ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకసభ శాసనసభ.[1][2] ఇది విభజన తరువాత 175 శాసనసభ నియోజకవర్గాల స్థానాలతో కలిగి ఉంది.[3][4] వీటిలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు 29 శాసనసభ నియోజకవర్గాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు 7 శాసనసభ నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి. మొత్తం 175 స్థానాలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేనపార్ఠీ ఒక స్థానం గెలుచుకున్నాయి.
చరిత్ర
మార్చుఅవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 294 నియోజకవర్గాలున్నాయి. శాసనసభలో మొత్తం 295 మంది శాసనసభ్యులు (ఎమ్.ఎల్.ఎ. లు) ఉండేవారు. అందులో ఒక సీటుకు ఒక ఆంగ్లో-ఇండీయన్ ని నామినేట్ చేస్తారు. ప్రతి నియోజక వర్గంనుండి ఓ ప్రతినిధి వుంటాడు. ఈ ప్రతినిధి నియోజక వర్గంలో గల ఓటర్లచే ఎన్నుకోబడుతాడు. 2014 లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాలు 175. 2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ జిల్లాలను 26 గా పునర్విభజించారు. చాలావరకు లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లా చేసినా, ప్రజల సౌకర్యంకొరకు కొన్ని మండలాలను దగ్గరిలోని జిల్లాలో కలిపినందున, కొన్ని శాసనసభ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి.[5]
జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పూర్తిగా జిల్లా పరిధి దాటిన శాసనసభ నియోజకవర్గాలు
మార్చుజిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా ఉండటంకోసం, కొన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలోగల మండలాలను పూర్తిగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]
శాసనసభ నియోజకవర్గం | లోక్‌సభ నియోజకవర్గం | జిల్లా |
---|---|---|
ఎచ్చెర్ల | విజయనగరం | శ్రీకాకుళం |
చంద్రగిరి | చిత్తూరు | తిరుపతి |
పుంగనూరు | రాజంపేట | చిత్తూరు |
శృంగవరపు కోట | విశాఖపట్నం | విజయనగరం |
సర్వేపల్లి | తిరుపతి | నెల్లూరు |
సంతనూతలపాడు | బాపట్ల | ప్రకాశం |
జిల్లా ప్రధానమైన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వున్ననూ, పాక్షికంగా జిల్లా పరిధిదాటిన శాసనసభ నియోజకవర్గాలు
మార్చుజిల్లా కేంద్రం ప్రజలకు దగ్గరగా వుండటంకోసం, కొన్ని శాసనసభ పరిధిలో గల మండలాలను పాక్షికంగా సరిహద్దు జిల్లాలో కలపడం జరిగింది.[6][7]
శాసనసభ నియోజకవర్గం | లోక్‌సభ నియోజకవర్గం | జిల్లా (లు) |
---|---|---|
అనపర్తి | రాజమండ్రి | తూర్పు గోదావరి, |
గోపాలపురం | రాజమండ్రి | తూర్పు గోదావరి, |
జగ్గంపేట | కాకినాడ | కాకినాడ, |
నగరి | చిత్తూరు | చిత్తూరు, |
పాణ్యం | నంద్యాల | నంద్యాల, |
పెందుర్తి | అనకాపల్లి | అనకాపల్లి, |
ముమ్మిడివరం | అమలాపురం | కోనసీమ, |
రాజంపేట | రాజంపేట | అన్నమయ్య, |
రాప్తాడు | హిందూపురం | శ్రీ సత్యసాయి, |
రామచంద్రపురం | అమలాపురం | కోనసీమ, |
వెంకటగిరి | తిరుపతి | తిరుపతి, |
సాలూరు | అరకు | పార్వతీపురం మన్యం, |
జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య
మార్చుఎస్. నో | జిల్లా | నియోజకవర్గాలు |
---|---|---|
1 | శ్రీకాకుళం | 8 |
2 | విజయనగరం | 7 |
3 | పార్వతీపురం మన్యం | 4 |
4 | విశాఖపట్నం | 6 + పెందుర్తి (పాక్షికంగా) |
5 | అనకాపల్లి | 7 + పెందుర్తి (పాక్షికంగా) |
6 | అల్లూరి సీతారామ రాజు | 3 |
7 | కాకినాడ | 7 |
8 | తూర్పు గోదావరి | 7 |
9 | కొనసీమ | 7 |
10 | పశ్చిమ గోదావరి | 7 |
11 | ఏలూరు | 7 |
12 | ఎన్టీఆర్ | 7 |
13 | కృష్ణా | 7 |
14 | గుంటూరు | 7 |
15 | పల్నాడు | 7 |
16 | బాపట్ల | 6 |
17 | ప్రకాశం | 8 |
18 | నెల్లూరు | 8 + వెంకటగిరి (పాక్షికంగా) |
19 | తిరుపతి | 6 + వెంకటగిరి (పాక్షికంగా) |
20 | చిత్తూరు | 7 |
21 | అన్నమయ్య | 6 |
22 | కడప | 7 |
23 | నంద్యాల | 6 + పాణ్యం (పాక్షికంగా) |
24 | కర్నూలు | 7 + పాణ్యం (పాక్షికంగా) |
25 | అనంతపురం | 8 |
26 | శ్రీ సత్య సాయి | 6 |
ప్రస్తుత నియోజకవర్గాల జాబితా
మార్చుఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ నియోజకవర్గాల ఉన్నాయి.[8]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Overview". Andhra Pradesh Legislative Assembly. Archived from the original on 13 అక్టోబరు 2018. Retrieved 9 February 2015.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. pp. 16–28. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
- ↑ "List of constituencies (District Wise) : Andhra Pradesh 2019 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
- ↑ "ఏపీలో కొత్త జిల్లాలు.. ఏ నియోజకవర్గం ఎక్కడ..? పూర్తి వివరాలు ఇవిగో." Samayam Telugu. Retrieved 2024-01-12.
- ↑ "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-08.
- ↑ 6.0 6.1 "AP New Districts: కొత్త కళ.. గడప వద్దకే పాలన". 2022-04-05. Retrieved 2022-04-22.
- ↑ 7.0 7.1 "Andhra news:అందుబాటులో జిల్లా కేంద్రం". ఈనాడు. 2022-04-04. Retrieved 2022-04-04.
- ↑ "The Andhra Pradesh Gazette" (PDF). Official website of the Chief Electoral Officer, Telangana. Delimitation Commission of India. pp. 7–15. Retrieved 7 May 2019.