబెట్టి రాసారు. ప్రశ్నించడం మంచిదే, కానీ అది అడిగేముందు, నా బాధ్యతేంటి, దాన్ని నేను నిర్వర్తించానా లేదా అని ఆలోచించుకోవద్దా?
  • "లేదంటే మన సముదాయం పేరు చెప్పి వికీమీడియా వారికి లెక్కలు చూపించి డబ్బు తెచ్చి ఉంటారు , ఒకవేళ వికీమీడియా వారి నుండి డబ్బు గనక తెచ్చినట్టయితే , యెంత మంజూరైంది, దానిలో యెంత ఖర్చయింది , ఈ విషయాలేవీ సముదాయానికి చెప్పకపోవటం గురించే నా ప్రశ్న," - అని అన్నారు. తన అనుమానాలు తీర్చుకోవాలంటే ఆయన అడగాల్సింది సీఐఎస్ వారిని. ఈ సంగతి ఇకనైనా గ్రహించమని ఆయన్ను కోరుతున్నాను. ఆయనే కాదు, మనలో ఎవరైనా ఈ సంగతి తెలుసుకోవాలంటే, నేరుగా సీఐఎస్ వారినే ట్యాగ్ చేసి అడగాలి.
ధన్యవాదాలు అభిలాష్ గారు.__ చదువరి (చర్చరచనలు) 15:15, 3 జనవరి 2025 (UTC)Reply

@ చదువరి గారు నమస్కారం ,

విషయం తెలియజెప్పినందుకు ధన్యవాదాలు, అలాగే చేద్దాం సీఐఎస్ నుండి ప్రాతినిధ్యం వహించిన @వాడుకరి:Pavan santhosh.s గారు ఈ ప్రశ్నకి సమాధాం చెప్పడానికి సరైన వారని భావిస్తున్నాను , లేదు అలా కాదు ఇంకెవరిని అడగాలో మీకు తెలిస్తే చెప్పండి, అలాగే చేద్దాం.

ఇక్కడ విషయం ఎవరిని ఎవరు అడుగుతున్నారని కాదండి , ఇది వరకు చర్చల్లో లెక్కల విషయంలో ప్రశ్నిచడంలో మీకున్న అనుభవం బట్టి మిమ్మల్ని అడిగాను, ఇంకోలా అనుకోవద్దు, పెద్దవారు మీ అభిప్రాయం తెలుసుకుంటే మంచిదనే ఆలోచనే తప్ప మరొకటి కాదని గమనించగలరు.

ఇంకో విషయం గ్రాంటు అన్న పదం తప్పుగా వాడినందుకు క్షమించాలి, అక్కడ ఖర్చులు అని సరి చేశాను.

మొత్తానికైతే ఆ లెక్కల గురించి సముదాయానికి తెలిస్తే, సముదాయం పేరిట వికీమీడియా ఫౌండేషన్ నుండి వస్తున్న ఆర్ధిక అంశాలను గ్రహించి తద్వారా, సముదాయ సభ్యులు ప్రణాళిక పరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని నా మనవి . నేతి సాయి కిరణ్ (చర్చ) 16:25, 3 జనవరి 2025 (UTC)Reply

@Nskjnv గారూ, ధన్యవాదాలు. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 16:59, 3 జనవరి 2025 (UTC)Reply
@Nskjnv గారూ, మీరు నా వాలంటీర్ ఖాతాను టాగ్ చేశారు. ఈ ఖాతా వాడి నేను చేసే వికీ కార్యక్రమాలకు, సీఐఎస్-ఎ2కె కార్యకలాపాలకు సంబంధం లేదు. @Pavan (CIS-A2K) ఖాతా ద్వారా మీకు సమాధానమిస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 10:19, 6 జనవరి 2025 (UTC)Reply

