వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్, తెలంగాణ/పట్టణ స్థానిక సంస్థలు పేజీలు సృష్టింపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కొన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు తెవికీలో పేజీలున్నాయి. అవి పూర్తి సమాచారంతో లేకపోయినప్పటికీ ప్రాధమిక సమాచారంతో ఉన్నాయి. పట్టణాల నిర్వహణకు, అభివృద్ధికి పట్టణ స్థానిక సంస్థలు భాధ్యత వహించటంలో ఎంతో కీలకపాత్ర కలిగిఉన్నవి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయితీలు మూడింటిని కలిపి పట్టణ స్థానిక సంస్థలు అని అంటారు. ఇవి అంత అవసరమా అనే విషయానికి వస్తే, గ్రామాలకు గ్రామ వ్యాసాలు, మండలాలకు మండల వ్యాసాలు, జిల్లాలకు జిల్లా వ్యాసాలు ఎలా అవసరమో, పట్టణాలకు పట్టణ స్థానిక సంస్థలు వ్యాసాలు అంతే అవసరం ఉంది. ఈ ఆలోచనతోనే పూర్వపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పురపాలక సంఘాలకు వ్యాసాలు సృష్టించబడినవి.అయితే అన్ని పురపాలక సంఘాలను పరిపూర్ణంగా గుర్తించటం జరుగలేదు. గుర్తించిన వాటిలో బహుకొద్ది స్థానికసంస్థలుకు మాత్రమే పేజీలు సృష్టించబడినవి. ప్రస్తుతం తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెలువరించబడ్డాయి.ఈ నేపథ్యంలో వివిధ దినపత్రికలనందు వెలువరించిన పాలకవర్గ సభ్యులు వివరాలు కొన్ని పురపాలకసంఘాలకు ప్రణయరాజ్ గారు సేకరించారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు 2021 మార్చిలో జరుపటానికి ప్రకటన వెలువడింది. వాటి పాలకవర్గ వివరాలు కూడా ఎన్నికలు పూర్తైన తరువాత వాటిని పొందుపర్చటానికి అవకాశం ఉంది.వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు పేజీ తయారు చేయబడింది.
ప్రాజెక్టు పూర్వాపరాలు
మార్చుపురపాలకసంఘాలకు పేజీలు అవసరమని భావించి అన్నిటిని గుర్తించి, పేజీలు సృష్టించాలనే భావనతో వాడుకరి:యర్రా రామారావు/తెవికీలో ఉండవలసిన పేజీలు పేజీలో జాబితాగా పెట్టుట జరిగింది. జాబితా అయితే కూర్పు చేసానుకానీ, వికీ ఇతరపనులు వలన వీటిని సృష్టించుటకు, విస్తరణకు వీలు పడలేదు.అదే సమయంలో మహేశ్వరరాజు గారు వికీలో చురుకుగా పనిచేయుట గమనించి, ఆసక్తిగా ఉంటే మీరు చేపట్టవచ్చుని ప్రస్తావించగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన 58 పురపాలకసంఘాలకు, 7 నగరపాలకసంస్థలకు పేజీలు సృష్టించి విస్తరించారు.ఈ సందర్భంగా అతనికి అభినందనలు. మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో చేపట్టపోయే పనులలో వీటిని గురించి ప్రస్తావించగా చదువరి గారు, మీరే చేయాలను కొనే దానికంటే, ఒక ప్రాజెక్ట్ పేజీని తయారుచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు పేజీలో పెడితే ఆసక్తి ఉన్నవాళ్లు, ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాడుకరులు మరింత మంది చేపడితే, మరింత నాణ్యతగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని సలహా ఇవ్వగా, ఆ స్పూర్తితో ఈ ప్రాజెక్ట్ పేజీ తయారుచేయటమైనది. ప్రాజెక్టుకు కాల పరిమితి అంటూ ఏమీలేదు.ఆసక్తి ఉన్న వాడుకరులు పాల్గొనగలరు.