గ్రాంట్లూ వాటి సాధక బాధకాలూ

తెవికీలో చాన్నాళ్ళుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఈ ఏడాది వరకూ గ్రాంట్లు రాసిన అనుభవం నాకు లేదు. ఈ సంవత్సరమే తొలిసారి గ్రాంటు ప్రతిపాదన రాయడంలో కొంత పాలుపంచుకున్నాను. తద్వారా దానిలోని సాధకబాధకాలు తెలిసాయి. పుస్తక ప్రదర్శన కోసం ఒకటి, వచ్చేనెలలో జరగబోయే తెవికీ పండగ కోసం ఒకటీ - రెండు గ్రాంటు ప్రతిపాదనలపై ముందస్తు చర్చల్లో నేను పాల్గొన్నాను. గ్రాంటు రాయడం ఒక ఎత్తైతే, అది ఆమోదం పొందాక, ఆ డబ్బులను తెచ్చుకోవడం, ఆ డబ్బువలన ఏయే పన్నులు తలమీద పడతాయో తెలుసుకోవడం, ఆ డబ్బును ఖర్చుపెట్టడం, ఎప్పటికప్పుడు ఖర్చుల లెక్కలు తయారుచేసుకుంటూ ఉండడం మరొక ఎత్తు. అదొక పెద్ద తల్నెప్పి. కానీ ఇద్దరు వికీపీడియన్లు మాత్రం, అది తలనెప్పి అని తెలిసీ, దాన్ని స్వీకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు - ఒకరు విజె సుశీల గారు, మరొకరు యర్రా రామారావు గారు. నిజానికి వాళ్ళిద్దరూ కూడా గ్రాంటు రాసేందుకు ఇంకెవరూ ముందుకు రాకపోతే నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని చెప్పినవారే. మరెవరూ ముందుకు రానందునే (రాకపోవడానికి ఎవరి కారణాలు వారికున్నై) వారు ఆ బాధ్యత తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి ఉండకపోతే, బహుశా ఆ గ్రాంటులు రాసేవాళ్ళు ఉండేవారే కావేమో. అందుకు వారిద్దరికీ ధన్యవాదాలు.

చేసే ఉద్యోగాల నుండి రిటైరై హాయిగా విశ్రాంతి తీసుకుకుంటున్న సమయంలో, ఏదో ఆసక్తి కొద్దీ వికీలో పనిచేస్తున్న వాళ్ళిద్దరూ చాలా బాధ్యతను తలకెత్తుకున్నారని నేను అప్పుడే అనుకున్నాను. అది, అప్పట్లో నేను అనుకున్నదాని కంటే పెద్ద బాధ్యత అని కూడా తెలుస్తోంది. సుశీల గారూ, రామారావు గారూ.. ఆ బాధ్యతలో కొంత పాలుపంచుకోవడం అనేది నా కనీస బాధ్యతగా నేను భావిస్తున్నాను. గ్రాంట్లు ఎలాగూ రాసేసారు కాబట్టి ఇక అందులో చేసేది ఏమీ లేదు. వాటికి సంబంధించి నివేదికలు రాయడం లాంటివి - కొంత తీరుబడిగా చెయ్యదగ్గవి - ఏవైనా ఉంటే కొంత పని నాకు చెప్పండి. సంతోషంగా చేస్తాను.__ చదువరి (చర్చరచనలు) 16:54, 3 జనవరి 2025 (UTC)Reply