పట్టణవ్యాసానికి, పురపాలకసంఘం వ్యాసానికి తేడా
మార్చురెండిటికి తేడా ఉంది.పట్టణ వ్యాసంలో పట్టణ చరిత్ర, గ్రామంలోని దేవాలయాలు, గ్రామానికి చెందిన నోటబిలిటీ వ్యక్తుల వివరాలు, పట్టణ విశేషాలు, ప్రయాణ సౌకర్యాలు, విద్య, వైద్యం, రాజకీయాలు మొదలగు వివరాలు ఉంటాయి. ఇవి పురపాలక సంఘం వ్యాసంలో అవసరంలేదు.పురపాలక సంఘం వ్యాసంలో నమూనా వ్యాసంనందు ఉన్న విభాగాల వివరాలు మాత్రమే ఉండాలి.సింపుల్ గా చెప్పాలంటే గుంటూరుకు చెందిన ఈ నాలుగు వ్యాసాలు గమనించండి. గుంటూరు (పట్టణం), గుంటూరు (నగరపాలకసంస్థ), గుంటూరు (రెవెన్యూ గ్రామం), గుంటూరు (జిల్లా) వ్యాసాలకు తేడా ఉన్నట్లు వీటికి తేడా ఉంటుంది. అందువలన వీటి అవసరం కూడా అలాంటిదే.
రెండు రాష్ట్రాలలో ప్రస్తుత స్థితి
మార్చుఆంధ్రప్రదేశ్
మార్చుఆంధ్రప్రదేశ్లో మొత్తం స్థానిక సంస్థలు 125.అందులో 16 నగరపాలక సంస్థలు, 78 పురపాలక సంఘాలు 31 నగరపంచాయతీలు ఉన్నవి.నగరపాలకసంస్థలు అన్నిటికీ పేజీలు సృష్టించబడినవి.ఇంకనూ 78 పురపాలక సంఘాలకు గాను 12 పురపాలక సంఘాలకు, 31 నగర పంచాయతీలకు గాను 25 నగరపంచాయితీలకు మాత్రమే పేజీలు సృష్టించవలసిఉంది.
తెలంగాణ
మార్చుతెలంగాణలో మొత్తం స్థానిక సంస్థలు 141.అందులో 13 నగరపాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు ఉన్నవి. 13 నగరపాలక సంస్థలుకు, 26 పురపాలక సంఘాలకు పేజీలు సృష్టించబడినవి.ఇంకా జాబితా ప్రకారం 102 పురపాలక సంఘాలకు పేజీలు సృష్టించవలసి ఉంది. తెలంగాణ పురపాలక సంఘాల కొత్తచట్టం ప్రకారం రాష్ట్రంలో నగర పంచాయితీలనేవి లేవు.
నమూనా పేజీ
మార్చుసమాచార వనరులు, సూచనలు
మార్చుపాల్గొంటున్న సభ్యులు
మార్చు- యర్రా రామారావు (చర్చ • రచనలు)
- చదువరి (చర్చ • రచనలు)
- Ch Maheswara Raju (చర్చ • రచనలు)
- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు)
సృష్టించవలసిన పేజీలు
మార్చుఆంధ్రప్రదేశ్ పురపాలకసంఘాలు
మార్చువ.సంఖ్య | జిల్లా | పేజీ సృష్టించవలసిన పట్టణ స్థానికసంస్థ | పురపాలక సంఘం
ప్రధాన కేంద్రం |
పేజీ సృష్టించిన వాడుకరి | సృష్టించిన తేది | బైట్లు సంఖ్య |
---|---|---|---|---|---|---|
1 | అనంతపురం | కళ్యాణదుర్గం పురపాలకసంఘం | కళ్యాణదుర్గం | |||
1 | కర్నూలు | ఆత్మకూరు పురపాలకసంఘం (కర్నూలు జిల్లా) | ఆత్మకూరు (కర్నూలు జిల్లా) | |||
2 | డోన్ పురపాలకంఘం | డోన్ | ||||
1 | వైఎస్ఆర్ | రాజంపేట పురపాలకసంఘం | రాజంపేట | |||
2 | మైదుకూరు పురపాలకసంఘం | మైదుకూరు | ||||
1 | కృష్ణా | కొండపల్లి పురపాలక సంఘం | నందిగామ | |||
2 | వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం | తిరువూరు | ||||
1 | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | నాయుడుపేట పురపాలకసంఘం | నాయుడుపేట | |||
2 | ఆత్మకూరు పురపాలకసంఘం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) | ఆత్మకూరు (నెల్లూరు) | ||||
3 | సూళ్ళూరుపేట పురపాలకసంఘం | సూళ్లూరుపేట | ||||
1 | పశ్చిమ గోదావరి | జంగారెడ్డిగూడెం పురపాలకసంఘం | జంగారెడ్డిగూడెం | |||
1 | చిత్తూరు | కుప్పం పురపాలకసంఘం | కుప్పం |