@Chaduvari గారూ మీరు మరోసారి ఇస్తున్న భరోసాకు ధన్యవాదాలు.గ్రాంటుకు నా ద్వారా ధరఖాస్తు చేసినా మీతో సహా, మీరందరూ ముఖ్యంగా @పవన్ సంతోష్, @కశ్యప్ , @మహేశ్, @సాయిఫణి, @ప్రణయ్ రాజ్ @సుశీల గారలు, నన్ను గాలికి వదలివేయకుండా, నాకు పూర్తి సహాయసహకారాలు అందిస్తూ, భాధ్యతలో పాలుపంచుకుంటున్నారు.ఈ సందర్బంగా అందిరికీ ధన్యవాదాలు.నేను ఇనకంటాక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందేమో అని సంశయ పడుతుంటే, అలాంటి రిస్కు మీకు రానివ్యం అని @Chaduvari గారూ, @పవన్ సంతోష్ గారూ ఇచ్చిన భరోసా చాలా గొప్పది. వికీపీడియాకు నేనూ ఒక ముఖ్యమైన ఈవెంట్ కార్యక్రమాలలో ఉడతా భక్తిగా సహకారం అందిస్తున్నాననే తృప్తి నాకు మిగులుతుంది కదా!అది చాలు. యర్రా రామారావు (చర్చ) 18:01, 3 జనవరి 2025 (UTC)Reply
@Chaduvari గారూ, మీ సదభిప్రాయానికి ధన్యవాదాలు. గ్రాంటు దరఖాస్తు విషయంలో, కార్యక్రమ నిర్వహణ విషయములో మీ సహకారంతోటే ముందుకు వెళ్లగలిగాము. మీరు అన్నట్లు గ్రాంట్ తీసుకోవడం, కార్యక్రమానికి ప్రణాళిక ప్రకారం ఖర్చుపెట్టడం ఒక పెద్ద బాధ్యత. అయితే మీ అందరి సహకారంతో, బుక్ ఫేర్ లో ఉత్సాహంగా పాల్గొన్న తెవికీ సభ్యుల తోడ్పాటుతో ఆ కార్యక్రమం ముగిసింది. దీనికి సంబంధించి మిగతా విషయాలకు మీ సలహా, సహకారం తీసుకుంటాము. ఎంతో విస్తృతమైన వికీప్రాజెక్టులలో ఈ కార్యక్రమనిర్వహణకు నేను ఉపయోగపడినందుకు నాకు సంతోషంగా ఉంది. V.J.Suseela (చర్చ) 03:02, 4 జనవరి 2025 (UTC)Reply
@Chaduvari గారూ, చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ చేస్తున్న రెండు ముఖ్యమైన, పెద్ద కార్యక్రమాలకు పెద్దవాళ్ళిద్దరూ బాధ్యత తీసుకుని, తమ వయసును, అలసటను లెక్కచేయకుండా మనందరి అభ్యర్థన మేరకు ఇంత పనిచేయడం చాలా గొప్ప సంగతి. ఇందుకు @Vjsuseela, @యర్రా రామారావు గార్లకు, వారికి సాయం చేస్తున్న @I.Mahesh, @Kasyap, @Saiphani02, @Pranayraj1985, తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 10:22, 6 జనవరి 2025 (UTC)Reply

Invitation to Participate in the Wikimedia SAARC Conference Community Engagement Survey

Dear Community Members,

I hope this message finds you well. Please excuse the use of English; we encourage translations into your local languages to ensure inclusivity.

We are conducting a Community Engagement Survey to assess the sentiments, needs, and interests of South Asian Wikimedia communities in organizing the inaugural Wikimedia SAARC Regional Conference, proposed to be held in Kathmandu, Nepal.

This initiative aims to bring together participants from eight nations to collaborate towards shared goals. Your insights will play a vital role in shaping the event's focus, identifying priorities, and guiding the strategic planning for this landmark conference.

Survey Link: https://forms.gle/en8qSuCvaSxQVD7K6

We kindly request you to dedicate a few moments to complete the survey. Your feedback will significantly contribute to ensuring this conference addresses the community's needs and aspirations.

Deadline to Submit the Survey: 20 January 2025

Your participation is crucial in shaping the future of the Wikimedia SAARC community and fostering regional collaboration. Thank you for your time and valuable input.

Warm regards,
Biplab Anand

A2K Monthly Report – December 2024

 

Dear Wikimedians,

Happy 2025! We are thrilled to share with you the December edition of the CIS-A2K Newsletter, showcasing our initiatives and achievements from the past month. In this issue, we offer a detailed recap of key events, collaborative projects, and community engagement efforts. Additionally, we provide a preview of the exciting plans we have in store for the upcoming month. Stay connected with our dynamic community as we celebrate the progress we’ve made together!

In the Limelight
Santali Food Festival
Dispatches from A2K
Monthly Recap
  • Learning hours Call
  • Indic Wikimedia Hackathon 2024
  • Santali Food Festival
Coming Soon - Upcoming Activities
  • She Leads Bootcamp

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 17:11, 12 జనవరి 2025 (UTC)Reply

Open Community Call - Expressions of Interest to host Wikimania 2027 in India

Please help translate to your language

Dear Wikimedians,

Happy 2025.. 😊

As you must have seen, members from Wikimedians of Kerala and Odia Wikimedia User Groups initiated preliminary discussions around submitting an Expression of Interest (EoI) to have Wikimania 2027 in India. You can find out more on the Meta Page.

Our aim is to seek input and assess the overall community sentiment and thoughts from the Indian community before we proceed further with the steps involved in submitting the formal EOI.

As part of the same, we are hosting an open community call regarding India's Expression of Interest (EOI) to host Wikimania 2027. This is an opportunity to gather your valuable feedback, opinions, and suggestions to shape a strong and inclusive proposal.

Your participation is key to ensuring the EOI reflects the collective aspirations and potential of the vibrant South Asian community.

Let’s join together to make this a milestone event for the Wikimedia movement in South Asia.

We look forward to your presence!
Warm regards,
Wikimedians of Kerala and Odia Wikimedians User Group's
This message was sent with MediaWiki message delivery (చర్చ) by Gnoeee (talk) at 05:55, 14 జనవరి 2025 (UTC)Reply

ప్రాజెక్టు:రాయసీమ

తెలుగు వికీపీడియా 21 వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ చరిత్ర, సంస్కృతి, కళలు, ప్రముఖులు, గ్రామాల గురించి కొత్త వ్యాసాలు రాయడం, పాత వ్యాసాలను మెరుగుపరచడం జరుగుతుంది. అరుదైన ఫోటోలు, వీడియోలు వికీమీడియా కామన్స్‌లో, సంబంధిత సమాచారాన్ని వికీసోర్స్, వికీడేటా వంటి సోదర ప్రాజెక్టులలో చేర్చుదాము.ఇది వికీపీడియన్లు స్వచ్ఛందంగా పాల్గొనే కార్యక్రమం. మరిన్ని వివరాలకు రాయలసీమ ప్రాజెక్టు పేజీ చూడగలరు. ఆసక్తిగల వారు ఆ పేజీలో తమ వికీసంతకం చేయండి. కొన్ని కార్యశాలలు నిర్వహించుకొందాము. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మీ సలహాలు, సూచనలను ప్రాజెక్టు చర్చా పేజీ లో పంచుకోగలరు. Kasyap (చర్చ) 06:16, 17 జనవరి 2025 (UTC)Reply

1000 రోజులు - 1000 వ్యాసాలు

ఎందరో మహానుభావులు, అందరి సహకారంతో 1000 రోజులు - 1000+ వ్యాసాలు (2022 ఏప్రిల్ 25 నుంచి 2025 జనవరి 18) పూర్తిచేసాను. ధన్యవాదాలు..! -Muralikrishna m (చర్చ) 03:31, 18 జనవరి 2025 (UTC)Reply

@మురళీకృష్ణ గారూ, మీరు మరలా 1000 రోజుల కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. యర్రా రామారావు (చర్చ) 04:30, 18 జనవరి 2025 (UTC)Reply
కృతజ్ఞతలు..! Muralikrishna m (చర్చ) 04:39, 18 జనవరి 2025 (UTC)Reply
@మురళీకృష్ణ గారు, మీరు విజయవంతంగా 1000 రోజులు-1000 వ్యాసాలు పూర్తిచేసినందుకు అభినందనలు.Tmamatha (చర్చ) 14:07, 18 జనవరి 2025 (UTC)Reply